Carrot
-
Diwali 2024 దివాలీకి ఈ స్వీట్లు చేసిపెడితే : దిల్ ఖుష్!
దీపాల పండుగ దీపావళి (Diwali 2024) కోసం ఉత్సాహంగా జరుపుకునేందుకు దేశవ్యాప్తంగా పిల్లా పాపా అంతా ఎదురు చూస్తున్నారు. దీపావళి దీప కాంతులు, బాణాసంచా వెలుగులతో పాటు, స్వీట్ల సందడి కూడా ఉంటుంది.మరి ఈ క్రమంలో టేస్టీగా, ఈజీగా, హెల్దీగా చేసుకునే రెండు హల్వాల గురించి తెలుసుకుందాం. ఒకటి మూంగ్ హల్వా, రెండు క్యారెట్–ఖర్జూరం హల్వా. మరి వీటికి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇదిగో..ఇలా..!మూంగ్ హల్వాకావల్సిన పదార్థాలునెయ్యి – రెండు టేబుల్ స్పూన్లుచాయ పెసరపప్పు – అరకప్పు (కడిగిపెట్టుకోవాలి)నీళ్లు – రెండు కప్పులునెయ్యి – అరకప్పుగోధుమ పిండి – రెండు టేబుల్ స్పూన్లుపంచదార – ముప్పావు కప్పుఫుడ్ కలర్ – చిటికెడుయాలకుల పొడి – పావు టీస్పూనుజీడిపలుకులు – రెండు టేబుల్ స్పూన్లుకిస్మిస్లు – రెండు టేబుల్ స్పూన్లుతయారీ స్టవ్ మీద ప్రెజర్ కుకర్ పెట్టి వేడెక్కిన తరువాత టీస్పూను నెయ్యి వేసి పెసరపప్పును దోరగా వేయించాలి.తరువాత రెండు కప్పుల నీళ్లుపోయాలి, కుకర్ మూతపెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి.పప్పు చల్లారాక మిక్సీజార్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ∙స్టవ్ మీద మరో బాణలి పెట్టుకుని పావుకప్పు నెయ్యి, గోధుమ పిండి వేసి ఉండలు లేకుండా కలుపుతూ వేయించాలి.పిండి వేగిన తరువాత పప్పు మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉడికించాలి.ఐదు నిమిషాల తరువాత ముప్పావు కప్పు పంచదార వేసి సన్నని మంట మీద పదిహేను నిమిషాల పాటు తిప్పుతూ ఉడికించాలి.ఇప్పుడు పప్పు మిశ్రమం బాగా ఉడికి బాణలికి అంటుకోకుండా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ సమయంలో ఫుడ్ కలర్ వేసి మరో ఇరవై నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. స్టవ్‌మీద మరో పాన్ పెట్టి టేబుల్ స్పూను నెయ్యి, జీడిపలుకులు, కిస్మిస్లు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంతవరకు వేయించి హల్వాలో వేయాలి. యాలకులపొడి వేసి రెండు నిమిషాలు తిప్పితే మూంగ్ హల్వా రెడీ. క్యారెట్–ఖర్జూరం హల్వా కావల్సిన పదార్థాలు ఖర్జూరం – పావు కప్పు (గింజలు తీసి, కడిగి, కొన్ని మంచి నీళ్లలో కొంత సేపు నానబెట్టి తీసి, ఉడికించి, మిక్సీ పట్టుకోవాలి)క్యారెట్ తురుము– 1 కప్పు, కొబ్బరి పాలు– 2 కప్పులుకొబ్బరి కోరు, కస్టర్డ్ మిల్క్– పావు కప్పు చొప్పున, నెయ్యి,పంచదార– పావు కప్పు చొప్పున (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు), కుంకుమ పువ్వు – చిటికెడు, వెనీలా ఎసెన్స్– 1 టీ స్పూన్కిస్మిస్ గుజ్జు– 1 టేబుల్ స్పూన్, డ్రై ఫ్రూట్స్ ముక్కలు– కొన్ని (నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి)తయారీముందుగా ఖర్జూరం గుజ్జు, కొబ్బరి పాలు, పంచదార, ఏలకుల పొడి వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ బౌల్లో నెయ్యి వేడి చేసుకుని.. అందులో ఖర్జూరం మిశ్రమం మొత్తం వేసుకుని చిన్న మంట మీద, గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి.కాస్త దగ్గర పడుతున్నప్పుడు క్యారెట్ తురుము, కస్టర్డ్ మిల్క్, ఫుడ్ కలర్ వేసుకుని తిప్పుతూ ఉండాలి.ఆ తర్వాత కిస్మిస్ గుజ్జు, కొబ్బరి కోరు, వెనీలా ఎసెన్స్ ఒకదాని తరవాత ఒకటి వేసుకోవాలి.ఆ మిశ్రమం మరింత దగ్గర పడగానే, డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒకసారి అటు ఇటు కలిపి, సర్వ్ చేసుకోవాలి. -
బంగారం లాంటి క్యారెట్ : మృదువైన చర్మం, మెరిసే జుట్టు, ఇలా ఎన్నో..!
కూరగాయల్లో శ్రేష్టమైన క్యారెట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. క్యారెట్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి. రోగనిరోధక శక్తికినిచ్చే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా అనేక బ్యూటీ సీక్రెట్స్ కూడా ఉన్నాయి. అందుకే దీన్ని కాస్మొటిక్ వెజ్ అని కూడా అంటారు. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయ పడుతుంది. కాలేయం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాదు చర్మం,జుట్టుకు అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. సెప్టెంబరు 1 నుండి 7వ తేదీ జరుపుకునే నేషనల్ నూట్రిషన్ వీక్ సందర్భంగా ఈ విశేషాలు మీకోసం..ఆఫ్ఘనిస్తాన్‌లో మొట్టమొదట పండించిన దుంప కూర క్యారెట్. మనకు తెలిసిన ఆరెంజ్ రంగులో మాత్రమే కాదు, ఊదా, పసుపు, ఎరుపు, తెలుపు లాంటి ఇతర రంగులలో కూడా లభిస్తాయి. ఆరెంజ్ క్యారెట్లు 15-16వ శతాబ్దంలో మధ్య ఐరోపాలో అభివృద్ధి చేయబడ్డాయి.క్యారెట్లలో శక్తి అందించే విటమిన్లు ఏ, ఈ, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలతో పాటు బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. గుండె, మూత్రపిండాలు ,కాలేయ ఆరోగ్యానికి సాయం చేస్తుంది. క్యారెట్ విటమిన్ సి, లుటిన్, జియాక్సంథిన్, విటమిన్ కె, డైటరీ ఫైబర్‌కి మంచి మూలం. క్యారెట్లో పిల్లల ఎదుగుదలకు అవసరమైన బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బీటా కెరోటిన్ శరీరంలో విటమిన్ ఎగా మారుతుంది. కంటి సమస్యలను దూరం చేస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మెరిసే చర్మాన్ని పొందడానికి మీరు క్యారెట్‌ను ఫేస్ ప్యాక్‌ల రూపంలో కూడా ఉపయోగించవచ్చు. మధుమేహ రోజులు కూడా వాడవచ్చు. ఇందులో సహజ చక్కెరలు తక్కువగా ఉంటాయి. డైటరీ ఫైబర్ రక్తంలోకి చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. క్యారెట్లో విటమిన్ సి, కె, మాంగనీస్, కాల్షియం, ఐరన్, పొటాషియం, కాపర్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి కూడా తోడ్పాటునందిస్తాయి. క్యారెట్ రక్తపోటును నియంత్రించడంలో సహాయడటంతోపాటు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి, బీటా కెరోటిన్ లక్షణాలు చర్మంపై మొటిమలు, దద్దుర్లు మొదలైన చర్మ వ్యాధులకు నయం చేయడంలో పనిచేస్తుంది. చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.క్యారెట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులోని పీచు పదార్థం మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.వి తక్కువ కేలరీలున్న దీనిని పచ్చిగా తినవచ్చు. స్నాక్స్ లేదా డెజర్ట్ లాగా వాడుకోవచ్చు. అన్ని రకాల కూరల్లో, సలాడ్లలో చేర్చుకుంటే అనేక పోషకాలు అందుతాయి. విడిగా గానీ, బీట్ రూట్, పుదీనా లాంటివాటితో కలిపి గానీ జ్యూస్ చేసుకొని తాగవచ్చు. అంతేకాదు అందంగా కట్ చేసుకుని (గార్నిషింగ్) అలంకరించుకోవచ్చు కూడా -
అందం, ఆరోగ్యం అందించేది ఇదే..!
బేబీ క్యారెట్లు గురించి తెలియని వారుండరు. ఇది తినేందుకు కూడా రుచిగా ఉంటాయి. ముఖ్యంగా సాధారణ క్యారెట్స్ కంటే ఈ బేబీ క్యారెట్లు తింటే ఎన్నో లాభాలు పొందొగలమని అమెరికా పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. అందం, ఆరోగ్యానికి కేరాఫ్ అడ్రస్ బేబీ క్యారెట్లని తేల్చి చెబుతున్నారు. అంత మేలు చేసే ఈ బేబీ క్యారెట్లను చిరుతిండిగా తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, అధ్యయనంలో వెల్లడైన ఆసక్తికర విషయాలు తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!శాకాహార ప్రియులకు బెస్ట్ స్నాక్ ఐటెంగా తీసుకునే కాయగూర బేబీ క్యారెట్లు. వీటిని స్నాక్ రూపంలో మరేదైన విధంగా తీసుకోవడం చాలా మంచిది. క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వారానికి మూడుసార్లు తీసుకుంటే చర్మ కెరోటినాయిడ్లు గణనీయంగా పెరుగుతాయని పరిశోధనలో తేలింది. ఈ కెరోటినాయిడ్లు శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి చర్మంలోని ఫ్రీ రాడికల్స్‌ని తగ్గించగలవు. ఆక్సికరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. దీర్ఘకాలికి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మెరుగైన చర్మం, రోగనిరోధక వ్యవస్థ పనితీరుని మెరుగ్గా ఉంచుతాయి. అధిక స్థాయి కెరోటినాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్ రక్షణతో సంబంధం కలిగి ఉన్నాయని, ఇవి గుండె జబ్బులు, కేన్సర్ల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి పరిశోధకులు చెబుతున్నారు. చర్మ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుందంటే..చికాగోలో జరిగిన అమెరికన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్ చెందిన శాస్త్రవేత్తలు సుమారు 60 మంది యువకులపై అధ్యయనం నిర్వహించగా..స్కిన్ కెరోటినాయిడ్ స్కోర్లు గణనీయంగా 10.8% పెరిగినట్లు గుర్తించారు. సుమారు వందగ్రాములు బేబిక్యారెట్లు తీసుకుంటేనే మంచి ఫలితాలను చూపించిందని అన్నారు. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి కూడా వివరించారు. అవేంటంటే..దృష్టి లోపాన్ని మెరుగుపరుస్తుంది: చూపుని రక్షించడంలో సహాయపడుతుంది. వయస్సు సంబంధిత సమస్యల నుంచి కూడా రక్షిస్తుంది. ఇది పిత్తస్రావాన్ని పెంచుతున్నట్లు పరిశోధనలో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇది కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.దంతాల ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. వృద్ధ జపనీస్ జనాభాలో దంతాల నష్టం రేటుని అధ్యయనం చేయగా బీటా కెరోటిన్ ఎక్కువగా తీసుకున్న వారిలో దంత సమస్యలు తగ్గినట్లు గుర్తించారు. అయితే బేబి క్యారెట్లు సాధారణ క్యారెట్లు కంటే తక్కువ రోజులే నిల్వ ఉంటాయి. రిఫ్రిజిరేటర్లో అయితే సుమారు నాలుగు వారాల పాటు నిల్వ చేయవచ్చు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్!..ఒక లీటర్‌కే..!) -
క్యారట్ చికెన్ మఫిన్స్.. చిన్న పిల్లలు ఇష్టం తింటారు
క్యారట్ చికెన్ కప్స్ తయారీకి కావల్సినవి: క్యారట్ తురుము – కప్పు; వెల్లుల్లి తురుము – పావు కప్పు; బాదం పప్పు పొడి – ముప్పావు కప్పు; చీజ్ తురుము – ముప్పావు కప్పు; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను; గుడ్డు – ఒకటి; చికెన్ ఖీమా – అరకప్పు; ఉప్పు, మిరియాల పొడి – రుచికి సరిపడా తయారీ విధానమిలా: పెద్ద గిన్నెలో క్యారట్, వెల్లుల్లి, చీజ్ తురుములు, కొత్తిమీర చికెన్ ఖీమా, రుచికిసరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి ∙చివరిగా గుడ్డుసొనను కూడా వేసి కలపాలి ∙ఈ మిశ్రమాన్ని మఫిన్ ట్రేలో వేసి ఇరవై నిమిషాల పాటు బేక్ చేయాలి ∙గోల్డెన్ బ్రౌన్ కలర్లో క్రిస్పీగా మారితే చికెన్ క్యారట్ కప్స్ రెడీ. -
క్యారట్ డిలైట్.. హెల్తీ అండ్ టేస్టీగా ఇలా చేసుకోండి
క్యారట్ డిలైట్ తయారీకి కావల్సినవి: క్యారట్స్ – అరకేజీ; పంచదార – అరకప్పు; కార్న్‌ఫ్లోర్ – పావు కప్పు; నీళ్లు – కప్పు; నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు; ఎండుకొబ్బరి తురుము – గార్నిష్‌కు సరిపడా. తయారీ విధానమిలా: క్యారట్ తొక్కతీసి శుభ్రంగా కడిగి ముక్కలు తరగాలి ∙ముక్కలు మునిగే అన్ని నీళ్లు పోసి రెండు విజిల్స్ రానిచ్చి, చల్లారనివ్వాలి.ముక్కలు చల్లారాక పేస్టులా గ్రైండ్ చేయాలి ∙మెత్తని పేస్టుని వడగట్టాలి ∙వడగట్టిన పేస్టులో పంచదార, కార్న్‌ఫ్లోర్, నీళ్లు వేసి కలపాలి. మిశ్రమాన్ని చక్కగా కలిపిన తరువాత మందపాటి బాణలిలో వేయాలి ∙మీడియం మంట మీద తిప్పుతూ ఉడికించాలి.మిశ్రమం చిక్కబడినప్పుడు నెయ్యి వేసి తిప్పాలి ∙అడుగంటుతున్నప్పుడు తీసి నెయ్యి రాసిన ప్లేటులో సమానంగా పోయాలి ∙గంట తరువాత నచ్చిన ఆకారంలో ముక్కలు కోసి, కొబ్బరి తురుము అద్దుకుని సర్వ్ చేసుకోవాలి. -
వీకెండ్ స్పెషల్: క్యారట్ చట్నీ.. సింపుల్‌గా ఇలా చేసుకోండి
క్యారట్ చట్నీ తయారీకి కావల్సినవి: నూనె – టీస్పూను; పచ్చిమిర్చి – ఆరు; వెల్లుల్లి రెబ్బలు – రెండు; అల్లం తరుగు – టీస్పూను; చింతపండు – గోలీకాయంత; క్యారట్ – మీడియంసైజు మూడు; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; వేయించిన వేరుశనగ గింజలు – రెండు టేబుల్ స్పూన్లు; పచ్చికొబ్బరి తురుము – టేబుల్ స్పూను;జీలకర్ర – టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా తాలింపు కోసం: నూనె – టీస్పూను; ఆవాలు – టీస్పూను; జీలకర్ర – టీస్పూను; మినపప్పు – అరటీస్పూను; పచ్చిశనగపప్పు – అరటీస్పూను; ఎండుమిర్చి – రెండు; ఇంగువ – చిటికెడు; కరివేపాకు – రెమ్మ. తయారీ విధానమిలా: ∙బాణలిలో నూనెవేసి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపేస్టు వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి ∙ఇవన్నీ వేగిన తరువాత చింతపండు వేసి నిమిషం తర్వాత దించేయాలి ∙ఇదే బాణలిలో క్యారట్, కొత్తిమీర తరుగు, కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి ∙ఇప్పుడు వేయించిన పచ్చిమిర్చి మిశ్రమం, క్యారట్ తురుము, వేరుశనగ గింజలు, కొబ్బరి తురుము, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పువేసి గ్రైండ్ చేయాలి ∙చట్నీ మెత్తగా గ్రైండ్ చేసాక... తాలింపు దినుసులతో తాలింపు పెట్టి చట్నీలో వేయాలి ∙ఈ క్యారట్ చట్నీ ఇడ్లీ, దోశ, రోటి, అన్నంలోకి మంచి కాంబినేషన్. -
క్యారట్‌తో మూంగ్‌దాల్ సలాడ్, ఓసారి ట్రై చేయండి
పచ్చిగా, కచ్చాపచ్చాగా, ఉడికించి... ఎలా తిన్నా టేస్టీగానే ఉంటుంది క్యారట్.aఅందుకే కరకరల క్యారట్‌ను మరింత రుచిగా ఇలా కూడా వండుకోవచ్చని చెబుతోంది ఈ వారం వంటిల్లు... క్యారట్ మూంగ్‌దాల్ సలాడ్ తయారీకి కావల్సినవి: క్యారట్ తురుము – కప్పు; పెసరపప్పు –పావు కప్పు; పచ్చికొబ్బరి తురుము – రెండు టేబుల్ స్పూన్లు; పచ్చిమిర్చి తరుగు – రెండు టీస్పూన్లు; నిమ్మరసం – రెండు టీస్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను. తయారీ విధానమిలా: పెసరపప్పుని శుభ్రంగా కడిగి గంటసేపు నానబెట్టుకోవాలి.నానిన పప్పులో నీళ్లు వంపేసి పప్పుని పెద్ద గిన్నెలో వేయాలి ∙ఈ పప్పులో క్యారట్ తురుము, కొబ్బరి, పచ్చిమిర్చి తురుము, నిమ్మరసం, ఉప్పువేసి చక్కగా కల΄ాలి ∙చివరిగా కొత్తిమీర తరుగుతో వేసి సర్వ్‌చేసుకోవాలి. -
క్యారట్ లడ్డు.. ఒకసారి తిన్నారంటే మైమరచిపోతారు
క్యారట్ లడ్డు తయారీకి కావల్సినవి: క్యారట్ తురుము – రెండు కప్పలు; ఎండు కొబ్బరి తురుము – ఒకటిన్నర కప్పులు; కండెన్స్డ్ మిల్క్ – కప్పు; బాదం పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు; రోజ్‌వాటర్ – అరటీస్పూను; యాలకుల పొడి – అరటీస్పూను; నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు; పచ్చికొబ్బరి తురుమ – గార్నిష్‌కు సరిపడా. తయారీ విధానమిలా: రెండు స్పూన్ల నెయ్యివేసి కొబ్బరి తురుముని ఐదు నిమిషాల పాటు దోరగా వేయించాలి. కొబ్బరి వేగిన తరువాత క్యారట్ తురుము వేసి మీడియం మంట మీద పదినిమిషాలు వేయించాలి. ఇప్పుడు బాదం పలుకులు, కండెన్స్డ్ మిల్క్ వేసి కలపాలి. ఐదు నిమిషాల తరువాత రోజ్ వాటర్. యాలకుల పొడి వేసి సన్నని మంట మీద తిప్పుతూ మగ్గనివ్వాలి. మిశ్రమం చిక్కబడిన తరువాత దించేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని చల్లారిన మిశ్రమాన్ని లడ్డుల్లా చుట్టుకుని,పైన కొద్దిగా పచ్చికొబ్బరితో గార్నిష్ చేసి సర్వ్‌చేసుకోవాలి. -
వర్షాకాలంలో వెరైటీగా క్యారెట్ కార్న్ బజ్జీ ట్రై చేయండి
వర్షాకాలంలో వేడివేడి బజ్జీలు తినడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు చాలామంది. అయితే ఈసారి క్యారెట్ కార్న్ బజ్జీ ట్రై చేసి చూడండి. మరి ఆ తయరీ విధానమేంటో చూసేయండి.. క్యారెట్ కార్న్ బజ్జీ తయారీకి కావల్సినవి: క్యారెట్ – 3 (పెద్దవి, గుండ్రంగా లేదా పొడవుగా కట్ చేసుకోవాలి) శనగపిండి – 1 కప్పు ఉప్పు, కారం – సరిపడా కార్న్ పౌడర్ – పావు కప్పు బేకింగ్ సోడా – కొద్దిగా నీళ్లు – తగినన్ని నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా.. ముందుగా ఒక బౌల్లో శనగపిండి, కార్న్ పౌడర్, ఉప్పు, కారం, గరంమసాలా, బేకింగ్ సోడా వేసుకుని.. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా, బజ్జీల పిండిలా పలుచగా కలుపుకోవాలి. అందులో క్యారెట్ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి ముంచి.. నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ బజ్జీలను వేడివేడిగా సాస్‌లో లేదా అల్లం చట్నీలో నంజుకుని తింటే రుచిగా ఉంటాయి. -
Health: మలబద్ధకం నివారణ... మరికొన్ని ప్రయోజనాలు!! ఇవి తరచుగా తింటే..
Health Tips In Telugu- Constipation (Malabaddakam): మలబద్ధకం అన్నది ఉదయాన్నే చాలామందిని బాధపెడుతుంది. సాఫీగా విరేచనం జరగకపోతే పొద్దున్నే లేచింది మొదలు రోజంతా ఇబ్బందికరంగానే గడుస్తుంది. అయితే మన రోజువారీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుని, కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటుంటే మల బద్ధకం సమస్య చాలా సులువుగానే దూరమవుతుంది. అయితే ఈ మార్గాలతో కేవలం మలబద్ధకం నివారణ మాత్రమే కాకుండా అనేక అదనపు ప్రయోజనాలూ ఒనగూరతాయి. జీర్ణాశయం మార్గం శుభ్రంగా పీచు మోతాదు ఎక్కువగా ఉండే ఆహారాలు, పండ్లు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే మలబద్ధకం సమస్య దరిచేరదన్న విషయం తెలిసిందే. ఆ ఆహారాలు కేవలం మలబద్ధకాన్ని నివారించడం మాత్రమే కాదు... పూర్తి జీర్ణాశయం మార్గాన్నీ శుభ్రంగా ఉంచుతాయి. ఇందుకోసం భోజనంలో ఎక్కువమొత్తంలో ఆకుకూరలు, కాయగూరలు, ఫైబర్ ఎక్కువగా ఉండే కాయధాన్యాలు తీసుకోవాలి. చక్కెర మోతాదులు నియంత్రణలో వీటితో పాటు పీచు మోతాదులు పుష్కలంగా ఉండే పుచ్చకాయలు, బొప్పాయి, నారింజ వంటి పండ్లు తీసుకోవాలి. వీటితో మరో అదనపు ప్రయోజనం ఏమిటంటే... అవి తేలిగ్గా విరేచనమయ్యేలా చేయడంతో పాటు రక్తంలోని కొలెస్ట్రాల్‌నూ, చక్కెర మోతాదుల్ని నియంత్రణలో ఉంచడానికీ తోడ్పడతాయి. సలాడ్స్ రూపంలో.. చిక్కుడు కాయల వంటి కూరల్లో ప్రోటీన్‌తో పాటు ఫైబర్ కూడా ఎక్కువే. చిక్కుళ్లు కండరాల రిపేర్లకూ, శక్తికీ, ఆరోగ్యకరమైన కండరాలకూ దోహదపడతాయి. అలాగే వాటిలోని పీచుపదార్థాలూ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. క్యారట్, బీట్రూట్ వంటి వాటిల్లోనూ ఫైబర్ ఎక్కువే. వీటిని కూరలుగా తీసుకోవచ్చు. అయితే కొంతమందికి అవి కూరలుగా అంతగా నచ్చకపోవచ్చు. అలాంటివారు సలాడ్స్ రూపంలో లేదా సూప్‌గానూ తీసుకోవచ్చు. చర్మ నిగారింపునకై పీచుపదార్థాలుండే ఆహారాలతో పాటు తగినన్ని నీళ్లు తాగడం వల్ల కూడా విరేచనం సాఫీగా అవుతుంది. జీర్ణ వ్యవస్థ మార్గమూ శుభ్రపడుతుంది. దేహం హైడ్రేటెడ్‌గానూ ఉంటుంది. ఫలితంగా మలబద్ధక నివారణే కాదు చర్మానికి మంచి నిగారింపుతో కూడిన మెరుపును ఇవ్వడంతో పాటు మరెన్నో జబ్బుల నివారణకూ ఈ అంశం తోడ్పడుతుంది మరెన్నో వ్యాధుల నుంచి రక్షణ ఇక్కడ పేర్కొన్న మార్గాలు కేవలం మలబద్ధకం నివారణ కోసం మాత్రమే కాకుండా... దాదాపు ప్రతి ఒక్కటి మన వ్యాధినిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం, జీర్ణవ్యవస్థలోని పిండి పదార్థాలను (కార్బోహైడ్రేట్స్‌ను) రక్తంలోకి ఆలస్యంగా వెలువడేలా చేయడం ద్వారా మధుమేహాన్ని నివారించడం, మరెన్నో వ్యాధుల నుంచి రక్షణ కల్పించడం వంటి పనులూ చేస్తాయి. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కోసం మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు తగిన పరిష్కారం లభిస్తుంది. చదవండి: రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం దేనికి సంకేతం? బ్లాక్ కాఫీ తాగుతున్నారా? ఇవి తింటే.. తులసి ఆకులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి.. ఉదయం ఖాళీ కడుపుతో నమిలితే.. -
టొమాటో కిలో రూ.150, క్యారెట్ కిలో రూ. 490
కొలంబో: శ్రీలంక సంక్షోభం చరిత్రలో ఒక గుణపాఠంగా నిలుస్తోంది. దేశ ఆర్థిక, రాజకీయ సంక్షోభం అక్కడి ప్రజలను అష్టకష్టాల్లోకి నెట్టేసింది. మునుపెన్నడూ లేని విధంగా కిరాణా వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజువారీ ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో కనీసం తినడానికి తిండి లేక సామాన్యులు అల్లాడి పోతున్నారు. దీనికి తోడు పెట్రోలు సంక్షోభం పట్టి పీడిస్తోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో 1990 అత్యవసర అంబులెన్స్ సేవ కూడా నిలిపివేశారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ‘1990’ అత్యవసర అంబులెన్స్ సర్వీస్ నంబర్‌కు కాల్ చేయవద్దని సువా సేరియా అంబులెన్స్ సర్వీస్ ప్రజలను కోరింది. కొలంబోలోని పేటలోని ఫెడరేషన్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ మార్కెట్ (FOSE మార్కెట్)లో కిలో టమోటా శ్రీలంక రూపాయల్లో 150కి అమ్ముడవుతోంది. కిలో ఉల్లి శ్రీలంక రూపాయల్లో 200కు విక్రయిస్తుండగా, కిలో బంగాళదుంపలు శ్రీలంక రూపాయల్లో 220కి విక్రయిస్తున్నారు. కిలో క్యారెట్ రూ.490కి, పావుకిలో వెల్లుల్లి రూ.160కి విక్రయిస్తున్నారు. సరఫరా కొరతతోపాటు, రవాణా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయిందని కూరగాయల విక్రయదారులు వాపోతున్నారు. ఫైల్ ఫోటో కాగా 1948లో స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలిసారి ద్వీపం దేశం అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆహారం, మందులు, వంటగ్యాస్ ఇంధనం లాంటి నిత్యావసర వస్తువుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మరోవైపు మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ఒప్పందం కుదిరిన తర్వాత శ్రీలంక మంత్రివర్గం రాజీనామా చేయనుందని ప్రధాని కార్యాలయం తెలిపింది. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే బుధవారం తన రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. నిరసనకారులు రాజపక్సే అధికారిక నివాసంపై దాడి చేయడం, ఆందోళనకారులు ప్రధాని రణిల్ విక్రమసింఘే వ్యక్తిగత నివాసానికి నిప్పు పెట్టడం లాంటి పరిణామాలు తెలిసినదే. -
Summer Food: మామిడి, ఉల్లి, క్యారట్, నెయ్యి.. ఇవీ ఉపయోగాలు!
Summer Care- Superfoods: కాలానికి అనుగుణంగా తీసుకునే ఆహారం ఇంటిని, ఒంటినీ ఆరోగ్యంగా ఉంచుతుందనేది పెద్దల మాట. ఈ మాటను అనుసరించి వేసవిలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. మసాలాలు, వేడిచేసే ఆహార పదార్థాలనూ తీసుకోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే వేసవిలో తేలిగ్గా జీర్ణమయ్యేవి, శరీరం నిర్జలీకరణ జరగకుండా ఉండే ఆహార పదార్థాలేమిటో తెలుసుకుందాం. వేసవిలో నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరం నిర్జలీకరణ కాకుండా ఉంటుంది. అటువంటి వాటిలో ముఖ్యమైన వాటిని చూద్దాం... పుచ్చకాయ: ఇందులో 80 శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. అందువల్ల ఇది దాహాన్ని తీర్చి, డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. అందుకే వేసవి రాగానే ప్రతి ఒక్కరూ పుచ్చకాయలు తింటూ ఉంటారు. తాటిముంజలు: తాటిముంజలు తినడం వల్ల వేసవిలో దాహార్తి తీరుతుంది. చెమట కాయలు రాకుండా ఉంటాయి. మామిడి: పండ్లకు రాజయిన మామిడిలో అధిక శాతం సి విటమిన్, ఏ విటమిన్ ఉంటాయి. కాస్త ధర ఎక్కువయినా ఆల్ఫోన్సో మామిడి మరీ మంచిది. ఇందులో పీచుపదార్థాలు, రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మామిడిలో ఉండే పొటాషియం చెడుకొవ్వును తగ్గించి రక ్తప్రసరణ వేగాన్ని మెరుగుపరుస్తుంది. దానివల్ల గుండె సంబంధిత ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఉల్లి, క్యారట్: ఎండలో పడి ఇంటికి రాగానే ఉల్లిపాయ, క్యారట్, బీన్స్, వెల్లుల్లి వంటి కూరగాయలను తినాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఎండతో వచ్చే చర్మవ్యాధుల నుంచి రక్షిస్తాయి. సలాడ్స్: వేసవిలో కూరగాయలతో రకరకాల సలాడ్స్‌ను తయారు చేసుకోవచ్చు. గ్రిల్డ్ వెజిటబుల్స్, గ్రిల్డ్ వెజిటబుల్ పాస్తా, నూడుల్స్, గ్రిల్డ్ వెజిటబుల్ పనీర్ సలాడ్స్ వంటివి చేసుకోవచ్చు. సూప్స్: దోసకాయతో చేసిన సూప్‌ను భోజనానికి ముందుగా తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. హోల్ గ్రెయిన్ సలాడ్స్: మొక్కజొన్న, మొలకెత్తిన పెసలు, శనగలు, కూరముక్కలు.. వంటివాటిని కలిపి తీసుకుంటే మంచిది. అలాగే మొలకెత్తిన గింజలు, బీన్స్, తరిగిన కూరముక్కలు, పండ్లతో కలిపి సలాడ్‌లా తీసుకుంటే కాల్షియం, ప్రొటీన్లు వొంటికి అందుతాయి. ఇందులో తక్కువ క్యాలరీలున్న చీజ్‌ను తరిగిన కూరలతో కలపడం వల్ల కాల్షియం, ప్రొటీన్ల పరిమాణాన్ని పెంచవచ్చు. వేసవి పానీయాలు: సాధారణంగా సమ్మర్లో చాలామంది తియ్యగా, చిక్కగా ఉండే శీతల పానీయాలను, సోడాలను, ఐస్‌క్రీమ్‌లను తీసుకుంటూ ఉంటారు. వీటిలో కేలరీలు ఎక్కువ. ఎటువంటి ద్రవపదార్థాన్ని తీసుకున్నా తాత్కాలిక ఉపశమనమే.. అందువల్ల మజ్జిగ, లస్సీ వంటి వాటిని తాగాలి. ఇందులో కొవ్వు లేని పాలు శ్రేష్ఠం. ముఖ్యంగా మంచినీళ్లు, కొబ్బరినీళ్లు, పళ్ల రసాలు మంచిది. వీటన్నింటికంటే నిమ్మరసం తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. పండ్లు, పండ్ల రసాలు: చిక్కగా ఉండే డెజర్ట్స్‌కు బదులుగా పండ్లతో తయారు చేసిన డెజర్ట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. పండ్లు, బెర్రీలు, పుచ్చకాయ వంటి వాటిని తీసుకోవాలి. ఆకుపచ్చని కూరలు, టొమాటోలు, బఠాణీ వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి పోషక పదార్థాలు అందుతాయి. కీరకాయను తినడం వల్ల కడుపులో చల్లగా ఉంటుంది. వేసవిలో లభించే సీజనల్ పండ్లు తప్పకుండా తినాలి. ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ సి, ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి. వీటన్నింటితో పాటు అక్రోట్లను తీసుకోవాలి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. మాంసాహారులైతే చేపలను ఎక్కువగా తినడం మంచిది. ఉదయం పూట ఓట్స్ తినడం వల్ల శరీరానికి పీచు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువ గా అందుతాయి. పొట్టు తీయని పప్పు ధాన్యాలు, గింజలను తీసుకుంటే చాలామంచిది. నూనె పదార్థాలు శరీరంలోని నీటి శాతాన్ని తగ్గించేస్తాయి. అందువల్ల వేసవిలో జంక్‌ఫుడ్, వేపుళ్ల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఎరుపు, నారింజ, పసుపు రంగుల్లో ఉండే గుమ్మడి, బంగాళాదుంప, చిలగడదుంప, బెల్‌పెపర్.. వంటివాటిలో విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. నీరు: దాహాన్ని తీర్చడానికి నీటిని మించినది లేదు. ఎండలో ఇంటికి వచ్చినప్పుడు గ్లాసుడు మంచినీళ్లు తాగితే మంచిది. మంచినీళ్లు తాగితే శరీరం ఉత్తేజితమవుతుంది. డీహైడ్రేషన్‌కు దూరంగా ఉండచ్చు. వాల్ నట్స్: యాంటీ ఆక్సిడెంట్లు, నిద్రని రప్పించే ట్రిప్టోఫాన్ మూలకం వాల్‌నట్స్‌లో పుష్కలంగా ఉంటాయి. గింజల రాజుగా పేరొందిన వాల్ నట్లలో ఫైబర్, ఒమెగా కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. వాల్నట్లను తీసుకోవడం వల్ల మనం చెమట ద్వారానూ, వాతావరణంలోని ఇతర మార్పుల మూలంగానూ కోల్పోయే ఖనిజ లవణాలను భర్తీ చేసి, శరీరానికి తగినంత శక్తి చేకూరుతుంది. నెయ్యి: బరువు పెరుగుతున్నారని పక్కన పెడుతున్నారు కానీ, ఇందులో విటమిన్ ఏ, విటమిన్ కే2, విటమిన్ ‘ఈ’ లతోపాటూ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే లినోలిక్ ఆమ్లాలు ఉన్నాయి. వీటివల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు జీర్ణక్రియ మెరుగవుతుంది.. అలాగని అధికంగా తీసుకుంటే దాహం ఎక్కువ కావడం వంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తగిన మోతాదులో నెయ్యి తీసుకోవడం వల్ల వొంటికి తగిన మెరుపు వస్తుంది. తొందరగా అలసట కలగదు. అంజీర( అత్తి పండ్లు): ఆపిల్, ఎండుద్రాక్షల కంటే అంజీరా చాలా మెరుగైనవి. పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఈ పండ్లను తినడం వల్ల మలబద్దకం దూరమవుతుంది. చర్మ సమస్యలు రావు. ముఖ్యంగా వేసవిలో బరువు తగ్గాలనుకునేవారు వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.. వేసవిలో ఎటువంటి ఆహార పానీయాలు తీసుకోవాలి.. వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకున్నాం కదా, ఈ సీజన్లో ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యకరమైన వేసవిని ఆస్వాదించవచ్చు. చదవండి: Muskmelon Juice Health Benefits: కర్బూజా జ్యూస్.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో! -
Health Tips: వేసవిలో ఈ ‘డ్రింక్’ తాగారంటే..
Summer Care- Health Tips: వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి చాలా మంది కూల్డ్రింకులు, ఐస్‌క్రీములు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇవి అప్పటికప్పుడు దాహార్తిని తీర్చిన ఫీలింగ్ కలిగించినా దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి సహజసిద్ధంగానే ఇంట్లోనే కూల్‌కూల్‌గా.. అదే సమయంలో తక్షణ శక్తిని అందించే ఇలాంటి పవర్ బూస్టర్లు తయారు చేసుకోవడం ఉత్తమం. పైనాపిల్, పుచ్చకాయ, క్యారెట్లతో డ్రింక్‌ను తయారు చేసుకుని చల్లచల్లగా తాగితే ఎండ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎలా తయారు చేసుకోవాలంటే.. పావు కప్పు పైనాపిల్ ముక్కలు, పావు కప్పు పుచ్చకాయ ముక్కలు, రెండు క్యారట్లు, రెండు రెమ్మలు కొత్తిమీర తరుగు, రెండు అంగుళాల అల్లం ముక్క (ముక్కలు తరగాలి)ను తీసుకోవాలి. వీటన్నింటిని జ్యూసర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. వడగట్టి అవసరాన్ని బట్టి రెండు మూడు ఐస్ ముక్కలను వేసుకోని తాగాలి. ఇది ఆటలు ఆడేవారికి తక్షణ శక్తినందించే సహజసిద్ధమైన డ్రింక్‌లా పనిచేస్తుంది. శరీరానికి కావాల్సిన మొత్తంలో కార్బొహైడ్రేట్స్‌ను అందిస్తుంది. పుచ్చకాయ, క్యారట్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కొత్తిమీరలో సోడియం, పైనాపిల్ లలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫైటో న్యూట్రియంట్స్, విటమిన్ బీ ఉండడం వల్ల మంచి రిఫ్రెష్మెంట్ డ్రింక్‌గా పనిచేస్తుంది. చదవండి: తల తిరగడం కూడా గుండె వైఫల్యానికి సంకేతమే! -
క్యారెట్ రైతులకు ప్రభుత్వం భరోసా
రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిత్యం కృషి చేస్తోంది. లాక్డౌన్ సమయంలోనూ రైతులకు చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తోంది. జిల్లాలో క్యారెట్ పండిస్తున్న రైతులకు మార్కెట్ సౌకర్యం కలి్పంచడమే కాకుండా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే ప్రక్రియకు పూనుకుంది. గిట్టుబాటు ధర లభిస్తుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సాక్షి, చిత్తూరు : జిల్లాలోని పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట, ములకలచెరువు మండలాల్లోని రైతులు దాదాపు 100 ఎకరాల్లో క్యారెట్ సాగు చేస్తున్నారు. అయితే లాక్డౌన్ ఉన్నందున దిగుబడి అయిన క్యారెట్‌ను అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఈ విషయాన్ని రైతులు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చొరవ తీసుకుని అధికారులకు విషయాన్ని తెలియజేశారు. వెంటనే ఉద్యాన, మార్కెటింగ్ శాఖాధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పంట పరిస్థితులను పరిశీలించారు. మార్కెట్ సౌకర్యం క్యారెట్ రైతుల కష్టాలను తెలుసుకున్న ప్రభుత్వం వారం రోజులుగా వాటి విక్రయానికి చర్యలు చేపడుతున్నారు. క్షేత్రస్థాయిలో క్యారెట్‌ను అధికారులు కొనుగోలు చేసి, రైతు బజార్లకు తరలించే విధంగా మార్కెట్ సౌకర్యం కలి్పంచింది. కిలో క్యారెట్‌ను రూ.13 చొప్పున రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి రాష్ట్రంలోని పలు జిల్లాల రైతుబజార్లకు ఎగుమతి చేస్తున్నారు. ప్రతిరోజూ ఐదు టన్నులకు పైగా ఎగుమతి చేస్తూ ఇప్పటికీ 33 టన్నుల క్యారెట్‌ను ఎగుమతి చేశారు. మొత్తం 700 టన్నుల మేరకు దిగుబడి అయ్యే అవకాశమున్నందున నిత్యం క్యారెట్ తరలించే విధంగా అధికారులు చర్యలు తీసు కున్నారు. దీంతో కష్టకాలంలోనూ తమకు గిట్టుబాటుధర కలి్పంచడమే కాకుండా నేరుగా పొలం వద్దనే క్యారెట్‌ను కొనుగోలు చేయడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో ఆదుకున్నారు లాక్డౌన్ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వం ముందుకొచ్చి క్యారెట్‌ను కొనుగోలు చేయడం చాలా ఆనందంగా ఉంది. రోజూ అధికారులే పొలం వద్దకు వచ్చి కిలో రూ.13 చొప్పున కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – శ్రీనాథ్, రైతు, పీటీఎం మండలం కలత చెందాల్సిన అవసరం లేదు రైతులు పండించిన ఏ పంట దిగుబడికైనా కలత చెందాల్సిన అవసరం లేదు. లాక్డౌన్ అమలులో ఉన్నా మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. రైతులకు ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకువస్తే సత్వర చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం క్యారెట్‌ను విక్రయించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీనివాసులు, ఉద్యాన శాఖ డీడీ -
క్యారెట్ కేక్ చేసిన జాన్వీ
-
ముఖ కాంతికి పెరుగు, క్యారెట్
సౌందర్య ఉత్పత్తులలో రసాయనాలు, రోజువారీ జీవనశైలిలో ఎదుర్కొనే కాలుష్యం వల్ల ముఖ కాంతి తగ్గుతుంది. సహజమైన మెరుపుతో పాటు ముఖానికి నునుపుదనాన్ని తీసుకువచ్చే మేలైన ఫేస్ ప్యాక్స్‌ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ►కొబ్బరినూనె, తేనె కలిపి ముఖానికి మసాజ్ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. పొడి చర్మం గలవారు రోజూ రాత్రి పడుకునేముందు ఈ విధంగా చేస్తుంటే చర్మం మృదువు, కాంతిమంతంగా తయారవుతుంది. ►రెండు టీ స్పూన్ల అలొవెరా జెల్, టీ స్పూన్ పెరుగు, టీ స్పూన్ కీరా రసం కలిపి ముఖానికి, మెడకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఎండవల్ల కందిపోయిన, రసాయనాల వల్ల ర్యాష్ ఏర్పడిన చర్మానికి సహజమైన సౌందర్యలేపనంలా పనిచేస్తుంది ఈ ప్యాక్. ►టీ స్పూన్ గోధుమపిండిలో పచ్చిపాలు కలిపి ముఖానికి పట్టించి వేళ్లతో మృదువుగా రుద్దాలి.æపాలు చర్మానికి బాగా ఇంకాయనిపించాక చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. జీవం కోల్పోయిన చర్మానికి ఈ ప్యాక్ వల్ల మంచి కాంతి లభిస్తుంది. ►రెండు టీ స్పూన్ల క్యారెట్ రసంలో టీ స్పూన్ తేనె, రెండు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలిపి ముఖానికి పట్టించాలి. మృదువుగా రబ్ చేసి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి జీవకాంతి లభిస్తుంది. ►రెండు టేబుల్స్పూన్ల టొమాటో జ్యూస్, టేబుల్ స్పూన్ ఓట్స్ అరకప్పు పెరుగులో కలపాలి. మిశ్రమం గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, పదినిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. బ్లాక్‌హెడ్స్, మొటిమలు తగ్గి చర్మం మెరుపు పెరుగుతుంది. -
హెల్త్ టిప్స్
కూరగాయ ముక్కలని పెద్దవిగా కట్ చేస్తే వీటిలో లభించే విటమిన్స్ వృథా అవ్వవు.ప్రతిరోజూ నీళ్లలో తులసి ఆకులు వేసుకుని తాగాలి. ఇలా చేస్తే థ్రోట్ ఇన్ఫెక్షన్ క్రమంగా తగ్గుతుంది.క్యారెట్, టొమాటో కలిపి జ్యూస్ చేసి, తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని నీళ్లలో కలుపుకుని తాగితే రక్తశుద్ధి అవుతుంది.తులసి ఆకులని మరిగించిన నీటితో స్నానం చేస్తే చర్మం పై రాషెస్ తగ్గుముఖం పడతాయి.జీలకర్ర, పంచదారని కలిపి నమిలితే కడుపు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.గ్లాసుడు నీళ్లలో పావు టీ స్పూన్ ఏలకుల పొడి కలుపుకుని తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్ బాధ నుండి బయట పడవచ్చుఅల్లం ముక్కని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇందులో చిటికెడు జీలకర్ర పొడి, పంచదార కలిపి తింటే దగ్గు తగ్గుముఖం పడుతుంది. -
కలపకండి కలుసుకోండి
వనభోజనాలంటేనే ప్రకృతితో ఏకమవ్వడం... అన్నం పెట్టిన చెట్టుకు దండం పెట్టుకోవడం...కుటుంబంలో తను ఒక సభ్యులని గుర్తు చేసుకోవడం...తనతోపాటు కలిసి భోజనం చేయడం... వనభోజనం కృతజ్ఞతల ఘనభోజనం...ప్రకృతి మాత పిల్లలకు ముద్దలు చేసి పెడితే ఎంత బాగుంటుందో అనుకుంటున్నారు కదా!అందుకే ఈ వారం అన్నీ కలిపిన వంటలే... ముద్దలు చేసుకుని తినడం మాత్రమే!కలపకండి... కలుసుకోండి. క్యారట్ దద్ధ్యోదనం కావలసినవి: బియ్యం – ఒక కప్పు; పెరుగు – 3 కప్పులు; మిరియాలు – ఒక టీ స్పూను; క్యారట్ తురుము – ఒక కప్పు; జీడి పప్పులు – 15; కిస్మిస్ – గుప్పెడు; దానిమ్మ గింజలు – అర కప్పు; పాలు – 2 టేబుల్ స్పూన్లు; మీగడ – పావు కప్పు ; ఉప్పు – తగినంత పోపు కోసం: పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 5 ; పచ్చి మిర్చి – 5; కరివేపాకు – 2 రెమ్మలు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; కరివేపాకు – 3 రెమ్మలు; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను తయారీ: ∙బియ్యం శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి పక్కన ఉంచాలి ∙బాణలిలో నెయ్యి వేసి కరిగించాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, మిరియాలు, కరివేపాకు వరుసగా వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసి పక్కన ఉంచుకోవాలి ∙అదే బాణలిలో మరి కాస్త నెయ్యి వేసి కాగాక జీడి పప్పులు, కిస్మిస్ వేసి వేయించి తీసేయాలి ∙మరి కాస్త నెయ్యి వేసి కరిగాక క్యారట్ తురుము వేసి దోరగా వేయించి తీసేయాలి ∙ఒక పెద్ద పాత్రలో అన్నం వేసి పల్చగా పరవాలి ∙వేయించి ఉంచుకున్న పోపు, జీడిపప్పులు, కిస్మిస్, క్యారట్, ఉప్పు వేసి బాగా కలపాలి. పెరుగు, పాలు, మీగడ జత చేసి కింద నుంచి పైకి కలియబెట్టాలి ∙దానిమ్మ గింజలు వేసి మరోమారు కలపాలి. చివరగా కొత్తిమీరతో అలంకరించి అందించాలి. ఉసిరి రైస్ కావలసినవి బాస్మతి బియ్యం – ఒక కేజీ; పెద్ద ఉసిరి కాయల తురుము – అర కప్పు; పచ్చి సెనగ పప్పు – పావు కప్పు; మినప్పప్పు – పావు కప్పు; ఆవాలు – రెండు టీ స్పూన్లు; జీలకర్ర – రెండు టీ స్పూన్లు; ఎండు మిర్చి – 15; పచ్చి మిర్చి – 6; బెల్లం పొడి – ఒక టీ స్పూను; ఇంగువ – తగినంత; కరివేపాకు – 3 రెమ్మలు; ఉప్పు – తగినంత; పసుపు – తగినంత; జీడి పప్పులు – 50 గ్రా.; వేయించిన పల్లీలు – 100 గ్రా.; నువ్వుల నూనె/ నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు తయారీ: ∙ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి వెంటనే పెద్ద పళ్లెంలోకి తీసి ఆరబోయాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి లేదా నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు వేసి దోరగా వేయించాలి ∙ఆవాలు, జీలకర్ర , పచ్చి మిర్చి, ఎండు మిర్చి, ఇంగువ వరుసగా వేసి బాగా కలపాలి ∙దోరగా వేగిన తరవాత ఉసిరి కాయ తురుము జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙కరివేపాకు జత చేసి బాగా కలపాలి ∙చివరగా జీడి పప్పులు, వేయించిన పల్లీలు వేసి మరో సారి వేయించి దింపేయాలి ∙పళ్లెంలో ఉన్న అన్నం మీద ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి ∙వేయించి ఉంచుకున్న ఉసిరి + పోపు మిశ్రమం, బెల్లం పొడి చివరగా వేసి బాగా కలియబెట్టాలి ∙సుమారు గంట సేపు ఊరిన తరవాత దేవుడికి నివేదన చేసి సేవించాలి ∙వనభోజనాలలో ఉసిరి తప్పనిసరిగా తినాలంటారు కనుక, విడిగా ఉసిరి తినవలసిన అవసరం లేకుండా ఉసిరి రైస్ సిద్ధం చేసుకుంటే సరి. డ్రై ఫ్రూట్స్ క్షీరాన్నం కావలసినవి బియ్యం – ఒక కప్పు; చిక్కటి పాలు – 4 కప్పులు; బెల్లం పొడి – 2 కప్పులు; నెయ్యి – ఒక కప్పు; జీడి పప్పులు – 25 గ్రా.; కిస్మిస్ – 25 గ్రా.; పిస్తా – 25 గ్రా.; ఎండు కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూను; గింజలు లేని ఖర్జూరాలు – 5; ఏలకుల పొడి – పావు టీ స్పూను; కుంకుమ పువ్వు – చిటికెడు తయారీ: ∙ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లలో నానబెట్టాలి ∙చిక్కటి పాలను బాగా మరిగించాలి ∙బియ్యంలోని నీళ్లను ఒంపేసి పాలలో వేసి కలియబెట్టాలి ∙బాగా మెత్తగా ఉడికేవరకు అడుగు అంటకుండా కలుపుతూ ఉడికించాలి (పాలు చాలకపోతే మరిన్ని పాలు కాని నీళ్లు కాని జత చేయాలి) ∙ఒక చెంచాడు నెయ్యి వేసి కలియబెట్టాలి ∙బెల్లం తురుము వేసి మరోమారు బాగా కలిపి దింపేయాలి ∙బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిçపప్పులు, కిస్ మిస్, ఎండు కొబ్బరి ముక్కలు, పిస్తాలను విడివిడిగా వేయించి తీసి చక్ర పొంగలిలో వేసి కలపాలి ∙ఖర్జూరాలను కూడా జత చేసి మరోమారు కలపాలి ∙చివరగా కుంకుమపువ్వు వేసి కలియబెట్టాలి ∙క్షీరాన్నం బాగా చల్లారాక అందించాలి. నేతి బీరకాయ బజ్జీ కావలసినవి: నేతి బీరకాయలు – 2; సెనగ పిండి – అర కేజీ; బియ్యప్పిండి – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – ఒక టీ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; పచ్చి మిర్చి పేస్ట్ – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; తినే సోడా–చిటికెడు; నూనె – వేయించడానికి తగినంత తయారీ: ∙ముందుగా నేతి బీరకాయలను శుభ్రంగా కడిగి, సన్నగా చక్రాల్లా తరిగి పక్కన ఉంచాలి ∙ఒక పెద్ద గిన్నెలో సెనగ పిండి, బియ్యప్పిండి, ఉప్పు, మిరప కారం, అల్లం తురుము, పచ్చి మిర్చి పేస్ట్, ధనియాల పొడి, జీల కర్ర పొడి, చిటికెడు సోడా వేసి బాగా కలపాలి ∙తగినన్ని నీళ్లు జత చేసి బజ్జీల పిండి మాదిరిగా కలుపుకుని పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, నేతి బీర కాయ చక్రాలను ఒక్కటొక్కటిగా నూనెలో వేసి, రెండు వైపులా దోరగా వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙కొబ్బరి చట్నీతో కాని, గ్రీన్ చట్నీతో కాని తింటే రుచిగా ఉంటాయి. బిసిబేళ బాత్ కావలసినవి: ధనియాలు – 4 టీ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు – 4 టీ స్పూన్లు; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; జీలకర్ర – ఒక టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; మిరియాలు – అర టీ స్పూను; ఏలకులు – 4; దాల్చిన చెక్క – చిన్న ముక్క; లవంగాలు – 4; ఎండు కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు; గసగసాలు – 2 టీ æస్పూన్లు; నువ్వులు – ఒక టీ స్పూను; నూనె – ఒక టీ స్పూను; కాశ్మీరీ ఎండు మిర్చి – 12; కరివేపాకు – మూడు రెమ్మలు; ఇంగువ – చిటికెడు; క్యారట్ – 1 (చిన్నది); బీన్స్ – 5; పచ్చి బఠాణీ – 2 టేబుల్ స్పూన్లు; బంగాళదుంప – అర చెక్క (ముక్కలు చేయాలి); పల్లీలు – 2 టేబుల్ స్పూన్లు; నీళ్లు – 2 కప్పులు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; చింతపండు రసం – ముప్పావు కప్పు (కొంచెం చిక్కగా ఉండాలి); బెల్లం పొడి – అర టీ స్పూను; ఉల్లి పాయ – అర చెక్క (ముక్కలు చేయాలి); ఉడికించిన కంది పప్పు – ఒక కప్పు; అన్నం – రెండున్నర కప్పులు; నీళ్లు – ఒక కప్పు; నెయ్యి – ఒక టేబుల్ స్పూను పోపు కోసం: నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); ఇంగువ – కొద్దిగా; కరివేపాకు – 2 రెమ్మలు; జీడిపప్పులు – 10 తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో కూరగాయ ముక్కలు, పల్లీలు, నీళ్లు, పసుపు, ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి ముక్కలు మెత్తపడే వరకు ఉడికించాలి ∙ముక్కలు బాగా ఉడికిన తరవాత చింతపండు రసం, బెల్లంపొడి, ఉల్లి తరుగు వేసి సుమారు పదినిమిషాల పాటు ఉడికించాలి ∙ఉడికించిన పప్పు, అన్నం జతచేసి బాగా కలిపి మరో కప్పు నీళ్లు పోసి కలియబెట్టి, మూత పెట్టాలి ∙çకొద్దిసేపటి తరవాత 4 టీ స్పూన్ల బిసిబేళబాత్ మసాలా వేసి సన్నని మంట మీద 20 నిమిషాల పాటు ఉడికించి దింపేయాలి ∙చిన్న బాణలి స్టౌ మీద ఉంచి వేడయ్యాక నెయ్యి లేదా నూనె వేసి కాగాక పోపు కోసం తీసుకున్న సరుకులను వేసి వేయించి, సిద్ధం చేసుకున్న బిసిబేళబాత్ మీద వేసి బాగా కలిపి, వేడివేడిగా అందించాలి. -
ఇంటిప్స్
క్యారట్ పైభాగాన్ని కోసేసి గాలి దూరని కవర్లో పెట్టి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి.క్యారట్ వండేటప్పుడు నాలుగైదు చుక్కల నిమ్మరసం కలిపితే రంగు ఆకర్షణీయంగా ఉంటుంది.అరటిపండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నల్లని కవర్లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే వారం రోజులైనా తాజాగా ఉంటాయి. పచ్చిమిరపకాయలు తరిగిన తర్వాత వేళ్ళ మంట తగ్గాలంటే చల్లటి పాలలో కొద్దిగా చక్కెర వేసి అందులో వేళ్లను ముంచాలి. -
నా పేరు చెప్పుకోండి..?
జహీరాబాద్ టౌన్: ఈ ఫొటోలో కనిపిస్తోంది క్యాబేజీ అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటు పడినట్లే. ఇది క్యాబేజీలా కనిపిస్తున్న ఓ పిచ్చిమొక్క. మండలంలోని హుగ్గెల్లి రైతు ఇస్మాయిల్ తన పొలంలో క్యారెట్ సాగు చేశాడు. పంట మధ్యలో ఈ పిచ్చి మొక్క మొలిచింది. విచిత్రమైన ఈ మొక్కను సమీప రైతులు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. -
ఇన్‌టిప్స్
♦ సాంబారు, రసం పొడులను డీప్ ఫ్రీజర్‌లో నిల్వ ఉంచితే ఎక్కువ రోజులు వాసనపోకుండా తాజాగా ఉంటాయి. ♦ పచ్చళ్ళు, ఊరగాయల్లో స్టీల్ స్పూన్లు వాడకూడదు. కోడిగుడ్డు పొరటు మెత్తగా రావాలంటే మూడు టీ స్పూన్ల పాలు కలపాలి. ♦ ఉల్లిపాయలను గ్రైండ్ చేసిన వెంటనే వాడాలి, ఆలస్యమైతే చేదవుతుంది. గ్రైండ్చేసే ముందు ఉల్లిపాయలను కొద్దిగా నూనెలో వేయిస్తే ఎక్కువ సేపు తాజాగా ఉంటాయి. ♦ క్యారట్ పైభాగాన్ని కోసేసి గాలి దూరని కవర్లో పెట్టి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువరోజులు నిల్వ ఉంటాయి. ♦ అరటిపండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నల్లని కవర్లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే వారం రోజులైనా తాజాగా ఉంటాయి. క్యారట్ వండేటప్పుడు నాలుగైదు చుక్కల నిమ్మరసం కలిపితే రంగు ఆకర్షణీయంగా ఉంటుంది. ♦ పచ్చిమిరపకాయలు తరిగిన తర్వాత వేళ్ళమంట తగ్గాలంటే చల్లటి పాలలో కొద్దిగా చక్కెర వేసి అందులో వేళ్లను ముంచాలి. -
13 ఏళ్ల తర్వాత క్యారెట్లో దొరికిన రింగ్
ఒట్టావా : వివాహంలో ముఖ్యమైన ఘట్టాలలో మొదటిది ఎంగేజ్మెంట్. ఆ రోజు కాబోయే భర్త తొడిగే రింగ్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కెనడాకు చెందిన ఓ మహిళ తన ఎంగేజ్మెంట్ నాటి డైమండ్ రింగ్‌ను 13 ఏళ్ల కిందట పొగొట్టుకుంది. అయితే విచిత్రంగా ఆ రింగ్ ఓ క్యారెట్లో దొరికింది. వివరాలు... 13 ఏళ్ల కిందట ఇంటి ఆవరణలోని గార్డెన్లో అల్బర్టాకు చెందిన మేరీ గ్రామ్స్(84) కలుపు తీస్తుండగా ఎంతో ఇష్టంగా ధరించిన తన ఎంగేజ్మెంట్ రింగ్ కనిపించకుండాపోయింది. అయితే ఈ విషయాన్ని భర్త నార్మన్‌తో చెప్పాలేదు. గార్డెన్లో ఎన్నో రోజులు వెతికి వెతికి తన డైమండ్ రింగ్‌పై ఆశలు వదులుకుంది. కొన్ని రోజుల తర్వాత తన కుమారుడికి రింగ్ పోగొట్టుకున్న విషయం చెప్పింది. అల్బర్టాలోని అర్మెనా సమీపంలో ఒకప్పుడు మేరీ గ్రామ్స్ నివాసం ఉన్న ప్రాంతంలో ప్రస్తుతం ఆమె కుమారుడు క్యారెట్ పంట వేశాడు. కోడలు కొలీన్ డలే క్యారెట్లను సేకరించడానికి వెళ్లినప్పుడు వింత ఆకృతిలో పెరిగిన ఓ క్యారెట్ లభించింది. తొలత ఏదో పాడైన క్యారెట్‌గా భావించి పక్కన పడేయాలనుకున్నా.. చివరకు తనతో తీసుకువెళ్లింది. ఆ క్యారెట్‌ను శుభ్రం చేస్తుండగా అందులో రింగ్ ఉందని గుర్తించి తన భర్తకు ఈ విషయాన్ని తెలిపింది. అంతే వెంటనే రింగ్ దొరికిన విషయాన్ని మేరీ గ్రామ్స్తో చెప్పారు. 'మీరు పోగుట్టుకున్న రింగ్ మన గార్డెన్లో దొరికిందని చెప్పా. ఎంత చెప్పినా మేరీ గ్రామ్స్ నమ్మలేకపోయింది' అని కోడలు కొలీన్ డలే చెప్పారు.'రింగ్ దొరకడంతో ఉపశమనం పొందినట్టయింది. రింగ్లోపలికి క్యారెట్ వెళ్లినా పాడైపోలేదు' అని మేరీ గ్రామ్స్ ఆనందాన్ని వ్యక్తం చేసింది. కుటుంబసభ్యులు అందరూ చూస్తుండగానే సబ్బుతో శుభ్రం చేసి వెంటనే ఆ రింగ్‌ను ధరించింది. తన భర్త ఎంగేజ్మెంట్ సమయంలో తనకిచ్చినప్పుటికన్నా ఇప్పుడు చాలా సులువుగా వేలికి పట్టిందని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. ఐదేళ్ల కిందటే మేరీ గ్రామ్స్ భర్త నార్మన్ మృతిచెందారు. -
క్యారట్... హెల్దీ రూట్!
గుడ్‌ఫుడ్ కంటి చూపు బాగుండటానికి క్యారట్ ఉపయోగపడుతుందన్న విషయం తెలిసిందే. దానిలో ఉండే విటమిన్–ఏ వల్ల మనకు ఈ ప్రయోజనం కలుగుతుంది. అలాగే క్యారట్ కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గించి గుండెజబ్బులను నివారిస్తుంది. మేని రంగులో నిగారింపు తెస్తుంది. దీనిలో ఉండే పీచు పదార్థాల కారణంగా అది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. మాక్యులార్ డీజనరేషన్ అనే కంటి వ్యాధిని నివారించగల శక్తి క్యారట్‌కు ఉంది. క్యారట్ తినడం వల్ల లాలాజలం ఎక్కువగా ఊరి చిగుర్లు ఆరోగ్యకరంగా ఉంటాయి. నోటి ఆరోగ్యం కూడా బాగుంటుంది. రక్తంలో చక్కెరపాళ్లను సైతం క్యారట్ నియంత్రిస్తుంది. -
క్యారట్ – చిక్పీ సలాడ్
హెల్దీ కుకింగ్ కావలసినవి: క్యారట్ తురుము – ఒక కప్పు, పచ్చి శనగలు – 100 గ్రా. (నానబెట్టి, పై పొట్టు తీసినవి), ఉప్పు – పావు టీ స్పూ , నిమ్మరసం – 2 టీ స్పూన్లు, ఆల ఆయిల్ – 2 టీ స్పూన్లు (నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు), కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు, జున్ను – 100 గ్రా., మిరియాల పొడి – చిటికెడు తయారి: క్యారట్ తురుములో ఉప్పు వేసి కలపాలి. ∙శనగగింజలను నీరు లేకుండా వడకట్టి క్యారట్ తురుములో కలపాలి ∙నిమ్మరసం వేసి, ఆ తర్వాత ఆలివ్ ఆయిల్ క్యారట్ తురుము అంతటికీ పట్టేలా కలపాలి ∙కొత్తిమీర తరుగు, ఆపైన జున్ను వేశాక మిరియాల పొడి చల్లి సర్వ్ చేయాలి. నోట్: ఈ సలాడ్‌లో బాదంపప్పు, జీడిపప్పు వేసుకోవచ్చు. అలాగే కీర, పండ్ల ముక్కలను కూడా కలుపుకోవచ్చు. జున్ను బదులుగా చీజ్‌ను కరిగించి వాడుకోవచ్చు. తేనె కూడా వేసుకోవచ్చు. -
పనీర్ సలాడ్
క్విక్ రెసిపీ తయారి సమయం: 15 నిమిషాలు కావలసినవి: ఆపిల్ ముక్కలు – కప్పు; కీరా – ఒకటి (చెక్కుతీసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి); పచ్చి బఠాణీ – గుప్పెడు; క్యారట్ – రెండు పనీర్ ముక్కలు – అర కప్పు ; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – టీ స్పూన్; మిరియాల పొడి – పావు టీ స్పూన్; తేనె – అర టేబుల్ స్పూన్ తయారి: ముందుగా బఠాణీని కొద్దిగా ఉడకబెట్టుకుని నీటిని వంపేసుకోవాలి. క్యారట్‌ని సన్నగా తురిమిపెట్టుకోవాలి. పాత్రలో ఒక టీ స్పూన్ నూనె వేడయ్యాక పనీర్ ముక్కలు వేసి గోధుమరంగు వచ్చేలా వేయించి పక్కన పెట్టుకోవాలి. పై పదార్థాలన్నీ ఒక పాత్రలో ఒకదాని తరవాత ఒకటి వేసి, దీంట్లో తేనె జత చేసి కలియబెట్టి అందించాలి.