assassition
-
షింజో అబే మృతి.. అమెరికా అధ్యక్షుడి ప్రగాఢ సంతాపం, భావోద్వేగ నోట్
వాషింగ్టన్: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యకు గురయ్యారు. వేదికపై ప్రసంగిస్తుండగా దుండగుడు కాల్పులకు జరపడంతో తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. ఈ క్రమంలో జపాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించి అబేకు సంతాపం తెలిపారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఈ విషాద సంఘటనపై తన సానుభూతిని వ్యక్తం చేస్తూ.. జపాన్ అంబాసిడర్ కోజి టొమితాకు భావోద్వేగ నోట్‌ను అందజేశారు. షింజో అబే అంటే శాంతి, తీర్పు అంటూ అందులో రాసుకొచ్చారు బైడెన్. 'షింజో అబే కుటుంబం, జపాన్ ప్రజలకు బైడన్ కుటుంబం, అమెరికా ప్రజల తరుపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. గతంలో ఉపాధ్యక్షుడి నివాసంలో ఆథిత్యమిచ్చినప్పుడు, జపాన్ పర్యటనలో ఆయనను కలుసుకోవటం నాకు గర్వకారణం. షింజో మరణం ఆయన భార్య, కుటుంబం, జపాన్ ప్రజలకు మాత్రమే లోటు కాదు.. యావత్ ప్రపంచానికి తీరని లోటు. శాంతి, సామరస్యానికి అబే ప్రతిరూపం.' అని పేర్కొన్నారు జో బైడెన్. అంతకు ముందు.. దుండగుడి కాల్పుల్లో షింజో అబే మరణించారన్న వార్త తెలుసుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అధ్యక్షుడు బైడెన్. ఇది జపాన్ తోపాటు ఆయన గురించి తెలిసిన వారందరికీ ఓ విషాద సంఘటన అని పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత ఇండోపసిఫిక్ కోసం ఆయన విజన్ కొనసాగుతుందన్నారు. ఆయన జీవితాన్ని జపాన్ ప్రజలకు సేవ చేసేందుకే అంకితం చేశారని గుర్తు చేసుకున్నారు. -
15 ఏళ్ల క్రితం వివాహం.. భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని
సాక్షి, మంత్రాలయం రూరల్(కర్నూల్): అనుమానం పెనుభూతంగా మారి భార్యను ఓ భర్త హతమార్చాడు. ఈ ఘటన మాధవరం తండా గ్రామంలో వెలుగు చూసింది. స్థానికులు, మాధవరం పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన గోవిందనాయక్ వంట మాస్టారుగా పనిచేస్తున్నాడు. ఈయనకు విజయాబాయితో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. అయితే ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానం పెంచుకున్నాడు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత విజయాబాయిని(35) గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అనుమానం రాకుండా ఉండేందుకు ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, గోవిందునాయక్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. చదవండి: టీడీపీ కార్యకర్తల వీరంగం.. పెట్రోల్ బంక్‌పై దాడి -
టీడీపీ వర్గీయుల మరో వికృతక్రీడ.. ఒడిశా బాలికపై అత్యాచారం, హత్య?
సాక్షి, ఆత్మకూరు (నెల్లూరు): టీడీపీ వర్గీయుల వికృత క్రీడకు మరో బాలిక బలైపోయింది. విజయవాడలో ఓ టీడీపీ నాయకుడి దాష్టీకానికి ఆత్మహత్యకు పాల్పడిన బాలిక ఉదంతం మరువక మునుపే జిల్లాలోని చేజర్ల మండలం పుట్టుపల్లి పంచాయతీ కొట్టాలు గ్రామంలో స్థానిక టీడీపీ నాయకుడికి చెందిన ఇటుక బట్టీలో ఈ దారుణ ఘటన జరిగింది. ఇటుక బట్టీల వద్ద పనిచేయడానికి వచ్చిన ఓ కుటుంబంలోని బాలిక (17) అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై స్థానికంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక మృతి సమాచారం బయటకు పొక్కకుండా గుట్టుచప్పుడు కాకుండా శవదహనం చేయడం స్థానికంగా వ్యక్తమవుతున్న అనుమానాలకు బలం చేకూరుతోంది. సేకరించిన విశ్వసనీయ సమాచారం మేరకు.. కొట్టాలు గ్రామంలో స్థానిక మాజీ సర్పంచ్, టీడీపీ నేత ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారు. ఒడిశాకు చెందిన పలువురు కూలీలు కొన్ని నెలలుగా ఇక్కడ పని చేస్తున్నారు. అయితే మృతి చెందిన బాలిక ఇక్కడ మేనమామ, బాబాయిలతో కలిసి ఉంటుంది. తల్లిదండ్రులు సికింద్రాబాద్‌లో ఉంటూ అక్కడి ఇటుక బట్టీల వద్ద పనిచేస్తున్నారు. క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఓ బాలిక (17) అనారోగ్యానికి గురైందంటూ తొలుత ఆత్మకూరు, అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఇటుక బట్టీల నిర్వాహకుడు వైద్యం చేయించాడు. అయితే శుక్రవారం రాత్రి ఆ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మెడికో లీగల్ కేసు (ఎంఎల్సీ) అయినప్పటికీ ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఆ టీడీపీ నేత జాగ్రత్త పడినట్లు సమాచారం. ఫిర్యాదు చేస్తే పోస్టుమార్టం రిపోర్టులో అసలు విషయాలు బట్టబయలు అవుతాయనే ఉద్దేశంతో బాలిక బంధువులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. బాధితుల సంప్రదాయాలకు భిన్నంగా నెల్లూరు బోడిగాడితోటలో శనివారం బాలిక మృతదేహానికి దహన సంస్కారాలు చేయించారు. ఆనవాళ్లు లేకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకోవడంలో సదరు టీడీపీ నేత సఫలీకృతుడయ్యారని స్థానికులు చెబుతున్నారు. అసలు ఏం జరిగింది.. బాలిక అందంగా ఉంటుంది. దీంతో అక్కడే పని చేసే స్థానిక యవకులు బాలికపై కన్నేసినట్లు సమాచారం. బాలికపై లైంగికదాడికి పలుమార్లు విఫలయత్నం చేశారు. బుధవారం రాత్రి కొందరు బాలికపై అఘాయిత్యానికి పాల్పడడంతో ప్రతిఘటనలో గాయపడినట్లు గ్రామంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బాలిక గాయపడి, చనిపోయేంత వరకూ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. శనివారం సాయంత్రం తల్లిదండ్రులు సికింద్రాబాద్ నుంచి నెల్లూరుకు చేరుకున్నారు. ఆ తర్వాత హడావుడిగా వారి సంప్రదాయాలకు భిన్నంగా దహనక్రియలు చేయడం అనుమానాలకు బలం చేకూర్చుతోంది. ఆదివారం బాలిక తండ్రికి ఇటుక బట్టీ యజమాని రూ.30 వేలు నగదు ఇచ్చినట్లు సమాచారం. బాలిక మృతిపై ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు వెళ్లడంతో ఆదివారం గ్రామానికి చేరుకుని మొక్కుబడిగా విచారణ జరిపారు. బాలికకు ఫిట్స్‌తో మృతి చెందిందని జిల్లా లేబర్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు ప్రకటించారు. పోలీస్ కేసు కూడా లేదు.. బాలిక గాయపడితే పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. వాస్తవానికి ఇది మెడికో లీగల్ కేసు. పోలీసులు ఈ వ్యవహారంపై అనుమానాస్పద మృతిగా తొలుత కేసు నమోదు చేయాల్సి ఉంది. పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉన్నా ఈ ప్రక్రియలు జరగలేదు. బాధితులు ఒడిశా వాసులు కావడంతో వారి తరఫున పట్టించుకునే నాథుడు లేకపోవడంతో సదరు టీడీపీ నేత అందరి నోర్లను నోట్లతో నొక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై ప్రచారం జరగడం ఐసీడీఎస్, కార్మికశాఖ, పోలీసులు బాధితులు నివాసం ఉండే ప్రాంతానికి చేరుకుని విచారణ చేపట్టి చేతులు దులుపుకున్నారు. బాధితులు ఒడిశా వాసులు కావడంతో వారిని భయపెట్టి ఎలాంటి విషయాలు బయటకు పొక్కకుండా సదరు టీడీపీ నేత జాగ్రత్త పడినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. బాలిక తండ్రి లోచన్ మాంజీని మీడియా ప్రతినిధులు అడిగితే.. తన కుమార్తె అనారోగ్యంతో చనిపోయిందంటూ సమాధానం ఇచ్చారు. ఈ విషయమై లోతుగా విచారణ జరిపితే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. -
రాహుల్ హత్య కేసులో కొత్త కోణం, ఇద్దరు మహిళల ప్రమేయం?
సాక్షి,విజయవాడ: విజయవాడలో సంచలనం సృష్టించిన యువ వ్యాపారి కరణం రాహుల్ హత్య కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. ఈ హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా కోరాడ విజయ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఈ హత్యతో మరో ఇద్దరు మహిళలకు కూడా సంబంధం ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మహిళల ఇంటి సమీపంలోనే రాహుల్ హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో ఒకసారి ఆ మహిళల తోపాటు కోరాడ విజయ్ కుమార్ ఒంగోలు లోని రాహుల్ ఇంటికి వెళ్ళినట్లు విచారణ లో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఆర్ధిక అంశాలపై పలుమార్లు ఆ మహిళల సమక్షంలోనే పంచాయతీలు జరిగినట్లు పోలీసులు నిర్దారించారు. మరో వైపు రాహుల్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని బంధువులకు వైద్యులు అప్పగించారు. రాహుల్ మృతదేహం స్వస్థలం ఒంగోలుకు పోలీసులు తరలించారు. చదవండి:పరిటాల సునీత కుమారుడి బ్యాగ్‌లో బుల్లెట్ -
నవ్యా రెడ్డి హత్య: వెనీలా ఆత్మహత్య
సాక్షి, ఖమ్మం: జిల్లాలో వివాహిత నవ్యా రెడ్డి హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే మరో యువతి ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఎర్రుపాలెం మండలం పగిళ్ల పాడుకు చెందిన వెనీలా అనే యువతి శుక్రవారం పగిళ్లపాడు-తొండలగోపవరం గ్రామాల మధ్యలో రైలు కింద పడి ఆత్యహత్య చేసుకుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మరణించిన వెనీలా.. నవ్యా రెడ్డి భర్త నాగశేషు రెడ్డికి బంధువేకాక ఇద్దరు ఒకే ఊరికి చెందిన వారు కావడం గమనార్హం. నవ్య హత్య గురించి దర్యాప్తు కొనసాగుతుండగానే వెనీలా ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. జ్యూస్‌లో నిద్రమాత్రలు కలిపి నవ్యా రెడ్డి హత్య భార్యను హత్య చేసిన నాగశేషు రెడ్డి.. ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారు సీసీ కెమరాలను పరిశీలించారు. దాంట్లో భార్యాభర్తలిద్దరు ఈ నెల 2న బైక్‌పై వెళ్లడం రికార్డయ్యింది. అనుమానం వచ్చిన పోలీసులు నాగశేషురెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే భార్యను చంపినట్లు అంగీకరించాడు. ఈ నెల 2న నవ్యకు జ్యూస్‌లో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చి.. కుక్కల గుంటలోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లానని తెలిపాడు. ఇక అప్పటికే స్పృహ కోల్పోయిన నవ్యను ఆమె చున్నీకే ఉరి వేశానని వెల్లడించాడు. ఆ తర్వాత నవ్య మొబైల్ నుంచి ఆమె తండ్రికి బీటెక్‌లో బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని మెసేజ్ పంపినట్లు వెల్లడించాడు. ఇక దర్యాప్తులో నాగశేషుకు వేరే యువతీతో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు వెల్లడయ్యింది. ఈ క్రమంలో వెనీలా ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చదవండి: దారుణ హత్య.. సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు..! -
16 హత్యలు: సీరియల్ కిల్లర్ అరెస్ట్..
సాక్షి, హైదరాబాద్: ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకొని హతమారుస్తున్న సీరియల్ కిల్లర్ రాములును రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సైకో కిల్లర్ 16 హత్యలు చేసినట్లు పోలీసులు నిర్థారించారు. 2011లో ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి నుంచి పరారైన రాములు స్వగ్రామం సంగారెడ్డి జిల్లా కంది మండలం అరుట్ల కాగా, గతంలో రాములపై పలు పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. జైలు నుంచి పారిపోయి మళ్లీ హత్యలు చేస్తున్న సైకో కిల్లర్‌ను రాచకొండ పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో పట్టుకున్నారు. నిందితుడిపై 16 హత్యలు, నాలుగు దోపిడీ, ఒక పోలీస్ కస్టడీ నుండి తప్పించుకున్న కేసులు ఉన్నాయి. చదవండి: ఈ దొంగ బాగా రిచ్, ఓ విల్లా.. 4 హైఎండ్ కార్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వివరాలను మంగళవారం మీడియాకు వెల్లడించారు. ‘‘చిన్న వయసులో పెళ్లి చేసుకున్న రాములు.. తన భార్య విడిపోవడంతో అప్పటి నుండి మహిళలపై కక్ష పెంచుకున్నాడు. మానసికంగా దెబ్బ తిన్న రాములు.. అప్పటి నుండి హత్యలకు పాల్పడుతున్నాడు. మొదట ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళను హత్య చేశాడు. అతని చేతిలో హత్యకు గురైన వారందరు కూడా మహిళలే. మెదక్ జిల్లా తూప్రాన్, సంగారెడ్డి, నరసాపూర్, బోయినపల్లిలో ఇద్దరిని, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 11 మంది మహిళలను హత్య చేశాడు. చదవండి: కిడ్నాప్ కలకలం.. ఆడ వేషంలో వచ్చి మరీ.. నార్సింగ్ మహిళ హత్య కేసులో అతనికి జీవిత కాలం శిక్ష పడింది. అతని మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి పోలీసులు తరలించగా, 2011లో అక్కడ నుంచి రాములు తప్పించుకున్నాడు. ఆ తర్వాత కూడా తీరు మార్చుకోని రాములు.. ఐదు దోపిడీలకు పాల్పడ్డాడు. 2013 లో అతనిని బోయినపల్లి పోలీసులు అరెస్ట్ చేయగా, 2018 లో జైలు నుండి విడుదలయ్యాడు. జైలు నుండి విడుదలై వచ్చిన తరువాత వరుసగా రెండు హత్యలకు రాములు పాల్పడ్డాడని’’ సీపీ వెల్లడించారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
చిల్లకూరు(నెల్లూరు జిల్లా): కలవకొండకు చెందిన దివ్యాంగుడైన చేజర్ల సుబ్రహ్మణ్యం హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే భార్య ప్రియుడు మరో ముగ్గురితో కలిసి హత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. శనివారం చిల్లకూరు పోలీస్ స్టేషన్లో హత్య కేసు వివరాలను డీఎస్పీ విలేకరులకు వెల్లడించారు. కలవకొండకు చెందిన చేజర్ల సుబ్రహ్మణ్యం (38) దివ్యాంగుడు. ఇంటి వద్ద టైర్లకు పంక్చర్లు వేస్తూ జీవనం సాగించేవాడు. అతని భార్యకు సిలికా మైన్‌లో పని చేసే క్రమంలో ఉడతావారిపాళేనికి చెందిన ఈతముక్కల కాటయ్యతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో సుబ్రహ్మణ్యాన్ని అడ్డు తప్పించేందుకు కాటయ్య గతంలో తనకు పరిచయం ఉన్న గూడూరుకు చెందిన అత్తిప ట్టు బాలాజీని సంప్రదించాడు. అతను తన వల్ల కాదని గూడూరుకు చెందిన ఓ మైనర్‌కు విషయం తెలియజేశాడు. సదరు యువకుడు సూళ్లూరుపేటలోని హోలీక్రాస్ ప్రాంతంలో మెకానిక్‌గా పనిచేస్తు న్న మరో మైనర్‌కు సమాచారం ఇచ్చాడు. సెపె్టంబరు 26న ముగ్గురు కలిసి హత్యకు పథకం పన్నారు. కాటయ్యతో రూ.40 వేలకు ఒప్పందం చేసుకున్నారు. 27న అర్ధరాత్రి కలవకొండకు నలుగురు చేరుకుని పూటుగా మద్యం సేవించారు. అనంతరం సుబ్రహ్మణ్యం ఇంటికి మెకానిక్ వెళ్లాడు. రాయితో తలుపును కొట్టి తిరిగి వచ్చి సమీపంలోని బస్‌షెల్టర్‌లో తలదాచుకున్నాడు. సుబ్రహ్మణ్యం బయటకు వచ్చి చూడగా ఎవ్వరూ కనిపించలేదు. అప్పటికే వేకువజాము కావడంతో కుటుంబ సభ్యులకు చెప్పి బహిర్భూమికి బయలుదేరాడు. ఇదే అదునుగా మెకానిక్ కత్తితో సుబ్రహ్మణ్యంపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం నలుగురు కలిసి పరారయ్యా రు. తన బాబాయి సుబ్రహ్మణ్యాన్ని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం గూడూరు ఎస్ఆర్ఏ టాకీస్ సమీపంలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. రెండు సెల్ఫోన్లు, రెండు కత్తులను స్వా«దీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుల్లో కాట య్య, బాలాజీను గూడూరు కోర్టుకు , మైనర్లను నెల్లూరులో ని బాల నేరస్తుల కోర్టుకు హాజరుపరుస్తామని తెలిపారు. కేసును వేగవంతగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్న గూడూరు రూరల్, వాకాడు సీఐలు శ్రీనివాసులరెడ్డి, కే నరసింహారావు,ఎస్సై బ్రహ్మనాయుడు, ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు రాజు, ఆదినారాయణను డీఎస్పీ అభినందించారు. -
దారుణం: లారీతో తొక్కి చంపేశాడు..
బొబ్బిలి/బొబ్బిలి రూరల్(కృష్ణా జిల్లా): బొబ్బిలి మండలం మెట్టవలస సమీపంలో గ్రోత్ సెంటర్ వద్ద ఈ ఏడాది సెప్టెంబర్ 6న గుర్తు తెలియని మృతదేహం నుజ్జయి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సెప్టెంబర్ 5న అర్ధరాత్రి దాటాక వాహనాలు ఢీకొని మృతి చెంది ఉంటాడని భావించిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని ఖననం చేశారు. ఇంతలో కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కంచికచర్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు కనిపించడం లేదని, సెపె్టంబర్ 5న అతని సెల్ సిగ్నల్ బొబ్బిలిలో చూపించిందని అక్కడి పోలీసులు బొబ్బిలి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు గుర్తు తెలియని మృతదేహంపై విచారణ మొదలుపెట్టారు. దీంతో తీగ లాగితే డొంక కదిలింది. చాకచక్యంగా కేసును ఛేదించిన పోలీసులు హత్యగా గుర్తించి నిందితుడు తోట నాగేంద్రబాబును పట్టుకుని శనివారం డీఎస్పీ జె.పాపారావు, బొబ్బిలి రూరల్ సీఐ పి.శోభన్‌బాబు విలేకరులకు వివరాలు అందజేశారు. (చదవండి: వన్ సైడ్ లవ్ ఉన్మాదం.. అందర్నీ తగల బెట్టేస్తా..) ఆగస్టు 26న ఏపీ 39యూ6499 నంబరు గల లారీలో డ్రైవర్ తోట నాగేంద్రబాబు అలియాస్ చంటి, క్లీనర్ వెంకటేశ్వరరావు కంచికచర్లలో బయలుదేరి స్థానికంగా కొన్ని లోడులు వేసుకుని తిరిగి కంచికచర్ల వచ్చారు. నాగేంద్రబాబు స్నేహితుడు ఆ్రస్టేలియా నుంచి వచ్చి ఉంటున్న మాలుపూరి రాంగోపాల్‌ను లారీలో తీసుకుని గుజరాత్ టైల్స్ లోడుకు వెళ్లారు. రాంగోపాల్ తన ఇంట్లో ఆగస్టు 28న తాను హైదరాబాద్ వెళ్తున్నట్టు చెప్పి వెళ్లాడు. ఈ విషయాన్ని రాంగోపాల్ తండ్రి వెంకటేశ్వరరావు, తల్లి సీతమ్మ ధ్రువీకరించినట్టు పోలీసులు తెలిపారు. ఈ మధ్యలో లారీ క్లీనర్ వెంకటేశ్వరరావు డ్యూటీ మారి పి.సాయితేజ క్లీనర్‌గా వెళ్లాడు. టైల్స్ లోడుతో బొబ్బిలి వచ్చి అన్లోడ్ చేసి సెప్టెంబర్ 5న బొబ్బిలి గ్రోత్ సెంటర్లో సిమెంట్ షాపు వద్ద రాంగోపాల్‌కు లారీ డ్రైవర్ నాగేంద్రబాబు మద్యం పట్టించాడు. నాగేంద్రబాబుకు మద్యం అలవాటున్నా సేవించకుండా జాగ్రత్త పడ్డాడు. క్లీనర్ సాయితేజను క్యాబిన్లో పడుకోమని చెప్పి తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న రాంగోపాల్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అతనితో వాదులాటకు దిగి పూటుగా తాగించాడు. మద్యం మత్తులో స్పృహ కొల్పోయిన రాంగోపాల్‌ను జాతీయ రహదారిపై పడుకోబెట్టి రాత్రివేళ తన లారీతో తొక్కించి నుజ్జునుజ్జు చేశాడు. విశాఖ వైపు వెళ్లాల్సిన లారీని తిరిగి బొబ్బిలి వైపు తిప్పి ఎవరికీ అనుమానం రాకుండా కంచికచర్ల వెళ్లిపోయి లారీతో గుజరాత్ వెళ్లిపోయాడు. క్యాబిన్లో పడుకున్న క్లీనర్ సాయితేజ రాంగోపాల్ ఎక్కడని ప్రశి్నస్తే రూ.3వేలు తీసుకుని బంధువుల వద్దకు వెళ్లాడని ఒకసారి, బొబ్బిలిలో టిప్పర్ ఢీకొందని మరోసారి చెప్పి ఈ విషయం ఎవరికైనా చెప్పావంటే చంపేస్తానని నాగేంద్రబాబు బెదిరించాడు. ఇంతలో తమ కుమారుడు కనిపించకపోవడంతో రాంగోపాల్ తల్లిదండ్రులు కంచికచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు విచారణ చేసి సెల్ సిగ్నల్ ఆధారంగా బొబ్బిలి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగు చూసింది. ఈ మేరకు నిందితుడు తోట నాగేంద్రబాబును పలు సెక్షన్ల కింద శనివారం అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి పలు విషయాలు రాబట్టాల్సి ఉందని, క్లీనర్లను విచారించాల్సి ఉందని డీఎస్పీ పాపారావు తెలిపారు. ఎస్పీ ఆదేశాలతో ఎస్ఐలు వెలమల ప్రసాదరావు, చదలవాడ సత్యనారాయణ పూర్తి స్థాయిలో సహకరించారని వారిని అభినందిస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఫేక్ ఆడియోతో పక్కతోవ పట్టించే యత్నం... కాగా నిందితుడు కంచికచర్లలో తన సోదరికి ఫోన్ చేసిన రాంగోపాల్‌ను టిప్పర్ ఢీకొందని, తనకు భయం వేస్తోందని ఫొన్లో చెప్పి రికార్డు చేసి, స్నేహితుల ద్వారా రాంగోపాల్ బంధువులకు పంపాడని, తమకు అనుమానం వచ్చిందని కంచికచర్ల నుంచి వచ్చిన మృతుడి కుటుంబ సభ్యులు రఘునాథ్, రామగోపాల్ విలేకరులకు తెలిపారు. నిందితుడిని, ఇంకా సంబంధం ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. -
ఆస్తి రాసివ్వలేదని అంతమొందించారు..
ఆత్మకూరు(కర్నూలు జిల్లా): ఆస్తి రాసివ్వలేదనే కారణంతోనే గంగయ్యను కిరాయి హంతకులతో భార్య దరగమ్మ, ఆమె బంధువులు అంతమొందించారని ఆత్మకూరు డీఎస్పీ వెంకట్రావ్ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. కొత్తపల్లి మండలం శివపురం గ్రామానికి చెందిన గంగయ్యకు అదే మండలం చిన్నగుమ్మడాపురానికి చెందిన దరగమ్మతో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. ఆరు నెలలు మాత్రమే కాపురం సజావుగా సాగింది. ఆస్తి అంతా తన పేరుపై రాసివ్వాలని, వేరు కాపురం పెట్టాలని దరగమ్మ గొడవలు పడేది. భర్త మాట వినకపోవడంతో పుట్టినింటికి వెళ్లిపోయింది. కాపురానికి రావాలని మద్యం సేవించి తరచూ గంగయ్య గొడవపడేవాడు. ఈ క్రమంలో అతని అడ్డుతప్పించేందుకు దరగమ్మతో పాటు ఆమె తండ్రి ఫక్కీరయ్య, తమ్ముడు మియాసావులు పథకం వేశారు. శివపురం గ్రామానికి చెందిన కదిరి రవి, మహేష్, పెద్దగుమ్మడాపురం గ్రామానికి చెందిన చెంచు వెంకటేశ్వర్లును సంప్రదించి.. గంగయ్యను చంపితే రూ.2 లక్షలు సుపారి ఇస్తామని మాట్లాడారని, ఇందుకు రూ.2 వేల అడ్వాన్స్ ఇచ్చినట్లు విచారణలో తేలిందని డీఎస్పీ తెలిపారు. గంగయ్యను సెపె్టంబర్ 28వ తేదీన ముసలిమడుగు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి కర్రతో తలవెనుక భాగాన కొట్టి, గొంతు బిగించి చంపి, శవాన్ని అడవిలో పడేశారన్నారు. లింగాపురం గ్రామ సమీపంలోని ఫక్కీరయ్య, దరగమ్మ, మియాసావు, చెంచు వెంకటేశ్వర్లు, కదిరి రవిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరి నుంచి రూ. వెయ్యి నగదు, రెండు మోటారు సైకిళ్లు, హత్యకు ఉపయోగించిన కర్ర, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను మెజి్రస్టేట్ ఎదుట హాజరుపరుస్తామన్నారు. విలేకరుల సమావేశంలో ఆత్మకూరు సీఐ కృష్ణయ్య, ఎస్ఐలు నాగేంద్రప్రసాద్, నవీన్‌బాబు పాల్గొన్నారు. -
వీడిన మిస్టరీ: ఒంటరి మహిళపై కన్నేసి..
ముదిగుబ్బ(అనంతపురం జిల్లా): దొరిగిల్లుకు వెళ్లే దారిలో కల్వర్టు కింద మూడు నెలల కిందట వెలుగుచూసిన మహిళ హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈమెను హత్య చేసింది ధర్మవరంలోని చీరల దుకాణం నిర్వాహకుడని తేలింది. మృతదేహం తరలింపు, పెట్రోలు పోసి తగులబెట్టడానికి నిందితుడికి సహకరించిన భార్య, అతని స్నేహితుడిని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను నల్లమాడ సీఐ ఎస్.వి.నరసింహారావు బుధవారం ముదిగుబ్బ పోలీస్ స్టేషన్లో మీడియాకు వెల్లడించారు. (చదవండి: ‘ఇంట్లో’ దొంగలు..) జూలై ఐదో తేదీన దొరిగిల్లుకు వెళ్లే దారిలోని కల్వర్టు కింద ఎవరో మహిళపై పెట్రోలు పోసి తగులబెట్టారని స్థానికుల ద్వారా సమాచారం అందడంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. కాలిపోయిన మహిళ ఆనవాళ్లను మీడియా, సోషల్ మీడియా ద్వారా గమనించిన ధర్మవరానికి చెందిన జగన్నాథ్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో వచ్చి ఆ శవం తన కూతురు కల్పనారెడ్డి(32)దని పోలీసులకు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తుండగా నిందితుడు చింతల రాయుడు, భార్య హేమలత, అతని స్నేహితుడు జగదీష్ ముదిగుబ్బ పోలీస్ స్టేషన్లో మంగళవారంలొంగిపోయారు. బుధవారం వీరిని అరెస్ట్ చూపారు. (చదవండి: ఢిల్లీ చూడాలని.. 15 ఏళ్ల బాలిక..) హత్యకు దారితీసిందిలా.. ధర్మవరానికి చెందిన ఫిజియోథెరపిస్ట్ కల్పనారెడ్డికి బత్తలపల్లి మండలం గుమ్మళ్లకుంటకు చెందిన వ్యక్తితో 13 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అనంతరం వీరు ధర్మవరానికి మకాం మార్చారు. కొంత కాలం తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో కల్పనారెడ్డి భర్త నుంచి విడిపోయింది. భర్త కుమారుడిని తీసుకుని స్వగ్రామానికి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కల్పనారెడ్డి ఒక్కతే ధర్మవరంలో నివాసం ఉంటోంది. ఈమె చీరల కోసం చింతలరాయుడు అనే వ్యక్తికి చెందిన దుకాణానికి తరచూ వెళ్లేది. చీటీల విషయంలో కూడా ఇతడితో పరిచయం ఉంది. ఒంటరిగా ఉంటోందని తెలిసి చింతలరాయుడు ఆమెపై కన్నేశాడు. అదునుకోసం చూస్తూ వచ్చాడు. లాక్డౌన్ సమయంలో జూన్ 29న మధ్యాహ్నం కల్పనారెడ్డి షాప్‌కు వచ్చింది. అప్పుడు అక్కడ చింతలరాయుడు తప్ప ఎవ్వరూ లేరు. షాప్ మూసే సమయమైందంటూ ఆమెను లోపలే ఉంచి షట్టర్ వేశాడు. అనంతరం మంచి చీరలు చూపిస్తానని లోపలి గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయతి్నంచగా ఆమె ప్రతిఘటించింది. తన వారితో చెప్పి నీ అంతు చూస్తానని బెదిరించడంతో చింతలరాయుడు ఆమెకు ఆ అవకాశం ఇవ్వకూడదనుకున్నాడు. వెంటనే ఆమె వేసుకున్న స్కార్్ఫ, టవల్‌తో ముఖానికి గట్టిగా చుట్టి ఊపిరి ఆడకుండా అదిమిపట్టి హత్య చేశాడు. ఆనవాళ్లు దొరకకూడదని.. మరుసటి రోజు తన స్నేహితుడు జగదీష్, భార్యకు చింతలరాయుడు జరిగిన విషయం చెప్పాడు. కేసు తమ మెడకు చుట్టుకోకుండా ఉండేందుకు ఆనవాళ్లు చెరిపేసే ప్రయత్నం చేశారు. మృతదేహాన్ని అట్టతో ప్యాకింగ్ చేసి ముదిగుబ్బ మండలం దొరిగిల్లు ఘాట్‌లో ఉన్న కల్వర్ట్ కింద పడేసి వెళ్లిపోయారు. తరువాత శవాన్ని ఎవరైనా గుర్తు పడితే దొరికిపోతామని భయపడి జూలై ఒకటో తేదీన మళ్లీ కల్వర్టు వద్దకు వెళ్లి పెట్రోలు పోసి తగులబెట్టారు. మహిళ హత్యకు గురైన విషయం అదే నెల ఐదో తేదీన వెలుగులోకి వచ్చింది. పోలీసుల దర్యాప్తు వేగవంతమవడంతో నిందితులు ముగ్గురూ సెప్టెంబర్ 29న పోలీసుల ఎదుట లొంగిపోయి, నేరాన్ని ఒప్పుకున్నారు. నిందితులు చింతలరాయుడు, జగదీష్‌లు ఉపయోగించిన ద్విచక్ర వాహనాలు, హతురాలు కల్పనారెడ్డి స్కూటర్‌ను స్వా«దీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ముగ్గురు నిందితుల్ని బుధవారం రిమాండ్‌కు తరలించామని చెప్పారు. -
దారుణం: మద్యం తాగించి కిరాతకంగా..
నెల్లూరు(క్రైమ్): పాతక్షల నేపథ్యంలో ఓ రౌడీషీటర్‌ను కొందరు దారుణంగా హత్యచేసి పరారయ్యారు. ఈ ఘటన నగరంలోని సీఏఏం హైస్కూల్ సమీపంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యుల సమాచారం మేరకు.. సీఏఎం హైస్కూల్ సమీపంలో రౌడీషీటర్ బాషా (32) నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య నసీమా, పిల్లలు సమీర్, సనా ఉన్నారు. బాషా వంట పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు పలువురితో వివాదాలు ఉన్నాయి. పలు పోలీసు స్టేషన్లలో కేసులు సైతం ఉన్నాయి. రెండేళ్ల క్రితం ఓ మహిళ విషయంలో కోటమిట్ట ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ మొహిసీన్‌పై చేయిచేసుకున్నాడు. అప్పట్నుంచి ఇరువురి నడుమ తరచూ వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొహిసీన్ వారం రోజుల క్రితం ఇకపై గొడవలు వద్దని స్నేహంగా ఉందామని బాషాతో రాజీ చేసుకున్నాడు. అతని మాటలను గుడ్డిగా నమ్మిన బాషా స్నేహంగా మెలగసాగాడు. ఈ క్రమంలో బాషా తన ఇంటి సమీపంలోని తన షెడ్లో మొహిసీన్, అతని స్నేహితులైన జాన్సన్, సమీర్, ఫరూఖ్, ప్రేమ్‌తో పాటు తన అనుచరుడైన కార్తీక్‌తో కలిసి గురువారం అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. కార్తీక్ సిగిరెట్లు తెచ్చేందుకు బయటకు వెళ్లగా, బాషా ఇంటికి వచ్చి రెండు వాటర్ బాటిళ్లు తీసుకుని షెడ్‌కు వెళ్లారు. కొద్దిసేపటికే మొహిసీన్, అతని స్నేహితులు విచక్షణా రహితంగా కత్తులతో బాషా గొంతుకోయడంతో పాటు ముఖంపై బలంగా పొడిచారు. బాషా కేకలు విన్న భార్య, కుమారుడు సమీర్, అత్త షరీఫా, సోదరుడు మస్తాన్, మరికొందరు షెడ్‌వద్దకు వెళ్లేసరికి దుండగులు పరారయ్యారు. తీవ్రగాయాలపాలైన బాషా అక్కడికక్కడే మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. . పథకం ప్రకారమే హత్య నిందితులు పథకం ప్రకారమే బాషాను హత్యచేసినట్లుగా తెలుస్తోంది. వారం రోజుల క్రితం బాషాతో మొహిసీన్ గొడవలు లేకుండా కలిసి ఉందామని రాజీ చేసుకున్నాడు. అçప్పట్నుంచి మొహిసీన్, అతని స్నేహితులు రోజూ బాషాను కలిసి అర్ధరాత్రి వరకు మాట్లాడి వెళ్లేవారు. మూడ్రోజులుగా అందరూ కలిసి బాషాకు చెందిన షెడ్లో అర్ధరాత్రి వరకు మద్యం సేవించేవారు. బాషా ప్రతి కదలికను నిందితులు నిశితంగా పరిశీలిస్తూ అనుమానం రాకుండా తుదముట్టించేందుకు అదనుకోసం వేచిచూడసాగారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి కార్తీక్ బయటకు వెళ్లడం, బాషా కుటుంబ సభ్యులు ఇంట్లో తలుపులు వేసుకుని ఉండడంతో ఇదే అదనుగా భావించిన మొహిసీన్, అతని స్నేహితులు బాషాను కిరాతకంగా హత్యచేశారు. బాషా కేకలు విని కుటుంబ సభ్యులు, కార్తీక్ అక్కడికి చేరుకోవడంతో చేతిలోని కత్తి పడిపోయినా పట్టించుకోకుండా నిందితులు పరారయ్యారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఇన్స్పెక్టర్లు బాషా హత్యపై సమాచారం అందుకున్న చిన్నబజారు ఇన్స్పెక్టర్ ఎం మధుబాబు, సంతపేట ఇన్స్పెక్టర్ అన్వర్‌బాషా, ఎస్సై అలీసాహెబ్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు దారితీసిన పరిస్థితులను మృతుడి భార్య నసీమాను అడిగి తెలుసుకున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు మొహిసీన్, అతని స్నేహితులపై పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి పోస్టుమార్టం చేయించారు. చిన్నబజారు ఇన్స్పెక్టర్ మధుబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పరారీలో ఉండడంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. -
కన్నతల్లిని హతమార్చిన కొడుకు
రొంపిచర్ల(నరసరావుపేట): ఆస్తి వ్యవహారంలో కన్నతల్లిని కొడుకు హతమార్చిన ఘటన గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలోని అన్నవరంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అన్నవరం గ్రామానికి చెందిన కుందేటి తిరుపతమ్మ(85)కి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె భర్త వెంకయ్య 20 ఏళ్ల కిందట మృతి చెందాడు. తిరుపతమ్మ పేరుతో నాలుగు ఎకరాల పంట భూమి ఉంది. వృద్ధాప్యంలో ఆమె బాగోగులు చూసిన వారికి ఒకరికి ఎకరం పొలం అదనంగా రాసి ఇచ్చేటట్లు గ్రామ పెద్దల సమక్షంలో ఒప్పందం చేశారు. ఆ ఒప్పందం ప్రకారం చిన్న కుమారుడు కుందేటి ఏడుకొండలు ఆమె బాగోగులు, పోషణ చూస్తున్నాడు. కొద్ది నెలల కిందట తిరుపతమ్మ పెద్ద కుమారుడు ఆంజనేయులు భార్య మృతి చెందింది. అప్పటి నుంచి వృద్ధాప్యంలో ఉన్న తిరుపతమ్మ ఆలనా పాలనా విషయంలో చిన్న కొడుకు కొంత అశ్రద్ధ చూపుతున్నాడు. ఈ తరుణంలో పెద్ద కుమారుడికి భార్య లేకపోవడంతో ఆంజనేయులు దగ్గరకు వెళ్లాలని తిరుపతమ్మ నిర్ణయించుకుంది. తిరుపతమ్మ ఆలోచనను పసిగట్టిన చిన్న కుమారుడు ఏడుకొండలు తన తల్లి అన్న దగ్గరకు వెళ్లితే ఆమె పొలం తనకు దక్కదని నిర్ణయించుకొని కొద్దిరోజులుగా గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో మద్యం తాగి మత్తులో తల్లితో వాదనకు దిగి కర్రతో విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలైంది. స్థానికులు తిరుపతమ్మను చికిత్స కోసం నరసరావుపేటకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న రొంపిచర్ల పోలీసులు అన్నవరం చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఏడుకొండలును అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. తిరుపతమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రొంపిచర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అసూయపడి.. ఉసురు తీసి
సోంపేట(శ్రీకాకుళం జిల్లా): అమ్మప్రేమ దక్కదన్న బాధో, వేరెవరికో వెళ్లిపోతుంద న్న ఆవేదనో గానీ ఆ బాలిక ఊ హించని నిర్ణయం తీసుకుంది. ఏకంగా హత్య చేయడానికే పూనుకుంది. రోజూ చూసే ముద్దుగారే పాపాయిని ట్యాంకులో పడేసి చంపేసేంత కోపం పెంచుకుంది. మండలంలోని టి.శాసనాం గ్రామంలో ఈ నెల 4న జరిగిన 11 నెలల చిన్నారి మూల హేమశ్రీ హత్య మిస్టరీని బారువ పోలీసులు ఛేదించారు. బారువ ఎస్ఐ పి.నారాయణస్వామి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పదిహేనేళ్ల బాలిక చిన్నారిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారిని పక్కింటి వారు తీసుకెళ్లడం, ఆ ఇంటి ట్యాంకులోనే పాప పడి మృతి చెందడంతో పోలీసులు అన్ని కో ణాల్లో దర్యాప్తు చేశారు. ఈ విచారణలో విస్మయం కలిగించే నిజాలు తెలిశాయి. హేమశ్రీని పక్కింటికి చెందిన నిర్మల అనే మ హిళ ప్రతి రోజూ ఆడించడానికి తనంటికి తీసుకెళ్లేవారు. పాపను ముద్దుగా చూసుకునేవారు. ఇది ఆ మె కూతురికి నచ్చలేదు. తన తల్లి ఆ చిన్నారిని దగ్గరకు చేర్చడం, ఆడించడం ఆమె చూసి తట్టుకోలేకపోయింది. తన అమ్మ తనకు దూరమవుతోందని భయపడింది. పదిహేనేళ్ల వయసు గల ఆ బాలిక హేమశ్రీపై విపరీతమైన కోపం పెంచుకుంది. అదీ కాక తను రోజూ ఫోన్లో మాట్లాడుతుంటే తల్లి మందలించేవారు. దీనికి కూడా హేమశ్రీనే కారణమని తప్పుగా భావించుకుంది. దీంతో సమయం చూసి పాపను ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంకులో పడేయడంతో చిన్నారి చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. నిందితురాలిని బాల నేరస్తుల కోర్టుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
భర్తను కడతేర్చిన భార్య
ప్రత్తిపాడు రూరల్: కట్టకున్న భర్తను ప్రియుడితో కలసి కడతేర్చిన సంఘటన మండలంలోని చింతలూరు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జంకల అప్పారావు అలియాస్ వరహాలు(37)కు గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామానికి చెందిన మంగతో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. మొదటి నుంచి వీరి వివాహ సంబంధం అంతంత మాత్రంగానే ఉండడంతో తరచూ భార్యభర్తలు గొడవ పడేవారని స్థానికులు తెలిపారు. భర్త మద్యానికి బానిసై నిత్యం భార్యను హింసించడం, భార్య గ్రామానికి చెందిన వరసకు కొడుకు అయ్యే సమీప బంధువు జంకల మణికంఠ (స్వామి)తో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే హత్యకు కారణంగా పోలీసులు తెలిపారు. (చదవండి: టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య) భర్త తాగొచ్చి హింసించడమే కాకుండా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండడాన్ని సహించ లేని మంగ భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించింది. పథకం ప్రకారం ప్రియుడితో కలసి బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఇంట్లో నిద్రిస్తున్న భర్తను కత్తె, కర్రతో ఇరువురూ కలసి హతమార్చినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం ఇంటి వాకిట్లో ఉన్న సందెకాలుపై మృతదేహాన్ని పడేసి ప్రమాదవశాత్తూ మరణించినట్టు చిత్రీకరించేందుకు ప్రయతి్నంచినా మృతుడి శరీరంపై బలమైన గాయాలు ఉండడంతో పథకం పారలేదు. గురువారం మృతుడు, ప్రియుడు కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ప్రియుడి బంధువులు మృతుడిని చంపేస్తామని హెచ్చరించడంతో వారే తన భర్తను హత్య చేసినట్టు మృతుడి భార్య పోలీసులకు తెలిపింది. పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాస్, ప్రత్తిపాడు సీఐ వై.రాంబాబు, ఎస్సై బి.అజయ్‌బాబు పోలీసు సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో సంఘటన స్థలంలో వివరాలను సేకరించారు. పోలీసులు మృతుడి భార్య మంగ, ప్రియుడు మణికంఠలను అదుపులోకి తీసుకొన్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు. -
దారుణం: మనవడిని రోకలిబండతో కొట్టి..
బేస్తవారిపేట (ప్రకాశం జిల్లా): వ్యసనాలకు బానిసైన మనవడిని తాత హత్య చేశాడు. ఈ సంఘటన బేస్తవారిపేట మండలంలోని ఖాజీపురంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. పూనూరు చిన్న వెంకటరెడ్డి, వరమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు రాఘవేంద్రరెడ్డి(20) గత మూడేళ్లుగా హైదరాబాద్‌లోని ఓ ప్రెవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో ఆరు నెలల క్రితం సొంత గ్రామానికి వచ్చాడు. అయితే తరుచూ మద్యం సేవిస్తూ, పేకాటాడుతూ నిత్యం డబ్బుల కోసం కుటుంబసభ్యులను వేధిస్తున్నాడు. (చదవండి: నన్ను కాపాడి నువ్వెళ్లిపోయావా..) ఈ క్రమంలో డబ్బులు ఇవ్వాలని కుటుంబసభ్యులపై ఒత్తిడి ఎక్కువ చేశాడు. నా ఆస్తి వాటా పంచి ఇస్తే కారు కొనుక్కోని బాడుగకు తిప్పుకుంటానని, ఇవ్వకపోతే చంపుతానని బెదిరింపులకు దిగాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో పడుకుని ఉన్న సమయంలో రాఘవేంద్రరెడ్డి జేజీనాయన పూనూరు పెద్ద ఓసూరారెడ్డి రోకలిబండతో కొట్టి హతమార్చాడు. హత్య చేసిన అనంతరం ఇంట్లో నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న గిద్దలూరు సీఐ యు సుధాకరరావు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు సీఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: విషాదం: వివాహమైన 28 రోజులకే..) అవాక్కైన గ్రామస్తులు.. ప్రతి కుటుంబంలో పిల్లలతో గొడవలు ఉంటాయి. అంతమాత్రానికే మనువడిని హత్య చేయడంపై గ్రామస్తులు విస్మయం చెందుతున్నారు. హత్య చేయడానికి వేరే కారణాలు ఏమైనా ఉండవచ్చునని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
మార్కాపురం(ప్రకాశం జిల్లా): వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో ప్రియుడితో కలిసి భర్తను భార్య హతమార్చిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్టేట్‌లో జరిగింది. మార్కాపురం సీఐ కేవీ రాఘవేంద్ర శనివారం తెలిపిన వివరాల ప్రకారం పూలసుబ్బయ్య కాలనీలో నివాసం ఉండే ఎల్లంగారి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేష్ (32)కు ఆరేళ్ల కిందట అశ్వనితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల అశ్వని ఎస్టేట్‌లో నివాసం ఉండే టి.దేవరాజ్‌తో సన్నిహితంగా ఉంటోంది. ఈ విషయమై అశ్వనికి, భర్త వెంకటేష్‌కు మధ్య గొడవలు జరిగాయి. భార్యను పద్ధతి మార్చుకోవాలని వెంకటేష్ హెచ్చరించాడు. నెల రోజుల క్రితం అశ్వని, దేవరాజ్‌లు ఇంటి నుంచి వెళ్లిపోయారు. తన భార్య కనిపించడం లేదని వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారం తరువాత వారిద్దరూ తిరిగి వచ్చారు. ఇలా ఉండగా శుక్రవారం కూడా వీరి మధ్య గొడవ జరిగింది. అశ్వని, వెంకటేష్ కలిసి దేవరాజ్ ఇంటికి వెళ్లారు. ముగ్గురి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అశ్వని, దేవరాజ్‌లు కలిసి బలమైన వస్తువుతో వెంకటేష్‌పై దాడి చేయటంతో మృతి చెందాడు. వెంటనే వారిద్దరూ పరారయ్యారు. ఈ సంఘటనపై మృతుని బావ జయరాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రాఘవేంద్ర తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. సంఘటన స్థలాన్ని సీఐతో పాటు ఎస్సై సందర్శించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. -
దారుణం: అడిగిన డబ్బు ఇవ్వలేదని..
పామిడి(అనంతపురం జిల్లా): భర్త అడిగినప్పుడల్లా పుట్టింటి నుంచి డబ్బు తెచ్చి ఇచ్చేది భార్య. పెళ్లైన పదేళ్ల నుంచి ఇదే తంతు. ఆ డబ్బు అంతా తాగుడుకే తగలేసేవాడు భర్త. దీనికితోడు తాగివచ్చి భార్యను చితక బాదేవాడు. విసిగిపోయిన భార్య వారం క్రితమే పుట్టింటికి వెళ్లింది. దీన్ని జీర్ణించుకోలేని భర్త ఆమె పుట్టింటికే వెళ్లి ఆమెను కడతేర్చాడు. ఈ ఘటన మండలంలోని ఓబుళాపురంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలమేరకు... ఓబుళాపురంకు చెందిన వితంతువు బోయ సుంకమ్మకు ఐదుగురు కుమార్తెలు. నాల్గో కుమార్తె బోయ చౌడమ్మ (35)ను 10 ఏళ్ల క్రితం పాత గుంతకల్లుకు చెందిన బేల్దారి బోయ శ్రీనివాసులుకు ఇచ్చి పెళ్లి చేశారు. కట్న కానుకల కింద 3 తులాల బంగారం, రూ.15 వేలు ఇచ్చారు. కూతురు బాగుండాలని సుంకమ్మ పాత గుంతకల్లులో రూ. లక్షలు వెచ్చించి ఇల్లు కట్టించడంతో పాటు సామగ్రిని కూడా ఇప్పించింది. దీనికి తోడు అప్పుడప్పుడూ ఆర్థిక సహాయం కూడా చేసేది. బోయ శ్రీనివాసులు, చౌడమ్మ దంపతులకు చరణ్ (7), శృతి (4) సంతానం. తాగుడుకు బానిసై... బేల్దారి బోయ శ్రీనివాసులు మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో తరచూ భార్య చౌడమ్మను డబ్బుకోసం హింసించేవాడు. విసిగిపోయిన చౌడమ్మ వారం రోజుల క్రితం భర్తపై గుంతకల్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పుట్టిల్లు ఓబుళాపురానికి వచ్చేసింది. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలు దాటాక శ్రీనివాసులు ఓబుళాపురానికి వెళ్లాడు. పిల్లలను చూద్దామని వచ్చానని భార్య, అత్తలకు చెప్పి ఇంట్లోకి వెళ్లాడు. అనంతరం అంతా నిద్రలోకి వెళ్లిన తర్వాత భార్య చౌడమ్మపై భర్త శ్రీనివాసులు కత్తితో దాడి చేశాడు. తర్వాత పారిపోతుండగా అత్త సుంకమ్మ అతన్ని అడ్డుకోవడంతో ఆమెపై కూడా కత్తితో దాడి చేసి పరారయ్యాడు. కన్నీరు మున్నీరైన బంధువులు చౌడమ్మ కుమారుడు చరణ్ రెండో తరగతి చదువుతున్నాడు. నాలుగేళ్ళ శృతి ఇంకా తల్లి పాలు వదల లేదు. తల్లిపాలు వదలని శృతికి తల్లిని మరిపింపజేయడం ఎలా అంటూ.. అవ్వ సుంకమ్మ , ఆమె కుమార్తెలు చౌడమ్మ మృతదేహంపై పడి కన్నీరు మున్నీరయ్యారు. దీంతో ఓబుళాపురం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతురాలి తల్లి సుంకమ్మ ఫిర్యాదు మేరకు సీఐ కే శ్రీనివాసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీస్ స్టేషన్ ఎదుటే భార్య హత్య
టీ.నగర్: ఆలంగుళంలో పోలీస్‌స్టేషన్ ఎదుట మంగళవారం ఓ మహిళ హత్యకు గురైంది. ఈ కిరాతక చర్యకు పాల్పడిన భర్త కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. తెన్కాశి జిల్లా, బాలుసత్రం సమీపానగల నాటార్‌పట్టికి చెందిన మురుగన్ (40). ఇతను బాలుసత్రం రైల్వేగేటు సమీపాన పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మురుగన్‌కు విరుదునగర్ జిల్లా, తిరిక్కళి ప్రాంతానికి చెందిన చిత్ర (35)తో వ్యాపారం సమయంలో పరిచయం ఏర్పడింది. దీంతో తొమ్మిదేళ్ల క్రితం ఆమెను రెండో వివాహమాడి బాలుసత్రంలో కుటుంబం నడుపుతూ వచ్చాడు. చిత్రకు ఇదివరకే రెండు వివాహాలు జరగగా, మురుగన్‌ను మూడో వివాహం చేసుకుంది. చిత్రకు రెండో భర్త ద్వారా కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరు ప్రస్తుతం చిత్రతో నివశిస్తున్నారు. ఇదిలావుండగా చిత్ర ఆలంగుళం పోలీసు స్టేషన్లో ఒక ఫిర్యాదు చేశారు. అందులో తన కుమార్తెపై మురుగన్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపించింది. దీంతో పోలీసులు విచారణ నిమిత్తం మురుగన్, చిత్రను పోలీసు స్టేషన్‌కు పిలిపించారు. విచారణ తర్వాత బయటికి వచ్చిన మురుగన్ తన వద్ద నున్న కత్తితో చిత్రపై దారుణంగా దాడి చేసి పరారయ్యాడు. ఆమెను పోలీసులు ఆలంగుళం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి చికి త్స అందించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి మురుగన్ కోసం గాలిస్తున్నారు. -
దారుణం: భార్య అనుమానిస్తోందని..
పద్మనాభం (భీమిలి): ప్రేమించి పెళ్లి చేసుకున్నారు... అనంతరం మనస్పర్థలు పెరిగాయి... భర్త ప్రవర్తనపై అనుమానం పెంచుకుని నిత్యం వేధిస్తుండడం.., విడిపోవాలని నిర్ణయించుకుని భార్య డబ్బులు డిమాండ్ చేయడంతో విసిగిపోయిన భర్త ఆమెను హతమార్చాడు. ఈ ఘటన పద్మనాభం మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. పద్మనాభం సీఐ ఎ.విశ్వేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం పట్టణానికి చెందిన పల్లి నవీన్ కుమర్ (27), పద్మనాభం మండలం విలాస్‌ఖాన్‌పాలెం గ్రామానికి చెందిన చెల్లూరి సంతోష్ స్నేహితులు. సంతోష్ కుమార్తె లలిత జన్మదిన వేడుకలకు 2014లో విలాస్‌ఖాన్‌పాలెం వచ్చిన నవీన్‌కు... అక్కడ సంతోష్ సోదరి చెల్లూరి పద్మ(25)తో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారడం.., అప్పటికే మేనత్త కుమార్తెతో నవీన్‌కు పెళ్లి చేయాలని అతని తల్లిదండ్రులు నిర్ణయించడంతో వారికి చెప్పకుండా 2015లో సింహాచలంలో పద్మను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం పద్మనాభం గ్రామంలో అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు. నవీన్ ఆరిలోవ హెల్త్‌సిటీలోని ఓ ఆస్పత్రిలో ఫార్మాసీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని పద్మ అనుమానం పెంచుకుంది. ఈ క్రమంలో నిత్యం నవీన్ ఫోన్ పరిశీలిస్తూ అనుమానించేంది. ఈ క్రమంలో ఆదివారం విధులకు వెళ్లి రాత్రి 9.30 గంటల సమయంలో ఇంటికి వచ్చిన నవీన్‌కు, పద్మకు మధ్య ఘర్షణ జరిగింది. భర్త ఫోన్ తీసుకుని కాల్ లిస్ట్ పరిశీలించింది. తనను ప్రేమ వివాహం చేసుకుని సరిగా చూడకుండా వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నావని ఘర్షణకు దిగింది. తనకు రూ.4 లక్షలు ఇచ్చి వదిలేయాలని కోరింది. అయితే అంత మొత్తం ఒకేసారి ఇవ్వలేనని, విడతలు వారీగా డబ్బులు ఇస్తానని నవీన్ చెప్పాడు. అందుకు నిరాకరించిన పద్మ విజయనగరంలోని మీ తల్లిదండ్రులకు అంతా చెప్పేస్తానని బెదిరించింది. దీంతో మనస్తాపానికి గురైన నవీన్ కుమార్ ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో పద్మ పీక నులిమి హతమార్చాడు. అనంతరం తన భార్య కడుపునొప్పితో చనిపోయిందని స్థానికులకు, బావమరిది సత్యనారాయణకి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం తరలించారు. మృతురాలు సోదరుడు సత్య నారాయణ ఫిర్యాదు మేరకు ఏïసీపీ రవి శంకర్‌రెడ్డి ఆధ్యర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. నిందితుడు నవీన్ పోలీసుల అదుపులో ఉన్నాడని విశ్వసనీయ సమాచారం అధారంగా తెలిసింది. -
సూసైడ్ నోట్లో ఏముందో?
ఇటీవల చోటుచేసుకున్న దంత వైద్యురాలు మాధవీలత ఆత్మహత్య ఘటన నంద్యాలలో తీవ్ర చర్చనీయాంశమైంది. భర్తతో అన్యోన్యంగా, ఆర్థికంగా బలంగా ఉన్న ఆమె ఆత్మహత్యకు కారణాలు ఏమై ఉంటాయని పలువురు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే మృతదేహం వద్ద లభించిన సూసైడ్ నోట్లో ఉన్న వివరాలు పోలీసులు బయటకు చెప్పకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నంద్యాల: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన లక్ష్మణకిశోర్, గుంటూరుకు చెందిన మాధవీలత(47) మెడిసిన్ చదుకునే సమయంలో ప్రేమించుకొని, 20 ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. అనంతరం నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్లో సొంతంగా శ్రీరమణ కాస్మొటిక్ దంతవైద్యశాలను నడుపుతున్నారు. వీరికి మెడిసిన్ చదివే కుమారుడు ఉన్నాడు. పట్టణంలోని టెక్కె భరతమాత ఆలయం వద్ద ఇల్లు కొనుగోలు చేసి, ఇక్కడే నివాసం ఉంటూ ఆసుపత్రిని నడుపుతున్నారు. మృతదేహం వద్ద సూసైడ్ నోట్.. ఈనెల 16న మాధవీలత(47) ఆత్మహత్య చేసుకుంది. భర్తతో ఎలాంటి ఇబ్బందులు లేవని, వారు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని మృతురాలి తండ్రే చెబుతున్నాడంటే వైద్యురాలు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే మృతదేహం వద్ద సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్లు విలేకరులకు వెల్లడించిన టూటౌన్ సీఐ కంబగిరిరాముడు.. అందులో ఏముందో ఇంతవరకు బయట పెట్టలేదు. ఈ కేసు విషయంలో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించనట్లు తెలుస్తోంది. అసలు మాధవీలత మృతి మిస్టరీని పోలీసులు ఛేదిస్తారా.. లేక కేసును నీరుగారుస్తారా.. అన్న విషయాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా దర్యాప్తులో భాగంగానే సూసైడ్ నోట్లో ఉన్న వివరాలను బయటకు వెల్లడించడం లేదని టూటౌన్ సీఐ కంబగిరిరాముడు చెబుతున్నారు. -
దారుణం: కత్తితో గొంతు కోసి..
గుడిపాల: జీవితాంతం కలిసి జీవిస్తానని అగ్నిసాక్షిగా చేసిన ప్రమాణాలు గాలికొదిలేశాడు. కట్టుకున్న భార్యను ఆస్తి వివాదం నేపథ్యంలో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. స్థానికుల కథనం.. మండలంలోని కుప్పిగానిపల్లెకు చెందిన పశుపతి(43), ఇదే మండలంలోని గొల్లపల్లెకు చెందిన ప్రతిభ (34)కు 2006లో పెద్దలు వివాహం చేశారు. వీరికి వేదేష్(12), పవన్(5) సంతానం. పశుపతి వృత్తిరీత్యా బెంగళూరులో లిఫ్ట్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఐదేళ్ల క్రితం తనే స్వయంగా లిఫ్ట్ కంపెనీ ప్రారంభించాడు. కంపెనీ బాగా అభివృద్ధి చెందుతున్న సమయంలో పశుపతి మద్యానికి అలవాటు పడ్డాడు. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు తలెత్తేవి. గుడిపాల పోలీస్‌స్టేషన్‌లో కూడా గతంలో దంపతులిద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహించి సర్దిచెప్పి పంపారు. గ్రామంలో కూడా పెద్దమనుషుల సమక్షంలో పలు పంచాయితీలు చేశారు. తరువాత దంపతులు కలిసి బెంగళూరుకు వెళ్లారు. అయినా పశుపతి తీరు మారలేదు. మరింతగా తాగుడుకు అలవాడు పడటంతో విసిగి వేసారిన ప్రతిభ ఏడాది క్రితం భర్త నుంచి కంపెనీని తన పేరిట రాయించుకుంది. అప్పటినుంచి కంపెనీ వ్యవహారాలన్నీ ఆమే చూసుకునేది. దీనిపై పశుపతి ఆమెతో విభేదించాడు. తన ఇద్దరి పిల్లలను తీసుకుని తన స్వగ్రామానికి వచ్చేశాడు. ఇక్కడే ఉంటూ జీవిస్తున్నాడు. గ్రామస్తులు ఇది గమనించి మళ్లీ మధ్యస్థం చేశారు. అతడిని ఒప్పించి తిరిగి బెంగళూరుకు పంపారు. అయినా భార్యభర్తల మధ్య మళ్లీ గొడవలు వస్తుండడంతో తిరిగి వచ్చేశాడు. అయితే అప్పటినుంచి పశుపతికి భార్యపై అనుమానం మొదలైంది. ప్రతిభ వినాయకచవితి పండుగ సందర్భంగా తన పుట్టింటికి వచ్చింది. ఇది తెలుసుకున్న పశుపతి తన ఇంటికి రావాలంటూ ఆమెను నమ్మించి శనివారం తీసుకువచ్చాడు. సాయంత్రం మిద్దెపైన ఉన్న రూమ్‌లోకి ప్రతిభను తీసుకెళ్లి కట్టెతో తలపై బాదాడు. ఆ తరువాత కత్తితో గొంతుకోసి పరారయ్యాడు. సంఘటన స్థలానికి సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి, ఎస్ఐ వాసంతి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసుల అదుపులో పశుపతి భార్యను హతమార్చిన పశుపతిని పోలీసుల అదుపులోకి తీసుకున్నాడు. హత్య ఎందుకు చేశాడో వివరాలు రాబట్టే దిశగా విచారణ చేస్తున్నారు. తల్లిని తమ తండ్రే హత్య చేయడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. -
అయినవాళ్లే హతమార్చారు..
కొవ్వూరు/ద్వారకా తిరుమల: ఆస్తి కోసం అయినవాళ్లే హంతకులయ్యారు. కిరాతకంగా హతమార్చి ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేసి పోలీసులకు దొరికిపోయారు. దేవరపల్లి మండలం చిన్నాయిగూడెంలో జరిగిన హత్యకు సంబంధించి కేసు వివరాలను డీఎస్పీ కె.రాజేశ్వరరెడ్డి వెల్లడించారు. చిన్నాయిగూడెంకు చెందిన గెడ భాస్కరరావు (60) అనే వ్యక్తి ఈనెల 8వ తేదీ నుంచి కనిపించకపోవడంతో 10వ తేదీన పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. భాస్కరరావును అతని పొలంలోనే హతమార్చినట్టు పోలీసులు గు ర్తించారు. మృతుడు భాస్కరరావు, లక్ష్మీకాంతం దంపతులకు సంతానం లేకపోవడంతో శ్వేత అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆమెకు వివాహం చేసి పదెకరాలు పొలం రాసిచ్చారు. 2016లో భార్య లక్ష్మీకాంతం మృతిచెందడంతో భాస్కరరావు మంచిచెడ్డలను శ్వేత, ఆమె సోదరుడు కిరణ్, వాళ్ల తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో భాస్కరరావు తన ఆస్తిలో మరో ఎనిమిదెకరాలు కిరణ్‌కు రాసిచ్చారు. అనంతర కాలంలో అతడి బాగోగులను శ్వేత, కిరణ్ పట్టించుకోకపోవడంతో శ్వేత దత్తతను, కిరణ్‌కు ఇచ్చిన పొలం రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని భాస్కరరావు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల నుంచి సోదరుడు సత్యనారాయణ, అతని భార్య రాధాకృష్ణవేణి భాస్కరరావు బాగోగులు చూసుకుంటున్నారు. భాస్కరరావు వద్ద మిగిలిన పదెకరాలను తన ఇద్దరు కూతుళ్ల పేరున రాయాలని కృష్ణవేణి, ఆమె తమ్ముడు గన్నిన శ్రీహరి ఒత్తిడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా భాస్కరరావు తాళ్లపూడి మండలం పోచ వరం గ్రామానికి చెందిన మహిళను ఈనెల 14న వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. వివాహం జరిగితే తమకు ఆస్తి దక్కదని భావించిన రాధాకృష్ణవేణి భాస్కరరావుని హతమార్చాలని నిర్ణయించుకుంది. భాస్కరరావును చంపితే రెండెకరాల పొలం ఇస్తానని బుట్టాయగూడెం మండలం ముప్పినవారిగూడెంకు చెందిన తమ్ముడు గన్నిన శ్రీహరితో ఒప్పందం కుదుర్చుకుంది. ఈనెల 8న ఉదయం 8 గంటలకు భాస్కరరావు పొలం వెళ్లగా శ్రీహరి చంపేశాడు. అదేరోజు రాత్రి వరుసకు అల్లుడు అయిన బుట్టాయగూడెం మండలం కంసాలిగుంటకు చెందిన కంగల రమేష్ అనే యువకుడి సాయంతో భాస్కరరావు శరీరంపై పెట్రోల్ పోసి తగులపెట్టి అక్కడే గొయ్యి తీసి పూడ్చిపెట్టారు. ప్రమాదంగా చిత్రీకరిస్తూ.. హత్య నుంచి బయటపడేందుకు భాస్కరరావు మోటారు సైకిల్‌ను ధుమంతునిగూడెం–పల్లంట్ల రోడ్డులో పోలవరం కుడికాలువలో పడవేశారు. ప్రమాదవశాత్తు భాస్కరరావు కాలువలోకి దూసుకెళ్లి గల్లంతైనట్టు చిత్రీకరించారు. అయితే భాస్కరరావు అదృశ్యంపై అనుమానం వచ్చిన బంధువు గెడ రామనరసింహారావు పొలానికి వెళ్లి చూడగా మృతదేహం బయటపడింది. తహసీల్దార్ సమక్షంలో దేవరపల్లి పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. ట్రైనీ డీఎస్పీ వై.శృతి ఆధ్వర్యంలో ప్రధాన నిందితుడు శ్రీహరితో పాటు రమేష్, రాధాకృష్ణవేణిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలవరం కాలువలో పడిఉన్న∙మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్టు డీఎస్పీ చెప్పారు. కేసుకు సహకరించిన సీఐ ఎం.సురేష్, ఎస్సై కె.స్వామిని అభినందించారు. -
దారుణం.. ఇసుక మాఫియా బరి తెగింపు
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇసుక మాఫియా మరోసారి రెచ్చిపోయింది. రాజాపూర్ మండలం తిరుమలాపూర్లో తన పంట పొలాల్లో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న రైతు గుర్రం కాడి నరసింహులును లారీతో ఢీకొట్టి.. ఇసుక మాఫియా ఆయన ప్రాణాలు బలిగొంది. గత ఏడాది అదే గ్రామంలో ఒక రైతుని కూడా అడ్డు వచ్చాడనే నెపంతో ఇసుక మాఫియా ఇసుక దిబ్బ కూల్చి రైతుని హత్య చేసినట్టు కూడా తెలిసింది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన పై గ్రామస్తులు మూకుమ్మడిగా దాడి చేసి లారీ అద్దాలు ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఒక ప్రజా ప్రతినిధితో ఇసుక మాఫియా సెటిల్ మెంట్ చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, నరసింహులు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో గ్రామస్తులు ధర్నాకు దిగారు. -
కన్నతల్లిని కడతేర్చిన కిరాతకుడు..
రోలుగుంట (చోడవరం): మద్యం మత్తులో కన్నతల్లినే హత్య చేశాడో కసాయి కొడుకు. విశాఖ జిల్లా రోలుగుంట మండలం గుండుబాడు పంచాయతీ శివారు బలిజపాలెంలో గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గేదెల నూకాలతల్లి (55) భర్త గతంలోనే మృతి చెందాడు. ఆమె తన ఒక్కగానొక్క కుమారుడు కృష్ణ (35)ను అల్లారు ముద్దుగా పెంచుకుంది. యుక్త వయస్సు రాగానే వివాహం చేసింది. అయినా కొడుకు బాగోగులు తల్లే చూసుకునేది. గురువారం రాత్రి ఆ తల్లి కుమారుడి కోసం పండ్ల జ్యూస్ తయారు చేసి ఇచ్చేందుకు ఎదురుచూస్తుండగా.. కృష్ణ పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మళ్లీ మద్యం తాగేందుకు తల్లిని డబ్బులు అడగడంతో ఆమె నిరాకరించింది. దీంతో మైకంలో ఉన్న అతను కోపోద్రిక్తుడై పక్కనే ఉన్న గిన్నెతో తల్లి తలపై అనేక సార్లు బలంగా కొట్టడంతో అధిక రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణం విడిచింది. వీఆర్వో నాగమణి ఇచ్చిన సమాచారం మేరకు రోలుగుంట ఎస్ఐ సంఘటన స్థలానికి వెళ్లి స్థానికులను విచారించారు. శుక్రవారం ఉదయం పంచనామా నిర్వహించి, నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టానికి మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘అమ్మ’మ్మలే హతమార్చారు..
బోసినవ్వుల బుజ్జాయిలను చూస్తే.. ఎవరికైనా ముద్దులాడాలనిపిస్తుంది. అప్పటి వరకు ఎంతో అలసటగా చిరాకుగా ఉన్న వారికి సైతం వారు కనిపిస్తే.. క్షణాల్లో అవన్నీ మాయమైపోతాయి. అభం శుభం తెలియని.. పసిపాపలంటే ఇష్టం లేని వారెవరూ ఉండరు. ఇక గోదావరి వాసులైతే ఆడపిల్ల పుడితే చాలని కనిపించే దేవతలందరికీ మొక్కుతారు. లక్ష్మీదేవితో సమానమని తరతరాలుగా నమ్ముతూ వస్తున్నారు.. ఆడపిల్ల పుట్టింది అనగానే ఆ ఇంట్లో సంబరం అంతా ఇంతా కాదు. బంగారు తల్లి పుట్టిందని మురిసిపోతారు. ఇక అత్త, మామలైతే.. మా ఇంటి కోడలు వచ్చేసిందంటూ తెగ ఆనందపడతారు. మరోవైపు ప్రభుత్వాలు సైతం ఆడపిల్లల సంరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. బేటీ పడావో.. బేటీ బచావో అని పాలకులు సైతం నినాదాలు చేస్తున్న రోజులవి.. కానీ సీతానగరం మండలం చినకొండేపూడి గ్రామంలో ఓ అమ్మ, అమ్మమ్మ, ముత్తమ్మలు ఆ పసిపాపను భారమనుకున్నారు. నవమాసాలు మోసి కన్న నవజాత శిశువును కనీస మానవత్వం లేకుండా కర్కశంగా చంపేశారు. చివరికి కటకటాలపాలయ్యారు. కోరుకొండ: సీతానగరం మండలంలో చినకొండేపూడి గ్రామానికి చెందిన కాళ్ల సతీష్, అదే గ్రామానికి చెందిన సృజన దంపతులు 2019 మేనెలలో వివాహమైంది. వీరు ఇక్కడే నివసిస్తున్నారు. భార్యకు నెలలు నిండటంతో భర్త సతీష్ ఆమెను రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా ఈనెల 4వ తేదీన ఆడపిల్లకు జన్మినిచ్చింది. ఆసుపత్రి నుంచి తల్లీబిడ్డలు సురక్షితంగా చినకొండేపూడి గ్రామం చేరుకున్నారు.. పుట్టింటికి చేరిన సృజనకు తన తల్లి మల్లిరెడ్డి మహాలక్ష్మి నుంచి నిరాదరణ ఎదురైంది. ఆడపిల్లకు జన్మనిచ్చావని అసహనం వ్యక్తం చేస్తూ వస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం రావులపాడు నుంచి వచ్చిన సృజన అమ్మమ్మ గంధం కనకరత్నం కూడా ఈ విషయంపై ఆగ్రహంగానే ఉంది. (ఒడి నుంచి మాయమై.. బావిలో శవమై..) మూడు తరాలుగా వంశంలో ఆడపిల్లలు జన్మించడం సమంజసంగా లేదని, ఆడబిడ్డ భారమని, పెరిగే కొద్దీ ఖర్చు పెట్టాల్సి ఉంటుందని కసి పెంచుకుంది. నవజాత శిశువును మునిమనురాలను కడతేర్చాలని నిర్ణయించుకుంది. కనకరత్నం, మహాలక్ష్మి ఈనెల 18వ తేదీ అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో వారి ఇంటికి సమీపంలో ఉన్న బావిలో ఆడశిశువును హత్య చేసి పడేశారు. అనంతరం బిడ్డను ఎవరో ఎత్తుకుపోయారని కేకలు వేశారు. దీంతో సీతానగరం ఇన్చార్జి ఎస్సై పి. విజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేయగా కోరుకొండ సర్కిల్ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు. శుక్రవారం తెల్లవారు జామున నవజాత శిశువు కిడ్నాప్ సంఘటన గ్రామంలో కలకలం రేపింది. చిన్నారి ఆచూకీ కోసం గ్రామస్తులు సైతం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ ముగ్గురూ..ఇలా దొరికారు... శుక్రవారం సాయంత్రం సుమారు నాలుగు గంటలు దాటిన తరువాత సమీపంలో ఉన్న పాడుబడ్డ బావిలో చిన్నారి చనిపోయి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. శిశువు మృతదేహాన్ని పోస్టుమారా్టనికి తరలించారు. అయితే ఈ సంఘటనలో లోతైన దర్యాప్తు చేసిన పోలీసులు కీలక అంశాలను సేకరించారు. ఆడశిశువును ఆమె తల్లి సృజన, అమ్మమ్మ ఎం.మహాలక్షి్మ, ముత్తమ్మ జి.కనకరత్నం హత్యచేసినట్టుగా గుర్తించి వారిని అరెస్టు చేశారు. ఆదివారం కోరుకొండ పోలీసు స్టేషన్ వద్ద రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఉత్తర మండలం డీఎస్పీ పి.సత్యనారాయణరావు, సీఐ పవన్‌కుమార్‌రెడ్డి, ఎస్సై విజయ్‌కుమార్ వారిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. డీఎస్పీ సత్యనారాయణరావు మాట్లాడుతూ ఆడబిడ్డ భారమనే భావంతోనే రక్త సంబంధులైన ముగ్గురు మహిళలు కలిపి హత్యకు పాల్పడ్డారన్నారు. ముక్కుపచ్చలారని చిన్నారని మొగ్గలోనే చిదిమేశారని తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ పవన్‌కుమార్‌రెడ్డి, ఎస్సై విజయ్‌కుమార్, హెడ్‌కానిస్టేబుల్ వాసంశెట్టి శ్రీను, గోవిందు, రాము, షేక్ వలీ, త్రిమూర్తులు, మహిళా కానిస్టేబుల్స్ ఉన్నారు.