bhojpuri
-
ఆ ఎంపీ మాతృభాషలో ప్రమాణం ఎందుకు చేయలేకపోయారు?
18వ లోక్‌సభలో భాషా సాంస్కృతిక వైవిధ్యం కనిపించింది. పలువురు ఎంపీలు తమ మాతృభాషలో ప్రమాణం చేశారు. అయితే తన భాష అయిన భోజ్‌పురిలో ప్రమాణం చేయలేకపోయినందుకు బీహార్‌లోని సారణ్కు చెందిన బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ విచారం వ్యక్తం చేశారు.లోక్‌సభలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ఇంగ్లీష్, సంస్కృతం, హిందీ, డోగ్రీ, బెంగాలీ, అస్సామీ ఒరియాలతో సహా పలు భారతీయ భాషల్లో ప్రమాణం చేశారు. ఎంపీలు ఇంగ్లీషులో లేదా రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొన్న 22 భాషల్లో దేనిలోనైనా ప్రమాణం చేయవచ్చు. అయితే భోజ్‌పురి భాషకు ఎనిమిదవ షెడ్యూల్ జాబితాలో స్థానం దక్కలేదు. రాజీవ్ ప్రతాప్ రూడీ భోజ్‌పురిలో ప్రమాణం చేయకపోవడానికి కారణం ఇదే. ఎంపీలు మాతృభాషలో ప్రమాణ స్వీకారం చేయడం గొప్ప అనుభూతిని కలిగిస్తుందని రూడీ అన్నారు.ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీహార్‌లోని తూర్పు చంపారన్‌కు చెందిన బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ అధ్యక్షత వహించారు. కాగా రాజీవ్ ప్రతాప్ సింగ్ రూడీ హిందీలో ప్రమాణం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్యపై రాజీవ్ ప్రతాప్ రూడీ విజయం సాధించారు. -
నామినేషన్ వెనక్కి.. ప్రముఖ నటుడికి ఊరట
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో పలు ఆసక్తికర ఉదంతాలు కూడా వెలుగు చూస్తున్నాయి. బీహార్‌లోని కరకట్ లోక్‌సభ స్థానంలో విచిత్ర రాజకీయ వాతావరణం కనిపించింది.ఈ సీటు నుంచి భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఇంతలోనే అతని తల్లి తల్లి ప్రతిమా దేవి కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి, అనంతరం ఉపసంహరించుకున్నారు. మరోవైపు పవన్ సింగ్ ఎన్నికల ప్రచారంతో ప్రజల మధ్యకు వెళుతున్నారు.పవన్ సింగ్ తల్లి నామినేషన్ ఉపసంహరణ వెనుక ఒక వాదన వినిపిస్తోంది. రాష్ట్రీయ లోక్ మోర్చా చీఫ్, మాజీ కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహా బీజేపీ కూటమి తరపున కరకట్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే పవన్ సింగ్‌కు కూడా బీజేపీతో అనుబంధం ఉంది. దీంతో అతనిపై నామినేషన్ ఉపసంహరించుకోవాలనే ఒత్తిడి వచ్చిందని సమాచారం. దానిని పట్టించుకోకుండా పవన్ సింగ్ కరకట్ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికల బరిలోకి దిగారు. కుమారునికి ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే అతని తల్లి నామినేషన్ దాఖలు చేశారనే మాట వినిపిస్తోంది. అయితే ఆ తరువాత ఆమె తన నామినేషన్ వెనక్కి తీసుకున్నారు.దీనికి ముందు పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ లోక్‌సభ స్థానం టిక్కెట్‌ను బీజేపీ పవన్ సింగ్‌కు కేటాయించింది. అయితే ఆయన అక్కడి నుంచి పోటీ చేసేందుకు నిరాకరించారు. అనంతరం తాను కరకట్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు పవన్ సింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ప్రకటించారు. ప్రతిమాదేవి నామినేషన్ ఉపసంహరణను ఎన్నికల సంఘం ధృవీకరించింది. ఆమె మే 14న స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పవన్ సింగ్ తన నామినేషన్ తిరస్కరణకు గురవుతుందనే అనుమానంతోనే తన తల్లి ప్రతిమా దేవి చేత నామినేషన్ దాఖలు చేయించినట్లు తెలుస్తోంది. జూన్ ఒకటిన కరకట్ లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరగనుంది. -
బరిలోకి మరో ఇద్దరు భోజ్‌పురి సెన్సేషన్లు! బీజేపీ కసరత్తు
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ ప్రకటించిన అభ్యర్థి భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ పోటీ నుంచి తప్పుకొన్నారు. దీంతో ఆ స్థానంలో గట్టి అభ్యర్థిని నిలిపేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రస్థాయి నేతలతోపాటు ఢిల్లీ స్థాయిలోనూ అభ్యర్థి ఎంపికకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అసన్సోల్ లోక్‌సభ స్థానానికి ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను రాష్ట్ర యూనిట్ సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీలోని పార్టీ వర్గాలు ఇద్దరు భోజ్‌పురి సంచలనాలను అన్వేషిస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా వారిలో ఒకరు బెంగాలీ అయినప్పటికీ భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధి చెందారు. బెంగాల్ బీజేపీ సూచించింది వీరినే.. బెంగాల్ బీజేపీ సూచించిన పేర్లు అగ్నిమిత్ర పాల్, జితేంద్ర తివారీ, డాక్టర్ అజయ్ పొద్దార్. వీరిలో అగ్నిమిత్ర పాల్ వైద్యురాలు, విద్యావేత్తల కుటుంబంలో జన్మించారు. కానీ ఫ్యాషన్ డిజైనింగ్‌ని ప్రవృత్తిగా ఎంచుకున్నారు. శ్రీదేవి, మిథున్ చక్రవర్తి, కేకే మీనన్ వంటి బాలీవుడ్ తారలకు ఆమె కాస్టూమ్స్ రూపొందించారు. 2019లో లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమె బీజేపీలో చేరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె అసన్సోల్ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక మరో సిట్టింగ్ ఎమ్మెల్యే జితేంద్ర తివారీ 2020లో బీజేపీలో చేరారు. హిందీలో అనర్గళంగా మాట్లాడగల ఆయన గణనీయమైన సంఖ్యలో హిందీ మాట్లాడే ఓటర్లను ప్రభావితం చేయగలడని పార్టీ భావిస్తోంది. ఆయన గతంలో అసన్సోల్ మేయర్‌గానూ పనిచేయడం మరింత కలిసొచ్చే అంశం. అలాగే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కుల్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్ అజయ్ పొద్దర్ను కూడా స్థానిక పార్టీ పరిశీలిస్తోంది. మరో ఇద్దరు భోజ్‌పురి సంచలనాలు పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ స్థానానికి ఢిల్లీలోని బీజేపీ నాయకత్వం ఇద్దరు భోజ్‌పురి సంచలనాలను అన్వేషిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భోజ్‌పురి చిత్రాల బెంగాలీ స్టార్ 'మోనాలిసా'పై కాషాయ పార్టీ ప్రత్యేక ఆసక్తి చూపుతున్నట్లు చెబుతున్నారు. ఆమె అసలు పేరు అంటారా బిస్వాస్. హిందీ టెలివిజన్‌లో పేరు సంపాదించడంతో పాటు భోజ్‌పురి సినీ పరిశ్రమలోనూ సంచలనంగా మారారు. ఆమెకు బెంగాలీ, హిందీ, భోజ్‌పురి భాషల్లో కూడా ప్రావీణ్యం ఉంది. అందుకే ఆమెను అసన్సోల్ నుంచి పోటీ చేయించే అంశాన్ని బీజేపీ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. మోనాలిసా బిగ్ బాస్-10లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. దక్షిణ కోల్‌కతాలోని జూలియన్ డే స్కూల్లో చదువుకున్న ఆమె కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలయ్యారు. భోజ్‌పురి పరిశ్రమలో సెన్సేషన్ అయిన మోనాలిసా భోజ్‌పురి స్టార్‌నే వివాహం చేసుకున్నారు. ఇక పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరైన మరో భోజ్‌పురి సంచలనం అక్షరా సింగ్‌ను రంగంలోకి దించే అవకాశాలను కూడా బీజేపీ పరిశీలిస్తోందన్న ఊహాగానాలు ఉన్నాయి. 'మోనాలిసా' కంటే పెద్ద స్టార్ అయినప్పటికీ అక్షరా సింగ్ విషయంలో కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. ఈమెకు బెంగాలీ నేపథ్యం లేకపోవడం, పవన్ సింగ్‌తో గత అనుబంధం. బీజేపీ అధిష్టానం ఈ ఐదుగురిలో ఒకరిని ఎంపిక చేస్తుందా లేక ఇంకెవరైనా కొత్తవారికి అవకాశం ఇస్తుందా అన్నది చూడాలి. -
లెజెండరీ సింగర్ పంకజ్ ఉదాస్ కన్నుమూత
మ్యూజిక్ లెజెండ్, పద్మశ్రీ గ్రహీత పంకజ్ ఉదాస్ (72) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తను పంకజ్ కూతురు నయాబ్ ఉదాస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా పంకజ్.. 1951లో గుజరాత్‌లోని జెటూర్‌లో జన్మించారు. చదువుకునే వయసులోనే ఆయన కుటుంబం ముంబైకి షిఫ్ట్ అయింది. తన అన్నయ్య మన్హర్ ఉదాస్ బాలీవుడ్లో ప్లేబ్యాక్ సింగర్‌గా రాణించారు. రెండో అన్న నిర్మల్ గజల్ గాయకుడిగా పేరు గడించారు. వారి బాటలోనే పంకజ్ కూడా నడిచారు. 1970లో వచ్చిన తుమ్ హసీన్ మే జవాన్ సినిమాలో తొలిసారి పాట ఆలపించారు. నామ్(1986) సినిమాలో పాడిన చ్టిటి ఆయూ హై పాట పంకజ్‌కు గుర్తింపు తెచ్చిపెట్టింది.అప్పటినుంచి మూడు దశాబ్దాల పాటు తన గాత్రంతో ప్రేక్షకులను అలరించారు.'చిట్టి ఆయిహై ఆయూహై.. చిట్టీ ఆయిహై..', 'చాంది జైసా రాంగ్ హై తేరా.. ఔర్ ఆహిస్తా కిజియే బాతే', 'తోడితోడి పియా కరో..' ఇలా బాలీవుడ్లో ఎన్నో అద్భుతమైన సాంగ్స్ ఆలపించారు. సొంతంగా మ్యూజిక్ ఆల్బమ్స్ రిలీజ్ చేశారు. గజల్ సింగర్‌గా ఎక్కువ ప్రసిద్ధి పొందారు. పంకజ్ సేవలను గుర్తించిన కేంద్రం 2006లో పద్మశ్రీతో సత్కరించింది.చదవండి: TV Serial Actress Story: ఛాన్స్ కోసం ఆ పని చేయాలి.. వద్దని చెత్త ఏరుకుంది.. తర్వాత లక్షలు ఆర్జిస్తూ.. -
Akshara Singh: హీరోయిన్ షోపై రాళ్ల దాడి.. వీడియో వైరల్
భోజ్‌పురి ప్రముఖ నటి, గాయని అక్షర సింగ్ నిర్వహించిన ఓ లైవ్ షో స్వల్ప ఉద్రిక్తలకు దారి తీసింది. ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో తోపులాట జరిగింది. ఫ్యాన్స్‌ని అదుపు చేసేందకు పోలీసులు లాఠీచార్జ్ చేయగా..కొంతమంది తిరగబడి పోలీసులపై రాళ్ల దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ హీరోయిన్ అక్షర సింగ్‌కి భోజ్‌పురిలో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె కేవలం నటి మాత్రమే కాదు, మంచి గాయని, డ్యాన్సర్ కూడా. తాజాగా అక్షర బిహార్‌లోని జౌరంగాబాద్ జిల్లాలో ఓ షాప్ ఓపెనింగ్‌కి వెళ్లింది. (చదవండి: నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే: సమంత) పేపర్ ప్రకటన ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు.. పెద్ద ఎత్తున ఆ షాపింగ్ మాల్కి తరలి వచ్చారు. కాస్త ఆలస్యంగా వచ్చిన అక్షర.. స్టైజ్‌పైకి వెళ్లి ఓ అద్భుతమైన పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ సమయంలో ఫ్యాన్స్ మధ్య తోపులాట జరిగింది. దీంతో వారిని అదుపు చేసేకుందు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అనంతరం అక్షర సింగ్‌ని అక్కడ నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ పోలీసులపై రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో చాలా మంది అభిమానులతో పాటు పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పోలీసులు అక్షర సింగ్‌కి రక్షణ కవచంగా మారి అక్కడి నుంచి సేఫ్‌గా పట్నాకు తరలించారు. ఈ ఘటనపై ఓ పోలీస్ అధికారి స్పందిస్తూ.. అక్షర చాలా ఆలస్యంగా కార్యక్రమానికి చేరుకుందని, దీంతో అక్కడ ఉన్న జనం అసహనానికి గురై రచ్చ సృష్టించారని తెలిపారు. (చదవండి: ఏం చేస్తోందసలు.. యాక్టింగా? గుర్తుపట్టడం కష్టమే!) 2010లో విడుదలైన సత్యమేవ జయతే అనే భోజ్‌పురి సినిమాతో అక్షర సింగ్ వెండితెరకు పరిచయమయ్యారు. తనదైన నటనతో తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో అక్షరకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. 2015లో కాల టీకా, సర్వీస్ వాలి బాహు అనే హిందీ టెలివిజన్ సిరీస్‌లలో నటించారు. కొన్నాళ్ల తర్వాత సినిమా అవకాశాలు తగ్గాయి. దీంతో 2021లో బిగ్‌బాస్ ఓటీటీ వర్షన్లో పాల్గొంది. #Bhojpuri star Akshara Singh पर Fans ने फेंके पत्थर, बेकाबू भीड़ पर Police ने किया लाठीचार्ज#Akshara #AksharaSingh #BhojpuriSongs #Bihar #AksharaSinghNews #AksharaSinghSongs #AksharaSinghHot #BhojpuriNews #Bollywood #Bhojiwood #BhojpuriMovies #BhojpuriFilms #PawanSingh pic.twitter.com/hPwCDe784o — JAYANTIKA TRIPATHI (@Jayantika_t) January 18, 2024 It’s late cold but still fans in thousands came to sherni event in Daudnagar..that’s the love she has earned. Some Bollywood stars don’t have such craze as humari bhojpuri Queen @AKSHARASINGH1 . #Bollywood #Bhojpuri #AksharaSingh #BiggBoss 🔥🔥🔥🔥 pic.twitter.com/z73tBwHKdB — Sherni Akshara Fan (@queen_twirl3) January 17, 2024 -
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. పొట్టకూటి కోసం భిక్షాటన చేస్తూ..
ఒక్కోసారి మన కళ్లు మనల్నే మోసం చేస్తున్నాయా? అనిపిస్తుంది! రంగుల ప్రపంచంలో ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న కొందరు తారలు తర్వాత గుర్తుపట్టలేని స్థితికి మారిపోయారు. చేతినిండా డబ్బులుండే స్థితి నుంచి ఒకరి దగ్గర చేతులు చాచి అడగాల్సిన పరిస్థితికి దిగజారిపోయారు. తెలుగు, తమిళం, హిందీ అని కాకుండా అన్ని భాషల్లోనూ ఇలాంటి దుస్థితిని ఎదుర్కొన్న తారలు ఉన్నారు. ఒకప్పటి ఆ సెలబ్రిటీయేనా ఇలాంటి హీనస్థితిలో ఉంది? అని అభిమానులు కళ్లు చెమర్చుకున్న రోజులున్నాయి. హీరోయిన్ మిథాలి శర్మ కూడా అందనంత ఎత్తుకు వెళుతుందనుకుంటే అందరి దగ్గర భిక్షమడిగే స్థాయికి దిగజారింది. అందుకు గల కారణాలేంటి? అసలు తనకు ఏమైంది? అనేది ఈ కథనంలో చదివేద్దాం.. ఇంటితో సంబంధం కట్ మిథాలి శర్మ.. భోజ్‌పురిలో ఫేమస్ హీరోయిన్. ఈమె స్వస్థలం ఢిల్లీ. ఎప్పటికైనా టీవీలో కనిపించాలనుకున్న ఆమె అందుకోసం ఇంటి నుంచి పారిపోయింది. ఒంటరిగా ముంబై వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడే ఆమెతో సంబంధాలు తెంచేసుకుంది మిథాలి కుటుంబం. ఇక ముంబైలో చెప్పులరిగేలా తిరిగిన మిథాలి తొలుత మోడలింగ్ చేసింది. తర్వాత సినిమాలు చేసింది, బాగానే క్లిక్ అయింది. దీంతో దర్శకనిర్మాతలు ఈమెతో సినిమా తీసేందుకు పోటీపడ్డారు. ఆ రేంజ్లో క్రేజ్ అందుకుంది. పని దొరక్క డిప్రెషన్లోకి.. కానీ, సడన్‌గా అంతా మారిపోయింది. అదృష్టం బాలేకపోతే అరటిపండు తిన్నా పన్ను విరుగుతుందన్నట్లు తన జీవితంలో బ్యాడ్ టైమ్ మొదలైంది. తను చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌టాక్‌ను మూటగట్టుకున్నాయి. అవకాశాలు తగ్గిపోయాయి. చాలాకాలం చేతిలో సినిమాలు లేక ఖాళీగా ఉండాల్సి వచ్చింది. నెలలు కావస్తున్నా పని దొరక్కపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. అలాగే కూర్చుంటే కడుపు నిండదు కదా.. పొట్టకూటి కోసం ఏదో ఒక పని చేయాలనుకుంది. అందుకే భిక్షాటన మొదలుపెట్టింది. ముంబై వీధుల్లో కనిపించినవారినల్లా నాలుగు రూపాయలు దానం చేయమని కోరింది. భిక్షాటన చేస్తూ పోలీసులకు దొరికిన హీరోయిన్ ఆ మధ్య ముంబై లోఖండ్వాలాలో భిక్షాటన చేస్తున్నవారిని పోలీసులు అరెస్ట్ చేయగా అందులో మిథాలి శర్మ కూడా ఉంది. తన చేతికి మహిళా పోలీసు బేడీలు వేస్తుంటే మిథాలి ఆమెను తిట్టిందని, అక్కడి నుంచి పారిపోవడానికి కూడా ప్రయత్నించిందని వార్తలు వచ్చాయి. చివరకు ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లగా మిథాలి తనకు కాస్త అన్నం పెట్టమని అడిగిందట! దీంతో ఆమెకు అన్నం పెట్టి ఆకలి తీర్చిన పోలీసులు తన మానసిక స్థితి సరిగా లేదని గ్రహించారు. దీంతో తనను మానసిక వికలాంగుల ఆశ్రమంలో చేర్పించినట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం మిథాలి శర్మ ఎక్కడుంది? ఎలా ఉంది? అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. చదవండి: సినీప్రియులకు అదిరిపోయే న్యూస్.. ఒకే సినిమాలో ఇద్దరు లెజెండరీ హీరోలు! -
నమ్మించి దారుణం.. నటిపై రెండుసార్లు అత్యాచారం..!
ప్రముఖ భోజ్‌పురి నటి ప్రియాన్స్ సింగ్ సంచలన ఆరోపణలు చేసింది. తన సహా నటుడు పునీత్ సింగ్ అత్యాచారం చేశాడని ఆరోపింంచింది. తనపై చాలా అసభ్యంగా ప్రవర్తించాడంటూ గతనెల 29న పోలీసులను ఆశ్రయించింది. తనతో అసహజమైన పనులు చేశాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. (ఇది చదవండి: ఏకంగా తొమ్మిది చిత్రాలు.. ఆ దర్శకుల్లో టాప్ ఎవరంటే.. రాజమౌళి మాత్రం!) ప్రియాంక మాట్లాడుతూ.. 'నా కెరీర్లో బాగా పని చేస్తున్న సమయంలోనే సోషల్ మీడియాలో పునీత్ సింగ్ రాజ్పుత్ని కలిశా. ఆ తర్వాత నాతో మాట్లాడటం ప్రారంభించాడు. మొదట నాతో చాలా మర్యాదగా వ్యవహరించేవాడు. చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాలనేది అతని కోరిక. నా పరిచయాల ద్వారా అతనికి సాయం చేశా. దీంతో అతనిపై పూర్తి నమ్మకం ఏర్పడింది. నన్ను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ చెప్పేవాడు. ఆ తర్వాత మా ఇంటికి రావడం మొదలెట్టాడు.' అంటూ చెప్పుకొచ్చింది. ప్రియాంక మాట్లాడుతూ.. 'ఒక రోజు నేను ఒంటరిగా ఉన్నప్పుడు మద్యం తాగి మా ఇంటికి వచ్చాడు. నాపై బలవంతంగా అత్యాచారం చేశాడు. నా జుట్టు పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. మరుసటి రోజు ఉదయం అతను స్పృహలోకి వచ్చాక.. పోలీసులకు కంప్లైంట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చా. ఏడ్చి నన్ను క్షమించమని వేడుకున్నాడు. ఆ తర్వాత తన కుటుంబాన్ని ఒప్పించి.. త్వరలో పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. ఇటీవల మరోసారి నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నాకు అతనిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. . నాకు న్యాయం కావాలి. అతనికి వీలైనంత త్వరగా శిక్ష విధించాలి.' అని డిమాండ్ చేసింది. (ఇది చదవండి: హీరో అవ్వాలనుకున్నా, సీక్రెట్‌గా పెళ్లి.. ఇండస్ట్రీలో కష్టాలు..: గడ్డం నవీన్) -
భోజ్‌పురి సింగర్‌కు బుల్లెట్ గాయం...వీడియో వైరల్
-
లైవ్ షోలో సింగర్‌కు బుల్లెట్ గాయం.. ఆస్పత్రికి తరలింపు!
ప్రముఖ భోజ్‌పురి సింగర్ నిషా ఉపాధ్యాయకు బుల్లెట్ తగిలింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బీహార్‌లోని పాట్నాలో ఓ లైవ్ షోలో బుల్లెట్ తగిలినట్లు తెలుస్తోంది. అయితే వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. బీహార్‌లోని సరన్‌లో ఓ కల్చరల్ ప్రోగ్రామ్‌లో ప్రదర్శన ఇచ్చేందుకు నిషా రాగా.. యజ్ఞం జరుగుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. (ఇది చదవండి: అమ్మాయిలపై అత్యాచారం.. నటుడికి 30 ఏళ్ల జైలు శిక్ష) కాగా.. నిషా ఉపాధ్యాయ్ బీహార్‌కి చెందిన సింగర్. ఆమెది సరన్ జిల్లాలోని గౌర్ బసంత్ స్వస్థలం కాగా.. పాట్నాలోనే ఉంటున్నారు. నిషా ఎక్కువగా సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. ఆమె పాటల్లో లే లే ఆయే కోకా కోలా, నవకర్ మంత్ర, ధోలిదా ధోల్ రే వగడ్, హసి హసి జాన్ మారెలా లాంటి హిట్ సాంగ్స్ ఉన్నాయి. (ఇది చదవండి: రూ.190 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న గ్లామర్ క్వీన్, ఆ నిర్మాత ఇంటిపక్కనే!) స్పందించిన పోలీసులు.. నిషా ఉపాధ్యాయ్‌పై బుల్లెట్ తగలడంపై పోలీసులు స్పందించారు. ఈ సంఘటన గురించి మాకు సమాచారం అందింది.. కానీ ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కాల్పులు ఎవరు జరిపారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నాం అని తెలిపారు. -
హోటల్ రూంలో శవమై కనిపించిన దర్శకుడు
ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. షూటింగ్ కోసం ఓ హోటల్లో బస చేసిన దర్శకుడు శవమై కనిపించారు. వివరాల ప్రకారం.. భోజ్‌పురి డైరెక్టర్ సుభాష్ చంద్ర తివారీ ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో షూటింగ్ కోసం మూవీ టీం అందరితో కలిసి ఓ హోటల్లో బసచేశారు. అయితే ఉదయం ఎంత పిలిచినా స్పందించికపోవడంతో అనుమానం వచ్చి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి తలుపులు బద్దలుకొట్టగా అప్పటికే తివారీ మృతిచెందారు. అయితే ఆయన మరణానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. -
మోడల్స్‌తో వ్యభిచారం.. ప్రముఖ నటి అరెస్ట్!
ముంబయి పోలీసులు హై లెవెల్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. మోడల్స్‌తో వ్యభిచారం నిర్వహిస్తున్న నటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని గోరెగావ్‌లోని ఓ హోటల్లో వ్యభిచార దందా నడుస్తోందన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భోజ్‌పురి నటి సుమన్ కుమారిని అరెస్ట్ చేశారు. వ్యభిచార కూపం నుంచి ముగ్గురు మోడల్స్‌ను పోలీసులు రక్షించారు. ఈ దందాలో భోజ్‌పురి నటి యువతులను ట్రాప్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భోజ్‌పురి నటి వయసు 24 ఏళ్లు కాగా.. గోరేగావ్‌లోని రాయల్ పామ్ హోటల్లో నిందితురాలు ఈ వ్యాపారాన్ని పోలీసులకు సమాచారం అందింది. శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు దాడులు నిర్వహించగా.. నటి చీకటి దందా బయటపడింది. కాగా.. భోజ్‌పురి చిత్ర పరిశ్రమకు చెందిన సుమన్ కుమారి ‘లైలా మజ్ను సినిమాలో నటించింది. అలాగే వెబ్ సిరీస్ జామ్‌స్టిక్ బాక్స్, భోజ్‌పురి కామెడీ ఎపిసోడ్ ‘బాప్ నంబ్రి బేటా దస్ నంబ్రి’లో పనిచేసింది. ఈనె హిందీ, పంజాబీ మ్యూజిక్ ఆల్బమ్‌లలో కూడా పనిచేసింది. Maharashtra | A Bhojpuri actress Suman Kumari (24) has been arrested by Mumbai Police for allegedly forcing girls (models) into prostitution. Police also rescued 3 models. Further investigation is being done: Crime Branch, Mumbai police — ANI (@ANI) April 21, 2023 -
Video: మెట్రో యువతి మరో డ్యాన్స్.. ఈసారి యువకుడితో స్టెప్పులు
ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ప్రపంచాన్ని శాసిస్తోందనే చెప్పాలి. సామాన్యుడిని సెలబ్రిటీ చేయాలన్నా, ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నా, అంతెందుకు మనీ సంపాదనకు కూడా మార్గం చూపిస్తూ ప్రత్యేకంగా యవతను తనవైపు తిప్పుకుంది. ఇదిలా ఉండగా భారతదేశంలో టిక్‌టాక్ నిషేధం తర్వాత, నెటిజన్లు ఇప్పుడు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇన్‌స్టాగ్రామ్‌ను ఆశ్రయిస్తున్నారు. ఫోటోగ్రఫీ నైపుణ్యాలను ప్రదర్శించడం నుంచి అనేక ఫన్నీ వీడియోలు, డ్యాన్స్‌లు, పాడే క్లిప్‌లతో ప్రజలను అలరించడం వరకు ఇలా ఒక్కటేంటి నెటిజన్లు తమ ప్రతిభను ప్రదర్శించడానికి సోషల్‌మీడియా ఒక వేదికగా రూపాంతరం చెందిందనే చెప్పాలి. అందుకే యవత వీడియోలతో తమ టాలెంట్‌ను నెట్టింట షేర్ చేస్తున్నారు. ఇటీవల చీరకట్టులో ఢిల్లీ మెట్రో ప్లాట్‌ఫాంపై డ్యాన్స్ చేసి హల్చల్ చేసిన అవ్నీకరీశ్ తాజాగా మరో డాన్స్ వీడియో ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. వృత్తిరీత్యా డ్యాన్సర్‌గా చెప్పుకునే అవ్నీకరీశ్ ఢిల్లీ మెట్రో స్టేషన్లో భోజ్‌పురి పాట సాజ్ కే సవార్ కేకు తన నిర్మొహమాటంగా డ్యాన్స్ చేసినందుకు అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే పబ్లిక్‌గా డ్యాన్స్ చేయడం ఆమెకు కొత్తేమీ కాదు. తాజాగా ఈ యువతి నలుపు రంగు లెహంగా ధరించి, తన డ్యాన్స్ పార్ట్నర్తో స్టెప్పులేసింది. సల్మాన్ ఖాన్, రాణి ముఖర్జీ నటించిన హలో బ్రదర్లోని తేరి చున్నారియా పాట బీట్లకు వీరిద్దరూ డ్యాన్స్ చేసి అలరించారు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Avnikarish Avnikarish (@avnikarish) -
చీరకట్టులో యువతి డ్యాన్స్.. ఢిల్లీ మెట్రో మరో వీడియో వైరల్..
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో ఢిల్లీ మెట్రో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఓ యువతి టూ పీస్ బికినీ టైప్ డ్రెస్ ధరించి ప్రయాణించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మరో ఘటనలో సీటు కోసం గొడవపడుతూ ఓ మహిళ మరో మహిళపై పెప్పర్ స్ప్రే కొట్టింది. తాజాగా ఓ యువతి చీరకట్టులో ఢిల్లీ మెట్రో ప్లాట్‌ఫాంపై డ్యాన్స్ చేసి హల్చల్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎర్ర చీర ధరించి బోజ్‌పురి పాటకు అదిరే స్టెప్పులేసి అదరగొట్టిన ఈ యువతి పేరు అవ్నీకరీశ్. ఇన్‌స్టాలో తన డ్యాన్స్ వీడియో పోస్టు చేసింది. ఇప్పటికే వేల మంది ఈ వీడియోను వీక్షించారు. View this post on Instagram A post shared by Avnikarish Avnikarish (@avnikarish) అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఢిల్లీ మెట్రో ఆవరణలో ఇలాంటి ఫొటోలు, వీడియోల చిత్రీకరణపై నిషేధం అమల్లో ఉంది కాదా.. అయినా ఎలా రికార్డు చేశారు అని కొందరు అభ్యంతరం తెలిపారు. మరికొందరేమో ఇలాంటి వాటిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకొందరు మాత్రం యువతి స్టెప్పులకు ఫిదా అయ్యారు. ఎలాంటి భయం లేకుండా మెట్రో ప్లాట్‌ఫాంపై డ్యాన్స్ చేసిన ఈమె ధైర్యవంతురాలు అని ప్రశంసలు కురిపించారు. ఈమె డ్యాన్స్‌ను తెగమెచ్చుకున్నారు. అవ్నీకరీశ్ ఢిల్లీ మెట్రోలో డ్యాన్స్ చేయడం ఇదే తొలిసారి కాదు. మార్చిలోనూ సోనూ నిగమ్ పాటకు నృత్యం చేసి.. ఆ వీడియోనూ కూడా ఇన్‌స్టాలో పోస్టు చేసింది. చదవండి: తాజ్‌మహల్ ప్రేమకు చిహ్నం కాదు.. దాన్ని కూల్చేయాలి: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు -
నటి సూసైడ్ కేసు.. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు
నటి ఆకాంక్ష దుబే ఆత్మహత్య కేసులో తవ్వేకొద్దీ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. భోజ్ పురి ఫేమస్ నటి అయిన ఆకాంక్ష వారణాసిలోని ఓ హోటల్ రూంలో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. షూటింగ్లో భాగంగా ఓ హోటల్లో బస చేసిన ఆమె అక్కడే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది.చనిపోయే ముందు కూడా ఫాలోవర్స్‌తో ఇన్‌స్టా లైవ్‌లో ముచ్చటించిన ఆమె సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. తాజాగా ఆకాంక్ష దుబే పోస్టుమార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఆమె కడుపులో 20 మీ.లీ. గుర్తు తెలియని లిక్విడ్‌ని గుర్తించారు. అలాగే ఆమె మణికట్టుపై కూడా గాయాలు ఉన్నట్లు తేలింది. దీంతో ఆకాంక్ష దుబేది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాగా ఆకాంక్ష కొంతకాలంగా సహనటుడు సమర్ సింగ్‌తో ప్రేమలో ఉంది. ఆకాంక్ష మరణానంతరం సమర్ సింగ్‌తో పాటు అతని సోదరుడు సంజయ్ సింగ్ పరారీలో ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. -
నటి సూసైడ్ కేసు.. ఆ మిస్టరీ మ్యాన్ ఎవరు?
భోజ్‌పురి నటి ఇటీవల వారణాసి ఓ హోటల్లో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆత్మహత్యకు ముందే ఓ వీడియో సాంగ్‌ను కూడా రిలీజ్ చేసింది. అయితే నటి ఆత్మహత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సూసైడ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారణాలపై ఆరా తీస్తున్నారు. తాజాగా బయటకొచ్చిన హోటల్ సీసీటీవీ ఫుటేజ్‌లో మరో వ్యక్తి కూడా నటితో కనిపించడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అతను ఎవరన్నదానిపై ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. మార్చి 26న ఆకాంక్ష తన హోటల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. ఇప్పటికే ఆమె సూసైడ్ చేసుకున్న రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఆమె హోటల్ గదిలో 17 నిమిషాల పాటు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీలో ఉన్న మిస్టరీ మ్యాన్ ఆకాంక్షతో పాటే ఉన్నాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కానీ అతని ముఖం ఆ వీడియో ఫుటేజీలో తగినంత స్పష్టంగా కనిపించడం లేదు. దీంతో ఆ మిస్టరీ మ్యాన్ ఎవరనేది పోలీసులు గుర్తించలేకపోతున్నారు. కాగా.. ఆకాంక్ష దుబే 'లైక్ హూన్ మై నాలైక్ నహిన్' చిత్రం షూటింగ్ కోసం వారణాసిలోని ఒక హోటల్లో బస చేసింది. ప్రియుడిపై కేసు నమోదు ఆకాంక్ష మరణానంతరం ఆమె ప్రియుడు సమర్ సింగ్, అతని సోదరుడు సంజయ్ సింగ్ వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె తల్లి కేసు పెట్టింది. సమర్ సింగ్ తన కుమార్తెను కొట్టేవాడని, అతని సోదరుడు చంపేస్తానని బెదిరించాడని ఆకాంక్ష తల్లి తన పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆకాంక్ష మరణించినప్పటి నుంచి సింగ్ సోదరులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. Exclusive CCTV footage of Bhojpuri actress Akanksha Dubey surfaced, in the video the actress is seen with Sandeep Singh. Look #AkanshaDubey #AkanshaDubeySuicide #CCTVFootage #bhojpuriactress https://t.co/b9kotfX75c pic.twitter.com/fbtQzCitSr — Siraj Noorani (@sirajnoorani) March 31, 2023 -
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. యువనటి ఆత్మహత్య
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. శనివారం కన్నడ డైరెక్టర్ కిరణ్ గోవి గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆ విషాదం మరవకముందే మరో నటి సూసైడ్ చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే ఆత్మహత్యకు పాల్పడింది. వారణాసిలోని ఓ హోటల్లో ఆమె విగతజీవిగా కనిపించింది. ఈ ఘటనతో భోజ్‌పురి చిత్రసీమ విషాదంలో మునిగిపోయింది. ప్రస్తుతం నటి వయస్సు 25 సంవత్సరాలు. కొన్ని గంటల ముందే సాంగ్ రిలీజ్ ఆత్మహత్యకు కొన్ని గంటలముందే పవన్ సింగ్‌తో కలిసి ఆమె చేసిన మ్యూజిక్ వీడియోను విడుదల చేశారు. ఆ తర్వాత కొన్ని గంటలకే ఆకాంక్ష ఆత్మహత్య చేసుకుంది. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో డ్యాన్స్ రీల్స్ చేస్తూ అభిమానులతో పంచుకునేవారు. ఆకాంక్ష దూబే 21 అక్టోబర్ 1997న ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్లో జన్మించింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఆకాంక్ష ఇన్‌స్టాగ్రామ్‌లో రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించింది. తన సహనటుడు సమర్ సింగ్‌తో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది. అయితే ఆకాంక్ష 2018లో డిప్రెషన్‌తో బాధపడి.. కొన్ని రోజులు సినిమాల నుంచి విరామం తీసుకుంది. ఆ తర్వాత తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆమె 17 ఏళ్ల వయసులోనే మేరీ జంగ్ మేరా ఫైస్లా అనే చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఆకాంక్ష ముజ్సే షాదీ కరోగి (భోజ్‌పురి), వీరన్ కే వీర్, ఫైటర్ కింగ్, కసమ్ పైడా కర్నే కేఐ 2 ప్రాజెక్ట్‌లలో కూడా కనిపించింది. View this post on Instagram A post shared by Prashant Photography Deoria (@prashant_photography_deoria) -
యోగి సర్కార్‌పై సెటైరికల్ సాంగ్.. సింగర్‌కు నోటీసులు
ప్రముఖ భోజ్‌పురి గాయని నేహా సింగ్ రాథోడ్‌కు ఉత్తర ప్రదేశ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. యూపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పాట పాడినందుకు ఆమెకు ఈ నోటీసులు అందాయి. కాగా ఇటీవల కాన్పూర్ అక్రమ ఇళ్లను తొలగిస్తుండగా తల్లీ కూతుళ్లు మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై సెటైర్లు వేస్తూ నేహా సింగ్ ఓ పాట పాడారు. ‘యూపీ మే కా బా సీజన్-2’ పేరుతో ఈ పాటను యూట్యూబ్, ఫేస్బుక్లో విడుదల చేశారు. ఈ క్రమంలోనే నేహా రాథోడ్ పాడిన పాటపై యోగి సర్కార్ సీరియస్ అయ్యింది. ఆ వెంటనే యూపీ పోలీసులు రంగంలోకి దిగారు. గాయని తన పాట ద్వారా ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆరోపిస్తూ సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేశారు. తనకు నోటీసులు రావడంపై గాయని స్పందిస్తూ.. మంగళవారం రాత్రి కాన్పూర్ పోలీసులు తన ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారని పేర్కొంది. తన పాటల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఇదేం తొలిసారి కాదని వెల్లడించారు. ప్రభుత్వం ఎవరికి సమాధానాలు ఇవ్వదని.. కేవలం నోటీసులే జారీ చేస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘జానపద గాయకురాలిగా నా బాధ్యతను నిర్వర్తించడానికి ఎప్పుడూ ప్రయతిస్తాను. జానపద పాటల ద్వారా ప్రభుత్వాలపై ప్రశ్నలు లేవనెత్తాను. యూపీ సర్కార్‌కు వ్యతిరేకంగా ప్రశ్నలను లేవనెత్తడానికి నేను 'కా బా' ఫార్మాట్‌ను ఉపయోగించడం ఇదేం తొలిసారి కాదు. ఎన్నికల సమయంలో కూడా నేను అనేక ప్రశ్నలు సంధించాను. దానిపై వారు ఇప్పటికీ సమాధానాలు చెప్పలేకపోయారు. వారు సమాధానాలు ఇవ్వలేరు.. కానీ నోటీసులు మాత్రమే జారీ చేస్తారు. యూపీలో ప్రస్తుత పరిస్థితిపై సమాజ్‌వాదీ పార్టీని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది.. కరెక్ట్ కాదు కదా. నేను ఏ ఒక్క పార్టీని టార్గెట్ చేయడం లేదు, కేవలం అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నించడమే నా పని’ అని పేర్కొన్నారు. తనను ఎంత ఇబ్బంది పెట్టినా భయపడేది లేదని, సాధారణ ప్రజల సమస్యల మీద పాటలు పాడటం ఆపనని భోజ్‌పురి సింగర్ స్పష్టం చేశారు. కాగా గుజరాత్ ఎన్నికలకు ముందు మోర్బీ వంతెన కూలిపోవడం గురించి కూడా ఆమె 'గుజరాత్ మే కా బా' అంటూ పాట పాడారు అంతేగాక 2022 యూపీ ఎన్నికల ముందు కూడా నేహా సింగ్ రాథోడ్ ఇలాగే ‘‘యూపీ మే కాబా’’ అంటూ పాట పాడారుది. ప్రస్తుతం దీని రెండో వెర్షన్ ను రిలీజ్ చేశారు. 'यू पी में का बा!' पर पुलिस का नोटिस..!#Nehasinghrathore #up @Uppolice @myogiadityanath @myogioffice #democracy pic.twitter.com/szZUsqvRCu — Neha Singh Rathore (@nehafolksinger) February 21, 2023 'यू पी में का बा!' पर पुलिस का नोटिस..!#Nehasinghrathore #up @Uppolice @myogiadityanath @myogioffice #democracy pic.twitter.com/szZUsqvRCu — Neha Singh Rathore (@nehafolksinger) February 21, 2023 -
రాత్రికి రాత్రే స్టార్ సింగర్‌గా మారిన ఖైదీ! వెల్లువలా ఆఫర్లు
ఇంతవరకు మనం ఎంతోమంది మట్టిలో మాణక్యలాంటి సింగర్ల గురించి విన్నాం. అదీ కూడా పల్లెటూరు నేపథ్యం నుంచి వచ్చిన సాధారణ మహిళలు, పురుషులు సింగర్ మాదిరి అద్భుతంగా పాడి ప్రశంసలందుకున్నారు. వారిలో కొందరైతే సినిమాల్లో పాడే అవకాశాన్ని కూడా కొట్టేశారు కూడా. అవన్నీ ఒకతైతే ఇక్కడొక ఖైదీ ఏకంగా ఒక పాటతో స్థార్ సింగర్‌గా పేరు సంపాదించేసుకున్నాడు. పైగా అవకాశాలు కూడా వెల్లువలా వచ్చేయడమే కాకుండా ఆ వ్యక్తిని విడుదలయ్యేలా చేస్తామని ఓ ఎమ్మెల్యే చెప్పడం విశేషం. వివారాల్లోకెళ్తే...కంగయ్య కుమార్ అనే వ్యక్తి బిహార్ జైలులో ఉండే ఖైదీ. ఐతే ఒక రోజు భోజ్‌పురికి సంబంధించిన ఫేమస్ పాట పాడాడు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక్కసారిగా నెటిజన్లంతా అతడి వాయిస్‌కి అతను పాడిన విధానానికి ఫిదా అయ్యారు. దీంతో అతన్ని బయటకు తీసుకువచ్చి పాటలు పాడే అవకాశం ఇవ్వాలనుకున్నారు బాలీవుడ్ ప్రముఖ గాయకుడు అంకిత్ తివారీ. అతన్ని టాలెంట్ నాలుగు గోడలకే పరిమితకాకుండా అతన్ని బయట వచ్చేలా చట్టపరమైన సాయం అందించి పునరావాసం కల్పించాలనుకున్నారు ఒక యూపీ ఎమ్మెల్యే. ఏది ఏమైతే ఒక పాటతో కంగయ్య అందరీ మనసులను దోచుకున్నాడు. ఏకంగా విడుదలయ్యే అవకాశం తోపాటు పాటలు పాడే అవకాశం ఇచ్చేందుకు బాలీవుడ్ ప్రముఖ గాయకులు ముందకు వచ్చారు. వాస్తవానికి కంగయ్య బిహార్‌లోని కైమూర్ జిల్లా నివాసి. అతను పని కోసం ఉత్తప్రదేశ్ సరిహద్దు జిల్లాకు వెళ్లి మద్యం సేవించి వచ్చాడు. ఐతే బిహార్‌లో మద్యం చట్టాలను కట్టుదిట్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బిహార్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడంతో అతను జైల్లో ఉన్నాడు. కంగయ్య జైల్లో దరోగజీ హో... సోచి-సోచి జియా హమ్రో కహే గబ్రతా..." అనే ప్రసిద్ధ భోజ్‌పురి పాటను పాడాడు. వాస్తవానికి కంగయ్య లాకప్‌లో ఉండగా ఎవరో ఒక వ్యక్తి ఆపాటను తప్పుగా పాడటంతో..అది కరెక్ట్ కాదని చెప్పేందుకు పాడాడు. అది సంగీత ప్రియులను ఎంతో ఆకట్టుకోవడంతో అద్భుతమైన అవకాశాన్ని కొట్టేశాడు. TV के पूर्व सहयोगी @cmohan_pat के माध्यम से संपर्क करने पर पता चला कि ये कैमूर का गरीब युवक कन्हैया है,नशे में मिलने पर बिहार पुलिस ने इसे जेल भेजा,इनकी कानूनी मदद के उपरांत इन्हें सुधारने का प्रयास होगा,साथ ही UP के मशहूर त्रिनेत्र स्टूडियो में गाने का अवसर भी उपलब्ध कराया जाएगा pic.twitter.com/Id8HrJV2HZ — Dr. Shalabh Mani Tripathi (@shalabhmani) January 8, 2023 (చదవండి: ఎయిర్ ఇండియా ఘటన: పశ్చాత్తాపం లేకుండా ఆరోపణలా!) -
జైల్లో పాట.. దెబ్బకు ఫేమస్.. ఫేట్ మారింది
వైరల్: ఊచల వెనుక పాడిన పాటను పోలీసు వాళ్లే చిత్రీకరించారు. అతని మధుర గాత్రానికి ఫిదా అయ్యి వైరల్ చేశారు. కటకటాల వెనుక పాడిన పాటకు ఇంటర్నెట్ ఫిదా అయ్యింది. ఆ వ్యక్తి మరింత ఫేమస్ అయ్యాడు. జైలు నుంచి రిలీజ్ అయ్యాక.. తన పాట ఫేమస్ కావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాడతను. దానికి కొనసాగింపుగానూ అతనికి ప్రభుత్వ సాయం ప్రకటనతో పాటు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. బిహార్‌లోని కైమూర్ దహ్రక్ గ్రామానికి చెందిన కన్హయ్యరాజ్ను.. మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో బక్సర్ పోలీసులు అరెస్టు చేశారు. యూపీ నుంచి తాగొచ్చాడని(బీహార్‌లో మద్యపాన నిషేధం అమలు ఉండడంతో) పోలీసులు అతని ఆ రాత్రి జైల్లో ఉంచారు. అయితే ఆ పూట జైలు శిక్ష అతని జీవితాన్ని మార్చేసింది. ఉదయం విడుదలై బయటకు వచ్చిన కన్హయ్యను.. ఆ తర్వాత అంతా కొత్తగా చూడడం మొదలుపెట్టారు. అతని పాట ఫేమస్ అయ్యిందని వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్‌లలో చక్కర్లు కొడుతోందని స్నేహితులు చెప్పారు. దీంతో తన గొంతు విన్న కన్హయ్య తెగ ఖుష్ అయ్యాడు. అయితే.. మద్యం సేవించినందుకు తనను పోలీసులు అరెస్ట్ చేయలేదని, పవన్ సింగ్(భోజ్‌పురి హీరో) పాట పాడినందుకు.. ఆ పాటలో ఒక పదం అభ్యంతకరంగా ఉందని ఆ హీరో ఫ్యాన్ ఫిర్యాదు చేసినందుకే తనను అరెస్ట్ చేశారని కన్హయ్య చెప్తున్నాడు. కానీ, ఆ వీడియోను తాను అప్పుడే డిలీట్ చేశానని వివరణ ఇచ్చాడతను. ఇక ఆ రాత్రి జైల్లో గడిపిన తాను సరదాగా పాట పాడనని, అది ఎవరు వీడియో తీశారు, ఎలా వైరల్ అయ్యిందో కూడా తనకు తెలియదని అంటున్నాడతను. ఆర్థిక కష్టాలతో చిన్నతనంలోనే చదువుకు తాను దూరం అయ్యానని, రిపబ్లిక్‌డే, ఇతర ఫంక్షన్లకు పాటలు కూడా పాడతానని చెప్తున్నాడు కన్హయ్య. ఇక జైలు వీడియో వైరల్ కావడంతో బాలీవుడ్ సింగర్ కమ్ మ్యూజిక్ కంపోజర్ అంకిత్ తివారీ తన మ్యూజిక్ ఆల్బమ్‌లో పాడేందుకు కన్హయ్యకు అవకాశం ఇస్తానని ప్రకటించాడు. మరోవైపు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి మట్టిలో మాణిక్యాలను రాటు దేల్చాల్సిన అవసరం ఉందని, అతని కుటుంబానికి అవసరమయ్యే సాయం అందిస్తామని ప్రకటించడం గమనార్హం. తనలో దాగున్న ప్రతిభ నలుగురికి తెలియడం, దాని ద్వారా తన కుటుంబ పరిస్థితిని మార్చుకునే అవకాశం దొరికినందుకు ఆ దేవుడికి, తనను వైరల్ చేసినవాళ్లకు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడతను. नशा एक सामाजिक बुराई है और सिर्फ कला में शक्ति है इस बुराई को हराने की ।@shalabhmani जी मैं इस व्यक्ति को अपनी म्यूजिक कंपनी @MistMusic_ की तरफ से एक गाना गाने का मौका देता हूं । 🙏 https://t.co/qug7cto5Rp — Ankit Tiwari (@officiallyAnkit) January 9, 2023 -
ఫోటో అంటూ ఎగబడిన ఫ్యాన్స్.. పారిపోయిన హీరోయిన్
-
చెప్పులు కూడా వదిలేసి పారిపోయిన హీరోయిన్, వీడియో వైరల్
సెలబ్రిటీలతో ఫోటోలు దిగాలని తహతహలాడేవారు చాలామంది. అలాంటిది సెలబ్రిటీ ఎదురుగా కనిపిస్తే ఊరుకుంటారా? ఆరునూరైనా సరే ఫోటో సంపాదించాల్సిందేనని అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. ఫొటో ప్లీజ్ అంటూ వెంటపడుతారు. తాజాగా ఇలాంటి ఘటనే ఎదురైంది భోజ్‌పురి హీరోయిన్ అక్షర సింగ్‌కు. అక్షర సింగ్ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బీహార్‌లోని బేథియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. హీరోయిన్ కనిపించడంతో ఆగలేకపోయిన జనం సెల్ఫీల కోసం పరుగులు తీశారు. వందలమంది ఫోటో అంటూ ఎగబడటంతో కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా ఉన్నపళంగా అక్కడి నుంచి పారిపోయింది హీరోయిన్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో అక్షర సింగ్ స్కూటీ మీద వెళ్తుండగా అభిమానులు ఆమె వెనకాల పరిగెత్తారు. కానీ చూడటానికి మాత్రం అందరూ ఆమెను తరుముతున్నట్లుగా ఉండటంతో హీరోయిన్‌కు ఎంత కష్టం వచ్చింది? అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. చదవండి: ఫస్ట్ డే షూటింగ్.. బాబు చనిపోయాడు..: నటుడు -
నా సోదరుడిని కాపాడుకోలేకపోయాను: నటుడు ఎమోషనల్
ప్రముఖ భోజ్‌పురి గేయ రచయిత శ్యామ్ దేహాటి ఇటీవలే కరోనాతో కన్నుమూశారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన భోజ్‌పురి సూపర్ స్టార్ కేసరిలాల్ యాదవ్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోను రిలీజ్ చేశాడు. ఇందులో తన ప్రియ ఆప్తుడు, అత్యంత సన్నిహితుడు శ్యామ్ దేహాటిని గుర్తు చేసుకున్నాడు. తన సోదరుడిని కాపాడలేకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అతడికి భార్యాపిల్లలు ఉన్నారని, వాళ్లు సైతం కరోనాతో బాధపడుతున్నారని తెలిపాడు. శ్యామ్‌ను కాపాడుకోలేకపోయిన తాను కనీసం అతడి కుటుంబాన్ని అయినా ఆదుకునేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో అభిమానుల మనసులను కదిలించి వేస్తోంది. కాగా కరోనా వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న శ్యామ్ కొన్నాళ్ల క్రితం ఓ వ్యాపారాన్ని కూడా ప్రారంభించాడట. కానీ, అంతలోనే కరోనా బారిన పడి సోమవారం గోరఖ్‌పూర్‌లో తుది శ్వాస విడిచాడు. ఇతడి మృతి పట్ల భోజ్‌పురి ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. టాప్ సెలబ్రిటీలు పవన్ సింగ్, దినేశ్ లాల్ యాదవ్, రితేశ్ పాండే, అర్వింద్ అకేలా కల్లు, రాణీ చటర్జీ, కాజల్ రాఘ్వానీ సహా పలువురు శ్యామ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. చదవండి: క్వారంటైన్లో మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్ ఒక్కటైన ప్రేమ జంట..జ్వాల, విష్ణు విశాల్ పెళ్లి ఫోటోలు వైరల్ -
రాథోర్ పాటలకు పడి పోవాల్సిందే!
న్యూఢిల్లీ : ‘గౌరీ లంకేష్‌కు పట్టిన గతి నీకు పట్టవచ్చు’ అంటూ నేహా సింగ్ రాథోర్‌ను ఆమె స్నేహితులు ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటారు. ఆ హెచ్చరికను ఆమె బుగ్గలపై చెదరని చిరు నవ్వుతో ఓ అభినందనగా స్వీకరిస్తున్నారు. హిందూ మత ఛాందస వాదులను విమర్శించినందుకు జర్నలిస్ట్, రచయిత గౌరీ లంకేష్‌ను 2017, సెప్టెంబర్‌లో బెంగళూరులో మతోన్మాదులు హత్య చేశారు. ‘ప్రశ్నించడం ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు’ అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ఎప్పటికప్పుడు తన భోజ్‌పురి జానపద పాటల ద్వారా సునిశితంగా విమర్శిస్తోన్న నేహా సింగ్ రాథోర్‌కు గౌరీ శంకర్‌కు పట్టిన గతి పడుతుందన్నది ఆమె మిత్రులు, సామాజిక కార్యకర్తల ఆందోళన. ( అందరూ చస్తారు: ప్రయాణికురాలి హల్చల్) పాలక వర్గాలను విమర్శిస్తూ నేహా సింగ్ రాథోర్ పాడిన భోజ్‌పూర్ జానపదాలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూ ఆమెకు మంచి పేరు తెస్తున్నాయి. ‘ప్రజలకు ఉద్యోగాలిస్తారా లేదా నాటకాలేసుకుంటూ బతకమంటారా? నీవు అలంకరించిన అధికార పీఠం వంశపారంపర్యంగా నీ తండ్రి నుంచి వచ్చింది కాదనే విషయాన్ని తెలుసుకో!, అచ్చా దిన్ (మంచి రోజులు) వస్తాయని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది, సంకలో జోలి, చేతికి చిప్ప ఇవ్వడమే మంచి రోజని తెలుసుకోలేక పోయాం!’ అనే భావాలతో ఆమె రాసి పాడిన పాటలు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్, బీహార్ సరిహద్దులోని జాండహ గ్రామంలో నివసిస్తోన్న రాథోర్, 2019 నుంచి పాటలు రాస్తూ, వాటికి సొంతంగా బాణీలు కూరుస్తూ పాడుతున్నారు. ‘ధరోహర్’ పేరిట ఆమె ప్రారంభించిన యూట్యూబ్ ఛానల్‌కు దాదాపు లక్ష మంది సబ్‌స్రై్కబ్ చేశారు. ఆమె ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా మంచి ప్రజాదరణ సంపాదించారు. ఆమె అభిమానుల్లో సినిమా దర్శకులు, జర్నలిస్టులు, మాజీ అధికారులు, ప్రతిపక్ష రాజకీయ నాయకులు ఉన్నారు. వారణాసికి వంద, పట్నాకు రెండు వందల కిలోమీటర్ల దూరంలోని జాండవ గ్రామంలో 8వ తరగతి వరకే పాఠశాల ఉండడంతో రాథోర్, రామ్‌గఢ్‌లో సెకండరీ ఎడ్యుకేషన్, యూపీలోని కాన్పూర్‌లో బీఎస్సీ చదివారు. -
పెళ్లి ఎప్పుడో చెప్పేసిన నటి..
భోజ్‌పురి నటి రాణి చటర్జీ తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. టెలివిజన్ రంగానికి చెందిన తన లాంగ్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్‌ను వివాహం చేసుకోనున్నట్టు తెలిపారు. ఓ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబర్లో తాము పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. కానీ ఇంకా తేదీపై నిర్ణయం తీసుకోలేదని అన్నారు. కొంత కాలంగా తన బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే తన బాయ్‌ఫ్రెండ్ ఎవరనేది మాత్రం రాణి రహస్యంగా ఉంచారు. అతని గుర్తింపును ఇప్పుడు వెల్లడించలేనని.. కానీ తొందరలోనే వివరాలు చెబుతానని అన్నారు. అలాగే వెడ్డింగ్ ప్లాన్స్ గురించి ఆమె మాట్లాడుతూ.. ముస్లిం సంప్రాదాయం ప్రకారం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నామని అన్నారు. కాగా, ససురా బడా పైసావాలా సినిమాతో రాణి భోజ్‌పురి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత దేవ్రా బడా సతవేల, ఏక్ లైలా తీన్ చైలా, నాగిన్, రాణి చాలీ సాసురల్, దులారా.. వంటి హిట్ చిత్రాల్లో నటించారు. అలాగే భోజ్‌పురిలో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. -
ఆ హీరోకు బిల్డర్ టోకరా..
న్యూఢిల్లీ : పలు బాలీవుడ్ సినిమాలు, టీవీ షోల్లో నటించిన భోజ్‌పురి సినిమా మెగాస్టార్ రవికిషన్ ఓ బిల్డర్ చేతిలో మోసపోయారు. ముంబైలో రూ 1.5 కోట్లు వెచ్చించి ఫ్లాట్‌ను బుక్ చేసిన రవికిషన్‌కు ఇంతవరకూ బిల్డర్ ఫ్లాట్‌ను అప్పగించకపోవడంతో నటుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబైలోని కమలా ల్యాండ్‌మార్క్ గ్రూప్ బిల్డర్స్ వద్ద రూ 1.5 కోట్లు చెల్లించి ఫ్లాట్ బుక్ చేసుకున్న రవికిషన్‌కు ఇప్పటివరకూ బిల్డర్లు ఫ్లాట్‌ను అప్పగించలేదు. కమలా ల్యాండ్‌మార్క్ గ్రూప్ బిల్డర్లు జితేంద్ర జైన్, జినేంద్ర జైన్, కేతన్ షాలపై రవికిషన్ ఫిర్యాదు చేశారు. సునీల్ నాయర్ అనే వ్యక్తిని కూడా బిల్డర్లు రూ 6.5 కోట్ల మేర మోసగించినట్టు ముంబై పోలీసులకు ఫిర్యాదు అందింది. కమలా ల్యాండ్‌మార్క్ గ్రూప్ మరో నిర్మాణ రంగ సంస్థతో కలిసి ఏర్పాటు చేసిన జేవీ గ్రూప్ ఫిర్యాదుదారులు ఇద్దరికీ కలిపి రూ 8 కోట్ల మేర టోకరా ఇచ్చిందని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.