cake cutting
-
600 కేజీల భారీ కేక్‌ను కట్ చేసిన ఎమ్మెల్సీ రఘురామ్, మంత్రి మేరుగ
-
మరో వివాదంలో డేరా బాబా.. తల్వార్‌తో కేక్ కట్టింగ్.. వీడియో వైరల్..
చండీగఢ్: అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ ఇటీవలే పెరోల్‌పై విడుదలైన డేరా బాబా రామ్ రహీం మరో వివాదంలో చిక్కుకున్నాడు. చాలా కాలం తర్వాత జైలు జీవితం నుంచి విముక్తి లభించిన ఆనందంలో ఆయన సంబరం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే పెద్ద తల్వార్‌తో కేక్ కట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో డేరా బాబాను జైలు నుంచి విడుదల చేసిన బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలతో పాటు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. త్వరలో జరగనున్న పంచాయితీ ఎన్నికలు, అదంపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు పొందేందుకే ప్రభుత్వం ఆయనను జైలు నుంచి విడుదల చేసిందని మండిపడ్డారు. డేరా బాబా నిర్వహించిన వేడుకల్లో బీజేపీ నేతలు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. Rape convict Ram Rahim celebrated his freedom by cutting a cake with a sword. Several of his followers joined him in his celebration. It's absolute shamelessness on the part of the Haryana government. They have done this to gain votes: @BrindaAdige@aishvaryjain pic.twitter.com/4oYnYcpSVH — TIMES NOW (@TimesNow) January 23, 2023 సీర్సాలోని తన ఆశ్రమంలో ఇద్దరు మహిళా భక్తులపై అత్యాచారం చేసిన కేసులో డేరాబాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించించి సీబీఐ కోర్టు. 2017లో ఈ తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి సుంజారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు డేరా బాబా. అయితే అక్టోబర్ 2022లో 40 రోజుల పెరోల్‌పై బయటకు వచ్చిన ఆయన.. మరో మూడు నెలల్లోనే మరోసారి 40 రోజుల పెరోల్‌పై విడుదల అయ్యాడు. దీంతో ప్రభుత్వం తీరుపై విమర్శలు వస్తున్నాయి. డేరా బాబాపై ఓ హత్య కేసు కూడా ఉంది. చదవండి: మెట్రోలోని ప్రయాణికులను హడలెత్తించిన చంద్రముఖి -
ఢిల్లీ ఏపీ భవన్లో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు..
న్యూఢిల్లీ: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఢిల్లీలోని ఏపీ భవన్లో ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, భరత్, వంగా గీత, తలారి రంగయ్య, రెడ్డప్పా, మాధవ్, గురుమూర్తి, మాధవి, సంజీవ్, లావు శ్రీకృష్ణదేవరాయలు, శ్రీధర్, ఆర్. కృష్ణయ్య, ఏపీ భవన్ ఉద్యోగులు, అభిమానులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగాా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. భారత రాజకీయల్లో వైఎస్ జగన్‌ది ప్రత్యేక స్థానమని కొనియాడారు. ప్రతిపక్షాలు వ్యవస్థలను మేనేజ్ చేసి ఆయనని ఇబ్బంది పెట్టాయని, అయినా వాటిని సీఎం జగన్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ప్రజల సంక్షేమం కోసం నిబద్దతతో పని చేస్తున్నారని చెప్పారు. '2009లో వైఎస్ జగన్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఆయన వ్యక్తిత్వంతో పార్టీ నిలబడింది. వైఎస్ కుటుంబంతో నాది మూడు తరాల అనుబంధం. సీఎం జగన్ వందేళ్లు చల్లగా జీవించాలి. ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలన చేయాలి' అని విజయసాయిరెడ్డి అన్నారు. చదవండి: CM Jagan Birthday: ఊరూవాడా సీఎం జగన్ జన్మదిన వేడుకలు -
క్రిస్మస్ కేక్ కట్ చేసిన సీఎం జగన్
-
విజయవాడ: హ్యాపీ బర్త్‌డే జగనన్న.. భారీ కేక్ కటింగ్ (ఫొటోలు)
-
పని మనిషి బర్త్‌డే.. ఓనరమ్మ సర్ప్రైజ్
ప్రతీ వ్యక్తి జీవితంలో కొన్ని మధుర క్షణాలు పదిలంగా ఉండిపోతాయి. వాటి వెనుక చిన్న చిన్న చర్యలు కూడా ఉండొచ్చు!. తమ ఇంటి బండి నడిచేందుకు.. నాలుగు ఇళ్లలో పని చేసుకునే వాళ్లు ఎందరో. అలాంటి వాళ్లను గౌరవంగా చూసే ఓనర్లు ఎందరుంటారు?.. అయితే ఇక్కడ తమకు సాయంగా ఇంటి పనులు చేసే ఆమెను.. ఇంట్లో మనిషిగానే భావించింది ఆ ఓనరమ్మ. అందుకే.. ఆమె జీవితంలో ఏ పుట్టినరోజుకు అందుకోని సర్ప్రైజ్ ఇచ్చింది. వీళ్లకు విలువైన కానుకలు అక్కర్లేదు. ఇలాంటి ప్రత్యేక క్షణాల్లో ప్రేమ, ఆనందం పంచితే సరిపోతుంది. ఈ నగరంలో ఆమె భర్తతో ఒంటరిగా ఉంటోంది. అందుకే ఆమె పుట్టినరోజును ముఖంలో చిరునవ్వులు పూయించాలనుకున్నాం. మా మామగారు ఆమె కోసం కేక్ తెచ్చారు. అంతా కలిసి ఆమెను సర్ప్రైజ్ చేశాం. కొన్నిసార్లు ఎదుటివాళ్లను నవ్వించేందుకు.. మీరు చిన్న చిన్న పనులు మీతో ఎప్పటికీ నిలిచిపోతాయి అంటూ క్యాప్షన్ ఉంచింది సదరు ఓనరామె. అంతే మీ వల్లే మా ఇల్లు శుభ్రంగా, సొగసుగా ఉంటోందని.. హ్యపీయెస్ట్ బర్త్‌డే మౌషీ అంటూ క్యాష్షన్ ఉంచారామె. అంతేకాదు.. ఎప్పుడూ తన కోసం టీ పెట్టే ఆమె కోసం.. ఈసారి ఆ ఓనర్ ప్రత్యేకంగా టీ చేసి ఇచ్చింది. తన జీవితంలో ఇప్పటిదాకా పుట్టినరోజు జరుపుకోలేదని.. ఈ క్షణాలు తనకు ఎంతో భావోద్వేగాన్ని పంచాయంటూ కంటతడి పెట్టుకుందామె. ప్రస్తుతం ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
పెంపుడు కుక్క బర్త్ డే...100 కేజీల కేక్, 4 వేలమందికి భోజనాలు!
చాలా మంది తమ పెంపుడు కుక్కల కోసం ఏదో ఒకటి చేసి వార్తల్లో నిలిచిన పలువురి గురించి విన్నాం. తమ పెంపుడు జంతువులు వినూతనంగా ఉండాలని అందంగా తీర్చిదిద్దడమో లేక ఊహించని విధంగా వాటి పేరు మీద విలువైన ఆస్తులు రాయడం వంటి కథనాలను గురించి విన్నాం. అచ్చం అలానే ఇక్కడొక యజమాని తన కుక్క పుట్టిన రోజు అందరూ గుర్తుంచుకునేలా ఘనంగా సెలబ్రేట్ చేశాడు. వివరాల్లోకెళ్తే...కర్ణాటకలోని బెలగావికి చెందిన శివప్ప ఎల్లప్ప తన పెంపుడు కుక్క పుట్టినరోజును ఘనంగా నిర్వహించాడు. ఏకంగా కుక్కతో 100 కిలోల కేక్ కట్ట చేయించి...నాలుగు వేలమందికి భోజనాలు పెట్టాడు. అతను పెట్టించిన భోజనం కూడా మాములుగా లేదు. వచ్చిన వారందరికీ సుమారు 300 కేజీల మాంసం, 100 డజన్ల గుడ్లతో మంచి విందు ఇచ్చాడు. అంతేకాదు శాఖాహారులకు కూడా వివిధ రకాల రెసిపీలతో ఘనంగా భోజనం ఏర్పాటు చేశాడు. ఎందుకు చేశాడంటే ఇలా... శివప్ప 20 ఏళ్లుగా గ్రామ పంచాయితీ సభ్యుడిగా ఉంటున్నాడు. ఐతే కొత్త పంచాయితీ సభ్యుడు బర్త్ డే పార్టీకి పిలిపించి అవమానించాడంటా. దీనికి నిరసనగానే తన పెంపుడు కుక్కుకు ఘనంగా పుట్టిన రోజు వేడుక నిర్వహించాడు శివప్ప. (చదవండి: ఢిల్లీ గోడౌన్లో మంటాలార్పుతున్న 'రోబో': వీడియో వైరల్) -
కేక్ కట్ చేశాడు! దెబ్బకు జైలుకెళ్లాడు
దొడ్డబళ్లాపురం: పుట్టినరోజునాడు పెద్ద కత్తితో కేక్‌ను కట్ చేసిన ముగ్గురిని ఉడుపి జిల్లా పడుబిద్రి పోలీసులు అరెస్టు చేసారు. జితేంద్రశెట్టి, గణేశ్ పూజారి, శరత్శెట్టి అరెస్టయిన యువకులు. మే 30న పడుబిద్రెలో జితేంద్రశెట్టి ఇంట్లో బర్త్‌డే సందర్భంగా తల్వార్‌తో కేక్‌ను కోశారు. ఈ వీడియోను వైరల్ చేయగా, పోలీసులు కేసు నమోదు పై ముగ్గురిని అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. పెద్ద కత్తిని కలిగి ఉండడం, దానిని ప్రదర్శించడం చట్టరీత్యా నేరమవుతుంది. సినిమాలో నష్టపోయి రియాల్టీలో మోసాల యశవంతపుర: స్థలాల పేరుతో డబ్బులు వసూలు చేసి పరారైన కేసులో సినీ నిర్మాత మంజునాథ్‌తో పాటు కేకే శివకుమార్, చంద్రశేఖర్, సీ శివకుమార్ అనేవారిని రాజాజీనగర పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మాత మంజునాథ్ నటుడు కోమల్‌తో లొడ్డె అనే సినిమాను నిర్మించారు. ఇంకా విడుదల కాలేదు. కానీ సినిమా ద్వారా అతనికి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో రియల్ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించి తక్కువ ధరలకు స్థలాలను ఇప్పిస్తామని ప్రకటన ఇవ్వటంతో అనేక మంది క్యూ కట్టారు. పలువురి నుంచి డబ్బులు కూడా కట్టించుకుని ఆఫీసుకు తాళం వేశారు. దీంతో బాధితులు ఫిర్యాదు చేయడంతో మంజునాథ్‌ను, అనుచరులను అరెస్టు చేశారు. (చదవండి: బాల్యం బడికి దూరం) -
తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేసిన నేతలు
-
'ప్రజలతో మమేకం కావడం వైఎస్ కుటుంబానికే సాధ్యం'
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర పూర్తయి మూడేళ్లయిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరి గౌతమ్‌రెడ్డి, పలు కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. దేశంలో సుదీర్ఘ పాదయాత్ర చేసిన ఘనత వైఎస్ జగన్‌ది అని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'అన్ని వర్గాల ప్రజల కష్ట, నష్టాలు తెలుసుకున్న నాయకుడు జగన్. అందుకే సీఎం అయిన తర్వాత ప్రజామోదయోగ్యమైన పాలన చేస్తున్నారు. అందుకే పాదయాత్ర ముగిసి మూడేళ్లయినా జనం మర్చిపోలేదు' అని అన్నారు. చదవండి: ('ప్రేమపెళ్లి.. జ్యోతుల నెహ్రూ నుంచి ప్రాణహాని ఉంది') మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పాదయాత్ర ద్వారా కోట్లమందిని జగన్ కలిశారు. ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు చేసిన పాదయాత్ర ఒట్టి బూటకం. ప్రజలతో మమేకం కావడమనేది వైఎస్ కుటుంబానికే సాధ్యం. ఆరోగ్యశ్రీ నుంచి పెన్షన్ల పెంపు వరకు ఎన్నో సంక్షేమ పథకాలు జగన్ కొనసాగిస్తున్నారు. అన్ని వర్గాల వారికీ పథకాలు అందిస్తున్న మనసున్న నేత సీఎం జగన్ అని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసిన ఘనత జగన్‌ది అని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఎండ, వాన, చలి ఏదీ లెక్కచేయకుండా జనం సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా పాదయాత్ర చేశారు. జనం ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. -
న్యూ ఇయర్ సందర్భంగా కేక్ కట్ చేసిన సీఎం జగన్
-
New Year 2022: సీఎం నివాసంలో నూతన సంవత్సర వేడుక
సాక్షి, అమరావతి: నూతన సంవత్సరం–2022 సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో శనివారం ఉదయం వేడుక నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వేద ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలు, క్యాలెండర్, డైరీ అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం పలువురు మంత్రులు, సీఎం కార్యాలయ అధికారులు వైఎస్ జగన్‌తో కేక్ కట్ చేయించారు. చదవండి: Rewind 2021: పడిలేచిన కెరటంలా.. పుష్ప గుచ్ఛాలు అందజేసి సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వారిలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, వెలంపల్లి శ్రీనివాసరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్, ముఖ్యమంత్రి కార్యదర్శులు సోలోమన్ ఆరోక్య రాజ్, రేవు ముత్యాలరాజు, ఇంటెలిజెన్స్ చీఫ్ రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సీహెచ్. ద్వారకా తిరుమలరావు, సీఎం స్పెషల్ సెక్రటరీ డాక్టర్ ఎం.హరికృష్ణ, ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. గవర్నర్ తరఫున ఆయన స్పెషల్ సీఎస్ ఆర్.పి.సిసోడియా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: AP: 2021లో సంక్షేమ పథకాలు ఇలా.. కోవిడ్ కష్టాల్లోనూ కొనసాగిన యజ్ఞం -
తల్వార్‌తో కేక్ కట్ చేసిన రామ్ గోపాల్ వర్మ
-
నక్సలైట్‌గా మారిన ఆర్జీవీ.. ముక్కలు ముక్కలుగా కేక్ కటింగ్
RGV Cake Cutting AT Konda Movie Wrap Up Praty: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన సినిమాల కంటే కాంట్రవర్సరీస్తోనే ఎక్కువగా పాపులర్ అయ్యాడు. తాజాగా నక్సలైట్ అవతారం ఎత్తి మరోసారి వార్తల్లో నిలిచాడు. సినిమా షూటింగ్ పూర్తైన సందర్భంగా వర్మ చేసిన రచ్చ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. కాగా వరంగల్‌కు చెందిన పొలిటికల్ లీడర్స్ కొండా మురళి-సురేఖ దంపతుల జీవి కథ ఆధారంగా ఆర్జీవీ కొండా అనే ఫ్యాక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కొండా మురళి పాత్రలో అదిత్ అరుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ సందర్భంగా వరంగల్‌లోని గోపాల్పూర్ కొండామురళి గెస్ట్‌హౌస్‌లో ముగింపు వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొండా మురళి, కొండా సురేఖ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ వేడుకలో నక్సలైట్ గెటప్‌లో వచ్చిన ఆర్జీవీ.. పెద్ద తల్వార్‌తో కేకును ముక్కలు ముక్కలుగా కోశాడు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. కిల్లింగ్ ఏ కేక్ ఫర్ కొండా అంటూ రాసుకొచ్చాడు. చదవండి: Rgv Hotel: 'ఆర్జీవీ హోటల్'.. అక్కడ అన్నీ అవే కనిపిస్తాయి KILLING a CAKE for KONDA pic.twitter.com/BXMmJIpV5F — Ram Gopal Varma (@RGVzoomin) December 26, 2021 -
కళ్లు చెదిరే వేడుక..ఇలా కూడా చేస్తారా?
ముంబై: ఎవరి పుట్టినరోజు వేడుక వారికే ప్రత్యేకం. ఎవరికి వారు ఇతరులకు భిన్నంగా తమ పుట్టినరోజు వేడుక జరుపుకోవాలని భావిస్తారు. అయితే కొందరు చేసే పనులు మాత్రం సోషల్ మీడియాలో వైరలయి.. అందరిని ఆకట్టుకుంటాయి. ఈ కోవకు చెందిన వార్త ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. పుట్టిన రోజు నాడు మహా అయితే 1,2 కేకులు కట్ చేస్తాం. కానీ ఇక్కడ మీరు చూడబోయే వ్యక్తి మాత్రం ఏకంగా 550 కేకులు కట్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు.. ముంబైకి చెందిన సౌర్య రాటూరి అనే యువకుడు తన పుట్టినరోజు సందర్భంగా ఏకంగా 550 కేకులు కట్ చేశాడు. అవి కూడా వేర్వేరు సైజుల్లో.. షేపులు, ఫ్లేవర్స్ ఉన్న కేక్‌లు కట్ చేశాడు. ఈ కేకులన్నింటిని.. ఓ పెద్ద టేబుల్ మీద పెట్టి.. వరుసగా వాటన్నింటిని కట్ చేసుకుంటూ వెళ్లాడు. అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులు సౌర్య చుట్టూ చేరి అతడిని ఎంకరేజ్ చేయసాగారు. (చదవండి: బైక్‌ను వెంబడించిన చిరుత; కేక్‌తో ప్రాణాలు కాపాడుకున్నారు) ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు కొందరు ప్రశంసిస్తుండగా.. చాలా మంది మాత్ర విమర్శలు కురిపిస్తున్నారు. ఇంత అట్టహాసం అవసరమా.. పుట్టిన రోజు అంటే ఏదైనా పనికి వచ్చే పని చేయాలి కానీ.. ఇలాంటి పనులు ఎందుకు అని విమర్శిస్తున్నారు. చదవండి: ముక్కలు.. ముక్కలైన నవ్వుతున్నాడు..! -
కత్తితో కేక్ కట్ చేసిన హీరో.. క్షమాపణలు
చెన్నై : ఈ మధ్య కాలంలో పుట్టినరోజు వేడుకల్లో కొన్ని అసాధారణ దృశ్యాలు కనిపిస్తున్నాయి. వెరైటీగా ఉంటుందని చెప్పి తల్వార్, గన్‌తో కేక్ కట్ చేస్తున్నారు కొందరు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం.. జనాలు వారి మీద దుమ్మెత్తిపోయడం వంటివి చూస్తూనే ఉన్నాం. సామాన్యులనే ఇంతలా తిడితే.. ఇక ఇవే పనులు హీరోలు చేస్తే.. ఇంకెంత ట్రోలింగ్ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బహిరంగంగా క్షమాపణలు చెప్పే వరకు వదలరు నెటిజనులు. తాజాగా తమిళ హీరో విజయ్ సేతుపతి ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వివరాలు నేడు విజయ్ సేతుపతి పుట్టినరోజు. ఈ నేపథ్యంలో దర్శకుడు పొన్రామ్ తన టీంతో కలిసి విజయ్ కోసం కేక్ తీసుకువచ్చారు. అయితే వెరైటీగా ఉంటుందని చెప్పి కత్తితో కేక్ కట్ చేయించారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజనులు ఓ రేంజ్లో ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో విజయ్ సేతుపతి క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటానని వెల్లడించారు. (చదవండి: గుర్తుండిపోయే జ్ఞాపకం) ఈ మేరకు విజయ్ సేతుపతి తన ట్విట్టర్లో ‘నా పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన వారందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పుట్టిన రోజు సందర్భంగా తీసిన ఓ ఫోటో ప్రస్తుతం వివాదాస్పదం అవుతుంది. దీంట్లో నేను కత్తితో కేట్ కట్ చేశాను. నేను దర్శకుడు పొన్రామ్ చిత్రంలో నటించబోతున్నాను. ఇందులో కత్తి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇక నేను నా పుట్టిన రోజును పొన్రామ్, బృందంతో జరుపుకున్నాను. దాంతో కేక్ కట్ చేయడానికి కత్తిని ఉపయోగించాను. ఈ పనితో నేను సమాజంలోకి తప్పుడు సంకేతాలు పంపానని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇక మీదట నేను జాగ్రత్తగా ఉంటాను. నా పనితో ఎవరినైనా బాధపెట్టినట్లయితే, క్షమాపణలు కోరుతున్నాను. నా చర్యకు చింతిస్తున్నాను’ అంటూ విజయ్ సేతుపతి తమిళ్లో ట్వీట్ చేశారు. (చదవండి: సిరీస్ కోసం సీరియస్) 🙏🏻 pic.twitter.com/dRRrYrmRd1 — VijaySethupathi (@VijaySethuOffl) January 16, 2021 గతంలో, చెన్నై పోలీసులు తమ పుట్టినరోజు కేక్‌ను కత్తితో కట్ చేసినందుకు స్థానిక గూండాలను అరెస్టు చేశారు. ఇప్పుడు విజయ్ సేతుపతి అదే నేరం చేశారు. మరి తనను కూడా అరెస్టు చేస్తారా అని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. ఇక తాజాగా విజయ్ సేతుపతి నటించిన మాస్టర్ చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
కత్తి సరిపోలేదని ఖడ్గంతో కోశాడు.. దాంతో
నాగ్‌పూర్ : పుట్టినరోజు వేడుక అంటే అందరితో కలిసి సంతోషంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తారు. కానీ కొందరు వ్యక్తులు మాత్రం తమ పుట్టినరోజును మరిచిపోలేని మధురానుభూతిగా మలుచుకోవాలని అతిగా ప్రవర్తిస్తుంటారు. ఆ అతి ప్రవర్తనే వారిని అందరిముందు అబాసుపాలయ్యేలా చేస్తుంది.(చదవండి : బాణాసంచా పేలి ఐదుగురు సజీవ దహనం) తాజాగా నాగ్‌పూర్‌కు చెందిన 19 ఏళ్ల నిఖిల్ పటేల్ అక్టోబర్ 21న తన పుట్టినరోజు పురస్కరించుకొని అందరిని పిలిచి ఘనంగా వేడుకలు నిర్వహించాడు. పార్టీ మధ్యలో వచ్చిన నిఖిల్ స్నేహితులు నాలుగు పెద్ద కేక్‌లను అరేంజ్ చేశారు. సాధారణంగా అయితే ఆ కేకులను కత్తితో కట్‌చేస్తే సరిపోయేది.. కానీ నిఖిల్ ఇక్కడే కాస్త అతిగా ప్రవర్తించాడు. ఘనంగా పుట్టినరోజు జరుపుకుంటున్న తాను కేక్‌ను కత్తితో కట్‌చేస్తే మజా ఎలా ఉంటుందని చెప్పి లోపలికి వెళ్లి ఖడ్గం తెచ్చి కేక్‌ను కట్ చేశాడు. నిఖిల్ చేసిన పనిని అతని స్నేహితులు ఫోటోలు తీసి వాట్సప్‌లో షేర్ చేశారు. అయితే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఫోటోలు పోలీసుల దృష్టిలో పడ్డాయి. వెంటనే నిఖిల్ ఇంటికి చేరుకున్న పోలీసులు అతన్ని మారణాయుధాల చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. -
జిల్లాలో పెరుగుతున్న తల్వార్ల సంస్కృతి
మంచిర్యాలక్రైం: జిల్లాలో రోజురోజుకూ తల్వార్లు, కత్తుల సంస్కృతి పెరిగిపోతోంది. జన్మదిన వేడుకలు జరుపుకునేందుకు అర్ధరాత్రి నగరం నడిబొడ్డున కేక్ కట్ చేయడం హంగామా సృష్టించడం జిల్లాలో పరిపాటిగా మారింది. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో మంగళవారం అర్ధరాత్రి అధికార పార్టీకి చెంది న యవజన విభాగం పట్టణ అధ్యక్షుడు గడప రాకేష్ (జిమ్ రాకేష్) జన్మదిన వేడుకల పేరిట హంగామా సృష్టించారు. వేడుకల్లో ఆయన అనుచరులు తల్వార్ తిప్పుతున్న వీడియో వాట్సాప్‌లో వైరల్ కావడం గమనార్హం. సుమారు 20 రోజుల క్రితం జిల్లాలోని ఓ ఎమ్మెల్యే అనుచరుడు బెల్లంపల్లిలో అర్ధరాత్రి నడిరోడ్డుపై తల్వార్‌తో కేక్ కట్ చేసిన వీడియో, ఫొటోలు వాట్సాప్‌లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. జిల్లాలో అధికార పార్టీ నాయకులకు రాజకీయ నాయకుల అండదండలు, అధికారబలం, పోలీసుల అండదండలు మెండుగా ఉన్నట్లు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తల్వార్లతో కేక్ కట్ చేసిన తాలూకూ ఫొటోలు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో జన్మదిన వేడుకల్లో తల్వార్లతో కేక్ కట్ చేయడమేంటని జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి వారితోనే యువతలో విషసంస్కృతి సంతరించుకుంటుందని, ఇలాంటి ఘటనలపై పోలీస్ యంత్రాంగం దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గడప రాకేష్ అనుచర వర్గంపై కేసు జన్మదిన వేడుకల్లో తల్వార్ తిప్పిన వీడియో వాట్సాప్‌లో వైరల్ కావడంతో రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ స్పందించి, మంచిర్యాల పోలీస్ స్టేషన్ సందర్శించారు. జన్మదిన వేడుకలపై ఆరాతీశారు. రాకేష్‌తో పాటు ఆయనకు సంబంధించిన అనుచర వర్గాన్ని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వార్నింగ్‌తో పాటు 9మందిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక సీఐ ముత్తి లింగయ్య తెలిపారు. చట్టవ్యతిరేక పనులు సహించం చట్ట వ్యతిరేకమైన పనులకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. మంచిర్యాలలో గడప రాకేష్ అనే వ్యక్తి నిబంధనలకు వ్యతిరేకంగా బర్త్‌డే పార్టీ అర్ధరాత్రి బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించడం, పైగా ఆయన అనుచర వర్గం తల్వార్‌తో హంగామా సృష్టించడం నేరంగా పరిగణించి కేసు నమోదు చేశాం. – సత్యనారాయణ, సీపీ -
వైరల్ వీడియో.. పాములతో కేక్ తినిపించారు
రాంచీ: ప్రతి ఏటా జూలై 16న ‘ప్రపంచ పాముల దినోత్సవం’ జరుగుతుంది. ఈ ఏడాది కూడా పాములకు సంబంధించి పలు అంశాలు, ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ఈ క్రమంలో జార్ఖండ్‌కు చెందిన ఓ వీడియో తెగ వైరలవ్వడమే కాక నెటిజనుల ఆగ్రహానికి కూడా కారణమవుతోంది. ఈ వీడియోలో జార్ఖండ్‌కు చెందిన పాముల సంరక్షకులు కొందరు ‘వరల్డ్ స్నేక్ డే’ సందర్భంగా కేక్ కట్ చేసి పాములతో దాన్ని తినిపించారు. ఈ చర్యల పట్ల నెటిజనుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ జర్నలిస్ట్, ఫోటాన్ సహ వ్యవస్థాపకుడు విరాట్ ఏ సింగ్ ఈ వీడియోను షేర్ చేయడమే కాక వీరిపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు ఐఎఫ్ఎస్ అధికారులను ట్యాగ్ చేశాడు. To celebrate #WorldSnakeDay2020 they cut a cake and even fed some to the snake and were so happy abt it. If these r snake rescuers thn they are more dangerous for snakes. This Video wch is viral seems to b frm Jharkhand@Saket_Badola @rameshpandeyifs @Kedarsbhide @ParveenKaswan pic.twitter.com/r5sVmZL8VN — Virat A Singh (@tweetsvirat) July 17, 2020 ‘ఈ వీడియోలోని వారంతా ప్రపంచ పాముల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి.. పాములతో కూడా తినిపించి ఎంతో ఆనందించారు. వీరంతా పాములను కాపాడే వారు.. కానీ వాటికన్నా వీరే ఎక్కువ ప్రమాదం’ అన్నారు. ఈ వీడియో పట్ల రమేష్ పాండే అనే ఐఎఫ్ఎస్ అధికారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. ‘సమాజానికి సహజ వనరుల పరిరక్షణకు సంబంధించిన విద్యను బోధించడం ఎంత అవసరమో ఈ వీడియోను చూస్తే అర్థం అవుతోంది. ప్రకృతి, వన్యప్రాణుల పట్ల ధర్మబద్ధమైన విధానాన్ని ప్రోత్సహించడంలో జూలు, సఫారీలు కీలక పాత్ర పోషిస్తాయని నేను భావిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. మరోక ఐఎఫ్ఎస్ అధికారి వీరి చర్యలను మూర్ఖపు చేష్టలుగా వర్ణించడమే కాక తక్షణమే వీటికి అడ్డుకట్టవేయాలని పిలుపునిచ్చారు. అంతేకాక వీరి గురించి మరిన్ని వివరాలు తెలిస్తే తనకు తెలియజేయాల్సిందిగా కోరాడు. వీరి గురించి పీసీసీఎఫ్(డబ్ల్యూఎల్) జార్ఖండ్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపాడు. (పెట్రోల్ పోయలేదని పామును వదిలాడు) This shows the importance of serious conservation education needed to any society. After working both in in-situ and ex-situ conservation fields, I feel this is where Zoos & Safaris play a pivotal role in inculcating righteous approach towards nature and wildlife, in youth. https://t.co/5aM7xru9fL — Ramesh Pandey IFS (@rameshpandeyifs) July 17, 2020 ఇక నెటిజనులు వీరి పనులు మంచివి కావని.. ఈ సంరక్షకుల వల్ల పాములకు పెద్ద ప్రమాదం వాటిల్లుతుందని అభిప్రాయపడుతున్నారు. ‘వీరి చర్యలకు బాధ కల్గుతుంది. ఎలా కోప్పడాలో తెలీడం లేదు. ఇప్పటికే నాగుల పంచమి నాడు పాముల చేత బలవంతంగా పాలు తాగిస్తున్నాం. ఇప్పుడు కేక్ తినిపిస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే త్వరలోనే పాముల్లో కార్బోహైడ్రేట్ ఎంజైమ్‌లను అభివృద్ధి చేసే వ్యవస్థ కూడా తయారవుతుంది’ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. -
'సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారు'
సాక్షి, అరకులోయ : అరకువ్యాలీలోని వైఎస్సార్ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు, అరకు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకులు, వైఎస్సార్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్‌చేసి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. కుంభా రవిబాబు మాట్లాడుతూ... అధికార వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందుతాయని అన్నారు. కుల, మతాలకు అతీతంగా రాష్ట్రమంతా అభివృద్ది చేయాలని ఆకాంక్షిస్తున్న వైఎస్ జగన్ సుదీర్ఘ కాలంపాటు ఆరోగ్యవంతంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. చరిత్రలో ఏ నాయకుడు చేయని పాదయాత్ర వైఎస్ జగన్ చేశారని, మరో 30 ఏళ్లు ఆయనే రాష్ట్రానికి సీఎంగా ఉండాలని వ్యాఖ్యానించారు. రెండు కోట్ల మంది ప్రజలను స్వయంగా కలిసి వారి కష్టాలను తెలుసుకొని హామీలన్నింటినీ అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. చట్టాలను అమలు చేయడంలో దేశానికి సీఎం జగన్ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.అన్ని ప్రాంతాల్లో అభివృద్ది సమానంగా జరగాలనే మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్సార్ అభిమానులు, మహిళ కార్యకర్తలు పాల్గొన్నారు. -
మాయావతి జన్మదిన వేడుకలు.. కేకు కోసం కక్కుర్తి
లక్నో: ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి తన 63వ జన్మదిన వేడుకలను ఆ పార్టీ శ్రేణులు మంగళవారం ఘనంగా జరుపుకున్నాయి. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బీఎస్పీ చీఫ్ బర్త్ డే సెలబ్రేషన్స్ వైభవంగా జరిపడంతో పాటు కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఐతే ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోరాలో జరిగిన వేడుకల్లో పార్టీ నిర్వాహకులకు ఊహించని ఘటన ఎదురైంది. (కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠమే: మాయావతి) ఒక్క కేక్ ముక్క కోసం జనాలు ఎగబడ్డారు. తొక్కిసలాట జరుగుతుందా? అన్నట్లుగా తోసుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు తీసుకోవాలంటూ.. నిర్వాహకులు ఎంత అరిచినా.. ఎవరూ పట్టించుకోలేదు. ఎవరికి వారు చేతులు పెట్టి కేక్ లాక్కోవడంతో.. అది చితికిపోయింది. క్షణాల్లోనే కేక్‌ని లూటీ చేసి... ఆదరబాదరగా లాగించేశారు. అనంతరం అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియా ఏఎన్ఐ ట్వీట్ చేయడంతో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. (ఎస్పీ, బీఎస్పీ.. చెరో 38) #WATCH: People loot cake during an event in Amroha, on Bahujan Samaj Party (BSP) chief Mayawati's 63rd birthday today. pic.twitter.com/8Q4bDWdr66 — ANI UP (@ANINewsUP) 15 January 2019 -
పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ జన్మదిన వేడుకలు
-
కేక్ తిన్నారు.. ఆసుపత్రి పాలయ్యారు
రైల్వేకోడూరు రూరల్ : జన్మదినం ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కేక్ తెచ్చుకుని తిన్న 12 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన సంఘటన రైల్వేకోడూరు మండలంలోని వీవీ కండ్రిక దళితవాడలో చోటు చేసుకుంది. బాధితులు, వారి బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వీవీ కండ్రికలో రెండు రోజుల క్రితం ఓ యువకుడికి వివాహమైంది. జమ్మలమడుగుకు చెందిన బంధువులు దండు సుగుణమ్మ, ఆమె భర్త దండు రవి, కుమార్తె మల్లీశ్వరిలు వివాహానికి హాజరయ్యారు. కాగా, గురువారం సుగుణమ్మ పుట్టిన రోజు కావడంతో బంధువుల మధ్య సంతోషంగా జరుపుకోవాలని భావించారు. ఈ క్రమంలో రైల్వేకోడూరు పట్టణంలోని చిట్వేలి రోడ్డులో బాలికోన్నత పాఠశాల పక్కనున్న స్వీట్ స్టాల్ నుంచి గురువారం సాయంత్రం 1.5 కేజీలు ఉన్న కేక్‌ను తీసుకెళ్లారు. రాత్రి కట్ చేసి ఇంటిలోని బంధువులు తిన్నారు. అర్థ రాత్రి దాటిన తర్వాత ఓ బాలికకు వాంతులు ప్రారంభం అయ్యాయి. వెంటనే పట్టణంలోని ఓ వైద్య శాలలో వైద్యం చేయించారు. తెల్లవారు జామున సుగుణమ్మ, ఆమెభర్త రవి, కుమార్తె మల్లీశ్వరి, బాబు, గుత్తి నుంచి వచ్చిన లక్ష్మీదేవి, బాలుడు సాయికుమార్, జ్యోతి, వెంకటసుబ్బయ్యలతో కలిపి మొత్తం 12 మందికి వాంతులు, విరేచనాలు అయి అపస్మారక స్థితికి చేరుకున్నారు. బంధువులు వెంటనే రైల్వేకోడూరు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ వెంకట సుబ్బయ్య వైద్యం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విషాహారం తినడం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. మిగిలి ఉన్న కేక్ తినవద్దని తెలిపారు. విషయంపై బాధితుల బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషాహారం తిన్న వీవీ కండ్రిక గ్రామంలో డాక్టర్ శైలజ, ఎంపీహెచ్ఈఓ మార్టిన్, దాస్, ఏఎన్ కలుదా. సిబ్బందితో కలిసి గ్రామంలో పర్యటించి వైద్య సేవలు అందించారు. -
దీన్నేమంటారు ?
బొమ్మనహళ్లి : రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి రేవణ్ణ కొడగులో వరద బాధితులకు బిస్కెట్ పాకెట్లను విసిరివేయడం తప్పని చెబుతున్న బీజేపీ నాయకులు మాజీ సీఎం యడ్యూరప్ప తన పుట్టిన రోజున కేక్ కట్ చేసి చాకుతో విద్యార్థులకు కేక్ తినిపించడాన్ని ఏమనాలని జేడీఎస్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు వారు సోషల్ మీడియాలో యడ్యూరప్ప చాకుతో ఓ విద్యార్థికి కేక్ తినిపిస్తున్న ఫొటో పెట్టడంతో అది వైరల్‌గా మారింది. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న యడ్యూరప్ప ఇటీవల పేదల మధ్య తన పుట్టిన రోజును జరుపుకొని వారికి కేక్ చేత్తో తినిపించకుండా చాకుతో తినిపించడాన్ని వారు తీవ్రంగా తప్పుబడుతున్నారు. -
ఐటీబీపీ జవాన్లకు పుట్టిన రోజు కానుక
న్యూఢిల్లీ: భారత్–చైనా సరిహద్దులను కాపాడే జవాన్లు తమ పుట్టినరోజు వేడుకలను పనిచేస్తున్న చోటే జరుపుకునే అవకాశాన్ని ఇండో–టిబెటన్ సరిహద్దు రక్షక దళం(ఐటీబీపీ) కల్పించింది. పుట్టిన రోజు జరుపుకునే జవానుకు సగం రోజు సెలవు ఇవ్వడంతోపాటు యూనిట్ సిబ్బంది సమక్షంలో కేక్ కట్ చేయించి, ఉన్నతాధికారులు బొకే అందజేయనున్నారు. సెలవు, ప్రత్యేక విధుల సమయంలో తప్ప యూనిట్లో ఉన్న ప్రతి జవాను కూడా బర్త్‌డే వేడుక జరుపుకోవాలని కోరారు. సిబ్బందిలో ఐకమత్యం, ఆత్మవిశ్వాసం పెంచేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు ఐటీబీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని దేశ వ్యాప్తంగా ఉన్న ఐటీబీపీ విభాగాలను కోరింది. దీని ప్రకారం ఇకపై స్త్రీ లేదా పురుష జవానుకు బర్త్‌డే నాడు సగం రోజు ఇవ్వనున్నారు. ఆ రోజు ఉన్నతాధికారులు బొకే అందించి శుభాకాంక్షలు తెలుపుతారు. యూనిఫాం బదులు తమకు ఇష్టమైన దుస్తులు ధరించి తోటి సిబ్బంది సమక్షంలో కేక్ కట్ చేసే అవకాశం ఇస్తారు. అంతేకాకుండా, తమ సంతానాన్ని దేశ రక్షణ విధులకు పంపినందుకు గాను తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉత్తరాలు కూడా పంపనున్నారు. దీంతో పటియాలాలోని 51వ బెటాలియన్ కమాండింగ్ అధికారితోపాటు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోహిత్ జిల్లాలో ఉన్న ఐటీబీపీ ‘ఎనిమల్ ట్రాన్స్పోర్ట్’విభాగం డీఐజీ సుధాకర్ నటరాజన్ జవాన్ల పుట్టిన రోజు వేడుకలు జరిపారు.