Atlee
-
అట్లీ కలర్‌పై కామెంట్స్.. గొర్రెలాగా అనుసరించొద్దు: నెటిజన్‌కు కపిల్ శర్మ కౌంటర్
బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ తన షోలో ఇటీవల చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీని అభ్యంతకరమైన ప్రశ్న అడిగారు. ఇప్పుడు మీరు చాలా పెద్ద స్టార్‌గా ఎదిగారు.. ఎవరైనా స్టార్‌ను మొదటిసారి కలవడానికి వెళ్లినప్పుడు అతనికి మీరు కనిపించారా? అంటూ కలర్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. దీనికి అట్లీ సైతం రిప్లై కూడా ఇచ్చారు. ఎవరినైనా సరే రూపాన్ని చూసి ఓ అంచనాకు రాకండి.. అతని హృదయాన్ని చూసి చెప్పాలంటూ సమాధానమిచ్చారు.అయితే ఈ షోలో అట్లీని అవమానించాడని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కపిల్ శర్మను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అట్లీ కలర్‌పై అలాంటి కామెంట్స్ ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో అట్లీకి క్షమాపణలు చెప్పాలంటూ మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. దీంతో తనపై వస్తున్న ట్రోల్స్‌పై కపిల్ శర్మ స్పందించారు.తనపై ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు కపిల్ శర్మ బదులిచ్చారు. డియర్ సర్.. నేను ఈ వీడియోలో అట్లీ లుక్స్ గురించి మాట్లాడినట్లు దయచేసి నాకు వివరించగలరా? దయచేసి సోషల్ మీడియాలో విద్వేషాన్ని వ్యాప్తి చేయకండి. మీకు ధన్యవాదాలు. అంతే కాదు అబ్బాయిలు మీ నిర్ణయం మీరే తీసుకోండి.. అంతేకానీ గొర్రెలాగా ఎవరో చేసిన ట్వీట్‌ను అనుసరించవద్దు' అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. అయితే మరికొందరేమో కపిల్ శర్మ కామెంట్స్‌కు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. Dear sir, can you pls explain me where n when I talked about looks in this video ? pls don’t spread hate on social media 🙏 thank you. (guys watch n decide by yourself, don’t follow any body’s tweet like a sheep). https://t.co/PdsxTo8xjg— Kapil Sharma (@KapilSharmaK9) December 17, 2024 -
స్టార్ డైరెక్టర్‌పై కమెడియన్ దారుణ కామెంట్స్.. వాళ్లను ఆ జబ్బు వదలదేమో?
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్నారు. వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన బేబీ జాన్ మూవీకి ఆయనే కథను అందించారు. ఈ మూవీకి కలీస్ దర్శకత్వం వహించగా.. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా బేబీ జాన్ టీమ్ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోకి హాజరైంది.అయితే ఈ షోలో డైరెక్టర్ అట్లీని ఉద్దేశించిన కపిల్ శర్మ అడిగిన ప్రశ్న వివాదానికి దారితీసింది. అట్లీ కలర్‌ను ఉద్దేశిస్తూ వ్యంగ్యమైన ప్రశ్న వేశాడు కపిల్. మీరు ఎవరైనా స్టార్‌ని కలిసినప్పుడు.. మీరు అతనికి కనిపిస్తారా? అంటూ అట్లీ కలర్‌ను ఉద్దేశించి కామెంట్ చేశాడు. దీనికి అట్లీ తనదైన స్టైల్లో సమాధానమిచ్చాడు.దీనికి అట్లీ మాట్లాడుతూ...'ఒక విధంగా మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది. నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తా. నా మొదటి సినిమాను నిర్మించిన ఏఆర్ మురుగదాస్ సర్కి నేను చాలా కృతజ్ఞతలు. అతను నా స్క్రిప్ట్, నా సామర్థ్యం మాత్రమే చూశాడు. అంతేకానీ నేను ఎలా ఉన్నానో ఆయన అడగలేదు. అక్కడ ఆయనకు నా కథ నచ్చింది. ప్రపంచం అది మాత్రమే గుర్తిస్తుంది. ఒక వ్యక్తి రూపాన్ని బట్టి మనం అంచనా వేయకూడదు. మీ హృదయంతో మాత్రమే స్పందించాలి. ' అంటూ కపిల్ శర్మకు ఇచ్చిపడేశాడు.అయితే ఈ ప్రశ్నపై సింగర్ చిన్మయి శ్రీపాద సైతం స్పందించింది. ఈ షో అట్లీ కలర్ గురించి కపిల్ శర్మ జోక్ చేశాడని విమర్శించింది. కామెడీ పేరుతో అతని చర్మం రంగు గురించి మాట్లాడే ఈ విపరీతమైన హేళనలను వాళ్లు ఎప్పటికీ ఆపలేరేమో? అంటూ మండిపడింది. కపిల్ శర్మ లాంటి ఫేమ్ ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తనను నిరాశకు గురి చేసిందని చిన్మయి ట్వీట్ చేసింది. అయితే కపిల్ కామెంట్స్ తనకు ఎలాంటి ఆశ్చర్యం కలిగించలేదని పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం చిన్మయి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Will they never stop these crass and racist jibes at his skin color in the name of ‘comedy’?Someone with the amount of influence and clout like Kapil Sharma saying something like this is disappointing and unfortunately, not surprising. https://t.co/63WjcoqHzA— Chinmayi Sripaada (@Chinmayi) December 15, 2024 -
నిర్మాతగా స్టార్ డైరెక్టర్ భార్య.. ట్రైలర్ చూశారా?
వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'బేబీ జాన్'. ఈ చిత్రాన్ని కలీస్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ అట్లీ భార్య ప్రియా అట్లీ నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబయిలో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో విడుదల చేశారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ మూవీగానే బేబీ జాన్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ యాక్షన్ సీన్స్, ఫైట్స్ ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, వామికా గబ్బి రాజ్‌పాల్ యాదవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ చిత్రానికి టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతమందించడం మరో విశేషం. -
'తెరి' హిందీ రీమేక్ మూవీ టీజర్ రిలీజ్
తమిళ స్టార్ హీరో విజయ్ హిట్ సినిమాల్లో 'తెరి' ఒకటి. దీన్నే 'పోలీసోడు' పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తే ఇక్కడ కూడా హిట్ అయింది. ఆల్రెడీ తెలుగు వచ్చిన మూవీ పవన్ కల్యాణ్ రీమేక్ చేస్తున్నాడు. అదే 'ఉస్తాద్ భగత్ సింగ్' అని టాక్. చాలా ఏళ్ల క్రితమే ఇది మొదలైంది కానీ ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. మరోవైపు 'తెరి'ని హిందీలోనూ రీమేక్ చేశారు. 'బేబీ జాన్' పేరుతో దీన్ని తీస్తున్నారు. తాజాగా చిత్ర టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)ఒరిజినల్లో విజయ్, సమంత, అమీ జాక్సన్ చేయగా.. అదే పాత్రల్లో వరుణ్ ధావన్, కీర్తి సురేశ్, వామికా గబ్బి నటించారు. టీజర్ చూస్తే చూచాయగా అదే కథ అని అర్థమైపోయింది. కాకపోతే అప్పట్లో ఓ మాదిరి మాస్ చూపిస్తే ఇప్పుడు ఎలివేషన్స్ కోసమా అన్నట్లు మూవీ తీసినట్లు కనిపిస్తుంది. సంగీతమందించిన తమన్ అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో హోరెత్తించాడు. టీజర్ చూస్తుంటే హిట్ కొట్టేలానే ఉంది.డిసెంబరు 25న 'బేబీ జాన్' థియేటర్లలోకి రానుంది. 'తెరి' దర్శకుడు అట్లీ దగ్గర సహాయకుడిగా చేసిన కలీస్.. ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. నిర్మాతల్లో అట్లీ భార్య కూడా ఒకరు. చాలా రోజుల నుంచి బాలీవుడ్లో సరైన మాస్ మూవీ రాలేదు. మరి ఆ లోటుని 'బేబీ జాన్' తీరుస్తుందేమో చూడాలి.(ఇదీ చదవండి: నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి వేదిక అక్కడేనా..?) -
ఎవరు ఊహించని విధంగా విజయ్ దళపతి మల్టీస్టారర్ సినిమా
-
అట్లీతో సినిమా కచ్చితంగా చేస్తా
-
కమల్–సల్మాన్–ఓ సినిమా
హిందీలో షారుక్ ఖాన్‌తో ‘జవాన్’ తీసి, బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు తమిళ దర్శకుడు అట్లీ. ‘జవాన్’ సినిమా బాక్సాఫీస్ వసూళ్లు రూ. వెయ్యి కోట్లకు పైగా దాటాయి. ఈ క్రమంలో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న తదుపరి చిత్రం ఏంటి? అనే చర్చల్లో భాగంగా అల్లు అర్జున్‌తో సినిమా చేయనున్నారనే ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమా గురించి అధికారిక సమాచారం ఏదీ రాలేదు.కాగా అట్లీ ఓ మల్టీస్టారర్ మూవీ కథను రెడీ చేశారని, ఇందులో రజనీకాంత్, సల్మాన్ ఖాన్ హీరోలుగా నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. తాజాగా ఈ సినిమాలో రజనీకాంత్ ప్లేస్‌లో కమల్‌హాసన్ నటించనున్నారని మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. సల్మాన్–కమల్ కాంబినేషన్లో అట్లీ దర్శకత్వంలోని సినిమా దాదాపు ఖరారైనట్లే అనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. ఈ సినిమాను దక్షిణాదిలోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సన్ పిక్చర్స్ నిర్మించనుందని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్. -
బన్నీ మూవీ పక్కన పెట్టి.. సల్మాన్ వైపు అట్లీ చూపు..
-
అల్లు అర్జున్ చేయాల్సిన మూవీ సల్మాన్ చేతికి!
దక్షిణాది డైరెక్టర్లకు బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా తమిళ దర్శకులు మురుగదాస్, అట్లీ లాంటోళ్లు అక్కడ హిట్స్ కొట్టారు. ఏఆర్ మురుగదాస్.. 'గజిని'తో సక్సెస్ అందుకోగా, అట్లీ 'జవాన్'తో వెయ్యి కోట్ల వసూళ్లు మూవీ తీశాడు. కాగా అట్లీ మరోసారి బాలీవుడ్‌పై మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. నిజానికి అల్లు అర్జున్ హీరోగా ఇతడు మూవీ తీస్తాడని ప్రచారం జరిగింది. కాకపోతే ఇదే ఇప్పుడు సల్మాన్ చేతికి వెళ్లినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఆ హీరో పెళ్లికి అడ్డుపడిన త్రిష.. ఇంతకీ ఏమైందంటే?)అల్లు అర్జున్‌తో కథా చర్చలు జరిగాయని, అయితే రెమ్యునరేషన్ విషయంలో అట్లీ ఏకంగా రూ.80 కోట్ల వరకు డిమాండ్ చేశాడని తెలుస్తోంది. దీంతో నిర్మాతలు లైట్ తీసుకున్నారని సమాచారం. కట్ చేస్తే ఇప్పుడు ఆ ప్రాజెక్టులోకి సల్మాన్ ఎంటరయ్యాడని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఇది సెట్స్‌పైకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో వస్తాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!) -
జవాన్ మూవీ అరుదైన రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్!
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ, బాలీవుడ్ బాద్షా కాంబోలో వచ్చిన చిత్రం జవాన్. 2023లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించింది. తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు.అయితే తాజాగా అట్లీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వెతికిన సినిమాల జాబితాలో జవాన్ చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని అట్లీ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. వరల్డ్ వైడ్‌గా గూగుల్‌లో అత్యధిక మంది వెతికిన చిత్రాల్లో జవాన్ మూడో స్థానంలో నిలిచింది. మొదటి, రెండు స్థానాల్లో హాలీవుడ్ చిత్రాలు బార్బీ, ఓపెన్ హైమర్ నిలిచాయి. అంతే కాకుండా బాలీవుడ్ చిత్రాలైన గదర్-2, పఠాన్ వరుసగా 8,10 స్థానాలు దక్కించుకున్నాయి. కాగా.. ఈ వివరాలను వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది. ❤️❤️❤️ https://t.co/NUiGjSORLJ— atlee (@Atlee_dir) June 6, 2024 -
డైరెక్టర్ కూతురి రెండో పెళ్లి.. స్టెప్పులతో అదరగొట్టిన స్టార్స్
ప్రముఖ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఏప్రిల్ 15న జరిగిన ఈ వివాహ వేడుకకు రజనీకాంత్, సూర్య, కమల్ హాసన్ సహా దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన స్టార్స్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మంగళవారం ఎంతో వైభవంగా రిసెప్షన్ నిర్వహించగా బాలీవుడ్ సెలబ్రిటీలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ముఖ్యంగా సౌత్ డైరెక్టర్ అట్లీ- బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ తమ డ్యాన్సులతో స్టేజీ దద్దరిల్లేలా చేశారు. వీరితోపాటు శంకర్ రెండో కూతురు, హీరోయిన్ అదితి శంకర్ కూడా ఎంతో హుషారుగా చిందేయడం విశేషం. ఇక వీరంతా తమిళ హిట్ సాంగ్స్‌కు కాలు కదిపారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఐశ్వర్య శంకర్ గతంలో క్రికెటర్ దామోదర్ రోహిత్‌ను పెళ్లాడింది. ఇతడు ఓ అమ్మాయిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలు రావడంతో ఐశ్వర్య తన నుంచి విడాకులు తీసుకుంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో తరుణ్ కార్తికేయన్‌తో నిశ్చితార్థం జరగ్గా రెండు రోజులక్రితమే ఘనంగా వివాహం జరిపించారు. #RanveerSingh & #AditiShankar dancing for ThalapathyVijay & #Trisha's Apadi Podu Song 🤩🔥pic.twitter.com/RFXuZLSZo1 — Kolly Corner (@kollycorner) April 16, 2024 చదవండి: నువ్వు వర్జినా..? ముందు నీ పెళ్లి గురించి చెప్పమన్న హీరోయిన్ తనయుడు -
అల్లు అర్జున్‌కి జోడీగా..?
‘పుష్ప: ది రైజ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నారు హీరో అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన ‘పుష్ప: ది రూల్’ సినిమా చేస్తున్నారు. ఆ చిత్రం పూర్తయిన తర్వాత తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అందులో భాగంగానే హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను ఫైనల్ చేసే పనిలో పడ్డారట అట్లీ. కాగా ఈ మూవీలో అల్లు అర్జున్‌కి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో సమంత, త్రిష పేర్లు వినిపిస్తున్నాయి. తొలుత త్రిష పేరు తెరపైకి వచ్చింది. అల్లు అర్జున్‌కి ఆమె జోడీగా నటించనున్నారనే వార్తలు కోలీవుడ్‌లో హల్చల్ చేశాయి. అయితే తాజాగా సమంత పేరు వినిపిస్తోంది. అట్లీ దర్శకత్వం వహించిన ‘తేరి’ సినిమాలో విజయ్‌కి జోడీగా నటించారు సమంత. అలాగే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో అల్లు అర్జున్‌తో జతకట్టారీ బ్యూటీ. అలాగే ‘పుష్ప: ది రైజ్’ మూవీలో ‘ఊ అంటావా...’ అంటూ ప్రత్యేక పాట చేశారు. తాజాగా వీరి జోడీ రిపీట్ కానుందనే వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరి అల్లు అర్జున్ సరసన నటించేది సమంతా? త్రిషా? లేకుంటే ఇద్దరూ నటిస్తారా? ఈ ఇద్దరూ కాకుండా వేరే కథానాయిక నటిస్తారా? అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. ఈ అక్టోబర్‌లో అల్లు అర్జున్–అట్లీ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్. -
స్టార్ జంటను ఫాలో అవుతున్న అట్లీ దంపతులు!
కోలీవుడ్‌లో నయనతార, విఘ్నేశ్ శివన్‌లకు బ్రాండ్ ఉంది. పదేళ్ల క్రితం ప్రేమలో పడి.. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న రికార్డు వీరిది. అయితే పెళ్లికి ముందు నుంచే ఏ చిన్న అకేషన్ వచ్చినా ఈ జంట విదేశాలకు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేసిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడాన్ని ఈ జంట ఆనవాయితీగా పెట్టుకున్నారనే చెప్పాలి. అలా పుట్టిన రోజు, పెళ్లి రోజులు వస్తున్నాయంటే ఈ జంట నుంచి రకరకాల ఫొటోల కోసం నెటిజన్లు ఎదురు చూసేస్థితికి వారిని తీసుకొచ్చారు. తాజాగా వీరిని స్ఫూర్తిగా తీసుకున్నట్లు ఉన్నారు దర్శకుడు అట్లీ. దర్శకుడు శంకర్ శిష్యుడు అయిన అట్లీ రాజా రాణి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రమే మంచి విజయాన్ని సాధించడంతో ఆ తరువాత విజయ్ వంటి స్టార్ హీరోకు అవకాశం కల్పించారు. ఆయనతో మెర్శల్, తెరి, బిగిల్ వంటి హిట్ చిత్రాలను చేసి హిట్ కొట్టారు. ఇక ఇటీవల బాలీవుడ్‌కు వెళుతూ బాద్షా షారూఖ్‌ఖాన్ హీరోగా జవాన్‌తో అట్లీ సక్సెస్ అయ్యారు. ఇదిలా ఉంటే.. నటి ప్రియనుప్రేమించి 2014లో పెళ్లి చేసుకున్నారు. కాగా తొమ్మిది ఏళ్ల తరువాత ఇటీవలే తల్లిదండ్రులు అయ్యారు. ఇక అసలు విషయం ఏమంటే నయనతార, విఘ్నేష్ శివన్ తరహాలోనే ఈ జంట ఎలాంటి అకేషన్ వచ్చినా, లేకపోయినా ప్రత్యేకంగా ఫొటోలు తీయించుకుని మరీ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ జంట దిగిన రొమాంటిక్ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Priya Mohan (@priyaatlee) -
Priya Atlee: డైరెక్టర్ అట్లీ భార్యలో ఈ యాంగిల్ కూడా ఉందా! (ఫోటోలు)
-
నమ్మించి మోసం చేశారు..నటి సంచలనం
-
మీ వల్లే ఈ ఘనత దక్కింది.. జవాన్ డైరెక్టర్ పోస్ట్ వైరల్!
ఈ ఏడాది జవాన్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ అట్లీ. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌తో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఇటీవల ఐఎండీబీ రిలీజ్ చేసిన జాబితాలో ఇండియాలో అత్యధిక ఆదరణ దక్కించుకున్న మూవీగా జవాన్ నిలిచింది. ఈ ఏడాది ప్రకటించిన థియేట్రికల్ సినిమాల్లో అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ నిలిచింది. ఈ సందర్భంగా అట్లీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అట్లీ ఇన్‌స్టాలో రాస్తూ.. "జవాన్ అనేది ఓ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇది సమాజంలోని అన్యాయాలను సరిదిద్దాలని నిర్ణయించుకున్న ఒక వ్యక్తి లోతైన భావోద్వేగానికి సంబంధించినగి. ఈ సినిమా మీ అందరి హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సినిమా పట్ల ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ, ప్రేమ చాలా గొప్పది. ప్రపంచ సినిమా గురించి నాకున్న జ్ఞానానికి ఐఎండీబీ ప్రశంసలు పొందడంతో ఓ కల నిజమైంది. ఈ విజయం కోసం సహకారించిన షారూఖ్ ఖాన్ సార్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, నా భార్య, నా టీమ్, ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్న' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ మీరు నంబర్ వన్ డైరెక్టర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరు జవాన్-2 కోసం వెయిట్ చేస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by IMDb India (@imdb_in) -
జవాన్ డైరెక్టర్ భారీ స్కెచ్.. ఆ ఇద్దరు స్టార్స్‌తో మూవీ!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం జవాన్. ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి సౌత్ సూపర్‌స్టార్స్ ఎక్కువగా నటించారు. దర్శకుడు కూడా తమిళనాడుకు చెందిన అట్లీ కావడం విశేషం. కాగా ఈ చిత్రం రూ.1100 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. (ఇది చదవండి: ఐదు భిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్న కంగువ) ఇక కోలీవుడ్‌లో దళపతిగా అభిమానులు పట్టం కట్టిన నటుడు విజయ్ ఆ మధ్య నటించిన చిత్రం బిగిల్. అందులోనూ నయనతారనే హీరోయిన్ కావడం మరో విశేషం. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించగా.. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇక జవాన్, బిగిల్ చిత్రాల్లో మరో కామన్ విషయం హీరోలు ద్విపాత్రాభినయం చేయడం. ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడిగా అట్లీ నిలిచారు. కాగా ఆయన తదుపరి చిత్రం ఏంటనే విషయంపై ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. దీనిపై తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జవాన్ హీరో షారుక్ ఖాన్, బిగిల్ హీరో విజయ్‌తో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారన్నదే లేటెస్ట్ టాక్. జవాన్ చిత్రంలో షారుక్‌ఖాన్‌తో కలిసి విజయ్ అతిథి పాత్రలో మెరవనున్నారనే ప్రచారం జరిగింది. కానీ అది వాస్తవం కాదని తెలిసిపోయింది. అయితే విజయ్‌తో కలిసి నటించడానికి తాను సిద్ధమని షారుక్ ఖాన్ జవాన్ చిత్రం సమయంలోనే వెల్లడించారు. అదేవిధంగా షారుక్ ఖాన్‌తో కలిసి నటించిన డానికి తాను సిద్ధమేనని విజయ్ కూడా అన్నారు. కాగా ఇటీవల ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ తన దర్శకత్వంలో చిత్రం చేయడానికి ముందుకు వచ్చినట్లు అట్లీనే స్వ యంగా ఇటీవల ఓ భేటీలో పేర్కొన్నారు. ఈ చిత్రానికి కథను సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దీంతో ఇది షారుక్ ఖాన్, విజయ్ కలిసి నటించిన చిత్రం అవుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ రావాలంటే కొద్ది కాలం ఆగాల్సిందే. అదేవిధంగా ఇది బాలీవుడ్ చిత్రం అవుతుందా? లేక హాలీవుడ్ చిత్రం అవుతుందా అన్నది కూడా తెలియాల్సి ఉంది. (ఇది చదవండి: పిల్లలు కావాలని హీరోను పెళ్లి చేసుకున్నా: స్టార్ హీరోయిన్) -
జవాన్ టీం బంపరాఫర్.. ఆ మూడు రోజులు టికెట్ ఫ్రీ!
సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, నయనతరా జంటగా నటించిన చిత్రం జవాన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీని సృష్టించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. విడుదలైన తొలి రోజే రూ. 75 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద బాద్ షా స్టామినా ఏంటో నిరూపించింది. అయితే తాజాగా ఫ్యాన్స్‌కు బిగ్ ఆఫర్ తీసుకొచ్చింది. (ఇది చదవండి: అఖిల్ ఫ్యాన్స్‌కు మరో షాక్.. ఓటీటీ రిలీజ్లో బిగ్ ట్విస్ట్!) ఈనెల 28,29, 30 తేదీల్లో సినిమా చూసేవారికి జవాన్ చిత్రబృందం ఓ బంపరాఫర్ తీసుకొచ్చింది. ఈ మూడు రోజుల్లో టికెట్ బుక్ చేసుకున్నవారికి మరో టికెట్ ఫ్రీగా రానుంది. దీంతో ఒక టికెట్ తీసుకుని ఇద్దరు మూవీ చూసేయొచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నవారికే వర్తిస్తుందని మేకర్స్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని షారుక్ ఖాన్ తన ట్విటర్లో షేర్ చేశారు. ఇంకేం ఈ వీకెండ్లో జవాన్ మూవీ చూడాలనుకువారు ఈ ఆఫర్‌ను ఎంజాయ్ చేయండి. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించారు. Bhai ko, behen ko… Dushman ko, Yaar ko… And of course, apne Pyaar ko… Kal Jawan dikhaaiyega! Chacha-Chachi, Phoopha-Phoophi, Maama-Maami… Yaani Poore Parivaar ko. Sab ke liye ek ke saath ek free ticket!!! Toh kal se… Parivaar, yaar aur pyaar… Just Buy 1 ticket and get the… pic.twitter.com/Qr9gI4ihcO — Shah Rukh Khan (@iamsrk) September 27, 2023 -
వెయ్యి కోట్ల క్లబ్లో జవాన్.. షారుక్ అరుదైన ఘనత!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ- బాలీవుడ్ షారుక్ ఖాన్ కాంబో వచ్చిన జవాన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈనెల 7న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం కేవలం 18 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల మార్క్‌ను దాటింది. ఇండియాలో ఇప్పటి వరకు రూ.560 కోట్లు వసూలు చేసింది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై అట్లీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించింది. జవాన్ మూవీ వెయ్యి కోట్లు అధిగమించడంపై అట్లీ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. (ఇది చదవండి: పరిణీతి- రాఘవ్ పెళ్లి.. అందుకోసం 2500 గంటలు పట్టిందా??) 'దేవుడు మా పట్ల చాలా దయతో ఉన్నాడు' అంటూ జవాన్ మూవీ క్లిప్‌ను షేర్ చేశారు. ఈ మైల్ స్టోన్‌కు కారణమైన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాగా.. ఈ ఏడాదిలో రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసిన షారుక్ రెండో చిత్రమిది. ఒకే ఏడాదిలో రెండు రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన తొలి భారతీయ నటుడు షారుఖ్ ఖాన్ ఘనత సాధించారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఇదంతా షారుక్ హవా అని.. త్వరలోనే రూ.1500 కోట్లకు చేరుకుంటుందని కామెంట్ చేశారు. పఠాన్ బాక్సాఫీస్ రికార్డ్ బ్రేక్ అయితే ఈ ఏడాది ప్రారంభంలో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం నటించిన పఠాన్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల కొల్లగొట్టింది. జనవరి 25న విడుదలైన ఈ చిత్రం నాలుగు వారాల తర్వాత ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల మార్కును దాటింది. పఠాన్‌తో పోలిస్తే.. జవాన్ కేవలం 18 రోజుల్లోనే ఈ మార్క్‌ని దాటింది. కాగా.. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా, రిధి డోగ్రా, లెహర్ ఖాన్, గిరిజా ఓక్ సంజీతా భట్టాచార్య కూడా నటించారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, దీపికా పదుకొణె కూడా అతిథి పాత్రలో కనిపించారు. (ఇది చదవండి: నేను శరత్‌బాబును రెండో పెళ్లి చేసుకోలేదు.. క్లారిటీ ఇచ్చిన నటి) God is so kind to us Thank you all #jawan History in the maKING ft. Jawan! 🔥 Have you watched it yet? Go book your tickets now! https://t.co/uO9YicOXAI Watch #Jawan in cinemas - in Hindi, Tamil & Telugu. pic.twitter.com/h57GwuTTP3 — atlee (@Atlee_dir) September 25, 2023 -
Nayanathara : అట్లీపై నయనతార కోపంలో నిజమెంత?
తమిళసినిమా: నటి నయనతార దర్శకుడు అట్లీపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ప్రచారం. మరి ఇందులో నిజం ఎంత? దక్షిణాదిలో లేడీ సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్న నయనతార తొలిసారిగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి నటించిన చిత్రం జవాన్. షారుక్‌ఖాన్ కథానాయకుడిగా నటించి సొంతంగా నిర్మించిన ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ యువదర్శకుడు అట్లీ బాలీవుడ్ పరిచయం అయ్యారు. కాగా ఈ భారీ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకొనె కూడా నటించిన విషయం తెలిసిందే. చిత్రం ఈనెల 7న విడుదలై బాక్సాఫీస్ షేక్ చేస్తూ రూ.1000 కోట్ల క్లబ్ చేరువలో ఉంది. అలాంటి చిత్రంలో దర్శకుడు తన పాత్రకు సరైన న్యాయం చేయలేదనే అసంతృప్తితో నయనతార ఉన్నట్లు ప్రచారం హోరెత్తుతోంది. Witnessing the magic of my favouritest @iamsrk last night in a packed hall amidst the cacophony of whistles & cheer was something else. #Jawan is truly an exceptional film. @Atlee_dir you are a magician who knows the pulse of the nation. @NayantharaU you were ethereal. No words… pic.twitter.com/YKdc3bsnsk — Genelia Deshmukh (@geneliad) September 8, 2023 జవాన్ చిత్రంలో నటి దీపిక పడుకొనెకు అతిథి పాత్ర అని చెప్పి ఆమెకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్లు నయనతార ఆవేదన చెందుతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అందుకే నయనతార ఆ చిత్ర ప్రచార కార్యక్రమంలోగానీ, విజయోత్సవ వేడుకల్లోగాని పాల్గొనలేదనేది నెటిజన్ల విశ్లేషణ. అయితే ఈ ప్రచారాన్ని నయనతార వర్గం తీవ్రంగా ఖండిస్తున్నారు. నిజానికి షారుఖ్‌ఖాన్ అంటే నయనతారకు చాలా ఇష్టమని అందుకే ఆమె ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించారని వారు పేర్కొంటున్నారు. Nayanthara special message to all after #Jawan success. She loved working with @iamsrk ❤️ SRK Nayanthara ❤️❤️ @NayantharaU + @iamsrk#JawanCreatesHistory #JawanEvent pic.twitter.com/S8ZU3uD2zp — Abu Bakar (@_Abubakar03) September 15, 2023 ఇక చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన లేదన్నది ఆమె పాలసీ అని అందుకే జవాన్ చిత్ర ప్రచారంలో కూడా పాల్గొనలేదని అంటున్నారు. అదేవిధంగా ముంబైలో జరిగిన చిత్ర సక్సెస్ కార్యక్రమంలో పాల్గొనపోవడానికి కారణం, అదేరోజు నయనతార తల్లి పుట్టినరోజు కావడంతో ఆమె తన తల్లికి ప్రాముఖ్యత ఇచ్చారని చెబుతున్నారు. అయితే దర్శకుడు అట్లీపై నయనతార ఆగ్రహం అని వారు, వీరు అంటుండడమే కానీ నయన మాత్రం ఏవిధంగా స్పందించలేదన్నది గమనార్హం. Nayanthara spotted in Mumbai #Nayanthara #VigneshShivan @NayantharaU #Jawan pic.twitter.com/wcJRbypqAl — Deccan Mirror (@TheDeccanMirror) September 8, 2023 -
జవాన్ డైరెక్టర్‌పై నయన్ అసంతృప్తి.. కారణం అదేనా..!!
లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే జవాన్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన కనిపించింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. కేవలం ఇండియాలోనే ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ చిత్రంలో నయన్ నటనపై ప్రశంసలు వస్తున్నాయి. ఆమె యాక్షన్ సన్నివేశాలతో సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. (ఇది చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి!) అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె సైతం కీలక పాత్రలో కనిపించింది. ఆమె పాత్ర కొద్దిసేపే అయినప్పటికీ ప్రేక్షకులను మెప్పించింది. ఇదంతా పక్కనపెడితే ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్లో ఓ చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో నయనతారకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదనే వార్త వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మూవీ డైరెక్టర్ అట్లీపై నయన్ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీపికా పదుకొణె అతిథి పాత్రలో కనిపించినా.. ఆమెకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని కోలీవుడ్ లేటెస్ట్ టాక్. నయనతార అసంతృప్తిగా ఉందా? తాజా బజ్ ప్రకారం జవాన్‌లో అతిథి పాత్ర పోషించిన దీపికా పదుకొణెకు దక్కిన ప్రాధాన్యత నయనతారకు ఇవ్వలేదని సమాచారం. ఈ విషయంలో నయనతార అట్లీ తీరు పట్ల కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక భవిష్యత్తులో బాలీవుడ్ చిత్రాల్లో నయన్ నటించకూడదని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే ప్రమోషన్లకు దూరం? జావాన్ సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రమోషన్లలో నయన్ కనిపించక పోవడం ఇదే ప్రధాన కారణమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. షారుక్-నయనతార జవాన్ కాస్తా దీపికా- షారుక్ మూవీగా మారిపోయిందంటున్నారు. అంతే కాకుకండా గత వారం ముంబైలో జరిగిన సక్సెస్ మీట్లో విలన్‌గా నటించిన విజయ్ సేతుపతితో సహా అందరూ హాజరైనప్పటికీ నయన్ సక్సెస్ మీట్‌కు కూడా హాజరు కాలేదు. (ఇది చదవండి: 6 ఏళ్ల తర్వాత పర్సనల్ ఫోటోలు బయటకు ఎలా వచ్చాయి?: రాహుల్) దక్షిణాదిలో ఆమెనే! అయితే మరికొందరేమో దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. ఇదంతా నిజం కాదని కొట్టి పారేస్తున్నారు. గతంలోనూ నయనతార ఎప్పుడూ సినిమా ఈవెంట్లకు వెళ్లలేదంటున్నారు. గతంలో ఆమెకు ఎదురైన చేదు అనుభవాల కారణంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని చెబుతున్నారు. కేవలం నటించడమే తన పని నయన్ భావిస్తారని అంటున్నారు. అయితే ఈ సినిమాకు నయనతార దాదాపు రూ.10 నుంచి 11 కోట్ల వరకు భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది హీరోయిన్లలో ఇప్పటివరకు ఇంత భారీ పారితోషికం తీసుకోలేదని సమాచారం. -
ఆ విషయంలో అట్లీ నన్ను మోసం చేశాడు: ప్రియమణి
తమిళసినిమా: బహుభాషా నటిగా రాణిస్తున్న ప్రియమణి మొదట్లో హీరోయిన్గా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. తమిళంలో పరుత్తివీరన్ చిత్రంలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. కాగా వివాహానంతరం తన వయసుకు తగిన పాత్రలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జవాన్ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించారు. ఈ చిత్రంలో నటించిన గురించి ప్రియమణి ఒక భేటీలో పేర్కొంటూ జవాన్ చిత్రంలో నటించే అవకాశం రావడంతో ఏదో క్యామియో పాత్ర అయి ఉంటుందని భావించారన్నారు. అయితే షారుక్ ఖాన్ టీం లో ఒకరిగా ముఖ్యమైన పాత్ర అని తెలియగానే చాలా సంతోషించానన్నారు. అట్లీ దర్శకుడు అని చెప్పగానే నటిస్తానని చెప్పానన్నారు. అలా ఒకసారి జూమ్ కాల్లో దర్శకుడు అట్లీ, ఆర్య మాట్లాడారని చెప్పారు. అట్లీ తన మిత్రుడు అని పరిచయం చేసి ఆర్య వెళ్లిపోయారన్నారు. అలా ప్రియమణి జవాన్ చిత్రంలో నటిస్తుందన్న వార్త వెలువడగానే ఏదో ఐటమ్ సాంగ్ అయ్యింటుందనే ప్రచారం జరిగిందన్నారు. అలాంటి ప్రచారాన్ని తాను పట్టించుకోలేదన్నారు. అయితే దర్శకుడు అట్లీ తనను చాలా ఏమార్చారన్నారు.. జవాన్ చిత్రం తమిళ వర్షన్లో నటుడు విజయ్ గెస్ట్ రోల్ లో నటించనున్నారని, అదే విధంగా తెలుగు వెర్షన్ జూనియర్ ఎన్టీఆర్ ఆ పాత్రను నటించనున్నారని ప్రచారం హోరెత్తిందన్నారు. విజయ్ ఇందులో నటిస్తున్నారా..? అని తాను అట్లీని అడగ్గా నటింపజేస్తే పోద్ది అన్నారన్నారు. అయితే విజయ్‌తో తనను ఒక్క సన్నివేశంలోనైనా నటింపజేయమని కోరగా అలాగే అన్నారని, అయితే చివరివరకూ దర్శకుడు అట్లీ తనను అలా ఏమార్చుతూనే వచ్చారని వెల్లడించారు. నిజానికి ఈ చిత్రంలో విజయ్ గానీ, జూనియర్ ఎన్టీఆర్ గానీ నటించలేదని ప్రియమణి పేర్కొన్నారు. -
అట్లీ, షారుఖ్‌పై నయనతార అసంతృప్తి.. నిజమెంత?
తమిళసినిమా: పండ్లు ఉన్న చెట్టుకే రాళ్లు అన్నది సామెత. అయితే ఇది కొందరి విషయంలో అక్షరసత్యంగా మారుతుంది. ముఖ్యంగా నటి నయనతార పరిస్థితి ఇదే. దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్రకథానాయకిగా రాణిస్తున్న నటి నయనతార. తాజాగా జవాన్ చిత్రంతో బాలీవుడ్‌లోనూ రంగప్రవేశం చేశారు. దీంతో ఇండియన్ సినిమా తారగా గుర్తింపుపొందారు. నయనతార నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటన కారణంగా ఈమైపె సంచలన నటిగా ముద్రవేశారు. నటిగా రెండు దశాబ్దాలకు దగ్గరలో ఉన్న నయనతార 75 చిత్రాల మైలురాయిని అవలీలగా అధిగమించి నాటౌట్‌గా వెలుగొందుతున్నారు. కాగా దీని గురించి ఇటీవల ఒక వదంతి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. జవాన్ చిత్రంలో తన పాత్రకు ప్రాముఖ్యత ఇవ్వలేదని దర్శకుడు అట్లీ, నటుడు షారుక్ఖాన్లపై అసంతృప్తిగా ఉన్నారన్నది ఆ వదంతి. అయితే జవాన్ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై అనూహ్యంగా వసూళ్లను కురిపిస్తోంది. ఇది ఇండియాలో ఒకరోజులో రూ.75 కోట్లు వసూళ్లు చేసిందని, ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు సాధించి గత రికార్డులను తిరగరాస్తున్నట్లు సమాచారం. ఇకపోతే జవాన్ చిత్రంలో నయనతారకు తగిన ప్రాధాన్యత ఉంది. ఆమెకు యాక్షన్ సన్నివేశాలు కూడా చోటుచేసుకున్నాయి. మరో విషయం ఏమిటంటే నటుడు షారుక్‌ఖాన్ అంటే నయనతారకు పిచ్చి అభిమానం. ఇక అట్లి దర్శకత్వం వహించిన తొలి చిత్రంలో కథానాయకి నయనతారనే ఆ తర్వాత బిగిల్ చిత్రంలో విజయ్ సరసన నయనతారనే నటింపజేశారు. ఇకపోతే జవాన్ చిత్రం సక్సెస్‌ను సెలబ్రేట్ చేయడానికి నయనతార తన భర్త విఘ్నేశ్ శివన్‌తో కలిసి ముంబై వెళ్లారు. ఈ జంటను ముంబై విమానాశ్రయంలో ఫొటో గ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాబట్టి జవాన్ చిత్ర దర్శక నిర్మాతలపై నయనతార అసంతృప్తిగా ఉన్నట్టు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తేటతెల్లమవుతోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఆస్పత్రిలో భార్య.. షూటింగ్ ఆపేయమన్న షారుక్: అట్లీ
ప్రపంచ వ్యాప్తంగా షారుక్ ఖాన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం జవాన్. ఈ సినిమాను తమిళ హిట్ దర్శకుడు అట్లీ కుమార్ తెరకెక్కించాడు. దీంతో ఈ సినిమా కోసం బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. జవాన్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అని ప్రచారం జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని లుక్‌లో ఈ సినిమాలో షారుక్ కనిపించనున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ చిత్రంలో కథానాయిక. విజయ్ సేతుపతి విలన్ రోల్ పోషిస్తుండగా, దీపికా పదుకొణె కూడా ఈ సినిమాలో అతిధి పాత్రలో నటిస్తోంది. (ఇదీ చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో నయనతార ఎంట్రీ.. ఫాలో అయ్యేది ఆ ఐదుగురిని మాత్రమే) దర్శకుడు శంకర్‌తో కో-డైరెక్టర్‌గా సినీ రంగ ప్రవేశం చేసిన అట్లీకి జవాన్ ఐదవ చిత్రం కానున్నడం విశేషం. 'రాజా రాణి'తో అట్లీ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాక దళపతి విజయ్‌తో వరుసగా మూడు చిత్రాలు థెరి, మెర్సల్, బిగిల్ భారీ విజయాలు సాధించాయి. దీని తర్వాత అట్లీ జవాన్‌ను ప్రకటించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ తదితర భాషల్లో సెప్టెంబర్ 7న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో వేదికపై అట్లీ ప్రసంగం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. నటి ప్రియను వివాహం చేసుకున్న అట్లీ సుమారు ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. జవాన్ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న సమయంలో తన భార్య గర్భం దాల్చిన విషయాన్ని షారుక్ ఖాన్‌కు తెలిపినప్పుడు ఆయన ఎలా స్పందించాడో తాజాగ అట్లీ గుర్తుచేసుకున్నాడు. 'జవాన్ షూటింగ్ కోసం నేను అమెరికాకు చేరుకున్నాను. ఈలోపు తాను గర్భం దాల్చినట్లు ప్రియా ఫోన్ చేసి తెలిపింది. ఎనిమిదేళ్ల తర్వాత గర్భం దాల్చినందున మూడు నెలల పాటు ప్రయాణం చేయవద్దని వైద్యులు సూచించారు. పూర్తిగా బెడ్ రెస్ట్ అన్నారు. అప్పటికి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి మూడు రోజులే అయింది. దీంతో ప్రియాను అమెరికాకు రమ్మని చెప్పలేకపోయాను ఏం చేయ్యాలో తెలియక ఈ విషయాన్ని షారుఖ్ ఖాన్‌కి చెప్పగా, వెంటనే షూటింగ్ ఆపేయమని, కొద్దిరోజులు వెయిట్ చేస్తానని చెప్పాడు. షారుక్ చెప్పిన మాటను ప్రియతో తెలుపగా.. షూటింగ్ ఆపవద్దని చెప్పడమే కాకుండా తన పనులు తానే చూసుకుంటానని చెప్పింది. అలాంటి కష్ట సమయంలో కూడా సినిమా పనులపై దృష్టి పెట్టమని ఆమె నన్ను ప్రోత్సహించింది. ప్రియా అందించిన ఆ సహకారమే నా విజయ రహస్యం' అని వేదికపై అట్లీ అన్నారు. తన కష్ట సమయంలో షారుక్ ఏంతో ధైర్యాన్ని ఇచ్చాడని, తండ్రి స్థానంలో షారుక్ ఎప్పుడూ తనవెంటే ఉన్నారని ఆట్లీ ఎమోషనల్ అయ్యాడు. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ గురించి ఆందోళన చెందనని అట్లీ తెలిపాడు. కాగా, గత జనవరిలో వీరికి మగబిడ్డ జన్మించాడు. అట్లీ, ప్రియా నవంబర్ 2014 లో వివాహం చేసుకున్నారు. ఇక అట్లీ భార్య ప్రియా కొన్ని తమిళ సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రియా నటించి తెలుగులో డబ్బింగ్ అయిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. నా పేరు శివ, యముడు లాంటి సినిమాల్లో ప్రియా నటించింది. 10years back , we were shooting near #ShahRukhKhan sir home , I stood near his gate and clicked a pic. Now his home gate opened for me and Shah Rukh sir stood at the gate to welcome me ! You are more than my father , my everything sir . #Atlee pic.twitter.com/ulmjyaSOzN — iamsrksneha (@iamsrkian000) August 30, 2023 -
'జవాన్' రెండో ట్రైలర్ విడుదల
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ 'జవాన్' సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. యూఎస్ఏలో ఈ సినిమా ప్రీ బుకింగ్స్ ఓ రేంజ్లో సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను నెలరోజుల కిందటే విడుదలైంది. అందులో భారీ యాక్షన్ సీన్స్‌తో షారుక్ అదరగొట్టాడు. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గపడుతుండడం వల్ల సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. అందువల్ల ఈ సినిమాకు సంబంధించిన రెండో ట్రైలర్‌ను కూడా మేకర్స్ తాజాగ విడుదల చేశారు. రెండో ట్రైలర్లో కూడా షారుఖ్ దుమ్ములేపాడనే చెప్పవచ్చు. ముంబయ్‌లోని మెట్రోను షారుఖ్ హైజాక్ చేస్తాడు.. ఈ సీన్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాలో లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తుండగా కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించనున్నారు. ట్రైలర్లో విజయ్ సేతుపతిని ప్రత్యేకమైన లుక్‌లో చూపించారని చెప్పవచ్చు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ జవాన్‌ను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నరు. ఈ సినిమా సెప్టెంబర్ 7న పాన్ ఇండియా లెవెల్లో థియేటర్లలోకి రానుంది .ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా(దుబాయ్)పై జవాన్ ట్రైలర్‌ను ప్రదర్శించేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. దీనిని నేడు రాత్రి (ఆగష్టు 31) 9 గంటలకు పదర్శించనున్నారు. బుర్జ్ ఖలీఫా బిల్డింగ్‌పై షారుక్ సినిమా ట్రైలర్‌ను ప్రదర్శించడం ఇది తొలిసారి కాదు. ఈ ఏడాది ఆరంభంలో రిలీజైన 'పఠాన్' సినిమా ట్రైలర్‌ను కూడా ఇదివరకే అక్కడ ప్రదర్శించిన విషయం తెలిసిందే.