bear
-
ఎనిమిదేళ్లలో తొలిసారి కనిపించిన ధ్రువ ఎలుగుబంటి.. పోలీసులు ఏం చేశారంటే!
ఐస్లాండ్లోని ఒక మారుమూల గ్రామంలోని కనిపించిన అరుదైన ధ్రువ ఎలుగుబంటిని స్థానిక ప్రజలకు ముప్పుగా భావించి పోలీసులు కాల్చి చంపారు. అయితే ముందుగా ఎలుగుబంటిని తరలించడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ విఫలం కావడంతో చంపాల్సి వచ్చందని వెస్ట్ఫ్జోర్డ్స్ పోలీస్ చీఫ్ హెల్గి జెన్సన్ తెలిపారు.ఆ ఎలుగుబంటి ఓ ఇంటికి సమీపంలోకి వచ్చిందని చెప్పారు. ఆ ఇంట్లో ఓ వృద్ధురాలు ఉందని, ఎలుగుబంటినిచూసి ఆమె భయంతో మేడపైకి వెళ్లి దాక్కుందని పేర్కొన్నారు. సాయం కోసం తన కుమార్తెకు చెప్పగా.. పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఎలుగుబంటి ద్వారా వృద్ధురాలి ప్రాణాలకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందో అని దాన్ని కాల్చినట్లు పోలీసులు తెలిపారు.ధృవపు ఎలుగుబంట్లు ఐస్లాండ్కు చెందినవి కావు, అయితే కొన్నిసార్లు మంచు గడ్డలపై గ్రీన్లాండ్ నుంచి ఒడ్డుకు చేరుకుంటాయి. 2016లో ఐస్‌ల్యాండ్‌లో మొదటిసారి కనిపించింది ఇవి 150 నుంచి 200 కిలోల బరువు ఉంటాయి. ధృవపు ఎలుగుబంట్లు మానవులపై దాడి చేయడం చాలా అరుదు. 2017లో వైల్డ్‌లైఫ్ సొసైటీ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. వాతావరణ మార్పుల కారణంగా సముద్రపు మంచు కోల్పోవడం వల్ల ఆకలితో ఉన్న ఎలుగుబంట్లు జనావాసాల్లోకి రావడం ప్రారంభించాయని తెలిపింది. దీని వల్ల మానకులకు ప్రమాదం పెరిగిందని పేర్కొంది. వీటి వల్ల, మానవులకు లేదా పశువులకు ముప్పు కలిగిస్తే అధికారులు వాటిపై చర్యలు తీసుకునే అధికారం ఉంటుది. -
కరెంటు షాక్‌తో ఎలుగుబంటి మృతి
మల్కన్‌గిరి: జిల్లాలోని మల్కన్‌గిరి సమితి సీక్‌పల్లి పంచాయతీ ఎంవీ 17 గ్రామం వద్ద మంగళవారం రాత్రి అంగన్వాడీ కేంద్రం వద్దనున్న ట్రాన్స్ఫార్మర్ వైరు తగిలి ఒక ఎలుగుబంటి మృతి చెందింది. బుధవారం ఉదయం అటుగా వెళ్లిన రైతులు చూసి మల్కన్‌గిరి అటవీ శాఖ వారికి సమాచారం ఇవ్వగా, వారు వెళ్లి చూసేసరికి మృతి చెందింది. దీంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని అటవీ శాఖ అడవిలో పూడ్చివేశారు. -
ఎలుగుబంట్లలో రకాలెన్ని? ఏ ఎలుగుబంటి ప్రమాదకరం?
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 23న ‘వరల్డ్ బేర్ డే’ అంటే ప్రపంచ ఎలుగుబంటి దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎలుగుబంట్ల జీవన విధానంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు. ఎలుగుబంటి దినోత్సవాన్ని తొలిసారిగా 1992లో నిర్వహించారు. ఎలుగుబంట్ల దుస్థితిపై అవగాహన కల్పించేందుకు దీనిని ప్రారంభించారు. ప్రపంచ ఎలుగుబంటి దినోత్సవాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా జరుపుకుంటారు. ఎలుగుబంట్ల అభయారణ్యాన్ని సందర్శించడం, ఎలుగుబంటి పాత్ర ఉన్న సినిమా చూడటం, ఎలుగుబంటి వివరాలు కలిగిన పుస్తకాన్ని చదవడం లాంటి కార్యకలాపాలు చేస్తారు. ఎలుగుబంట్లు క్షీరద జాతికి చెందినవి. ఇవి మాంసాహార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఎలుగుబంటి జాతులు ప్రధానంగా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా ఐరోపాలలో కనిపిస్తాయి. గోధుమ లేదా నలుపు రంగులో ఇవి ఉంటాయి. స్వచ్ఛమైన తెలుపు రంగులో పోలార్ ఎలుగుబంట్లు ఉంటాయి. ఎలుగుబంటి ఒంటరి జంతువు. ఎలుగుబంట్లు శీతాకాలంలో ఎక్కువసేపు నిద్రావస్థలో ఉంటాయి. ఈ కాలంలో అవి గుహలలో ఆశ్రయం పొందుతాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎనిమిది రకాల ఎలుగుబంట్లు ఉన్నాయి. అమెరికన్ బ్లాక్ బేర్ అమెరికన్ బ్లాక్ బేర్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణంగా కనిపించే ఎలుగుబంటి జాతి. ఈ రకమైన ఎలుగుబంటి ఎక్కువగా ఉత్తర అమెరికాలోని అటవీ, పర్వత ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇది మధ్యస్థ పరిమాణంతో ఉంటుంది. దట్టమైన నల్లని బొచ్చుతో శారీరకంగా చాలా బలంగా ఉంటుంది. ఆసియన్ బ్లాక్ బేర్ దాని పేరులో సూచించినట్లుగా ఇది ఆసియాలో కనిపించే ఎలుగుబంటి జాతి. ఇది భారతదేశం, కొరియా, ఈశాన్య చైనా, రష్యా, జపాన్, తైవాన్లలో కనిపిస్తుంది. దీనిని మూన్ బేర్ అని కూడా అంటారు. స్పెక్టాక్లెడ్ బేర్ ఇది ఛాతీ పైభాగంలో లేత గోధుమరంగు రంగును కలిగి ఉంటుంది. దీని ఆకారంలో కళ్లకు అద్దాలు పెట్టుకున్నట్లు కనిపిస్తున్నందున దీనిని స్పెక్టాక్లెడ్ బేర్ అని అంటారు. దీనిని ఆండియన్ బేర్, పర్వత ప్రాంత ఎలుగుబంటి అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ట్రెమార్క్టోస్ ఆర్నాటస్. ఇది దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. మధ్యస్థ పరిమాణంలో ఉంటుంది. ఇవి చెట్లపై ఎక్కువ సమయం గడుపుతాయి. ఇవి ఒంటరిగా తిరుగుతాయి. జెయింట్ పాండా జెయింట్ పాండా ఎలుగుబంటికి కళ్ళ చుట్టూ నల్లటి గుర్తులు కనిపిస్తాయి. నలుపు, తెలుపు రంగుల మృదువైన బొచ్చుతో కూడిన శరీరంతో విభిన్నంగా కనిపిస్తాయి. జెయింట్ పాండా బేర్ దక్షిణ మధ్య చైనాలో కనిపిస్తుంది. జెయింట్ పాండాకు రెండు ఉపజాతులు ఉన్నాయి. సన్ బేర్ ఎలుగుబంటి జాతులలో సన్ బేర్ చిన్నగా కనిపిస్తుంది. ఇది ఆగ్నేయాసియాలోని ఉష్ణమండల వర్షారణ్యాలలో ఉంటుంది. తేనెను విపరీతంగా ఇష్టపడే దీనిని హనీ బేర్ అని కూడా పిలుస్తారు. దాని మెడపై ప్రత్యేకమైన గుర్రపుడెక్క ఆకారంలో ఆరెంజ్ రంగు గుర్తు ఉంటుంది. సన్ ఎలుగుబంటికి రెండు ఉపజాతులు ఉన్నాయి. ఇవి అన్ని రకాల ఎలుగుబంట్లలో అత్యంత ప్రమాదకరమైనవని చెబుతారు. స్లాత్ బేర్ స్లాత్ బేర్ శాస్త్రీయ నామం మెలుర్సస్ ఉర్సినస్. ఇది ప్రధానంగా భారతదేశం, నేపాల్, శ్రీలంకలో కనిపిస్తుంది. దీని పొడవాటి దిగువ పెదవి కారణంగా దీనిని లాబియేట్ బేర్ అని కూడా అంటారు. ఈ రకమైన ఎలుగుబంట్ల చెవులు పొడవాటి జుట్టును కలిగి ఉంటాయి. ఈ ఎలుగుబంట్లు జంటగా తిరుగుతాయి. బ్రౌన్ బేర్ బ్రౌన్ బేర్ భారీ పరిమాణం కలిగిన ఎలుగుబంటి జాతి. దీనిని గ్రిజ్లీ బేర్ అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ఉర్సస్ ఆర్క్టోస్. ఉత్తర యురేషియా, ఉత్తర అమెరికాలో ఇవి కనిపిస్తాయి. బ్రౌన్ బేర్ ఉపజాతులు అనేకం ఉన్నాయి. వీటి మెడ వెనుక భాగంలో పొడవైన మందపాటి బొచ్చు ఉంటుంది. బ్రౌన్ బేర్ అనేక యూరోపియన్ దేశాలకు జాతీయ జంతువు. పోలార్ బేర్ పోలార్ బేర్ అనేది భారీ పరిమాణం కలిగిన ఎలుగుబంటి జాతి. దీని శాస్త్రీయ నామం ఉర్సస్ మారిటిమస్. ఇది ప్రధానంగా ఆర్కిటిక్ సర్కిల్ చుట్టూ కనిపిస్తుంది. దీనికి తెల్లటి బొచ్చు కింద నల్లని చర్మం ఉంటుంది. దీనికి రెండు ఉపజాతులు. అవి అమెరికన్ పోలార్ బేర్, సైబీరియన్ పోలార్ బేర్. సముద్రపు మంచు ఘనీభవించిన శీతాకాలంలో ఈ ధృవపు ఎలుగుబంట్లు మరింత చురుకుగా ఉంటాయి. ప్రాణాలు తీస్తున్న ఎలుగుబంట్లు గత రెండు దశాబ్దాలో స్లాత్ ఎలుగుబంట్లు వేలాది మందిని పొట్టన పెట్టుకున్నాయి. ఇవి మన దేశంలో వందల మందిని చంపాయి. భారత ప్రభుత్వం అధికారికంగా ఎలుగుబంట్ల దాడులను లెక్కించనప్పటికీ, స్లాత్ ఎలుగుబంటి మన దేశంలోని అత్యంత ప్రాణాంతక జంతువులలో ఒకటని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇతర రకాల ఎలుగుబంటి కంటే ఈ స్లాత్ ఎలుగుబంటి మనుషులపై అధికంగా దాడులు చేస్తోంది. మరోవైపు మనదేశంలో ఈ రకపు ఎలుగుబంట్ల సంఖ్య పెరుగుతున్న కారణంగా అవి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మన దేశంలోని అడవులలో కేవలం 10 శాతం మాత్రమే ఎలుగుబంట్లకు అనువైనవిగా ఉన్నాయి. ఎవరైనా ఈ అడవుల్లోకి ప్రవేశించినప్పుడు లేదా అవి (ఎలుగుబంట్లు) ఆహారం, నీటి కోసం మానవ నివాసాలలోకి ప్రవేశించినప్పుడు అవి మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఆగ్రాలో ఎలుగుబంట్ల రక్షిత కేంద్రం యూపీలోని ఆగ్రాలో ప్రపంచంలోనే అతిపెద్ద రక్షిత బేర్ సెంటర్ ఉంది. ఇక్కడ 100 ఎలుగుబంట్లు ఉన్నాయి. 20 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో వీటి సంఖ్య 500కు పైగానే ఉండేది. వైల్డ్‌లైఫ్ ఎస్ఏఓస్కు చెందినప్రత్యేక బృందం ఆగ్రా బేర్ కన్జర్వేషన్ సెంటర్లో ఎలుగుబంట్లను సంరక్షిస్తోంది. తాజ్ సిటీలోని సుర్ సరోవర్ ప్రాంతంలో ఈ బేర్ కన్జర్వేషన్ సెంటర్ ఉంది. 1995లో స్థాపితమైన వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్.. ఎలుగుబంట్లతో కొందరు ఫీట్స్ చేయించడాన్ని అరికట్టేందుకు ఉద్యమించింది. యూపీలోని ‘కలందర్’ తెగ ప్రజలు ఎలుగుబంటి పిల్లలను వేటాడి, వాటి చేత గారడీ చేయించేవారు. ఈ వ్యవహారాలను వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్ అరికట్టింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం జంతువులను హింసించడం చట్టవిరుద్ధం. వైల్డ్‌లైఫ్ సంస్థ ఇప్పటివరకూ 628 ఎలుగుబంట్లను రక్షించింది. ఈ సంస్థ నాలుగు ఎలుగుబంట్ల పునరావాస కేంద్రాలను నిర్వహిస్తోంది. వీటిలో ఆగ్రా బేర్ కన్జర్వేషన్ సెంటర్ ప్రముఖమైనది. ఆగ్రా బేర్ కన్జర్వేషన్ సెంటర్ సహ వ్యవస్థాపకుడు కార్తీక్ సత్యనారాయణ మాట్లాడుతూ ఎలుగుబంట్లకు తాము ఉదయం వేళ పండ్లు, సాయంత్రం గంజి అందిస్తామన్నారు. వాటికి పలువిధాలుగా ఉపయోగపడేలా ఎన్క్లోజర్లు ఏర్పాటు చేశామన్నారు. -
జనారణ్యంలోకి ఎలుగుబంటి
మానకొండూర్ రూరల్: జనారణ్యంలోకి చొరబడిన ఎలుగుబంటి ఎనిమిది గంటలు హైరానా చేసి ఎట్టకేలకు బోనులో చిక్కింది. కరీంనగర్ జిల్లా మానకొండూర్‌లోని చెరువుకట్ట సమీపంలో కరీంనగర్–వరంగల్ రహదారి పక్కన ఉన్న ఓ ఇంట్లోకి దూరేందుకు యత్నించింది. కుక్కలు అరవడంతో ఇంటి పక్కనున్న వేపచెట్టు ఎక్కింది. ఇంటి యజమాని ఉదయం ఎలుగుబంటి అరుపులు విని, భయపడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఎలుగుబంటి ఉన్న ప్రాంతానికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేసి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెటర్నరీ వైద్యుడు మత్తు ఇంజక్షన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. గ్రామస్తుల సందడితో ఎలుగుబంటి చెట్టుదిగి చెరువు పక్కనున్న పొదల్లోకి దూరింది. పొదల్లో ఎలుగుబంటి కనిపించడంతో టపాసులు పేల్చి బయటకు రప్పించారు. అక్కడి నుంచి అది పంటపొలాల వెంట పరుగెత్తి సమీప ముంజంపల్లి గ్రామం వైపు వెళ్లింది. అటవీ అధికారులు మత్తు ఇంజక్షన్‌ను ఫైర్ చేయడంతో కిలోమీటర్ దూరం పరుగెత్తి పొలాల్లో సొమ్మసిల్లి పడిపోయింది. స్పృహ తప్పిన ఎలుగుబంటిని వలలో బంధించి వ్యాన్‌లో ఎక్కించి వరంగల్‌కు తరలించారు. -
తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంటి కలకలం
-
తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంట్ల కలకలం
సాక్షి, తిరుమల: తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంట్లు సంచారం కలకలం రేపాయి. ట్రాప్ కెమెరాల్లో చిరుత, ఎలుగుబంట్ల కదలికలు నమోదయ్యాయి. గడచిన నెల రోజుల్లో రెండు రోజులు ట్రాప్ కెమెరాలో కదలికలు నమోదయ్యాయి. డిసెంబర్ 13, 29 తేదీల్లో ట్రాప్ కెమెరాకు చిరుత చిక్కింది. చిరుతతో పాటు ఎలుగుబంట్లు కదలికలు అధికారులు గుర్తించారు. ఎలిఫెంట్ ఆర్చ్ వద్ద చిరుత, ఎలుగుబంటి తిరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. నడకమార్గంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని, గుంపులు గుంపులుగా రావాలంటూ టీటీడీ హెచ్చరికలు జారీ చేసింది. నడకమార్గం పక్కనున్న అటవీ ప్రాంతంలో చిరుత సంచరించడంతో భక్తులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. అవి తిరుగుతున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు పేర్కొన్నారు. టీటీడీ ఈవోకు ఫారెస్ట్ అధికారులు సమాచారం అందించారు. ఇదీ చదవండి: కృష్ణానది ఒడ్డున కలకలం.. అర్ధరాత్రి క్షుద్ర పూజలు! -
తల్లీకొడుకులను భయపెట్టి వారి ఆహారం తిసేసిన ఎలుగు
మెక్సికోలోని చిపింక్యూ ఎకోలాజికల్ పార్క్‌లో చోటుచేసుకున్న ఒక ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పిక్నిక్ పార్టీలోకి చొరబడిన ఒక ఎలుగుబంటి అక్కడి ఆహార పదార్థాలన్నింటినీ ఆనందంగా ఆరగించింది. ఆ ఎలుగుబంటి ఎటువంటి బెరుకు లేకుండా, టేబుల్‌పైకి ఎక్కి అక్కడి ఆహారాలను ఆనందంగా ఆస్వాదించింది. పిక్నిక్ చేసుకునేందుకు వచ్చిన తల్లీకొడుకులు ఆ సీన్ చూసి భయంతో నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. ఎలుగుబంటి నుండి తన కుమారుడిని రక్షించడానికి ఆ మహిళ ప్రయత్నించడం వీడియోలో కనిపిస్తుంది. ఈ వైరల్ వీడియో టిక్‌టాక్‌లో 10 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. అటవీ జంతువుల చేష్టలను చూసేందుకు ఇష్టడేవారు ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. బీబీసీ తెలిపిన వివరాల ప్రకారం చిపింక్ ఎకోలాజికల్ పార్క్ నిర్వాహకులు మాంటెర్రీ మెట్రోపాలిటన్ ప్రాంతంలో పెరుగుతున్న ఎలుగుబంటి దాడుల గురించి ఇటీవల హెచ్చరికను జారీ చేశారు. పార్క్ సందర్శకుల కోసం పలు సూచనలు చేశారు. ఫొటోలు, వీడియోల కోసం ఈ జంతువులకు దగ్గరగా వెళ్లవద్దని హెచ్చరించారు. పార్క్‌లో ఇలాంటి దాడి జరగడం ఇదేమీ తొలిసారి కాదు. 2020లో ఒక ఎలుగుబంటి సందర్శకునిపై దాడి చేసింది. అప్పుడు కూడా ఇలాంటి వీడియో వైరల్‌గా మారింది. ఇది కూడా చదవండి: ‘జో నెహ్రూ’ ఎవరు? ఇందిర, సోనియా, ప్రియాంకలకు ఏమి బహూకరించారు? A family was stunned when an intruding bear hopped onto their table to devour their food. The eldest daughter captured the scene as the bear continued munching away in Parque Ecológico Chipinque in San Pedro, Mexico 🇲🇽. The mother, as seen in the video, remained calm, shielding… pic.twitter.com/o47OkJQsNr — Voyage Feelings (@VoyageFeelings) September 27, 2023 -
పులిని ఫాలో చేసిన ఎలుగు, అది వెనక్కి తిరిగినంతనే శరణుకోరుతూ..
ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఒక వీడియో చాలా మందిని షాక్‌కు గురిచేసింది. పులి, ఎలుగుబంటి మధ్య చోటుచేసుకున్న విచిత్రమైన సీన్ ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఒక ఎలుగుబంటి పులి వెనుకగా వెళుతున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఆ ఎలుగుబంటి.. పులికి దూరంగా వెళ్లేందుకు బదులు.. వెనుక కాళ్లపై దానిముందు నిలబడి శరణాగతి వేడుతున్నట్లు చూస్తుంది. కొంతసేపటి తరువాత ఆ ఎలుగుబంటి పక్కకు వెళ్లిపోతుంది. ఈ వీడియోను షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి రమేష్ పాండే .. ‘ఈ పులి సన్యాసి అయివుండాలి లేదా ఆ ఎలుగుబంటికి కంటి చూపు తక్కువగా అయినా ఉంటుందని’ రాశారు. ఈ వీడియోను చూసిన ఒక యూజర్ ‘ఇది చాలా ఆసక్తికరమైన వీడియో. అడవిలో ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పుతున్నది’ అని రాశారు. మరో యూజర్.. ‘ఎలుగుబంటి ఆ పులి దృష్టిని మళించడానికి ప్రయత్నించింది. తనకు తానుగా లొంగిపోతున్నట్లు తెలియజేసిందని’ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ‘... అయితే ఇండిగో ‘భాగో’ కానుందా?’... ‘ఇండియా vs భారత్’ తెగ నవ్విస్తున్న మీమ్స్! While people in safari wanted- fight hone de- it was an affable interaction… Tiger use their tails to communicate with each other. An upright, slowly wagging tail indicates friendliness. Bear understood the language☺️ pic.twitter.com/huDRjStLot — Susanta Nanda (@susantananda3) September 3, 2023 -
శిఖరేశ్వరంలో ఏర్పాటు చేసిన బోనులో చిక్కిన ఎలుగుబంటి
-
శ్రీవారి మెట్టు నడకదారిలో ఎలుగుబంటి సమాచారం
-
అందమైన భామలను తడిమి చూసి వదిలేసిన ఎలుగు.. తెలివితో తప్పించుకున్నారిలా!
ఎలుగుబంటి ఎంతో శాంతస్వభావం కలిగినదని చెబుతుంటారు. అయితే అది ఒక్కోసారి రెచ్చిపోయినప్పుడు దానిని ఆపడం ఎవరితరమూ కాదని కూడా అంటుంటారు. అయితే మీరు ఎప్పుడైనా అడవిమార్గం గుండా వెళ్లినప్పుడు ఎలుగుబంటి ఎదురైతే ఏం చేయాలో తెలుసా? దాని నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసా? సోషల్ మీడియాతో తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో అందమైన భామలు తాము ఎలుగుబంటి నుంచి ఎలా తప్పంచుకున్నదీ ఒక వీడియోలో చూపించారు. ఎలుగు ముంగిట చిక్కి, ఆపదలో ఉన్నవారికి ఈ వీడియో ఎంతో ఉపయోగపడేలా ఉంది. వైరల్ అవుతున్న వీడియోలో ముగ్గురు యువతులు రోడ్డుపక్కన ఉండటాన్ని గమనించవచ్చు. ఇంతలోనే వారి దగ్గరకు ఒక నల్లని ఎలుగుబంటి రావడాన్ని చూడవచ్చు. అది వారి దగ్గరకు వచ్చి, వారిని పట్టుకుంటుంది. అయితే ఆ యువతులు ఏ మాత్రం కంగారు పడకుండా కదలకుండా నిలుచునే ప్రయత్నం చేస్తుంటారు. దీంతో ఆ ఎలుగుబంటి ఆ అందమైన యువతుల నుంచి ఎటువంటి ప్రమాదం లేదని భావించి, అక్కడి నుంచి కామ్‌గా వెళ్లిపోతుంది. ఈ వీడియోను ట్విట్టర్లో @CCTV IDIOTS పేరుతో షేర్ చేశారు. ఈ వీడియోకు క్యాప్షన్‌గా ‘ఎలుగుబంటి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకోండి.. శాంతంగా, స్థిరంగా నిలుచోండి’ అని రాశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 269.4కేకు పైగా వీక్షణలు దక్కాయి. 3వేలకు పైగా లైక్స్ దక్కాయి. ఒక యూజర్ తన కామెంట్లో ఒకవేళ ఆ ఎలుగుబంటికి ఆ యువతుల స్మెల్ నచ్చకపోయి ఉంటే ఏమయ్యేదోనని అనగా, మరొకరు ఆ ఎలుగుబంటి వారిని కావలించాలనుకుంటోంది అని రాశారు. ఇది కూడా చూడండి: పట్టుతప్పి పట్టాలపై పిల్లాడు.. క్షణాల్లో స్పందించిన కార్మికుడు.. కన్నార్పనీయని వీడియో! How to survive a bear attack… stand still and stay silent pic.twitter.com/zyE17dTbSv — CCTV IDIOTS (@cctvidiots) August 13, 2023 -
భల్లూకాన్ని చూసి..బెంబేలెత్తిపోయారు..
కొత్తపల్లి (కరీంనగర్): కరీంనగర్ శివారు రేకుర్తి, సీతారాంపూర్, సూర్యనగర్ ప్రాంతాల్లో భల్లూకం హడలెత్తించింది. సుమారు 14 గంటల పాటు స్థానికులను బెంబేలెత్తించిన గుడ్డెలుగు.. ఎట్టకేలకు వరంగల్ నుంచి వచ్చిన రెస్క్యూ టీంకు పట్టుబడింది. సుమారు రెండు గంటల పాటు రెస్క్యూ టీంను ముప్పుతిప్పలు పెట్టింది. శనివారం వేకువజామున 4.30 గంటల ప్రాంతంలో కుక్కతో బయటకు వెళ్లిన సూర్యనగర్ వాసికి ఎలుగు కనిపించింది. కుక్క మొరగడంతో వెనక్కి తగ్గిన ఎలుగుబంటి.. అక్కడి నుంచి రేకుర్తి వైపు వెళ్లింది. ఎస్సారెస్పీ కెనాల్ మార్గం గుండా ప్రధాన రహదారిపై సంచరిస్తుండటం గమనించిన స్థానికులు పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. శనివారం ఉదయం వరంగల్ నుంచి వచ్చిన ఫారెస్ట్ రెస్క్యూ టీం రేకుర్తి సబ్‌స్టేషన్ ప్రాంతంలోని సమ్మక్క గుట్ట పొదల్లో దాగిన ఎలుగుబంటిని పట్టుకునేందుకు వలలు ఏర్పాటు చేసింది. ఎలుగుబంటికి మత్తు ఇంజక్షన్ ఇచ్చే క్రమంలో టీం సభ్యుడిపైకి దూసుకొచ్చింది. ఎట్టకేలకు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వలకు చిక్కిన ఎలుగుబంటిని చికిత్స నిమిత్తం వెటర్నరీ హాస్పిటల్‌కు తరలించారు. కాగా, మరో రెండు ఎలుగుబంట్లు సంచరిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. -
కరీంనగర్ జిల్లాలో ఎలుగుబంటిని బంధించిన అధికారులు
-
రోడ్లపై తిరుగుతూ హల్చల్ చేసిన ఎలుగు బంటి
-
కరీంనగర్: ముప్పుతిప్పలు పెట్టి.. ఎట్టకేలకు చిక్కిన ఎలుగుబంటి
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతూ సంచరిస్తున్న ఎలుగుబంటి ఎట్టకేలకు అధికారులు పట్టుకున్నారు. దాన్ని పట్టుకునేందుకు అధికారులు వలలు ఏర్పాటు చేశారు. రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా ఎయిర్ గన్‌తో అటవీశాఖ అధికారులు మత్తు ఇంజక్షన్ ఇవ్వగా.. అనంతరం రేకుర్తి సమ్మక్క గద్దెల్లోకి భల్లూకం పారిపోయింది. దీంతో అటవీశాఖ అధికారుల గాలింపు ప్రక్రియ ముమ్మరం చేసి చివరికి పట్టుకున్నారు. కాసేపట్లో అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటిని అడవిలో విడిచిపెట్టనున్నారు. నడిరోడ్డు పై హల్చల్ కాగా నడిరోడ్డుపై సంచరిస్తూ నగర వాసులను పరుగులు పెట్టిస్తోంది. శుక్రవారం రాత్రి బొమ్మకల్ పంచాయతీ పరిధిలోని రజ్వీ చమాన్ ప్రాంతంలో ఓ కాలనీలోకి ప్రత్యక్షమైన ఎలుగుబంటి.. శనివారం ఉదయం రేకుర్తిలో నడిరోడ్డుపై సంచరిస్తూ ప్రజలకు కనిపించింది. దీంతో ఎలుగు బంటిని చూసిన గ్రామస్థులు భయంతో పరుగులు పెట్టారు. ఎలుగుబంటి సంచరిస్తుండగా దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ కాగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. మరో వైపు ఎలుగుబంటి కోసం అటవీశాఖ అధికారులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఎలుగుబంటి కోసం హన్మకొండ నుంచి ప్రత్యేకంగా వలలు, ఎయిర్ గన్స్, ఇతర ఎక్విప్ మెంట్ తో వచ్చారు. చదవండి: హైదరాబాద్ మెట్రో రైల్ మరో బంపర్ ఆఫర్.. -
ఎరక్కపోయి వచ్చి ఎలుగుబంటి కంట్లో పడ్డాం.. పరుగో పరుగు
ఇటీవల అమెరికాలోనిలోని మోంటానాలో గల గ్లేసియర్ నేషనల్ పార్క్‌లో పర్యాటకులకు ఒక పెద్ద ఎలుగుబంటి ఎదురుపడటంతో వారు నిలువునా వణికిపోయారు. అప్పుడు వారికి గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఈ ఉదంతాన్ని వీడియోలో బంధించారు. వన్యప్రాణుల స్వభావానికి ఆ ఎలుగుబంటి ప్రవర్తించిన తీరు ఉదాహరణగా నిలిచింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. పర్యాటకులు అవుట్‌డోర్‌లో చేసే అన్వేషణల వల్ల కలిగే ప్రమాదాలను గుర్తు చేసేలా ఈ వీడియో ఉంది. స్టీవ్ ఫ్రాంక్లిన్.. ఆ ఎలుగుబంటి హిడెన్ లేక్ ట్రయిల్‌లో హైకర్ల వైపుగా ఇరుకైన మార్గంలో కొండ నుంచి దిగుతున్న వీడియోను బంధించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆ ఎలుగుబంటి సియెహ్ బెండ్ సమీపంలోని వాలు పైభాగంలో ఉన్న చెట్ల మధ్య కనిపించింది. కాలిబాట నిటారుగా రాతితో ఉండటాన్ని వీడియోలో గమనించవచ్చు. దీని వలన హైకర్లు పక్కకు వెళ్లినా ఎలుగుబంటిని తప్పించుకోలేకపోయారు. అయితే ఆ ఎలుగుబంటికి దూరంగా ఆ హైకర్లు మెల్లగా సమీపంలోని కాలిబాట నుంచి వెళ్లడం వీడియోలో చూడవచ్చు. ఆ గ్రిజ్లీ మీ వెనుకే ఉందంటూ హైకర్లను ఎవరో హెచ్చరించడం వీడియోలో వినిపిస్తుంది. దాని నుంచి తప్పించుకునేందుకు కాలిబాటలో నడవడం శ్రేయస్కరంగా అనిపించిదని ఫ్రాంక్లిన్ పేర్కొన్నారు. నేషనల్ పార్క్ సర్వీస్ (ఎన్సీఎస్) తెలిపిన వివరాల ప్రకారం గ్లేసియర్ నేషనల్ పార్క్‌లో సుమారు వెయ్యి గ్రిజ్లీ, నల్ల ఎలుగుబంట్లు ఉన్నాయి. అవి అప్పుడప్పుడు మనుషులపై దాడులు చేస్తుంటాయి. ఎలుగుబంట్లు మనుషుల విషయంలో హింసాత్మకంగా ఉంటాయని స్పష్టంగా చెప్పలేనప్పటికీ, ఎలుగుబంట్లు ఎదురైనప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను నేషనల్ పార్క్ సర్వీస్ సూచించింది. గ్లేసియర్ నేషనల్ పార్క్‌లోని హైకర్లను సమీపిస్తున్న గ్రిజ్లీ ఎలుగుబంటి దృశ్యాలు పర్యాటకుల మదిలో నిలిచిపోతాయి. ఈ ఎలుగుబంటి తమ జాతులను, వాటి ఆవాసాలను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను ఈ సంఘటన హైలైట్ చేస్తుంది. వన్యప్రాణులు ఎదురుపడినప్పుడు ఎదురయ్యే అనుభవం, వాటిని తప్పించుకునేందుకు చేసే ప్రయత్నాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. సోషల్ మీడియాలో షేర్ అయిన ఈ వీడియోకు లెక్కకు మించిన వ్యూస్వస్తుండగా, కామెంట్లు కూడా అదే రీతిన వస్తున్నాయి. ఇది కూడా చదవండి: మహిళ ఆర్తనాదాలపై ఫిర్యాదు.. సంఘటనా స్థలంలో డంగైన పోలీసులు! -
Viral Video: హఠాత్తుగా ఓ నది ఎరుపు రంగులోకి మారిపోయింది
ఏమైందో ఏమో ఒక్కసారిగా ఓ నది ఎరుపు రంగులోకి మారిపోయింది. ఈ షాకింగ్ ఘటన జపాన్‌లో చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా స్థానిక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఓరియన్ బ్రూవరీస్ అనే బీర్ ప్యాక్టరీ లీక్ కారణంగా జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఈ షాకింగ్ ఘటన ఒకినావాలోని నాగో సిటీలోని ఓడరేవు వద్ద జరిగింది. కర్మాగారాన్ని చల్లబరిచే ప్రక్రియలో భాగంగా వినియోగించే ఒక రసాయనం కారణంగా ఇది జరిగిందని వివరణ ఇచ్చారు. ఇది సురక్షితమైనదేనని, ఈ రసాయనాన్ని కాస్మెటిక్ పరిశ్రమలో వియోగిస్తారని చెప్పారు. సదరు ఓరియన్ బ్రూవరీ కంపెనీ ఫుడ్ కలరింగ్ రసాయనం వల్లే ఇది ఈ రంగులోకి మారిందని. దీని వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని తెలిపింది. తమ ఫ్యాక్టరీని చల్లబరిచే ప్రక్రియకు సంబంధించి ఆహార భద్రత చట్టాల నిబంధనలో జాబితాలో ఉందని వివరణ ఇచ్చింది. ప్రొపైలిన్ గ్లైకాల్ అనే రసాయంన లీకేజ్ కారణంగా ఇలా నది ఎరుపురంగులోకి మారిందని తెలిపింది. నిజానికి లీకైన శీతలీకరణ నీరు వర్షం ద్వారా నదిలోకి ప్రవహించడంతో ఇలా మారిందని, అది కాస్త సముద్రంలోకి చేరడంతో ఓడరేవు ఈ రంగులోకి మారిందని వెల్లడించింది ఓరియన్ బ్రూవరీస్ బీర్ కంపెనీ. ఈ మేరకు బీర్ కంపెనీ ప్రెసిడెంట్ హజిమ్ మురానో మాట్లాడుతూ..ఈ అసౌకర్యానికి క్షమాపణలు చెప్పడమే గాక ఈ లీక్ ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. Orion beer factory leak turns Japanese port red. pic.twitter.com/uyw3JC02S2 — Project TABS (@ProjectTabs) June 29, 2023 (చదవండి: రెండు వేల ఏళ్ల క్రితమే పిజ్జా వంటకం ఉందంటా!) -
ఊరిలోకి వచ్చిన ఎలుగుబంటి
-
జస్ట్ మిస్.. చెట్టు ఎక్కి షాకిచ్చిన ఎలుగుబంటి
-
ఆస్కార్ వేదికపై ఎలుగుబంటి.. అసలు విషయమిదే..!
అమెరికాలోని లాస్ ఎంజిల్స్ వేదికగా 95వ ఆస్కార్ అవార్డ్ వేడుక ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు వీక్షించారు. ఈ వేడుకలో సినీరంగంలో అత్యుత్తమ ప్రతిభ చాటిన ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన సినిమాలకు అవార్డులు ప్రకటిస్తారు. ఈ వేడుక కోసం ఆస్కార్ అకాడమీ నిర్వాహకులు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈవెంట్లో అందరి దృష్టిని ఆకర్షించింది ఏంటో తెలుసా? వేదికపై అందరినీ అలరిస్తూ సందడి చేసిన ఓ ఎలుగుబంటి. ఇంతకీ ఆ వేదికపై ఎలుగుబంటి ఎందుకొచ్చిందా అని సందేహం మీకు వచ్చి ఉండొచ్చు. పదండి ఆ ఎలుగుబంటి కథేంటో తెలుసుకుందాం. ఆస్కార్ వేదికపై అందరి దృష్టిని ఆకర్షించిన ఆ ఎలుగుబంటి ఓ సినిమాలోని పాత్ర. ఎలిజబెత్ బ్యాంక్స్ కామెడీ థ్రిల్లర్ మూవీలో ఎలుగుబంటి అలరించింది. ఈ ఏడాది ఆస్కార్ వేడుకపై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈవెంట్లో పాల్గొన్న సినీ దిగ్గజాలను పలకరిస్తూ సందడి చేసింది. దీంతో నెటిజన్స్ దీనిపై ఆరా తీస్తున్నారు. ఆస్కార్ వేదికపై మెరిసిన ఆ ఎలుగుబంటి గురించి ఆసక్తి కనబరుస్తున్నారు. -
3,500 ఏళ్ల నాటి ఎలుగు కళేబరం...
మాస్కో: దాదాపుగా 3,500 ఏళ్ల నాటి ఎలుగుబంటి కళేబరం ఏమాత్రం చెక్కుచెదరని స్థితిలో దొరికి సైంటిస్టులను సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. అది పూర్తిగా అతిశీతల వాతావరణంలో మంచులో కూరుకుపోవడమే ఇందుకు కారణం. రష్యాలో మాస్కోకు 4,600 కిలోమీటర్ల దూరంలో న్యూ సైబీరియన్ ఆర్చిపెలాగోలో భాగమైన బొల్షోయ్ ల్యాక్షోవ్స్కీ ద్వీపంలో జింకల వేటగాళ్లు దీన్ని 2020లో గుర్తించారు. ‘‘అది ఆడ ఎలుగుబంటి. గోధుమ రంగుతో, 1.55 మీటర్ల ఎత్తు, దాదాపు 78 కిలోల బరువుంది. చనిపోయేనాటికి బహుశా మూడేళ్ల వయసుంటుంది’’ అని తూర్పు సైబీరియాలోని లజరేవ్ మామూత్ మ్యూజియం లేబొరేటరీ చీఫ్ మాక్సిం చెప్రసోవ్ అంచనా వేశారు. ఆయన సారథ్యంలోని సైంటిస్టుల బృందం దానికి శవపరీక్ష జరిపింది. ‘‘దాని ఒంట్లోని అతి మృదువైన కణజాలం కూడా గులాబి రంగులో ఇప్పటికీ ఏమాత్రం పాడవకుండా ఉండటం నిజంగా అద్భుతం. అలాగే పసుపు రంగులోని కొవ్వు కూడా. అంతేగాక దాని చివరి తిండి తాలూకు పక్షి ఈకలు, మొక్కలు కూడా పొట్టలో అలాగే ఉన్నాయి. అంత పురాతన కాలపు జంతువు తాలూకు కళేబరం ఇంత చక్కని స్థితిలో పరిపూర్ణంగా దొరకడం ఇదే తొలిసారి’’ అని పేర్కొంది. దాని మెదడు, అంతర్గత అవయవాలను కోసి లోతుగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా కణజాల, సూక్ష్మజీవ, జన్యుపరమైన పరీక్షల్లో తలమునకలుగా ఉన్నారట. -
జూలో జంతువులకు ఆయుషు ఎక్కువ.. ఎందుకంటే..?
సాక్షి, హైదరాబాద్: వేళకు తిండి..సేద తీరేందుకు ఆవాసం ఉంటే ఏ జీవి అయినా పదికాలాలు బాగా ఉంటుందనే సామెత మన జూ పార్కులోని జంతువులకు సరిగ్గా సరిపోతుంది. అడవి జంతువులకంటే.. జంతు ప్రదర్శనశాలలోనే పుట్టి.. ఇక్కడే పెరిగిన ఆనేక జంతువులు తమ జీవితకాలంటే ఎక్కువగా జీవిస్తున్నాయి. పోషకాహారం.. అలనాపాలన బాగుండడంతో ఈ జీవులు సంపూర్ణ ఆరోగ్యంతో జీవితాన్ని గడుపుతున్నాయి. అడవుల్లో స్వేచ్ఛగా పెరిగే జంతువులు వయోభారంతో వేటను కొనసాగించలేవు. ఒంట్లో సత్తువ తగ్గడం.. ఇతర ప్రాణులతో పోటీపడలేక ఆకలితో అలమటిస్తాయి. నీరసంతో కన్నుమూస్తాయి. అదే జూలో అయితే.. సహజసిద్ధమైన ఆహారానికి కొరత ఉండదు. బలవర్ధకమైన ఆహారం.. సప్లిమెంట్లు, ఆనారోగ్యానికి గురైతే ఔషధాలు అందిస్తుండడంతో ఈ ప్రాణుల జీవనకాలం పెరుగుతుందని జూ క్యూరేటర్ రాజశేఖర్ ‘సాక్షి’కి తెలిపారు. జూలో వేట లేదు, ఇతర జంతువులతో పోరాటాలు ఉండకపోవడం కూడా వీటి జీవితకాలం పెరగడానికి కారణమని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో అడవిలో పెరిగే జంతువులకంటే అధికకాలం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న కొ న్ని జంతువుల వివరాలు మీ కోసం... ఆహార ఆవసరాలకు అనుగుణంగా డైట్ జూలో వివిధ రకాల వన్యప్రాణులు ఉన్నాయి. వాటి ఆహార అవసరాలకు అనుగుణంగా పోషకాలతో కూడిన ఆహారం అందిస్తాం. ఆహారంలో నాణ్యత ప్రమాణాలు తప్పక పాటిస్తాం. ఒక్కో వన్యప్రాణి ఒక్కోతీరుగా ఆహారం తీసుకుటుంది. సమయం, సరిపడా మోతాదులో ఆహారం అందజేస్తాం.ఆడవుల్లో ఉండే వన్యప్రాణుల కంటే జూలో ఉంటున్న వన్యప్రాణుల వయో పరిమితి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాటికి ఆహారం సమయానికి అందుతుంది. రోగాల బారినపడకుండా చూసుకుంటాం. – డాక్టర్ మహ్మద్ అబ్దుల్ హకీం, జూ డిప్యూటీ డైరెకర్ట్ (వెటర్నరీ) ఆపర్ణ (బెంగాల్ టైగర్) పుట్టినరోజు : డిసెంబర్ 3, 2001 వయసు : 20 ఏళ్లు సగటు జీవితకాలం : 15 ఏళ్లు జిరాఫీ ( సునామీ బసంత్) పుట్టినరోజు : ఫిబ్రవరి 13, 2005 వయసు : 17 ఏళ్లు సగటు జీవితకాలం : 15 ఏళ్లు కునాల్, సమీరా (తెల్లపులులు) పుట్టినరోజు : సెప్టెంబర్ 9, 2006 వయసు : 16 ఏళ్లు సగటు జీవితకాలం : 12–15 ఏళ్లు సులేమాన్ (జాగ్వార్) పుట్టినరోజు : ఏప్రిల్ 5, 1998 వయసు : 24 ఏళ్లు సగటు జీవితకాలం : 20 ఏళ్లు బారసింగా (చిత్తడి జింక) పుట్టినరోజు : 27, ఏప్రిల్ 2005 వయసు : 17 ఏళ్లు సగటు జీవితకాలం : 12 ఏళ్లు ఎలుగుబంటి పుట్టినరోజు : ఫిబ్రవరి 18, 2001 వయసు : 20 ఏళ్లు సగటు జీవితకాలం : 15 ఏళ్లు 30 ఏళ్ల నుంచి పక్షుల్లో కూడా హరన్బెల్ పక్షి, తెల్ల కొకాటో పక్షి వయస్సు కూడా దాదాపు 30 ఏళ్లు ఉంటుందని జూ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా 20–25 ఏళ్లు వరకు ఈ సంతతి పక్షులు జీవిస్తాయి. (క్లిక్ చేయండి: డాక్టర్ల ఫొటోలే వైద్యం చేస్తుంటాయ్!) -
గుడిలోకెళ్లి గంట కొట్టిన ఎలుగుబంటి!.. 105 కిలోల బరువైన..
సాక్షి, సత్యసాయి జిల్లా (రొళ్ల): అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడిన ఎలుగుబంటి ఆలయంలోని గంటను మోగించి అందరినీ ఆశ్చర్యపరిచింది. సీసీకెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమైన ఈ సమాచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వివరాలు... శ్రీసత్యసాయి జిల్లా రొళ్ల మండలంలోని జీరిగేపల్లిలో వెలసిన అమ్మాజీ ఆలయంలో సోమవారం రాత్రి పూజాదికాలు ముగించుకున్న తర్వాత అర్చకులు తాళం వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయంలోకి రెండు ఎలుగు బంట్లు ప్రవేశించాయి. అందులో ఒకటి నేరుగా గరుడ స్తంభం వద్ద ఏర్పాటు చేసిన 105 కిలోల బరువైన గంటకు కట్టిన తాడును నోటితో లాగేందుకు ప్రయత్నించింది. సాధ్యం కాకపోవడంతో ముందరి కాళ్లతో దానిని పట్టుకుని లాగి గంట మోగించి పక్కకు వైదొలిగింది. మంగళవారం ఉదయం ఆలయం తలుపులు తీసిన అర్చకులు సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమైన దృశ్యాలను చూసి అవాక్కయ్యారు. చదవండి: (ఇక కుప్పం పోలీసు సబ్‌డివిజన్.. విడుదలైన రాజపత్రం) -
అయ్యో.. కనిపించిన కాసేపటికే కన్నుమూత!
అరే.. ఏంటిది.. అడవుల్లో నల్ల ఎలుగుబంట్లు లేదంటే గోధుమ రంగు ఎలుగుబంట్లు ఉంటాయని తెలుసు. కానీ ఇదేంటి ధ్రువ ప్రాంతాల్లో సంచరించే తెల్ల ఎలుగుబంటి ఇలా దట్టమైన అడవిలోకి ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీరు పొరబడ్డట్లే..! ఎందుకంటే మీరనుకుంటున్నట్లు ఇది పోలార్ బేర్(ధృవపు ఎలుగుబంటి) కాదు! ప్రపంచంలోనే అత్యంత అరుదైన తెల్ల ‘స్పిరిట్ బేర్’ ఇది. దీన్నే కీర్మోడ్ బేర్ అని కూడా పిలుస్తారు. అమెరికాలోని అడవుల్లో కనిపించే ఈ తెల్ల ఎలుగు.. వాస్తవానికి నల్ల ఎలుగుబంటి ఉపజాతికి చెందినది కావడం విశేషం! జన్యు మార్పుల కారణంగా నల్ల ఎలుగులకు ఇలా తెల్ల ఎలుగు పుడుతుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఈ పరిణామం ప్రతి 10 లక్షలసార్లలో కేవలం ఒక్కసారే సంభవించేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. అత్యంత అరుదుగా పుట్టే ఈ రకమైన ఎలుగుబంట్లను అడవుల్లో గుర్తించడం దాదాపు అసాధ్యమని అటవీ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా కెనడాలోని బ్రిటిష్ కొలంబియా మధ్య, ఉత్తర తీర ప్రాంతాల్లో స్పిరిట్ బేర్స్ జీవిస్తాయని వారు వివరించారు. కానీ అనూహ్యంగా.. ఈ తెల్ల ఎలుగుబంటి ఇటీవల అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలో ఉన్న పశ్చిమ ఎగువ ద్వీపకల్ప ప్రాంతంలో కనిపించి యావత్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. ఓ వేటగాడు అమర్చిన ఎరవైపు వచ్చి అక్కడ అటవీ అధికారులు అమర్చిన ఓ ఆటోమెటిక్ మోషన్ సెన్సర్ కెమెరాకు చిక్కింది. ఈ ఎలుగు ముఖం, మెడ భాగం తప్ప మిగతా శరీరమంతా ధవళవర్ణంలో ఉంది. దీని వయసు సుమారు రెండేళ్లు ఉండొచ్చని, అది మగదని అధికారులు వివరించారు. కానీ, విషాదం ఏంటంటే.. కనిపించిన కాసేపటికే అది తోడేళ్ల దాడిలో మృతి చెందిందని అధికారులు చెప్తున్నారు. ఇలాంటిది మళ్లీ ఎప్పుడు కనిపిస్తుందో అనే బెంగ ఇప్పుడు పరిశోధకుల్లో నెలకొంది. ఇది తెల్ల ఎలుగేనని అమెరికా సహజ వనరుల శాఖ ఇంకా నిర్ధారించనప్పటికీ ఓ ట్రెక్కింగ్ గైడ్ మాత్రం దీన్ని స్పిరిట్ బేర్‌గా పేర్కొంటూ ఫేస్బుక్లో ఫొటోలు షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. -
పిల్లల కథ: ఎలుగుబంటి పిసినారితనం
చింతలవనంలో పెద్ద ఎలుగుబంటి ఒకటి కాపురముండేది. కూతురుని ఆమడ దూరంలో ఉన్న నేరేడుకోనలోని ఎలుగుకిచ్చి వివాహం చేసింది. పిల్లాడు బంటి బాల్యదశలోనే ఉన్నాడు. మగ ఎలుగుబంటి పగలంతా కష్టపడి చెట్లూ, పుట్టలూ వెదికి తేనెని సేకరించేది. దానితో ఆడ ఎలుగుబంటి వ్యాపారం చేసేది. ఆ అడవిలోని ఏ జంతువైనా తేనె అవసరమైతే వీరి దుకాణానికి రావలిసిందే. అయితే ఆడ ఎలుగు పరమ లోభి. పైగా నోటి దురుసు జాస్తి. కనీస జాలి లేకుండా అధిక ధరలతో ముక్కుపిండి ఖరీదు రాబట్టేది. ఇంట్లో భర్త, పిల్లాడిని కూడా తేనె ముట్టనిచ్చేది కాదు. ఒకరోజు ఆడ ఎలుగు ‘నేరేడుకోనకీ పోయి కూతురిని చూసివద్దాం’ అని అడిగింది. ‘నాకు పనుంది. పిల్లాడిని తీసుకుని నువ్వెళ్లు. అమ్మాయి కోసం వేరే కుండలో మంచి తేనె దాచాను. పట్టుకెళ్ళు’ అంది మగ ఎలుగు. ‘ఎందుకూ దండగా?ఎలాగూ అల్లుడు తెస్తాడుగా ’ అంటూ తిరస్కరించింది ఆడఎలుగు. ఇంటి ముందున్న కొబ్బరి చెట్టు నుంచి ఐదు కాయలు దింపింది. వాటి పీచు ఒలిచి, సంచీలో వేసుకుని ప్రయాణమైంది ఆడఎలుగు కొడుకు బంటితో. కొంతదూరం సాగాక బంటిగాడికి దప్పిక కలిగింది. ‘అమ్మా! దాహమేస్తోంది. మంచినీళ్ళు కావాలి’ అన్నాడు. ఆడ ఎలుగు నీళ్ళతిత్తిని వెదకబోయి నాలుక కరుచుకుంది. మంచినీరు మరిచి పోయింది. దెయ్యాలగుట్ట దాటితేగాని, నీటికుంట దొరకదు. ఇప్పుడెలా? అనుకుని ‘కాస్త ఓర్చుకో నాయనా! మరో రెండు మలుపులు తిరిగితే గుట్ట వస్తుంది. అక్కడ తాగుదువుగాని’ అంది అనునయంగా. బంటిగాడు బుద్ధిగా తలూపటంతో నడక సాగింది. మొదటి మలుపు దాటగానే మళ్ళీ అడిగాడు బంటిగాడు. ‘వచ్చేశాం! మరొక్క మలుపు’ అంటూ సముదాయించింది. కానీ విపరీతమైన దాహం వేయటంతో బంటిగాడు తట్టుకోలేక పోయాడు. సమీపంలో మరే నీటి తావూ లేదు. ‘పోనీ ఒక కొబ్బరికాయ కొట్టివ్వమ్మా!’ దీనంగా అడిగాడు. వాడలా అడగడంతో వాడి దాహం.. కేవలం కొబ్బరి నీళ్ల కోసం ఎత్తుగడ అనుకుంది. అసలు కాయలు దింపినపుడే నీరు తాగుతానని మంకుపట్టు పట్టాడు. అప్పుడు ఎలాగోలా గదిమి ఆపింది. ఇప్పుడు దాహం వంకతో కొబ్బరి నీళ్లకు పథకం వేశాడని నవ్వుకుంది. ‘ఇంకాసేపట్లో గమ్యం చేరతాం. అప్పటి వరకూ నిశ్శబ్దంగా ఉండు. లేకపోతే వీపు బద్దలవుతుంది’ అని హెచ్చరిస్తూ ముందుకు నడిపించింది. బంటిగాడిది నిజమైన దాహమని గుర్తించలేక పోయింది. నాలుగడుగులు వేశాక ‘దబ్బు’ మని కూలి,కళ్ళు తేలవేశాడు బంటిగాడు. ఆసరికి బిడ్డది నటన కాదు. నిజమైన దాహమని అర్థమైంది ఆడ ఎలుగుకి. వెంటనే సంచీలోంచి నాలుగు కొబ్బరి కాయలు తీసి వెంట వెంటనే కొట్టి, నీళ్ళు తాగించింది. కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే బంటిగాడి నేల కూలాడు. బిడ్డను చూస్తూ ‘సకాలంలో కొబ్బరినీళ్ళు పట్టించుంటే, నువ్వు దక్కి ఉండేవాడివిరా! నా పిసినారితనంతో నిన్ను చంపుకున్నాను’ అంటూ భోరున ఏడ్వసాగింది. దాని ఏడుపు విని సమీపంలోని పక్షులు, జంతువులూ వచ్చాయి. ఏమీ చేయలేక జాలిగా చూస్తుండి పోయాయి. అంతలో చింతలవనానికే చెందిన కోతి ఒకటి మూలికలను అన్వేషిస్తూ అటుగా వచ్చింది. అది హస్తవాసిగల వైద్యుడిగా పేరు గాంచింది. ఆడ ఎలుగుని గుర్తు పట్టి దగ్గరకు వచ్చింది. బంటిగాడి నాడిని పరీక్షించింది. అదృష్టవశాత్తు అది కొట్టుకుంటోంది. కానీ చాలా బలహీనంగా ఉంది. స్పృహ తప్పిందే గాని, చావలేదని గ్రహించింది. వెంటనే ఆడ ఎలుగుతో ‘ఏడ్వకు. నీ బిడ్డను బతికిస్తాను’ అంది. దాంతో కోతి కాళ్ళు పట్టుకుంది ఆడ ఎలుగు.. ‘నా దగ్గరున్న సమస్త తేనెని నీకు ధార పోస్తాను. నా బిడ్డని దక్కించు’ అంటూ. తన భుజాన వేలాడుతున్న సంచిలోంచి కొన్ని ఆకులు తీసి, నలిపి, బంటిగాడి ముక్కుల్లో పిండింది కోతి. తక్షణమే బంటిగాడు ‘హాఛ్’ అంటూ మూడుసార్లు తుమ్మి, పైకి లేచాడు. సంచీలోని చివరి కాయని కొట్టి, తాగించమని ఆడ ఎలుగుకు సూచించింది కోతి. ఆడఎలుగు కొబ్బరి నీళ్లు తాగించగానే బంటిగాడు తెప్పరిల్లాడు. ఇంతలో ఒక పక్షి పండును తెచ్చిచ్చింది. అది తిన్నాక బంటిగాడికి సత్తువ కలిగి కోలుకున్నాడు. అప్పుడు కోతి ‘మన నిత్యావసరాలు తీరగా మిగిలినది దాచుకుంటే దాన్ని ‘పొదుపు’ అంటారు. కడుపు మాడ్చుకుని కూడబెడితే అది‘పిసినారితనం’ అవుతుంది. నీ లోభత్వంతో కుటుంబాన్ని వేధించావు. ఇరుగు పొరుగుని సాధించావు. దానివల్ల చెడ్డపేరు మూటగట్టుకున్నావు తప్ప చిటికడెంత గౌరవం పొందలేక పోయావు. ‘నా ’ అనే వాళ్ళు నలుగురు లేని ఒంటరి జీవితం వ్యర్థం’ అని హితవు పలికింది. బుద్ధి తెచ్చుకున్న ఆడ ఎలుగు లెంపలేసుకుంది. ‘ఇకపై నా ప్రవర్తన మార్చుకుంటాను’ అంటూ బిడ్డపై ప్రమాణం చేసింది. మరిన్ని పిల్లల కథల కోసం ఇక్కడ క్లిక్ చేయండి