bumper offer
-
ఇవి నా కార్డు డీటైల్స్.. నచ్చింది కొనుక్కోండి
పక్కవాళ్ళకు ఒక్క రూపాయి ఇవ్వడానికే చాలామంది ఆలోచిస్తారు. అలాంటి ఈ రోజుల్లో బ్యాంక్ కార్డు డీటైల్స్ పెట్టి, నచ్చింది కొనుక్కోండి అంటూ ఓ వ్యక్తి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఇందులో నిజమెంత ఉంది? అనే మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.బోల్డ్ కేర్ కో-ఫౌండర్ 'రాహుల్ కృష్ణన్' సోమవారం (సెప్టెంబర్ 2)న తన బ్యాంక్ కార్డు వివరాలను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. నచ్చింది కొనుక్కోండి అంటూ.. రూ.1000 లిమిట్ పెట్టారు. ఇది చూసినవారు మొదట్లో నమ్మలేదు, కానీ రాహుల్ కృష్ణన్ ఓటీపీలను కూడా షేర్ చేశారు. ఈ విషయం తెలిసి చాలామంది ఆ కార్డు వాడటం మొదలు పెట్టారు. లెక్కకు మించిన జనం ఆ కార్డును వాడటం వల్ల బ్యాంక్ దానిని బ్లాక్ చేసినట్లు సమాచారం.రాహుల్ కృష్ణన్ మరో ట్వీట్ చేస్తూ.. నా నెంబర్ బ్లాక్ చేశారు అని వెల్లడించారు. అయితే ఐదు గంటల్లో సుమారు 200 మంది ఈ కార్డును ఉపయోగించుకున్నట్లు సమాచారం. ఇందులో ఎక్కువమంది స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, అమెజాన్ వంటి వాటిలో కొనుగోళ్లు చేసినట్లు తెలుస్తోంది.I think my number is blocked so no more otps unfortunately :(( https://t.co/qR2LeGdWom— Rahul Krishnan (@oneandonlyrk) September 2, 2024 -
వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు బంపరాఫర్.. ఐడియా వర్కవుట్!
Tulsa Remote program: వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు అమెరికాలోని ఓ నగరం కొన్నాళ్ల క్రితం బంపరాఫర్ ప్రకటించింది. యూఎస్‌లోని ఎక్కడ వర్క్ ఫ్రమ్ చేస్తున్న ఉద్యోగులైనా తమ నగరానికి వచ్చి నివాసం ఉంటే 10,000 డాలర్లు (సుమారు రూ.8 లక్షలు) డబ్బులిస్తామని వెల్లడించింది. ఇప్పుడా ఐడియా వర్కవుట్ అయినట్లు కనిస్తోంది. అమెరికాలో ఒక్లహామా రాష్ట్రంలో ఉన్న తుల్సా (Tulsa) అనే నగరం ఈ ఆఫర్ ప్రకటించింది. ‘తుల్సా రిమోట్’ అనే ప్రోగ్రామ్ ద్వారా అందించిన ఈ ఆఫర్ యూఎస్‌లోని ఇతర ప్రాంతాల నుంచి రిమోట్‌గా పూర్తి సమయం పని చేయగల నిపుణులను తమ నగరానికి ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీని వెనుక ఆలోచన ఏమిటంటే ఉద్యోగులు ఇక్కడికి స్థిరపడతారు. ఇక్కడే ఖర్చు చేస్తారు. తుల్సా నగరం తుల్సా రిమోట్ ప్రోగ్రామ్ పని చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రోగ్రామ్ ఎకనమిక్ ఇంపాక్ట్ రిపోర్ట్ ప్రకారం.. 2022 డిసెంబర్ నాటికి తుల్సాకు 2,000 మందికి పైగా మకాం మార్చారు . 2022 చివరి నాటికి, తుల్సా రిమోట్ దాదాపు 307 మిలియన్ డాలర్ల ప్రత్యక్ష కార్మిక ఆదాయాన్ని ఆర్థిక వ్యవస్థకు తీసుకువచ్చింది. నగరానికి వచ్చిన ప్రతి ఇద్దరు తుల్సా రిమోట్ సభ్యులతోపాటు పాటు మరో ముగ్గురు వచ్చారు. 2019 నుంచి ఇప్పటి వరకు అక్కడ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న వారిలో 76 శాతం మంది ఇక్కడే స్థిరపడిపోయారు. -
బంపర్ ఆఫర్
మలయాళంలో ‘హెలెన్’ (2019), ‘కప్పెలా’ (2020) వంటి సినిమాల్లో నటించిన అన్నా బెన్ను ఓ బంపర్ ఆఫర్ వరించినట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898 ఏడీ’ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్. కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ ముఖ్య పాత్రధారులు. రాజమౌళి, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా మలయాళ బ్యూటీ అన్నా బెన్ పేరు తెరపైకి వచ్చింది. ‘కల్కి 2898 ఏడీ’ వంటి పాన్ వరల్డ్ మూవీలో చాన్స్ అంటే.. అది బంఫర్ ఆఫర్ అనొచ్చు. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న రిలీజ్ కానుంది. -
పవన్ కళ్యాణ్ కి ఇదే చివరి అవకాశం.. కేఏ పాల్ మంచి మనసు
-
పవన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కేఏ పాల్
-
చంద్రబాబుని నమ్ముకుని మీరు పిచ్చోళ్ళు అవ్వొద్దు..
-
బంపర్ ఆఫర్..నేనే పీఎం, నేనే సీఎం
-
మద్యం వ్యాపారులకు బంపర్ ఆఫర్
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌బీసీఎల్).. మద్యం వ్యాపారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా క్రెడిట్ రూపంలో మద్యం సరఫరా చేశారు. ఇదివరకు ఎంత చలానా చెల్లిస్తే అంతమొత్తం మద్యం డిపో నుంచి అందించేవారు. పోస్ట్ పెయిడ్ చెక్కులతో సరుకు తీసుకెళ్లారు. సిద్దిపేటలోని డిపో లో గురువారం అర్ధరాత్రి వరకు బిల్లింగ్ చేశారు. ఒక్కరోజే రూ14.14కోట్ల మద్యం అందించారు. వారం రోజుల్లో రూ. 36.23కోట్ల మద్యం గత నెల 25 నుంచి 31వ తేదీ వరకు చలానా ద్వారా రూ22.09కోట్ల మద్యం లిఫ్ట్ అయ్యింది. 25న రూ.3.73 కోట్లు, 26న రూ.2.98 కోట్లు, 27న సెలవు, 28న రూ.6.52కోట్లు, 29న రూ.2.95 కోట్లు, 30న రూ.5.91కోట్లు, 31న రూ.2.96కోట్లు మద్యం డిపో నుంచి వ్యాపారులు స్టాక్‌ను కొనుగోలు చేశారు. అదే క్రెడిట్ ఇవ్వడంతో ఒక్కరోజే 14.14కోట్లు స్టాక్‌ను వ్యాపారులు తీసుకెళ్లారు. చలానా, పోస్ట్ పెయిడ్ చెక్కులతో కలిపి వారం రోజుల్లో రూ.36.23కోట్ల మద్యం లిఫ్ట్ చేయడం గమనార్హం. ఎకై ్సజ్ శాఖ నిర్ణయించిన తేదీలోగా క్రెడిట్‌పై తీసుకున్న మద్యం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. -
ఎంబాపెకు బంపరాఫర్.. ఏకంగా రూ. 2,716 కోట్లు!
సిడ్నీ: సమకాలీన ఫుట్‌బాల్‌లో అత్యుత్తమ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న కిలియాన్ ఎంబాపె కోసం సహజంగానే క్లబ్‌లు క్యూ కడతాయి. 2018 వరల్డ్‌కప్‌ను ఫ్రాన్స్ గెలవడంతో పాటు 2022లో తమ జట్టు ఫైనల్ చేరడంలో కూడా అతను కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఎంబాబెకు సౌదీ అరేబియా క్లబ్ అల్–హిలాల్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అతనితో ఒప్పందం కోసం 332 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2 వేల 716 కోట్లు) ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఎంబాపె పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్జీ) టీమ్‌తో ఉన్నాడు. ఈ టీమ్‌తో అతను కాంట్రాక్ట్ పొడిగించుకునే అవకాశం కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో అల్–హిలాల్ ముందుకు వచి్చంది. ప్రస్తుతం దీనిపై చర్చలు కొనసాగుతున్నాయి. -
పిల్లల్ని కంటే రూ.5.6 లక్షలు.. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్!
ప్రపంచంలో అత్యంత జనాభా ఉన్న చైనా ఇప్పుడు యువత జనాభా తగ్గి వయసు మళ్లిన వారి సంఖ్య పెరిగిపోవడంతో ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో పిల్లల్ని కనాలని ఆ దేశ ప్రభుత్వం కూడా అక్కడ జంటలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో చైనాలో అతిపెద్ద ట్రావెల్ ఏజెన్సీ ట్రిప్ డాట్ కామ్ తమ ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చింది. ఐదేళ్లలో రూ.5.6 లక్షలు కంపెనీలో పనిచేసే ఉద్యోగులు పిల్లల్ని కంటే ఒక్కో శిశువుకు ఏడాదికి 10,000 యువాన్లు (రూ.1.1 లక్షలు) చొప్పున ఐదేళ్లపాటు అందిస్తామని ట్రిప్ డాట్ కామ్ సంస్థ ప్రకటించింది. అంటే ఒక్కో బిడ్డకు ఐదేళ్లలో మొత్తంగా 50,000 యువాన్లు (రూ.5.6 లక్షలు) లభిస్తాయి. జూన్ 30న ప్రకటించిన ఈ ఆఫర్ జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. వారికి మాత్రమే.. ఈ చైల్డ్ కేర్ బినిఫిట్లు కంపెనీలో మూడేళ్లకు పైగా పని చేస్తున్న ఉద్యోగులకు మాత్రమే. "మా ఉద్యోగులు వారి వృత్తిపరమైన లక్ష్యాలు, సాధనలపై రాజీ పడకుండా వారి కుటుంబాలను పోషించుకునేలా ప్రోత్సహిస్తూ ఆర్థిక సహాయాన్ని అందించే లక్ష్యంగా ఈ చైల్డ్‌కేర్ బెనిఫిట్‌ను ప్రవేశపెట్టాం" అని ట్రిప్ డాట్ కామ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జేమ్స్ లియాంగ్ చెప్పినట్లుగా సీఎన్ఎన్ వార్తా కథనం పేర్కొంది. కాగా చైల్డ్ కేర్ బినిఫిట్ల కోసం కంపెనీకి సుమారు 1 బిలియన్ యువాన్ (దాదాపు రూ.1131 కోట్లు) ఖర్చు అవుతుంది. చైనాలో ఒక ప్రైవేట్ కంపెనీ ఈ తరహాలో చైల్డ్ కేర్ బినిఫిట్లు ప్రారంభించడం ఇదే తొలిసారి. చైనా జననాల రేటు గత ఏడాది 1,000 మందికి గానూ 6.77 జననాలకు పడిపోయింది. ఇది 2021లో 7.52 జననాలుగా ఉండేది. ఇది రికార్డ్ స్థాయి అత్యంత తక్కువ జననాల రేటు. కొత్త తరం జనాభాను ప్రోత్సహించేందుకు 2021లో చైనా ప్రభుత్వం ప్రతి జంట ముగ్గురు పిల్లలను కనేందుకు అవకాశం ఇచ్చారు. కోవిడ్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నప్పటికీ పిల్లలను కనడంపై జంటలు ఆసక్తి చూపించలేదు. తక్కువ ఆదాయం, పెరిగిన పిల్లల సంరక్షణ, విద్యా ఖర్చులు వంటివి ఇందుకు కారకాలుగా ఉన్నాయి. ఇదీ చదవండి: గుడ్‌న్యూస్.. డబుల్ డిజిట్ బాటలో వేతన ఇంక్రిమెంట్లు -
విక్టరీ వెంకటేష్ దక్షిణ భారత స్టార్ నుండి పాన్ ఇండియన్ స్టార్ గా...
-
కేఏ పాల్ పెద్ద మనసు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్
-
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్: ఐఫోన్ 14 పై రూ. 44వేల భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: యాపిల్ ఐఫోన్ 14పై భారీ తగ్గింపు లభిస్తోంది.ఈ రోజు (మార్చి 31) ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో అనేక ఉత్పత్తులపై స్మార్ట్డీల్స్ అందిస్తోంది. ముఖ్యంగా ఖరీదైన ఐఫోన్ 14 స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్న వారికి బంపర్ ఆఫర్. దాదాపు రూ. 44,901 తగ్గింపు తర్వాత కేవలం రూ. 34,999కి అందుబాటులో ఉంది. (సంక్షోభ సమయంలో హెచ్‌సీఎల్ టెక్ గుడ్‌న్యూస్) మార్చి 31 నుండి ఏప్రిల్ 3 వరకు జరిగే బిగ్ బచత్ ధమాల్ సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ మొబైల్‌లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలపై తగ్గింపును అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10,901 తగ్గింపుతో రూ.68,999కి విక్రయిస్తోంది. దీంతోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.4000 తక్షణ తగ్గింపు, స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్లో రూ. 30,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అలా రూ. 44,901 తగ్గింపు తర్వాత యాపిల్ 14 ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 34,999కి లభించనుంది. (ఇదీ చదవండి: హయ్యస్ట్ సాలరీతో మైక్రోసాఫ్ట్‌లో జాబ్ కొట్టేసిన అవని మల్హోత్రా) యాపిల్ ఐఫోన్ 14లో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే 12 ఎంపీ సెన్సార్లతో డ్యూయల్ కెమెరా,12 ఎంపీ సెల్ఫీ కెమెరా లాంటి ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. (అచ్చం యాపిల్ స్మార్ట్‌వాచ్ అల్ట్రాలానే : ధర మాత్రం రూ. 1999లే!) -
ఐటీ ఉద్యోగులకు TSRTC బంపర్ ఆఫర్
-
బిగ్’సి’ దీపావళి డబుల్ ధమాకా ఆఫర్
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ రిటైలర్ బిగ్ ‘సి’ దీపావళి పండుగ సందర్భంగా కస్టమర్లకు ‘‘డబుల్ ధమాకా ఆఫర్’’ ఆఫర్లను ప్రకటించింది. ప్రతి స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.1,999 విలువైన ఇయర్ బడ్స్‌ను కేవలం రూ.199లకే లేదా రూ.3,999 విలువైన గిగ్మోర్ కాలింగ్ స్మార్ట్ వాచ్‌ను కేవలం రూ.999లకే అందించనుంది. ప్రతిస్మార్ట్ ఫోన్‌పై రూ.7900 వరకు తక్షణ డిస్కౌంట్ కూడా ఇస్తుంది. ప్రతి ల్యాప్‌ట్యాప్ కొనుగోలుపై రూ.3వేల తక్షణ డిస్కౌంట్‌తో పాటు ల్యాప్‌టాప్ బ్యాగ్ ఉచితంగా ఇస్తుంది. ఏటీఎం కార్డుపై ఎలాంటి డౌన్ పేమెంట్ లేకుండానే మొబైల్, ల్యాప్‌టాప్, స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే ఆకర్షణీయమైన సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది. బిగ్ సి అందిస్తున్న ఈ దీపావళీ పండుగ ఆఫర్లను కస్టమర్లు అందరూ వినియోగించుకోవాలని కంపెనీ సీఎండీ బాలు చౌదరి తెలిపారు. -
యూట్యూబ్ క్రియేటర్స్‌కి బంపర్ ఆఫర్
-
బరువు తగ్గితే రూ.10 లక్షలు.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్
ముంబై: జెరోడా అనే ఆన్లైన్ బ్రోకరేజీ కంపెనీ ఉద్యోగులకు సీఈఓ నితిన్ కామత్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. బరువు తగ్గితే మంచి ఇన్సెంటివ్‌లు ఇస్తారట. అంతేకాదు, ఒక లక్కీ విజేతకు ఏకంగా రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు. ఇందుకోసం వారు రోజుకు కనీసం 350 క్యాలరీలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలా ఏడాది పాటు శ్రమించి లక్ష్యంలో 90 శాతం సాధించిన వారందికీ నెల వేతనం బోనస్‌గా ఇస్తారు! దీనికి తోడు రూ.10 లక్షల బంపర్ బొనాంజా ఉండనే ఉంది! దాంతో ఈ ఫిట్నెస్ చాలెంజ్‌ను సీరియస్‌గా తీసుకుని ఉద్యోగులంతా గట్టిగానే శ్రమిస్తున్నారట. అన్నట్టూ, ఎవరు ఏ మేరకు కొవ్వు కరిగిస్తున్నదీ కంపెనీ తాలూకు ఫిట్నెస్ ట్రాకర్ గమనిస్తుంటుందట. ఉద్యోగుల ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఈ కంపెనీకి కొత్తేమీ కాదట. 25 కంటే తక్కువ బీఎంఐ ఉన్న ఉద్యోగులకు ఇప్పటికే సగం నెల వేతనం బోనస్‌గా ఇస్తోంది!! వర్క్ ఫ్రం హోం వల్ల స్థూలకాయం తెచ్చుకుని అనారోగ్యం పాలు కావొద్దన్నదే తమ ఉద్దేశమంటున్నారు కామత్. కరోనా కాలంలో పెరిగిన బరువును తానెలా తగ్గించుకున్నదీ చెబుతూ ఉద్యోగులను మోటివేట్ చేస్తున్నారు. -
వీవీఎస్ లక్ష్మణ్ కు బంపర్ ఆఫర్
-
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్
-
ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ పీఏకు బంపర్ ఆఫర్
సాక్షి, పుట్టపర్తి(శ్రీసత్యసాయి జిల్లా): సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ పీఏ బాలాజీకి వయోజన విద్యాశాఖ ఉన్నతాధికారులు బంపర్ ఆఫర్ ఇచ్చారు. విధులకు గైర్హాజరయినా ప్రతి నెలా ఠంచనుగా వేతనం ఖాతాలో వేశారు. పేకాటలో దొరికి పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టినా... చర్యలు తీసుకోకుండా అండగా నిలుస్తున్నారు. సగటు ఉద్యోగి ఏ చిన్న తప్పుచేసినా క్రమశిక్షణ చర్యలు తీసుకుని సస్పెండ్ చేసే ఉన్నతాధికారులు... బాలాజీకి అండగా నిలవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: మళ్లీ బాలకృష్ణ పీఏగా మారిన బాలాజీ.. గృహప్రవేశమని చెప్పి ఆఫీస్‌కు డుమ్మా కొట్టి హాజరుతో సంబంధం లేకుండా జీతం.. వయోజన విద్య పెనుకొండ డివిజన్ సూపర్వైజర్గా పనిచేసే బాలాజీ డిప్యుటేషన్‌పై ఆరేళ్ల క్రితం బాలకృష్ణ పీఏగా నియమితులయ్యారు. అయినప్పటికీ అతను ప్రతి నెలా బాలకృష్ణ వద్ద విధులు నిర్వహిస్తున్నట్లు హాజరుపట్టిక, టూర్గైడ్ను విధిగా వయోజన విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపాలి. కానీ రెండేళ్లుగా టూర్‌గైడ్, హాజరు పట్టిక పంపకపోయినా వయోజన విద్యాశాఖ అధికారులు ప్రతి నెలా బాలాజీకి జీతం మంజూరు చేశారు. పేకాట ఆడినా చర్యలు శూన్యం.. ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ బాలాజీ టీడీపీ నాయకుడిలా వ్యవహరించేవారు. టీడీపీ కార్యక్రమాలు, ఆ పార్టీ సమాచారాన్ని నేరుగా వాట్సాప్ గ్రూపుల్లో అందరికీ పంపేవాడు. అయినప్పటికీ అతనిపై అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఈ ఏడాది మార్చి 20న గౌరీబిదనూరులో పేకాట ఆడుతూ పట్టుబడగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయడంతో పాటు రిమాండ్‌కు పంపగా.. అతను బెయిల్ తెచ్చుకున్నాడు. దీంతో అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ... బాలాజీని సస్పెండ్ చేయాలని సిఫార్సు చేస్తూ వయోజన విద్యాశాఖకు ఉత్తర్వులు ఇచ్చారు. బాలకృష్ణ పీఏగా రిలీవ్ చేసి వయోజన విద్యాశాఖకు సరెండర్ చేశారు. కానీ అధికారులు మాత్రం ఇప్పటి వరకు బాలాజీని సస్పెండ్ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. భోజనం చేస్తుంటే కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారని... పేకాట ఆడలేదని తప్పుడు నివేదికను వయోజన విద్యాశాఖ డైరెక్టర్‌కు పంపి.. కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టినా... అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ, మభ్యపెట్టి చర్యలు తీసుకోకుండా కాపాడే ప్రయత్నం జరుగుతున్నట్లు వయోజన విద్యాశాఖలో చర్చ జరుగుతోంది. -
Hyderabad: ప్రయాణికులకు మెట్రో రైలు బంపర్ ఆఫర్
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు మెట్రో రైలు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రభుత్వ సెలవు రోజున రూ.59 చెల్లించి అపరిమితంగా ప్రయాణించేందుకు ‘సూపర్ సేవర్ హాలిడే కార్డు’ను ప్రవేశపెట్టింది. ఎల్అండ్టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి గురువారం అమీర్‌పేట మెట్రో స్టేషన్లో దీనిని ప్రారంభించారు. ఈ కార్డుతో సెలవు రోజున కేవలం రూ.59తో మెట్రోలో ప్రయాణించవచ్చని ఆయన వెల్లడించారు. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగవచ్చు. ఉగాది పండగ రోజు (ఏప్రిల్ 2) నుంచి మెట్రో రైల్ టికెట్ కౌంటర్ల వద్ద ఈ కార్డులు విక్రయిస్తారని ఆయన తెలిపారు. ఏప్రిల్ 2 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ముందుగా ప్రకటించిన 100 ప్రభుత్వ సెలవు దినాల్లోనే ఈ రాయితీ వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. లక్కీ డ్రా విజేతలకు బహుమతుల ప్రదానం మెట్రో సువర్ణ ఆఫర్లో భాగంగా నెలవారీ పాసులు కొనుగోలు చేసిన ప్రయాణికులకు లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపికచేశారు. గెలుపొందిన 5 మంది విజేతలకు బహుమతులను అందజేశారు. మెట్రో సువర్ణ ఆఫర్ విజేతలకు ప్రతి నెల లక్కీ డ్రా తీసి బహుమతులను అందజేస్తున్నట్లు కేవీబీ రెడ్డి తెలిపారు. చదవండి: (రీజినల్ రింగ్ రోడ్డు తొలి గెజిట్ విడుదల) -
బడిలో చేరేందుకు బంపర్ ఆఫర్లు..
-
Xiaomi Bumper Offer: రూ.15,999 స్మార్‌వాచ్.. రూ.7,999లకే.. ఇంకా మారెన్నో..
Mi Accessories Bonanza : ఇండియాలో నంబర్ వన్ స్మార్ట్‌ఫోన్ సెల్లర్ కంపెనీగా రికార్డ్ సృష్టించిన షావోమీ ఎంఐ సంస్థ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. యాక్ససరీస్ బొనాంజా పేరుతో తగ్గింపు ధరలకే స్మార్ట్‌వాచ్, ఇయర్‌ఫోన్స్, స్మార్ట్బ్యాండ్స్ తదితర యాక్సెసరీస్‌ని అందిస్తోంది. యాక్సెసరీస్ బొనాంజా స్మార్ట్ఫోన్లతో ఇండియా మార్కెట్లోకి ఎంటరైన షావోమి సంస్థ ఇక్కడ బలంగా పాతుకుపోయింది. స్మార్ట్ఫోన్లతో పాటు ల్యాప్‌ట్యాప్స్, బ్యాగ్స్, స్మార్ట్‌వాచెస్, ఇయర్‌ఫోన్స్, పాకెట్ స్పీకర్స్ తదితర యాక్సెసరీస్‌ని ఇక్కడి ప్రజలకు పరిచయం చేసింది. తక్కువ ధరకే నాణ్యమైన ప్రొడక్టులు అందిస్తుండంతో ఎంఐకి ఇండియాలో భారీ కస్టమర్ బేస్ ఏర్పడింది. ఈ కస్టమర్ల కోసం యాభై శాతం డిస్కౌంట్‌తో యాక్సెసరీస్ అందిస్తోంది. ఈ మేరకు నవంబరు 13, 14 తేదీల్లో ప్రత్యేకంగా యాక్సెసరీస్ బొనాంజా సేల్స్ ప్రకటించింది. ఎంఐ వాచ్ రివాల్వ్ యాక్సెసరీస్ బొనాంజా సేల్స్‌లో స్మార్ట్‌వాచ్ రివాల్వ్‌పై అత్యధికంగా రూ. 8000ల వరకు తగ్గింపు ఎంఐ అందిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ ఎంఆర్పీ ధర రూ.15,999లు ఉండగా ఈ ఆఫర్లో కేవలం రూ.7,999లకే సొంతం చేసుకోవచ్చు. ఈ వాచ్ ఫీచర్లు ఇలా ఉన్నాయి. - 3.53 అమోల్డ్ డిస్ప్లే, సింగిల్ ఛార్జ్‌తో 14 రోజలు బ్యాటరీ బ్యాకప్ - పీపీజీ బయో సెన్సార్స్‌తో 24 గంటల రియల్‌టైమ్ మానిటరింగ్, - లైఫ్‌క్యూ సాయంతో స్లీప్ట్రాకింగ్, వైటల్ సైన్, స్ట్రెస్, బ్రీత్, హార్ట్‌రేట్ మానిటరింగ్ ఫీచర్లు - 10 ప్రొఫెషనల్ స్పోర్ట్స్ , 117 స్పోర్ట్స్ మోడ్స్ సపోర్ట్ - ఆటోమేటిక వర్క్అవుట్ డిటెక్షన్ - జీపీఎస్, గ్లోనాస్, గాలిలియో, బీడీఎస్ సపోర్ట్ - అమెజాన్ అలెక్సా సపోర్ట్, వాటర్ రెసిస్టెంట్ - ఈ రివాల్వ్ స్మార్ట్‌వాచ్‌లో మరో వేరియంట్ అమెజాన్‌లో రూ.6,999లకే లభిస్తోంది. ఇతర ఆఫర్లు - ఎంఐ ఇయర్‌ఫోన్ ఎంఆర్పీ ధర రూ.999 ఉండగా ప్రత్యేక తగ్గింపుగా రూ.199కే వస్తోంది - ఎంఐ స్పోర్ట్స్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ బేసిక్ ధర రూ.1799 ఉండగా ఈ ఆఫర్లో రూ.499కే వస్తోంది - ఎంఐ స్మార్ట్‌బ్యాండ్ 4 ధర రూ.2499 ఉండగా యాక్సెసరీస్ బొనాంజా సేల్స్‌లో రూ.1,599కి అందిస్తోంది - రెడ్మీ స్మార్ట్‌బ్యాండ్ ధర రూ.2099లు కాగా ఈ ఆఫర్లో రూ.1299కే వస్తోంది - ఎంఐ పాకెట్ స్పీకర్ ధర రూ.1499 ఉండగా ఇప్పుడు రూ.799కే లభిస్తోంది. - ఎంఐ ప్రొటెక్టివ్ గ్లాస్ ధర రూ.599 కాగా ఈ ఆఫర్లో రూ.49కే అందుబాటులో ఉంది. చదవండి:షావోమీదే పైచేయి.. శాంసంగ్ వెనుకంజ -
‘బుల్లెట్టు బండి’ వధువుకు అద్భుత అవకాశం
తెలంగాణ యాసలో ఎంతో మధురంగా ఉన్న ‘బుల్లెట్టు బండి’ పాటకు ఓ వధువు తన పెళ్లి బరాత్‌లో అద్భుతంగా డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఒక జానపదం పాటకు చేసిన డ్యాన్స్ వీడియో ట్రెండింగ్‌లోకి వెళ్లింది. ఆ డ్యాన్స్ చేసిన యువతికి ఇప్పుడు ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. ఏ పాటకైతే డ్యాన్స్ చేసిందో ఆ పాటను నిర్మించిన సంస్థ తమ తదుపరి పాటకు డ్యాన్స్ చేసే అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ నిర్వాహకురాలు ప్రకటించారు. మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్ఎస్ఓ రాము, సురేఖ దంపతుల పెద్ద కుమార్తె సాయి శ్రీయ వివాహం రామకృష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌తో ఈనెల 14వ తేదీన జరిగింది. అప్పగింతల సమయంలో సాయిశ్రీయ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. (చదవండి : బుల్లెట్ బండి పాట: ఎవరీ మోహన భోగరాజు?) అయితే ఆమె డ్యాన్స్ చేసిన పాటను నిర్మించిన సంస్థ బ్లూ రాబిట్ ఎంటర్టైన్మెంట్. రచయిత లక్ష్మణ్ సాహిత్యానికి ఎస్కే బాజి సంగీతం అందించగా ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడారు. ఆ పాటను అద్భుతంగా తెరకెక్కించిన బ్లూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్వాహకులు నిరూప స్పందించారు. సాయిశ్రీయతో నిరూప ఫోన్లో మాట్లాడారు. (చదవండి: ఒక్క డ్యాన్స్‌తో సెలబ్రిటీగా ‘బుల్లెట్టు బండి’ వధువు) ‘మా సంస్థలో నిర్మించే తదుపరి పాటకు నువ్వే క్యాస్ట్‌గా (నటించడం) చేయాలి’ అని చెప్పగా సాయిశ్రీ ఆనందంతో ఉబ్బితబ్బిబైంది. అంత పెద్ద అవకాశం రావడంతో సాయిశ్రీయ కాదనలేకపోయింది. దీంతో సాయిశ్రీయ త్వరలోనే ఆమె ప్రధాన పాత్రలో ఓ పాట రాబోతోంది. బ్లూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఆవిర్భవించి దాదాపు రెండేళ్లవుతోంది. ఈ సంస్థ గతంలో అనేక పాటలు రూపొందించింది. రాహుల్ సిప్లిగంజ్, నోయల్‌తో పాటలు పాడించింది. ‘బుల్లెట్ బండి’ పాటతో ఆ సంస్థకు మంచి క్రేజ్ ఏర్పడింది. చదవండి: చీరకట్టులో కుందనపు బొమ్మలా ‘పీవీ సింధు’ -
ఇకపై చాను ఐనాక్స్‌లో ఎక్కడైనా ఫ్రీగా సినిమా చూడొచ్చు..
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో దేశానికి రజత పతకం అందించిన మీరాబాయి చానుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. దీంతో పాటు ఆమెకు భారీ స్థాయిలో అవార్డులు, రివార్డులు క్యూ కట్టాయి. ఈ క్రమంలో తాజాగా ఆమెను మరో బంపర్ ఆఫర్ వరించింది. చానుకు జీవితకాలం పాటు సినిమా టికెట్లు ఫ్రీగా ఇస్తామని ఐనాక్స్ మల్టీప్లెక్స్ ప్రకటించింది. టోక్యోలో పతకం గెలిచే ప్రతి భారత అథ్లెట్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. వీరితో పాటు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ప్రతి అథ్లెట్‌కు ఏడాది పాటు టికెట్లు ఫ్రీగా టికెట్లు ఇస్తామని పేర్కొంది. ఈ విషయాన్ని ఐనాక్స్ తమ ట్విటర్లో పోస్ట్ చేసింది. కాగా, దేశంలో ఐనాక్స్కు మొత్తం 648 మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. INOX takes immense pride in all the endeavors of #TeamIndia at #Tokyo2020 🌟✨We are happy to announce free movie tickets for lifetime for all the medal winners🏅& for one year for all the other athletes🎟️🎟️#AayegaIndia #INOXForTeamIndia #EkIndiaTeamIndia #Respect #JaiHind 🇮🇳 pic.twitter.com/evaAAJbgKx— INOX Leisure Ltd. (@INOXMovies) July 27, 2021 ఇదిలా ఉంటే, అంతకుముందు డొమినోస్ ఇండియా పిజ్జా వారు కూడా చానుకు లైఫ్‌టైం ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. చాను.. జీవితకాలం ఎన్ని పిజ్జాలు తిన్నా ఫ్రీ ఆఫర్ ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఒలింపిక్స్ పతకం అందుకుంటున్న సందర్భంగా పిజ్జా తినాలనుందని చాను చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో డొమినోస్ ఈ మేరకు స్పందించింది. ఇక విశ్వవేదికపై భారతీయ జెండాను రెపరెపాలాడించిన చానుపై కానుకల వర్షం కురుస్తోంది. ఇప్పటికే భారత రైల్వేశాఖ రూ. 2కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించడంతో పాటు ప్రమోషన్ కూడా ఇచ్చింది. ఈశాన్య రైల్వేలో పని చేస్తున్న ఆమెను ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (స్పోర్ట్స్)గా ప్రమోట్ చేసింది. మరోవైపు మణిపూర్ సర్కార్ కూడా చానుకు కోటి రూపాయల నగదు ప్రోత్సాహకం అందించింది.