Anil Ravapudi
-
సంక్రాంతి సాంగ్‌తో దుమ్మురేపిన వెంకటేష్
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా నుంచి మూడో సాంగ్ ప్రోమో వచ్చేసింది. సరికొత్తగా ఈ సాంగ్ పరిచయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి ఒక వీడియో రూపంలో ఇప్పటికే చూపించారు. అయితే, ఇప్పుడు సాంగ్ ప్రోమో విడుదల కావడంతో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ పాట ప్రత్యేకత ఏంటంటే.. సుమారు ఏడేళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్ ఆలపించడం. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. పూర్తి సాంగ్‌ను డిసెంబరు 30న మేకర్స్ విడుదల చేయనున్నారు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లగా నటిస్తున్నారు. ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటించారు. వెంకటేశ్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025 జనవరి 14న రిలీజ్ కానుంది. -
ఏడేళ్ల తర్వాత స్పెషల్ సాంగ్‌తో వస్తున్న వెంకటేష్
సంక్రాంతికి వస్తున్నాం.. ప్రస్తుతం ఈ సినిమా విశేషాలు సోషల్‌మీడియాలో భారీగా వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలు భారీ హిట్ అందుకున్నాయి. త్వరలోనే మూడో సాంగ్‌ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ఈ సాంగ్‌ను విక్టరీ వెంకటేష్ ఆలపించనున్నారు. సుమారు ఏడేళ్ల తర్వాత మళ్లీ ఆయన గాత్రం నుంచి ఒక పాట రానున్నడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మూడో సాంగ్ విడుదల నేపథ్యంలో 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్ర యూనిట్ ఒక ఫన్నీ వీడియోను పంచుకుంది. ఈ సాంగ్‌ను ఎవరితో పాడిద్దాం అని అనిల్ రావిపూడి చర్చిస్తుండగా సడెన్‌గా వెంకటేష్ ఎంట్రీ ఇచ్చేసి నేను పాడతా... నేను పాడతా... అంటూ పట్టుబట్టి మరీ ఈ పాటని ఆలపించినట్టు చిత్ర యూనిట్ ఒక వీడియో పంచుకుంది. అయితే, వెంకటేష్ ఇప్పటికే 2017లో విడుదలైన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ 'గురు'లో ఆయన మొదటిసారిగా తన గాత్రంతో మెప్పించాడు. ఇప్పుడు మరోసారి సంక్రాంతి నేపథ్యంలో వచ్చే ఈ పాటని వెంకటేష్ ఆలపించనున్నాడు. త్వరలోనే ఈ పాటని విడుదల చేయనున్నారు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లగా నటిస్తున్నారు. ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటించారు. వెంకటేశ్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025 జనవరి 14న రిలీజ్ కానుంది. -
‘భగవంత్ కేసరి’.. ఈ పేరు చానా ఏళ్లు యాదుంటది
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్‌కు జూన్ 10 పండుగరోజు. నేడు ఆయన బర్త్‌డే సందర్భంగా అభిమానుల కోసం ‘భగవంత్ కేసరి’ టీజర్‌ను వదిలారు. బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. (ఇదీ చదవండి: అప్పటినుంచే ప్రేమలో ఉన్నామన్న లావణ్య.. పోస్ట్ వైరల్) 'అడవి బిడ్డా .. నేలకొండ భగవంత్ కేసరి' అంటూ తన గురించి తాను చెప్పుకుంటూ బాలకృష్ణ యాక్షన్‌లోకి దిగిపోవడం ఈ టీజర్లో కనిపిస్తుంది. 'ఈ పేరు చానా ఏళ్లు యాదుంటది' అంటూ తెలంగాణ యాసలో డైలాగులు చెప్తూ బాలయ్య కేక పుట్టించాడు. గత సినిమాల్లోలాగే బాలయ్య రక్తపాతం సృష్టించేందుకు రెడీ అయ్యాడని టీజర్ చూస్తే అర్థమవుతోంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో తమన్ దుమ్ములేపాడు. పవర్ఫుల్ టీజర్‌తో సినిమా రేంజ్‌ను భారీగా పెంచేశాడు బాలకృష్ణ. ‘భగవంత్ కేసరి’ ఈ దసరాకు విడుదల చేస్తున్నట్లు టీజర్లో మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తోంది. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. (ఇదీ చదవండి: ఆ నిర్మాత అవసరం తీరాక ముఖం చాటేస్తాడు: ప్రేమమ్ హీరోయిన్) -
'గిప్పడి సంది ఖేల్ అలగ్' .. ఎన్బీకే108 టైటిల్ ఇదే!
నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'ఎన్బీకే108'. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. (ఇది చదవండి: క్రికెటర్‌ను పెళ్లి చేసుకుంటున్నారా?.. ఓపెన్‌గానే చెప్పేసిన హీరోయిన్!) అనిల్ రావిపూడి ట్వీట్లో రాస్తూ.. ఇప్పటి సంది ఖేల్ అలగ్ అంటూ 'భగవంత్ కేసరి' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఐ డోంట్ కేర్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో బాలయ్య మాస్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ టైటిల్‌ను రివీల్ చేశారు. కాగా.. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. (ఇది చదవండి: రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో.. టార్గెట్ అదే..) గిప్పడి సంది ఖేల్ అలగ్ 😎 Extremely proud to present our Hero, The one & only #NandamuriBalakrishna garu in & as #BhagavanthKesari 💥#NBKLikeNeverBefore ❤️🔥@MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna @Shine_Screens pic.twitter.com/bMXbhzDp6x — Anil Ravipudi (@AnilRavipudi) June 8, 2023 -
రజనీ కాంత్ నో చెప్పిన డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చిన బాలకృష్ణ?
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న చిత్రం NBK108. ఈ నెల 8న ఈ సినిమా టైటిల్,ఫస్ట్ లుక్‌తో పాటు మరో భారీ సర్ప్రైజ్ను అభిమానులకు ఇవ్వబోతున్నట్లుగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ లోపు మరో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేమిటంటే.. NBK 109 కూడా బాలయ్య లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కొత్త ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించే అవకాశం బాబీకి వచ్చినట్లు సమాచారం. (ఇదీ చదవండి: ‘ఆదిపురుష్’ ప్రతి థియేటర్లో ఆయన కోసం ఒక టికెట్ రిజర్వ్) మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య'తో సూపర్ హిట్ కొట్టిన బాబీకి ఇది మరో గోల్డెన్ ఛాన్స్ అని ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు. మొదట ఈ స్క్రిప్ట్‌ను సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు బాబీ వివరించాడట.. అయితే, రజనీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో అదే స్క్రిప్ట్‌ని బాలయ్యకు చెప్పాడట. దీంతో బాబీ ఫుల్ ఖుషి అయ్యాడట. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ దీన్ని నిర్మించబోతున్నాడు. ఈ కాంబోలో మూవీ గురించి గతంలో ఆన్ స్టాపబుల్ షోకు వచ్చినప్పుడు పరస్పరం హింట్ ఇచ్చుకున్నారు. కానీ డైరెక్టర్ ఎవరన్నది అప్పుడు లాక్ చేయలేదు. యాక్షన్ ఎంటర్ ట్రైనర్‌గా కమర్షియల్ బ్యాక్ డ్రాప్ లోనే ఇది రూపొందనుంది. (ఇదీ చదవండి: లలితా జ్యువెలరీలో బంగారు ఆభరణాలు దొచుకున్న ఆ దొంగ కథే 'జపాన్'!) -
కాఫీ షాప్‌లో ఇన్ని జరుగుతాయని ఇప్పుడే అర్థమైంది: అనిల్ రావిపూడి
ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కాఫీ విత్ ఎ కిల్లర్'. ది బెస్ట్ క్రియేషన్, సెవెన్‌హిల్స్ ప్రొడక్షన్స్‌పై సెవెన్‌హిల్స్ సతీష్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ట్రైలర్‌ను విడుదల చేశారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. 'కరోనా తరువాత రీ రీలీజులు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అదరగొడుతున్నాయి. ముఖ్యంగా కంటెంట్ ఉన్న సినిమాలకే ఎక్కువ స్కోప్ ఉంది. అలాంటి స్కోప్ ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ ట్రైలర్లో కనిపిస్తోంది. కాఫీ షాప్‌లో ఇన్ని జరుగుతాయా అని ఇప్పుడే అర్థమైంది. చాలా ఎంటర్టైనింగ్గా ట్రైలర్ కనిపిస్తోంది. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఈ ట్రైలర్ చూశాక నాకు ఆర్పీ గారే హీరో అనిపించింది. ఆయనంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తూ చిత్ర బృందానికి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను.' అని అన్నారు. దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. ‘‘ఓటీటీ వచ్చాక జనాలకు థియేటర్స్‌లో సినిమా చూడాలనే ఆలోచనలో మార్పు వచ్చింది. కొత్తగా చెప్తే కానీ థియేటర్స్‌కు రప్పించలేం. ఎంటర్‌టైనింగ్‌తో కూడిన థ్రిల్లర్ కథగా ఈ ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ సినిమా కథను రాసుకున్నా.అందుకు నా మరో తమ్ముడు సెవెన్‌హిల్స్ సతీష్ తోడై నిర్మాతగా వ్యవహరించాడు. ఇంకో రెండు సినిమాలు మా ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్నాయి. ఈ చిత్రంలో ఒక సీక్రెట్‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్లో రివీల్ చేస్తాం. ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చిన అనిల్ రావిపూడిగారికి కృతఙ్ఞతలు. ఎందుకో ఆయనకు నేనంటే చాలా అభిమానం.' అని అన్నారు. నిర్మాత సెవెన్‌హిల్స్ సతీష్ మాట్లాడుతూ.. 'ఆర్పీ గారు నాకు సొంత బ్రదర్ లాంటి వాడు. ఈ సినిమా లైన్ చెప్పగానే యాక్సెప్ట్ చేయాలనుకున్నా. ఈ చిత్రంలో ఒక చిన్నసర్‌ప్రైజ్ ఉంది. అది త్వరలో రివీల్ చేస్తాం. ఆర్పీ పట్నాయక్‌తో ఇంకో రెండు ప్రాజెక్ట్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు. ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, రవి బాబు, సత్యం రాజేష్, రఘు బాబు, జెమినీ సురేష్, రవి ప్రకాష్, టెంపర్ వంశీ, బెనర్జీ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. -
బిగ్‌బాస్ నుంచి బయటకు అరియానా.. ఎంత గెలుచుకుందంటే ?
Bigg Boss Non Stop Telugu Grand Finale: Ariyana Came Out With 10 Lakhs: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ గ్రాండ్ ఫినాలే నుంచి అనిల్, బాబా భాస్కర్, మిత్రా శర్మ బయటకు వచ్చాక డబ్బుల ఎపిసోడ్ రసవత్తరంగా మారింది. డబ్బుల బ్రీఫ్‌కేసుతో హౌజ్‌లోకి వెళ్లిన అనిల్ రావిపూడి, సునీల్ డబ్బులతో బేరం చేశారు. అఖిల్ కప్ కోసం వచ్చానని చెప్పగా, బిందు మాధవి తెలుగు ప్రేక్షకులకు దగ్గరవడానికే వచ్చానని తెలిపింది. అరియానా అయితే డబ్బు కోసమే వచ్చానని, ఒక ప్లాట్ కొనాలనే కోరికతోనే వచ్చానని వెల్లడించింది. తన ఆర్థిక కష్టాలని తీర్చుకునేందుకు, కప్పు కూడా కొట్టాలని ఉద్దేశ్యంతోనే వచ్చినట్లు శివ చెప్పుకొచ్చాడు. దీంతో డబ్బుల బేరం మొదలైంది. ఈ బేరంలో అందరు సైలెంట్‌గా ఉంటే అరియానా మాత్రం ఎంత డబ్బు ఉండొచ్చని, డబ్బు తీసుకునేందుకే ఉత్సాహాన్ని చూపించింది. కానీ అందులో ఎంత డబ్బు ఉందనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. అందులో లక్షల్లో డబ్బు ఉందని నాగార్జున మాటిచ్చిన తర్వాత అరియానా ఈ సూట్‌కేస్‌ను తీసుకుంది. సూట్‌కేస్‌తో స్టేజ్‌పైకి వచ్చిన అరియానాతో నాగార్జున, అనిల్, సునీల్ ఆట ఆడుకున్నారు. అందులో డబ్బు ఉందంటే ఎలా నమ్మావ్ అని బాంబు పేల్చారు. దీంతో అనిల్, సునీల్‌లను దొంగసచ్చినోళ్లను నమ్మి వ్చచానని అరియానా తిట్టేసింది. కొద్దిసేపు అరియానా అనిల్, సునీల్, నాగార్జున, బాబా భాస్కర్ ఆడుకున్నారు. చివరికి అందులో రూ. 10 లక్షలు ఉన్నాయని నాగార్జున చెప్పడంతో అరియానా ఊపిరి పీల్చుకుంది. -
పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ వచ్చేది అప్పుడే..
F3 Movie: Pooja Hegde Party Song Of The Year Promo Released: విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా మరోసారి సందడి చేయనున్న చిత్రం 'ఎఫ్ 3'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ 'ఎఫ్ 2' చిత్రానికి సీక్వెల్ అని తెలిసిన సంగతే. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించిన 'ఎఫ్ 3' మే 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవేకాకుండా అంతకుముందు రిలీజైన రెండు సింగిల్స్ ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు తాజాగా మూడో సింగిల్‌ను విడుదల చేయనున్నారు. 'లైఫ్ అంటే ఇట్టా ఉండాలా' అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను మే 17న రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రొమోను సోమవారం (మే 16) బయటకు వదిలారు. ఇందులో స్పెషల్ అట్రాక్షన్‌గా బుట్టబొమ్మ పూజా హెగ్డే నిలవనుంది. మోస్ట్ గ్లామరస్‌గా ఉన్న పూజా హెగ్డే పోస్టర్‌ను 'పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్'గా రిలీజ్ చేశారు. ఈ పార్టీ నంబర్ సాంగ్‌ను కాసర్ల శ్యామ్ రచించగా, రాహుల్ సిప్లిగంజ్, గీతా మాధురి ఆలపించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చదవండి: ఈ వారం థియేటర్లలో సందడి చేసే సినిమాలు.. మా సభ్యుల ఆరోగ్యం, సంక్షేమం తొలి ప్రాధాన్యత: మంచు విష్ణు -
సకల గుణాభిరామ ట్రైలర్ లాంఛ్.. ఎమోషనల్‌గా వీజే సన్నీ స్పీచ్
VJ Sunny Emotional In Sakala Gunabhi Rama Trailer Launch: బిగ్‌బాస్ సీజన్-5 విజేతగా నిలిచిన సన్నీకి సోషల్ మీడియాలో యమ క్రేజ్ ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన సన్నీ తన ఆటతీరుతో, ఎంటర్టైన్మెంట్తో ట్రోపీని సొంతం చేసుకున్నాడు. బిగ్‌బాస్ టైటిల్ విన్నర్‌గా నిలిచి తెలుగు రాష్ట్రాల్లో మరింత పాపులర్ అయ్యాడు. ఈ క్రేజ్‌తోనే హీరోగా మారాడు. వీజే సన్నీ నటించిన చిత్రం 'సకల గుణాభిరామ'. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా డైరెక్టర్ అనిల్ రావిపూడి, విశ్వక్ సేన్, బిగ్‌బాస్ కంటెస్టెంట్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విశ్వక్ సేన్ అతిథిగా రావడంతో వీజే సన్నీ ఎమోషనల్ అయ్యాడు. తాను బిగ్‌బాస్ ట్రోఫీ గెలిచేందుకు విశ్వక్ సేన్ ప్రయత్నాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు సన్నీ. 'నేను బిగ్‌బాస్ టైటిల్ కొట్టడానికి కారణం నా స్నేహితులే. వాళ్లే నా వెనుక ఉండి నన్ను ముందుకు నడిపిస్తారు. జీవితంలో కావాల్సింది పైసల్ కాదు. దోస్తులు కావాలి. నా దోస్తులందరికీ నేను హీరో కావాలనే కల ఉండేది. ఆ కలను ఈ చిత్రంతో నిజం చేశాను. ఈ కార్యక్రమానికి పిలవగానే విశ్వక్ సేన్ అన్న, అనిల్ అన్నా వచ్చారు. నేను బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడు విశ్వక్ సేన్‌కు నేను ఎవరో తెలియదు. కానీ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారని బయటకు రాగానే నా స్నేహితులు చెప్పారు. విశ్వక్ సేన్ అన్న ఎంత సపోర్ట్ చేశారో.. అనిల్ రావిపూడి అన్న అంతే సపోర్ట్ చేశారు. నేను బయటకు రాగానే అన్నని కలిశాను. వాళ్ల డాటర్ కేక్ కట్ చేసిన వీడియో నాకు చూపించేసరికి నేను ఫిదా అయిపోయా. థాంక్యూ అన్నా.' అని తెలిపాడు వీజే సన్నీ. -
Cheruvaina Dooramaina: సుజిత్‌కి మంచి భవిష్యత్ ఉంది : అనిల్ రావిపూడి
కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి మేనల్లుడు సుజిత్ రెడ్డి, తరుణి సంగ్ జంటగా నటించిన చిత్రం ‘చేరువైన... దూరమైన’.చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నివినాయక ఎంటర్టైన్ మెంట్ పతాకంపై కంచర్ల సత్యనారాయణ రెడ్డి, సముద్రాల మహేష్ గౌడ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా బాగుందని, ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని తెలిపారు. సుజిత్ కి మంచి భవిష్యత్ ఉంటుదన్నారు. దర్శకుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘హీరో సుజిత్ తో నాకు చాలా అనుబంధం వుంది. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందు ఓ మూడు నిమిషాల నిడివిగల ఓ డెమో సన్నివేషాన్ని తీసి సుజిత్ వాళ్ల అమ్మకు చూపించాం. ఆమె ఎంతో ఆనందించారు. నన్ను నమ్మి వాళ్ల అబ్బాయిని నా చేతిలో పెట్టారు. సుజిత్ లో ఆనందం కంటే... వాళ్ల అమ్మ కళ్లలో ఆనందమే చూడాలనుకున్నా. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాను చిత్రీకరించాం. ఆ సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుంది’అన్నారు. నిర్మాత కంచర్ల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ..‘శ్రీనివాసరెడ్డి అన్న మా వెన్నంటి వుండి ఈసినిమాను ఎంతో ప్రోత్సహించారు. ఆయన కొన్ని సందేహాలు వెలిబుచ్చినా...ఈ సినిమాను దర్శకుడు ఎంతో పట్టుదలతో కంప్లీజ్ చేశారు చంద్రశేఖర్ తాను చెప్పిన కథ ఏదైతో వుందో దానినే తీశారు. ఈ రోజు టీజర్, ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతోంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఇష్టపడతారు’అని అన్నారు. ‘నా మేనల్లుడిని ఆశీర్వదించండి’అని ప్రేక్షకులను కోరారు కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో విలన్ గా నటించిన శశి, రచయిత సురేష్, బట్టు అంజిరెడ్డి, జిట్టా సురేందర్ రెడ్డి, దండెం రాజశేఖర్ రెడ్డి, ప్రముఖ దర్శకుడు వెంకీ తదితరులు పాల్గొన్నారు. -
'కథ వేరేలా ఉందే'.. అనిల్ రావిపూడిని కలిసిన సోహైల్
ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-4తో బాగా పాపులారిటీ సంపాదించుకున్న వాళ్లలో సయ్యద్ సోహైల్ ముందుంటాడు. హౌజ్‌లో ‘కథ వేరే ఉంటది’ అంటూ తనదైన మేనరిజమ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఈ సింగరేణి ముద్దు బిడ్డ. 100 రోజుల పాటు హౌస్‌లో సందడి చేసిన సోహైల్ ఈ సీజన్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. అప్పటిదాకా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన సోహైల్‌కు బిగ్‌బాస్‌తో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. బిగ్‌బాస్‌కు వెళ్లిన తర్వాత సోహైల్ లైఫ్ టర్న్ అయ్యిందని చెప్పవచ్చు. రీసెంట్గా సోహైల్ .. డైరెక్టర్ అనిల్ రావిపూడిని కలిశాడు. ఈ సందర్భంగా ఇద్దరం కలిసి బిగ్‌బాస్ రోజుల్ని గుర్తుతెచ్చుకున్నామని తెలిపాడు. జీరో యాటిట్యూడ్, యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడిని కలిసే అవకాశం వచ్చిందని, అయితే ఇది జస్ట్ క్యాజువల్ మీటింగ్ మాత్రమేనని, సినిమాకు సంబంధించింది కాదని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి ఇచ్చిన సలహాలు, సూచనల్ని తప్పకుండా పాటిస్తానని పేర్కొంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టును షేర్ చేశాడు. బిగ్‌బాస్ అనంతరం వరుస అవకాశాలు దక్కించుకుంటున్న సోహైల్.. హీరోగా ఓ సినిమాలో నటించనున్నాడు. ‘జార్జ్ రెడ్డి’, ‘ప్రెషర్ కుక్కర్’ చిత్రాల నిర్మాత అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోహైల్ స్నేహితుడు శ్రీనివాస్ వింజనంపాటి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నాడు. View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) చదవండి : బిగ్‌బాస్ ఫేం సొహైల్‌కు రైజింగ్ స్టార్ అవార్డు దూసుకెళ్తున్న ‘హీరో’..అప్పుడే 4M వ్యూస్ -
దిల్‌రాజుకు షాకిచ్చిన వరుణ్, వెంకీ..!
కరోనా కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్స్ మళ్లీ షూరు అవుతున్నాయి. లాక్‌డౌన్‌తో ఎక్కడిక్కకడ మూతబడ్డ కెమెరాలు క్లిక్క్మనిపించేందుకు సిద్ధమయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో చిత్ర పరిశ్రమలో సందడి నెలకొంది. కొత్త కథలు, కొత్త సినిమాల కబుర్లలతో ఇండస్ట్రీలో మునుపటి వాతావరణం కనిపిస్తోంది. లాక్డౌన్ సమయంలో ఇంట్లో కూర్చుని కథలు సిద్ధం చేసుకున్న దర్శకులు వాటిని పట్టాలెక్కించేందుకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇక హీరోలు సైతం కొత్త కథలపై దృష్టిసారించారు. సుదీర్ఘ విరామం అనంతరం రానున్న సినిమాలు కావడంతో ఆచితూచీ అడుగులు వేస్తున్నారు. ఇక అసలు విషయాని కొస్తే టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ సినిమాలపై మరింత దూకుడు పెంచాడు. కెరీర్లో ప్రారంభంలో వడివడిగా అడుగులేసిన యంగ్ హీరో.. ఫిదా, గద్దలకొండ గణేష్, ఎఫ్2 విజయాలతో ఓ రేంజ్‌లోకి వెళ్లిపోయాడు. వరుస సినిమాల విజయంతో రెమ్యునరేషన్‌ను ఒక్కసారిగా పెంచేశాడు. స్టార్ హీరోలతో పోల్చుకుంటే తానేమీ తక్కవ కాదంటూ నిర్మాతల ముందు భారీ మొత్తాన్నే డిమాండ్ చేస్తున్నాడు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్2 చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 35 కోట్లతో దిల్ రాజు నిర్మించిన ఈ కామెడీ మూవీ దాదాపు 85 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి హిట్‌ను సొంతం చేసుకుంది. అయితే ఎఫ్2 ఇచ్చిన విజయంతో దిల్‌కుష్‌గా ఉన్న దర్శక, నిర్మాతలు ఎఫ్3 మూవీని పట్టాలెక్కించాలని నిర్ణయించారు. ఈ మేరకు దర్శకుడు అనిల్ రావిపూడి కథను కూడా సిద్ధం చేశారు. అయితే అసలు సమస్య ఇక్కడే వచ్చి పడింది. ఎఫ్3కి తనకు పారితోషికతం మరింత పెంచాలని హీరో వరుణ్ తేజ్ నిర్మాతకు ముడిపెట్టాడు. దాదాపు 12 కోట్లు వరకు ఇవ్వాలని పట్టుపట్టినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. మరోవైపు వెంకటేష్ సైతం తనకు 13 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు చిత్ర పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. మరోవైపు వరుస హిట్స్‌తో స్టార్ దర్శకుల సరసన చేరిన అనిల్ సైతం భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే భారీ బడ్జెట్‌తో ఎఫ్3ని తెరక్కించాలనుకున్న దిల్‌రాజ్‌కు ఇప్పుడు ఇద్దరు హీరోలు ఊహించని పారితోషికం డిమాండ్ చేయడం తలనొప్పిగా మారింది. దర్శకుడు ఇప్పటికే కథ సిద్ధం చేయడం. చిత్రీకరణకు కూడా ముహూర్తం ఖరారు కావడంతో ఇక చేసేదేమీ లేక వారి డిమాండ్స్‌కు నిర్మాత ఒప్పుకున్నట్లు సమాచారం. -
అచ్చ తెలుగు కథ
దర్శకుడు అనిల్ రావిపూడి సమర్పణలో శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ జంటగా ‘గాలి సంపత్’ చిత్రం ప్రారంభమైంది. టైటిల్ రోల్‌ను రాజేంద్ర ప్రసాద్ చేస్తున్నారు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఎస్.కృష్ణ, సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సీన్‌కి నారా రోహిత్ కెమెరా స్విచాన్ చేయగా, ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. వరుణ్ తేజ్ గౌరవ దర్శకత్వం వహించగా, స్క్రిప్ట్‌ను అనీష్ కృష్ణకు నిర్మాత ఎస్వీసీ శిరీష్ అందజేశారు. ‘‘నేనీ సినిమాకు స్క్రీన్‌ప్లే అందిస్తున్నాను’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘అచ్చ తెలుగు స్క్రిప్ట్ ఇది’’ అన్నారు శ్రీవిష్ణు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నాగమోహన్ బాబు ఎమ్. -
యమ డ్రామా హిట్ అవ్వాలి
‘‘రెండు జంటల మధ్య లవ్, ఎమోషన్‌తో పాటు యముడి రాసే తల రాతలు ఎలా ఉంటాయనేది ఈ ‘యమ డ్రామా’ ట్రైలర్లో దర్శకుడు హర్ష అద్భుతంగా చూపించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించి యూనిట్‌కి మంచి పేరు, డబ్బు తీసు కురావాలి’’ అని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. సాయికుమార్ లీడ్ రోల్లో టి. హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యమ డ్రామా’. సుకన్య సమర్పణలో ఫిల్మీ మెజీషియన్స్ పతాకంపై టి. రామకృష్ణ రావు నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా హర్ష మాట్లాడుతూ– ‘‘అనిల్ రావిపూడిగారు తన సినిమా పనిలో బిజీగా ఉన్నా మా మీద అభిమానంతో మా యూనిట్‌కి సలహాలు ఇస్తూ, ట్రైలర్ లాంచ్ చేసినందుకు ఆనందంగా ఉంది. నేటి యువత చిన్న సమస్యలకు, ఒత్తిళ్లకు లొంగిపోయి కన్నీళ్లు పెట్టుకోవడం సరికాదు.. చమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలం అనేది తెలుసుకోవాలి. ఇలాంటి సందేశంతో యువతని టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది’’ అన్నారు. పోసాని కృష్ణమురళి, జెన్నీ, గౌతమ్ రాజు, సుదర్శన్ రెడ్డి, నవీన్, వేణు వండర్స్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: దాము నర్రావుల, సంగీతం: సునీల్ కశ్యప్. -
అందర్నీ టార్చర్ పెట్టాను!
‘‘నేను చాలా సెటిల్డ్ యాక్టర్‌ని. ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో చాలా ఎమోషనల్‌గా నటించాను. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఫుల్ ఎనర్జీ ఉన్న పాత్ర చేశాను. ప్రస్తుతం అన్ని రకాల పాత్రలు చేస్తూ ప్రయోగాలు చేస్తున్నాను’’ అన్నారు రష్మికా మందన్నా. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మిక కథానాయిక. ‘దిల్’ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మించారు. ఈ నెల 11న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా రష్మికా చెప్పిన విశేషాలు. ► దర్శకుడు అనిల్‌గారు కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. ఆయన కథను మొత్తం యాక్ట్ చేసి చూపిస్తారు. ఈ సినిమాలో నా పాత్ర ఇలా వచ్చి అలా వెళ్లిపోయేది కాదు. నా పాత్రకో ముగింపు కూడా ఉంటుంది. సినిమాలో మంచి ఫీల్ ఉంది. మహేశ్‌బాబుగారు, విజయశాంతిగారితో కలసి యాక్ట్ చేయడం బోనస్. ► ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నా పాత్ర చాలా డ్రమాటిక్‌గా ఉంటుంది. హీరో వెంటపడి అల్లరి చేసే పాత్ర నాది. చాలా హైపర్ యాక్టివ్. ఫుల్ లెంగ్త్ నవ్వించే పాత్ర నాది. ట్రైన్ ఎపిసోడ్లో మహేశ్‌బాబు పాత్రను నా పాత్ర చాలా టార్చర్ పెడుతుంది. ఈ సినిమాలోనే కాదు సెట్లోనూ అందర్నీ టార్చర్ పెట్టాను. సెట్లో అందరూ కామ్‌గా ఉంటే అందర్నీ డిస్ట్రబ్ చేస్తుంటాను. అదే నా బలం అనుకుంటున్నాను (నవ్వుతూ). ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పుకునేటప్పుడు ‘మరీ అంత టార్చర్ పెట్టకే’ అని అనుకున్నాను. ► ఈ సినిమా ట్రైలర్లో కనిపించినంత హైపర్‌గా నిజజీవితంలో ఉండను. మా దర్శకుడు చెప్పినట్లు చేశాను. మీరు చేసి చూపించండి, దాన్ని కాపీ కొడతాను అని చెప్పి కాపీ కొట్టేశా. కాపీ అంటే పూర్తి కాపీ కాదు. ఆయన చెప్పినదానికి కొంచెం నా స్టయిల్ జత చేసి నటించాను. ► విజయశాంతిగారితో నాకు ఎక్కువ సన్నివేశాలు లేవు. మొదట్లో ఆమెతో మాట్లాడాలంటే కొంచెం టెన్షన్ పడ్డాను. ఆమెను లేడీ అమితాబ్ అంటారు కదా. అలాగే సీనియర్ యాక్టర్ అని చిన్న భయం ఉండేది. కానీ సెట్లో ఆమె ఎనర్జీ చూసి ఫ్యాన్ అయిపోయాను. చాలా పాజిటివ్‌గా ఉంటారు. కేరళలో షూటింగ్ అప్పుడు మేం ఫ్రెండ్స్ అయిపోయాం. రెండు రోజులు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు ఫోన్ చేసి కూడా విసిగిస్తున్నా. త్వరలోనే మేమిద్దరం కలసి ఓ సినిమా చేస్తాం (నవ్వు). ► ఈ సినిమాలోని ‘మైండ్ బ్లాక్..’ సాంగ్‌లో డ్యాన్స్ హైలైట్‌గా ఉంటుంది. నాకు డ్యాన్స్ అంతగా రాదేమో అని మా టీమ్ అనుకున్నారు. ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేస్తారో అని ఎదురు చూస్తున్నాను. ► వచ్చే నెలలో ‘భీష్మ’ విడుదల అవుతుంది. సుకుమార్– అల్లు అర్జున్ కాంబినేషన్లో హీరోయిన్గా చేయబోతున్నాను. రెండు మూడు నెల్లలో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. మిగతావి చర్చల్లో ఉన్నాయి. -
రిస్క్ ఎందుకన్నా అన్నాను
‘‘నాకున్న క్లోజ్ ఫ్రెండ్స్‌లో శ్రీనివాస్‌రెడ్డి ఒకరు. అందుకనే నా సినిమాల్లో తనుంటాడు. ‘సరిలేరు నీకెవ్వరు’లో మాత్రం మిస్సయ్యాడు. మా సినిమాల షూటింగ్స్‌లో తను ఆర్టిస్ట్‌గాకంటే అసిస్టెంట్ డైరెక్టర్‌గా కష్టపడుతుంటాడు’’ అన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. నటుడు వై. శ్రీనివాస్‌రెడ్డి దర్శక నిర్మాతగా ఫ్లయింగ్ కలర్స్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’. శ్రీనివాస్‌రెడ్డి, సత్య, ‘షకలక’ శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో బ్యానర్ లోగోను అనిల్ రావిపూడి, టైటిల్ యానిమేషన్‌ను సంగీత దర్శకుడు యస్.యస్. తమన్ విడుదల చేశారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు ప్రొడక్షన్ కూడా చేస్తున్నానని శ్రీనివాస్‌రెడ్డి చెప్పగానే ‘ఎందుకన్నా.. రిస్క్ ఏమో!’ అన్నాను. తను ప్లానింగ్‌తో సినిమాను పూర్తి చేశాడు.. సినిమా చాలా బాగుంది’’ అన్నారు. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకు వేరే డైరెక్టర్‌ను పెట్టినా ఆయన వెనక నేను నిలబడాల్సి వచ్చేది. అందుకే నేనే డైరెక్ట్ చేశాను. దర్శకుడు కావాలనే కోరిక అలా తీరింది. సినిమా చూసిన ‘దిల్’ రాజుగారు, శిరీష్‌గారు, సాయిగారు.. ఇంకొంతమంది చిన్న కరెక్షన్స్ చెప్పారు. అవెంతో ఉపయోగపడ్డాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు తమన్. నిర్మాత పద్మనాభ రెడ్డి, నటులు ‘సత్యం’ రాజేష్, ‘షకలక’ శంకర్, సంగీత దర్శకుడు సాకేత్ తదితరులు మాట్లాడారు. -
‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ ఎప్పుడంటే?
మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ఇందులో ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్ర చేస్తున్నారు మహేశ్‌బాబు. ఈ చిత్రంలో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటివకే విడుదలైన ప్రచార గీతం, మహేశ్ బాబు, విజయశాంతి ఫస్ట్ లుక్ పోస్టర్లు హైలైట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే మహేశ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అన్ని ఎదురు చూస్త్ను టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 22న ‘సరిలేరు నీకెవ్వరు’టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే మేజర్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను త్వరగా కంప్లీట్ చేసుకొని ప్రమోషన్స్ భారీగా చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక్కొ అస్త్రాన్ని సంధించి అభిమానులకు సినిమాపై అంచనాలు పెరిగేలా చేయాలని భావిస్తోంది. దీనిలో భాగంగా ఈ సినిమా టీజర్‌ను అనిల్ రావిపూడి బర్త్‌డే సందర్భంగా ఈ నెల 23న విడుదల చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉందని తాజా సమాచారం. అంతేకాకుండా ఈ నెల చివర్లో మూవీ కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తారనే టాక్ కూడా నడుస్తోంది. డిసెంబర్ మొదటివారంలో ఓ పాటను విడుదల చేస్తారని టాలీవుడ్ టాక్. ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. Witness Major Ajay Krishna on Nov 22nd @ 5:04 PM 💥#SarileruNeekevvaruTeaser Superstar @urstrulyMahesh @AnilRavipudi @AnilSunkara1 @vijayashanthi_m @iamRashmika @RathnaveluDop @ThisIsDSP @AKentsOfficial @GMBents @SVC_official #SarileruNeekevvaruTeaserOnNov22nd pic.twitter.com/1KFfq5DcbE — AK Entertainments (@AKentsOfficial) November 19, 2019 -
టీజర్ రెడీ
గన్ ట్రిగ్గర్ లాగి లక్ష్యం వైపు ముందుకు వెళ్తున్న మేజర్ అజయ్‌కృష్ణ ఆపరేషన్ ఎలా విజయవంతమైందన్న విజువల్ సంక్రాంతి పండక్కి వెండితెరపై చూడొచ్చు. ఆ లోపు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని ఈ ఆపరేషన్ తాలూకు శాంపిల్‌ను ఈ వారంలో టీజర్‌గా విడుదల కాబోతుంది. మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఇది. ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రంలో మేజర్ అజయ్‌కృష్ణ పాత్రలో మహేశ్‌బాబు నటిస్తున్నారు. రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ పాట చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. ఈ సినిమా టీజర్‌ను అనిల్ రావిపూడి బర్త్‌డే సందర్భంగా ఈ నెల 23న విడుదల చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉందని తాజా సమాచారం. టీజర్‌ను ఈ నెల 19న విడుదల చేసి, ఈ నెల 23న మూవీ కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తారనే టాక్ కూడా నడుస్తోంది. డిసెంబర్ మొదటివారంలో ఓ పాటను విడుదల చేస్తారట. ఈ విషయాలపై అతి త్వరలో అధికారిక ప్రకటన వెల్లడి కానుంది. ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీప్రసాద్. -
ఫైనల్‌కొచ్చేశారు
‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ తుది దశకు చేరుకుంది. చివరి షెడ్యూల్ మినహా షూటింగ్ పూర్తయిందని చిత్రబృందం తెలిపింది. మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ సుంకర, ‘దిల్’ రాజు, మహేశ్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా కథానాయిక. విజయ శాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే ఓ షెడ్యూల్‌ను ప్రత్యేకంగా వేసిన ఇంటి సెట్లో పూర్తి చేశారు. కథానుసారం ఇది విలన్ (ప్రకాశ్ రాజ్) ఇల్లు అని సమాచారం. ఈ సెట్ రూపొందించడానికి రెండున్నర కోట్లు ఖర్చు చేశారట. త్వరలో చివరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: రత్నవేలు. అసురన్ బావుంది ధనుష్ హీరోగా వెట్రిమారన్ రూపొందించిన తమిళ చిత్రం ‘అసురన్’. ఇటీవల విడుదలైన ఈ సినిమాను చూసిన మహేశ్ ఆ సినిమాను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ‘‘అసురన్’ సినిమా చాలా నిజాయతీగా అనిపించింది. అద్భుతంగా ఉంది. టీమ్‌కి నా అభినందనలు’’ అన్నారు. -
మహేష్ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో జగపతిబాబు నటించడం లేదని సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. మహేష్, జగపతి బాబు మధ్య విభేదాల కారణంగానే ఆయన సినిమా నుంచి తప్పుకున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలుగు సినీపరిశ్రమలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలపై జగపతిబాబు స్పందించారు. తనకు మహేష్‌తో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని.. అవన్నీ తప్పుడు వార్తలని కొట్టిపారేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. ‘సినీ పరిశ్రమ అనేది నాకు కుటుంబంతో సమానం. వారి గురించి మాట్లాడటం సరికాదు. కానీ నాపై వస్తున్న తప్పుడు కథనాల మూలంగా 33 ఏళ్ల సినీ జీవితంతో తొలిసారి వివరణ ఇస్తున్నా. మహేష్ బాబు సినిమా నుంచి నన్ను తప్పించారంటూ వార్తలు వస్తున్నాయి. అవన్నీ తప్పుడు వార్తలు. మహేష్ సినిమా కోసం రెండు చిత్రాలను కూడా వదులుకున్నాను. ఈ క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ నాకు చేయాలని ఉంది. కానీ కొన్ని అనుకోని సంఘటన మూలంగా ఆ చిత్రంలో నటించడం కుదరటంలేదు. సోషల్ మీడియాలో వస్తున్నదంతా అసత్యం. మహేష్‌కి, చిత్ర యూనిట్‌కి ఆల్ ద బెస్ట్’’ అంటూ జగపతిబాబు వివరణ ఇచ్చారు. అయితే జగపతిబాబు స్థానంలో ప్రకాశ్‌రాజ్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. -
మేజర్ అజయ్‌కృష్ణ
కశ్మీర్లో ఆపరేషన్ షురూ చేశారు మేజర్ అజయ్‌కృష్ణ. ఈ ఆపరేషన్ డీటైల్స్ వచ్చే ఏడాది సంక్రాంతికి సిల్వర్ స్క్రీన్‌పై చూడొచ్చు. మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో మేజర్ అజయ్‌కృష్ణ పాత్రలో మహేశ్‌బాబు నటిస్తున్నారు. రష్మికా మండన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కశ్మీర్లో జరుగుతోంది. నెక్ట్స్ షెడ్యూల్‌ను టీమ్ హైదరాబాద్‌లో ప్లాన్ చేసినట్లు తెలిసింది. ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్ బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా విజయశాంతి నటిగా రీ–ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. -
సరిలేరు నీకెవ్వరు!
‘మహర్షి’ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసి ప్రజెంట్ ఫారిన్లో ఫ్యామిలీతో కలిసి హాలిడేని ఎంజాయ్ చేస్తున్నారు మహేశ్‌బాబు. అయితే మహేశ్ నెక్ట్స్ సినిమా వర్క్స్ మాత్రం మంచి జోరుగా సాగుతున్నాయి. ‘ఎఫ్ 2’ ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. ఈ సినిమా షూటింగ్ కోసం కర్నూల్లో లొకేషన్స్‌ని వెతుకుతున్నారు అనిల్ రావిపూడి. ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ జూన్‌లో స్టార్ట్ కానుందని తెలుస్తోంది. అలాగే లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయడానికి అంగీకరించారని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ చిత్రంలో రష్మికా మండన్నా కథానాయిక అని తెలిసింది. అలాగే ఈ సినిమాకు ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్‌ను టీమ్ పరిశీలిస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. మహేశ్ కెరీర్లో వన్నాఫ్ ది హిట్స్‌గా నిలిచిన ‘ఒక్కడు’ సినిమాలోని కొన్ని సీన్లు కర్నూల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటాయని గుర్తుండే ఉంటుంది. ఇదిలా ఉంటే.. ‘మహర్షి’ ప్రీ–రిలీజ్ ఫంక్షన్ మే 1న జరగనుంది. -
ఫన్ చేస్తారా?
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన తెలుగు చిత్రం ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా రూపొందిన ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించారు. ఈ సినిమాను బోనీకపూర్‌తో కలిసి ‘దిల్’ రాజు హిందీలో రీమేక్ చేయనున్నారు. హిందీ చిత్రంలో వెంకటేశ్, అర్జున్ కపూర్ హీరోలుగా నటించబోతున్నారని బాలీవుడ్ టాక్. తెలుగు చిత్రాలు ‘పెళ్లాం ఊరెళితే, రెడీ’లను నో ఎంట్రీ, రెడీగా హిందీలో రీమేక్ చేసిన అనీస్ బాజ్మీ హిందీ ‘ఎఫ్ 2’ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఇక బోనీకపూర్ తనయుడే అర్జున్ కపూర్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరి.. వెంకీ, అర్జున్ కాంబినేషన్ నిజమేనా? వేచి చూద్దాం. -
అనిల్ సినిమాలు చూస్తే జిమ్‌కు వెళ్లక్కర్లేదు
‘‘డిస్ట్రిబ్యూటర్స్‌కి ఇలా షీల్డ్స్ ఇవ్వడం చూసి చాలా ఏళ్లయ్యింది. ‘దిల్’ రాజు మంచి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్. ఇక అనిల్ రావిపూడి సినిమా చూస్తే చాలు జిమ్‌కు కూడా వెళ్లనక్కర్లేదు’’ అని దర్శకులు కె. రాఘవేంద్రరావు అన్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి రూపొందించిన చిత్రం ‘ఎఫ్ 2’. తమన్నా, మెహరీన్ హీరోయిన్లు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్–లక్ష్మణ్ నిర్మించిన ‘ఎఫ్ 2’ చిత్రం 50 రోజులను పూర్తి చేసుకున్న సందర్భంగా, రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ‘‘నా సినిమాల్లో ‘పెళ్ళిసందడి, గంగోత్రి’ సినిమాలు ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టాయి. వెంకటేష్ గత సినిమాల కంటే వంద రెట్లు ఎక్కువగా నవ్వించాడు, వరుణ్ కూడా మంచి నటనను కనపరిచాడు’’ అన్నారు. ‘‘ఈ సినిమా 50 రోజుల వేడుకను జరుపుకోవడానికి ముఖ్య కారణం అనిల్. మా హీరోలిద్దరూ బిజీగా ఉండటం, అనిల్ తన నెక్ట్స్ మూవీకి, అలాగే మేం నెక్ట్స్ ప్రాజెక్ట్‌తో ఆల్రెడీ బిజీగా ఉన్నా... ఈ వేడుక చేయడానికి నిర్ణయించుకున్నాం’’ అన్నారు ‘దిల్’ రాజు. ‘‘ఎక్కడా గ్యాప్ లేకుండా కామెడీతో అనిల్ ఇరగొట్టేశాడు. టాలెంట్‌ను వెతికి పట్టుకుని, ఎంకరేజ్ చేయడం ‘దిల్’ రాజుగారికి వెన్నతో పెట్టిన విద్య. నవ్విస్తే చాలు.. ప్రేక్షకుడు లాజిక్, మేజిక్ల గురించి ఆలోచించడు’’ అన్నారు యస్వీ కృష్ణారెడ్డి. ‘‘ఈ సినిమాకు సంబంధించి ఈ షీల్డుని చూస్తే .. దీనికి సంబంధించిన జ్ఞాపకం మైండ్‌లో రీల్లా తిరుగుతుంది. అందుకనే ఈ ఫంక్షన్ చేశాం. 107 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకోవడమే కాదు.. 130 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేసిన సినిమా ఇది. ‘నువ్వునాకు నచ్చావ్’ లాంటి ఫుల్ ఎంటర్టైనింగ్ సినిమాను వెంకటేష్‌గారు చేస్తే ఎలా ఉంటుందో ఈరోజు మనకు మరోసారి తెలిసింది. వరుణ్‌తేజ్ కామెడీజోనర్లో చేసిన తొలి చిత్రమిది. అలాగే తమన్నా, మెహరీన్, రాజేంద్ర ప్రసాద్‌గారు, ఇలా ప్రతి ఆర్టిస్ట్‌కు, సాంకేతిక నిపుణలకు థాంక్స్.రాజుగారు, శిరీష్‌గారు, లక్ష్మణ్‌గారు నాకు కుటుంబతో సమానం’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘నా 10వ సినిమా బెస్ట్ మూవీగా నిలవడం, సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడం పట్ల çసంతోషంగా ఉన్నాను’’ అన్నారు మెహరీన్. -
శ్రీవారిని దర్శించుకున్న అనిల్ రావిపూడి, దిల్ రాజు