boxoffice
-
మట్కా,కంగువా ఫస్ట్ డే కలెక్షన్స్.. వరుణ్ కెరీర్లోనే భారీ డిజాస్టర్
టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ జయాపజయాలతో సంబంధం లేకుండా కథ నచ్చితే ఓకే చెప్పేస్తాడు. భారీ అంచనాలతో ఆయన నటించిన 'మట్కా' చిత్రం నవంబర్ 14న విడుదలైంది. అయితే, ఈ సినిమా మొదటి ఆటతోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది. వరుణ్ కెరియర్లోనే అత్యంత తక్కువ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా 'మట్కా' రికార్డ్ క్రియేట్ చేసింది.'పలాస' సినిమాతో మెప్పించిన కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సుమారు రూ. 40 కోట్లతో ఈ మూవీని నిర్మించారు. 'మట్కా' టీజర్, ట్రైలర్‌తో ఆకట్టుకునేలా ఉండటం, వరుణ్ భిన్నమైన గెటప్పుల్లో కనిపించడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల దృష్టి పడింది. అయితే, కథలో కొత్తదనం లేకపోవడంతో పాటు ఆసక్తిరేకెత్తించే సీన్స్ పెద్దగా సినిమాలో కనిపించలేదు. దీంతో 'మట్కా' మొదటిరోజు కేవలం రూ. 70 లక్షలు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమాతో నిర్మాతలకు భారీ నష్టాలు తప్పవని తెలుస్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే కనీసం రూ. 2 కోట్లు అయినా రావడం కష్టమని చెప్పవచ్చు.కంగువా కలెక్షన్స్సూర్య, దిశా పటానీ జోడీగా నటించిన చిత్రం 'కంగవ'. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సత్తా చాటింది. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించింది. దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ మూవీ నవంబర్ 14న విడుదలైంది. అయితే, కంగువా మొదటిరోజు రూ. 58.62 కోట్లు రాబట్టినట్లు అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమా కోసం రూ.350 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది. ఇదే నిజమైతే కంగువా నిర్మాతలకు కూడా భారీగా నష్టాలు తప్పవని చెప్పవచ్చు. -
'అమరన్' కలెక్షన్స్.. శివ కార్తికేయన్ కెరీర్లో అరుదైన రికార్డ్
శివ కార్తికేయన్ హీరోగా నటించిన చిత్రం 'అమరన్'. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. శివ కార్తికేయన్ కెరిర్లో ఒక మైల్స్టోన్ లాంటి సినిమాగా అమరన్ నిలిచిపోనుంది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్గా నటించారు. కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించిన ఈ సినిమా దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 31న తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి రిలీజ్ చేశారు.వీర సైనికుడు ముకుంద్ వరదరాజన్ ఇతివృత్తంతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. మొదటిరోజే రూ. 35 కోట్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, మూడురోజులకు ప్రపంచవ్యాప్తంగా అమరన్ కలెక్షన్స్ రూ. 100 కోట్ల గ్రాస్‌కు చేరింది. కేవలం తమిళనాడులోనే రూ. 50 కోట్ల మార్క్‌ను చేరుకుంది. రిలీజైన మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్లో చేరిన అమరన్.. శివ కార్తికేయన్ కెరీర్లో ఇదే ఫాస్టెస్ట్ గ్రాసర్‌గా రికార్డ్ కెక్కింది. ఆయన నటించిన గత సినిమాలు రూ. 100 కోట్ల మార్క్‌ను అందుకునేందుకు డాక్టర్ (25 రోజులు), డాన్ (12రోజులు) పట్టింది. అయితే, ఈ సినిమా రూ. 200 కోట్ల క్లబ్లో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయిన ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.అమరన్ చిత్రాన్ని ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో పాటు రజనీకాంత్ కూడా చూశారు. సినిమా బాగుందంటూ వారు ప్రశంసించారు. ఈ సినిమాను నిర్మించిన కమల్ హాసన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. తమిళనాడులోని బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మేజర్ 'ముకుంద్ వరద రాజన్' జీవిత కథతో ఈ సినిమాను రూపొందించారు. 2014లో జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాటం చేస్తూ ఆయన అసువులు బాసిన వీరుడిగా నిలిచారు. ఆయన పాత్రలో శివ కార్తికేయన్ నటించగా, భార్య ఇందు రెబెకా జాన్ వర్ఘీస్ పాత్రలో సాయి పల్లవి మెప్పించారు. -
రూ.500 కోట్ల క్లబ్లో చిన్న సినిమా.. ఏకంగా ఆ జాబితాలో టాప్!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ నటించిన హారర్-కామెడీ చిత్రం స్త్రీ-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు సృష్టించిన ఈ చిత్రం తాజాగా అరుదైన క్లబ్లో చేరింది. ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం 22 రోజుల్లోనే రూ.502.9 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. షారూఖ్ ఖాన్ జవాన్ తర్వాత అత్యంత వేగంగా రూ.500 కోట్ల క్లబ్లో చేరిన చిత్రంగా నిలిచింది. త్వరలోనే గదర్-2 ఆల్ టైమ్ వసూళ్లను దాటేయనుంది. బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ నటించిన గదర్-2 బాక్సాఫీస్ వద్ద రూ. 525 కోట్లు నికర వసూళ్లు సాధించింది.అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన 'స్త్రీ 2 మొదటి రోజు నుంచే రికార్డ్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ రావడంతో దేశవ్యాప్తంగా ఈ ఏడాది రూ. 500 కోట్ల నికర వసూళ్లను సాధించిన తొలి బాలీవుడ్ సినిమాగా ఘనత సాధించింది. అయితే ఈ నెలలో బాలీవుడ్లో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశముంది. దేశవ్యాప్తంగా హిందీలో ఈ మూవీ కంటే ముందు జవాన్(రూ. 640 కోట్లు), పఠాన్(రూ.543 కోట్లు), యానిమల్(రూ.553 కోట్లు), గదర్-2 (రూ. 525 కోట్లు) ముందున్నాయి. -
తగ్గేదేలే.. దంగల్, అవతార్-2ను వెనక్కినెట్టిన స్త్రీ-2!
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలైన 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.560 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ దెబ్బతో బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమా రికార్డులను బద్దలు కొట్టింది. దేశవ్యాప్తంగా రూ.474 గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. రూ.402 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది.అమర్ కౌశిక్ దర్శకత్వంలో హారర్ కామెడీగా వచ్చిన స్త్రీ-2 రెండో వారాంతంలో అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఇండియావ్యాప్తంగా 'ఎవెంజర్స్: ఎండ్‌గేమ్' (రూ. 373.05 కోట్లు), 'జైలర్' (రూ. 348.55 కోట్లు), 'సంజు' (రూ. 342.57 కోట్లు), 'దంగల్' (రూ. 387.38 కోట్లు), 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' (రూ. 391.4 కోట్లు) చిత్రాలను అధిగమించింది.ఇదే జోరు కొనసాగితే త్వరలోనే సలార్ పార్ట్-1(రూ. 406.45 కోట్లు), 'బాహుబలి: ది బిగినింగ్' (రూ. 421 కోట్లు), '2.0' (రూ. 407.05 కోట్లు) వసూళ్లను దాటేయనుంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 'గదర్ 2' (రూ. 525.7 కోట్లు), 'పఠాన్' (రూ. 543.09 కోట్లు), 'యానిమల్' (రూ. 553.87 కోట్లు) చిత్రాల నెట్ కలెక్షన్స్‌ను అధిగమించే అవకాశముంది. కాగా.. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అపరశక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ, వరుణ్ ధావన్ కీలక పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) -
తగ్గేదేలే అంటోన్న విశ్వక్ సేన్.. రెండు రోజుల్లోనే క్రేజీ రికార్డ్!
విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'గామి'. ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న ఈ చిత్రం విడుదల అయింది. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చూసిన ప్రేక్షకులు గామి టీమ్‌ను మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఇందులో హీరోగా నటించిన విశ్వక్ సేన్‌కు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. విశ్వక్ సేన్ కెరీర్లో మొదటి రోజు అత్యధిక వసూళ్ల సాధించిన చిత్రంగా నిలిచింది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.9.07 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక రెండో వీకెండ్ కావడంతో వసూళ్ల పర్వం ఏమాత్రం తగ్గలేదు. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.15.1 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా రెండో రోజు 6.03 కోట్లు వసూళ్లతో రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంది. ఓవర్సీస్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాల్లో ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ఈవెన్కు చేరుకోగా.. మూడో రోజు మిగిలిన ఏరియాల్లోను రీచ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్‌గా థియేటర్లలో 52 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదు చేసినట్లు తెలుస్తోంది. గామి ప్రత్యేకతలు.. ఇక గామి సినిమా కోసం చిత్రయూనిట్ ఎన్నో కష్టాలు పడింది. మైనస్ 25 డిగ్రీల చలిలో షూట్ చేశారు. వారి ప్రాణలు పణంగా పెట్టి సినిమా తీశారు. సినిమా మొత్తంలో విశ్వక్‌కు రెండు పేజీల డైలాగ్స్ మాత్రమే ఉన్నాయి. విశ్వక్‌కు అఘోరాగా మేకప్ వేయడానికే రెండు గంటలకు పైగా సమయం పట్టేది. ఈ సినిమాకు విశ్వక్ ఇంతవరకు పారితోషికం తీసుకోనేలేదు. సినిమా ఆరేళ్ల క్రితమే మొదలైంది. కానీ డైరెక్టర్ ఈ సినిమాపై తొమ్మిదేళ్లుగా వర్క్ చేయడం విశేషం. #Gaami is going super strong all over 💥 Collects 15.1CRORE+ gross worldwide in 2 days with super positive WOM & remains #1 choice of moviegoers this week 💥💥 Book your tickets now for the 𝗧𝗛𝗘 𝗕𝗥𝗘𝗔𝗧𝗛𝗧𝗔𝗞𝗜𝗡𝗚 𝗘𝗣𝗜𝗖 𝗙𝗥𝗢𝗠 𝗧𝗘𝗟𝗨𝗚𝗨 𝗖𝗜𝗡𝗘𝗠𝗔 🤩 🎟️… pic.twitter.com/l13z6Wik1b — UV Creations (@UV_Creations) March 10, 2024 -
స్టార్ హీరో లేటేస్ట్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద బిగ్ షాక్!
మలయాళ స్టార్ మోహన్‌లాల్ తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు. ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాల్లో కనిపించారు. అయితే ఇటీవల ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మలైకొట్టై వాలిబన్. ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ ఊహించని షాకిచ్చింది. ఈ పాన్ ఇండియా చిత్రానికి లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వం వహించగా.. మోహన్ లాల్ రాజస్థాన్‌కు చెందిన రెజ్లర్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ సోనాలి కులకర్ణి హీరోయిన్గా నటించింది. దాదాపు రూ.65 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద ఝలక్ ఇచ్చింది. కేవలం రూ.25 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు మాత్రమే రాబట్టింది. దీంతో మలయాళంలో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది మలైకోట్టై వాలిబన్. కాగా.. గతేడాది జైలర్, నేరు సినిమాలతో అలరించిన మోహన్ లాల్.. ప్రస్తుతం బరోజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. -
బాక్సాఫీస్ వద్ద ఈగల్ దూకుడు.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం 'ఈగల్'. ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్,కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అభిమానుల భారీ అంచనాల మధ్య ఈనెల 9న థియేటర్లలోకి వచ్చింది. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు తర్వాత నటించిన సినిమా కావడంతో ఫ్యాన్స్‌లోనూ ఆసక్తి నెలకొంది. మూవీ రిలీజైన మొదటి రోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.11.90 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అయితే రెండో రోజు సైతం బాక్సాఫీస్ వద్ద ఈగల్ అదే జోరు కొనసాగించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.9 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దీంతో రెండు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ.20.90 గ్రాస్ వసూళ్లు రాబట్టింది. అయితే మొదటి రోజు ఇండియా వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ.6.2 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ఈగల్.. రెండో రోజు అదే జోరులో రూ. 5 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో రెండు రోజుల్లోనే రూ.11.2 కోట్లు వచ్చాయి. ఇక మూడో రోజు ఆదివారం కావడంతో ఈగల్ బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో 32.84 శాతం ఆక్యుపెన్సీతో నడిచాయి. కాగా.. ఈగల్ చిత్రానికి దేవ్ జాంద్ సంగీతమందించారు. ఈ మూవీలో అక్రమ ఆయుధాల వ్యాపారాన్ని అడ్డుకునే పాత్రలో మాస్ మహారాజా నటించారు. కాగా.. ఈ చిత్రాన్ని హిందీలో సహదేవ్ పేరుతో విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
Prabhas Salaar: బాక్సాఫీస్ వద్ద సలార్ జోరు.. ఐదో రోజు ఎన్ని కోట్లంటే?
ప్రభాస్ నటించిన సలార్ ప్రభంజనం ఐదు రోజు కూడా కొనసాగింది. ఈ నెల 22న రిలీజైన ఈ చిత్రం మొదటి రోజే రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. మొదటి మూడు రోజులతో పోలిస్తే.. నాలుగు, ఐదు రోజుల్లో కాస్తా తగ్గినట్లు కనిపించినా.. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్ల మైలురాయి దిశగా దూసుకుపోతోంది. రూ.500 కోట్ల క్లబ్లో చేరితే.. బాహుబలి, బాహుబలి 2: ది కన్‌క్లూజన్ తర్వాత ప్రభాస్ మూడో చిత్రంగా సలార్ నిలవనుంది. తొలిరోజు రూ.178.7 కోట్లు రాగా.. రెండో రోజుకే రూ.295.7 కోట్లకు చేరుకున్న వసూళ్లు.. మూడో రోజే నాలుగు వందల మార్క్‌ను దాటేశాయి. నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకు చేరుకున్న సలార్.. ఐదో రోజు అదే ఊపులో దూసుకెళ్లింది. సలార్ ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.రూ.490.23 కోట్లు కొల్లగొట్టిందని సినీ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద గ్రాస్ కలెక్షన్స్ పరంగా సలార్ భారీ వసూళ్లను సాధించింది. దేశవ్యాప్తంగా చూస్తే బాక్సాఫీస్ వద్ద 5 రోజుల్లోనే 300 కోట్ల రూపాయల మార్కుకు చేరువలో ఉంది. ఇండియా బాక్సాఫీస్ కలెక్షన్ ఐదు రోజుల్లో రూ.280.30 కోట్లకు చేరుకుంది. ఈ చిత్రాన్ని కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు, టిన్ను ఆనంద్, శ్రీయా రెడ్డి, ఈశ్వరీ రావు ముఖ్య పాత్రలు పోషించారు. #Salaar WW Box Office #Prabhas is racing towards his 3rd ₹500 cr club film after #Baahubali and #Baahubali2. Day 1 - ₹ 176.52 cr Day 2 - ₹ 101.39 cr Day 3 - ₹ 95.24 cr… pic.twitter.com/0maGBGaqY8 — Manobala Vijayabalan (@ManobalaV) December 27, 2023 -
రిలీజ్‌కు ముందే సలార్ రికార్డ్.. అట్లుంటది మనతోని..!
ఈ వారంలో రిలీజవుతున్న ప్రభాస్ సలార్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్స్ ప్రారంభం హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఎంతోమంది అభిమానులు టికెట్స్ దొరకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే సలార్ బుకింగ్స్ రూ.18 కోట్లకు పైగా జరిగినట్లు తెలుస్తోంది. అయితే సలార్‌కు ఒక రోజు ముందే బాలీవుడ్ బాద్షా నటించిన డంకీ చిత్రం కూడా బాక్సాఫీస్ బరిలో నిలిచింది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 21న రిలీజ్ కానుంది. ఈ మూవీ టికెట్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. ఇప్పటివరకు రూ.12 కోట్ల వరకు బుకింగ్స్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్క రోజు వ్యవధిలో బాక్సాఫీస్ బరిలో ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడనుండండతో కలెక్షన్స్ పైనే అందరి దృష్టి పడింది. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే ఓ రేంజ్లో దూసుకెళ్తోన్న సలార్ ముందు.. షారుక్ ఖాన్ డంకీ పోటీలో నిలుస్తుందా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే. కాగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, టిను ఆనంద్, జగపతి బాబు కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం కోసం తెలుగు రాష్ట్రాల్లో యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు షారుక్ ఖాన్ డంకీ చిత్రంలో తాప్సీ పన్ను, బోమన్ ఇరానీ, విక్కీ కౌశల్ కూడా కీలక పాత్రల్లో నటించారు. -
బాక్సాఫీస్ వద్ద లియో జోరు.. నెగెటివ్ టాక్ వచ్చినా తగ్గేదేలే!
తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం లియో. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈనెల 19 ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటిరోజే రూ. 64 కోట్ల వసూళ్లు రాబట్టిన లియో.. దాదాపు మూడో రోజు అదే జోరును కొనసాగించింది. శనివారం దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ.40 కోట్లు వసూలు రాబట్టింది. దీంతో మూడు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరింది. సినిమా రిలీజ్ రోజు నెగెటివ్ టాక్ వచ్చినా వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. రెండో రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన లియో.. మూడో రోజే రెండొందల కోట్ల మార్కును దాటేసింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే తమిళ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను ఆదరించలేదు. మొత్తంగా తమిళనాడులో మూడు రోజుల్లో కలిపి రూ.56.9 కోట్లు రాబట్టింది. తొలి రోజు రూ.27.63 కోట్లు, రెండో రోజు రూ.15.95 కోట్లు, మూడో రోజు రూ.13.32 కోట్లు వసూలు మాత్రమే రాబట్టింది. అయితే విడుదలకు ముందే ఈ చిత్రం రిలీజ్‌పై వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవడం.. తెలుగులోనూ రిలీజ్‌పై స్టేలు ఇవ్వడం కలెక్షన్లపై కాస్తా ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. -
రన్ టైమ్ తగ్గించినా కలిసిరాలేదు.. టైగర్ నాగేశ్వరరావు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ చిత్రంలో కృతి సనన్ సోదరి నూపూర్ సనన్ హీరోయిన్గా నటించింది. విజయదశమి సందర్భంగా ఈనెల 20న థియేటర్లలో రిలీజైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడంతో టైగర్ నాగేశ్వరరావు విఫలమైంది. (ఇది చదవండి: 20 ఏళ్లుగా అంటున్న మాట నిజమైంది: బన్నీ ఆసక్తికర కామెంట్స్) ఈ మూవీ రన్‌టైమ్ తగ్గించినప్పటికీ ప్రేక్షకుల నుంచి ఆదరణ పెద్దగా కనిపించలేదు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 5.50 కోట్ల షేర్.. దేశవ్యాప్తంగా అన్నీ భాషల్లో కలిపి రూ.8 కోట్ల నెట్ వసూలు చేసింది. రెండో రోజు రెండు రాష్ట్రాల్లో రూ. 3.20 కోట్లు వరకు షేర్‌ను వసూలు చేయగా... రెండో రోజు రూ.4.75 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. రెండు రోజుల్లో మొత్తంగా ఈ చిత్రం రూ.9 కోట్లకు పైగా షేర్‌ను అందుకుని పది కోట్ల మార్క్‌ను చేరుకునేందుకు దగ్గరలో ఉంది. ఓవరాల్‌గా చూస్తే రెండురోజుల్లో రూ.12.75 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. కాగా.. టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని 1970 కాలంలోని స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ చిత్రాన్ని నిర్మించారు. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలుగా నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించారు. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: 'టైగర్ నాగేశ్వరరావు'.. ఇప్పుడు జాగ్రత్త పడి ఏం లాభం?) -
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న విజయ్ ఆంటోనీ క్రైమ్ థ్రిల్లర్..!
విజయ్ ఆంటోని, నందితాశ్వేతా, రమ్యానంభీశన్, మహిమా నంబియార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం రత్తం. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి సీఎస్ అముదమ్ దర్శకత్వం వహించారు. ఈయన ఇంతకుముందు తమిళ్ పడం, తమిళ్‌పడమ్–2 వంటి వినోదభరిత కథాచిత్రాలను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని పూర్తి భిన్నంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇతివృత్తంతో రూపొందించారు. ఇటీవలే బిచ్చగాడు-2 సినిమాతో హిట్ అందుకున్నారు విజయ్ ఆంటోని. క్రైమ్ థ్రిల్లర్ కావడంతో ఈ మూవీపై అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. కథేంటంటే.. ముఖ్యంగా మీడియా నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం రత్తం. చిత్ర ప్రారంభంలోనే ఒక పత్రిక సహాయ సంపాదకుడిని ఆయన కార్యాలయంలోనే ఒక వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేస్తాడు. చనిపోయిన వ్యక్తి విజయ్ ఆంటోనికి మిత్రుడు. కాగా ఇంతకుముందు పత్రికలో పనిచేసిన విజయ్‌ఆంటోని ఈ తరువాత జర్నలిజానికి దూరంగా వేరే ప్రపంచంలో జీవిస్తుంటారు. అలాంటిది ఆయన మళ్లీ మీడియా ప్రపంచంలోకి రావలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు కారణం ఏమిటి? జరుగుతున్న హత్యలకు కారణం ఎవరూ? వంటి అంశాలపై ఆయన ఇన్వెస్టిగేషన్ మొదలెడతారు. అయితే ఆ మిస్టరీని ఆయన ఛేదిస్తారా? అందుకు ఎలాంటి సాహసానికి పూనుకుంటారు? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిన చిత్రం రత్తం. ఇటీవలే విడుదలైన ఈ చిత్రాని ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. విషాదం కాగా.. ఇటీవలే విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన పెద్ద కుమార్తె మానసిక ఒత్తిడితో బలవన్మరణానికి పాల్పడింది. -
బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న జైలర్.. రెండు రోజుల్లోనే వందకోట్ల మార్క్!
సూపర్ స్టార్ రజినీకాంత్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం.. ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన రోజే రూ.52 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రెండు రోజు సైతం అదే ఊపులో దూసుకెళ్తోంది. (ఇది చదవండి: మొన్న సెలవులు.. ఇప్పుడేమో ఏకంగా జైలర్ స్పెషల్ షోలు..!) జైలర్ రెండు రోజుల్లోనే రూ.100 కోట్లను దాటేసిందని సినీ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తలైవాకు దక్షిణాదిలో భారీగా అభిమానులు ఉన్నారు. అంతే కాకుండా రజినీకాంత్ సినిమాలకు విదేశాల్లోనూ క్రేజ్ అదేస్థాయిలో ఉంది. దీంతో ఈజీగా రూ.100 కోట్ల మార్కును అధిగమించింది జైలర్. వీకెండ్స్‌లో మరిన్ని రికార్డులు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా.. ఈ చిత్రంలో సునీల్, రమ్యకృష్ణ, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందించారు. (ఇది చదవండి: స్టార్ హీరో కుమార్తె చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు! ) -
బాక్సాఫీస్ కింగ్...దేశంలోనే ఒకే ఒక్కడు
-
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ ఏదో తెలిస్తే షాకవుతారు
ఆది నుంచీ భారతీయ చిత్ర పరిశ్రమ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోంది. అలనాటి మొఘల్-ఎ-ఆజం, షోలే నుంచి లగాన్, దిల్వాలే దుల్హనియా లేజాయింగే, పీకే , పఠాన్, బజరంగీ భాయిజాన్ లాంటి బాలీవుడ్ సినిమాలతో పాటు దేశంలో రెండవ అతిపెద్ద నిర్మాణ కేంద్రంగా ఉన్న టాలీవుడ్లో 1977లో ఎన్టీ రామారావు నటించిన అడవి రాముడు సినిమా కోటి వసూలు చేసిన తొలి చిత్రంగా నిలిచింది. 1992లో కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి మూవీ ఘరానా మొగుడు , బాక్సాఫీస్ వద్ద రూ 10 కోట్లకు పైగా వసూలు చేసిన తొలి తెలుగు చిత్రం. బాహుబలి, పుష్ప సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ లిస్ట్‌లో నిలిచాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ రూ.1258 కోట్లను రాబట్టడమే కాదు ఆస్కార్ అవార్డులను సైతం కైవసం చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే కన్నడ మూవీల జాబితాలో వసూళ్లకు సంబంధించిన టాప్ వసూళ్లతో దూసుకుపోతున్న మూవీ కేజీ ఎఫ్-2. 100కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన టాప్ వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ వసూళ్లలో కన్నడ సినీ పరిశ్రమను మరో ఎత్తుకు తీసుకెళ్లింది. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ చివరిగా విడుదలైన పఠాన్ జనవరి 25 న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పఠాన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,050.3 కోట్లు వసూలు చేసింది, 2023లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. (తనను తాను పెళ్లాడిన యువతి ఫస్ట్ యానివర్సరీ, అదిరిపోయే వీడియో వైరల్) అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ ఇండియన్ మూవీస్ దంగల్ అమీర్ ఖాన్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.2,000 కోట్లు వసూలు చేసింది. దంగల్‌లో అమీర్ ఖాన్ రెజ్లర్ మహావీర్ ఫోగట్ పాత్రను పోషించాడు. (ఒకప్పుడు రెస్టారెంట్లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో) బాహుబలి-2 ద కంక్లూజన్ రెండు భాగాలుగా టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన చిత్రం బాహుబలి. ప్రభాస్, అనుష్క శెట్టి, సత్యరాజ్, రమ్య కృష్ణన్ , సత్యరాజ్ ముఖ్య పాత్రలు పోషించిన సీక్వెల్ బాహుబలి-2 రూ.1810 కోట్ల భారీ వసూళ్లు రాబట్టింది. ఆర్ఆర్ఆర్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1,258 కోట్లు రాబట్టింది. ఈ చిత్రంలోని నాటు నాటు పాట బ్లాక్ బస్టర్ హిట్.. ఈ సినిమాలో తొలిసారి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించింది కేజీఎఫ్-2 ప్రపంచవ్యాప్తంగా సుమారుగా రూ. 1,250 కోట్లు వసూలు చేసింది. 2018 సూపర్ హిట్ అయిన కేజీఎఫ్‌కి సీక్వెల్‌గా కేజీఎఫ్2 తెరకెక్కింది.ఈ మూవీలో 2 లో యష్, సంజయ్ దత్ , రవీనా టాండన్ నటించారు.(వరుణ్ లావణ్య ఎంగేజ్మెంట్: బేబీ బంప్‌తో ఉపాసన, డ్రెస్ ఖరీదెంతో తెలుసా?) బజరంగీ భాయీజాన్ సల్మాన్ ఖాన్ నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.969 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించగా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ముఖ్యమైన పాత్రలో నటించారు. పీకే రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన పీకే ప్రపంచవ్యాప్తంగా రూ.769 కోట్లు రాబట్టింది. అమీర్ ఖాన్, అనుష్క శర్మ, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తదితరులు నటించారు. సీక్రెట్ సూపర్ స్టార్ చిన్న బడ్జెట్ చిత్రం సీక్రెట్ సూపర్ స్టార్ బాక్సాఫీస్ వద్ద రూ.966 కోట్లు వసూలు చేసింది.అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అమీర్ ఖాన్ చిన్న పాత్రలో నటించారు. ---- పోడూరి నాగ ఆంజనేయులు -
బాక్స్ ఆఫీస్ ని పీస్ పీస్ చేస్తున్నవిరూపాక్ష కలెక్షన్స్..
-
18 ఏళ్ల తర్వాత మళ్లీ రజనీకాంత్, కమల్ మధ్య బాక్సాఫీస్ వార్!
లోకనాయకుడు కమలహాసన్, సూపర్‌స్టార్ రజనీకాంత్ మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. వీరిద్దరూ తమిళ సినిమాకి రెండు ధృవాలు లాంటి వారు. తొలి దశలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ తరువాత ఎవరి ఇమేజ్ వారికి రావడంతో విడివిడిగా నటించడం మొదలెట్టారు. కాగా ఇటీవల విక్రమ్ చిత్రంతో ఫుల్‌ఫామ్‌లోకి వచ్చిన కమలహాసన్ ప్రస్తుతం ఇండియన్–2 చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీతిసింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరో పక్క నటుడు రజనీకాంత్ నెల్సన్ దర్శకత్వంలో నటిస్తున్న జైలర్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో రమ్యకృష్ణ, తమన్నా, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీష్రాప్, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ జైపూరులో జరుగుతోంది. కాగా ఈ రెండు చిత్రాలు ఒకే రోజు తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2005 ఏప్రిల్ 14న రజనీకాంత్ చంద్రముఖి, కమలహాసన్ ముంబయి ఎక్స్‌ప్రెస్ చిత్రాలు విడుదలై పోటీపడ్డాయి. అప్పట్లో చంద్రముఖి చిత్రం ఘన విజయాన్ని సాధించింది. మళ్లీ 18 ఏళ్ల తరువాత రజనీకాంత్ జైలర్ చిత్రం, కమలహాసన్ ఇండియన్–2 ఒకే రోజు విడుదల కానున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ ‘18 పేజెస్’ వారం రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్ర 18 పేజెస్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. విడుదలైన తొలి షో నుంచే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. దీంతో మొదటి రోజే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్‌తో దూసుకెళ్లింది. కేవలం మౌత్ టాక్‌తోనే ఈ చిత్రానికి రోజు రోజుకు ఆదరణ మరింత పెరుగుతోంది. ఈ సినిమా విడుదలై వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికి థియేటర్లో అదే జోరు కొనసాగుతోంది. ఆడియన్స్ మళ్లీ మళ్లీ థియేటర్‌కు వచ్చి సినిమా చూస్తుండటం విశేషం. ఫలితంగా ఈ సినిమా ఇప్పటివరకు (వారం రోజులకు) రూ. 20 కోట్ల గ్రాస్ సాధించి విజయంతంగా ముందుకు సాగుతుంది. కాగా బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాను, మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పించారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథ అంధించిన సంగతి తెలిసిందే. ఆయన శిష్యుడు ‘కుమారి 21ఎఫ్’ చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కమర్షియల్ సినిమాలు మాత్రమే కాదు ఒక ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీకి కూడా సరైన ఆదరణ లభిస్తుంది అని నిరూపించింది ఈ క్రేజి లవ్ స్టోరీ. ఈ సినిమాలో సిద్ధు, నందినిల పాత్రలను మలిచిన తీరు, పాటలు, కొన్ని అందమైన విజువల్స్, వీటన్నింటిని మించి సుకుమార్ మార్క్‌తో కూడిన క్లైమాక్స్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. చదవండి: బాలయ్య ‘అన్‌స్టాపబుల్ షో’పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు! వాల్తేరు వీరయ్య నుంచి మరో మాస్ సాంగ్, గొంతు కలిపిన చిరు, రవితేజ -
పోటీ ఇద్దరికీ రిస్క్ మాత్రం ఒక్కరికే..
-
ఈ సినిమాలకు దారుణంగా పడిపోయిన వసూళ్లు.. కారణం ఇదే
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'లాల్‌సింగ్ చద్ధా'. బెబో కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కు హిందీ రీమేక్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రానికి అద్వెత్ చందన్ దర్శకత్వం వహించారు. వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్, ట్రైలర్‌తో చిత్రంపై మంచి హైప్ ఏర్పడింది. భారీ అంచనాల మధ్య ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. అయితే 'లాల్ సింగ్ చద్ధా' విడుదలైన తొలిరోజు నుంచే నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకుంది. అనుకన్నంత స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. సినిమా రిలీజ్ రోజైన గురువారం 11. 70 కోట్లను రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు శుక్రవారం 7.26 కోట్లకు పడిపోయింది. మొత్తంగా 'లాల్ సింగ్ చద్ధా' తొలి రెండు రోజుల్లో రూ. 18.96 కోట్లను మాత్రమే రాబట్టగలిగింది. అంటే కనీసం రూ. 20 కోట్ల మార్క్‌ను కూడా చేరుకోలేకపోయింది. కాగా సినిమా ప్రమోషన్స్ ప్రారంభం నుంచే 'బాయ్‌కాట్ బాలీవుడ్'లో భాగంగా 'లాల్ సింగ్ చద్ధా'పై సోషల్ మీడియాలో నెగెటివిటీ ఎక్కువగా ప్రచారం. 'బాయ్‌కాట్ లాల్ సింగ్ చద్ధా' అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ కూడా అయింది. అమీర్ ఖాన్ సినిమా ఇలా తక్కువ వసూళ్లు సాధించడానికి ఈ ట్రెండింగే కారణంగా తెలుస్తోంది. #LaalSinghChaddha falls flat on Day 2... Drop at national chains... Mass pockets face steep fall... 2-day total is alarmingly low for an event film... Extremely crucial to score from Sat-Mon... Thu 11.70 cr, Fri 7.26 cr. Total: ₹ 18.96 cr. #India biz. Note: #HINDI version. pic.twitter.com/9hwygm6Jrm — taran adarsh (@taran_adarsh) August 13, 2022 అలాగే 'బాయ్‌కాట్ బాలీవుడ్' సెగ ప్రభావం ఈ సినిమాతో పాటు మరో స్టార్ హీరో అక్షయ్ కుమార్ చిత్రంపై కూడా పడింది. అన్నాచెళ్లెల్ల అనుబంధంగా తరకెక్కిన 'రక్షా బంధన్' చిత్రం కూడా ఆగస్టు 11నే విడుదలైంది. తొలి రోజైన గురువారం రూ. 8.20 కోట్లను సాధించిన 'రక్షా బంధన్' రెండో రోజు శుక్రవారం రూ. 6.40 కోట్లతో సరిపెట్టుకుంది. మొత్తంగా అమీర్ ఖాన్ చిత్రం కంటే తక్కువగా రూ. 14.60 కోట్ల కలెక్షన్లతో నెమ్మదిగా ముందుకుసాగుతోంది. ఈ రెండు చిత్రాల కలెక్షన్లను బట్టి చూస్తే 'బాయ్‌కాట్ బాలీవుడ్' ప్రభావం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. #RakshaBandhan declines on Day 2... National chains remain extremely low... Mass belt is driving its biz... 2-day total is underwhelming... Needs to have a miraculous turnaround from Sat-Mon... Thu 8.20 cr, Fri 6.40 cr. Total: ₹ 14.60 cr. #India biz. pic.twitter.com/WaJtvW8SJY — taran adarsh (@taran_adarsh) August 13, 2022 -
నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి సినిమా..
Kiccha Sudeep Vikrant Rona Enters Rs 100 Crore Club In 4 Days: కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన భారీ యాక్షన్ ఎమోషనల్ ఫాంటసీ అడ్వెంచర్ కథా చిత్రం 'విక్రాంత్ రోణ'. అనూప్ భండారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్గా నటించింది. ఈగ, బాహుబలి, సైరా లాంటి చిత్రాలతో సుదీప్ తెలుగు ఆడియన్స్‌కు దగ్గరవ్వడంతో టాలీవుడ్లో కూడా ‘విక్రాంత్ రోణ’పై హైప్ క్రియేట్ అయింది. అత్యంత భారీ అంచనాల మధ్య జులై 28న పాన్ ఇండియా సినిమాగా విడుదలైంది విక్రాంత్ రోణ. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండటంతో మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ మూవీ విడుదలైన నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లో చేరినట్లు సమాచారం. ఈ చిత్రం తొలి వారంలోనే వరల్డ్ వైడ్‌గా రూ. 115-120 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. అలాగే తెలుగులోని నైజాం ఏరియాలో అతి తక్కువ సమయంలో బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంది. చదవండి: నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన నైజాం ఏరియాలో తొలిరోజు నుంచే మంచి బజ్ రావడంతో వీకెండ్లో చిత్రాన్ని వీక్షించేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపారు. దీంతో 4 రోజుల్లోనే నైజాం ఏరియాలో బ్రేక్ ఈవెన్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే 'విక్రాంత్ రోణ'ను నైజాం ఏరియాలో చాలా తక్కువ రేటుకు కొనుగోలు చేశారు. కన్నడ చిత్రసీమలో 'కేజీఎఫ్ 2' సినిమా తర్వాత అంత భారీ హిట్ సాధించిన చిత్రంగా 'విక్రాంత్ రోణ' రికార్డుకెక్కింది. కాగా కన్నడ, తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రాన్ని రూ. 95 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. -
సౌత్ ఇండస్ట్రీపై హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
తన నటనతో బాలీవుడ్లో ప్రత్యేక ముద్ర వేసుకుంది రిచా చద్దా. 2017లో 'ఇన్సైడ్ ఎడ్జ్' వెబ్ సిరీస్‌తో ఓటీటీలో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే ఈ సిరీస్ మూడో సీజన్లో కూడా నటించి అలరించింది. అయితే ప్రస్తుతం సౌత్ ఇండియా, నార్త్ ఇండియా సినిమాల మధ్య కాంట్రవర్సీ నడుస్తున్న విషయం తెలిసిందే. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 వంటి సౌత్ మూవీస్ పాన్ ఇండియా రేంజ్లో విడుదలై బాలీవుడ్‌లోనూ మంచి కలెక్షన్లు రాబట్టాయి. అక్కడితో ఆగకుండా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు వెయ్యి కోట్ల క్లబ్‌లోనూ చేరాయి. ఈ క్రమంలో సౌత్ ఇండియా సినిమా కలెక్షన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రిచా చద్దా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'సౌత్ ఇండియన్ సినిమాలకు టికెట్ల రేట్లు రూ. 100 నుంచి 400 లోపు మాత్రమే ఉంటాయి. అందువల్ల ఆ మాత్రం ఖర్చు చేసేందుకు అభిమానులు వెనుకాడరు. స్టార్ హీరోలకు ఫ్యాన్ బేస్ ఎక్కువ. వారంతా ఆ ఖర్చు పెట్టి సినిమాలు చూస్తారు. అందుకే పెద్ద మొత్తంలో ఓపెనింగ్స్ వస్తాయి. ఆ సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా ఆ ధరలు అలాగే ఉంటాయి. కానీ బాలీవుడ్లో అలా కాదు. సినిమా హిట్ అయినా, కాకున్నా టికెట్ ధర రూ. 400కు పైనే ఉంటుంది. దీంతో అంత ధర పెట్టేందుకు ప్రేక్షకులు ధైర్యం చేయరు. ఆ డబ్బుతో నిత్యవసరాలు వస్తాయని సగటు మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఆలోచిస్తారు. ఇక సినిమాకు ప్లాప్ టాక్ వచ్చిందటే కలెక్షన్లు దారుణంగా ఉంటాయి. హిందీలో డిస్ట్రిబ్యూటర్ల అత్యాశ వల్ల బాలీవుడ్ సినిమా నష్టపోతోంది.' అని రిచా చద్దా పేర్కొంది. చదవండి: బాలీవుడ్‌పై మరోసారి ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
100 కోట్ల క్లబ్లో చేరిన మహిళా ప్రాధాన్యత చిత్రాలు ఇవే..
Heroine Oriented Movies That Crossed 100 Crore In Bollywood: హీరో ఒరియెంటెడ్ మూవీస్ సాధారణమే. అవి బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా హిట్ కొట్టడం పరిపాటే. కానీ మహిళా ప్రాధాన్యతతో వచ్చే సినిమాలు తక్కువే. ఒకవేళ వచ్చిన హిట్ కొట్టడం అంతా ఈజీ కాదు. పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ మాత్రం తమ అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని పొందారు. వారి చరిష్మా, నైపుణ్యం వారికి ఎంతోమంది అభిమానులను సంపాదించిపెట్టాయి. అయితే ఇటీవల 'ఆర్ఆర్ఆర్' బ్యూటీ అలియా భట్ నటించిన హీరోయిన్ ఒరియెంటెడ్ చిత్రం 'గంగుబాయి కతియావాడి'. ఈ సినిమాలో అలియా తన అందం, అభినయం, డైలాగ్‌లతో విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 25న విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ చిత్రం వరల్డ్‌వైడ్ కలెక్షన్లతో రూ. 100 కోట్ల క్లబ్లో చేరిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా విడుదలై రూ. 100 కోట్ల మార్క్ దాటిన మహిళా ప్రాధాన్యత గల పలు బాలీవుడ్ చిత్రాలేంటో చూద్దామా ! 1. గంగుబాయి కతియవాడి- వారం రోజుల్లో రూ. 100 కోట్ల కలెక్షన్లు 2. తను వెడ్స్ మను రిటర్న్స్ - రూ. 255.3 కోట్లు 3. రాజీ- రూ. 195 కోట్లు 4. నీర్జా- రూ. 131 కోట్లు 5. స్త్రీ- రూ. 130 కోట్లు -
‘అఖండ’జోరు.. సెంచరీ కొట్టిన బాలయ్య
నటసింహం నందమూరీ బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’మూవీ జోరు ఇంకా కొనసాగుతోంది. డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. రొటీన్ కథే అయినా.. బోయపాటి ఇచ్చిన మాస్ స్ట్రోక్‌కు బాలయ్య రెచ్చిపోయి నటించడం.. దానికి తమన్ మ్యూజిక్ తోడవడంతో థియేటర్స్‌లో బొమ్మ అదిరిపోయింది. బాలయ్య కెరీర్లోనే తొలిసారి 100 కోట్ల మార్క్‌ను అందుకున్నాడు. కేవలం పది రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్‌ని అందుకోవడం గమనార్హం. ఈ పది రోజుల్లో.. . నైజాంలో రూ. 16.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 12.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.10 కోట్లు, గుంటూరులో రూ. 3.96 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.39 కోట్లు, కృష్ణాలో రూ. 2.99 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.80 కోట్లు, నెల్లూరులో రూ. 2.15 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ట్రేడ్ నిపుణుల నుంచి అందిన సమాచారం మేరకు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోరూ. 49.34 కోట్లు షేర్ వచ్చింది. ఇతర రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కలిపితే మొత్తంగా రూ. 9.35 కోట్లు రాబట్టింది. వీటన్నింటిని కలుపుకుంటే రూ. 58.74 కోట్లు షేర్ రాగా…. రూ. 100 కోట్లు గ్రాస్‌ను దాటినట్లు చెబుతున్నారు. రూ.53 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్‌తో బరిలోకి దిగిన ఈ మూవీ వారం రోజుల్లోనే టార్గెట్‌ని పూర్తి చేసుకొని బ్రేక్ ఈవెన్‌లోకి దూసుకెళ్లింది. మొత్తం మీద బాక్సాఫీస్ వద్ద బాలయ్య సునామీ సృష్టించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. . ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. -
‘అనుభవవించు రాజా’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..?
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(నవంబర్ 26)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ మూవీ దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ వారం పెద్ద చిత్రాలేవి లేకపోవడం, విడుదలైన చిన్న చిత్రాల్లో ‘అనుభవించు రాజా’కే మంచి స్పందన రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే రాబట్టింది. దాదాపు 450 పైగా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తొలి రోజే రూ.70 లక్షలకు పైగా వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. వీకెండ్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. అనుభవించు రాజా చిత్రానికి రూ.3.90 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.సో బ్రేక్ ఈవెన్ కు రూ.4 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ వీకెండ్లో భారీగా వసూళ్లను రాబడితే.. బ్రేక్ ఈవెన్ ఈజీగా అవుతుందనే చెప్పాలి. పోటీగా మరే క్రేజీ మూవీ లేకపోవడం.. అనుభవించు రాజా కి ప్లస్ పాయింట్.