Chief secretary
-
ఏపీ కార్మికశాఖ ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్ కు కారు ప్రమాదం...
-
కేరళ చీఫ్ సెక్రటరీగా భర్త తర్వాత భార్య
తిరువనంతపురం: దక్షిణ భారతదేశంలో నెల వ్యవధిలోనే అరుదైన రికార్డు పునరావృతమైంది. కేరళ నూతన ప్రధాన కార్యదర్శిగా శారదా మురళీధరన్ బుధవారం నియమితులయ్యారు. ఆమె తన భర్త, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి వి.వేణు నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. వేణు ఆగస్టు 31న పదవీ విరమణ చేయనున్నారు. ప్రణాళిక విభాగంలో అడిషనల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న 1990 బ్యాచ్ ఐఏఎస్ శారదను తదుపరి సీఎస్‌గా ఎంపిక చేస్తూ కేరళ కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. కర్నాటకలోనూ ఆగస్టు 1న శాలినీ రజనీష్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. భర్త రజనీష్ గోయెల్ రిటైరయ్యాక ఆయన స్థానంలో శాలినీ సీఎస్ అయ్యారు. -
భర్త తర్వాత భార్య
బెంగళూరు: ఒక రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేయడమంటే.. ప్రభుత్వానికి కళ్లు, చెవులు అన్నీ తానై వ్యవహరించడం. కర్నాటకలో ఈ కీలక పోస్టును భర్త తర్వాత భార్య చేపట్టే అరుదైన రికార్డును రజనీష్ గోయల్, శాలినీ రజనీష్ లు దక్కించుకున్నారు. ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఉన్న రజనీష్ గోయల్ ఈనెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో నూతన ప్రధాన కార్యదర్శిగా శాలినిని నియమిస్తూ కర్నాటక ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. 1989 ఐఏఎస్ బ్యాచ్ టాపర్ అయిన శాలిని గ్రామీణాభివృద్ధిలో పీహెచ్డీ చేశారు. మేనేజ్మెంట్, వ్యక్తిత్వ వికాసం, మహిళా సాధికారికతలపై పలు పుస్తకాలు రచించారు. రజనీష్ దంపతులకంటే ముందు కర్నాటకలో మరో జంట కూడా ప్రధాన కార్యదర్శులుగా పని చేసింది. 20 ఏళ్ల కిందట బి.కె.భట్టాచార్య, ఆయన భార్య థెరెసా భట్టాచార్యలు ఇద్దరూ సీఎస్‌లుగా చేశారు. -
మహారాష్ట్ర తొలి మహిళా సీఎస్‌గా సుజాతా సౌనిక్ రికార్డు
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి సుజాతా సౌనిక్ నియమితులయ్యారు. ఐఏఎస్ అధికారి నితిన్ కరీర్ పదవీ విరమణ అనంతరం సుజాతా సౌనిక్‌కు బాధ్యతలు అప్పగించారు. దక్షిణ ముంబైలోని రాష్ట్ర సచివాలయం మంత్రాలయంలో ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో సౌనిక్ బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్ర చరిత్రలో అత్యున్నత పదవిని చేపట్టిన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. 1987 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సుజాత మరో ఏడాది పాటు పదవిలో ఉంటారు. ఆమె భర్త మనోజ్ సౌనిక్ కొన్నేళ్ల క్రితం ప్రధాన కార్యదర్శిగా చేశారు. ఇప్పుడు రాష్ట్ర హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. -
ఏపీ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన నీరబ్ కుమార్ ప్రసాద్
-
గవర్నర్‌ను కలిసిన ఏపీ కొత్త సీఎస్ నీరభ్‌కుమార్
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌కు నూతన ప్రభుత్వ కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, గవర్నర్‌ను కలిశారు. శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్ వెళ్లిన సీఎస్ నీరభ్.. గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో కాసేపు భేటీ అయ్యారు. సీఎస్‌గా నియమితులైన వేళ.. ఇది మర్యాదపూర్వకంగా జరిగిన భేటీగా తెలుస్తోంది. సంబంధిత వార్త: ఏపీ కొత్త సీఎస్‌గా నీరబ్‌కుమార్ ప్రసాద్ -
ఏపీ కొత్త సిఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్..
-
ఏపీ కొత్త సీఎస్‌గా నీరబ్‌కుమార్ ప్రసాద్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్‌కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుత సీఎస్ జవహర్‌రెడ్డి బదిలీ అయ్యారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి నీరబ్‌కుమార్ ప్రసాద్.. ప్రస్తుతం అటవీ, పర్యావరణశాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. -
ఈసీ ముందుకు ఏపీ సీఎస్, డీజీపీ
సాక్షి, ఢిల్లీ: ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరయ్యారు. రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తరువాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవటాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. దీనిపై స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్.జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఢిల్లీ వెళ్లి ఈసీకి వివరణ ఇచ్చారు.కాగా, పోలింగ్ అనంతరం పల్నాడు, కారంపూడి, చంద్రగిరి, తాడిపత్రిలో ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి హెచ్చరించినా స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించటాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. కొంత మంది పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని, ప్రేక్షక పాత్ర పోషించారని కేంద్ర పరిశీలకులు ఈసీకి నివేదిక ఇచ్చారు.సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి బందోబస్తు ఏర్పాట్లు చేసినా అక్కడ పోలీసు ఉన్నతాధికారులను ఈసీ హఠాత్తుగా బదిలీ చేయడంతోనే సమస్యలు ఉత్పన్నమైనట్లు అధికార యంత్రాంగం భావిస్తోంది. కొత్త అధికారులకు క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర అవగాహన లేకపోవడంతో కొన్ని చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. -
AP: ఎన్నికల నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాలి: సీఎస్
సాక్షి, విజయవాడ: లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వ కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు శనివారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో సాధారణ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన 24 గంటలలోగా ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు వంటివన్నీ తొలగించాలని ఆదేశించారు. అలాగే వివిధ పబ్లిక్ ఆస్తులైన బహిరంగ ప్రదేశాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే,రోడ్డు వంతెనలు,ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు,మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయ పరమైన యాడ్లు, వాల్ రైటింగ్‌లు, పోస్టర్లు, కటౌట్లను వెంటనే తొలగించాలని సీఎస్ ఆదేశించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రసార మాధ్యమాల్లో ప్రభుత్వ నిధులతో జారీ చేసే యాడ్లను నిలిపి వేయాలని స్పష్టం చేశారు. అంతేగాక ప్రభుత్వ వెబ్సైట్లో మంత్రులు తదితర ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫోటోలను వెంటనే తొలగించాలని సీఎస్ జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. ఎన్నికల ప్రకటన వచ్చాక మంత్రులెవరూ అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచారం వినియోగించరాదని సీఎస్ స్పష్టం చేశారు. మంత్రుల ఎన్ని కల పర్యటనలకు ప్రభుత్వ అతిథి గృహాలను కేటాయించరాదని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే నిధులు, ఇతర ప్రభుత్వ పథకాల నిధులతో నిర్వహించే వాటర్ ట్యాంకులు, అంబులెన్సులు వంటి వాటిపై ఎంపీ, ఎమ్మెల్యేల ఫొటోలు ఉండ రాదని సీఎస్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రకటన వచ్చాక ప్రభుత్వ భవనాలు, కార్యాలయిల్లో ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి సహా మంత్రుల ఫొటోలు ఉండరాదన్నారు. అదే విధంగా మంత్రులు అధికారుల మధ్య ఎటువంటి వీడియో సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాక విద్యుత్, నీటి బిల్లులు, బోర్డింగ్ పాస్‌లు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రజాప్రతినిధుల ఫొటోలు, సందేశాలు వంటివి ఉండరాదని సీఎస్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాక ప్రభుత్వ అధికారులు ఎవరూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముందస్తు అనుమతి లేకుండా వారి హెడ్ క్వార్టర్ విడిచి వెళ్లడానికి వీలు లేదని సీఎస్ స్పష్టం చేశారు. అదే విధంగా ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బందిని బదిలీ చేయడానికి వీలులేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినా, ఆయా పార్టీలు నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా, గిఫ్టులు, ఇతర లబ్దిలు పొందినా అలాంటి వారిపై సీసీఏ నిబంధనలు ప్రకారం ఐపీసీ సెక్షన్ 171, 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 123,129,134,134 ఏ నిబంధనలు ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాక బడ్జెట్ ప్రావిజన్ ఉన్నప్పటికీ నూతన ప్రాజెక్టులు, పథకాల మంజూరు, కన్సిజన్లు, గ్రాంట్లు, హామీలు, శంకుస్థాపనలు పూర్తి నిషేధమని సీఎస్ స్పష్టం చేశారు. వర్క్ఆర్డర్ ఉన్న కేత్ర స్థాయిలో మొదలు కాని పనులు చేపట్ట కూడదని తెలిపారు. పనులు పూర్తయిన వాటికి నిధులు విడుదలలో ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేశారు. అలాగే పీఎం,సీఎం సహాయ నిధి కింద గుండె, కిడ్ని, కేన్సర్ వంటి రోగులకు చికిత్సలకై సకాలంలో నిధులు మంజూరుకు ఆయా శాఖలకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వీడియో సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
నాడు జర్నలిస్ట్ నేడు ప్రధాన కార్యదర్శిగా..!
ఐఏఎస్ సాధించడం చాలామంది కల. అందుకోసం ఏళ్లుగా ఓ తపస్సులా కృషి చేస్తారు. తాము అనుకున్న ఐఏఎస్, ఐపీఎస్ వంటివి సాధించేంత వరకు ప్రయత్నాలు సాగిస్తున్నే ఉంటారు. కానీ రాధ రాటూరి చేసిన సివిల్స్ ప్రయత్నాల్లో ప్రతీ ప్రయత్నం విజయవంతంగా గెలిచి అందర్నీ ఆశ్చర్యపర్చింది. చివరికి ఆమె కోరుక్నుట్లుగా ఐఏఎస్ అయ్యారు. ఇప్పుడు ఉత్తరాఖండ్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆమె విజయ ప్రస్థానం ఎలా సాగిందంటే.. 1988 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ అడ్మినస్ట్రేటివ సర్వీస్(ఐఏఎస్ ) అధికారి ఉత్తరాఖండ్ తొలి మహిళా కార్యదర్శిగా గత వారమే నియమితులయ్యారు. జనవరి 31తో సుఖ్బీర్ సింగ్ సంధు పదవీకాలం ముగియడంతో అతని స్థానంలో సీనియర్ అధికారిణి రాధ రాటూరిని బాధ్యతలు చేపట్టాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. ఆమె భర్త అనిల్ రాట్రూయ్ నవంబర్ 2020లో ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపీఎస్) నుంచి ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఇక ఆమె తండ్రి కూడా సివిల్ సర్వెంట్‌గా పనిచేయడం విశేషం. ఆమె ఎడ్యుకేషన్ నేపథ్యం వచ్చేటప్పటికీ..1985లో ముంబైలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత మాస్ కమ్యూనికేషన్లో మాస్టర్స్ కూడా పూర్తి చేసింది. ఇక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్లో ఎంఏ చేసింది. అనంతరం ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ బొంబాయి ఎడిషన్‌లో జర్నలిస్టుగా ఉద్యోగం చేయటం ప్రారంభించారు. ఆ తర్వాత కొంతకాలం ఇండియా టు డేలో కూడా జర్నలిస్టుగా పనిచేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగంపై మక్కువతో సివిల్ సర్వీస్ వైపుకి రావడం జరిగింది. ఐతే తొలి ప్రయత్నంలో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆపీసర్ ఉద్యోగాన్ని సాధించారు. ఆ తర్వాత మరో ప్రయత్నంలో ఐపీఎస్‌ని కూడా సాధించారు. అక్కడితో ఆగక మూడో ప్రయత్నంలో ఆమె కోరుకున్నట్లుగా ఐఏఎస్‌లో చేరాలన్న లక్ష్యాన్ని సాధించారు. ఇలా సివిల్స్‌లో వరుస ప్రయత్నాల్లో ఏదో ఒక క్యాడర్ సాధిస్తూ.. పోయిన వ్యక్తిగా రాధ రాటూరి నిలవడం విశేషం. తొలుత ఆమెను మధ్యప్రదేశ్ కేడర్‌కు కేటాయించినా.. యూపీ కేడర్‌కు బదిలీ చేయాలన్న ఆమె అభ్యర్థన మేరకు తొలి పోస్టింగ్ గుజరాత్‌లోని టెహ్రీ ఇచ్చారు. అక్కడ నుంచి ఐఏఎస్ అధికారిగా కెరియర్ని ప్రారంభించి.. అలా పదేళ్ల పాటు ఉత్తరాఖండ్ ప్రధాన ఎన్నికల అధికారిగా కూడా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత రాధ రాటూరి అదే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫిసర్‌గా నియమితులయ్యారు. అంతేగాదు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అత్యున్నత అడ్మినిస్ట్రేటివ్ పదవిని అలంకరించిన తొలి మహిళగా కూడా రాధ నిలిచారు. (చదవండి: ఒకపుడు చనిపోవాలనుకుంది.. ఇపుడు ఐఏఎస్ అధికారిగా!) -
రంగంలోకి సీనియర్ ఐఏఎస్ అధికారులు..
-
MP: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వీర రాణా.. రెండో మహిళగా రికార్డ్
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి వీర రాణా నియమితులయ్యారు. రాష్ట్ర సీఎస్‌గా గురువారం ఆమె అదనపు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుధవారం రాత్రి నోటీసులు జారీ చేసింది. వీర రాణా ప్రస్తుతం మధ్యప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆమె రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెండు సార్లు పొడిగింపుల తర్వాత పదవీ విరమణ చేయనున్న అవుట్గోయింగ్ సీఎస్ ఇక్బాల్ సింగ్ బెయిన్స్ స్థానంలో 1988 బ్యాచ్‌కు చెందిన వీర రాణా నియమితులయ్యారు. 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన బెయిన్స్ పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2022 డిసెంబర్ 1 నుంచి 2023 మే 31 వరకూ మొదటిసారి పదవీ కాలాన్ని పొడిగించగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా 2023 జూన్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు మరోసారి పొడిగించారు. రెండో మహిళగా రికార్డ్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రెండో మహిళగా వీర రాణా రికార్డు సృష్టించారు. 1990వ దశకం ప్రారంభంలో మధ్యప్రదేశ్‌కు తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారిణి నిర్మలా బుచ్ నియమితులయ్యారు. ఈమె ఈ ఏడాది జూలైలో కన్నుమూశారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం బెయిన్స్‌కు వీడ్కోలు పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. 230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 17న ఎన్నికలు నిర్వహించారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
‘చీఫ్ సెక్రటరీ’ వివాదానికి సుప్రీం పరిష్కారం
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నియామకంపై కేంద్రం, ఆప్ ప్రభుత్వం మధ్య నలుగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు ఒక పరిష్కారమార్గం చూపింది. చీఫ్ సెక్రటరీ హోదాకు అర్హులైన అయిదుగురు సీనియర్ పరిపాలనాధికారుల పేర్లను ఈనెల 28న ఉదయం 10.30 గంటల్లోగా సూచించాలని కేంద్రాన్ని కోరింది. అందులో నుంచి ఒకరి పేరును అదే రోజు ఎంపిక చేసుకుని, ఈ వివాదానికి ముగింపు పలకాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా కొత్తగా చీఫ్ సెక్రటరీని కేంద్రం నియమించ జాలదంటూ ఢిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ సూచనలు చేసింది. అంతకుముందు, కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీలోని ఆప్ సర్కార్ చీఫ్ సెక్రటరీ నియామకం విషయంలో పోటాపోటీగా వాదనలు వినిపించాయి. -
చీఫ్ సెక్రటరీని తొలగించండి
న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్‌ను బాధ్యతల నుంచి తప్పించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్(ఎల్జీ)ని సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. నరేశ్ కుమార్ తన కుమారుడికి చెందిన సాఫ్ట్వేర్ కంపెనీకి, ఐఎల్బీ అనే సంస్థతో ఎంవోయూ కుదిరేందుకు అధికార దురి్వనియోగానికి పాల్పడినట్లు విజిలెన్స్ మంత్రి అతీషి ఆరోపించారు. ఈ మేరకు నివేదికను ఇటీవల సీఎం కేజ్రీవాల్‌కు అందజేశారు. ఆ నివే దికను కేజ్రీవాల్ శనివారం లెఫ్టినెంట్ జనరల్ వీకే శుక్లాకు పంపారు. అతీషి సిఫారసుల మేరకు ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలను చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. తనకుమారుడికి ఎటువంటి కంపెనీతోను, ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. ఐఎల్‌బీఎస్ సంస్థ కూడా అతీషి చేసిన ఆరోపణలు నిరాధారాలంటూ ఖండించింది. -
AP: ఎస్ఐపీబీ ఆమోదం పొందిన ప్రాజెక్టులపై సీఎస్ సమీక్ష
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుకు సంబంధించి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించిన ప్రాజెక్టుల ప్రగతిని శనివారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్ రెడ్డి పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఎస్ఐపీబీ ఆమోదం పొందిన ప్రాజెక్టులన్నీ వేగవంతంగా ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. వీటి ప్రగతిపై ప్రతి 15 రోజులకు నివేదిక సమర్పించాలని పరిశ్రమల శాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్‌ను సీఎస్ ఆదేశించారు. నెలకు ఒకసారి ఈ అంశంపై సమీక్షిస్తానని సీఎస్ అన్నారు. అలాగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పరిశ్రమలకు సంబంధించి చేసుకున్న అవగాహనా ఒప్పందాలపై సీఎస్ సమీక్షించారు. ఆ సమ్మిట్‌లో పరిశ్రమల శాఖకు సంబంధించి వివిధ కంపెనీల ద్వారా 3 లక్లల 41వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో 2 లక్షల 38 వేల మందికి ఉపాధి కల్పించే 107 అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకోగా ఇప్పటికే కొన్ని కంపెనీలు, పరిశ్రమలకు ముఖ్యమంత్రి స్వయంగానూ, వర్చువల్గానుశంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారని చెప్పారు చదవండి: బాబు అండ్ బ్యాచ్ ఓవరాక్షన్.. నిర్మల సీతారామన్ చెప్పింది విన్నారా? డిశంబరు నెలాఖరులోగా మరో 36 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ఇంకా పరిశ్రమలు ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస చర్యలు తదితర అంశాలపై సీఎస్ అధికారులతో సమీక్ష జరిపారు. అంతకు ముందు రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ కే.ప్రవీణ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎస్ఐపీబీలో ఆమోదించిన ప్రాజెక్టులు వాటి ప్రగతిని వివరించారు. అలాగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో చేసుకున్న అవగాహనా ఒప్పందాలు ఆయా కంపెనీల ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలను వివరించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జేడీ రామలింగేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు. -
వంద శాతం జనన, మరణాల వివరాల నమోదు జరగాలి: ఏపీ సీఎస్
-
సీఎస్‌కు ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: ఎక్సై జ్, వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి పూ ర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆమెకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి వి.శేషాద్రి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో సీఎస్‌గా ఉన్న సోమేశ్‌కుమార్ ఈ శాఖలను పర్యవేక్షించేవారు. కొత్త సీఎస్‌గా శాంతికుమారి బాధ్యతలు తీసుకున్నప్పటికీ ఆ రెండు శాఖల బాధ్యతలు ఆమె తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే సీఎస్‌కు ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖల పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
తెలంగాణ సీఎస్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎస్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ రాసింది. ప్రైవేట్ లాయర్లకు ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెడుతుందని లేఖలో పేర్కొంది. ఏజీ, అడిషనల్ ఏజీ ఉండగా, ప్రైవేట్ లాయర్ల ఎందుకు అని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రశ్నించింది. గవర్నర్ రిపబ్లిక్ డే కేసుతో పాటు, ఎమ్మెల్యేల ఫాంహౌస్ కేసులోనూ ప్రభుత్వం తరుపున న్యాయవాది దుష్యంత్ దవే వాదించారు. ప్రైవేట్ న్యాయవాదులకు లక్షల్లో ఫీజులు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఫోరం ఫిర్యాదు చేసింది. చదవండి: E-Car Racing: ఓరి నాయనో ఇదేంటి! వాహనాలు రేసింగ్ ట్రాక్‌పైకి ఎలా వచ్చాయ్? -
ఏపీ సీఎస్‌పై కథనాలు అవాస్తవం: ఐఏఎస్ అసోసియేషన్
సాక్షి, విజయవాడ: ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డిపై వచ్చిన కథనాలు పూర్తి అవాస్తమని, తప్పుడు వార్తలను ఖండిస్తున్నామని ఐఏఎస్ అసోసియేషన్ తెలిపింది. సీఎస్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథనాలు రాయడం సరికాదన్నారు. తప్పుడు కథనాలపై ఐఏఎస్ అసోసియేషన్‌లో చర్చించాం. ఇలాంటి కథనాలపై న్యాయపరమైన చర్యలు ఉంటాయని స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ప్రవీణ్ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా సీఎస్ జవహర్‌రెడ్డి కడపలో పర్యటించారని ప్రవీణ్ వివరణ ఇచ్చారు. సీనియర్ అధికారిపై తప్పుడు వార్తలను ఖండిస్తున్నామని ఆయన అన్నారు. చదవండి: ‘లోకేష్ పప్పు కాబట్టే.. చంద్రబాబు అలా చేశారు’ -
AP: సీఎస్ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ సమావేశం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన వివిధ కంపెనీలకు ప్రభుత్వపరంగా సమకూర్చాలిన భుములు, వివిధ రాయితీలు, ఇతర ప్రోత్సాహకాల కల్పన అంశాలపై విస్తృతంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా పరిశ్రమల శాఖలో ప్రత్యేక ఫ్యాకేజీ ఇన్సెంటివ్‌లకు సంబంధించి ఎనిమిది అజెండా అంశాలతో పాటు విధాన నిర్ణయాలకు చెందిన అంశాలపైన కమిటీ సమీక్షించింది. అదే విధంగా ఐటి అండ్ సి శాఖకు సంబంధించి ఎనిమిది అజెండా అంశాలు, ఇంధన శాఖకు సంబంధించిన అజెండా అంశాలపైన సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఆయా పరిశ్రమలు, కంపెనీలకు అందించాల్సిన ప్రోత్సాకాలు తదితర అంశాలపై చర్చించి విధాన పరమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకా ఈ సమావేశంలో పలు అంశాలపై కూడా సీఎస్ డా.కెఎస్ జవహర్ రెడ్డి అధికారులతో చర్చించారు. చదవండి: ఏంటి లోకేశా ఇదీ?.. నరాలు కట్ అయిపోతున్నాయ్..! ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కరికల వలవన్, కె.ప్రవీణ్ కుమార్, ఎస్ఎస్ రావత్ పాల్గొనగా దృశ్య మాధ్యమం ద్వారా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పాల్గొన్నారు. అలాగే ఈసమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్, ఎంఏయుడి కమిషనర్ ప్రవీణ్ కుమార్, పరిశ్రమల శాఖ కమిషనర్ సృజన, ఏపీ మారిటైమ్ బోర్డు సీఇవో షన్మోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌లపై సీఎస్ జవహర్ రెడ్డి ఆగ్రహం
అమరావతి: ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌లపై సీఎస్ జవహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు కథనాలు ప్రసారం చేసిన మీడియాపై మండిపడ్డారు. ఈ సంస్థలు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే చట్టపరంగా, న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. 'సీఎస్‌తో కలిసివెళ్లిన ఓఎస్డీ అంటూ రాసిన కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నేను కడప జిల్లాలోని సింహాద్రిపురం, మద్దూనూరులో 3న పర్యటించా. నేను, ఓఎస్డీ కృష్ణమోహన్ కలిసి ఇద్దరం ఒకే వాహనంలో ప్రయాణించామని తప్పుడు కథనం ప్రచారం చేశారు. నాతో కలిసి ఓఎస్డీ వచ్చారన్న కథనం ఊహాజనితం, దారుణమైన అబద్ధం. ఉద్యోగులందరికీ అధినేత అయిన సీఎస్‌ను చులకన చేసేలా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, తప్పుడు కథనాలు ప్రసారం చేశాయి. కుట్రపూరితంగా కట్టు కథను అల్లి అజెండా ప్రకారం తప్పుడు ప్రచారం చేశారు. గౌరవ ప్రదమైన ప్రభుత్వ కార్యదర్శి ప్రతిష్టకు భంగం కలిగించడం ఏ జర్నలిజం విలువల ఆధారంగా చేస్తున్నారు. నేను కోరిన విధంగా ఖండన ప్రచురించకపోతే చట్టపరంగా చర్యలుంటాయి.' అని సీఎస్ జవహర్ రెడ్డి హెచ్చరించారు. చదవండి: పవన్ కల్యాణ్‌కు పంపబోయిన లేఖ నాకు పంపారా? హరిరామ జోగయ్యకు అమర్నాథ్ కౌంటర్.. -
గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు
సాక్షి, అమరావతి: సీనియర్ ఐఎఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. 1993 బ్యాచ్‌కు సింఘాల్ ఇప్పటి వరకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించారు. రాజ్ భవన్లో మాననీయ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను సింఘాల్ మర్యాద పూర్వకంగా కలిసారు. వీరిరివురు కొద్దిసేవు సమావేశం అయ్యారు. సింఘాల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కీలకమైన శాఖలలో బాధ్యతలు నిర్వర్తించి మంచి అధికారిగా తనదైన ముద్ర వేసారు. కేంద్రంలో అత్యంత కీలకమైన డిఓపిటి డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్‌గా పనిచేసారు. కీలకమైన కరోనా సమయంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా సేవలు అందించి రాష్ట్ర ప్రజల మన్ననలు అందుకున్నారు. టీడీడీ ఈవోగా పలు సంస్కరణలకు బీజం వేశారు. విశాఖపట్నం, తూర్పు గోదావరి, మెదక్ కలెక్టర్ గా, చిత్తూరు, గుంటూరు సంయిక్త కలెక్టర్‌గా ఆయా జిల్లాలలో తనదైన ముద్ర వేశారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా ఉట్నూరు, కేఆర్ పురంలలో, సబ్ కలెక్టర్‌గా గద్వాల్ లో ప్రజలకు ఇతోధిక సేవలందించారు. సర్వీసు తొలి రోజుల్లో నెల్లూరు, అనంతపురం ఉప కలెక్టర్‌గా వ్యవహరించారు. -
ఐఏఎస్ అధికారిగా మొదటి పోస్టింగ్ భువనగిరిలోనే
సాక్షి, యాదాద్రి : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా బాధ్యతలు చేపట్టిన శాంతికుమారి గతంలో భువనగిరి సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. ఐఏఎస్ అధికారిగా ఆమె మొదటగా భువనగిరి సబ్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. 1992 ఆగస్టు 25 నుంచి 1993 జూన్ 14 వరకు భువనగిరి డివిజన్లో విధులు నిర్వహించారు. సమస్య ఉన్నచోటుకు వెళ్లి పరిష్కరించే అధికారిగా ఆమెకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. భువనగిరిలో ప్రభుత్వ భూమిని కబ్జా చెర నుంచి విడిపించారు. ప్రస్తుతం ఆ స్థలాన్ని టీఎన్జీవో భవనానికి కేటాయించారు. వలిగొండ మండలంలోని ఎం.తుర్కపల్లి గ్రామంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూమస్యను అప్పట్లో క్షేత్ర స్థాయికి వెళ్లి పరిష్కరించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు భువనగిరి డివిజన్లో పీపుల్స్‌వార్ నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో.. సబ్ కలెక్టర్‌గా శాంతికుమారి ప్రభుత్వ కార్యక్రమాలను ముమ్మరంగా కొనసాగించారు. ప్రధానంగా చదువు–వెలుగు కార్యక్రమం భువనగిరి డివిజన్లో విజయవంతం కావడం కోసం రాత్రి పూట గ్రామాలను తిరిగి నిరక్షరాస్యులైన మహిళలకు చదువు చెప్పించారు. అలాగే యువజన, సేవా, వైద్య బిరాలకు విస్త్రతంగా హాజరయ్యేవారు. మొత్తంగా సుమారు 10 నెలల కాలంలో శాంతికుమారి సబ్ కలెక్టర్‌గా అందించిన సేవలు భువనగిరిలో ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. సేవలు అందించిన అధికారి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌గా నియమితులు కావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
తెలంగాణ సీఎస్ రేసులో ముగ్గురు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ ఏపీ కేడర్‌కు వెళ్లిపోవాలని హైకోర్టు తీర్పు చెప్పగా, ఆ వెంటనే ఆయన్ను తెలంగాణ కేడర్ నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12లోగా ఏపీ ప్రభుత్వంలో రిపోర్టు చేయాలని కేంద్రం సోమేశ్ కుమార్‌ను ఆదేశించింది. దీంతో తక్షణమే కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకం అనివార్యంగా మారింది. హైకోర్టు తీర్పు అనంతరం సోమేశ్ కుమార్ సీఎం కేసీఆర్‌ను కలిశారు. కాగా, మంగళవారం అర్ధరాత్రి వరకు ఉత్తర్వులు రాకపోవడంతో కొత్త సీఎస్ నియామకంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీనియారిటీతో సంబంధం లేకుండా.. కొత్త సీఎస్ రేసులో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సీనియారిటీ ప్రకారం పరిశీలిస్తే సీఎస్ రేసులో 1987 బ్యాచ్ ఐఏఎస్ వసుధ మిశ్రా ముందంజలో ఉంటారు. అయితే, డెప్యూటేషన్‌పై యూపీఎస్సీ సెక్రటరీగా మంచి పదవిలో ఉండటం, మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేయనుండడంతో ఆమె పోటీలో లేనట్టే. రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాణికుముదిని (1988 బ్యాచ్)కి సైతం ఆరు నెలలకు మించి సర్వీసు లేదు. వీరిద్దరి తర్వాత సీనియారిటీ ప్రకారం 1989 బ్యాచ్‌కు చెందిన శాంతికుమారి, 1990 బ్యాచ్ అధికారులైన శశాంక్ గోయల్ (ప్రస్తుతం డెప్యూటేషన్‌పై కేంద్రంలో ఉన్నారు), రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, 1991 బ్యాచ్ అధికారులైన రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, కేంద్ర జలవనరుల శాఖ డైరెక్టర్ జనరల్ అశోక్‌కుమార్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ పేర్లను పరిశీలించాల్సి ఉండనుంది. సీనియారిటీతో సంబంధం లేకుండా తమకు నచ్చిన అధికారులను సీఎస్‌గా నియమించుకునే సంప్రదాయం కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో గతంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన శాంతికుమారి, రామకృష్ణారావు, అరవింద్ కుమార్‌ల్లో ఒకరిని సీఎస్‌గా నియమించవచ్చనే చర్చ జరుగుతోంది. కీలకమైన రాష్ట్ర ఆర్థిక శాఖ బాధ్యతలను సుదర్ఘీకాలంగా నిర్వహిస్తున్న కె.రామకృష్ణారావు పనితీరు పట్ల సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారు. ముక్కుసూటిగా వ్యవహరించే అధికారిగా పేరున్న అరవింద్ కుమార్ అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో స్పెషల్ సీఎస్‌లుగా ఉన్న శాంతికుమారి, రామకృష్ణారావు, అరవింద్‌కుమార్‌లలో ఒకరిని నియమిస్తారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి ఇన్చార్జి సీఎస్ నియామకం? పూర్తి స్థాయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నియమించాలా? లేదా ఇన్చార్జి సీఎస్‌ను నియమించాలా? అన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్టు సమాచారం. సోమేశ్‌కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం ఏపీ కేడర్‌కు కేటాయించడాన్ని సమర్థిస్తూ హైకోర్టు జారీ చేసిన తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్టు తెలిసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధిస్తే మళ్లీ ఆయన్నే సీఎస్‌గా పునరి్నయమించే అవకాశముంది. సుప్రీంకోర్టు స్టే విధించడానికి నిరాకరిస్తే మాత్రం పూర్తిస్థాయి సీఎస్‌ను నియమించక తప్పని పరిస్థితి ఏర్పడనుంది. అలాంటి పరిస్థితుల్లో స్టేపై సుప్రీం కోర్టు నిర్ణయం వచ్చే వరకు రామకృష్ణారావు, అరవింద్‌కుమార్‌లలో ఒకరిని ఇన్చార్జి సీఎస్‌గా నియమించవచ్చని తెలుస్తోంది.