Anisha Ambrose
-
అవన్నీ కథలో భాగమే
‘భలే భలే మగాడివోయ్’, ‘నేను లోకల్’, ‘మహానుభావుడు’, ‘శైలజారెడ్డి అల్లుడు’తో సినిమాటోగ్రాఫర్‌గా నిజార్ షఫీ మంచి పేరు తెచ్చుకున్నారు. ‘సెవెన్’ చిత్రం ద్వారా ఆయన దర్శకుడిగా మారారు. హవీష్ హీరోగా రమేష్ వర్మ ప్రొడక్ష¯Œ లో రమేష్ వర్మ నిర్మించారు. రెజీనా, నందితా శ్వేత, అనీషా ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లు. ఈ 5న చిత్రం విడుదల కానున్న సందర్భంగా నిజార్ షఫీ మాట్లాడుతూ – ‘‘ఎంజీఆర్ గవర్నమెంట్ ఫిల్మ్ అండ్ టెలివిజ¯Œ ట్రైనింగ్ ఇ¯Œ స్టిట్యూట్లో డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ చేశా. కోర్స్ పూర్తయిన తర్వాత శక్తీ శరవణన్‌గారి దగ్గర ‘సరోజ’, తెలుగులో ‘గ్యాంబ్లర్’గా విడుదలైన అజిత్ సినిమాలకు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశా. రజనీకాంత్ గారి ‘రోబో’కి సినిమాటోగ్రాఫర్ రత్నవేలుగారి దగ్గర అసిస్టెంట్‌గా చేశా. ఒక రోజు హవీష్ ఫోన్ చేసి, ‘మంచి లైన్ విన్నాను. డైరెక్షన్ చేస్తారా?’ అని అడిగారు. నాకు స్టోరీ లైన్ నచ్చింది. రమేష్ వర్మగారితో కలిసి డెవలప్ చేశాం. మంచి స్టోరీ లైన్, ఎందుకు ఈ సినిమా మిస్ చేసుకోవాలని దర్శకుడిగా ఓకే చెప్పేశా. ఇదొక రొమాంటిక్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. సినిమాలో లిప్ కిస్సుల ఐడియా నాదే. కథలో భాగంగా ఉంటాయి. నటుడిగా ముద్దు సన్నివేశాలు చేయడానికి హవీష్ కొంచెం ఆలోచించి ఉండొచ్చు. కానీ, దర్శకుడిగా సెట్లో నాకు కావలసిన సన్నివేశాలు చేయించుకున్నాను. ప్రస్తుతం సినిమాటోగ్రాఫర్‌గా కొన్ని సినిమాలు కమిట్ అయ్యాను. దర్శకుడిగా రెండు స్టోరీ లైన్స్ అనుకున్నాను’’ అన్నారు. -
వాళ్లు చెప్పిందొకటి.. చేసిందొకటి
‘‘తెలుగు అమ్మాయి కావాలి అని దర్శకులు అనుకున్నారు కాబట్టే ‘దర్శకుడు, రంగస్థలం, కల్కి’ సినిమాల్లో నాకు అవకాశాలు వచ్చాయి’’ అన్నారు పూజిత పొన్నాడ. కెమెరామెన్ నిజార్ షఫీ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘7’. హవీష్ హీరోగా, రెజీనా, నందితాశ్వేత, త్రిధాచౌదరి, అనీషా ఆంబ్రోస్, అదితీ ఆర్య, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. రమేష్ వర్మ నిర్మించిన ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ నెల 5న విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా పూజిత పొన్నాడ చెప్పిన విశేషాలు... ► నా తొలి ప్రాధాన్యం ప్రేమకథకే. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘7’ చిత్రంలో నాది సస్పెన్స్ రోల్. అందుకే నా పాత్ర గురించి ఎక్కువగా రివీల్ చేయకూడదు. సినిమాలో ఆరుగురు హీరోయిన్లు ఉన్నప్పటికీ ఎవరి కథ వారిదే. క్లైమాక్స్‌లో మెర్జ్ అవుతాయి. ఈ సినిమాలో లిప్‌లాక్ సీన్ లేని హీరోయిన్ని నేనే అనుకుంటాను. హావీష్ మంచి కో స్టార్. ‘రాజుగాడు’ సినిమాలో చేసినప్పుడే షఫీగారితో పరిచయం.ఆయన దర్శకత్వంలో నటించడం హ్యాపీ. ► ఎలాంటి టీమ్‌తో వర్క్ చేయకూడదో ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ’ సినిమా ప్రయాణం నేర్పించింది. ఈ సినిమా చేసినందుకు రిగ్రేట్ ఫీల్ అవుతున్నాను. స్క్రిప్ట్ నుంచి ప్రమోషన్, రిలీజ్ దాకా వారు చెప్పింది ఒకటి.. చేసింది మరొకటి. ఏదీ నేను అనుకున్నట్లు జరగలేదు. ఈ సినిమాకు ముందు స్క్రిప్ట్‌ని బట్టి మాత్రమే సినిమా చేసేదాన్ని. ఇప్పుడు మూవీ టీమ్‌ని కూడా పరిశీలించుకుంటున్నాను. ► ప్రస్తుతం ‘కల్కి’ సినిమాలో ఓ డిఫరెంట్ రోల్ చేస్తున్నాను. తెలుగులో కీర్తీ సురేశ్ లీడ్ రోల్ చేయనున్న చిత్రంలో నటించనున్నా. అదేవిధంగా మరో తమిళ సినిమాకి కూడా సైన్ చేశాను. -
ముద్దు సీన్లు ఉన్నాయని ముందు తెలియదు
‘‘సాధారణంగా నాకు థ్రిల్లర్స్ పెద్దగా ఆసక్తి లేదు. ఆ సబ్జక్టే కొంచెం డ్రైగా అనిపిస్తుంది. కానీ ఈ థ్రిల్లర్ ఒప్పుకోవడానికి కారణం కథ. ప్లస్ 6 హీరోయిన్లు ఉన్న తర్వాత ఇక డ్రైగా ఎందుకు ఉంటుంది? ఇలాంటి కథ ఎక్కడా రాలేదు’’ అన్నారు హవీష్. కెమెరామేన్ నిజార్ షఫీ దర్శకుడిగా మారి హవీష్ హీరోగా రెజీనా, నందితా శ్వేత, త్రిధా చౌదరి, అనీషా ఆంబ్రోస్, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా రూపొందించిన చిత్రం ‘7’. రమేశ్ వర్మ కథను అందించి, నిర్మించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ఈ నెల 5న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా హవీష్ పలు విషయాలు పంచుకున్నారు. ► సినిమాలో రెహమాన్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారు. ఆయన దృష్టిలో హీరోయిన్లు, నేను (6+1) 7 పాత్రలం. అందుకే ఆ టైటిల్ పెట్టాం. మొదట సినిమా అనుకున్నప్పటి నుంచి మరో నాలుగు రోజుల్లో సెట్స్ మీదకు వెళ్తాం అనేవరకూ కూడా తెలుగులో మాత్రమే తీయాలనునుకున్నాం. చివర్లో మరో నిర్మాత కూడా తోడవ్వడంతో తెలుగు, తమిళంలో నిర్మించాం. దర్శకుడు షఫీ పుట్టింది తమిళనాడులో అయినా తెలుగు సినిమాలు ఎక్కువ చేశారు. రెండు ప్రాంతాల వాళ్లకు అనుగుణంగా ఈ సినిమా తెరకెక్కించారు. నాకు ఒక్క ముక్క తమిళం రాదు. డైలాగ్స్ నేర్చుకోవడానికి గంటల గంటలు పట్టేది. ► కథలో బలం ఉండబట్టే ఆరుగురు హీరోయిన్లు నటించడానికి ఒప్పుకున్నారు. ఒకరితో ఫ్రెండ్ అవుతున్నాను అనుకునే లోపు ఆమె పార్ట్ షూటింగ్ పూర్తయి మరో హీరోయిన్ జాయిన్ అయ్యేవారు. ఇంత మంది హీరోయిన్లు ఉన్నప్పుడు చిన్న చిన్న ఫైట్స్ కామన్. ఇద్దరు హీరోయిన్స్ సెట్లో ఉన్నప్పుడు అక్కడి వాతావరణంలో తేడా నాకు అర్థం అయ్యేది. ► ఏ పని చేసినా నం.1గా ఉండాలనుకునే మనస్తత్వం నాది. అలానే కష్టపడతాను. మన పని మనం చేసుకుంటూ వెళ్తే సక్సెస్ ఆటోమేటిక్‌గా వస్తుంది. ఆ మధ్య ఓ పెద్ద ప్రాజెక్ట్‌లో హీరోగా అవకాశం వచ్చింది. చివరి నిమిషంలో క్యాన్సిల్ అయింది. దాంతో నా గత చిత్రానికి, దీనికి ఇంత గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం ఓ మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. అభిషేక్ పిక్చర్స్ వాళ్లకు చేస్తున్నది ఫ్యామిలీ డ్రామా. అందులో మంచి లవ్‌స్టోరీ ఉంటుంది. ► మా ప్రొడక్షన్లో ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘రాక్షసుడు’ సినిమా చేస్తున్నాం. జూలై 18న రిలీజ్ అనుకుంటున్నాం. నా బ్యానర్లో నేను నటించకపోయినా ఫర్వాలేదు. ఆల్రెడీ బ్యానర్లో నిర్మాతగా నా పేరున్నట్టే. ప్రతి సినిమాలో నేనుండవసరం లేదు కదా. ► ‘7’లో కొన్ని లిప్‌లాక్ సన్నివేశాలు ఉన్నాయి. కథ చెప్పినప్పుడు ముద్దు సీన్లు ఉన్నాయని నాతో చెప్పలేదు. సెట్లోకి వెళ్లి హీరోయిన్ను ముద్దుపెట్టమంటే భయపడ్డాను. ‘ఒకవేళ తను కొడితే ఏంటి?’ అనుకున్నాను. మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత ధైర్యంగా చేసేశాను. ఏ రంగంలో అయినా మార్పు మంచిదే. అందరికీ చాన్స్ ఇవ్వాలనే పద్ధతిని నమ్ముతాను. ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబుగారిని చూశాం. ఇప్పుడు జగన్‌గారికి అవకాశం ఇచ్చారు. ఆప్షన్ ఉండాలి. ఈయన సరిగ్గా పరిపాలించకపోతే ఆయన. ఆయన చేయకపోతే ఈయన.. అలా ఉండాలి. జగన్‌గారు రావడం ఖచ్చితంగా మంచిదే. ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదని ఎందుకు అనుకోవాలి. జగన్‌గారు యంగ్‌స్టర్, ప్రపంచాన్ని చూశాడు. ఆయన బాగా పాలించగలరని అనుకుంటున్నాను. -
ఆరుగురు అమ్మాయిలు.. ఓ అబ్బాయి
అతడి పేరు కార్తీక్. ఆరుగురు అమ్మాయిలు అతనితో ‘ఐ థింక్... ఐయామ్ ఇన్ లవ్ విత్ యు కార్తీక్’ అన్నారు. దీంతో ఆరుసార్లు నవ్విన కార్తీక్ ఆరుగురికీ ముద్దులు పెట్టి, ముగ్గులోకి దింపాడు. ఇంతకీ అతడి కథేంటి? అన్నది జూన్ 5న తెలుస్తుంది. హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సెవెన్’. రెజీనా, నందితా శ్వేత, అనీషా ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. కిరణ్ స్టూడియోస్‌పై రమేష్ వర్మ ప్రొడక్షన్లో రమేష్ వర్మ నిర్మించారు. ఈ సినిమా వరల్డ్‌వైడ్ రైట్స్‌ను సొంతం చేసుకున్న అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాని జూన్ 5న విడుదల చేస్తోంది. సంస్థ అధినేత అభిషేక్ నామా మాట్లాడుతూ– ‘‘సెవెన్’ ఫస్ట్ కాపీ చూశా. మైండ్ బ్లోయింగ్. థ్రిల్లర్ చిత్రాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుంది. ట్విస్ట్ వెనక ట్విస్ట్ ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తాయి. రమేష్ వర్మగారు ఫెంటాస్టిక్ స్టోరీ, స్క్రీన్ ప్లే రాశారు. ఈ సినిమాలో కొత్త హవీష్‌ను చూస్తారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్ భరద్వాజ్, సహ నిర్మాత: కిరణ్ కె. తలశిల (న్యూయార్క్), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామకృష్ణ, కెమెరా–దర్శకత్వం నిజార్ షఫీ. -
ఒక్కరా.. ఇద్దరా?
ఆ అబ్బాయి పేరు కార్తీక్. ప్రేమ, పెళ్లి పేరుతో యువతులను మోసం చేశాడని అతడిపై కేసు నమోదు అవుతుంది. పోలీసులు కార్తీక్ కోసం గాలింపు చర్యలు చేపడతారు. అతడు కార్తీక్ కాదని, కృష్ణమూర్తి అని ఓ వ్యక్తి చెబుతాడు. అమ్మాయిలను మోసం చేసింది ఎవరు? కార్తీకా? కృష్ణమూర్తా? వంటి సస్పెన్స్ అంశాలతో రూపొందిన చిత్రం ‘సెవెన్’. హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో తెరకెక్కింది. రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలుగా నటించారు. కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ నిర్మించిన ఈ సినిమా జూన్ 5న విడుదలకానుంది. శుభం విశ్వనాధ్ సాహిత్యం అందించిన ‘సంపొద్దోయ్ నన్నే..., పులగం చిన్నారాయణ సాహిత్యం అందించిన ‘ఇదివరకెపుడు తెలియదు...’ పాటలను ఇప్పటికే రిలీజ్ చేయగా, తాజాగా సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. రమేష్ వర్మ మాట్లాడుతూ–‘‘ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్. కథ నేనే అందించాను. అభిషేక్ పిక్చర్స్ సంస్థ మా సినిమాని విడుదల చేస్తోంది’’ అన్నారు. ‘‘ట్రైలర్‌లా సినిమా కూడా కొత్తగా ఉంటుంది’’ అని హవీష్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్ భరద్వాజ్, సహనిర్మాత: కిరణ్ కె. తలశిల (న్యూయార్క్), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామకృష్ణ. -
ఆరు ప్రేమకథలు
‘‘ఆరుగురు అమ్మాయిలు.. ఆరు ప్రేమకథలు.. విచిత్రంగా ఆరు ప్రేమకథల్లోనూ అబ్బాయి ఒక్కడే. ఆరుగురు అమ్మాయిలను ఒకేసారి ప్రేమిస్తున్న ఆ అబ్బాయి మంచోడా? చెడ్డోడా?’’ తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటోంది ‘సెవెన్’ చిత్రబృందం. హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వం వహించిన చిత్రం ‘సెవెన్’. రెజీనా, అనీషా ఆంబ్రోస్, త్రిదా చౌదరి, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రమేష్ వర్మ కథ అందించడంతో పాటు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘‘సెవెన్’ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదో రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా. స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. ఊహించని మలుపులు ఉంటాయి’’ అన్నారు రమేష్ వర్మ. ఈ సినిమాకు కెమెరా: నిజార్ షపి, సంగీతం: చైతన్య భరద్వాజ్. -
సీక్రెట్‌గా హీరోయిన్ నిశ్చితార్థం
ఒకప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారిన హీరోయిన్ అనీషా ఆంబ్రోస్. పవన్ కల్యాణ్ సరసన సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాలో ఈ భామ హీరోయిన్గా నటించాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఆ అవకాశం అనీషా చేజారింది. తరువాత మనమంతా, ఒక్కడు మిగిలాడు లాంటి సినిమాల్లో నటించిన అనీషాకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న 7 సినిమాలో నటిస్తోంది అనీషా. తాజాగా అనీషాకు సంబంధించిన మరో వార్త టాలీవుడ్లో హల్చల్ చేస్తోంది. త్వరలో ఈ భామ పెళ్లిపీటలెక్కనుందట. జేఎంఆర్ కన్స్ట్రక్షన్ ఈడీ గుణ జక్కను అనీషా పెళ్లి చేసుకోబోతోంది. అంతేకాదు ఇప్పటికే సీక్రెట్‌గా వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిందట. ఈ కార్యక్రమానికి అత్యంత సన్నిహితులు మాత్రమే హజరయ్యారు. -
ఏడుతో లింకేంటి?
ఈ మధ్య రెజీనా ఒకటి రెండు మూడు నాలుగు అని అంకెలు లెక్కేస్తూ ఏడు రాగానే ఆగిపోతున్నారు. ఎందుకిలా? ఏడు రెజీనా లక్కీ నెంబరా అంటే.. కాదట. విషయం ఏంటీ అంటే... ‘7’ ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమా టైటిల్. అందుకే ఆ అంకెను అదే పనిగా పలుకుతున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకూ రెజీనా ‘ఏడు’ అంకె జపం చేస్తారేమో! ఇంతకీ కథలో 7కి లింక్ ఏంటి? అంటే సినిమా చూడాల్సిందే. కెమెరామేన్ నిజర్ షఫీ దర్శకుడిగా మారి, తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. రెహమాన్, హవీష్, రెజీనా, అనీషా ఆంబ్రోస్, పూజిత పొన్నాడ ముఖ్య పాత్రధారులు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చైతన్య భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. -
స్కైప్ లో కథవిని ఓకే చెప్పింది..
తమిళసినిమా: వంజకర్ ఉలగం రెగ్యులర్ గ్యాంగ్స్టర్స్ కథా చిత్రంలా ఉండదని ఆ చిత్ర కథానాయకి అనీషా అంబ్రోస్ అంటోంది. చాలా మంది ఇతర చిత్రాల తారల మాదిరిగానే కోలీవుడ్‌కు దిగుమతి అవుతున్న కన్నడ నటి ఈ అమ్మడు. కన్నడంలో గర్వ, మోహన్‌లాల్, గౌతమి జంటగా నటించిన మన్మధ వంటి చిత్రాల్లో నటించిన అనీషా వంజగర్ ఉలగం చిత్రంతో నాయికిగా కోలీవుడ్‌లో అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి సిద్ధమైంది. ఈ చిత్రంలో నటించిన అనుభవాలను తెలుపుతూ వంజగర్ ఉలగం చిత్రం అవుట్ పుట్తో చిత్రయూనిట్ అంతా సంతృప్తిగా ఉందని చెప్పింది. అయితే తనకు మాత్రం ఇది చాలా స్పెషల్ అని పేర్కొంది. వార్తలను సేకరించే పనిలో ఒక భయంకరమైన పరిస్థితిలో చిక్కుకుపోయిన విలేకరి పాత్రలో తాను నటించానని చెప్పింది. ఆ పరిస్థితి నుంచి ఎలా బయట పడ్డానన్నదే తన పాత్ర అని తెలిపింది. ఇది హైపర్లింక్ కథాంశంతో కూడిన చిత్రం అని పేర్కొంది. ఒకే సమయంలో జరిగే పలు కథల ఇతివృత్తంగా వంజకర్ ఉలగం చిత్రం ఉంటుందని చెప్పింది. ఇది గ్యాంగ్స్టర్స్ నేపథ్యంలో సాగే కథా చిత్రం అయినా రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ చిత్రాల మాదిరిగా ఉండదని అంది. ప్రేమ కథా చిత్రాలు పలు కోణాల్లో ఎలాగైతే తెరకెక్కుతాయో, ఈ వంజగర్ ఉలగం చిత్రం వైవిధ్యంగా ఉంటుందని పేర్కొంది. ఈ చిత్ర కథను దర్శకుడు మరోజ్ బీధ తనకు స్కైప్ ద్వారా చెప్పారని, కథ వినగానే ఆయన తాను ఇంతకు ముందు నటించిన చిత్రాలు చూసి ఉంటారా? అన్న ఆశ్చర్యం కలిగిందని చెప్పింది. కారణం నటనకు అవకాశం ఉన్న అలాంటి పాత్రకు తనను ఎంచుకోవడంతో తనకు అలా అనిపించిందంది. చిత్ర షూటింగ్ ప్రారంభం నుంచి అంతా సక్రమంగా జరుగుతూ వచ్చిందని, ఈ చిత్రంలో నటించిన ప్రతిరోజూ సంతోషంగా సాగిందని అనీషా చెప్పుకొచ్చింది. ఇందులో ప్రధాన పాత్రల్లో సిబి భువన్ చంద్రన్, హరీశ్ పేరడి, గురు సోమసుందరం, చాందిని తమిళరసన్, విశాగన్ వనంగాముడి, జాన్‌విజయ్, వాసు విక్రమ్ నటించారు. శ్యామ్.సీఎస్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని లాభిరింద్ ఫిలింస్ పతాకంపై మంజులా బీదా నిర్మిస్తున్నారు. -
‘ఈ నగరానికి ఏమైంది?’ మూవీ రివ్యూ
టైటిల్ : ఈ నగరానికి ఏమైంది? జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : విశ్వక్ సేన్ నాయుడు, సుశాంత్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, సిమ్రన్ చౌదరి సంగీతం : వివేక్ సాగర్ దర్శకత్వం : తరుణ్ భాస్కర్ నిర్మాత : డి. సురేష్ బాబు పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్. కాస్త గ్యాప్ తీసుకొని మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పక్కా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది? సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. పదికి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడా..? ఈ నగరానికి ఏమైంది? యాడ్ రేంజ్లో సినిమా కూడా సక్సస్ అయ్యిందా..? కథ; ఈ నగరానికి ఏమైంది? నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ (విశ్వక్ సేన్ నాయుడు), కార్తిక్ (సుశాంత్ రెడ్డి), కౌశిక్ (అభినవ్ గోమఠం), ఉపేంద్ర (వెంకటేష్ కాకుమాను)లు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతురిని పెళ్ళి చేసుకొని అమెరికాలో సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాసెట్స్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. (సాక్షి రివ్యూస్) ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడిగా ఎదగటానికి షార్మ్ ఫిలింస్ తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావటంతో మధ్యానికి బానిసై ఫ్రెండ్స్‌కు దూరంగా ఉంటుంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్‌కి ఓనర్ కూతురితో పెళ్లి కుదరటంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒక్కటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకొని పరిస్థితుల్లో గోవా వెళ్లిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు..? ఈ ప్రయాణం వారికి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది.? ఈ ట్రిప్ తరువాత వారు ఎలా మారిపోయారు? అన్నదే మిగతా కథ. నటీనటులు ; సినిమా అంతా నలుగురు కుర్రాళ్ల చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటీనటులను ఎంచుకున్న దర్శకుడు వాళ్ల నుంచి సహజమైన నటనను రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్ సీరియస్‌నెస్ తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమఠం. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతీసారి ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుకుంటాడు.(సాక్షి రివ్యూస్) చిన్న చిన్న పంచ్ డైలాగ్స్‌తో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో సుశాంత్, ఉపేంద్రలు తమ పాత్రలకు న్యాయం చేశారు. వివేక్ ప్రేమ కథలో వచ్చే శిల్ప పాత్రలో సిమ్రాన్ చౌదరి అందంగా కనిపించారు. మోడ్రన్ అమ్మాయిగా అనీషా ఆంబ్రోస్ అందం, అభినయంతో ఆకట్టుకుంది. విశ్లేషణ ; పెళ్లిచూపులు లాంటి క్లాస్ సినిమా తరువాత పక్కా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్ గా తెరకెక్కించాడు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఇరికించిన ఎమోషన్స్, బిల్డప్ సీన్స్, డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగుతుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెరమీద చూపించటంలో తరుణ్ భాస్కర్ విజయం సాధించాడు. చాలా సందర్భాల్లో తనలోని రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. `జీవితమంటే.. నచ్చిన వాళ్లతో ఉంటూ, నాలుగు మెతుకులు తింటూ, నచ్చిన పని చేసుకోవడమే` లాంటి డైలాగ్స్ మనసును తాకుతాయి. (సాక్షి రివ్యూస్) ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రస్టింగ్‌గా తెరకెక్కించిన దర్శకుడు.. వివేక్ ప్రేమకథ, బ్రేకప్ లను చాలా సాదాసీదాగా తెరకెక్కించాడు. తొలి భాగం కామెడీ సీన్స్ తో వేగంగా కథ నడిచినా.. ద్వితీయార్థం కాస్త నెమ్మదించింది. వివేక్ సాగర్ అందించిన పాటలు పరవాలేదనిపించినా.. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ ; లీడ్ యాక్టర్స్ నటన డైలాగ్స్ మైనస్ పాయింట్స్ ; అక్కడక్కడా నెమ్మదించిన కథనం లవ్ స్టోరి సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
స్టార్స్‌తో సినిమా తీయడం రిస్క్
‘‘హ్యాంగోవర్, దిల్ చహ్తా హై, జిందగీ నా మిలేంగా దోబారా’ లాంటి సినిమాలన్నీ బడ్డీ కామెడీలు. అలాంటి సినిమాలు తెలుగులో రాలేదు. ఆ స్టైల్లో రాసుకున్న సినిమానే ‘ఈ నగరానికి ఏమైంది’’ అని దర్శకుడు తరుణ్ భాస్కర్ అన్నారు. విశ్వక్ సేన్, సాయి సుశాంత్, వెంకట్ కాకుమాను, అభినవ్ గోమటం, అనీషా అంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ముఖ్య పాత్రల్లో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో డి.సురేశ్ బాబు నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. తరుణ్ భాస్కర్ చెప్పిన విశేషాలు... ► ‘పెళ్ళిచూపులు’ సక్సెస్ అర్థం కావడానికి టైమ్ పట్టింది. ఈ షాక్‌లో నుంచి బయటకు రావడానికి, కొంచెం బ్యాలెన్స్ రావడానికి సమయం పట్టింది. ‘పెళ్ళిచూపులు’ సినిమాకి ప్లస్ పాయింట్ కథ. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి కూడా అదే ప్లస్ పాయింట్. కథ విన్న వెంటనే సురేశ్‌బాబుగారు ఓకే అన్నారు. షూటింగ్‌లోనూ ఎలాంటి మార్పులు చెప్పలేదు. ►కొత్త వాళ్లతో కథ చెప్పడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. స్టార్స్‌తో అయితే కథ వాళ్ల చుట్టూ తిరగాలి. అలా రాయడం నాకు కొత్త. నిజమైన రిస్క్ స్టార్స్‌తో సినిమా తీయడమే. కొత్తవాళ్లతో ఆల్రెడీ చేశాను. అదే నమ్మకంతో ‘ఈ నగరానికి ఏమైంది’ చేశా. ►‘పెళ్ళిచూపులు’ హిట్ తర్వాత చాలా మంది హీరోలు జెన్యూన్‌గా అప్రిషియేట్ చేశారు. మంచి పాయింట్ ఉంటే అప్రోచ్ అవ్వమన్నారు. సినిమా పూర్తిగా అర్థం అవ్వాలి. అది అయ్యాక వాళ్లను అప్రోచ్ అవ్వాలనుకుంటున్నా. ►జనంలో క్యూరియాసిటీ పెంచడం కోసమే కాకుండా సినిమాలో మెయిన్ థీమ్ కూడా అదే ఉండటంతో ‘ఈ నగరానికి ఏమైంది’ అనే టైటిల్ ఫిక్స్ చేశాం. ఈ టైటిల్ నా ఫ్రెండ్ కౌశిక్ చెప్పారు. సురేశ్‌బాబుగారు కూడా బావుంది అనడంతో ఫిక్స్ అయ్యాం. తాగుడుకు బానిసత్వం గురించి ఈ సినిమాలో డిస్కస్ చేశాం. ఫన్నీ ఎంటర్టైనింగ్ మూవీ. తర్వాతి సినిమా గురించి ఇంకా ఆలోచించలేదు. ముందు కథ రాస్తా. అది ఎవరికి సూట్ అవుతుందనిపిస్తే వాళ్లను అప్రోచ్ అవుతా. -
టైటిల్ చూడగానే కంగారుపడ్డాను
‘‘అర్బన్ డెవలెప్మెంట్ మినిస్టర్‌గా ఈ టైటిల్ చూడగానే కంగారుపడ్డాను. హైదరాబాద్ రోడ్ల గురించి పేపర్లో రాస్తుంటారు ‘ఈ నగరానికి ఏమైంది’ అని. దానితో ఈ సినిమాకి ఏం సంబంధం లేదనుకుంటాను (నవ్వుతూ)’’ అన్నారు తెలంగాణ సమాచార సాంకేతిక, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలెప్మెంట్ మినిస్టర్ కేటీఆర్. ‘పెళ్ళి చూపులు’ ఫేమ్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’. విశ్వక్ సేన్, సాయి సుశాంత్, వెంకట్ కాకుమాను, అభినవ్ గోమటం, అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ముఖ్య పాత్రల్లో నటించారు. డి. సురేశ్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం వివేక్ సాగర్. ఈ చిత్రం ప్రీ–రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ– ‘‘తరుణ్ భాస్కర్ నన్ను ఆహ్వానించినప్పుడు ఒక్కటే అడిగాను. మీ టీమ్ అంతా హ్యాండ్ల్యూమ్ వేసుకుంటానంటేనే వస్తాను అని. అన్నట్టుగానే అందరూ వేసుకున్నారు. ‘పెళ్ళి చూపులు’ సినిమాను బాగా ఎంజాయ్ చేశాను. తరుణ్ ఫ్యామిలీ నాకు బాగా తెలుసు. సురేశ్‌బాబు ‘పెళ్ళి చూపులు’ చూడమని చెప్పారు. జనరల్‌గా ఫస్ట్ సినిమా హిట్ అయితే నెక్ట్స్ సినిమా పెద్ద పెద్ద స్టార్స్‌తో హంగామాగా ఉంటుంది. కానీ మళ్లీ కొత్తవాళ్ళతో సినిమా చేస్తున్నా అనేసరికి నాకేం అర్థం కాలేదు. కామెడీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ‘హ్యాంగోవర్, దిల్ చాహ్తా హై’ లాంటి కూల్ సినిమాలాగా ఈ సినిమా ఉంటుందనుకున్నాను. ఇంకా బెటర్‌గా ఉంటుందనుకుంటున్నాను. తెలుగు సినిమాల్లో ఛేంజ్ కనిపిస్తోంది. సందీప్ రెడ్డి, సంకల్ప్ రెడ్డి ఇలా చాలామంది చేతుల్లో ఒక జాయ్‌ఫుల్ రైడ్‌గా తెలుగు ఇండస్ట్రీ ఉంటుందనుకుంటున్నాను. ఈ దర్శకులంతా హద్దుల్ని చెరిపేస్తున్నారు. ఈ సినిమా ‘పెళ్ళి చూపులు’ కంటే పెద్ద సక్సెస్ కావాలి. తరుణ్... నీకంటూ ఓ పాత్ క్రియేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. రానా మాట్లాడుతూ – ‘‘తరుణ్ అంటే ఎందుకో నాకు ఇష్టం. నేను చదివిన స్కూల్లోనే చదివాడు. నా జూనియర్. హెచ్పీయస్ (హైదరాబాద్ పబ్లిక్ స్కూల్) నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిలో ఒక గర్వం ఉంటుంది. ఆ గర్వం అతనిలోనూ ఉంది. ఫస్ట్ హిట్ కొట్టగానే స్టార్స్‌తో డీల్ మేకింగ్ చేసి కరెప్ట్ అయ్యే ఇండస్ట్రీ ఇది. అలా లొంగిపోకుండా మళ్లీ ఓ కథను చెప్పడానికి సిద్ధమైనందుకు చాలా హ్యాపీగా, ప్రౌడ్‌గా ఉంది. మా కంపెనీలో భాగమైనందుకు ఇంకా హ్యాపీ’’ అన్నారు. మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ – ‘‘పెళ్ళిచూపులు’ సినిమా చూసి తరుణ్ నువ్వు మారొద్దు అని చెప్పాను. ఈ ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. తరుణ్ వర్క్‌కి నేను పెద్ద ఫ్యాన్. ‘సమ్మోహనం’ సినిమాలో కూడా అందుకే చిన్న గెస్ట్ అపియరెన్స్ చేయించాను. ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందనుకుంటున్నాను’’ అన్నారు. తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ – ‘‘కొత్త సినిమాలు ఎందుకు చేయాలి? కొత్తవాళ్లను ఎందుకు తీసుకు రావాలంటే.. ఎక్కడో దాక్కుండిపోయిన జెమ్స్‌ను బయటకు తీసుకురావచ్చు. అలాంటి వాళ్లను బయటకు తీసుకురావడం హానర్‌గా ఉంది. ప్రొడ్యూసర్ సురేశ్‌బాబుగారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్‌కి ఆయన ఫాదర్ ఫిగర్లాగా. మా కంటే మోడ్రన్, ముందు చూపు ఉన్న నిర్మాత. ఎటువంటి ఈగో లేని మనిషి. ‘పెళ్ళి చూపులు’ అప్పుడు, ఆ తర్వాత కూడా చాలా హెల్ప్ చేశారు. నికేత్ లాంటి గ్రేట్ టాలెంట్ పరిచయం అయ్యాడు. విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. లత గురించి చెప్పకపోతే నాకు రాత్రి అన్నం ఉండదు. చాలా బాగా వర్క్ చేసింది. వివేక్ సాగర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు’’ అన్నారు.‘‘ఆడిషన్స్‌లో సెలెక్ట్ అవ్వడం హ్యాపీ. సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం’’ అన్నారు అభినవ్ గోమటం. ‘‘ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కచ్చితంగా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు సాయి సుశాంత్. ‘‘వెళ్లిపోమాకే’ సినిమా చూడమని చాలా మందికి షేర్ చేశా. కానీ ఈ సినిమాకి అలా అవసరం లేదు. అందరూ కచ్చితంగా వస్తారు. ఈ సినిమాను రిపీటెడ్‌గా చూస్తారు’’ అన్నారు విశ్వక్ సేన్. ‘‘డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి యాక్టింగ్‌కి రావడం మంచి ఎక్స్పీరియన్స్. తరుణ్, లత, నికేత్ అందరితో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు వెంకటేశ్ కాకమాను. -
నాన్నగారి బయోపిక్ ఆలోచన లేదు
‘‘పెళ్ళి చూపులు’ సక్సెస్ తర్వాత తరుణ్ భాస్కర్‌కి పెద్ద స్టార్‌తో సినిమా చేసే చాన్స్ వచ్చినా తగ్గాడు. తనకు ఇంకా నేర్చుకోవాలని ఉంది. ఇప్పుడా ప్రాసెస్‌లో ఉన్నాడు. ఓ రోజు తప్పకుండా హైట్స్‌కి రీచ్ అవుతాడు. అది గ్యారంటీ’’ అన్నారు నిర్మాత డి. సురేశ్‌బాబు. విశ్వక్ సేన్, సాయి సుశాంత్, వెంకట్ కాకుమాను, అభినవ్ గోమతం, అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ముఖ్య పాత్రల్లో తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో ఆయన నిర్మించిన ‘ఈ నగరానికి ఏమైంది’ ఈ నెల 29న రిలీజవుతోంది. ఈ సందర్భంగా సురేశ్‌బాబు చెప్పిన విశేషాలు... ► మా బ్యానర్లో చిన్న సినిమా చేసినా, పెద్ద సినిమా చేసినా 2 పాయింట్స్ ఉంటాయి. కొత్తవారిని, కొత్త ట్యాలెంట్‌ని పరిచయం చేయడం, ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్‌ని ఇంకా బెటర్ చేయడం. ఇస్రో లాంటి చాలా సంస్థలు పనిని క్రమశిక్షణతో ఒక ప్రాసెస్‌లో చేస్తాయి కాబట్టే వరల్డ్ క్లాస్ సక్సెస్‌ని అచీవ్ చేస్తున్నాయి. అదే రివల్యూషన్, అంత క్రమశిక్షణ ఫిల్మ్ మేకింగ్‌లోనూ రావాలి. దీన్ని ఆచరణలో పెట్టడం కష్టమేం కాదు. కచ్చితంగా చేరుకుంటాం. ► మనం సినిమా చూడ్డానికి వెళ్లి కూర్చోగానే లైట్స్ ఆఫ్ చేసి, స్క్రీన్‌పై ఏదో ప్లే చేస్తారు. ఆ వీడియోకి మనం కనెక్ట్ అయితే సినిమా హిట్.. లేకపోతే ఫ్లాప్.. సింపుల్ ఫార్ములా. సింక్ సౌండ్ ప్రాసెస్‌లోనే ఫిల్మ్ మేకింగ్ జరగాలి. ఈ రోజుల్లో యంగ్ ఫిల్మ్ మేకర్స్ దానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ► ‘ఈ నగరానికి ఏమైంది’ షూటింగ్ జరుగుతున్నప్పుడు రెండుసార్లు సెట్స్‌కి వెళ్లాను. ప్రతీదీ పర్ఫెక్ట్గా అనిపించింది. నాన్నగారి (రామానాయుడు) బయోపిక్ రిస్క్. ‘మహానటి, సంజు’ లాంటి బయోపిక్స్ వేరు, వాళ్లు ఒకే లైఫ్‌లో మల్టిపుల్ లైవ్స్ బతికారు. నాన్నగారి లైఫ్ అలా కాదు. నిజానికి ఒక స్టోరీలో కాంట్రవర్సీస్ లేకపోతే ఆ స్టోరీ ఎవరూ వినరు.. చూడరు. ప్రస్తుతానికి నాన్నగారి బయోపిక్ ఆలోచన లేదు. ► సురేశ్ ప్రొడక్షన్స్ ఏ సినిమా నిర్మించినా పార్టనర్స్‌ని కలుపుకోవడానికే ఇష్టపడతాను. మా ప్రొడక్షన్లో బాబీ డైరెక్షన్లో వెంకటేశ్, చైతన్య సినిమా ఉంటుంది. ఒక్కో సినిమాకి ఒక్కో ప్రాసెస్ ఉంటుంది. రాజమౌళి ‘బాహుబలి’కి ఐదేళ్లు పట్టింది. మా బ్యానర్లో గుణశేఖర్ డైరెక్షన్లో ‘హిరణ్యకశ్యప’కు చాలా రోజులుగా వర్క్ జరుగుతోంది. ఏదైనా పర్ఫెక్ట్గా అయ్యాకే సెట్స్‌పైకి వస్తుంది. మేకింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది. -
‘ఈ నగరానికి ఏమైంది?’
-
బ్యాడ్ గర్ల్
ట్రెడిషనల్ రోల్స్‌తో ఎంట్రీ ఇచ్చి, మెల్లిగా గ్లామరస్ రోల్స్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న అమలా పాల్ ఇప్పుడు కెరీర్‌ని యూ టర్న్ తిప్పారు. కొత్త క్యారెక్టర్స్, క్యారెక్టరైజేషన్‌తో ప్రయోగాలు చేస్తున్నారు. తమిళంలో చేస్తున్న ‘అదో అంద పరవై పోల’లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్ చేస్తున్న ఆమె ఇప్పుడు ఏకంగా బ్యాడ్ గర్ల్‌గా మారారట. ‘భలేభలే మగాడివోయ్, మహానుభావుడు’ సినిమాలకు కెమెరామేన్‌గా పని చేసిన నిజర్ షఫీ దర్శకుడిగా మారి తెలుగు–తమిళ్ బైలింగువల్ మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నందితా శ్వేత, శ్రద్ధ శ్రీనాథ్, అదితీ ఆర్య, అనీషా ఆంబ్రోస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులోనే అమలా పాల్ విలన్‌గా నటించనున్నారు. ఆమె పాత్ర 1950ల కాలంలో ఉంటుందట. ఇన్వెస్టిగేటీవ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు నిజర్ షఫీ కెమెరామేన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ ఇయర్ సెకండ్ హాఫ్‌లో రిలీజ్ కానుందని సమాచారం. -
మరో ఆసక్తికర పాత్రలో నిత్య
కెరీర్ స్టార్టింగ్ నుంచి విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళీ ముద్దుగుమ్మ నిత్యమీనన్. ఇటీవల ఆచితూచి సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తిరిగి ఫాంలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే నాని నిర్మాతగా మారి రూపొందిస్తున్న అ! సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది ఈ బ్యూటి. ఈ సినిమా తరువాత బహు భాషా చిత్రంగా తెరకెక్కనున్న ఓ ఆసక్తికర చిత్రంలో నటించేందుకు అంగీకరించింది. సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫీ దర్శకుడిగా మారి రూపొందిస్తున్న సినిమాలో నిత్యమీనన్ కీలక పాత్ర పోషించనుందట. ముందుగా ఈ పాత్రకు అంజలిని తీసుకున్నారన్న ప్రచారం జరిగినా.. చిత్రయూనిట్ నిత్య మీనన్ రను తీసకునేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కథ విన్న నిత్య, ఈ సినిమాలో నటించేందుకు సుముఖంగానే ఉందన్న టాక్ వినిపిస్తోంది. నలుగురు హీరోయిన్లు నటించనున్న ఈ సినిమాలో ఇతర పాత్రల్లో అనీషా ఆంబ్రోస్, అదితి ఆర్య, నందిత శ్వేతలు నటించనున్నారు. -
తిరుగుబాటు తీవ్రవాదంగా మారే లోపు...!
‘‘హీరోలు, దర్శకులు... ప్రతి ఒక్కరం అన్నదమ్ముల్లా, స్నేహితుల్లా కలసిమెలిసి ఉంటున్నాం. ఇదే సంస్కృతి ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో వచ్చి, అందరూ ఓచోట చేరితే బాగుంటుంది. ఇదొక సలహా మాత్రమే. సలహాను తప్పకుండా సీరియస్‌గా తీసుకోవాల్సిన పరిస్థితులొచ్చాయి’’ అన్నారు మంచు మనోజ్. ఆయన హీరోగా అజయ్ ఆండ్రూస్ దర్శకత్వంలో ఎస్.ఎన్. రెడ్డి, లక్ష్మీకాంత్ నిర్మించిన ‘ఒక్కడు మిగిలాడు’ రేపు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సినిమా గురించి, థియేటర్ల సమస్య గురించి మనోజ్ చెప్పిన ముచ్చట్లు... కమర్షియల్ ఫిల్మ్ కాదిది... హార్ట్ టచింగ్ హై ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామా! నో కామెడీ, నో సాంగ్స్. ఇందులో సూర్య, పీటర్... రెండు పాత్రలు చేశా. ఓ వర్గానికి దేవుడైన పీటర్ (ఎల్టీటీఈ ప్రభాకరన్!) కథను తెరపై చూపిస్తున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలని రీసెర్చ్ చేశా. దర్శకుడు ఇచ్చిన నోట్స్ హెల్ప్ అయ్యాయి. సెకండాఫ్‌లో 40 నిమిషాలు నేనుండను. అయినా... కథకు రెస్పెక్ట్ ఇచ్చి చేశా. ఇలాంటి కథలు కొత్తవాళ్లు చేస్తే అంత రీచ్ ఉండదు. అందుకని చేశా ∙ఆర్నెల్లుగా కలల్లోనూ యుద్ధం చేస్తున్నా. అంతలా వెంటాడుతోందీ కథ. క్యారెక్టర్ మూడ్‌లోనే ఉంటున్నా. (నవ్వుతూ...) చైనాలోనూ యుద్ధానికి వెళ్లా. కలల్లో మనకిష్టమైన వ్యక్తులు, కుటుంబ సభ్యులు వస్తారు కదా. ప్రతి రాత్రి కలలో ఫ్యామిలీని సేవ్ చేయడమే నా పని! అంత డెప్త్ ఉందీ సినిమాలో. తెరౖపై చూసిన తర్వాత మనుషుల మధ్య దూరం పెరిగిందా? నిజంగా మనిషికి మనిషి తోడుంటున్నాడా? అనేది ఆలోచిస్తారు ∙రియలిస్టిక్‌గా సినిమా తీశాం. సమాజంలో జరిగినదాంట్లో ఒక్క శాతమే చూపించాం... సినిమాటిక్‌గా! ఇటువంటి సినిమాలు తీయడమే కష్టమంటే... సెన్సార్ వాళ్లు చుక్కలు చూపించారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే ఉద్దేశంతో ఇంకా తమిళ సెన్సార్ చేయించలేదు. రెండు వారాల తర్వాత తమిళంలో విడుదల చేయాలనుకుంటున్నాం ∙ఈ సినిమా చేసిన తర్వాత జనాల్లోకి వెళ్లి, సేవ చేయాలనుకున్నా. దేశాన్ని ఉద్ధరించలేం. నా ఏరియాను ఉద్ధరించగలుగుతాను కదా! కనీసం ప్రయత్నించగలను కదా! ఇంట్లో విష్ణు అన్న ఓ తన్ను తన్ని చక్కగా సినిమాలు చేయమన్నారు. ఏదో రోజున సేవ చేయడానికి వస్తా. నైజాంలో థియేటర్స్ కోసం మావాళ్లు (దర్శక–నిర్మాతలు) ఫైట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఏం జరిగిందో? నాకు క్లియర్‌గా తెలీదు. తెలిసినంత వరకూ... ఫస్ట్ కొంతమందిని అడిగారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ నచ్చక, ఎక్కువ అమౌంట్ ఆఫర్ చేసిన కొత్త డిస్ట్రిబ్యూటర్స్‌కి మావాళ్లు సినిమాను ఇచ్చారు. ఫస్ట్ అడిగిన వాళ్ల దగ్గరే థియేటర్లున్నాయి. మళ్లీ థియేటర్ల కోసం వాళ్ల దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది. ముందు అడిగితే... 50 థియేటర్లు ఇస్తామన్నారు. సడన్‌గా రెండు డబ్బింగ్ (తమిళ్) సినిమాలు రావడంతో థియేటర్లు లేవన్నారట! దర్శకుడు అజయ్ సెన్సిటివ్ అండ్ వెరీ సీరియస్ పర్సన్. క్వశ్చన్ చేయడానికి వెళితే... రెచ్చగొట్టేలా మాట్లాడి, మాటల్లో పెట్టి పోలీసుల్ని పిలిచారట. ఇండస్ట్రీలో ఇంతమంది పెద్దలు ఉండగా పోలీసుల్ని పిలవడం ఏంటి? ఒక పరిష్కారం కావాలి కదా! ఇలాంటి సమస్యలు మున్ముందు రాకుండా పెద్దలందరూ కూర్చుని, పరిష్కార మార్గం ఆలోచిస్తారని ఆశిస్తున్నా. పోలీసులు, కొట్టుకోవడాలు అయితే ఎంతసేపు! సినిమాలు మానేసి అందరూ అదే పనిలో ఉండాలి. ‘ఒక్కడు మిగి14లాడు’ విడుదల తర్వాత, అతి త్వరలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస యాదవ్‌లను కలసి ప్రభుత్వం తరపున ఓ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఏర్పాటు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేద్దామనుకుంటున్నా. ఫిల్మ్ ఛాంబర్ ఉంది కదా! అందులోనే డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెడితే... పెద్దవాళ్లు అయినా, చిన్నవాళ్లు అయినా అక్కడికి వెళతారు. సినిమా విడుదలవుతుందని చెబితే... ఎన్ని థియేటర్లు ఉన్నాయనేది చాంబర్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు కొత్తవాళ్లు సినిమా విడుదల చేయాలంటే వందచోట్ల తిరగాల్సి వస్తుంది. నా బాధ ఒకటే... రెచ్చగొడితే ఓ నాయకుడు పుడతాడు. నాయకుడి మాటల్ని అణచి వేయాలనుకుంటే తిరుగుబాటు మొదలవుతుంది. తిరుగుబాటును తొక్కేయాలనుకుంటే... తీవ్రవాదంగా మారుతుంది, మొదలవుతుంది. ఇప్పుడు చిత్రపరిశ్రమలో తిరుగుబాటు పరిస్థితులొచ్చాయి. అది తీవ్రవాదంగా మారడానికి ఎంతోసేపు పట్టదు. కడుపు కాలితే... ఏ ఫ్యామిలీ వల్ల తను నాశనం అయితే వాళ్లపై పగ తీర్చుకుంటాడు. అప్పుడు మన ఇండస్ట్రీకి ఎంత చెడ్డపేరు వస్తుందో ఆలోచించుకోండి! ‘ఫలనా నిర్మాత ఎవర్నో చంపేశాడంట’ అంటే... ఎంత దరిద్రంగా ఉంటుందో చెప్పండి! fv -
బ్రేక్ రాలేదని ఎప్పుడూ బాధపడలేదు
‘‘నేను కేవలం కమర్షియల్ సినిమాలే చేయాలని రూల్ పెట్టుకోలేదు. డిఫరెంట్ మూవీస్ చేయాలనుకుంటున్నా. అందుకే ‘ఒక్కడు మిగిలాడు’ చేశా. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కానీ, ఇలాంటివి ఎప్పుడో కానీ రావు’’ అని కథానాయిక అనీషా ఆంబ్రోస్ అన్నారు. మనోజ్, అనీషా ఆంబ్రోస్ జంటగా అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో ఎస్.ఎన్. రెడ్డి, లక్ష్మీకాంత్ నిర్మించిన ‘ఒక్కడు మిగిలాడు’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనీషా ఆంబ్రోస్ చెప్పిన చిత్ర విశేషాలు... ►రెండు ఫ్రేమ్స్‌లో జరిగే సినిమా ఇది. ఒక ఫ్రేమ్ 1990 ఎల్టీటీఈ నేత ప్రభాకరన్ కోణంలో ఉంటే ఇంకొకటి ప్రస్తుతంలో ఉంటుంది. నేను ప్రస్తుతంలో జర్నలిస్టుగా కనిపిస్తాను. 1990కి, ప్రస్తుతానికి సంబంధం ఏమిటన్నది సస్పెన్స్. కథ సీరియస్‌గా ఉంటుంది. పాటలు, కామెడీ అస్సలు ఉండవు ►అజయ్ ఆండ్రూస్ ఈ సినిమా కోసం బాగా రీసెర్చ్ చేశారు. ఎల్టీటీఈ సభ్యుల వద్దకు వెళ్లి వాళ్ల అనుభవాల్ని, అప్పటి పరిస్థితుల్ని తెలుసుకుని, వాస్తవ ఘటనలతో రూపొందించారు. దర్శకుడు కథ చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. ఇలాంటి కథలను దర్శకుడి మీద నమ్మకం ఉన్నవాళ్లు మాత్రమే చేస్తారు ►మనోజ్ పవర్ఫుల్ యాక్టర్. సినిమా కోసం తను పడే కష్టం చూస్తే ఆశ్చర్యం అనిపించింది. ఈ చిత్రంలో మా మధ్య లవ్‌ట్రాక్ ఉన్నా అదే ప్రధానాంశం కాదు. ఎన్ని సినిమాలు చేసినా నాకు బ్రేక్ ఎందుకు రాలేదో తెలియదు. బ్రేక్ రాలేదని ఎప్పుడూ బాధపడలేదు. నాకు వచ్చిన, నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా. ►‘విఠలాచార్య’తో పాటు మరో తెలుగు సినిమా చేస్తున్నా. తమిళంలో ఒక సినిమా షూటింగ్ పూర్తయింది. -
హీరో నేను కాదు.. అజయ్ – మంచు మనోజ్
‘‘ఒక్కడు మిగిలాడు’ కథ వినగానే ఆ కథకి గౌరవం ఇవ్వాలి, ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలని ముందుగానే నిర్ణయించుకున్నా. శ్రీలంకను బేస్ చేసుకుని తీసిన సినిమా కాదిది. బాధలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం చేసిన చిత్రం’’ అని హీరో మంచు మనోజ్ అన్నారు. మనోజ్, అనీషా ఆంబ్రోస్ జంటగా అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’. ఎస్.ఎన్. రెడ్డి, లక్ష్మీకాంత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ–రిలీజ్ వేడుకలో మనోజ్ మాట్లాడుతూ– ‘‘సిరియాలో ఓ చిన్నారి మృతదేహం నీటిలో కొట్టుకుని వచ్చిన ఫోటో చూసినప్పుడు ప్రపంచం ఉలిక్కి పడింది. ఓ ఫొటో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే, సినిమా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో అనే ఆలోచనతో అజయ్ ఈ సినిమా చేశాడు. ఈ చిత్రానికి హీరో నేను కాదు... అజయ్ ఆండ్రూస్. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకున్న రోజునే మన దేశం ముందుకెళుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో మనోజ్ రెండు పాత్రలను అద్భుతమైన వేరియేషన్స్‌తో క్యారీ చేశాడు. టీమ్ చేసిన ఈ మంచి ప్రయత్నం చలన చిత్ర చరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటున్నా’’ అని నారా రోహిత్ అన్నారు. ‘‘విజువల్స్ చూస్తుంటే మంచి ప్రయత్నం చేశారని తెలుస్తోంది. టీజర్లో మనోజ్ పర్ఫార్మెన్స్ చూసి థ్రిల్లయ్యా’’ అని దర్శకుడు ఎన్. శంకర్ తెలిపారు. అజయ్ ఆండ్రూస్ మాట్లాడుతూ – ‘‘సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఒకే టెంపోలో ఉంటుంది. పాటలు ఉండవు. ఇలాంటి సినిమా చేయడానికి రెండు పిల్లర్స్ కావాలి. మొదటి పిల్లర్ మనోజ్గారు. రెండో పిల్లర్ నిర్మాతలు. బ్రతకడానికి మనిషి ఎంత కష్టపడుతున్నాడనే సామాన్యుడి వేదన ఈ సినిమాలో కనపడుతుంది. నా ముత్తాత, తాతలు స్వాతంత్య్ర సమరయోధులు. నాన్న, మావయ్యలు ఆర్మీలో పనిచేశారు. అందుకనే ఈ డిఫరెంట్ కంటెంట్‌ను సినిమాగా తీశా’’ అన్నారు. ‘‘ఏడాదికి పైగా ఈ సినిమాతో జర్నీ చేశాం. సముద్రంలో ఎక్కువ రోజులు షూటింగ్ చేసిన మూవీ ఇదే’’ అన్నారు ఎస్.ఎన్. రెడ్డి. అనీషా, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
10+10=20–10!
మంచు మనోజ్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’. అనీషా ఆంబ్రోస్ కథానాయిక. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో ఎస్.ఎన్. రెడ్డి, లక్మీకాంత్ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. దర్శకుడు అజయ్ ఆండ్రూస్ మాట్లాడుతూ– ‘‘హింస, అహింస అనే రెండు అనుభవాలు ఎదురైతే మనం పరిస్థితులకు తగ్గట్టు ఎలా ప్రవర్తిస్తామో... మనోజ్ క్యారెక్టరైజేషన్ కూడా అలాగే ఉంటుంది. ఈ సినిమా కోసం తనతో ఏడాదిన్నరగా ట్రావెల్ చేస్తున్నా. ఇందులోని ఓ పాత్ర కోసం మనోజ్ 20 కిలోలు బరువు పెరిగారు. మరో పాత్ర కోసం 10 కిలోలు తగ్గారు. నిర్మాతలు చాలా సపోర్ట్ చేశారు’’ అన్నారు. ‘‘గ్రాఫిక్స్ పనుల వల్ల సినిమా విడుదల ఆలస్యమైంది. సముద్రంలో, సముద్రం దగ్గర షూట్ చేసిన సీన్స్ విశేషంగా ఆకట్టుకుంటాయి. యుద్ధ సన్నివేశాలు సినిమాకే హైలైట్. నవంబర్ 10న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. మిలింద్ గునాజీ, పోసాని కృష్ణమురళి, సుహాసిని, సూర్య, బెనర్జీ, జెన్నీఫర్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: వి.కోదండ రామరాజు, సంగీతం: శివ నందిగామ. -
డబుల్ డోస్!
మంచు మనోజ్ నటించిన తాజా సినిమా ‘ఒక్కడు మిగిలాడు’. అనీషా ఆంబ్రోస్ కథానాయిక. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో ఎస్.ఎన్. రెడ్డి, ఎన్. లక్ష్మీకాంత్ నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో మనోజ్ ఎల్టీటీఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్‌గా, యువ విద్యార్థిగా కనిపిస్తారు. ఇప్పటి వరకూ చూడని విధంగా అద్భుతంగా నటించారు. 25 నిమిషాల పాటు జరిగే యుద్ధ సన్నివేశాలతో పాటు 35 నిమిషాలు సముద్రంలో సాగే ప్రయాణం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులు ఎక్కువగా ఉన్నందున తొలుత ప్రకటించిన తేదీకి సినిమా రావడం లేదు. ఎప్పుడు విడుదల చేస్తామన్నది వారంలో ప్రకటిస్తాం’’ అన్నారు. అజయ్, జెన్నీఫర్, మురళీమోహన్, సుహాసిని, బెనర్జీ, మిలింద్ గునాజి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శివ నందిగామ, కెమెరా: వి.కోదండ రామరాజు. -
హింస.. అహింస ఒకేసారి ఎదురైతే..?
మంచు మనోజ్ హీరోగా అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో ఎస్.ఎన్. రెడ్డి, లక్ష్మీకాంత్ నిర్మించిన చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’. అనీషా అంబ్రోస్ హీరోయిన్. సెప్టెంబర్ 8న విడుదల కానున్న ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను శనివారం మంచు లక్ష్మీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ– ‘‘నా తమ్ముడు మనోజ్ నటుడిగా నాకెంతో ఇన్స్పిరేషన్ ఇస్తుంటాడు. కొత్త రకం సినిమాలు, పాత్రలు చేయాలనుకుంటాడు. ‘మనోజ్ ఇండస్ట్రీకి ఒక వరం’ అని నేను భావిస్తున్నాను. దర్శకుడు అజయ్ మంచి హార్డ్‌వర్కర్. నిర్మాతలకు సినిమాల పట్ల మంచి ప్యాషన్ ఉంది’’ అన్నారు. ‘‘నేను రెండు పాత్రలు చేయగలనని నమ్మి నాతో సినిమా చేసిన దర్శకుడు అజయ్, నిర్మాతలకు నా కృతజ్ఞతలు. సినిమా అద్భుతంగా వచ్చింది’’ అన్నారు మనోజ్. ‘‘హింస, అహింస అనే రెండు అనుభవాలు ఎదురైతే ఆ పరిస్థితులకు తగ్గట్లు ఎలా ప్రవర్తిస్తారో అలా ఉంటుంది మనోజ్‌గారి క్యారెక్టరైజేషన్. ఒక దేశం, రాష్ట్రం, కుటంబంలో పెద్ద ఫెయిల్ అయితే ఆ ప్రభావం ఆ సమాజం లేదా ఆ కుటుంబంపై ఎలా ఉంటుందనేదే చిత్రకథ. సినిమా కోసం మనోజ్ ఒక దశలో 20 కేజీల బరువు పెరిగారు. ఆ తర్వాత పది కేజీలు తగ్గారు’’ అన్నారు అజయ్. -
తల్లి–తనయుడు–ఇద్దరు మనవళ్లు.. ఓ సినిమా
విఠలాచార్య.. తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఇప్పుడున్న టెక్నాలజీ లేని ఆ రోజుల్లోనే జానపద చిత్రాలు తీసి, ప్రేక్షకుల చేత ఔరా అనిపించారాయన. అటువంటి గొప్ప దర్శకుడి పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. ‘నందిని నర్సింగ్ హోమ్’ ఫేమ్ నవీన్ విజయ కృష్ణ, అనీషా ఆంబ్రోస్ జంటగా, నరేశ్, ఇంద్రజ కీలక పాత్రల్లో సుహాస్ మీరా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విఠలాచార్య’ గురువారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటి–దర్శకురాలు విజయనిర్మల కెమెరా స్విచ్చాన్ చేయగా సూపర్‌స్టార్ కృష్ణ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. సినిమా బ్రోచర్స్‌ను మరో దర్శకుడు కోదండ రామిరెడ్డి విడుదల చేసి, కృష్ణకు అందించారు. కృష్ణ మాట్లాడుతూ– ‘‘విఠలాచార్యతో ‘ఇద్దరు మొనగాళ్లు’ సినిమాకు పనిచేశా. ఆయన ఎన్నో హిట్ చిత్రాలు తీశారు. నరేశ్, నవీన్ కలిసి చేస్తున్న ఈ సినిమా కోసం నేనూ వెయిట్ చేస్తున్నా’’ అన్నారు.‘‘మా తరతరాలు నటీనటులుగా కొనసాగుతారు. మా పెద్ద మనవడితో పాటు చిన్న మనవడు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడు’’ అన్నారు విజయనిర్మల. ‘‘పరుచూరి వెంకటేశ్వరరావుగారి దగ్గర రచనలోనూ, దర్శకుడు గుణశేఖర్‌గారి వద్ద టెక్నికల్ విభాగాల్లోనూ పనిచేశా. డైరెక్టర్‌గా చాన్స్ ఇచ్చిన నిర్మాతలకు Sథ్యాంక్స్’’ అన్నారు సుహాస్ మీరా. నరేశ్ మాట్లాడుతూ– ‘‘మాస్, ఫ్యామిలీ, యూత్ కాన్సెప్ట్ చిత్రమిది. ఇందులో నా ఇద్దరు కుమారులతో పాటు మా అమ్మగారు (విజయ నిర్మల) నటిస్తున్నారు’’ అన్నారు. రచయితలు పరుచూరి బ్రదర్స్, నిర్మాత మల్కాపురం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: సత్య కశ్యప్, నిర్మాతలు: ఎస్.కె.విశ్వేశ్‌బాబు, కె.ఎస్.టి.యువరాజ్, యం.వి.కె.రెడ్డి. -
వంశీగారి కోసం గ్లామరస్‌గా నటించా
‘‘ఈ చిత్రంలో పల్లెటూరి సంస్కృతిపై ఇష్టంతో విదేశాల నుంచి వచ్చిన అమ్మాయిగా నటించా. తనకు చీర కట్టుకోవడం రాదు, ఇక్కడి పద్ధతులు తెలీవు. వెరీ గ్లామరస్ రోల్. దర్శకుడు వంశీగారని గ్లామరస్‌గా కనిపించడానికి ఒప్పుకున్నా. ఆయన దర్శకత్వంలో నటించడం నా అదృష్టం’’ అన్నారు అనీషా ఆంబ్రోస్. సుమంత్ అశ్విన్ హీరోగా వంశీ దర్శకత్వంలో మధుర శ్రీధర్ నిర్మించిన ‘ఫ్యాషన్ డిజైనర్... సన్నాఫ్ లేడీస్ టైలర్’లో ఆమె ఓ కథానాయిక. వచ్చే నెల 2న విడుదల కానున్న ఈ సినిమా గురించి అనీషా చెప్పిన సంగతులు... ► ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకున్న ‘లేడీస్ టైలర్’ కొడుకు కథే సినిమా. మాది సీక్వెల్ కదా, ‘లేడీస్ టైలర్’తో పోలిస్తే చాలా తేడాలుంటాయి. వంశీగారు పాత్రలను తీర్చిదిద్దిన విధానం బాగుంటుంది. నన్ను గ్లామరస్, బోల్డ్ క్యారెక్టర్లో చూసి ప్రేక్షకులు షాకవుతారు. నాతో పాటు మిగతా ఇద్దరు హీరోయిన్లు మనాలీ రాథోడ్, మానసలకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పబ్లిసిటీ స్టంట్ కాదు. హీరో అలా ఎందుకు చేశాడనేది సినిమాలో చూడాలి. ► సుమంత్‌తో షూటింగ్ అంటే పిక్నిక్కు వెళ్లినట్టుంటుంది. ఫ్రెండ్లీ కోస్టార్. నిర్మాత ‘మధుర’ శ్రీధర్‌గారు నటీనటులకు ఏ సమస్య రాకుండా చూసుకుంటారు. ఆయనతో వ్యక్తిగత సమస్యలు చెప్పుకునేంత చనువు ఉంది. ఆయన నిర్మాణంలో పది సినిమాలు చేయొచ్చనే నమ్మకం ఏర్పడింది. మణిశర్మగారు అద్భుతమైన పాటలు స్వరపరిచారు. పాటలన్నిటినీ పాపికొండల్లో తీశారు. అక్కడ సెల్ సిగ్నల్స్ లేవు. అమ్మానాన్నలతో మాట్లాడకుండా చాలా రోజులు అక్కడ షూటింగ్ చేయడం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ► పవన్ కల్యాణ్ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ను నేను వదులుకోలేదు. కాజల్ అగర్వాల్ ఆ సినిమా చేయడం కరెక్ట్. అంత పెద్ద స్టార్‌తో నటించడమంటే నాకు నెర్వస్‌గా ఉండేదేమో! ప్రస్తుతం మంచు మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు’లో నటిస్తున్నా. తమిళంలో ఓ సినిమాకి సంతకం చేశా. -
పుష్కరం దాటాక డబుల్ డోస్
బాల నటుడిగా పలు చిత్రాల్లో నటించిన మంచు మనోజ్ ‘దొంగ దొంగది’తో హీరోగా తెరంగేట్రం చేశారు. ఆ చిత్రం విడుదలై పుష్కరం (పన్నెండేళ్లు) దాటింది. ఇప్పటి వరకూ చేసిన అన్ని సినిమాల్లోనూ సింగిల్ క్యారెక్టర్లో కనిపించారు మనోజ్. తొలిసారి ‘ఒక్కడు మిగిలాడు’లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. డబుల్ డోస్ అన్నమాట. ఈ చిత్రంలో ఆయన ఎల్.టి.టి.ఈ. మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్‌గా, స్టూడెంట్ లీడర్‌గా కనిపించనున్నారు. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో పద్మజ ఫిలిమ్స్ పతాకంపై ఎస్.ఎన్.రెడ్డి–లక్ష్మీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనీషా ఆంబ్రోస్ కథానాయిక. ఈరోజు (మే 20) మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో ఆయన పోషిస్తున్న విద్యార్థి పాత్ర లుక్‌ను రిలీజ్ చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మిలిటెంట్ లీడర్ పాత్ర కోసం భారీగా బరువు పెరిగిన మనోజ్ స్టూడెంట్ లుక్ కోసం దాదాపు 15 కేజీలు తగ్గారు. కేవలం నెలల వ్యవధిలో 15 కేజీల బరువు తగ్గడం మామూలు విషయం కాదు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకొచ్చాయి. జూన్ మొదటివారంలో ఆడియో, నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వి. కోదండ రామరాజు, సంగీతం: శివ నందిగామ.