bishop
-
రాత్రి అదిరిపోయే పార్టీ ఇచ్చి...ఉదయాన్నే ఉద్యోగులను పీకేసిన కంపెనీ..
-
మెదక్ చర్చి బిషప్‌పై సస్పెన్షన్ వేటు
సాక్షి, మెదక్: సీఎస్ఐ మెదక్ డయాసిస్ బిషప్ రెవ ఎ.సి.సాల్మన్‌రాజ్‌ను సస్పెండ్ చేస్తూ సీఎస్ఐ చెన్నై సినాడ్ మాడరేటర్ ధర్మరాజు రసాలం మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. మెదక్ బిషప్ ఎ.సి.సాల్మన్‌రాజు తన విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని, సీఎస్ఐ గైడ్‌లైన్స్ ఉల్లంఘించారని సినాడ్‌కు ఫిర్యాదులు అందాయి. మెదక్ చర్చి పాస్టరేట్ కమిటీ పాలకవర్గ నియామకం విషయంలో మెజారిటీ సభ్యుల ప్యానెల్‌కు కాకుండా బిషప్ తన వర్గానికి పదవులు దక్కేలా చేశారనే ఆరోపణలున్నాయి. దీనిపై పాస్టరేట్ కమిటీ ఎన్నికల్లో మెజారిటీ సభ్యులు నిరసన తెలుపుతూ బిషప్‌పై చెన్నై సినాడ్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన సినాడ్ కోర్టు ఎ.సి.సాల్మన్‌రాజ్ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, పరిపాలన విషయాల్లో సీఎస్ఐ బైలాను పాటించలేదని నిర్ధారిస్తూ మెదక్ డయాసిస్ బిషప్ పదవి నుంచి ఆయన్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో డోర్నకల్ మోడరేటర్ బిషప్ పద్మారావును మెదక్ డయాసిస్ ఇన్చార్జ్ బిషప్‌గా నియమిస్తున్నట్లు సీఎస్ఐ మాడరేటర్ ధర్మరాజ్ రసాలం తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన సికింద్రాబాద్‌లో సీఎస్ఐ ఆఫీస్‌లో బాధ్యతలు స్వీకరించారు. చదవండి: తెలంగాణలో జ్యోతిష్యం ప్రకారం ఎన్నికలు: సుప్రీం వ్యాఖ్య -
మరింత మందిని కనండి.. ఇటాలియన్లకు పోప్ పిలుపు
మటేరా: ఎన్నికల వేళ ఇటాలియన్లు మరింత మంది పిల్లలను కనాలంటూ పోప్ ఫ్రాన్సిస్ ఇచ్చిన పిలుపు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆదివారం మటేరాలో ఆయన బిషప్‌ల సమావేశంలో ఈ మేరకు కోరారు. వలసదారులను స్వాగతించాలని పిలుపునిచ్చారు. దేవుడు కుటుంబం, మాతృభూమి’నినాదంతో ప్రచారం చేస్తున్న మెలోనీ నేతృత్వంలోని రైటిస్ట్ పార్టీ కూడా ఎక్కువ మందిని కంటే ప్రోత్సాహకాలిస్తామని వాగ్దానం చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ జననాల రేటున్న దేశాల్లో ఇటలీ ఒకటి. చదవండి: చైనాలో ‘సైనిక కుట్ర’పై... అదే అస్పష్టత -
అంతరిక్షంలో చెత్తకు కొత్త విరుగుడు.. అక్కడే మండించేందుకు పరికరం
హూస్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో తయారయ్యే వ్యర్థాలను భూమిపైకి తేకుండా అంతరిక్షంలోనే మండించే కొత్త పరికరాన్ని హూస్టన్‌కు చెందిన నానో ర్యాక్స్ అనే ప్రైవేట్ అంతరిక్ష సంస్థ తయారు చేసింది. బిషప్స్ ఎయిర్‌లాక్ అనే ఈ పరికరంలో ఒకేసారి 600 పౌండ్లు, సుమారు 272 కిలోల చెత్తను ఉంచి కాల్చవచ్చు. ఐఎస్ఎస్లో ఆస్ట్రోనాట్ల వల్ల ఏడాదికి 2,500 కిలోల వ్యర్థాలు తయారవుతున్నాయి. ఈ వ్యర్థాలను ఐఎస్ఎస్కు అవసరమైన సామగ్రి రవాణాకు ఉపయోగించే సిగ్నస్ కార్గో వెహికల్ ద్వారా భూమిపైకి పంపిస్తున్నారు. ఇందుకు సమయం పడుతోంది. కానీ, బిషప్స్ ఎయిర్ లాక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు వెలుపలి అంతరిక్షంలోనే మండించి, తిరిగి ఐఎస్ఎస్కు చేరుకుంటుంది. దీనిని విజయవంతంగా పరీక్షించినట్లు నానోర్యాక్స్ తెలిపింది. -
కేరళ లైంగిక దాడి కేసు : బిషప్కు ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ లైంగిక దాడి కేసులో నిందితుడికి సర్వోన్నత న్యాయస్ధానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేరళ నన్‌పై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్ ఫ్రాంకో ములక్కల్ విచారణను ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తనపై లైంగిక దాడి ఆరోపణలను కొట్టివేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. మీ పిటిషన్ ఏమాత్రం విచారణార్హంగా లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే ఈ కేసులో తనను కావాలని ఇరికించారని, తాను అమాయకుడినని..కేసు నుంచి తనను తప్పించాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో బిషప్ ములక్కల్ పేర్కొన్నారు. కాగా ములక్కల్ అభ్యర్ధనను అంతకుముందు కేరళ హైకోర్టుతో పాటు, ప్రత్యేక న్యాయస్ధానం కూడా తోసిపుచ్చి విచారణను ఎదుర్కోవాలని ఆదేశించాయి. ఇక 2014 నుంచి 2016 మధ్య బిషప్ ములక్కల్ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని 2018 జూన్‌లో నన్ (43) ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ములక్కల్‌ను పలుమార్లు ప్రశ్నించిన కేరళ పోలీసులు 2018 సెప్టెంబర్‌లో ఆయనను అరెస్ట్ చేశారు. 40 రోజుల అనంతరం ములక్కల్ బెయిల్‌పై విడుదలయ్యారు. లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగుచూడటంతో జలంధర్ బిషప్‌గా ములక్కల్‌ను తొలగించారు. ఆయనపై సిట్ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. చదవండి : లైంగికదాడి కేసులో వెలుగులోకి కొత్త విషయాలు -
హత్తుకుని.. బలవంతంగా ముద్దులు పెట్టాడు!
తిరువనంతపురం: కేరళ బిషప్ ప్రాంకో ములక్కల్..నన్(క్రైస్తవ సన్యాసిని)పై పలుమార్లు లైంగికదాడి పాల్పడిన ఆరోపణల కేసులో గతేడాది అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం బిషప్ కేసు పిటిషన్ విచారణ నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాట్సప్‌లో కాల్లో అసభ్య పదజాలంతో తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని బాధితురాలు తెలిపారు. అంతేగాక బలవంతంగా ముద్దులు పెట్టాడని కోర్టుకు విన్నవించారు. ఈ విషయాల గురించి బాధితురాలు మాట్లాడుతూ ‘నేను బిషప్‌ను మొదటి సారిగా 2015 బిహార్‌లో కలిశాను. కాన్వెంట్కు సంబంధించిన విషయాలను గురించి తరచూ ఆయనతో వాట్సప్ వీడియో కాల్, ఫోన్ కాల్స్ మాట్లాడేదాన్ని. వాట్సప్‌లో చాటింగ్ కూడా చేసేదాన్ని. ఇలా 2015 నుంచి 2017 వరకు మాట్లాడాను. మొదట్లో బాగానే మాట్లాడేవాడు. ఇక 2015 ఏడాది చివరిలో ఆయన మాటల్లో క్రమంగా తేడాను గమనించాను. నన్ని అని కూడా చూడకుండా అసభ్యపదజాలంతో మాట్లాడూతూ వేధించడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో కొన్ని కారణాలు వల్ల నేను కేరళకు వెళ్లాల్సివచ్చింది. ఈ క్రమంలో ఓ రోజు రాత్రి ఒంటిగంట ప్రాంతంలో బిషప్ ములక్కల్ నన్ను తన రూంకు పిలిచి బిహార్ నుంచి కేరళకు రావడానికి గల కారణాలపై ఆరా తీశాడు. నేను ఆయనకు వివరించాను. ఇలా రెండుగంటల పాటు మాట్లాడుకున్నాక నేను వెళ్లిపోతున్న క్రమంలో నన్ను వెనుక నుంచి వచ్చి గట్టిగా కౌలిగించుకుని బలవంతంగా ముద్దులు పెట్టాడు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వాట్సప్ వీడియో కాల్స్‌లో తన శరీర భాగాలు, నా దేహంలోని భాగాల గురించి మాట్లాడాడని భాధితురాలు వాగ్మూలంలో పేర్కొన్నారు. నన్‌పై లైంగిక దాడి : బిషప్‌పై బాధితురాలు ఫైర్ ‘‘బిషప్ ములక్కల్ డియోసెస్ అధికారి కావడంతో చర్చి నుంచి పంపించేస్తారన్న భయంతో ఆయనపై వెంటనే ఫిర్యాదు చేయలేకపోయాను. ఒకవేళ బయటకు చెబితే ఏదైనా హాని తలపెడతాడమోనన్న భయంతో ఆయన ఆరాచాకాలను మౌనంగా భరించాల్సి వచ్చేది’’ అంటూ నన్ వాపోయారు. కాగా ములక్కల్.. తనపై పలుమార్లు అత్యాచారం చేశారని కొట్టాయం కాన్వెంటుకు చెందిన ఓ నన్ ఆరోపించడంతో రెండేళ్ల కింద కేసు నమోదైంది. ఆమె ఫిర్యాదు మేరకు బిషప్‌ను పోలీసులు అరెస్ట్ చేసి 2019లో చార్జిషీటు దాఖలు చేశారు. కాగా మరో నన్ కూడా సదరు బిషప్.. తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఆయన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. -
మెదక్ చర్చి నిర్మాణం అద్భుతం..
సాక్షి, మెదక్: వాహ్.. వండర్ఫుల్.. ఈ నిర్మాణం ప్రపంచలోనే అద్భుతం. ఆకలితో అలమటించే ప్రజల కడుపునింపి పరలోక ప్రభువు ఆలయ నిర్మాణం కావడం మహా అద్భుతమని ఇంగ్లాండ్ కాంటర్బరి ఆర్చ్ బిషప్ డాక్టర్ జస్టిన్ వెల్‌బి పేర్కొన్నారు. తన యాత్రలో భాగంగా గురువారం ఆయన మెదక్ పట్టణంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సీఎస్ఐ చర్చ్‌ను సందర్శించారు. స్థానిక బిషప్ రెవరెండ్ సాల్మాన్రాజ్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. మెదక్ పట్టణంలోని ప్రధాన తపాల కార్యాలయం నుంచి సీఎస్ఐ చర్చ్ వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఇందులో భాగంగా తెలంగాణలోని వివిధ సంస్కృతుల కళాకారులు ఆయనకు తమ ఆహ్వానం పలికారు. ఇందులో గోండు, కోయ, లంబాడ, కోలాటం, చిరుతలు తదితర కళాకారులు నృత్యాలు చేస్తూ ఆయనకు ఆహ్వానం పలికారు. చర్చ్ ప్రాంగణంలోని క్రైస్తవ మతాన్ని సూచించే జెండాలను జస్టిన్ వెల్‌బి దంపతులు ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ–ఆంధ్రా రాష్ట్రాల్లోని చర్చ్‌ల పాస్టర్లు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆచారంలో భాగంగా సిలువతో చర్చ్ చుట్టూ ప్రదక్షణ కొనసాగించారు. అనంతరం చర్చ్‌లో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన దేవుని సందేశాన్నిస్తూ.. ప్రేమ, సమాధానం, సమానత్వం, ఒకరినొకరు ప్రేమతో గౌరవించడం దేవుని చూపిన మార్గమని, వీటిని ప్రతి వ్యక్తి అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. దేవుని ముందు మోకరిల్లుతూ ప్రార్థనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మెదక్ అధ్యక్ష మండలం వారు తనను ఆహ్వానించిన తీరు జీవితంలో మరిచిపోలేనిదన్నారు. తెలంగాణ కల్చర్ వివిధ నృత్యాలు, లంబాడ, గోండు, చిరుతలు, కోయ, కోలాటం, తదితర సంస్కృతులను వెలిబుచ్చిన తీరు అద్భుతమన్నారు. ఇక్కడి వేడుకలు ఇంగ్లాండ్‌కు వెళ్లి చెబితే అంతా మంత్రముగ్ధులవుతారన్నారు. ఇలాంటి గొప్ప ఆహ్వానం నా హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. భారత దేశంలోని కేరళ, కర్ణాటక, శ్రీలంకతోపాటు మెదక్చర్చ్లను సందర్శించడం సంతోషదాయకమన్నారు. అంతకు ముందు జుస్టిన్‌వెల్‌బి ఒక చేపకథను వివరించారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడికి రోజంతా కష్టపడిన వలలో చేపలు పడలేవంటా. ఇది గమనించిన పరలోక దేవుడు ఓ మత్స్యకారుడా! నీవున్న చోట నుంచి కుడివైపునకు వల విసరాలని చెప్పడంతో మత్స్యకారుడు అటువైపు వల విసరడంతో అనేక చేపలు చిక్కాయని చెప్పారు. పరలోక ప్రభువు మాట వింటే అంతా మంచే జరుగుతుందని ఆయన వివరించారు. అనంతరం మెదక్ సీఎస్ఐ అధ్యక్ష మండలి బిషప్ సాల్మాన్రాజ్ మాట్లాడుతూ ఈ చర్చ్ నిర్మించిన చార్లెస్ పాస్నెట్ వాకర్ 150వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. చర్చ్ నిర్మించి నేటికి 96 సంవత్సరాలు కావస్తుందన్నారు. ఈ చర్చ్ నిర్మించేందుకు వినియోగించిన ముడిసరుకు గురించి జస్టిన్వెల్బికి వివరించారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు ఇంగ్లాండ్ కాంటర్బరి ఆర్చ్ బిషప్ డాక్టర్ జస్టిన్ వెల్‌బి రాకతో గురువారం మెదక్‌పట్టణంలో పండగ వాతావరణం నెలకొంది. ఆయన రాక తెలుసుకొని తెలంగాణ–ఆంధ్రా రాష్ట్రాల నుంచి చర్చ్‌ల పాస్టర్లు, భక్తులు భారీగా తరలిరావడంతో చర్చ్ ప్రాంగణం కిటకిటలాడింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే నృత్య ప్రదర్శనలు ఊరేగింపులో నిర్వహించడంతో ఆందరిని ఆకట్టుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గోండుల నృత్యాలు, చిరుతలు, కోలాటం, లంబాడ నృత్యాలు సంస్కృతికి అద్దం పట్టాయి. భారీ బందోబస్తు: మతగురువు జుస్టిన్‌వెల్‌బి మెదక్‌కు రాక సందర్భంగా పట్టణంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఎస్పీ చందనాదీప్తి ఆధ్వర్యంలో పట్టణంలో అడుగడుగున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 4గంటలపాటు పట్టణంలోని చర్చ్ ప్రాంగణంలో ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమంలో మెదక్ అధ్యక్ష మండల బిషప్ ఏసీ సాల్మన్‌రాజ్, కరీంనగర్ బిషప్ రుబిన్మార్క్, సౌత్ ఇండియన్ డిప్యూటీ కమిషనర్ థామస్ కే ఉమన్, డిప్యూటి మోడ్రన్ డోర్నాక బిషప్, నంద్యాల బిషప్ పుష్పలలిత, కృష్ణ, గోదావరి బిషప్ జార్జ్ పెర్నాండెజ్, తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలకు చెందిన 13 జిల్లాల గురువులతోపాటు స్థానిక గురువులు అండ్రూస్ ప్రేమ్ కుమార్, సహాయక గురువులు విజయ్‌కుమార్, దయానంద్, రాజశేఖర్, ఐవాండ్, ఒలెన్పాల్, జయరాజ్, శాంతకుమార్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
నన్‌పై లైంగిక దాడి : బిషప్‌పై బాధితురాలు ఫైర్
తిరువనంతపురం : లైంగిక దాడి కేసులో నిందితుడు బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధితురాలు ఆరోపించారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేరళ నన్‌పై బిషప్ లైంగిక దాడి కేసు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. కేసులో ఆధారాలను తొలగించే ప్రయత్నాల వెనుక నిందితుడు ములక్కల్ ప్రమేయం ఉందని ఆమె సందేహం వ్యక్తం చేశారు. సరైన పత్రాలను పోలీసులకు సమర్పించని పక్షంలో ఫోరెన్సిక్ ల్యాబ్‌పై తాను ఫిర్యాదు చేస్తానని బాధితురాలు హెచ్చరించారు. కాగా ఈ కేసుకు సంబంధించి తాజా సైబర్ ఫోరెన్సిక్ రిపోర్ట్‌ను తక్షణమే సమర్పించాలని పాలాలోని జ్యుడిషియల్ మేజిస్ర్టేట్ కోర్టు దర్యాప్తు అధికారిని ఆదేశించింది. బిషప్ ఫ్రాంకో ములక్కల్ 2014 నుంచి 2016 మధ్య తనను లైంగికంగా వేధించారని కేరళ నన్ 2018 జూన్ 27న కొట్టాయం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
శ్రీలంక పేలుళ్లపై బిషప్ ఎమోషనల్ వీడియో
కొలంబో: శ్రీలంకలో వరుస పేలుళ్లపై యావత్తు ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. శ్రీలంకలోని ప్రముఖ చర్చిలు, హోటళ్లు లక్ష్యం చేసుకుని జరిగిన బాంబు పేలుళ్లను కొలంబో బిషప్ డిలోరాజ్ ఖండించారు. ఈస్టర్ పర్వదినాన ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై భావోద్వేగంతో కూడిన ఒక వీడియో సందేశాన్ని ఆయన విడుదల చేశారు. బాంబు పేలుళ్లలో తమ ఆత్మీయులను కోల్పోయినవారికి, గాయపడినవారికి తాను అండగా ఉంటానని తెలిపారు. తమలాంటి దేశంలో ఈ ఘటన జరగడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. 30 ఏళ్ల క్రితం జరిగిన సివిల్ వార్ అనంతరం శ్రీలంక ప్రజల శాంతియుతంగా జీవనం సాగిస్తున్నారని అన్నారు. ప్రజలంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి విధ్వంసక ఘటనలకు వ్యతిరేకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆరు గంటల వ్యవధిలో ఎనిమిది చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 160 మందికి పైగా మరణించగా, 400 మందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. మరణించినవారిలో 35 మంది విదేశీయులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పేలుళ్ల ఘటన అనంతరం శ్రీలంకలో ఎమర్జెన్సీ సర్వీసులు రంగంలోకి దిగాయి. శ్రీలంక వ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన అధికారులు.. కొలంబోలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. -
నన్ల బదిలీ ఉత్తర్వుల నిలిపివేత
తిరువనంతపురం: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్ ఫ్రాంకో ములక్కల్‌పై చర్యలు తీసుకోవాలంటూ నిరసన తెలిపిన నన్ల బదిలీ ఉత్తర్వులను జలంధర్ డయోసిస్ నిలిపివేసింది. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తున్నందున విచారణ పూర్తయ్యే దాకా వారిని మరో చోటుకు పంపబోమంటూ హామీ ఇచ్చింది. బిషప్ ములక్కల్ 2014–16 సంవత్సరాల్లో కొట్టాయంలోని కురువింగలద్ కాన్వెంట్కు చెందిన ఓ నన్‌పై పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ బిషప్‌పై చర్యలు తీసుకోవాలంటూ గత ఏడాది బాధితురాలితోపాటు మరికొందరు నిరసన తెలిపారు. ఆందోళనకు దిగిన నలుగురు నన్లను వేరే ప్రాంతాలకు బదిలీ చేస్తూ మిషనరీస్ ఆఫ్ జీసస్కు చెందిన నన్ల కాంగ్రిగేషన్ హెడ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ విషయాన్ని బాధితులు డయాసిస్తోపాటు కేరళ ముఖ్యమంత్రి విజయన్ దృష్టికి తీసుకెళ్లారు. తన జీవితం ప్రమాదంలో పడిందని, ఒంటరి చేసి, వేధించాలంటూ చూస్తున్నారంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం వారంతా కాన్వెంట్ వద్ద నిరసనకు దిగగా మరికొందరు వ్యక్తులు బాధితులకు వ్యతిరేక నినాదాలు చేస్తూ అక్కడ బైఠాయించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని సద్దుమణిగించారు. ఈ పరిణామాలపై స్పందించిన జలంధర్ డయాసిస్.. ఆ నలుగురు నన్ల బదిలీ ఉత్తర్వులను రద్దు చేసింది. బిషప్ ములక్కల్‌పై ఆరోపణల కేసు తేలేదాకా సిస్టర్ ఆల్ఫీ, సిస్టర్ అనుపమ, సిస్టర్ జోసెఫైన్, సిస్టర్ అన్సితలను అక్కడి నుంచి బదిలీ చేయబోమంటూ హామీ ఇచ్చింది. వారు ప్రస్తుతం పనిచేస్తున్న చోటే యథావిధిగా విధులకు హాజరు కావొచ్చని తెలిపింది. -
కేరళ నన్‌పై లైంగిక దాడి : కీలక సాక్షి మృతి
చండీగఢ్ : కేరళ నన్‌పై లైంగిక దాడి కేసుకు సంబంధించి బిషప్ ములక్కల్‌పై ఫిర్యాదు చేసిన మత ప్రబోధకుడు మరణించడం కలకలం రేపింది. పంజాబ్‌లోని జలంధర్‌కు సమీపంలో దాస్వా వద్ద ప్రబోధకుడు కురియకొస్ కథుథార మృతదేహాన్ని గుర్తించారు. ఈ కేసులో కురియకోస్ కీలక సాక్షి కావడం గమనార్హం. కాగా, తమ సోదరుడిని హత్య చేశారని, తనను హతమారుస్తామని గతంలో బెదిరింపులు వచ్చాయని బాధితుడి సోదరుడు వెల్లడించారు. దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కాగా కేరళ నన్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్ ములక్కల్‌కు కోర్టు ఈనెల 15న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. నిందితుడు తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, విచారణాధికారి ఎదుట హాజరయ్యేందుకు మినహా కేరళలో అడుగుపెట్టరాదని ములక్కల్‌కు కోర్టు షరతులు విధించింది. కాగా బిషప్ ములక్కల్ 2014 నుంచి 2016 మధ్య తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని కేరళ నన్ ఆరోపించారు. ఈ కేసును విచారించిన కేరళ పోలీసులు సెప్టెంబర్ 21న బిషప్‌ను అరెస్ట్ చేశారు. -
నన్‌పై లైంగిక దాడి : బిషప్కు చుక్కెదురు!
తిరువనంతపురం : కేరళ నన్‌పై లైంగిక దాడికి పాల్పడిన కేసులో అరెస్టయిన జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్ బెయిల్ అభ్యర్ధనను బుధవారం కేరళ హైకోర్టు తోసిపుచ్చింది. 2014 నుంచి 2016 మధ్య బాధితురాలిపై బిషప్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో గత నెల 20న కేరళ పోలీసులు మూడు రోజులు ప్రశ్నించిన అనంతరం బిషప్ ములక్కల్‌ను అరెస్ట్ చేశారు. కొట్టాయంలోని పాలా జ్యుడిషియల్ మేజిస్ర్టేట్ కోర్టు ఎదుట హాజరు పరిచిన మీదట సెప్టెంబర్ 22న ములక్కల్‌ను పోలీస్ కస్టడీకి తరలించారు. ఇక సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 6వరకూ బిషన్‌ను జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణ హాని ఉందని, తమకు, తమ ఆస్తులకు భద్రత కల్పించాలని బాధితురాలి సోదరి రాష్ట్ర పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో బిషప్ చర్చి పాస్టర్ బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. -
స్త్రీలోక సంచారం
♦ బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో 2019 ఆస్కార్ పోటీలకు భారతదేశం నుంచి అధికారికంగా ప్రవేశం పొందిన అస్సామీ చిత్రం ‘విలేజ్ రాక్‌స్టార్’ దర్శకురాలు రీమా దాస్.. తన చిత్రం ప్రచారం కోసం డబ్బుల వేటలో పడ్డారు. సొంత గిటార్ సంపాదించుకుని, స్థానిక బాలురతో మ్యూజిక్ బ్యాండ్ ఏర్పాటు చేయాలని కలలుగన్న ధను అనే పదేళ్ల బాలికలోని తపనను కథాంశంగా తీసుకుని, చేత్తో పట్టుకుని తీసే కెమెరాతో అస్సాంలోని పల్లె ప్రాంతాలలో రీమా దాస్ చిత్రీకరించిన ‘విలేజ్ రాక్‌స్టార్’ ఇప్పటివరకు కనీసం 40 దేశాలలో ప్రదర్శనకు, అభినందనలకు నోచుకుంది. ♦ ఒక కేరళ నన్‌పై పలుమార్లు అత్యాచారం జరిపి, అసహజమైన లైంగిక అకృత్యాలకు పాల్పడిన బిషప్ ఫ్రాంకో ములక్కల్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ కేరళ కోర్టు ఇచ్చిన రెండు రోజుల పోలీసు కస్టడీ ఈరోజు మధ్యాహ్నం 2.30 నిమిషాలకు ముగుస్తోంది. బిషప్ అప్పటికే మూడు రోజుల పోలీస్ కస్టడీలో ఉన్నందున అతడికి ఈ రెండు రోజుల కస్టడీ నుంచి మినహాయింపును ఇవ్వాలని లాయర్లు కోరగా.. ఆ మూడు రోజులూ బిషప్కు సామర్థ్య నిర్ధారణ పరీక్ష చేయడానికి, అతడి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, దుస్తులు స్వాధీనం చేసుకోడానికి సరిపోయినందున.. అనంతర విచారణ కోసం మళ్లీ ఒకసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసుల తరఫు న్యాయవాదులు చేసిన వాదనకు అనుకూలంగా మేజిస్ట్రేట్ స్పందించారు. ♦ తెలంగాణలో పరువు హత్యల కలకలం ఇంకా సద్దుమణగకుండానే తాజాగా హైదరాబాద్‌కు 80 కి.మీ. దూరంలోని జనగామ పట్టణానికి చెందిన 18 ఏళ్ల అగ్రకుల యువతి, జనగామకు 20 కి.మీ. దూరంలోని పరిపడిగ ప్రాంత ఎరుకల కులస్తుడైన 25 ఏళ్ల యువకుడు.. గుర్తు తెలియని ఒక అటవీ ప్రాంతంలో తామిద్దరూ ఉన్న చోటు నుంచి ఒక వీడియో తీసి.. యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడంతో ఈ జంటకు వారి కుటుంబాల నుంచి ప్రాణహాని పొంచి ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాదే ఇంటర్ పూర్తి చేసిన యువతి, రెండు నెలల క్రితం ఆ యువకుడిని కులాంతర వివాహం చేసుకుని జనగాం నుంచి హైదరాబాద్ వచ్చి, అక్కడి నుంచి అతడితో కలిసి అటవీ ప్రాంతంలో తలదాచుకుని, తన తల్లిదండ్రుల నుంచి, గ్రామస్తుల నుంచి తమను కాపాడాలని ఆ వీడియోలో విజ్ఞప్తి చేయగా, గ్రామస్తులు మాత్రం ఆ యువకుడు ఇప్పటికే ముగ్గురు అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడని, యువతిని అతడి బారిన పడనివ్వబోమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు కొన్ని జాతీయ ఆంగ్ల పత్రికలు రాశాయి. ♦ అగ్రకుల కుటుంబానికి చెందిన ఓ పదేళ్ల బాలిక చెయ్యి తాకుతూ, చాక్లెట్ ఇచ్చిన పదమూడేళ్ల బాలుడిని ఆ బాలిక బంధువులు అతడి ఇంటి నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు.. ఒంటి మీద బట్టలు తీసి, కొట్టుకుంటూ, దిగంబరంగా నడిపించుకుంటూ వెళ్లిన ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే బాలిక బంధువులు ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు వారిపై ఎస్సీ, ఎస్సీ యాక్ట్ 1989 లోని సెక్షన్ 452, సెక్షన్ 323, సెక్షన్ 506 కింద కేసులు నమోదు చేయడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ¯ð లకొంది. ♦ 2022లో అంతరిక్షంలోకి మనిషిని పంపే భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘గగన్‌యాన్’కు డైరెక్టర్‌గా వి.ఆర్.లలితాంబిక ఎంపిక అయ్యారు. ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్)లో వంద మిషన్ల అనుభవం ఉన్న సీనియర్ సైంటిస్ట్ లలిత (56) 2017 ఫిబ్రవరి 15న భారతదేశం రికార్డు స్థాయిలో నింగిలోకి 104 ఉపగ్రహాలను పంపించిన ప్రాజెక్టులో కూడా కీలక పాత్ర పోషించారు. ♦ రుడాలి, చింగారి, ఏక్ ఫల్ దామన్ : ఎ విక్టిమ్ ఆఫ్ మార్షల్ వయలెన్స్‌తో పాటు ఇంకా అనేక స్త్రీవాద చిత్రాలతో ప్రేక్షకాదరణ పొందిన బాలీవుడ్ దర్శకురాలు కల్పనా లజ్మీ (61) ఆదివారం తెల్లవారుజామున మరణించారు. 2006లో మిథున్ చక్రవర్తి, అంజు సహానీ, సుస్మితా సేన్లతో తన ఆఖరి సినిమా ‘చింగారి’ని తీసిన కల్పన ఏడాది కాలంగా కిడ్నీ క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నప్పుడు ఆమిర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, కరణ్ జోహార్, ఆలియాభట్, సోనీ రాజ్‌ధాన్, నీనా గుప్తా ఆర్థికంగా ఎంతో సహాయం చేశారు. ♦ భారతదేశపు తొలి మహిళా విమానయాన ఫైర్ ఫైటర్‌గా 26 ఏళ్ల తానియా సాన్యాల్ తన జన్మస్థల మైన కోల్‌కతాలోని ఎయిర్‌పోర్ట్‌లో బాధ్యతలు స్వీకరించారు. విధినిర్వహణలో భాగంగా తానియా.. 161 మందితో కూడిన పురుష బృందంతో జూనియర్ అసిస్టెంట్‌గా కలిసి పని చేయడంతో పాటు.. కోల్‌కతా సమీపంలోని నారాయణపూర్‌లో ఉన్న ‘ఫైర్ సర్వీస్ ట్రైనింగ్ సెంటర్’ (ఎఫ్.ఎస్.టి.సి.)లో 25 ఏళ్ల అంజలీ మీనా (జైపూర్) అనే ఒకే ఒక యువతి సహా 133 మంది యువకులకు శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. ♦ లండన్‌లోని మేడమ్ తుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియానికి అనుబంధంగా ప్రపంచ దేశాలలోని ముఖ్యనగరాలతో పాటు ఢిల్లీలో ఉన్న మ్యూజియంలో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఇటీవల తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇప్పటికే ఆ మ్యూజియంలో ఉన్న షారుక్‌ఖాన్, విరాట్ కోహ్లీ, కత్రీనా కైఫ్ వంటి వారితో పాటు తన విగ్రహం కూడా ఉండటంపై సన్నీ లియోన్ ఆనందం వ్యక్తం చేస్తూ, విగ్రహం పక్కన నిలబడి తీసుకున్న ఫొటోను ‘ది క్రేజీనెస్ అండ్ హిస్టీరియా’ అనే కామెంట్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, ‘షి ఈజ్ ది మోస్ట్ గూగుల్డ్ ఎంటర్టైనర్ ఇన్ ఇండియా’ అని పేర్కొంటూ విగ్రహంతో ఉన్న ఆమె వీడియోను ఇంగ్లండ్‌లోని హఫింగ్టన్ పోస్ట్ ట్విట్టర్లో అప్లోడ్ చేసింది. -
కేరళ నన్‌పై లైంగిక దాడి : పోలీస్ కస్టడీకి బిషప్
తిరువనంతపురం : కేరళ నన్‌పై లైంగిక దాడి కేసులో అరెస్టయిన జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను ఈనెల 24 వరకూ పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్ధానం ఉత్తర్వులు జారీ చేసింది. ములక్కల్ బెయిల్ అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది. 2014 మే 5న బాధితురాలిని లైంగికంగా వేధించే ఉద్దేశంతోనే స్కూల్‌కు వచ్చిన ములక్కల్ గెస్ట్ హౌస్‌లోని రూమ్ నెంబర్ 20లో రాత్రి 10.48 గంటలకు వరకూ ఆమెను ఉంచారని, అసహజ శృంగారానికి ఒత్తిడి చేశారని పోలీసులు రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. ఘటన గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బిషప్ బాధితురాలిని బెదిరించినట్టు వెల్లడించారు. తర్వాతి రోజు (మే 6) సైతం బాధితురాలిపై ఆయన లైంగిక దాడికి పాల్పడ్డాడని నివేదికలో ప్రస్తావించారు. 2014 నుంచి 2016 వరకూ అదే గదిలో బాధితురాలిపై నిందితుడు 13 సార్లు లైంగిక దాడి, అసహజ శృంగారానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. తనపై ఆరోపణలు నిరాధారమని బిషప్ ములక్కల్ తోసిపుచ్చారు. -
నన్‌పై లైంగికదాడి : బిషప్ ములక్కల్ అరెస్ట్
తిరువనంతపురం : కేరళ నన్‌పై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదురొంటున్న జలంధర్ చర్చ్ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను కేరళ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఓ నన్‌పై లైంగిక దాడికి పాల్పడి అరెస్ట్ అయిన తొలి భారతీయ కాథలిక్ బిషప్ ములక్కల్ కావడం గమనార్హం. కొచ్చిలో శుక్రవారం సాయంత్రం బిషప్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. ఫ్రాంకో ములక్కల్ జలంధర్ చర్చ్ కేరళలో నిర్వహిస్తున్న స్కూళ్ల పర్యవేక్షణకు వచ్చిన సందర్భంగా నన్‌పై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. 2014 నుంచి 2016 వరకూ ములక్కల్ తనపై 13 సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని కేరళ నన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా తనపై లైంగిక దాడి ఆరోపణలు వచ్చిన క్రమంలో పాస్టర్ బాధ్యతల నుంచి తప్పించాలని పోప్‌కు ములక్కల్ లేఖ రాసిన క్రమంలో ఆయన స్ధానంలో మరొకరికి బాధ్యతలు అప్పగిస్తూ వాటికన్ నుంచి అధికారిక సమాచారం అందిందని చర్చి వర్గాలు తెలిపాయి. బిషప్‌ను అరెస్ట్ చేసే ముందు ఆయనపై లైంగిక దాడి ఆరోపణలు చేసిన బాధితురాలి నుంచి తాజా స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. మూడు రోజుల కిందట కేసుకు సంబంధించి ములక్కల్‌ను పోలీసు అధికారులతో కూడిన సిట్ బృందం ప్రశ్నించింది. -
ఆ పాస్టర్‌ను తప్పించారు..
తిరువనంతపురం : కేరళ నన్‌పై లైంగిక దాడి కేసులో విచారణ ఎదుర్కొంటున్న జలంధర్‌కు చెందిన బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను తాత్కాలికంగా పాస్టర్ బాధ్యతల నుంచి తప్పించారు. వాటికన్ నుంచి ఈ మేరకు అధికారిక సమాచారం అందిందని కాథలిక్ బిషప్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా గురువారం నిర్ధారించింది. కేరళ నన్‌పై ములక్కల్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తనపై ఆరోపణలు వచ్చిన క్రమంలో చట్టపరంగా వాటిని ఎదుర్కొనేవరకూ తనను చర్చి బాధ్యతల నుంచి తప్పించాలని ములక్కల్ పోప్‌కు లేఖ రాసిన క్రమంలో బిషప్ వినతిని అంగీకరించారు. జలంధర్ చర్చ్‌కు బిషప్ అగ్నెలో రఫినో గ్రాసియస్ను నియమిస్తున్నట్టు వాటికన్ ప్రకటన పేర్కొంది. కాగా ములక్కల్‌ను కేరళ పోలీసులతో కూడిన సిట్ ప్రశ్నించిన నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు. మరోవైపు ములక్కల్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించేందుకు అంగీకరించిన కేరళ హైకోర్టు ఈనెల 25న విచారణను చేపట్టనుంది. ఈ కేసులో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు కోరింది. -
నన్‌పై లైంగికదాడి: బిషప్‌ను ప్రశ్నించనున్న పోలీసులు
కొచ్చి : కేరళ నన్‌పై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జలంధర్‌కు చెందిన బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను బుధవారం కేరళ పోలీసులు ప్రశ్నించనున్నారు. తనపై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో చర్చ్ బాధ్యతల నుంచి గత వారం తప్పుకున్న బిషప్ ములక్కల్ కేసుకు సంబంధించి విచారణను ఎదుర్కొనేందుకు వైకోం డీఎస్పీ కే. సుభాష్ ఎదుట హాజరుకానున్నారు. కొచ్చిలోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో వైకోం డీఎస్పీ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన పోలీసుల బృందం ఆయనను ప్రశ్నించనుంది. సంచలనం సృష్టించిన కేరళ నన్‌పై లైంగిక దాడి కేసులో బిషప్‌ను ప్రశ్నించనున్న క్రమంలో క్రైమ్ బ్రాంచ్ (సీఐడీ) కార్యాలయం పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో బిషప్‌ను ప్రశ్నించనుండటంతో ఉన్నతాధికారులతో కొట్టాయం ఎస్పీ హరిశంకర్, కొచ్చి రేంజ్ ఐజీ విజయ్ శేఖర్ విచారణ ప్రక్రియలో పాల్గొంటారని భావిస్తున్నారు. కాగా 2014 నుంచి 2016 వరకూ బిషప్ ములక్కల్ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని కేరళ నన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
ముందస్తు బెయిల్‌కు బిషప్ ములక్కల్ అప్పీల్
తిరువనంతపురం : కేరళ నన్‌పై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జలంధర్‌కు చెందిన బిషప్ ఫ్రాంకో ములక్కల్ ముందస్తు బెయిల్ కోరుతూ మంగళవారం కేరళ హైకోర్టును ఆశ్రయించారు. నన్‌పై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆమెపై చర్యలు చేపట్టినందుకు ప్రతీకారంగానే ఆమె తనపై లైంగిక దాడి ఆరోపణలు చేశారని బిషప్ పేర్కొంటున్నారు. తనపై నన్ చేసిన ఆరోపణలు కట్టుకథంటూ ఆయన కొట్టిపారేస్తున్నారు. మరోవైపు తనపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో చర్చి బాధ్యతల నుంచి తనను తాత్కాలికంగా తప్పించాలని ములక్కల్ పోప్ ఫ్రాన్సిస్‌కు లేఖ రాశారు. ఈ కేసును ఎదుర్కొనేందుకు తాను తరచూ కేరళ ప్రయాణించాల్సి ఉన్నందున బిషప్ బాధ్యతల నుంచి తాను వైదలగుతానని లేఖలో బిషప్ స్పష్టం చేశారు. కేసులో తదుపరి విచారణ నిమిత్తం ఈనెల 19న హాజరు కావాలని కేరళ పోలీసులు తనకు నోటీసులు జారీ చేసిన క్రమంలో డయాసిస్ బాధ్యతలను మాధ్యూ కొక్కండమ్‌కు అప్పగిస్తూ బిషప్ సర్క్యులర్ జారీ చేశారు. జలంధర్ కు చెందిన బిషప్ ఫ్రాంకో ములక్కల్ 2014- 2016 మధ్య కాలంలో క్రైస్తవ మహిళా సన్యాసిని (46) మీద 13 సార్లు అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. -
కేరళ నన్‌పై లైంగిక దాడి : పోప్‌కు బిషప్ లేఖ
తిరువనంతపురం : కేరళ నన్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జలంధర్ చర్చి బిషప్ ఫ్రాంకో ములక్కల్ తాత్కాలికంగా బిషప్ బాధ్యతల నుంచి వైదొలుగుతానని పేర్కొంటూ పోప్ ఫ్రాన్సిస్‌కు లేఖ రాశారు. న్యాయస్ధానం వెలువరించిన ఉత్తర్వుల నేపథ్యంలో చర్చి నిర్వహణ బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పించాలని పోప్ ఫ్రాన్సిస్‌కు రాసిన లేఖలో ములక్కల్ కోరారు. నన్‌పై లైంగిక దాడి కేసును విచారిస్తున్న కేరళ పోలీసుల తరపున శుక్రవారం జలంధర్ పోలీసులు బిషప్కు సమన్లు అందచేశారు. కాగా 2014 నుంచి 2016 వరకూ ములక్కల్ తనపై 13 సార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని 43 ఏళ్ల నన్ ఈ ఏడాది జూన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పంజాబ్‌కు చెందిన జీసస్ మిషనరీలు కేరళలో రెండు కాన్వెంట్లను నిర్వహిస్తున్న క్రమంలో ఈ మిషనరీల్లో బాధిత నన్ సభ్యురాలిగా ఉన్నారు. నన్‌పై లైంగిక దాడికి పాల్పడిన బిషప్ అరెస్ట్‌ను డిమాండ్ చేస్తూ కొచ్చిలో నన్‌లు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. కాగా బిషప్‌పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన అధికార ప్రతినిధి ఫాదర్ పీటర్ పేర్కొన్నారు. -
బాధ్యతలను మరొకరికి అప్పగిస్తున్నా
కొట్టాయం/కొచ్చి: అత్యాచారం ఆరోపణలను ఎదుర్కొంటున్న జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్ పరిపాలన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన ఈ నెల 13వ తేదీన జారీ చేసిన సర్క్యులర్ తాజాగా వెలుగు చూసింది. ‘నేను లేని సమయంలో మాన్సిగ్నోర్ మాధ్యూ కొక్కండమ్ ఈ డయోసిస్ పరిపాలన సజావుగా సాగేలా చూసుకుంటారు. దైవశక్తి జోక్యంతోనే ఈ అంశంలో సత్యం వెలుగు చూస్తుంది. నాకు వ్యతిరేకంగా పోలీసులు సేకరించిన ఆధారాల్లో పరస్పర విరుద్ధాంశాలున్నాయి. ఫలితం కోసం ఎదురు చూస్తున్నాను’ అని అందులో పేర్కొన్నారు. ఈ నెల 19వ తేదీన జరిగే విచారణకు హాజరు కావాల్సిందిగా కేరళ పోలీసులు నోటీసులిచ్చిన నేపథ్యంలో ఈ సర్క్యులర్ వెలువడింది. -
‘ఆమె సన్యాసిని కాదు.. వేశ్య’
తిరువనంతపురం : జలంధర్ కు చెందిన బిషప్ ఫ్రాంకో ములక్కల్ 2014- 2016 మధ్య కాలంలో క్రైస్తవ మహిళా సన్యాసిని (46) మీద 13 సార్లు అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, తాజాగా కేరళ స్వతంత్ర ఎమ్మెల్యే పీసీ జార్జ్ ముక్కల్‌కు మద్దతు పలుకుతూ.. సన్యాసినిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొట్టాయంలో ఎమ్మెల్యే జార్జ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఆ సన్యాసిని వేశ్యగా అభివర్ణించాడు. ఆమె ఒక వ్యక్తితో రెండేండ్లుగా లైంగిక సంబంధాలు నడిపిందని, పవిత్రమైన సన్యాసినిగా ఉన్న ఆమెను వేశ్యనికాక, ఇంకేమని పిలవాలని ప్రశ్నించారు. బిషప్ తనపై 13 సార్లు అత్యాచారం చేశాడని ఆరోపిన్నారు. మరి 12 సార్లు శృంగారంలో పాల్గొని ఆనందించిన ఆమెకు 13 వ సారి మాత్రమే ఎందుకు అత్యాచారంగా అనిపించింది.. మొదటి సారి ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. సన్యాసిని అంటే ఆమె కన్యగా ఉండాలి. ఆమెను సన్యాసినిగా పరిగణించలేమంటూ అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. సమాజంలో ప్రముఖుల పరువు తీయడానికే కొందరు మహిళలు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని, వారిలో ఆమె కూడా ఒకరని జార్జ్ ఆరోపించారు.కాగా జార్జ్ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ తీవ్రంగా ఖండించారు. ఓ ప్రజా ప్రతినిధి అలా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మరోవైపు బిషప్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని కోరుతూ క్రైస్తవ సన్యాసినిలు కోచిలో ఆందోళనలు నిర్వహించారు. సిస్టర్ అల్ఫై ఎంజే, సిస్టర్ అన్నే జైసీ, సిస్టర్ నీనా రోజ్ ఎంజే, సిస్టర్ జోసెఫ్ ఎంజే, సిస్టర్ నీనా జోస్‌లు నిరసన చేపట్టిన ఫ్రాంకో ములక్కల్‌ను అరెస్ట్ చేయాలని కోరారు. ఆధారాలతో సహా బాధితురాలు ఫిర్యాదు చేసి 74 రోజులైనా ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. -
సన్యాసినిపై మత గురువు పలుమార్లు అత్యాచారం!
సాక్షి, తిరువనంతపురం: కేరళలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ సన్యాసినిపై మత గురువు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బాధితురాలు శుక్రవారం కొట్టాయం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదులో ఉత్తర భారతదేశానికి చెందిన ఓ డియోసెస్ కేథలిక్ మత గురువు ఇప్పటివరకు 13సార్లు అత్యాచారం చేశాడని పేర్కొన్నారు. తాను మొదటిసారి 2014లో కురవిలాంద్ ప్రాంతంలోని అనాథ శరణాలయం వద్ద అతిథి గృహంలో ఉన్నపుడు అత్యాచారానికి గురయ్యానని తెలిపారు. దీనిపై చర్చి అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. ఇదిలా ఉండగా తనని బదిలీ చేశాననే కోపంతో నాఫై ఫిర్యాదు చేసిందని మత గురువు కౌంటర్ ఫిటిషన్ వేశారు. దీనిపై దర్యాప్తు జరిపేందుకు ఎస్పీ ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేరళాకు చెందిన ఆయన 2013 నుంచి డియోసెస్ కేథలిక్ మత గురువుగా వ్యవహరిస్తున్నారు. -
ప్రభుత్వంపై కేథలిక్ బిషప్ సంచలన ఆరోపణలు
సాక్షి, న్యూఢిల్లీ : మత విశ్వాసాల ఆధారంగా దేశం విభజించబడిందని.. కేథలిక్ బిషప్ కాన్ఫెరెన్స్ ఆఫ్ ఇండియా (సీబీసీఐ) ఆరోపించింది. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం దురదృష్టమని సీబీసీఐ తెలిపింది. ప్రస్తుతం దేశంలోని వర్గాలన్నీ మత ప్రాతిపదికన చీలిపోయాయని, ఇటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా అందరూ పోరాడాలని సీబీసీఐ పిలుపునిచ్చింది. ప్రస్తుత ప్రభుత్వంపై విశ్వాసం సన్నిగిల్లుతోందని.. క్రైస్తవ సమాజం నుంచి ఈ భయం మరింత ఎక్కువగా ఉందని సీబీసీఐ అధ్యక్షుడు, కార్డినల్ బసిలియోస్ క్లీమేస్ చెప్పారు. అమాయకులైన మతాధికారులపై ప్రభుత్వం అన్యాయంగా కేసులు పెడుతోందని ఆయన అన్నారు. అమాయక, పేద మతాధికారులను ఇబ్బందులు పెట్టడం మంచిది కాదన్నారు. ఈ పరిస్థితుల్లో మాకు ప్రభుత్వం మీద నమ్మకం సన్నగిల్లుతోందని ఆయన.. ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. గత వారం మధ్యప్రదేశ్‌లోని సాత్నా పట్టణంలో 30 మంది మతాధికారులు కారోల్స్ పాడుతుండగా.. అరెస్ట్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అలాగే గ్రామాల్లోని ప్రజలను భజరంగ్ దళ్ కార్యకర్తలు బలవంతంగా మతమార్పిడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. -
ఆరోపణలు తగదు
– బిషప్ పుష్పలలిత నంద్యాలవిద్య : సీఎస్ఐ ట్రస్టు అసోసియేషన్ స్టేక్ హోల్డర్స్ కమిటీ సభ్యులు తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని నంద్యాల డయాసిస్ బిషప్ పుష్పలలిత అన్నారు. మంగళవారం చర్చి ఆఫ్ సౌత్ ఇండియా నంద్యాల డయాసిస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వ్యక్తిగత కారణాలచేత తనపై కక్ష సాధించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. తన పరిపాలనలో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగలేదని.. ‘పరిశుద్ధ సిలువపై ఒట్టేసి చెబుతున్నా..నేను ఎలాంటి పాపంచేయలేదు’ అంటూ స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు చేసున్నవారు గతంలో డయాసిస్ పెద్దలపై దుర్భాషలాడారని, వారిపై క్రమశిక్షణ రాహిత్య చర్యలు తీసుకున్నానేతప్ప ఎటువంటి కక్షసాధింపు చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. సమావేశంలో వైస్ ప్రసిడెంట్ రెవరెండ్ ఏసురత్నం, సెక్రటరీ గంగు ఆనంద్, కోశాధికారి రత్నరాజు, గురువులు పాల్గొన్నారు. -
దివ్యాంగులకు సేవ చేయడం అదృష్టం
– కర్నూలు డయాసిస్ బిషప్ పూల ఆంథోని అయ్యలూరుమెట్ట (నంద్యాలరూరల్): దివ్యాంగులకు సమాజంలో వారికి గౌరవ స్థానం కల్పించడం అదృష్టంగా భావించాలని కర్నూలు డయాసిస్ బిషప్ మోస్ట్ రైట్ రెవరెండ్ పూల ఆంథోని అన్నారు. అయ్యలూరు మెట్ట నవజీవన్ బధిరుల పాఠశాల వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బిషప్ పూల ఆంథోని మాట్లాడుతూ ఏసుప్రభువు చూపిన ప్రేమ, దయ, కరుణతో 39 సంవత్సరాలు విచారణ గురువుగా సేవలు అందిస్తున్న ఫాదర్ మర్రెడ్డి సేవలు మరువలేనివన్నారు. పెద్దకొట్టాలలో శారీరక వికలాంగుల ఆశ్రమం, గోపవరం వద్ద మానసిక వికలాంగుల ఆశ్రమం, అయ్యలూరు మెట్ట వద్ద మూగ, చెవిటి పిల్లల ప్రత్యేక పాఠశాలను నెలకొల్పి వికలాంగులకు వసతితో పాటు విద్యను అందించడం దేవుడు ఆయనకు ఇచ్చిన గొప్పవరం అన్నారు. జేఎంజే సంస్థ పర్య అధినేత సిస్టర్ సెలీనా ఆలాపాట్ కూడా దైవ కన్యగా నిలుస్తూ 50 సంవత్సరాలుగా దైవ మార్గంలో విద్యార్థులకు, సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని సేవాదృక్పథం పెంచుకోవాలని సూచించారు. అనంతరం బిషప్ పూల ఆంథోని, సిస్టర్ సెలీనా ఆలాపాట్, ఫాదర్ మర్రెడ్డిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్ రాజమ్మ, పెద్దకొట్టాల ఆర్సీఎం చర్చి విచారణ గురువు ఏర్వ జోజిరెడ్డి, ప్యారీస్ క్రీస్ ఫాదర్ సురేష్, నవజీవన్ డీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ నారపురెడ్డి, ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ పద్మావతమ్మ, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రాజశేఖర్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు: పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా నవజీవన్ విద్యార్థుల నాటికలు, సాంస్కృతిక ప్రదర్శనలు, కోలాటం నృత్యం, చెక్కభజన, ఆహుతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏసుప్రభువు జీవిత ఘట్టం, గ్లోరిగ్లోరి దేవుని మహిమ గీతం, ప్రేమసింధు, పరమాత్మ నీవనే అనుక్రమ గీతం, అల్లేలూయ గీతాలకు బధిర విద్యార్థుల ప్రదర్శన శభాష్ అనిపిచింది. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.