bachupally
-
చీకటి పడితే పాములు.. వర్షం పడితే దుర్గంధం.. నిజాంపేట్ లో నరక కూపం
-
బాచుపల్లిలో మీతో సాక్షి
-
అనూష ఆత్మహత్య.. నారాయణ కాలేజీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని అనూష కాలేజీలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.వివరాల ప్రకారం.. బాచుపల్లిలోని నారాయణ కాలేజీలో అనూష ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆదివారమే అనూషను పేరెంట్స్ హాస్టల్లో దింపి వెళ్లారు. ఆమెను డ్రాప్ చేసిన కాసేపటికే గదిలో ఉరివేసుకుని అనూష ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం అనూష పేరెంట్స్‌కి ఫోన్ చేసి.. విద్యార్థి పేరెంట్స్‌కు స్పృహ తప్పి కిందపడిపోయినట్టు సమాచారం ఇచ్చారు. దీంతో, సిటీ దాటకముందే.. పేరెంట్స్ కాలేజీకి బయలుదేరారు. వారు.. కాలేజీకి వెళ్ళే సరికి అనూష ఉరి వేసుకొని చనిపోయిందని యాజమాన్యం తెలిపింది యాజమాన్యం. పేరెంట్స్ కాలేజీకి రాకముందే అనూష మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించింది నారాయణ కాలేజీ యాజమాన్యం. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇక, తాజాగా బాచుపల్లి నారాయణ కాలేజ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనూష బంధువులు నారాయణ కాలేజీలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అనూష సూసైడ్ చేసుకున్న విషయాన్ని తమకు ముందే ఎందుకు చెప్పలేదని కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఇదే సమయంలో తాము అనూష డెడ్‌బాడీని చూడకముందే ఎందుకు గాంధీ ఆసుపత్రికి తరలించారని అడిగారు. ఈ క్రమంలో కాలేజీ ఎదుట వారు ఆందోళనకు దిగారు. దీంతో, పోలీసులు అక్కడికి చేరుకుని వారిని పంపించే ప్రయత్నం చేయగా.. వాగ్వాదం చోటుచేసుకుంది. -
ప్రాపర్టీ ధరల పెరుగుదలలో కోకాపేట అదుర్స్
సాక్షి, హైదరాబాద్: కోకాపేట బంగారం కంటే ఖరీదైపోయింది. ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మించడం, నివాసం ఉండటం డెవలపర్లకు, కొనుగోలుదారులకు ఇద్దరికీ స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. గత ఐదేళ్లలో ప్రాపర్టీ ధరల పెరుగుదలలో దేశంలోనే కోకాపేట రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ 89 శాతం మేర పెరుగుదల నమోదు కాగా.. బాచుపల్లిలో 57 శాతం, తెల్లాపూర్‌లో 53 శాతం ధరలు పెరిగాయని అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. 2019లో ఈ ప్రాంతంలో ధర చదరపు అడుగుకు రూ.4,750గా ఉండగా.. 2024 నాటికి రూ.9 వేలకు పెరిగింది. ఈ ప్రాంతంలో భూముల ధరలు ఖరీదు కావడంతో విల్లాల కంటే ఎక్కువగా హైరైజ్ భవనాలనే ఎక్కువగా నిర్మిస్తున్నారు. మూడేళ్ల క్రితం వరకూ కోకాపేట బడ్జెట్ హోమ్స్ దొరికేవి కానీ, ఇప్పుడు 40 అంతస్తుల స్కై స్క్రాపర్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనిష్టంగా 8 వేల చదరపు అడుగు నుంచి గరిష్టంగా 16 వేల చదరపు అడుగు విస్తీర్ణం ఉన్న అపార్ట్మెంట్లు సైతం నిర్మిస్తున్నారు.ధర రూ.2.5 కోట్లకు పైమాటే.. గత ఐదేళ్లలో కోకాపేటలో దాదాపు 12,920 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. ఇందులో అల్ట్రా లగ్జరీ గృహాలే ఎక్కువగా ఉన్నాయి. రూ.2.5 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన యూనిట్ల వాటా 52 శాతంగా ఉందంటే డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. 30 శాతం మధ్య, ప్రీమియం విభాగం యూనిట్లు, రూ.1.5–2.5 కోట్ల మధ్య ఉన్న లగ్జరీ గృహాల వాటా 19 శాతంగా ఉంది.బాచుపల్లిలో బూమ్.. బాచుపల్లిలో కూడా రియల్టీ మార్కెట్ బూమ్‌లో ఉంది. ఇక్కడ గత ఐదేళ్లలో ధరలు 57 శాతం పెరిగాయి. 2019లో ఇక్కడ సగటు ధర చదరపు అడుగుకు రూ.3,690 ఉండగా.. 2024 నాటికి రూ.5,800లకు పెరిగాయి. మిడ్, ప్రీమియం విభాగానికి బాచుపల్లి కేంద్రంగా మారింది. 2019లో తెల్లాపూర్‌లో ధర చదరపు అడుగుకు రూ.4,819గా ఉండగా.. 2024 నాటికి 53 శాతం వృద్ధి రేటుతో రూ.7,350కు పెరిగాయి. తెల్లాపూర్‌లో గత ఐదేళ్లలో 18,960 యూనిట్లు లాంచింగ్ కాగా.. ఇందులో 66 శాతం ప్రీమియం, 34 శాతం లగ్జరీ విభాగం గృహాలే.చదవండి: మాట మార్చిన నిఖిల్ కామత్!.. అప్పుడు అద్దె ఇల్లే బెస్ట్ అని.. సంపన్న వర్గాల ఆసక్తి.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలలో రద్దీ పెరగడంతో ఇక్కడి వారు కోకాపేటకు మారుతున్నారు. ఈ ప్రాంతం హై ప్రొఫైల్, ప్రీమియం ప్రాజెక్ట్‌లకు డెస్టినేషన్‌గా మారింది. – ప్రశాంత్ రావు, డైరెక్టర్, పౌలోమీ ఎస్టేట్స్మౌలిక వసతులే మెయిన్ ఐటీ కారిడార్లకు చేరువగా ఉండటమే బాచుపల్లి హైలైట్. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో పాటు ఇంటర్నేషనల్ స్కూల్స్, హాస్పిటల్స్, మాల్స్‌తో ఈ ప్రాంతానికి డిమాండ్ పెరిగింది. ప్రవాసులు, ఉన్నత హోదా ఉద్యోగులు ఇక్కడ నివాసం ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. – నరేంద్ర కుమార్, డైరెక్టర్, ప్రణీత్ గ్రూప్ -
కాలేజీలా.. మురికి కూపాలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కార్పొరేట్ ప్రైవేటు జూనియర్ కాలేజీలు భారీగా ఫీజులు దండుకుంటూ హాస్టళ్లలో విద్యార్థినులకు కనీస వసతు లు కలి్పంచకపోవడంపై తెలంగాణ మహిళా కమిషన్ తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఇటీవల రెండు కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శ్రీచైతన్య జూనియర్ కాలేజీ (మాదాపూర్ ఐఐటీ గర్ల్స్ క్యాంపస్), నారాయణ జూనియర్ కాలేజీ (బాచుపల్లి ఐఐటీ గర్ల్స్ క్యాంపస్)లను పూర్తిస్థాయిలో తనిఖీ చేసి అక్కడి విద్యార్థినులతో మాట్లాడారు. ప్రధానంగా ఆయా కాలేజీల్లో వాష్‌రూమ్‌లు, మంచినీటి వసతి అత్యంత దుర్భరంగా ఉన్న విషయాన్ని ప్రత్యక్షంగా గుర్తించి యాజమాన్యాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పబ్లిక్ టాయిలెట్ల కంటే అధ్వానంగా... రెండు కాలేజీల్లోనూ వందలాది మంది విద్యార్థినులు ఉండగా వారి సంఖ్యకు తగినన్ని వాష్‌రూమ్‌లు లేకపోవడం, మంచినీటి వసతి ప్రాంగణం దుర్గంధం వెదజల్లుతుండటంపై నేరెళ్ల శారద తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. డారి్మటరీలు అపరిశుభ్రంగా ఉన్నాయని, చాలా వాష్‌రూమ్‌లకు తలుపులు లేవని పలువురు విద్యార్థినులు ఆమెకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ రెండు కాలేజీలకు ఎలాంటి అనుమతులు ఇచ్చారో పూర్తిస్థాయి నివేదిక సమరి్పంచాలని జీహెచ్ఎంసీ, అగ్నిమాపక, ఆహార భద్రత విభాగం, ఇంటర్ బోర్డు కమిషనర్‌కు తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద నోటీసులిచ్చారు. ఎలాంటి ఇబ్బందులున్నా తనకు ఫిర్యాదు చేయాలని సూచిస్తూ ఫోన్ నంబర్‌ను విద్యారి్థనులకు ఇచ్చారు. -
చేయని నేరానికి చిత్రహింసలు
-
బాచుపల్లిలో దారుణం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను హత్య చేసిన భర్త
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని బాచుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యను భర్తతో కత్తితో హత్య చేశాడు. మే 5న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాలు.. సాయి అనురాగ్ కాలనీలో నాగేంద్ర భరద్వాజ్, అతని భార్య సాఫ్ట్వేర్ ఇంజరీర్గా పనిచేస్తున్న మధులతతో కలిసి జీవిస్తున్నాడు. ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈనెల 5వ తేదీన ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరగడంతో నాగేంద్ర కోపంతో రగిలిపోయాడు. భార్య మధులతను కత్తితో పొడిచి చంపాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేయడానికి ప్రయత్నంచగా విఫలమయ్యాడుదీంతో గ్యాస్ లీకేజ్ చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఇవేవి ఫలించకపోవడంతో చివరికి తాను కత్తితో కోసుకొని హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మధులత తండ్రి రంగనాయకులు పిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
హైదరాబాద్‌లో విషాదం.. ఏడుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మంగళవారం కుండపోత వర్షం కురిసింది. అకాల వర్షాల నేపథ్యంలో ప్రమాదాల కారణంగా రెండు రాష్ట్రాల్లో పలువురు మృతిచెందారు.కాగా, హైదరాబాద్‌లోని బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెంట్రింగ్ పని కార్మికుల షెడ్‌పై కూలిన రిటైనింగ్ వాల్. భారీ వర్షానికి కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న గోడ కూలిపోవడంతో ఏడుగురు కార్మికులు మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సీఎన్‌డీఆర్‌ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు. ఇక, మృతులను ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కార్మికులుగా గుర్తించారు. ఇక, ఏపీలో కూడా పిడుగుల కారణంగా ఏడుగురు మృత్యువాడపడ్డారు. బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. గోడకూలి ఏడుగురు చనిపోవడంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గోడ నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే, చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందించాలన్నారు. #HyderabadRains #tankbund #Hussainsagar @CoreenaSuares2 @Rajani_Weather super duper rain. #scary pic.twitter.com/2xvWITJ3jt— sαмυεℓ ραυℓ🇮🇳 (@vikramsamuelp) May 7, 2024 -
మిస్టరీ వీడిన తేజస్ మర్డర్ కేసు
హైదరాబాద్: ప్రగతినగర్‌లో జరిగిన ప్రతీకార హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరో నలుగురు మైనర్లు ఉన్నారు. ఎస్హెచ్ఓ ఉపేందర్ కథనం ప్రకారం వివరాలు.. గత ఏడాది అక్టోబర్ 24న తెల్లవారుజామున ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి దాసారం బస్తీలో తరుణ్‌రాయ్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఏ–1గా షేక్ షరీఫ్ అలియాస్ అమీర్ షరీఫ్, ఏ–2గా అభిషేక్, అలియాస్ అభి, ఏ–3గా పిల్లి తేజస్ అలియాస్ తేజు, అలియాస్ డీల్, ఏ–4గా బండ నాగరాజు, ఏ–5గా రాహుల్, ఏ–6గా రాబిన్ బెన్నీలు నిందితులు. వీరిని ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. షేక్ షరీఫ్, తేజస్‌లు రెండు నెలల క్రితం బెయిల్‌పై విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన వీరిని ఎలాగైనా హత్య చేయాలని తరుణ్‌రాయ్ అనుచరులు పథకం రచించారు. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన తేజస్ బోరబండ నుంచి ప్రగతినగర్‌కు వచ్చి తన తల్లితో కలిసి అద్దె ఇంటిలో ఉండేవాడు. పక్కా ప్రణాళికతో.. తరుణ్‌రాయ్ బంధువులైన రోహిత్‌తో పాటు అతని అనుచరులు దినేష్ తదితరులు తేజస్‌ను హత్య చేయాలని పథకం వేసుకున్నారు. ఈ క్రమంలో ఎవరికీ అనుమానం రాకుండా శివప్పను ప్రగతినగర్‌లో ఉంటున్న తేజస్ దగ్గరకు మద్యం తాగడానికి పంపించారు. దీంతో శివప్పతో పాటు కౌశిక్, మహేశ్ ముగ్గురూ ఈ నెల 7న ప్రగతినగర్‌లోని తేజస్ ఇంటికి చేరుకుని రాత్రి 11 గంటల వేళ మద్యం తాగుతున్నారు. ఇదే సమయంలో మోతీనగర్‌లోని అల్సఫా హోటల్లో రోహిత్‌తో పాటు మరో 13 మంది తేజస్ హత్యపై చర్చించారు. శివప్ప ప్రగతినగర్‌లోని ఇంటి లొకేషన్‌ను షేర్ చేశాడు. తెల్లవారుజాము 2 గంటల సమయంలో సమీర్, సిద్ధేశ్వర్ నాయక్, జయంత్‌లు బైక్‌పై వచ్చారు. రోహిత్, దినే‹Ù, ప్రతీక్, రాహుల్, సునీల్, గానప్ప, సంతోష్, శ్రీకర్లు బైక్‌లపై లొకేషన్‌కు చేరుకుని చుట్టు పక్కల ప్రాంతాలను పరిశీలించారు. ఇదే సమయంలో శివప్ప సిగరెట్ తాగేందుకు కిందికి వెళదామనడంతో అందరూ కలిసి వచ్చారు. మద్యం మత్తులో ఉన్న తేజస్‌ను శివప్ప తన స్కూటీపై ఎక్కించుకుని సమీర్, జయంత్, సిద్ధేశ్వర్ల ఎదుట నిలిపాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన తేజస్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించే లోపే జయంత్, సిద్ధేశ్వర్ కత్తులతో తేజస్‌పై దాడి చేశారు. వెంటనే సమీర్ సిమెంట్ రాయితో తలపై బలంగా కొట్టాడు. అప్పటికే తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయిన తేజస్ రోడ్డుపై పడిపోయాడు. దాడి చేసే క్రమంలో సిద్ధేశ్వర్ చేతికి గాయమైంది. దీంతో వెంటనే శివప్ప.. సిద్ధేశ్వర్ నుంచి కత్తి తీసుకుని తేజస్ గొంతు కోశాడు. మర్మాంగాలపై రాళ్లతో దాడి చేశాడు. తేజస్ చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం అందరూ అక్కడి నుంచి డాన్సులు చేసుకుంటూ బైక్‌పై రీల్స్ చేసుకుంటూ వెళ్లిపోయారు. తేజస్ ఇంటిని అదీనంలోకి తీసుకుని.. ప్రగతినగర్‌లో నివాసం ఉంటున్న తేజస్ నివాసానికి తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో చేరుకున్న సుమారు 10 మందికి పైగా అతని ఇంటి పరిసరాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. దాడి అనంతరం 10 నిమిషాల్లోనే తేజస్‌ను హత్య చేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. రోహిత్, సమీర్, సిద్ధేశ్వర్, శివప్ప, గణేశ్, సునీల్, రాహుల్, తిరుమల్, మహేశ్‌లను రిమాండ్‌కు తరలించారు. దినేష్‌ను అరెస్ట్ చేయాల్సి ఉందని, ఈ కేసులో నలుగురు మైనర్లు సైతం ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితులు వినియోగించిన ఆరు సెల్ ఫోన్లు, నాలుగు బైక్‌లు స్వా«దీనం చేసుకున్నారు. బాలానగర్ జోన్ డీసీపీ ఆదేశాలతో కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాస్‌రావు నేతృత్వంలో కేసును ఛేదించిన ఎఎస్ఎహ్ఓ ఉపేందర్, ఎస్ఐలు మహేశ్, సత్యనారాయణ, కానిస్టేబుళ్లు రాజేశ్, యాదగిరి, బాల్‌రాజ్‌లను ఉన్నతాధికారులు అభినందించారు. నాడు తేజస్.. నేడు శివప్ప.. తరుణ్‌రాయ్ హత్య కేసులో ఏ–3గా ఉన్న తేజస్.. తరుణ్రాయ్కి నమ్మకంగా ఉండేవాడు. దీంతో అప్పట్లో ప్రత్యర్థులు తేజస్‌ను నమ్మకంగా వాడుకుని తరుణ్‌కు సంబంధించిన కదలికలను తెలుసుకుని అనువైన సమయం కోసం వేచి చూసి హత్య చేశారు. ఇదే క్రమంలో తరుణ్‌రాయ్ అనుచరులు సైతం తేజస్‌కు నమ్మకంగా ఉండే శివప్పను ప్రలోభపెట్టి తేజస్‌ను హత్య చేయడం గమనార్హం. అందరూ నేర చరిత్ర కలిగిన వారే.. తేజస్ హత్యకేసు నిందితుల్లో అందరూ నేర చరిత్ర కలిగిన వారే ఉన్నారు. తిరుమల్ రౌడీ షీటర్ కాగా..సిద్ధేశ్వర్ మర్డర్ కేసులో నిందితుడు. మిగతా వారిపై సైతం పలు రకాల కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. కాగా అందరూ 25 సంవత్సరాల వయసు లోపు వారే కావడం గమనార్హం. -
హత్య చేసి.. ఆపై ఇన్‌స్టాలో రీల్ పోస్ట్ చేసి
నిజాంపేట్: ప్రతీకారంతో రగిలిపోతున్న ఓ గ్యాంగ్ ప్రత్యర్థి కోసం కాపు కాసి పక్కా స్కెచ్‌తో అదును చూసి అంతమొందించింది. ఆపై హత్యకు ఉపయోగించిన కత్తులు పట్టుకొని నృత్యాలు చేస్తూ రక్తంతో తడిసిన చేతులతో రీల్స్ చేసి లెక్క సరిపోయింది..పగ తీర్చుకున్నామంటూ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు పెట్టి సంచలనం సృష్టించింది. కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాస్‌రావు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్ఆర్నగర్ పీఎస్ పరిధిలోని బోరబండలో నివాసముండే షేక్ షరీఫ్ గ్యాంగ్‌స్టర్. చిన్నచిన్న నేరాలకు పాల్పడుతుండేవాడు. ఓ కేసు విషయంలో షేక్ షరీఫ్ జైలుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన దగ్గర నంబర్–2గా ఉన్న తరుణ్‌రాయ్ గ్యాంగ్ మొత్తానికి తన ఆదీనంలోకి తీసుకున్నాడు. దీంతో షరీఫ్, తరుణ్రాయ్ల మధ్య విభేదాలు మొదలయ్యాయి. 2023లో దసర పండగరోజున రావణ దహనం సందర్భంగా షరీఫ్ గ్యాంగ్ తరుణ్రాయ్ను హత్య చేసింది. ఈ ఘటనలో ఏడుగురు పాలుపంచుకోగా, ప్రగతినగర్‌లో హత్యకు గురైన తేజస్ అలియాస్ తేజు అలియాస్ డీల్ ఏ3గా ఉన్నాడు. రెండు నెలల క్రితం బెయిల్‌పై వచ్చిన తేజస్ బెయిల్‌పై బయటకు వచ్చాక తేజస్ ప్రత్యర్థుల నుంచి ప్రమాదం పొంచి ఉందని ముందే గ్రహించి బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్లోబతుకమ్మకుంట వద్ద ఓ అపార్ట్మెంట్లో తల్లితో కలిసి ఉంటున్నాడు. తన గ్యాంగ్ స్నేహితులతో మాట్లాడటం, కలిసి పార్టీలు చేసుకోవడం జరిగేది. అయితే ఈ క్రమంలో తేజస్ తన స్నేహితులతో నెక్ట్స్ టార్గెట్ సమీర్ అని..అతడిని కూడా లేపేస్తామంటూ మాట్లాడినట్టు ప్రత్యర్థులకు తెలిసింది. ఈ క్రమంలో ఆదివారం తేజస్ తల్లి ఇంట్లో లేకపోవడంతో బోరబండ నుంచి స్నేహితులు మహేశ్, శివప్ప, మహేశ్‌లు ప్రగతినగర్‌కు వచ్చారు. తేజస్ ఇంట్లో నలుగురు కలిసి మద్యం సేవిస్తున్నారు. వచ్చిన ముగ్గురు స్నేహితుల్లో శివప్ప రెండు గ్యాంగ్‌లకు కామన్ ఫ్రెండ్. దీంతో ప్రత్యర్థులు శివప్పతో మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న తేజస్‌ను హత్య చేయాలని పథకం వేసి, శివప్పతో లోకేషన్ షేర్ చేయించుకున్నారు. దాని ఆధారంగా ప్రగతిగనగర్లోని తేజస్ ఇంటి సమీపంలోకి చేరుకున్నారు.. తెల్లవారుజామున ఫుల్‌గా తాగిన తేజస్ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. బైక్ ఎక్కే క్రమంలో ఒక్కసారిగా తేజస్‌పై కత్తులతో సమీర్, శివప్ప, సిద్దేశ్వర్, జయంత్‌లు విచక్షణరహితంగా పొడిచి హత్య చేశారు. అనంతరం కత్తులు చూపుతూ రీల్స్ చేసి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. ఈ రీల్స్‌కు రక్తచరిత్ర సినిమాలోని పాటను జత చేశారు. హత్యకు పాల్పడిన వారిని, తేజస్‌తో మద్యం సేవించిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. -
Hyd: యువకుడిని హత్యచేసి ఇన్‌స్టాలో రీల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని బాచుపల్లిలో భయంకరమైన ఘటన జరిగింది. తేజస్(21) అలియాస్ సిద్దూను అనే యువకుడిని కొంత మంది యువకులు అతి కిరాతకంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. చంపడమే కాకుండా ఆ ఘటనను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం కలకలం రేపింది. బాచుపల్లి పోలీసు స్టేషన్లో పరిధిలోని ప్రగతి నగర్లో తేజస్ అద్దె ఇంట్లో తన తల్లితో కలిసి ఉంటున్నాడు. తన తల్లి ఊరు వెళ్లటంతో.. ఆదివారం రాత్రి తేజస్ తన మిత్రులైన మహేశ్, శివస్ప, సమీర్లతో కసిలి మద్యం తాగాడు. సోమవారం తెల్లవారుజూమున ప్రగతి నగర్‌లోని బతుకమ్మ ఘాట్ వద్ద ఉన్న తేజస్‌ను గతంలో హత్యకు గురైన తరుణ్ స్నేహితులు బైక్‌లపై వచ్చి దారుణంగా పొడిడి చంపారు. హత్య చేసిన తర్వాత యువకులు రీల్ చేసి ఇస్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రతీకారంగానే తాము హత్య చేసినట్లు ఆ పోస్టులో వాళ్లు పేర్కొన్నారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గత ఏడాది తరుణ్ అనే వ్యక్తి హత్య కేసులో సిద్దూ ఏ3గా ఉన్నట్లు తెలుస్తోంది. పాత కక్షల నేపథ్యంలో.. ఆ హత్యకు ప్రతీకారంగానే తేజస్‌ను హతమార్చినట్లు స్పష్టత వచ్చింది. -
తెలంగాణలో మార్పు తెస్తాం
నిజాంపేట్ (హైదరాబాద్): తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. కాంగ్రెస్ దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిందని, రాజ్యాంగాన్ని రూపొందించి బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేసిందని ఖర్గే చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్లకు ఓటేస్తే గులాంగిరి చేయాల్సి వస్తుందని.. అదే కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రజల జీవితాలు మారుతాయని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ శివార్లలోని బాచుపల్లిలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఖర్గే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఇతర నేతలు ప్రసంగించారు. కాంగ్రెస్‌ను ఎవరూ అడ్డుకోలేరు బీఆర్ఎస్ సర్కార్‌కు బీజేపీ మద్దతు తెలుపుతోందని, ఇరు పారీ్టలు కలసి కాంగ్రెస్‌ను ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఖర్గే ఆరోపించారు. ఇలాంటి వాటికి కాంగ్రెస్ భయపడేదేలేదని, ఏ శక్తీ తమను అడ్డుకోలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారాన్ని అనుభవిస్తున్న వారు తామే రాష్ట్రాన్ని సాధించామని చెప్పుకొంటున్నారని, ఏ ఒక్క కుటుంబంతో రాష్ట్ర సాధన సాధ్యపడలేదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ కాంగ్రెస్ నాయకుల ను బెదిరించేందుకు ఈడీ, ఐటీ దాడులను చేయిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతి మోదీ కి కనిపించదని, కాంగ్రెస్ నేతలే కనిపిస్తారని విమర్శించారు. కాంగ్రెస్‌తోనే రాష్ట్రంలో వెలుగులు: రేవంత్ రాష్ట్రానికి కాంగ్రెస్ ఏం చేసిందని కొందరు సన్నాసులు ప్రశ్నిస్తున్నారని, కాంగ్రెస్ చేసినవన్నీ కళ్లముందే ఉన్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలోని శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ డ్యామ్‌లు, దేవాదుల పథకాన్ని కాంగ్రెస్ పారీ్టయే కట్టింది. 75 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచి్చంది. హెచ్ఎంటీ, ఐడీఎల్, బీడీఎల్ వంటి ఫ్యాక్టరీలు, జీడిమెట్ల పారిశ్రామికవాడ వంటివి స్థాపించింది. రాష్ట్రంలో వెలుగులు జిలుగులు ఉన్నాయంటే కాంగ్రెస్ చేసిన పనులే కారణం. సీఎం కేసీఆర్ చింతమడకలో చదువుకున్న బడిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించిందే..’’అని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనపై పెద్ద కుట్ర చేసి కొడంగల్‌లో ఓడించారని, కానీ కొన్నిరోజుల్లోనే దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్‌గిరిలో ప్రజలు తనను గెలిపించారని రేవంత్ చెప్పారు. కుత్బుల్లాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కొలన్ హన్మంతరెడ్డిని గెలిపించాలని కోరారు. -
భయాందోళనలో హాస్టళ్ల విద్యార్థులు
-
హైదరాబాద్ బాచుపల్లిలో రెండేళ్ల చిన్నారి దీక్షిత మృతి కేసు
-
బాచుపల్లిలో విషాదం: రోడ్డుపై గుంతకు బలైన చిన్నారి
సాక్షి, హైదరాబాద్: బాచుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై గుంతకు చిన్నారి బలైంది. గుంతలో బండి పడటంతో చిన్నారి ఎగిరి రోడ్డుపై పడింది. చిన్నారిపై నుంచి స్కూల్ బస్సు వెళ్లడంతో పాప అక్కడికక్కడే మృతిచెందింది. చిన్నారిని తన తండ్రి బండి మీద తీసుకెళ్తుండగా బాచుపల్లి పరిధిలో రెడ్డీస్ ల్యాబ్ వద్ద ఈ ఘటన జరిగింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. అతివేగంగా వెనుక నుంచి బైక్‌ను బస్సు డ్రైవర్ ఢీకొట్టాడు. బైక్‌పై నుంచి ఎగిరిపడిన ఎనిమిదేళ్ల దీక్షిత బస్సు వెనుక చక్రాల కింద పడి మృతిచెందింది. డ్రైవర్ రహీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో దీక్షిత 2వ తరగతి చదువుతోంది. చదవండి: ఒక్కగానొక్క కుమార్తె.. స్నానం చేసేందుకు బాత్రూమ్కు వెళ్లి, నీటి కొళాయిని తాకగానే.. -
బాచుపల్లిలో కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, మైదరాబాద్: బాచుపల్లి ఓ ప్రైవేట్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. బాలికల క్యాంపస్ హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం ఉదయం హాస్టల్ భవనం 5వ అంతస్తు నుంచి దూకి విద్యార్థిని వంశిక మృతి చెందింది. కామారెడ్డి జిల్లాకు చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వంశిక.. వారం రోజుల క్రితమే క్యాంపస్‌లో చేరినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ వద్దకు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వంశిక ఆత్మహత్య చేసుకుందా?. ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయిందా? అన్నది స్పష్టత లేదు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతికి గల కారణలపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: శిరీషది హత్యా.. ఆత్మహత్యా?.. తెలంగాణ డీజీపీకి మహిళా కమిషన్ ఆదేశం -
Hyderabad: నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం
సాక్షి, హైదరాబాద్: రోడ్డు పక్కన నిలిపిన క్యాబ్ డోర్‌ను ఒక్కసారిగా తెరవడంతో అటుగా ద్విచక్ర వాహనంపై వచ్చినన ప్రభుత్వ టీచర్‌కు తీవ్ర గాయాలై మృతి చెందగా, అతని కుమారుడు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన ప్రభుత్వ పాఠశాల టీచర్ పెంటయ్య(45) ఆదివారం కొంపల్లిలో చదువుతున్న కుమారుడు శ్రీతేజను తీసుకుని ప్రగతినగర్‌కు వచ్చాడు. ఆపై అక్కడ నుండి జేఎన్టీయు మీదుగా కొండాపూర్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో ప్రగతినగర్ కాకతీయ హిల్స్ సమీపంలో రోడ్డుపై నిలిపిన క్యాబ్ డ్రైవర్ అకస్మాత్తుగా డోర్‌ను తెరిచాడు. దీంతో బైకుపై నుంచి పెంటయ్య, శ్రీతేజలు రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో వెనుక నుండి వచ్చిన టిప్పర్ పెంటయ్య మీదుగా వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పెంటయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కాగా తీవ్రంగా గాయపడిన శ్రీతేజను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిర్లక్ష్యంగా క్యాబ్ డోరు తెరిచిన డ్రైవర్‌తో పాటు క్యాబ్ బుక్ చేసిన వ్యక్తిపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
40 శాతం పెరిగే..
బాచుపల్లిలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో లలిత్ ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు. ఫస్ట్‌క్లాస్‌లో చేరేప్పుడే ఏటా ఎంత ఫీజు పెరుగుతుందో అప్పుడే చెప్పారు. ఈ మేరకు ఏటా 25 శాతం పెరుగుదలతో తల్లిదండ్రులు ఫీజులు చెల్లిస్తున్నారు. 2019లో రూ.3.10 లక్షలు కట్టారు. 2020, 2021లో ఫీజులు పెంచలేదు. కానీ 2022లో ఏకంగా రూ.4.50 లక్షలు అన్నారు. రాష్ట్రంలోని బడ్జెట్ స్కూళ్ళలో 2019లో (కోవిడ్ కన్నా ముందు) కనిష్టంగా రూ.17 వేల నుంచి గరిష్టంగా రూ.33 వేల వరకూ వార్షిక ఫీజులున్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పుడవి రూ.25 వేల నుంచి రూ.55 వేల వరకూ పెరిగాయి. ఎల్కేజీ నుంచి 6వ తరగతి వరకూ రూ. 25 వేలు, ఆ తర్వాత టెన్త్ వరకూ రూ.55 వేల వరకూ తీసుకుంటున్నారు. స్కూలును బట్టి ఫీజుల్లో హెచ్చుతగ్గులున్నాయి. సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్లలో పెరిగిన ఫీజులు తల్లిదండ్రులను బెంబేలెత్తిస్తున్నాయి. ఓ మాదిరి బడ్జెట్ స్కూళ్ల నుంచి కార్పొరేట్ స్కూళ్ల వరకు ఫీజులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫీజులు సగటున 40 శాతం మేర పెరిగినట్లు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. ఫీజులు, పుస్తకాలు, ఇతరత్రా ఖర్చులు కలిపి ఓ మాదిరి స్కూల్లో సగటున రూ.40 వేలు, కార్పొరేట్ స్కూలైతే రూ.4 లక్షల వరకు వార్షిక ఫీజు లేకుండా అడ్మిషన్ దొరికే పరిస్థితి లేదని అంటున్నారు. కోవిడ్ కాలంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేలా పాఠశాలలు ఫీజుల పెంపునకు శ్రీకారం చుట్టాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు డీజిల్ ధర పెరుగుదలను సాకుగా చూపిస్తూ బస్సు ఫీజుల్ని కొన్ని యాజమాన్యాలు రెట్టింపు చేశాయి. ఇక పుస్తకాలు, యూనిఫామ్‌లకయ్యే ఖర్చు వీటికి అదనం. కాగా జూన్ ఆరంభం నుంచి కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందే 50 శాతం మేర ఫీజులు కట్టేయాలంటూ స్కూళ్లు ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో తాము అప్పులు చేయాల్సి వస్తోందని కొందరు తల్లిదండ్రులు తెలిపారు. నియంత్రణ ఏదీ? ► ఫీజుల నియంత్రణకు 2016లో ఆచార్య తిరుపతి రావు కమిటీని ప్రభుత్వం నియమించింది. తెలంగాణ వ్యాప్తంగా 10,800 ప్రైవేటు స్కూళ్ళలో చదువుతున్న 32 లక్షల మంది విద్యార్థుల పరిస్థితిని ఈ కమిటీ పరిశీలించింది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఫీజుల నియంత్రణకు తెచ్చిన చట్టాలను కమిటీ పరిశీలించి కొన్ని సిఫారసులు చేసింది. ► దీనిప్రకారం ప్రతి స్కూలు 10 శాతం లోపు ఫీజు పెంచుకోవచ్చు. ఈ పరిమితి దాటి ఫీజులు పెంచే స్కూళ్లు తాము చేసిన ఖర్చు (స్కూలు అభివృద్ధికి, సౌకర్యాల కల్పనకు) ప్రతి పైసాకు లెక్క చూపాలి. బ్యాంకు ద్వారా ఆన్లైన్ లావాదేవీలు జరిగినట్లు ఆధారాలు చూపాలి. వీటిని ఫీజుల రెగ్యులేటరీ కమిటీ పరిశీలిస్తుంది. అవకతవకలుంటే భారీ జరిమానాకు, అవసరమైతే స్కూలు గుర్తింపు రద్దుకు కమిటీ సిఫారసు చేస్తుంది. ► ఈ విధానం అమలు చేస్తే చాలా స్కూళ్ళు 10 శాతం లోబడే ఫీజులు పెంచే వీలుంది. 2018లో తిరుపతి రావు కమిటీ దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసింది. దాదాపు 4,500 స్కూళ్ళు తమ ఖర్చులను ఆన్లైన్ ద్వారా చూపాయి. ఇవన్నీ 10 శాతానికి పైగా ఫీజులు పెంచుకునేందుకు అర్హత పొందాయి. అయితే ఈ విధానం ఆ తర్వాత కనుమరుగైంది. ► గత ఏడాది రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం తిరుపతిరావు కమిటీ సిఫారసులతో పాటు మరికొన్ని అంశాలను జోడించి ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ఫీజుల నియంత్రణ దిశగా అడుగులు పడలేదు. దీంతో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ బడుల వైపు మొగ్గు కోవిడ్ కారణంగా చితికిపోయిన కుటుంబాలుప్రస్తుత పరిస్థితుల్లో తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లు మాన్పించి, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు ఇష్టపడుతున్నాయి. పైగా సర్కారీ బడుల్లో ఈ ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియం కూడా అందుబాటులోకి వస్తుండం, కోవిడ్ కేసులు పెరిగి ప్రైవేటు స్కూళ్ళు మూతపడితే తాము కట్టే ఫీజులూ వృధా అవుతాయనే ఆలోచనతో ప్రభుత్వ స్కూళ్ళలో చేర్పిస్తున్నాయి. ఈ కారణంగా ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు ఇప్పటికే లక్ష దాటాయి. హైదరాబాద్‌లోని ఒక స్కూల్లో (ఐఏఎస్ ఫౌండేషన్ ప్రత్యేక స్కూలు) నిశాంత్ ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాడు. 2019లో వార్షిక ఫీజు రూ. 3.50 లక్షలు ఉంది. ఇప్పుడే ఏకంగా రూ.4.10 లక్షలు కట్టమన్నారు. మొత్తం ఫీజు ఒకేసారి కడితే కొంత తగ్గిస్తామన్నారు. 2019లో డీజిల్ ధర లీటర్ రూ.68 ఉంది. ఇప్పుడు రూ.98 అయింది. పాఠశాల బస్సు ఫీజులు 2019లో దూరాన్ని బట్టి రూ.22 నుంచి రూ.48 వేల వరకూ ఉండగా.. ఇప్పుడివి రూ.28 వేల నుంచి రూ.58 వేల వరకూ పెరిగాయి. అప్పులు చేసే పరిస్థితిని నివారించాలి కరోనా నష్టాల పేరుతో ఈ సంవత్సరం ప్రైవేటు స్కూళ్ళు సగటున 40 శాతం మేర ఫీజులు పెంచాయి. డీజిల్ ధరలు పెరిగాయని బస్సు ఫీజులూ విపరీతంగా పెంచారు. పేద, మధ్య తరగతి వర్గాలు పిల్లల చదువు కోసం అప్పులు చేసే దారుణమైన పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఫీజుల నియంత్రణకు కఠిన చట్టాలు తేవాలి. – టి.నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి) ఒకేసారి పెంచేశారు మా పిల్లాడి స్కూల్లో ఫీజు ఒకేసారి 40 శాతం పెంచారు. కోవిడ్ సమయంలో బకాయి పడిన మొత్తంతో పాటు ఈ ఏడాది ఫీజు సగం ఇప్పుడే కట్టమంటున్నారు. బతిమిలాడితే ఒక నెల గడువు ఇచ్చారు. ఫీజు కట్టడం కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంది. – గుర్రం రామకృష్ణ (విద్యార్థి తండ్రి, మల్లెపల్లి, రఘునాథపాలెం మండలం, ఖమ్మం జిల్లా) -
Photo Feature: దారంతా పూలవనం
రోడ్డుకిరువైపులా పచ్చని చెట్లు, మధ్యలో గుల్ మొహర్ చెట్లకు పూసిన ఎర్రటి పూలు. ఈ సీన్ చూస్తుంటే కనువిందు చేస్తుంది కదూ. కొంపల్లి నుంచి బాచుపల్లికి వెళ్లే దారిలో దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ వద్ద ప్రతి మే నెలలో ఈ సీన్ కనబడుతుంది. ఈ రోడ్డు గుండా వెళ్లే వాహనదారులను ఈ ఎర్రటి పూల చెట్లు కనువిందు చేస్తూ కట్టి పడేస్తుంటాయి. – సుభాష్‌నగర్ (Hyd) -
అనుమానాస్పదంగా విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నిజాంపేట్: బాచుపల్లిలోని వీఎన్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద మృతి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. నాగర్‌కర్నూలు జిల్లా మాదవన్పల్లికి చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, అరుణ దంపతుల కుమారుడు శివనాగులు బాచుపల్లిలోని వీఎన్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో బీటెక్ సీఎస్ఈ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. 20 రోజుల క్రితం వీఎన్ఆర్ కాలే జీæ హాస్టల్లో చేరాడు. కాగా గురువారం ఉదయం శివనాగులు హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని హాస్టల్ నిర్వాహకులు విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాచుపల్లిలో నివాసముండే శివనాగులు మేనమామ ప్రకాష్ హుటాహుటిన హా స్టల్ దగ్గరకు వచ్చాడు. అయితే సుమారు 30 నిమిషాలు అతన్ని హాస్టల్ సిబ్బంది లోపలికి అనుమతించ లేదు. అప్పటికే మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ, బీజేపీ నాయకులు కాలేజ్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. అయితే పోలీసులకు సంఘటన స్థలంలో లభించిన సూసైడ్ నోట్లో తనకు జీవితంపై విరక్తి వచ్చిందని, అందుకే తాను ఆత్మహత్య చేసు కుంటున్నానని, కుటుంబ సభ్యులు తనను క్షమించాలని కోరినట్లు అందులో ఉంది. మృతుడి తండ్రి సత్యనారాయణ మాట్లాడుతూ తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడని, ఇతర ఎలాంటి సమస్యలు లేవని, సుసైడ్ నోట్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ తమ బిడ్డది కాదని పేర్కొన్నారు. విద్యార్థి సంఘాల ధర్నా.. లాఠీ చార్జ్.. విషయం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు విద్యార్థి మృతిపై అనుమానాలున్నాయంటూ కాలేజ్ గేట్ ముందు ధర్నా చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న వారిపై లాఠీ చార్జ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాలేజ్ యాజమాన్యం కనీసం విద్యార్థి మృతికి సంతాపం కూడా తెలపక పోవడం సిగ్గుచేటని ఏబీవీపీ నాయకులు అన్నారు. మధ్యాహ్నం తరువాత స్పందించిన కాలేజ్ యాజమాన్యం సెలవు ప్రకటించింది. లాఠీ చార్జిపై శ్రీశైలంగౌడ్ ఆగ్రహం.. విద్యార్థి అనుమానాస్పద మృతిపై నిరసన తెలిపిన ఏబీవీపీ నాయకులపై పోలీసులు లాఠీచార్జి చేయడంపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కూన శ్రీశైలంగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదేవి ధంగా మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి, నిజాంపేట్ మున్సి పల్ అ«ధ్యక్షుడు సతీష్‌లు పోలీసులు, కళాశాల యాజమాన్యం ప్రవర్తించిన తీరుపై మండి పడ్డారు. అదే విధంగా సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమామహేష్, మండల కార్యదర్శి శ్రీనివాస్‌లు కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అర్ధరాత్రి వరకు హాస్టల్లో ఫ్రెషర్స్ పార్టీ.. వీఎన్ఆర్ హాస్టల్లో బుధవారం రాత్రి ఫ్రెషర్స్ పార్టీ జరిగినట్లు సమాచారం. ఆ పార్టీ అర్ధరాత్రి వరకు కొనసాగిందని, ఈ నేపథ్యంలో సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసినందుకు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడా.. లేదా ఇతరాత్రా కారణాలేమైనా ఉన్నాయా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడితే అసలు విషయం బయటపడే అవకాశముంది. -
బాచుపల్లిలో క్లౌడ్ 33
సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరుకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ అలయన్స్ గ్రూప్ అనుబంధ కంపెనీ అర్బన్‌రైజ్ బాచుపల్లిలో క్లౌడ్–33 అనే పేరుతో లగ్జరీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. 9.15 ఎకరాల్లోని ఈ ప్రాజెక్ట్‌లో 2,600 లగ్జరీ అపార్ట్మెంట్లుంటాయి. 1,100 నుంచి 2,021 చ.అ.లలో 2, 3, 4 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి. సింగపూర్‌లోని సిటీస్కేప్స్, మొరాకో రాయల్ రెసిడెన్సీలను స్ఫూర్తిగా తీసుకొని ఈ రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేశామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 85 వేల చ.అ.లలో క్లబ్ హౌస్‌లో జీరో గ్రావిటీ యోగా గది, రూఫ్ టాప్ మీద బార్బిక్యూ, ప్రైవేట్ పార్టీ ఏరియా, గ్రీన్ డైనింగ్, గేమింగ్ జోన్, స్విమ్మింగ్ పూల్ వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి. ముందస్తు సొమ్ము చెల్లించి బుకింగ్ చేసుకుంటే చాలు 2026లో ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన తర్వాతే కొనుగోలుదారులకు నెలవారీ వాయిదా (ఈఎంఐ) మొదలవుతుందని ఈడీ రాజేంద్ర జోషి తెలిపారు. 1,3 ఎకరాల స్థలాన్ని సెంట్రల్ ల్యాండ్ స్కేపింగ్‌ను కేటాయించారు. దీంతో 75 శాతం స్థలం ఓపెన్ స్పేస్ ఉంటుంది. భవిష్యత్తులో పిల్లల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ‘జీనియస్’ నాలెడ్జ్ సెంటర్‌ను నిర్మిస్తోంది. ఇందులో క్రచ్, డే కేర్ సెంటర్లతో పాటు ఆన్లైన్, ట్యూషన్, సంగీతం, నృత్యం, కుకరీ, ఏఐ, రోబోటిక్స్ వంటి శిక్షణ తరగతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లుంటాయి. దీంతో పిల్లలకు భద్రత, రక్షణ ఉండటమే కాకుండా వారి అభిరుచులకు తగ్గట్లుగా శిక్షణ ఇప్పించేందుకు వీలవుతుంది. -
బాచుపల్లి: తీరని శోకాన్ని మిగిల్చిన ‘ఓవర్టేక్’
సాక్షి, హైదరాబాద్: ఒక్కసారి రోడ్డు మీదకు వచ్చామంటే.. ఒళ్లంతా కళ్లు చేసుకుని జాగ్రత్తగా చుట్టుపక్కల గమనిస్తూ.. వాహనాలు నడపాలి. మన గురించి, మన కుటుంబం గురించి ఆలోచించి.. మనమే జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. కేవలం ప్రాణం పోవడమే కాదు.. కొన్నేళ్ల పాటు మన కుటుంబం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుంది అని గుర్తుంచుకోవాలి. అర సెకను అజాగ్రత్త.. ఎంతటి కష్టాన్ని, నష్టాన్ని మిగులుస్తోందో చెప్పడానికి మాటలు చాలవు. ఇందుకు సంబంధించిన వీడియోని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ ట్విటర్లో షేర్ చేశారు. ఒళ్లు గగుర్పొడిచే ఆ ప్రమాద వివరాలు.. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ‘‘దీని ద్వారా మీరు ఏం గమనించారు’’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోలోని ప్రమాదం బాచుపల్లి ప్రాంతంలో చోటు చేసుకుంది. రోడ్డు మీద కొన్ని వాహనాలు వెళ్తుంటాయి. పెద్దగా రద్దీగా కూడా లేదు. రోడ్డు మీద లారీ, ఇన్నోవా వెళ్తుంటాయి. ఈ రెండింటి మధ్య ఓ వ్యక్తి బైక్ మీద వెళ్తుంటాడు. ఈ క్రమంలో ఇన్నోవాకు ముందు ప్రయాణిస్తున్న ఆటో.. దానికి దారి ఇవ్వడం కోసం కొద్దగా ముందుకు వెళ్లి ఓ పక్కకు ఆగుతుంది. ఇక అంతసేపు ఇన్నోవాకు అతి సమీపంలో ఉన్న బైకర్.. ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నిస్తూ.. లారీ ముందుకు వెళ్తాడు. అయితే ఇది గమనించని లారీ డ్రైవర్ ఫాస్ట్‌గా వెళ్లడంతో బైక్‌ను ఢీ కొడతాడు. దాంతో ఆ వ్యక్తి ఎగిరి లారీ కింద పడి కొద్ది దూరం వెళ్తాడు. లారీలోని వ్యక్తి ప్రమాదాన్ని గుర్తించి కిందకు దిగి చూస్తుంటాడు. ఇంతలో లారీ కొంచె దూరం వెనక్కి కదిలి.. దాని కిందే ఉన్న బైకర్ మీదుగా కొంచెం దూరం వెళ్తుంది. కింద ఉన్న వ్యక్తి హెచ్చరించడంతో లారీని ఆపుతాడు. ఓవర్టేక్ చేయాలనే అర సెకను కోరిక.. బైకర్‌కి.. అతని కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆరోగ్యం ఎలా ఉందనే దాని గురించి వీడియోలో ఎలాంటి సమాచారం లేదు. ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం కోసం ఈ వీడియోని షేర్ చేశామని.. ఇతరుల అనుభవం నుంచి మనం పాఠాలు నేర్చుకోవచ్చు అంటూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ ట్విటర్లో దీన్ని షేర్ చేశారు. ఈ వీడియో చూసిన వారంతా బాధితుడిది, ఇన్నోవా డ్రైవర్‌దే తప్పని విమర్శిస్తున్నారు. -
Bachupally: 840 ఫ్లాట్స్.. 320 విల్లాలు: 24/7వలంటీర్లు
కరోనా మహమ్మారిని కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు బాచుపల్లిలోని హిల్‌కౌంటీ అసోసియేషన్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్‌కు గురైన వారికి కొండంత ధైర్యాన్నిస్తూ.. వారి ఆరోగ్యం కోసం చర్యలు చేపడుతోంది. వైరస్ బాధితులను కంటికి రెప్పలా కాపాడుతూ.. సేవలను ఇంటి వద్దకే సమకూర్చుతోంది. కుత్బుల్లాపూర్ బాచుపల్లిలోని హిల్‌కౌంటీ గేటెడ్ కమ్యూనిటీకి ఓ ప్రత్యేకత ఉంది. సుమారు 65 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన హిల్‌కౌంటీ అపార్ట్‌మెంట్స్‌లో 840 ఫ్లాట్స్, 320 విల్లాలు ఉన్నాయి. వందలాది కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి. కరోనా బాధితులకు మందులతో పాటు అవసరమైన వారికి ఆక్సిజన్.. అత్యవసరమైన వారికి ఆస్పత్రుల్లో బెడ్లు సమకూరుస్తున్నారు అసోసియేషన్ సభ్యులు. – నిజాంపేట్ కట్టడి చర్యలు ఇలా.. గేటెడ్ కమ్యూనిటీలోని సభ్యులంతా సమష్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కోవిడ్ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అత్యవసర సేవలను అందుబాటులో ఉంచారు. రెండు రోజులకోసారి కాలనీలోని ప్రతి వీధిలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో బ్లీచింగ్, సోడియం హైసో క్లోరైట్ పిచికారీ చేయిస్తున్నారు. హిల్కౌంటీలోకి వచ్చే ప్రతిఒక్కరినీ థర్మల్ స్కానింగ్‌తో టెంపరేచర్ పరీక్షిస్తున్నారు. సామూహిక కార్యకలాపాలకు చెక్ పెడుతున్నారు. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్ ఇతర గేమ్స్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. రెండు నెలల నుంచి 250 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా.. ఐసోలేషన్ అయిన వారందరికీ అవసరమైన సేవలను అందజేశారు. కోవిడ్‌కు గురైన వారికి కూరగాయలు, మందులు, ఆహార పదార్థాలు అందించేందుకు 24 గంటలు వలంటీర్లను అందుబాటులో ఉంచారు. హిల్‌కౌంటీ డాక్టర్స్ గ్రూపులో అన్ని రకాల వైద్య నిపుణులు ఉన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి లక్షణాలను బట్టి సంబంధిత వైద్యులు సూచనలు, సలహాలు అందజేస్తూ అవసరమైన మందులను రిఫర్ చేస్తున్నారు. కరోనా బాధితులకు 24 గంటల పాటు వైద్య సేవలు అందించేందుకు డాక్టర్ సునీల్ ఆధ్వర్యంలో అసోసియేషన్ కృషి చేస్తోంది. మీరూ స్పందించండి.. ∙కరోనా సెకండ్‌వేవ్ ఉద్ధృతితో మీ అపార్ట్మెంట్/కాలనీలో ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటున్నారు? ∙మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు వినూత్నంగా, విభిన్నంగా ఎలా ముందుకెళ్తున్నారు? ∙కోవిడ్‌కు ఎదురొడ్డి ఏ విధంగా నిలువరిస్తున్నారు? ∙మీ అపార్ట్మెంట్/కాలనీలో ఎవరికైనా కోవిడ్ వస్తే ఎలా చేయూతనిస్తున్నారు? ∙వారిలో ధైర్యాన్ని ఎలా నింపుతున్నారు? .... అయితే ‘సాక్షి’ మీకు తోడుగా నిలుస్తుంది. మీ మీ అపార్ట్మెంట్లలో చేపట్టిన కోవిడ్ కట్టడిని ఫొటోతో సహా మాతో పంచుకోండి. దిగువ తెలిపిన నంబర్లకు వాట్సాప్/మెయిల్ చేయండి. చదవండి: అనగనగా సొసైటీ.. ఒక్క కేసు కూడా నమోదు కాని వైనం -
పెళ్లింట్లో అసభ్య ప్రవర్తన, హిజ్రాల అరెస్టు
సాక్షి, హైదరాబాద్: పెళ్లి ఇంట్లోకి ప్రవేశించి అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా బలవంతంగా డబ్బులు వసూలు చేసిన హిజ్రాలు వారికి సహకరించిన ఆటో డ్రైవర్లను బాచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ప్రగతినగర్ ఆర్.కె.లేఅవుట్‌కు చెందిన ప్రేవేటు ఉద్యోగి పంచాంగం చలపతి ఈనెల 24న తన కుమారుడి వివాహం జరిపించాడు. 25న ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసే క్రమంలో 8 మంది హిజ్రాలు ఆయన ఇంటికి వచ్చి రూ.20 వేలు డబ్బులు డిమాండ్ చేశారు. అసభ్యకరంగా ప్రవర్తించారు. భయపడిన చలపతి కుటుబ సభ్యులు వారికి రూ.16,500 ఇవ్వడంతో వెళ్లిపోయారు. ఈ విషయంపై బాధితుడు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు ప్రగతినగర్ ఎలీప్ చౌరస్తాలో టీఎస్15 యూడీ 0298 ఆటోలో వెళ్తున్న 8 మంది హిజ్రాలను, ఆటో డ్రైవర్లు కరణ్ గుప్త, మొహమ్మద్ మాసీలను అరెస్టు చేశారు. ఈ విషయమై మాదాపూర్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అమాయకులను వేధించే ట్రాన్స్జెండర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే డయల్ 100కు ఫోన్ చేయాలని, లేదా వాట్సాప్ నెంబర్ 94906 17444కు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
యువతిపై భర్త లైంగిక దాడి.. భార్య వీడియో