begumpet airport
-
హైదరాబాద్ లో రాష్ట్రపతి
-
బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు.వివరాల ప్రకారం.. బేగంపేట ఎయిర్‌పోర్టుకు సోమవారం ఉదయం బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. సదరు మెయిల్లో విమానాశ్రయంలో బాంబు ఉందని హెచ్చరించారు. దీంతో, అలర్ట్ అయిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. ఎయిర్పోర్ట్ సహా పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా బాంబు లేదని గుర్తించారు. అనంతరం, సదరు మెయిల్ ఎవరు పంపారనే విషయంపై దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో దేశంలోని పలు విమానాశ్రాయలకు కూడా ఇలాగే బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ రావడం తెలిసిన విషయమే. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో బాంబు లేదని తెలిసి అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక, ఇలాంటి కాల్స్, మెయిల్స్ పెడితే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. -
రేవంత్, బాబుల మధ్య అదే చర్చ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తన గురువు చంద్రబాబుతో రెండు గంటల పాటు బేగంపేట ఎయిర్ పోర్టులో చర్చలు జరిపారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రేవంత్‌ను కలిసిన తర్వాతే చంద్రబాబు అమిత్ షాను కలిశారని వివరించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్‌ను బీజేపీ వైపు తీసుకొస్తానని చంద్రబాబు అమిత్ షాకు హామీ ఇచ్చారని ఆరోపించారు. రేవంత్‌కు చంద్రబాబు ఎంత చెబితే అంతే అని వారు విశ్లేషించారు. తెలంగాణ భవన్లో శనివారం మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్ ,క్రాంతి కిరణ్, నన్నపనేని నరేందర్, బీఆర్ఎస్ నేతలు దేవీప్రసాద్, రాకేష్ కుమార్, గట్టు రాంచందర్ రావు మీడియాతో మాట్లాడారు. మోదీ వద్ద బీజేపీ సీఎంలకు దొరకని ప్రాధాన్యత కాంగ్రెస్ సీఎం రేవంత్‌కు దొరుకుతోందని, పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ బీజేపీతో జత కట్టడం ఖాయంగా కనిపిస్తోందని బీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడ్డారు. మోదీని రేవంత్ పెద్దన్నగా సంభోధించిన తర్వాత వారిద్దరి బంధం బలపడిందని, పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ మరో ఏక్ నాథ్ షిండే, హిమంత్ బిశ్వశర్మగా మారుతారని ఆరోపించారు. బాబు మాదిరిగానే రాష్ట్రంలో ఇప్పుడు మళ్లీ కరువు చంద్రబాబు సీఎంగా ఉండగా తెలంగాణలో కరువు ఉండేదని, ఇప్పుడు చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణలో మళ్ళీ కరువు వచ్చిందని వారు విమర్శించారు. రేవంత్ పత్రికల్లో ఇచ్చే అధికారిక ప్రకటనల్లో ఇప్పటికే మార్పు వచ్చిందనీ, ఉపముఖ్యమంత్రి భట్టి ఫొటో ప్రకటనల్లో అదశ్యమయ్యిందన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ ప్రకటనల్లో అమిత్ షా, చంద్రబాబు ఉంటారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు ఆదేశాల మేరకే తెలంగాణ ఉద్యమంపై రేవంత్ రైఫిల్ ఎక్కు పెట్టారని గుర్తు చేశారు. రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నరేంద్రమోడీ చేతిలో పెడుతున్న తీరును కాంగ్రెస్ శ్రేణులు గమనించాలన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో ప్రభుత్వం మారుతుందని బీజేపీ నేతలు ఇస్తున్న ప్రకటనలు రేవంత్‌ను దష్టిలో పెట్టుకుని ఇస్తున్నవేనని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, నేతలు ఆరోపించారు. -
వీడ్కోలు సమయాన విన్నపాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తన రెండురోజుల పర్యటన ముగించుకుని ఒడిశాకు వెళ్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి సీఎం రేవంత్‌రెడ్డి తన విన్నపాల చిట్టా అందజే శారు. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో వేలకోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్న ప్రధాని మంగళవారం ఒడిశాకు బయలుదేరారు. సీఎం రేవంత్ బేగంపేట విమానాశ్రయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయనకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మొత్తం 11 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ► ఎన్టీపీసీకి 4,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉంది. అయితే గత ప్రభుత్వం 1,600 మెగావాట్లు మాత్రమే సా ధించింది. మిగిలిన 2,400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్రం సహ కరించాలి. రాష్ట్రం తరఫున అన్ని అనుమతులు ఇస్తాం. ► హైదరాబాద్‌లో మెట్రో విస్తరణకు, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి (ప్రక్షాళనకు) సహకరించాలి. ► తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భూసేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేలా ప్రధాని జోక్యం చేసుకోవాలి. ► హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై అమ్రాబాద్ అటవీ ప్రాంతం మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సహకరించాలి. 2022–23లోనే కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ తయారీకి రూ.3 కోట్లు మంజూరు చేసింది. రూ.7,700 కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును మంజూరు చేయాలి. ► రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా నీరు నూటికి నూరు శాతం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలి. దాదాపు పది లక్షల కుటుంబాలకు ఇప్పటికీ నల్లాల ద్వారా నీటి సరఫరా జరగడం లేదు. సమీపంలోని నీటి వనరుల ద్వారా గ్రామాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు జల జీవన్ మిషన్ నిధులు కేటాయించాలి. ► ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి హైదరాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో 178 ఎకరాలు, 10 టీఎంసీల కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణానికి పొన్నాల గ్రామ సమీపంలోని 1,350 ఎకరాల మిలటరీ డెయిరీ ఫామ్ ల్యాండ్స్ (తోఫెఖానా) రాష్ట్రానికి బదిలీ చేయాలి. లీజు గడువు ముగిసిన శామీర్‌పేటలో ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ భూములను (1,038 ఎకరాలు) తిరిగి అప్పగించాలి. ► నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్నాం. 5,259 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ప్రభుత్వం నిర్వహిస్తో్తంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర వాటాగా రాష్ట్రానికి రావాల్సిన రూ.347.54 కోట్లను విడుదల చేయాలి. ► భారత్ మాల పరియోజన జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా కల్వకుర్తి–కొల్లాపూర్, గౌరెల్లి–వలిగొండ, తొర్రూర్ – నెహ్రూనగర్, నెహ్రూనగర్–కొత్తగూడెం, జగిత్యాల–కరీంనగర్ ఫోర్‌లేన్, జడ్చర్ల–మరికల్ ఫోర్‌లేన్, మరికల్ – డియసాగర్ టెండర్ల ప్రక్రియకు అనుమతులివ్వాలి. ► ఇండియా సెమీ కండకర్ల మిషన్‌లో భాగంగా తెలంగాణలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం సహకరించాలి. అత్యవసరంగా 29 ఐపీఎస్ పోస్టులను కేటాయించాలి కేంద్ర హోంశాఖ 2016లో తెలంగాణకు 76 ఐపీఎస్ కేడర్ పోస్టులను మంజూరు చేసింది. ప్రస్తుతం పెరిగిన జిల్లాలు, పోలీస్ కమిషనరేట్ల సంఖ్యకు అనుగుణంగా ఐపీఎస్ క్యాడర్‌ను సమీక్షించాలి. అత్యవసరంగా 29 పోస్టులను కేటాయించాలి. ఐఐఎం కూడా ఏర్పాటు చేయండి ఐఐటీ, నల్సార్, సెంట్రల్ వర్సిటీతో పాటు ఎన్నో పేరొందిన పరిశోధన, ఉన్నత విద్యా సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయి. కేంద్రం ఐఐఎంను కూడా ఏర్పాటు చేస్తే అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. మాకే ఓటేయండి.. మంగళవారం బేగంపేట విమానాశ్రయంలో ఓ సరదా సన్నివేశం చోటు చేసు కుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఏకంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్‌రెడ్డిని బీజేపీకి ఓటేయాలంటూ కోరారు. మంగళవారం ప్రధానికి వీడ్కోలు పలికే సమయంలో క్లిక్‌మనిపించిన ఈ ఫొటోలో మోదీ, రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి పొన్నం, నాగర్‌కర్నూల్ ఎంపీ పి.రాములు ఉన్నారు. ఇటీవల బీజేపీలో చేరిన రాములు.. సీఎం రేవంత్ తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఓటరేనని ఈ సందర్భంగా మోదీకి చెప్పారు. అందుకు రేవంత్ కూడా అవునంటూ బదులిచ్చారు. వెంటనే స్పందించిన మోదీ ‘అయితే ఇంకేంటి.. ఈసారి మా కే ఓటేయండి..’ అంటూ సరదాగా వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మోదీ సహా ఫొటోలో కనిపిస్తున్న నేతలు ఒక్కసారిగా ఘొల్లున నవ్వారు. – సాక్షి, హైదరాబాద్ -
Begumpet: గంటసేపు ఉత్కంఠ.. ఐఏఎఫ్ విమానం సేఫ్ ల్యాండ్
-
Begumpet: గంటసేపు ఉత్కంఠ.. ఐఏఎఫ్ విమానం సేఫ్ ల్యాండ్
సాక్షి, హైదరాబాద్: బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఐఏఎఫ్ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. సాంకేతిక లోపంతో విమానం గాలిలో చక్కర్లు కొట్టింది. గంటకుపైగా ఎయిర్‌ఫోర్స్ విమానం గాలిలో చక్కర్లు కొట్టింది. ఎయిర్ ఫోర్స్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ హైడ్రాలిక్స్ వీల్స్ ఓపెన్ కావడంతో గంటకు పైగా విమానం ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. ప్రస్తుతం ఈ విమానంలో సిబ్బందితో సహా 12 మంది ఉన్నారు. సేఫ్ ల్యాండింగ్ కోసం ఏవియేషన్ సిబ్బంది ప్రయత్నించగా, ఉత్కంఠత కొనసాగింది. గంట సేపు ఉత్కంఠత తర్వాత చివరకు బేగంపేట ఎయిర్ పోర్టులో ఐఏఎఫ్ విమానం సురక్షితంగా ల్యాండింగ్ అయ్యింది. సేఫ్‌గా ల్యాండ్ కావడంతో విమానంలో ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. -
బేగంపేట్ ఎయిర్ పోర్టులో 2వ రోజు వింగ్స్ ఇండియా-2024 షో
-
Aviation Expo Wings India 2024: విమానయానం ఉజ్వలం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘మనుషులను, మనసులను విమానయాన రంగం అనుసంధానిస్తోంది. జీవితాల్లో మార్పు తెచ్చింది. సామాజిక, ఆర్థిక పురోగతిలో పాలుపంచుకుంటోంది. నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత విమానయాన పరిశ్రమ వెలుగులమయం’ అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురువారం అన్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో రెండేళ్లకోసారి జరిగే వైమానిక ప్రదర్శన వింగ్స్ ఇండియా–2024 ప్రారంబోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సామాన్యుడికీ విమానయాన అవకాశాన్ని అందించే ఉడాన్ 5.3 స్కీమ్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. దేశీయంగా 30 కోట్లకు.. పౌర విమానయాన రంగంలో ప్రపంచంలో అయిదవ స్థానంలో భారత్ నిలిచిందని జ్యోతిరాదిత్య తెలిపారు. ‘2014లో దేశీయంగా 6 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2023లో ఈ సంఖ్య 15.3 కోట్లకు ఎగసింది. 2030 నాటికి ఇది 30 కోట్లను తాకుతుంది. విమాన ప్రయాణికుల విస్తృతి ప్రస్తుతం కేవలం 3–4 శాతమే. ఏడేళ్లలో ఇది 10–15 శాతానికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. మిగిలిన 85 శాతం మేర అవకాశాలను అందుకోవడానికి కసరత్తు చేస్తున్నాం. అడ్డంకులు తొలగించడంతోపాటు మౌలిక వసతుల కల్పన చేపడుతున్నాం’ అని వివరించారు. కొత్త విమానాశ్రయాలు.. దేశవ్యాప్తంగా 2014 నాటికి 74 విమానాశ్రయాలు, హెలిప్యాడ్స్, వాటర్ డ్రోమ్స్ ఉన్నాయి. ఇవి రావడానికి 65 ఏళ్ల సమయం పట్టిందని సింధియా తెలిపారు. ‘గడిచిన 10 ఏళ్లలో 75 విమానాశ్రయాలు, హెలిప్యాడ్స్, వాటర్ డ్రోమ్స్ జోడించాం. దీంతో ఈ కేంద్రాల సంఖ్య 149కి చేరుకుంది. 2030 నాటికి ఇవి 200 దాటతాయి. ప్రతి జిల్లా కేంద్రంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక. ప్రస్తుతం భారతీయ విమానయాన సంస్థల వద్ద 713 విమానాలు ఉన్నాయి. వచ్చే దశాబ్దిలో వీటి సంఖ్య 2,000 దాటుతుంది. విమానాల కొనుగోలులో యూఎస్, చైనా తర్వాతి స్థానాన్ని భారత్ కైవసం చేసుకుంది’ అని అన్నారు. రికార్డు స్థాయిలో మహిళా పైలట్లు.. ప్రయాణికుల వృద్ధి రేటు దేశీయంగా 15.3 శాతం, అంతర్జాతీయంగా 6.1 శాతం ఉంది. 15 ఏళ్లలో విమానాల్లో సరుకు రవాణా దేశీయంగా 60 శాతం, విదేశాలకు 53 శాతం అధికమైందని సింధియా గుర్తు చేశారు. ‘గతేడాది 1,622 మంది కమర్షియల్ పైలట్ లైసెన్స్ అందుకున్నారు. వీరిలో 18 శాతం మహిళలు కావడం విశేషం. భారత్‌లో ఉన్న పైలట్లలో మహిళల వాటా 15 శాతం ఉంది. ఇది ప్రపంచ రికార్డు. డ్రోన్స్ రంగంలో ప్రపంచ కేంద్రంగా భారత్‌ను నిలబెట్టేందుకు నిబంధనలు సరళీకరించాం, ప్రోత్సాహకాలు ప్రకటించాం’ అని చెప్పారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) వి.కె.సింగ్, తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో
-
Wings India 2024: బేగంపేట్ ఎయిర్పోర్ట్ వేదికగా ‘వింగ్స్ ఇండియా–2024’ (ఫొటోలు)
-
గగనంలో అద్భుత వీక్షణకు
సనత్‌నగర్ (హైదరాబాద్): గగనంలో గగుర్పొడిచే విన్యాసాలకు మరోసారి బేగంపేట విమానాశ్రయం వేదికైంది. వింగ్స్ ఇండియా–2024కు కౌంట్‌డౌన్ మొదలైంది. రెండేళ్లకోసారి జరిగే ఈ వేడుకను కేంద్ర పౌర విమాన శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సంయుక్తంగా ఈ నెల 18 నుంచి 21 వరకు నిర్వహిస్తున్నాయి. గురువారం ఉదయం 10 గంటలకు జరిగే వింగ్స్ ఇండియా–2024 ప్రారంబోత్సవానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. దాదాపు 25 విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శనకు ఉంచనున్నారు. తొలిసారి ప్రదర్శనకు వస్తున్న బోయింగ్‌తోపాటు ఎయిర్ ఇండియా మొదటి హెలికాప్టర్ ఏ350 లాంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మొదటి 2 రోజులు (18, 19 తేదీలు) వ్యాపార, వాణిజ్యవేత్తలను, ఆ తరువాత రెండు రోజులు (20, 21 తేదీలు) సామాన్యులను అనుమతిస్తారు. ఈ షోలో 106 దేశాల నుంచి 1500 మంది డెలిగేట్స్, 5,000 మంది బిజినెస్ విజిటర్స్ పాల్గొననున్నట్లు అంచనా. ఫ్లయింగ్ డిస్ప్లే సమయం పెరిగిందోచ్.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సారంగ్ టీమ్‌తోపాటు మార్క్ జాఫరీస్ బృందం చేసే వైమానిక విన్యాసాలను కళ్లు ఆర్పకుండా చూడాల్సిందే. గతంలో ఫ్లెయింగ్ డిస్ప్లే సమయాన్ని కేవలం 15 నిమిషాల చొప్పున రోజుకు రెండు పర్యాయాలు నిర్వహించగా, ఈసారి 45 నిమిషాల చొప్పున రోజుకు రెండు సార్లు విన్యాసాలు చేయనున్నారు. చివరి రోజు ఆదివారం సందర్శకులు ఎక్కువగా విచ్చేయనున్న దృష్ట్యా ఆ రోజు మూడుసార్లు విన్యాసాలు నిర్వహించనున్నారు. సారంగ్ టీమ్ వచ్చేసింది.. ముగ్గురు హైదరాబాదీలే.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సారంగ్ టీమ్ మరోసారి తమ వైమానిక విన్యాసాలు ప్రదర్శించేందుకు రెడీ అయ్యింది. ప్రపంచంలోనే ఏరోబాటిక్స్ చేసే ఏకైక జట్టుగా పేరొందిన ఈ టీమ్ ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకుంది. ఐదు హెలికాప్టర్లతో ఏరోబాటిక్స్ ప్రదర్శించే ఈ బృందానికి సీనియర్ గ్రూప్ కెపె్టన్ ఎస్కే మిశ్రా నేతృత్వం వహిస్తున్నారు. ఏరోబాటిక్స్ ప్రదర్శన చేసే ఐదుగురిలో ముగ్గురు హైదరాబాదీలే కావడం విశేషం. హైదరాబాదీలైన వింగ్ కమాండర్లు టీవీఆర్ సింగ్, అవినాష్ సారంగ్ టీమ్‌లో రాణిస్తున్నారు. దేశ, విదేశాల్లో ఈ టీమ్ 350 షోలకు పైగా నిర్వహించి రికార్డు సృష్టించింది. వైమానిక విన్యాసాల వేళలు 18వ తేదీన మధ్యాహ్నం 1 – 2 గంటల వరకు, 4.15–5 గంటల వరకు 19న ఉదయం 11.30–12.15 వరకు, మధ్యాహ్నం 3.30–4.15 వరకు. అనంతరం డ్రోన్ షో జరగనుంది. 20న ఉదయం 11.30–12.15 వరకు, మధ్యాహ్నం 3.30–4.15 వరకు.. 21న ఉదయం 11–11.45 వరకు, మధ్యాహ్నం 3–3.45 వరకు, సాయంత్రం 5–5.45 వరకు -
హైదరాబాద్‌లో వింగ్స్ 24 ఎగ్జిబిషన్ (ఫొటోలు)
-
సంజయ్ ఎలా ఉన్నావ్ ?
-
Wings India 2024: ఎయిర్ షో తేదీలు ఖరారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెండేళ్లకోసారి ప్రతిష్టాత్మకంగా జరిగే వింగ్స్ ఇండియా 2024 కార్యక్రమానికి తేదీలు ఖరారయ్యాయి. బేగంపేట విమానాశ్రయం వేదికగా జనవరి 18 నుంచి నాలుగు రోజులపాటు ఇది జరుగనుంది. పౌర విమానయాన శాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, తెలంగాణ ప్రభుత్వం, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (ఫిక్కీ) సంయుక్తంగా వింగ్స్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. పౌర విమానయాన రంగంలో ఆసియాలో ఇదే అతిపెద్ద ప్రదర్శన. 2022లో జరిగిన వింగ్స్ ఇండియా ప్రదర్శనలో 125 కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు గవర్నమెంట్ సమావేశాలు 364 జరిగాయి. 12 ఎయిర్‌క్రాఫ్ట్స్ కొలువుదీరాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సారంగ్ బృందం చేసిన ఎయిర్‌షో ప్రత్యేక ఆకర్షణ. -
ప్రధానిని అవమానించేలా ఫ్లేక్సీలు పెట్టారు: కిషన్‌రెడ్డి
-
ప్రధానిని ఆహ్వానించేందుకు కేసీఆర్‌కు మొహం చెల్లటం లేదు: డీకే అరుణ
-
రైతులతో అమిత్ షా భేటీ.. కేసీఆర్ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిజీ బిజీగా ఉన్నారు. నగరానికి చేరుకున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొని బేగంపేట విమానాశ్రయంలో రైతు సంఘాల నేతలతో అమిత్ షా భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు రైతులతో అమిత్ షా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా.. తెలంగాణ రైతాంగం ఏం కోరుకుంటోందని రైతులను ఆరా తీశారు. ఈ క్రమంలో విద్యుత్ చట్టాన్ని మార్చాలని రైతు సంఘాల నేతలు అమిత్ షాను కోరగా.. దానికి అమిత్ షా సమాధానమిస్తూ మార్చాల్సింది చట్టం కాదు. ఇక్కడి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సంచలన కామెంట్స్ చేశారు. ఇక, అమిత్ షాతో భేటీ ముగిసిన అనంతరం రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణలో అమలు చేయడంలేదు. దీని వల్ల తెలంగాణ రైతులు బీమా సౌకర్యాన్ని కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా భూసార పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం నిధులు ఇస్తున్నా.. తెలంగాణలో మాత్రం భూసార పరీక్షలు జరగడంలేదు. ఇన్పుట్ సబ్సీడీ కూడా రావడంలేదని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిపారు. అలాగే, సేంద్రీయ వ్యవసాయం పెరగాల్సిన అవసరం ఉందని చెప్పినట్టు స్పష్టం చేశారు. ఈ సందర్బంలోనే మోటర్లకు మీటర్లు అనే ప్రతిపాదన లేదని అమిత్ షా క్లారిటీ ఇచ్చారని అన్నారు. ఇదంతా కేసీఆర్ ఆడుతున్న పొలిటికల్ డ్రామా అని చెప్పారని రైతులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: కాషాయ పార్టీ కార్యకర్త ఇంట్లో అమిత్ షా.. కీలక హామీ ఇచ్చిన బీజేపీ బాస్! -
బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న అమిత్ షా
-
కాషాయ పార్టీ కార్యకర్త ఇంట్లో అమిత్ షా.. కీలక హామీ ఇచ్చిన బీజేపీ బాస్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అమిత్ షాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్, బండి సంజయ్ స్వాగతం పలికారు. సత్యనారాయణ ఇంట్లో అమిత్ షా టీ తాగి, స్వీట్ ఆరగించారు. అక్కడే కొంతసేపు ఇంటి సభ్యులతో ముచ్చటించారు. ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త పార్టీ గెలుపు కోసం బలంగా పోరాడాలని సూచించారు. పార్టీ ప్రతీ ఒక్కరికీ గౌరవం దక్కుతుందని అమిత్ షా హామీ ఇచ్చారు. అనంతరం.. అమిత్ షా.. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్లి.. అమ్మవారిని దర్శించుకున్నారు. దేవాలయంలో అమిత్ షా, బీజేపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం నుంచి అమిత్ షా.. నేరుగా బీజేపీ కార్యకర్త సత్యనారాయణ ఇంటికి వెళ్లనున్నారు. అనంతరం, అక్కడి నుంచి అమిత్ షా మళ్లీ.. బేగంపేట్ ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. కాగా, విమానాశ్రయంలో రైతులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రైతులతో వరి కొనుగోలు, రుణమాఫీ, ఫసల్ బీమా యోజనపై అమిత్ షా చర్చించనున్నారు. ఇది కూడా చదవండి: ఊహించని ట్విస్ట్.. అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ.. హీటెక్కిన పాలిటిక్స్? -
‘సీఎం ఎవరు కౌన్ కిస్కా.. కేసీఆర్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలే తమకు బాస్‌లు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణ సమాజానికి తమ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాధానం చెప్పారని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. పర్యటన ముగిసిన నేపథ్యంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు వద్ద సోమవారం ప్రధాని మోదీకి బండి సంజయ్ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో బండి సంజయ్ మాట్లాడుతూ.. సీఎం ఎవరు కౌన్ కిస్కా.. కేసీఆర్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. ముందు తెలంగాణ ప్రజలకు కేసిఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ప్రజల వద్ద మొహం లేక రాష్ట్ర ముఖ్యమంత్రి పారిపోతున్నారు. మోదీని ఎదుర్కోడానికి ఫ్లెక్సీల కోసం పెట్టిన డబ్బులను ప్రజల కోసం ఖర్చు పెట్టు కేసిఆర్. నిన్నటి ప్రధాని సభకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జాతీయ కార్యవర్గ సమావేశాలను తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్నాం. కేసిఆర్ మీద ఉన్న వ్యతిరేకత నిన్నటి విజయ సంకల్ప సభతో మరోసారి బహిర్గతం అయింది. కేసీఆర్ తప్పుడు విధానాల పలితమే నిన్నటి సభ. తెలంగాణ ప్రజలకు మోదీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. -
విజయవంతంగా ముగిసిన ఏవియేషన్ షో (ఫొటోలు)
-
లోహ విహంగాల హంగామా.. 'వింగ్స్ ఇండియా' (ఫోటోలు)
-
WINGS INDIA 2022 : రెక్కలు తొడిగిన గగనం (ఫొటోలు)
-
వరుస సమావేశాలు.. పోటెత్తిన విజిటర్లు
బేగంపేట ఎయిర్‌పోర్టులో జరుగుతున్న వింగ్స్ ఆఫ్ ఇండియా 2022 ఏవియేషన్ షో రెండో రోజు సందండిగా సాగింది. ఏవియేషన్ సెక్టార్‌కి చెందిన కీలక కాన్ఫరెన్సులు రెండో రోజు జోరుగా కొనసాగాయి. మరోవైపు ఏవియేషన్ షో చూసేందుకు బిజినెస్ విజిటర్లు భారీగానే వచ్చారు. హెలికాప్టర్లు, హిందూస్తాన్ విమానాలు మొదలు ఎయిర్‌బస్ వరకు అనేక విహాంగాలను ఈ షోలో ప్రదర్శించారు. హర్యాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తిరుపతి ఎంపీ గురుమూర్తి తదితరులు ఈ షోకు హాజరయ్యారు. గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్‌లో భాగంగా రెండో రోజు ఫ్యూచర్ ఆఫ్ ట్రావెల్, ఎయిర్పోర్ట్ పర్స్పెక్టివ్, ఎయిరో మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ ఎంఆర్వో, ఇండో యూఎస్ రౌండ్ టేబుల్ తదితర అంశాలపై విస్త్రృత చర్చలు జరిగాయి. వింగ్స్ ఆఫ్ ఇండియా చివరి రెండు రోజులు సాధారణ సందర్శనకు అనుమతి ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ షోకు రావాలనుకునే వారు వింగ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్, బుక్ మై షో ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలు, సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక ఎయిర్‌షో ఉంటుంది. -
ఆకట్టుకున్న 'వింగ్స్ ఇండియా 2022' ఏవియేషన్ షో