bakrid
-
‘గాజా యుద్ధ ముగింపునకు అత్యుత్తమ మార్గమిదే!’
వాషింగ్టన్: హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంతో నిత్యనరకం చూస్తున్న ఇస్లాం పౌరులు.. ఇకనైనా ప్రశాంతంగా జీవించాల్సిన అవసరం ఉంది. యుద్ధం ముగిస్తేనే అది సాధ్యపడుతుంది. అందుకు అమెరికా ప్రతిపాదించిన కాల్పుల ఉల్లంఘన ఒప్పందం ఒక్కటే అత్యుత్తమ మార్గమని పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదివారం బక్రీద్(Eid ul Adha) సందేశం విడుదల చేశారు. ‘‘గాజా యుద్ధంతో ఎందరో అమాయకులు చనిపోయారు. అందులో వేల మంది చిన్నారులు ఉన్నారు. తమ కళ్ల ముందే తమ వాళ్లను పొగొట్టుకుని.. సొంత ప్రాంతాల నుంచి పారిపోయిన ముస్లింలు ఇంకెందరో. వాళ్ల బాధ అపారమైంది.. .. ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఈ మూడు దశల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించింది. గాజాలో హింసకు ముగింపు పలకాలన్నా.. అంతిమంగా యుద్దం ముగిసిపోవాలన్నా ఇదే అత్యుత్తమ మార్గం అని బైడెన్ తన సందేశంలో స్పష్టం చేశారు.అంతేకాదు.. మయన్మార్‌లో రోహింగ్యాలు, చైనాలో ఉయిగర్లు.. ఇలా ఇతర ముస్లిం తెగల హక్కుల పరిరక్షణ కోసం అమెరికా ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు. అలాగే.. సూడాన్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధం ముగింపునకు శాంతిపూర్వకం తీర్మానం రూపకల్పన దిశగా అమెరికా అడుగులు వేస్తున్నట్లు తెలిపారాయన. తన పరిపాలన ఇస్లామోఫోబోబియా, ఇతరత్ర రూపాల్లో ఉన్న పక్షపాత ధోరణిని ఎదుర్కొనేందుకు జాతీయ వ్యూహాన్ని అనుసరిస్తోందని.. ఇది ముస్లింలకు మాత్రమే కాకుండా అరబ్, సిక్కు, దక్షిణాసియా అమెరికన్లపై కూడా ప్రభావం చూపెడుతుందని తన బక్రీద్ సందేశంలో బైడెన్ పేర్కొన్నారు.బైడెన్ ప్రతిపాదించిన ఒప్పందం ఇదే.. మొదటి దశ.. ఇది ఆరు వారాలు కొనసాగుతుంది. ఇందులో ఇజ్రాయెల్-హామాస్ బలగాలు పూర్తిస్థాయిలో కాల్పుల విరమణను పాటించాలి. గాజాలోని జనాలు ఉండే ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెనుదిరగాలి. వందల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. ప్రతిగా మహిళలు, వృద్ధులు సహా పలువురు బందీలను హమాస్ అప్పగించాలి. రెండో దశలో.. సైనికులు సహా సజీవ ఇజ్రాయెలీ బందీలందరినీ హమాస్ విడిచిపెట్టాలి. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా వెనక్కి వచ్చేయాలి. మూడో దశలో.. గాజాలో పునర్నిర్మాణ పనులు భారీస్థాయిలో ప్రారంభమవుతాయి. బందీలుగా ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయినవారి అవశేషాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలి. -
ముస్లిం సోదరులకు ఏపీ సీఎం చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు
-
బక్రీద్ వేడుక: మేకలు, గొర్రెలతో మార్కెట్లలో నెలకొన్న సందడి
-
ముస్లింలకు మాజీ సీఎం వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
-
ఒంటెనే చోరీ చేశారు
కురబలకోట : ఇన్నాళ్లు పర్సులు కొట్టేసే దొంగలను చూశాం.. ఇంట్లో చొరబడి బంగారో..నగదో చోరీ చేసిన వాళ్లనూ చూశాం.. కానీ ఏకంగా పెద్ద జంతువులలో ఒకటైన ఒంటెనే ఎత్తుకెళ్లే ఘనులుంటారని ఇప్పుడే చూస్తున్నాం. అవును.. అన్నమయ్య జిల్లా కురబల కోట మండలం అంగళ్లులో ఒంటెను ఎత్తుకెళ్లిన ఘటన వెలుగు చూసింది. స్థానికుల కథనం మేరకు..త్వరలో జరగబోయే బక్రీద్‌కు అంగళ్లుకు చెందిన మిత్రులు కొందరు 13 రోజుల క్రితం రూ.1.25 లక్షలతో ఒంటెను కొన్నారు. పరిసర ప్రాంతాల్లో మేపుతూ రాత్రి వేళ ఇంటి వద్ద కట్టేసేవారు. ఆదివారం వేకువ జామున లేచి చూస్తే ఒంటె కాస్తా కన్పించలేదు. తాడు తెంపుకుని బయటకు వెళ్లిందోమోనని తొలుత భావించారు. స్థానికంగా వెతికినా కన్పించలేదు. ఆరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకే కాకుండా రాత్రి పొద్దుపోయే వరకు కూడా స్నేహితులు కలసి అంతటా గాలించారు. పరిసర ప్రాంతాలు జల్లెడ పట్టినంత పనిచేశారు. సమీపంలోని గుట్టలు, వాగులు, వంకలతో పాటు పరివాహక ప్రాంతాల్లో కూడా వెతికారు. ఎక్కడా ఆచూకీ కన్పించలేదు. గుర్తు తెలియని వారు ఎవరైనా తోలుకెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా పరిశీలించారు. ఒంటె జాడ మాత్రం కన్పించలేదు. అంగళ్లు సమీపంలోని కనసానివారిపల్లె నుంచి మదనపల్లెకు కొత్తగా వేస్తున్న బైపాస్ మీదుగా ఒంటెను తోలుకెళ్లిన ఆనవాళ్లు, అడుగులు కన్పించినట్లు చెబుతున్నారు. సాధారణంగా ఏనుగులు, ఒంటెలు లాంటి భారీ సైజు వాటిని చోరీ చేయడం ఆషామాషీ కాదు. కష్టంతో పాటు సాహసంతో కూడుకున్న పని. ఇలాంటి పెద్ద ఒంటెనే అంగళ్లులో ఏకంగా చోరీ చేశారంటే వారెంత ఘనులో అర్థం చేసుకోవచ్చు. ఆచూకీ తెలిస్తే 8978126623 మొబైల్ నెంబరుకు సమాచారం ఇస్తే తగిన పారితోషికం ఇస్తామని బాధితులు తెలిపారు. -
బక్రీద్ పొట్టేళ్లకు భలే డిమాండ్
బైరెడ్డిపల్లి/పలమనేరు( చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లిలో పొట్టేళ్ల సంతకు ప్రసిద్ధి. ఈ నెల 16న బక్రీద్ పండగను పురస్కరించుకుని ముందస్తుగానే కొందరు మాంసాహారం కోసం పొట్టేళ్లను ఇక్కడకొచ్చి కొనడం ఆనవాయితీ. ఆ మేరకు శనివారం జరిగిన వారపు సంతలో జత పొట్టేళ్లు గరిష్టంగా రూ.3 లక్షల దాకా పలికాయి. సాధారణంగా జత పొట్టేళ్లు్ల రూ.40 వేల దాకా ఉంటాయి. రాష్ట్రంలోనే పొట్టేళ్ల వారపుసంతగా పేరొందిన సంత చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లిలో జరుగుతుంది. ఇక్కడ లభించే నాణ్యమైన, రుచికరమైన పొట్టేళ్ల కోసం మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళల నుంచి వచ్చి వ్యాపారులు పొట్టేళ్లను కొని తీసుకెళుతుంటారు. పండుగకు ముందు సంత కావడంతో పొట్టేళ్లను విక్రయించే రైతులు, కొనే వ్యాపారులతో సంత ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. ఇక వాహనాలైతే మూడు కిలోమీటర్ల మేర బారులుతీశాయి. ముఖ్యంగా కాశ్మీరీ మేకపోతులు, స్థానికంగా పెంచిన పొట్టేళ్లు మాత్రం లక్షల్లో ధరలు పలకడం విశేషం. బక్రీద్ నేపథ్యంలో శనివారం జరిగిన వారపుసంతకు పొట్టేళ్లు, మేకలు, గొర్రెలు సుమారుగా 40 నుంచి 50 వేల దాకా వచ్చాయి. మొత్తం మీద ఇక్కడ పండుగ సంతలో రూ.20 కోట్ల దాకా క్రయ, విక్రయాలు జరిగాయి. వచ్చే శనివారమూ ఇదే స్థాయిలో వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. దళారులకు పండగే.. ఇక్కడి పొట్టేళ్ల సంతలో పండుగసంత కావడంతో దళారుల హవా కొనసాగింది. మొత్తం వ్యవహారం చేతిరుమాళ్ల ద్వారా రహస్య వ్యాపారాలతోనే జరిగింది. అటు రైతులు, ఇటు వ్యాపారులకు మధ్య బేరం కుదర్చడంలో దళారులే ఇక్కడ కీâ¶లకం. వీరికి ఇరువైపుల నుంచి నిర్ణయించిన మేర కమీషన్లు దక్కుతాయి. కేవలం బక్రీద్ పండుగకు పొట్టేళ్లను పెంచి మంచి ధరలకు అమ్ముకోవడం రైతులకు మంచి ఆదాయంగా మారింది. దీంతో చిత్తూరు, అనంతపురం జిల్లాలు, కర్ణాటకలోని కోలారు, చింతామణి, శ్రీనివాసపురం, మాలూరు జిల్లాల్లో బక్రీద్ పొట్టేళ్ల పెంపకం సాగుతోంది. ఏటా మేలో మంచి పొట్టేళ్ల కోసం రైతుల అన్వేషణ మొదలవుతుంది. కందూరు, సోమల, సదుం, పీలేరు, అంగళ్లు, బైరెడ్డిపల్లె, బంగారుపేట(కర్ణాటక) తదితర ప్రాంతాల నుంచి మంచి గొర్రె పొట్టేళ్లను రైతులు కొనుగోలు చేస్తారు. అప్పటికే వీటి ధర రూ.10 వేల దాకా ఉంటుంది. ఆ తర్వాత వీటిని బాగా సంరక్షిస్తారు. పచి్చగడ్డితో పాటు బూసా, గానుగపిండి, మొక్కజొన్న తదితరాలను పెట్టి ఏడాది పాటు సాకుతారు. దీంతో బక్రీద్ పండుగకల్లా కొమ్ములు తిరిగిన పొట్టేళ్లు మంచి మాంసంతో సిద్ధమవుతాయి. ఇక్కడి పొట్టేళ్ల మాంసం చాలా రుచి నేను బైరెడ్డిపల్లి సంతంలో 30 ఏళ్ల నుంచి బక్రీద్ పొట్టేళ్లను కొంటున్నా. మా ప్రాంతంలో బైరెడ్డిపల్లి పొట్టేళ్లకు భలే డిమాండ్. వీటి మాంసం చాలా రుచిగా ఉంటుంది. ఫారాల్లో మేపే పొటేళ్లలో ఈ రుచి రాదు. అందుకే ఇక్కడి కొచ్చి కొంటుంటాం. – అబ్దుల్ బాషా, గుడియాత్తం, తమిళనాడు ఇక్కడి పొట్టేళ్లకు భలే డిమాండ్ ఈ ప్రాంతంలోని రైతులు కొండల్లో, బీడు భూముల్లో పొట్టేళ్లను మేపుతుంటారు. దీంతో ఫామ్‌లో ఉండే వాటి కన్నా వీటి శరీరం దృఢంగా ఉంటుంది. దీంతో పాటు రుచి బాగుంటుంది. ఇక మేకలను అటవీప్రాంతంలో మేపుతారు. అవి అడవుల్లోని పలురకాల ఔషధ గుణాలున్న ఆకులను తినడంతో వీటికీ డిమాండ్ ఎక్కువగా ఉంది. – డా.వేణు, గొర్రెల పరిశోధన కేంద్ర చీఫ్ సైంటిస్ట్, పలమనేరు -
బక్రీద్‌కు ‘తోఫా’!
సాక్షి, హైదరాబాద్: రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలకు పంపిణీ చేయాల్సిన తోఫాను బక్రీద్ సమయంలో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రంజాన్ నేపథ్యంలో ముస్లింలకు ఇచ్చే గిఫ్ట్‌ప్యాక్ (వస్త్రాలు)ల కోసం 4.50 లక్షల కిట్లు ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ తోఫా పంపిణీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ఎన్నికల సంఘానికి గత నెలలోనే లేఖ రాసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో కూడిన లేఖ గతనెల 23న తెలంగాణ ఎన్నికల కమిషన్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్లింది. కానీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అనుమతిని నిరాకరిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్‌కుమార్ గత నెల 30నే తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారికి లిఖిత పూర్వకంగా స్పష్టం చేశారు. దీంతో రంజాన్ తోఫా పంపిణీతోపాటు జిల్లా కేంద్రాల్లో ఇఫ్తార్ పార్టీల నిర్వహణను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఆ తోఫాను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత బక్రీద్ సందర్భంగా ఇచ్చే యోచనలో సీఎం రేవంత్ ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలంటున్నాయి. -
మద్యం మత్తులో స్నేహితుణ్ని చంపేశారు
హైదరాబాద్: మద్యం మత్తులో స్నేహితుడిని చంపిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ దశరథ్ చెప్పిన వివరాల ప్రకారం.. బోరబండకు చెందిన మహ్మద్ అకీల్ (25) ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. బక్రీద్ సందర్భంగా అకీల్ న్యూ హాఫీజ్పేట్ ప్రేమ్‌నగర్‌కు వచ్చి తన పాత స్నేహితులు షేక్ ఆసీఫ్ (22), మహ్మద్ అబ్బాస్ (23), సమీర్‌ఖాన్(22), షేక్ అమీద్ (25), అస్లాంఖాన్ (20), మహ్మద్ ఫరునుద్దీన్ (22)లతో కలిసి శనివారం రాత్రి మద్యం తాగారు. ఈ క్రమంలో గొడవ జరిగి ఒకరినొకరు కొట్టుకున్నారు. కోపోద్రిక్తులైన ఆరుగురు స్నేహితులు కలిసి అకీల్ కడుపులో చాకుతో పొడిచి, సుత్తె, బండరాయితో తలపై మోది హత్య చేసి పరారయ్యారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. -
Bakrid 2023: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బక్రీద్ వేడుకలు (ఫొటోలు)
-
దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో బక్రీద్ ప్రార్థనలు (ఫొటోలు)
-
మనోవాంఛల త్యాగమే బక్రీద్.. ఖుర్బానీ అంటే ఏమిటి?
ఈదుల్ అజ్ హా ఒక మహత్తర పర్వదినం. వ్యావహారికంలో దీన్ని బక్రీద్ పండుగ అంటారు. బక్రీద్ పేరు వినగానే మొదట మనకు హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయీల్ అలైహిస్సలాంల పేర్లు గుర్తుకొస్తాయి. ఆ మహనీయుల విశ్వాస పటిమ, త్యాగ నిరతి కళ్ళముందు కదలాడతాయి. అలనాటి ఆ మధుర ఘట్టాలు ఒక్కొక్కటిగా మనో యవనిక పై ఆవిష్కృతమవుతాయి. వారి ఒక్కో అడుగు జాడ విశ్వాసాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. ఈ విధంగా ఆ త్యాగ దనుల ఒక్కో ఆచరణనూ స్మరించుకుంటూ జరుపుకునే పర్వదినమే ఈదుల్ అజ్ హా... అదే బక్రీద్. ఆరోజే అరేబియా దేశంలోని మక్కా నగరంలో ‘హజ్’ ఆరాధన జరుగుతుంది. లక్షలాదిమంది యాత్రికులతో ఆ పవిత్ర నగరం కళకళలాడుతూ ఉంటుంది. ‘లబ్బైక్’ నినాదాలు సర్వత్రా మిన్నంటుతూ ఉంటాయి. అల్లాహ్ ఆదేశాలను, ప్రవక్త వారి ప్రవచనాలను ΄ాటించడంలో భక్తులు నిమగ్నమై ఉంటారు. నేల ఈనినట్లు కనిపించే ఆ జనవాహినిలో ‘తవాఫ్ ‘చేసేవారు కొందరైతే, ‘సఫా మర్వా’ కొండల మధ్య ‘సయీ’ చేసేవారు మరికొందరు. అదొక అపురూపమైన సుందర దృశ్యం. రమణీయమైన అద్భుత సన్నివేశం. అల్లాహ్ స్తోత్రంతో పరవశించి తన్మయత్వం చెందే ఆధ్యాత్మిక కేంద్రబింబం. జిల్ హజ్ పదవ తేదీన జరుపుకొనే బక్రీద్ ఒక అపూర్వమైన పండుగ. హజ్రత్ ఇబ్రాహీమ్, హజ్రత్ ఇస్మాయీల్ అలైహిస్సలాంల త్యాగాలను స్మరించుకునే త్యాగోత్సవం. ప్రపంచ విశ్వాసుల పర్వదినం. ఇదేదో షరా మామూలుగా జరిగే ఆచారం కాదు. ఇదొక మహత్తర సందేశం కలిగిన శుభదినం. క్రియా రూపంలో దైవ ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అద్భుత ప్రక్రియ. మనిషి తనను తాను తగ్గించుకొని, వినమ్ర పూర్వకంగా అల్లాహ్ ఔన్నత్యాన్ని, ఆయన ఘనతను కీర్తించే గొప్పరోజు. మౌలిక విశ్వాసం పరంగా ఒక్కటిగానే ఉన్న మనం పాక్షిక పొరపొచ్చాలనూ విస్మరించి తోటి సోదరుల్ని గుండెలకు హత్తుకోవాల్సిన రోజు. ఈ పర్వదినం మనకిచ్చే మరో సందేశం ఏమిటంటే, సమాజాన్ని కలుపుకు పోకుండా, నలుగురితో మమేకం కాకుండా, సాటి ప్రజల పట్ల ప్రేమ, త్యాగం, సహనం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచుకోకుండా ఏ సంతోషమయినా, ఎంతటి ఆనందమైనా పరిపూర్ణం కాజాలదు. ఏ సంతోషకార్యమైనా నలుగురితో పంచుకోవాలని, కేవలం మన గురించి మాత్రమే కాకుండా సంఘం గురించి, సమాజం గురించి ఆలోచించాలని చెబుతుందీ పండుగ. ప్రతి ఒక్కరూ తమ స్థాయి, స్తోమతకు తగినట్లు ఈద్ జరుపుకుంటారు. ఆర్ధిక స్థోమత ఉన్నవారు జిల్ హజ్జ్ నెలలో ‘హజ్ ’యాత్రకు వెళతారు. అంతటి స్థోమత లేనివారు ఇళ్ళవద్దనే ఖుర్బానీలు ఇస్తారు. ఆ స్థోమత కూడా లేకపోతే రెండు రకాతుల నమాజ్ ఆచరించినా దయామయుడైన దైవం హజ్, ఖుర్బానీలు ఆచరించిన వారితో సమానంగా పుణ్యఫలం ప్రసాదిస్తాడు. ఆయన తన దాసుల చిత్తశుధ్ధిని, సంకల్పాన్ని మాత్రమే చూస్తాడు. ఆయనకు ధనరాశులు, రక్తమాంసాల అవసరం ఎంతమాత్రం లేదు. కనుక సర్వకాల సర్వావస్థల్లో చిత్తశుధ్ధితో కూడిన సత్కర్మలు ఆచరించాలి. పేదసాదల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. పండుగల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో వారిని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఆనందంలో వారినీ భాగస్వాములను చేయాలి. అప్పుడే నిజమైన పండుగ. ఒకప్పుడు ఎలాంటి జనసంచారం లేని నిర్జీవ ఎడారి ప్రాంతమది. కాని ఈనాడు విశ్వప్రభువు అనుగ్రహంతో నిత్యనూతనంగా కళకళలాడుతూ యావత్ ప్రపంచ ముస్లిం సమాజానికి ప్రధాన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఆ పుణ్యక్షేత్రమైన మక్కాలో జరిగే హజ్ ఆరాధనకు, ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సమాజం జరుపుకునే ఈదుల్ అజ్ హా పండుగకు అవినాభావ సంబంధం ఉంది. ఈ పండుగకు, హజ్, ఖుర్బానీలకు మూలకారణం హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం. ఈయన గొప్పదైవ ప్రవక్త. దేవునికి ప్రియ మిత్రుడు. తన పూర్తిజీవితం ద్వారా దైవప్రసన్నతకు మించిన కార్యం మరొకటి లేదని నిరూపించిన త్యాగధనుడు. కలలో కనిపించింది కూడా కరుణామయుని ఆజ్ఞగానే భావించి ఆచరించేవారు. ఒకరోజు ఇబ్రాహీం ప్రవక్త తన ముద్దుల కొడుకు ఇస్మాయీల్ గొంతుకోస్తున్నట్లు కలగన్నారు. దీన్ని ఆయన దైవాజ్ఞగా భావించి, తనయునితో సంప్రదించారు. తండ్రికి దగ్గ ఆ తనయుడు వెనకా ముందు ఆలోచించకుండా త్యాగానికి సిద్ధమయ్యారు. ఆ క్రమంలో వారు ఎదుర్కొన్న పరీక్షలు, అందులో వారు సఫలమైన తీరు, వారి ఒక్కో ఆచరణ ప్రళయకాలం వరకు సజీవంగా ఉండేలా ఏర్పాటు చేశాడు దైవం. అందుకే విశ్వవ్యాప్త విశ్వాసులు ఆ మహనీయుల ఒక్కో ఆచరణనూ స్మరించుకుంటూ, దేవుని ఘనతను, గొప్పతనాన్ని కీర్తిస్తూ, సముచిత రీతిలో ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి పండుగ రోజు ఈద్గాహ్కు చేరుకుని వేనోళ్ళా దైవాన్ని స్తుతిస్తారు. తన అవసరాలను త్యజించి దైవ ప్రసన్నత కోసం ఇతరుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వమని చెప్పేదే ఈ త్యాగాల పండుగ. మంచికోసం మానవ సంక్షేమం కోసం, ధర్మంకోసం, ధర్మసంస్ఢాపన కోసం ఎంతో కొంత త్యాగం చెయ్యాలన్న సందేశం ఇందులో ఉంది. ఈరోజున ముస్లిం సమాజం జరుపుకుంటున్న త్యాగోత్సవానికి ఇదే అసలు ప్రేరణ. అందుకని, పండుగ సందర్భంగా చేసే ప్రతి ఆచరణలో త్యాగ ధనులైన హజ్రత్ ఇబ్రాహీం, ఇస్మాయీల్ గార్ల స్పూర్తి తొణికిసలాడాలి. దైవప్రసన్నత కోసం, ఇహపర సాఫల్యం కోసం వారు ఎలాంటి పరీక్షలు ఎదుర్కొన్నారో, ఎంతటి సహన స్ధయిర్యాలు కనబరిచారో మనం కూడా అలాంటి ప్రయత్నం చెయ్యాలి. సదాచారం, త్యాగం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచుకోవాలి. మనోవాంఛల త్యాగం అన్నిటికన్నా ముఖ్యమైనది. ఈ సందర్భంగా మనం ఖుర్బానీలు ఇస్తాం, నమాజులు చేస్తాం. ఇతరత్రా ఇంకా ఏవో పుణ్యకార్యాలు ఆచరిస్తాం. కాని మనోవాంఛల త్యాగం అన్నిటికన్నా ముఖ్యమన్న విషయాన్ని విస్మరించకూడదు. ఇది నిస్సందేహంగా కష్టంతో కూడుకున్నకార్యమే. కాని, హజ్రత్ ఇబ్రాహీం, ఇస్మాయీల్ గార్ల త్యాగాలను స్మరించుకుంటే ఏమాత్రం కష్టంకాదు. మనం కూడా పరీక్షలు, కష్టాలు, త్యాగాల కఠినమయిన దశలను దాటవలసి ఉంది. ఈ మార్గంలో చేసే ఏ కృషి అయినా, ఏ త్యాగమయినా వృథా పోదు. చరిత్రే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. దైవం మనందరిలో త్యాగభావం, పరోపకార గుణాలను పెంపొదించాలని ప్రార్ధిద్దాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
గొర్రెల రాజు.. కోట్లు ఇచ్చినా ఆ పని మాత్రం చేయడట!
చాలాకాలం కిందట సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. బహుశా పాకిస్తాన్ నుంచి అనుకుంటా.. తనను దూరం చేయొద్దంటూ ఓ మూగజీవి తన ఓనర్‌ను బతిమాలినట్లు ఉన్న వీడియో నెట్లో ట్రెండ్ అయ్యింది. అయితే.. కుటుంబం గడవడానికి ఆ యజమానిని దానిని అమ్మేయక తప్పలేదు. కానీ, ఇక్కడో గొర్రెల ఓనర్ మాత్రం అలా కాదు. కోటి రూపాయలు ఇచ్చినా కూడా తన మందలోని ఆ గొర్రెను మాత్రం అమ్మేయడంట. రాజస్థాన్ చురూ జిల్లాలో ఏడాది వయసున్న ఓ గొర్రె పిల్ల.. ఏకంగా కోటి రూపాయలకు పైగా రేటు పలుకుతోంది. అలాగని అదేం భారీ సైజులో లేదు. కానీ, దాని ఓనర్ రాజు సింగ్‌కు మాత్రం అది ఎంతో ప్రత్యేకమంట. అందుకే ఇంట్లోకి తెచ్చి మరీ పెంచుకుంటున్నాడు దానిని. కోటి కాదు కదా.. వందల కోట్లు ఇచ్చినా అమ్మేయడంట. అందుకు కారణం ఉంది. రాజు సింగ్‌ను స్థానికంగా గొర్రెల రాజు అని పిలుస్తారు. తన మందలోని గొర్రెలను వారాంతపు సంతలో అమ్మేస్తుంటాడతను. అయితే రాజు ఒకరోజు ఆ ప్రత్యేకమైన గొర్రె పొట్ట భాగంలో ఏదో అక్షరాల మాదిరి ఉండడం గమనించాడట. అది ఉర్దూ భాషగా కొందరు చెప్పడంతో.. తన ఊరిలోని ముస్లిం పెద్దలను సంప్రదించాడతను. అది 786 నెంబర్ అని.. తమ పవిత్రమైన నెంబర్ అని ముస్లిం పెద్దలు చెప్పడంతో రాజు సింగ్ దానిని అమ్మకూడదని నిర్ణయించుకున్నాడట. బక్రీద్ సందర్భంగా ఆ గొర్రెకు లక్షల నుంచి కోటి దాకా డిమాండ్ వెళ్లినా.. రాజు సింగ్ మాత్రం ఆ గొర్రెను అమ్మేయడానికి సిద్ధంగా లేడు. అల్లా ముస్లిం దేవుడు. కానీ, దేవుడి దయ తమ కుటుంబంపై ఉంటుందనే ఉద్దేశంతో ఆ గొర్రెను తన ఇంట్లోకి తెచ్చి మరీ పెంచుకుంటున్నాడు రాజు సింగ్. అంతేకాదు.. దానిని దానిమ్మలు, బొప్పాయిలు, మిల్లెట్లు పెట్టి అపరూపంగా చూసుకుంటున్నాడు. రిస్క్ రేటు ఎక్కువగా ఉండడంతో.. దానిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. అలా.. స్థానికంగా సెలబ్రిటీ గొర్రెగా మారిపోయిందది. ఇదీ చదవండి: ఒకే వేదికపై రెండు పెళ్లిళ్లు.. అంతలో షాక్ -
అల్లాహ్ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకుంటారు. త్యాగనిరతికి బక్రీద్ పండుగ నిదర్శనం’’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా రాగ ద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా’’ అని సీఎం జగన్ అన్నారు. చదవండి: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. -
బక్రీద్ వేళ మేకలను ఇంటికి తెచ్చాడని.. అపార్ట్‌మెంట్‌వాసుల ఆందోళన..
ముంబయి: బక్రీద్ పండగ వేళ మేకలను అపార్ట్‌మెంట్‌కు తీసుకురావడంపై నిర్వాసితులు నిరసన చేపట్టారు. ముంబయిలోని భయందర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మేకలను అపార్ట్‌మెంట్‌కు తీసుకురాకూడదని స్థానికులు ఆందోళన నిర్వహించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. బక్రీద్ పండగ వేళ ఎవరూ మేకలను అపార్ట్‌మెంట్‌కు తీసుకురాకూడదని రెసిడెన్షియల్ సొసైటీ నిర్ణయించింది. దీంతో బిల్డర్ కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని అందరికీ విన్నవించారు. కానీ అపార్ట్మెంట్లో ఓ వ్యక్తి మేకను ఇంటికి తీసుకువచ్చాడు. దీంతో అపార్ట్మెంట్ వాసులు ఆందోళన నిర్వహించారు. మేకలను ఇంట్లోకి తీసుకురావద్దు.. అపార్ట్మెంట్లో మేకలను వధించవద్దని నినాదాలు చేపట్టారు. Uproar over goats in Mumbai Housing Society. (@pankajcreates)#Mumbai #News #ITVideo #FirstUp pic.twitter.com/ScHHzMsRIz — IndiaToday (@IndiaToday) June 28, 2023 దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. బక్రీద్ పండగకు ఒక రోజు ముందు మేకలను ఇంట్లో ఉంచుకుంటారని.. అపార్ట్మెంట్లో వధించబోరని పోలీసులు తెలిపారు. చివరికి మేకలను అపార్ట్మెంట్లో నుంచి బయటకు పంపడంతో అంతా సద్దుమణిగింది. ఇదీ చదవండి: వేలాది పక్షుల మృతి.. పురుగు మందులే కారణం? -
బక్రీద్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: బక్రీద్ సందర్భంగా జంతువధపై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. యుగ తులసి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివకుమార్ లేఖను సుమోటో పిల్‌గా కోర్టు స్వీకరించింది. మత పరమైన మనోభావాలు దెబ్బ తినేలా గోవధ జరుగుతోందని లేఖలో పేర్కొనగా.. చర్యలు తీసుకోవాలని బక్రీద్‌కు ఒక్క రోజు ముందు లేఖ రాయడం తగదన్న ధర్మాసనం.. సున్నితమైన అంశాల్లో చివరి నిమిషంలో వచ్చి హైకోర్టును లాగితే ఎలా అని ప్రశ్నించింది. గోవధ, అక్రమ రవాణా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నామన్న ఏజీ ప్రసాద్.. చెక్ పోస్టులు పెట్టి కేసులు నమోదు చేస్తున్నామని హైకోర్టుకు తెలిపారు. గోవధ నిషేధ చట్టం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని, సీఎస్, డీజీపీ తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు.. నిజమైన స్ఫూర్తితో బక్రీద్ జరుపుకోవాలని సూచించింది. ఆగస్టు 2న నివేదికలు సమర్పించాలని సీఎస్, డీజీపీకి ఆదేశిస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: తెలంగాణ బీజేపీ.. మరీ ఇంత గందరగోళమా? -
బక్రీద్ వేళ.. అక్కడ మేకల్ని ఎత్తుకెళ్తున్నారు!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో.. ప్రజల జీవన ప్రమాణాలు ఘోరంగా పడిపోయాయి. బతకడానికి దొంగతనాలకు, దోపిడీలకు సైతం తెగపడుతున్నారు అక్కడి జనాలు. ఈ క్రమంలో బక్రీద్ వేళ మేకలు, గొర్రెల దొంగతనాలు పెరిగిపోవడం.. అక్కడి పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో తెలియజేస్తోంది. జూన్ 29న బక్రీద్ కాగా.. పాక్ లో మేకలు, గొర్రెల వంటి జీవాలకు రక్షణ లేకుండా పోయింది. బక్రీద్ సమయంలో జంతువులను బలి ఇవ్వడం సంప్రదాయం. అయితే మేకలు, గొర్రెల ధరలు అక్కడ ఆకాశాన్నంటుతుండడంతో.. చాలామంది దొంగతనాలకు మొగ్గుచూపుతున్నారు. పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలోనూ ఈ కేసులు అడ్డగోలుగా నమోదు అయ్యాయట. గత ఐదు నెలలుగా అక్కడ మూడు నెల కేసులు నమోదు అయ్యాయంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సింధ్ సిటిజన్స్ పోలీస్ కమిటీ ఈ మేరకు ఓ నివేదికను రూపొందించింది కూడా. క్వెట్టాలోనూ ఈ తరహా కేసులు చాలానే నమోదు అయ్యాయి. మేతకు వెళ్లిన మంద నుంచి.. రిస్క్ చేసి వాహనాలపై తీసుకెళ్తున్నవాటిని.. ఆఖరికి దుకాణాలు పగలకొట్టి మరీ మూగజీవాలను ఎత్తుకెళ్తున్నారు. అంతేకాదు మందతో అమ్మడానికి వెళ్తున్న వాళ్లను సైతం బెదిరించి దొపిడీలకు పాల్పడుతున్నారట. కొన్నిరోజుల కిందట లారీలో మేకలు తీసుకువెళుతుండగా, ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి లారీడ్రైవర్ ను తుపాకీతో బెదిరించి మేకలను ఎత్తుకెళ్లారు. అలాగే.. ట్రాలీలోకి ఎక్కేసి మరీ చోరీలకు పాల్పడుతున్న వీడియో ఒకటి విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక పోలీసు దళాలను ఏర్పాటు చేశారు. Goat🐐 kidnapp!ng in "film style" in Pakistan😂😂 pic.twitter.com/5ZytmCi9sp — Bharat Ojha🗨 (@Bharatojha03) June 25, 2023 ఇదీ చదవండి: కొత్త చట్టంతో పాక్‌లో అడుగుపెట్టబోతున్నాడు! -
హైదరాబాద్‌లో బక్రీద్ కోలాహలం (ఫొటోలు)
-
శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలి
మంచిర్యాలక్రైం: శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని మంచిర్యాల ఏసీపీ తిరుపతిరెడ్డి అన్నారు. బక్రీద్, తొలి ఏకాదశి, బోనాల పండుగలు వరుసగా ఉన్నందున అన్ని మతాల పెద్దలతో స్థానిక ఏసీపీ కార్యాలయంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గోవధపై నిషేధం విధించారని, గోవులను అక్రమంగా రవాణా చేసినా, వధించిన చర్యలు ఉంటాయని తెలిపారు. మతాలకతీతంగా పండుగలు జరుపుకోవాలని, ఏదైనా సమస్య ఉత్పన్నమైతే వెంటనే 100డయల్‌కు సమాచారం అందించాలని సూచించారు. ఈ సమావేశంలో సీఐ రాజు, ఎస్సైలు పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో.. బెల్లంపల్లిరూరల్: ప్రజలు పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య అన్నారు. మంగళవారం సాయంత్రం తాళ్లగురిజాల పోలీసుస్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన శాంతికమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మత సామరస్యం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఈ సమావేశంలో బెల్లంపల్లిరూరల్ సీఐ రాజ్‌కుమార్‌గౌడ్, వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో శంకరయ్య, మతపెద్దలు, తాళ్లగురిజాల, వన్‌టౌన్, టూటౌన్ ఎస్సైలు నరేష్, విక్టర్, రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
పసందైన పొట్టేళ్ల సంత!
బైరెడ్డిపల్లి/పలమనేరు(చిత్తూరు జిల్లా): సాధారణంగా జత పొటేళ్లు రూ.40 వేల దాకా ఉంటాయి. కానీ బక్రీద్ పండుగ కోసం ప్రత్యేకంగా సంరక్షించిన కొమ్ములు తిరిగిన పొట్టేళ్ల ధరలు లక్షలు పలుకుతున్నాయి. రాష్ట్రంలో పొట్టేళ్లు, మేకలు, గొర్రెలకు ప్రాచుర్యం పొందిన వారపు సంతల్లో చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె ముఖ్యమైంది. ఇక్కడ లభించే నాణ్యమైన, రుచికరమైన పొట్టేళ్ల కోసం మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళల నుంచి కూడా వస్తుంటారు. బక్రీద్‌ను పురస్కరించుకుని బైరెడ్డిపల్లెలో శనివారం జరిగిన వారపుసంతకు పొట్టేళ్లు, మేకలు, గొర్రెలు సుమారుగా 40 నుంచి 50 వేల దాకా వ చ్చినట్టు తెలిసింది. జత పొట్టేళ్లు రూ.30 వేల నుంచి రూ.2.70 లక్షల దాకా అమ్ముడయ్యాయి. మొత్తంమీద ఇక్కడ పండుగ సంతలో రూ.20 కోట్ల దాకా క్రయ, విక్రయాలు జరిగినట్టు సమాచారం. గత శనివారం సైతం ఇదే స్థాయిలో రూ.10 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. బైరెడ్డిపల్లె సంతకు బడా వ్యాపారులు బయటి రాష్ట్రాల నుంచి రావడంతో ఇక్కడి పొట్టేళ్లుఅత్యధిక ధరలు పలుకుతున్నాయి. అంతేకాదు, ఇక్కడి పొట్టేళ్ల సంతలో పండుగ సంత కావడంతో దళారుల హవా కొనసాగింది. అటు రైతులు, ఇటు వ్యాపారులకు మధ్య బేరం కుదర్చడంలో దళారులే కీâలకం. వీరికి ఇరువైపుల నుంచి నిర్ణయించిన మేర కమీషన్లు దక్కుతాయి. మొత్తం మీద బక్రీద్ పండుగకు ముందే దళారులు జేబులు నింపుకొన్నారు. మే నుంచి ఏడాది పాటు పొట్టేళ్ల పెంపకం బక్రీద్ పండుగ కోసం పొట్టేళ్లను పెంచి అమ్ముకోవడం రైతులకు లాభసాటిగా మారింది. దీంతో చిత్తూరు, అనంతపురం(అవిభక్త) జిల్లాలు, కర్ణాటకలోని కోలారు, చింతామణి, శ్రీనివాసపురం, మాలూరు జిల్లాల్లో బక్రీద్ పొట్టేళ్ల పెంపకం సాగుతోంది ఏటా మేలో మంచి పొట్టేళ్ల కోసం రైతుల అన్వేషణ మొదలవుతోంది. కందూరు, సోమల, సదుం, పీలేరు, అంగళ్లు, బైరెడ్డిపల్లె, బంగారుపేట(కర్ణాటక) తదితర ప్రాంతాల నుంచి మంచి గొర్రె పొట్టేళ్లను రైతులు కొనుగోలు చేస్తారు. అప్పటికే వీటి ధర రూ.10 వేల దాకా ఉంటుంది. ఆ తర్వాత వీటిని బాగా సంరక్షిస్తారు. ప చ్చిగడ్డితో పాటు బూసా, గానుగపిండి, మొక్కజొన్న తదితరాలను పెట్టి ఏడాదిపాటు సాకుతారు. దీంతో బక్రీద్ పండుగకల్లా కొమ్ము లు తిరిగిన పొట్టేళ్లు మంచి మాంసంతో సిద్ధమవుతాయి. జత పొట్టేళ్లను రూ.2.70 లక్షలకు విక్రయించా.. బక్రీద్ కోసం పొట్టేళ్లను మేపడమే వృత్తిగా పెట్టుకున్నాం. ఏడాదంతా పొట్టేళ్లను మేపి.. బక్రీద్ పండక్కి ముందు సంతకు తోలుకెళతాం. వ్యాపారులు ఎక్కువగా వస్తారు కాబట్టి బాగా మేపిన పొట్టేళ్ల ధర ఎక్కువ పలుకుతుంది. ఈ దఫా జత పొట్టేళ్లను రూ.2.70 లక్షలకు అమ్మడం ఆనందంగా ఉంది. – జగదీష్ , పొట్టేళ్ల పెంపకందారు, తాయిళూరు, కర్ణాటక వీటి మాంసం చాలా రుచిగా ఉంటుంది.. నేను బైరెడ్డిపల్లి సంతలో 23 ఏళ్ల నుంచి బక్రీద్ పొట్టేళ్లను కొంటున్నా. మా ప్రాంతంలో బైరెడ్డిపల్లి పొట్టేళ్లకు భలే డిమాండ్. ఎందుకంటే ఈ ప్రాంతంలోని కొండ, గుట్టల్లో మేత మేస్తుంటాయి. దీంతో వీటి మాంసం చాలా రుచిగా ఉంటుంది. ఫారాల్లో మేపే పొట్టేళ్లు రుచీపచీ ఉండవు. – అబ్దుల్‌బాషా, గుడియాత్తం, తమిళనాడు -
ఆవులు, దూడలను తరలించొద్దు
అనంతగిరి: బక్రీద్ సందర్భంగా ఆవులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. ఈమేరకు తన కార్యాలయంలో మంగళవారం పశుసంవర్ధక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎట్టి పరిస్థితిలోనూ ఆవులు, లేగ దూడలను తరలించొద్దన్నారు. ఇతర పశువులను తీసుకెళ్లే వారు ఫిట్ ఫర్ స్లాటర్ పత్రాలు, పశువును తరలిస్తున్న వాహనాల పత్రాలు తప్పనిసరిగా వెంట పెట్టుకోవాలని తెలిపారు. వాహనంలో ఒక్కో పశువు మధ్య రెండు స్క్వేర్ మీటర్ల స్థలం ఉండాలన్నారు. వాహనాల్లో పరిమితికి మించి, ఎక్కువ సంఖ్యలో తరలించకూడదని సూచించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోతే అక్రమ రవాణాగా పరిగణించి పశువులను గోశాలలకు తరలిస్తామని తెలిపారు. పది చెక్ పోస్టులు పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లాలో పది చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా పశువులను తరలిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పశువులు కలిగిన వాహనాలను అనధికారికంగా అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు డీటీసీ అడిషనల్ ఎస్పీ మురళీధర్, జిల్లా వెటర్నరీ అధికారి అనిల్ కుమార్ జిల్లా మార్కెటింగ్ అధికారి సారంగపాణి, వికారాబాద్, పరిగి, తాండూరు అధికారులు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, వెటర్నరీ సిబ్బంది పాల్గొన్నారు. -
త్యాగ నిరతికి చిహ్నం బక్రీద్
ఎన్నో త్యాగాలు.. ఎన్నోబలి దానాలు... ఒక మానవ మాత్రుని సహనానికి పరాకాష్ట అనదగిన అనేక పరీక్షలు... అన్నిటినీ తట్టుకొని మేరుపర్వతంలా నిలిచిన అపూర్వవ్వక్తిత్వం.. ఎన్నో ఉలిదెబ్బల తరువాత శిల శిల్పంగా మారుతుంది. కొలిమిలో కాలిన తరువాతనే నగ అద్భుత సౌందర్యాన్ని సంతరించుకుంటుంది. ఇది మానవ జీవితానికీ వర్తిస్తుంది. సయ్యిదినా హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితమే దీనికి చక్కని చారిత్రక ఉదాహరణ. ఆయన ఎన్నోపరీక్షలు ఎదుర్కొన్నారు. ఎన్నో త్యాగాలు చేశారు. విగ్రహారాధన, అధర్మవ్యాపారం వద్దన్నందుకు తండ్రి ఆయన్ని ఇంట్లోంచి గెంటేశాడు. సామాజిక రుగ్మతలు, సాంఘిక దురాచారాలను వ్యతిరేకించినందుకు సమాజం కన్నెర్రజేసింది. అధికార దుర్వినియోగాన్ని, అవినీతిని, మిథ్యాదైవత్వాన్ని ప్రశ్నించినందుకు పాలకుల ఆగ్రహాన్ని చవిచూడవలసి వచ్చింది. కళ్ళముందే అగ్గిరాజేసి, ఉవ్వెత్తున ఎగసిపడే మంటల్లో పడవేసినా ప్రాణత్యాగానికే సిద్ధమయ్యారు కాని, రాజును దైవాంశ సంభూతునిగా అంగీకరించడానికి ఒప్పుకోలేదు. చివరికి దేశంనుండి బహిష్కరించినా సంతోషంతో సంచారజీవనం సాగించారాయన. అయినా పరీక్షల పరంపర అంతం కాలేదు. అదనంగా మరో పరీక్ష ఎదురైంది. మానవ ఇతిహాసం కనీవిని ఎరుగని పరీక్ష అది. దైవాదేశపాలనలో ప్రేమానురాగాలకు, వాత్సల్యానికి అణుమాత్రమైనా చోటులేదని రుజువు చేసిన పరీక్ష అది. సుదీర్ఘ ఎడబాటు తరువాత భార్యా బిడ్డలను కలుసుకున్న ఆనందం కూడా తీరక ముందే, ప్రాణసమానమైన పుత్రరత్నాన్ని దేవుని మార్గంలో త్యాగం చేయాల్సి రావడం మామూలు పరీక్షకాదు. హజ్రత్ ఇబ్రాహీం (అ) దానికీ సిద్ధమయ్యారు. బాబును సంప్రదించారు. ’దైవాజ్ఞ పాలనలో ఆలస్యం చేయకండినాన్నా! దైవచిత్తమైతే నన్నుమీరు సహనవంతునిగా చూస్తారు. ’ అన్నారు చిన్నారి ఇస్మాయీల్. ఆ సమయాన తండ్రీకొడుకుల మధ్య జరిగే సంభాషణ వినడానికి సృష్టిలోని అణువణువూ అవాక్కయి పోయింది. ఈ అచంచల, అద్వితీయ విశ్వాస బలాన్ని నివ్వెరపోయి చూస్తున్న ప్రకృతి ఒక్కసారిగా స్తంభించి పోయింది. అంతటా నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, అల్లాహ్ పవిత్ర నామాన్ని స్మరిస్తూ తనయుని మెడపై కత్తిపెట్టి జుబహ్ చెయ్యడానికి ఉద్యుక్తులయ్యారు హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం. దీంతో తన ప్రియ ప్రవక్త ఇబ్రాహీం పట్ల దేవుని ప్రసన్నత పతాక స్థాయిన ప్రసరించింది. తన ఆజ్ఞాపాలనకు వారు మానసికం గా సిద్ధమైన క్షణంలోనే ఆయన వారి పట్ల అమిత ప్రసన్నుడై, వారి త్యాగాన్ని స్వీకరించాడు. చిన్నారి ఇస్మాయీల్ స్థానంలో జుబహ్ చెయ్యడానికి ఓ స్వర్గ పొట్టేలును ప్రత్యక్షపరిచాడు. ఇదీ నేటి త్యాగోత్సవానికి(ఈదుల్ అజ్ హా/ బక్రీద్ సంబంధించిన సంక్షిప్త గాథ. ఇందులో మనందరికీ చక్కని ఆదర్శం ఉంది. మంచికోసం, మానవ సంక్షేమం కోసం, ధర్మం కోసం, ధర్మసంస్థాపన కోసం ఎంతోకొంత త్యాగం చెయ్యాలన్న సందేశం ఉంది. ఈనాడు ముస్లిం సమాజం జరుపుకుంటున్న త్యాగోత్సవానికి ఇదే అసలు ప్రేరణ. మనోవాంఛల త్యాగం అన్నిటికన్నా ముఖ్యమైనది. ఈదుల్ అజ్ హా పర్వం మానవాళికిస్తున్న సందేశం ఇదే. (నేడు బక్రీద్ పర్వదినం సందర్భంగా..) – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
సీఎం వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: పవిత్రమైన బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదర సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘త్యాగం, ప్రేమ, సహనం వంటి సద్గుణాల సందేశమే బక్రీద్’ అని ట్వీట్ చేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరికి ప్రాణ త్యాగానికి సిద్ధపడిన ఇబ్రహీమ్ జీవితం మనందరికీ ఆదర్శం. మంచి కోసం, ధర్మ సంస్థాపన కోసం ఈరోజు త్యాగోత్సవం జరుపుకొంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలంటూ ఆయన ట్వీటర్లో పేర్కొన్నారు. చదవండి: మీ మద్దతుకు.. మరోసారి సెల్యూట్: సీఎం జగన్ త్యాగం, ప్రేమ, సహనం వంటి సద్గుణాల సందేశమే బక్రీద్. నమ్మిన సిద్ధాంతం కోసం చివరికి ప్రాణత్యాగానికి సిద్ధపడిన ఇబ్రహీమ్ జీవితం మనందరికీ ఆదర్శం. మంచి కోసం, ధర్మ సంస్థాపన కోసం ఈరోజు త్యాగోత్సవం జరుపుకొంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) July 10, 2022 -
మత విశ్వాసాల కన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యం
సాక్షి, అమరావతి: కోవిడ్ నేపథ్యంలో బక్రీద్ ప్రార్థనల సందర్భంగా పలు ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఈ నెల 16న జారీ చేసిన ఉత్తర్వుల విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం ఆంక్షలు విధించడంలో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేసింది. మత విశ్వాసాల కన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని బక్రీద్ సందర్భంగా పలు ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం జీవో 100ను జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో, మసీదుల్లో పెద్ద సంఖ్యలో గుమికూడటానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మసీదుల్లో 50 మందికి మించి ప్రార్థనలు చేయడానికి వీల్లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన న్యాయవాది షేక్ ఆరీఫ్ మాలిక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్ బట్టు దేవానంద్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున న్యాయవాది చేజర్ల సుబోద్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ ఆంక్షల వల్ల బక్రీద్ ప్రార్థనలకు ఇబ్బంది కలుగుతుందని, ఈద్గాల్లో ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతినిచ్చేలా ఆదేశాలివ్వాలని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ప్రతి మతస్తుడు వారి మతాన్ని ఆచరించుకోవచ్చునని, అయితే ప్రస్తుతమున్న కరోనా పరిస్థితుల్లో ఈ కేసులో చూడాల్సింది ప్రజారోగ్యం, ప్రజా క్షేమం మాత్రమేనని తెలిపారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం విషయంలో కూడా ఆంక్షలు విధించారని ఆయన గుర్తు చేశారు. మత విశ్వాసాల కన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యమని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ప్రభుత్వ న్యాయవాది టీఎన్ఎం రంగారావు వాదనలు వినిపిస్తూ.. కరోనా కట్టడి నిమిత్తం, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఆంక్షలు విధించిందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ప్రభుత్వం ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించారు. పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపారు. -
భారీ పేలుడు.. రద్దీమార్కెట్ మొత్తం రక్తసిక్తం
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో మరో మారణ హోమం చోటు చేసుకుంది. ఈద్ లక్క్ష్యంగా చేసుకుని భారీ కుట్రకు పాల్పడ్డారు మిలిటెంట్లు. బాగ్దాద్ శివారు నగరం సద్ర్‌లోని ఓ రద్దీ మార్కెట్లో భారీ బాంబు పేలుడుకు పాల్పడగా.. ఆ ప్రాంతం రక్తపు ముద్దలతో భీకరంగా మారింది. ఈ ఘటనలో ఇప్పటిదాకా 35 మంది చనిపోగా, 60 మందికిపైగా గాయపడ్డారు. సద్ర్ సిటీ వహాయిలత్ మార్కెట్లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బక్రీద్ కోసం మార్కెట్లకు క్యూ కట్టిన జనాలను లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. రద్దీ మార్కెట్ కావడంతో ఎటు చూసినా తెగిపడిన అవయవాలు, రక్తపు ముద్దలే కనిపిస్తున్నాయి. మృతుల్లో ఎక్కువగా పిల్లలు, మహిళలే ఉన్నారు. గాయపడ్డ వాళ్లలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఘటనకు స్థానికంగా తయారుచేసిన పేలుడు పదార్థాన్నే ఉపయోగించినట్లు అధికారులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే ఈ దాడి తమ పనేనని ఐఎస్ఐఎల్(ఐఎస్ఐఎస్) ప్రకటించుకుంది. ఇరాక్ అధ్యక్షుడు బర్హమ్ సాలి ఈ దాడిని ‘క్రూరమైన నేరం’గా అభివర్ణించాడు. కాగా, ఈ ఏడాదిలో ఈ తరహా దాడి ఇది మూడోది. మరోవైపు సోషల్ మీడియాలో ఈ పేలుడుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. -
వారిపై చర్యలు తీసుకోండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్ : బక్రీద్ సందర్భంగా అక్రమ జంతు వధ చేస్తే చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా జంతువుల రవాణా లేదా వధ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. ఒంటెల అక్రమ రవాణా, వధ నిరోధించాలని డాక్టర్ శశికళ దాఖలు చేసిన కేసుపై విచారణ నేపథ్యంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఆదేశాలతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జంతు వధ కేంద్రాలను తనిఖీ చేసినట్టు తెలిపిన ప్రభుత్వం..రెండు కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించకూడదంటూ పేర్కొన్న హైకోర్టు.. జంతు వధ నిబంధనల ప్రకారమే జరగాలని స్పష్టం చేసింది. జంతు మాంసం ద్వారా వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని.. చైనాలో గబ్బిలాలు తినడం ద్వారా కరోనా వచ్చిందన్న ప్రచారాన్ని గుర్తుచేసింది. మాంసం దుకాణాలను జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పుడైనా తనిఖీలు చేశారా అని ప్రశ్నించింది. రెండు వారాల్లో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. (బక్రీద్ బిజినెస్ ఎలా?)