Basavaraj Bommai
-
కాంగ్రెస్ నేతపై ప్రశంసలు కురిపించిన బీజేపీ ఎమ్మెల్యే
బెంగళూరు: ఒక్కసారిగా పదవి పోతే రాజకీయ నాయకులు నిరాశలో కుంగిపోతుంటారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన తర్వాత బీజేపీ నేతల పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. తమ ఉనికిని చాటుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఇదే క్రమంలో బీజేపీ నేత ఎస్.డీ.సోమశేఖర్ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ పై ప్రశంసలు కురిపించారు. ఆయనను తన రాజకీయ గురువుగా చెబుతూ కాంగ్రెస్ తలుపు తట్టే ప్రయత్నం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఎస్.డీ.సోమశేఖర్ గౌడ మాట్లాడుతూ.. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన రాజకీయ గురువు అని సహకార శాఖలో నేను ఏదైనా సాధించానంటే అది అయన చలవేనని అన్నారు.అయన నాకు చాలా సహాయం చేశారు. మొదట్లో నాకు జేపీ నగర్ బ్లాకు ఇవ్వలేదు. అలాంటి సమయంలో ఫీకే శివకుమార్ నన్ను జేపీనగర్ జాయింట్ సెక్రెటరీగా నియమించారు. అక్కడి నుండి ఆయన నాకు అనేక సందర్భాల్లో అండగా నిలిచారు. ఉత్తరహళ్లి నియోజకవర్గం అభ్యర్థిగా నా పేరును ఆయనే ప్రతిపాదించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడో నెలలోనే ఆయన కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించడం చూస్తే ఆయన మళ్ళీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకునే ఉద్దేశ్యంలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. 2019లో కాంగ్రెస్ పార్టీని నిలువునా ముంచి యాడ్యూరప్ప ప్రభుత్వానికి అండగా నిలిచిన 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో సోమశేఖర్ కూడా ఒకరు. కాంగ్రెస్ నాయకుడిని పొగుడుతూ బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ.. బహుశా ఆయన ఎదో అసంతృప్తితో ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారు. ఆయనతో మాట్లాడితే సమస్య సర్దుకుంటుంది అని అన్నారు. ఇది కూడా చదవండి: బీజేపీ తొలి జాబితా విడుదల.. అత్యధికులు వారే.. -
పోరాడినా గెలవలేకపోయాం ఓటమిని విశ్లేషించుకుంటాం..
-
బసవరాజ బొమ్మైతో కాంగ్రెస్ ఎమ్మెల్యే రహస్య భేటీ...
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నాయకుల రహస్య, బహిరంగ భేటీలో తాజాగా రాజకీయాల్లో కుతూహలానికి కారణమయ్యాయి. దావణగెరె కాంగ్రెస్ వృద్ధ నేత శామనూరు శివశంకరప్పని బీజేపీ నాయకుడు బసవరాజ బొమ్మై కలవడంపై అనేక ఊహాగానాలు వ్యాప్తి చెందాయి. అదేరీతిలో డీసీఎం శివకుమార్‌తో బీజేపీ నేత రేణుకాచార్య భేటీ అయ్యారు. మరోవైపు కొందరు బీజేపీ నాయకులు కాంగ్రెస్‌తో సఖ్యతగా ఉంటూ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారని కాషాయనేతలు సీటీ రవి, ప్రతాపసింహా మండిపడడం రెండు పారీ్టల్లో కలకలం రేపింది. కర్ణాటక: మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు రేణుకాచార్య బుధవారం బెంగళూరులో ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్‌ను భేటీ చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రేణుకాచార్య ఓడిపోయాక మౌనంగా ఉంటున్నారు. ఈ తరుణంలో డీకేని కలవడం రాజకీయ రంగంలో చర్చకు కారణమైంది. భేటీ తరువాత రేణుకాచార్య మీడియాతో మాట్లాడుతూ డీకే తనకు మంచి స్నేహితుడని, అందుకే కలిశానని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని అన్నారు. హొన్నళ్లిలో జరిగే వ్యవసాయ మేళాకు ఆహా్వనించానన్నారు. కుమ్మక్కుపై వారినే అడగండి కొంతమంది బీజేపీ నాయకులు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని మైసూరు ఎంపీ ప్రతాప్ సింహ, బీజేపీ సీనియర్‌నేత సీటీ రవి ఆరోపణలు చేసిన సమయంలో ఈ భేటీ జరగడం విశేషం. ఈ ఆరోపణలపై రేణుకాచార్య స్పందిస్తూ కుమ్మక్కుపై సీటీ రవి, ప్రతాపసింహనే అడగాలని, తనకు సమాచారం లేదని, ఏ అర్థంలో చెప్పారనేది తెలియదని అన్నారు. ప్రతాపసింహ, సీటీ రవి ఏమన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ సీనియర్ నాయకులు మౌనంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించటం గాని, ఆరోపణలు చేయటం గాని చేయటం లేదు. అనేక మంది సీనియర్ నాయకులు సీఎం సిద్దరామయ్యతో కుమ్మక్కయ్యారని ఎంపీ ప్రతాప్ సింహ, సీటీ రవి ఆరోపణలు చేశారు. రెండు పారీ్టల నాయకులు కుమ్మక్కు రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక బీజేపీ నాయకులను బెదిరింపులకు గురిచేశారని వారు ఆరోపించారు. అది మామూలు భేటీనే: బొమ్మై బీజేపీ మాజీ సీఎం బసవరాజ బొమ్మై మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే శామనూరు శివశంకప్పను రహస్యంగా భేటీ కావటంపై రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. దీనిపై బుధవారం బొమ్మై స్పందిస్తూ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవు. నా రాజకీయ వైఖరిలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన ట్విట్టర్లో అన్నారు. ఆయన తనకు బంధువు అని, తరచూ ఇళ్లకు వెళ్లి వస్తుంటామని, దీనికి రాజకీయాలు పూయడం సరికాదన్నారు. వారి మనమళ్లకు పెళ్లి సంబంధాల గురించి చర్చ జరిగింది, ఇందులో రాజకీయాల ప్రస్తావన లేదన్నారు. మరోవైపు శివశంకరప్ప స్పందిస్తూ ఎన్నికలు జరిగిననాటి నుంచి తాము కలవలేదు. అందుకే కలిశామన్నారు. మాకు బంధుత్వం ఉంది, కొన్ని విషయాలు చెప్పేందుకు సాధ్యపడదన్నారు. -
సీఎం పదవికి బసవరాజు బొమ్మై రాజీనామా
కర్ణాటక ముఖ్యమంత్రిగా 19 నెలల 17 రోజులు పనిచేసిన 'బసవరాజు బొమ్మై' ఎట్టకేలకు రాజీనామా చేశారు. ఇందులో భాగంగానే తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందించారు. ఈ రోజు విడుదలైన ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ 136 సీట్లతో భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. కేవలం 65 స్థానాలకు పరిమితమైన బీజేపీ ప్రస్తుతం కర్ణాటకలో అధికారం కోల్పోయింది. కన్నడ నాట ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సీఎం రేసులో డీకే శివకుమార్, సిద్దరామయ్య ఉన్నారు. అయితే ఎవరు కర్ణాటక కొత్త ముఖ్యమత్రి అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. -
బీజేపీ ఘోర పరాభవంపై కర్ణాటక సీఎం రియాక్షన్ ఇదే..
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవంపై సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. ఓటమిని అంగీకరిస్తున్నట్లు తెలిపారు. మెజార్టీ సాధిచడంలో విఫలమయ్యామని, ఫలితాలను విశ్లేషిస్తామన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే తమ లోటుపాట్లను అధిగమించి ముందుకెళ్తామని బొమ్మై చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఫలితాలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తామన్నారు. మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప కూడా ఫలితాలపై స్పందించారు. గెలుపు ఓటములు తమకు కొత్తేం కాదన్నారు. కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవవరం లేదన్నారు. పార్టీ ఓటమికి గల కారణాలపై ఆత్మపరీశీలన చేసుకుంటామన్నారు. ప్రజాతీర్పును శిరసావహిస్తున్నట్లు స్పష్టం చేశారు. కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 135 స్థానాలకు పైగా ఆధిక్యంలో దూసుకుపోతోంది. దీంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మరోవైపు బీజేపీ కేవలం 65 స్థానాల్లోనే ముందంజలో ఉంది. జేడీఎస్ 22 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. చదవండి: కాంగ్రెస్ విజయానికి కారణమైనా 6 మంత్రాలివే.. -
కర్ణాటక బీజేపీ ఆఫీస్‌లో కింగ్ కోబ్రా.. సీఎం బసవరాజ్ బొమ్మై పక్కనే..
బెంగళూరు: కర్ణాటక శిగ్గావ్లోని బీజేపీ క్యాంప్ ఆఫీస్‌లో కింగ్ కోబ్రా కన్పించడం కలవరపాటుకు గురిచేసింది. సీఎం బసవరాజ్ బొమ్మై ఆఫీస్‌లో ఉన్న సమయంలో కోబ్రా కన్పించడంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు. పామును పట్టుకునే సమయంలో సీఎం బొమ్మై అక్కడే ఉన్నారు. అయితే కింగ్ కోబ్రా వల్ల ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరిపిల్చుకున్నారు. #WATCH Karnataka CM Basavaraj Bommai reaches the BJP camp office in Shiggaon, a snake found in the building compound slithers away The snake was later captured and the building compound secured pic.twitter.com/FXSqFu0Bc7 — ANI (@ANI) May 13, 2023 #WATCH A snake which had entered BJP camp office premises in Shiggaon, rescued; building premises secured amid CM's presence pic.twitter.com/1OgyLLs2wt — ANI (@ANI) May 13, 2023 కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం చవిచూసింది. కేవలం 60-65 స్థానాలకే పరిమితమయ్యేలా కన్పిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ తిరుగులేని మెజార్టీతో దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మంచి 130 స్థానాల్లో మెజార్టీలో దూసుకుపోతోంది. అటు కింగ్ మేకర్ అవుతుంది అనుకున్న జేడీఎస్ కేవలం 22 స్థానాల్లో ఆదిక్యంలో కొనసాగుతోంది. చదవండి: కాంగ్రెస్‌ను గెలిపించిన ఆరు మంత్రాలివే.. -
బీజేపీ ఓటమి.. బసవరాజు బొమ్మై ఫస్ట్ రియాక్షన్..!
-
కర్ణాటకలో ఖతర్నాక్ ఫైట్.. సీఎం అభ్యర్థులపై సస్పెన్స్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు(శనివారం) విడుదల కానున్నాయి. ఇక, కర్ణాటకలో పార్టీల గెలుపుపై ఎగ్జిట్‌పోల్స్ ఆసక్తికర ఫలితాలను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికల ఫలితాల్లో ఏపార్టీకి మ్యాజిక్ ఫిగర్(113) వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్‌పోల్స్ స్పష్టం చేశాయి. దీంతో, హెచ్డీ కుమారస్వామి జేడీఎస్ పార్టీ కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమారస్వామితో టచ్‌లో ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు.. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే సీఎం అభ్యర్థి ఎవరు అనే అంశంపై కూడా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా డీకే మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ వస్తుంది. దాదాపు 150 స్థానాల్లో గెలుస్తాము. నేను నా అంచనాలకు మార్చుకోను. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సి అవసరం లేదు. జేడీఎస్‌తో మేము ఎలాంటి చర్చ జరపలేదు. ఎన్నికల సందర్బంగా మా పార్టీకి చెందిన జాతీయ నేతలు, సిద్ధరామయ్య ఇతర నేతలు తీవ్రంగా కృషి చేశారు. మ్యాజిక్ ఫిగర్ దాటుతామన్న నమ్మకం నాకుంది. అయితే, కర్ణాటక సీఎం రేసులో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనే ప్రశ్నపై డీకే స్పందించారు. సీఎం ఎవరుతారనే అంశం కాంగ్రెస్ అధిష్టానం పరిధిలో ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిర్ణయమే ఫైనల్ అంటూ కామెంట్స్ చేశారు. ఇక, కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేసులో సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ ఉన్నారు. ఇదిలా ఉండగా.. అటు బీజేపీలో కూడా సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ నుంచి సీఎం రేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మతో పాటుగా మాజీ సీఎం యడియూరప్ప కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై సీఎం బొమ్మై నివాసంలో సీనియర్ నేతలు భేటీ అయ్యారు. బీఎల్ సంతోష్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరుగుతోంది. ఇది కూడా చదవండి: మోదీ 'మన్ కీ బాత్' వినలేదని 36 మంది విద్యార్థులకు శిక్ష -
Karnataka Exit Polls: ఎగ్జిట్‌పోల్స్‌పై సీఎం బొమ్మై రియాక్షన్ ఇదే..
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌పోల్స్ వెలువడ్డాయి. కాగా, ఎగ్జిట్‌పోల్స్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఏపార్టీకి స్పష్టమైన మెజార్టీని ఇవ్వలేదు. హాంగ్ దిశగా అన్ని ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను వెల్లడించాయి ఈ నేపథ్యంలో కుమారస్వామి జేడీఎస్ మరోసారి కీలక కానుంది. ఎగ్జిట్‌పోల్స్ జేడీఎస్‌కు దాదాపు 20 స్థానాలకు పైగానే గెలిచే అవకాశాలు ఉన్నట్టు తెలిపాయి. ఈ క్రమంలో ఎగ్జిట్‌పోల్స్‌పై కర్ణాటక సీఎం బస్వరాజు బొమ్మై స్పందించారు. తాజాగా బొమ్మై మీడియాతో మాట్లాడుతూ.. ఎగ్జిట్‌పోల్స్ వాస్తవ ఫలితాలు కాదు. కర్ణాటకలో మేమే గెలుస్తాం. రిసార్ట్ పాలిటిక్స్ అవసరం ఉండదు అని స్పష్టం చేశారు. #WATCH | Exit polls are exit polls, it can't be 100% correct. We are going to get a complete majority and form the government. I think we should wait till 13th May: Karnataka CM Basavaraj Bommai #KarnatakaAssemblyElection (ANI) pic.twitter.com/643rQa1pIM — Argus News (@ArgusNews_in) May 10, 2023 మరోవైపు.. సీఎం భార్య చెన్నమ్మ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుంది. 150కిపైగా స్థానాల్లో విజయం మాదే. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మ 50వేలకు పైగా మెజార్టీ విజయం సాధిస్తారు అని అన్నారు. ఇది కూడా చదవండి: కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయ్.. -
karnataka Assembly Elections: హై ఓల్టేజ్ సీట్లలో అమీతుమీ!
సాక్షి, కర్ణాటక ఎలక్షన్ డెస్క్: కర్ణాటక ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రముఖులు పోటీ చేస్తోన్న నియోజకవర్గాలపై అందరి దృష్టి నిలిచింది. సీఎం బసవరాజ బొమ్మై, సీఎల్పీ నేత సిద్దరామయ్య, కేపీసీసీ నేత డీకే శివకుమార్, యడియూరప్ప తనయుడు బీవై విజయేంద్ర, కుమారస్వామి, ఆయన కొడుకు నిఖిల్‌గౌడ తదితరుల నియోజకవర్గాల్లో గాలి ఎలా ఉందనేది చర్చనీయాంశమైంది. ప్రముఖులు కావడం, నియోజకవర్గాల్లో అన్ని విధాలా పట్టు ఉన్న మూలంగా వీరి విజయానికి ఢోకా లేకపోవచ్చనేది మెజారిటీ మాట. కానీ సమయం అనుకూలించకపోతే ఎవరికై నా పరాజయం తప్పదని అనేకసార్లు ఎన్నికల ఫలితాలు చాటిచెప్పాయి. శిగ్గావ్లో సీఎం బొమ్మైకు పరీక్ష హావేరి జిల్లా శిగ్గావ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సీఎం బసవరాజ్ బొమ్మై పోటీలో ఉన్నారు. బొమ్మై గత మూడు పర్యాయాలు 2008లో 12వేలు, 2013లో 9,600, 2018 ఎన్నికల్లో 9,200 మెజారిటీతో గట్టెక్కడం గమనార్హం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్ బరిలో ఉన్నారు. బొమ్మైకి లింగాయత్ వర్గాల ఓటర్ల బలముంటే, కాంగ్రెస్‌కు మైనారిటీ ఓటర్లు అండగా ఉన్నారు. ఈసారి పోటీ గట్టిగానే ఉండొచ్చని తెలుస్తోంది. చెన్నపట్టణలో కుమారకు పోటీ రామనగర జిల్లా చెన్నపట్టణ నుంచి జేడీఎస్ తరఫున మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌కు పెట్టని కోటగా చెన్నపట్టణను చెబుతారు. ప్రస్తుతం బీజేపీ తరఫున పోటీ చేస్తోన్న సీపీ యోగేశ్వర్ 1999, 2004, 2011, 2013 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. యోగేశ్వర్ ఒకసారి స్వతంత్ర, మరోసారి కాంగ్రెస్, ఇంకోసారి బీజేపీ, నాల్గోసారి ఎస్పీ నుంచి విజయం సాధించారు. 2018లో జేడీఎస్ తరఫున పోటీ చేసిన కుమారస్వామి స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. మరోసారి ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. వరుణలో సిద్దుకు తేలికేనా? మైసూరు జిల్లా వరుణలో కాంగ్రెస్ మాజీ సీఎం సిద్దరామయ్యకు ఎదురు లేదు. 2008, 2013 భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2018లో తనయుడు యతీంద్రను పోటీ చేసి గెలిపించారు. అయితే పక్క నియోజకవర్గమైన చాముండేశ్వరిలో నిలబడిన సిద్ధరామయ్య ఓడిపోయారు. ఈసారి వరుణ నుంచే బరిలో ఉన్నారు. ఆయనకు మంత్రి వి.సోమణ్ణ పోటీ చేస్తున్నారు. కనకపురలో ఇద్దరు దిగ్గజాలు కనకపురలో కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు ఓడిపోయింది లేదు. ఇక్కడ కాంగ్రెస్ – జేడీఎస్ మధ్యనే పోటీ ఉంటోంది. బీజేపీది మూడో స్థానమే. గతంలో జేడీఎస్ నుంచి డీకేశిపై పోటీ చేసి ఓడిన నారాయణగౌడ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీ నుంచి సీనియర్ మంత్రి ఆర్.అశోక్ డీకేను ఎదుర్కొంటున్నారు. ఇద్దరూ ఒకే వర్గానికి చెందినవారు, సమ ఉజ్జీలు కావడంతో ఈసారి ఏం జరుగుతుందా అనేద ఉత్కంఠ నెలకొంది. రామనగరలో తనయుని కోసం.. రామనగర నుంచి మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి తనయుడు నిఖిల్‌గౌడ జేడీఎస్ నుంచి బరిలో దిగారు. రామనగరలో 2004 నుంచి నాలుగుసార్లు హెచ్డీ కుమారస్వామి గెలుస్తూ వచ్చారు, గత ఎన్నికల్లో భార్య అనితకు అప్పజెప్పారు. ఉప ఎన్నికల్లో ఆమె కూడా గెలిచారు. ఈసారి తనయుడు పోటీలో ఉన్నాడు. దంపతులిద్దరూ కొడుకు కోసం ప్రచార వ్యూహాల్లో మునిగారు. విజయేంద్రకు ఢోకా లేదా! శివమొగ్గ జిల్లా శికారిపుర నుంచి మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప తనయుడు బీవై విజయేంద్ర బీజేపీ టికెట్‌తో పోటీలో ఉన్నారు. శికారిపురలో 1983 నుంచి 2018 వరకు ఒకసారి తప్ప యడియూరప్ప గెలుపొందారు. శికారిపుర అంటే యడియూరప్పే అనే పేరు వచ్చింది. ఈసారి వారసున్ని బరిలోకి దింపారు. గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు. -
మా నామినేషన్లు చెల్లకుండా చేసే కుట్ర
బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడితో పాటే అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కూడా తారస్థాయికి చేరుతోంది. తమ నామినేషన్లను ఏదోలా చెల్లకుండా చేసేందుకు బసవరాజ్ బొమ్మై సర్కారు భారీ కుట్రకు తెర తీస్తోందని పీసీసీ చీఫ్ శివకుమార్ మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తమ అభ్యర్థుల నామినేషన్లలో ఏదో ఒక లోపాన్ని వెతకాలని, అలాగే బీజేపీ నామినేషన్లలో ఏమైనా తప్పులుంటే సరి చేయాలని రిటర్నింగ్ ఆఫీసర్లందరి మీదా ఎంతగానో ఒత్తిడి తెస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు స్వయానా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే వారికి ఫోన్లు వెళ్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తక్షణం రంగంలోకి దిగి దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. సీఎంఓ కాల్ డీటైల్స్ తెప్పించుకుని పరిశీలించాలని సూచించారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి అంతూ పొంతూ లేకుండా పోతోందంటూ దుయ్యబట్టారు. ‘‘ఈ కుట్రకు సంబంధించి మా దగ్గర సాక్ష్యాలున్నాయి. సౌందత్తి ఎల్లమ్మ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నామినేషన్ పత్రాల్లో తప్పులున్నాయి. వాటిని సరిచేయాల్సిందిగా సీఎంఓ నుంచి ఆర్ఓకు ఫోన్ వెళ్లింది. ఇక నా నామినేషన్‌ను ఏదోలా తిరస్కరింపజేసేందుకు బీజేపీ తరఫున పెద్ద టీమే రంగంలోకి దిగింది. నా పరిస్థితే ఇలా ఉంటే ఇతర సాధారణ అభ్యర్థుల సంగతేమిటో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు. -
బొమ్మై నామినేషన్.. హాజరైన నడ్డా, సుదీప్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నామినేషన్ వేశారు. షిగ్గావ్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరపున బరిలో దిగుతున్న ఆయన.. బుధవారం నామినేషన్ పత్రాలను నిజయోకవర్గపు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్ సైతం ఆ సమయంలో బొమ్మై వెంట ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున కిచ్చా సుదీప్ స్టార్ క్యాంపెయినర్‌గా పని చేయనున్న విషయం విదితమే. అయితే తాను రాజకీయాల్లోకి రాకున్నా.. బొమ్మైతో ఉన్న అనుబంధం మేరకు ఈ ఎన్నికల్లో ఆయన తరపున ప్రచారం చేస్తానని సుదీప్ ఇదివరకే ప్రకటించారు. ఇక నామినేషన్ తరవ తర్వాత జేపీ నడ్డా మాట్లాడుతూ కర్ణాటకలో కమల వికాసం ఖాయమన్నారు. మే 10వ తేదీన ఒకే దఫాలో 224 నిజయోకవర్గాలకు పోలింగ్ జరగనుంది. మే 13వ తేదీన ఫలితాలు వెల్లడి అవుతాయి. దేశంలో తొలిసారిగా ఓట్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని వృద్ధులు, వికలాంగుల కోసం తీసుకురానుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇదీ చదవండి: కర్ణాటకలో బీజేపీకి ఊహించని పరిణామం -
బీజేపీ హైకమాండ్ ఆయనకు బిగ్ ఆఫర్ ఇచ్చింది: సీఎం బొమ్మై
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల వేళ కర్నాటక రాజకీయాల్లో ట్విస్టులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. అధికార బీజేపీ సీనియర్లు, సిట్టింగులను కాదని కొత్త ముఖాలకు బరిలోకి దింపింది. ఈ క్రమంలో సీనియర్లు కాషాయ పార్టీకి షాకిస్తూ.. ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. తాజాగా బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం జగదీష్ షెట్టర్.. ఆ పార్టీకి గుడ్ బై చెపారు. ఇక, ఆయన రాజీనామా కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై స్పందించారు. ఈ సందర్భంగా సీఎం బొమ్మై మాట్లాడుతూ.. మా పార్టీ హైకమాండ్ జగదీష్ షెట్టర్‌కు ఢిల్లీలో పెద్ద పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. షెట్టర్ కర్నాటకలో సీనియర్ నాయకుడు, కీలక నేత. అందుకే ఆయనకు పెద్ద పదవి ఇస్తామని జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా వాగ్దానం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల కోసం మేము మూడో జాబితాపై చర్చించాము. మా సిఫార్సులను పార్లమెంటరీ బోర్డుకు పంపించాము. అభ్యర్థులను వారే ఖరారు చేస్తారు. ఈ సందర్బంగా జగదీష్ షెట్టర్‌కు సీటుపై చర్చించలేదని స్పష్టం చేశారు. ఇక, అంతకు ముందు.. బీజేపీ పెద్దలు మాజీ సీఎం షెట్టర్‌ను కలిసి గవర్నర్ లేదా కేంద్రమంత్రి పదవి ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే, ఈ ఆఫర్‌ను షెట్టర్ తిరస్కరించారు. తన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మాత్రమే పనిచేయాలని అనుకుంటున్నానని, పెద్ద పదవిపై ఆశ లేదని అన్నారు. ఇక, నాటకీయ పరిణామాల మధ్య జగదీష్ షెట్టర్ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా షెట్టర్.. కర్నాటకలోని కొందరు బీజేపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. కొంత మంది తమ స్వలాభం కోసం పార్టీని తప్పుగా నిర్వహిస్తున్నారని అన్నారు. రాష్ట్ర పరిస్థితులపై తప్పుగా నివేదికలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఇక, తాను కాంగ్రెస్‌లో చేరే అంశంపై ఇంకా నిర్ణయించుకోలేదని స్పష్టం చేశారు. #KarnatakaElections2023| "We have discussed the third list, shortly it is going to come out. We've sent our recommendations to Parliamentary board & they will take a call...we've not discussed about Jagadish Shettar", says Karnataka CM Basavaraj Bommai after the BJP meeting over… pic.twitter.com/1GSjZnRFob — ANI (@ANI) April 16, 2023 -
సొంత వాహనం లేని ముఖ్యమంత్రి.. రూ.5.79 కోట్లు అప్పు ఉందట..!
బనశంకరి: సీఎం బొమ్మై నామినేషన్ సందర్భంగా అఫిడవిట్లో మొత్తం రూ.5.98 కోట్ల చరాస్తులు, రూ.22.95 కోట్ల స్థిరాస్తి కలిగి ఉన్నట్లు ప్రకటించారు. సొంత వాహనం లేదని, అయితే రూ.5.79 కోట్లు అప్పు ఉందని తెలిపారు. ఇక సతీమణికి ఎలాంటి స్థిరాస్తి లేదని, రూ.1.14 కోట్ల విలువచేసే చరాస్తి ఉన్నట్లు తెలిపారు. కుమార్తె పేరుతో రూ.1.28 కోట్ల చరాస్తులు ఉన్నాయి. తన చేతిలో రూ.3 లక్షల నగదు, భార్య వద్ద రూ.50,000 నగదు, కుమార్తె అదితి బొమ్మై వద్ద రూ.25,000 నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. బొమ్మై పేరిట వివిధ బ్యాంకుల్లో రూ.40 లక్షలకు పైగా డిపాజిట్లు, భార్య పేరుతో రూ.27.7 లక్షల డిపాజిట్లు ఉన్నాయి. పలు కంపెనీల్లో రూ.3.23 కోట్లు పెట్టుబడి పెట్టగా, భార్య రూ.7 లక్షలు, కుమార్తె రూ.23 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టారు. బొమ్మై వద్ద రూ. 1.50 కోట్ల బంగారు నగలు బొమ్మై వద్ద రూ.1.50 కోటికి పైగా విలువచేసే బంగారు నగలు, భార్య వద్ద రూ.78.83 లక్షల విలువ చేసే నగలు, కుమార్తె వద్ద రూ.53.84 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలు ఉన్నాయి. బొమ్మై పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి మొత్తం రూ.5.79 కోట్లు రుణం తీసుకున్నారు. బెంగళూరు యలహంక, హుబ్లీలో తలా ఎకరా వ్యవసాయేతర భూమి ఉంది. హుబ్లీలో 4 పొలం ఉంది, పలు నగరాల్లో వాణిజ్య కట్టడాలు ఉన్నాయి. బెంగళూరు ల్యావెల్లి రోడ్డులో, ఆర్టీ.నగరలో ఇళ్లు కూడా ఉన్నాయి. -
కర్ణాటకలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ
-
సీఎం వెంట కాంతార రిషబ్.. బీజేపీ తరపున ప్రచారం చేస్తారా?
యశవంతపుర: సీఎం బొమ్మై రాష్ట్రంలో దేవస్థానాల సందర్శన చేపట్టారు. గురువారం కొల్లూరు మూకాంబిక దేవస్థానాన్ని సతీసమేతంగా దర్శించారు. ఈ సమయంలో కాంతార నటుడు రిషబ్‌శెట్టి కూడా సీఎం వెంట ఉండడం విశేషం. తరువాత సీఎం విలేకరులతో మాట్లాడుతూ రిషబ్‌శెట్టి అనుకోకుండా కలిశారని చెప్పడం గమనార్హం. సీఎం వెంట మంత్రి కోట శ్రీనివాస పూజారి, ప్రమోద్ మధ్వరాజ్‌లున్నారు. జిల్లాకు చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు గైరాజరయ్యారు. కాగా, ఉడుపి జిల్లా శిరూరు వద్ద సీఎం హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగా అక్కడికి వంద మీటర్ల దూరంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. హెలికాప్టర్ యథావిధిగా టేకాఫ్ అయ్యింది. కాగా ఇటీవల సినీనటుడు కిచ్చా సుదీప్ బహిరంగంగానే సీఎం బసవరాజ్ బొమ్మై, బీజేపీకి మద్దతు ప్రకటించారు. దీని తర్వాత సీఎం బసవరాజ బొమ్మైతో కాంతారావు నటుడు రిషబ్ శెట్టి కనిపించడం ఆసక్తిని రేకెత్తించింది. కిచ్చా సుదీప్ లాగా కాంతారావు కూడా బీజేపీ తరపున ప్రచారం చేస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
బీజేపీలోకి కిచ్చా సుదీప్! ఎన్నికల్లో పోటీపై నటుడి క్లారిటీ
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపే, జేడీఎస్ వంటి పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో త్రిముఖ పోరు నడుస్తోంది. వివిధ పార్టీల నుంచి నేతలను ఆకర్షించడంతోపాటు.. సినీ తారలను కూడా తమ వైపు తిప్పుకునేందుకు ఆయా పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బీజేపీలో చేరుతున్నట్లు, కమలం గుర్తు తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే. ఇందుకు సుదీప్ బుధవారం బెంగళూరులోని ఓ ప్రైవేటు హోటల్ సీఎం బసవరాజ్ బొమ్మై, ఇతర నేతలతో సమావేశమవ్వడమే కారణం. తాజాగా ఈ వార్తలపై సుదీప్ స్పందించారు. తాను బీజేపీ తరపున కేవలం ప్రచారంలో మాత్రమే పాల్గొంటానని తెలిపారు. పార్టీలో చేరడం లేదని, ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుదీప్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం బొమ్మైతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిపై ఉన్న అభిమానం, గౌరవంతో బీజేపీ తరపున ప్రచారం చేయనున్నట్లు పేర్కొన్నారు. బొమ్మై వ్యక్తిగతంగా జీవితంలో చాలాసార్లు సాయం చేశారని.. దానికి కృతజ్ఞతగా తాను ఈ విధంగా చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఇది పార్టీ కోసం కాదని చెప్పారు. ‘జీవితంలో నాకు చాలా మంది నాకు అండగా నిలిచారు. ఎంకరేజ్ చేశారు. వారిలో సీఎం బొమ్మై ఒకరు. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే ఆయన కోసమే. పార్టీ కోసం కాదు’ అని తెలిపారు. అంతేగాక ఎన్నికల్లో పోటీ చేయడం తనకు ఇష్టం లేదనే విషయాన్ని ఇప్పటికే సీఎంకు చెప్పిన్నట్లు పేర్కొన్నారు. కాగా వచ్చేనెల 10న రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. 13న ఫలితాలు వెలువడుతాయి. చదవండి: సుప్రీంకోర్టులో విపక్షాలకు షాక్.. సీబీఐ, ఈడీపై పిటిషన్ తిరస్కరణ.. -
Video: సీఎం బొమ్మై కారును అడ్డగించిన అధికారులు.. ఆకస్మిక తనిఖీలు
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రయాణిస్తున్న కారును ఎన్నికల సంఘం అధికారులు అడ్డుకున్నారు. శుక్రవారం చిక్కబళ్లాపుర జిల్లాలోని ఆలయానికి వెళ్తుండగా బొమ్మై వాహనాన్ని ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఆపింది. సీఎం కారులో కారులో తనిఖీలు చేపట్టింది. బొమ్మై కారును అధికారులు తనిఖీ చేస్తన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడదలవ్వడంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది. ఈ క్రమంలో బొమ్మై తన అధికారిక వాహనాన్ని అధికారులకు సరెండర్ చేశారు. శుక్రవారం ఓ ప్రైవేటు కారులో ఘాటి సుబ్రమణ్య స్వామి ఆలయానికి వెళ్తుండగా హోసహుద్య చెక్‌పోస్టు వద్ద అధికారులు ఆపారు. అయితే బొమ్మై కారులో అభ్యంతరకరమైనవేవి గుర్తించలేదని అధికారులు తెలిపారు. సాధారణ తనిఖీ అనంతరం ఆయన వాహనం వెళ్ళడానికి అనుమతించినట్లు పేర్కొన్నారు. #WATCH | Karnataka CM Basavaraj Bommai's car checked by the Flying Squad team of the Election Commission as he was on his way to Sri Ghati Subramanya Temple in Doddaballapur Model Code of Conduct is enforced in the State in view of the May 10 Assembly elections. pic.twitter.com/esBkFcIMAL — ANI (@ANI) March 31, 2023 కాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను బుధవారం ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. మే 10న ఎన్నికలు జరుగనుండగా.. మే 13న కౌంటింగ్ ఉండనుంది. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలు ఉండగా, బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. -
కాంగ్రెస్‌కే జై కొడుతున్న కన్నడిగులు.. సీఎంగా మాత్రం ఆయనే కావాలట..!
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 224 స్థానాలకు ఒకే విడతలో మే 10 న పోలింగ్ జరగనుంది. 13న కౌంటింగ్ చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. అయితే ఈసారి అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంతా అనుకుంటున్నారు. స్థానిక పార్టీ జేడీఎస్ కూడా సత్తా చాటి కింగ్ మేకర్‌గా అవతరిస్తుందనే అంచనాలున్నాయి. కానీ సీఓటర్ నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో మాత్రం ఫలితాలు ఏకపక్షంగా ఉన్నాయి. కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సాధించి అధికారం చేజిక్కించుకుంటుందని ఈ సర్వే తేల్చింది. అధికార బీజేపీ ప్రభుత్వంపై 57 శాతం మంది తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు పేర్కొంది. సీఎం బసవరాజ్ బొమ్మై పనితీరు పేలవంగా ఉందని సర్వేలో పాల్గొన్న 47శాతం మంది అభిప్రాయపడ్డారు. కేవలం 26.8 శాతం మంది ఆయన పాలన బాగుందన్నారు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్‌కు 115-127 సీట్లు, బీజేపీకి 68-80, జేడీఎస్‌కు 23-35 సీట్లు వస్తాయని సీఓటర్ సర్వే తెలిపింది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం (29.1 శాతం) మౌలిక సదుపాయాల కల్పన(21.5శాతం)పై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సీఎంగా ఆయనే.. ఈ ఒపీనియన్ పోల్‌లో కర్ణాటక తదుపరి సీఎంగా ఎవరైతే బాగుంటుందనే విషయంపైనా ఓటింగ్ నిర్వహించారు. 39.1శాతం మంది కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యకే జై కొట్టారు. బసవరాజ్ బొమ్మై కావాలని 31.1 శాతం మంది తెలిపారు. హెచ్డీ కుమారస్వామికి 21.4 శాతం మంది ఓటేశారు. ఇక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు కేవలం 3.2 శాతం మంది అనుకూలంగా ఉన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ చాలా కాలంగా బలమైన పార్టీగా ఉంటోంది. 2008 ఎన్నికల్లో ఓడిపోయి 80 సీట్లే గెలిచిన ఆ పార్టీ.. 2013లో తిరిగి పుంజుకుని 122 సీట్లు కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చింది. 2018లో మళ్లీ 80 సీట్లే గెల్చుకుంది. అయినా జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఏడాదికే ఈ సర్కార్ కూలిపోవడంతో బీజేపీ అధికారం కైవసం చేసుకుంది. మరోవైపు మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఇప్పటికే ప్రకటించారు. తనకు 80 ఏళ్లు దగ్గరపడుతున్నందున ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. పార్టీ బలోపేతం కోసం మాత్రం తనవంతు కృషి చేస్తానన్నారు. కాగా.. ఈసారి కాంగ్రెసే అధికారంలోకి వస్తుందని ఇటీవలే కన్నడ వార్త పత్రిక సర్వేలో తేలిందని వార్తలొచ్చాయి. ఇందుకు సంబంధించి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అది ఫేక్ అని తేలింది. ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని, బీజేపీనే మరోసారి అధికారంలోకి వస్తుందని సీఎం బసవరాజ్‌బొమ్మైతో పాటు ఇతర బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఫేక్ సర్వేపై మండిపడ్డారు. చదవండి: రాహుల్ గాంధీని కోర్టుకు ఈడుస్తా.. కాంగ్రెస్ నేతపై లలిత్ మోదీ ఫైర్.. -
కర్ణాటకలో మూడు ముక్కలాట!
అధికార వ్యతిరేకతకు ఎదురొడ్డి 40 ఏళ్ల చరిత్రను తిరగరాయాలని తహతహలాడుతూ బీజేపీ.. కన్నడ నాట పార్టీ జెండా ఎగురవేసి 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని పొందాలని కాంగ్రెస్.. కన్నడ ఆత్మగౌరవ నినాదాన్ని మరింత రాజేసి కింగ్‌మేకర్ స్థాయి నుంచి కింగ్‌గా మారాలని జేడీ(ఎస్).. పార్టీ ల వ్యూహ ప్రతివ్యూహాలతో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి సాక్షి, నేషనల్ డెస్క్ : కర్ణాటక ఓటర్లు ప్రతీసారి ఒకే తీర్పు ఇవ్వడం లేదు. ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 1985 నుంచి ఏ పార్టీ కూడా వరసగా రెండోసారి గెలవలేదు. ఈసారీ అదే సంప్రదాయం కొనసాగుతుందా, అధికార బీజేపీకి మళ్లీ పట్టం కడతారా అన్నది ఉత్కంఠగా మారింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రభుత్వంపై అధికార వ్యతిరేకతను ప్రధాని మోదీ ఇమేజీతో ఎదుర్కొనే వ్యూహంతో బీజేపీ ముందుకు వెళుతోంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో 150 సీట్లు గెలవడం లక్ష్యంగా పెట్టుకుంది. బలహీనంగా ఉన్న పాత మైసూరు (ఉత్తర కర్ణాటక)లో బలపడటంపై దృష్టి పెట్టింది. 89 స్థానాలున్నా ప్రాంతంలో మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తరచూ పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అంతగా బలంగా లేకపోవడం, బొమ్మై ప్రభుత్వంపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదాన్నే వారు నమ్ముకున్నారు. 100 సీట్లలో కీలకమైన లింగాయత్ ఓటు బ్యాంకును నమ్ముకుంది. బీజేపీ ఇలా కేంద్ర నాయకత్వాన్ని నమ్ముకుంటే, కాంగ్రెస్‌కు స్థానిక నాయకత్వమే బలంగా ఉంది. పీసీసీ చీఫ్ డి.కె శివకుమార్, సీనియర్ నేత సిద్ధరామయ్య కుడి, ఎడమ భుజాలుగా ఉన్నారు. ముస్లింల 4 శాతం రిజర్వేషన్ల రద్దు, ధరల పెరుగుదల, హిజాబ్ వంటివాటిపై పార్టీ దృష్టి పెట్టింది. ప్రభుత్వ అవినీతిని ప్రధానాస్త్రంగా మలచుకుంటోంది. జేడీ(ఎస్) కన్నడ ఆత్మగౌరవ నినాదంతో ఉనికిని కాపాడుకునే పనిలో ఉంది. మాజీ సీఎం హెచ్.డి.కుమారస్వామి అంతా తానై నడుపుతున్నారు. ముక్కోణ పోరులో విజయం ఎవరిదోనన్న ఉత్కంఠ నెలకొంది.... బీజేపీ.. అనుకూలం.. ♦ ప్రధాని మోదీ ఇమేజ్. కేంద్ర నేతలు చేస్తున్న పర్యటనలు. డబుల్ ఇంజిన్ నినాదం. ♦ సంఘ పరివార్ సంస్థాగత బలం. ♦లింగాయత్ సామాజిక వర్గం మద్దతు, వక్కలిగ అనుకూల వైఖరితో మైసూర్ ప్రాంతంలో పెరుగుతున్న పట్టు. ♦ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు. ♦ డిజిటల్ మీడియా ప్రచారంలో పార్టీ కున్న పట్టు. వ్యతిరేకం.. ♦ ప్రభుత్వ వ్యతిరేకత, బొమ్మై ♦ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు. ♦ 40% కమీషన్ల ప్రభుత్వమన్న విపక్షాల ఉధృత ప్రచారం. ♦ ఎన్నికలకు ముందు మైనార్టీ ల ఓబీసీ కోటా రద్దుతో ముస్లింలు పార్టీకి మరింత దూరం. ♦ టికెట్ దక్కే అవకాశం లేని ఆశావహుల అసమ్మతి. జేడీ(ఎస్) అనుకూలం.. ♦ వక్కలిగ సామాజిక వర్గం మద్దతు. ♦ కన్నడ ఆత్మగౌరవం నినాదం మిన్నంటుతున్న వేళ ప్రాంతీయ పార్టీ గా ఉన్న ఇమేజ్. ♦ రైతు అనుకూల విధానాలతో గ్రామీణ ప్రాంతాల్లో పట్టు. ♦ హంగ్ వస్తే బీజేపీ, కాంగ్రెస్‌ల్లో ఎవరికైనా మద్దతివ్వగల వైఖరి. వ్యతిరేకం.. ♦ కుటుంబ పార్టీ ముద్ర. ♦ వక్కలిగ మినహా మిగతా సామాజిక వర్గాల ఆధిపత్యమున్న ప్రాంతాల్లో ఎదగకపోవడం. ♦ సొంత బలంపై పార్టీ అధికారంలోకి వచ్చే సత్తా లేకపోవడం.. చాలాచోట్ల గెలుపు గుర్రాలు లేకపోవడం. ♦ 2018 నుంచి పార్టీ నుంచి కొనసాగుతున్న వలసలు. కాంగ్రెస్ అనుకూలం ♦ బలమైన స్థానిక నాయకత్వం. ♦ బీజేపీ హిందూత్వ ఎజెండాను ఎదుర్కోవడానికి అనుసరిస్తున్న అహిండా (మైనార్టీలు, వెనుకబడిన తరగతులు, దళితుల) సోషల్ ఇంజనీరింగ్ విధానంతో. తద్వారా వర్గాల ఓటు బ్యాంకును ఆకట్టుకునే ప్రయత్నం. ♦ బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలపై పేసీఎం, 40% కమీషన్ అంటూ చేస్తున్న ప్రచారం. ♦ కర్నాటకకు చెందిన దళిత నేత మల్లిఖార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడయ్యాక వస్తున్న తొలి ఎన్నికలు కావడంతో ఆ వర్గం ఓటు బ్యాంకును కొల్లగొట్టే అవకాశం. ♦ గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గ్రాడ్యుయేట్లకు రూ.3,000 నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.2,000 ఆర్థిక సాయం వంటి హామీలు. వ్యతిరేకం ♦ శివకుమార్, సిద్దరామయ్య వర్గాల మధ్య పోరు. ♦ జి.పరమేశ్వర, హెచ్.కె.పాటిల్, కె.హెచ్.మునియప్ప వంటి నేతల్ని పక్కన పెట్టడంతో అసమ్మతి. కీలకమైన లింగాయత్ సామాజిక వర్గంలో ఓటు బ్యాంకును పెంచుకోలేకపోవడం. ♦ ప్రధాని మోదీ ఇమేజ్‌కి దీటైన కేంద్ర నాయకత్వం లేకపోవడం. ♦ ఆశావహులు ఎక్కువవటంతో అసమ్మతి భగ్గుమనే ఆస్కారం. కాంగ్రెస్‌దే అధికారం..! కర్ణాటక ఎన్నికల నగారా మోగిన రోజే విడుదలైన ఏబీపీ–సీఓటర్ ఎన్నికల సర్వే కాంగ్రెస్ పార్టీ యే అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 115 నుంచి 127 సీట్లు వస్తాయని, బీజేపీ 68–80 సీట్లు గెలుచుకుంటే జేడీ (ఎస్) 23–25 సీట్లతో సరిపెట్టుకుంటుందని సీ ఓటర్ సర్వేలో తేలింది. బసవరాజ్ బొమ్మై పరిపాలన అసలు బాగోలేదని సర్వేలో పాల్గొన్న ఏకంగా 50.5%మంది తేల్చి చెప్పారు. 57శాతం మంది ప్రస్తుత ప్రభుత్వం మారిపోవాలని అభిప్రాయపడినట్టు ఆ సర్వే వెల్లడించింది. -
కన్నడనాట రిజర్వేషన్ల రగడ
అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని బీజేపీ సర్కారు రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపింది. ఓబీసీ కోటాలో ముస్లింలకు అందుతున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ గత వారం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఆ 4 శాతాన్ని బీజేపీకి గట్టి ఓటు బ్యాంకైన వక్కలిగలు, లింగాయత్‌లకు సమానంగా పంచడంపై కలకలం రేగుతోంది. ఈ పరిణామం విపక్ష కాంగ్రెస్‌కు మింగుడు పడటం లేదు. ఇవి ఓటు బ్యాంకు రాజకీయాలని విమర్శిస్తూనే, తాము అధికారంలోకి వస్తే ముస్లింల కోటాను పునరుద్ధరిస్తామంటూ హస్తం పార్టీ తాజాగా ఎన్నికల హామీ ఇచ్చింది. మరోవైపు ఎస్సీ రిజర్వేషన్లను ఉప కులాలవారీగా విభజించిన తీరుతో తమకు అన్యాయం జరిగిందంటూ బంజారాలు, ఆదివాసీలు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు... ఏం జరిగింది? కర్ణాటకలో ముస్లింలను ఓబీసీ జాబితాలోని 2బీ కేటగిరీ నుంచి తొలగిస్తూ బొమ్మై ప్రభుత్వం వారం క్రితం నిర్ణయం తీసుకుంది. ఓబీసీ కోటాలో భాగంగా విద్య, ఉద్యోగాల్లో వారికి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేసింది. వాటిని లింగాయత్‌లు, వక్కలిగలకు చెరో 2 శాతం చొప్పున పంచింది. ముస్లింలను ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనకబడ్డ వర్గాల) జాబితాకు మారుస్తున్నట్టు సీఎం బొమ్మై చెప్పుకొచ్చారు. ‘‘మతాధారిత రిజర్వేషన్లకు రాజ్యాంగంలో చోటు లేదు. ముస్లింలకు ఇకనుంచి 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అందుబాటులో ఉంటాయి’’అన్నారు. కాంగ్రెస్ ఏమంటోంది? ముస్లింలను ఓబీసీ జాబితా నుంచి ఏ ప్రాతిపదికన తొలిగించారంటూ కాంగ్రెస్ మండిపడింది. ఇది మతాల మధ్య మంటలు రాజేసే యత్నమంటూ దుయ్యబట్టింది. ముస్లింల 4 శాతాన్ని తమకు పంచడంపై లింగాయత్‌లు, వక్కలిగలు కూడా సంతోషంగా లేరని చెప్పుకొచ్చింది. ‘‘ముస్లింలను ఓబీసీ నుంచి ఈడబ్ల్యూఎస్ కోటాకు మార్చడం రాజ్యాంగవిరుద్ధం. ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఏ మతానికి, కులానికి చెందిన వారైనా జనరల్ కేటగిరీ అయిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాకు అర్హులే అవుతారు. అలాంటి కోటాకు ముస్లింలను మార్చి, వారికేదో కొత్తగా 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు బీజేపీ చెప్పుకోవడం విడ్డూరం’’అంటూ మండిపడింది. తాము అధికారంలోకొస్తే వారికి 4 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామని ప్రకటించింది. భగ్గుమన్న బంజారాలు, ఆదివాసీలు విద్య, ఉద్యోగాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లను 15 నుంచి 17 శాతానికి, ఎస్టీలకు 4 నుంచి 7 శాతానికి బీజేపీ సర్కారు గత డిసెంబర్లో పెంచింది. అయితే వారిలో అణగారిన ఉప కులాల వారికి రిజర్వేషన్ల ఫలాలు అందకుండా బలవంతులైన కొన్ని ఉప కులాల వాళ్లే వాటిని అత్యధికంగా చేజిక్కించుకుంటున్నారన్న ఫిర్యాదు చాలాకాలంగా ఉంది. ఈ అసమానతలను సరిచేయాలన్న వారి చిరకాల డిమాండ్‌పై బొమ్మై ప్రభుత్వం ఇటీవలే రంగంలోకి దిగింది. 101 ఎస్సీ కులాల వారికి సమ న్యాయం చేసేందుకు అంతర్గత రిజర్వేషన్లను నిర్ణయించింది. ► ఆ మేరకు రాజ్యాంగంలోని 341(2) ఆర్టికల్ ప్రకారం ఎస్సీలను 4 విభాగాలుగా వర్గీకరించారు. ఎస్సీ (లెఫ్ట్)కు 6 శాతం రిజర్వేషన్లు కేటాయించింది. ఆ జాబితాలోకి మాదిగ, ఆది ద్రవిడ, బాంబి ఉపకులాలు వస్తాయి. ► ఎస్సీ (రైట్)కు 5.5 శాతం కేటాయించింది. ఆది కర్ణాటక, హోలెయా, చలవాది ఉప కులాలు దీని కిందికి వస్తాయి. బంజారా, భోవి, కొరచ, కొరమలకు 4.5 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. ► మిగిలిన ఒక్క శాతం సంచార, ఆదివాసీ జాతులైన అలెమరి, ఆరె అలెమరిలకు దక్కుతుంది. ► దీన్ని బంజారా, భోవి కులాలవాళ్లు తీవ్రంగా నిరసిస్తున్నారు. తమకు తీరని అన్యాయం జరిగిందంటూ ఆందోళనలకు దిగారు. తాజాగా మాజీ సీఎం యడ్యూరప్ప నివాసంపై రాళ్లు రువ్వడం అందులో భాగమే. వక్కలిగ, లింగాయత్... బలీయమైన ఓటు బ్యాంకులు వక్కలిగలు, లింగాయత్‌లు కర్ణాటకలో బలమైన సామాజిక వర్గాలు. బలీయమైన ఓటు బ్యాంకులు కావడంతో ఎన్నికల్లో వాటి ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. బెంగళూరు నగర నిర్మాత కెంపె గౌడది వక్కలిగ సామాజిక వర్గమే. రాష్ట్రంలో గత, ప్రస్తుత రాజకీయ ప్రముఖుల్లో చాలామంది ఈ కులాలకు చెందినవారే. ► పలు నివేదికల ప్రకారం రాష్ట్ర జనాభాలో లింగాయత్‌లు 17 శాతం ఉంటారు. ► మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 100 చోట్ల వీరు ఫలితాలను శాసించే స్థితిలో ఉన్నారు. ► లింగాయత్‌లు రెండు దశాబ్దాలకు పైగా బీజేపీకి గట్టి మద్దతుదారులుగా ఉంటూ వస్తున్నారు. ► ఇక వక్కలిగలు జనాభాలో 11% ఉన్నట్టు అంచనా. కానీ తాము నిజానికి 16 శాతం దాకా ఉంటామన్నది వీరి వాదన. ► తొలుత ప్రధానంగా వ్యవసాయదారులైన వక్కలిగలు స్వాతంత్య్రానంతరం పలు రంగాలకు విస్తరించి పట్టు సాధించారు. ► తమకు రిజర్వేషన్లు పెంచాలంటూ ఈ రెండు సామాజిక వర్గాలూ కొద్ది నెలలుగా బొమ్మై ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. లేదంటే ఈసారి బీజేపీకి ఓటేసేది లేదంటూ భీష్మించుకున్నాయి. ► తాజాగా ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను వీరికి పంచడంతో వక్కలిగల రిజర్వేషన్లు 4 నుంచి 6 శాతానికి, లింగాయత్‌లకు 5 నుంచి 7 శాతానికి పెరిగాయి. -
బీజేపీకి సీనియర్ నేత గుడ్‌బై.. కాషాయ పార్టీలో ఏం జరుగుతోంది?
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల వేళ కర్నాటకలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, ఎమ్మెల్సీ బాబురామ్ చించనసూర్.. బీజేపీకి రాజీనామా చేశారు. ఇక, మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్‌లో చేరేందుకు ముహుర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అయితే, నెల రోజుల వ్యవధిలో ఇద్దరు బీజేపీ నేతలు కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పడం చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. బీజేపీ ఎమ్మెల్సీ బాబూరావ్ చించనసూర్ రాజీనామా చేశారు. ఈ క్రమంలో తన రాజీనామా లేఖను శాసన మండలి చైర్మెన్ బసవరాజ్ హొరట్టికి సమర్పించారు. అయితే, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బాబూరావు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలని(ఎమ్మెల్యే) నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన నిర్ణయానికి నో చెప్పడంతో పార్టీని వీడినట్టు తెలుస్తోంది. ఈనెల 25వ తేదీని బాబూరావ్.. కాంగ్రెస్‌లో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కొద్దిరోజుల క్రితమే బీజేపీ నేత పుట్టన్న కాషాయ పార్టీని వీడారు. అనంతరం, కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా కర్నాటకలో బస్వరాజు బొమ్మై సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. బొమ్మై ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, మరో మూడు నెలల్లో కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్ జోరుగా ప్రచారానికి ప్లాన్ చేస్తున్నాయి. ఇది కూడా చదవండి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు... 80 మందితో ఆప్ జాబితా -
నేనెందుకు రాజీనామా చేయాలి? : సీఎం బొమ్మై
హుబ్లీ: రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతానికి మహారాష్ట్ర సర్కారు నుంచి నిధులు కేటాయిస్తే తానెందుకు రాజీనామా చేయాలని సీఎం బొమ్మై ప్రశ్నించారు. బెళగావిలో ఆయన మీడియాతో మాట్లాడారు. డీకే.శివకుమార్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.54 కోట్లను విడుదల చేసిన అంశంపై కేపీసీసీ అధ్యక్షులు డీకే.శికుమార్ తన రాజీనామాకు డిమాండ్ చేసిన విషయంపై సీఎం పైవిధంగా స్పందించారు. తాము కూడా మహారాష్ట్రలోని పండరాపుర, తులజాపుర వెళ్లిన కర్ణాటక వారికి నిధులు విడుదల చేశామన్నారు. మహారాష్ట్ర సర్కారు ఏ నిధులు మంజూరు చేసిందో పరిశీలిస్తానన్నారు. మహారాష్ట్ర అభ్యంతరాలను ఏ విధంగా ఎదుర్కోవాలో సమీక్షిస్తానన్నారు. నేల, నీరు, భాష సరిహద్దు రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు అనవసరంగా రాష్ట్ర ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఆ తర్వాత ఆయన హుబ్లీకి వచ్చి స్వగ్రామంకమడొళ్లిలోని బంధువులను, స్నేహితులను కలిసి ఎంతో ఉద్వేగానికి గురయ్యారు. -
కర్ణాటక ఎన్నికల ప్రచార కమిటీ సారథిగా సీఎం బొమ్మై
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీకి మరికొద్ది నెలల్లో జరగనున్న ఎన్నికలకు బీజేపీ సమాయత్తమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను నియమించింది. అదేవిధంగా ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజెను ప్రకటించింది. ఎన్నికల ప్రచార కమిటీ సభ్యుడిగా మాజీ సీఎం యెడియూరప్పను నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు కమిటీలకు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన లింగాయత్, వొక్కలిగ కులాలకు చెందిన బొమ్మై, కరంద్లాజెలకు సారథ్య బాధ్యతలు అప్పగించడం ద్వారా బీజేపీ జాతీయ నాయకత్వం సమతూకం సాధించేందుకు ప్రయత్నించింది. -
విద్యార్థులు, మహిళా ఉద్యోగులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఎక్కడంటే?
బెంగళూరు: పాఠశాల విద్యార్థులు, మహిళా ఉద్యోగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై మంగళవారం ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నారు. కేఎస్ఆర్టీసీ వోల్వో బస్సుల ప్రారంభోత్సవం సందర్భంగా ఈ హామీ ఇచ్చారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహిళా ఓటర్లను ఆకట్టునే ప్రయత్నం చేశారు. కొత్త పథకంలో భాగంగా విద్యార్థుల కోసం మరిన్ని మినీ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీఎం చెప్పారు. ఒక్కో తాలుకాలో కనీసం ఐదు బస్సులు నడిచేలా చూస్తామన్నారు. అవసరమైతే దీని కోసం అదనపు నిధులు విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఆర్థిక అభివృద్ధిలో రవాణా ముఖ్య పాత్ర పోషిస్తుందని బొమ్మై చెప్పారు. అందుకే తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మహిళా ఉద్యోగులు, విద్యార్థులకు ఉచిత పాసులు ఇస్తామని బడ్జెట్ సమావేశాల్లోనే చెప్పినట్లు గుర్తుచేశారు. చదవండి: మనీశ్ సిసోడియాకు భారీ షాక్.. స్నూపింగ్ కేసు విచారణకు కేంద్రం ఆమోదం..