Cheteshwar Pujara
-
సెలక్టర్లకు వార్నింగ్.. డబుల్ సెంచరీతో చెలరేగిన పుజారా
భారత క్రికెట్ జట్టుకు దూరంగా ఉంటున్న వెటరన్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా మరోసారి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సత్తాచాటాడు. పుజారా ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా రాజ్‌కోట్ వేదికగా ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. సౌరాష్ట్ర మొదటి ఇన్నింగ్స్‌లో 348 బంతుల్లో తన డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 22 ఫోర్లు ఉన్నాయి. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో పుజారాకు ఇది 18వ డబుల్ సెంచరీ కావడం గమనార్హం. అంతేకాకుండా పుజారా ఈ ఇన్నింగ్స్‌తో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 27,000 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. ఈ ఘనతను సాధించిన నాలుగో భారత క్రికెటర్‌గా పూజారా నిలిచాడు. ఈ జాబితాలో పూజారా కంటే ముందు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ ఉన్నారు. అదే విధంగా ఫస్ట్ క్లాస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో పూజారా నాలుగో స్ధానానికి ఎగబాకాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో డాన్ బ్రాడ్‌మన్(37) అగ్రస్ధానంలో ఉండగా .. తర్వాతి స్ధానాల్లో వాలీ హమండ్(36), హెన్రడన్(22), పూజారా(18) కొనసాగుతున్నారు. -
కోహ్లి లేడు.. పుజారా కెరీర్ ముగిసినట్లేనా? ఎందుకీ దుస్థితి?
India vs England, 4th Test Day 2: టీమిండియా నయా వాల్‌గా పేరొందిన ఛతేశ్వర్ పుజారాను ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పుజారా లాంటి బ్యాటర్ జట్టులో ఉండి ఉంటే బాగుండేదన్నాడు. అతడు గనుక తుదిజట్టులో ఉండి ఉంటే నాలుగో టెస్టులో భారత్‌కు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నాడు. కాగా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా 2-1తో ముందంజలో ఉంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య రాంచి వేదికగా శుక్రవారం నాలుగో టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్‌లో ఫలితం తేల్చి సిరీస్ కైవసం చేసుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా బరిలోకి దిగింది. అయితే, తొలిరోజు అందుకు తగ్గట్లుగానే ప్రణాళికలు అమలు చేసినా.. జో రూట్ అద్భుత ఇన్నింగ్స్(122 నాటౌట్)తో ఇంగ్లండ్‌కు మంచి ఆరంభం అందించాడు. ఈ నేపథ్యంలో శనివారం నాటి రెండో రోజు ఆటలో 353 పరుగులకు ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసింది టీమిండియా. అయితే, ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. బ్యాటింగ్ మొదలుపెట్టిన రోహిత్ సేన 177 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 73 పరుగులతో రాణించగా.. ఆట పూర్తయ్యే సరికి 219/7 (73) స్కోరు వద్ద నిలిచింది. ఇంగ్లండ్ స్పిన్నర్లు షోయబ్ బషీర్ 4, టామ్ హార్లే రెండు.. పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కంటే 134 పరుగులు వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర ట్వీట్‌తో ముందుకు వచ్చాడు. స్పిన్ బౌలింగ్ ఆడటంలో టీమిండియా బ్యాటర్ల వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘అనుభవజ్ఞుడైన, వరల్డ్‌క్లాస్ బ్యాటర్ కోహ్లి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిణామంలో టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో పుజారాను తిరిగి తీసుకురావాలనే తలంపు వస్తోందా? లేదంటే అతడి అంతర్జాతీయ కెరీర్ పూర్తిగా ముగిసిపోయినట్లేనా? ఒకవేళ ఈరోజు అతడు గనుక జట్టుతో ఉండి ఉంటే కచ్చితంగా పట్టుదలగా నిలబడి.. ఆంకర్ ఇన్నింగ్స్ ఆడేవాడు’’ అని స్టువర్ట్ బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. కాగా జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంతో రంజీ ట్రోఫీ టోర్నీ బరిలో దిగిన సౌరాష్ట్ర బ్యాటర్ పుజారా.. ప్రస్తుతం తమిళనాడుతో క్వార్టర్ ఫైనల్ ఆడుతున్నాడు. చదవండి: Ind Vs Eng 4th Test: ‘ఛీ.. ఛీ.. చీటింగ్‌కు కూడా వెనుకాడరు’.. ఇలా ఉన్నారేంట్రా బాబూ! With the experience & world class talent of Kohli missing, would there have been temptation to bring back Pujara into this India batting line up? Or is his international career over? Feels like he could have brought some consistency and an anchor ⚓️ — Stuart Broad (@StuartBroad8) February 24, 2024 -
పుజారా మెరుపు సెంచరీ.. రీ ఎంట్రీకి 'సై'
రంజీట్రోఫీ 2023-24 సీజన్లో టీమిండియా వెటరన్ క్రికెటర్ ఛెతేశ్వర్ పుజారా అదరగొడుతున్నాడు. సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న పుజరా.. సెంచరీల మోత మోగిస్తున్నాడు. పుజారా తాజాగా మరో ఫస్ట్ క్లాస్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. రాజ్‌కోట్ వేదికగా మణిపూర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పుజారా తన శైలికి విరుద్దంగా టీ20 తరహాలో ఆడాడు. 105 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 108 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పుజారాకు ఇది 63వ సెంచరీ. ప్రస్తుత సీజన్లో ఓవరాల్‌గా 7 మ్యాచ్‌లు ఆడిన పుజారా 77 సగటుతో తో 673 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. కాగా పుజారా దాదాపు ఏడాది నుంచి భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. గతేడాది జరిగిన వరల్ట్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో చివరిగా భారత తరపున ఆడాడు. అయితే పుజారా ప్రస్తుత ఫామ్‌ను చూస్తే రీ ఎంట్రీ ఇచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. కాగా భారత్ తరపున టెస్టుల్లో పుజారాకు ఘనమైన రికార్డు ఉంది. 103 టెస్టుల్లో పుజారా 43 సగటుతో 7195 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో 19 సెంచరీలు, మూడు డబుల్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: ఆయనొక టీమిండియా మాజీ కెప్టెన్.. ఇదేనా మీరేచ్చే గౌరవం? -
‘టీమిండియా స్టార్ రవీంద్ర జడేజాకు సన్మానం’
Ind vs Eng Test Series 2024: ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు టీమిండియా సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య రాజ్‌కోట్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా స్వదేశంలో భారత్ ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ‘బజ్‌బాల్’ అంటూ దూకుడు ప్రదర్శించిన ఇంగ్లండ్ అనూహ్య రీతిలో విజయం సాధించింది. 28 పరుగుల తేడాతో గెలుపొంది బోణీ కొట్టింది. ఈ క్రమంలో వైజాగ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా ఇందుకు బదులు తీర్చుకుంది. బదులు తీర్చుకున్న టీమిండియా డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్టేడియంలో జరిగిన టెస్టులో రోహిత్ సేన స్టోక్స్ బృందాన్ని 106 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఫలితంగా సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 15 నుంచి గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఆరంభమయ్యే మూడో టెస్టు టీమిండియా- ఇంగ్లండ్‌లకు కీలకంగా మారింది. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా టీమిండియా స్టార్లు ఛతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజాలకు ఇది సొంతమైదానం. ఈ నేపథ్యంలో సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎస్సీఏ) కీలక ప్రకటన చేసింది. ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు ముందు ఈ ఇద్దరు క్రికెటర్లను సన్మానించనున్నట్లు తెలిపింది. ఎస్సీఏ అధ్యక్షుడు జయదేవ్ షా ఈ విషయాన్ని వెల్లడించాడు. భారత క్రికెట్‌కు పుజారా, జడేజా చేస్తున్న సేవలకు గానూ వారిని సముచితంగా గౌరవించనున్నట్లు తెలిపాడు. 100 టెస్టుల వీరుడు టీమిండియా నయవాల్గా పేరొందిన ఛతేశ్వర్ పుజారా వందకు పైగా టెస్టులు ఆడాడు. తద్వారా ఈ ఘనత సాధించిన పదమూడో భారత క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అంతర్జాతీయ టెస్టుల్లో టీమిండియా సాధించిన పలు చారిత్రాత్మక విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం జట్టులో చోటు కోల్పోయినా.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సౌరాష్ట్ర తరఫున రంజీ ట్రోఫీ-2024లో అదరగొడుతున్నాడు. అన్ని ఫార్మాట్లలో ఆల్‌రౌండర్‌గా జడేజా టెస్టుల్లో ప్రపంచ నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా ఉన్న రవీంద్ర జడేజా.. టీమిండియాకు అన్ని ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న అతడు.. గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. హోంగ్రౌండ్లో జరిగే మూడో మ్యాచ్‌కు జడ్డూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కెరీర్ పరంగా ఇలా జడేజా గొప్ప స్థాయిలో ఉండగా.. అతడి తండ్రి అనిరుద్‌సిన్హ జడేజా.. జడ్డూతో తమకు కొన్నేళ్లుగా మాటలే లేవంటూ సంచలన ఆరోపణలు చేశాడు. కోడలి వల్లే ఇలా జరుగుతోందంటూ ఇంటిగుట్టును రచ్చకెక్కించాడు. చదవండి: Ravindra Jadeja: మా కోడలి వల్లే ఇదంతా... మండిపడ్డ రివాబా! -
పుజారా అక్కడ దంచికొడుతున్నాడు.. జాగ్రత్త: మాజీ కోచ్ వార్నింగ్
టీమిండియా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిమిత ఓవర్ల క్రికెట్లో అదరగొడుతున్న ఈ కుర్ర బ్యాటర్.. ఇటీవల టెస్టుల్లో మాత్రం తేలిపోతున్నాడు. వెస్టిండీస్ పర్యటన సందర్భంగా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఎంట్రీ ఇచ్చి.. కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా పాతుకుపోగా.. గిల్ వన్‌డౌన్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే, ఓపెనర్‌గా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్... మూడో స్థానంలో మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలోనూ శుబ్‌మన్ గిల్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. తొలి టెస్టులో మొత్తంగా కేవలం 23 పరుగులు మాత్రమే చేసిన గిల్.. వైజాగ్‌లో జరుగుతున్న రెండో మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 34 పరుగులకే అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ హెడ్‌కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి గిల్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘ఈ జట్టులో ఎంతో మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. ప్రతి ఒక్కరు తమను తాము నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా పుజారా నుంచి వారి స్థానానికి కచ్చితంగా ప్రమాదం పొంచి ఉంటుంది. రంజీ ట్రోఫీలో అద్భుత ఫామ్‌తో సత్తా చాటుతున్న పుజారా ఎల్లప్పుడూ సెలక్టర్ల దృష్టిలోనే ఉంటాడన్న విషయం మర్చిపోవద్దు. టెస్టు మ్యాచ్ అంటేనే ఓపికగా ఆడాల్సి ఉంటుంది. సహనం లేకుంటే.. సమస్యలు కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. ఆండర్సన్ వంటి క్లాస్ బౌలర్ బౌలింగ్‌లో ఆడుతున్నపుడు చాలా చాలా జాగ్రత్తగా ఆడాలి’’ అంటూ గిల్ పేరెత్తకుండానే.. అతడికి పుజారా రూపంలో పోటీ ఉందంటూ రవిశాస్త్రి హెచ్చరికలు జారీ చేశాడు. కాగా వైజాగ్ టెస్టులో శుబ్‌మన్ గిల్ ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే.. రాహుల్ ద్రవిడ్ తర్వాత టెస్టుల్లో మూడో స్థానంలో అదరగొట్టిన ఛతేశ్వర్ పుజారా ప్రస్తుతం రంజీ ట్రోఫీతో బిజీగా ఉన్నాడు. సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ఇటీవలే ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇరవై వేల పరుగుల అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ద్విశతకంతోనూ చెలరేగి సత్తా చాటాడు. గత కొంతకాలంగా తనను పక్కన పెట్టిన సెలక్టర్ల దృష్టిని ఆకర్షించడమే లక్ష్యంగా ఆటతో సత్తా చాటుతున్నాడు ఈ నయావాల్. -
అతడి ఖేల్ ఖతం?!.. టీమిండియా సెలక్టర్లు ఏమైనా అనుకోని...
Cheteshwar Pujara Gets Huge Praise: టీమిండియా వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారాపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించాడు. బీసీసీఐ సెలక్టర్లు ఏం ఆలోచిస్తున్నారన్న అంశంతో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్న తీరు అమోఘమని కొనియాడాడు. ఆట పట్ల అతడి నిబద్ధత యువ ఆటగాళ్లకు ఓ స్పూర్తిదాయ పాఠంగా నిలుస్తుందని కైఫ్ పేర్కొన్నాడు. కాగా టెస్టు స్పెష్టలిస్టు పుజారా టీమిండియా ‘నయా వాల్’గా ప్రఖ్యాతి గాంచాడు. స్వదేశీ, విదేశీ గడ్డలపై భారత జట్టు సాధించిన పలు చిరస్మరణీయ విజయాల్లో అతడిది కీలక పాత్ర. శరీరానికి గాయం చేసే డెలివరీలతో బౌలర్లు ఇబ్బంది పెడుతున్నా వికెట్ పడకుండా గంటల కొద్దీ క్రీజులో నిలబడి జట్టుకు ప్రయోజనం చేకూర్చగల అంకితభావం అతడి సొంతం. ఇక తన కెరీర్లో వందకు పైగా టెస్టులాడిన పుజారా 7195 పరుగులు సాధించాడు. ఇందులో 19 శతకాలు, 3 డబుల్ సెంచరీలు, 35 అర్ధ శతకాలు ఉన్నాయి. అయితే, ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్లో వైఫల్యం తర్వాత అతడికి టీమిండియాలో చోటు కరువైంది. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా పర్యటనలకు అతన్ని తప్పించగానే ఈ వెటరన్ పనైపోయిందని అందరూ భావించారు. అయితే రంజీ ట్రోఫీ కొత్త సీజన్లో ఈ సౌరాష్ట్ర స్టార్ బ్యాటర్ అజేయ డబుల్ సెంచరీతో తాను ఫామ్‌లోకి వచ్చానని చాటుకున్నాడు. తన ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 17వ డబుల్ సెంచరీతో రికార్డులు సృష్టించాడు. డబుల్ సెంచరీల వీరుడు.. అరుదైన రికార్డులు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో పుజారా ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్‌మన్ (ఆస్ట్రేలియా; 37), వ్యాలీ హామండ్ (ఇంగ్లండ్; 36), ప్యాట్సీ హెండ్రన్ (ఇంగ్లండ్; 22) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. హెర్బర్ట్ సట్‌క్లిఫ్ (ఇంగ్లండ్; 17), మార్క్ రాంప్రకాశ్ (ఇంగ్లండ్; 17)లతో కలిసి పుజారా (17) ఉమ్మడిగా నాలుగో స్థానంలో ఉన్నాడు. అంతేకాదు.. రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా పుజారా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో తొమ్మిది డబుల్ సెంచరీలతో పారస్ డోగ్రా (హిమాచల్‌ప్రదేశ్) అగ్రస్థానంలో ఉండగా... అజయ్ శర్మ (ఢిల్లీ–7) మూడో స్థానంలో నిలిచాడు. ఈ నేపథ్యంలో పుజారా అద్భుత ప్రదర్శనపై స్పందిస్తూ మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ఎక్స్ వేదికగా అతడిని ప్రశంసించాడు. పరుగుల వరద పారించడమే పని ‘‘జాతీయ జట్టు సెలక్టర్లు ఏం ఆలోచిస్తున్నారో అతడికి అనవసరం. కేవలం పరుగుల వరద పారించడం మాత్రమే అతడికి తెలుసు. క్రికెట్ పట్ల అతడి నిబద్ధత యువ ఆటగాళ్లకు కచ్చితంగా ఓ పాఠంగా నిలుస్తుంది’’ అని పుజారాను ఉద్దేశించి కైఫ్ పేర్కొన్నాడు. Regardless of what the national selectors think of him, Pujara keeps scoring runs. His commitment should be a lesson for all youngsters playing the game. #pujara pic.twitter.com/Py3cFlJJs5 — Mohammad Kaif (@MohammadKaif) January 8, 2024 కాగా జనవరి 25 నుంచి స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీమిండియా టెస్టు సిరీస్ ఆడనునున్న నేపథ్యంలో ఛతేశ్వర్ పుజారాకు సెలక్టర్లు పిలుపునిస్తారా? లేదంటే మళ్లీ పక్కనే పెడతారా అన్న అంశంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. చదవండి: Ind Vs Afg: అఫ్గన్‌తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
శతక్కొట్టిన పుజారా.. టీమిండియా సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్
Ranji Trophy 2023-24- Saurashtra vs Jharkhand: టీమిండియా వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌ను సెంచరీతో ఆరంభించాడు. జార్ఖండ్‌తో శనివారం నాటి ఆటలో ఈ సౌరాష్ట్ర బ్యాటర్ శతక్కొట్టాడు. తద్వారా ఇంగ్లండ్‌తో టీమిండియా టెస్టు సిరీస్ జట్టు ప్రకటనకు ముందు తానూ రేసులోనే ఉన్నానంటూ బీసీసీఐ సెలక్టర్లకు గట్టి సందేశం ఇచ్చాడు. కాగా దేశవాళీ క్రికెట్లో సొంత జట్టు సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న పుజారా.. గత కొన్నేళ్లుగా నిలకడగా ఆడుతూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇంగ్లండ్ కౌంటీల్లోనూ సెంచరీలు బాదుతూ ఎప్పటికప్పుడు తన ఫామ్‌ను నిరూపించుకుంటూనే ఉన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత నో ఛాన్స్ ఈ క్రమంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23లో భాగంగా ఆస్ట్రేలియాతో ఫైనల్ ఆడే అవకాశం దక్కించుకున్న పుజారా.. ఆ మ్యాచ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. ఇంగ్లండ్ వేదికగా ఆసీస్‌తో జరిగిన తుదిపోరులో కేవలం 41 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 209 పరుగుల భారీ తేడాతో ఓడి డబ్ల్యూటీసీ టైటిల్‌ను ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. పుజారా టీమిండియా తరఫున ఆడిన ఆఖరి టెస్టు ఇదే. ఆ తర్వాత సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదు. సౌతాఫ్రికాతో ఇటీవల ముగిసిన టెస్టులకూ ఎంపిక చేయలేదు. మళ్లీ దేశవాళీ క్రికెట్‌పై దృష్టి ఈ క్రమంలో మళ్లీ దేశవాళీ క్రికెట్‌పై దృష్టిపెట్టిన పుజారా.. తాజాగా సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగాడు. రాజ్‌కోట్ వేదికగా జార్ఖండ్‌తో శుక్రవారం మొదలైన ఐదు రోజుల మ్యాచ్‌లో భాగంగా శనివారం సెంచరీతో మెరిశాడు. వికెట్ పడకుండా.. ఆచితూచి ఆడుతున్న ఈ ‘నయా వాల్’ తన శతకాన్ని ద్విశతకంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నాడు. పుజారా 157 నాటౌట్ జార్ఖండ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌరాష్ట్ర తొలుత బౌలింగ్ చేసింది. పేసర్ చిరాగ్ జాని ఐదు వికెట్లతో చెలరేగడంతో జార్ఖండ్‌ను 142 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్రకు ఓపెనర్ హర్విక్ దేశాయ్ 85 పరుగులు సాధించి శుభారంభం అందించాడు. వన్‌డౌన్ బ్యాటర్ షెల్డన్ జాక్సర్ అర్ధ శతకం(54)తో రాణించగా.. అర్పిత్ వసవాడ కూడా హాఫ్ సెంచరీ(68) చేశాడు. ఇక పుజారా 239 బంతుల్లో 19 ఫోర్ల సాయంతో 157 పరుగులతో క్రీజులో ఉండగా.. అతడికి తోడుగా ప్రేరక్ మన్కడ్ 23 పరుగులతో అజేయంగా ఉన్నాడు. పటిష్ట స్థితిలో ఉనాద్కట్ బృందం ఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సరికి సౌరాష్ట్ర 119 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 406 పరుగుల భారీ స్కోరు సాధించింది. పుజారా అద్భుత ఇన్నింగ్స్ కారణంగా జార్ఖండ్ మీద ఆధిపత్యం కొనసాగిస్తోంది. కాగా రంజీ ట్రోఫీలో సౌరాష్ట్రకు టీమిండియా పేసర్ జయదేవ్ ఉనాద్కట్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. చదవండి: BCCI: ఇంగ్లండ్‌తో తలపడే భారత్-‘ఏ’ జట్టు ప్రకటన.. కెప్టెన్ అతడే -
రంజీ ట్రోఫీకి సర్వం సిద్దం.. బరిలో సీనియర్ క్రికెటర్లు
దేశంలోని వివిధ నగరాల్లో భారత దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీకి శుక్రవారం తెర లేవనుంది. ఈ టోర్నీలో మొత్తం 5 గ్రూపుల్లో.. 38 జట్లు తలపడుతున్నాయి. ఎలైట్ డివిజన్లో 32 జట్లు... ప్లేట్ డివిజన్లో 6 జట్లు ఉన్నాయి. ఎలైట్ డివిజన్ తొలి రౌండ్ మ్యాచ్‌లో విశాఖపట్నంలో బెంగాల్‌తో ఆంధ్ర జట్టు... ప్లేట్ డివిజన్లో నాగాలాండ్ జట్టుతో హైదరాబాద్ తలపడతాయి. అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారా వంటి సీనియర్ క్రికెటర్లతో పాటు యువ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చదవండి: ఏం జరిగిందో చూశారు కదా.. నోరుపారేసుకోవడం ఆపితే మంచిది: రోహిత్ -
నిన్న రహానే.. ఇప్పుడు పుజారా! కన్ఫ్యూజన్లో అభిమానులు
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా చిత్తుగా ఓడిన తర్వాత ఇద్దరు సీనియర్ క్రికెటర్ల పేర్లు తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. వారెవరో కాదు.. అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారా. టెస్టు స్పెషలిస్టులైన ఈ ఇద్దరు బ్యాటర్లు టీమిండియా సాధించిన పలు చిరస్మరణీయ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా విదేశీ గడ్డపై ఉత్తమంగా రాణించిన రికార్డు వీరికి ఉంది. టీమిండియా తరఫున ఇప్పటి వరకు 85 టెస్టులు ఆడిన ముంబై బ్యాటర్ రహానే 5077 పరుగులు సాధించాడు. అతడి సారథ్యంలోనే ఆసీస్ గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ గెలిచిన మ్యాచ్ జరిగింది. ఇక ఈ ఏడాది జూలైలో వెస్టిండీస్ సిరీస్ సందర్భంగా రహానే చివరిసారిగా టీమిండియా తరఫున టెస్టు ఆడాడు. మరోవైపు.. తన కెరీర్లో ఇప్పటిదాకా భారత్ తరఫున 103 టెస్టులు ఆడిన పుజారా 7195 రన్స్ చేశాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సందర్భంగా జూన్‌లో అతడు ఆఖరిసారి టీమిండియాకు ఆడాడు. అయితే, దేశవాళి క్రికెట్‌తో పాటు ఇంగ్లండ్ కౌంటీల్లోనూ ఆడుతూ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వీరిద్దరిని గనుక సౌతాఫ్రికాతో టెస్టులకు ఎంపిక చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సహా పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. Ranji Trophy prep mode: 🔛 pic.twitter.com/kFN3PyvTHx — Cheteshwar Pujara (@cheteshwar1) December 30, 2023 ఈ నేపథ్యంలో సౌరాష్ట్ర బ్యాటర్ పుజారా ఓ ఆసక్తికర వీడియోతో ముందుకు వచ్చాడు. రంజీ ట్రోఫీ ఆడేందుకు తాను సన్నద్ధం అవుతున్నట్లు తెలిపాడు. అయితే, ఇందులో అతడు రెడ్ బాల్‌తో కాకుండా వైట్ బాల్‌తో ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపించడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు.. రహానే సైతం శుక్రవారం ఎక్స్ వేదికగా ఓ వీడియో పంచుకున్నాడు. ‘‘విశ్రాంతి లేని రోజులు’’ అంటూ రంజీలకు సిద్ధం అవుతున్నట్లు చెప్పకనే చెప్పాడు. కాగా టెస్టుల్లో అపార అనుభవం, మెరుగైన రికార్డులు ఉన్నా టీమిండియా సెలక్టర్లు తమను పక్కన పెట్టడాన్ని రహానే- పుజారా చాలెంజింగ్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. No rest days 🏏 pic.twitter.com/EM218MqMhK — Ajinkya Rahane (@ajinkyarahane88) December 29, 2023 ఈ ఏడాది రంజీ ట్రోఫీలో సత్తా చాటి మళ్లీ భారత జట్టులో చోటే లక్ష్యంగా వీరిద్దరు ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. జనవరి 5 నుంచి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. చదవండి:Rohit Sharma: ఘనంగా రోహిత్ గారాలపట్టి సమైరా బర్త్‌డే.. వీడియో వైరల్ -
అతడి వల్లే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో టెస్టులు గెలిచాం.. కానీ: భజ్జీ
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయంపై భారత మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. ఈ సిరీస్‌కు జట్టు ఎంపిక చేసిన విధానం అస్సలు బాగోలేదంటూ పెదవి విరిచాడు. విదేశీ గడ్డపై రాణించగల సత్తా ఉన్న ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారాలను పక్కన పెట్టి తప్పుచేశారని విమర్శించాడు. కాగా సఫారీ గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయం నమోదు చేయాలన్న రోహిత్ సేనకు ఆదిలోనే చుక్కెదురైన విషయం తెలిసిందే. బాక్సింగ్ డే మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తో వెనుకబడటంతో పాటు సిరీస్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో.. సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ఫలితంపై స్పందించిన భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ జట్టు కూర్పుపై విమర్శలు గుప్పించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘అజింక్య రహానేను సెలక్ట్ చేయలేదు. ఏ కారణం లేకుండానే ఛతేశ్వర్ పుజారాను తప్పించారు. వీరిద్దరు ఎలాంటి పిచ్‌లపైనైనా పరుగులు రాబట్టగల సమర్థులు. పుజారా రికార్డులు గమనిస్తే.. కోహ్లి మాదిరే జట్టు కోసం అతడు ఎంతో కష్టపడ్డాడు. అయినా.. అతడిని ఎందుకు ఎంపిక చేయలేదో నాకైతే అర్థం కావడం లేదు. నిజానికి టెస్టు క్రికెట్లో పుజారా కంటే అత్యుత్తమమైన బ్యాటర్ మనకూ ఎవరూ లేరు. అతడు నెమ్మదిగా ఆడతాడన్నది వాస్తవం.. అయితే, మ్యాచ్ చేజారిపోకుండా కాపాడగలుగుతాడు. కేవలం అతడి కారణంగానే టీమిండియా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో టెస్టు మ్యాచ్‌లు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక్కసారి కూడా ఆకట్టుకోలేకపోయింది. టాస్ ఓడి తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకే ఆలౌట్ అయింది. కేఎల్ రాహుల్ సెంచరీ వల్లే ఈమాత్రం సాధ్యమైంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో మరీ 131 పరుగులే చేసింది. ఒకవేళ కోహ్లి కాంట్రిబ్యూషన్ గనుక లేకపోయి ఉంటే పరిస్థితి మరింత దిగజారేది. నిజానికి ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లోనే టీమిండియా ఓటమి దాదాపుగా ఖరారైపోయింది’’ అంటూ భజ్జీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా సౌతాఫ్రికాతో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో రాహుల్ 101 పరుగులు చేయగా.. కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లో 76 రన్స్ తీశాడు. ఇక ఇరు జట్ల మధ్య జనవరి 3 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Ind A Vs SA A: ఐదు వికెట్లు తీసిన ఆవేశ్.. తిలక్, అక్షర్ అర్ధ శతకాలు! టాప్ స్కోరర్ అతడే -
కోహ్లి సెంచరీపై పుజారా సంచలన వ్యాఖ్యలు! రాహుల్ ఎందుకలా? జట్టుకు నష్టం..
ICC ODI WC 2023- Kohli 78th Century: సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023.. బంగ్లాదేశ్‌తో పుణెలో మ్యాచ్.. లక్ష్య ఛేదనలో టీమిండియా జోరు చూస్తే గెలుపుపై ఎలాంటి సందేహాలు లేవు. రన్‌మెషీన్ విరాట్ కోహ్లి సెంచరీ సెంచరీలకు మరో ముందడుగు పడే అవకాశం.. ఛేజింగ్‌లో 36 ఓవర్ల తర్వాత జట్టు విజయానికి 48 పరుగులు కావాల్సి ఉండగా... కోహ్లి అప్పటికి 68 పరుగుల వద్ద ఉన్నాడు. తర్వాతి ఓవర్లో కేఎల్ రాహుల్ 6, 4 సహా 12 పరుగులు చేయడంతో ఈ అంతరం మరింత తగ్గింది. మరుసటి ఓవర్ తర్వాత టీమిండియా గెలవాలంటే 28 పరుగులు, కోహ్లి సెంచరీకి 27 పరుగులు కావాలి. ఇద్దరు ప్రధాన బ్యాటర్లు క్రీజ్‌లో ఉంటే ఒక్కడే పరుగులు చేయడం దాదాపుగా జరగదు. కానీ తగినన్ని ఓవర్లు అందుబాటులో ఉండటంతో సమస్య లేదు కాబట్టి ఈ దశలో కోహ్లి శతకం పూర్తి చేసుకోవడంపై దృష్టి సారించాడు. అతడి ఆలోచనకు తగ్గట్లుగా రాహుల్ కూడా పరుగులు చేయకుండా వెనక్కి తగ్గాడు. సింగిల్స్ తీసే అవకాశమున్నా కోహ్లి- రాహుల్ పరస్పర సమన్వయంతో ముందుకు సాగారు. ఫలితంగా కోహ్లి అంతర్జాతీయ కెరీర్లో 78వ శతకం సాధ్యమైంది. తర్వాతి 32 పరుగుల్లో కోహ్లి ఒక్కడే 30 పరుగులు సాధించగా రాహుల్ సింగిల్ మాత్రమే తీశాడు. మరో పరుగు వైడ్ రూపంలో వచ్చింది. నసుమ్ వేసిన ఫుల్‌టాస్ బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాది విరాట్ కోహ్లి శతక(103- నాటౌట్) గర్జన చేశాడు. ఫ్యాన్స్ సంబరాలు.. మరోవైపు విమర్శలు దీంతో కింగ్ కోహ్లి అభిమానులతో పాటు.. క్రికెట్ ప్రేమికులంతా సంబరాల్లో మునిగిపోయారు. అయితే, రాహుల్ కోహ్లికి సహకరించిన తీరు, వైడ్ విషయంలో అంపైర్ వ్యవహరించిన విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవయ్యాయి. కోహ్లి స్వార్థంగా వ్యవహరించాడని కొందరు.. అంపైర్ కావాలనే టీమిండియా బ్యాటర్‌కు సహకరించాడని మరి కొందరు విమర్శలు గుప్పించారు. కోహ్లి సెంచరీ చేసిన తీరును తప్పుబట్టిన పుజారా ఈ నేపథ్యంలో టీమిండియా టెస్టు స్పెషలిస్టు, వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా భిన్నంగా స్పందించాడు. వ్యక్తిగత రికార్డుల గురించి ఆలోచించే కంటే.. జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేయాలంటూ కోహ్లి తీరును పరోక్షంగా తప్పుబట్టాడు. అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘విరాట్ కోహ్లి శతకం సాధించాలని నేనెంతగా కోరుకున్నానో.. వీలైనంత త్వరగా లక్ష్యాన్ని ఛేదించాలని కూడా అంతగా కోరుకున్నాను. ఎందుకంటే.. ఇలాంటి మెగా టోర్నీల్లో నెట్ రన్‌రేటు ఎంతో కీలకం. జట్టు గురించి కూడా ఆలోచించాలి.. త్యాగం చేయాలి అగ్రస్థానంలో నిలవాలంటే... నెట్ రన్‌రేటు కోసం మనం పోరాడాల్సిన స్థితిలో ఉన్నాం. అలాంటపుడు జట్టు గురించే మనం మొదట ఆలోచించాలి. పరస్పర అవగాహనతోనే ఇలా జరిగి ఉండొచ్చు. అయితే, ఒక్కోసారి జట్టు కోసం మనం కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టుకే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. మన కెరీర్లో ఓ మైలురాయిని అందుకునేందుకు జట్టు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి రాకూడదు. మైండ్‌సెట్‌ను బట్టే ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలన్న హక్కు ఆటగాడిగా మనకు ఉంటుంది. అయితే, కొంతమంది తాము ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తే తదుపరి మ్యాచ్‌కు ఉపయోగపడుతుందని భావిస్తారు. ఇదంతా కేవలం ఆటగాడి మైండ్‌సెట్‌పై మాత్రమే ఆధారపడి ఉంటుంది’’ అని ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో షోలో ఛతేశ్వర్ పుజారా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. తనకైతే బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ కంటే నెట్ రన్‌రేటు పెంచుకోవడమే ముఖ్యమైనదిగా అనిపించిందని పేర్కొన్నాడు. ఆటగాళ్ల మైలురాళ్ల కోసం చూస్తే ఒక్కోసారి జట్టు నష్టపోవాల్సి వస్తుందని పరోక్షంగా అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లిని ఉద్దేశించి పుజారా చేసిన వ్యాఖ్యలు క్రీడావర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. కింగ్ కోహ్లి ఫ్యాన్స్ అయితే.. ‘‘జట్టు ప్రయోజనాల గురించి విరాట్‌కు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు’’ అంటూ పుజ్జీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బంగ్లాదేశ్‌పై విజయంతో వరల్డ్‌కప్-2023లో టీమిండియా వరుసగా నాలుగో గెలుపు నమోదు చేసినప్పటికీ.. న్యూజిలాండ్(4 విజయాలు) కంటే రన్‌రేటు పరంగా వెనుకబడటంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పరిమితమైంది. చదవండి: Virat Kohli: 78వ సెంచరీ! వాళ్ల వల్లే సాధ్యమైంది.. జడ్డూకు సారీ చెప్పాలి: కోహ్లి View this post on Instagram A post shared by ICC (@icc) -
Ind vs Aus: ససెక్స్‌ను వీడి..! రోహిత్, బుమ్రాలతో రాజ్‌కోట్‌కు పుజారా..
Ind vs Aus 3rd ODI- Pujara With Jasprit Bumrah and Rohit Sharma: వన్డే వరల్డ్‌కప్-2023 ఆరంభానికి ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ గెలిచి టీమిండియా ఫుల్ జోష్‌లో ఉంది. తొలి రెండు మ్యాచ్‌లలో జయకేతనం ఎగుర వేసిన భారత జట్టు 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తదితరులు లేకుండానే కేఎల్ రాహుల్ సారథ్యంలో బరిలోని దిగిన టీమిండియా.. ఆసీస్‌కు షాకులిచ్చింది. ముఖ్యంగా రెండో వన్డేలో ఫామ్‌లేమితో కొట్టుమిట్టాడుతున్న శ్రేయస్ అయ్యర్ ఏకంగా సెంచరీతో మెరవడం సానుకూలాంశంగా పరిణమించింది. ఇదిలా ఉంటే.. రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో నామమాత్రపు మూడో వన్డేకు భారత్ సిద్ధమైంది. ఈ క్రమంలో రోహిత్, కోహ్లి, హార్దిక్ తదితరులు విశ్రాంతి విరమించి మైదానంలో దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. రోహిత్‌తో పాటు బుమ్రా... పుజారా కూడా అదే విమానంలో ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, రెండో వన్డేకు దూరమైన జస్ప్రీత్ బుమ్రా బుధవారం నాటి మ్యాచ్ కోసం ముంబై నుంచి బయల్దేరారు. ఈ సందర్భంగా టీమిండియా టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్ పుజారా విమానంలో వారిని కలిశాడు. రోహిత్, బుమ్రా మధ్యన కూర్చున్న పుజ్జీ ఆ ఫొటోను మంగళవారం.. తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా చాలాకాలంగా జట్టుకు దూరమైన పుజారా ఇంగ్లండ్‌లో కౌంటీలు ఆడుతున్న విషయం తెలిసిందే. సస్పెన్షన్ కారణంగా ససెక్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్న పుజారా.. 8 మ్యాచ్‌లలో అతడు 649 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. అయితే, జట్టు క్రమశిక్షణ ఉల్లంఘన కారణంగా అతడిపై ఇటీవల సస్పెన్షన్ పడింది. దీనిపై ససెక్స్ అధికారులు అప్పీలుకు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో నిరాశ చెందిన పుజారా ఇంటికి తిరుగుపయనమైనట్లు తెలుస్తోంది. స్వస్థలం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు విమానంలో వస్తుండగా ఇలా అనుకోకుండా సహచర ఆటగాళ్లను కలిశాడు. చదవండి: WC: ఎవరిని తప్పిస్తారో తెలియదు.. అతడు మాత్రం ప్రతి మ్యాచ్ ఆడాల్సిందే! View this post on Instagram A post shared by Cheteshwar Pujara (@cheteshwar_pujara) -
సెంచరీతో చెలరేగిన పుజారా.. భారత సెలక్టర్లకు వార్నింగ్! వీడియో వైరల్
టీమిండియా వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ కౌంటీల్లో తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రాయల్ లండన్ వన్డే కప్‌లో ససెక్స్ క్రికెట్ క్లబ్‌కు పుజారా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో పుజారా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 113 బంతులు ఎదుర్కొన్న పుజారా.. 11 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ టోర్నీలో పుజారాకు ఇది రెండో సెంచరీ కావడం గమనార్హం. పుజారా అద్భుత సెంచరీ ఫలితంగా.. ఈ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ససెక్స్ విజయం సాధించింది. 319 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ససెక్స్ 48.1 ఓవర్లలోనే ఛేదించింది. పుజారాతో పాటు టామ్ ఆల్సోప్(60) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. సోమర్సెట్ బ్యాటర్లలో ఉమీద్, కర్టిస్ కాంఫర్ సెంచరీలతో మెరిశారు. సెలక్టర్లకు వార్నింగ్.. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో విఫలమకావడంతో పుజారాపై భారత సెలక్టర్లు వేటు వేశారు. దీంతో వెస్టిండీస్‌తో టెస్టులకు అతడిని ఎంపికచేయలేదు. ఈ క్రమంలో ఇంగ్లండ్ కౌంటీల్లో రాణించి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని పుజారా లక్ష్యంగా పెట్టుకున్నాడు. గతంలో కూడా పుజారాను జట్టు నుంచి సెలక్టర్లు ఊద్వసన పలికారు. దీతో ఈ కౌంటీల్లోనే అదరగొట్టి.. మళ్లీ భారత జట్టులోకి అతడు పునరాగమనం చేశాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం పుజారా మాట్లాడుతూ.. "నేను ఎక్కడ ఆడినా నా వంతు 100 శాతం ఎఫక్ట్ పెడతాను. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడానికి ప్రయత్నిస్తాను. భారత్‌కు మరో మూడు నెలల పాటు ఎటువంటి టెస్టు మ్యాచ్‌లు లేవు. డిసెంబర్లో మళ్లీ దక్షిణాఫ్రికాతో ఆడనున్నాం. అంతకంటే ముందు నేను ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌పై దృష్టిపెడతాను. అక్కడ రాణించి మళ్లీ జట్టులోకి రావడమే నా లక్ష్యమని" పుజారా పేర్కొన్నాడు. రాయల్ లండన్ వన్డే కప్-2023లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన పుజారా 302 పరుగులు చేశాడు. చదవండి: IND vs WI: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. హెడ్‌కోచ్ లేకుండానే! టీమిండియా ఎలా మరి? A superstar indeed, @tregs140 🌟 Cheteshwar Pujara is just inevitable.#MBODC23 pic.twitter.com/lG7Tfxx8gg — Metro Bank One Day Cup (@onedaycup) August 11, 2023 -
పుజారా, సూర్య విఫలం.. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన ప్రియాంక్.. ఇంకా..
Duleep Trophy 2023- West Zone vs South Zone, Final: సౌత్ జోన్‌తో నువ్వా- నేనా అన్నట్లుగా సాగుతున్న దులిప్ ట్రోఫీ-2023 ఫైనల్లో వెస్ట్ జోన్ గెలుపు అవకాశాలను సజీవంగా ఉంచాడు కెప్టెన్ ప్రియాంక్ పాంచల్. ఓవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడి కష్టాల్లో కూరుకుపోయిన జట్టును గట్టెక్కించాడు. టీమిండియా నయావాల్ ఛతేశ్వర్ పుజారా(15), సూర్యకుమార్ యాదవ్ (4) విఫలమైన వేళ తానున్నానంటూ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. బెంగళూరు వేదికగా సాగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఓపెనింగ్ బ్యాటర్ ప్రియాంక్ 92 పరుగులతో క్రీజులో ఉన్నాడు. సౌత్ జోన్‌ను ఓడించి టైటిల్ గెలవాలంటే వెస్ట్ జోన్ 116 పరుగులు చేయాలి. ఇంకా ఒకరోజు ఆట మిగిలి ఉండటం, చేతిలో ఐదు వికెట్లు ఉండటంతో వెస్ట్ జోన్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. అయితే, ప్రియాంక్‌ను త్వరగా పెవిలియన్‌కు పంపిస్తే మాత్రం హనుమ విహారి సారథ్యంలోని సౌత్ జోన్ పైచేయి సాధించే అవకాశం ఉంది. వెస్ట్ జోన్ కీలక బ్యాటర్లంతా ఇప్పటికే పెవిలియన్ చేరడం ప్రత్యర్థికి కలిసి వచ్చే అంశం. కాగా వెస్ట్ జోన్- సౌత్ జోన్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ-2023 ఫైనల్ బుధవారం ఆరంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్ట్ జోన్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సౌత్ జోన్ తిలక్ వర్మ(40), హనుమ విహారి(63) ఆదుకోవడంతో 213 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇక వెస్ట్ జోన్ తరఫున ఓపెనర్ పృథ్వీ షా(65) ఒక్కడే రాణించడం.. పుజారా(9), సూర్య(8) సహా ఇతర బ్యాటర్లు చేతులెత్తేయడంతో 146 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో మెరుగైన ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌత్ జోన్ 230 పరుగులకు కథ ముగించింది. ఈ క్రమంలో వెస్ట్ జోన్ టాప్ బ్యాటర్లు మరోసారి విఫలం కావడం ప్రభావం చూపింది. అయితే, కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ 92 పరుగులతో ఒంటరిపోరాటం చేస్తున్నాడు. ఆఖరి రోజు 116 పరుగులు సాధిస్తేనే టైటిల్ గెలుస్తుంది. లేదంటే సౌత్ జోన్ ఈసారి చాంపియన్‌గా అవతరిస్తుంది. చదవండి: రహానేను కించపరిచిన ఇషాన్! ఇవే తగ్గించుకుంటే మంచిది.. మొన్న కోహ్లికే.. అతడిని టెస్టుల్లోకి తీసుకురావాలి.. ఎందుకంటే: కుంబ్లే కీలక వ్యాఖ్యలు 𝐒𝐭𝐮𝐦𝐩𝐬 𝐨𝐧 𝐃𝐚𝐲 𝟒 The match is nicely poised 👍 Priyank Panchal's fighting 92* has taken West Zone to 182/5 💪. They need 116 more to win. South Zone need 5 wickets.#WZvSZ | #DuleepTrophy | #Final 💻 Ball by ball updates - https://t.co/ZqQaMA6B6M pic.twitter.com/eGRmdrpQVh — BCCI Domestic (@BCCIdomestic) July 15, 2023 -
Ind vs WI: అతడొక్కడే కాదు.. వాళ్లు కూడా విఫలం.. కానీ పాపం..
Ind Vs WI 2023 Test Series: ‘‘అన్ని రకాల గౌరవాలు పొందేందుకు అతడు నూటికి నూరు శాతం అర్హుడు. అలాంటిది తనను జట్టు నుంచి తప్పించడం నాకు ఆశ్చర్యంగా ఉంది. నిజానికి డబ్ల్యూటీసీ ఫైనల్లో అతనొక్కడే విఫలం కాలేదు కదా! అదే జట్టులో ఉన్న చాలా మంది కూడా కనీస స్థాయి ప్రదర్శన కనబరచలేదు. పుజారా మాదిరే వాళ్లు కూడా పరుగులు సాధించడంలో వైఫల్యం చెందారు. స్ట్రైక్‌రేటు అంతంత మాత్రంగా ఉండటానికి కారణమదే చాలా మంది టెస్టుల్లో పుజారా స్ట్రైక్‌రేటు గురించిన విమర్శలు చేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. వాస్తవానికి పుజారా స్ట్రైక్‌రేటు అంతంత మాత్రంగా ఉండటానికి కారణం.. సహచర ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టినపుడు వికెట్ పడకుండా చూసుకోవడం.. జట్టును ఆదుకునే వాళ్లకు సపోర్టు ఇవ్వడం వల్లే! ఎన్నో విజయాల్లో పుజారా కీలక పాత్ర పోషించాడు. కానీ అతడికి దక్కాల్సినంత గౌరవం దక్కలేదు. జట్టుకు ఇప్పుడు కూడా తన అవసరం ఎంతగానో ఉంది. కానీ అనూహ్య రీతిలో పక్కనపెట్టారు. ముఖ్యంగా SENA(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) గడ్డ మీద జట్టుకు ఇలాంటి ఆటగాడు అవసరం. వాళ్లను మాత్రం పక్కన పెట్టరు?! ఎవరైనా సరే ప్రతిసారి అద్భుతంగా ఆడలేరు కదా! పుజారా లాంటి టెస్టు క్రికెటర్‌ను వదులుకుంటే నష్టపోవాల్సి ఉంటుంది’’ అంటూ టీమిండియా మాజీ బౌలర్ హర్భజన్ సింగ్.. ఛతేశ్వర్ పుజారాకు అండగా నిలబడ్డాడు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో పుజారాను తప్పించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023లో టీమిండియా ఘోర ఓటమిని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌లోని ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 209 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. బ్యాటర్ల వైఫల్యమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఓపెనర్లు రోహిత్ శర్మ(15, 43), శుబ్‌మన్ గిల్(13, 18) ఆకట్టుకోలేకపోయారు. స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన కోహ్లి వన్‌డౌన్‌లో వచ్చిన పుజారా చేసిన పరుగులు 14, 27. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన విరాట్ కోహ్లి(14, 49) కూడా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. అజింక్య రహానే మొత్తంగా 138 పరుగులతో టీమిండియా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు అతడు వైస్ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. అనూహ్యంగా పుజారాకు చోటే దక్కలేదు. ఈ నేపథ్యంలో మాజీ స్పిన్నర్ భజ్జీ స్పందిస్తూ పుజారాకు జట్టులో చోటు ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టాడు. ముఖ్యంగా కోహ్లి, ఇతర బ్యాటర్లను టార్గెట్ చేస్తూ.. పుజారాకు అండగా నిలిచాడు. కాగా జూలై 12 నుంచి టీమిండియా- విండీస్ మధ్య డొమినికా వేదికగా తొలి టెస్టు ఆరంభం కానుంది. చదవండి: రాయుడు రిటైర్ అయ్యాడు.. మీకు తప్పకుండా జట్టులో చోటిస్తాం.. కానీ: ధోని సిక్సర్ల రింకూ.. ఎక్కడా తగ్గేదేలే! వీడియోతో సెలక్టర్లకు దిమ్మతిరిగేలా! -
జైశ్వాల్ ఆడడం ఖాయమా? రోహిత్ ప్రశ్నకు రహానే స్పందన
టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది. ఇరుజట్ల మధ్య బుధవారం నుంచి విండ్సర్ పార్క్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇటీవలే వైస్‌కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన అజింక్యా రహానే సిరీస్‌లో రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. కాగా టెస్టు స్పెషలిస్టుగా ముద్రపడిన చతేశ్వర్ పుజారా ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు. కాగా అతని స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేది ఎవరనే దానిపై రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా బుధవారం నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్లులో యశస్వి జైశ్వాల్ అరంగేట్రం ఖాయంగా కనబడుతోంది. పుజారా స్థానమైన మూడో నెంబర్లో బ్యాటింగ్‌కు వచ్చేది జైశ్వాల్ అని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇదే విషయమై రహానే మాట్లాడుతూ.. ''కచ్చితంగా పుజారా స్థానంలో ఎవరో ఒకరికి అవకాశం వస్తుంది. పుజారా లోటును తీర్చడానికి మూడో స్థానం కాలకం. ఈ కీలక స్థానంలో బ్యాటింగ్ వచ్చే అవకాశం ఎవరిదనేది చెప్పలేను. కానీ అతనికి(యశస్వి జైశ్వాల్‌కు) మంచి చాన్స్. ఇప్పుడున్న యంగ్ క్రికెటర్లలో మంచి టాలెంట్ ఉన్నవాడు. మొత్తానికి జైశ్వాల్ టీమిండియా తరపున టెస్టు ఫార్మాట్లో ఆడడం సంతోషం కలిగిస్తోంది. డొమొస్టిక్ క్రికెట్లో ముంబై తరపున.. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరపున బాగా ఆడాడు. గతేడాది దులీప్ ట్రోపీలోనూ తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. అంతర్జాతీయ క్రికెట్లోనూ అదే జోరు చూపించాలని కోరుకుంటున్నా. అతని బ్యాటింగ్ తీరు చూడముచ్చటగా ఉంది. స్థానం కాదు ముఖ్యం.. ఏ స్థానంలోనైనా వచ్చి బ్యాటింగ్ చేయగల సత్తా జైశ్వాల్‌ది. చాలా సంతోషంగా ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రహానేను ఇంటర్య్వూ చేసింది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మనే. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్లో షేర్ చేసింది. ఇక 21 ఏళ్ల జైశ్వాల్‌కు ఫస్ట్‌క్లాస్ కెరీర్లో మంచి బ్యాటింగ్ యావరేజ్ ఉంది. గత 18 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో జైశ్వాల్ 1845 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మది సెంచరీలు, రెండు అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్ 2023లోనూ జైశ్వాల్ రాజస్తాన్ రాయల్స్ తరపున 14 మ్యాచ్‌ల్లో 625 పరుగులు చేశాడు. అతని ఖాతాలో ఒక సెంచరీ సహా ఐదు అర్థశతకాలు ఉన్నాయి. 𝘿𝙊 𝙉𝙊𝙏 𝙈𝙄𝙎𝙎! When #TeamIndia Captain @ImRo45 turned reporter in Vice-Captain @ajinkyarahane88's press conference 😎 What do you make of the questions 🤔 #WIvIND pic.twitter.com/VCEbrLfxrq — BCCI (@BCCI) July 11, 2023 చదవండి: TNPL 2023 DD Vs NRK: మరో 'రింకూ సింగ్'.. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో సంచలనం ODI World Cup 2023: ప్రపంచ కప్ టికెట్ల ధరలు వచ్చేశాయోచ్.. ఎలా ఉన్నాయంటే? -
ఆ నలుగురు ఎందుకు? ఓహో.. అందుకే వాళ్లను సెలక్ట్ చేయలేదా?: మాజీ బ్యాటర్
India West Indies tour 2023: వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో టీమిండియా సెలక్టర్ల వ్యవహారశైలిపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మండిపడ్డాడు. ముఖ్యంగా విండీస్‌తో టెస్టు సిరీస్‌కు జట్టును ఎంపిక చేసిన తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ఆడనంత మాత్రాన రంజీల్లో అద్భుతంగా ఆడిన ఆటగాళ్లను పక్కన పెడతారా అని జాఫర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. విండీస్‌లో నెల రోజులు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత భారత జట్టుకు దాదాపు నెలరోజుల విశ్రాంతి లభించింది. ఈ క్రమంలో జూలై 12- ఆగష్టు 13 వరకు వెస్టిండీస్ పర్యటనతో మరోసారి బిజీ కానుంది. రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో విండీస్‌తో తలపడే టెస్టు, వన్డే జట్లను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. అయితే, రంజీల్లో అదరగొట్టిన ఆటగాళ్ల పేర్లను కనీసం పరిశీలనలోకి తీసుకోకపోవడం పట్ల వసీం జాఫర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా టెస్టు జట్టు కూర్పుపై సెలక్టర్లకు అవగాహన లేనట్లు కనిపిస్తోందని విమర్శించాడు. నలుగురు ఓపెనర్లు ఎందుకు? ‘‘నలుగురు ఓపెనింగ్ బ్యాటర్లను ఎంపిక చేయాల్సిన అవసరం ఏమిటి? రోహిత్, శుబ్‌మన్, గైక్వాడ్, జైశ్వాల్ వీళ్లంతా ఓపెనర్లే! ఇలా చేసే బదులు సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేసి ఉంటే మిడిలార్డర్ పటిష్టమయ్యేది కదా? దేశవాళీ క్రికెట్లో అతడి ప్రదర్శన చూశాం కదా! ఓహో అందుకే వాళ్లను పక్కనపెట్టారా? ఇక అభిమన్యు ఈశ్వరన్, ప్రియాంక్ పాంచాల్ రంజీల్లో, ఇండియా- ఏ జట్టు తరఫున అద్భుతంగా ఆడుతున్నారు. టెస్టు జట్టులో చోటు కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. కేవలం వాళ్లు ఐపీఎల్ ఆడలేదన్న కారణంగా టీమిండియాకు ఎంపిక చేయరా? అకస్మాత్తుగా రుతురాజ్ టెస్టు జట్టులోకి ఎలా వచ్చాడు? దీన్ని బట్టే మీ దృష్టికోణం ఎలా ఉందో అర్థమవుతోంది’’అని వసీం జాఫర్ సెలక్టర్ల తీరును తూర్పారపట్టాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత దాదాపు నెలరోజుల విశ్రాంతి లభించిన తర్వాత కూడా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి రెస్ట్ ఇవ్వడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా విండీస్‌తో సిరీస్ నేపథ్యంలో యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్ సెలక్టర్ల పిలుపు అందుకున్నారు. వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే రోహిత్ శర్మ డిప్యూటీగా ఎంపిక కాగా.. నయా వాల్‌గా పేరొందిన ఛతేశ్వర్ పుజారాకు జట్టు నుంచి ఉద్వాసన పలికారు. రంజీ ట్రోఫీ 2022-23లో అభిమన్యు, ప్రియాంక్ ఇలా బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ 8 మ్యాచ్‌లలో 798 పరుగులు చేయగా.. గుజరాత్ క్రికెటర్ ప్రియాంక్ పాంచల్ 5 మ్యాచ్‌లు ఆడి 583 పరుగులు సాధించాడు. ఇక ముంబై ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ 6 మ్యాచ్‌లలో కలిపి 556 పరుగులు చేశాడు. విండీస్‌తో రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: కోహ్లి లేకుంటే జట్టులోకి వచ్చేవాడినే కాదు.. ధోని నా కళ్లు తెరిపించాడు: యువీ లెజండరీ ఓపెనర్ దిల్షాన్.. డీకే మాదిరే! ఉపుల్ తరంగతో భార్య ‘బంధం’.. అతడినే పెళ్లాడి! Thoughts? #WIvIND pic.twitter.com/2YwaMuOwvN — Wasim Jaffer (@WasimJaffer14) June 24, 2023 -
వందకు పైగా టెస్టులు ఆడాడు.. మీరు ఇచ్చే గౌరవం ఇదేనా?
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ భారత జట్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సిరీస్‌కు వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారాను పక్కన పెట్టడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. అతడి పట్ల సెలక్టర్లు వ్యవహరించిన తీరును చాలా మంది మాజీలు తప్పుబడున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో చాలా మంది ఆటగాళ్లు విఫలమైనప్పటికి.. పుజారా ఒక్కడినే బలిపశువును చేయడం సరికాదు అని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం విమర్శించాడు. తాజాగా భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా పుజారాకు మద్దతుగా నిలిచాడు. పుజారా వంటి అనుభవం ఉన్న ఆటగాడిని పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. "విండీస్‌తో టెస్టులకు ఛతేశ్వర్ పుజారాను ఎంపిక చేయకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. అతడు భారత జట్టుకు వెన్నెముక వంటి వాడు. చాలా మ్యాచ్‌ల్లో భారత జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు. అతడిని జట్టు నుంచి తప్పించకుండా కేవలం విశ్రాంతి మాత్రమే ఇచ్చారని నేను ఆశిస్తున్నాను. ప్రస్తుత భారత టెస్టు జట్టులో మిగితా బ్యాటర్లు సగటు కూడా అంతగా బాగోలేదు. అటువంటి అప్పుడు పుజారా ఏం తప్పు చేశాడు. ఎంత పెద్ద ఆటగాడైనా ఆడకపోతే పుజారా లాగే జట్టు నుంచి తప్పించాలి. సెలక్టర్లు అలా చేయగలరా? మీరు పుజారాను కీలక ఆటగాడిగా పరిగణించకపోతే.. మిగితా ఆటగాళ్లు కూడా అంతకన్న తక్కువే. పుజారా కెరీర్ గురించి మనం ఎప్పుడూ ప్రశ్నించకూడదు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి విదేశీ గడ్డలపై భారత జట్టుకు ఎన్నో చారిత్రాత్మక విజయాలు అందించాడు. అతడు 100కు పైగా టెస్టులు ఆడాడు. అటువంటి వ్యక్తి మీరు ఇలా చేయడం సరికాదు. అతడికి సరైన గౌరవం ఇవ్వాలి" అని భజ్జీ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: Sunil Gavaskar: వాళ్లేం సాధించారు.. పూజారాని మాత్రం ఎందుకు బలి చేశారు? -
వాళ్లేం సాధించారు.. పూజారాని మాత్రం ఎందుకు బలి చేశారు?: సునీల్ గవాస్కర్
వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. అయితే విండీస్‌తో టెస్టులకు ఎంపిక చేసిన జట్టులో సీనియర్ బ్యాటర్, నయావాల్ ఛతేశ్వర్ పూజారాకి చోటు దక్కలేదు. అదే విధంగా ఐపీఎల్లో అదరగొట్టిన యశస్వీ జైశ్వాల్, రుత్‌రాజ్ గైక్వాడ్‌కు సెలక్టర్లు టెస్టు జట్టులో అవకాశం ఇచ్చారు. అయితే టెస్టు క్రికెట్లో నయావాల్‌గా పేరుగాంచిన పూజారాను పక్కన పెట్టడాన్ని చాలా మంది మాజీలు తప్పుబడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చేరాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో చాలా మంది భారత ఆటగాళ్లు విఫలమైనా పూజారాని మాత్రం ఎందుకు బలిపశువు చేశారంటూ గవాస్కర్ మండిపడ్డాడు. "పుజారాను జట్టు నుంచి ఎందుకు తప్పించారు? టీమిండియా బ్యాటింగ్ యూనిట్ మొత్తం ఫెయిల్ అయినప్పుడు అతన్ని మాత్రం ఎందుకు బలిపశువుని చేశారు? పుజారా భారత క్రికెట్‌కు ఎన్నో ఏళ్లగా తన సేవలు అందిస్తున్నాడు. అతడు సైలెంట్‌గా ఉండి భారత జట్టును ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు. కేవలం అతనికి సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్లు లేరనే ఉద్దేశంతోనే పూజారాని తప్పించారని అనిపిస్తోంది. సరే.. డబ్ల్యూటీసీ ఫైనల్లో పుజారా సరిగ్గా ఆడలేదని జట్టు నుంచి తప్పించారు.. మరి మిగితా ఆటగాళ్లు కూడా ఫెయిలయ్యారు కదా వారి పరిస్ధితి ఏంటి? అయినా జట్టును ప్రకటించేటప్పుడు సెలక్షన్ కమిటీ, మీడియా సమావేశం ఎందుకు పెట్టడం లేదో నాకు ఆర్ధం కావడం లేదు. పుజారా గత కొంత కాలంగా కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. కాబట్టి అతడి రెడ్‌బాల్ క్రికెట్లో మరింత అనుభవం పెరిగింది. రెడ్‌బాల్ క్రికెట్‌పై అతడికి పూర్తి అవగహన ఉంది. ప్రస్తుతం ఫిట్నెస్ ఉంటే 39-40 సంవత్సరాల వయస్సు వరకు ఆడవచ్చు. పూజారాకి కూడా నాలుగైదేళ్ల కెరీర్ ఉంది. అజింకా రహానే మినహా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఏ బ్యాటర్ కూడా సరిగా ఆడలేదు. అయినా కేవలం పుజారాను మాత్రమే ఎందుకు బలిచేశారో సెలక్టర్లు సమాధానం చెప్పాలంటూ" స్పోర్ట్స్ టూడేతో మాట్లాడుతూ సన్నీ ఫైరయ్యాడు. చదవండి: Ind Vs WI 2023: 'రంజీలెందుకు ఆడించడం.. ఐపీఎల్‌తోనే కానిచ్చేయండి!' -
కౌంటీల్లో సెంచరీల మీద సెంచరీలు! అసలు పోరులో తుస్సు! అందుకే..
Cheteshwar Pujara- Ind Vs WI test Series: వెస్టిండీస్‌తో సిరీస్ నేపథ్యంలో టీమిండియా నయా వాల్ ఛతేశ్వర్ పుజారాకు మొండిచేయి ఎదురైంది. విండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో అతడికి చోటు దక్కలేదు. కాగా ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్టుతో జట్టులోకి తిరిగి వచ్చిన పుజారా బంగ్లాదేశ్ సిరీస్‌లోనూ ఆడాడు. కౌంటీల్లో సెంచరీల మీద సెంచరీలు ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో భాగమయ్యాడు. ఈ క్రమంలో ఆసీస్‌తో నాలుగు మ్యాచ్‌లలో కలిపి 140 పరుగులు చేయగలిగాడు. అనంతరం ఇంగ్లండ్‌లో కౌంటీల్లో ఆడిన పుజారా ససెక్స్ జట్టు నాయకుడిగా వ్యవహరించాడు. అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ 8 ఇన్నింగ్స్‌లో 3 సెంచరీల సాయంతో.. 545 పరుగులతో అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్లో ఛతేశ్వర్ అదరగొట్టడం ఖాయమని అభిమానులు సంబరపడిపోయారు. కానీ గుజరాత్ బ్యాటర్ వారి ఆశలపై నీళ్లు చల్లాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో తుస్సు ఆస్ట్రేలియాపై మెరుగైన రికార్డు కలిగి ఉన్న పుజారా.. ఓవల్ వేదికగా తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులు మాత్రమే చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 27 పరుగులకు పరిమితమై వైఫల్యం కొనసాగించాడు. దీంతో అతడికి భారీ షాకిచ్చారు టీమిండియా సెలక్టర్లు. విండీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదు. అదే సమయంలో.. మరో వెటరన్ బ్యాటర్, డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆకట్టుకున్న అజింక్య రహానేకు మాత్రం ఈ సిరీస్‌తో మరోసారి వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ దక్కింది. విండీస్‌తో రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: ఎన్నాళ్లో వేచిన ఉదయం! ఈసారి మా ఆశలు వమ్ము చేయొద్దు ప్లీజ్! అప్పుడు జట్టులో చోటే కరువు.. ఇప్పుడు వైస్ కెప్టెన్‌గా.. నువ్వు సూపర్ ‘హీరో’! ధోని కెప్టెన్సీ అలా ఉంటుంది కాబట్టే! రోహిత్, ద్రవిడ్‌పై అశ్విన్ విసుర్లు! -
గిల్ నేర్చుకుంటున్నాడు.. కానీ పుజారాకు ఏమైంది: రవిశాస్త్రి
ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా పట్టు కోల్పోయిన సంగతి తెలిసిందే. తొలి రోజు ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేయడంలో బౌలర్లు విఫలం కాగా.. రెండో రోజు బ్యాటర్లు చేతులెత్తేశారు. కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు శుభ్‌మన్ గిల్, పుజారా, కోహ్లి వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో వెటరన్ ఆటగాడు చతేశ్వర్ పుజారా ఔటైన తీరుపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి విమర్శల వర్షం కురిపించాడు. చెత్త షాట్ సెలెక్షన్ వల్లే పుజారా క్లీన్ బౌల్డయ్యాడు. గ్రీన్ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడంలో విఫలమైన పుజారా బౌల్డయ్యాడు. అంతకుముందు అదే రీతిలో బోలాండ్ బౌలింగ్‌లో గిల్ కూడా ఔటయ్యాడు. "పుజారా లాంటి సీనియర్ ఆటగాడు బంతిని తప్పుగా అంచనా వేయడం నిరాశపరిచింది. ఫ్రంట్ ఫుట్ సరిగా వాడకుండా బంతిని వదిలేయడం దారుణం. అతడి ఫ్రంట్ ఫుట్ బంతివైపు వెళ్లాల్సింది. అతడు ఆ బంతిని ముందు ఆడాలని అనుకున్నాడు. కానీ వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోని బంతిని విడిచిపెట్టాడు. అందుకు తగ్గ ప్రతిఫలం అనువభవించాడు. ఆఫ్‌స్టంప్ ఎగిరిపోయింది. ఆ సమయంలో ఆఫ్‌స్టంప్‌కు వెళ్లాల్సిన అతడి ఫ్రంట్ ఫుట్ మిడిల్ స్టంప్పైనే ఉండిపోయింది. కానీ అతడు మాత్రం తన ఫ్రంట్ ఫుట్ ఆఫ్‌స్టంప్ పైనే ఉందని అనుకున్నాడు. ఇక శుబ్‌మన్ గిల్ కూడా ఇదే తరహాలో తన వికెట్‌ను కోల్పోయాడు. ఇంగ్లండ్ పిచ్‌లపై బంతిని ఆడకుండా వదిలేయాలి అనుకున్నప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఆఫ్‌స్టంప్ దగ్గరగా ఉన్నప్పుడు అలా చేయాలి. శుభమాన్ గిల్ తన ఫుట్‌వర్క్‌లో విషయంలో కాస్త బద్ధకంగా కనిపించాడు. అయితే గిల్ ఇంకా నేర్చుకునే దశలో ఉన్నాడు. కానీ పుజరాకు ఏమైంది" అని కామెంటరీ సందర్బంగా రవిశాస్త్రి పేర్కొన్నాడు. చదవండి: WTC Final: టీమిండియాకు ఇదేమి కొత్తకాదు.. గెలిచే ఛాన్స్ ఉందా? కనీసం డ్రా అయినా -
కోహ్లీని లైట్ తీసుకుంటే ఆసీస్ అవుట్..!
-
పుజారా మీదే ఆశలు..!
-
ప్రాక్టీస్‌కు సొంత కారులో వచ్చిన పుజారా.. ఆశ్చర్యపోయిన జడేజా!
జూన్ 7నుంచి లండన్ వేదికగా జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్- ఆస్ట్రేలియా జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా ఫైనల్ కోసం రోహిత్ నేతృత్వంలోని భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే శుక్రవారం ప్రాక్టీస్ సెషన్‌కు ముందు భారత స్టార్ క్రికెటర్లు పుజారా, రవీంద్ర జడేజా మధ్య ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. కాగా పుజారా ఇంగ్లండ్ కౌంటీల్లో సస్సెక్స్ తరపున ఆడుతున్న విషయం విధితమే. ఈ క్రమంలో పుజారా శుక్రవారం భారత జట్టుతో చేరాడు. అయితే పుజారా మాత్రం ప్రాక్టీస్ చేసే స్టేడియానికి జట్టు ప్రయాణించే బస్సులో కాకుండా.. తన సొంత కారులో చేరుకున్నాడు. అప్పటికే స్టేడియంకు చేరుకుని ప్రాక్టీస్ చేస్తున్న రవీంద్ర జడేజా.. కారులో ఒక్కసారిగా పుజారా చూసి ఆశ్చర్యపోయాడు. అతడి దగ్గరికి వెళ్లి నిజంగానే పుజారా భాయ్ వచ్చాడా? అని గట్టిగా నవ్వుతూ అన్నాడు. ఇక పుజారా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది కౌంటీ ఛాంపియన్ షిప్లో 6 మ్యాచ్‌లు ఆడిన పుజారా.. 545 పరుగులు సాధించాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ విజేతగా టీమిండియా నిలవాలంటే పుజారా పాత్ర చాలా కీలకం. చదవండి: WTC Final 2023: 50 ఏళ్లలో రెండు సార్లు మాత్రమే.. ఆసీసీను భయపెడుతున్న చెత్త రికార్డు Fun fact - Rohit Sharma, Cheteshwar Pujara and Ravindra Jadeja made their List-A debut in the same match and for the same team!! pic.twitter.com/0HCgNB9WZs — Aryan 45 🇮🇳 (@Iconic_Rohit) June 2, 2023 -
ఆసీస్ అంటే పూనకాలే! వాళ్ల దృష్టి మొత్తం ఈ ఇద్దరిపైనే: ఆస్ట్రేలియా దిగ్గజం
WTC Final 2021-23- Ind Vs Aus: పొట్టి ఫార్మాట్ క్రికెట్ పండుగ ఐపీఎల్-2023 ముగిసింది. దాదాపు రెండు నెలల పాటు క్యాష్ రిచ్ లీగ్ ఫీవర్‌తో ఊగిపోయిన అభిమానులకు.. క్రికెట్లోని అసలైన మజా అందించేందుకు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ రూపంలో మరో మెగా ఫైట్‌కు రంగం సిద్ధమైంది. ఇంగ్లండ్ వేదికగా జూన్ 7న మొదలుకానున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా- ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జూన్ 11 వరకు నిర్వహించనున్న ఈ టెస్టు మ్యాచ్‌కు జూన్ 12 రిజర్వ్ డేగా నిర్ణయించారు. వారిద్దరే కీలకం ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా.. 15 మందితో కూడిన జట్లను ఖరారు చేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీమిండియా, ఆసీస్ మాజీ క్రికెటర్లు తుది జట్లపై అంచనాలు వేస్తుండగా.. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాకు విరాట్ కోహ్లి, ఛతేశ్వర్ పుజారా కీలకంగా మారనున్నారని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా దృష్టి మొత్తం ఈ ఇద్దరిపైనే ఉంటుందని, వారిని త్వరగా పెవిలియన్‌కు పంపే వ్యూహాలతో ముందుకు వస్తుందని రిక్కీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఆసీస్ అంటే పూనకాలే కాగా టీమిండియా నయావాల్ పుజారాకు ఆస్ట్రేలియా మీద మెరుగైన రికార్డు ఉంది. ఆసీస్‌తో ఆడిన 24 టెస్టుల్లో ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ 2033 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా ఐదు సెంచరీలు ఉండటం విశేషం. మరోవైపు.. రన్‌మెషీన్ విరాట్ కోహ్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంప్రదాయ క్రికెట్లో ఆసీస్‌తో 24 మ్యాచ్‌లలో కోహ్లి 1979 పరుగులు చేశాడు. ఆసీస్‌పై అతడి అత్యధిక స్కోరు 186. స్వదేశంలో ఇటీవల జరిగిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సందర్భంగా కోహ్లి సెంచరీతో మెరిశాడు. విరాట్, పుజారాలను త్వరగా అవుట్ చేయాలని ఇక అంతర్జాతీయ క్రికెట్లో మొత్తంగా 75 సెంచరీలు నమెదు చేసిన విరాట్ కోహ్లి.. ఐపీఎల్-2023లో వరుసగా రెండు శతకాలు బాది ఫుల్‌జోష్‌లో ఉన్నాడు. టీ20 క్రికెట్లో సత్తా చాటిన అతడు.. టెస్టుల్లోనూ రాణించేందుకు నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ రివ్యూ షోలో రిక్కీ పాంటింగ్ మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియా జట్టు ఎక్కువగా విరాట్ గురించే చర్చిస్తుంది. అతడిని ఎలా అవుట్ చేయాలన్న అంశంపై దృష్టి సారిస్తుందనడంలో సందేహం లేదు. అదే విధంగా పుజారా గురించి కూడా మాట్లాడుకుంటారు. ఈ ఇద్దరిని త్వరగా పెవిలియన్‌కు పంపాలనే యోచనలో ఉంటారు. ఆస్ట్రేలియా మీద పుజారాకు మంచి రికార్డు ఉంది. నిజానికి ఓవల్ పిచ్ కూడా ఆసీస్ పిచ్‌లలాగే ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాళ్లు అందుకు తగ్గట్లు ప్రణాళికలు రచిస్తారు’’ అని పేర్కొన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ జట్లు ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), వార్నర్, ఉస్మాన్ ఖ్వాజా, లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, హాజల్‌వుడ్, నాథన్ లయన్, టాడ్ మర్ఫీ, స్కాట్ బోలాండ్, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, ఇంగ్లిస్. టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కట్, ఇషాన్ కిషన్. స్టాండ్ బై ప్లేయర్లు: సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైశ్వాల్, ముకేశ్ కుమార్. చదవండి: #SKY: టీ20 మాస్టర్‌క్లాస్ చూశాను! నా కళ్ల ముందే.... వారెవ్వా! SL Vs AFG: లంకతో వన్డే సిరీస్.. అఫ్గనిస్తాన్‌కు ఊహించని షాక్!