campus
-
ఐటీ కంపెనీలు క్యాంపస్‌లకు వచ్చేస్తున్నాయ్..
చాలాకాలం తర్వాత ఐటీ కంపెనీలు క్యాంపస్‌లకు వచ్చేస్తున్నాయి. దాదాపు ఏడాది సుదీర్ఘ విరామం అనంతరం కంపెనీలు రిక్రూట్మెంట్ డ్రైవ్‌ల కోసం కాలేజీ క్యాంపస్‌లకు వస్తున్నాయి. ఇది ఐటీ పరిశ్రమలో పునరుజ్జీవనాన్ని సూచిస్తోంది. వ్యాపారాలు రికవరీ సంకేతాలను చూపడం, ప్రత్యేక సాంకేతిక ప్రతిభకు డిమాండ్ పెరగడంతో క్యాంపస్ నియామకాలపై కంపెనీలు దృష్టి పెట్టాయి.అయితే గతంలో మాదరి ఎంట్రీ-లెవల్ ఇంజనీర్లను పెద్దమొత్తంలో నియమించుకోవడం కాకుండా క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో నైపుణ్యం కలిగినవారి కోసం ఐటీ కంపెనీలు వెతుకుతున్నాయి. వీరికి వేతనాలు కూడా సాధారణంగా ఎంట్రీ-లెవల్ ఉద్యోగులకు ఇచ్చేదాని కంటే ఎక్కువగా ఆఫర్ చేస్తున్నాయి.క్యాంపస్‌ల బాటలో కంపెనీలుఇన్ఫోసిస్, టీసీఎస్, ఐబీఎం, ఎల్‌టీఐమైండ్‌ట్రీ వంటి ప్రధాన ఐటీ సంస్థలు ప్రారంభ దశ నియామకాల కోసం ఇప్పటికే కాలేజీ క్యాంపస్‌లను సందర్శించాయి. వీటిలో టీసీఎస్ 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది. అలాగే ఇన్ఫోసిస్ కూడా క్యాంపస్, ఆఫ్-క్యాంపస్ డ్రైవ్‌ల ద్వారా 15,000 నుండి 20,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను నియమించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏడాది విరామం తర్వాత విప్రో కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో 10,000 నుండి 12,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలతో తిరిగి క్యాంపస్‌ల బాట పట్టనుంది.ఇదీ చదవండి: ఉద్యోగులకు విప్రో కొత్త కండీషన్!మరింత కఠినంగా ఎంపికక్యాంపస్ ప్లేస్మెంట్ ప్రక్రియ ఇప్పుడు మరింత కఠినంగా మారింది. అధిక కట్-ఆఫ్ స్కోర్లు, ప్రత్యేక నైపుణ్యాలు, సర్టిఫికేషన్లకు ప్రాధాన్యం పెరిగింది. అభ్యర్థులను అంచనా వేయడానికి సాంప్రదాయ కోడింగ్ పరీక్షలే కాకుండా వారి నైపుణ్యాలు, నేపథ్యంపై సంపూర్ణ అవగాహన పొందడానికి సోషల్ మీడియా ప్రొఫైల్స్, సంబంధిత సర్టిఫికేషన్లను పరిశీలిస్తున్నాయి. ఈ క్రమంలో హై-డిమాండ్ నైపుణ్యాలపై కంపెనీలు దృష్టి కేంద్రీకరించడం వల్ల క్లౌడ్, డేటా, ఏఐ వంటి అభివృద్ధి చెందుతున్న టక్నాలజీలలో ప్రత్యేక పరిజ్ఞానం ఉన్నవారికే ఉద్యోగ అవకాశాలు దక్కే పరిస్థితి ఏర్పడింది. -
ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ నియామక పత్రాలు
న్యూఢిల్లీ: క్యాంపస్ నియామకాల్లో భాగంగా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 1,000 మందికిపైగా అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేసినట్టు సమాచారం. అభ్యర్థుల ఆన్‌బోర్డింగ్ సెపె్టంబర్ చివర లేదా అక్టోబర్ నుండి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఇన్ఫోసిస్ నుంచి దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడి కాలేదు. 2022 బ్యాచ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు వీరిలో ఉన్నారని ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్న నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) వెల్లడించింది. రెండేళ్లుగా వీరంతా నియామక పత్రాల కోసం ఎదురు చూస్తున్నారని ఎన్ఐటీఈఎస్ ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా తెలిపారు. ‘మేము అప్రమత్తంగా ఉంటాం. ఇన్ఫోసిస్ ఈ నిబద్ధతను గౌరవించడంలో విఫలమైనా, చేరే తేదీని ఉల్లంఘించినా ఇన్ఫోసిస్ కార్యాలయం ముందు నిరసన చేపట్టడానికి వెనుకాడము’ అని హెచ్చరించారు. 2022–23 రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో సిస్టమ్ ఇంజనీర్, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన 2,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఆన్‌బోర్డింగ్ చేయడంలో ఆలస్యం చేసినందుకు ఇన్ఫోసిస్‌పై కార్మి క, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఎన్ఐటీఈఎస్ గతంలో ఫిర్యాదు చేసింది. ఫ్రెషర్లకు ఇచి్చన ఆఫర్ లెటర్లను కంపెనీ గౌరవిస్తుందని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ఇటీవలే స్పష్టం చేశా రు. ‘కొన్ని నియామక తేదీలను మార్చాం. అందరూ ఇన్ఫోసిస్‌లో చేరతారు. ఆ విధానంలో ఎటువంటి మార్పు లేదు’ అని వెల్లడించారు. -
'పాలిటెక్నిక్' లో నవోదయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్య సరికొత్త బ్రాండ్ ఇమేజ్ను సృష్టిస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణులై.. మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేసేలోగా బహుళజాతి సంస్థల్లో లక్షల రూపాయల జీతాలతో ఉద్యోగాలు కల్పిస్తోంది. గడచిన ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో వివిధ కంపెనీల్లో దక్కుతున్న ఉద్యోగాలకు సంబంధించిన ప్లేస్మెంట్లు క్రమేణా పెరుగుతున్నాయి. 2023–24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏకంగా 12 వేల మందికి ఉద్యోగాలు దక్కడం విశేషం.గతేడాది అత్యధిక వార్షిక వేతనం రూ.6.25 లక్షలుగా ఉంటే.. ఈ ఏడాది రూ.8.60 లక్షలకు పెరిగింది. ప్రతి వి ద్యార్థి సగటున రూ.3 లక్షల ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఒకప్పుడు 2019కి ముందు 400 కూడా దాటని ఉద్యోగ అవకాశాలు.. ఇప్పడు వేల మందికి చేరు వ అవుతున్నాయి.2019–20లో 575 ఉద్యోగాలు, 2020–21లో 652 పోస్టులు, 2021–22లో 780 కొలువులు మాత్రమే వచ్చాయి. 2022–23లో 6వేల మంది క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఎంపికైతే.. ఈ ఏడాది రెట్టింపైంది. ఇంటర్మీడియెట్, ఇంజనీరింగ్ కోర్సులను ఆరేళ్లు చదివి పూర్తి చేసిన తర్వాత అందుకునే వేతనాలను మూడేళ్ల డిప్లొమాతో 18 ఏళ్ల వయసులోనే దక్కించుకోవడం మార్కెట్లో పాలిటెక్నిక్ విద్య డిమాండ్‌కు అద్దం పడుతోంది. ఒకవైపు ఉద్యోగం.. మరోవైపు ఉన్నత చదువులు రాష్ట్రవ్యాప్తంగా 88 ప్రభుత్వ, 179 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో 35,533 మంది డిప్లొమా ఫైనలియర్ చదువుతుంటే.. వీరిలో 12వేల మందికి ఉద్యోగాలు దక్కాయి. ఇందులో 50 శాతం ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర పాలిటెక్నిక్ విద్యా చరిత్రలో తొలిసారిగా బహుళజాతి సంస్థ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ రూ.8.60 లక్షల వార్షిక వేతనంతో విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఈ సంస్థ సాధారణంగా జాతీయ స్థాయిలో పేరొందిన ఐఐటీలు, ఎన్ఐటీలు నుంచి బీటెక్ గ్రాడ్యుయేట్లను మాత్రమే తమ సంస్థలో ఉద్యోగాలకు ఎంపిక చేసేది. కానీ.. ఏపీలో నైపుణ్యాలతో కూడిన విద్యను అభ్యసిస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు అరుదైన అవకాశం కల్పించింది.ఇక్కడ అత్యధిక ప్యాకేజీలతో రూ.8.60 వార్షిక వేతనానికి 9 మంది ఎల్రక్టానిక్స్ విద్యార్థులకు టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ల్యాబ్ ఇంటర్న్‌లుగా, రూ.8 లక్షల వార్షిక వేతనంతో థాట్వర్క్ల కోసం సాఫ్ట్వేర్ డెవలపర్లుగా 35 మంది కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించాయి. ఈ రెండు సంస్థలతో పాటు మెగా ఇంజనీరింగ్, జీఈ ఏరోస్పేస్, మోస్ చిప్, సుజ్లాన్, అమరరాజా, ఆర్సెలర్ మిట్టల్ అండ్ నిప్పన్ స్టీ ల్, ఎఫ్ట్రానిక్స్, మేధా సర్వో, డాక్టర్ రెడ్డీస్ లే»ొరేటరీస్, షాపూర్జీ పల్లోంజీ, ఆల్ఫా లావాల్, మారుతీ సుజుకి రాయ ల్ ఎన్ఫీల్డ్, వీల్స్ ఇండియా, స్మార్ట్‌డివి టెక్నాలజీస్, నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, హెచ్ఎల్ మాండో ఆనంద్ ఇండియా వంటి ప్రధాన సంస్థల్లో డిప్లొమా విద్యార్థులు కొలువుదీరారు.డిప్లొమా స్థాయిలో ఉద్యోగాలు పొందిన విద్యార్థులను సైతం ఉన్నత చదువుల వైపు ప్రోత్సహించేలా సాంకేతిక విద్యాశాఖ కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ఆయా సంస్థలు రెండేళ్లు అనుభవం గడించిన తర్వాత ఉద్యోగులందరికీ బీటెక్ విద్యను అభ్యసించేలా తోడ్పాటును అందించనున్నాయి. ఇక్కడ ఉన్నత చదువులకయ్యే మొత్తం ఫీజును కూడా కంపెనీలే భరించనున్నాయి. ప్రత్యేక క్యాంపస్ రిక్రూట్మెంట్ శిక్షణసాంకేతిక విద్యాశాఖ విద్యార్థులను మార్కెట్లోకి రెడీ టు వర్క్‌గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కరిక్యులమ్ అమలు చేస్తోంది. అకడమిక్ లెర్నింగ్, ఇండస్ట్రీ అవసరాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి వర్క్‌షాపులను నిర్వహిస్తోంది. పారిశ్రామికవేత్తలు, ఐటీ తదితర కంపెనీల ప్రతినిధుల నుంచి వచ్చిన సూచనలతో పరిశ్రమ ఆధారిత కోర్సులను ప్రారంభించింది. అన్ని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రభుత్వం వర్చువల్ డిజిటల్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేసినందున విద్యార్థులకు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా థియరీ, ప్రాక్టికల్ సబ్జెక్టుల బోధన పకడ్బందీగా అందుబాటులోకి వచ్చింది.పారిశ్రామిక రంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా సిలబస్‌ను మార్పు చేయడంతో పాటు వాటి బోధనకు వీలుగా సిబ్బంది కోసం ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లను అమలు చేయిస్తున్నారు. పారిశ్రామిక శిక్షణ కార్యక్రమాల కోసం విద్యాసంస్థలను పరిశ్రమలతో అనుసంధానిస్తున్నారు. వీటితో పాటు క్యాంపస్ రిక్రూట్మెంట్ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు ఇంటర్వ్యూల్లో చక్కగా రాణించేలా సంసిద్ధం చేసింది. కళాశాల స్థాయి, క్లస్టర్ల వారీగా, కమిషనరేట్ స్థాయి వరకు మల్టీ లెవల్ ప్లేస్మెంట్ డ్రైవ్‌లు చేపట్టింది. తద్వారా మహిళా పాలిటెక్నిక్‌లు, మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్,మైనారిటీ పాలిటెక్నిక్‌ల విద్యార్థులు గణనీయంగా ఉద్యోగాలు పొందారు. పాడేరు, చీపురుపల్లి, శ్రీకాకుళం, అద్దంకి, శ్రీశైలం, చోడవరం వంటి మారుమూల ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు ప్రఖ్యాత కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విజయం సాధించింది. రూ.8.60 లక్షల వేతనంతో.. మాది అనంతపురం జిల్లా పామిడి గ్రామం. నాన్న డ్రైవర్. అమ్మ గృహిణి. వాళ్లిద్దరూ కష్టపడి చదివించడంతో నేను డిప్లొమాలో ఎలక్ట్రికల్ అండ్ ఎల్రక్టానిక్స్ (ఈఈఈ) పూర్తి చేశాను. చివరి ఏడాది చదువుతుండగానే బెంగళూరులోని టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీలో రూ.8.60 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం వచ్చింది. ఇది మల్టీ నేషనల్ కంపెనీ. నాకు రాయల్ ఎన్ఫీల్డ్లోనూ ఉద్యోగం వచ్చినప్పటికీ చిన్న ప్యాకేజీ కావడంతో చేరలేదు. మా కాలేజీలో చదువుతో పాటు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలను ముందుగానే నేరి్పంచారు. ల్యాబ్స్, కరిక్యులమ్, క్యాంపస్ ఇంటర్వ్యూల్లో రాణించేలా ఇచ్చిన ప్రత్యేక శిక్షణ మాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు కొనసాగించాలని ఉంది. – ఎన్.గౌతమి, ప్రభుత్వ పాలిటెక్నిక్, అనంతపురం‘రెడీ టూ వర్క్’ లక్ష్యంతో.. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పాలిటెక్నిక్ విద్యను అందించడంలో ఏపీ విజయం సాధించింది. ఏటా పెరుగుతున్న క్యాంపస్ ఎంపికలే ఇందుకు నిదర్శనం. టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, థాట్వర్స్, మేధా సర్వో, జీఈ ఏరో స్పేస్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు సాంకేతిక విద్యలోని విప్లవాత్మక మార్పులను చూసి ఎంతో ప్రశంసించారు. దేశవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యలో ఇంతటి స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కలి్పస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ ఒకటే.మారుతున్న సాంకేతిక, అవసరాలకు తగ్గట్టు బోధన ఉండేలా లెక్చరర్లకు పరిశ్రమల్లో నైపు ణ్య శిక్షణ ఇస్తున్నాం. విద్యార్థులను రెడీటూ వర్క్‌గా తీర్చిదిద్దుతున్నాం. అందుకే రాష్ట్రానికి అంతర్జాతీయ, జాతీయ బహుళజాతి కంపెనీలు వస్తున్నాయి. డిప్లొమాతో ఉద్యోగం పొందిన విద్యార్థులకు ఆయా సంస్థలే ఉన్నత చదువులకు ప్రోత్సహించేలా కంపెనీలు సైతం అంగీకరించాయి. చివరి సంవత్సరంలో ఉండగానే క్యాంపస్ రిక్రూట్మెంట్పై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకున్నాం. అందుకే ప్లేస్మెంట్లు రెట్టింపయ్యాయి. – చదలవాడ నాగరాణి, కమిషనర్, సాంకేతిక విద్యాశాఖ -
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శృతి భావోద్వేగ ప్రసంగం: చప్పట్లతో మారుమోగిన క్యాంపస్
ఇండియన్-అమెరికన్ విద్యార్థి హార్వర్డ్ విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేషన్ సభ ప్రసంగంలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. గ్రాడ్యుయేషన్ విద్యార్థి శ్రుతి కుమార్ గాజా సంఘీభావ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులపై చర్యపై నిరసన వ్యక్తం చేశారు. డజనుకు పైగా విద్యార్థుల డిప్లొమాలను తిరస్కరించే నిర్ణయంపై యూనివర్సిటీ నేతలను శ్రుతి విమర్శించారు.క్యాంపస్‌లో వాక్ స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణపై జరుగుతున్న దాడులపై తీవ్ర నిరాశకు గురయ్యానంటూ ఉద్వేగంగా ప్రసంగించింది. విద్యార్థులు , అధ్యాపకులు మాట్లాడుతున్నా, హార్వర్డ్, మాట వినడం లేదంటూ మాట్లాడింది. ఉద్వేగభరిత హావ భావాలతో, ఆవేదనతో చేసిన ఈప్రసంగానికి కొంతమంది అధ్యాపకులతో సహా అక్కడున్న ఆడియన్స్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. క్యాంపస్‌లో చప్పట్లు మారుమోగిపోయాయి. ఇంగ్లీషులో మాట్లాడేందుకు ఎంపికైన సీనియర్ స్పీకర్ శ్రుతి కుమార్, "ది పవర్ ఆఫ్ నాట్ నోయింగ్" పేరుతో సిద్ధం చేసిన ప్రసంగానికి బదులు మధ్యలో తాను రాసిపెట్టుకున్న మరో కాపీని తీసి ప్రసంగించడం మొదలు పెట్టింది. తానీ రోజు ఇక్కడ నిలబడి ఉన్నందున, తన సహచరులను గుర్తించడానికి కొంత సమయం కేటాయించాలి అంటూ ఇజ్రాయెల్ ద్వారా గాజాలో జరిగిన మారణహోమానికి వ్యతిరేకంగా నిరసనలలో పాల్గొన్న విద్యార్థులు అనుభవాలతోపాటు స్వయంగా తన అనుభవాలను కూడా పంచుకుంది.అలాగే దక్షిణాసియా వలస కుటుంబంలో పుట్టి, అమెరికాలోని హార్వర్డ్‌లో చేరిన తొలి వ్యక్తిగా నెబ్రాస్కా నుండి హార్వర్డ్ దాకా తన ప్రయాణం గురించి వెల్లడించింది. ఒకరికి తెలియని వాటిని గుర్తించడంలోని విలువ గురించి, ఈ ఆలోచన ఎదుగుదలకు, సానుభూతికి ఎలా దారితీసిందో వివరించింది. 2024లో గ్రాడ్యుయేట్ చేయకుండా నిషేధం విధించిన 13 మంది అండర్ గ్రాడ్యుయేట్ల గురించి ప్రస్తావించడం అక్కడి వారిలో భావోద్వేగాన్ని నింపింది. కాగా హార్వర్డ్ యూనివర్శిటీలోని ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఫ్యాకల్టీ వారికి డిగ్రీలు ఇవ్వడానికి అనుకూలంగా మెజారిటీ ఓటు ఉన్నప్పటికీ, పాలస్తీనాకు మద్దతుగా క్యాంపస్ నిరసనలలో పాల్గొన్న 13 మంది విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ నిరాకరించారని హార్వర్డ్ క్రిమ్సన్ నివేదించింది. -
క్యాంపస్ సెలక్షన్స్‌లో టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థినీ గ్లోబల్ ఉద్యోగిగా మార్చాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఉద్యోగ నైపుణ్య ఆధారిత విద్యా సంస్కరణలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. విద్యార్థి చదువు సమయంలోనే వృత్తి నైపుణ్యాలను కూడా నేర్చుకోవడం ద్వారా మల్టీ నేషనల్ కంపెనీల్లో సులభంగా ఉద్యోగాలు సాధిస్తున్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలకు ఎంపికవుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది.ఇంటర్న్‌షిప్, ఫ్యూచర్ స్కిల్స్‌లో రాష్ట్రం దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచింది. అత్యధిక ఉద్యోగాలు సాధిస్తున్న యువత కలిగిన అగ్ర రాష్ట్రాల జాబితాలో నిలిచింది. విద్యార్థులు మంచి ఉద్యోగాలు సాధించేలా ఓవైపు ఇంటర్న్‌షిప్, మరోవైపు నైపుణ్య శిక్షణను ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో ఇంజనీరింగ్, డిగ్రీలోనే కాకుండా డిప్లొమా విద్యార్థులూ మంచి మంచి ఉద్యోగాలు పొందుతున్నారు. వీటన్నింటికీ తోడు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలతో పేదింటి బిడ్డల విద్యకు ఆరి్థక భరోసా లభిస్తోంది. ఇందుకోసం సీఎం జగన్ ఈ ఐదేళ్లలో రూ.18,600 కోట్లకు పైగా ఖర్చు చేశారు. పెరిగిన క్యాంపస్ కొలువులు చంద్రబాబు హయాంలో కేవలం 35 వేలుగా ఉన్న క్యాంపస్ కొలువులు సీఎం జగన్ తీసుకొచ్చిన సంస్కరణ ఫలితంగా గణనీయంగా పెరిగాయి. గత ఏడాది (2022–23లో) ఏకంగా 1.80 లక్షల మందికి పైగా ఉన్నత విద్యనభ్యసించిన విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగాలు సాధించారు. వీరిలో 1.20 లక్షల మందికి పైగా సాంకేతిక విద్యనభ్యసించిన వారు కాగా, సాధారణ డిగ్రీ అభ్యసించి ఉద్యోగాలు పొందిన వారు 60 వేల మంది ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే క్యాంపస్ సెలక్షన్స్ జోరుగా సాగుతున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది మరింత ఎక్కువ మంది క్యాంపస్ ఎంపికల్లో ఉద్యోగాలు పొందే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది 11 వేలకు పైగా డిప్లొమా విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగాలు సాధించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు రూ.8.60 లక్షల వరకు ప్యాకేజీని అందుకున్నారు. ఇంటర్న్‌షిప్‌తో ఉద్యోగ నైపుణ్యంఉన్నత విద్యలో 30కి పైగా గ్లోబల్ సర్విసు ప్రొవైడర్ల ద్వారా వర్చువల్, మరో 27 వేలకు పైగా పరిశ్రమలతో కళాశాలలను అనుసంధానం చేసి ఎక్స్పీరియన్స్ ఇంటర్న్‌షిప్‌లకు వైఎస్ జగన్ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల్లో 52.80 శాతం ఐటీ, 13.43 శాతం అకౌంటింగ్, 8.45 శాతం విద్యా, 5.47 శాతం ఫార్మా, 8.68 శాతం మార్కెటింగ్, 4.39 శాతం గవర్నమెంట్ సెక్టర్, 2.01 శాతం ఉత్పత్తి, 1.78 శాతం వ్యవసాయం, 1.36 శాతం ఆతిథ్యం, 0.9 శాతం అడ్వరై్టజింగ్, 0.7 శాతం బయోటెక్నాలజీ రంగంలో పేరు గడించిన సంస్థల్లోనే ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇంటర్న్‌షిప్‌లను అందించింది. ఈ ఏడాది సుమారు 40 వేల మంది సంప్రదాయ డిగ్రీ విద్యార్థులకు స్టైఫండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్‌ను అందించింది. తద్వారా చదువు సమయంలోనే విద్యార్థులు సంపాదనను ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఒక్క ఏడాదిలోనే 1.25 లక్షల మంది విద్యార్థులు మైక్రోసాఫ్ట్ సర్టీఫికేషన్, మరో 1.50 లక్షల మంది ఇతర సర్టిఫికేషన్లు సాధించారు. ఎడెక్స్ ద్వారా అంతర్జాతీయ వర్సిటీ సర్టీఫికేషన్ కోర్సులు పూర్తి చేసి 1.73 లక్షలకుపైగా సర్టీఫికేషన్లు సాధించారు. వీటన్నింటి ఫలితంగా క్యాంపస్ ఇంటర్వ్యూల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నారు. నైపుణ్యాన్ని పెంచే సర్టీఫికేషన్ఏపీ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో ఉద్యోగావకాశాలు పొందేలా ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మైక్రోసాఫ్ట్‌తోపాటు తదితర సంస్థల ద్వారా ప్రభుత్వం శిక్షణ ఇప్పిస్తోంది. మైక్రోసాఫ్ట్ అప్‌స్కిల్లింగ్‌లో భాగంగా డేటా సైన్స్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఎనాలసిస్, నెట్వర్కింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సర్టీఫికేషన్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తోంది. ఇందుకోసం దాదాపు రూ. 37 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది. అలాగే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ద్వారా ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), పైథాన్, క్లౌడ్, డేటా ఎనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, క్యాడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) అంశాల్లో శిక్షణ అందిస్తోంది. నాస్కామ్ ప్యూచర్ స్కిల్స్ పేరినేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్విసెస్ కంపెనీస్ (నాస్కామ్) ఫ్యూచర్ స్కిల్స్ పేరిట లక్ష మందికి మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్, సిస్కో, సేల్స్‌ఫోర్స్, ఏడబ్ల్యూఎస్ విభాగాల్లో వర్చువల్‌గా ప్రభుత్వం శిక్షణ ఇప్పించింది. అలాగే ‘ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ప్రెస్’ సంస్థతో 50 వేల మందికి శిక్షణ ఇప్పిస్తోంది. ఐసీఐసీఐ, విప్రో, ఐబీఎం, ఎడెల్వీస్, హోండా, మారుతి సుజుకి వంటి కంపెనీల్లో ఫుల్‌స్టేక్, హెచ్ఆర్, మార్కెటింగ్, సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్, బీఎఫ్ఎస్ఐ అనలిస్ట్ తదితర అంశాల్లో శిక్షణ అందించింది. అదేవిధంగా ఎడ్యుస్కిల్స్ ఫౌండేషన్ సంస్థతో వర్చువల్ ఇంటర్న్‌షిప్ కార్యక్రమానికి ఉన్నత విద్యా మండలి ఒప్పందం కుదుర్చుకుంది. 1.60 లక్షల మంది విద్యార్థులకు ఈ సంస్థ వర్చువల్ ఇంటర్న్‌షిప్ అందించింది. 281మంది ఏయూ విద్యార్థులకు ఉద్యోగాలు ఏయూ క్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన 281 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. ఏపీఎండీసీలో రూ 8.4 లక్షల వార్షిక వేతనంతో ఐదుగురు, ప్రధాన్ ఎన్జీఓలో రూ.10 లక్షల వార్షిక వేతనంతో పదిమంది, శ్రీ చైతన్య కళాశాలల్లో 60 మంది, ఎంఎస్ఎన్ ల్యాబ్స్‌లో 58 మంది, హెటిరో డ్రగ్స్‌లో 109 మంది, సింధు సంస్థలో 39 మంది మొత్తం 281 మందికి ఉద్యోగాలు లభించాయి. వీరిలో కొంతమందికి వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి తన కార్యాలయంలో నియామక పత్రాలు అందజేసి, వారిని అభినందించారు. విశ్వవిద్యాలయం నుంచి వెళ్లే సమయంలో విద్యార్థి చేతిలో ఉద్యోగ నియామక పత్రం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఈ సందర్భంగా ప్రసాదరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ప్లేస్మెంట్ అధికారి వి.ఆర్.రెడ్డి పాల్గొన్నారు. రూ.16.30 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది మా స్వస్థలం ఒంగోలు. నాన్న రైతు. రాష్ట్రంలో సాంకేతిక విద్య కరిక్యులమ్‌లో తెచ్చిన మార్పులు మాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. చదువు సమయంలోనే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను క్యాంపస్‌లోనే నేర్చుకున్నాం. సాధారణ పాఠ్యాంశాలతో విషయ పరిజ్ఞానం వస్తుంది. 10 నెలల ఇంటర్న్‌షిప్ ద్వారా ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించాం. కంప్యూటర్ సైన్స్ చివరి ఏడాదిలో ఉండగానే నాకు ఉద్యోగం వచ్చింది. డారి్వన్బాక్స్ డిజిటల్ సొల్యూషన్స్‌లో రూ.16.30 లక్షల ప్యాకేజీతో లభించింది. – అల్లాడి సంధ్య, జేఎన్టీయూ కాకినాడ మా ఫ్యామిలీ ఫుల్ ఖుష్మాది విశాఖపట్నం. నాన్న పండ్ల వ్యాపారి. అమ్మ గృహిణి. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నేను.. ఇప్పుడు థాట్ వర్క్స్ సాఫ్ట్వేర్ కంపెనీలో రూ.8 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించాను. అక్కడ ఉద్యోగం చేసేవారికి ఉన్నత చదువులకు ఆ కంపెనీ సహకారం అందిస్తుంది. ప్రత్యేకంగా మార్కెట్లో జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్‌పై మాకు తరగతి గదిలోనే నేరి్పంచారు. ఇంటర్న్‌షిప్, ఆన్లైన్ కోర్సులతో సిలబస్‌ను దాటి చాలా విషయాలు నేర్చుకున్నాం. గడిచిన రెండేళ్లుగా మా కాలేజీలో క్యాంపస్ ఎంపికలు బాగున్నాయి. – ఆర్.అజయ్, ప్రభుత్వ పాలిటెక్నిక్, అనకాపల్లి -
ఆర్ధిక అనిశ్చితి.. ఐఐటీ బాంబే విద్యార్ధులకు దక్కని జాబ్ ఆఫర్లు
అంతర్జాతీయ స్థాయిలో ఆర్ధిక అనిశ్చితి దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో జరిగే ప్లేస్‌మెంట్స్‌పైనా ప్రభావం చూపుతోంది. ఐఐటీ బాంబే విద్యార్ధుల్లో 36 శాతం మంది అభ్యర్ధులకు ప్రస్తుత ప్లేస్మెంట్ సీజన్లో ఇప్పటివరకూ ఉద్యోగాలు లభించలేదు. 2 వేల మంది ప్లేస్మెంట్లో నమోదు చేసుకుంటే వారిలో 712 మందికి ఇప్పటికీ జాబ్ ఆఫర్లు రాకపోవడం గమనార్హం. పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం..ఐఐటీ బాంబే ప్లేస్‌మెంట్స్‌లో నమోదు చేసుకున్న సీఎస్ఈ విద్యార్ధులకు పూర్తిస్ధాయిలో జాబ్ ఆఫర్లు పొందలేకపోవడం ఇదే తొలిసారి. ప్లేస్మెంట్ డ్రైవ్‌లో పాల్గొన్న కంపెనీల్లో 380 కంపెనీలు దేశీ కంపెనీలు కాగా, అంతర్జాతీయ కంపెనీ సంఖ్య ఈసారి తక్కువగా ఉందని చెబుతున్నారు. కాగా, ఆర్ధిక అనిశ్చితి, ఇతరాత్ర కారణాల వల్ల ఐఐటీ బాంబే నిర్ధేశించిన ప్యాకేజీ ఇచ్చేందుకు సంస్థ మొగ్గుచూపడలేదని తెలుస్తోంది. అయితే ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొనే ముందు పలు దశల్లో ఆయా కంపెనీలు సంప్రదింపులు జరుపుతున్నాయని అధికారులు తెలిపారు. -
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఫ్రీజ్ అవ్వటానికి కారణాలు
-
క్యాంపస్ రిక్రూట్మెంట్లపై ఫ్రెషర్స్ లో కంగారు
-
హైదరాబాద్‌లో గూగుల్ క్యాంపస్ నిర్మాణ పనులు ప్రారంభం
హైదరాబాద్‌లో ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ క్యాంపస్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అమెరికా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గూగుల్ క్యాంపస్‌ను ఆ సంస్థ గచ్చిబౌలిలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్యాంపస్ నిర్మాణానికి గత ఏడాది ఏప్రిల్ 28న మంత్రి కేటీఆర్ చేతులు మీదిగా శంకుస్థాపన జరిగింది. తాజాగా, ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. #Google #Hyderabad 🚨 Construction on Google's new office campus at Financial District has (finally) begun! Spread across 23 floors with a built-up of 3 million sft for 25,500 employees, it will be their largest office campus outside their US HQ in Mountain View!🔥 pic.twitter.com/pWjekAnCZ8 — Hyderabad Mojo (@HyderabadMojo) October 14, 2023 గూగుల్ క్యాంపస్ హైదరాబాద్ నానక్‌రాంగూడలో 7.3 ఎకరాల్లో 30 లక్షల 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 23 ఫ్లోర్లలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పూర్తయితే 25,500 మందికి ఉపాధి కలగనుందని గూగుల్ ప్రతినిధులు తెలిపారు. Super excited to break the ground for Google’s largest campus outside of their HQ at Mountain View, USA A 3.3 Million sft energy efficient campus built with sustainability will stand as a landmark for Hyderabad for decades to come Thanks to Google for their continued support pic.twitter.com/wbjbjit9VC — KTR (@KTRBRS) April 28, 2022 -
ఉన్నతప్రమాణాలు..మరింత ప్రశాంతత
సాక్షి, హైదరాబాద్: మరింత ప్రశాంతతకు, ఉన్నత విద్యా ప్రమాణాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదిక కాబోతోందని వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ తెలిపారు. యూనివర్సిటీలు ప్రశాంత వాతావరణంలో ఉండేలా దేశవ్యాప్తంగా క్లోజ్డ్ క్యాంపస్‌ల ఏర్పాటు జరుగుతోందని చెప్పారు. ఇందులో భాగంగా ఓయూకు ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసిందని, బయటి వ్యక్తులు క్యాంపస్ నుంచి ప్రయాణించకుండా బైపాస్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల కేవలం విద్యార్థులే ప్రాంగణంలో తిరుగుతారన్నారు. ఓయూలో మహిళా విద్యార్థినుల సంఖ్య పెరుగుతోందని, క్లోజ్డ్ క్యాంపస్ ఏర్పాటు వల్ల వారికి మరింత పటిష్టమైన భద్రత చేకూరుతుందని చెప్పారు. మరోవైపు వర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు వివరించారు. రెండేళ్లుగా మౌలిక వసతులకు రూ.145 కోట్లు ఖర్చు చేశామన్నారు. శుక్రవారం యూనివర్సిటీ ప్రాంగణంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. హాస్టళ్లు.. సరికొత్త క్లాస్‌రూమ్‌లు సైఫాబాద్‌లోని యూనివర్సిటీ కాలేజీలో 300 మందికి సరిపడా బాలుర హాస్టల్ నిర్మాణం. నిజాం కాలేజీలో 284 మంది బాలికల కోసం హాస్టల్ ఏర్పాటు. సెంటినరీ హాస్టల్‌ను 500 మందికి సరిపడేలా నిర్మాణం. ఓయూ ప్రాంగణంలో స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్టుల ఏర్పాటు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో సరికొత్త క్లాస్ రూంల ఏర్పాటుకు శ్రీకారం. పరిశోధనలకు వీలు కల్పించేలా పూర్తి స్థాయి సాంకేతిక విద్యా విధానం అందుబాటులోకి తెచ్చేందుకు వ్యూహరచన. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఓయూకు నిధులు సమకూరాయి. అమెరికాలోని 12 నగరాలను ప్రొఫెసర్ రవీంద్ర సందర్శించారు. అక్కడ పూర్వ విద్యార్థులతో భేటీ అయ్యారు. ఓయూలో వారి అనుభవాలు వివరించేందుకు అంగీకారం కుదిరింది. మారుతున్న విద్యా విధానంలో భాగంగా ఈ ఏడాది నుంచి ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీసెస్ అమలు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు వర్సిటీ విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించేందుకు అనుమతి. ఈ ఏడాది నుంచి నిరంతర పరీక్షా విధానం అమలు. ఎప్పటికప్పుడు మధ్యంతర పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో సమీక్ష ఉస్మానియా యూనివర్సిటీ: నిరంతర పరీక్షా విధానంపై ప్రొఫెసర్ రవీందర్ వివిధ కాలేజీల ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఇతర కోర్సులకు ఇంటర్నల్ పరీక్షలు, ప్రాక్టికల్స్‌తో పాటు ప్రతి ఆరు నెలలకు ఒక సెమిస్టర్ పరీక్షను నిర్వహిస్తున్నారు. యూజీసీ ప్రవేశ పెట్టిన కొత్త నిబంధనల ప్రకారం సెమిస్టర్ పరీక్షలతో పాటు 15 రోజులకు ఒకసారి పరీక్షలను నిర్వహించేందుకు వర్సిటీ సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ల అభిప్రాయాలు, అభ్యంతరాలు, సందేహాలను వీసీ తెలుసుకున్నారు. -
గూగుల్ ఉద్యోగులకు బంపరాఫర్.. ఆఫీస్‌కు రప్పించడానికి కొత్త ఎత్తుగడ!
మండే వేసవిలో లగ్జరీ ఏసీ హోటల్లో విశ్రాంతి తీసుకోవడానికి ఎవరు ఇష్టపడకుండా ఉంటారు? ఆఫీస్‌కి వెళ్లేందుకు చెమటలు కక్కుతూ ప్రయాణించాల్సిన పనిలేదు. ఆఫీస్ క్యాంపస్‌లోని హోటల్లోనే మకాం. అయితే ఈ ఆఫర్ గూగుల్ ఉద్యోగులకు మాత్రమే. వర్క్ ఫ్రం హోమ్‌కి అలవాటు పడిన ఉద్యోగులను ఆఫీస్‌కు రప్పించడానికి గూగుల్ వేసిన కొత్త ఎత్తుగడ ఇది. గూగుల్ ఫుల్‌టైమ్ ఉద్యోగులు క్యాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలోని క్యాంపస్ హోటల్లో ఒక రోజుకు 99 డాలర్లకే రూమ్ బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. సమ్మర్ స్పెషల్ ఆఫర్ అంటూ దీన్ని పేర్కొన్నట్లు ‘సీఎన్‌బీసీ’ నివేదించింది. గూగుల్ ఉద్యగులు హైబ్రిడ్ వర్క్‌ప్లేస్‌కి మారడాన్ని సులభతరం చేసేలా సెప్టెంబర్ 30 వరకు ఈ ఆఫర్ అమలు అవుతుంది. అయితే హోటల్లో బస చేసేందుకు అయ్యే మొత్తాన్ని తమ పర్సనల్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఉద్యోగులే భరించుకోవాలి. ఆ మొత్తాన్ని కంపెనీ రీయింబర్స్ చేయదు. ఎందుకంటే ఇది అన్‌అప్రూవ్డ్ బిజినెస్ ట్రావెల్ కిందకు వస్తుందని కంపెనీ పేర్కొంది. ఉదయం హడావుడిగా ఆఫీసుకు రావాల్సిన పని లేదు. ఓ గంట ఎక్కువగా నిద్ర పోవచ్చు. మధ్యలో రూమ్‌కి వెళ్లి బ్రేక్‌ఫాస్ట్ లేదా వర్కవుట్ చేసుకోవచ్చు. ఆఫీస్ వర్క్ పూర్తయ్యాక హోటల్ టాప్ డెక్కి వెళ్లి ఆహ్లాదకరమైన సాయంత్రాన్ని ఆస్వాదించవచ్చు అంటూ ఈ ఆఫర్‌కు సంబంధించిన ప్రకటన చెబుతోంది. గూగుల్ యాజమాన్యంలోని ఈ హోటల్ కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో గత సంవత్సరం ప్రారంభించిన కొత్త క్యాంపస్‌లో ఉంది. 42 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్ నాసా అమెస్ రీసెర్చ్ సెంటర్‌కు ఆనుకుని ఉంది. ప్రకటనల విభాగంలో పనిచేస్తున్న 4,000 మంది ఉద్యోగులకు ఇక్కడ వసతి కల్పించే సామర్థ్యం ఉందని దీని ప్రారంభం సందర్భంగా కంపెనీ పేర్కొంది. శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియా రియల్ ఎస్టేట్ ధరలు విపరీతంగా ఉంటాయి. చాలా టెక్ కంపెనీల కార్యాలయాలతో పాటు టెక్ పరిశ్రమ ఉద్యగులు ఇక్కడ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఇక్కడున్న కార్పొరేట్ కార్యాలయాలు చాలా గూగుల్ యాజమాన్యంలోనివో లేకుంటే లీజ్‌కు తీసుకున్నవో ఉంటాయి. కంపెనీకి చెందిన హోటళ్లలో ఉద్యోగులకు ఇలాంటి ఆఫర్లు తరచూ ఇస్తుంటామని గూగుల్ ప్రతినిధి తెలిపారు. Google Jobs Cut 2023: కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించిన గూగుల్.. వాళ్లు చేసిన పాపం ఏంటంటే.. -
ఆంధ్రా యూనివర్సిటీలో ఉద్యోగ విప్లవం
-
కాల్పుల భయంలో అమెరికా..హడావిడి చేసిన యూనివర్సిటీ
అమెరికాలో గతేడాది నుంచి వరుస కాల్పుల ఘటనలో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ప్రజలు దుండగులు కాల్పుల భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక యూనివర్సిటీ సైతం కాల్పులు జరిగే అవకాశం ఉందంటూ హడావిడి చేసింది. అందుకోసం యూనివర్సిటీ ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించి ట్విట్టర్ వేదికగా విద్యార్థులను అప్రమత్తం చేసింది కూడా. ఈ అనూహ్య ఘటన అమెరికాలోని నార్మన్లో ఉన్న ఓక్లహోమ్ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఓక్లహోమ్ యూనివర్సిటీలో ఓ సాయుధుడు కాల్పులు జరుపుతున్నాడని విద్యార్థులను అప్రమత్తంగా ఉండండి అంటూ యూనివర్సటీ అధికారులు ట్విట్టర్ వేదికగా సర్క్యూలర్ జారీ చేశారు. అత్యవసర పరిస్థితని కూడా ప్రకటించింది. పైగా క్యాంపస్‌లో విద్యార్థులు ఉంటే పరిగెత్తండి, దాక్కోండి లేదా ఆత్మరక్షణ కోసం ఫైట్ చేయండి అంటూ ట్వీట్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యూనివర్సిటీ మొత్తం సోదా చేయగా.. అలాంటిదేమీ లేదని తేలింది. వెంటనే యూనివర్సిటీ అధికారులు క్యాంపస్‌కి ఎలాంటి ముప్పు లేదంటూ ఆ హెచ్చరికను కూడా రద్దు చేసింది. ఇటీవలే నాషేవిల్లే పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు చిన్నారులతో సహా ఒక ఉపాద్యాయుడు మృతి చెందిన కొద్దిరోజులకే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. గత కొంతకాలంగా కళాశాల, పాఠశాలల్లోనే కాల్పులు చోటు చేసుకోవడంతో ఈ తుపాకీ హింసతో అమెరికా వాసులు బెంబేలెత్తిపోతున్నట్లు తెలుస్తోంది. OU-NORMAN Critical 10:53pm: OUPD has issued an ALL CLEAR. After a thorough search, no threat was found. There is no threat to campus. Alert has been canceled. — Univ. of Oklahoma (@UofOklahoma) April 8, 2023 (చదవండి: పాక్ 2026 నాటికి చైనా, సౌదీ అరేబియాలకు రూ. 63 వేల కోట్లు చెల్లించాలి) -
తప్పని తిప్పలు: జాబొచ్చినా జాయినింగ్ లేదు!
గత ఏడాదే కోర్సులు పూర్తి చేసుకున్న ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు క్యాంపస్ రిక్రూట్మెంట్లలో ఎంపికైనా ఉద్యోగాలు మాత్రం ఇంకా చేతికి అందలేదు. ఏడాది కింద కాలేజీలకే వెళ్లి, మెరిట్ విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి రిక్రూట్ చేసుకున్న కొన్ని కంపెనీలు ఇప్పటికీ ‘ఆన్ బోర్డింగ్ (ఉద్యోగాల్లో చేర్చుకోవడం)’ప్రక్రియను మొదలుపెట్టలే దు. పైగా మళ్లీ కొత్తవారి కోసమంటూ పలు కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేపడుతుండటం.. చిన్న కంపెనీలే కాకుండా బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ)లు కూడా ఇలాగే వ్యవహరిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు ఉద్యోగం వస్తుందా, రాదా? భవిష్యత్తు ఎలా ఉంటుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీరింగ్/డిగ్రీ చదువు ముగియగానే క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఎంపిక కావడంతో.. తమకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనే ఊహలు తలకిందులు అవుతున్నాయని వాపోతున్నారు. – సాక్షి, హైదరాబాద్ నిరుద్యోగుల వెతలెన్నో.. ఇటీవల ‘ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ (ఫైట్)’చేసిన అధ్యయనంలో ‘ఆఫర్ లెటర్ల’తో అభ్యర్థు లు ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వచ్చాయి. భారీ సంఖ్యలో ఐటీ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేస్తూ ఆఫర్ లెటర్లు (లెటర్ ఇంటెంట్) ఇచ్చిఏడాది దాటుతున్నా ఆన్ బోర్డింగ్ సమాచారం ఇవ్వడం లేదు. దీనితో చాలా మంది ఆందోళనలో పడిపోతున్నారు. ఇక కొన్ని కంపెనీలు ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నా యి. మరికొన్ని కంపెనీలు ఉద్యోగంలో చేరేందుకు నిర్ణీతకాలానికి బాండ్లు సమర్పించాలని, ఒరిజి నల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కొర్రీలు పెడుతు న్నా యి. అభ్యర్థులు ఇతర కంపెనీల్లో మంచి ఉద్యో గాలు, ఆఫర్లు వచ్చినా వెళ్లలేని పరిస్థితిని కల్పిస్తున్నాయి. కొన్ని కంపెనీలు తాము శిక్షణ, ఇతరాల కోసం వెచ్చించిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లిస్తే ఇతర కంపెనీలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నాయి. ఫైట్ నిర్వహించిన సర్వేలో వేయి మందికి పైగా ఆఫర్ లెటర్ల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇన్ఫోసిస్, ఎంఫసిస్, విప్రో, క్యాప్‌జెమిని వంటి ప్రధాన కంపెనీలు కూడా ఇందులో ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ఆందోళన వద్దు.. ఐటీరంగంలో ఒడిదుడుకులు సహజమేనని, యువత తమ నైపుణ్యాలు, నాలెడ్జ్‌ను పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉద్యోగాల కోసం కొన్నినెలల నిరీక్షణ ఫరవాలేదని, అది ఎక్కువ కాలమైతేనే సమస్యగా మారుతుందని చెప్తున్నారు. రెండు, మూడేళ్లకోసారి కరెక్షన్ వస్తుందని, అది ఆయా రంగాలకు మంచిదే తప్ప హానికరం కాదని పేర్కొంటున్నారు. ముందే స్పష్టత తీసుకోవాలి.. ఎంఎన్‌సీలు సహా వివిధ ఐటీ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్కు వచ్చినప్పుడే ఏ తేదీ లోగా ‘ఆన్ బోర్డింగ్’చేస్తారనే దానిపై కాలేజీ యాజమాన్యాలు స్పష్టత తీసుకోవాలి. లేకుంటే కంపెనీలు తమకు నచ్చినట్టు చేస్తూ.. అవసరముంటే నెలలోనే జాయినింగ్ ఇస్తూ, లేకుంటే నెలల తరబడి జాప్యం చేస్తూ వెళుతున్నాయి. ఈ విషయంలో అటు కాలేజీలు, ఇటు కంపెనీల తప్పిదాలు ఉన్నాయి. ఐటీ కంపెనీ లు వెంటనే ఉద్యోగం ఇవ్వకపోయినా శిక్షణ ఇవ్వొ చ్చు. ఇంటర్న్‌షిప్, ట్రైనింగ్ ప్రాసెస్‌తో నడిపించవచ్చు. ఫ్రెషర్స్ కూడా ఒక కంపెనీ ఆఫర్‌కే పరిమి తం కాకుండా మరో కంపెనీలో ప్రయత్నించొచ్చు. ఆన్‌బోర్డింగ్ వచ్చేలోగా చిన్న కంపెనీలు, స్టార్టప్‌లలో చేరి నైపుణ్యాలు మెరుగుపరుచుకోవచ్చు. – రమణ భూపతి, క్వాలిటీ థాట్ గ్రూప్ చైర్మన్ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ఆఫర్ లెటర్లు ఇచ్చినా జాయినింగ్ తేదీపై కంపెనీలు స్పష్టత ఇవ్వకపోవడంపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. కార్మిక శాఖ ద్వారా సర్వే నిర్వహించాలి. ఆఫర్ లెటర్లను గౌరవించని సంస్థలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వపరంగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఇటీవల మా సంస్థ సర్వేలో వెల్లడైన అంశాలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్లకు అందజేశాం.. – సి.వినోద్‌కుమార్, కన్వీనర్, ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ ఆర్థిక మాంద్యం తొలగితే చక్కబడొచ్చు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్య పరిస్థితి నెలకొంది. మార్కెట్ వాస్తవ పరిస్థితి ఏమిటనేది మరో మూడు నెలల్లో స్పష్టత వస్తుంది. కంపెనీలు మంచి ఉద్ధేశంతోనే ఫ్రెష్ రిక్రూట్మెంట్ చేపట్టాయి. కంపెనీ బిజినెస్ అవసరాలను బట్టి ఆఫర్ లెటర్లు ఇచ్చిన వారిని ఆన్‌బోర్డింగ్‌కు పిలుస్తుంటాయి. ఆఫర్ లెటర్లు ఇచ్చి పిలవనంత మాత్రాన అది నేరమేమీ కాదు. ఎకానమీ వృద్ధి చెంది పరిశ్రమకు సానుకూల పరిస్థితులు ఏర్పడితే అన్నీ సర్దుకుంటాయి. గత వందేళ్లలో ప్రతి ఏడెనిమిదేళ్లకోసారి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా విస్తృతి పెరిగి ఎక్కువ ప్రచారం జరగడం తప్ప ఇది కొత్తగా వచ్చిన సమస్యేమీ కాదు. యువత సమయాన్ని సద్వినియోగం చేసుకుని స్కిల్స్ పెంచుకోవాలి. – కోఫోర్జ్ వెంకా రెడ్డి, సీనియర్ హెచ్ఆర్ లీడర్ -
కాకినాడలో ప్రతిష్టాత్మక IIFT విద్యాసంస్థ ఏర్పాటు
-
క్యాంపస్‌లో సరస్వతీ పూజ : వర్సిటీ అధికారుల అనుమతి
తిరువనంతపురం : విద్యార్ధుల నిరసనలతో కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తమ అలప్పుజ క్యాంపస్‌లో సరస్వతి పూజకు అనుమతించింది. శాంతియుతంగా పూజ నిర్వహించాలని సూచిస్తూ వర్సిటీ వారిని అనుమతించింది. కొచ్చిన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో అభ్యసిస్తున్న ఉత్తరాది విద్యార్ధుల ఆందోళనలతో పూజలకు వర్సిటీ అధికారులు అనుమతించారు. తొలుత వర్సిటీ సెక్యులర్ క్యాంపస్ అని, ఇక్కడ మతపరమైన ప్రార్థనలు, పూజలకు అనుమతించబోమని కొచ్చిన్ వర్సిటీ అధికారులు స్పష్టం చేసినా ఉత్తరాది విద్యార్ధులు ఆందోళన చేపట్టడంతో ఈనెల 9,10,11 తేదీల్లో క్యాంపస్‌లో శాంతియుతంగా సరస్వతి పూజ నిర్వహించుకోవాలని అనుమతించారు. గత ఏడాది సైతం పూజలకు అనుమతించారని విద్యార్ధులు ఆందోళన చేపట్టడంతో కొచ్చిన్ వర్సిటీ వీసీ, రిజిస్ర్టార్లతో కూడిన ఉన్నతస్ధాయి కమిటీ సరస్వతీ పూజకు అనుమతించిందని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. -
జేఎన్‌యూలో ఉద్రిక్తత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలు ముగిసి 24 గంటలు కూడా గడవకముందే క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికల్లో గెలిచిన వామపక్ష కూటమిలోని ఆల్ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ), ఓటమి పాలైన ఏబీవీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. అనంతరం పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున క్యాంపస్‌లోని గంగా దాబా వద్ద ఏబీవీపీ నేత సౌరభ్ శర్మ ఆధ్వర్యంలో తమపై దాడి జరిగిందంటూ విద్యార్థి సంఘం నూతన అధ్యక్షుడు సాయి బాలాజీ, మాజీ అధ్యక్షురాలు గీతాకుమారి తదితరులు వసంత్‌కుంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హాస్టల్ గదుల్లో ఉన్న తమ మద్దతుదారులను వామపక్షాలకు చెందిన విద్యార్థులు తీవ్రంగా కొట్టారంటూ ఏబీవీపీ నేతలు కూడా ఫిర్యాదు చేశారు. అంతకుముందు ఏబీవీపీ నుంచి తనకు ప్రాణహాని ఉందని సాయి బాలాజీ ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో క్యాంపస్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. కాగా, జేఎన్‌యూ విద్యార్థి సంఘం నూతన అధ్యక్షుడు ఎన్.సాయిబాలాజీ స్వస్థలం హైదరాబాదు. 2014 నుంచి ఆయన జేఎన్‌యూలో స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో పీహెచ్డీ చేస్తున్నారు. -
ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, న్యూఢిల్లీ : ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి దక్షిణ ఢిల్లీలోని క్యాంపస్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగరంలోని గ్రేటర్ కైలాష్‌లో కుటుంబంతో కలిసి ఉండే అన్షుమన్ గుప్తా (31) నిరుద్యోగి. 2010 బ్యాచ్ బీటెక్ స్టూడెంట్ అన్షుమన్ శుక్రవారం ఉదయం 11 గంటలకు క్యాంపస్ బిల్డింగ్ ఏడవ ఫ్లోర్ నుంచి దూకడంతో రక్తపు మడుగులో పడిఉన్నాడని పోలీసులు తెలిపారు. ఘటనా ప్రాంతంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని చెప్పారు. కాగా అన్షుమన్‌ను ఆస్పత్రికి తీసుకువచ్చే సమయానికే అతడు మరణించాడని డీసీపీ మిలింద్ మహదేవ్ డంబెరే తెలిపారు. నిరుద్యోగి అయిన అన్షుమన్ ఉదయాన్నే కాలేజీ స్నేహితుడిని కలిసేందుకు వెళుతున్నట్టు కుటుంబసభ్యులకు చెప్పాడని అన్నారు. అన్షుమన్ ఉద్యోగం రాలేదనే బెంగతో తీవ్ర చర్యకు పాల్పడినట్టు భావిస్తున్నామన్నారు. బాధితుడి కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నామని, పూర్తి దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
హృతిక్‌రోషన్‌తో నటిస్తా..
‘సినిమాల్లో అవకాశం వస్తే నా ఫేవరేట్ హీరో హృతిక్‌రోషన్‌తో నటిస్తా’ అని నిట్ క్యాంపస్ ప్రిన్సెస్ విజేత నీలాక్షిశర్మ పేర్కొన్నారు. నిట్ స్ప్రింగ్ స్ప్రీలో భాగంగా శుక్రవారం నిర్వహించిన క్యాంపస్ ప్రిన్సెస్ ఫ్యాషన్ షోలో విజేతగా నిలిచిన నీలాక్షిశర్మ శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఇవీ.. నమ్మలేకపోతున్నా.. వరంగల్ నిట్‌లో క్యాంపస్ ప్రిన్సెస్‌గా ఎంపికవడం నమ్మలేకపోతున్నా. ఇక్కడ చదువుకోవడం నా అదృష్టం. నిట్‌ను నా సొంత ఇంటిలా భావిస్తాను. ఈ ఏడాది ముంబాయిలో నిర్వహించే మిస్ ఇండియా–2018 పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచేందుకు ప్రయత్నిస్తా. నిట్ డైరెక్టర్, నా తల్లిదండ్రులు, అధ్యాపకులు, స్నేహితులు ప్రవళిక, స్వాతి ప్రోత్సాహంతో క్యాంపస్ ప్రిన్సెస్‌గా విజయం సాధించా. చదువు, మోడలింగ్ ప్రాధాన్యం.. వరంగల్ నిట్‌లో బీటెక్ తర్వాత ఎంఎస్ కోర్సు చేస్తూనే మోడలింగ్‌పై దృష్టిసారిస్తా.. మాది జార్ఖండ్. తండ్రి అనిల్‌కుమార్, తల్లి సీమాశర్మ, సోదరి జీలాక్షిశర్మ.. ప్రతి విషయంలో నన్ను ప్రోత్సహిస్తుంటారు. నాన్న మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫెర్స్లో సెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మిస్ ఇండియా–2018 కాంటెస్ట్‌లో గెలుపొంది మహిళా సాధికారత కోసం కృషి చేస్తా. మానుషీచిల్లర్ స్ఫూర్తితో.. మిస్ ఇండియా– 2017 విజేత మానుషీచిల్లర్ను స్ఫూర్తిగా తీసుకుని క్యాంపస్ ప్రిన్సెస్ పోటీల్లో పాల్గొన్నా. కేవలం వారం రోజులు మాత్రమే సాధన చేశా. గతేడాది స్ప్రింగ్ స్ప్రీలో నిర్వహించిన అల్యూర్ ఫ్యాషన్ షోలో ఐదుగురితో కలిసి ర్యాంపుపై క్యాట్ వాక్ చేశాను. మా టీం విజేతగా నిలిచింది. ఆ విజయంతో కేవలం వారంరోజుల పాటు మాత్రమే ప్రాక్టీస్ చేశాను. -
14న ఎస్కేయూలో క్యాంపస్ ఇంటర్వ్యూలు
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 14న క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ టి.హెచ్.విన్సెంట్ తెలిపారు. బహుళజాతి సంస్థ అయిన బీఎస్పీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రతినిధులు ఇంటర్వ్యూ చేస్తారని పేర్కొన్నారు. ఎస్కేయూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు. 2015, 2016, 2017 విద్యాసంవత్సరాల్లో బీకాం, ఎంకాం, ఎంబీఏ ఉత్తీర్ణులైన వారు ఇంటర్వ్యూలో పాల్గొనడానికి అర్హులన్నారు. ఇతర వివరాలకు 94909 78868, 78010 31771 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చన్నారు. -
ఉపాధి శిక్షణ మరింత విస్తృతం
– డిగ్రీ అభ్యర్థులకూ క్యాంపస్ సెలక్షన్స్ – రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ సంస్థ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ప్రయివేట్ రంగంలో ఉద్యోగాలకు అవసరమైన నేపుణ్యాలను యువతలో పెంపొందించేందుకు ఉద్దేశించిన శిక్షణ కార్యక్రమాలను మరింత విస్తృతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ సంస్థ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తెలిపారు. రవీంద్ర మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఇతర సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు పూర్తి చేసిన లక్షలాదిగా విద్యార్థులు బయటకు వస్తున్నా వారిలో ఉద్యోగ నైపుణ్యాలు లేవన్నారు. కనీసం కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్ లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ క్రమంలో వారికి శిక్షణ ఇచ్చి మెలకువలు నేర్పుతున్నట్లు చెప్పారు. పలు అంతర్జాతీయ సంస్థలతో అవగాహన కుదుర్చుకొని క్యాంపస్ డ్రై వ్లు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది నుంచి డిగ్రీ అభ్యర్థులకు కూడా క్యాంపస్ డ్రై వ్‌లను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో రవీంద్ర విద్యా సంస్థల చైర్మన్ మోహన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కొలువు ఫలాల కల్పతరువు
క్యాంపస్ ఇంటర్వ్యూల్లో జేఎన్టీయూకే ముందంజ అగ్రశ్రేణి సంస్థల్లో ఉద్యోగాలు సాధిస్తున్న విద్యార్థులు తాజాగా టీసీఎస్ సంస్థకు 207 మంది ఎంపిక బాలాజీచెరువు (కాకినాడ): ఐటీ బూమ్, మాంద్యంలతో సంబంధం లేకుండా ప్రారంభించిన నాటి నుంచి గణనీయంగా ప్లేస్మెంట్లు కల్పిస్తూ ‘కొలువుల కల్పతరువు’గా ఖ్యాతినార్జించింది జేఎన్టీయూ కాకినాడ ఇంజనీరింగ్ కళాశాల. కళాశాలలో గత వారం రోజులుగా ప్రముఖ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ సంస్ధ టీసీఎస్ నిర్వహిస్తున్న క్యాంపస్ ఇంటర్వ్యూలు శుక్రవారంతో ముగిశాయి. బీటెక్‌లో అన్ని బ్రాంచ్‌లతో పాటు ఎంటెక్, ఎంఎస్‌ఐటీ, ఐఎస్టీ కోర్సు విద్యార్థులకు ఈ నెల ఒకటి నుంచి క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. ముందుగా రాతపరీక్ష నిర్వహించి, ఎంపికైన వారికి టెక్నికల్ రౌండ్ అనంతరం ఫైనల్‌గా గురు, శుక్రవారాల్లో హెచ్ఆర్ ఇంటర్వ్యూ నిర్వహించి బీటెక్ నుంచి 146 మందిని, ఎంటెక్ నుంచి 61 మందిని ఎంపిక చేశారు. బీటెక్ విద్యార్థులకు రూ.3.30 లక్షలు, ఎంటెక్ విద్యార్థులకు రూ.3.50 లక్షల వార్షిక వేతనం అందజేయనున్నారు.వీరిలో ఒకరు డిజిటల్ ఇంటర్వ్యూకు ఎంపికైయ్యారు. ఎంఎస్‌ఐటీ విద్యార్థుల హవా మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఎస్‌ఐటీ) కోర్సు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 19 మంది పరీక్షకు హాజరవగా 14 మంది ఎంపికయ్యారు. రెండు సంవత్సరాల వ్యవధిగల ఎంఎస్‌ఐటీ కోర్సును అమెరికాలోని కార్నెగీ మెల్లాన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. టీసీఎస్‌లో విజయం సాధించా.. నూజీవీడు సారథి ఇన్స్టిట్యూట్లో ఈసీఈ విభాగంలో ఇంజనీరింగ్ చదివాను. ఎంఎస్‌ఐటీ కోర్సు పూర్తిగా సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినది. కోర్సు ద్వితీయ సంవత్సర మెుదటి నెలలోనే టీసీఎస్‌కు ఎంపికవడం సంతోషంగా ఉంది. –తలాటం కొండబాబు, ఎంఎస్‌ఐటీ ద్వితీయ సంవత్సరం క్యాంపస్ ఇంటర్వ్యూలకు తగ్గ శిక్షణ ఈ కోర్సు పూర్తిగా క్యాంపస్ ఇంటర్వ్యూలలో విజయం సాధించేలా రూపకల్పన చేయబడింది. సిలబస్‌లో 90 శాతం ప్రాక్టికల్స్‌కు, పదిశాతం మాత్రమే థియరీకి కేటాయించారు. ఈ కోర్సును అభ్యసించిన విద్యార్థులకు నూరుశాతం ఉపాధి తప్పకుండా వస్తుంది. – కె.సంతోషి ప్రియాంక, ఎంఎస్‌ఐటీ ద్వితీయ సంవత్సరం ఫ్యాకల్టీ శిక్షణతో విజయం ఇప్పుడు అభ్యసిస్తున్న కోర్సు పూర్తిగా సాఫ్ట్వేర్రంగానికి సంబంధించినది. ఫ్యాకల్టీలంతా వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని రోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. వారి సూచనలు, శిక్షణ వల్లే విజయం సాధిచడం సులభమౌతుంది. – వి.సాయి అలేఖ్య, ఎంఎస్‌ఐటీ డిజిటల్ ఇంటర్వ్యూలో విజయం సాధించా.. టీసీఎస్ నిర్వహించిన డిజిటల్ ఇంటర్వ్యూలో విజయం సాధించి రూ.6.3 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాను. బీటెక్ సీఎస్ఈ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. కోర్సు పూర్తవకుండానే ఉపాధి పొందడం చాలా సంతోషంగా ఉన్నది. అధ్యాపకుల సహకారం మరువలే నిది. –పి.బాల గణేష్, సీఎస్ఈ నాలుగో సంవత్సరం ప్రాక్టికల్ నాలెడ్జ్‌కే ప్రాధాన్యం సిలబస్‌లో బీటెక్ తరహాలో పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం ప్రాక్టికల్ నాలెడ్జ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాము. థియరీకి గంట మాత్రమే కేటాయించి, మిగతా సమయంలో పోగ్రామింగ్స్కు ప్రాధాన్యమివ్వడం వల్లే విద్యార్థులు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు సాధించగలుగుతున్నారు. –డాక్టర్ ఎం.సహదేవయ్య, ఎంఎస్‌ఐటీ కో ఆర్డినేటర్ నూరుశాతం ఉపాధి కల్పనే లక్ష్యం జేఎన్టీయూకేలో విద్యను అభ్యసించే బీటెక్, ఎంటెక్, ఎంఎస్‌ఐటీ అభ్యర్థులకు నూరుశాతం ఉపాధి కల్పనే ధ్యే్యయంగా జేఎన్టీయూకే వీసీ,రిజిస్ట్రార్, అధ్యాపకుల సహకారంతో కృషిచేస్తున్నాం. విద్యార్థుల గ్రూప్ డిష్కషన్లు, ప్రెజెంటేషన్లు, రైటింగ్ అసైన్మెంట్లు, కామర్స్ స్పెషలైజేషన్‌లో మొబైల్ అప్లికేషన్స్ శిక్షణతో పాటు డేటా ఎనలిటిక్స్ డొమైన్స్ పై శిక్షణ ఇవ్వడంతో ఉద్యోగాల సాధన సులభతరమౌతుంది. వచ్చేవారంలో మరిన్ని కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలకు సిద్ధంగా ఉన్నాయి. –డాక్టర్ జి.విఆర్.ప్రసాద్‌రాజు, జేఎన్టీయూకే ప్రిన్సిపాల్ జేఎన్టీయూహెచ్ కన్నా ఎక్కువ ప్లేస్మెంట్లు జేఎన్టీయూకేలో చదివిన ప్రతి విద్యార్థికీ కోర్సు పూర్తయ్యే లోపే ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా వర్సిటీ అధికారులు, అధ్యాపకులు కృషి చేస్తున్నారు.ప్లేస్మెంట్ ఆఫీస్ ద్వారా ఈ నెలలో, అక్టోబర్‌లో మరిన్ని కంపెనీలు ఇంటర్వ్యూలకు సిద్ధంగా ఉన్నాయి. పలువురు జాతీయ స్థాయి కంపెనీకి ఎంపికై జేఎన్టీయూకే ప్రతిష్ట నిలిపారు. ఈ సంవత్సరం జేఎన్టీయూ హైదరాబాద్ కంటే కాకినాడ వర్సిటీలో ఎక్కువ ప్లేస్మెంట్ అవడం గర్వంగా ఉన్నది. –ఎస్.చంద్రశేఖర్, ప్లేస్మెంట్ ఆఫీసర్, జేఎన్టీయూకే -
‘పైడా’లో రేపు ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూలు
తాళ్లరేవు : పటవలలోని పైడా ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో గల ఐసీఐసీఐ బ్యాంక్‌ల్లో ఆఫీసర్ ఉద్యోగాలకు ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు కళాశాల చైర్మన్ పైడా సత్య ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ పూర్తిచేసిన వారందరూ ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చన్నారు. భాష, కంప్యూటర్ పరిజ్ఞానం, వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారన్నారు. ఆసక్తి కలిగినవారు జె. కృష్ణారావు, సెల్ నెం. 83339 61165ను సంప్రదించాలని సూచించారు. -
పాలిటెక్నిక్ ప్రాంగణంలో బీసీ హాస్టళ్లు
ఒక్కో భవన నిర్మాణానికి రూ.2.50 కోట్లు హన్మకొండ అర్బన్ : జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ పాలిటెక్నిక్ కశాళాల ఆవరణలో కొత్తగా రెండు బీసీ సంక్షేమ హాస్టల్ భవనాలు నిర్మిం చనున్నారు. ఒకటి బాలురకు, ఒకటి బాలికలకు కేటాయిస్తారు. ఒక్కో భవన నిర్మాణానికి కేంద్ర సాంకేతిక విద్యాశాఖ నుంచి రూ.2.50 కోట్లు కేటాయించనున్నారు. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపించారు. రెండు హాస్టళ్లలో బీసీలతో పా టు ఇతర విద్యార్థులకు సమానంగా సీట్లు కే టాయిస్తారు. ఒక్కో హాస్టల్లో విద్యార్ధుల గరి ష్ట పరిమితి 100 మందిగా ఉంటుంది. అయి తే ప్రస్తుతం పాలిటెక్నిక్ ప్రాంగణంలో నిర్మిం చబోయే హాస్టళ్లలో విద్యార్థుల పరిమితిలో మినహాయింపు ఇస్తున్నారు. ఒక్కో హాస్టల్లో 200 మంది ఉండే అవకాశం ఉంటుంది. వీరిలో సగం మంది పాలిటెక్నిక్, మిగతా సగం ఇతర కళాశాలల్లో చదివేవారు ఉండేలా పాలిటెక్నిక్, బీసీ సంక్షేమశాఖ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. భవనాల నిర్వహణ బాధ్యతలు బీసీ సంక్షేమ శాఖ పర్యవేక్షిస్తుంది. గ్రేటర్లో కొత్తగా నాలుగు హాస్టళ్లు.. జిల్లాలో ఇప్పటికే కాలేజీ హాస్టళ్లు ఉన్నప్పటికీ నగరంలో విద్యార్థులకు సరిపడనంతగా లేవు. దీంతో గ్రేటర్ మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా కాలేజీ హాస్టళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని బీసీ సంక్షేమ శాఖాధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. గ్రేటర్ పరిధిలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో రెండు బాలుర, రెండు బాలికల కాలేజీ హాస్టళ్ల చొప్పున అవసరమని నివేదిక పంతున్నట్లు డీబీసీడబ్ల్యూఓ హృషికేష్‌రెడ్డి తెలిపారు. ఇంతకాలం బీమారంలో కొనసాగిన వర్ధన్నపేట నియోజక వర్గ బాలికల కళాశాల హాస్టల్‌ను న్యూశాయంపేటలోని కొత్త భవనంలోకి మార్చినట్లు చెప్పారు. -
అంబేద్కర్ వర్శిటీ కొత్త క్యాంపస్ ప్రారంభం!
న్యూఢిల్లీః దేశరాజధాని నగరంలో అంబేద్కర్ విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ ను విద్యాశాఖ మంత్రి సిసోడియా ప్రారంభించారు. రాష్ట్ర నిధులతో ప్రారంభమైన యూనివర్శిటీగా 2008లో 1800 మంది విద్యార్థులతో ప్రారంభమైంది. 2020 నాటికి మరో రెండు క్యాంపస్ లు ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. ఢిల్లీనగరంలోని కశ్మీర్ గేట్ ప్రాంతంలో నెలకొన్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం 40 అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, రీసెర్స్ ప్రోగ్రామ్ లను అందిస్తోంది. ప్రతి సంవత్సరం ఢిల్లీలో 2.5 లక్షల మంది విద్యార్థులు పన్నెండో తరగతి పూర్తి చేస్తే, వారిలో సగానికి పైగా విద్యార్థులు ఢిల్లీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని వివిధ కళాశాలలకు ఉన్నత విద్యకు వెళుతున్నారని కరంపుర ప్రాంతంలో క్యాంపస్ ప్రారంభోత్సవ సందర్భంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. విద్యార్థుల్లో చాలామంది డ్రాపవుట్స్ గా మారడం, ఢిల్లీనుంచి ఇతర ప్రాంతాల్లోని కాలేజీలకు వెళ్ళడం, లేదా ప్రైవేట్ కళాశాలల్లో భారీ మొత్తంలో ఫీజులు చెల్లించి ప్రవేశాలు పొందడం చేస్తున్నారని, అటువంటివారికి సదుపాయం కల్పించాలన్న ఆలోచనలోనే 2020 నాటికి రోహిణి, ధీర్ పురేర్ ప్రాంతాల్లో మరో రెండు క్యాంపస్ లు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సిసోడియా తెలిపారు. విద్యాశాఖా మంత్రిగా కూడా ఉన్న సిసోడియా.. మరింతమంది విద్యార్థులకు స్థానం కల్పించడంతోపాటు.. విద్యా ప్రమాణాలను పెంచడానికి వారికి కావలసిన బోధనా సిబ్బంది, విద్యాలయాధికారులను సైతం నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మొత్తం 26 లక్షల మంది విద్యార్థుల్లో.. ప్రభుత్వ పాఠశాలల్లోని 16 లక్షల మందితోపాటు.. మొత్తం 2.5 లక్షలమంది విద్యార్థులు ప్రతి సంవత్సరం ఉత్తీర్ణులై బయటకు వస్తున్నారని, ప్రతి సంవత్సరం 10 నుంచి 100 వరకూ సీట్లు పెంచడం సరికాదని చెప్పారు. సీట్లను పెంచడంతోపాటు.. విద్యాప్రమాణాలను కూడా పెంచాలని మంత్రి నొక్కి వక్కాణించారు. అయితే ఇటీవల ఢిల్లీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా కొత్తగా నిర్మించిన కళాశాల భవనాలను ప్రారంభించిన సందర్భంలో.. అరవింద్ కేజ్రీవాల్ మోదీని విమర్శిస్తూ ట్వీట్లు కూడా చేసిన సంతగి తెలిసిందే.