Balagam Movie
-
బలగం సింగర్ మొగిలయ్య మృతి
-
జానపద కళాకారుడు 'బలగం మెగిలయ్య' మృతి
'బలగం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయిన 'మొగిలయ్య' అనారోగ్యంతో మరణించారు. బలగం సినిమాలో భావోద్వేగభరిత పాటను ఆలపించి ప్రేక్షకుల హృదయాలను కదిలించారు. దీంతో ఆయన్ను అందరూ బలగం మెగిలయ్యగా చెరగని ముద్ర వేశారు. తెలంగాణకు చెందిన జానపద కళాకారుడు మొగిలయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కిడ్నీకి సంబంధించిన జబ్బుతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వరంగల్‌లోని ఆసుపత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ మరణించారు.తన గాత్రంతో కళకు ప్రాణం పోసి, బుర్రకథలతో ప్రజలను మెప్పించిన గాయకుడు మొగిలయ్య. అలా బలగం సినిమాలో చనిపోయిన మనిషిని గుర్తుచేసుకుంటూ మొగిలయ్య, కొమురమ్మ కలిసి పాడిన 'తోడుగా మా తోడుండి.. నీడలా మాతో నడిచి' అనే సాంగ్ ఆ చిత్రానికే ప్రధానంగా నిలిచింది. ఈ పాట సమయంలో ప్రక్షకులు కూడా చాలా భావోద్వేగానికి గురికావడమే కాకుండా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కనిపించాయి. అయితే, ఇప్పుడు ఆయన అనారోగ్యంతో మరణించడంతో చాలామందిని కలిచివేస్తుంది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులు తమ పూర్వీకుల నుంచి సంప్రదాయంగా వచ్చిన కళ బుర్రకథలనే తమ జీవనాధారంగా మార్చుకున్నారు. కరీంనగర్, గోదావరిఖని,సిరిసిల్ల తదితర జిల్లాలలో బుర్రకథలు చెబుతూ వచ్చిన కొద్ది ఆదాయంతోనే బతుకు పోరాటం సాగించారు. ఆయనకు ఒక కుమారుడు సుదర్శన్ ఉన్నారు. అతను స్టీల్ సామాన్ల వ్యాపారం చేస్తున్నాడు. మొగిలయ్య టాలెంట్‌ను గుర్తించిన 'బలగం' చిత్ర దర్శకుడు వేణు సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. అలా ఆయనకు ‘భీమ్లా నాయక్’లో కూడా ఒక జానపదం గీతం పాడే అవకాశం వచ్చింది.కొంత కాలంగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న మొగిలయ్య వరంగలోలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా మరణించారు. గతంలో ఆయనకు మెరుగైన వ్యైద్య సదుపాయాలను తెలంగాణ ప్రభుత్వం అందించింది. చిరంజీవితో పాటు నిర్మాత దిల్ రాజు,డైరెక్టర్ వేణు యెల్దండి వంటి వారు ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉండాలని ఆర్థిక సాయం అందించారు. కానీ, ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో గురువారం తెల్లవారుజామున మరణించారు. మొగిలయ్య మరణం పట్ల బలగం సినిమా నిర్మాత దిల్ రాజు, వేణు యెల్దండి, నటీనటులు సంతాపం ప్రకటించారు. -
బలగం బ్యూటీ.. చాలా హాట్ గురూ!
-
శారీలో బలగం హీరోయిన్.. ఈ స్టిల్స్ చూశారా?
-
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్-2024.. తెలుగులో ఎవరెవరికి వచ్చాయంటే?
69వ ఫిల్మ్ ఫేర్ -2024 సౌత్ అవార్డుల కార్యక్రమం హైదరాబాద్‌లో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు అందరూ ఈ వేడుకకు హాజరయ్యారు. ఇకపోతే తెలుగులో దసరా, బలగం, బేబి చిత్రాల్నే దాదాపు అవార్డులన్నీ వరించడం విశేషం. ఇంతకీ ఎవరెవరికీ ఏయే అవార్డు వచ్చిందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: కట్టప్ప లేటెస్ట్ సినిమా.. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్)69వ ఫిల్మ్ ఫేర్ తెలుగు-2024 అవార్డ్ విజేతల జాబితాఉత్తమ సినిమా - బలగంఉత్తమ నటుడు - నాని (దసరా)ఉత్తమ నటి - కీర్తి సురేశ్ (దసరా)ఉత్తమ దర్శకుడు - వేణు (బలగం)ఉత్తమ పరిచయ దర్శకుడు - శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యువ్ (హాయ్ నాన్న)ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) - సాయి రాజేశ్ (బేబి)ఉత్తమ నటి (క్రిటిక్స్) - వైష్ణవి చైతన్య (బేబి)ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - నవీని పొలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి), ప్రకాశ్ రాజ్ (రంగమార్తాండ)ఉత్తమ సహాయ నటుడు - రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ)ఉత్తమ సహాయ నటి - రూపలక్ష్మి (బలగం)ఉత్తమ గాయకుడు - శ్రీరామ చంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలిలా- బేబి)ఉత్తమ గాయని - శ్వేత మోహన్ (మాస్టారూ మాస్టారూ- సార్)ఉత్తమ సాహిత్య - అనంత్ శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా- బేబీ)ఉత్తమ సంగీతం - విజయ్ బుల్గానిన్ (బేబి)ఉత్తమ సినిమాటోగ్రాఫీ - సత్యన్ సూరన్ (దసరా)ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - కొల్లా అవినాష్ (దసరా)ఉత్తమ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (ధూమ్ ధామ్ దోస్తానా- దసరా) -
సైమా అవార్డ్స్ కోసం పోటీలో ఉన్న సినిమాలు, హీరోలు.. లిస్ట్ ఇదే
సినీ రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ఒకటి. ఈ అవార్డుల విషయంలో ప్రేక్షకులకు తీపి కబురు వినిపించింది సైమా. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రారంభమైంది. 12 ఏళ్లుగా విజయవంతంగా ఈ పురస్కారాల వేడుకలు జరుగుతున్నాయి. 2024 ఏడాది సైమా ఉత్సవాలకు ముహూర్తం ఖరారైంది.ఈ ఏడాది సెప్టెంబరు 14, 15 తేదీల్లో జరగనున్న ఈ వేడుకకు దుబాయ్ వేదిక కానుంది. ఈ అవార్డ్స్ దక్కించుకునేందుకు పోటీ పడుతున్న చిత్రాల జాబితాను ‘సైమా’ టీమ్ తాజాగా విడుదల చేసింది. 2023లో రిలీజైన సినిమాలకు ఈ అవార్డ్స్ దక్కనున్నాయి. టాలీవుడ్ నుంచి నాని నటించిన దసరా సినిమా అత్యధికంగా 11 విభాగాల్లో పోటీపడుతుంది. తమిళ్ నుంచి జైలర్ 9 విభాగాల్లో సత్తా చాటుతుంది. మలయాలళం నుంచి టొవినో థామస్ 2018, దర్శన్ నటించిన కాటేర (కన్నడ) 8 విభాగాల్లో రేసులో ఉన్నాయి.ఉత్తమ చిత్రం కోసం బరిలో ఉన్న సినిమాలు సలార్: సీజ్ ఫైర్దసరాహాయ్ నాన్నమిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిబేబీబలగంసామజవరగమనఉత్తమ నటుడి అవార్డ్ లిస్ట్లోచిరంజీవి (వాల్తేర్ వీరయ్య)బాలకృష్ణ (భగవంత్ కేసరి)ఆనంద్ దేవరకొండ (బేబీ)నాని (దసరా)నాని (హాయ్ నాన్న)ప్రకాశ్ రాజ్ (రంగమార్తాండ)ధనుష్ (సర్)నవీన్ పొలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి)ఉత్తమ నటి కోసం పోటీ పడుతున్న హీరోయిన్లుకీర్తిసురేశ్ (దసరా)సమంత (శాకుంతలం)అనుష్క (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి)వైష్ణవీ చైతన్య (బేబీ)మృణాళ్ ఠాకూర్ (హాయ్ నాన్న) ఉత్తమ దర్శకుడు కోసం బరిలో ఉన్న డైరెక్టర్స్ ప్రశాంత్‌నీల్ (సలార్:పార్ట్-1 సీజ్ ఫైర్)వేణు యెల్దండ (బలగం)శ్రీకాంత్ ఓదెల (దసరా)అనిల్ రావిపూడి (భగవంత్ కేసరి)శౌర్యువ్ (హాయ్ నాన్న)కార్తిక్ దండు (విరూపాక్ష)సాయి రాజేశ్ (బేబీ) -
ఈ దశాబ్దంలో నా ఫేవరేట్ మూవీ అదే: హీరో నాని కామెంట్స్
టాలీవుడ్ హీరో నాని గతేడాది హాయ్ నాన్నతో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన సరిపోదా శనివారం అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. కోలీవుడ్ నటుడు ఎస్జే సూర్య, సాయికుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలోకి రానుంది.అయితే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన డార్లింగ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో ప్రియదర్శిపై ప్రశంసలు కురిపించారు. ఈ దశాబ్దంలోనే తనకిష్టమైన సినిమా బలగం అని నాని అన్నారు. బలగం హీరో ఫ్యాన్‌గా ఈవెంట్‌కు వచ్చానని ఆసక్తికర కామెంట్స్ చేశారు. డార్లింగ్ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని.. నీ కెరీర్లో ఒక మైల్‌స్టోన్‌గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.అనంతరం ప్రియదర్శి సైతం నాని గురించి మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీలో నాలాంటి వారికి నాని అన్ననే ఆదర్శమని అన్నారు. ఎలాంటి బ్యాగ్‌గ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలో నిలబడిన వ్యక్తి అని కొనియాడారు. ఇప్పుడున్న యంగ్ హీరోలందరూ మిమ్మల్నే స్ఫూర్తిగా తీసుకుంటారని అన్నారు. సినిమాల్లో నువ్వు కృష్ణుడు అయితే.. నేను అర్జునుడిని అంటూ నానిపై ప్రశంసలు కురిపించారు. కాగా.. ప్రియదర్శి, నభా నటేశ్ జంటగా నటించిన డార్లింగ్ మూవీ ఈనెల 19న థియేటర్లలో సందడి చేయనుంది. Grandfather time lo #SrNTR Inspiration,Nanna time lo #Chiranjeevi Inspiration,Aa tarwtha #RaviTeja Inspiration.Ma generation ki @NameisNani Inspiration.#Nani Anna, A Genuine Person❤️.Can’t wait for #SaripodhaaSanivaaram @DVVMovies #VivekAthreya pic.twitter.com/PPf7HhxjEP— Saikumar Devendla (@saidevendla) July 16, 2024#Nani About #Balagam and #Darling Film 💥💥💥💥pic.twitter.com/fH1HSAhYrG— GetsCinema (@GetsCinema) July 15, 2024 -
‘బలగం’వేణుకి షాకిచ్చిన నాని.. ‘ఎల్లమ్మ’ రానట్లేనా?
హీరో నాని సినిమా ప్లానింగ్ గురించి అందరికి తెలిసిందే. చేతిలో ఒక్క సినిమా ఉండగానే..మరో రెండు సినిమాలను లైన్లో పెట్టేసుకుంటాడు. అందుకే హిట్, ఫ్లాప్ తేడా లేకుండా ఈ నేచురల్ స్టార్ నుంచి వరుస సినిమాలు వస్తుంటాయి. గతేడాది డిసెంబర్లో ‘హాయ్ నాన్న’తో ప్రేక్షకులను పలకరించిన నాని..ఇప్పుడు ‘సరిపోదా శనివారం’తో రాబోతున్నాడు. ఆగస్ట్ 29న ఈ చిత్రం రిలీజ్ కానుంది. (చదవండి: నా జీవితంలో ఆ 105 రోజులు మర్చిపోలేను)ఈ చిత్రం తర్వాత వరుసగా మూడు సినిమాలు చేయాల్సింది. అందులో ఒకటి బలగం వేణుతో చేయబోతున్నట్లు ప్రకటించాడు. దిల్ రాజు నిర్మాణ సంస్థలో ఈ సినిమా తెరకెక్కాలి. నాని కోసం ‘ఎల్లమ్మ’ టైటిల్‌తో వేణు ఓ కథను కూడా రెడీ చేశాడట. ‘సరిపోదా శనివారం’ రిలీజ్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందనే ప్రచారం జరిగింది. (చదవండి: రిలీజ్‌కు ముందే కల్కి మరో రికార్డు.. )కానీ ఇప్పుడు ఈ చిత్రం క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. నానినే ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశాడట. బలగం వేణు చెప్పిన కథకు, శ్రీకాంత్ ఓదెల చెప్పిక కథల మధ్య సారూప్యత ఉండడంతో..నాని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అంతకు ముందు సాహో ఫేం సుజిత్ సినిమాను కూడా నాని రిజెక్ట్ చేశాడు. మంచి కథ దొరికితే భవిష్యత్తులో నాని-వేణు కాంబినేషన్ కొనసాగే అవకాశం ఉంది. -
'బలగం' మొగిలయ్యకు అస్వస్థత.. సాయం కోసం ఎదురుచూపు
టాలీవుడ్లో సంచలన హిట్‌గా నిలిచిన చిత్రం 'బలగం'. జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వేణు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా చివరి సన్నివేశంలో భావోద్వేగభరిత పాటను ఆలపించిన జానపద కళాకారుడు మొగిలయ్యను అందరూ అభినందించారు.ప్రజలను కన్నీళ్లు పెట్టించిన ఈ పాటను బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య దంపతులు అద్భుతంగా పాడారు. అయితే, మొగిలయ్య మరోసారి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజుల నుంచి కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించడంతో ప్రస్తుతం మెరుగైన చికిత్స కోసం ఆయన్ను హైదరాబాద్‌కు తరలించారు. దుగ్గొండికి చెందిన మొగిలయ్యకు 67 సంవత్సరాలు. ఆర్థిక ఇబ్బుందుల వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని తెలిపిన మొగిలయ్య సతీమణి సాయం కోసం ఎదురుచూస్తుంది. తన భర్త ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కొమురమ్మ వేడుకుంది. -
బలగం సినిమాతోనే గుర్తింపు: సంజయ్‌కృష్ణ
బలగం చిత్రంతోనే తనకు మంచి గుర్తింపు లభించిందని సినీ నటుడు సంజయ్‌కృష్ణ అన్నారు. మహానందీశ్వరుడి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఆయన మహానందికి వచ్చారు. శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ 2013లో మొదటగా కాళీచరణ్ చిత్రంలో నటించానన్నారు. బాలకృష్ణ హీరోగా చేసిన అఖండ, జయసింహా, భగవంత్ కేసరి, చిరంజీవి నటించిన ఆచార్య, పవన్ కల్యాణ్ నటించిన బీమ్లానాయక్, కాటమరాయుడు చిత్రాలు మంచి పేరు తెచ్చాయన్నారు. ఇప్పటి వరకు 53 చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించానన్నారు. ప్రస్తుతం నితిన్ హీరోగా ఓ చిత్రంతో పాటు ఎనిమిది నూతన చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభతో పాటు మంచి పాత్రలు దొరికితేనే గుర్తింపు లభిస్తుందన్నారు. ఆయనను గుర్తించిన అభిమానులు ఫొటోలు తీసుకుంటూ అభిమానం చాటుకున్నారు. -
Kavya Kalyanram Photos: బలగం బ్యూటీ ఫోటోషూట్.. కావ్య కల్యాణ్‌రామ్ స్మైల్‌కి నెటిజన్లు ఫిదా (ఫొటోలు)
-
'నా బలగం అందరు చూశారు.. ఒక్క ఆయన తప్ప': వేణు ఎమోషనల్ పోస్ట్!
బలగం సినిమాతో అందరినీ ఏడిపించిన డైరెక్టర్ వేణు యెల్దండి. జబర్దస్త్ కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న వేణు ఆ తర్వాత నటుడిగా, కమెడియన్‌గా రాణించారు. గతేడాది తెలంగాణ పల్లె నేపథ్యంలో బలగం సినిమాను తెరకెక్కించారు. ఎవరూ ఊహించని విధంగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అప్పటివరకు కమెడియన్‌గా తెలిసిన వేణులో ఇంతమంచి దర్శకుడు ఉన్నాడన్న విషయం తెలిసింది. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ ప్రధాన పాత్రలో కనిపించారు. అయితే తాజాగా వేణు యెల్దండి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నేను తీసిన బలగం సినిమాను అందరు చూశారు.. ఒక్క మానాన్న తప్ప.. మిస్ యూ నాన్న' అంటూ పోస్ట్ చేశారు. దాదాపు 24 ఏళ్ల క్రితమే వేణు తండ్రి మరణించగా.. ఆయనను తలుచుకుని వేణు ఎమోషనలయ్యారు. అంతే కాకుండా తన తండ్రి ఫోటోను షేర్ చేశారు. Naa BALAGAM Cinema andaru choosaaru.. Maa nanna tappa🥲 MISS YOU NAAINA🙏 Late 06/02/2000#father pic.twitter.com/U831rWKRgS — Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) February 8, 2024 -
పద్మశ్రీ అవార్డు గ్రహీతకు 'దిల్ రాజు' సాయం
అంతరించిపోతున్న ఆ కళకు అతడే చివరి వారసుడు. బుర్రవీణను భుజాన మోస్తూ.. రామాయణం, ఆధ్యాత్మిక, గ్రామీణ కథలకు తగ్గట్లు వాయిద్యం వాయిస్తూ.. పాటలు పాడుతూ అందరినీ అబ్బురపరిచారు దాసరి కొండప్ప. వాయిద్యం, పాట మాత్రమే తెలిసిన అతడిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. నారాయణపేట జిల్లా దామరగిద్దకి చెందిన ఒలియ దాసరి కుటుంబీకుడైన కొండప్పది ఎంతో నిరుపేద కుటుంబం.. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి ఆయనది. తాతల కాలం నుంచే బుర్రవీణ వాయిద్యంతో భిక్షాటన చేస్తూ తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. నేడు కేంద్ర ప్రభుత్వం ఆయన్ను గుర్తించి దేశంలోనే నాలుగో అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందించడంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా వైరల్ అయింది. కానీ కొన్ని సంవత్సరాలుగా తిరుమలరావు అనే వ్యక్తి ద్వారా ఆంధ్ర ప్రాంతంలో పాటలు పాడి తన కళకు గుర్తింపు సంపాదించారు. ఈ క్రమంలో ఆయన కళను గుర్తించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన కూతురు నిర్మించిన బలగం చిత్రంలో ఒక పాట పాడేందుకు అవకాశం ఇచ్చారు. ఆ చిత్రంలో ‘అయ్యో శివుడా ఏమాయే ఎనకటి దానికి సరిపోయే’ అనే పాటకు తన గాత్రాన్ని అందించాడు కొండప్ప. తాజాగా కొండప్పను తన ఆఫీస్‌కు దిల్ రాజు పిలుపించుకున్నారు. ఆపై ఆయన్ను సన్మానించి గౌరవించారు. దిల్ రాజుతో పాటు బలగం డైరెక్టర్ వేణు తదితరులు కొండప్పను అభినందించారు. అనంతరం దిల్ రాజు లక్ష రూపాయల చెక్కుని కొండప్పకు అందించారు. ఆ డబ్బును కొండప్ప కోసం మాత్రమే వాడాలని సూచించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. #DasariKondappa garu who sang a song and acted in the film #Balagam has been awarded the PRESTIGIOUS PADMA SHRI ❤️ The entire team met him, felicitated him and presented a cheque of 1 Lakh as a token of appreciation!@VenuYeldandi9 @PriyadarshiPN @kavyakalyanram @dopvenu pic.twitter.com/gVNabIzGNK — Dil Raju Productions (@DilRajuProdctns) February 3, 2024 -
Rewind 2023: బడ్జెట్‌తో పనిలేని బంపర్ హిట్స్
ఈ ఇయర్లో కొన్ని చిన్న సినిమాలు పెట్టిన పెట్టుబడికి ఐదారు ఇంతలకు పైగా కలెక్షన్లు సంపాదించాయి. ఇంకా చెప్పాలి అంటే..మేకర్స్ కూడా ఈ రేంజ్ విజయాన్ని ఉహించలేకపోయారు. అంతగా ఆడియన్స్ మనసు దోచుకున్నాయి. బయ్యర్లకు భారీ లాభాలు తీసుకొచ్చి.. కంటెంట్ బలం మరోసారి నిరూపించాయి. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన స్మాల్ మూవీస్‌పై ఓ లుక్కేద్దాం. బలగం ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి పెద్ద హిట్‌గా నిలిచిన చిత్రాల్లో బలగం ముందు వరుసలో ఉంటుంది. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. తెలంగాణ నేపథ్యంలోని పల్లెటూరి లో జరిగే స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించాడు వేణు. మార్చి 3న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.25 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తెలంగాణలోని పల్లెల్లో తెరలు కట్టి మరి ఈ సినిమాను ప్రదర్శించారంటే.. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. బేబి ఈ ఏడాది సూపర్ హిట్ కొట్టిన మరో చిన్న చిత్రం బేబి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జులై 14న విడుదలై బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. .దాదాపుగా వందకోట్ల వసూళ్ల వరకు వెళ్లి సంచలనాలు నమోదు చేసింది. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ ముక్కోణపు ప్రేమ కథా చిత్రంపై మొదట్లో పెద్ద అంచనాలేమి లేవు. కానీ సినిమా విడుదలైన తర్వాత మౌత్‌టాక్‌తో వసూళ్లను పెంచుకుంది. ఈ సినిమా బడ్జెట్ 10 కోట్లలోపే కానీ.. కలెక్షన్స్ మాత్రం వంద కోట్ల వరకు వచ్చాయి. కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు సినిమా హిట్ చేస్తారనేదానికి బేబీ మూవీని బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. మ్యాడ్ అంతా కొత్త నటులే..అయినా కూడా బాక్సాఫీస్‌ని షేక్ చేశారు. విడుదలకు ముందు మ్యాడ్ చిత్రంపై కూడా పెద్దగా అంచనాలు లేవు. కానీ రిలీజ్(అక్టోబర్ 6) తర్వాత ఈ మూవీకి బాగా పేరొచ్చింది. కాలేజీ నేపథ్యంలో సాగే ఈ కామెడీ డ్రామా.. యూత్‌ని బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ ఏడాది సితార ఎంటర్టైన్మెంట్స్కు మంచి లాభాలను తెచ్చిపెట్టిన చిత్రంగా మ్యాడ్ నిలిచింది. ఈ ఇయర్ మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ఆడియన్స్‌ని ఆకట్టుకున్న చిత్రాలలో చోటు దక్కించుకున్నాయి. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన బెదురు లంక 2012 మూవీ .డీసెంట్ హిట్ కొట్టింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చినా..కీడా కోలా..పెట్టుబడిని వెనక్కి తీసుకొచ్చిన చిన్న చిత్రాల జాబితాలోకి చేరింది. సత్యం రాజేష్,బాలాదిత్యా ప్రధాన పాత్రలో నటించిన మా ఊరి పొలిమేర 2 మూవీ విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన పరేషాన్..కూడా ఎంటర్టైన్ చేసింది.మరో చిన్న సినిమా మిస్టర్ ప్రెంగ్నెంట్ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్ చిత్రంగా అలరించింది.ఇక స్మాల్ హీరో సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ మూవీ కూడా హిట్ స్టెటస్ దక్కించుకుంది. అలాగే ఇటీవల విడుదలైన హారర్ మూవీ పిండం కూడా మంచి టాక్ని సొంతం చేసుకుంది. -
బలగం-2 లో హీరో నాని..!
-
బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న చిన్న చిత్రాలు
సినిమా విజయానికి కంటెంట్ ప్రధాన కారణం.దీనికి రుజువుగా నిలుస్తున్నాయి చిన్న సినిమాలు.కథ బలంతో వచ్చి..ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి.తక్కువ బడ్జెట్లో నిర్మాణం జరుపుకుని లాభాల పంట పండిస్తున్నాయి. 2023 లో వచ్చిన స్మాల్ మూవీస్ ఇందుకు సాక్షంగా నిలిచాయి. ఒకటో రెండో కాదు..ఎన్నో సినిమాలు..విజయ ఢంకా మోగించాయి. ప్రేక్షకులను కనుల విందు చేసాయి. స్టార్స్ నటించకున్నా కూడా..మంచి కలెక్షన్లు రాబట్టి మేము కూడా ఫేమస్ అని నిరూపిస్తున్నాయి. ఆ మధ్య తరుణ్ బాస్కర్ దర్శకత్వం వహించి, నటించిన కీడా కోలా మూవీ థియేటర్లోకి వచ్చింది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. సినిమాకు సూపర్ హిట్ స్టెటస్ కూడా దక్కింది. మొదటి సినిమా పెళ్లి చూపులుతోనే...తెలుగు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ తో పాటు..ఉత్తమ స్క్రీన్ ప్లే, డైలాగ్ రైటర్‌గా జాతీయ అవార్డు అందుకున్నాడు తరుణ్. తర్వాత ఈ నగరానికి ఏమైంది మూవీతో యూత్‌ను అట్రాక్ట్ చేసాడు. రీసెంట్గా రీ రిలీజ్ అయిన ఈ మూవీ.. మంచి వసూళ్లు రాబట్టడం విశేషం. ఇక తర్వాత వెంకటేశ్‌తో తరుణ్ మూవీ పట్టాలు ఎక్కాల్సింది. కాని ఈ మూవీ ప్రారంభం అవటం ఆలస్యం అవుతుండటంతో..ఈ లోపు కీడా కోలా మూవీకి మెగా ఫోన్ పట్టుకున్నాడు. మా ఊరి పొలిమేర మూవీ ఓటీటీలో విడుదలయింది.మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.ఆడియన్స్ ఈ థ్రిల్లర్ సబ్జెక్టు బ్రహ్మరథం పట్టారు.ఇటీవల మా ఊరి పొలిమేర మూవీకి సెకండ్ భాగం కూడా విడుదల అయింది.అయితే ఈ సారి థియేటర్లలోకి వచ్చింది.ఫస్ట్ భాగానికి వచ్చిన స్పందనతో...రెండో భాగానికి మంచి వసూళ్లు వచ్చాయి.సత్యం రాజేష్,బాలాదిత్యా లాంటి వారు ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. (చదవండి: వాస్తవ సంఘటనలే సినిమాగా తెరకెక్కిస్తున్న దర్శకులు) ఈ ఇయర్ హిట్ సినిమాల గురించి మాట్లాడుకుంటే..మ్యాడ్ మూవీ గురించి కూడా చెప్పుకోవాలి.అంతగా గుర్తింపు లేని యాక్టర్లు నటించిన ఈ కామెడీ డ్రామా..యూత్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ మూవీ..మంచి వసూళ్లు రాబట్టింది. (చదవండి: ప్రభాస్ 'సలార్' షర్ట్ కావాలంటే ఇలా పొందండి.. ధర ఎంతో తెలుసా?) మీడియం రేంజ్ హీరోలకే వందకోట్ల కలెక్షన్లు డ్రీమ్‌గా మారాయి. రేపో మాపో ఈ టార్గెట్ చేరుకోవాలి అనుకుంటున్నారు. అయితే బేబి లాంటి చిన్న సినిమా మాత్రం ..దాదాపుగా వందకోట్ల వసూళ్లుకు దగ్గరగా వెళ్లింది. ఆనంద్ దేవరకొండ కు ..బిగ్ హిట్ లేదు. ఈ మూవీ దర్శకుడు సాయి రాజేశ్‌కు కూడా..ఓ కమర్శియల్ విజయం లేదు. కాని..కంటెంట్ యూత్ కు బాగా కనెక్ట్ అయింది. అందుకే భారీ విజయం సాధ్యం అయింది శ్రీవిష్ణుకి విజయం వచ్చి చాలా కాలామే అయింది. అయితే ఈ ఇయర్ మాత్రం..ఉహించని సక్సెస్ చూశాడు. సామజవరగమనతో..సూపర్ హిట్ అందుకున్నాడు.డిఫరెంట్ సబ్జెక్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా యాభై కోట్ల వసూళ్లు రాబట్టింది. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఆడియనన్స్ను ఫ్రెష్ ఫీల్ కలుగజేసింది.సెంటిమెంట్,ప్రేమ,మెసెజ్ లాంటి అన్ని అంశాలతో కట్టి పడేసింది. ఈ సినిమాలో సంభాషణలు ఆసక్తికరంగా ఉండి ఆకట్టుకున్నాయి. మినిమిం బజ్‌తో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర యాభై కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తెలంగాణ నేపథ్యంలోని పల్లెటూరి లో జరిగే స్టోరీతో తెరకెక్కింది బలగం. ఈ మూవీ మీద ఏమాత్రం అంచానాలు లేవు. కాని కంటెంట్ పర్ఫెక్ట్గా ఉంటే ..చిన్న సినిమా కూడా మంచి వసూళ్లు రాబడుతుంది అని చెప్పటానికి పెద్ద ఉదాహారణగా ఈ మూవీ నిలిచింది. చావు చుట్టు తిరిగే ఈ మూవీ స్టోరీ. బందాలు,అనుభందాలు ఎంత గొప్పగా ఉంటాయో చాటి చెప్పింది. ఆర్ ఎక్స్ 100 తర్వాత కార్తికేయకు మరో విజయం దక్కలేదు.మార్కెట్ కూడా పాడు చేసుకున్నాడు.దాంతో విజయం కంపల్ సరిగా మారింది.ఈ సారి బెదురు లంక 2012 మూవీతో వచ్చాడు.ఈ ఇయర్ థియేటర్లలోకి వచ్చింది.పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని..డీసెంట్ హిట్ కొట్టింది.కార్తికేయను హిట్ ట్రాక్ మీదికి తీసుకొచ్చింది.నేహా శెట్టి ఈ మూవీలో కథానాయికగా నటించింది. ఇక ఈ నెలలో విడుదలైన మంగళవారం, కోట బొమ్మాళి చిత్రాలు కూడా హిట్ టాక్ని సంపాదించుకున్నాయి. అయితే ఇందులో మంగళవారం చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన.. ఆశించిన స్థాయిలో మాత్రం వసూళ్లను రాబట్టలేకపోతుంది. ఇక కోట బొమ్మాళి మూవీ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఈ ఏడాది వీటితో పాటు మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాయి. తెలంగాణ నేపథ్యంలో పల్లెటూరులో జరిగే సబ్జెక్ట్‌తో రూపొందిన పరేషాన్, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మిస్టర్ ఫ్రెంగ్నెంట్.. సుహాన్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ లాంటి చిత్రాలు కూడా డీసెంట్ హిట్ టాక్ని సంపాదించుకున్నాయి. -
రెండోసారి తండ్రి అయిన 'బలగం' డైరెక్టర్ వేణు
టాలీవుడ్లో గుర్తుండిపోయే సినిమాల లిస్ట్ తీస్తే అందులో 'బలగం' కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ గ్రామీణ నేపథ్య కథతో తీసిన ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. అప్పటివరకు కమెడియన్ గా తెలిసిన వేణులో ఇంతమంచి దర్శకుడు ఉన్నాడని బయటపెట్టింది. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 29 సినిమాలు రిలీజ్) ఈ ఏడాది 'బలగం' సినిమాతో దర్శకుడిగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన వేణు యెల్దండి.. ఇప్పుడు తండ్రిగా మరోసారి ప్రమోషన్స్ పొందాడు. తనకు అమ్మాయి పుట్టిందని చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఇకపోతే వేణుకి ఇదివరకే ఓ కొడుకు ఉన్నాడు. ఇద్దరూ కలిసి యూట్యూబ్ ఛానెల్లో పలు వీడియోస్ కూడా చేశారు. ఇక 'బలగం' తర్వాత మళ్లీ దిల్ రాజు నిర్మాణంలో వేణు మరో సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో 'బలగం'లో యాక్ట్ చేసిన ప్రియదర్శినే హీరోగా నటిస్తున్నాడని టాక్. అయితే ఈ విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: మెగాస్టార్ పాన్ ఇండియా సినిమా.. రెండు నెలల్లో పూర్తి) View this post on Instagram A post shared by Venu Yeldandi (@venuyeldandi9) -
ఆస్కార్ బరిలో మన 'బలగం'.. టాలీవుడ్ నుంచి ఆ రెండే!
ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా చాటిన చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పురస్కారం లభించింది. మరోవైపు ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్‌కు సైతం ఈ అవార్డ్ దక్కింది. ఈ ఏడాది భారత్ నుంచి ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో గుజరాతీ చిత్రం ఛెల్లో షో ను పంపిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకు ఎలాంటి అవార్డు లభించలేదు. (ఇది చదవండి: ఓటీటీలో సూపర్‌హిట్ లవ్ స్టోరీ.. ఫ్రీగా చూసేయండి!) అయితే వచ్చే ఏడాది జరిగే ఆస్కార్ వేడుక కోసం అప్పుడే సందడి మొదలైంది. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఆస్కార్-2024 ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఏడాదికి ఈ విభాగంలో మన టాలీవుడ్ సినిమాలు బరిలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఆస్కార్ ఎంట్రీ కోసం దాదాపు 22 చిత్రాలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలను ఫిల్మ్ మేకర్ గిరీష్ కాసరవల్లి అధ్యక్షతన 17మంది సభ్యులతో కూడిన ఆస్కార్ కమిటీ చెన్నైలో వీక్షిస్తున్నారు. ఈ చిత్రాలు చూసిన తర్వాతే ఉత్తమ చిత్రం ఎంపిక చేయనున్నారు. ఆస్కార్ ఎంట్రీకి వచ్చిన సినిమాలివే!! దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 22 సినిమాలు అధికారిక ఎంట్రీకి వచ్చినట్లు తెలుస్తోంది. దసరా (తెలుగు), బలగం(తెలుగు), ది స్టోరీ టెల్లర్ (హిందీ), మ్యూజిక్ స్కూల్ (హిందీ), మిస్ ఛటర్జీ వర్సెస్ నార్వే (హిందీ), 12 ఫెయిల్ (హిందీ), ది కేరళ స్టోరీ, విడుదలై పార్ట్-1 (తమిళం), ఘూమర్ (హిందీ), వాల్వి (మరాఠీ), గదర్-2 (హిందీ), అబ్ థో సాబ్ భగవాన్ భరోస్ (హిందీ), బాప్ లాయక్ (మరాఠీ), రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ, జ్విగాటో చిత్రాలు ఉన్నట్లు సమాచారం. (ఇది చదవండి: రైతుబిడ్డకు 26 ఎకరాల పొలం, కోట్ల ఆస్తి? స్పందించిన ప్రశాంత్ తండ్రి) బలగం సినిమాకే ఛాన్స్!! ఈ సారి టాలీవుడ్ నాని సూపర్ హిట్ దసరా, చిన్న సినిమాగా వచ్చి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన బలగం పోటీ పడుతున్నాయి. ఈ సినిమాలన్నీ చూసిన తర్వాతే ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో ఆస్కార్‌కు పంపుతారు. కాగా.. ఇప్పటికే బలగం చిత్రానికి పలు అంతర్జాతీయ అవార్డులు సైతం వరించి సంగతి తెలిసిందే. దీంతో బలగం మూవీ ఆస్కార్ ఎంట్రీకి ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. -
‘బలగం’ మూవీ.. సర్పంచ్‌కు కన్నీటి వీడ్కోలు..!
కరీంనగర్: బలగం సినిమాలో సర్పంచ్‌గా నటించిన కీసరి నర్సింగం అంత్యక్రియలు బుధవారం అభిమానుల కన్నీటి మధ్య పూర్తయ్యాయి. కోనరావుపేట మండలం నాగారం గ్రామానికి చెందిన కీసరి నర్సింగం కొన్నేళ్లుగా నాటక ప్రదర్శనలు చేస్తూ గుర్తింపు పొందారు. ఇటీవల వేణు డైరెక్షన్లో వచ్చిన బలగం సినిమాలో సర్పంచ్‌గా నటించి అందరి ప్రశంసలు పొందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారుల సంఘం ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్న నర్సింగం కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం సాయంత్రం మృతిచెందారు. నర్సింగంకు భార్య భూమవ్వ, కుమారుడు శ్రీనివాస్, కూతురు అంజలి ఉన్నారు. అంత్యక్రియల్లో జెడ్పీచైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, వైఎస్సార్టీపీ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, డీపీఆర్వో మామిండ్ల దశరథం, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు, సర్పంచ్ లావణ్య–శ్రీనివాస్, బీజేపీ జిల్లా కార్యదర్శి గోపాడి సురేందర్‌రా వు, మాజీ జెడ్పీటీసీ శ్రీకుమార్, నాయకులు రాఘవరెడ్డి, పిట్టల భూమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
టాలీవుడ్లో విషాదం.. బలగం నటుడు కన్నుమూత!
చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిత్రం బలగం. వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కాగా.. ఈ సూపర్ హిట్ మూవీలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ జంటగా నటించారు. మురళీధర్ గౌడ్, కేతిరి సుధాకర్ రెడ్డి, జయరామ్, రూప, రచ్చ రవి ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: బలగం మూవీ అరుదైన ఘనత.. ఇంతవరకు ఏ సినిమాకు దక్కలేదు!) అయితే ఈ చిత్రంలో సర్పంచ్ పాత్రలో కనిపించిన నర్సింగం తాజాగా కన్నుమూశారు. ఈ విషయాన్ని దర్శకుడు వేణు యెల్దండి ట్విటర్ ద్వారా తెలియజేశారు. ఆయనకు నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు చిత్రబృందం సభ్యులు ఆయనకు సంతాపం ప్రకటించారు. వేణు ట్వీట్లో రాస్తూ..' నర్సింగం బాపుకి శ్రద్ధాంజలి. మీచివరి రోజుల్లో బలగం సినిమా ద్వారా మీలోని నటుణ్ని మీరు చూసుకొని మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఓంశాంతి. బలగం కథ కోసం రీసర్చ్ చేస్తున్నప్పుడు మొదటగా నర్సింగం బాపునే కలిసాను.ఆరోజు కల్లు, గుడాలు తెప్పించాడు నాకోసం.' అంటూ బలగం సినిమా రోజులను తలుచుకుని ఎమోషనల్ అయ్యారు. (ఇది చదవండి: ‘బలగం’ తర్వాత యష్‌తోనే సినిమా ఎందుకంటే:దిల్ రాజు ) నర్సింగం బాపుకి శ్రద్ధాంజలి 🙏 మీచివరి రోజుల్లో బలగం సినిమా ద్వారా మీలోని నటుణ్ని మీరు చూసుకొని మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఓంశాంతి🙏 బలగం కథ కోసం రీసర్చ్ చేస్తున్నప్పుడు మొదటగా నర్సింగం బాపునే కలిసాను.ఆరోజు కళ్ళు, గుడాలు తెప్పించాడు నాకోసం..🙏 pic.twitter.com/smDHR8ULyU — Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) September 5, 2023 -
ప్రతి రైతు మనుసును కదిలిస్తున్న 'నాగలి' చిత్రం.. యూట్యూబ్‌లో విడుదల
నిజ జీవిత విలువల నేపథ్యంలో వస్తున్న సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా రైతు నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ నీరాజనం పలుకుతుంటారు. రైతన్న కష్టసుఖాలను తెరపై ఆవిష్కరించే సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఇదే బాటలో ఇప్పుడు 'నాగలి' అనే ఒక లఘు చిత్రాన్ని డాక్టర్ విశ్వామిత్ర రెడ్డి, మానస (USA) సమర్పణలో సుంకర.నీలిమా- దేవేందర్ రెడ్డి నిర్మించారు. తాజాగా యూట్యూబ్‌లో విడుదలైన 'నాగలి' అనే 24 నిమిషాల లఘు చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో బలగం ఫేమ్ అరుసం మధుసుదన్ కీలక పాత్రలో నటించారు. (ఇదీ చదవండి: ఫ్యాన్స్‌కు కోటి విరాళం.. అవసరం ఉన్న వాళ్లు ఇలా ధరఖాస్తు చేసుకోండి: విజయ్) నేషనల్ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేస్తున్న నివేదికల ప్రకారం ప్రతి ఏడాది భారత్‌లో సుమారు 15 వేలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యలు దేశానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదని సాక్షాత్తు సుప్రీం కోర్టు కూడూ పలు మార్లు వ్యాఖ్యానించింది. రైతుల ఆత్మహత్యలపై ప్రతీ రోజూ పత్రికల్లో వార్తా కథనాలు వస్తుంటాయి.. వారి పరిస్థితి హృదయ విదారకంగా ఉంటుంది. ఎందుకంటే మన అందరిదీ కూడా రైతు నేపథ్యం కాబట్టి. అలాంటి రైతుల ఘోషను గుర్తించిన సుంకర.నీలిమా- దేవేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. తమ వంతుగా ఇలాగైనా రైతుల ఆత్మహత్యలు ఆగాలనే ఆకాంక్షతో 24 నిమిషాల నిడివితో 'నాగలి' అనే లఘు చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో మొదట తన ప్రేమను ప్రియురాలు కాదని చెప్పడంతో ఒక యువకుడు పొలం గట్టుపైనే పురుగుల మందు తాగే ప్రయత్నం చేస్తాడు. ఈలోపు నటుడు మధు అక్కడ ప్రత్యక్షం అయి అతన్ని ఆపే ప్రయత్నం చేస్తాడు.. ఈ సీన్ రెగ్యూలర్ సినిమాల్లో మాదిరి కాకుండా కొంచెం ప్రత్యేకంగా క్రియేట్ చేశారు. నీతో పాటు పురుగుల మందు తాగి చనిపోయేందుకు ఒక పెద్దాయన కూడా ఇక్కడికి వస్తున్నాడని ఆ యువకుడితో చెప్తాడు. అది నీకు ఎలా తెలుసని ఆ యువకుడు ప్రశ్నిస్తాడు. ఈలోపు ఆ పెద్దాయన నిజంగానే వస్తాడు. వారిద్దరూ చనిపోబోతున్నట్లు ముందే అతను ఎలా గ్రహించాడు...? ఒకరైతు ఎందుకు చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు..? ఆ యువకుడిని కాదన్న యువతి ఎవరు..? వారితో పాటు ఉన్న తీరని కష్టాలు ఏంటి..? తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే. ప్రతి గ్రామంలో ఉండే యువకుల్లో కొందరైనా ఇలా ఆలోచిస్తే తమ చుట్టూ ఉన్న రైతులను కాపాడుకోవచ్చని దర్శకుడు జానా రాజ్‌కుమార్ చెప్పిన విధానం మెప్పిస్తుంది. ఎంతో ఆసక్తిగా సాగే ఈ చిత్రాన్ని మీరూ చూసేయండి. -
రాయలసీమ నేపథ్యంలో...
రవి మహాదాస్యం, విషికా లక్ష్మణ్ జంటగా రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించిన చిత్రం సగిలేటి కథ’. నవదీప్ సి–స్పేస్ సమర్పణలో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరులో రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని సోమవారం విడుదల చేశారు. దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి మాట్లాడుతూ – ‘‘రాయలసీమ నేపథ్యంలో సాగే చిత్రం ‘సగిలేటి కథ’’ అన్నారు. ‘‘సగిలేటి కథ’ అనే నవల నా సినిమాకి ప్రేరణ మాత్రమే.. కథ పూర్తిగా ఒరిజినల్‌గా ఉంటుంది’’ అన్నారు రాజశేఖర్ సుద్మూన్ . ‘‘కేరాఫ్ కంచరపాలెం, బలగం’ వంటి చిత్రాల కోవలోనే ‘సగిలేటి కథ’ కూడా ఉంటుంది’’ అన్నారు సమర్పకుడు నవదీప్. -
‘బలగం’ తర్వాత యష్‌తోనే సినిమా ఎందుకంటే:దిల్ రాజు
'ఆకాశం దాటి వస్తావా’ మంచి మ్యూజికల్ మూవీ. కొత్త ప్రతిభని పరిచయం చేయాలనే దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్లో శశి, యష్‌లతో ఈ యూత్‌ఫుల్ సినిమా చేస్తున్నాం' అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. కొరియోగ్రాఫర్ యష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’. శశి కుమార్ ముతులూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కార్తీక మురళీధరన్ హీరోయిన్. ‘దిల్’ రాజుప్రొడక్షన్ బ్యానర్లో ‘బలగం’ తర్వాత హర్షిత్, హన్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ టైటిల్, పోస్టర్ని విడుదల చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– 'నా సినిమాలో కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇస్తానని యష్‌తో అన్నాను. కానీ లుక్ పరంగా బాగున్నాడు. అందుకే హీరోగా పరిచయం చేస్తున్నాం. సింగర్ కార్తీక్ ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు' అన్నారు. 'జీవితంలో అన్ని బంధాలకు ప్రేమ, టైమ్, డబ్బులను సమానంగా ఇవ్వాలి. ఈ మూడింటిలో ఏది తగ్గినా ఆ బంధంలో గొడవలు జరుగుతాయి. ఇదే ΄పాయింట్‌తో ఈ సినిమా కథ సాగుతుంది' అన్నారు శశి కుమార్ ముతులూరి. 'నన్ను నమ్మి హీరోగా అవకాశం ఇచ్చినందుకు ‘దిల్’ రాజు, శశి, హర్షిత్, హన్షితగార్లకు థ్యాంక్స్' అన్నారు యష్. -
అతనితో పోల్చడమంటే కించపరిచినట్లే.. రాహుల్ రామకృష్ణ ట్వీట్ వైరల్
కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన నటనతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ రామకృష్ణ. ఒకవైపు కమెడియన్‌గా రాణిస్తూనే.. మరోవైపు జాతిరత్నాలు, విరాటపర్వం, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లతో నటిస్తూ.. బిజీగా ఉన్నారు. ఇటీవల రాహుల్ రామకృష్ణ నటించిన ఇంటింటి రామాయణం సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా రామకృష్ణ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: సూపర్‌స్టార్ కొత్త సినిమాకు లీగల్ సమస్యలు) ఈ ఏడాది అందరినీ కంటతడి పెట్టించిన సినిమా బలగం. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ ప్రధానపాత్రలో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాహుల్ నటించిన ఇంటింటి రామాయణం సూపర్ హిట్ కావడంతో నెటిజన్స్ అతన్ని ప్రియదర్శితో పోలుస్తూ పోస్టులు పెడుతున్నారు. నెట్టింట వైరలవుతున్న వాటిపై రాహుల్ రామకృష్ణ స్పందించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. రాహుల్ ట్విటర్లో రాస్తూ.. 'నా ప్రాణ మిత్రుడు ప్రియదర్శి హార్ట్ వర్క్‌తో పాటు మంచి నటుడు. అతనితో నన్ను పోల్చడమంటే మీరు అతన్ని కించపరిచినట్లే. అతను గొప్ప నటుడే కాదు.. మంచి వ్యక్తితమున్న వ్యక్తి. ఇలా పోల్చడం మీ పిరికితనంలా అనిపిస్తుంది. నేను అతని బాటలోనే నడుస్తాను.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. ఇంటింటి రామాయణం చిత్రానికి సురేష్ నరెడ్ల దర్శకత్వం వహించగా..ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో నవ్య స్వామి, వీకే నరేశ్, సురభి ప్రభావతి, గంగవ్వ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో రాహుల్ తండ్రైన విషయం తెలిసిందే. పెళ్లి విషయాన్ని గోప్యంగా ఉంచి.. గతేడాది నవంబర్‌లో తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించి అందరికి షాకిచ్చాడు. (ఇది చదవండి: ప్రేక్షకుల స్పందనతో ఆనందం కలిగింది) pic.twitter.com/E51s5hGVfw — Rahul Ramakrishna (@eyrahul) July 16, 2023 -
Balagam Actors Images: 'బలగం'కు 100 అవార్డులు.. విశ్వ విజయ శతకం వేడుకలు (ఫోటోలు)