CBI case
-
నేడు ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ విచారణ
సాక్షి,ఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై బుధవారం(జులై 17) విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కేజ్రీవాల్ తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ధర్మాసనం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను విచారించనుంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయినా ఇదే స్కామ్‌లో సీబీఐ కేసులో ఇంకా జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉండటంతో కేజ్రీవాల్ తీహార్ జైలులోనే ఉండాల్సి వచ్చింది. -
రఘరామలీలలు కన్నెత్తి చూడరు.. పట్టించుకోరు
స్వస్థలం ఉండి నియోజకవర్గమైనా.. ఉండేది మాత్రం రాజధానుల్లోనే.. సంక్రాంతి కోడిపందాల సమయంలో హడావుడి తప్ప మిగిలిన రోజుల్లో నియోజకవర్గానికి వచ్చింది అరుదే.. రచ్చబండంటూ.. అందలమెక్కించిన వారిపై నోరుపారేసుకోవడం తప్ప ఎంపీగా తనను గెలిపించిన ప్రజల వైపు కన్నెత్తి చూసింది లేదు.. ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదు.. ఆయనే మాజీ ఎంపీ, టీడీపీ ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణరాజు. ఢిల్లీలో తన బిల్డప్ పాచికలు పారకపోవడంతో ఉండిలో టీడీపీ అభ్యర్థిగా గెలుపు కోసం ఆపసోపాలు పడుతున్నారు. సాక్షి, భీమవరం: బ్యాంకు అప్పులకు సంబంధించిన వ్యవహారాలు, సీబీఐ కేసుల నేపథ్యంలో ఢిల్లీలోనే ఉంటూ లాబీయింగ్ చేసుకునేందుకు ఎంపీ సీటుపై చాలానే ఆశలు పెట్టుకున్నారు రఘు రామకృష్ణరాజు. తానే నరసాపురం కూటమి అభ్యర్థినంటూ తాడేపల్లిగూడెం జెండా సభలో స్వయంగా ప్రకటించేసుకున్నారు. ఇంతకన్నా భారీ సభ ఏర్పాటు చేస్తానంటూ బిల్డప్‌లూ ఇచ్చారు. అంతలోనే సీన్ రివర్స్ అయ్యింది. కేంద్రంలో ఆయన పలుకుబడి ఏ పాటిదో సీట్ల కేటాయింపుల్లోనే తేలిపోయింది. బీజేపీ సీటు మరొకరికి ఇవ్వడంతో ఏం చేయాలో పాలుపోలేదు. మరికొద్ది రోజుల్లో మంచి మాట వింటారంటూ మీడియా ముందు బిల్డప్‌లు ఇస్తూ ఎన్ని పైరవీలు చేసినా, జిల్లాలోని కూటమి అసెంబ్లీ అభ్యర్థులందరితో సంప్రదింపులు చేయించినా బీజేపీ నిర్ణయాన్ని మార్చలేకపోయారు. ఏదో క చోట నుంచి పోటీ చేయకపోతే తన బిల్డప్‌లు పనిచేయవనుకున్నారేమో ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు సీటుకు ఎసరుపెట్టి ఉండి అసెంబ్లీ నుంచి పోటీలో నిలిచారు. గెలుపు కోసం ఆపసోపాలు గత ఎన్నికల ప్రచారంలో తప్ప స్వతహాగా రఘురామకృష్ణరాజు ప్రజల మధ్య తిరిగింది ఏమీలేదు. నియోజకవర్గానికి వచ్చినా సొంత సామాజికవర్గంలోని కొందరితో తప్ప మిగిలిన సామాజిక వర్గాల వారిని పట్టించుకున్నది లేదు. నిత్యం తన సొంత వ్య వహారాల్లో తలమునకలై ఉండే ఆయనకు, నియోజకవర్గంలోని వివిధ వర్గాల ప్రజలు, వారి కష్టాలు, మౌలిక పరమైన అవసరాల గురించి అవగాహన ఏ మేరకు ఉందనేది ప్రశ్నార్థకమే. ఇప్పుడు ఆయనకు అదే పెద్ద సమస్యగా తయారైందని స్థానికంగా చర్చ నడుస్తోంది. ఎల్లప్పుడూ స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ అభివృద్ధికి అహరి్నశలు పాటుపడిన వైఎస్సార్సీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు, మరోపక్క రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కలిగి, ప్రస్తుతం టీడీపీ రెబల్‌గా బరిలో నిలిచిన వేటుకూరి వెంకట శివరామరాజు నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. మునుపెన్నడూ లేని విధంగా గత ఐదేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం అధికారపక్ష అభ్యర్థి పీవీఎల్‌కు లాభించే అంశం కావడంతో పాటు ఇప్పటికే ఆయన ప్రచారంలో ముందంజలో ఉన్నారు. దళితులు, క్రైస్తవులపై చిన్నచూపు దళితులు, క్రైస్తవులు టీడీపీకి ఓట్లే వేయరన్న భావనలో రఘురామకృష్ణరాజు వారిని చిన్నచూపు చూస్తున్నారన్న ప్రచారం ఎక్కువగానే ఉంది. ఆయా ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారానికి ఆయన పెద్దగా ప్రాధాన్యమివ్వడం లేదంటున్నారు. ఎప్పు డూ ఢిల్లీ, హైదరాబాద్‌లో ఉంటూ నియోజకవర్గ ప్రజలకు ఆయన అందుబాటులో ఉండరని, సామాన్యులకు అపాయింట్మెంట్ దొరకడం కష్టమేనంటూ ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం రఘురామను ఇరకాటంలో పడేస్తుందని స్థానికంగా చర్చించుకుంటున్నారు. తన ఎన్నికల ప్రచారానికి పెద్దగా స్పందన లేకపోవడం, రోజురోజుకూ విజయావకాశాలు సన్నగిల్లుతుండటంతో నిరాశకు లోనై చిన్నపాటి విషయాలకు కేడర్‌పై ఆయన చిర్రుబుర్రులాడుతున్నారని సమాచారం. అసమ్మతి సెగలు టీడీపీకి చెందిన కొందరు నేతలు పార్టీని వీడి రెబల్‌గా పోటీలో ఉన్న శివరామరాజు వెంట వెళ్లిపో గా మిగిలిన వారిలో అధిక శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు వర్గమే. సీటు మార్చొద్దంటూ రామరాజుకు మద్దతుగా ఆందోళన చేసిన టీడీపీ నాయకులను బెట్టింగ్రాయుళ్లని రఘురామ అనుచిత వ్యాఖ్యలు చేయడం పార్టీలో అంతర్గతంగా అసమ్మతి జ్వాలలు రగిలిస్తూనే ఉంది. పైకి రామరాజుతో కలిసి చిరునవ్వులు చిందిస్తున్నా సిట్టింగ్ సీటును లాక్కోవడంపై ఆయన వర్గం ఎంత వరకు తనకు సహకరిస్తారనే అనుమానం రఘురామను వెంటాడుతోందంటున్నారు. జనసేన కేడర్‌పైనే ఆయన నమ్మకం పెట్టుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కాపులను ఉద్దేశించి గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, కాపు యువకులపై కేసులు పెట్టి స్టేషన్లో పెట్టించిన సంఘటనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ‘మీరు కాపు కాసేవారు మీ పని మీరు చేసుకోండి.. నార తీసే వృత్తి వేరు, తాట తీసే వృత్తి వేరంటూ’ ఆయన చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన కేడర్ అన్నీ మర్చిపోయి ఆయనకు ఎంతవరకు కలిసివస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఎన్సీపీ నేత ప్రఫుల్‌పటేల్‌కు సీబీఐ క్లీన్చిట్.. అందుకేనా ?
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన విమానాల లీజు వ్యవహారంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని సీబీఐ తాజాగా క్లీన్ చిట్ ఇచ్చింది. ఢిల్లీలో ఈ కేసు విచారణ జరుగుతున్న కోర్టులో సీబీఐ ఈ మేరకు దర్యాప్తు క్లోజర్ రిపోర్టు దాఖలు చేసింది. యూపీఏ హయంలో ప్రఫుల్ విమానయాన శాఖ మంత్రిగా ఉన్నపుడు ఎయిర్ ఇండియా విమానాల లీజులో అవినీతి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని క్లోజర్ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. ఈ క్లోజర్ రిపోర్టును విచారించి కేసును మూసివేసే అంశంలో నిర్ణయం తీసుకునేందుకుగాను ఏప్రిల్ 15న హాజరుకావాలని కేసు దర్యాప్తు అధికారికి కోర్టు నోటీసులు జారీ చేసింది. శరద్‌పవార్ అధ్యక్షుడిగా ఉన్న ఎన్సీపీని ఆయన మేనల్లుడు అజిత్‌పవార్ చీల్చి మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా చేరిన విషయం తెలిసిందే. సరిగ్గా ఇది జరిగిన 8 నెలల తర్వాత ఎన్సీపీ ముఖ్య నేత ప్రఫుల్‌పటేల్‌కు సీబీఐ క్లీన్చిట్ ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది. అవసరం లేకున్నా ఎయిర్ఇండియా కోసం అత్యంత ఎక్కువ ఖర్చుతో విమానాలు లీజుకు తీసుకున్నారన్న ఆరోపణలపై ప్రఫుల్‌పటేల్ మీద 2017లో సీబీఐ కేసు నమోదు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేసింది. ఇదీ చదవండి.. బీజేపీకి అర్థం కావడం లేదు.. చిదంబరం -
విశాఖ డ్రగ్స్ కేసు: సీబీఐ విచారణలో సంచలన విషయాలు..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ కేసులో సీబీఐ దూకుడు పెచ్చింది. ఈ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో సంచలన సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులోనూ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ పాత్ర ఉన్నట్టు సీబీఐ గుర్తించింది. వివరాల ప్రకారం.. విశాఖ పోర్టు డ్రగ్స్ కేసుపై సీబీఐ దృష్టిసారించింది. ఈ క్రమంలో సంధ్యా ఆక్వాకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలోనూ సంధ్యా ఆక్వా పాత్ర ఉన్నట్టు సీబీఐ గుర్తించింది. అలాగే, లిక్కర్ స్కాంకు పాల్పడిన సిండికేట్‌లో సంధ్యా ఆక్వా భారీగా పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. దీంతో.. మద్యం, డ్రగ్స్ మాఫియా గుట్టును చేధించే పనిలో సీబీఐ దూకుడు పెంచింది. ఇక, పది మంది సీబీఐ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో కాకినాడలోని సంధ్యా ఆక్వా కంపెనీలో సోదాలు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు ఆ కంపెనీని పరిశీలించారు. ఇదే సమయంలో కంటైనర్లలో మెటీరియల్‌కు సంబంధించి మరిన్ని శాంపిల్స్‌ను విశాఖలో పరిశీలించగా ఫలితాల్లో పాజిటివ్‌గా తేలింది. ఇది కూడా చదవండి: విశాఖ డ్రగ్స్ కేసు: చంద్రబాబు ఇంగితం లేని మాటలు -
శ్రీదేవి మరణంపై సంచలన ఆరోపణలు.. చిక్కుల్లో ప్రముఖ యూట్యూబర్!
అందాల తార, తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి శ్రీదేవి. కానీ ఉహించని విధంగా దుబాయ్‌లోని ఓ హోటల్లో కన్నుమూసింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న తుదిశ్వాస విడిచింది.బాలీవుడ్ నిర్మాత బోనీ కపూప్ పెళ్లాడిన శ్రీదేవికి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. పెద్దకూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మూవీ దేవరలో కనిపించనుంది. మరోవైపు చిన్నకూతురు ఖుషీ కపూర్ సైతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అయితే శ్రీదేవి మరణంపై ఒడిశాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఆమె మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సహా పలువురు ప్రముఖుల పేర్లతో నకిలీ లేఖలను యూట్యూబ్‌లో ఉంచింది. శ్రీదేవి మరణంపై విచారణను రెండు ప్రభుత్వాలు దాచిపెడుతున్నాయంటూ గతంలో తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో ఆమెపై గతేడాది ముంబైకి చెందిన న్యాయవాది చాందినీ షా సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఆమె యూట్యూబ్ వీడియోలో ఉంచిన పత్రాలు నకిలీవని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా శ్రీదేవి మరణానికి స్పాన్సర్‌గా ప్రభుత్వాన్ని కించపరిచేలా పదేపదే మాట్లాడిందని ఆరోపించారు. ప్రధానమంత్రి, రక్షణ మంత్రి లేఖలతో పాటు సుప్రీంకోర్టుకు సంబంధించిన పత్రాలు, యూఏఈ ప్రభుత్వం నుంచి వచ్చిన రికార్డులు నకిలీవని తేలిందని న్యాయవాది ఫిర్యాదులో ప్రస్తావించారు. ఆయన ఫిర్యాదుతో యూట్యూబర్ దీప్తితో ఆమె లాయర్ భరత్ సురేశ్ కామత్‌లపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మొత్తానికి శ్రీదేవి మరణంపై సంచలన ఆరోపణలు చేసి ఇబ్బందుల్లో ఇబ్బందుల్లో పడ్డారు యూట్యూబర్. తాజాగా సీబీఐ ఛార్జిషీట్ వేయడంపై దీప్తి స్పందించారు. ఆ ఛార్జ్ షీట్ నమ్మేలా లేదని దీప్తి ఆరోపించారు. నా స్టేట్మెంట్ను రికార్డ్ చేయకుండా ఛార్జిషీట్ దాఖలు చేయడం చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు. కాగా.. గతేడాది డిసెంబర్ 2న భువనేశ్వర్‌లోని ఆమె నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకుంది. శ్రీదేవి మరణంతో పాటు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై సంచలన కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో జరిగిన చర్చల్లోనూ దీప్తి చురుకుగా పాల్గొంది. -
డీకే శివకుమార్ సీబీఐ కేసుపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు
బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అక్రమాస్తుల కేసుపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య స్పందించారు. డీకే కేసులో సీబీఐ విచారణ జరిపేందుకు గతంలో బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతి(కన్సెంట్) అక్రమమని చెప్పారు. తాము ఆ అనుమతిని ఉపసంహరించుకుంటామని చెప్పారు. ‘సాధారణంగా సీబీఐ కేసుల్లో ఎమ్మెల్యేలకు స్పీకర్, మంత్రులకు గవర్నర్ విచారణ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. డీకే కేసులో కేలం గవర్నర్ మాత్రమే అనుమతి ఇచ్చారు. స్పీకర్ పర్మిషన్ ఇవ్వలేదు. డీకే ఎమ్మెల్యే కూడా. ఆయనపై సీబీఐ విచారణజరపాలంటే స్పీకర్ అనుమతి కావాలి. స్పీకర్ అనుమతివ్వనందున సీబీఐ విచారణకు బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతి అక్రమం’ అని సిద్ధరామయ్య తెలిపారు. ‘అయితే డీకే అక్రమాస్తుల కేసులో గత ప్రభుత్వం సీబీఐకి ఇచ్చిన అనుమతిపై ప్రస్తుతం హై కోర్టులో ఉన్న కేసు గురించి నేను మాట్లాడను. ప్రభుత్వం మాత్రం అనుమతి ఉపసంహరిస్తుంది. ఆ అనుమతి కేవలం అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్ప మౌఖిక ఆదేశాల మేరకు ఇచ్చింది’ అని సిద్ధరామయ్య అన్నారు. 2013 నుంచి2018 వరకు సిద్ధరామయ్య ప్రభుత్వంలో డీకే విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ టర్ములో ఆయన అక్రమంగా 75 కోట్ల రూపాయల అక్రమాస్తులు పోగేశారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో విచారణకుగాను తరువాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం సీబీఐకి కన్సెంట్ ఇచ్చింది. పబ్లిక్ సర్వెంట్లను విచారించాలంటే సీబీఐకి ప్రభుత్వ కన్సెంట్ తప్పనిసరి. తాను మంత్రిగా ఉన్నప్పటి అక్రమాస్తుల కేసులో కేవలం గవర్నర్ మాత్రమే కన్సెంట్ ఇచ్చారని, స్పీకర్ కన్సెంట్ ఇవ్వలేదని పేర్కొంటూ కేసు విచారణను కొట్టి వేయాలని డీకే ఇప్పటికే హైకోర్టులో కేసు వేశారు. ఇదీచదవండి..చైనా కొత్త వైరస్ కేసులతో ప్రమాదం లేదు : భారత ఆరోగ్య శాఖ -
వివేకా హత్య కేసులో గత చార్జ్ షీట్ కు వ్యతిరేకంగా సీబీఐ తుది చార్జ్ షీట్
-
Karnataka CM Post: డీకే విషయంలో కాంగ్రెస్ తటపటాయింపు!
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పంచాయితీ ఎటు తేలడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి స్పష్టమైన మెజార్టీ అందుకున్న హస్తం పార్టీకి.. ముఖ్యమంత్రి ఎంపిక మాత్రం కష్టతరంగా మారింది. సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొనగా.. వీరిలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. అయితే ముఖ్యమంత్రి రేసులో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను కేసుల గండం చుట్టుముడుతోంది. డీకే శివకుమార్‌పై నమోదైన సీబీఐ కేసులు.. కాంగ్రెస్‌ను కలవరపెడుతున్నాయి. డీకేను సీఎంగా నియమిస్తే సీబీఐ ఏమైనా ఇబ్బంది పెడుతుందా అన్న ఆలోచనలో పడింది హైకమాండ్. దీనికి తోడు కర్ణాటక డీజీపీగా ఉన్న ప్రవీణ్ సూద్‌ను సీబీఐ బాస్‌గా కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. కాగా 2020-23 మధ్య ఆయనపై 13 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికీ శివకుమార్ పై 19 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2013-18లో మంత్రిగా డీకే అక్రమంగా ఆస్తులు సంపాదించారని సీబీఐ అభియోగం మోపింది. ఈనెల 30న డీకే అక్రమాస్తుల కేసు విచారణ కూడా ఉంది. అంతేగాక అక్రమాస్తుల కేసులో ఇప్పటికే ఓసారి అరెస్టై విడుదలయ్యారు శివకుమార్. చదవండి: కర్ణాటక సీఎం ఎవరు?.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు ఢిల్లీ పర్యటనపై సస్పెన్స్ డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటనపై సస్పెన్స్ కొనసాగుతోంది. కర్ణాటక ఏఐసీసీ ఇంచార్జి రణదీప్ సింగే సూర్జేవాలాతో డీకే సమావేశం ముగిసింది. దాదాపు మూడు గంటలపాటు చర్చలు కొనసాగాయి. డీకే శివకుమార్‌ను బుజ్జగించేందుకు సుర్జేవాలా చేసిన ప్రయత్నం విఫలమైంది. ‘కాంగ్రెస్ కోసం నేను ఎంతో పనిచేశాను. ఇస్తే సీఎం పదవి ఇవ్వండి.. లేదంటే అసుల కేబినెట్లో స్థానం కూడా వద్దు’ సూర్జేవాలాకు డీకే తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఢిల్లీకి సిద్ధరామయ్య కాగా ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిని ఎంపిక చేసే అధికారాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. కాసేపట్లో మల్లికార్జున ఖర్గేతో ఏఐసీసీ బృందం సమావేశం కానుంది. కేబీనెట్ కూర్పుపై కూడా హైకమాండ్ నిర్ణయం తీసుకోనుంది. అయితే సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌కు చెరో రెండున్నరేళ్లు కర్ణాటక సీఎం పదవి ఇచ్చే ప్రతిపాదనను మల్లికార్జున ఖర్గే తెచ్చినట్లు తెలుస్తోంది. దీనిని సిద్దరామయ్యా అంగీకరించినా డీకే శివకుమార్ మాత్రం నో చెప్పినట్టు సమాచారం. ఇక నూతన ముఖ్యమంత్రి, మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం మే 18న జరుగనుంది. ఇదీ చదవండి: మల్లికార్జున ఖర్గేకు షాక్.. పంజాబ్ కోర్టు సమన్లు -
ఢిల్లీ లిక్కర్ స్కాం... ఆగని ఈడీ దాడులు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) దాడులు శుక్రవారం మళ్లీ దేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లో నాలుగు చోట్ల అధికారులు దాడులు కొనసాగించారు. అలాగే బెంగళూరు, ఢిల్లీ, పంజాబ్‌లోనూ దాడులు సాగాయి. మాదాపూర్‌కు చెందిన అభినవ్‌రావ్, ఓ తెలుగు దినపత్రికలో పెట్టుబడులు పెట్టిన అభిషేక్‌రెడ్డి, ఎం.గోపాలకృష్ణ, కూకట్‌పల్లికి చెందిన మరో వ్యక్తి ఇంట్లో దాడులు నిర్వహించారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ముఖ్య అనుచరుడి ఇంట్లో ఈడీ ముందుగా సోదాలు జరిపింది. దినేష్ అరోరా ఇంటితో పాటు ఆఫీస్, అతని స్నేహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఏ11గా ఉన్న దినేష్‌కు చెందిన అకౌంట్లోకి సమీర్ మహేంద్రు ద్వారా రూ.కోటి నగదు బదిలీ జరిగింది. ఈ కోణంలో సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సమీర్ మహేంద్రును ఈడీ కస్టడీలోకి తీసుకుంది. అతను ఇచ్చిన వాంగ్మూలంతోనే అధికారులు నాలుగు చోట్ల సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. -
వాన్ పిక్ ప్రాజెక్ట్ లిమిటెడ్ కు ఊరట
-
‘ఐపీఎల్ బెబెట్టింగ్’పె సీబీఐ దూకుడు
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మ్యాచుల్లో బెట్టింగ్ వ్యవహారంపై సీబీఐ దూకుడు పెంచింది. ఈ మేరకు రెండు కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. 2019లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో భారీగా బెట్టింగ్ జరిపినట్టు పక్కా సమాచారం అందటంతో శనివారం దేశంలోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు జోధ్‌పూర్, జైపూర్, హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. బెట్టింగ్‌లో వచ్చిన డబ్బు కోసం బ్యాంక్ అకౌంట్లు సైతం తీసినట్టు సీబీఐ గుర్తించింది. దీనితో పలు ప్రైవేట్ వ్యక్తులతోపాటు అనుమానిత ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు నమోదుచేసినట్టు ఏజెన్సీ వర్గాలు వెల్లడించాయి. మ్యాచ్‌ల గెలుపు ఓటములను సైతం నిర్ణయించేలా బెట్టింగ్ మాఫియా పాకిస్తాన్ నుంచి కథ నడిపించినట్టు సీబీఐ అనుమానిస్తోంది. లావాదేవీల నిర్వహణ కోసం ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంకు అకౌంట్లు తెరవడంతోపాటు కేవైసీ(నో యువర్ కస్టమర్) డాక్యుమెంట్లలో పలువురు బ్యాంకు అధికారుల పాత్ర ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఇలా ఒక గ్యాంగ్ రూ.11 కోట్లకు పైగా లావాదేవీలు జరపగా, మరో గ్యాంగ్ రూ.1.5 కోట్ల మేర లావాదేవీలు నిర్వహించినట్టు సీబీఐ ఆధారాలు సేకరించింది. రెండు ఎఫ్ఐఆర్లు పాకిస్తాన్‌లోని వఖాస్ మాలిక్ అనే వ్యక్తితో రెండు గ్యాంగులు బెట్టింగ్ దందా సాగించినట్టు సీబీఐ అనుమానిస్తోంది. రూ.11 కోట్ల మేర లావాదేవీ నడిపిన కేసులో హైదరాబాద్‌కు చెందిన దిలీప్ కుమార్, గుర్రం సతీశ్, గుర్రం వాసును నిందితులుగా చేర్చినట్టు తెలిసింది. వీరు 2013 నుంచి ఐపీఎల్ బెట్టింగ్ పాల్పడుతున్నట్టు సీబీఐ అనుమానిస్తోంది. మరో ఎఫ్ఐఆర్లో ఢిల్లీ, జోధ్‌పూర్, జైపూర్‌కు చెందిన సజ్జన్ సింగ్, ప్రభులాల్మీనా, రామ్ అవతార్, అమిత్ కుమార్ శర్మతోపాటు మరికొంత మంది గుర్తుతెలియని ప్రభుత్వ ఉద్యోగులను నిందితుల జాబితాలో చేర్చినట్టు తెలిసింది. వీరు 2010లో కూడా ఐపీఎల్ మ్యాచ్‌ల్లో బెట్టింగ్ పాల్పడినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. -
'చిత్ర' విచిత్రమైన కథ..ఆ 'అజ్ఞాత' యోగి కేసులో మరో ఊహించని మలుపు!!
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) మాజీ ఎండీ చిత్రా రామకృష్ణ ప్రస్తావించిన ‘అజ్ఞాత యోగి’ గురించి మరిన్ని వివరాలు బైటపడుతున్నాయి. సదరు యోగి పేరిట ఈమెయిల్ ఐడీని సృష్టించినది ఎన్ఎస్ఈ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) ఆనంద్ సుబ్రమణియన్ అని కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ వెల్లడించింది. రుగ్యజుర్సామ @అవుట్‌లుక్‌డాట్‌కామ్ పేరిట క్రియేట్ చేసిన ఈమెయిల్ ఐడీని ఆయనే ఉపయోగించేవారా లేక మరొకరు ఎవరైనా ఆపరేట్ చేసే వారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ప్రత్యేక సీబీఐ కోర్టుకు తెలిపింది. అలాగే యోగి, చిత్రాకు మధ్య ఈమెయిల్ ద్వారా జరిగిన ఉత్తరప్రత్యుత్తరాల్లో ప్రస్తావనకు వచ్చిన సీషెల్స్ పర్యటనపై కూడా దృష్టి పెడుతున్నట్లు వివరించింది. చిత్రా సిఫార్సుల మేరకు సుబ్రమణియన్‌ను జీవోవోగా నియమించడం తదితర చర్యల ద్వారా ఎన్ఎస్ఈలో పాలనాపరమైన అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆమెతో పాటు ఇతరులపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. నిరాకారుడైన ఓ సిద్ధపురుషుడు తనకు పలు అంశాల్లో మార్గదర్శకత్వం చేసే వారంటూ విచారణ సందర్భంగా చిత్రా వెల్లడించడంతో అజ్ఞాత యోగి పాత్ర తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో చిత్రా, తదితరులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ జరిమానా విధించడంతో పాటు కఠిన చర్యలు ప్రకటించింది. అటు వివాదాస్పద ఎన్ఎస్ఈ కో–లొకేషన్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, తాజా కేసుపై కూడా విచారణ జరుపుతోంది. చదవండి: మూడు కోట్ల కార్లు..కోటి రూపాయల డైనింగ్ టేబుల్.. చివరికి -
‘వివేకా హత్యపై బాబు డైరెక్షన్లో దుష్ప్రచారం’
కడప సెవెన్‌రోడ్స్: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో వైఎస్ కుటుంబంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు డైరెక్షన్లో దుష్ప్రచారం జరుగుతోందని వైఎస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రం కడపలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వివేకా హత్య జరిగిందని గుర్తుచేశారు. చంద్రబాబు అప్పుడే నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించి నిజాలు ఎందుకు వెలికి తీసుకురాలేదని ప్రశ్నించారు. నేడు పథకం ప్రకారం స్క్రిప్ట్ తయారు చేసుకుని దుష్ప్రచారానికి ఒడిగడుతున్నారని చెప్పారు. వైఎస్ కుటుంబానికి రక్తపు మరకలు అంటించాలని ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిపై బురద చల్లేందుకు యత్నించడం అన్యాయమని చెప్పారు. అవినాష్‌రెడ్డి సౌమ్యుడని, హత్యారాజకీయాలను ఏనాడూ ప్రోత్సహించలేదని పేర్కొన్నారు. ఆయన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని యత్నించడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివేకానందరెడ్డి స్వయాన చిన్నాన్న అని, ఆ కుటుంబాన్ని సీఎం పట్టించుకోలేదనడం దుర్మార్గమని చెప్పారు. వైఎస్ కుటుంబానికి ఉభయ రాష్ట్రాల్లో ఎంతో గౌరవ ప్రతిష్టలున్నాయన్నారు. వివేకా కుటుంబం చంద్రబాబు ఉచ్చులో పడరాదని కోరారు. వైఎస్ కుటుంబంలో చిచ్చుపెట్టడం ద్వారా రాజకీయలబ్ధి పొందాలని చంద్రబాబు యత్నిస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్యకేసులో దోషులను గుర్తించాలని తాము ఆరోజే డిమాండ్ చేశామని గుర్తుచేశారు. తమకు మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి తదితరులపై అనుమానాలున్నాయని చెప్పారు. సీబీఐ అధికారులు వారిని ఎందుకు విచారించరని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీబీఐ అధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి దోషులను చట్టానికి అప్పగించాలన్నారు. వివేకా కుటుంబం అపోహాలు వీడి నిష్పక్షపాతంగా దర్యాప్తు సాగేందుకు యత్నించాలని కోరారు. -
ఈపీఎఫ్ ఖాతాల్లో అక్రమాలపై సీబీఐ కేసు
సాక్షి, అమరావతి: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) ఖాతాల్లో అక్రమాలకు పాల్పడిన గుంటూరులోని ఈపీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలోని పలువురు అధికారులపై సీబీఐ బుధవారం కేసులు నమోదు చేసింది. గుంటూరు, విజయవాడ, ఒంగోలు, చీరాల, గుంటుపల్లి తదితర చోట్ల ఈపీఎఫ్ అధికారులకు చెందిన 40 నివాసాలు, ఇతర ప్రదేశాలపై సీబీఐ విస్తృతంగా తనిఖీలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈపీఎఫ్ అధికారులు కొందరు ప్రైవేటు కన్సల్టెన్సీలతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడినట్టు సీబీఐ గుర్తించింది. ఈపీఎఫ్ క్లెయిములు, సేవలు, ఉద్యోగులకు బకాయిల చెల్లింపు వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారించింది. అందుకోసం గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే మొదలైన మొబైల్ వాలెట్ల ద్వారా భారీగా లంచాలు తీసుకున్నట్టు కూడా ఆధారాలు సేకరించింది. అక్రమాలకు పాల్పడిన ఈపీఎఫ్ అధికారులపై 4 కేసులు నమోదు చేసినట్టు సీబీఐ ఓ ప్రకటనలో తెలిపింది. -
రఘురామకృష్ణరాజుపై సీబీఐ చార్జ్‌షీట్
సాక్షి, అమరావతి: ఆర్థిక సంస్థలు, బ్యాంకులను మోసం చేసిన కేసులో నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడులోని ట్యూటీకొరిన్‌లో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఇండ్ భారత్ థర్మల్ పవర్ మద్రాస్ లిమిటెడ్ అనే కంపెనీ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుని ఎగవేసినందున 2019 ఏప్రిల్ 29న సీబీఐ కేసు నమోదు చేసింది. రూ.947.71 కోట్ల మేరకు మోసం చేసిన ఇండ్ భారత్ కంపెనీ చైర్మన్, ఎండీగా ఉన్న కె.రఘురామకృష్ణరాజుతో సహా ఆ కంపెనీ డైరెక్టర్లు, అనుబంధ కంపెనీలు, చార్టెడ్ అకౌంటెంట్లు, కాంట్రాక్టర్లు కలిపి మొత్తం 16 మందిపై న్యూ ఢిల్లీలోని సీబీఐ న్యాయస్థానంలో శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేసింది. థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు పేరిట ఆర్థిక సంస్థలను రఘురామకృష్ణరాజు ఎలా మోసం చేశారనేది సీబీఐ ఓ ప్రకటనలో సవివరంగా వెల్లడించింది. ఇండ్ భారత్ పవర్ కంపెనీ చైర్మన్, ఎండీగా ఉన్న కె.రఘురామకృష్ణం రాజు పక్కా పన్నాగంతోనే బ్యాంకులను మోసం చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. తమిళనాడులోని ట్యూటికోరిన్లో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆర్థిక సంస్థల కన్సార్షియం నుంచి రూ.947.71 కోట్లు రుణం తీసుకున్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్ఈసీ), ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సీఎల్)లతో కూడిన కన్సార్షియం రుణం మంజూరు చేసింది. కానీ రఘురామకృష్ణరాజు తమిళనాడులో థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయలేదు. రుణ ఒప్పంద నిబంధనలను పాటించలేదు. రుణం ద్వారా తీసుకున్న నిధులను నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించారు. ఆ నిధులను కాంట్రాక్టర్లకు అడ్వాన్స్‌లు చెల్లించేందుకుగాను బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అనంతరం ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు హామీగా చూపించి ఆ రెండు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. వాటితో కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు చెల్లించినట్టుగా చూపించారు. ఆ తర్వాత ఆ రెండు బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించనే లేదు. దాంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకులు తమ వద్ద ఉన్న డిపాజిట్లను ఆ రుణం కింద జమ చేసుకున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం రుణం ఇచ్చిన ఆర్థిక సంస్థల కన్సార్షియం పూర్తిగా మోసపోయింది. ఆ విధంగా ఆర్థిక సంస్థల కన్సార్షియంను రఘురామకృష్ణరాజు రూ.947.71 కోట్ల మేర మోసం చేశారని సీబీఐ దర్యాప్తులో నిగ్గు తేలింది. పూర్తి ఆధారాలు సేకరించిన సీబీఐ ఈ కేసు దర్యాప్తులో భాగంగా త్వరలో సంచలన చర్యలకు ఉపక్రమించనుందని సమాచారం. సీబీఐ చార్జిషీట్లో పేర్కొన్న నిందితులు ► ఇండ్ భారత్ పవర్ మద్రాస్ లిమిటెడ్ కంపెనీ,కె.రఘురామకృష్ణరాజు, చైర్మన్, ఎండీ, ఇండ్ ► భారత్ పవర్ మద్రాస్ లిమిటెడ్ కంపెనీ మధుసూదన్‌రెడ్డి, డైరెక్టర్, ఇండ్ భారత్ పవర్ ► మద్రాస్ లిమిటెడ్ కంపెనీ ► ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ ► ఆర్కే ఎనర్జీ లిమిటెడ్ ► శ్రీబా సీబేస్ ప్రైవేట్ లిమిటెడ్ ► ఇండ్ భారత్ పవర్ జెన్‌కామ్ లిమిటెడ్ ► ఇండ్ భారత్ ఎనర్జీ ఉత్కళ్ లిమిటెడ్ ► ఇండ్ భారత్ పవర్ కమాడిటీస్ లిమిటెడ్ ► ఇండ్ భారత్ ఎనర్జీస్ మహారాష్ట్ర లిమిటెడ్ ► ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ ► సోకేయి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ► వై.నాగార్జున రావు, ఎండీ, సోకేయి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ► ఎం.శ్రీనివాసుల రెడ్డి, చార్టెడ్ అకౌంటెంట్ ► ప్రవీణ్ కుమార్ జబద్, చార్టెడ్ అకౌంటెంట్ ► సి.వేణు, ఇండ్ భారత్ గ్రూప్స్ చార్టెడ్ అకౌంటెంట్ -
అడ్డగోలు మాటలకు అర్థం ఏమిటి?
కేంద్ర నిఘా సంస్థల దగ్గర కూడా లేని సమాచారం చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నట్టుంది. అందుకే తాలిబన్లు, తాడేపల్లి అంటూ అడ్డగోలుగా మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వాన్ని వెంటనే దించేయాలన్నంత కసితో ప్రకటనలు గుప్పించారు. సమస్య ఏమిటంటే– ప్రజాక్షేత్రంలో ఓటమిని ఆయన ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించడం అన్న మాటే మరిచిపోయారు. రాజకీయాలను విషక్రీడగా మార్చారు. తిరిగి అధికారంలోకి రావడానికి ఎంతకైనా దిగజారడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పకనే చెబుతున్నారు. తన ప్రత్యర్థులు ఎవరిపైన అయినా తట్టెడు బురద చల్లడం మొదటినుంచీ చంద్రబాబు నైజం. ఈ విషయంలో ఆయనకు ఎన్టీఆర్ అయినా, కేసీఆర్ అయినా, జగన్ అయినా, మరొకరు అయినా ఒకటే. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన రెండు ప్రకటనలు గమనించదగినవి. తన పార్టీ ఓడిపోవడం ఆయనకు జీర్ణించుకోలేని విషయమే. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎవరు కావాలని అనుకుంటే వారిని ఎన్నుకుంటారు. అయినా ప్రతిపక్షంలో ఉన్నా తామే పెత్తనం చేయాల నుకుంటే కష్టమే. ఇంతకీ బాబు చేసిన ప్రకటనలు ఏమిటో చూద్దాం. తాలిబన్లకూ తాడేపల్లికీ ఉన్న లింక్ బయటపెడతామని అన్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి రాష్ట్రాన్ని రిపేరు చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఈ రెండు ప్రకటనలు చూస్తే ఏమని పిస్తుంది! తక్షణమే ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేయా లన్న వ్యూహం ఏమైనా ఉందా అన్న సంశయం కలుగుతుంది. తాలిబన్లు అఫ్గానిస్తాన్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చి, అధికారం చేపట్టారు. ఆ తర్వాత ఎన్నో ఘాతుకాలకు పాల్పడు తున్నారు. మరి ఇప్పుడు ఏపీలో ముఖ్యమంత్రిని తాలిబన్లతో పోల్చ డమే కాకుండా, లింకులు బయటపెడతామని చంద్రబాబు అనడంలో ఆంతర్యం ఏమిటి? నిజంగా అలాంటి లింకులు ఉంటే కేంద్ర ప్రభు త్వానికీ, కేంద్ర దర్యాప్తు సంస్థలకూ తెలియదా? వారికన్నా చంద్ర బాబుకే ఎక్కువ అంతర్జాతీయ నెట్వర్క్ ఉందా? ఆ దేశ అధ్యక్షుడు తెలుసు... ఈ దేశ ప్రధాని తెలుసు... తాను, బిల్ క్లింటన్, టోనీ బ్లేయర్ అంటూ గతంలో ఏవేవో కబుర్లు చెప్పేవారు. సింగపూర్, మలేíషియాలతో సంబంధం ఉందనీ, జపాన్‌కు చెందిన ప్రముఖుడిని అమరావతికి తెచ్చాననీ అనేవారు. వీటన్నింటిని బట్టి కేంద్రం కన్నా చంద్రబాబే తెలివైనవాడనీ, ఎక్కడి సమాచారం అయినా ఆయనకు ఇట్టే వస్తుందని అనుకోవాలి కదా? చంద్రబాబే స్వయంగా ఆ దర్యాప్తు సంస్థలకు తన వద్ద ఉన్న సమాచారం అందించవచ్చు కదా! తాలిబన్లతో పోల్చుతూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించా ల్సిన సమయం వచ్చిందని చంద్రబాబు అంటున్నారు. అంటే ఇప్పటి కిప్పుడు జగన్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటే తాను ఆ కుర్చీ ఎక్కాలని ఉబలాటపడుతున్నారా! 1989–94 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. అప్పుడు కూడా ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పక్షాన బాబు ఇలాగే మాట్లాడేవారు. దానికి ఆనాటి మంత్రి రోశయ్య ‘బాబూ... నువ్వు దిగు, దిగు... నేను ఎక్కుతా అంటే కుదర’దనీ; ‘ఉట్టి శాపనార్థాలకు ప్రభుత్వం పడిపో’దనీ అనేవారు. కానీ ఎలాగైతే నేమి 1995లో తన మామ ఎన్టీ రామారావును చంద్రబాబు పదవీచ్యు తుడిని చేశారు. అంటే ఆ ప్రభుత్వాన్ని కూలదోశారు. తాలిబన్లు మరో పద్ధతిలో అఫ్గాన్ ప్రభుత్వాన్ని కూల్చారు. మరి అలాంటప్పుడు చంద్ర బాబు ఆధ్వర్యంలోని టీడీపీ తాలిబన్ల మాదిరి వ్యవహరించిందని చెప్పవచ్చా? చంద్రబాబును తాలిబన్ అనడం లేదు. కానీ ఆయన ముఖ్యమంత్రి జగన్‌పై అలాంటి విమర్శ చేసినప్పుడు, సహజంగానే ఆయా విషయాలు స్ఫురణకు వస్తాయి. ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూలదోసినప్పుడు కూడా ఆయా వ్యవస్థలను విజయవంతంగా చంద్రబాబు వాడుకున్నారని ప్రచారం జరిగేది. తన మామను దించినట్లుగా జగన్ ప్రభుత్వాన్ని దించడం సాధ్యమయ్యే పని కాదు కనుక, కొన్ని వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని ఏమైనా కుట్ర పన్నుతారా అన్న సందేహం కలగవచ్చు. ఇలాంటివి చేసేవారిని కదా తాలిబన్లు అనాలి! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నర్‌కు జగన్ ఒక వినతిపత్రం సమర్పిం చిన సందర్భంలో– చంద్రబాబు ప్రభుత్వంపై ఒక్క మాట అంటేనే ఇంకేముంది ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని హోరెత్తిం చారే! మరో వైపు వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారే! ఇంకో సంగతి చెప్పాలి. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బాబు ప్రయత్నించి అభాసుపాలయ్యారు. నామినేటెడ్ ఎమ్మెల్యే ఒకరిని కొనుగోలు చేయడం ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకుని, ఆ తర్వాత వీలైతే మరికొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించి ప్రభుత్వాన్ని కూలదోయాలని యత్నించారన్న ఆరోపణలు వచ్చాయి. కేసీఆర్ కాస్త అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది... లేకుంటే ఆయన బాబు చేతిలో ఇబ్బంది పడవలసి వచ్చేది. ఇలా తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడా నికి చేసే ప్రయత్నాన్ని కదా తాలిబన్ అని అనాలి! డ్రగ్స్ వ్యవహారానికీ, జగన్ ప్రభుత్వానికీ లింక్ పెట్టడానికి విశ్వ యత్నం చేశారు. చోటామోటా నేతలతో కాకినాడ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖరరెడ్డి మరికొందరు నేతలపై ఆరోపణలు చేయిం చారు. అక్కడ మత్స్యకారుల బోటు దగ్ధం అయితే అందులో డ్రగ్స్ ఉన్నాయని ప్రచారం చేశారట. దానిపై మత్య్సకారులు టీడీపీ ఆఫీస్ వద్ద నిరసన చెప్పారట. దీనిని వైసీపీ వారు దాడి చేశారని చంద్ర బాబు ప్రచారం చేశారు. అక్కడ ఒక ఎగుమతిదారుడితో వైసీపీ వారికి సంబంధాలు అంటగట్టే యత్నం చేశారు. తీరా చూస్తే ఆ ఎగుమతి దారుడు అలీ షాతో చంద్రబాబు, గంటా శ్రీనివాసరావు దిగిన ఫొటోలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి బయటపెట్టారు. పైగా స్వయంగా అలీ షా జిల్లా ఎస్పీని కలిసి తనపై విచారణ చేయాలనీ, డ్రగ్స్ ఆరోపణలు నిజం కాదని తేలితే, ఆరోపణలు చేసినవారిపై చర్య తీసుకోవాలనీ కోరారు. దాని గురించి టీడీపీ సమాధానం ఇవ్వాలి కదా? దీనిపై పోలీసులు తెలుగుదేశం పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులు ఇస్తే దానిపై మళ్లీ గగ్గోలు పెడుతున్నారు. ఆరోపణలు చేయడం, తర్వాత జారి పోవడం టీడీపీకి అలవాటుగా మారింది. కాకినాడలో నిజంగానే పడవలో డ్రగ్స్ ఉంటే కేంద్ర నిఘా సంస్థలు నిద్రపోతున్నాయా? ఇన్ని కబుర్లు చెప్పే జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గుజరాత్లో అంత పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడితే ఆ ప్రభుత్వాన్ని కానీ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని కానీ ఒక్క మాట అనే సాహసం చేయడం లేదేమి? ఒకప్పుడు మోదీని తీవ్రంగా దూషించిన టీడీపీ ఇప్పుడు నోరు విప్పడానికే ఎందుకు భయపడు తోంది? చంద్రబాబు పీఏ ఇంటిలో సోదాలు చేసి, రెండు వేల కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు సీబీటీడీ అధికారిక ప్రకటన చేస్తే దానిపై చంద్ర బాబు ఇంతవరకు నోరు విప్పలేదు. అలాగే పండోరా పత్రాలలో పలువురు భారత ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. వెంటనే దానిని జగన్‌కు పులిమే యత్నం చేశారు. ఇందులో జగన్ పేరు కూడా ఉండ వచ్చేమో అని టీడీపీ నేతలు అనుకున్నారట. దానిని ఈనాడు పత్రిక పెద్ద శీర్షిక పెట్టి వార్త ఇచ్చింది. తద్వారా పత్రికా ప్రమాణాలను మరింతగా దిగజార్చింది. వాస్తవంగా ఎవరిపై ఆధారాలు ఉన్నా బయటపెట్టవచ్చు. అలాకాకుండా ఒక ప్రతిపక్ష పార్టీ ఇలా అను కుంది... అలా అనుకుంది... అనుకుంటే అందులో చెత్త ఉన్నా, అలాగే రాస్తారా? అందుకే సజ్జల ఒక ప్రశ్న వేశారు. రామోజీరావు పేరు కూడా పండోరా జాబితాలో ఉందని తామెవరైనా అనుకుంటే రాస్తారా అని ప్రశ్నించారు. ఇక చంద్రబాబు తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉందని అంటూ అలీషాతో ఆయన ఉన్న ఫొటోలను చూపించారు. లోకేశ్ హడావుడిగా దుబాయి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. రాజకీయాన్ని ప్రజాసేవగా కన్నా, ఒక విషక్రీడగా చంద్రబాబు మార్చారన్న విమర్శలకు గురి అవుతున్నారు. గతంలో 1993లో కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు– అసెంబ్లీలో చంద్ర బాబు మాట్లాడుతూ... కర్నూలులో ఒక అటవీ అధికారితో కుమ్మక్కై విజయభాస్కరరెడ్డి పదికోట్లు తీసుకున్నారని ఆరోపించారు. ఆ విషయాన్ని తన చాంబర్లో ఉన్న కోట్ల విన్న వెంటనే అసెంబ్లీ హాల్లోకి ఆగ్రహావేశాలతో వచ్చి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. తన ప్రత్యర్థులు ఎవరిపైన అయినా, ఏ అవకాశం వచ్చినా తట్టెడు బురద చల్లడం చంద్రబాబు నైజం. ఈ విషయంలో ఆయ నకు ఎన్టీఆర్ అయినా, జగన్ అయినా, మరొకరు అయినా ఒకటే. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తే అనుమానిస్తారా?
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చినందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిపై అనుమానం వ్యక్తం చేస్తారా అని ఏపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదిని హైకోర్టు నిలదీసింది. ఆ అనుమతులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అప్పీలు చేయలేదని.. అలాంటప్పుడు ఆ ఆదేశాలను ప్రస్తావిస్తూ, అనుమానాలు ఎలా వ్యక్తం చేస్తారని న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. తాను కూడా ఇలాంటి కేసుల్లో నిందితులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతించానని చెప్పారు. ఇది సహేతుక కారణం కాదని.. సదరు కోర్టు ఎదుట ఉన్న పిటిషన్లను మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరడం సరికాదని స్పష్టం చేశారు. అత్యవసర విచారణలో.. పెట్టుబడుల కేసులో బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ ప్రత్యేక కోర్టులో తాను వేసిన పిటిషన్‌ను మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ట్రాన్స్ఫర్ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ మంగళవారం భోజన విరామం తర్వాత అత్యవసర విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. గత నెల 26న తాము దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసిందంటూ సాక్షి వెబ్సైట్లో కథనాన్ని ఉంచిందని కోర్టుకు వివరించారు. ఇదే కేసులో రెండో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి రెండు వారాలపాటు దుబాయ్, మాల్దీవులు, ఇండోనేషియా దేశాల్లో పర్యటించేందుకు ప్రత్యేక కోర్టు అనుమతించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో తమకు ప్రత్యేక కోర్టుపై అనుమానాలు ఉన్నాయని, అందువల్ల తమ పిటిషన్‌ను మరో కోర్టుకు బదిలీ చేసి విచారించేలా ఆదేశించాలని కోరారు. అయితే.. జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఎప్పుడు పిటిషన్ దాఖలు చేశారని న్యాయమూర్తి ప్రశ్నించగా.. ఏప్రిల్ నెలలో వేశామని న్యాయవాది బదులిచ్చారు. ఆగస్టు 25న తమ పిటిషన్‌పై ఆదేశాలు రావాల్సి ఉందని, అయితే విజయసాయిరెడ్డి బెయిల్‌ను కూడా రద్దు చేయాలంటూ తాము పిటిషన్ వేయడంతో.. రెండు పిటిషన్లపై ఈ నెల 15న ఆదేశాలు ఇస్తామని ప్రత్యేక కోర్టు పేర్కొన్నదని వివరించారు. అప్పీలు చేయకుండానే.. విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంపై అభ్యంతరం ఉన్నట్లయితే.. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేశారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. అప్పీల్ చేయలేదని రఘురామ తరఫు న్యాయవాది బదులిచ్చారు. అలాంటప్పుడు ప్రత్యేక కోర్టు ఆదేశాలను ఎలా ప్రస్తావిస్తున్నారని న్యాయమూర్తి నిలదీశారు. గతంలోనూ విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు ప్రత్యేక కోర్టు అనుమతించిందని గుర్తు చేశారు. అప్పుడు ప్రత్యేక కోర్టు విధించిన షరతులను విజయసాయిరెడ్డి ఏమైనా ఉల్లంఘించారా అని సీబీఐ స్పెషల్ పీపీ సురేందర్‌ను ప్రశ్నించారు. అలాంటిదేమీ లేదని స్పెషల్ పీపీ తెలిపారు. అంతేగాకుండా మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. సహేతుక కారణాలేవీ చూపకుండానే, బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు వెలువరించనున్న తరుణంలో ఇలా పిటిషన్‌ను మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరడం సరికాదని స్పష్టం చేశారు. నిందితులు విదేశాల్లో పర్యటించేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనేక సార్లు ఆదేశాలు ఇస్తూ ఉంటుందని.. అంత మాత్రాన పిటిషన్ మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరడం సరికాదని పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును బుధవారానికి వాయిదా వేశారు. -
ఎంపీ కవిత పీఏలం.. అంతా చూసుకుంటాం..!
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత పీఏలమంటూ ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటున్న ముగ్గురిని సీబీఐ అరెస్టు చేసింది. ఢిల్లీలోని న్యూగుప్తా కాలనీకి చెందిన మన్మీత్ సింగ్ లాంబా నివాసాన్ని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) కూల్చేయనుందని, కూల్చకుండా చూసుకుంటామని లాంబాను నిందితులు సంప్రదించారు. ఎంసీడీలో ఓ అధికారి తెలుసని, ఇల్లు కూల్చకుండా ఉండేందుకు రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంపీ కవిత నివాసంలో గురువారం రూ.లక్ష లంచం తీసుకుంటుండగా, రెడ్ హ్యాండెడ్‌గా ముగ్గురు నిందితులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. వారిలో రాజీవ్ భట్టాచార్య, శుభాంగి గుప్తా, దుర్గేశ్‌కుమార్ ఉన్నారు. లాంబా ఫిర్యాదు ప్రకారం.. ఎంసీడీలో అధికారి తనకు తెలుసని, టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత పీఏనంటూ రాజీవ్ భట్టాచార్య తొలుత పరిచయం చేసుకున్నాడు. ఎంపీ కవితకు కో–ఆర్డినేటర్ అంటూ శుభాంగి గుప్తాను పరిచయం చేశాడు. ఆ తర్వాత దుర్గేశ్కుమార్ను ఎంపీ మరో పీఏ అంటూ పరిచయం చేశాడు. ముగ్గురూ కలిసి రూ.5 లక్షలు డిమాండు చేశారు. తదనంతరం జరిపిన చర్చల్లో చివరకు రూ.లక్షకు బేరం కుదుర్చుకున్నారు. బీష్మంబర్దాస్ మార్గ్‌లోని ఎంపీ నివాసానికి డబ్బు తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని లాంబా సీబీఐకి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగి, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులను నేడు కోర్టులో హాజరుపర్చనున్నారు. ఢిల్లీలో నాకు పీఏలెవరూ లేరు: ఎంపీ ఢిల్లీలో తనకు వ్యక్తిగత సహాయకులు ఎవరూ లేరని ఎంపీ మాలోత్ కవిత స్పష్టం చేశారు. ఓ గృహ నిర్మాణదారుడి నుంచి డబ్బులు వసూలు చేసిన ముఠాలో తన పీఏ ఉన్నాడంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన దుర్గేశ్ అనే వ్యక్తి కేవలం 2 నెలల కిందటే కారు డ్రైవర్‌గా చేరాడని, అతడికి స్టాఫ్ క్వార్టర్స్ ఇచి్చనట్లు వెల్లడించారు. యూపీకి చెందిన దుర్గేశ్‌కు తాను ఢిల్లీ వెళ్లినప్పుడే వాహనం ఇస్తానని, గురువారం జరిగిన ఘటన నేపథ్యంలో తక్షణమే విధుల నుంచి తొలగించానని వివరణ ఇచ్చారు. చదవండి: ప్రాణం లేదని.. చెత్తకుప్పలోకి -
‘ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు.. చట్టానికి అతీతులా?’
ముంబై: మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు చేసిన మాజీ ముంబై పోలీసు కమిషనర్ పరంవీర్ సింగ్‌పై బాంబే హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా.. సీబీఐ విచారణ కోరుతున్నారు మీరు చట్టానికి అతీతులా’’ అని ప్రశ్నించింది. అనిల్ దేశ్‌ముఖపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ పరంవీర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ని బాంబే హైకోర్టు బుధవారం విచారించింది. ఈ సందర్భంగా కోర్టు ‘‘ మీరు ఓ పోలీసు కమిషనర్. మీ కోసం చట్టాన్ని పక్కకు పెట్టాలా. మంత్రులు, రాజకీయ నాయకులు, పోలీసులు చట్టానికి అతీతులా.. మాకు ఏ చట్టాలు వర్తించవని మీ అభిప్రాయమా’’ అంటూ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. అంతేకాక ‘‘పోలీసు డిపార్ట్మెంట్లో అత్యున్నత స్థానంలో ఉండి.. 30 ఏళ్లకు పైగా ఈ నగరానికి సేవలందించిన మీలాంటి ఓ వ్యక్తి వద్ద నుంచి ఇలాంటి కఠిన నిజాలు వెలువడటం శోచనీయం. అనిల్ దేశ్‌ముఖ్ అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసును సీబీఐకి అప్పగించాలని మీరు కోరుతున్నారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఎలాంటి విచారణ జరపలేం అనే విషయం మీకు తెలియదా.. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు. నేరం జరుగుతుందని తెలిసినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అది మీ బాధ్యత కాదా’’ అని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది ముకేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు కలిగిన వాహనం కలకలం కేసుకు సంబంధించి పోలీసు సహచరుల తప్పిదాలకు కమిషనర్ పరంవీర్ సింగ్‌ను బాధ్యుడిగా చేస్తూ మహారాష్ట్ర హోంమంత్రి బదిలీ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరంవీర్ సింగ్ అనిల్ దేశ్‌ముఖ్ బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు 100 కోట్ల రూపాలయు వసూలు చేయాలని వజేకు టార్గెట్ విధించాడని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు రాసిన లేఖలో ఆరోపించాడు. ఇందుకు సంబంధించి సీబీఐ విచారణ చేపట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో పిల్ దాఖలు చేశాడు. చదవండి: వాజే టార్గెట్ వంద కోట్లు -
ఎంపీ రఘురామకృష్ణరాజుపై సీబీఐ మరో కేసు
సాక్షి, అమరావతి: నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజుపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగవేసినందుకు ఆయనపై ఇటీవల సీబీఐ కేసు నమోదు చేసి ఏకకాలంలో ఆయన ఆఫీసు, ఇళ్లపైన సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఫోర్జరీ పత్రాలతో బ్యాంకులకు టోకరా వేసినందుకు సీబీఐ కేసు నమోదు చేసింది. పథకం ప్రకారం ఫోర్జరీ పత్రాలతో రూ.237.84 కోట్ల రుణం తీసుకుని మోసం చేసినట్టు చెన్నై ఎస్బీఐ డీజీఎం ఎస్.రవిచంద్రన్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఢిల్లీలో సీబీఐ ఎస్పీ అశోక్‌కుమార్ కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ వివరాలను సీబీఐ కార్యాలయం గురువారం విడుదల చేసింది. రఘురామకృష్ణరాజుతోపాటు కంపెనీ డైరెక్టర్లుగా ఉన్న ఆయన భార్య, కుమార్తె, ఇంకా పలువురిపై కేసు నమోదైంది. తమిళనాడులోని తూత్తుకూడిలో ఇండ్ భారత్ పవర్ జెన్‌కం లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు పేరుతో ఫోర్జరీ పత్రాలు పెట్టి రుణంగా పొందిన రూ.237.84 కోట్ల మొత్తాన్ని పక్కదారి పట్టించినట్టు సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. రఘురామకృష్ణరాజుతోపాటు కంపెనీ డైరెక్టర్లపై ఐపీసీ 120బి రెడ్ విత్ 420, 467, 468, 471తోపాటు పీసీ యాక్ట్–1988 ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఆయన బ్యాంకులను మోసం చేయాలనే ఉద్దేశపూర్వకమైన నేర స్వభావంతోనే పథకం ప్రకారం ఫోర్జరీ పత్రాలతో కోట్లాది రూపాయలను బ్యాంకుల నుంచి రుణంగా పొందినట్టు సీబీఐ పేర్కొంది. ఈ కేసులో ఎంపీ రఘురామకృష్ణరాజు, కనుమూరు రమాదేవి, కనుమూరు ఇందిరా ప్రియదర్శిని, అంబేద్కర్ రాజ్‌కుమార్ గంటా, దుంపల మధుసూదనరెడ్డి, నారాయణప్రసాద్ భాగవతుల, రామచంద్ర అయ్యర్ బాలకృష్ణ.. మరికొందరిని నిందితులుగా సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. చదవండి: ‘చంద్రబాబు డైరెక్షన్లో రఘురామ కృష్ణంరాజు’ -
సీళ్లు సేఫ్.. బంగారం ‘ఉఫ్’
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎనిమిదేళ్ల క్రితం ఒక ప్రైవేటు సంస్థ నుంచి సీబీఐ సీజ్ చేసిన 400 కిలోల బంగారంలో 103 కిలోల మేర మాయమైన సంఘటన కలకలం సృష్టిస్తోంది. దీంతో ఉలిక్కిపడిన సీబీఐ ఒక ఎస్పీ ర్యాంక్ అధికారి ఆధ్వర్యంలో మొత్తం ఘటనపై అంతర్గత విచారణకు సిద్ధమైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై మరోవైపు సీబీసీఐడీ(తమిళనాడు) విచారణకు మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఆరునెలల్లో విచారణ పూర్తి చేసి చార్జిషీటు దాఖలు చేయాలని సూచించింది. స్థానిక పోలీసులు విచారణ జరిపితే తమ పరువు పోతుందన్న సీబీఐ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఇది సీబీఐకి అగ్ని పరీక్ష సమయమని వ్యాఖ్యానించింది. ఏం జరిగింది? చెన్నై ఎన్ఎస్సీ బోస్ రోడ్డులోని సురానా కార్పొరేషన్‌తో కొందరు స్వదేశీ, విదేశీ ఉన్నతాధికారులు, వ్యాపార సంస్థలు లోపాయికారి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని, ఎంఎంటీసీ అధికారుల అండతో ఈ కంపెనీ బంగారం, వెండిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించడంతో 2012లో సీబీఐ సదరు సంస్థలో సోదాలు చేసి దాదాపు 400.47 కిలోల బంగారు బిస్కెట్లు, నగలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఆ బంగారాన్ని సురానా కార్యాలయంలోని లాకర్లో భద్రం చేసి సీలువేశారు. ఈ లాకరుకు సంబంధించిన 72 తాళం చెవులను, స్వాధీనం చేసుకున్న బంగారు వివరాల జాబితాను చెన్నైలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు అప్పగించారు. సురానా అనేక బ్యాంకుల్లో రూ.1,160 కోట్లను రుణంగా పొంది తిరిగి చెల్లించకపోవడంతో ఆ సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకుని నిర్వహించేందుకు బ్యాంకుల తరఫున రామ సుబ్రమణియం అనే వ్యక్తిని జాతీయ కంపెనీ లా బోర్డు ప్రత్యేకాధికారిగా నియమించింది. సీబీఐ స్వాధీనం చేసుకున్న బంగారాన్ని రుణ బకాయి చెల్లింపు కింద తమకు అప్పగించాలని ఆయన కోర్టులో పిటిషన్ వేసి అనుమతి పొందారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో లాకర్‌ను తెరిచిచూడగా లోపల ఉంచిన మొత్తం 400.47 కిలోల బంగారులో 103.86 కిలోల బంగారం తగ్గింది. ఈఘటనపై ప్రత్యేకాధికారి రామసుబ్రమణియం మద్రాసు హైకోర్టులో వేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. బం గారం మాయమైన ఘటనపై సీబీసీఐడీకి ఫిర్యాదు చేయాలని రామసుబ్రమణియంకు కోర్టు సూచించింది. ఈ ఫిర్యాదును అనుసరించి ఎస్పీ హోదాకు తక్కువగాని అధి కారి విచారణ చేయాలని పేర్కొంది. సీబీఐ ఏమంటోంది? ఇప్పటికే సీబీఐ ఈ విషయమై అంతర్గత విచారణకు ఎస్పీ స్థాయి అధికారిని నియమించింది. అయితే కోవిడ్ నిబంధనలు, లాక్డౌన్ తదితర కారణాల వల్ల ఈ విచారణ పూర్తికాలేదని సంస్థ వర్గాలు తెలిపాయి. బంగారం తమ సొంత వాల్టుల(మల్ఖనా) నుంచి మాయమై ఉంటే సీబీఐ వెంటనే చర్యలు తీసుకునేదని, కానీ ఇప్పుడు మాయమైన బంగారం సురానా కంపెనీ లాకర్ నుంచి మాయం కావడంతో ఏం జరిగిందో లోతైన విచారణ జరగాలని సీబీఐ అధికారులు చెప్పారు. ఇదే సమయంలో సురానా సంస్థ కోర్టును ఆశ్రయించిందని, తాము ఆదేశించే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోర్టు చెప్పిందని వెల్లడించారు. 2012లో ఈ రైడ్‌లో పాల్గొన్న అధికారులు కొందరు రిటైరయ్యారని, కోవిడ్ లాక్డౌన్ సమయంలో వారిని విచారించడం కుదరలేదని వివరించారు. బంగారమా? గంజాయా? వేసిన సీళ్లు వేసినట్లుండగానే బంగారం మాయం కావడంపై విచారించిన హైకోర్టు పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ కోర్టు లేదా సీబీఐ సొంత వాల్టుల(మల్ఖనా) నుంచి చోరీ జరిగితే ఎలాంటి చర్యలు తీసుకునేవారని హైకోర్టు విచారణలో భాగంగా ప్రశ్నించింది. అదే జరిగితే స్థానిక పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించి పోలీసు దర్యాప్తు జరిపేవారని, సదరు పోలీసులు పట్టుకున్న బంగారం 296.66 కిలోలేనని, తప్పుగా 400.47 కిలోలుగా ఎంటర్ చేశారని నిర్ధారించేవాళ్లని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఇంకా ఇలాంటి వాదన రాకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నది. వ్యత్యాసం కొన్ని గ్రాములైతే ఏదో ఒక సమాధానం చెప్పవచ్చని, కానీ వంద కిలోల బంగారం తేడా రావడం ఎలా జరుగుతుందో ఎంత ఆలోచించినా అర్ధం కావడం లేదని, గంజాయి లాగా బంగారం బరువు కాలంతో పాటు తగ్గదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. -
సీబీఐ కేసు: రఘురామకృష్ణం రాజు ఔట్
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల కాలంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ రఘురామకృష్ణం రాజుపై వేటుపడింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి అతన్ని తప్పించారు. సబార్డినేట్ లెజిస్లేచర్ స్టాండింగ్ కమిటీ నూతన చైర్మన్‌గా వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరిని నియమించారు. అక్టోబర్ 9 నుంచే మార్పులు చేర్పులు అమల్లోకి వస్తాయని శుక్రవారం లోక్‌సభ సచివాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రుణాల ఎగవేత కేసులో రాఘురామకృష్ణం రాజుపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. (రఘురామకృష్ణంరాజుపై సీబీఐ కేసు) పంజాబ్ నేషనల్ బ్యాంకు నేతృత్వంలోని కన్సార్షియం ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. రూ. 826.17 కోట్ల మోసానికి పాల్పడినట్టు ఫిర్యాదు అందినట్లు, నిధులను దారిమళ్లించి దుర్వినియోగానికి పాల్పడ్డట్టు అభియోగాలు మోపింది. ఈ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నందున అతన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. -
బ్యాంకు రుణం ఎగ్గొట్టి సొంత ఖాతాలకు..
-
ఉల్లం‘గనుల్లో బినామీలు’
టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సాగించిన అక్రమ మైనింగ్‌పై సీబీఐ కేసు నమోదు వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా టీడీపీ శ్రేణుల్లో యరపతినేని బినామీల వ్యవహారంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆరుగురు బినామీలపై కేసు నమోదు కావడంతో మిగిలినవారు భయపడుతున్నారు. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తమ పేర్లు లేకపోవడం తాత్కాలికంగా ఊరట ఇస్తున్నా ముందు ముందు తమ పేర్లు, పాత్ర బయటపడుతుందన్న భయం వారిని వెంటాడుతోంది. సాక్షి, గుంటూరు: టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్‌కు పాల్పడిన విషయం బహిరంగ రహస్యమే. ఆయన బినామీలు, అనుచరులను అడ్డుపెట్టుకుని పిడుగురాళ్ల మండలం కోనంకి, దాచేపల్లి మండలం కేశానుపల్లి, నడికుడి గ్రామాల పరిధిలో జరిగిన అక్రమ మైనింగ్ విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. బుధవారం 17 మందిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నిందితుల్లో ఆరుగురు యరపతినేని బినామీలేనని టీడీపీలోనే చర్చ నడుస్తోంది. అక్రమ మైనింగ్‌పై కేసుల నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు మరికొందరిపై కేసులు నమోదు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే యరపతినేని బినామీలపై కేసులు నమోదవ్వడంతో అక్రమ మైనింగ్‌లో కీలక పాత్ర పోషించిన ఘట్టమనేని బుల్లెబ్బాయి, ఘట్టమనేని నాగేశ్వరరావు, ముప్పన వెంకటేశ్వర్లు తదితరులు ఆందో ళనలో ఉన్నట్టు తెలుస్తోంది. సీబీఐ నమోదు చేసి న ఎఫ్ఐఆర్లో తమ పేర్లు లేకపోవడం తాత్కాలికంగా ఊరటనిస్తున్నప్పటికీ పూర్తి స్థాయి విచారణ మొదలైతే తమ పేర్లు, పాత్ర బయపడుతుందని భయం వారిని వెంటాడనుంది. యరపతినేని బినామీల చరిత్ర ఇదీ.. ఏ–1 నెల్లూరి శ్రీనివాసరావు : కేశానుపల్లికి చెందిన నెల్లూరి శ్రీనివాసరావు పెట్రోలు బంకులో సూపర్వైజర్గా పనిచేస్తూ టీడీపీలో యరపతినేని అనుచరుడిగా తిరుగుతుండేవాడు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కేశానుపల్లి గ్రామంలో ఉన్న క్వారీలన్నింటిని తమ ఆధీనంలోకి తీసుకుని పర్యవేక్షణ బాధ్యతలు మొత్తం నెల్లూరు శ్రీనివాసరావుకు అప్పగించేశారు. క్వారీల్లో అక్రమంగా లైమ్‌స్టోన్‌ను తవ్వడం నుంచి మిల్లులకు సరఫరా చేయడం వరకు ఇతనే చూశాడని ప్రచారం. అక్రమ మైనింగ్ పుణ్యమా అని పెట్రోల్ బంకులో పనిచేసిన శ్రీనివాసరావు నేడు రూ.కోట్లకు పడగలెత్తాడు. ఏ–6 బత్తుల నరసింహారావు: 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే అప్పటి వరకు నడుస్తున్న వడ్డెర కో–ఆపరేటీవ్ సొసైటీని రద్దు చేసి యరపతినేని అండతో కొత్త సొసైటీ ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా కొనసాగాడు. కేశానుపల్లిలో 25 ఎకరాలు, నడికుడి రైల్వే స్టేషన్ సమీపంలోని అంజనీపురం కాలనీ పక్కనే ఉన్న జేపీ సిమెంట్, ప్రభుత్వ భూములు సుమారు 150 ఎకరాలు ఆక్రమించేశారు. యరపతినేని కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియా అండతో వడ్డెర సొసైజీలోని యరపతినేని అనుచరులతో లైమ్ స్టోన్‌ను దోచేయడంలో కీలకపాత్ర పోషించాడు. నడికుడి, కేశానుపల్లిల్లో అక్రమ మైనింగ్ బ్లాస్టింగ్స్, తదితర వ్యవహారాలను చూసుకున్న నరసింహారావు కుమారుడు బత్తుల రాంబాబుపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఏ–7 మీనిగ అంజిబాబు: పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామానికి చెందిన మీనిగ అంజిబాబు 2014 టీడీపీ అధికారంలోకి రాకముందు వరకూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే యరపతినేని కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియా ముఠాలో ఇతను ఒక సభ్యుడుగా మారాడు. ఇతను క్వారీ వద్ద కాపలాగా ఉంటూ రోజువారి టిప్పర్లలో లైమ్‌స్టోన్‌ను ఏఏ మిల్లులకు తరలించారనే వివరాలను బుల్లెబ్బాయి ద్వారా యరపతినేనికి తెలిపేవాడు. అక్రమ మైనింగ్ జరిగే క్వారీల్లో కొందరు కురాళ్లను అంజిబాబు నిఘా కొనసాగించేవాడు. కూలీలకు డబ్బు చెల్లించడం, క్వారీవైపు ఇతరులు ఎవ్వరినీ కన్నెత్తకుండా చేయడం లాంటివి చేస్తూ చోటా డాన్‌లా ఇతను వ్యవహరించాడు. ఏ–9 గ్రంధి అజయ్‌కుమార్: పిడుగురాళ్ల పట్టణానికి చెందిన గ్రంధి అజయ్ కొండమోడులో యరపతినేని కనుసన్నల్లో నడిచే అక్రమ క్వారీ వ్యవహారాలను చూసుకున్నాడు. ఏ–12 గుదె వెంకట శివకోటేశ్వరరావు: పిడుగురాళ్లకి పట్టణానికి చెందిన గుదె వెంకట శివకోటేశ్వరరావు అలియాస్ కోటి అక్రమ మైనింగ్‌కు మందు గుండు సామాగ్రి సరఫరా చేస్తూ మైనింగ్ కార్యక్రమాలను పరిశీలిస్తుంటాడు. మిల్లులకు సరఫరా చేసిన లైమ్‌స్టోన్ తాలుకూ డబ్బును వసూలు చేసి ఏ రోజుకు ఆ రోజు యరపతినేనికి లెక్కలు చెప్పడం వంటి కార్యకలాపాలు ఇతనే చూసుకున్నాడు. ఏ–16 నీరుమల్ల శ్రీనివాసరావు: పిడుగురాళ్ల పట్టణానికి చెందిన నీరుమల్ల శ్రీనివాసరావు వార్డు స్థాయిలో టీడీపీ క్రీయాశీల నేత, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బినామిల్లో ఒకడు. ఇతడు 1.30 లక్షల టన్నుల తెల్లరాయిని అక్రమ మైనింగ్ ద్వారా దోచేశాడని మైనింగ్ అధికారులు 2018లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సీబీఐ కార్యాలయానికి రియా చక్రవర్తి
ముంబై : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును విచారిస్తున్న సీబీఐ హీరో గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తికి సమన్లు జారీ చేసింది. ఈ రోజు(శుక్రవారం) విచారణకు హాజరు కావలని రియాకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం ముంబైలోని సీబీఐ కార్యాలయానికి రియా చేరుకున్నారు. రియాతోపాటు సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పితానీని మరోసారి ప్రశ్నించనున్నాను. రియా సోదరుడిని 14 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. సుశాంత్ ఇంటి సిబ్బంది, స్నేహితుడు సిద్దార్ధ్‌ను కూడా విచారించారు. సుశాంత్‌ది అసలు ఆత్మహత్యా? లేదా హత్యా? అనే కోణంలో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. (సుశాంత్ మెసేజ్ చేశాడు.. బ్లాక్ చేశా: రియా) రియా తన కొడుకును మానసికంగా వేధించిందని, డబ్బుల్ని వ్యక్తిగతంగా వినియోగించుకుందని సుశాంత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న క్రమంలో గత వారం సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు సీబీఐ సుశాంత్ కేసులో దర్యాప్తును ప్రారంభించిన విషయం తెలిసిందే. సుశాంత్ తండ్రి బిహార్‌లో ఫిర్యాదు చేసిన కేసు ఆధారంగా రియా, ఆమె కుటుంబాన్ని సీబీఐ విచారిస్తోంది. రియా చక్రవర్తి తండ్రి, సోదరుడిని అధికారులు ప్రశ్నించగా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్లాట్ మేట్ సిద్ధార్థ్ పిథానీని కూడా ఏడు రోజుల పాటు ప్రశ్నించారు. (అన్నలాంటి వాడు.. సిగ్గుపడండి)