cable operators
-
ఏపీలో ఆ చానళ్ల ప్రసారాలు వెంటనే పునరుద్ధరించండి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో నిలిపివేసిన చానళ్ల ప్రసారాలను తక్షణమే పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. జూన్ 6 నుంచి ఏపీలో సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10టీవీ ప్రసారాలను నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ మిని పుష్కర్ణ మంగళవారం విచారించారు. ఆయా చానళ్లను పునరుద్ధరించాలని కేబుల్ ఆపరేటర్లను ఆదేశించారు. లిఖితపూర్వక ఆదేశాలు ఇంకా వెబ్సైట్లో పొందుపరచాల్సి ఉంది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయంపై న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ (ఎన్బీఎఫ్) హర్షం వ్యక్తం చేసింది. ఏపీలో ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా తీసుకొన్న నిర్ణయంపై కొరడా లాంటి ఆదేశాలుగా అభివరి్ణంచింది. ‘ప్రజాస్వామ్య పనితీరుకు అవసరమైన బహిరంగ, పారదర్శక మీడియా వాతావరణాన్ని నిర్వహించే ప్రాముఖ్యతను హైకోర్టు జోక్యం నొక్కి చెబుతోంది. ఈ తీర్పు పత్రికా స్వేచ్ఛను సమరి్థంచడం, జర్నలిస్టుల హక్కులను పరిరక్షించడంపై ఓ ఉదాహరణగా నిలుస్తుంది’ అని మంగళవారం ఎన్బీఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. -
న్యూస్ చానళ్లపై నిషేధం ఎత్తేయాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగు న్యూస్ చానళ్లపై మల్టిపుల్ సిస్టమ్ ఆపరేటర్లు (ఎంఎస్‌వోలు) విధించిన అప్రకటిత ఆంక్షలను అంతర్జాతీయ సంస్థలు తప్పుపడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉన్న ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్‌జే) ఈ అప్రకటిత నిషేధం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందన్నారు.రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగిందని, ప్రసారాలు తిరిగి పునరుద్ధరించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బ్రస్సెల్ కేంద్రంగా ఉన్న ఆ సంస్థ సూచించిందని వెల్లడించారు. న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అథారిటీ (ఎన్బీడీఏ) కూడా ఈ అప్రకటిత నిషేధాన్ని ఖండించిందని తెలిపారు. కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి ప్రసారాలు నిలిపివేయడం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిబంధనలకు విరుద్ధమని చెప్పిందన్నారు.రాష్ట్రంలోని పాలకులు ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ చర్యల కారణంగా అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ఇమేజ్ దెబ్బతిందని కృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణలో కొన్ని న్యూస్ చానళ్ల ప్రసారాలను అక్కడి కేబుల్ ఆపరేటర్లు నిలిపివేయడాన్ని చంద్రబాబు తప్పుపట్టారన్నారు. ఆ తప్పు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంటే ఆయన తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ఉత్తరప్రదేశ్ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) (ఎ), 19(1) (జి) భావ ప్రకటనా స్వేచ్ఛకు హామీ ఇస్తోందని చెప్పిందని గుర్తు చేశారు. ప్రజాహితానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడానికి , తెలుసుకోవడానికి కూడా ఆ ఆర్టికల్ హామీ ఇస్తోందని తెలిపారు. కాబట్టి సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10టీవీలపై విధించిన అప్రకటిత నిషేధాన్ని వెంటనే తొలగించాలని కోరారు. -
‘సాక్షి’ టీవీ ప్రసారాల నిలిపివేత రాజ్యాంగ ఉల్లంఘనే: ఎన్బీడీఏ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడంపై ‘బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్’ (ఎన్బీడీఏ) ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సాక్షి టీవీతోపాటు మరో మూడు ఛానళ్ల ప్రసారాలనూ ఏపీలోని కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ నిలిపివేయడానికి సరైన కారణాలు చూపకపోవడం ట్రాయ్ నిబంధనలకు విరుద్ధమని ఎన్బీడీఏ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్బీడీఏ సోమవారం(జూన్24) మీడియా ప్రకటన విడుదల చేసింది.మీడియాతో పాటు ప్రజల ప్రయోజనాలకు భంగం..ఏపీలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన టీడీపీపై విమర్శనాత్మక కథనాలు ప్రసారం చేయడం వల్లనే ఆయా టీవీ ఛానళ్ల ప్రసారాలు నిలిపివేసినట్లు చెబుతున్నారని, కొందరు కేబుల్ టీవీ ఆపరేటర్లు తీసుకున్న ఈ చర్యలు బ్రాడ్కాస్టర్లు, మీడియా, ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందని ప్రకటించింది. కొన్ని టీవీ ఛానళ్ల ప్రసారాలు ఆపడం ప్రమాదకరమైన సంకేతాలు పంపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే..ఛానెళ్లలో ఎలాంటివి ప్రసారం చేయాలన్నది బ్రాడ్కాస్టర్ల ఇష్టమన్నది రాజకీయ పార్టీలు గుర్తించాలని, మీడియా స్వేచ్ఛలో ఎవరూ జోక్యం చేసుకోకూడదని స్పష్టంగా పేర్కొంది. ఇతరుల జోక్యంతో మీడియా తన స్వతంత్రతను కోల్పోయే పరిస్థితి కల్పిస్తుందని తెలిపింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ), ఆర్టికల్ 19(1)(జీ)లను ఉల్లంఘించినట్లేనని స్పష్టం చేసింది. మీడియా స్వేచ్ఛపై ప్రభావం..ఛానళ్లపై నిషేధం సరైన పద్ధతి కాదని,మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించేదని ఎన్బీడీఏ పునరుద్ఘాటించింది. ఏకపక్ష నిర్ణయాలు బ్రాడ్కాస్టర్ల వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీస్తాయని, వ్యూయర్షిప్పై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించింది. ఇది చివరికి ఛానళ్ల రేటింగ్ తద్వారా ఆదాయంపైనా ప్రభావం చూపుతుందని వివరించింది. ప్రభుత్వానిదే బాధ్యత..దీర్ఘకాలంలో బ్రాడ్కాస్టర్లు, ప్రకటనకర్తల మధ్య సంబంధాలు దెబ్బతినేందుకు చర్యలు కారణమవుతాయని తెలిపింది. ఏపీలో మీడియా స్వతంత్రంగా, స్వేచ్ఛగా వ్యవహరించేలా కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎన్బీడీఏ అభ్యర్థించింది. ఇతరుల జోక్యం ఏమాత్రం లేకుండా మీడియా తమ కార్యకలాపాలు నిర్వహించుకునేలా చూడాలని కోరింది.సమాచారం పొందడం ప్రజల హక్కు..ప్రజాస్వామ్య వ్యవస్థలో వేర్వేరు మార్గాల ద్వారా సమాచారం పొందే హక్కు ప్రజల మౌలిక హక్కు అని, మీడియా నోరు నొక్కేందుకు చేసే ఏ ప్రయత్నాన్ని అయినా వెంటనే అడ్డుకోవాలని సూచించింది. సాక్షి టీవీతోపాటు మరో మూడు ఛానళ్ల ప్రసారాలను నిలిపి వేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని, కొందరు కేబుల్ ఆపరేటర్లు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే సమీక్షించి ఘర్షణ పూర్వక పరిస్థితిని నివారించాలని ఎన్బీడీఏ కోరింది. -
కేబుల్ ఆపరేటర్లు, బ్రాడ్‌కాస్టర్స్ మధ్య ముగిసిన వివాదం
న్యూఢిల్లీ: కొత్త టారిఫ్ ఆర్డరుపై (ఎన్టీవో) బ్రాడ్కాస్టర్లు, లోకల్ కేబుల్/మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్ మధ్య వివాదం మొత్తానికి ఓ కొలిక్కి వచ్చింది. కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసేందుకు ఆపరేటర్లు అంగీకరించారు. దీంతో బ్రాడ్కాస్టర్లు శుక్రవారం తిరిగి చానల్స్ కనెక్షన్లను పునరుద్ధరించినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. రేట్లను పెంచుతూ రూపొందించిన ఒప్పందాలను కుదుర్చుకోని కేబుల్ ఆపరేటర్లకు డిస్నీ స్టార్, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా ఫీడ్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కొత్త ఎన్టీవో ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చింది. అంతక్రితమే ఫిబ్రవరి 15లోగా కొత్త ఒప్పందంపై సంతకాలు చేయాల్సిందిగా బ్రాడ్‌కాస్టర్స్ నోటీసులు ఇచ్చారు. కానీ ఆలిండియా రేట్లను 18–35 శాతం మేర పెంచేశాయంటూ డిజిటల్ కేబుల్ ఫెడరేషన్ (ఏఐడీసీఎఫ్) సభ్యులు నిరాకరించడంతో బ్రాడ్కాస్టర్లు సిగ్నల్స్‌ను నిలిపివేశాయి. -
కేబుల్ ఆపరేటర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
-
కేబుల్ ఆపరేటర్లకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
సాక్షి, విజయవాడ: కేబుల్ టీవీ ఆపరేటర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆపరేటర్లకు భారంగా మారిన పోల్ టాక్స్‌ను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతంరెడ్డి చెప్పారు. చదవండి: దేశంలోనే అత్యంత పిరికి సన్నాసి.. ఎవరో చెప్పిన కొడాలి నాని గతంలో పాదయాత్ర సందర్భంగా అనేకమంది కేబుల్ ఆపరేటర్లు తమకు పోల్ టాక్స్ వలన ఇబ్బందులు వస్తున్నాయంటూ జగన్ దృష్టికి తెచ్చారనీ, దీనిపై స్పందించిన సీఎం ఆ టాక్సును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. త్వరలోనే ఏపీఎస్ఎఫ్ఎల్ ఆధ్వర్యంలో టీవీ ఛానల్‌ను కూడా తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈ ఛానల్ ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. -
ఏ ఆపరేటర్‌కైనా అదే సెట్‌టాప్ బాక్సు
న్యూఢిల్లీ: డీటీహెచ్ సంస్థలు తమ వినియోగదారులకు ఇచ్చే సెట్‌టాప్ బాక్సులు... ఒక ఆపరేటర్ నుంచి వేరొక ఆపరేటర్‌కు మారినా సరే ఉపయోగపడేటట్లు ఉండాలని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) స్పష్టం చేసింది. ఇలాంటి బాక్సులనే వినియోగదార్లకు ఇవ్వాల్సిందిగా కంపెనీలను ఆదేశించాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు సూచించింది. అంటే వినియోగదారుడు ఆపరేటర్‌ను మార్చాలని భావించినా (డీటీహెచ్ పోర్టబిలిటీ) సెట్‌టాప్ బాక్సు మాత్రం మార్చాల్సిన పని ఉండదు. ఈ సెట్‌టాప్ బాక్సులన్నీ యూఎస్బీ ఆధారిత కనెక్షన్‌తో పనిచేసేలా ఉండాలని కూడా ట్రాయ్ స్పష్టంచేసింది. ఈ మేరకు కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ మార్గదర్శకాలను సవరించాలని కూడా ట్రాయ్ సూచించింది. ఈ మార్పులను అమలు చేసేందుకు డీటీహెచ్ కంపెనీలకు 6 నెలల గడువివ్వాలని ట్రాయ్ పేర్కొంది. దీనికోసం ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ట్రాయ్, భారత ప్రమాణాల సంస్థ(బీఎస్ఐ), టీవీ ఉత్పత్తిదారులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రిత్వ శాఖను కోరింది. ప్రతిపాదిత ప్రమాణాలను డీటీహెచ్, కేబుల్ టీవీ విభాగాలు అమలు చేస్తున్నదీ లేనిదీ ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. -
‘మా ఆవేదన ప్రభుత్వానికి తెలియాలనే’
సాక్షి, విజయవాడ : ట్రాయ్ అసంబద్ధ విధానాలు ఆపరేటర్ల ఉనికే ప్రశ్నర్థకం చేసేలా ఉన్నాయని, తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలపాలనే నిరసన దీక్ష చేపట్టినట్లు కేబుల్ ఆపరేటర్లు, మల్టీ సర్వీసెస్ సంఘం తెలుగు రాష్ట్రాల కన్వీనర్ సురేష్ తెలిపారు. బుధవారం కేబుల్ రంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. ధర్నాచౌక్‌లో చేపట్టిన నిరసన దీక్షలో 13 జిల్లాల కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల కేబుల్ ఆపరేటర్లు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పే ఛానల్ యాజమాన్యంపై అవలంభిస్తున్న వైఖరి దారుణమన్నారు. -
పోరుబాటలో కేబుల్ ఆపరేటర్లు
ఏలూరు (టూటౌన్): ట్రాయ్ నిబంధనలు, జీఎస్టీ పేరుతో ప్రజలపై పడుతున్న కేబుల్ చార్జీలను ఉపసంహరించాలని కోరుతూ జిల్లాలోని కేబుల్ ఆపరేటర్లు పోరుబాట పట్టారు. ఇప్పటికే పలు దఫాలుగా తమ నిరసనను వివిధ రూపాల్లో తెలియజేసిన ఆపరేటర్లు మరోసారి ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి నుంచి ట్రాయ్ నిబంధనలు అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయడంపై జిల్లాలోని కేబుల్ ఆపరేటర్లు మండిపడుతున్నారు. కాకులను కొట్టి గద్దలకు పెట్టిన చందంగా చిన్న చిన్న కేబుల్ ఆపరేటర్లను కొట్టి బడా కంపెనీలకు దోచి పెట్టేవిధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. సర్వత్రా నిరసన కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఈ నిబంధనలు ఉపసంహరించుకునేలా చేయాలని వీరు కోరుతున్నారు. ఇప్పటికే సినిమాలు భారమై సగటు ప్రజలు వెళ్లలేని పరిస్థితుల్లో ఉండగా తాజా చర్యలు మూలంగా బుల్లి తెర వినోదం సైతం ప్రజలకు భారంగా మారనుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ట్రాయ్ నిబంధనల మేరకు మీరు చూస్తున్న చానళ్లకే రేట్లు చెల్లించాలంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నప్పటికీ దాని వెనుక కేబుల్ రంగంలో కూడా బడా కంపెనీలకే దోచిపెట్టే కుట్ర దాగి ఉందని ఆపరేటర్లు విమర్శిస్తున్నారు. స్థానిక కేబుల్ ఆపరేటర్ల ద్వారానే ప్రసారాలు జిల్లాలో కేబుల్ ప్రసారాలను స్థానిక కేబుల్ ఆపరేటర్ల ద్వారానే జరుగుతోంది. చాలా మంది ఆపరేటర్లు సొంత పెట్టుబడులు పెట్టుకుని దీన్నే స్వయం ఉపాధి మార్గంగా తాము బతుకుతూ తమతో పాటు మరి కొందరికి జీవనోపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.200 నుంచి రూ.250, గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.150 నుంచి రూ.200 వరకూ వసూలు చేస్తున్నారు. అయితే తాజాగా ట్రాయ్ నిబంధనల మేరకు ఒక్కో వినియోగదారుడు నెలకు కచ్చితంగా జీఎస్టీతో కలిపి రూ.153.40 చెల్లించాల్సి ఉంది. దీనిలో వచ్చే చానల్స్‌లో దూరదర్శన్ తో పాటు మిగతా అన్నీ పరభాషా చానెల్సే ఉంటాయి. మనకు నచ్చిన తెలుగు చానల్స్‌ను ఎంచుకోవాలంటూ ఒక్కో చానెల్‌కు ఒక్కో రేటును వినియోగదారుడు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన కనీసం ఒక్కో వినియోగదారుడు కనీసం రూ.100 వరకూ అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఈ కారణంగా ప్రజలు కేబుల్ ప్రసారాలను పక్కన బెట్టే ప్రమాదం పొంచి ఉంది. ఇదే జరిగితే జిల్లాలోని వేలాది మంది కేబుల్ ఆపరేటర్లు రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడనుంది. జిల్లా వ్యాప్తంగా కేబుల్ ప్రసారాలను అందించే ఎంఎస్ఓలు 11 మంది ఉన్నారు. ఏలూరు,నిడదవోలు, పెనుగొండ, జంగారెడ్డిగూడెం, మొగల్తూరు,పాలకొల్లు, భీమవరం, తణుకు,తాడేపల్లిగూడెం, కొవ్వూరు,నల్లజర్ల కేంద్రాల నుంచి జిల్లా అంతటా కేబుల్ ప్రసారాలు జరుగుతున్నాయి. కేబుల్ ఆపరేటర్లు రోడ్డున పడాల్సి వస్తుంది కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ట్రాయ్ నిబంధనలను అమలు చేస్తే కేబుల్ ఆపరేటర్లు రోడ్డున పడాల్సి వస్తుంది. ఇప్పటికే ఉన్న కేబుల్ చార్జీలను చెల్లించేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కనీస చార్జీలు, జీఎస్టీ, అదనపు చానెళ్ల చార్జీల రూపంలో అదనంగా సొమ్ము చెల్లించాలనడం సరైంది కాదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి.– ఎస్.జగదీష్, అధ్యక్షులు, ఏలూరు నగర కేబుల్ ఆపరేటర్ల సంఘం జీఎస్టీ ఎత్తివేయాలి సామాన్య పేద ప్రజలు వినోదం కోసం ఆశ్రయించే కేబుల్ ప్రసారాలపై జీఎస్టీ విధించడం అన్యాయం. పాలకులు దీన్ని కూడా ఆదాయ వనరుగా చూడటం బాధాకరం. ఒకపక్క పాలకులు పేదల సంక్షేమానికి ఎంతో చేస్తున్నామంటూ దొడ్డిదారిన ఈవిధంగా భారం మోపడం తగదు. దీనిని రద్దు చేయాలి.– వి.భోగేశ్వరి, హనుమాన్ నగర్,వెంకటాపురం, ఏలూరు రూరల్ మండలం -
‘కేబుల్ వ్యవస్థపై జీఎస్టీని రద్దు చేయాలి’
హైదరాబాద్: వినియోగదారులకు వినోదాన్ని అందించడానికి కృషి చేస్తున్న కేబుల్ వ్యవస్థపై జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ డిజిటల్ కేబుల్ ఆపరేటర్స్ ఫెడరేషన్ (టీడీసీఓఎఫ్) అధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్వర్ డిమాండ్ చేశారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీడీసీఓఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో జగదీశ్వర్ మాట్లాడుతూ.. 30 ఏళ్ల క్రితం నిర్మించుకున్న కేబుల్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ట్రాయ్ అనే కొత్త టారీఫ్‌ను తీసుకొచ్చారని ఆరోపించారు. దేశంలో 17 కోట్ల టీవీలు ఉంటే 10 కోట్ల బ్రాడ్కాస్ట్, 7 కోట్ల కేబుల్ చానెల్స్ ఉన్నాయని చెప్పారు. ట్రాయ్ విధించిన రూ. 19 గరిష్ట రేటును రూ. 5 లకు తగ్గించాలని డిమాండ్ చేశారు. 350 చానెళ్లకు కేవలం రూ.250 వసూలు చేస్తున్నామని, ట్రాయ్ కొత్త నిబంధన ప్రకారం రూ.1,000 భారం పడుతుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కేబుల్ ఆపరేటర్లు కీలక పాత్ర పోషించారని, సీఎం కేసీఆర్ తమ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బద్రినాథ్ యాదవ్, ఉపాధ్యక్షులు బంగారు ప్రకాశ్ పాల్గొన్నారు. -
విజయ కృష్ణన్‌పై కేబుల్ ఆపరేటర్ల ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లపై కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ విజయ కృష్ణన్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సీమాంధ్ర కేబుల్ టీవీ ఆపరేటర్ల వెల్ఫేర్ ఆసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఆసోషియేషన్ అధ్యక్షుడు పక్కి దివాకర్, గౌరవ సలహాదారు జనార్ధన్, ప్రధాన కార్యదర్శి పోతన రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. స్థానిక కేబుల్ ఆపరేటర్లను థర్డ్ క్లాస్ రాస్కెల్స్ అంటూ పరుష పదజాలంతో జేసీ దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఐఏఎస్ అధికారి అయిన విజయ కృష్ణన్‌కు ట్రాయ్ నియమించిన నోడల్ అధికారి అన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. ఎమ్మెస్వోలు, కేబుల్ వినియోగదారులను రక్షించాల్సిన అధికారిణి ఈ విధంగా వ్యాఖ్యలు చేసి నాలుగు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం అని అన్నారు. తక్షణమే జేసీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆమె పాల్గొనే ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని బాయ్‌కట్ చేయమని ఎమ్మెస్వోలకు సూచిస్తామన్నారు. -
ఎమ్మెస్వోలపై జేసీ అనుచిత వ్యాఖ్యలు
-
ఎమ్మెస్వోలపై జేసీ అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలపై కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ విజయ కృష్ణన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రెండు రోజలు కిందట రెవెన్యూ, పోలీసు అధికారులతో జరిగిన ఫోన్ కాన్ఫరెన్స్‌లో జేసీ కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలపై చిందులు తొక్కారు. ఫైబర్ గ్రిడ్‌ను ప్రమోట్ చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వారికి వ్యతిరేకంగా అధికారులకు పలు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎలక్ట్రిక్ పోల్స్‌కు ఉన్న కేబుల్ కనెక్షన్లు తొలగించాలని ఆదేశించారు. మాట వినకపోతే ఎమ్మెస్వోలపై క్రిమినల్ కేసులు పెట్టాలని అధికారులకు తెలిపారు. కాగా, జేసీ వ్యాఖ్యలపై ఎమ్మెస్వోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టబద్ధంగా తాము వ్యాపారం చేస్తున్నామని ఎమ్మెస్వోలు పేర్కొన్నారు. తమపై ఒత్తిడి చేసి వ్యాపారాలు చేయిస్తారా అని మండిపడ్డారు. న్యాయం కోసం కోర్టుకు వెళతామని ఎమ్మెస్వోలు స్పష్టం చేశారు. -
నిలచిన కేబుల్ ప్రసారాలు
సాక్షి, హైదరాబాద్ : కేబుల్ ప్రసారాలపై తాజాగా ట్రాయ్ విధించిన నిబంధనలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో శనివారం హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ప్రసారాలను నిలిపేసి ఆపరేటర్లు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ, ఏపీ ఎంఎస్ఒ, కేబుల్ ఆపరేటర్ల జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిపి తమ నిరసనతో పాటు కార్యాచరణను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంఎస్ఒ అసోసియేషన్ అధ్యక్షుడు కిశోర్, కేబుల్ టీవీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేంద్రలు మాట్లాడుతూ పే చానల్స్‌ను గతంలో ఉన్న ధరకే ఇవ్వాలని, గరిష్ట ధరను రుద్దవద్దని, జీఎస్టీని ఎత్తేయాలని డిమాండ్ చేశారు. గడువు, సమాచారం ఇవ్వకుండా ట్రాయ్ రెండో విడతగా పే చానల్స్‌ను కనిష్టంగా రూ.1 నుంచి 19 వరకు ప్రకటించడం సహేతుకం కాదన్నారు. గతంలో రూ.1 ఉన్న చానల్స్ కూడా ప్రస్తుతం రూ. 19 గా ప్రకటించడంతో వినియోగదారులపై మోయలేని భారం పడుతుందన్నారు. ఇలా ఒక్కో చానల్‌కు రూ.19 వంతున చెల్లిస్తే ప్రస్తుతం ఉన్న కేబుల్ చార్జీలు 200 నుంచి 800 దాటే అవకాశం ఉందన్నారు. ఇలా రేట్లు పెంచితే వినియోగదారులు తమను నిలదీయడమే కాకుండా డబ్బులు చెల్లించేందుకు నిరాకరించే పరిస్థితి వస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ రూపంలో 18 శాతం వసూలు చేస్తున్నాయని దాన్ని పూర్తిగా ఎత్తేయాలని కిశోర్, జితేంద్రలు డిమాండ్ చేశారు. బ్లాకవుట్ ఎప్పుడూ లేదు.. కేబుల్ చరిత్రలో బ్లాకవుట్ ఎప్పుడూ జరగలేదని, కేబుల్ రంగంలో ఇంతపెద్ద సమస్య ఎప్పుడూ రాలేదన్నారు. 2012లో డిజిటలైజేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించటంతో కేబుల్ ఆపరేటర్లు రూ.లక్షలు వెచ్చించి సెటప్ బాక్సులు పెట్టారన్నారు. 2015 కన్నా ముందు రూ.3 నుంచి 5 ఒక్కొ పే చానల్ ధర ఉండగా ప్రస్తుతం ట్రాయ్ ఒక్కసారిగా పెంచేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇదే అదనుగా ప్రతీ బ్రాడ్‌కాస్టర్ గతంలో తక్కువ ధర ఉన్న తమ చానల్ రేటును రూ.19కి పెంచి ఆ రేటుకే ఇస్తామని చెపుతున్నారన్నారు. ట్రాయ్ కొత్త టారిఫ్‌ను నియంత్రించాలని గతంలో ఉన్న టారిఫ్‌కే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తాము రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో రిట్ పిటీషన్ వేశామన్నారు. పే చానల్స్ ఏవో, ఫ్రీ చానల్స్ ఏవో వినియోగదారులకు తెలియకుండా తాము రూ.200 వసూలు చేసి అన్ని చానల్స్ ప్రసారం చేశామన్నారు. ఇలా చూపడంద్వారానే బ్రాడ్కాస్టర్లకు రేటింగులు పెరిగాయన్న విషయాన్ని వారు గుర్తుంచుకోవాలన్నారు. కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ గ్రేటర్ అధ్యక్షుడు హరిగౌడ్, గ్రేటర్ గౌరవాధ్యక్షుడు జి. భాస్కర్ రావు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.పి.రాంబాబు, సునీల్, సురేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరాపార్క్ వద్ద ఎమ్‌ఎస్‌వోల మహా ధర్నా
-
ట్రాయ్ నిబంధనలు ఏకపక్షం!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన ట్రాయ్ నిబంధనలపై రెండు తెలుగు రాష్ట్రాల ఎమ్మెస్వోలు, ఎల్సీవో కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘాల జేఏసీ తీవ్రంగా మండిపడింది. తమ అభిప్రాయాలను తీసుకోకుండానే టారిఫ్ ఆర్డర్‌ను తీసుకురావడం ఆక్షేపణీయమని పేర్కొంది. కేబుల్ టీవీ వినియోగదారులకు లబ్ధి చేకూర్చేలా.. ట్రాయ్ నిర్దేశించిన టారిఫ్ ఆర్డర్లో మార్పులు చేయాలన్న డిమాండ్‌తో తెలుగు రాష్ట్రాల ఎమ్మెస్వో, ఎల్సీఓ కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద ‘కేబుల్ ఆపరేటర్ల మహాధర్నా’జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది ఆపరేటర్లు ఈ మహాధర్నాలో పాల్గొన్నారు. టారిఫ్ ఆర్డర్లో మార్పులు తేవడం, పే చానళ్ల ధరను ఐదు రూపాయలకు మించకుండా చూడడంతోపాటు జీఎస్టీని 18 నుంచి ఐదు శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తమ డిమాండ్ల సాధనకై ఈ నెల 29న (శనివారం) ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పది గంటలపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్తా చానళ్లు మినహాయించి పే టీవీ బ్రాడ్కాస్టర్స్కు సంబంధించిన పే చానళ్ల ప్రసారాలు నిలిపివేయా లని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ దిశగా తెలుగురాష్ట్రాల్లోని కేబుల్ ఆపరేటర్లందరికీ చానళ్ల ప్రసారాలు నిలిపేయాలంటూ పిలుపునిచ్చింది. కార్పొరేట్ శక్తులకు లబ్ధి కేబుల్ ఆపరేటర్లను సంప్రదించకుండా ట్రాయ్, కేంద్ర ప్రభుత్వం టారిఫ్ ఆర్డర్‌ను తీసుకురావడంపై ఎమ్మెస్వోలు, ఎల్‌సీవోలు తీవ్రంగా మండిపడ్డారు. ట్రాయ్ డైరెక్టర్‌గా ఒక కేబుల్ ఆపరేటర్‌ను నియమించాలని వీరు డిమాండ్ చేశారు. తెలంగాణలో కేబుల్ టీవీపై లక్షకు పైగా కుటుంబాలు ఆధారపడ్డాయన్నారు. టారిఫ్ ఆర్డర్‌పై గ్రామీణ ప్రాంత ఆపరేటర్లకు, వినియోగదారులకు అవగాహన కూడా లేదని వాపోయారు. కార్పొరేట్ శక్తులకు లబ్ధిచేకూర్చేందుకే.. కేంద్ర ప్రభుత్వం కేబుల్ టీవీ రేట్లను పెంచిందని వారు విమర్శించారు. పేద ప్రజల అభీష్టానికి అనుగుణంగా రేట్లు నిర్ణయించాలన్నారు. ట్రాయ్, బ్రాడ్కాస్టర్లు, ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు తమ పోరాటం సాగుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితిలో కేబుల్ ఆపరేటర్లు కలిసికట్టుగా పోరాటం చేయకపోతే వీరి మనుగడే కష్టమవుతుందన్నారు. జీఎస్టీ, పోల్టాక్స్లపై అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ముఠాగోపాల్‌లు మాట్లాడుతూ కేంద్రం తీరువల్లే కోట్ల మంది కేబుల్ ఆపరేటర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేబుల్‌టీవీ ఆపరేటర్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. బీసీ నాయకులు కనకాల శ్యాం కురుమ, విక్రమ్ గౌడ్, కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘాల జేఏసీ నాయకులు కిశోర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు హరిగౌడ్‌లు పాల్గొన్నారు. అధికార, విపక్షాల సంఘీభావం ఎమ్మెస్వోలు, కేబుల్ టీవీ ఆపరేటర్ల జేఏసీ మహాధర్నాకు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, ముఠా గోపాల్, కాంగ్రెస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తదితరులు సంఘీభావం ప్రకటించారు. తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షులు మిద్దెల జితేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పి.రాజుగౌడ్, ఏపీ, తెలంగాణ ఆపరేటర్ల సమన్వయకర్త పమ్మి సురేష్, తెలంగాణ మల్టీ సర్వీస్ కేబుల్ టీవీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఉపేందర్ యాదవ్, తెలంగాణ ఎమ్మెస్వోల అధ్యక్షుడు ఎం.సుభాష్‌రెడ్డి, తెలంగాణ డిజిటల్ కేబుల్ టీవీ ఫెడరేషన్ అధ్యక్షులు సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, ఏపీ కేబుల్ టీవీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఇప్పటి వరకు ఒక రూపాయి ఉన్న పే చానళ్లు ట్రాయ్ తాజా నిబంధనలతో ఏకంగా రూ.19 పెంచుతున్నాయని.. దీని వల్ల ప్రస్తుతం నెలవారీగా వసూలు చేస్తున్న కేబుల్ అద్దె రూ.180 నుంచి రూ.800కు పెరుగుతుందని వెల్లడించారు. ఒక్క తెలుగు పే చానల్స్‌కే నెలకు దాదాపు రూ.300 భారం పడుతుందని అన్నారు. చానళ్ల ధరల పెరుగుదల వినియోగదారులకు, ఎమ్మెస్వోలు, ఎల్సీఓలకు తీవ్ర భారమవుతుందని అన్నారు. -
ఛానళ్లు నిలిచిపోతాయన్న వార్తలు అసత్యం
హైదరాబాద్: ఈ నెల 29 నుంచి టీవీ ఛానళ్ల ప్రసారాలు నిలిచిపోతాయని వస్తోన్న వార్తలు అసత్యమని తెలంగాణ ఎంఎస్ఓల సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి తెలిపారు. బ్రాడ్కాస్టర్లకు, ఎంఎస్ఓలకు ఎలాంటి నోటీసులు, ఉత్తర్వులు రాలేదని స్పష్టం చేశారు. ట్రాయ్ అవలంబిస్తోన్న విధానాలు మారాలని డిమాండ్ చేశారు. ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్ల అభిప్రాయం తెలుసుకోకుండా ధరలు నిర్ణయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పే ఛానళ్లపై పెంచిన ధరలను రద్దు చేయాలని కోరారు. అలాగే కేబుల్ ఛార్జీలపై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేశారు. -
29 నుంచి ఆ టీవీ ఛానళ్లు రావు
సాక్షి, విజయవాడ : సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) తీసుకొచ్చిన కొత్త టారిఫ్ ఈ నెల 29 అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని తెలంగాణ ఎమ్మెస్వో అసోసియేషన్ అధ్యక్షుడు సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ఏపీ, తెలంగాణ ఎమ్మెస్వోలు బుధవారం విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎమ్మెస్వో అసోసియేషన్ అధ్యక్షుడు సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. కేబుల్ ఆపరేటర్లు అతి తక్కువ ధరకే 200 నుంచి 300 ఛానల్స్ అందిస్తున్నారని, సుప్రీం కోర్టు తీర్పుతో ప్రేక్షకులపై అధిక భారం పడుతుందన్నారు. ఎమ్మెస్వోలు అన్ని తెలుగు ఛానళ్లను కేవలం రూ.40కే అందిస్తున్నారని, కోర్టు నిర్ణయంతో పే ఛానల్స్ అధిక రేట్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఛానల్స్ అన్ని ఫ్రీ టు ఎయిర్ అయ్యేవరకు ప్రేక్షకులు సహకరించాలని కోరారు. పే చానల్స్‌ను చూడడం తగ్గిస్తే వాళ్లే దారికొస్తారని చెప్పారు. ఏపీ ఎమ్మెస్వో అసోషియేషన్ గౌరవాధ్యక్షుడు కడియల బుచ్చి బాబు మాట్లాడుతూ..సుప్రీం టారిఫ్ని అమలు చేస్తే ప్రేక్షకులపై రూ.600 భారం పడుతుందన్నారు. టారిఫ్‌పై ప్రేక్షకులకు, ఆపరేటర్లకు అవగాహన లేదని, కేంద్రం కనీసం ఆరు నెలల గడువు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జెమిని, ఈటీవి ,మాటీవి, జీ టీవి నుండి ఒక్కో ఛానల్ ని మాత్రమే ప్రేక్షకులకి అందించబోతున్నామని చెప్పారు. మిగతా చానళ్లని నిలిపివేస్తున్నామని ప్రకటించారు. రేపు డిల్లీకి వెళ్లి ఎమ్మెస్వోల తరఫున కేంద్రప్రభుత్వానికి మెమొరాండం అందిస్తామని చెప్పారు. -
వైఎస్ జగన్‌ని కలిసిన కేబుల్ ఆపరేటర్లు
-
హ్యాపీ అవర్స్! ముఖేష్ తర్వాత హిట్‌లిస్ట్ వారే!
బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో రిలయన్స్ జియో హ్యాపీ అవర్స్ ప్రారంభం కాబోతున్నాయి. ముఖేష్ అంబానీ తర్వాత హిట్‌లిస్ట్‌గా కేబుల్ ఆపరేటర్స్ ఛార్జ్ చేసే దానికంటే సగం తక్కువగా ఇంటర్నెట్ ఆధారిత టెలివిజన్ ప్రొగ్రామింగ్ సర్వీసులను(జియోగిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను) ఆఫర్ చేసేందుకు జియో సన్నద్ధమైంది. వీటి ప్రారంభ ధర 500 రూపాయలుగా కంపెనీ నిర్ణయించిందని సంబంధిత వర్గాలు చెప్పాయి. జియోగిగాఫైబర్‌ను దివాళి కంటే ముందస్తుగానే కమర్షియల్‌గా ఆవిష్కరించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ సర్వీసుల అందుబాటు ఆగస్టు 15 నుంచే ప్రారంభమయ్యే వినియోగదారుల రిజిస్ట్రేషన్లను బట్టి ఉంటుంది. ఏ ప్రాంతంలో అయితే ఎక్కువ రిజిస్ట్రేషన్లు నమోదు అవుతాయో, అక్కడ తొలుత ఈ సర్వీసులను అందజేయనున్నారు. ఇలా దివాళి కల్లా కమర్షియల్‌గా ఆవిష్కరించడం పూర్తయి పోవాలని కంపెనీ చూస్తోంది. తొలుత మెట్రోల్లో, ఆ అనంతరం 80 టాప్ టైర్ 1, టైర్ 2 మార్కెట్లలో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్స్‌ను కేబుల్ ఆపరేటర్స్ ఆఫర్ చేస్తున్నరు. నెలకు 700 రూపాయల నుంచి 1000 రూపాయల మధ్యలో 100 జీబీ డేటాను, 100 ఎంబీపీఎస్ స్పీడులో అందజేస్తున్నారు. అదనంగా టీవీ సర్వీసులకు ఒక్కో ఇంటికి 250 రూపాయల నుంచి 300 రూపాయలు తీసుకుంటున్నారు. జియో కూడా అదేరకమైన ఆఫర్‌ను అంటే 100జీబీ డేటాను 100 ఎంబీపీఎస్ స్పీడులో వాటికంటే 50 శాతం తక్కువ ధరకే అందజేయబోతుంది. కంపెనీ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల ధరలు ప్రస్తుతమున్న 4జీ మొబైల్ డేటా రేట్లకు 25 శాతం నుంచి 30 శాతం డిస్కౌంట్లో లభించనున్నాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అంటే ఒక్క జీబీ డేటా కేవలం రూ.2.7 నుంచి రూ.5కే లభ్యం కానుందని హెచ్ఎస్బీసీ డైరెక్టర్, టెలికాం విశ్లేషకులు రాజీవ్ శర్మ చెప్పారు. టీవీ సర్వీసులతో వస్తున్న జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు, తన సొంత 4జీ మొబైల్ డేటా వ్యాపారాలను దెబ్బకొట్టవని విశ్లేషకులు చెప్పారు. ఫైబర్ ఆధారిత హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవల వీడియో స్ట్రీమింగ్ నాణ్యత, 4జీ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ కంటే ఎక్కువ విశ్వసనీయతతో, స్థిరంగా ఉంటాయని ఫిలిప్‌క్యాపిటల్ టెలికాం విశ్లేషకుడు నవీన్ కులకర్ని తెలిపారు. -
విజయవాడలో కేబుల్ ఆపరేటర్ల భారీ ర్యాలీ
-
‘మాకూ బీమా కల్పించండి’
సాక్షి, విజయవాడ : కేబుల్ వ్యవస్థను ప్రభుత్వంలో అంతర్భాగం చేయాలని ఆంధ్రప్రదేశ్ మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం మీడియాతో మాట్లాడిన సంఘ సభ్యులు కేబుల్ ఆపరేటర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అసంఘటిత రంగం కింద తమను కూడా చేర్చాలని, కేబుల్ ఆపరేటర్లు, టెక్నీషియన్లకు ఐదు లక్షల రూపాయల బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 15లో ఉన్న పోల్ ట్యాక్స్ నుంచి కేబుల్ ఆపరేటర్లను మినహాయించాలని కోరారు. కేబుల్ ఆపరేటర్ల సమస్యలను ఎన్నిసార్లు దృష్టికి తెచ్చినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. -
కేబుల్ ఆపరేటర్లకు వైఎస్ జగన్ భరోసా
సాక్షి, పెద్దాపురం : నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు పాలన వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. 218వ రోజు పాదయాత్ర కొనసాగిస్తోన్న జననేత వైఎస్ జగన్‌ను కేబుల్ సంఘాల ఆపరేటర్స్ ప్రతినిధులు కలుసుకున్నారు. సీఎం చంద్రబాబు దుశ్చర్యలతో తమ కేబుల్ వ్యవస్థ పూర్తిగా నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. పోల్ ట్యాక్స్ విధానంతో తమకు చాలా నష్టం జరుగుతోందన్నారు. బ్రాడ్ బ్రాండ్, కేబుల్ ఆపరేటర్స్‌ను టీడీపీ సర్కార్ దోచుకుంటోందని విమర్శించారు. కార్పొరేట్ అండర్ గ్రౌండ్ పేరుతో టీడీపీ పెత్తనం చేస్తోందని రాజన్న తనయుడు వైఎస్ జగన్‌కు కేబుల్ ఆపరేటర్స్ ప్రతినిధులు తమ గోడు వెల్లబోసుకున్నారు. అధికారంలోకి రాగానే ఫైబర్ గ్రిడ్ చట్టం తెస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారని కేబుల్ సంఘాల ఆపరేటర్స్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. పోల్ ట్యాక్స్‌ను సైతం వైఎస్ జగన్ తీసేస్తామని చెప్పారని వివరించారు. మరోవైపు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్ జగన్ తన పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. -
‘కేబుల్‌పై జీఎస్టీ తొలగించాలి’
సాక్షి, విజయవాడ : కేబుల్‌పై జీఎస్టీని తొలగించాలని ఏపీ కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కోనేరు మురళి కృష్ట డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేబుల్ ఆపరేటర్ల సమస్యలపై ఈ నెల 13న ముఖ్యమంత్రిని కలిసి వివరించామన్నారు. ఫైబర్ నెట్ కలిగి ఉన్న వారికి పోల్ టాక్స్ వర్తించదని సీఎం హామి ఇచ్చారని పేర్కొన్నారు. ఈ నెల 19న జరిగే సమావేశంలో కేబుల సమస్యలపై చర్చిస్తామని పేర్కొన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం జరిగే సభకు కేబుల్ ఆపరేటర్లు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ప్రధాన కార్యదర్శి కె.విజ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వం జీఎం నెంబర్ 15 జారీ చేసి పోల్ టాక్స్ విధించడం కెబుల్ రంగానికి పెను భారంగా మారిందన్నారు. కేబుల్ ఆపరేటర్లను ప్రభుత్వం ఆసంఘటిత కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కేంద్రం కేబుల్‌పై జీఎస్టీని తొలగించే విధంగా ఒత్తిడి తీసుకొస్తామని పేర్కొన్నారు. కేబుల్ ఆపరేటర్లకు ప్రమాద బీమా, ఇన్యూరెన్స్, ముద్ర పథకం ద్వారా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
కేబుల్ ఆపరేటర్లకు అన్యాయం చేయొద్దు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కేంద్రంలో కలెక్టరేట్లో కలెక్టర్ కె.ధనంజయరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఎక్కువగా వ్యక్తిగత వినతులు అందాయి. కార్యక్రమంలో జేసీ కె.వి.ఎన్.చక్రధరబాబు, జేసీ–2 పి.రజనీకాంతారావు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ వారం అందిన వినతులు కొన్ని పరిశీలించగా... ♦ కేబుల్ ఆపరేటర్లకు ఏపీఎస్ ఫైబర్ లిమిటెడ్ కనెక్షన్ ఇవ్వాలని, కేబుల్ ఆపరేటర్లకు అన్యాయం జరగకుండా చూడాలని రణస్థలం మండలానికి చెందిన కే బుల్ ఆపరేటర్లు లంక రమణ, జి.జనా ర్దనరావు, కె.గణపతిరావు, ఎస్.ఖాన్, ఎస్.సూర్యనారాయణ తదితరులు వినతి పత్రం అందించారు. ♦ తనకు రేషన్ కార్డు, ఆధాఆర్ కార్డు, ఇల్లు స్థలం ఉన్నా పక్కా ఇల్లు మం జూరు చేయడం లేదు. పలుమార్లు ప్రజాపతినిధులను, అధికారులను కోరి నా ఫలితం లేదు. తనకు ఇల్లు మం జూరు చేయాలని రేగిడి మండలంలోని బూరాడ గ్రామానికి చెందిన వంజరాపు రమేష్ కోరారు. ♦ ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చినా, సంతకవిటి మండలంలోని మందరాడ, కాకరాపల్లి, చేనేత సొసైటీకి రుణం మాఫీ కావడం లేదని, అక్కడ బ్యాంకర్లు సహకరించడం లేదని ఆ సొసైటీ సభ్యులు ఎన్.ధర్మారావు, బి.సత్యం, కె.మహేష్, కె.నీలయ్య తదితరులు కోరారు. ♦ శ్రీకాకుళం నగరంలోని పశు సంవర్థ క శాఖ జేడీ కార్యాలయం ప్రాంగణంలో గత 30 సంవత్సరాలుగా చెప్పులు కుట్టికొని, చిల్లర వ్యాపారాలు చేనుకొని చిరు దుకాణాలు నడుపుకుంటూ జీవి స్తున్నాం. అయితే అక్కడ కమర్షియల్ కాం ప్లెక్స్‌ను నిర్మించారని, అందులో తమకు షాపులు ఇవ్వాలని అన్నారు. అయితే అధికార పార్టీ నాయకులు ఈ షాపులను అడ్డగోలుగా అమ్మకాలు చేస్తున్నట్టు తెలుస్తోందని, దీనిపై అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కె.శంకరరావు, ఎం.వెంకట్రావు, వి.శంకరరావు తదితరులు కోరారు. ♦ జలుమూరు మండలంలోని శ్రీముఖలింగంలో ముఖలింగేశ్వర దేవాల యం అభివృద్ధి చేయాలని, ఈ ప్రాంతా న్ని పర్యటక రంగంలోకి తీçసుకొని అన్ని వసతులు కల్పించాలని, భక్తులకు వస తి గృహాలు, ఇతర సదుపాయాలు కల్పించాలని ఆ గ్రామానికి చెందిన నాయుడుగారి రాజశేఖర్ వినతి పత్రం అందించారు. ♦ జిల్లాలోని తహసీల్దారు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు శిక్షణ పొందిన లైసెన్సుడు సర్వేయర్లు 78 మంది పనిచేస్తున్నారని, వీరికి ఇప్పటివరకు జీతాలు, గౌరవ వేతనం లేదని, ఇకనుంచైనా గౌరవ వేతనం కల్పించాలని సీహెచ్ ధనరాజ్, కమల్, సీతామహాలక్ష్మి, శరణ్య, రాజు, శ్రీను తదితరులు కోరారు. ♦ ఒకే మరుగుదొడ్డికి రెండు సార్లు బిల్లులు చేశారని, గతంలో ఒకరి పేరిట ఎన్ఆర్ఈజీఎస్ కింద, రెండో సారి మరొకరి పేరిట స్వచ్ఛ భారత్ కింద బిల్లులు పెట్టి చెల్లింపులు చేసి సంబంధిత శాఖ సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని లావేరు మండలంలోని నక్కపేట గ్రామానికి చెందిన కొన్ని శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు.