Army recruitment rally
-
నేటి నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
సాక్షి, విశాఖపట్నం: అగ్నివీర్ నియామక ప్రక్రియలో భాగంగా విశాఖపట్నం పోర్టు స్టేడియంలో సోమవారం నుంచి భారీ ఆర్మీ ర్యాలీలు నిర్వహించనున్నారు. సెపె్టంబర్ 5 వరకూ జరిగే ఈ నియామక ప్రక్రియలో వివిధ రకాల పరీక్షలు పెట్టనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణతతో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్/స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులు, 8వ తరగతి ఉత్తీర్ణతతో అగ్నివీర్ ట్రేడ్ మ్యాన్ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. పోర్టు స్టేడియానికి ఆదివారం అర్ధరాత్రి నుంచి అభ్యర్థులు చేరుకున్నారు. ముందుగా రిజిస్టర్ చేసుకొని అడ్మిట్ కార్డులు పొందిన వారికి మాత్రమే నియామక ప్రక్రియలో పాల్గొనేందుకు అవకాశం కల్పించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. అడ్మిట్ కార్డుల కోసం ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క ధృవపత్రంతో హాజరవ్వాలని అధికారులు అభ్యర్థులకు సూచించారు. పూర్తి పారదర్శకంగా నియామక ప్రక్రియ జరుగుతుందనీ.. దళారుల్ని నమ్మవద్దని రక్షణ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. ఆర్మీ ర్యాలీకి సంబంధించి పోర్టు స్టేడియంలో అభ్యర్థులకు కావాల్సిన సౌకర్యాల ఏర్పాట్లను కలెక్టర్ హరేందీర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ శంఖబత్ర బాగ్చీ పర్యవేక్షించారు. ప్రతి రోజూ 500 నుంచి 800 మంది అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొనే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. -
జూలై 8 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: హెడ్‌క్వార్టర్స్ యూనిట్ కోటా కింద ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని జూలై 8 నుంచి సెప్టెంబర్ 8 వరకు నిర్వహించను న్నట్టు మిలిటరీ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్, అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకోసం ఈ ర్యాలీ నిర్వ హిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జూలై 5న ఉదయం 6 గంటల నుంచి సికింద్రాబాద్ ఏఓసీ సెంటర్, థాపర్ స్టేడి యంలో ధ్రువపత్రాలతో హాజరుకావాల న్నారు. స్పోర్ట్స్ కోటా కింద జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా అథ్లెటిక్ పోటీలో పాల్గొని ఉన్నవారే అర్హులన్నారు. ఈ ఉద్యోగా లకు దరఖాస్తు చేసుకునే అర్హులైన అభ్యర్థులు అదనపు వివరాల కోసం ‘www. joinindianarmy@nic.in’ వెబ్సైట్లో తెలుసుకోవచ్చని తెలిపారు. -
Secunderabad: 29 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
సాక్షి, సికింద్రాబాద్: యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోటా కింద ఈ నెల 29 నుంచి వచ్చే ఏడాది జనవరి 30 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ కొనసాగనుందని ఆర్మీ పీఆర్ఓ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (ఏఓసీ) సెంటర్ ఏబీసీ ట్రాక్‌లో నిర్వహించే ఈ ర్యాలీలో సోల్జర్ టెక్నికల్ (ఏఈ), సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్‌మెన్, అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్‌మెన్ (ఓపెన్ కేటగిరీ), సోల్జర్ (సీఎల్కే/ ఎస్కేటీ– ఏఓసీ వార్డు) కేటగిరీల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్‌మెన్ (ఓపెన్ కేటగిరీ)లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు ఈ నెల 26న ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ ఏఓసీ సెంటర్ థాపర్ స్టేడియంలో రిపోర్ట్ చేయాలని సూచించారు. క్రీడల్లో ప్రావీణ్యం ఉన్న వారు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు ఏఓసీ సెంటర్ హెడ్‌క్వార్టర్స్, ఈస్ట్‌మారేడుపల్లి కార్యాలయంలో నేరుగా లేదా, https://joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రాజెక్టులకు చంద్రబాబు బద్ధ వ్యతిరేకి: మంత్రి పెద్దిరెడ్డి
చిత్తూరు: సాగునీటి ప్రాజెక్టులకు చంద్రబాబు బద్ధ వ్యతిరేకి అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. గాలేరు నగరి ప్రాజెక్టుకు హంద్రీనీవాకు అనుసంధానం చేసి కుప్పం నియోజకవర్గానికి కూడా సాగునీరు అందించడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని వివరించారు. ఇప్పటికే రూ.550 కోట్లతో టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. తాగునీటి కోసం ప్రత్యేక వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. చిత్తూరు జిల్లా అభివృద్ధికి సీఎం జగన్ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో సోమవారం జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో మంత్రి పెద్దిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆయన యువతకు పలు సూచనలు చేశారు. దేశ భద్రత కోసం యువకులు పెద్ద ఎత్తున ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సైన్యంలో చేరడానికి యువకులు ఆసక్తి చూపాలని సూచించారు. సీఎం జగన్ కూడా యువకుల భవిష్యత్తు కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. యువతలో నైపుణ్య లక్షణాల అభివృద్ధికి ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేశారని గుర్తు చేశారు. ఆ విశ్వవిద్యాలయం చిత్తూరు జిల్లాలో ఏర్పాటు కావడం శుభపరిణామమని పేర్కొన్నారు. ప్రతి యువకుడికి ఉద్యోగం కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. -
ప్రారంభమైన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
గుంటూరు వెస్ట్: భారీ బందోబస్తు, కఠిన ఆంక్షలు, ఫ్లడ్‌లైట్ల వెలుగుల మధ్య గురువారం తెల్లవారుజామున ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభమైంది. గుంటూరులోని బీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఎంపికలకు ఏడు జిల్లాల నుంచి సుమారు 2వేల మంది హాజరయ్యారు. అభ్యర్థులకు ముందుగా స్క్రీనింగ్, ఎత్తు, సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించారు. రన్నింగ్ ట్రాక్ తడిగా ఉండడంతో పొన్నూరు రోడ్డులో 1.6 కిలోమీటర్ల రన్నింగ్ ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది అభ్యర్థులు కనీసం విద్యార్హత, కోవిడ్ నెగిటివ్, నో రిస్క్ సర్టిఫికెట్స్ తీసుకురాలేదు. వారికి 29న హాజరు కావాలని మరో అవకాశం కల్పించారు. 18 ఏళ్లలోపు యువకులు తల్లిదండ్రుల వద్ద నుంచి అనుమతి పత్రం తీసుకుని రావాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కొందరిని అనర్హులుగా ప్రకటించారు. కొందరు దళారులు స్టేడియం వద్ద అభ్యర్థులను మభ్యపెడుతున్న విషయాన్ని స్థానిక అధికారులు గుర్తించారు. పూర్తిగా ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షలో ఎటువంటి సిఫార్సులు ఉండవని, దళారులను నమ్మి మోసపోవద్దని స్పష్టం చేశారు. కొన్ని కోచింగ్ సెంటర్లు కూడా రాత పరీక్షను పాస్ చేస్తామని చెబుతున్నాయని, దీనిని నమ్మవద్దని వారు కోరుతున్నారు. ఈ నెల 30 వరకు రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహిస్తారు. -
పరుగో పరుగు..
సాక్షి, కరీంనగర్ స్పోర్ట్స్ : కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు ఆర్మీ రిక్రూట్మెంటు ర్యాలీ ప్రారంభమైంది. తొలి రోజు పలు జిల్లాల అభ్యర్థులకు సోల్జర్ టెక్నికల్ విభాగంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి మూడు వేల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. కలెక్టరేట్ ఆవరణలోని హెలిప్యాడ్‌ప్రాంగణంలో ఎత్తు కొలిచి పంపించారు. 2,608 మంది రన్‌కు అర్హత సాధించారు. అంబేద్కర్ స్టేడియంలో 250 చొప్పున బ్యాచ్‌లుగా విభజించి రన్ నిర్వహించారు. వీరిలో సుమారు 250 మంది అర్హత సాధించినట్లు సమాచారం. జిల్లాలో వర్షం పడటంతో అంబేద్కర్ స్టేడియం ట్రాక్ బురద మయంగా మారింది. బురుదలోనూ పరుగు పందెం నిర్వహించారు. -
ఆర్మీ ర్యాలీకి వెళ్ళొస్తూ.. పదిమంది మృతి
చండీగఢ్ : హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పది మంది యువకులు ప్రాణాలను కోల్పోయారు. ఈ విషాద ఘటన రాష్ట్రంలోని జింద్-హన్సీ సమీప ప్రాంతాల్లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. ఆర్మీ నియామక ర్యాలీలో పాల్గొని తిరిగి ఆటోలో ఇంటికి వెళ్తుండగా రాత్రి 10.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో వెళ్తున్న వారిని వెనక నుంచి వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఆటోను ఢీ కొట్టింది. దీంతో ప్రమాద స్థలంలోనే పది మంది మృత్యువాత పడగా, ఒకరు గాయాలతో బయటపడ్డారు. అనంతరం గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుల వద్ద ఉన్న పత్రాల ఆధారంగా తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. మరణించిన పది మందిలో అయిదుగురు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో స్థానికంగా విషాదం నెలకొంది. -
సైనికుల ఎంపిక షురూ..!
సాక్షి, ఒంగోలు: స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండులో శుక్రవారం ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభమైంది. మొత్తం ఏడు జిల్లాల అభ్యర్థులకు ఈ నెల 15వ తేదీ వరకు ఈ ఎంపిక ప్రక్రియ జరగనుంది. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నుంచి మొత్తం 28,200 మందికిపైగా దరఖాస్తు చేసుకోగా, తొలిరోజు చిత్తూరు, అనంతపురం జిల్లాలకు చెందిన అభ్యర్థులతో ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. ఆయా జిల్లాల నుంచి 3,400 మంది దరఖాస్తు చేసుకోగా, 2,470 మంది హాజరయ్యారు. వీరంతా గురువారం రాత్రే ఒంగో లు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం నాలుగు గంటలకే వారికి బ్యాడ్జీ నంబర్లు కేటాయిస్తూ పరేడ్ గ్రౌండ్లోకి ఆహ్వానించారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం శారీరక కొలతలైన ఎత్తు, బరువు, ఛాతి విస్తీర్ణం తదితర పరీక్షలు నిర్వహించారు. అనంతరం 1.6 కిలోమీటర్ల పరుగు పరీక్ష, 9 అడుగుల గొయ్యి దూకడం, 6 కంటే ఎక్కువ పుల్‌ఆప్స్ తీయడం, జిగ్‌జాగ్ బ్యాలెన్స్ వంటి వాటిలో ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేశారు. వీరికి శనివారం మెడికల్ టెస్టు నిర్వహించనున్నారు. కొనసాగుతున్న నిఘా... ఒక వైపు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతుండగా, మరోవైపు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన వారు అభ్యర్థులకు తమ ప్రచార పత్రాలను ఇస్తున్నారు. దీంతో పోలీసులు వారిపై నిఘా పెట్టారు. వారిలో కొంతమందిని లోపలకు పిలిపించి వివరాలు సేకరించారు. ఎందుకు వచ్చారని అడిగి తెలుసుకుని వారి మొబైల్ నంబర్లు, ఇతర వివరాలు నమోదు చేసుకున్నారు. దళారులపై అనుమానంతో పోలీసులు నిఘా ఉంచారు. అభ్యర్థులను ఏమాత్రం ప్రలోభాలకు గురిచేసినా చట్టబద్ధమైన చర్యలు తప్పవంటూ వారిని హెచ్చరించి పంపించి వేశారు. అభ్యర్థులతో మాట్లాడి ధైర్యం నింపిన జేసీ–2 సిరి... ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్–2 డాక్టర్ సిరి సందర్శించారు. ఈ సందర్భంగా అభ్యర్థులతో మాట్లాడి వారిలో ధైర్యాన్ని నింపారు. రిక్రూట్మెంట్లో పారదర్శకత ఉంటుందని, ఎటువంటి అపోహలకు తావులేదని స్పష్టం చేశారు. దళారులు ఎవరైనా మభ్యపెడుతున్నట్లు గుర్తిస్తే తక్షణమే పోలీసు డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. దేశభద్రతకు సైనికులు ఎలా పనిచేస్తారో.. అలాగే సమాజంలోని అసాంఘిక శక్తుల్ని తుదముట్టించేందుకు కూడా సైన్యంలో చేరాలనుకునే వారు పనిచేయాలని సూచించారు. అనంతరం మీడియాతో జేసీ–2 సిరి మాట్లాడుతూ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో రోజుకు 3,500 నుంచి 4 వేల మంది అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెడికల్ చెకప్‌కు ఎంపికైన వారికి మరుసటి రోజు చేస్తారన్నారు. ఆర్మీ నుంచి 7 బృందాల డాక్టర్లు వచ్చారని, అభ్యర్థులకు మెడికల్ చెకప్‌ను వారే నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ ఏడు బృందాలు రోజుకు 280 మందికి మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహిస్తాయని, మిగిలిన వారికి ఆ మరుసటి రోజు మెడికల్ చెకప్‌లు చేస్తారని, అప్పటి వరకు వారికి కలెక్టర్ భాస్కర్ ఆదేశాల మేరకు స్థానిక డాన్‌బాస్కో స్కూల్లో వసతి కల్పించామని తెలిపారు. రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతున్న పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అభ్యర్థుల కోసం మెప్మా ఆధ్వర్యంలో ఒకటి, డీఆర్డీఏ ఆధ్వర్యంలో రెండు క్యాంటీన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. నగరపాలక సంస్థ మంచినీటి సౌకర్యాన్ని కల్పించిందన్నారు. తొలిరోజు రిక్రూట్మెంట్కు వాతావరణం కూడా అనుకూలించిందన్నారు. ఈ ర్యాలీలో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, గుండె జబ్బులు ఉన్న వారు హాజరుకాకూడదని, ఆ మేరకు ముందస్తు సూచనలు చేశామని తెలిపారు. అయితే, వాటి గురించి తెలుసుకోని వారు ఎవరైనా హాజరై అస్వస్థతకు గురైతే వారికి తక్షణ వైద్యంఅందించేందుకు రెండు అంబులెన్స్‌లు, ఇద్దరు రిమ్స్ వైద్యులను కూడా అందుబాటులో ఉంచామన్నారు. దళారులను ఎవరూ నమ్మవద్దని, ఎవరైనా అటువంటి వ్యక్తులు తారసపడితే మీడియా కూడా పోలీసుశాఖకు సమాచారం అందించాలని కోరారు. ఎంపిక ప్రక్రియను మిలటరీ అధికారులతో పాటు స్టెప్ ఇన్చార్జి సీఈవో నరసింహారావు పర్యవేక్షిస్తున్నారు. -
కష్టాలు రానీ.. కన్నీళ్లు రానీ
కర్నూలు: ఉద్యోగ లక్ష్య సాధనలో నిరుద్యోగులు అర్ధాకలితో రోడ్లపైనే పడిగాపులు కాస్తూ అల్లాడుతున్నారు. గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబడి కాళ్లనొప్పులు భరించలేక తల్లడిల్లుతున్నారు. అర్ధరాత్రి నుంచి తెల్లారే దాకా ఆర్మీ నియామక ప్రక్రియ కొనసాగుతుండటంతో చేసేదేమీ లేక దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువకులు రోడ్లపైనే తిష్ట వేసి అధికారుల పిలుపు కోసం నిరీక్షిస్తున్నారు. కర్నూలు ఏపీఎస్పీ రెండవ పటాలం మైదానంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ రెండో రోజు శనివారం కొనసాగింది. సుదూర ప్రాంతాల నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి హాజరైన నిరుద్యోగ యువకులు క్యూలైన్ల వద్దనే కునుకు తీస్తూ సేద తీరుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎంపిక పోటీలు ప్రారంభమై శనివారం ఉదయం 10 గంటలకు ముగిసింది. చిత్తూరు, అనంతపురం జిల్లాలకు చెందిన సుమారు 3,800 మంది అభ్యర్థులు పోటీల్లో పాల్గొని తమ అదృ ష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆర్మీ రిక్రూట్మెంట్ డైరెక్టర్ కల్నల్ బింద్రా పర్యవేక్షణలో ఈనెల 15 వరకు ఆర్మీ ఎంపిక పోటీలు కొనసాగనున్నాయి. ఏడు జిల్లాల నుంచి నిరుద్యోగ అభ్యర్థులు కర్నూలుకు తరలివస్తున్నారు. మూడవ రోజు కర్నూలు జిల్లాకు సంబంధించిన అభ్యర్థులను ఆర్మీ రిక్రూట్మెంట్కు ఆహ్వానించడంతో శనివారం రాత్రే పెద్ద ఎత్తున కర్నూలుకు చేరుకున్నారు. ఫలితాల ప్రకటనపై అధికారుల ఆంక్షలు ఆర్మీ రిక్రూట్మెంట్కు ఏయే రోజు ఏ జిల్లా నుంచి హాజరవుతున్నారు, రాత పరీక్షకు ఎంతమంది ఎంపికయ్యారనే వివరాల వెల్లడిపై నిర్వాహకులు గోప్యత పాటిస్తున్నారు. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులతో ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారులు కొంతమంది కుమ్మౖMð్క విషయాలు బయటకు చెప్పకుండా గోప్యత పాటిస్తుండటంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. పోటీలో పాల్గొన్నప్పటికీ వారు రాత పరీక్షకు ఎంపికయ్యారా లేదా అనే విషయంపై ఆంక్షలు విధిస్తుండటంతో కొంతమంది అనుమానంతో అధికారులతో వాదనకు దిగుతున్నారు. -
ఆర్మీ రిక్రూట్మెంట్
వరంగల్ స్పోర్ట్స్ : ఈ నెల 21 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి జిల్లా యంత్రాంగం సహకరించాలని రిక్రూట్మెంట్ బోర్డు సికింద్రాబాద్ అధికారి పవన్‌పూరి కోరారు. గురువారం పలువరు జిల్లా అధికారులతో కలిసి హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని ఆయన పరిశీలించారు. అభ్యర్థులకు కావాల్సిన వసతులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో హన్మకొండ ఏ సీపీ రాజేంద్రప్రసాద్, డీఆర్డీఏ డీడీ రాము, డీపీఆర్ఓ డీడీ జగన్, కార్పొరేషన్ ట్రాన్కో ఈఈ లక్ష్మారెడ్డి, మెడికల్ ఆఫీసర్ రాజిరెడ్డి, ఆర్డీఓ వెంకారెడ్డి ఆర్డబ్ల్యూఎస్, రెవెన్యూ ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
కరీంనగర్ స్పోర్ట్స్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్డేడియంలో నవంబర్ 1 నుంచి 10వ తేదీవరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాటీ జరగనుంది. చెన్నైలోని హెడ్‌క్వార్టర్స్ రిక్రూటింగ్ జోన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాలకు (10 పాత జిల్లాల ప్రకారం) చెందిన 4,9078 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. గుంటూరులో జరిగిన ర్యాలీ నుంచి 5,895 మంది అభ్యర్థులతో పాటు మొత్తం 54,973 మంది అభ్యర్థులు ర్యాలీకి హాజరుకానున్నారు. కరీంనగర్ కేంద్రంలోని అంబేవడ్కర్ స్టేడియంలో నియామక ప్రక్రియ జరుగనుంది. సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ క్లర్క్/ ఎస్కెటీ, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ టెక్నికల్, సోల్జర్ ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలకు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ర్యాలీకి వచ్చే అభ్యర్థుల కోసం జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయనుంది. ఆర్మీ రిక్రూట్మెంట్ డైరెక్టర్ కల్నల్ పవన్ పూరి సోమవారం ర్యాలీ ఏర్పాట్లను సమీక్షించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్ ర్యాలీ నియామకాలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే నియామక ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు చెప్పారు. -
ఆర్మీ ఎంపికలకుఅవరోధం
విజయనగరం రూరల్: భారత్ సైన్యంలో నాలుగు విభాగాల్లో ఎంపికల కోసం శుక్రవారం చేపట్టిన భారీ ర్యాలీకి వరుణుడు అడ్డంకిగా మారాడు. దేశ రక్షణ రంగంలో ప్రవేశించాలన్న యువత ఆశలపై వర్షం నీళ్లు చల్లింది. ఈ నెల 6 నుంచి 17వ తేదీ వరకు విజయనగరం రాజీవ్‌గాంధీ క్రీడా మైదానంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ప్రారంభమైన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి గురువారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో మైదానం చిత్తడి మారింది. రన్నింగ్ ట్రాక్ సరిగా లేకపోవడంతో అనివార్యంగా ఎంపికలను వాయిదా వేశారు. ఆర్మీ ర్యాలీకి ఆరు జిల్లాల నుంచి అభ్యర్థులు హాజరుకాగా శుక్రవారం వేకువజామునుండే పరుగుపందెం పోటీలు నిర్వహించారు. పోటీల ప్రారంభానికి ముందే పట్టణంలో భారీ వర్షం కురిసింది. ర్యాలీకి హాజరైన అభ్యర్థులు గురువారం రాత్రి ఎనిమిది గంటల నుంచి శుక్రవారం ఉదయం వరకు రాజీవ్‌క్రీడా మైదానం సమీపంలో వర్షంలోనే తడుస్తూ ఉన్నారు. బురదలోనే పరుగు వర్షం నీటితో 16 వందల మీటర్ల పరుగుపందెంలో 400 మీటర్ల రన్నింగ్‌ట్రాక్ చిత్తడిగా మారిపోయింది. శుక్రవారం వేకువజామున నిర్వహించిన పరుగుపందెం మొదటి విడత పోటీల్లో 300 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. రన్నింగ్‌ట్రాక్ చిత్తడిగా మారడంతో మొదటి విడతలో ఆరుగురు అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించారు. రెం డోసారి పరుగుపందెం నిర్వహించే సమయానికి భారీ వర్షం కురవడంతో రన్నింగ్‌ట్రాక్ మొత్తం బురదగా మా రిపోయింది. దీంతో 300 మంది అభ్యర్థులు పరుగుపెట్టడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిర్దేశించిన సమయానికి అభ్యర్థులు ఎవరూ పరుగు పూర్తి చేయకపోవడంతో ఒక్కరూ అర్హత సాధించలేదు. మూడో విడత ప రుగు పందెం నిర్వహించిన సమయానికి వర్షం ఏకధారగా కురవడంతో వర్షం, బురదలోనే అభ్యర్థులు పరుగుపందెంలో పాల్గొన్నారు. దీంతో ఒకే ఒక్కడు అర్హత సాధించారు. పరిశీలించిన జేసీ–2 రాజీవ్ క్రీడా మైదానంలో నిర్వహించిన ఆర్మీ ర్యాలీని శుక్రవారం ఉదయం ఆరుగంటలకు జేసీ–2 నాగేశ్వరరావు పరిశీలించారు. అభ్యర్థులు బురద, వర్షం నీటిలో పరిగెత్తడానికి పడుతున్న అవస్థలను ఆయన స్వయంగా పరిశీలించారు. అభ్యర్థుల అవస్థలపై ఆర్మీ అధికారులు, జేసీ–2 నాగేశ్వరరావు చర్చించి ఉన్నతాధికారులకు విషయాన్ని చేరవేశారు. వెంటనే వారు వాయిదాకు అనుమతినివ్వడంతో ర్యాలీని తొలుత రెండు నెలలపాటు వా యిదా వేస్తున్నట్లు ఆర్మీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (రిక్రూట్మెంట్) వై.ఎస్.శంకియాన్, జేసీ–2 నాగేశ్వరరావు మీడియాకు తెలిపారు. కానీ రన్నింగ్ ట్రాక్‌కు సాయంత్రానికి మరమ్మతులు చేపట్టారు. వెంటనే జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ కలుగజేసుకుని శనివారం మ రోసారి ట్రాక్ పరిశీలించిన తరువాత ఎప్పుడు ఎంపికలు నిర్వహించేదీ ప్రకటిస్తామని, పరిస్థితులు అనుకూలి స్తే యధావిథిగా ఎంపికలు కొనసాగిస్తామని వెల్లడించారు. నిరుత్సాహంగా అభ్యర్థులు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ వాయిదా పడటంతో దూర ప్రాంతాలనుంచి రెండురోజుల క్రితం వచ్చి రాత్రంతా వేచిఉన్న అభ్యర్థులు నిరుత్సాహపడ్డారు. ఎన్నో రోజులపాటు సాధన చేసి ఆఖరి సమయం వచ్చే సరికి వాయిదా పడిందనడంతో ఆవేదన చెందారు. బురదమట్టితోనే అవస్థలు రాజీవ్ క్రీడా మైదానం ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సిద్ధం చేయడానికి రన్నింగ్ ట్రాక్‌ను ఎర్రమట్టి, గ్రావెల్ పౌడర్‌తో కప్పి చదును చేశారు. వారం రోజులుగా మైదానం సిద్ధం చేసినా ఆఖరి రెండు రోజుల్లో రన్నింగ్ ట్రాక్ చదును చేసే సమయంలో వర్షం కురవడంతో ట్రాక్ చదును కొంత అసంపూర్తిగా ఉండిపోయిందని అధికారులే తెలిపారు. దీంతో భారీ వర్షంతో ఎర్రమట్టి బురదగా మారిపోవడంతో అభ్యర్థులు పరిగెత్తడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కడ జారిపడి గాయాలపాలవుతామోనని అనేకమంది నాలుగు రౌండ్ల పోటీలో ఒకటి, రెండ్లు పరిగెత్తి ఆగిపోయారు. బురద, వర్షం నీటిలో పరుగుపందెం నిర్వహించడంతో పరిగెత్తలేక అనేకమంది అభ్యర్థులు పరుగు మధ్యలోనే ఆపేయగా నలు గురు అభ్యర్థులు పరిగెత్తలేక సొమ్మసిల్లి పడిపోయారు. వీరికి వైద్యాధికారులు సేవలు అందించారు. క్రీడా మైదానంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి చేసిన ఏర్పాట్లు బాగున్నాయని ఆర్మీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (రిక్రూట్మెంట్) వైఎస్ శంకియాన్ అన్నారు. -
జోరువాన.. తడిసిముద్దయిన అభ్యర్థులు..!!
సాక్షి, విజయనగరం: భారీ వర్షాలు పడుతుండటంతో విజయనగరం జిల్లా కేంద్రంలో తలపెట్టిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ శుక్రవారం రద్దు అయింది. శుక్రవారం నుంచి రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం కావాల్సి ఉండగా.. జోరువాన కారణంగా రద్దు చేశారు. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ పాల్గొనేందుకు గురువారం అర్ధరాత్రి నుంచే అభ్యర్థులు క్యూలైన్లో బారులు తీరారు. అయితే, అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో అభ్యర్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తొలిరోజే నరకం అనుభవించారు. గురువారం అర్ధరాత్రి నుంచి క్యూలైన్లో నిల్చున్న అభ్యర్థులు భారీ వర్షంలో తడిసి ముద్దయ్యారు. రోజుకు ఐదువేల మంది చొప్పున సుమారు 55 వేల మంది అభ్యర్ధులు ఆర్మీ రిక్రూట్ మెంట్ కు హాజరు కానున్నారని అంచనా. పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతున్నా... కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని అభ్యర్ధులు ఆవేదన చెందారు. తమ సర్టిఫికేట్లు వానలో తడిసి పోతున్నా కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నామని వాపోయారు. భారీగా వర్షాలు.. విజయనగరంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విజయనగరం జిల్లా ఎస్ కోటలో కుండపోతగా వర్షం పడింది. దీంతో రోడ్లన్నీ కాలువలను తలపించాయి. ఇళ్లలోకి, షాపుల్లోకి వర్షం నీరు భారీగా చేరడంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ ఇంత భారీ వర్షాన్ని చూడలేదని స్థానికులు చెబుతున్నారు. -
అక్టోబర్ 6న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
అనంతపుర న్యూటౌన్: విజయనగరంలోని రాజీవ్‌గాంధీ స్పోర్ట్స్ స్టేడియంలో అక్టోబర్ 6 నుంచి 17 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగనుంది. ఇందులో పాల్గొనేందుకు అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వారు మాత్రమే అర్హులని జిల్లా యువజన శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి వెంకటేశం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు ఈనెల 20 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు www.joinindianarmy.nic.in వెబ్సైట్లో చూడవచ్చని తెలిపారు. అదేవిధంగా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న యువకులు తమ అర్హతను తెలిపే వివరాలను ‘ముఖ్య కార్యనిర్వహణాధికారి, యువజన సంక్షేమశాఖ, ఆన్సెట్, అనంతపురం’ చిరునామాలో ఈనెల 14లోపు అందించాలని కోరారు. దరఖాస్తుదారులకు 15వ తేదీ ఉదయం 9 గంటలకు ఆర్ట్స్ కళాశాలలో స్క్రీనింగ్టెస్ట్ నిర్వహించి అర్హత సాధించిన వారికి యువజన సర్వీసు శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణనందిస్తామన్నారు. -
ఒకటే లక్ష్యం.. ఒకటే గమనం
* కొనసాగుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ * గుంటూరు, చిత్తూరు జిల్లాల నుంచి 2800 మంది అభ్యర్థుల హాజరు గుంటూరు రూరల్ : స్థానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో నిర్వహిస్తోన్న ఆర్మీ రిక్రూట్ మెంట్ ఎంపికలు మంగళవారమూ కొనసాగాయి. గుంటూరు, చిత్తూరు జిల్లాల నుంచి 2800 మందికిపైగా అభ్యర్థులు ఎంపికల్లో పోటీపడ్డారు. తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైన ఎంపికల్లో అభ్యర్థులను 200 మంది చొప్పున గ్రౌండ్లోకి అనుమతించారు. ఒక్కో బ్యాచ్‌కు 300 మంది చొప్పున పరుగు పోటీ నిర్వహించారు. మొత్తం ఈవెంట్స్ పూర్తి చేసుకున్న 358 మంది మెడికల్ పరీక్షలకు ఎంపికయ్యారు. సోమవారం జరిగిన ఎంపికల్లో 245 మంది అభ్యర్థులు మెడికల్‌కు హాజరుకాగా వారిలో 89 మంది రాత పరీక్షకు అర్హత సాధించినట్లు గుంటూరు రిక్రూట్మెంట్ ఆఫీసర్ కల్నల్ ధృవ్‌చౌదరి తెలిపారు. బుధవారం కర్నూలు జిల్లా అభ్యర్థులకు జనరల్ డ్యూటీ ఎంపికలు జరుగనున్నట్లు వెల్లడించారు. -
ప్రారంభమైన ఆర్మీ ర్యాలీ
తొలిరోజు హాజరైన 3,100 మంది యువత కొత్తగూడెం: తెలంగాణ పది జిల్లాల స్థాయి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో గురువారం ప్రారంభమైంది. ముందురోజు రాత్రే పలువురు అభ్యర్థులు ర్యాలీ నిర్వహించే ప్రాంతాలకు చేరుకోగా, వేకువజామున 3 గంటలకు ఆర్మీ ర్యాలీ ప్రక్రియను ఆర్మీ అధికారులు ప్రారంభించారు. పరుగుపందెంను కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు జెండా ఊపి ప్రారంభిం చారు. తొలిరోజు సోల్జర్ టెక్నికల్ విభాగంలో అభ్యర్థులకు శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఐదు కేటగిరీల్లోని 780 పోస్టులకుగాను మొత్తం 4,359 మంది అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోగా 3,100 మంది హాజరయ్యారు. ఎత్తు, ఛాతీ కొలతలు సరిపోక 200 మందిని తిరస్కరించారు. ఎంపికైన అభ్యర్థులకు పుల్ అప్స్, బ్యాలెన్సింగ్ బీమ్, లాంగ్‌జంప్ పోటీలు నిర్వహిం చారు. అన్ని పోటీల్లో ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహిం చనున్నారు. ర్యాలీకి హాజరైన అభ్యర్థులకు అధికారులు ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. అన్ని విభాగాల్లో ఎంపికైన వారికి ఫిబ్రవరి 28, మార్చి 1 తేదీల్లో రెండు బ్యాచ్‌లకు రాతపరీక్షలు నిర్వహిస్తామని, ఏప్రిల్ మొదటి తేదీ నుంచి శిక్షణకు పంపిస్తామని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ డెరైక్టర్ బ్రిగేడియర్ సంగ్రామ్ దాల్వి చెప్పారు. ఆర్మీ ర్యాలీ ప్రక్రియను సంగ్రామ్ దాల్వితోపాటు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ సికింద్రాబాద్ కల్నల్ ఎ.కె.రోహిల్లా పర్యవేక్షించారు. నేడు సోల్జర్ క్లర్క్, నర్సింగ్ అసిస్టెంట్ ఎంపిక రిక్రూట్మెంట్ ర్యాలీలో శుక్రవారం సోల్జర్ క్లర్క్, నర్సింగ్ అసిస్టెంట్ విభాగాల్లో ఎంపికలు జరగనున్నాయి. ఈ రెండు విభాగాలకు సంబంధించి 5,596 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వేకువ జామున అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనతో ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో భాగంగా శుక్రవారం నిర్వహించనున్న సోల్జర్ క్లర్క్, నర్స్ అసిస్టెంట్ పోస్టుల ఎంపిక కోసం అభ్యర్థులు గురువారం సాయంత్రం 4 గంటల నుంచే క్యూ కట్టారు. -
కొత్తగూడెంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం
ఖమ్మం జిల్లా కొత్తడూడెంలోని సింగరేణి ప్రకాశం స్టేడియం మైదానంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభమైంది. సైన్యంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ ర్యాలీలో రాష్ట్రంలోని 10 జిల్లాలకు చెందిన నిరుద్యోగులు పాల్గొంటున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచి నిరుద్యోగులు ప్రకాశం స్టేడియం వద్ద బారులు తీరారు. గురువారం తెల్లవారుజాము నుంచి అభ్యర్థులను స్టేడియంలోకి అనుమతించి శరీర దారుఢ్య పరిక్షలు నిర్వహిస్తున్నారు. -
వచ్చేనెల 4నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ర్యాలీ
నిజామాబాద్‌నాగారం : నిరుద్యోగ యువత కోసం ఆసక్తి ఉన్న వారికి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు స్టెప్ ఇన్చార్జి సీఈవో ముత్తెన్న ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ర్యాలీ ఫిబ్రవరి4నుంచి 13వరకు ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఉంటుందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 19లోగా www.joinindianarmy.nic.in నందు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న వారికి అదే వెబ్సైట్లో అడ్మిట్‌కార్డు వస్తుందన్నారు. -
తిరుపతిలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
-
దేశ సేవకు ముందుండాలి
మంత్రి జోగు రామన్న పిలుపు ⇒ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం ⇒ 3012 మంది అభ్యర్థులు హాజరు ⇒ మెడికల్ టెస్ట్‌కు 615 మంది అర్హత ⇒ రెండో రోజూ ధ్రువీకరణ పత్రాల పరిశీలన ⇒ అర్హత-1656 , రిజక్ట్ 894 మంది ఆదిలాబాద్ స్పోర్ట్స్ : సైన్యంలో చేరి దేశానికి సేవ చేయడంలో యువత ముందుండాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. జాతీయ జెండా ఆవిష్కరించారు. జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ కోసం వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను ఎంచుకోవడం హర్షించదగిన విషయమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ర్ట ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. కలెక్టర్ ఎం.జగన్మోహన్ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న యువతకు ఆర్మీలో భారత సరిహద్దు ప్రాంతాల్లో దేశ రక్షణ అవకాశం కల్పించినందుకు ఆర్మీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. 5 జిల్లాలకు చెందిన యువత పాల్గొంటోందని, 18 శాఖల పర్యవేక్షణతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని వివరించారు. చెన్నై జోన్ డెప్యూటీ డెరైక్టర్ జనరల్ సంగ్రామ దార్వీ, సైనిక ఉన్నతాధికారి కల్నల్ ఎ.కే.రోహిలా, ఏఎస్పీ పనసారెడ్డి, ఏజేసీ ఎస్.ఎస్.రాజు, డీఎస్డీవో సుధాకర్‌రావు, మెప్మా పీడీ రాజేశ్వర్, రెవెన్యూ అధికారి వనజారెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మెడికల్ టెస్ట్‌కు 615 మంది అర్హత ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో సోమవారం అర్హత సాధించిన జిల్లా యువకులు 3,012 మంది రన్నింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో యువకులు చాలామంది అలసిపోయి, మధ్యలోనే ఆగి పడిపోయారు. 3012 మందిలో నుంచి 615 మంది మెడికల్ పరీక్షలకు అర్హత సాధించారు. వీరికి బుధవారం ఉదయం 6 గంటలకు ఆర్మీకి చెందిన పది మంది బృందంతో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా, మంగళవారం జిల్లాకు చెందిన 2,550 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎత్తు లేని వారిని 228 మందిని రిజక్ట్ చేశారు. ధ్రువీకరణ పత్రాలు సక్రమంగా లేని వారిని 666 మందిని వెనక్కి పంపించారు. 1,656 మంది పరుగుకు అర్హత సాధించారు. వీరు బుధవారం ఉదయం 5 గంటలకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో రిపోర్ట్ చేయాలని ఆర్మీ అధికారులు కోరారు. ఆర్మీ సైనిక ఉన్నతాధికారి కల్నల్ ఏకె.రోహిలా యువతకు పలు సూచనలందించారు. సోమవారం రాత్రి గాలివాన బీభత్సంగా ఉన్నా అధికారులు, యువకులు ఉత్సాహంగా ముందుకుసాగి ర్యాలీని విజయవంతం చేశారని చెప్పారు. -
జమ్మూ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో గందరగోళం
జమ్మూజ: మ్మూలో సోమవారం జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో గందరగోళం నెలకొంది. ర్యాలీలో పాల్గొనేందుకు ఊహించనంత పెద్దసంఖ్యలో యువకులు రావడంతో తోపులాట జరిగింది. వారిని అదుపు చేసేందుకు పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక దశలో లాఠీలు కూడా ఝుళిపించారు. దొరికనవారిని దొరికినట్టు లాగిపడేశారు. పలువురు గాయపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. -
24న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 24వ తేదీన హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్టిలరీ సెంటర్లో సైనిక నియామక ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆర్మీ పీఆర్వో మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోల్జర్స్ స్పోర్ట్స్‌మన్, సోల్జర్ మ్యూజీషియన్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు నేరుగా ఈ నియామక ప్రక్రియలోని పరీక్షలకు హాజరుకావచ్చని పేర్కొన్నారు. స్పోర్ట్స్‌మన్ కేటగిరీ కోసం అభ్యర్థులు 23 జనవరి 1994 - 23 జూలై 1997 మధ్య జన్మించి ఉండాలని, మ్యూజీషియన్ పోస్టుల కోసం 23 జనవరి 1992- 23 జూలై 1997 మధ్య జన్మించినవారు అర్హులని తెలిపారు. కనీసం 45 శాతం మార్కులతో పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. మాజీ సైనికుద్యోగుల పిల్లలు కూడా అర్హులేనని, వీరికి ఈ నెల 19 నుంచి 29 వరకు ఉద్యోగ నియామకాలు జరుగుతాయని తెలిపారు. -
ఫిబ్రవరిలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
కలెక్టర్ ఇలంబరితి ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 నుంచి 12వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఉంటుందని, ఇందుకు సహకరించాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ కె. ఇలంబరితి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞాసమావేశమందిరంలో సమావేశంలో మా ట్లాడారు. గతంలో కొత్తగూడెంలో నిర్వహించిన ఆర్మీ ఎంపికలు విజయవంతమయ్యాయని, అదే విధంగా ర్యాలీకి యువకులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యేలా చూడాలని సూచించారు. జనరల్ డ్యూటీ సోల్జర్స్, టెక్నికల్ సోల్జర్స్, క్లర్క్ సోల్జర్స్, నర్సింగ్ అసిస్టెంట్ సోల్జర్స్, ట్రేడ్స్మెన్సోల్జర్స్ల ఎంపికలు ఉంటాయని తెలి పారు. ఎంపికైన వారికి సికింద్రాబాద్‌లో ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని, విద్యాశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు డాక్యూమెంట్ల పరిశీలన చేస్తారన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు వారికి కేటాయించిన విధులు నిర్వహించి న ఆర్మీ రిక్రూట్ మెంట్‌ను విజయవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్మీ రిక్రూట్ మెంట్ డెరైక్టర్ కల్నల్ అనిల్ కుమార్ రోహిల్లా, అదనపు సంయుక్త కలెక్టర్ బాబూరావు, జిల్లా పరిషత్ సీఈఓ జయప్రకాశ్ నారాయణ, డ్వామా, డీఆర్డీఏ పీడీలు జగత్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ నాయక్‌లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బి. భానుప్రకాశ్ పాల్గొన్నారు. -
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం
* 7 జిల్లాల నుంచి 6 వేలమందికి పైగా పాల్గొన్న అభ్యర్థులు * ఎత్తు ప్రాతిపదికన 3597 మంది ఎంపిక * ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం పరుగు, లాంగ్ జంప్ పోటీలు విద్యానగర్(గుంటూరు) :నగరంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో గురువారం ఏడు జిల్లాలకు సంబంధించి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభమైంది. ఈనెల 20 వతేదీవరకు వివిధ విభాగాల్లో అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం కొనసాగుతుంది. మొదటిరోజు గుంటూరు, అనంతపూర్, కడప, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలకు చెందిన అభ్యర్థులు 6 వేల మందికి పైగా ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఎంపిక కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు పటిష్ట బందోబస్తు మధ్య జరిగింది. ముందుగా అభ్యర్థులను 400 మంది చొప్పున మైదానంలోకి అనుమతించారు. అనంతరం వారిని క్యూ పద్ధతిలో ఎత్తు ప్రాతిపదికన సర్టిఫికెట్ల పరిశీలనకు పంపారు. కనీస ఎత్తు 166 సెంటీమీటర్లుగా నిర్ణయించడంతో వచ్చిన అభ్యర్థుల్లో 3597 మంది మాత్రమే సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికయ్యారు. వారిని ఏ జిల్లాకు ఆ జిల్లా వారీగా టెంట్లను ఏర్పాటుచేసి విద్యాశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు, ఆర్మీ సిబ్బంది సహకారంతో సర్టిఫికెట్ల పరిశీలన చేశారు. ప్రధానంగా నివాస ధ్రువీకరణ పత్రాలు, ఐడీ ప్రూఫ్, కాండక్ట్ సర్టిఫికెట్లు పరిశీలించారు. తదనంతరం అభ్యర్థులకు తాము ప్రకటించిన పర్సంటేజ్ మార్కుల జాబితాలో ఉందా, లేదా అని ఆర్మీ అధికారులు పరిశీలించి అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారు. సర్టిఫికెట్ల ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి రన్నింగ్, లాంగ్‌జంప్ తదితర పోటీలు నిర్వహిస్తామని రిక్రూటింగ్ డెరైక్టర్ కల్నల్ ఆఫ్సర్ అబ్బాస్ జాఫ్రి తెలిపారు. నిర్ణీత ఎత్తు కంటే తక్కువ ఎత్తుగల అభ్యర్థులను ఎంపిక ప్రక్రియ నుంచి తొలగించి వారి చేతికి రంగు రాసి వెనక్కి పంపారు. తక్కువ ఎత్తు ఉండి గురువారం ఎంపిక కాని అభ్యర్థులు తక్కువ ఎత్తు ఉన్న ట్రేడ్ల ఎంపిక రోజున తిరిగి పాల్గొనవచ్చని చెప్పారు.శుక్రవారం జరుగనున్న పరుగు పందెంలో 1.6 కిలో మీటర్ల దూరాన్ని 6 నిమిషాల 20 సెకన్లలో పూర్తి చేయాలని తెలిపారు. 9 అడుగుల లాంగ్ జంప్, పుష్ అప్స్ తదితర ఈవెంట్స్ కూడా నిర్వహిస్తామన్నారు. వీటితో పాటు టెక్నికల్ విభాగానికి ఎంపిక జరుగుతుందని కల్నల్ తెలిపారు. విలువైన వస్తువులు వెంట తేవద్దు ఎంపిక ప్రక్రియలో పాల్గొనే అభ్యర్థుల కోసం మంచినీరు, తదితర వసతులను సంబంధిత శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఎంతోమంది తమ సెల్ఫోన్లు, విలువైన వస్తువులు, సర్టిఫికెట్లు పోగొట్టుకున్నామని స్థానిక పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీంతో కల్నల్ జాఫ్రి అభ్యర్థులు తమ విలువైన వస్తువులు తమ వెంట తీసుకురావద్దని, కేవలం సర్టిఫికెట్లను మాత్రమే జాగ్రత్తగా తీసుకుని రావాలని తెలిపారు. ఎంపికలో ఆర్మీ అభ్యర్థులకు సహకరించి విధులు నిర్వహించిన ఈస్ట్ డీఎస్పీ గంగాధరానికి, పోలీసు సిబ్బందికి కల్నల్ జాఫ్రి కృతజ్జతలు తెలిపారు. పోలీసుల అత్యుత్సాహం ఎంపిక ప్రక్రియలో పాల్గొనేందుకు ఇతర జిల్లాలనుంచి అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. వీరిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.ఎంపికలో పాల్గొనాలనే తపనతో అభ్యర్థులు తోసుకుంటుండడంతో పోలీసులు కర్రలు తీసుకుని దాడి చేసినంత పని చేశారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో దాదాపు 70 మంది పోలీసులు విధులు నిర్వహించారు. -
గుంటూరులో రేపటి నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
విద్యానగర్(గుంటూరు): గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఈనెల 9 నుంచి 20వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన యువకులు ఈ రిక్రూట్మెంట్లో పాల్గొనవచ్చు. సర్టిఫికెట్ల పరిశీలన, దేహదారుఢ్యం, శరీరకొలతలు, పోలీస్ వెరిఫికేషన్, వైద్య, రాత పరీక్షల విధానాల ద్వారా ఈ ఎంపిక చేస్తారు. సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్‌మెన్, సోల్జర్ క్లర్క్, స్టోర్‌కీపర్, టెక్నికల్ క్యాటగిరీల్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. 500 పోస్టుల భర్తీకి ఈ ర్యాలీ జరుగుతున్నట్లు రిక్రూటింగ్ డెరైక్టర్ కల్నల్ అఫ్సర్ జాఫ్రి తెలిపారు. ఏఏ విభాగాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి.. ఎలా సిద్ధపడాలి అనే విషయాలను ఇలా వివరించారు.. ఎంపికకు అవసరమైన సర్టిఫికెట్లు విద్యార్హత మార్కుల లిస్టులు, కుల ధ్రువీకరణ పత్రం, కాండక్ట్ సర్టిఫికెట్, నివాస ధ్రువీకరణ పత్రం, పుట్టినతేదీ సర్టిఫికెట్ తదితర సర్టిఫికెట్లు మండల తహశీల్దార్ సంతకంతో ఆఫీసు ముద్రతో ఉండాలి.అన్ని పత్రాలు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, 20 పాస్‌పోర్టుసైజు ఫొటోలు వెంట తీసుకురావాలి. అన్ని సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఇంగ్లిష్‌లో ఉండాలి. అభ్యర్థులు వసతి, ఆహారం సొంతంగానే ఏర్పాటు చేసుకోవాలి. మంచినీరు తప్పనిసరిగా తెచ్చుకోవాలి. సెల్ఫోన్లు అనుమతించరు.మాజీ సైనికుల కుమారులు, యుద్ధ వితంతువుల కుమారులు, యుద్ధంలో చనిపోయినవారి కుమారులు సంబంధిత రిలేషన్ సర్టిఫికెట్లను తీసుకురావాలి.21 సంవత్సరాలలోపు వివాహం జరిగిన అభ్యర్థులు ఎంపికకు అనర్హులు.శరీరంపై పచ్చబొట్లు ఉంటే అనర్హులు. అభ్యర్థులకు పరీక్షలు ఇలా.. 1.6 కిలోమీటర్ల పరుగుపందెం 6 నిమిషాల 20 సెకన్లలోపు పూర్తి చేయాలి. అదేవిధంగా 9 అడుగుల లాంగ్‌జంప్, పుష్అప్స్ కనీసం 6 తీయాలి. ఒక కడ్డీపై నిలబడి బ్యాలెన్స్‌గా చేతులు చాపి నడవాలి. సోల్జర్ జనరల్ డ్యూటీలో 1.6 కిమీ పరుగు పందేన్ని రెండు గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపులో 5 నిముషాల 20 సెకన్లలోపు, రెండవ గ్రూపు 6 నిముషాలలోపు పూర్తి చేయాలి. ఫిజికల్ టెస్ట్‌లో ఎంపికైనవారు అనంతరం మెడికల్, రాతపరీక్షకు హాజరవాలి. రాత పరీక్షలో సమాధానాల్లో ప్రతి తప్పునకు నాలుగవ వంతు మార్కు కట్ చేస్తారు. అభ్యర్థుల అర్హతలు సోల్జర్ టెక్నికల్ విభాగం: సైన్స్ సబ్జెక్టుతో కూడిన ఇంటర్ పాసై ఉండాలి సోల్జర్ టెక్నికల్ ఏవియేషన్: సెన్స్ సబ్జెక్టుతో కూడిన ఇంటర్. అదేవిధంగా 3 సంవత్సరాల డిప్లొమా సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ : ఇంటర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బ యాలజీలలో కనీసం 40 శాతం మార్కులతో పాసై ఉండాలి. (పై పోస్టులకు ఛాతీ 77 సెంటీ మీటర్లు కలిగి ఉండాలి. గాలి పీల్చినపుడు 5 సెంమీ వ్యాకోచం కలిగి ఉండాలి. బరువు 50 కేజీలకు పైగా, 165 సెంమీ ఎత్తు ఉండాలి. 17 సంవత్సరాల 6 నెలల నుంచి 23 సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలి) సోల్జర్ జనరల్ డ్యూటీ: 10వతరగతి ప్రతి సబ్జెక్టులో 33 శాతం మార్కులతో పాసై ఉండాలి. మొత్తం మార్కులలో 40 శాతం కలిగి ఉండాలి. ఎత్తు 166 సెంమీ ఎత్తు కలిగి ఉండాలి. {sేడ్మెన్: 8వ తరగతి పాసై ఉండాలి. పదవతరగతి పా సైన అభ్యర్థులకు ఇందులోనే ఉన్నత స్థానాలు కల్పిస్తారు. ఛాతీ 76 సెంటీమీటర్లు కలిగి ఉండాలి. గాలి పీల్చినపుడు 5 సెంమీ వ్యాకోచం కలిగి ఉండాలి. బరువు 48 కేజీలకు పైగా ఉండి 166 సెంమీ ఎత్తు కలిగి ఉండాలి సోల్జర్ క్లర్క్/స్టోర్ కీపర్: ఇంటర్ 40 శాతం మార్కులతో పాసై ఉండాలి. అభ్యర్థులు ఇంగ్లిష్, గణితం, అకౌంట్స్, బుక్కీపింగ్ తదితర సబ్జెక్టులలో తప్పనిసరిగా 40శాతం మార్కులు కలిగి ఉండాలి. ఛాతీ 77 సెంటీమీటర్లు ఉండాలి. గాలి పీల్చినపుడు 5 సెంమీ వ్యాకోచం కలిగి ఉండాలి. బరువు 50 కేజీలకు పైగా ఉండి 162 సెంమీ ఎత్తు తప్పనిసరిగా ఉండాలి.