Atlanta
-
గాటా దీపావళి వేడుకలు.. పోతిరెడ్డి నాగార్జున రెడ్డికి సన్మానం
-
అట్లాంటాలో ట్రంప్ ప్రచారం.. ర్యాలీలో పాల్గొన్న భారతీయ అమెరికన్ ఓటర్లు
-
అట్లాంటాలో ఘనంగా శంకర నేత్రాలయ “నవరసం” వేడుకలు
అట్లాంటాలో శంకర నేత్రాలయ “నవరసం” వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా కర్ణాటిక్ స్ట్రింగ్స్ వయోలిన్ స్టూడియో వ్యవస్థాపకురాలు జస్సోత బాలసుబ్రహ్మణ్యం శంకర నేత్రాలయ USA (SNUSA) ప్రెసిడెంట్ బాలా రెడ్డి ఇందుర్తి, ట్రస్టీ నీలిమ గడ్డమణుగుల ఆధ్వర్యంలో 8 విభిన్న శాస్త్రీయ నృత్య అకాడమీలతో సమన్వయంతో నిధుల సమీకరణ చేయడానికి ఆసక్తిని వ్యక్తం చేశారు. వయోలిన్ అకాడమీతో సహా, 9 అకాడమీలు పేద రోగులకు దృష్టిని పునరుద్ధరించే ఉదాత్తమైన కారణం కోసం సెప్టెంబర్ 14, 2024న నవరసం పేరుతో నిధుల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించాయి. హౌస్ ఫుల్ షో కావడంతో ఈ కార్యక్రమం పూర్తిగా విజయవంతమైంది. దీనికి శంకర నేత్రాలయకు, వారి మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. పాల్గొన్న అన్ని విద్యాసంస్థలు, గురువులు మరియు విద్యార్థుల సహాయాన్ని కృతజ్ఞతలు తెలిపారు.SNUSA బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ డా. రాజ్ మోడీ, ట్రస్టీ వంశీ కృష్ణ ఏరువరం సోషల్ మీడియాలో ఈవెంట్‌ను ప్రచారం చేయడంలో సహాయం చేసారు. SNUSA వ్యవస్థాపకుడు & అధ్యక్షుడు ఎమెరిటస్ S.N. ఆచార్య, బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్ ప్రసాద్ రెడ్డి, లీలా కృష్ణమూర్తి , కోశాధికారి బానోతు రామకృష్ణన్ అట్లాంటా టీమ్ గ్రాండ్ సక్సెస్‌పై అభినందనలు తెలిపారు. అగస్టా జిఎ ముఖ్య అతిథి టి.రామచంద్రారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయినప్పటికీ, ఆయన దత్తత తీసుకున్న నంది వడ్డెమాన్‌లో నవంబర్ 2024లో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారు. గౌరవ అతిథి డా. కల్పనా రెంగరాజన్ శంకర నేత్రాలయతో తనకున్న అనుబంధాన్ని, సంగీత నృత్య కచేరీ గురించి అద్భుతమైన అనుభవాన్ని పంచుకున్నారు ఈ ప్రతిపాదనను SNUSA బోర్డ్ ఆఫ్ అడ్వైజర్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ జగదీష్ షేత్ సులభతరం చేశారు.అట్లాంటా చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తడికమళ్లతో పాటు చాప్టర్ లీడ్స్ చిన్మయ్ దాస్మోహపాత్ర, హేమంత్ వర్మ పెన్మెత్స, సుధీర్ పాత్రో, విజయ్ గార్లపాటి ఈ ప్రయత్నానికి నాయకత్వం వహించారు. వాలంటీర్లు దేవాన్ష్ తడికమళ్ల, గిరి కోటగిరి, గోపాల అభిమన్యు పుల్లెల, మౌర్య కొప్పిరెడ్డి, పరిచాయి కృష్ణ కత్తెర్ల, శివెన్ పాత్రో ఈ కార్యక్రమం గ్రాండ్‌గా విజయవంతం కావడానికి చాలా సహాయం అందించారు. SNUSA ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మూర్తి రేకపల్లి, ట్రస్టీలు శ్రీని రెడ్డి వంగిమళ్ల, రాజశేఖర్ రెడ్డి ఐల, శ్రీధర్ రావు జూలపల్లి, నీలిమ గడ్డమణుగు, స్పోర్ట్స్ కమిటీ చైర్ రమేష్ బాబు చాపరాల, MESU UNIT (కమిటీ సభ్యుడు డాక్టర్ కిషోర్ రెడ్డి రసమల్లు నుండి సంపూర్ణ మద్దతు లభించింది.భారతదేశంలోని అంధులైన రోగులకు కంటిశుక్లం శస్త్రచికిత్సలకు మద్దతుగా మేము ఈ ఈవెంట్ నుండి గణనీయమైన నిధులను సేకరించాము. మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) అనేది చక్రాలపై ఉన్న ఆసుపత్రి మరియు చెన్నై, హైదరాబాద్ , జార్కండ్ నుండి 500 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఒక ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. ప్రతి MESU (సంచాలక వైద్య శిబిరం) లో రెండు బస్సులు ఉంటాయి. ఈ బస్సులు మారుమూల గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలోనే శస్త్రచికిత్సలు చేస్తుంటాయి. వీటిని ఐఐటీ మద్రాస్ డిజైన్ చేసి అభివృద్ధి చేసింది. బాలా రెడ్డి ఇందుర్తి , మూర్తి రేకపల్లి భారతదేశంలో ప్రస్తుతం MESU కార్యకలాపాలు ఎలా కొనసాగుతున్నాయి.ప్రస్తుతం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్ రాష్ట్రాలను కవర్ చేయడానికి చెన్నై, జార్ఖండ్, హైదరాబాద్ నుండి 3 MESU యూనిట్లు పూర్తిగా పనిచేస్తున్నాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళలోని కొన్ని ప్రాంతాలలో సేవలను కవర్ చేయడానికి SNUSA మరియు బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ ఆనంద్ దాసరి మద్దతుతో 4వ యూనిట్ జనవరి 2025 ప్రారంభంలో పుట్టపర్తిలో ప్రారంభమవుతుంది. ఐదవ MESU యూనిట్ 2025 3వ త్రైమాసికంలో వైజాగ్‌లో SNUSA మరియు బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ ఉదయ భాస్కర్ గంటి మద్దతుతో కోస్తా ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు మరియు ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాలను భువనేశ్వర్ వైపు కవర్ చేస్తుంది.అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్లు శ్రీని రెడ్డి వంగిమల్ల, రాజశేఖర్ రెడ్డి ఐల, నీలిమ గడ్డమణుగు , బాల ఇందుర్తి ఈ MESU 10 రోజుల కంటి శిబిరాలు వందలాది మంది రోగులకు వారి స్వస్థలాలలో చూపును ఎలా పునరుద్ధరించాయో వివరించారు. అలాగే అట్లాంటా బృందం భారతదేశంలో వేల సంఖ్యలో కంటిశుక్లం శస్త్రచికిత్సలకు మద్దతుగా నిధులను సేకరించేందుకు నవంబర్ 17న సంవత్సరాంతపు కచేరీని నిర్వహించాలని యోచిస్తోంది. -
గోల్ఫర్ సాహిత్‌కు రూ. 62 కోట్ల ప్రైజ్‌మనీ
అట్లాంటా (అమెరికా): ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ (పీజీఏ) సీజన్ ముగింపు ప్రతిష్టాత్మక టోర్నీ టూర్ చాంపియన్‌షిప్‌లో భారత సంతతి అమెరికన్ గోల్ఫర్ తీగల సాహిత్ రెడ్డి ఆకట్టుకున్నాడు. –24 అండర్ స్కోరుతో సాహిత్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ప్రదర్శనకుగాను సాహిత్‌కు 75 లక్షల డాలర్లు (రూ. 62 కోట్ల 93 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. విజేతకు రూ. 209 కోట్లుసాహిత్ తల్లిదండ్రులు మురళీధర్, కరుణ 1980 దశకంలో హైదరాబాద్ నుంచి అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. సాహిత్ కాలిఫోర్నియాలో జన్మించి అక్కడే పెరిగాడు. అమెరికాకే చెందిన స్కాటీ షెఫ్లర్ –30 అండర్ స్కోరుతో విజేతగా నిలిచి 2 కోట్ల 50 లక్షల డాలర్లు (రూ. 209 కోట్లు) ప్రైజ్‌మనీని దక్కించుకోగా... కొలిన్ మొరికావా –26 అండర్ స్కోరుతో రన్నరప్‌గా నిలిచి 1 కోటీ 25 లక్షల డాలర్ల (రూ. 104 కోట్లు) ప్రైజ్‌మనీని సొంతం చేసుకున్నాడు. -
బ్రెయిన్ సర్జరీలో వైద్యుల తప్పిదం..పాపం ఆ రోగి..!
బ్రెయిన్ సర్జరీ కోసం వెళ్లి పుర్రెలో కొంత భాగాన్ని కోల్పోయాడు. పోనీ అక్కడితో అతడి కష్టాలు ఆగలేదు. చివరికి వైద్యులు అతడికి సింథటిక్ ఎముకను అమర్చి సర్జరీ చేశారు. అది కూడా వర్కౌట్ అవ్వకపోగా ఇన్ఫెక్షన్ సోకి ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఆస్పత్రి బిల్లులు కూడా తడసి మోపడయ్యాయి. వైద్యులు తప్పిదం వల్లే నాకి పరిస్థితి అని సదరు ఆస్పత్రిపై దావా వేశాడు. ఈ దిగ్బ్రాంతికర ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..అమెరికాకు చెందిన ఫెర్నాండో క్లస్టర్ విపరీతమైన తలనొప్పికి తాళ్లలేక సెప్టెంబర్ 2022లో ఎమోరీ యూనివర్సిటీ హాస్పిటల్ వెళ్లాడు. అక్కడ వైద్యులు అతడికి ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ ఉన్నట్లు గుర్తించాడు. దీని కారణంగా బ్రెయిన్లో బ్లీడ్ అవుతుంది. ఆ సమయంలో వైద్యులు ఒత్తడిని తగ్గించేందుకు 4.7 బై-6-అంగుళాల పుర్రె ముక్కని తొలగించాలని నిర్ణయించారు. పుర్రె భాగాన్ని మార్చిన రెండు నెలల తర్వాత యథావిధిగా తొలిగించిన భాగాన్ని రీప్లేస్ చేసేందుకు యత్నించగా..అక్కడ ఇతర రోగుల పుర్రె భాగాలు కూడా ఉండటంతో అందులో అతడిది ఏదో గుర్తించడంలో విఫలమయ్యారు వైద్యులు. దీంతో ఆస్పత్రి అతడికి సింథటిక్ పుర్రె భాగాన్ని కృత్రిమంగా తయారు చేసి ప్రత్యామ్నాయంగా అమర్చింది. ఇలా సింథటిక్ ఎముక కోసం సదరు రోగి నుంచి ఏకంగా రూ. 15 లక్షలు వసూలు చేసింది. అయితే ఇలా రోగికి సింథటిక్ ఎముకను పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ బారిని పడి అదనంగా మరికొన్ని సర్జరీలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెప్పాలంటే సదరు రోగికి బ్రెయిన్ సర్జరీ శారీరకంగా, ఆర్థికంగా భయానక అనుభవాన్ని మిగిల్చింది. ఈ సమస్య నుంచి బయటపడేటప్పటికీ అతడికి ఆస్పత్రి బిల్లు ఏకంగా కోటి రూపాయల పైనే ఖర్చు అయ్యింది. వైద్యుల తప్పిదం కారణంగా జరిగిన నష్టాన్ని కూడా తనపైనే రుద్ది మరీ డబ్బులు వసూలు చేశారంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. తాను శరీరంలో కొంత భాగాన్ని కోల్పోవడమే గాక, ఆర్థికంగా శారీకంగా ఇబ్బందులు పడేలా చేసినందుకు గానూ సదరు ఆస్పత్రి తనకు నష్ట పరిహారం చెల్లించాల్సిందే అంటూ దావా వేశాడు.(చదవండి: హోటల్ వ్యాపారం నుంచి ఏకంగా దేశ ప్రధాని స్థాయికి..!) -
అట్లాంటా భారత రాయబార అధికారులను కలిసిన నాట్స్ బృందం
అట్లాంటాలోని భారతీయ రాయబార అధికారి రమేశ్ ను ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నాయకులు కలిసి నాట్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అట్లాంటా నాట్స్ నాయకులు నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సురేశ్ పెద్ది, అట్లాంటా నాట్స్ నాయకులు ఇండియన్ కాన్సులేట్ అధికారులతో చర్చించారు. నాట్స్ హెల్ప్ లైన్, అమెరికాకు వచ్చే విద్యార్ధులకు చేయాల్సిన, చేయకూడని పనులపై అవగాహన, గృహహింస బాధితులకు అండగా నిలబడటం, మానసిక పరిణితి పెంచేలా సదస్సులు, ప్రతిభ గల విద్యార్ధులకు పురస్కారాలు, స్థానిక కమ్యునిటీ సేవలు ఇవన్నీ నాట్స్ ఎలా చేస్తుంది..? అమెరికాలో తెలుగుజాతికి ఎలా అండగా నిలబడుతుందనే విషయాలను కాన్సులేట్ అధికారులకు వివరించారు. నాట్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలుసుకున్న అట్లాంటా భారత రాయబార కార్యాలయాన్ని నాట్స్ నాయకత్వాన్ని ప్రత్యేకంగా అభినందించింది. ప్లోరిడాలో కూడా భారత కాన్సులేట్ జనరల్ నిర్వహించే కార్యక్రమాల్లో నాట్స్ చురుకుగా పాల్గొంటుందని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని తెలిపారు.. భారత రాయబార కార్యాలయంతో తమ అనుబంధం మరింత బలోపేతం అవుతుందనే నమ్మకాన్ని ప్రశాంత్ వ్యక్తం చేశారు.(చదవండి: ఆఫ్రికాలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు)a -
USA Presidential Elections 2024: తప్పుకోవాలంటూ బైడెన్‌పై ఒత్తిళ్లు
వాషింగ్టన్: అట్లాంటాలో టీవీలో ముఖాముఖి చర్చలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ధాటికి చేతులెత్తేసిన డెమొక్రటిక్ అభ్యర్థి, అధ్యక్షుడు జో బైడెన్‌పై సొంత పారీ్టలోనే వ్యతిరేకత ఎక్కువవుతోంది. 81 ఏళ్ల వయసున్న ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆయన మాత్రం తాను తప్పుకునే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు! ట్రంప్‌తో చర్చలో బైడెన్ పేలవ ప్రదర్శనను పలు మీడియా సంస్థలు సంపాదకీయాల్లో ఏకిపారేశాయి. సోషల్ మీడియాలో మీమ్స్‌కు కొదువే లేదు. ఈ విమర్శలపై బైడెన్ స్పందించారు. ‘‘బరాక్ ఒబామా మాదిరి ప్రత్యర్థిని నేను వాగ్ధాటితో ఇరుకున పెట్టలేకపోయిన మాట వాస్తవమే. దీనిపై నా మద్దతుదారులు, పారీ్టలోనూ కొంత అసంతృప్తి నెలకొందని తెలుసు. కానీ ట్రంప్‌పై మరింతగా పోరాడతా’ అని అన్నారు. డెమొక్రటిక్ ముఖ్యుల్లో పెరిగిన అసంతృప్తి ట్రంప్‌తో డిబేట్ తర్వాత బైడెన్ అభ్యరి్థత్వంపై చాలా మంది డెమొక్రటిక్ నేషనల్ కమిటీ(డీఎన్సీ) సభ్యుల్లో అసమ్మతి పెరిగింది. యువనేతకు అవకాశమిశ్వాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. షికాగోలో ఆగస్ట్ 19న జరిగే డెలిగేట్ల భేటీలో దీనిపై కీలక నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ వర్గాల కథనం. -
వెంటాడి వేటాడేసింది.. ఈ కుక్కకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
విశ్వాసానికి పెట్టింది పేరు శునకం. పెంపుడు జంతువుల్లో బాగా పాపులర్ అయింది కూడా కుక్క. ఇంటి యజమాని, కుటుంబం ఏదైనా అనుకోని ప్రమాదంలో పడినపుడు చాకచక్యంగా వ్యవహరించి కాపాడుతుంది. ఒక్కోసారి ప్రాణాలకు తెగించి మరీ విశ్వాసాన్ని చాటుకుని హ్యాట్సాఫ్ అనిపించుకున్న ఘటనలు చాలానే చూశాం. అయితే పగబట్టి, వెంటాడి వేటాడిన ఘటనలు చాలా అరుదు కదా. ఇలాంటి ఘటన ఒకటి అట్లాంటాలో చోటు చేసుకుంది.వివరాలను పరిశీలిస్తే..తన యజమాని కుటుంబానికి చెందిన గొర్రెలు, మేకల మందకు కాపలాగా ఉంది ఒక కుక్క. దాని పేరు కాస్పర్. ఒకరోజు గొర్రెలమందపై ఒక్కసారిగా 13 తోడేళ్ల గుంపు (కొయెట్, అమెరికన్ జాకల్) దాడి చేసింది దీంతో అక్కడే ఉన్న కుక్క వాటిపై ఎటాక్ చేసింది. ఎనిమిదింటిని అక్కడికక్కడే చంపేసింది.Atlanta Dog fights 13 coyotes attacking his sheep. Kills 8 on the spot. Goes missing 4 days. Comes home after killing the remaining 5. Salute 🫡 pic.twitter.com/OYDKhuzscW— trader (@TicTocTick) June 25, 2024ఇంతటితో దాని కోపం చల్లారలేదు. నాలుగు రోజులు అదృశ్యమై, వాటిని వెదికి పట్టుకొని మరీ వేటాడి, మిగిలిన ఐదు తోడేళ్ల పని కూడా పట్టింది. ఆ తర్వాత మాత్రమే ఇంటికి చేరింది. తీవ్ర గాయాలతో ఇంటికి చేరిన దాన్ని చూసి, ఇక బతకదని భావించారట దాని యజమాని వీర్విల్లే. ఆ తరువాత కొంతకాలం లైఫ్‌లైన్ యానిమల్ ప్రాజెక్ట్ సంరక్షణలో కోలుకుంది హీరో కాస్పర్. గత ఏడాది చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇన్‌స్టా,, ఎక్స్‌లో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. -
ఆటా ఉత్సవాల్లో విజయ్ దేవరకొండ
-
అట్లాంటాలో అట్టహాసంగా ముగిసిన 18 వ ఆటా కన్వెన్షన్
నవత, యువత, భవిత నినాదంతో తెలుగు వారి అతి పెద్ద పండుగ ఆటా 2024 వేడుక అమెరికాలో ఘనంగా జరిగింది. జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ లో జూన్ 7 నుండి 9 వరకు అట్లాంటా లో జరిగిన 18వ ఆటా కన్వెన్షన్ కు 18 వేల మంది పైగా హాజరయ్యారు. ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, కన్వీనర్ కిరణ్ పాశం నాయకత్వంలో తొలి రోజు బ్యాంకెట్ సమావేశం జరిగింది. తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు దుద్దిళ్ల, కాన్సులేట్ జనరల్ రమేష్ బాబు లక్ష్మణన్, ధ్యాన గురు దాజి, సినీ నటులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, హీరో శ్రీకాంత్, హీరోయిన్ మెహ్రీన్, నేహా షెట్టి, తమ్మారెడ్డి భరద్వాజ, తనికెళ్ళ భరణి హాజరయ్యారు.జార్జియా రాష్ట్ర అభివృద్ధికి తెలుగు వారి సేవలు అభినందనీయం- జార్జియా గవర్నర్ బ్రయాన్ కెంప్ జార్జియా రాష్ట్ర అభివృద్ధికి తెలుగు వారు తోడ్పడుతున్నందుకు కొనియాడారు జార్జియా గవర్నర్ బ్రయాన్ కెంప్ . ఇండియా తమకు కీలక భాగస్వామి అన్నారు. ముఖ్యంగా తెలుగు వారి సేవలను ఎప్పటికీ గుర్తుంచు కుంటామని అన్నారు. ఆటా వేడుకల లో జార్జియా గవర్నర్ పాల్గొన్నారు.యువత భవిష్యత్తుకు పెద్దపీటనవత, యువత, భవిత అనే లక్ష్యాలతో ఈ సారి కన్వెన్షన్ నిర్వహించామని ఆటా అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, అధ్యక్షురాలు మధు బొమ్మినేని వెల్లడించారు. చరిత్రను తిరగరాసిన ఈ కన్వెన్షన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. ఆటా నవల పోటీ లు..త్రీఓరీ మ్యూజికల్ కాన్సర్ట్ చాలా విన్నూత్నంగా, యువతను ఆకర్షించే విధంగా సాగింది. ఈలల గోలల తో మారు మోగిపోయింది. భద్రాద్రి శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ కమిషనర్ హనమంతరావు హాజరయ్యారు. యూత్ కమిటీ సమావేశాలు ఈసారి హై లైట్ గా నిలిచాయి. ఏ ఐ సెమినార్, సెలబ్రిటీలతో క్యూ & ఏ, వివిధ విషయాలపై డిబేట్స్ వినోదాత్మకంగా సాగాయి. ఉమెన్స్ ఫోరమ్ లో మహిళా సాధికారత, గృహ హింస, వంటి అంశాలు చర్చించారు. మెహ్రీన్, దేవరకొండ బ్రదర్స్ తో ముఖాముఖీ కార్యక్రమాలు నిర్వహించారు. బిజినెస్ ఫోరంలో రాష్ట్ర మంత్రులు, కాన్సులేట్ జనరల్ రమేష్ బాబు, తెలంగాణ ఐటీ అడ్వైజర్ రవి తంగిరాల తదితరులు పాల్గొనగా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా మోడరేటర్ గా వ్యవహరించారు. ఎప్పుడూ లేని విధంగా బిజినెస్ పిచ్చింగ్ జరిగింది. టెక్నాలజీ, ట్రేడ్ ఫోరంలో ఏ ఐ వంటి అత్యాధునిక విషయాల ప చర్చ జరిగింది. యెన్ ఆర్ ఐ కమిటీ ఇమ్మిగ్రేషన్, టాక్స్, యెన్ ఆర్ ఐ ఇష్యూస్ సెమినార్లు, ఆంధ్రా, తెలంగాణా, అమెరికా పొలిటికల్ ఫోరంలలో వివిధ విషయాలపై చర్చ ఆసక్తిగా సాగింది. సాహిత్య ఫోరమ్ లో కథా సాహిత్యం, సమకాలీన నవల, పుస్తక ఆవిష్కరణలు జరిగాయి. అష్టావధానం రకరకాల చిక్కుముడులతో రసవత్తరంగా సాగింది. తనికెళ్ళ భరణి, గంగాధర శాస్త్రి ప్రవచనాలు అద్భుతంగా సాగాయి. బ్యూటీ పెజెంట్ వేరే లెవెల్లో ఘనంగా జరిగింది, గెలిచిన వారికి దేవరకొండ బ్రదర్స్ కిరీటాలను అందించారు.జీవిత భాగస్వాములను కోరుకునే పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆటా మ్యాట్రిమోనీకి అధిక సంఖ్యలో హాజరయ్యారు. మరోవైపు ప్రధాన కార్యక్రమంలో దాజీ శ్రీ కమలేష్ పటేల్ పాల్గొని ప్రేక్షకులకు సందేశo ఇచ్చారు. థమన్ మ్యూజికల్ కాన్సర్ట్ చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ఉర్రూతలూగించింది. వివిధ రంగాలలో ప్రతిభాపాటవాలు చూపించిన 17 మందికి ఆటా అవార్డులు ప్రదానం చేశారు. మాజీ అధ్యక్షులు భువనేష్ బూజాల, హరి ప్రసాద్ రెడ్డి లింగాల, రామకృష్ణారెడ్డి ఆల, సాయినాథ్ బోయపల్లి, విజయ్ కుందూరు, రఘువీరారెడ్డిలకు అవార్డులు, ఆటా లైఫ్‌టైమ్ సర్వీస్ అవార్డును డాక్టర్ రాజేశ్వర్ రావు టేక్మాల్‌కు అందజేశారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ జర్నలిస్ట్ అసోసియేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి సన్మానం చేశారు. ఆటా మహా సభలు అట్లాంటాలో జరగడం ఇది మూడోసారి. 2000, 2012లో అట్లాంటాలో ఆటా సమావేశాలు జరగగా ఇప్పుడు మళ్లీ పదేళ్ల తరవాత జరిగాయి. కన్వెన్షన్ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, కో కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. -
18వ ఆటా కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్: అదిరిపోయిన ఆరంభం!
ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ జూన్ 7న బ్యాంకెట్తో మొదలయ్యి..మూడు రోజులు వివిధ కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా జరిగాయి. జార్జియా వరల్డ్ కాంగ్రె సెంటర్ ప్రాంగణం ఈ వేడుకుల కోసం అంత్యంత సుందరంగా ముస్తాబయ్యింది. అట్లాంటాలో ఈ వేడుకలు 2000, 2012లో జరగగా మళ్లీ ఇన్నేళ్లకు జరగడం విశేషం. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనంతో ప్రారంభించిన అనంతరం కన్వెన్షన్ కోర్ టీం కన్వీనర్ కిరణ్ పాశం, అధ్యక్షురాలు మధు బొమ్మినేని ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాన్ని ఇంతలా దిగ్విజయంగా చేసుకునేందుకు సహకరించిన స్పాన్సర్లను కోర్ కమిటీ తోపాటు ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, సెక్రటరీ రామకృష్ణ రెడ్డి ఆలా, ట్రెజరర్ సతీష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ తిరుపతి ఎర్రంరెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, బోర్డు అఫ్ ట్రస్టీలు ఘనంగా సత్కరించారు. ఇక ఆటా అవార్డ్స్ కమిటీ వివిధ రంగాలలో ప్రతిభాపాటవాలు చూపించిన వారికి అవార్డులు ప్రదానం చేసింది. ఈ వేడుకలో జరిగిన పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలంగాణ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు దుద్దిళ్ల, సినీ నటులు శ్రీకాంత్, మెహ్రీన్, నేహా షెట్టి, తమ్మారెడ్డి భరద్వాజ, సందీప్ రెడ్డి వంగా వంటి పలువురు విశిష్ట అతిథులు ఆటా వారి ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలియ జేసి, అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనూప్ రూబెన్స్ బృందం చేసిన మ్యూజికల్ కాన్సర్ట్ చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ఉర్రూతలూగించింది. రుచికరమైన భోజనాలు అందరి జిహ్వ చాపల్యాన్ని తీర్చాయి. ఇక ఈ వేడుకలో యూత్ కాన్ఫరెన్స్ హైటెట్గా నిలిచింది. ఎక్కడెక్కడ నుంచే పెద్ద ఎత్తున యువతీయువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ ఆటా నవత, యువత, భవితకు ఆటా పెద్ద పీట వేస్తుందంటూ దీని ప్రాముఖ్యత గురించి వివరించారు ప్రెసిడెంట్ మధు బొమ్మినేని ఇంకా ఎన్నో ఆకట్టుకునే అలాగే అట్లాంటా నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుండి పలు నాన్ ప్రాఫిట్ సంస్థల నుంచి ఎంతో మంది వచ్చారు. వారందరికీ కన్వీనర్ కిరణ్ పాశం అభినందనలు తెలిపి, ఈ కన్వెన్షన్ ఎలా మొదలయ్యిందీ, ఎంత మంది పాటుపడ్డారు, వాలంటీర్ల కృషి మున్నగు వివరాలు గురించి వివరించారు. ఆటా టీం గౌరవ అతిథులకు కృతజ్ఞతలు తెలియజేసి, సముచితంగా సత్కరించారు. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేసుకుని అందరం కలిసి పాల్గొని ఆనందిద్దాం అని అన్నారు కన్వీనర్ కిరణ్ పాశం.(చదవండి: 18వ ఆటా కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ సర్వం సన్నద్ధం!) -
మహేష్ బాబు గురించి చెప్పిన శ్రీమంతుడు నటి
-
18వ ఆటా మహాసభల్లో మెహ్రీన్ సందడి
-
అట్లాంటాలో తెలుగువారిని చూసి శ్రీకాంత్ సంతోషం
-
అట్లాంటాలో ఘనంగా ఆటా బాంక్వెట్ వేడుకలు
-
అట్లాంటాలోని గాంధీ విగ్రహానికి తెలంగాణ ఐటీ మంత్రి నివాళులు
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్‌బాబు అట్లాంటాలోని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. గాంధీ ఫౌండేషన్ ఆఫ్ యూఎస్ఏ (ఎఊ్ఖ అ) ఆహ్వానం మేరకు అట్లాంటా వెళ్లిన ఆయన డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ సెంటర్లోని గాంధీ కాంస్య విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఫ్రీడమ్ హాల్, గాంధీ రూమ్, కింగ్ రూమ్, ఎటర్నల్ ఫ్లేమ్, ప్రసిద్ధ ఎబినేజర్ బాప్టిస్ట్ చర్చి, కింగ్స్ బర్త్ హోమ్, విజిటర్స్ సెంటర్, కింగ్ క్రిప్ట్‌లను సందర్శించారు.అట్లాంటాలో గాంధీ విగ్రహ ఏర్పాటుకు సాకారం చేసినందుకు ఇండియన్ ఎంబసీ, ఇండియా కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, వివిధ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్‌తో పాటు నేషనల్ పార్క్ సర్వీస్‌కు శ్రీధర్ బాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ స్మారక చిహ్నం ఏటా కింగ్ పార్క్‌ను సందర్శించే లక్షలాది మంది పర్యాటకులకు అహింస, శాంతి కోసం పోరాడాలనే విషయం గుర్తుకుతెస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్ట్, జీఎఫ్‌యూఎస్‌ఏ మీడియా డైరెక్టర్ రవి పోణంగి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంటోనీ థాలియాత్, ఛైర్మన్ సుభాష్ రజ్దాన్ తదితరులు పాల్గొన్నారు. అమెరికాలోని గాంధీ ఫౌండేషన్‌ను 1997 అక్టోబర్ 26న స్థాపించారు. -
అట్లాంటాలో అట్టహాసంగా ఆటా కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్!
జూన్ 7 నుంచి 9 వరకు అట్లాంటాలో అత్యంత భారీగా, మిన్నంటేలా జరగనున్న ఆటా కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్ ఏర్పాట్లు బ్రహ్మాండంగా సాగుతున్నాయి. సాంస్కృతిక, సాహిత్య, సంగీత, నృత్య, ఆధ్యాత్మిక, వ్యాపారం, వ్యవస్థాపకత, అవార్డులు, అంగళ్ళు, ఆరోగ్యం, నాయకత్వం, కళలు, మ్యాట్రిమోనీ, పేజంట్ వంటి ఎన్నెన్నో ప్రత్యేక కార్యక్రమాలు ఆ మూడు రోజులలో జరగనున్నాయి. ఆటా వారు యువత తమకు ఎంత ముఖ్యమో చాలాసార్లు తెలియజేసారు, చేతల్లో చూపిస్తున్నారు కూడా. యువతకు ఉపయోగకరంగా సరదాగా సాగే చాలా ఈవెంట్స్ ఉన్నాయి. వారికి ఒక ప్రత్యేక కమిటీ కూడా ఉంది. వినోద, వివేక, విజ్ఞానాల కలబోతగా ఉండనున్న కన్వెన్షన్ గురించి ఎంత సేపైనా మాట్లాడుకోవచ్చు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక విందు సరే సరి, తెలుగు వారి వంటకాలు నోరూరేలా, ఘుమ ఘుమ లాడుతూ చాలానే ఉండనున్నాయి. వివిధ రంగాలలో ప్రముఖులకు ఆటా అవార్డులు అందజేయటం ఆనవాయితీగా వస్తోంది. పొద్దు పోయాక జరిగే మ్యూజికల్ కాన్సర్ట్ లు ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణే. మహిళా సాధికారికత కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విశిష్ట అతిథుల విషయానికి వస్తే, తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు శ్రీ. రేవంత్ రెడ్డి, శ్రీ. జగన్ మోహన్ రెడ్డిని, ఎంతో మంది ప్రముఖ నటులను, దర్శకులను, సాహితీ వేత్తలను, శాస్త్రఘ్నులను, వ్యాపారవేత్తలను, న్యాయ కోవిదులను, వివిధ రంగాలలో నిష్ణాతులను ఆటా నాయకత్వం ఆహ్వానించడం జరిగింది. భారతదేశం నుంచి ఇప్పటికే విజయ్ దేవరకొండ, జాహ్నవి కపూర్, మెహ్రీన్, శ్రీకాంత్, థమన్, అనూప్ రూబెన్స్, సందీప్ రెడ్డి వంగా, తనికెళ్ళ భరణి వంటి వారు వస్తున్నామని నిర్ధారించారు, ఇంకా తెలంగాణా క్యాబినెట్ మంత్రులు, ఎందరో తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు విచ్చేస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు ఒకే చోట జరగడం చిరస్మరణీయం. ఆలస్యం దేనికీ, రండీ కదలి రండి, ఈ అత్యద్భుతాన్ని ఆస్వాదించండి. మరిన్ని వివరములకు https://ataconference.org, ఎర్లీ బర్డ్ టికెట్లకు https://ataconference.org/Registration/Attendee-Registration ని సందర్శించండి.జార్జియా కాంగ్రెస్ సెంటర్ ప్రాంగణం చాలా పెద్దది. కన్వెన్షన్ కి 15 నుండి 20 వేల మంది వస్తారని అంచనా, వీళ్ళందరికీ ఈ సెంటర్ చాలా వసతిగా ఉంటుంది. ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని, కన్వీనర్ కిరణ్ పాశం ఆధ్వర్యంలో చాలా టీములు వెళ్లి సదుపాయాలు చూసి వచ్చారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మధు గారు మాట్లాడుతూ.. వేల మంది వందల రోజులు ఈ కన్వెన్షన్ కోసం శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇది అభినందనీయం. అందరూరండి, కన్వెన్షన్‌లో పాలు పంచుకోండని అన్నారు. అమెరికా విషయానికి వస్తే, జా2ర్జియా గవర్నర్ బ్రయాన్ కెంపిని ఆహ్వానించారు. ఆయన వీలుంటే తప్పకుండా వస్తాను అన్నారు. అట్లాంటాలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ రమేష్ బాబు లక్ష్మణను సాదరంగా ఆహ్వానించారు. కన్వీనర్ కిరణ్ గారు మాట్లాడుతూ.. కాన్సులేట్ జనరల్ రావడం కార్యక్రమానికి ఎంతో వన్నె తెస్తుందని శ్లాఘించారు. అలానే, లోకల్ లీడర్స్ ఎందరినో పిలిచామనీ, వారందరూ విచేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ మెన్ రిచ్ మెకార్మిక్, సెనేటర్ జాన్ ఆసాఫ్, స్టేట్ రెప్రెసెంటేటివ్ టాడ్ జోన్స్, కమీషనర్లు లారా సేమాన్సన్, ఆల్ఫ్రెడ్ జాన్, సిటీ కౌన్సిల్ దిలీప్ తున్కి, బాబ్ ఎర్రమిల్లి, నరేందర్ రెడ్డి, ఇంకా సిటీ మేయర్లు, ఇతర నాయకులను ఆహ్వానించడం జరిగింది. కోర్ కమిటీ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, కో కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ్ పలు కమిటీలను, నాయకులను, వాలంటీర్లను తదితరులు సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారని అన్నారు.ఇండియా నుంచి తేవలసిన వస్తువులు. ఇక్కడ కావలసినవి ఇప్పటికే సమకూరుస్తున్నారు. ఎక్సిబిట్స్ విషయానికి వస్తే, దాదాపు 200 లకు పైగా స్టాల్ల్స్ ఉండనున్నాయి. ఇంకా చాలా మంది పెడదామనుకున్నా, ఇంకే అవకాశం లేదని నిర్వాహకులు చెప్పారు. ఆటా ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, పాస్ట్ ప్రెసిడెంట్ భువనేశ్ బూజాల, సెక్రటరీ రామకృష్ణ రెడ్డి ఆల, ట్రెజరర్ సతీష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ తిరుపతి ఎర్రంరెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు తోపాటు ఎంతో మంది కృషి చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే, చాలా విశేషాలు ఉన్నాయి. త్వరలో కలుద్దాం. ఈ మధ్యలో మీకు మరిన్ని వివరాలు కావాలంటే, ఆటా సోషల్ మీడియా, వెబ్ సైట్, టీవీ ఇంటర్వ్యూ లు, పత్రికలు చూస్తూ ఉండండి.(చదవండి: తానా ప్రపంచసాహిత్యవేదిక నాల్గవ వార్షికోత్సవ వేడుకలు !) -
గ్రేటర్ అట్లాంటా తెలుగు సంఘం ఉగాది వేడుకలు!
గ్రేటర్ అట్లాంటా తెలుగు సంఘం వారి ఉగాది వేడుకలు అంగ రంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ SplashBI వారి సహాయ సహకారంతో, ఏప్రిల్ 13న డేశానా మిడిల స్కూల్(Desana Middle School)లో వేడుకగా నిర్వహించారు. ఈ వేడుకకు దాదాపు 1800 మందికి పైగా విచ్చేశారు. తెలుగు వారి సాంప్రదాయా పద్ధతిలో గణనాథుని ఆరాధన, జ్యోతి ప్రజ్వలన శ్రీకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నోరూరించే షడ్రుచుల ఉగాది పచ్చడి..వినోదాత్మక రీతిలో యాంకరింగ్ చేసిన లావణ్య గూడూరు, లక్మీ మండవల్లిల అల్లరి ముచ్చటలతో మునగితేలారు. ఈ ఈవెంట్లో దాదాపు 200 మంది చిన్నారుల ఆట పాటల సందడి, అతిధుల సాంప్రదాయ వస్త్రదారణ, విభిన్న కళా ప్రదర్శనలు ఆద్యంతం ఆహుతులను మంత్ర ముగ్దుల్ని చేశాయి. ఈ వేడుకలో పాల్గొన్న వారికి ఫుడ్ స్పాన్సర్లు ప్రశాంత్, బిర్యాని హౌస్ మహేష్ స్టాప్ ఈట్ రిపీట్( Stop Eat Repeat) వారు నోరూరించే కమ్మని వంటకాలను అదించారు. ఈ కార్యక్రమంలో దుర్గ మ్యూజికల్ కన్సర్ట్‌తో అఖిల్ అందించిన డీజే మ్యూజిక్ దద్ధరిల్లగా, అందులో అద్భతమైన గాయని అంజనా సౌమ్యా తన గాన మాదుర్యంలో ఆహుతలను రంజిప చేసింది. అంతేగాదు ఈ వేడుకల్లో పెద్దా, చిన్నా, పిల్లలు చిందులేసి సంతోషంగా గడిపారు. చివరిగా శ్రీరాములోరి రథం తరలిరావడం, అక్షింతలు, ప్రసాదాలు, ఆశీర్వాదాలు అక్కడున్న వారందర్నీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేశాయి. ఇక గాటా ఈసీ బోర్డు(Gata EC బోర్డు) సభ్యులకు సహకారులకు, సంస్థ శ్రేయోభిలాషులకు, విశిష్ట అతిథులకు, విచ్చేసిన అతిథులందరికీ పేరుపేరునా కృతజ్క్షతలు తెలియజేశారు గాటా ప్రెసిడెంట్ స్వప్న కస్వా. (చదవండి: అమెరికలో కలవర పెడుతున్న భారత విద్యార్థుల మరణాలు..ఎఫ్ఐడీఎస్ సీరియస్!) -
అట్లాంటా గ్యాస్ స్టేషన్ దోపిడీ.. ఇంటి దొంగల పనే!
అట్లాంటాలోని బుఫోర్డ్ హైవేలోగల గ్యాస్ స్టేషన్లో గత జనవరి 21న జరిగిన సాయుధ దోపిడీని దులుత్ పోలీస్ డిపార్ట్మెంట్ ఛేదించింది. వివరాల్లోకి వెళితే గ్యాస్ స్టేషన్ నిర్వాహకుడు, క్యాషియర్ రాజ్ పటేల్.. నలుపు రంగు దుస్తులు ధరించిన గుర్తు తెలియని వ్యక్తి తనపై దాడి చేశాడని, ఐదువేల డాలర్లు దొంగిలించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్యాస్ స్టేషన్‌లోని సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్ సోషల్ మీడియాలో ప్రసారం అయినప్పుడు ఈ సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. రాజ్ పటేల్‌ను ఆ గుర్తు తెలియని వ్యక్తి కొట్టగానే అతను వెంటనే కింద పడిపోయినట్లు వీడియోలో కనిపించింది. రాజ్ పటేల్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అతనితో పాటు అదే గ్యాస్ స్టేషన్లో పనిచేస్తున్న కర్టిస్లను విచారించారు. దీనిలో వారు డబ్బు కోసం కుట్ర పన్నారని తేలడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. పటేల్ ఈ దోపిడీకి సంబంధించి చెబుతున్నదానిలో పోలీసులకు పలు అనుమానాలు తలెత్తాయి. రాజ్ పటేల్ విచారణ అధికారులతో గుర్తు తెలియని వ్యక్తి తన ముఖంపై కత్తితో దాడి చేశాడని చెప్పాడు. అయితే పోలీసులకు రాజ్ పటేల్ ముఖంపై ఎలాంటి గుర్తులు కనిపించలేదు. సెక్యూరిటీ ఫుటేజ్‌లో కర్టిస్.. రాజ్ పటేల్‌ను మెల్లగా కొట్టినప్పటికీ అతను వెంటనే పడిపోవడం పోలీసులలో అనుమానాలను పెంచింది. తనపై దాడిచేశాక ఆ గుర్తు తెలియని వ్యక్తి బయటపడేందుకు గ్యాస్ స్గేషన్లోని మరో తలుపును ఉపయోగించాడని రాజ్ పటేల్ పోలీసులకు చెప్పాడు. దీంతో ఆ అధికారి అదే తలుపు నుండి బయటకు వెళ్లి అక్కడ పరిశీలించాడు. కర్టిస్ ఆ గదిలో పనిచేసేవాడని పటేల్ పోలీసులకు తెలిపాడు. అయితే కర్టిస్ తాను ఈ దాడి జరిగిన సమయంలో ఎవరినీ చూడలేదని పోలీసు అధికారులకు చెప్పాడు. వీడియో ఫుటేజీలో ఆ గుర్తు తెలియని వ్యక్తి సైడ్ డోర్ నుండి బయటకు వెళ్లి, అక్కడున్న చెత్తకుప్ప దగ్గర రెండుసార్లు బట్టలు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో పోలీసులు కర్టిస్‌ను అదుపులోకి తీసుకుని, ఆ గది కీని అడిగారు. అతను కీని బయటకు తీసే సమయంలో అతని జేబులో నుండి విలువైన బిల్లులు పడిపోవడాన్ని పోలీసులు గుర్తించారు. కర్టిస్ గ్యాస్ స్టేషన్లో ఉద్యోగి అని, ఈ దోపిడీకి పాల్పడింది అతనేనని పటేల్ పోలీసుల ముందు ఆరోపించాడు. పోలీసుల విచారణలో కర్టిస్ తాను నగదు దొంగిలించినట్లు అంగీకరించాడు. అయితే ఇదంతా రాజ్ పటేల్ చేసిన ప్లాన్ అని, తాను దొంగిలించిన నగదు తీసుకుంటే, రాజ్ పటేల్ బీమా సొమ్ము తీసుకోవాలని ప్లాన్ చేశాడని కర్టిస్ పోలీసులకు తెలిపాడు. -
అట్లాంటిక్ డైట్‌తో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
ఇప్పుడు వెజిటేరియన్ డైట్ అని, ఫ్రూట్ జ్యూస్ డైట్ అని పలు రకాల డైట్లు వచ్చేశాయి. తమ ఆహార్యానికి తగ్గట్టుగా వారికి నచ్చిన డైట్‌ని ఫాలో అవుతున్నారు. ఇటీవల బాగా సోషల్ మీడియాలో అట్లాంటిక్ డైట్ అని ఓ డైట్ తెగ ట్రెండ్ అవుతోంది. ఈ డైట్ ఫాలో అయితే కేవలం బరువు మాత్రమే అదుపులో ఉండటమే గాకుండా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అత్యంత ఆరోగ్యకరమైన డైట్లలో ఇది కూడా ఒకటని చెబుతున్నారు. ఏంటా డైట్ అంటే.. ఈ అట్లాంటిక్ డైట్ మెడిటేరియన్ డైట్‌ని పోలి ఉంటుంది. ఇది యూరప్‌లో బాగా ఫేమస్ అయ్యిన డైట్. ఇది బరువుని అదుపులో ఉంచడమే గాక శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఆరునెలల పాటు ఈ డైట్ ఫాలో అయితే గొప్ప ప్రయోజనాలు పొందగలరని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిల తోపాటు రక్తపోటు, గ్లూకోజ్ స్థాయిలను సమతుల్య స్థాయిలో ఉండేట్లు చేస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. దాదాపు 200 స్పానిష్ కుటుంబాలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యిందlన్నారు. ఈ డైట్లో ఏం ఉంటాయంటే.. ఈ డైట్లో పోర్చుగల్, వాయువ్య స్పెయిన్‌లో ప్రసిద్ధి చెందిన ఆహారాలు ఉంటాయి. దీనిని దక్షిణ యూరోపియన్ డైట్ అని కూడా అంటారు. ఐరోపాలో జరిపిన పలు అధ్యయనాల్లో ఈ డైట్ వల్ల అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు తేలింది. ఇందులో క్యాన్సర్ లేదా గుండె జబ్బుల నుంచి ముందుగానే చనిపోయే ప్రమాదం తక్కువగా ఉంటుంది. అంతే కాకుండా కొరోనరీ హార్ట్ డిసీజ్, డయాబెటిస్, స్ట్రోక్ ,ఇతర తీవ్రమైన ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని పెంచే వేలాడే పొట్ట కొవ్వుని కూడా తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఈ డైట్లో ఉండే ఆహారాలు.. తాజా చేప కొద్దిగా ఎర్ర మాంసం ఉత్పత్తులు పాలు చిక్కుళ్ళు తాజా కూరగాయలు బంగాళదుంపలు గోధమ బ్రెడ్ కొద్ది మోతాదులో వైన్ ఆకుకూరలు ఈ డైట్లె మాంసం, చేపలు తప్పనిసరిగా ఉంటాయి. అయితే మితంగానే ఉంటుంది. ముఖ్యంగా ఒమెగా 3కి సంబంధించిన కొవ్వు ఆధారిత చేపలు, గుడ్లు, పాలు ఉత్పత్తులు తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటారు. దీన్ని చాలావరకు కుటుంబసభ్యులంతా కలిసి ప్రిపేర్ చేసుకుని ఉత్సాహ భరితంగా ఆస్వాదిస్తారు. దీంతోపాటు రోజువారీ నడక, సైక్లింగ్ తప్పనిసరి ఉంటాయి. ప్రయోజనాలు.. మెటబాలిక్ సిండ్రోమ్‌ను తగ్గిస్తుంది జబ్బులు, మధుమేహం, స్ట్రోక్ వంటివి వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఊబకాయం వంటివి రావు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చెడు కొలస్ట్రాల్‌ని దరిచేరనీయ్యదు బరువు అదుపులో ఉంటుంది అధిక రక్తపోటు సమస్య నుంచి బయటపడగలుగుతారు. మూడేళ్లకు అట్లాంటిక్ డైట్‌కు కట్టుబడి ఉంటే 60 ఏళ్ల పైబడిన పెద్దల్లో ముందస్తుగా మరణించే ప్రమాదాలు 14% తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. బరువు తగ్గాలని కోరుకునే వారికి ఇది బెస్ట్ డైట్. (చదవండి: నటుడు శరత్‌బాబు ఉసురు తీసింది ఆ వ్యాధే!) -
అట్లాంటా దద్దరిల్లేలా జీటీఏ బతుకమ్మ సంబరాలు!
అట్లాంటా దద్దరిల్లేలా, అమెరికా మారుమ్రోగేలా, తెలంగాణ గర్వపడేలా గ్లోబల్ తెలంగాణ అసోసీయేషన్(జీటీఏ) బతుకమ్మ సంబరాలు జరిగాయి. మునుపెన్నడూ లేని విధంగా సుమారు 5 వేలకు పైగా విచ్చేసిన అతిథులతో డెన్మార్క్ హైస్కూల్ కిటకిటలాడింది. తొలి అడుగులోనే బతుకమ్మ సంబరాల చరిత్రలో నూతన అధ్యాయం సృష్ఠిస్తూ గ్లోబల్ తెలంగాణ అసోసీషియేషన్ తమ ఉత్సాహాన్ని, నిర్వహణా సామర్థ్యాన్ని చాటుకున్నారు. జీటీఏ ప్రతిపాదన మేరకు బతుకమ్మ పండుగను గుర్తిస్తూ జార్జియా రాష్ట్ర అధ్యక్షులు గవర్నర్ కెంపు ప్రతినిధుల అధికారిక ప్రకటన ఈ సంబరాల్లో విశిష్ఠ అంశంగా నిలిచింది. పలు స్వచ్ఛంద సేవా కార్య్రమాలలో అత్యద్భుత సహకారం అందిస్తున్న వీటీ సేవ సంస్థకు సహకరిస్తూ నిర్వహించనున్న పలు సేవా కార్యక్రమాలను ప్రకటించింది. విశిష్ఠ అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున విచ్చేసిన వి. ప్రకాష్ గారు జీటీఏ కార్య నిర్వహణా సామర్ధ్య పటిమను కొనియాడారు. స్టేట్ ఆఫ్ జార్జియా, సిటీ ఆఫ్ జాన్స్ క్రీక్ ప్రముఖులు విచ్చేయగా ఈ వేదికపై "Meditation" అనే పుస్తకాన్ని విడుదల చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ముస్తాబయిన ఎత్తైన కళాత్మక బతుకమ్మలు అందరినీ అబ్బుర పరుచగా, పరికినీలు పట్టు పంచెలు, పట్టు చీరలు, పలుకరింపుల కోలాహలంతో బంధుమిత్ర సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసిన ఆత్మీయ అతిథులతో కన్నుల పండుగలా అలరించింది జీటీఏ బతుకమ్మ సంబరం. ఆకట్టుకునేలా విభిన్న విక్రయదారుల కోలాహలం, ఘుమఘుమలాడే విందు, సాంస్కృతిక వినోదం, అనురాగ పూరిత ఆతిథ్యం, పిల్లల కేరింతలు, నారీమణుల ఉత్తేజ భరిత బతుకమ్మ ఆటల వాతావరణంతో అందరినీ మంత్రముగ్ధుల్ని గావించింది. నిర్విరామంగా సుమారు 8 గంటలకు పైగా జీటీఏ బతుకమ్మ సంబరం సాగింది. బతుకమ్మ పాటలకు పరవశించి ఆడిపాడి, బతుకమ్మలను సగౌరవంగా నిమర్జనంగావించగా, యువత అందించిన అద్వితీయ సేవా సహకారాలకు హృదయ పూర్వకంగా అభినందనలు తెలియజేశారు. అత్యుత్సాహంగా బతుకమ్మ పోటీలలో పాల్గొన్న ఆడపడుచులకి , గ్లోబల్ తెలంగాణ అసోసీయేషన్ కోర్ టీం సభ్యులకు, అతిథులకు, సహాయ సహకారకులకు, ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ఇతర సంస్థల కార్యవర్గ బృందానికి, స్పాన్సర్లకు హృదయ పూర్వకంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంది జీటీఏ సంస్థ. రానున్న కాలంలో మరిన్ని అద్భుత కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలియచేయడమే గాక అందుకుగాను అమెరికా తెలుగు ప్రజల ఆదరణాభిమానాలను మద్దతు ఉండాలని కోరింది జీటీఏ అట్లాంటా కార్యవర్గ బృందం. (చదవండి: లండన్‌లో వైభవంగా చేనేత బతుకమ్మ, దసరా సంబరాలు!) -
అట్లాంటా తెలుగు ఐడల్ 2023
-
అట్లాంటాలో 18వ ఆటా మహాసభల సన్నాహాలకు శ్రీకారం!
అమెరికా తెలుగు సంఘం ఆటా ద్వైవార్షికంగా నిర్వహించు 18వ మహాసభలను 2024న జూన్ 7,8, 9 తేదీలలో అట్లాంటాలో అత్యంత వైభవోపేతంగా జరగనున్నాయి. అందుకోసం ఈ నెల సెప్టెంబరు 8,9,10తేదీలలో అట్లాంటాలోని మారియట్ హోటల్లో ఆటా బోర్డు సమావేశం, ఫేస్ ఈవెంట్స్ నందు ఆటా18వ మహాసభల కిక్ ఆఫ్ కార్యక్రమం నిర్వహించారు. సెప్టెంబరు 8న, శుక్రవారం సాయంత్రం వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన వివిధ నగరాలలో సేవలు అందిస్తున్న ఆటా అధ్యక్షురాలు, ఉపాధ్యక్షులు, పూర్వ అధ్యక్షులు, ట్రస్ట్ బోర్ద్ సభ్యులు,రీజనల్ అడ్వైజర్స్, రీజనల్ కోఆర్దినేటర్స్, వుమెన్ కోఆర్దినేటర్స్, స్టాండింగ్ కమిటీస్, ఆటా అడ్వైజర్స్ పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరు అయ్యారు. ఆటా అట్లాంటా సభ్యులు మర్యాదపూర్వక స్వాగత సమారోహంతో ఆహ్వానిస్తూ ఆత్మీయ ఆతిథ్యం, అద్వితీయ విందు వినోదాలతో అలరించింది. ఇక సెప్టెంబర్ 9 శనివారం ఉదయం 9 గంటలకు బోర్డు సమావేశం గణనాథుని ప్రార్థనతో ఆరంభమయి, ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని సారథ్యంలో, ఉపాధ్యక్షులు జయంత్ చల్లా ,పూర్వ అధ్యక్షులు భువనేష్ బుజాల,హనుమంత్ రెడ్డి,కరుణాకర్ మాధవరం,సుధాకర్ పెరికారి మరియు పరమేష్ భీమ్‌రెడ్డి, కార్యదర్శి రామకృష్ణ రెడ్డి ఆల, కోశాధికారి సతీష్ రెడ్డి, సంయుక్త కోశాధికారి రవీందర్ గూడూర్, ట్రస్ట్ బోర్ద్ సభ్యుల,రీజనల్ అడ్వైజర్స్, రీజనల్ కోఆర్దినేటర్స్, వుమెన్ కోఆర్దినేటర్స్, స్టాండింగ్ కమిటీస్, ఆటా అడ్వైజర్స్ మరియు అట్లాంటా ఆటా బృందం ఆధ్వర్యంలో నిర్విరామంగా సమావేశాన్ని జరిపారు. ఆటా సభ్యుల ప్రోత్సాహభరిత సందేశాలు , మౌలిక సదుపాయాల చర్చ, ఆవశ్యక సేవా కార్యక్రమాలు, భారత దేశంలో డిసెంబర్ నెలలో జరుగు ఆటా వేడుకల చర్చలు, ఆమెరికన్ తెలంగాణ సొసైటి (ఏటీఎస్) సంస్థ విలీనం , సమావేశ సభ్యుల పరిచయం, మహాసభల తాత్కాలిక అడ్హాక్ బృందం ప్రకటన, ఆర్థిక సేవా అభివృద్ధి సంబంధిత అజెండా, రానున్న బోర్డు సమావేశపు కీలక నిర్ణయాలు, వంటి పలు కీలక అంశాల అధ్యయనంతో ప్రభావాన్వితంగా సాగడం హర్షణీయం. ఆటా 18వ సభల కొరకు నియామికమైన కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం,కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ అనిల్ బోదిరెడ్డి నేషనల్ కోఆర్డినేటర్ సాయి సుదినిలు ప్రసంగిస్తూ అట్లాంటా తరుపున అందరికీ అభినందనలు తెలుపుకుంటూ ఆటా సభలకుగాను అందరి సహాయసహకారాలను సవినయంగా కోరుతూ, సభలను గూర్చి పలు అంశాల వివరణ అందించారు. ఆటా మ్యాట్రిమోని కమిటీ కో-చైర్ రమేష్ నల్లవోలు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అట్లాంటాలో వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేసారు. వధూవరులు, తల్లితండ్రులు, మిత్రులు సుమారు 50 కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం కమ్మని విందుతో బోర్డు సమావేశం సంపూర్ణం అయ్యింది. మధ్యాహ్నం ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం, ఆటా 18వ కాన్ఫరెన్స్ బృందం , ట్రస్ట్ బోర్ద్ సభ్యులు, అట్లాంటా ఆటా బృందం 18వ మహాసభలను నిర్వహించు జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్(జీడబ్ల్యూసీసీ)ని సందర్శించి అట్లాంటా నగర వీధుల్లో ప్రత్యేక సందడి చేసారు. సాయంత్రం 7 గంటలకు అట్లాంటాలోని ఫేస్ ఈవెంట్స్‌లో కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ సమావేశం అధ్యక్షురాలు మధు బొమ్మినేని అట్లాంటా కోర్ సభ్యుల చేత సాంప్రదాయబద్దంగా జ్యోతి ప్రజ్వలనతో శ్రీకారం చుట్టుకోగా గణనాథుని ఆరాధనతో శుభారంభమయ్యింది. ఆ శుభవేళ కళారాధనతో మొదలైన నీలిమ గడ్డమనుగు నేపథ్యంలో వివిధ శాస్త్రీయ జానపద , చలన చిత్ర గీతికల నృత్య ప్రదర్శనలు, సంగీత విభావరి వంటి అద్భుత కార్యక్రమాలతో ఆద్యంతం సభాసదుల అలరించింది. ఆటా 18వ కాన్ఫరెన్స్ లోగో ను ఇటీవల ఎన్నికైన అమెరికా క్రికెట్ బోర్డ్ చైర్మన్ మరియు పూర్వ ట్రస్ట్ బోర్ద్ సభ్యులు వేణు పీసీకే ఆవిష్కరించగా, మధు బొమ్మినేని, జయంత్ చల్లా కిరణ్, పాశం వేణు పీసీకేను సన్మానించారు. మధు బొమ్మినేని కాన్ఫరెన్స్ సాంగ్ ఆవిష్కరించగా ప్రసిద్ధ గాయకులు, అద్భుత సంగీత సహకారాన్ని అందించిన దర్శకులు మల్లికార్జున సాహిత్య సహకారం అందించిన మాధవి దాస్యంలను అధ్యక్షురాలు మధు బొమ్మినేని అభినందించగా సభాసదులు ప్రతిధ్వనించు హర్షధ్వానాలతో ఆటా సభ అడ్హాక్ సభ్యులను, సలహాదారులను, పూర్వ అధ్యక్షులను, స్పాన్సర్సను హర్షధ్వానాలతో సత్కరించారు. ఈ సాయంకాలం సుమారు 600 గౌరవ అతిథులతో కార్యక్రమం ఆద్యంతం మధురానుభూతులతో ఉల్లాసభరితంగా కొనసాగింది. శ్రావణి రాచకుల్ల సారథ్యంలో సుందర నారీమణుల వస్త్రాలంకరణ ప్రదర్శన (ఫ్యాషన్ షో) వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేయగా నూతన మోహన, జనార్ధన్ పన్నేల గార్ల అద్భుత గానాలాపన మరియు స్థానిక గాయకుల గానాలాపానతో జనరంజకంగా సాగింది ఆ శుభ సాయంకాలం. కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం 18 వ కాన్ఫరెన్స్ కార్యక్రమాలు గురించి తెలుపుతు అందరికీ అభినందనలు తెలియచేశారు. అట్లాంటాలోని స్థానిక తెలుగు సంస్థల TANA, GATA,GATeS, GTA, NATA,NATS,TTA, TDF, TAMA ప్రతినిధులను 18వ ఆటా మహాసభలకు ఆహ్వానించారు. తెలుగు సంస్థల ప్రతినిధులు కూడా 18వ ఆటా మహాసభల విజయవంతంగా సాగడానికి సహాయ సహకారాలను అందిస్తామన్నారు. అధ్యక్షురాలు మధు బొమ్మినేని తమ స్పందన తెలియచేస్తూ కార్యక్రమం అద్భుతంగా, అద్వితీయంగా కొనసాగడానికి కారకులైన విశిష్ఠ అతిథులకు, గౌరవ అతిథులకు, వదాన్యులకు , యూత్ వాలంటీర్స్‌కు, అట్లాంటా కోర్ సభ్యులకు, అట్లాంటా కోర్ కాన్ఫరెన్స్ దాతలకు తదితర మీడియా మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేశారు. (చదవండి: ఐటీ అమెరికా నిర్వహించిన ఆత్మీయ సదస్సులో బండి సంజయ్!) -
Atlanta: యూఎస్ యూనివర్సిటీ అధికారులతో మంత్రి బొత్స భేటీ
అట్లాంట: ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకించి అటవీ విశ్వ విద్యాలయం (ఫారెస్టు యూనివర్సిటీ) ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అమెరికాలోని పర్యటిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ ఇక్కడి అలబామాలోని సుప్రసిద్ధ ఆబర్న్ యూనివర్సిటీ అధికారులతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విదేశీ విద్యా కో-ఆర్డినేటర్ డాక్టర్ కుమార్ అన్నవరపు.. మంత్రి బొత్సకు స్వాగతం పలికి ఆబర్న్ యూనివర్సిటీ అధికారులను పరిచయం చేశారు. ఏపీ ప్రభుత్వంతో ఈ యూనివర్సిటీ కొలాబరేషన్ కొరకు ఆయన అధికారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత విద్యకు ఇస్తున్న ప్రాధాన్యం, విద్యా రంగంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి వివరించారు. ఉన్నత విద్యారంగాన్ని మరింత ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం దాదాపు 2600 ప్రొఫెసర్ ఖాళీలను భర్తీ చేయనున్నామని తెలిపారు. పాఠశాల విద్య నుంచే ఆంగ్లమాధ్యమంలో బోధనకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక చర్యల వల్ల సాధిస్తున్న ఫలితాల గురించి కూడా మంత్రి బొత్స అక్కడ యూనివర్సీటీల అధికారులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫారెస్టు యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని, ఈ యూనివర్సిటీ అభివృద్ధికి ఆబర్న్ యూనివర్సిటీ అధికారుల సహాయ సహకారాలు, సూచనలు తప్పకుండా తీసుకుంటామని తెలిపారు. వ్యాక్సిన్ పరిశోధనలో సహకారం వ్యాక్సిన్ల అభివృద్ధి పరిశోధన, కేస్ స్టడీస్ రంగాల్లో విశేషమైన కృషి చేసిన అట్లాంటాలోని సుప్రసిద్ధ ఎమరే యూనివర్సిటీ అధికారులు మాట్లాడుతూ వ్యాక్సిన్ పరిశోధనకు కేస్ స్టడీస్‌కు సంబంధించి ఏపీతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అమెరికాలోని సుప్రసిద్ధ యూనివిర్సటీలతో కొలబొరేషన్కు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బొత్స తెలిపారు. ప్రొఫెసర్ అమరాతో భేటీ అమెరికాలో వ్యాక్సిన్ గురుగా సుప్రసిద్ధులైన ఎమరే యూనివర్సిటీ ప్రొఫెసర్ రామారావు అమరాతో మంత్రి బొత్స భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీలో వ్యాక్సిన్ అభివృద్ధికి గల సాధ్యాసాధ్యాల గురించి మంత్రి చర్చించారు. ఈ పర్యటనలో ఆబర్న్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అలవలపాటి జానకీరామిరెడ్డి, ఆంధప్రదేశ్ ప్రభుత్వ అమెరికా రెప్రజెంటేటివ్ రత్నాకర్ పండుగల తదితరులు పాల్గొన్నారు. -
అట్లాంటా: వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బొత్స
అట్లాంటా: వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైయస్ఆర్సీపీ శ్రేణులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. దివంగత మహానేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. ఇక అమెరికాలో సైతం వైఎస్సార్సీపీ శ్రేణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అట్లాంటాలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో విద్యాశాఖమంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొని దివంగత మహానేతకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహానేతతో తన అనుబంధాన్ని, ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక కార్యక్రమలు పేదల జీవితాలను ప్రభావితం చేసిన తీరును బొత్స సత్యనారాయణ ప్రస్తావించారు. సమాజం బాగుండాలంటే ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదవాలి, నిరుపేదలు తమ పిల్లలను డాక్టర్లు, ఇంజినీర్లుగా చూడాలని దివంగత వైయస్ఆర్ ఆనాడే తపించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి లక్షలమంది పేద పిల్లలను ఉచితంగా చదివించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా చదువుకున్న ఎంతో మంది పిల్లలు నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఎంఎన్సీల్లో పెద్ద ఉద్యోగాలు చేస్తూ జీవితంలో గొప్పగా స్థిరపడ్డారని పేర్కొన్నారు. దేశానికే ఆదర్శం.. నాడు మహానేత వైఎస్సార్ చదువుల కోసం రెండు అడుగులు వేస్తే నేడు ముఖ్యమంత్రి జగన్ అదే స్ఫూర్తితో నాలుగడుగులు ముందుకు వేశారన్నారు. సీఎం జగన్ నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం విద్యను ప్రధాన అంశంగా గుర్తించి అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. నాడు-నేడు, డిజిటల్ బోధనలు, విద్యాకానుక, అమ్మఒడి, గోరు ముద్ద వంటి పథకాలు దేశంలో మరెక్కడా లేవని, ఏపీ విద్యారంగం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. కార్యక్రమం అనంతరం, ప్రవాస ఆంధ్రులతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర- దేశ ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు ఇతర అంశాలపై ఎన్నారైలతో ముచ్చటించారు. ఆ ఘనత వైఎస్సార్‌దే కనిగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు మాట్లాడుతూ.. ఆరోగ్య శ్రీ, 108 వంటి అద్భుతమైన కార్యక్రమాల ద్వారా దివంగత వైయస్ఆర్ ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచారని, పేదలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ఘనత వైయస్ఆర్దే అని అన్నారు. ఆయన సంక్షేమ పథకాల స్పూర్తితో మన దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలూ ఆరోగ్య శ్రీ వంటి పథకాలు ప్రవేశపెట్టాయన్నారు. వైయస్ జగన్ తండ్రిని మించిన తనయుడు.. ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ మాట్లాడుతూ విశ్వసనీయతకు, మంచితనానికి మారుపేరు డాక్టర్ వైయస్ఆర్ అన్నారు. 14 ఏళ్ల తర్వాత కూడా ప్రజలకు వైయస్ఆర్ పై ఉన్న అభిమానం చెక్కుచెదర్లేదని, తెలుగు నేలపై ఆయన పేరు, ఆయన ప్రవేశపెట్టిన అజరామరంగా కీర్తింపబడతాయని పేర్కొన్నారు. ఆ మహానేత దారిలోనే ప్రయాణిస్తున్న వైయస్ జగన్ తండ్రిని మించిన తనయుడిగా ఏపీని తీర్చిదిద్దుతున్నారని అన్నారు. 4 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని విప్లవాత్మక మార్పులను సీఎం వైయస్ జగన్ తీసుకొచ్చారని, ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్ ఉండటం మన అదృష్టం అని రత్నాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో IIIT మాజీ ప్రిన్సిపాల్ కృష్ణా రెడ్డి వైయస్ఆర్ గొప్పతనాన్ని పద్యరూపంలో చెప్పడం అలరించింది. సీఎం సలహాదారు ( విద్య ) కుమార్ అన్నవరపు కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అట్లాంటాలో నివాసముంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, వైఎస్సార్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదీ చదవండి: స్మృత్యంజలి