cabbage
-
క్యాబేజీతో క్రేజీగా...!
క్యా... బే... జీ! పిల్లలు ఈ జోక్‌ని సరదాగా ఎంజాయ్ చేస్తారు. సిబ్లింగ్స్ ఒకరినొకరు తిట్టుకోనట్లు తిట్టుకుంటారు. పొగడక తప్పనట్లు పొగుడుకుంటారు. క్యాబేజీ తినమంటే మాత్రం ముఖం చిట్లిస్తారు. వారానికి ఒకసారి క్యాబేజ్ తినమంటోంది ఆరోగ్యం. క్యాబేజీతో ఇలా ట్రై చేస్తే ఎలా ఉంటుంది?క్యాబేజ్ కుల్చా..కావలసినవి..గోధుమపిండి– పావు కేజీ;నూనె– 2 టీ స్పూన్లు;నీరు – ము΄్పావు కప్పు;ఉప్పు – పావు టీ స్పూన్;స్టఫింగ్ కోసం... క్యాబేజ్ – పావు కేజీ;నూనె – టేబుల్ స్పూన్;పచ్చిమిర్చి – 2 (తరగాలి);వాము – అర టీ స్పూన్;అల్లం తురుము – టీ స్పూన్;పసుపు – పావు టీ స్పూన్;కొత్తిమీర తరుగు – టీ స్పూన్;జీలకర్ర పొడి– అర టీ స్పూన్;గరం మసాలా పొడి– అర టీ స్పూన్;ఆమ్చూర్ – అరటీ స్పూన్;ఉప్పు – అర టీ స్పూన్;నూనె – టేబుల్ స్పూన్.తయారీ..– గోధుమపిండిలో ఉప్పు, నీరు పోసి ముద్దగా కలిపి పైన నూనె వేసి అద్ది పలుచని వస్త్రాన్ని కప్పి పక్కన పెట్టాలి.– క్యాబేజ్‌ని శుభ్రంగా కడిగి మరుగుతున్న నీటిలో వేసి ఐదు నిమిషాల సేపు ఉంచి తీయాలి. నీరు పోయిన తర్వాత తురమాలి.– వెడల్పు పెనంలో నూనె వేడి చేసి వాము గింజలు వేయాలి.– అవి చిటపటలాడిన తర్వాత క్యాబేజ్ తురుము, ఉప్పు వేసి కలిపి మంట తగ్గించి మూతపెట్టాలి.– ఏడెనిమిది నిమిషాలకు క్యాబేజ్ మగ్గుతుంది. అవసరమైతే కొద్దిగా నీటిని చిలకరించాలి.– ఇప్పుడు పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, అల్లం, పసుపు, ఆమ్చూర్ పౌడర్, గరం మసాలా పొడులు వేసి కలిపి మూత పెట్టాలి.– రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లి దించేయాలి. చల్లారే వరకు పక్కన పెట్టాలి.– ఈ లోపు గోధుమ పిండితో చపాతీలు చేయాలి. ఒక చపాతీ మీద ఒక గరిటె క్యాబేజ్ స్టఫింగ్ పెట్టి ఆ పైన మరో చపాతీ పెట్టి అంచులను చేత్తో అతికించాలి.– ఇప్పుడు క్యాబేజ్ సమంగా విస్తరించడానికి అప్పడాల కర్రతో జాగ్రత్తగా రోల్ చేస్తే అదే కుల్చా. ఇలాగే పిండి అంతటినీ చేయాలి.– ఇప్పుడు చపాతీల పెనం వేడి చేసి ఒక్కో కుల్చాను చపాతీలాగానే నూనె వేస్తూ రెండువైపులా కాలనివ్వాలి.– స్టఫింగ్ బరువుతో కుల్చా విరిగిపోకుండా జాగ్రత్తగా తిరగేయాలి.– వేడి కుల్చాలోకి వెన్న, పెరుగు మంచి కాంబినేషన్. కారంగా తినాలంటే నిమ్మకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి బాగుంటుంది.గమనిక: ఆమ్చూర్ పౌడర్ లేకపోతే తాజా మామిడి తురుము టీ స్పూన్ తీసుకోవాలి.క్యాబేజ్ డ్రై మంచూరియా..కావలసినవి..క్యాబేజ్ – 200 గ్రాములు (తరగాలి);ఉల్లిపాయ – 1 (పెద్దది, తరగాలి);క్యాప్సికమ్ – 1 (తరగాలి);క్యారట్ – 1 (తరగాలి);షెజ్వాన్ సాస్ – అర టేబుల్ స్పూన్;అల్లం తురుము – టీ స్పూన్; కశ్మీరీ మిరపొ్పడి– అర టీ స్పూన్;మిరియాల పొడి– పావు టీ స్పూన్;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;శనగపిండి – 100 గ్రాములు;మైదా – 50 గ్రాములు;మొక్కజొన్న పిండి– 50 గ్రాములు;నూనె – వేయించడానికి తగినంత;గార్నిష్ చేయడానికి... క్యాబేజ్ తురుము – టేబుల్ స్పూన్;కొత్తిమీర తరుగు – టీ స్పూన్.తయారీ..– వెడల్పు పాత్ర తీసుకుని అందులో నూనె మినహా మిగిలిన దినుసులన్నీ వేసి కలిపి పక్కన పెట్టాలి.– నీరు అవసరం లేదు, కూరగాయల్లోని నీటితోనే పిండి ముద్దగా అవుతుంది.– అరగంట తర్వాత మరోసారి బాగా కలుపుకోవాలి.– బాణలిలో నూనె మరిగించి పై మిశ్రమాన్ని చేతి నిండుగా తీసుకుని వేళ్లతో కొద్ది కొద్దిగా నూనెలో వదలాలి.– కాలి కొంచెం గట్టి పడిన తర్వాత చిల్లుల గరిటెతో అన్ని వైపులా బాగా కాలే వరకు తిరగేస్తూ కాలనివ్వాలి.– ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పరిచి మంచూరియా దోరగా కాలిన తర్వాత తీసి పేపర్ మీద వేయాలి.– వేడిగా ఉండగానే క్యాబేజ్, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.ఇవి చదవండి: ఉన్నది ఒకటే.. 'జిమ్'దగీ..! -
క్యాబేజీ ఆకులతో కట్టుకడితే కీళ్లనొప్పులు తగ్గుతాయా?
క్యాబేజీ అంటే చాలామంది పెద్దగా ఇష్టపడరు. ఎందుకంటే దీనివాసన చాలామందికి నచ్చదు. అయితే క్యాబేజీలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది. బరువు తగ్గడం నుంచి అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అయితే క్యాబేజీ ఆకులతో ఆర్థరైటిస్ నొప్పుల నుంచి చక్కని ఉపశమనం లభిస్తుందని మీకు తెలుసా?క్యాబేజీ ఆకులను యూరోపియన్ జానపద వైద్యంలో పేదవారి పౌల్టీస్ (పిండికట్టు) అని పిలుస్తారు. వృద్ధులలో అత్యంత సాధారణమైన దీర్ఘకాలిక వ్యాధులలో ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్. అలాంటి వారు క్యాబేజీ ఆకులను పాదాలకు చుట్టి రాత్రంతా ఉంచడం వల్ల కీళ్ల వాపులు, నొప్పులు తగ్గుతాయని పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. నొప్పులను తగ్గించడంలో క్యాబేజీ ఆకులు పెయిన్ కిల్లర్స్ కన్నా అద్భుతంగా పనిచేస్తాయని, ఈ ఆకుల్లో సహజసిద్ధమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. వీటిని కొద్దిగా నూనెతో వేడిచేసి కానీ, ఐస్‌తో కలిపి ఐస్ ప్యాక్‌లాగా గానీ వాడతారు. ఇవి సురక్షితమైనవి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు కాబట్టి దీర్ఘకాలికంగా ఉపయోగించవచ్చు. ధూమపానం చేసేవారు క్యాబేజీ లేదా బ్రోకలీని తిన్న పది రోజుల తర్వాత వారి సి-రియాక్టివ్ ప్రోటీన్ స్థాయిలు 40 శాతం తగ్గినట్టు పరిశోధనల్లో తేలింది.ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న 81 మంది వ్యక్తులపై 2016లో ఒక చిన్న అధ్యయనం జరిగింది, అక్కడ మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్‌కు క్యాబేజీ ఆకు చుట్టడం ద్వారా ఫలితం ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. అయితే దీని నిర్ధారణకు "మరింత పరిశోధన అవసరమని పేర్కొన్నారు. 2018లో చేసిన మరొక అధ్యయనంలో పురుషులలో మోకాలికి ఐస్‌తో పాటు, క్యాబేజీ ఆకులను చుట్టి కట్టడం వలన వాపు తగ్గినట్టు గమనించారు. నోట్: ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది. -
క్యాబేజ్‌తో ఎగ్ భుర్జి.. ఎప్పుడైనా ట్రై చేశారా? చపాతీలో బావుంటుంది
క్యాబేజ్ ఎగ్ భుర్జి తయారీకి కావల్సినవి క్యాబేజీ తురుము – రెండు కప్పులు; నూనె – మూడు టేబుల్ స్పూన్లు; ఉల్లిపాయ తరుగు – అరకప్పు; అల్లం వెల్లుల్లి పేస్టు – ఒకటిన్నర టీస్పూన్లు; పచ్చిమిర్చి – చిన్నవి ఆరు(సన్నగా తరగాలి); ధనియాల పొడి – అరటీస్పూను; పసుపు – అరటీస్పూను; కారం – ముప్పావు టీస్పూను; గుడ్లు – నాలుగు; ఉప్పు – రుచికి సరిపడా; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానమిలా: ►స్టవ్ మీద మందపాటి బాణలి పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి. ఉల్లిపాయ వేగాక, అల్లం వెల్లుల్లి పేస్టువేసి వేయించాలి. ► అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తరువాత పచ్చిమిర్చి తరుగు వేయాలి. మిర్చి వేగిన తరువాత ధనియాల పొడి, కారం, పసుపు, క్యాబేజీ తరుగు, రుచికి సరిపడా ►ఉప్పు వేసి కలిపి బాణలి మీద మూతపెట్టి సన్న మంట మీద మగ్గనివ్వాలి. ►గుడ్లసొనను ఒక గిన్నెలో వేసి బీటర్ లేదా ఫోర్క్‌తో కలిపి పక్కన పెట్టాలి. ∙క్యాబేజీ ఉడికి దగ్గర పడుతున్నప్పుడు గుడ్ల సొనవేసి కలుపుతూ వేయించాలి. ► చక్కగా వేగిన తర్వాత కొత్తిమీర చల్లుకుని దించేయాలి. ∙రోస్టెడ్ బ్రెడ్, చపాతీ, రోటీలోకి ఇది మంచి సైడ్ డిష్. -
‘పుష్ప’ తరహాలో గంజాయి రవాణా.. క్యాబేజీ బుట్టల మాటున దాచి..
సాక్షి, విశాఖపట్నం: ‘పుష్ప’ సినిమా తరహాలో గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన విశాఖ జిల్లా పెందుర్తిలో చోటుచేసుకుంది. బొలెరో వాహనంలో ఇద్దరు వ్యక్తులు క్యాబేజీ బుట్టల మాటున గంజాయి అక్రమంగా తరలించే ప్రయత్నం చేశారు. అయితే బొలెరోలో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు సమచారం అందింది దీంతో పెందుర్తి వద్ద పోలీసులు వాహనంలో తనిఖీలు చేపట్టగా గుట్టు రట్టైంది. క్యాబేజీ బుట్టలు కింద 14 బ్యాగుల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బొలెరో వాహనంలో ఒడిశా నుంచి గంజాయిని క్యాబేజీ బుట్టల లోడుతో తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయితో ఉన్న బొలెరో వాహనాన్ని, ఇద్దరు వ్యక్తులను పెందుర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
Health: నీరసం, నిస్సత్తువ.. ఛాతిలో నొప్పి ఉందా? ఇవి తిన్నా, తాగినా...
Hemoglobin Count: నీరసం.. నిస్సత్తువ.. కళ్ళు తిరిగినట్టుండడం.. చర్మం పాలినట్టుండడం.. ఊపిరాడక పోవడం.. ఛాతిలో నొప్పి.. పాదాలు- అరి చేతులు చల్లగా ఉండడం.. తలనొప్పి... వీటిలో రెండు అంతకంటే ఎక్కువ లక్షణాలు ఉన్నాయా? అయితే ఆ వ్యక్తి అనీమియాతో బాధపడుతున్నట్టే? ఏంటిది? హీమోగ్లోబిన్ ఇది ఎర్రరక్త కాణాల్లోని ప్రోటీన్. ఇది కొరియర్లా పని చేస్తుంది. శరీరంలోని వివిధ కణాలకు ఆక్సిజన్ ను తీసుకొని వెళుతుంది. హీమోగ్లోబిన్ శాతం పురుషుల్లో 13 - 16.6 మధ్యలో ఉండాలి. స్త్రీలలో 11.6 - 15 మధ్యలో ఉండాలి. మన దేశంలో సుమారుగా అరవై కోట్లమంది అనీమియాతో అంటే తక్కువ హీమోగ్లోబిన్ శాతంతో బాధపడుతున్నారు. తక్కువ హీమోగ్లోబిన్‌కు ప్రధాన కారణం తీసుకొనే ఆహారంలో ఇనుము తక్కువగా ఉండడం. టెస్టులొద్దు .. ఇటీవల అయినదానికీ కానిదానికి డియాగ్నోస్టిక్ సెంటర్లకు పరుగెత్తడం... టెస్ట్‌లు చేసుకోవడం ఒక రివాజుగా మారింది. మన హీమోగ్లోబిన్ శాతమెంత? అని ఈ మెసేజ్‌ని చదివిన వారు టెస్టులకు పరుగెత్తొద్దు. ఇవి సమృద్ధిగా ఉండాలి పై లక్షణాల్లో ఒకటో రెండో కనిపించినా ... కనిపించకపోయినా... హీమోగ్లోబిన్ను తగినంతగా ఉంచుకొనేలా చేయండి . నేను చెప్పిన పద్ధతుల్లో హీమోగ్లోబిన్ పెరుగుతుంది . దీనికి అదనపు ఖర్చుండదు. ఒకవేళ మీకు హీమోగ్లోబిన్ ఇదివరకే తగినంతగా ఉన్నా ఇలా చెయ్యడం వల్ల నష్టం జరగదు. సైడ్ రియాక్షన్లు ఉండవు. మీరు తీసుకొనే ఆహారంలో ఇవి సమృద్ధిగా ఉండేలా చూసుకోండి . 1.పాల కూర 2. క్యాబేజీ 3.బీన్స్ 4. పన్నీర్ ఇక మాంసాహారులకు అనీమియా అరుదుగా మాత్రమే వస్తుంది. కారణం మటన్ ముఖ్యంగా మటన్ కు సంబందించిన లివర్ కిడ్నీ మొదలైనవి ఐరన్ రిచ్ ఫుడ్స్. వేగంగా పెరగాలా మీకు హీమోగ్లోబిన్ తక్కువగా ఉన్నపుడు { చాల మందిలో ఇది 8 కంటే తక్కువగా ఉంటుంది. 5 కంటే తగ్గితే కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది) ఏం చేయాలంటే? ►ఆపిల్ పండును తొక్క తీయకుండా అదేనండి ఎర్రటి పై పొట్టును సోకు కోసం తీసేయకుండా తినండి . ఇంకా ద్రాక్ష , అరటిపండు , పుచ్చకాయ కూడా ఉపయుక్తం. ►బీట్ రూట్ రసం వేగంగా హిమోగ్లోబిన్ పెరగడానికి దోహదం చేస్తుంది. మీకు ఇది వరకే షుగర్ ఉంటే మీరు ఇతర ఆహార నియమాలు పాటించకుండా ఉంటే పళ్ళు తీసుకోలేరు. ఇవి మానేయండి ►పళ్ళు తీసుకొంటే షుగర్ కంట్రోల్ అవుతుంది. పళ్ళు తింటే షుగర్ పెరుగుతుంది. రెండూ పరస్పర విరుద్ధ మాటలు కదా? కానీ రెండు సరైనవే . అది వేరే టాపిక్. మీకు ఇదివరకే హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటే, ఇవి వాడకండి { తినడం / తాగడం } 1 . టీ 2 కాఫీ 3. పాలు 4. కోడి గుడ్లు .. ముఖ్యంగా తెల్ల సొన. 5 . సొయా ప్రోటీన్ { సొయా పచ్చి విషం . హీమోగ్లోబిన్ బాగున్నా వాడొద్దు . వాడితే థైరాయిడ్ లాంటివి వచ్చే ప్రమాదం} ఇవి మంచి మార్గాలు ►వ్యాయాయం ►తగినంత నీరు తాగడం ►తగినంత నిద్ర .. అనీమియా రాకుండా ఉండడానికి మంచి మార్గాలు . పోలీసైతేమియా అంటే? గత ఆరునెలల్లో వేర్వేరు ఘటనల్లో కనీసం డజను మంది తమ బ్లడ్ రిపోర్ట్స్ మెసెంజర్ ద్వారా నాకు పంపించారు. వారి హీమోగ్లోబిన్ 17 కంటే ఎక్కువ ఉంది. ఇలా హీమోగ్లోబిన్ ఎక్కువగా ఉండడం పోలీసైతేమియా కావొచ్చు. వారందరూ నాకు రిపోర్ట్స్ పంపించడానికి 2- 5 నెలల ముందు వాక్సిన్ వేసుకొన్నవారే. అంటే వాక్సీన్ కలిగించే సైడ్ ఎఫెక్ట్స్ లో ఇది కూడా ఒకటి .దీనికి మరో పేరు బ్లడ్ కాన్సర్. చైనా లో అయితే లక్షలాది మంది ఇదే సమస్య తో బాధపడుతున్నారు . హీమోగ్లోబిన్ బాగా ఎక్కువగా ఉంటే అంటే పోలీసైతేమియా ఉంటే 1 . విపరీతంగా చెమటలు పడుతాయి 2 . నీరసం తలనొప్పి { హీమోగ్లోబిన్ బాగా తక్కువ ఉన్నా ఇవి ఉంటాయి } ౩. కీళ్ల నొప్పులు 4 . ఉన్నట్టుండి బరువు తగ్గడం 5 . పచ్చ కామెర్లు వచ్చిన్నట్టు కళ్ళు యెల్లోగా మారడం ఒకటి గుర్తు పెట్టుకోండి . ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎంత ఎక్కువ తిన్నా పోలీసైతేమియా రాదు. -వాసిరెడ్డి అమర్నాథ్, ప్రముఖ ఉపాధ్యాయులు, వ్యక్తిత్వ, మానసిక పరిశోధకులు (ఇది వ్యాసకర్త వ్యక్తిగతానుభవసారం ఇచ్చిన కథనం) చదవండి: Menopause: టాబ్లెట్ల ద్వారా హార్మోన్స్‌ను రీప్లేస్ చేయొచ్చా? వారికైతే సురక్షితం కాదు.. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం దేనికి సంకేతం? బ్లాక్ కాఫీ తాగుతున్నారా? ఇవి తింటే.. -
Hyderabad: దిగివచ్చిన ఆకుకూరలు, కూరగాయలు.. 50-80 శాతం తగ్గిన ధరలు
సాక్షి, హైదరాబాద్: మొన్నటి వరకు ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు ఎట్టకేలకు దిగివచ్చాయి. పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా మార్కెట్లో ఒక కూరగాయ ధర ఎక్కువ ఉంటే మరో కూరగాయ ధర తక్కువ ఉంటుంది. కొన్నిసార్లు కూరగాయల ధరలు చూస్తే బాబోయ్ అనిపిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లోకి వెళ్తున్న వారు బ్యాగు నిండా కూరగాయలతో ఇంటికి వస్తున్నారు. కూరగాయలతో పాటు ఆకుకూరలు సైతం తక్కువ ధరలకే లభిస్తుండటంతో శాఖాహారులు, ఆరోగ్య అభిలాషులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 50 నుంచి 80 శాతం తగ్గిన ధరలు టమాటా నుంచి క్యాబేజీ వరకు చౌకగా లభిస్తున్నాయి. తాజా ఆకుకూరలు అతి తక్కువ ధరకే విరివిరిగా లభిస్తున్నాయి. కూరగాయల దిగుబడి బాగా ఉండటంతో మార్కెట్లో అధికంగా లభ్యమవుతున్నాయి. రిటైల్‌గా కిలో టమాటా రూ.8 నుంచే రూ.10లకి లభిస్తోంది. వంకాయ, కాకరకాయ ధరలు తక్కువ ఉండగా ఒక్క ఆలుగడ్డ తప్పతో మిగతా కాయగూరలు అత్యంత చౌకగా లభిస్తున్నాయి. మెంతికూర, పాలకూరతో పాటు ఇతర ఆకుకూరలు గతంలో కంటే 80 శాతం ధరలు తగ్గాయి. పుదీనా కొత్తిమీర ధలకు కూడా తగ్గాయి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ రూ.10 నుంచి రూ.15కే పీస్ చొప్పున అమ్ముతున్నారు. ఎప్పుడూ కూడా చుక్కలను అంటే ధరలతో ఉండే బీన్స్ మాత్రం కేజీ రూ.25 నుంచి రూ.30లకే లభ్యమవుతోంది. నేరుగా కాలనీలు, బస్తీల్లోకే.. కరోనా దెబ్బతో ఉద్యోగాలు కోల్పోయిన యువకులు అధిక సంఖ్యలో కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. కాగా కూరగాయల కోసం బయటకు వెళ్లకుండా ఇంటి వద్దనే లభ్యమవుతున్నాయి. ఆటో ట్రాలీలలో గల్లీ గల్లీ తిరిగి విక్రయిస్తున్నారు. సాయంత్రం రోడ్లపక్కన, ప్రధాన కూడళ్ల వద్ద కూరగాయల స్టాళ్లు వెలుస్తున్నాయి. తాజాగా.. చౌకగా లభ్యమవుతుండటంతో ప్రతి ఒక్కరూ వీటిని కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. -
Beauty Tips: మొటిమలు, వాటి తాలుకు గుంతల సమస్య వేధిస్తోందా? ఇలా చేస్తే
మొటిమల సమస్య వేధిస్తోందా? ఈ చిట్కాలు ట్రై చేసి చూడండి. ►పదిహేను పుదీనా ఆకుల్ని తీసుకుని మెత్తగా నూరాలి. ►దీనిలో రెండు టీస్పూన్ల ఓట్స్, రెండు టీస్పూన్ల కీరా రసం, టీస్పూను తేనె వేసి చక్కగా కలపాలి. ►ఈ మిశ్రమాన్ని మొటిమలపై పూతలా వేసుకుని ఇరవై నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. ►ఇలా చేయడం వల్ల మొటిమలు పోతాయి. తేనెతో పాటు.. పుదీనా ఆకుల పేస్టులో తేనె, రోజ్‌వాటర్ వేసి కలిపాలి. మొటిమలపైన పూతలా వేసుకుంటే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు పోతాయి. ఇలా కూడా! కొన్ని పుదీనా, కొన్ని తులసి ఆకులు తీసుకొని బాగా పిండాలి. ఒక నిమ్మకాయ తీసుకుని ఈ రసంలో పిండాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మొటిమలపై పూయాలి. ఆరిన తర్వాత ముఖం కడుక్కోవాలి. చర్మం గరుకుగా ఉంటే.. ముఖంపై చర్మం గరుకుగా అనిపిస్తోందా? అలాంటప్పుడు.. క్యాబేజీని ఉడికించిన నీళ్లలో కొద్దిగా శనగపిండి కలిపి ముఖానికి మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారే అవకాశం ఉంటుంది. గుంతలు పోవాలంటే.. మొటిమలు తగ్గిన తర్వాత కూడా వాటికి సంబంధించిన గుంతలు అలాగే ఉంటాయి చాలా మందికి. ఈ సమస్య నుంచి బయపడాలంటే.. ఉడకపెట్టిన బంగాళదుంప గుజ్జును ఓ వారం పాటు రాత్రుళ్లు నిద్రపోయే ముందు ముఖానికి రాస్తే సరి! చదవండి: Hair Fall Control: అల్లం, ఆవాలు, లవంగాలతో.. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా, పొడవుగా! Madhuri Dixit: వారానికి 3 సార్లు ఇలా చేస్తా! నా బ్యూటీ సీక్రెట్ అదే! -
నిద్ర సరిగ్గా పట్టట్లేదా? ఈ మినరల్ లోపిస్తే అంతే! నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు పాడై!
Health Tips In Telugu: మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఎ, బి, సి, డి, ఈ, కె, బీకాంప్లెక్స్, బీట్వెల్వ్(బీ12) వంటి విటమిన్లు ఏవిధంగా అవసరమో, అదేవిధంగా క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ కూడా అవసరం. మన శరీరం ఫిట్‌గా ఉండాలంటే మెగ్నీషియం దేహంలో అధికంగా ఉండాలి. కార్బోహైడ్రేట్స్, కొవ్వు, ప్రోటీన్స్ నుంచి మనకు శక్తి వచ్చేలా చేయడంలో మెగ్నీషియం కీలకపాత్ర పోషిస్తుంది. ఇది మంచి శక్తితోపాటు చక్కటి నిద్ర పట్టేలా చేస్తుంది. రక్తంలో చక్కెరలను, హార్మోన్లను క్రమబద్ధీకరిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు చేకూర్చే మెగ్నీషియం తగినంత లేకపోతే కలిగే అనర్థాలేమిటో తెలుసుకుందాం. మెగ్నీషియం లోపిస్తే ఈ అనారోగ్యాలు వస్తాయి..!! ►సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో సరిపడా మెగ్నీషియం లేకపోతే కిడ్నీలు తమ దగ్గరున్న మెగ్నీషియం దేహానికి అందిస్తాయి. ►ఇలా ఎక్కువసార్లు మెగ్నీషియం కోసం కిడ్నీలపై ఆధారపడితే అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంతేకాకుండా కిడ్నీలు కూడా పాడవుతాయి. ►శరీరంలో తగినంత మెగ్నీషియం లేనప్పుడు మనకు కొన్ని సూచనలు వస్తాయి. వాటిని గమనిస్తే ముందుగానే ఈ లోపం గురించి తెలుసుకొని నివారించవచ్చు. లక్షణాలు..( Magnesium Deficiency Symptoms) ►మెగ్నీషియం లోపం ఉంటే ఆకలి వేయదు. ►వికారంగా ఉంటుంది. ►వాంతులు వస్తున్నట్లు అనిపిస్తుంది. ►నీరసంగా ఉంటారు. ► హార్ట్ బీట్‌రేట్ లో హెచ్చుతగ్గులు వస్తాయి. ► కళ్ళు మసక బారిన ఎక్కువగా ఉంటుంది. ►కండరాలలో నొప్పి వస్తుంది. ►ఒత్తిడి పెరుగుతుంది. ►నిద్ర సరిగ్గా పట్టదు. ►అధిక రక్తపోటు వస్తుంది. ►ఆస్తమాతో బాధపడేవారు మెగ్నీషియం లోపిస్తే ఈ సమస్య తీవ్రంగా మారుతుంది. మెగ్నీషియం ఉండే ఆహార పదార్థాలు..!! (Magnesium Rich Foods) ►ఆకుకూరలలోనూ, అవకాడో, అరటి పండ్లు, రాస్ బెర్రీస్, ఫిగ్స్ వంటి పండ్లలోనూ మెగ్నీషియం ఉంటుంది. ►అలాగే బ్రకోలీ, క్యాబేజి, పచ్చి బఠానీలు, మొలకలు వంటి వాటిలో కూడా ఇది దొరుకుతుంది. ►బ్రౌన్ రైస్, ఓట్స్, సీఫుడ్స్‌లో కూడా మెగ్నీషియం లభిస్తుంది. ►మెగ్నీషియం వెంటనే రావాలి అంటే ఒక కప్పు కాఫీ తాగాలి. ►డార్క్ చాక్లెట్ తిన్నా ఫలితం ఉంటుంది. ►మెగ్నీషియం లోపించినట్లు అనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే అనారోగ్యానికి గురవుతారు. ►సబ్జా గింజలు, ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో కూడిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువైతే..? ►మెగ్నీషియం ఎక్కువైనా కూడా ఇబ్బందులు తప్పవు. ► కడుపునొప్పి, డయేరియా వచ్చే అవకాశం ఉంది. ►మెగ్నీషియం ఎంత అవసరమో అంతే ఉండేలా చూసుకోవాలి. లోపించినా ప్రమాదమే; ఎక్కువైనా ప్రమాదమే కాబట్టి సమంగా ఉండేలా చూసుకోవాలి. చదవండి: Vitamin D Deficiency: విటమిన్- డి.. ఆ హార్మోన్ ఉత్పత్తికి ఇది అవసరం! Vitamin C Deficiency: విటమిన్ ‘సి’ లోపిస్తే అంతే సంగతులు.. ఇవి తింటే మేలు! -
Beauty Tips: క్యాబేజీ పేస్టు.. ముఖంపై మృతకణాలు తొలగిపోయి..
మన దగ్గర క్యాబేజీని తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ ఇతర ప్రపంచ దేశాల్లో ప్రతి సలాడ్లోనూ క్యాబేజీ తప్పక ఉండాల్సిందే. ఇందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలే ఇందుకు కారణం. క్యాబేజీలో విటమిన్ ‘సి’ అధికం. పీచు పదార్థాలు కూడా అధికం. వీటితో పాటు బీటా కెరోటిన్, విటమిన్ కే, అయోడిన్, పొటాషియం, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. క్యాలరీలు మాత్రం తక్కువ. అయితే క్యాబేజీలో కేవలం ఆరోగ్య లాభాలు మాత్రమే కాదు.. చర్మ సౌందర్యాన్ని పెంపొందించే గుణాలు కూడా ఉన్నాయి. దీనిని పలు బ్యూటీ ట్రీట్మెంట్స్ లో మాత్రం విరివిగా ఉపయోగిస్తారు. అందమైన ముఖం కోసం.. ►తాజాగా ఉన్న క్యాబేజీ ఆకులను శుభ్రంగా కడిగి పేస్టులా రుబ్బుకోవాలి. ►మరిగించిన గ్రీన్ టీ నీళ్లను ఈ పేస్టులో కలిపి చల్లారిన తర్వాత ముఖానికి అప్లై చేయాలి. ►ఆరిన తరువాత చల్లటి నీటితో కడగాలి. ►జిడ్డుచర్మం ఉన్న వారు గోరువెచ్చని నీటితో కడగాలి. ►ముఖంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించి, నిగారింపునిస్తుంది. చదవండి: Groundnuts Health Benefits: ఉడకబెట్టిన పల్లీలు తినడం ఇష్టమా? ఇవి విడుదల చేసే సెరోటోనిన్ వల్ల.. Beauty Tips- Beetroot: ముఖం మీది మొటిమలు, మృత కణాలు ఇట్టే మాయం -
Health Tips: గుండెలో మంటా.. రాగిరొట్టెలు, క్యాబేజీ, ముల్లంగి తినకండి.. ఇంకా
ఇటీవల కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ఎక్కువమందిని ఇబ్బంది పెడుతున్న సమస్య గుండెలో మంట. తినే ఆహారాలు మెల్లగా లేదా కష్టంగా జీర్ణం అయ్యేవిగా వుంటే అవి గుండెలో మంటను కలిగిస్తాయి. ఒకోసారి చిన్నపాటి చాక్లెట్ లేదా ఐస్ క్రీమ్ వంటివి కూడా అజీర్ణం కలిగించవచ్చు. కొన్నిసార్లు ఆహారాలు తినవలసిన విధంగా తినకపోయినా అజీర్తి ఏర్పడుతుంది. కొన్ని ఆహారాలు కష్టంగా జీర్ణం అవటం, గుండె మంటను కలిగించటం చేస్తాయి. వాటిని పరిశీలిద్దాం. వేపుళ్లు నూనెలో వేయించిన ఆహారాలు కష్టంగా జీర్ణం అవుతాయి. బయట తినే బజ్జీల వంటివి వేయించేటపుడు, వారు చవకరకం నూనె లేదా బాగా మరిగిన నూనె అనేకమార్లు ఉపయోగిస్తారు. అది జీర్ణక్రియకు హాని కలిగిస్తుంది. మసాలా ఆహారాలు పచ్చి మిరపకాయలు, మిరియాల వంటివాటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. కనుక ఆరోగ్యానికి మంచివే. కాని అవి కూడా అజీర్ణం కలిగిస్తాయి. నాలిక మండించే ఈ ఆహారాలు మీ ఆహార గొట్టాన్ని కూడా మండించి గుండెమంట కలిగిస్తాయి. పాలలోని షుగర్ లాక్టోజ్ అనేది పాలలో వుండే ఒక రకమైన షుగర్. సాధారణంగా 70 శాతం మంది పెద్ద వారికి లాక్టోస్ సరిపడదు. ఎందుకంటే లాక్టోస్ జీర్ణం చేయగల ఎంజైములు వారిలో లేకపోవటం లేదా అతి తక్కువగా ఉత్పత్తి అవటం జరుగుతుంది. గింజ ధాన్యాలు పప్పులు, రాజ్మా, బీన్స్, గింజలు వంటివి పొట్టకు బరువే. వీటిలో కూడా ఆలిగో శాచురేట్స్ అనే పదార్థం వుంటుంది. సిట్రస్ పండ్ల రసాలు సిట్రస్ పండ్ల రసాలు కూడా అజీర్ణం కలిగిస్తాయి. ఆహార గొట్టం కణాలను ఇబ్బంది పెట్టి ఆహారం వెలుపలికి వచ్చేలా చేస్తాయి. వీటిని ఖాళీ పొట్టతో తీసుకోరాదు. రాగి అంబలి/ రాగి రొట్టెలు వీటిలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల కడుపులో బరువుగా అనిపిస్తుంది. ఈ ఆహారాలు కష్టంగా జీర్ణం అవుతాయి. అలాగని వాటిని తీసుకోవడం మానరాదు. ఎందుకంటే ఆరోగ్యానికి అవికూడా అవసరమే. అయితే, గుండెకు మంట కలుగకుండా వాటిని తక్కువ మొత్తాలలో తినాలి. క్యాబేజి, బ్రకోలి, ముల్లంగి వంటివి త్వరగా జీర్ణం కావు. వీటిలో ఆలిగో శాచురైడ్స్ అనే పదార్ధం వుంటుంది. ఈ రకమైన ఆహారాలను జీర్ణం చేయటానికి అవసరమైన ఎంజైమ్ మానవులలో వుండదు. అందుకని, ఈ ఆహారాలు తింటే అవి జీర్ణం కాకుండానే చిన్న పేగులలోకి వెళ్ళిపోతాయి. అక్కడ గ్యాస్ తయారై అజీర్ణ ఆహారంతో కూడి బాక్టీరియా బలపడుతుంది. చదవండి: Health Tips: వేరు శెనగలు, ఖర్జూరాలు, కిస్మిస్లు తరచుగా తింటే... -
ఘుమఘుమలాడే బెంగాలీ రొయ్యల ఇగురు, క్యాబేజీ చికెన్.. ఎలా వండాలంటే..
మన దగ్గర చాలా మంది క్యాబేజీ తినడానికి పెద్దగా ఆసక్తి కనబరచరు. కానీ ఇతర దేశాల్లో ప్రతి సలాడ్లోనూ క్యాబేజీ ఉండాల్సిందే. దీనిలో విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉంటుంది. నారింజ పండులోకంటే క్యాబేజీలోనే విటమిన్ సీ అధికంగా ఉంటుంది. పీచుకూడా ఎక్కువే. ఇవేగాక సల్ఫర్, మెగ్నీషియం, బీటా కెరోటిన్, విటమిన్ కే, అయోడిన్, పొటాషియం, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి సైతం ఇది మంచి ఆహారం. ఇన్ని ప్రయోజనాలు ఉన్న క్యాబేజీని రుచికరంగా ఎలా వండుకోవచ్చో చూద్దాం... కావల్సిన పదార్థాలు: రొయ్యలు – పావు కేజీ, ఆవ నూనె – నాలుగు టేబుల్ స్పూన్లు, బంగాళ దుంప – ఒకటి (ముక్కలుగా తరగాలి), బిర్యానీ ఆకు – ఒకటి, జీలకర్ర – టీస్పూను, ఉల్లిపాయ ముక్కలు – అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు – టేబుల్ స్పూను, పసుపు – టీస్పూను, కారం – రుచికి సరిపడా, టొమాటో – ఒకటి( సన్నగా తరగాలి), ఉప్పు – రుచికి సరిపడా, పంచదార – అర టీస్పూను, క్యాబేజీ తరుగు – నాలుగు కప్పులు ( ఉప్పునీళ్లల్లో అరగంటపాటు నానబెట్టుకోవాలి), గరం మసాలా పొడి – అరటీస్పూను. తయారీ విధారం: ►ముందుగా రొయ్యలను శుభ్రంగా కడిగి పసుపు, కొద్దిగా ఉప్ప వేసి కలిపి పదినిమిషాలపాటు నానబెట్టాలి. ►స్టవ్ మీద బాణలి పెట్టి అవనూనె వేసి వేడెక్కిన తరువాత నానబెట్టిన రొయ్యలు వేసి ఒక నిమిషంపాటు వేయించి పక్కన పెట్టుకోవాలి. ►బంగాళ దుంప ముక్కలు వేసి గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ►ఇదే పాన్‌లో జీలకర్ర, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ►ఉల్లిపాయ వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా నీళ్లు పోసి పచి్చవాసన పోయేంత వరకు వేయించాలి. ►ఇప్పుడు పసుపు, జీలకర్ర పొడి, కారం, టొమాటో తరుగు, కొద్దిగా నీళ్లు పోసి ఐదు నిమిషాల సేపు మగ్గనివ్వాలి. ►ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళ దుంప ముక్కలు, రొయ్యలు, నానబెట్టిన క్యాబేజీ, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపి మూతపెట్టి సన్నని మంటమీద ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించి, తరువాత గరం మసాలా పొడి చల్లితే బెంగాలీ రొయ్యల ఇగురు రెడీ. క్యాబేజీ చికెన్ ఎలా వండాలో తెలుసా! కావల్సిన పదార్థాలు: చికెన్ బ్రెస్ట్ ముక్కలు – అరకేజీ, ఉల్లిపాయ – ఒకటి (ముక్కలుగా తరగాలి), వెల్లుల్లి రెబ్బలు – మూడు (సన్నగా తురుముకోవాలి), ఆయిల్ – మూడు టేబుల్ స్పూన్లు, క్యాబేజీ తరుగు – ఐదు కప్పులు, ఎర్ర రంగు క్యాప్సికమ్ – ఒకటి( ముక్కలు చేయాలి), కొబ్బరి సాస్ – పావు కప్పు, తరిగిన అల్లం – అర టేబుల్ స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, మిరియాల పొడి – రెండు టీస్పూన్లు, స్రింగ్ ఆనియన్ తరుగు – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానం: ►ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడిక్కిన తరువాత వెల్లుల్లి తురుము, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ►తరువాత చికెన్ ముక్కలు వేసి గోల్డ్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించాలి. ►చికెన్ వేగాక క్యాబేజీ తరుగు, క్యాప్సికమ్ ముక్కలు, కొబ్బరి సాస్, అల్లం, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు మగ్గనిస్తే క్యాబేజీ చికెన్ రెడీ. -
ముఖంపై ముడతలు పోవాలంటే...
అరటిపండు సగ భాగం తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, క్యాబేజీ ఆకులు రెండు లేదా మూడు తీసుకుని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అరటిపండు గుజ్జు, క్యాబేజీ ఆకుల పేస్ట్ రెండింటిని కలిపి ఆ మిశ్రమంలో ఒక గుడ్డు తెల్ల సొన వేసి బాగా కలుపుకోవాలి. ఉదయం ముఖాన్ని చన్నీటితో శుభ్రం చేసుకుని, తయారుచేసుకున్న ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసుకోవాలి. అరగంటపాటు ప్యాక్‌ను ఆరనిచ్చి, నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా నెలరోజుల పాటు ప్రతిరోజూ చేస్తే ముఖంపై ఉన్న ముడతలు పోతాయి. తర్వాత ఇదే ప్యాక్‌ను నెలకు రెండుసార్లు వేసుకుంటే సరిపోతుంది. -
ఇంటిప్స్
►పప్పు తొందరగా ఉడకాలంటే ఉడికించేటప్పుడు కొద్దిగా డాల్టా లేదా నూనె వేయాలి. ►నిమ్మకాయ తొక్కలను పిండిన తర్వాత వాటిని కుకర్ అడుగున వేసి రుద్దితే నలుపు తగ్గుతుంది. దుర్వాసన దూరం అవుతుంది. ►పచ్చిమిరపకాయల తొడిమలను తీసి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే అవి త్వరగా పాడవవు. ►నూనె ఒలికితే ఆ ప్రాంతంలో కొద్దిగా మైదాపిండి చల్లాలి. పిండి నూనెను త్వరగా పీల్చేస్తుంది. ►క్యాబేజీ ఉడికించేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే చిన్న అల్లం ముక్క వేయాలి. ►కత్తిపీటకు ఉప్పు రాయడం వల్ల పదునుగా తయారవుతుంది. ►కందిపప్పు డబ్బాలో ఎండుకొబ్బరి చిప్ప వేసి నిల్వ ఉంచితే పప్పు త్వరగా పాడవదు. ►మిక్సీ, అవెన్, ఫ్రిజ్.. వంటి ఎలక్ట్రానిక్ వస్తువులపై భాగం జిడ్డుగా మారుతుంటుంది. ఇలాంటప్పుడు 4 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాలో టేబుల్ స్పూన్ వెచ్చని నీళ్లు కలిపి స్పాంజ్‌తో ముంచి, పిండి తుడవాలి. మురికి సులువుగా వదిలిపోతుంది. ►షూస్, స్నీకర్స్ లోపలి వైపు దుర్వాసన వస్తుంటుంది. కొద్దిగా బేకింగ్ సోడా లోపలి వైపు చల్లి, తడి క్లాత్‌తో తుడిస్తే దుర్వాసన రాదు. ►చెక్క ఫర్నీచర్ మీద మరకలు తొలగించాలంటే టూత్‌పేస్ట్ రాసి తర్వాత తడి క్లాత్‌తో తుడవాలి. ►పిల్లలు కలర్ పెన్సిళ్లతో గోడల మీద బొమ్మలు వేస్తుంటారు. ఈ మరకలు తొలగించాలంటే బేకింగ్ సోడా చల్లి, తడి స్పాంజ్‌తో తుడవాలి. ►నీళ్లలో కప్పు అమ్మోనియా కలిపి మెత్తని టర్కీ టవల్స్‌ను నానబెట్టాలి. అరగంట తర్వాత ఉతికితే మురికిపోతుంది. ►వేడి నీళ్లలో రెండు చుక్కల నిమ్మరసం, చెంచా వంటసోడా, చిటికెడు ఉప్పు వేసి వాటర్ బాటిల్స్‌ను రెండు రోజుల కొకసారి శుభ్రపరిస్తే బాక్టీరియా దరిచేరదు. -
ఇంటిప్స్
►పాలు విరిగిపోతాయని అనుమానంగా ఉంటే కాచేటప్పుడు చిటికెడు వంటసోడా వేస్తే సరి. ►నెయ్యి కాచి దించేముందు కాసిని మెంతులు లేదా తమలపాకు వేస్తే సువాసనగా ఉండటంతోపాటు నెయ్యి ఎక్కువ కాలం నిల్వ ఉన్నా, తాజాగా ఉంటుంది. ►ఇంటికి అతిథులు వచ్చారు. ఆధరువులన్నీ వడ్డించారు కానీ, సమయానికి మజ్జిగ సరిపోవని అనుమానం వచ్చిందనుకోండి, అప్పుడు కాసిని గోరువెచ్చటి పాలలో చిటికెడు ఉప్పు వేసి, నిమ్మ రసం పిండితే సరి. మజ్జిగలా తయారవుతుంది. ►కూరలో ఉప్పు ఎక్కువైందనుకోండి, కంగారు పడకండి, రెండు స్పూన్ల పాలమీగడ కలిపెయ్యండి... ఉప్పదనం కాస్తా పరారైపోయి, యమా టేస్టీగా తయారవుతుంది కూర. ►బెండకాయముక్కల్ని ముందుగా కాస్త వేయించి, ఆ తర్వాత ఉడకబెట్టి వండితే, జిగటగా ఉండకుండా, వేటికవి విడివిడిగా వస్తాయి ముక్కలు. ►క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటివి ఉడికించేటప్పుడు అదొకరకమైన వాసన వేస్తాయి. అలా వాసన రాకుండా ఉండాలంటే, చిన్న బ్రెడ్ ముక్క వేయాలి లేదా స్పూను పంచదార వేయాలి. ►పులిహోర చేసేటప్పుడు, అన్నం పొడపొడలాడుతూ రావాలంటే, అన్నం ఉడికేటప్పుడు కొన్ని చుక్కల నిమ్మరసం, ఒక స్పూను నూనె వేస్తే, అన్నం తెల్లగా మల్లెమొగ్గల్లా, పొడిపొడిగా వస్తుంది. -
హెల్దీ ట్రీట్
ఫ్రూట్ అండ్ లెట్యూస్ సలాడ్ కావలసినవి: లెట్యూస్ ఆకులు (దీనికి బదులుగా తరిగిన క్యాబేజీ ఆకులను వాడుకోవచ్చు) – 1 కప్పు బొప్పాయి ముక్కలు – అర కప్పు ద్రాక్ష – అర కప్పు ఆరెంజ్ తొనలు – అర కప్పు జామపండు ముక్కలు – అర కప్పు స్ట్రాబెర్రీలు – అర కప్పు పుచ్చకాయ ముక్కలు – అర కప్పు బాదం పప్పు పలుకులు – టేబుల్‌స్పూన్ డ్రెస్సింగ్కోసం... నిమ్మరసం – టేబుల్ స్పూన్ తేనె – 2 టేబుల్ స్పూన్లు ఎండుమిర్చి – 2 ఉప్పు – తగినంత తయారి: 1. డ్రెస్సింగ్ కోసం చెప్పిన పదార్థాలన్నీ ఒక పాత్రలో వేసి కలపాలి. 2. పండ్ల ముక్కలన్నీ ఒక పాత్రలో తీసుకుని, డ్రెస్సింగ్ మిశ్రమం వేసి కలపాలి. 3. సలాడ్ కప్పులో లెట్యూస్ ఆకులు వేసి, పైన డ్రెస్సింగ్ చేసిన పండ్లముక్కలను వేసి సర్వ్ చేయాలి. కప్పు సలాడ్‌లో పోషకాలు: క్యాలరీలు : 103కి.క్యా కొవ్వు : 2.5 గ్రా. పిండిపదార్థాలు : 18.7 గ్రా. విటమిన్ : 30.7 గ్రా. -
క్యాబేజీల మధ్యలో గంజాయి రవాణా
తూర్పుగోదావరి, రాజానగరం: పదమారో నంబరు జాతీయ రహదారిపై అక్రమంగా తరలిపోతున్న రూ.10.25 లక్షల విలువైన 205 కిలోల గంజాయిని రాజానగరం పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. సీఐ సురేష్‌బాబు, ఎస్సై జగన్మోహన్ల కథనం ప్రకారం.. విశాఖపట్నం నుంచి ముంబైకి ఐషర్ వ్యాన్‌లో క్యాబేజీ బస్తాలు రవాణా చేస్తున్నారు. వాటి మధ్య గంజాయి ఉంచి, పైకి క్యాబేజీ బస్తాలుగా చూపిస్తూ తరలిస్తున్నారు. రాజానగరం సమీపాన కలవచర్ల జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై స్థానిక పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో దీనిని పట్టుకున్నారు. గంజాయి రవాణాకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన దేవదాసు లడ్డూ, దిలీప్‌సింగ్ పరదేశి, బేల్ధార్, అంబుదాస్ కచ్చిరు, సురేష్ కచ్చిరు, అనాబక్రీ, ఏక్‌నాథ్‌లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.25 వేల నగదు, 9 సెల్ఫోన్లు, కారు, క్యాబేజీల్లో గంజాయితో ఉన్న ఐషర్ వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కళ్ల కింద నలుపు తగ్గాలంటే...
మానసిక ఒత్తిడి, నిద్రలేమి, పోషకాహార లోపం వల్ల కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడతాయి. ఇవి ముఖ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. కళ్ల కింద నలుపు తగ్గాలంటే... అర టీ స్పూన్ బాదంపప్పు పొడి, కొద్దిగా గంధం పొడి, అర టీ స్పూన్ బంగాళదుంప రసం, పది చుక్కల నిమ్మరసం కలిపి కళ్ల కింద నల్లని వలయాలున్నచోట మృదువుగా రాయాలి. పదినిమిషాలు కళ్లుమూసుకొని, విశ్రాంతి తీసుకొని, తర్వాత చల్లని నీళ్లతో శుభ్రపరచాలి. రోజు విడిచి రోజు ఇలా చేయడం వల్ల నల్లని వలయాలు తగ్గుతాయి. గింజలేని ద్రాక్షపండ్లను సగానికి కట్ చేసి, నలుపుదనం ఉన్నచోట ఉంచి, పది నిమిషాలు ఉంచి తర్వాత శుభ్రపరుచుకోవాలి. టీ స్పూన్ తేనెలో 2–3 కుంకుమపువ్వు రేకలు కలిపిన మిశ్రమాన్ని నల్లనివలయాలు, మచ్చలు ఉన్న చోట రాస్తే నలుపు తగ్గి, ముఖ కాంతి పెరుగుతుంది.రాత్రి పడుకునే ముందు క్యాబేజీని ఉడికించిన నీళ్లను చల్లార్చి ఆ నీటిని దూది ఉండతో కళ్లకిందా, ముఖమంతా రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత ముఖం శుభ్రపరుచుకోవాలి. రోజూ ఈ విధంగా చేస్తూ ఉంటే నల్లని వలయాలు తగ్గుముఖం పడతాయి. ముఖకాంతి పెరుగుతుంది. -
చల్లాడ్స్
కట్ చేయండి... ఎండను తగ్గించండి... కలపండి... ఎండను తొలగించండి... ఫ్రిజ్‌లో పెట్టండి... ఎండను చల్లబరచండి... ఆరగించండి... ఎండను తరిమికొట్టండి... ఎండలకు సలాడ్‌తో జవాబు చెప్పండి... క్యాబేజీ, బీన్స్, రైస్, ఎగ్ ... కాదేదీ సలాడ్కనర్హం... ఆరోగ్యమూ చల్లదనమూ వీటి సొంతం! చికెన్ సలాడ్ విత్ చౌ మే నూడుల్స్ కావలసినవి: డ్రెసింగ్ కోసం: బ్రౌన్ సుగర్ – 2 టేబుల్ స్పూన్లు, సోయా సాస్ – 2 టీ స్పూన్లు, కమలాపండు రసం – 2 టీ స్పూన్లు, నువ్వుల నూనె – 4 టీ స్పూన్లు, వెజిటబుల్ ఆయిల్ – పావు కప్పు, వెనిగర్ – 3 టేబుల్‌స్పూన్లు సలాడ్ కోసం: లెట్యూస్ ఆకు – ఒకటి (చిన్నది, సన్నగా తరగాలి. ఈ ఆకు దొరకని చోట క్యాబేజీ తరుగు ఉపయోగించుకోవచ్చు), ఉడికించిన బోన్ లెస్ చికెన్ బ్రెస్ట్ – 4 ముక్కలు, ఉల్లికాడల తరుగు – 2 టేబుల్ స్పూన్లు, క్యారట్ తురుము – అర కప్పు, నూడుల్స్ – 2 కప్పులు (ఉడికించకూడదు), పల్లీలు – అర కప్పు (చిన్న చిన్న ముక్కలు చేయాలి), కమలా పండు తొనలు – 10 తయారీ: ∙డ్రెస్సింగ్ కోసం తీసుకున్న పదార్థాలను ఒక పాత్రలో వేసి బాగా కలిపి సుమారు గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీసేయాలి ∙ఒక పెద్ద పాత్రలో, లెట్యూస్ లేదా క్యాబేజీ తరుగు, చికెన్, ఉల్లికాడల తరుగు, డ్రై నూడుల్స్, క్యారట్ తురుము, పల్లీ ముక్కలు వేసి బాగా కలిపి, డ్రెసింగ్ వస్తువులు వేసిన పాత్రలో వేసి కలపాలి ∙కమలా పండు తొనలతో అలంకరించి, వెంటనే అందించాలి. గ్రీక్ రైస్ సలాడ్ కావలసినవి: అన్నం – 3 కప్పులు, పుట్ట గొడుగులు – కప్పు (గంటసేపు నీళ్లలో నానబెట్టి, నీరు ఒంపేసి చిన్న చిన్న ముక్కలు చేయాలి), టొమాటో – 1 (ముక్కలు చేయాలి), కీర దోస చక్రాలు – అర కప్పు, ఉల్లి తరుగు – పావు కప్పు, చీజ్ – పావు కప్పు, నిమ్మ రసం – ఒక టేబుల్ స్పూను, మిరియాల పొడి – అర టీ స్పూను తయారీ: ∙ఒక పాత్రలో అన్నం, మిగిలిన పదార్థాలు వేసి బాగా కలిపి మూత పెట్టి, ఫ్రిజ్‌లో సుమారు గంటసేపు ఉంచి తీసేయాలి ∙బౌల్స్‌లో సర్వ్ చేసే ముందు, కొద్దిగా కొత్తిమీర వేసి అందించాలి. క్యాబేజీ సలాడ్ విత్ ఎ క్రంచ్ కావలసినవి: క్యాబేజీ తరుగు – ఒక కప్పు, ఆలివ్ ఆయిల్ – 2 టేబుల్ స్పూన్లు, నూడుల్స్ – ఒక ప్యాకెట్, నువ్వులు – ఒక టేబుల్ స్పూను, వెల్లుల్లి రెబ్బలు – 4 (మెత్తగా చేయాలి), బాదం పప్పులు – అర కప్పు (చిన్న చిన్న ముక్కలు చేయాలి)డ్రెసింగ్ కోసంసోయా సాస్ – 2 టేబుల్ స్పూన్లు, వెనిగర్ – పావు కప్పు, పంచదార – అర కప్పు, రిఫైన్డ్ ఆయిల్ – పావు కప్పు, మిరియాల పొడి – పావు టీ స్పూను, అల్లం తురుము – పావు టీ స్పూను తయారీ: ∙పాన్‌ను స్టౌ మీద ఉంచి వేడయ్యాక సోయా సాస్, వెనిగర్, పంచదార, రిఫైన్డ్ ఆయిల్, మిరియాల పొడి, అల్లం తురుము వేసి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి ∙ చల్లారాక ఫ్రిజ్‌లో సుమారు రెండు గంటలు ఉంచాలి ∙ ఒక చిన్న బాణలి స్టౌ మీద ఉంచి వేడయ్యాక నూనె వేసి వేడయ్యాక నూడుల్స్, నువ్వులు, వెల్లుల్లి ముద్ద వేసి పదార్థాలన్నీ బంగారు రంగులోకి మారేవరకు కలిపి దింపేయాలి ∙ ఒక పెద్ద బౌల్లో నూడుల్స్ మిశ్రమం, క్యాబేజీ తరుగు వేసి కలపాలి ∙ ఫ్రిజ్‌లో నుంచి డ్రెసింగ్ మిశ్రమం బయటకు తీసి, ఈ మిశ్రమంలో వేసి బాగా కలిపి, బాదం పప్పులతో అలంకరించి చల్లగా అందించాలి. త్రీ బీన్ సలాడ్ కావలసినవి: నానబెట్టిన అలసందలు – ఒక కప్పు ; నానబెట్టిన చిక్కుడు గింజలు; – ఒక కప్పు ; నానబెట్టిన సెనగలు – ఒక కప్పు ; ఉల్లి తరుగు – అర కప్పు ; కొత్తిమీర తరుగు – ఒక కప్పు ; పంచదార – పావు కప్పు ; ఆలివ్ ఆయిల్ – 3 టేబుల్ స్పూన్లు ; ఉప్పు – ఒకటిన్నర టీ స్పూన్లు; నల్ల మిరియాలు – పావు టీ స్పూను; వెనిగర్ – 2 టీ స్పూన్లు తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో మూడు రకాల గింజలూ వేసి బాగా కలపాలి ∙ కొత్తిమీర తరుగు, ఉల్లి తరుగు జత చేసి బాగా కలపాలి ∙ వేరొక బౌల్లో వెనిగర్, పంచదార, ఆలివ్ ఆయిల్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి గింజలున్న బౌల్లో వేసి కలిపి, ఫ్రిజ్‌లో నాలుగైదు గంటలు ఉంచి, బయటకు తీసి, అందించాలి. సాల్మన్ ఎగ్ స్పెషల్ సలాడ్ కావలసినవి: సాల్మన్ చేప – 14 ముక్కలు (ఫోర్క్‌తో గాట్లు పెట్టి, నూనెలో వేయించాలి), ఉడికించిన కోడిగుడ్లు – 6 (పెంకు తీసి, కోడి గుడ్లను చిన్నచిన్న ముక్కులుగా చేయాలి), ఉల్లి తరుగు – అర కప్పు, ఆవాలు – ఒకటిన్నర స్పూన్లు (నీళ్లలో నానబెట్టి మెత్తగా పేస్ట్ చేయాలి), చీజ్ – అర కప్పు, మిరియాల పొడి – అర టీ స్పూను, మిరప పొడి – పావు టీ స్పూను, ఉప్పు – తగినంత తయారీ: పైన చెప్పిన పదార్థాలను ఒక బౌల్లో వేసి బాగా కలిపి, మూత పెట్టి, ఫ్రిజ్‌లో నాలుగైదు గంటలు ఉంచి, బయటకు తీసి చల్లగా అందించాలి. చపాతీ నూడుల్స్ ఈ రోజుల్లో పిల్లలు, పెద్దలు నూడుల్స్‌కి బాగా అలవాటు పడ్డారు. మైదాతో తయారయ్యే నూడుల్స్ ఆరోగ్యానికి మంచిది కాదు. వాటికి బదులుగా చపాతీలతో నూడుల్స్‌లా చేసి పెడితే, మళ్లీ మళ్లీ కావాలంటారు. కావలసిన వస్తువులు: చపాతీలు – 3, ఉల్లిపాయ – 1, పచ్చి మిర్చి – 2, క్యారట్ – 1, బీన్స్ – 8, అజినమోటో– చిటికెడు, పంచదార – ఒక టీ స్పూను, మిరియాలపొడి – ఒక టీ స్పూను, కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత, నూనె – 4 టీ స్పూన్లు ∙ఉల్లిపాయలను సన్నగా తరగాలి ∙క్యారట్, బీన్స్‌లను సన్నగా చీలికల్లాగా కట్ చేసుకోవాలి. ∙చపాతీలను కత్తెరతో సన్నగా నూడుల్స్‌లా కట్ చేయాలి ∙ప్యాన్ లో నూనె వేడి చేసి ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చి మిర్చి వేసి మెత్తబడేవరకు వేయించాలి ∙క్యారట్, బీన్స్, క్యాప్సికమ్ ముక్కలు వేసి కొద్దిసేపు వేయించాలి ∙పంచదార, అజినమోటో జత చేసి రెండు నిమిషాలు వేయించిన తర్వాత కట్ చేసుకున్న చపాతీ ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి ∙రెండు నిమిషాలు మగ్గిన తర్వాత దింపేసి, కొత్తిమీర చల్లి వేడిగా సర్వ్ చేయాలి. మైదాపిండితో దుష్ప్రభావాలు ఫుడ్ ఫ్యాక్ట్స్ సాధారణంగా బిస్కెట్లు, బ్రెడ్, కేకులు వంటి బేకరీ ఉత్పత్తులలో మైదాపిండిని ఎక్కువగా ఉపయోగిస్తారు. పిల్లలు ఎక్కువగా తినే పిజ్జా, పేస్ట్రీలు, బర్గర్లు, పరాఠాలు, నాన్, స్వీట్స్ వంటి వాటిలో సైతం మైదా వాడకం ఎక్కువే. మైదాపిండిని గోధుమల నుంచే తయారుచేస్తారని తెలుసా! గోధుమ పిండిని సన్నటి జల్లెడలో జల్లించితే వచ్చేదే మైదా పిండి. ఇంత ఎక్కువగా జల్లించడం వల్ల ఇందులో ఉండే పీచు పదార్థం, విటమిన్లు, ఖనిజాలు పూర్తిగా బయటకుపోతాయి. జల్లెడ పట్టిన పిండిని బెంజైల్ పెరాక్సైడ్ వంటి రసాయనాలతో బ్లీచింగ్ చేశాక, వచ్చిన మెత్తని పిండిని మైదాపిండిగా వాడుతుంటారు. ఇన్ని రకాలుగా ప్రోసెస్ చేయడం వల్ల ఈ పిండి మానవ ఆరోగ్యం మీద దుష్ప్రభావం చూపుతుంది. చెడు ప్రభావాలు... మైదా పిండిలో అత్యధికంగా గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. అందువల్ల ఈ పిండిని ఏ రూపంలో తిన్నా సుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగి, పాంక్రియాస్‌పై ఒత్తిడి పడుతుంది. చివరకు ఇది డయాబెటిస్‌కు దారి తీస్తుంది. శరీరంలోని కొవ్వు శాతం పెరిగి, ఊబకాయులవుతారు. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ అవుతాయి. గుండెకు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడతాయి. కోలన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. మలబద్దకం కలుగుతుంది. ఇన్ని చెడు ప్రభావాలు కలిగించే మైదాను వాడటం అవసరమా అని ఆలోచించుకోవాలి. మైదాకు బదులుగా... మైదాకు బదులుగా జొన్న, రాగి, వరి... ధాన్యాల నుంచి తయారయ్యే పిండిని వాడటం మంచిది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. వాల్ పోస్టర్లు అతికించడానికి, బట్టలకు గంజి పెట్టడానికి ఉపయోగించే మైదాను రోజువారీ ఆహారంలో నుంచి తొలగించడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంటి చిట్కాలు ఉసిరి పచ్చడి నల్లబడకుండా ఉండాలంటే, పచ్చడిలో తగినంత నిమ్మరసం కలిపితే సరి ∙దోస ఆవకాయ ఘాటుగా అనిపిస్తే, కొద్దిగా నిమ్మరసం పిండితే, ఘాటు కొంతవరకు తగ్గుతుంది ∙టొమాటో పప్పు చప్పగా అనిపిస్తే, టీ స్పూను నిమ్మరసం జత చేస్తే రుచిగా ఉంటుంది. మీ వంటలకు ఆహ్వానం మీరూ గొప్ప చెఫ్ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. మీరు చేసిన భిన్నమైన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జత చేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్... ఎవరైనా వంట చేసి లొట్టలేయించవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్కమ్. mail : familyvantakalu@gmail.com సేకరణ: వైజయంతి -
ఆరెంజ్‌లో కంటే ఎక్కువే!
క్యాబేజీ ఒక ఆరోగ్యకరమైన ఆకుకూరగా మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్సగా కూడా పనికి వస్తుంది. క్యాబేజీని ఆహారంలో తరచూ తీసుకునే వారిలో ఎన్నో రకాల జబ్బులు దూరం అవుతాయి. అంతేకాదు, ఎన్నో వ్యాధులను అవి రాకుండా కూడా క్యాబేజీ నివారిస్తుంది! క్యాబేజీతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని ఇవి. ♦ విటమిన్–సి ఎన్నో వ్యాధులను నివారిస్తుందన్నది తెలిసిందే. నమ్మడం ఒకింత కష్టంగానీ నిజానికి ఆరెంజ్‌లో కంటే క్యాబేజీలోనే విటమిన్–సి పాళ్లు ఎక్కువ. అది శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్ కూడా. అందుకే క్యాబేజీ ఎన్నో క్యాన్సర్లను నివారించడంతో పాటు, వయసు పెరుగుదలతో వచ్చే మార్పులను ఆలస్యం చేసి, దీర్ఘకాలం యౌవనంగా ఉండటానికి తోడ్పడుతుంది. ♦ క్రమం తప్పకుండా క్యాబేజీని ఆహారంలో తీసుకునేవారిలో అలర్జీలు, నొప్పి–మంట–వాపు (ఇన్ఫ్లమేషను) చాలా తక్కువ. క్యాబేజీలోని గ్లుటామైన్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ ఇందుకు కారణం. గాయాలు త్వరగా తగ్గేందుకూ క్యాబేజీ దోహదపడుతుంది. ♦ క్యాబేజీలోని బీటా–కెరటిన్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాదు... ఈ బీటా–కెరటిన్ వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా నివారితమవుతుంది. ♦ క్యాబేజీ వల్ల వెలువడే క్యాలరీలు చాలా తక్కువ. అందుకే స్థూలకాయులకు, బరువు పెరుగుతున్న వారికి ఇది మంచి ఆహారం. ♦ మెదడు ఆరోగ్యానికి, నరాల మీద ఉండే మైలీన్ షీత్ అనే పొర దెబ్బతినకుండా కాపాడటానికి క్యాబేజీ ఎంతగానో దోహదపడుతుంది. అలై్జమర్స్, డిమెన్షియా వ్యాధులను నివారిస్తుంది. ♦ క్యాబేజీలో... మిగతా పోషకాలతో పాటు క్యాల్షియమ్ కూడా ఎక్కువే. అందుకే ఇది ఎముక ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు ఎముకలు బలహీనంగా మారే ఆస్టియోపోరోసిస్ వంటి కండిషన్లను నివారిస్తుంది. ♦ క్యాబేజీ అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. అంతేకాదు... ఇది ఒంట్లోని విషాలను హరించే మంచి డీ–టాక్సిఫైయింగ్ ఏజెంట్. -
క్యాన్సర్లను నివారించే క్యాబేజీ
క్యాబేజీ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. దీనిలో పీచుపదార్థాలు (డయటరీ ఫైబర్) చాలా ఎక్కువ. అందుకే పేగులకు దీనివల్ల ఎంతో మేలు కలుగుతుంది. పేగుల్లో వచ్చే అల్సర్స్‌ని నివారిస్తుంది. ♦ క్యాబేజీలో విటమిన్ సి, థయోసయనేట్స్, ఇండోల్–3–కార్బినాల్, జియాగ్జాంథిన్, సల్ఫరోఫేన్, ఐసోథయోసయనేట్స్ వంటి శక్తిమంతమైన జీవరసాయనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతాకాదు. రొమ్ము, పెద్దపేగు, ప్రోస్టేట్ క్యాన్సర్లను నివారిస్తాయి. అంతేకాదు చెడుకొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను నిరోధించి గుండెకూ, రక్తనాళాలకు మేలు చేస్తాయి. ♦ క్యాబేజీలో విటమిన్ బి–కాంప్లెక్స్‌కు చెందిన పాంటథోనిక్ యాసిడ్ (విటమిన్–బి5), పైరిడాక్సిన్ (విటమిన్–బి6), థయామిన్ (విటమిన్–బి1) చాలా ఎక్కువ. ఇవన్నీ మంచి రోగనిరోధకశక్తిని ఇస్తాయి. ♦ క్యాబేజీలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇవి ఎముకల ఆరోగ్యానికి బాగా దోహదపడుతుంది. ♦ అలై్జమర్స్ వ్యాధిని క్యాబేజీ సమర్థంగా నివారిస్తుందని ఇటీవలి కొన్ని అధ్యయనాల్లో తేలింది. ♦ క్యాబేజీలో ఫోలేట్, పొటాషియమ్, మ్యాంగనీస్, విటమిన్ ఏ, థయాబిన్, క్యాల్షియమ్, ఐరన్, మెగ్నీషియమ్... వంటి పోషకాలన్నీ ఎక్కువ. అందుకే దీన్ని సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేసే ఆహారంగా చెప్పుకోవచ్చు. ♦ క్యాబేజీ మలబద్దకం సమస్యను సమర్థంగా దూరం చేస్తుంది. ♦ క్యాబేజీలోని విలువైన ఫైటో కెమికల్స్ అనేక రకాల క్యాన్సర్ల నుంచి రక్షిస్తాయి. ♦ దీని నుంచి వెలువడే క్యాలరీలు చాలా తక్కువ. అందుకే స్థూలకాయులకు, బరువు తగ్గాలనుకున్న వారికి ఇది మంచి ఆహారం. -
ఇన్‌టిప్స్
పాలు విరిగిపోతాయని అనుమానంగా ఉంటే కాచేటప్పుడు చిటికెడు వంటసోడా వేస్తే సరి. నెయ్యి కాచి దించేముందు కాసిని మెంతులు లేదా ఓ తమలపాకు వేస్తే సువాసనగా ఉండటంతోపాటు నెయ్యి ఎక్కువ కాలం నిల్వ ఉన్నా, తాజాగా ఉంటుంది. ఇంటికి అతిథులు వచ్చారు. ఆధరువులన్నీ వడ్డించారు కానీ, సమయానికి మజ్జిగ సరిపోవని అనుమానం వచ్చిందనుకోండి, అప్పుడు కాసిని గోరువెచ్చటి పాలలో చిటికెడు ఉప్పు వేసి, నిమ్మ రసం పిండితే సరి. మజ్జిగలా తయారవుతుంది. కూరలో ఉప్పు ఎక్కువైందనుకోండి, కంగారు పడకండి, రెండు స్పూన్ల పాలమీగడ కలిపెయ్యండి... ఉప్పదనం కాస్తా పరారైపోయి, యమా టేస్టీగా తయారవుతుంది కూర. బెండకాయముక్కల్ని ముందుగా కాస్త వేయించి, ఆ తర్వాత ఉడకబెట్టి వండితే, జిగటగా ఉండకుండా, వేటికవి విడివిడిగా వస్తాయి ముక్కలు.క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటివి ఉడికించేటప్పుడు అదొకరకమైన వాసన వేస్తాయి. అలా వాసన రాకుండా ఉండాలంటే, చిన్న బ్రెడ్ ముక్క వేయాలి లేదా స్పూను పంచదార వేయాలి. పులిహోర చేసేటప్పుడు, అన్నం పొడపొడలాడుతూ రావాలంటే, అన్నం ఉడికేటప్పుడు కొన్ని చుక్కల నిమ్మరసం, ఒక స్పూను నూనె వేస్తే సరి... అన్నం తెల్లగా మల్లెమొగ్గల్లా, పొడిపొడిగా వస్తుంది. -
అల్సర్స్‌ను దూరం చేస్తుంది
ఉడికించేటప్పుడు కాస్తంత వాసన వేస్తుంది కానీ, క్యాబేజీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో పీచుపదార్థాలు (డయటరీ ఫైబర్) చాలా ఎక్కువ. అందుకే పేగులకు దీనివల్ల ఎంతో మేలు. క్యాబేజీని క్రమం తప్పకుండా తినేవారిలో పేగుల్లో అల్సర్స్ నివారితమవుతాయి. ముఖ్యంగా ఇది పెద్ద పేగు ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది.మలబద్దకం సమస్య నుంచి విముక్తి పొందడానికి క్యాబేజీ చాలా నమ్మకమైన ఆహార పదార్థం.క్యాబేజీలో విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, పొటాషియమ్, మ్యాంగనీస్, విటమిన్ ఏ, థయాబిన్, క్యాల్షియమ్, ఐరన్, మెగ్నీషియమ్... వంటి పోషకాలన్నీ ఎక్కువ. అందుకే ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేసే ఆహారంగా దీన్ని పేర్కొంటారు. క్యాబేజీలోని విలువైన ఫైటో కెమికల్స్ అనేక రకాల క్యాన్సర్ల నుంచి రక్షిస్తాయి.దీని నుంచి వెలువడే క్యాలరీలు చాలా తక్కువ. దాదాపు 100 గ్రాముల క్యాబేజీ నుంచి కేవలం 15 క్యాలరీల శక్తి మాత్రమే లభ్యమవుతుంది. అందుకే స్థూలకాయులు, బరువు పెరుగుతున్న వారికి ఇది మంచి ఆహారం. బరువు తగ్గాలనుకునేవారు రోజూ ఒక గ్లాసు క్యాబేజీ జ్యూస్ తీసుకోవడం వల్ల త్వరలోనే ఫలితం కనిపిస్తుంది. -
క్యాబేజీ కర్రీ విత్ స్నేక్
ఇండోర్: మొన్న తెలంగాణాలో పొరపాటున పాముతో పాటు టమాటా పచ్చడి నూరిన ఘటన లాంటిదే మరో ఉదంతం మధ్యప్రదేశ్‌లో ఓ తల్లీ కూతుళ్ల ప్రాణాల మీదకు తెచ్చింది. అయితే ఈసారి క్యాబేజీ కూర తోపాటు పొరపాటున పాము పిల్లకూడా ఉడికింది. దీంతో ఈ కూరను తిన్న తల్లీకూతుళ్లు తీవ్ర అస్వస్తతకు లోనయ్యారు. ఇండోర్‌లో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అఫ్‌జాన్ ఇమామ్ (36) , ఆమె కుమార్తె ఆమ్నా (15) క్యాబేజీ కూర చేసుకుని తిన్నారు. అకస్మాత్తుగా చేదుగా అనిపించడంతోపాటు వెంటనే వాంతులు మొదలయ్యాయి. దీంతో అనుమానం వచ్చిన అఫ్‌జాన్ వండిన కూరను పరిశీలించింది. ఇంకేముంది ఆ కూరలో పాము ముక్కలు కనిపించడంతో ఇద్దరూ బేలెత్తిపోయారు. వెంటనే వారిని బంధువులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. పాము విషం మనిషి రక్తంలో సమ్మిళితమై, బాడీ అంతా పాకినపుడు ప్రమాదకరంగా మారుతుందనీ, రెండు రోజుల పాటు రోగుల పరిస్థితిని తాము పర్యవేక్షిస్తామని ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ధర్మేంద్ర జన్వర్ చెప్పారు. దీని మూలంగా వారి శరీర కణజాలాలకు ఎటువంటి హాని కలిగిందో తెలుసుకోవడానికి వివిధ రకాల పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. -
మెడకు స్టీమ్.. ముఖానికి క్యాబేజీ...
బ్యూటిప్స్ మెడ నల్లగా ఉందని ఎంతోమంది బాధపడుతుంటారు. కొంతమంది స్నానం చేస్తున్నప్పుడు మాత్రమే మెడ కడుక్కుంటారు. అలా కాకుండా రోజు కచ్చితంగా రెండుసార్లు సబ్బుతో మెడను శుభ్రం చేసుకోవాలి. అంతేకాకుండా వారానికి మూడుసార్లు పాటించాల్సిన చిట్కా ఒకటుంది. వేడి వేడి నీళ్లలో ఒక టవల్‌ను ముంచాలి. కొద్దిగా ఆ టవల్‌ను పిండి మెడపై నల్లగా ఉన్న ప్రాంతంలో బాగా రుద్దాలి. అలా చేస్తే మెడకు స్టీమ్ అందడంతో క్రమంగా నలుపు రంగు పోతుంది. అంతేకాకండా ఈ చిట్కాతో మెడ దగ్గర ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది. ముఖంపై చర్మం లూజ్‌గా ఉండటం వల్ల కొందరు తక్కువ వయసులోనే పెద్దవాళ్లలా కనిపిస్తారు. అందుకు స్కిన్ టైటనింగ్ చిట్కా పాటిస్తే సరి. ముందుగా క్యాబేజీని మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో కొద్దిగా బియ్యం పిండి, గుడ్డు తెల్లసొన వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని వారానికి ఒకసారి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఓ 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. క్యాబేజీలోని విటమిన్–ఏ,బి, పొటాషియం, పాస్పరస్ల ప్రభావం వల్ల చర్మం లూజ్‌గా అయ్యే అవకాశాలు తగ్గుతాయి.. -
పేగులు క్లీన్ అవుతాయి
గుడ్‌ఫుడ్ క్యాబేజీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో పీచుపదార్థాలు (డైటరీ ఫైబర్) చాలా ఎక్కువ. అందుకే పేగులకు ఎంతో మేలు. క్యాబేజీని క్రమం తప్పకుండా తినేవారిలో పేగుల్లో అల్సర్, క్యాన్సర్లు నివారితమవుతాయి. మరీ ముఖ్యంగా పెద్ద పేగు ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది. మలబద్దకం సమస్య నుంచి విముక్తి పొందడానికి క్యాబేజీ చాలా నమ్మకమైన ఆహార పదార్థం. క్యాబేజీలో విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, పొటాషియమ్, మ్యాంగనీస్, విటమిన్ ఏ, థయామిన్, క్యాల్షియమ్, ఐరన్, మెగ్నీషియమ్... వంటి పోషకాలన్నీ ఎక్కువ. అందుకే ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేసే ఆహారంగా దీన్ని పేర్కొంటారు.క్యాబేజీలోని విలువైన ఫైటో కెమికల్స్ అనేక రకాల క్యాన్సర్ల నుంచి రక్షిస్తాయి.ఇది ఇచ్చే శక్తి చాలా తక్కువ. వందగ్రాముల క్యాబేజీ నుంచి కేవలం 15 క్యాలరీల శక్తి మాత్రమే లభ్యమవుతుంది.అందుకే స్థూలకాయులకు, బరువు పెరుగుతున్న వారికి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం.