Bolero vehicle
-
పోలీస్ జీప్ నంబర్‌తో మరో బైక్
సిరిసిల్లటౌన్: ఈ ఫొటోలు రెండూ చూశారా.. ఒకటి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పోలీస్ బోలెరో వాహనం. మరోటి ఖమ్మం జిల్లా జలగంనగర్‌లోని బైక్. ఈరెండు వాహనాల నంబర్లు టీఎస్09పీసీ 4009గా ఉన్నాయి. సాధారణంగా పోలీస్ వాహనాలకు టీఎస్09పీసీ సిరీస్‌తో నంబర్లు అలాట్ అవుతుంటాయి. కానీ, ఖమ్మం జిల్లాలోని జలగంనగర్‌లో కూడా ఓ వ్యక్తి బైక్ నంబరు సిరిసిల్ల పోలీస్ బోలెరో వాహనం ఒకటే కావడం విశేషం. పైగా ఖమ్మంలో ఓ వ్యక్తి హెల్మెట్ లేకుండా బైక్‌పై వెళ్తుండగా అక్కడి పోలీసులు ఫొటో తీసి ఏప్రిల్ 30న ఆన్లైన్ ద్వారా రూ.100 పెనాల్టీ విధించారు. తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ ఈ–చలాన్లో బైక్ యజమాని పేరు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ టీఎస్ ఉండటం విశేషం. అయితే రెండింటిలో ఏది అసలు.. ఏది నకిలీ అనేది తేలాల్సి ఉంది. ఈవిషయమై సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణను వివరణ కోరగా.. ఈఅంశంపై ఖమ్మం పోలీస్ సహకారంతో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
బొలేరో, ఆర్టీసీ బస్సు ఢీ: ఇద్దరి మృతి..
కరీంనగర్: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ బస్టాండ్ సమీపంలో మంగళవారం సాయంత్రం బొలేరో వాహనం, ఆర్టీసీ బస్సు ఢీకొన్ని ఘటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 21 మంది ప్రయాణికులతో ధర్మారం నుంచి కరీంనగర్ వైపు వెళ్తోంది.ఇదే సమయంలో కరీంనగర్ నుంచి ధర్మారం వైపు వస్తున్న బొలేరో ట్రాలీ అదుపుతప్పి ఢీకొన్నాయి. ట్రాలీ నుజ్జునుజ్జు కాగా డ్రైవర్ అన్వర్(25), అందులో ప్రయాణిస్తున్న అఫ్జల్(55) క్యాబిన్లో ఇరుక్కుని మరణించారు. రెండు వాహనాలు బలంగా ఢీకొనడంతో ట్రాలీలోని ఆవు కొవ్వు డబ్బాలు, చర్మం రోడ్డుపై పడిపోయాయి.పెద్దపల్లి సీఐ కృష్ణ, ధర్మారం ఎస్సై సత్యనారాయణలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్యాబిన్లో ఇరుక్కున్న మృతదేహాలను కట్టర్ల సాయంతో బయటకు తీశారు. అన్వర్ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తికాగా, అఫ్జల్ గోదావరిఖని ప్రాంతానికి చెందిన వాడని పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు రమాదేవి, ఆగవ్వకు స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసినట్లు సీఐ కృష్ణ తెలిపారు.ఆవు కొవ్వు ఎందుకోసం?బొలేరో ట్రాలీలో ఆవు కొవ్వు, చర్మం తరలింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? రావాణాకు అనుమతి ఉందా? లేదా? ఆవు కొవ్వు, చర్మం దేనికి వినియోగిస్తారు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, ఎస్సై సత్యనారాయణ మాట్లాడుతూ, మృతుల బంధువులు వస్తే పూర్తిసమాచారం తెలుస్తుందన్నారు. -
టమాటా దొంగలు అరెస్ట్
కర్ణాటక: టమాటాలతో ఉన్న బోలెరో వాహనంతో పరారైన దంపతులను బెంగళూరు ఆర్ఎంసీ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు...చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరె నివాసి రైతు మల్లేశ్ ఈ నెల 8న 210 బాక్సుల టమాటాలను లోడ్ చేసుకుని బొలెరో వాహనంలో చెళ్లకెరె నుంచి కోలారు మార్కెట్‌కు బయలుదేరారు. రాత్రి 10:45 గంటల సమయంలో డ్రైవర్ శివణ్ణతో కలిసి మార్గంమధ్యలోని తుమకూరు రోడ్డు సీఎంటీఐ నుంచి హెబ్బాళ వైపు వెళ్తూ టీ తాగటానికి మల్లేశ్, శివణ్ణలు ఓ హోటల్ వద్ద వాహనం నిలిపారు. ఈ సమయంలో బొలెరో అపహరణకు గురైంది. ఇందుకు సంబంధించి ఆర్ఎంసీ యార్డ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు తమిళనాడుకు చెందిన దంపతులు భాస్కర్ (38), సింధు (36)లను అరెస్ట్ చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరుకు చెందిన ఇద్దరు సహకారంతో తమిళనాడుకు చెందిన దంపతులు చోరీ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. టమాటాలను అమ్మగా వచ్చిన రూ.1.5 లక్షలు నగదును ఐదుగురు సమానంగా పంచుకున్నారు. దంపతులను అరెస్ట్ చేయటంతో మిగిలిన ముగ్గురు పరారీ అయ్యారు. నిందితులు కారులో వెంబడించి బులెరో వాహనాన్ని ఢీకొట్టడానికి యత్నించి అది సాధ్యం కానీ పక్షంలో బొలెరోను అపహరించుకుని పరారైనట్లు పోలీసులు తెలిపారు. -
మార్కెట్లోకి దూసుకొస్తున్న మరో మహీంద్ర బొలెరో మాక్స్ పికప్
-
రోడ్డుపై ఏనుగు బీభత్సం.. బొలెరో వాహనాన్ని ఒక్కసారిగా ఎత్తిపడేసి..
-
మహీంద్రా నుంచి కమర్షియల్ వెహికల్ విడుదల..ధర ఎంతంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తేలికపాటి వాణిజ్య వాహనం కొత్త బొలెరో మ్యాక్స్ పికప్‌ను విడుదల చేసింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.7.68 లక్షల నుంచి ప్రారంభం. 1,300 కిలోల సరుకును మోయగలదు. వారంటీ మూడేళ్లు లేదా ఒక లక్ష కిలోమీటర్లు. మెరుగైన రవాణా కోసం ఆర్15 టైర్లను వినియోగించారు. 20,000 కిలోమీటర్లకు ఒకసారి సర్వీసింగ్ చేయించాల్సి ఉంటుంది. 2–3.5 టన్నుల తేలికపాటి వాణిజ్య వాహన విభాగంలో కంపెనీకి దక్షిణాదిన 43 శాతం వాటా ఉందని మహీంద్రా ఎస్వీపీ వెంకట్ శ్రీనివాస్ తెలిపారు. దక్షిణ భారత్‌లో 2–3.5 టన్నుల విభాగం మార్కెట్ ఏటా 8,000 యూనిట్లు ఉంది. -
లోయలోకి దూసుకుపోయిన కారు
రంపచోడవరం: రంపచోడవరానికి సుమారు 15 కిలోమీట ర్ల దూరంలోని బర్డ్స్ నెట్ రిసార్ట్స్ సమీపంలో సోమవారం సాయంత్రం బొలేరో వాహనం బోల్తా కొట్టి లోయలో పడింది. కాకినాడ నుంచి చత్తీస్‌గఢ్ రాష్ట్రం కుంట వెళ్తున్న ఈ వాహనంలో నలుగురు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. కారులో ప్రయాణికుల వివరాలు తెలియరాలేదు. -
తీరని శోకం.. రాములవారి భజనలో అపశ్రుతి..
కొణిజర్ల: పండుగపూట విషాదం నెలకొంది. ఆలయంలోకి బొలేరో వాహనం దూసుకెళ్లడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లి పాడులో ఆదివారం రాత్రి చోటు చేసు కుంది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీరామనవమి సందర్భంగా పల్లిపాడు అభయాంజనేయ స్వా మి దేవాలయంలో ఏర్పాటు చేసిన భజనకు తుమ్మలపల్లికి చెందిన 25 మంది వచ్చారు. కొందరు పిల్లలను వెంటబెట్టుకొచ్చారు. పెద్ద లు భజన చేస్తుండగా, పిల్లలు ఆడుకుంటున్నా రు. రాత్రి 9 దాటాక ఖమ్మం నుంచి దిద్దుపూడికి వేగంగా వెళ్తున్న బొలేరో ఆలయ సమీపానికి రాగానే అదుపు తప్పింది. పక్కన ఉన్న వి ద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి, అదేవేగంతో దేవాలయంలోకి దూసుకెళ్లింది. దీంతో ఆలయం గో డ విరిగి పక్కనే ఆడుకుంటున్న పగడాల దేదీప్య(9), పగడాల సహస్ర(7)తో పాటు ఇజ్జగాని అలేఖ్యపై పడింది. తీవ్రగాయాలైన చిన్నారులను ఖమ్మం తరలిస్తుండగా దేదీప్య, సహస్ర మృతి చెందారు. అలేఖ్య గాయాలతో బయట పడింది. వాహనం డ్రైవర్ మద్దెల పోతురాజు, వాహనంలో ఉన్న నాగటి వెంకన్న సైతం తీ వ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఖమ్మం తరలించారు. తీరని శోకం.. తుమ్మలపల్లికి చెందిన పగడాల ఆదినారాయణ, శిరీష దంపతులకు ఇద్ద రూ ఆడపిల్లలే. ఆదినారాయణ పెయింటర్‌గా పనిచేస్తూనే ఆలయాల్లో భజనలకు తబలా వాయిద్యకారుడిగా వెళ్తుం టాడు. పల్లిపాడులో భజనకు భార్యాభర్తలు వెళ్తూ, కుమార్తెలు దేదీప్య, సహస్రను కూడా వెంట తీసుకెళ్లారు. ఊహించని విధంగా జరి గిన ప్రమాదంలో చిన్నారులిద్దరూ మరణించడంతో ఆ దంప తుల దుఃఖానికి అంతులేకుండా పోయింది. -
బొలెరో వాహనం, బైక్ ఢీ..
శంకర్పల్లి: బొలెరో వాహనం బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగాపురం గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా శాంతినగర్‌కు చెందిన జలేందర్, నాగరాజు(34)లు సంగారెడ్డిలోని కనకదుర్గ చిట్‌ఫండ్‌లో కలెక్షన్ ఏజెంట్లుగా పని చేస్తున్నారు. శంకర్‌పల్లిలోని ఓ వ్యక్తి వద్ద డబ్బులు వసూలు చేసేందుకు మధ్యాహ్నం బైక్‌పై శంకర్‌పల్లికి వస్తుండగా సింగాపురం శివారులో ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న నాగరాజు అక్కడికక్కడే మృతి చెందగా, జలేందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బొలెరో వాహనం వేగంగా ఉండటంతో అదుపు తప్పి పల్టీ కొట్టింది. బొలేరో డ్రైవర్ నావిద్ఖాన్(38) తీవ్రంగా గాయపడగా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంతోష్ తెలిపారు. -
సూపర్ ఐడియా మహీంద్రా.. సెలబ్రిటీలకే కాదు సామాన్యులకు క్యారవాన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా.. భారత్‌లో క్యాంపర్స్ వాహనాలను ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం కారవాన్ల తయారీ కంపెనీ క్యాంపర్వాన్ ఫ్యాక్టరీతో ఒప్పందం కుదుర్చుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో పలు మోడళ్లలో అందుబాటు ధరలో కారవాన్లను కంపెనీ రానున్న రోజుల్లో భారత్‌లో పరిచయం చేస్తుంది. ఐఐటీ మద్రాస్ అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ క్లీన్ వాటర్, సెయింట్ గోబెయిన్ రీసెర్చ్ సెంటర్ సైతం ఈ వాహనాల అభివృద్ధిలో మహీంద్రాకు సాయం చేస్తాయి. కారవాన్ విభాగంలో ఇటువంటి ఒప్పందం భారత వాహన తయారీ రంగంలో ఇదే తొలిసారి అని మహీంద్రా వెల్లడించింది. ఐఐటీ మద్రాస్‌లో క్యాంపర్వాన్ ప్రాణం పోసుకుంది. డబుల్ క్యాబ్ బొలెరో క్యాంపర్ గోల్డ్ ప్లాట్‌ఫామ్‌పై క్యాంపర్స్ రూపుదిద్దుకుంటాయి. కుటుంబం, స్నేహితులతో కలిసి యాత్రలకు వెళ్లేవారికి కారవాన్ వాహనాలు సౌకర్యంగా ఉంటాయి. నలుగురు కూర్చుని భోజనం చేయడానికి, పడుకోవడానికి కారవాన్‌లో ఏర్పాట్లు ఉంటాయి. బయో టాయిలెట్‌తో కూడిన రెస్ట్ రూమ్, ఫ్రిడ్జ్, మైక్రోవేవ్, ఏసీ, టీవీ వంటివి పొందుపరుస్తారు. చదవండి: Toyota Tocozilla: ఇది ట్రక్కు కాదు నడిచే ఇల్లు.. అచ్చంగా హీరోల తరహాలో -
విషాదం: బిడ్డను గమనించని తండ్రి.. వాహనాన్ని ముందుకు నడపడంతో
గీసుకొండ: అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురు.. పొరపాటున తండ్రి నడిపించే గూడ్స్ వాహనం కిందపడి తనువు చాలించింది. ఈ ఘటన గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్ కాలనీలో మంగళవారం జరిగింది. బొలెరో గూడ్స్ వాహనం డ్రైవర్‌గా పనిచేస్తున్న వల్లెపు రమేశ్‌కు కూతురు చందన (5), కుమారుడు ఉన్నారు. రమేశ్ ఉదయం ఇంటి నుంచి గూడ్స్ వాహనాన్ని వరంగల్ కూరగాయల మార్కెట్‌కు తీసుకుని వెళ్లడానికి సిద్ధమవుతుండగా.. దివ్యాంగురాలైన చందన పాకుకుంటూ ఆ వాహనం వెనుక టైరు వద్దకు చేరింది. కూతురుని గమనించని తండ్రి వాహనాన్ని ముందుకు నడపడంతో టైరు కిందపడి చందన అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ దేవేందర్ తెలిపారు. (చదవండి: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఢీకొట్టిన లారీ) -
Tomato Price: నెల క్రితం 3టన్నుల టమాటా లక్ష రూపాయలు.. మరి నేడు..?
సాక్షి, కడప: టమోట ధరలు భారీగా క్షీణించాయి. నెల రోజుల క్రితం 114 బాక్సుల లోడు గల బోలేరో వాహనంలో సుమారు 3టన్నుల టమాటాలు లక్ష రూపాయలు పలికాయి. ప్రస్తుతం అదే బోలేరో వాహనంలోని 114 బాక్సుల టమోటాలు రూ.6వేల ధర కూడా పలకడంలేదు. వాహనంలోకి లోడు ఎక్కించేందుకు కూలీలకు రూ.2,800, మార్కెట్‌కు తరలించడానికి వాహన బాడుగ రూ.4వేలు కలిపి మొత్తం రూ.6,800 చెల్లించాలి. లోడు టమాటాల ధర రూ.6వేలు పలికితే రైతు అదనంగా రూ.800 చేతినుంచి వేసుకుని చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో లింగాల మండలం కోమన్నూతలకు చెందిన వెంకటేష్ అనే రైతు తాను పండించిన టమాటాలను ఇలా మేకలకు మేతగా పడేశాడు. చదవండి: (జులై 1 నాటికి వారికి కొత్త జీతాలు అందాలి: సీఎం జగన్) -
ఆనంద్ మహీంద్రా కోరిక నెరవేరింది
దేశం గర్వించదగ్గ వ్యాపారదిగ్గజాల్లో ఆనంద్ మహీంద్రా ఒకరు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వర్తమాన అంశాలపై స్పందించడమే కాదు.. అవసరమైతే సాయానికి సైతం వెనకాడని నైజం వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాది. అలాంటిది మాట ఇచ్చాక ఊరుకుంటాడా? ఆ మధ్య మహారాష్ట్రకు చెందిన ఓ సామాన్యుడికి ఆనంద్ మహీంద్రా ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసే ఉంటుంది. తన టాలెంట్‌కు పదునుపెట్టి పాత సామాన్లతో ఫోర్ వీలర్‌ను తయారుచేశాడు దత్తాత్రేయ లొహార్ అనే అతను. అసమాన్యమైన ఆ ప్రతిభకు, సృజనాత్మక ఆవిష్కరణకు ఆనంద్ మహీంద్రా ఫిదా అయిపోయారు. ఆ వాహనం ఇస్తే.. బదులుగా కొత్త బొలెరో వాహనం ఇస్తానని ప్రకటించారు. ఇప్పుడు మొత్తానికి ఆ పని చేసి చూపించారాయన. ‘‘కొత్త బొలెరో తీసుకుని తన వాహనాన్ని మార్చుకునే ప్రతిపాదనను అతను అంగీకరించినందుకు ఆనందంగా ఉంది. నిన్న అతని కుటుంబం బొలెరోను అందుకుంది. మేము అతని సృష్టికి సగర్వంగా బాధ్యత వహిస్తాం. ఇది మా రీసెర్చ్ వ్యాలీలో మా అన్ని రకాల కార్ల కలెక్షన్లో భాగంగా ఉండనుంది ఇక. స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నాం అంటూ ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. Delighted that he accepted the offer to exchange his vehicle for a new Bolero. Yesterday his family received the Bolero & we proudly took charge of his creation. It will be part of our collection of cars of all types at our Research Valley & should inspire us to be resourceful. https://t.co/AswU4za6HT pic.twitter.com/xGtfDtl1K0 — anand mahindra (@anandmahindra) January 25, 2022 సంబంధిత వార్త: బొలెరో ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా! ప్రతిగా ఏం కోరాడంటే.. దత్తాత్రేయ లొహార్ స్వస్థలం మహారాష్ట్రలోని దేవ్రాష్ట్రే గ్రామం. పాత, పాడుబడ్డ కార్ల నుంచి పార్ట్‌లను సేకరించి ఈ ప్రయత్నం చేశాడు. పాత సామాన్లను చేర్చి ఆ వాహనం చేయడానికి అతను 60 వేల రూపాయల అప్పు కూడా చేశాడు. టూవీలర్స్‌లోని మెకానిజంతో ఈ బండిని తయారు చేయడం విశేషం. పేద కుటుంబమే అయినప్పటికీ కేవలం కొడుకు ముచ్చట తీర్చడానికే చేశాడట! షోరూంలో దత్తాత్రేయ కుటుంబంతో సహా వాహనం అందుకున్న ఫొటోల్ని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. This clearly doesn’t meet with any of the regulations but I will never cease to admire the ingenuity and ‘more with less’ capabilities of our people. And their passion for mobility—not to mention the familiar front grille pic.twitter.com/oFkD3SvsDt — anand mahindra (@anandmahindra) December 21, 2021 -
పందుల దొంగల ముఠా.. బొలేరోతో ఢీకొట్టి.. ఎంత పనిచేశారంటే..
ఆదోని రూరల్(కర్నూలు జిల్లా): ఆదోని పట్టణంలో పందులు, గొర్రెలను అపహరించేందుకు వచ్చిన కర్ణాటక గ్యాంగ్ హల్చల్ సృష్టించింది. వారి వాహనాన్ని అడ్డగించేందుకు యత్నించిన యువకుడిని ఢీకొట్టి చంపేశారు. ఇస్వీ ఎస్ఐ విజయలక్ష్మి తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం తెల్లవారుజామున కర్ణాటకు చెందిన కేఏ25 ఏఏ 4030 నంబర్ బొలేరో ట్రక్కు వాహనంలో టీజీఎల్ కాలనీ, బొబ్బలమ్మ గుడి ఏరియా ప్రాంతాల్లో పందులను అపహరించేందుకు ఓ దొంగల ముఠా చేరుకుంది. చదవండి: భర్త అదృశ్యం.. ఇంట్లో రక్తపు మరకలు.. భార్య వివాహేతర సంబంధమే కారణమా..? పందుల యజమానులు గుర్తించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. పట్టణ శివారులోని శిరుగుప్పక్రాస్ రోడ్డు వద్ద వారి వాహనానికి టీజీఎల్ కాలనీకి చెందిన సురేష్(19) తన బైక్‌ను అడ్డుగా పెట్టి పక్కనే నిలిచాడు. దొంగలు వాహనాన్ని ఆపకుండా వేగంగా ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో దొంగలకు చెందిన బొలేరో వాహనం బోల్తా పడటంతో.. వాహనాన్ని వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న ఇస్వీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు ఈరన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయలక్ష్మి తెలిపారు. కర్ణాటకకు చెందిన పందుల దొంగల ముఠా ఇటీవల ఆదోని మండలంలో మదిరె, హాన్వాల్, పెద్దతుంబళం, కోసిగి తదితర ప్రాంతాల్లో పట్టపగలు ఇళ్లలో దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేగాకుండా ఆరు నెలల క్రితం గూడూరు వద్ద పందులను అపహరించి తరలిస్తున్న ముఠాపై స్థానికులు వెంబడించగా, మండల పరిధిలోని దొడ్డనగేరి గ్రామ సమీపంలో వాహనం టైరు పేలడంతో వాహనాన్ని వదిలి పరారయారు. పందుల దొంగలను అరెస్ట్ చేసి శిక్షించాలని పందుల యజమానులు కోరుతున్నారు. -
భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం
సాక్షి, రాయచూరు(కర్ణాటక): రోడ్డు ప్రమాదంలో భర్త దుర్మరణం చెందగా భార్య తీవ్రంగా గాయపడింది. వివరాలు... మాన్విలో రంగరేజ్(40),నూరుస్లు కిరాణా అంగడి నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి దుకాణం మూసివేసి ఇద్దరూ బైక్‌లో ఇంటికి బయల్దేరారు. మార్గం మధ్యలో ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొంది. రంగరేజ్ అక్కడికక్కడే మృతి చెందగా నూరుస్ గాయపడింది. పోలీసులు క్షతగాత్రురాలిని రిమ్స్‌కు తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. అల్లుని దాడిలో అత్త హతం బనశంకరి: మద్యం మత్తులో అల్లుడు కొట్టిన దెబ్బలకు అత్త మరణించింది. ఈ ఘటన బాళేహెన్నూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రమేశ్, మంజుల దంపతులు అత్త కాళమ్మ (75) కలిసి ఉంటున్నారు. సోమవారం సాయంత్రం మద్యం తాగి విందు చేసుకున్నారు. ఇంతలో రమేశ్‌కు అత్తతో గొడవ చెలరేగి ఆమెను తీవ్రంగా కొట్టి బయటకు తరిమేశాడు. తల, గొంతుకు తీవ్రగాయాలు కావడంతో పాటు రాత్రంతా చలిలో వణికిపోయి కాళమ్మ మతిచెందింది. పోలీసులు రమేశ్‌ను అరెస్ట్‌చేశారు. -
సామాన్యుడికి ఆనంద్ మహీంద్రా బంపరాఫర్
Anand Mahindra Offers Bolero To This Man Who Made four wheeler With Scrap: మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా చర్యలు ఎప్పుడూ ఆకట్టుకునేలా ఉంటాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బిజినెస్ టైకూన్.. అప్పుడప్పుడు సర్ప్రైజ్లు కూడా ఇస్తుంటాడు. అలా ఇప్పుడు ఓ సామాన్యుడికి బంపరాఫర్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ మహీంద్రా ఆఫర్ ఇచ్చింది ఓ పేదకమ్మరికి!. తన టాలెంట్‌కు పదునుపెట్టి పాత సామాన్లతో ఫోర్ వీలర్‌ను తయారుచేశాడతను. అసమాన్యమైన ఆ ప్రతిభకు, సృజనాత్మక ఆవిష్కరణకు ఆనంద్ మహీంద్రా ఫిదా అయిపోయారు. అందుకే ఆ వీడియోను షేర్ తన ట్విటర్లో షేర్ చేశారు. అందులో ఆ కారు ఎలా పని చేస్తుందో కూడా వివరంగా ఉంది. పనిలో పనిగా ఆ వ్యక్తి తయారు చేసిన వాహనం తీసుకుని.. తన కంపెనీ తరపున బొలెరో వాహనాన్ని ఇవ్వాలని ఫిక్సయ్యారు ఆనంద్ మహీంద్రా. This clearly doesn’t meet with any of the regulations but I will never cease to admire the ingenuity and ‘more with less’ capabilities of our people. And their passion for mobility—not to mention the familiar front grille pic.twitter.com/oFkD3SvsDt — anand mahindra (@anandmahindra) December 21, 2021 ‘‘ఇది నిబంధనలకు అనుగుణంగా లేకపోవచ్చు. కానీ తక్కువ వనరులతో ఎక్కువ ఫలితాన్ని చూపెట్టే మన ప్రజల చాతుర్యాన్ని మెచ్చుకోకుండా నేను ఉండలేను’’.. అంటూ ట్విటర్ వేదికగా పెద్దగా చదువుకోని ఆ ‘ఇంజినీర్’పై ప్రశంసలు గుప్పించాడు. హిస్టోరికానో యూట్యూబ్ ఛానెల్ ప్రకారం.. ఆ ఆవిష్కరణ చేసిన వ్యక్తి పేరు దత్తాత్రేయ లొహార్. ఊరు మహారాష్ట్రలోని దేవ్రాష్ట్రే గ్రామం. పాత, పాడుబడ్డ కార్ల నుంచి పార్ట్‌లను సేకరించి ఈ ప్రయత్నం చేశాడు. పాత సామాన్లను చేర్చి ఆ వాహనం చేయడానికి అతను 60 వేల రూపాయల అప్పు కూడా చేశాడు. టూవీలర్స్‌లోని మెకానిజంతో ఈ బండిని తయారు చేయడం విశేషం. పేద కుటుంబమే అయినప్పటికీ కేవలం కొడుకు ముచ్చట తీర్చడానికే చేశాడట! మరి ఆనంద్ మహీంద్రా ఇచ్చిన ఆఫర్‌ను దత్తూ స్వీకరిస్తాడా? లేదా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. చదవండి: బాధ్యత కలిగిన పౌరులను చూశా! -
మీరు నిజమైన సూపర్ హీరో: ఆనంద్ మహీంద్రా
ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారనే విషయం మన అందరికీ తెలిసిందే. ఆలోచనాత్మక, సందేశాత్మక పోస్ట్‌లతో అభిమానులు, ఫాలోవర్లను అలరించడం ఆనంద్ మహీంద్రాకు ఇష్టం. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే వాటి మీద స్పందించడంతో పాటు అప్పుడప్పుడూ కొన్ని ఆలోచనాత్మక పోస్టులు చేస్తుంటారు. తాజాగా తన ట్విటర్ వేదికగా మరో పోస్టు చేశారు. మహీంద్రా బోలెరోను సామాజిక సేవ కోసం వినియోగిస్తున్న 'మట్కా మ్యాన్' గురుంచి ట్వీట్ చేశారు. సూపర్ హీరో ఈ ట్వీట్లో "మార్వెల్ కంటే శక్తివంతమైన సూపర్ హీరో మట్కామన్. అతను ఇంగ్లాండ్‌లో ఒక వ్యవస్థాపకుడు & క్యాన్సర్ విజేత, అతను పేదలకు సేవ చేయడానికి భారతదేశానికి తిరిగి వచ్చాడు. మీ సామాజిక సేవ కోసం బొలెరోను వినియోగించుకున్నందుకు ధన్యవాదాలు సర్"అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. అలగ్ నటరాజన్(మట్కా మ్యాన్) దక్షిణ ఢిల్లీలో ఉన్న మట్టి కుండలను (మట్కాస్) నింపడానికి మహీంద్రా బొలెరోను ఉపయోగించారు. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అతన్ని మొత్తం మార్వెల్ సూపర్ హీరోలతో పోల్చాడు.(చదవండి: ఎలక్ట్రిక్ మార్కెట్లోకి హోండా మోటార్స్!) A Superhero that’s more powerful than the entire Marvel stable. MatkaMan. Apparently he was an entrepreneur in England & a cancer conqueror who returned to India to quietly serve the poor. Thank you Sir, for honouring the Bolero by making it a part of your noble work. 🙏🏽 pic.twitter.com/jXVKo048by — anand mahindra (@anandmahindra) October 24, 2021 దక్షిణ ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో మట్కాస్ నింపడానికి ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకు ఈ హీరో మేల్కొంటాడు. 72 ఏళ్ల నటరాజన్ ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి నిర్విరామంగా పని చేస్తున్నారు. ఇతను కేవలం పెద ప్రజలకు తాగునీటిని అందించడం కాకుండా నిర్మాణ కార్మికుల కోసం పోషకాహార సలాడ్ తయారు చేసి పంపిణీ చేస్తారు.అలాగే దారిలో సెక్యూరిటీ గార్డులు, డ్రైవర్లకు ఆహారాన్ని అందిస్తారు. ఈ సలాడ్‌లో 20 రకాల ఆహార పదార్థాలు ఉంటాయి. -
ప్రకాశం: బొలేరో నుంచి జారిపడి నలుగురు మృతి
ప్రకాశం: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలేరో వాహనం నుంచి జారిపడి నలుగురు మృతి చెందారు. కొనకలమిట్ల మండలం గార్లదిన్నె వద్ద బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెదదోర్నల నుంచి పొదిలి మండలం, అక్క చెరువుకు పెళ్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బొలేరో వాహనంలో 12 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. బొలెరో గూడ్స్ వాహనం వెనుక డోర్ ఊడిపోవడంతో రోడ్ మీద పడి నలుగురు మృతి చెందారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చదవండి: రక్షా బంధన్ రోజునే అక్కాతమ్ముడి మృతి.. -
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుత్తి సమీపంలోని జాతీయ రహదారిపై లారీ-బొలెరో ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మృతులను గుల్ బర్గాకు చెందిన లాయక్ అలీ, అష్రఫ్ అలీ.. కర్నూలు జిల్లాకు చెందిన కాశీం మహమ్మద్‌లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని బొలేరో వాహనం లో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు. -
సరికొత్తగా మహీంద్రా బొలెరో...ధర ఎంతంటే..
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మహీంద్రా కొత్త లుక్‌తో మహీంద్రా బొలెరో నియోను మార్కెట్లోకి లాంఛ్ చేసింది. బొలెరో నియో సబ్‌కంపాక్ట్ ఎస్యూవీ మోడల్ మహీంద్రా టీయూవీ 300ను పోలి ఉంది. ఈ కారు ఎన్4, ఎన్8, ఎన్10, ఎన్10(ఓ) నాలుగు రకాల వేరియంట్లలో లభించనుంది. బొలెరో నియో ఎక్స్‌షోరూమ్ ధర రూ. 8.48 లక్షల నుంచి ప్రారంభంకానుంది. సరికొత్త బొలెరో నియో రివైజ్డ్ డీఆర్ఎల్ హెడ్‌ల్యాంప్స్, కొత్త ఫ్రంట్ బంపర్, న్యూ ఫాగ్ ల్యాంప్స్‌తో రానుంది. కారు ఇంటీరియల్స్ విషయానికి వస్తే..టీయూవీ 300ను పోలీ ఉంటుంది. 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇనోఫో సిస్టమ్ విత్ బ్లూటూత్‌ను అమర్చారు. స్టీరియో మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్, బ్లూ సెన్స్యాప్తో బొలెరో నియో రానుంది. బొలెరో నియో ఇంజన్ విషయానికి వస్తే..1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో, గరిష్టంగా 100పీఎస్ పవర్, 260ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను అందిస్తోంది. టీయూవీ 300తో పోలిస్తే 20ఎన్ఎమ్ టార్క్‌ను తక్కువగా ఉత్పత్తి చేస్తోంది. బొలెరో నియో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు. బొలెరో నియో బ్లాక్, మెజెస్టిక్ సిల్వర్, హైవే రెడ్, పెర్ల్ వైట్, డైమండ్ వైట్, రాకీ బీజ్ ఆరు రకాల కలర్ వేరియంట్లతో రానుంది. -
పాపం.. 3 ఏళ్ల బాలుడు ఆడుకుంటున్నాడు.. అంతలోనే..
సాక్షి, రాయచూరు(కర్ణాటక): బొలెరో ఢీకొని మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన శనివారం తాలూకాలోని లింగన ఖాన్ దొడ్డిలో చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ ఇంటి వద్ద సిద్దార్థ(3)అనే చిన్నారి ఆడుకుంటుండగా అదే సమయంలో ఒక బొలెరో వాహనం రివర్స్ చేసుకునే క్రమంలో టైర్లు బాలుడిపైకి ఎక్కాయి. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆడుకుంటున్న పిల్లవాడు అంతలోనే విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ ఉడాయించాడు. ఇడపనూరు ఎస్ఐ కరెమ్మ ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: Viral: బిడ్డ చదువుకు తండ్రి గొడుగు -
సదాశివపేట పోలీసుల ఓవరాక్షన్
-
సంగారెడ్డి: బొలెరో డ్రైవర్‌పై.. పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో బొలెరో వాహన డ్రైవర్‌పై అమానుషంగా ప్రవర్తించారు పోలీసులు. బూటు కాలితో తంతు.. లాఠీలతో చితకబాదారు. లబోదిబోమని మొత్తుకుంటున్నా వినకుండా ఇష్టం ఉన్నట్లు కొట్టారు. ఇంతకు ఆ డ్రైవర్ చేసిన పాపం ఏంటో తెలుసా.. పోలీసులు వాహనం ఆపమనగానే ఆపకుండా.. కాస్తా ముందుకు వెళ్ళి ఆపడం. దానికే రెచ్చిపోయిన సదాశివపేట పోలీసులు ఆ అమాయకునిపై తమ ప్రతాపం చూపారు. ఆ వివరాలు.. సదాశివపేటకు చెందిన వాజిద్ బొలేరో వాహనం నడుపుతుంటాడు. సింగూరుకు కిరాయికి వెళ్తుండగా అయ్యప్ప స్వామి గుడి వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రధాన రహదారిపై సడెన్‌గా పోలీసులు రావడంతో వాహనాన్ని కాస్తా దూరంగా తీసుకెళ్లి ఆపాడు వాజిద్. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కానిస్టేబుల్ అతని చేతిలో ఉన్న లాఠీతో చితకబాదాడు. అక్కడితో ఆగకుండా బూటు కాలితో తంతూ.. బండ బూతులు తిట్టాడు. పోలీసుల దాడిలో వాజిద్‌కి గాయాలయ్యాయి. ఓవైపు రాష్ట్రంలో ప్రైండ్లీ పోలీస్ అని పోలీసు ఉన్నతాధికారులు చెబుతుంటే... కింది స్థాయిలో అమలు కాకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: ‘డీజిల్‌కి డబ్బులివ్వు.. బిడ్డను వెతుకుతాం’ -
మృతదేహాన్ని తీసుకెళ్తూ చావు ఒడిలోకి
సాక్షి, బేస్తవారిపేట: చనిపోయిన వ్యక్తిని బొలెరో వాహనంలో తరలిస్తున్న సమయంలో లారీని ఢీకొనడంతో మరో ఇద్దరు మృతిచెందిన సంఘటన బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం సమీపంలో ఒంగోలు–నంద్యాల హైవేరోడ్డుపై శనివారం తెల్లవారుజామున జరిగింది. కొమరోలు మండలం బుంగాయపల్లెకు చెందిన తురక వెంకట సుబ్బయ్య(73) అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్త్రెవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మృతదేహాన్ని తీసుకుని కుటుంబ సభ్యులు, బంధువులు పది మంది బొలెరో వాహనంలో బయలుదేరారు. మోక్షగుండం వద్దకు వచ్చే సమయానికి ముందున్న లారీ టైరు పంక్చర్ కావడంతో ఒక్కసారిగా వేగం తగ్గించి రోడ్డు మార్జిన్లోకి తీస్తున్న సమయంలో వెనుక వైపున బొలెరో ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలుకాగా, మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. కూతురు, అల్లుడు దుర్మరణం.. హైదరాబాద్‌లో మృతిచెందిన వెంకట సుబ్బయ్య మొదటి కుమార్తె గంప సుబ్బలక్ష్మమ్మ(50), చిన్న కుమార్తె రమణమ్మ భర్త ఓరుసు దాసరయ్య(55) లు ఈ దుర్ఘటనలో మృత్యు ఒడిలోకి చేరారు. మృతదేహంతో వెళ్తున్న వాహనం ముందు భాగంలో డ్రైవర్ పక్కన కూర్చొని ఉన్న గిద్దలూరు మండలం బయనపల్లికి చెందిన దాసరయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ గుండెపోటుతో వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మమ్మ మృతి చెందింది. సుబ్బయ్య దగ్గరి బంధువులు హైదరాబాద్‌లో ఏడేళ్లుగా కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అతడు మరణించడంతో పది మంది మృతదేహాన్ని తీసుకుని వాహనంలో బయలుదేరారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన తురక ఉష, లక్ష్మీప్రియల పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. తురక పూజ, రమణమ్మ, దంప రమణమ్మలు గిద్దలూరు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. (చదవండి: అయిదో ఫ్లోర్ నుంచి పడి బాలుడు మృతి) మూడు కుటుంబాల్లో విషాదం.. రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తండ్రి మరణంతో విషాదంలో ఉన్న కుమార్తెల కుటుంబాల్లోనూ పెను విషాదాన్ని మిగిల్చింది. పెద్ద కుమార్తె మరణం, చిన్న కుమార్తె భర్త మరణం, మనవరాళ్లకు తీవ్ర గాయాలతో పరిస్థితి విషమంగా మారడంతో బంధువులు, కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. గిద్దలూరు సీఐ యు సుధాకరరావు, బేస్తవారిపేట ఎస్సై బాలకృష్ణలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఇంతకంటే దారుణమైన ప్రమాదం ఉండదు.. కానీ!
ముంబై: అదృష్టం అంటే అతడిదే అని చెప్పుకోవాలి. రోడ్డు పక్కన దర్జాగా తన ద్విచక్ర వాహనంపై కూర్చున్న ఓ వ్యక్తికి భయంకరమైన అనుభవం ఎదురైంది. అదుపు తప్పిన జేసీబీ అతడి మీదకు మృత్యువు రూపంలో దూసుకువచ్చింది. ఆ సమయంలో అతడికి ఏం చేయాలో తోచక షాక్‌లో ఉండిపోయాడు. ఇక అతడు ఆ జేసీబీకి బలవ్వాల్సిందే అని అనుకుంటున్న సమయంలో క్షణంలో అద్భుతం జరిగింది. ఎవరూ ఊహించని రీతిలో క్షణాల్లో మరో వాహనం.. జేసీబీకి అడ్డుగా వచ్చి అతడికి ప్రాణం పోసింది. ఒళ్లు గగుర్పోడిచే ఈ దృశ్యం మహరాష్ట్రలో సోమవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో మోటర్ సైకిల్‌పై ఓ వ్యక్తి రోడ్డు పక్కన కూర్చోని ఉన్నాడు. అదుపుతప్పిన జేసీబీ అతి వేగంతో అతడి మీదకు వస్తోంది. అదే సమయంలో మహీంద్రా బొలెరో రోడ్డుపై అటుగా వెళుతూ జీసీబీని ఢీకొట్టింది. దీంతో క్షణాల్లో ద్విచక్ర వాహనదారుడు ఈ పెను ప్రమాదం నుంచి తప్పించుకోవడమే కాదు చిన్న గాయం కాకుండా బయటపడ్డాడు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లకు ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినంత పనైంది. అతడు, ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో బ్రతుకు జీవుడా అంటూ మళ్లీ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఈ వ్యక్తితో సహా బొలెరో డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. బొలెరో కారు ముందు భాగం ధ్వంసమైంది. (చదవండి: సింహాల కొట్లాట చూశారా?) #NDTVBeeps | A biker narrowly avoided being crushed between a JCB and SUV as they collided. His incredible escape was caught on CCTV pic.twitter.com/3527JNRPn8 — NDTV (@ndtv) July 27, 2020 ఈ ఘటనపై నెటిజన్లు మాత్రమే గాక ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహింద్రా సైతం స్పందించారు. ‘‘బోలేరో ప్రాణం పోసుకున్నట్లు కనిపిస్తోంది ఎందుకంటే మోటరు సైకిల్ వ్యక్తి ప్రాణాన్ని కాపాడటమే దాని ఏకైక లక్ష్యం’’ అంటూ మహీంద్రా ట్వీట్ చేశారు. ‘‘ఇంతకంటే దారుణమైన కారు ప్రమాదం మరొకటి ఉండదేమో. కానీ ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు, బొలెరో డ్రెవరు అదృష్టవంతులు. వారిని మహింద్ర బొలెరోనే కాపాడింది. దానికి ధన్యవాదాలు’’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.