Anup Rubens
-
విడుదలకు ముందే భారీగా అవార్డ్స్.. వేదిక 'ఫియర్' ట్రైలర్
హీరోయిన్ వేదిక ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఫియర్' సినిమా నుంచి తాజాగా ట్రైలర విడుదలైంది. ప్రేక్షకుల్లో ఆసక్తితో పాటు భయాన్ని కలిగించేలా సీన్స్ ఉన్నట్లో ట్రైలర్లోనే అర్థం అవుతుంది. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డా. హరిత గోగినేని ఈ ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు.కాంచన, రూలర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ వేదిక టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగానే కనెక్ట్ అయింది. "ఫియర్" సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 70 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా డిసెంబర్ 14న గ్రాండ్‌గా విడుదల కానుంది.రెగ్యులర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా "ఫియర్" ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని డైరెక్టర్ హరిత ఇప్పటికే చెప్పారు. సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఫ్యామిలీ ఆడియెన్స్ చూసేందుకు ఇష్టపడరు. కానీ ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుందని ఆమె తెలిపారు. విడుదలకు ముందే పలు అవార్డ్స్‌తో తాము విజయం సాధించామని ఇప్పుడు ఇక్కడి ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నట్లు ఆమె అన్నారు. -
ఇంగ్లీష్ లిరిక్స్‌తో ‘ఫియర్’ టైటిల్ సాంగ్
హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా "ఫియర్". ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డా. హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. "ఫియర్" సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 70 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.ఈ రోజు "ఫియర్" మూవీ నుంచి టైటిల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా..మేఘన, నీల్ క్రితన్ ఆకట్టుకునేలా పాడారు. ఫియర్ టైటిల్ సాంగ్ లిరిక్స్ ఇంగ్లీష్ లో ఉండటం విశేషం. నాయిక వేదిక క్యారెక్టర్ ను భయాలు ఎలా చుట్టుముట్టాయి. ఆ ఫియర్ ప్రభావం ఆమె మీద ఎంతగా ఉందో చెప్పేలా ఈ పాటను డైరెక్టర్ డా. హరిత గోగినేని ఆసక్తికరంగా డిజైన్ చేశారు. -
రవితేజ వారసుడి మూవీ.. క్రేజీ సాంగ్ వచ్చేసింది!
మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తోన్న మూవీ "మిస్టర్ ఇడియట్". ఈ చిత్రంలో సిమ్రాన్ శర్మ హీరోయిన్గా నటిస్తోంది. జేజేఆర్ ఎంటర్ టైన్ మెంట్స్, ఎల్ఎల్ పీ పతాకంపై యలమంచి రాణి సమర్పణలో జేజేఆర్ రవిచంద్ నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో హిట్ కొట్టిన దర్శకురాలు గౌరీ రోణంకి తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.తాజాగా ఈ మూవీ నుంచి వస్సాహి వస్సాహి లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. యాక్టర్ శివాజీ చేతుల మీదుగా ఈ పాటను విడుదల చేశారు. సాంగ్ అద్భుతంగా ఉందని.. ఇంతవరకు సంస్కృత భాషలో ఏ పాట రాలేదని శివాజీ అన్నారు. హీరో మాధవ్‌తో పాటు చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.కాగా.. ఈ పాటను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేయగా.. లిరిక్ రైటర్ శివశక్తి దత్తా సాహిత్యాన్ని అందించారు. సింగర్ శ్రీరామచంద్ర పాడారు. 'సౌందర్య సార, మకరంద దార, శృంగార పారవరా, సౌవర్ణ ప్రతిమ, లావణ్య గరిమ,చతురస్య చాతుర్య మహిమ కింతు పరంతు విరంచ్య విరచితం కిమిదం, ఇదంకిం తమాషా...వస్సాహి వస్సాహి' అంటూ సంస్కృత సాహిత్యంతో ఆకట్టుకునేలా ఉంది ఈ సాంగ్. ఈ చిత్రంలో జయప్రకాష్, ఆచంట మహేశ్, అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, కాశీ విశ్వనాథ్, హిమజ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
హీరోగా రవితేజ వారసుడి ఎంట్రీ.. ట్రైలర్ వచ్చేసింది!
మాస్ మహారాజా రవితేజ ఫ్యామిలీ నుంచి మరో హీరో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన తమ్ముడు రఘు తనయుడు మాధవ్ హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం 'మిస్టర్ ఇడియట్'. ఈ చిత్రంలో సిమ్రాన్ శర్మ హీరోయిన్గా నటిస్తోంది. గౌరీ రోణంకి డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జేజేఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్ఎల్ పీ పతాకంపై రవిచంద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ కార్యక్రమంలో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పాల్గొన్నారు.డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ..' రవితేజ ఇండస్ట్రీలో నాలాంటి వారిని ఎంతోమందిని సపోర్ట్ చేశారు. ఈ ఫంక్షన్‌కు పిలిచినప్పుడు మాధవ్‌కు సపోర్ట్ చేయడం నా బాధ్యతగా భావించి వచ్చా. టైటిల్ మిస్టర్ ఇడియట్ అని చెప్పగానే నాకు ఇడియట్ సినిమా చూసిన రోజులు గుర్తొచ్చాయి. నేను కూడా చంటిగాడిలా ఫీలయ్యేవాడిని. ఆ సినిమాలో హీరోయిజం కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. రవితేజ స్థాయికి మాధవ్ చేరుకోవాలని కోరుకుంటున్నా. మిస్టర్ ఇడియట్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా' అని అన్నారు. -
‘ఓ మంచి ఘోస్ట్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘మనం’ రీరిలీజ్.. అనూప్ రూబెన్స్ మ్యూజికల్ వీడియో వైరల్
అక్కినేని హీరోల సీనీ కెరీర్లో ‘మనం’ చాలా ప్రత్యేకమైన మూవీ. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి నటించిన ఈ చిత్రం 2014 మే 23న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంలో అనుప్ రూబెన్స్ సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమాలోని పాటలు అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచాయి. ఎక్కడ చూసిన ‘మనం’ పాటలే వినిపించేవి. ఆ మెలోడీ సాంగ్స్ ఇప్పటికీ మార్మోగిపోతూనే ఉంటాయి. ‘మనం’ విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా మళ్లీ ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. నేడు(మే 23)సాయంత్రం హైద్రాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని దేవీ థియేటర్లో మనం రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘మనం’ మ్యూజికల్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. మనం వచ్చి పదేళ్లు అయిన సందర్భంగా అనూప్ ఈ వీడియోను రిలీజ్ చేశాడు. అనూప్ కీ బోర్డు మీద వాయించిన ట్యూన్స్ మళ్లీ ట్రాన్స్ లోకి తీసుకెళ్ళాయి.అనూప్ ప్రస్తుతం యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తీస్తోన్న పాన్ ఇండియా మూవీకి, గౌరీ రోనంకి తీస్తోన్న చిత్రానికి, ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నారు. అంతే కాక సుమంత్ హీరోగా సంతోష్ తెరకెక్కిస్తున్న సినిమాకు, సక్సెస్ ఫుల్ కాంబో అయిన ఆది సాయి కుమార్‌తో కృష్ణ ఫ్రమ్ బృందావనం సినిమాకు, విజయ్ కొండ, ఆకాష్ పూరి దర్శకత్వంలో వస్తున్న చిత్రానికు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. View this post on Instagram A post shared by Annapurna Studios (@annapurnastudios) -
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
యువ హీరో ఆది సాయి కుమార్.. త్వరలో 'కృష్ణ ఫ్రమ్ బృందావనం' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. వీరభద్రమ్ చౌదరి దర్శకుడు. ఈ మధ్య లాంఛనంగా ప్రారంభమైంది. అన్ని కమర్షియల్ అంశాలతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి.(ఇదీ చదవండి:పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'? )ఇందులో భాగంగా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం ఆది సాయి కుమార్, దర్శకుడు వీరభద్రమ్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ గోవా వెళ్లారు. గతంలో ఆది సాయి కుమార్ లవ్ లీ, ప్రేమ కావాలి, సుకుమారుడు లాంటి హిట్ సినిమాలకు అనూప్ రుబెన్స్ సంగీతమందించారు. ఇప్పుడు 'కృష్ణ ఫ్రమ్ బృందావనం’ చిత్రానికి అలాంటి సాంగ్స్ రెడీ చేస్తున్నారు. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. దిగంగన సూర్యవంశీ హీరోయిన్గా చేస్తోంది.(ఇదీ చదవండి: హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?) -
Ari: మంగ్లీ ఆలపించిన ‘చిన్నారి కిట్టయ్య’ పాట విన్నారా?
పేపర్ బాయ్` ఫేమ్ జయశంకర్ తెరకెక్కిస్తున్న రెండో చిత్రం ‘అరి’. మై నేమ్ ఈజ్ నోబడీ అనేది ట్యాగ్ లైన్. ప్రముఖ వ్యాపారవేత్తలు శేషు మారం రెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి సంయుక్తంగా, ఆర్వి రెడ్డి, సమర్పణ లో `అరి` సినిమా ని నిర్మిస్తున్నారు. అనసూయ భరద్వాజ్, సాయికుమార్, వైవాహర్ష, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి పాట విడుదలైంది. కృష్ణుడు గొప్పదనం గురించి తెలియజేసే ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. ప్రముఖ గాయని మంగ్లీ అద్భుతంగా ఆలపించింది. అనూప్ రూబెన్స్ మైమరిపించే సంగీతం అందించారు. ఇక అరి విషయానికొస్తే.. జయశంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ చిత్రంలో జెలసీ పాత్రలో అనసూయ, ప్రైడ్‌గా సాయి కుమార్, ఆంగర్ క్యారెక్టర్లో శ్రీకాంత్ అయ్యంగార్, లస్ట్‌గా వైవా హర్ష, గ్రీడీ పాత్రలో శుభలేఖ సుధాకర్, అటాచ్ మెంట్ క్యారెక్టర్లో సురభి ప్రభావతి నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి విడుదలకు రెడీ అయిన ఈ చిత్రానికి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ నుంచి భారీ ఆఫర్ వచ్చిందట. థియేటర్స్‌లో కాకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయడానికి రూ.10 కోట్లతో డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ కావడంతో ‘అరి’ ని కచ్చితంగా ఓటీటీ ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తం చెల్లించడానికి సిద్దమైందట. అయితే చిత్రబృందం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. థియేటర్స్‌లో విడుదల చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
'లక్కీ లక్ష్మణ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
Ginna: మంచు విష్ణు కూతుళ్ల ‘ఫ్రెండ్షిప్’ సాంగ్ వచ్చేసింది
మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జిన్నా’. ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ఓ పాటను మంచు విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా పాడారు. తాజాగా చిత్ర యూనిట్ ఆ పాటని విడుదల చేశారు. (చదవండి: ‘రుద్రమదేవి’ బాలనటి ఇప్పుడేం చేస్తుందో తెలుసా?) ‘ఇది స్నేహం’ అంటూ సాగే ఈ పాటకు భాస్కర పట్ల లిరిక్స్ అందించగా.. అనూప్ రూబెన్స్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మంచు విష్టు కూతుళ్లు పాడిన ఈ పాట సినిమాలో కీలక సందర్భంలో వస్తుందట. డా.మంచు మోహన్‌బాబు ఆశీస్సులతో అవ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కొన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందించి, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. -
వీరభద్రం చౌదరి దర్శకత్వంలో నరేష్ అగస్త్య కొత్త చిత్రం
‘పూలరంగడు’ ఫేమ్ వీరభద్రం చౌదరి దర్శకత్వంలో సేనాపతి చిత్రంతో ప్రశంసలు అందుకున్న నరేష్ అగస్త్య హీరోగా ఓ చిత్రం తెరకెక్కబోతుంది. క్రైమ్ కామెడీ జోనర్ లో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రాన్ని జయదుర్గాదేవి మల్టీమీడియా & డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్స్ పై అనిల్ రెడ్డి సమర్పణలో నబీషేక్, తూము నర్సింహా పటేల్ నిర్మిస్తున్నారు. జులై నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..'దర్శకులు వీరభద్రం చౌదరితో మా మొదటి సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. వీరభద్రం చౌదరి గారు ఒక అద్భుతమైన కథ చెప్పారు. కథ వినగానే మరో ఆలోచన లేకుండా ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించాం. కథ చాలా వండర్ ఫుల్ గా వచ్చింది. జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలని త్వరలోనే వెల్లడిస్తాం' అన్నారు. -
అనసూయ చిత్రానికి అనూప్ సంగీతం.. టైటిల్ ఇదేనా?
గతకొంత కాలంగా కెరీర్ పరంగా కాస్త వెనకబడ్డ అనూప్ రూబెన్స్..‘బంగార్రాజ’తో మళ్లీ పుంజుకున్నాడు. ఈ సినిమా విజయంలో సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా క్లిక్ అయింది. దీంతో అనూప్‌కి మళ్లీ వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని చిత్రాలకు సంగీతం అందిస్తున్న అనూప్.. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌లోకి ఎంటరయ్యాడు. యాంకర్ అనసూయ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఓ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ అందుకున్నాడు. పేపర్ బాయ్, విటమిన్-షి సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్న యంగ్ డైరెక్టర్ జయశంకర్.. ఈ సారి మరో ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఢిపరెంట్ కాన్సెప్ట్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆర్వీ సినిమాస్ బ్యానర్‌పై ఆర్వీ రెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘గ్రహమ్’అని టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. తర్వలోనే టైటిల్‌ని అధికారికంగా వెల్లడించనున్నారు. తమ చిత్రానికి అనూప్ సంగీతం చాలా ప్లస్ అవుతుందని దర్శకుడు జయశంకర్ పేర్కొన్నారు. -
బంగార్రాజు సినిమాకు రోజుకి 20 గంటలు పని చేశాం
‘‘బంగార్రాజు’ లాంటి పెద్ద సినిమాకి చాలా సమయం పడుతుంది. అయితే నాలుగు నెలల్లోనే షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి విడుదల చేయాలని నాతోపాటు సాంకేతిక నిపుణులందరూ పని చేశారు. రీ రికార్డింగ్ కోసం రోజుకు 20 గంటలు పని చేశాం’’ అని సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అన్నారు. అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, నాగచైతన్య, కృతీ శెట్టి కాంబినేషన్లో కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ పతాకాలపై నాగార్జున నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనూప్ రూబెన్స్ విలేకరులతో చెప్పిన విశేషాలు.. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా మ్యూజికల్‌గా బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమాకి ప్రీక్వెల్‌గా వస్తున్న ‘బంగార్రాజు’ పాటలతో ఆ సినిమా పాటలకు పోలికలు పెడతారు. ‘‘సోగ్గాడే చిన్నినాయనా’తో మనకు ఓ బెంచ్ మార్క్ ఉంది.. దాన్ని ‘బంగార్రాజు’తో రీచ్ అవ్వాలి’’ అని నాగ్ సార్ అన్నారు. ప్రేక్షకుల అంచనాలు అందుకునేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచించి సంగీతం ఇచ్చాను. ∙‘బంగార్రాజు’ పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ఉంటుంది. ఒక్క పాట కూడా వెస్ట్రన్ టైప్‌లో ఉండదు. అన్నీ కూడా ట్రెడిషనల్‌గా, పల్లెటూరి వాతావరణంలోనే ఉంటాయి. ఈ సినిమా కోసం కల్యాణ్ కృష్ణ చాలా కష్టపడ్డారు. ఎక్కడా టెన్షన్ పడకుండా ఓ టార్గెట్ పెట్టుకుని ఇంత పెద్ద సినిమాను పూర్తి చేయడం చాలా కష్టమైన పని. క్వాలిటీ, మ్యూజిక్, ఎడిటింగ్, సీజీ వర్క్.. ఇలా ఎక్కడ కూడా రాజీ పడలేదు. ∙‘బంగార్రాజు’లో ఇప్పటి వరకు విడుదలైన ‘లడ్డుందా, నా కోసం, వాసివాడి తస్సాదియ్యా..’ పాటలకు మంచి స్పందన వచ్చింది. మరో మూడు పాటలను రిలీజ్ చేస్తాం. నాగార్జున సార్ సాంకేతిక నిపుణులకు మంచి ఫ్రీడమ్ ఇస్తారు. ఆయనతో పని చేయడం ప్రోత్సాహకంగా ఉంటుంది. నేను సంగీతం అందించిన ‘శేఖర్’ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. విక్రమ్ కె.కుమార్‌తో చేస్తోన్న సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది. -
బంగార్రాజు చిత్రం నుంచి మరో లిరికల్.. 'నా కోసం నువ్వు' అంటూ
Bangarraju Movie Another Lyrical Song Released: టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున సినీ కెరీర్లో మంచి విజయాన్ని సాధించిన సినిమాల్లో ఒకటి 'సోగ్గాడే చిన్ని నాయనా'. ఈ చిత్రానికి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నాగార్జున రెండు పాత్రల్లో కనిపించి అలరించారు. ఈ సినిమాకు 'బంగార్రాజు' పేరుతో ప్రీక్వేల్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కూడా కల్యాణ్ కృష్ణ డెరెక్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ఒక అందమైన మెలోడీ పాటను విడుదల చేశారు మేకర్స్. 'నా కోసం నువ్వు' అంటూ సాగే ఈ పాటకు బాలాజీ సాహిత్యం అందించగా, ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించారు. పాటలో అనూప్ రూబెన్స్ సంగీతం అద్భుతంగా ఉంది. ఈ లిరికల్ వీడియో చివరిలో నాగర్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ఈ పాట టీజర్‌ను డిసెంబర్ 2న విడుదల చేయగా పూర్తి సాంగ్‌ను ఇవాళ (డిసెంబర్ 5) న రీలీజ్ చేశారు. ఇంతకుముందు 'నాగలక్ష్మీ' పాత్రలో కనిపించిన కృతి శెట్టి లుక్కు మంచి ఆదరణ లభించింది. అలాగే నాగార్జున పాడిన 'లడ్డుండా' లిరికల్ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. 'బంగర్రాజు' సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుండగా, చై సరసన కృతి శెట్టి కనిపించనుంది. ఈ చిత్రాన్ని జీ స్డూడియోస్, అన్నపూర్ణ స్డూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంపై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. Here’s #NaaKosam https://t.co/XaBO3LUx24 from #Bangarraju another beautiful melody from @anuprubens with @sidsriram magic .. happy listening !! @iamnagarjuna@IamKrithiShetty @kalyankrishna_k @AnnapurnaStdios @ZeeStudios_ @zeemusiccompany@zeemusicsouth — chaitanya akkineni (@chay_akkineni) December 5, 2021 ఇదీ చదవండి: నీ ఎనర్జీని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు నాన్నా.. చైతూ ట్వీట్ వైరల్ -
మ్యూజిక్ చేస్తే మిలియన్స్ వ్యూస్..అదే అనూప్ రూబెన్స్ మ్యాజిక్
ఘంటసాల నుంచి ఇళయరాజా దాకా, రాజ్ కోటి నుంచి మణిశర్మ దాకా.. దేవిశ్రీ ప్రసాద్ నుంచి థమన్ దాకా..టాలీవుడ్‌ను తమ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశారు ఎందరో సంగీత దర్శకులు. ఈ మ్యూజిక్ హిస్టరీలో అనూప్ రూబెన్స్‌కు ఒక ప్రత్యేక శైలి, స్థానం ఉంది. ‘జై’ సినిమాతో మొదలైన అనూప్ స్వర ప్రస్థానం పదిహేడేళ్లుగా జైత్రయాత్ర సాగిస్తూనేే ఉంది. ఫాస్ట్ బీట్, మెలొడీ, ఇన్ స్పైరింగ్ సాంగ్స్, పేట్రియాటిక్, ఫోక్ సాంగ్స్..ఇలా పాటల కంపోజిషన్‌లో అనూప్ టచ్ చేయని జానర్ లేదు, మెప్పించని తరహా లేదు. అప్పట్లో క్యాసెట్ల అమ్మకాల్లో ట్రిపుల్ ప్లాటినం ఫంక్షన్లు చూసిన అనూప్.. డిజిటల్ యుగంలో వందల మిలియన్ వ్యూస్ పాటలను అందించి మారిన ట్రెండ్‌లోనూ తన మ్యూజిక్ టాలెంట్‌ను చూపిస్తున్నారు. ‘జై, ధైర్యం’ సినిమాలతో మొదలైన అనూప్ రూబెన్స్ కెరీర్... ‘ప్రేమ కావాలి’ చిత్రంతో మరో మలుపు తిరిగింది. ‘ఇష్క్, లవ్లీ, గుండెజారి గల్లంతయ్యిందే, పూలరంగడు, మనం, భీమవరం బుల్లోడు, పిల్లా నువ్వు లేని జీవితం, టెంపర్, గోపాల గోపాల’ చిత్రాలతో రివ్వున పైకి ఎగిరి సంగీత ఆకాశంలో అక్కడే నిలిచిపోయింది. బాలకృష్ణతో పైసా వసూల్, నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయనా వంటి క్లాస్ హిట్స్ ఇవ్వడం అనూప్కే సాధ్యమైంది. పవన్ కల్యాణ్‌తో గోపాల గోపాల, కాటమరాయుడు రెండు చిత్రాలకు స్వరాలు అందించారు అనూప్. కాస్త గ్యాప్ రాగానే ఓ సూపర్ హిట్ ఆల్బమ్‌తో మళ్లీ తన స్వరవేడుక చూపడం ఈ యంగ్ మ్యూజిషియన్కు అలవాటు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రంతో ఇదే పాటల వేడుక చేశారు. నీలి నీలి ఆకాశం 274 మిలియన్ వ్యూస్ సాధించి, పాండమిక్ లో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. రీసెంట్గా మంచి రోజులు వచ్చాయి సినిమాతో హిట్ కొట్టిన అనూప్...త్వరలో మరిన్ని ఛాట్ బస్టర్స్ ఇవ్వబోతున్నారు. నాగార్జున ‘బంగార్రాజు’ లడ్డుండా ఆల్రెడీ హిట్ ఆల్బమ్ మొదలుపెట్టేశాడు. వెంకీతో దృశ్యం 2, రాజశేఖర్ హీరోగా వస్తున్న శేఖర్ వంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్‌తో మరిన్ని హిట్ ఆల్బమ్స్‌ను మన ముందుకు తీసుకురాబోతున్నారు అనూప్. -
'30 రోజుల్లో ప్రేమించటం ఎలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు..
-
నేను చాలా లక్కీ: అనూప్ రూబెన్స్
రాజ్‌తరుణ్, మాళవికా నాయర్ జంటగా నటించిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మించారు. నేడు ఆహా ఓటీటీ చానల్ ద్వారా ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్ర సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ మీడియాతో చెప్పిన విశేషాలు. ‘ఒరేయ్ బుజ్జిగా’ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. దర్శకుడు విజయ్‌కుమార్ కొండాతో ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలాకోసం’, సినిమాల తర్వాత ‘ఒరేయ్ బుజ్జిగా’ హ్యాట్రిక్ ఫిల్మ్ చేశాను. దేనికదే విభిన్నంగా ఉండే ఈ సినిమాలోని ఐదు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. లాక్డౌన్లో మ్యూజిక్ చేశాను, కానీ ఎక్కడో చిన్న అసంతృప్తి ఉండేది. కారణం అంతకుముందు దర్శకుడు, నిర్మాత అందరూ కలిసి కూర్చుని ఇక్కడ ఇలా చేస్తే బావుంటుంది, అలా చేస్తే బావుంటుంది అని చర్చించుకుని సినిమాకి సంగీతం చేసేవాళ్లం. ఒక్కడినే ఇంటిదగ్గర కూర్చుని మ్యూజిక్ చేయటం కష్టంగా అనిపించింది. ఈ సినిమాలోని ‘ఈ మాయ పేరేమిటో...’ అనే సాంగ్ పర్సనల్‌గా నాకెంతో ఇష్టం. అలాగే ‘కృష్ణవేణి..’ అనే పాట కూడా ఇష్టం. ఎందుకంటే ఆ పాటలో రాజ్‌తరుణ్ డ్యాన్స్ ఇరగదీశాడు. ఒక సినిమాకి సంగీతం అందించేటప్పుడు హీరోని, కథను దృష్టిలో పెట్టుకుని మ్యూజిక్ చేస్తాను. ఒక సంగీత దర్శకునిగా నాకు అన్ని రకాల సినిమాలు చేయటం ఇష్టం. లక్కీగా ‘ఇష్క్’, ‘మనం’, ‘గోపాల గోపాల’, ‘టెంపర్’, ‘కాటమరాయుడు’, ‘పైసా వసూల్’, ‘పూలరంగడు’, ‘సోగ్గాడే చిన్నినాయనా’... ఇలా ఒకదానికొకటి సంబంధం లేకుండా డిఫరెంట్ జోనర్స్లో సినిమాలు చేసే అవకాశం అభించింది. ఇప్పటివరకు 55 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాను. నాకు అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు కృతజ్ఞతలు. ప్రసుత్తం రాధామోహన్‌గారు నిర్మిస్తున్న ‘ఓదెల రైల్వేస్టేషన్’, రాజ్‌తరుణ్–విజయ్‌కుమార్ కొండా కాంబినేషన్లో మరో సినిమా చేస్తున్నాను. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు ఉన్నాయి. అలాగే ఈ లాక్డౌన్లో కొన్ని ప్రైవేట్ సాంగ్స్ రికార్డ్ చేశాను. మంచి టైమ్ చూసుకుని ఈ పాటలను విడుదల చేస్తాను. -
‘సరిగమ’ అంటున్న రాజ్, హెబ్బా
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. హెబ్బా పటేల్ మరో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూవీ ఫస్ట్ లుక్, టీజర్, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రంలోని ‘సరిగమ’ అనే పూర్తి లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. వనమాలి సాహిత్యం అందించగా.. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసి పాడాడు. యూత్‌కు బాగా కనెక్ట్ అయిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. (నగ్నంగా నరేశ్.. 30న ఎఫ్ఐఆర్) ఈ పాటలో రాజ్ తరుణ్ డ్యాన్స్, హెబ్బా పటేల్ అందాలు హైలైట్‌గా నిలిచాయి. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే కుమారి 21ఎఫ్, అంధగాడు, ఆడోరకం ఈడోరకం చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ జోడిని ప్రేక్షకులు చాలా ఇష్టపడుతుండటంతో ఈ చిత్రంలోనూ వీరిని రీపీట్ చేశామని దర్శకనిర్మాతలు పేర్కొన్నారు. మార్చి 25న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే ఈ చిత్రానికి ఓటీటీలో మంచి డిమాండ్ ఉన్నప్పటికీ థియేటర్లోనే విడుదల చేస్తామని నిర్మాతలు స్పష్టం చేశారు. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా థియేటర్లు తెరిచిన వెంటనే ‘ఒరేయ్ బుజ్జిగా’ విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. (వర్మ కొత్త సినిమా: పవర్ స్టార్ ఇతనే) -
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’.. తమన్నా సాయం!
బుల్లితెర ప్రఖ్యాత యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. అమృతా అయ్యర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మున్నా దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై పాజిటీవ్ వైబ్రేషన్స్ నెలకొన్నాయి. ఇందుకు తగ్గట్టు చిత్ర ప్రమోషన్లు భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. ఇప్పటికే మూవీ మ్యూజిక్ పోస్టర్‌ను రానా విడుదల చేయగా.. తొలి పాట సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు. తాజాగా ఈ సినిమాలోని రెండు లిరికల్ సాంగ్ మిల్క్ బ్యూటీ తమన్నా తన అధికారిక ట్విటర్ ద్వారా విడుదల చేశారు. ఈ సాంగ్ విడుదల చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ చిత్ర యూనిట్‌కు తమన్నా బెస్ట్ విషెస్ తెలిపారు. కాగా, ఈ చిత్రం కోసం తమన్నా తన వంతు సాయాన్ని ఈ విధంగా చేసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘ఇదేరా స్నేహం.. కనివిని ఎరుగని స్నేహం ఇది కాలం చూడని స్నేహం.. దేహం అడగని స్నేహం.. ఇది హృదయం అడిగే స్నేహం.. నింగిని నేలని వాన చినుకై కలిపెను స్నేహం. తూర్పుకు పడమరకు కాంతి తోరణమైందీ స్నేహం’అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ యూత్‌ను కట్టిపడేస్తోంది. ఈ పాటను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేయగా.. ‘బుట్టబొమ్మ’ ఫేమ్ అర్మాన్ మాలిక్ ఆలపించాడు. చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. స్నేహానికి సంబంధించి ఈ పాటలో చంద్రబోస్ అందించిన లిరిక్స్ హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన తొలి సాంగ్ ‘నీలి నీలి ఆకాశం’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎస్వీ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నాడు. Happy to launch this beautiful song #IderaSneham from #30RojulloPreminchadamEla 😊 So happy for u my dear @impradeepmachi and wishing entire team the best 👍😊https://t.co/UI1Y3dlSoO — Tamannaah Bhatia (@tamannaahspeaks) February 16, 2020 చదవండి: ‘ప్రదీప్’ పాటకు నెటిజన్లు ఫిదా ‘సామజవరగమన’ వీడియో సాంగ్ వచ్చేసింది! నితిన్ లవ్‌స్టోరీ తెలిసింది అప్పుడే -
90 ఎంఎల్ : మూవీ రివ్యూ
టైటిల్: 90ఎంల్ నటీనటులు: కార్తికేయ, నేహా సోలంకి, రవికిషన్, రోల్‌రైడా, కాలకేయ ప్రభాకర్, రావూ రమేష్,అలీ, పోసాని కృష్ణమురళి, సత్యరాజ్ సంగీతం: అనూప్ రూబెన్స్ దర్శకుడు: ఎర్ర శేఖర్‌రెడ్డి నిర్మాణ సంస్థ: కార్తికేయ క్రియేటివ్ వర్క్ ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్లోకి దూసుకెచ్చిన యువకెరటం కార్తికేయ. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ కావడంతో కార్తికేయకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత హిప్పీ, గుణ 369 వంటి సినిమాలు చేసిన ఈ యంగ్ హీరో సరైన సక్సెస్‌ను అందుకోలేదు. ఈ క్రమంలో ‘90ఎంఎల్’ అంటూ డిఫరెంట్ టైటిల్‌తో తెరమీదకు వచ్చాడు కార్తీకేయ. రోజుకు మూడుపూటల మందు వేస్తే తప్ప మనుగడ సాగించని ఓ యువకుడి కథ అంటూ ఈ సినిమా ట్రైలర్‌ను ప్రేక్షకులపైకి వదిలారు. ఇంతకు ఈ మందుబాబు కథేంటో తెలుసుకుందాం పదండి.. కథ: పార్వతీనగర్‌కు చెందిన దేవదాస్ (కార్తికేయ).. ఓ అరుదైన వ్యాధి వల్ల రోజూ మూడుపూటలు 90 ఎంఎల్ లిక్కర్ తాగాల్సిన విచిత్రమైన స్థితి అతనిది. ఈ వ్యాధి వల్ల కన్న తల్లిదండ్రులే మద్యం తాగమని అతన్ని బతిలాడుతుంటారు. అలాంటి దేవ్‌దాస్ సాహసాన్ని సోషల్ మీడియా ద్వారా చూసిన సువాసన (నేహా సోలంకి) అతన్ని ఇష్టపడుతుంది. ఇద్దరు ప్రేమించుకుంటారు. సువాహన కుటుంబానికి మద్యం అంటేనే పరమ అసహ్యం. ఆమె తండ్రి ట్రాఫిక్ పోలీసు. మరోవైపు జాన్విక్ (రవికిషన్) కూడా మద్యం వ్యసనపరుడే. మద్యం తాగి ఓసారి జాన్విక్ ఇంటికి వెళ్లిన దేవ్‌దాస్ కొన్ని కారణాల వల్ల అతన్ని చితకబాదుతాడు. ఈ క్రమంలో సువాహనకు దేవ్‌దాస్ మద్యం తాగే విషయం తెలిసి అతనితో బ్రేకప్ చేసుకుంటుంది. అతను ఎందుకు మద్యం తాగుతున్నాడో సువాహనకు తెలుసుకోదు. ఇంకోవైపు మద్యంలో మత్తులో ఉన్నప్పుడు తనను ఎవరు కొట్టారు? ఎందుకు కొట్టారు? తెలుసుకునేందుకు జాన్విక్ ప్రయత్నిస్తుంటాడు. అసలు జాన్విక్-దేవ్దాస్కు మధ్య ఏం జరిగింది? ఒక్క పూట 90 ఎంఎల్ తాగకుంటే చచ్చిపోయే స్థితిలోని దేవదాస్ తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు. ఈ క్రమంలో జాన్విక్, అతని గ్యాంగ్ నుంచి ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడన్నది మిగతా కథ. విశ్లేషణ: కొత్త దర్శకుడు యెర్ర శేఖర్‌రెడ్డి ఒకింత భిన్నమైన కథతో కమర్షియల్ హంగులతో మాస్, యూత్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఈ మాస్‌మసాలా కథను సిద్ధంచేసినట్టు కనిపిస్తోంది. సినిమాటిక్‌గా, కామెడీపరంగా సినిమా బావుంది. కామెడీ సీన్లు నవ్వించేలా ఉన్నాయి. హీరోహీరోయిన్లు కార్తికేయ, సోలంకీ చాలా ఎనర్జీటిక్గా యాక్ట్ చేశారు. సినిమాటోగ్రఫి, నేపథ్య సంగీతం, పాటలు బావున్నాయి. రవికిషన్, కాలకేయ ప్రభాకర్, రావూ రమేశ్, సత్యరాజ్, పోసాని కృష్ణమురళి, రోల్‌రైడా తమ పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. నిర్మాణ విలువులు చిత్రస్థాయికి తగ్గట్టు ఉన్నాయి. కానీ, బలమైన కథ, కథనాలు సినిమాలో లేకపోవడం, ఎక్కువగా సినిమాటిక్‌గా, సెకండాఫ్ కొంత బోర్ కొట్టించడం మైనస్ పాయింట్‌గా అనిపిస్తుంది. ఈ సినిమా మూలకథనే మద్యం మీద ఆధారపడి ఉంది. ఒకప్పుడు దేవదాసు సినిమాలో ప్రేమలో విఫలమై గుండెల్ని పిండేసే బాధను దిగమింగలేక మద్యానికి బానిసై.. జగమే మాయా, బతుకే మాయ అని పాడుకుంటే ప్రేక్షకులు కూడా ఆ పాత్రలో లీనమై దుఃఖించారు. కథపరంగా చూసుకుంటే ఈ సినిమాలోని హీరోది పెద్ద సమస్యే. ఒక్క పూట మద్యం తాగకపోయినా చచ్చిపోయే పరిస్థితి ఉండటం హీరో పట్ల సానుభూతి కల్పించేదే. కానీ, సినిమాలో కమర్షియల్ పంథాలో మాస్ అంశాలను దృష్టిలో పెట్టుకొని మద్యం సేవించడాన్ని కొంత గ్లోరిఫై చేసినట్టు కనిపిస్తుంది. సమాజం మీద ఎంతో విషప్రభావం చూపుతున్న మద్యం నేపథ్యంగా సినిమాను తీసినప్పుడు దర్శకుడు కమర్షియల్, మాస్ అంశాలే కాకుండా ఇంకాస్త సెన్సిబుల్‌గా ఆలోచించి.. సమాజానికి ఏదైనా చెబితే బాగుండేనేమోనని ప్రేక్షకులకు అనిపించవచ్చు. ఎందుకంటే సినిమా వినోద సాధనమే కాదు బలమైన మాద్యమం కూడా. సినిమా తెర నిండా ‘పొగ త్రాగుట, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం’ అన్న ట్యాగ్ తప్ప.. మద్యం వల్ల జరిగే ఏ చెడు గురించి సినిమా పెద్దగా ఫోకస్ చేసినట్టు కనిపించదు. సినిమాలో ‘రేప్’ మీద జోక్ వినిపించడం ఇన్సెన్సిటివ్గా అనిపిస్తుంది. బలాలు హీరోహీరోయిన్ల నటన కామెడీ చిత్ర నిర్మాణ విలువలు బలహీనతలు బలమైన కథ, కథనాలు లేకపోవడం మరీ సినిమాటిక్‌గా ఉండటం - శ్రీకాంత్ కాంటేకర్ -
‘90 ఎంఎల్’ ప్రీ రిలీజ్ వేడుక
-
‘నా మందు తాగి నన్నే కొడతాడా.. వదలను’
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం ‘90 ఎంఎల్’. నేహా సోలంకి కథానాయిక. శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకత్వం వహించారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్ పతాకంపై అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, సాంగ్స్ సినీ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ‘నాతో నువ్వుంటే చాలు’ అనే సాంగ్ యూత్‌కు ముఖ్యంగా లవర్స్‌కు తెగ కనెక్ట్ అయింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌ను మొదలుపెట్టింది. తాజాగా మూవీ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘నీతో కలిసి చచ్చేంత ప్రేమ నాలో ఉంది.. నాతో కలిసి బతకాలన్న ఆలోచనే నీలో లేదు.. ఐ హేట్ యూ’అంటూ ట్రైలర్లో హీరోయిన్ పలికే మాటలు ప్రేమికుల మనసులను కదిలించేలా ఉంది. ‘కొందరకి మందు తాగడం సరదా.. మరికొందరికి అది వ్యసనం.. కానీ మీ బాబుకు అది అవసరం, ఏ జన్మలో ఏ యాగం చేశారో ఈ రాజావారు ఈ జన్మలో ఈ యోగంతో పుట్టారు’ఈ డైలాగ్‌లతో ఈ సినిమాకు 90 ఎంఎల్ అని టైటిల్ ఎందుకు పెట్టారో అర్థమవుతోంది. అదేవిధంగా స్టోరీ కూడా తెలిసిపోతోంది. ఇక తనకున్న వీక్నెస్తో ప్రేమలో పడిన కష్టాలు, అమ్మాయి కుటుంబసభ్యులతో ఎదురైన సంఘటనలు చూస్తుంటే సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. ఇక హీరోయిన్ హీరోను వదిలి వెళ్లిపోతుంటే ‘కన్నులు వదిలి కల వెళుతుందే.. గుండెను వదిలి లయ వెళుతుందే.. గుడినే వదిలి దేవత వెళుతుందే’ వచ్చే సాంగ్ సూపర్బ్. చివర్లో ‘నా మందు తాగి నన్నే కొడతాడా.. వదలను’అని విలన్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ముగుస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్‌కు నెటిజన్లు ఫిదా అవడంతో తెగ వైరల్ అవుతోంది. ఇక ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ సృష్టించిన కార్తికేయ తరువాత ఆ స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాడు. ఇటీవల గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రతినాయక పాత్రలో సక్సెస్ అయిన ఈ యంగ్ హీరో ‘90 ఎంఎల్’పై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. రవి కిషన్, రావూ రమేష్, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నాడు. -
‘ఒక్క అడుగు నాతో వేస్తే చాలు’
‘ఒకసారి చూస్తే చాలు.. ఒకసారి నవ్వితే చాలు.. ఒక అడుగు నాతో వేస్తే చాలు.. ఒక రిప్లై ఇస్తే చాలు.. ఒక స్మైలీ పెడితే చాలు.. ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. నాతో నువ్వుంటే చాలు.. కోరుకోను ఇంకేం వరాలు’అంటూ సాగే ఈ పాట లవర్స్‌కు బాగా కనెక్ట్ అవుతోంది. అంతేకాకుండా వాట్సప్ స్టేటస్, కాలర్ ట్యూన్, రింగ్ ట్యూన్స్‌లలో ఈ పాట మార్మోగటం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగులో లవ్ సాంగ్స్ స్పెషలిస్ట్‌గా పేరు గాంచిన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఈ పాటకు ట్యూన్ కట్టగా.. చంద్రబోస్ లిరిక్స్‌ను అందించాడు. ఈ పాటకు వీరిద్దరు ఒకెత్తయితే అద్నాన్ సమీ వాయిస్ ఈ పాటకు మరింత హైలెట్‌గా నిలిచింది. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ నటిస్తోన్న ‘90 ఎం.ఎల్’ సినిమాలోని మరో లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాట యూత్‌ను ముఖ్యంగా లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. చంద్రబోస్ అందించిన హార్ట్ టచింగ్ లిరిక్స్‌తో పాటు అద్నాన్ సమీ వాయిస్ ఎక్స్ట్రార్డినరీగా నిలిచింది. ఇక జానీ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ కూడా కొత్తగా ఉంది. ఓవరాల్‌గా అన్ని హంగులు జోడించి విడుదల చేసిన ఈ లిరికల్ సాంగ్ వీడియో నెట్టింట్లో రచ్చ చేస్తోంది. ఇక ఈ సినిమాలో కార్తికేయ సరసన నేహా సోలంకి కథానాయికగా కనిపించనుంది. శేఖర్‌రెడ్డి ఎర్ర దర్శకునిగా పరిచయమవుతున్నారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్ పతాకంపై అశోక్‌రెడ్డి గుమ్మకొండ ఈ సినిమా నిర్మిస్తున్నారు. వాణిజ్య అంశాలతో వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే సినిమా విడుదల తేదీపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకా ఈ చిత్రంలో రవికిషన్, రావు రమేష్, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్, ప్రగతి, ప్రవీణ్ తదితరులు నటించారు. -
‘90ఎంఎల్’ అంటోన్న యంగ్‌హీరో
‘ఆర్ఎక్స్ 100’తో సెన్సేషన్ క్రియేట్చేసిన కార్తికేయ.. ‘హిప్పీ’ చిత్రంతో నిరాశపరిచాడు. అయితే మళ్లీ ‘గుణ 369’ అంటూ ప్రయత్నించినా.. సరైన విజయాన్ని అందుకోలేకపోయాడు. ఈసారి ఎలాగైనా హిట్టుకొట్టాలని.. మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు. ఈ చిత్రానికి సంబంధించిన తాజాగా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. పాలసీసాలో కూడా మందును పోసినట్టు డిజైన్చేసి రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తిని రేకిత్తించగా.. కాసేపటి క్రితమే ఫస్ట్ లుక్, టైటిల్‌ను రిలీజ్ చేశారు. టైటిల్ చూస్తుంటే మరో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. -
పాలసీసాలో మందు..!
ఆర్ఎక్స్ 100 మూవీతో ఫేమస్ అయిన హీరో కార్తికేయ. ఈ మూవీతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఈ హీరోకు యూత్‌లో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే హిప్పీతో పలకరించి నిరాశచెందాడు. ఈ మూవీ అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా కార్తీకేయ తన స్వంత బ్యానర్లో మరో చిత్రాన్ని నిర్మించడానికి సిద్దమయ్యాడు. ప్రేమతో మీ కార్తీక్ అంటూ మొదటి చిత్రాన్ని నటించి నిర్మించినా.. అంతగా పేరు తీసుకురాలేదు. అయితే తాజాగా తన సొంత బ్యానర్లో రెండో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. జీవితం పాలసీసాతో మొదలై.. మందుసీసాతో ముగిసిపోతుందా? అని అనిపించేట్టు డిజైన్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్, టైటిల్‌ను సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించనున్నాడు.