Child died
-
తల్లి చెంతకు చేరేలోపే.. గుండెపోటుతో నాలుగేళ్ల చిన్నారి మృతి
భారత్‌లో గుండె పోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. డ్యాన్స్ వేస్తూ, వ్యాయామం చేస్తూ, అలా కూర్చుని చనిపోయిన ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ ఈ మాయదారి గుండెపోటు బలితీసుకుంటుంది. తాజాగా అభం శుభం తెలియని ఓ చిన్నారి సైతం గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. సాక్షి, ఖమ్మం: అప్పటివరకు తల్లిదండ్రులతో ఆడుతూ పాడుతూ గడిపిన చిన్నారి గుండెపోటుతో మృతిచెందింది. ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెంకు చెందిన కుర్రా వినోద్, లావణ్య దంపతులకు నాలుగేళ్ల కుమార్తె ప్రహర్షిక ఉంది. సోమవారం తల్లి లావణ్య గ్రూప్-3 పరీక్ష రాసేందుకు వెళ్లగా.. చిన్నారి నానమ్మ, తాతయ్యల వద్ద ఆడుకుంటూ ఉంది. సాయంత్రం ఇంటి తిరిగి వస్తున్న తల్లిని చూసి ప్రహర్షిక ఒక్కసారిగా ఆమె వైపు పరుగెత్తుకు వెళ్లింది. తల్లి కూడా రా..రా.. అంటూ కూతుర్ని చూస్తూ చేతులు చాచింది. కానీ అమ్మను చేరక ముందే ఆ పాప ఒక్కసారిగా కిందపడిపోయింది. తల్లి ఏమైందని ప్రశ్నించగా ఛాతీ వద్ద నొప్పి వస్తోందని చెప్పి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే కుటుంబసభ్యులు చిన్నారికి స్థానిక ఆర్ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స చేయించి.. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కళ్ల ముందే మృతి చెందడంలో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు .చిన్నారి గుండెపోటుతో మృతిచెంది ఉండొచ్చని వైద్యులు తెలిపారు. -
సందడిగా తిరిగి.. నీళ్లబకెట్‌లో పడి..
ఖైరతాబాద్: రాత్రి 9 గంటలు.. ఇంట్లో కుటుంబసభ్యులంతా కలిసి భోజనం చేస్తున్నారు. ఏడాదిన్నర పాప తప్పటడుగులు వేస్తూ తిరుగుతుండగా తల్లి గోరుముద్దలు పెడుతోంది. చిన్నారి సందడికి అందరూ సంతోషంగా ఉన్నారు. అంతలోనే ఆ పాప బెడ్రూం బాత్రూంలోని నీళ్లబకెట్‌లో పడి విగతజీవిగా మారింది. ఖైరతాబాద్ ఏఎస్ఐ శ్రీరాములు తెలిపిన వివరాల ప్రకారం... ఖైరతాబాద్ డివిజన్లోని ఐమా క్స్ ఎదురుగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లలో బి బ్లాక్ 307 ఫ్లాట్‌లో తోట సతీష్ కుమార్, రేణుక దంపతులు నివసిస్తున్నారు. ఈ ఫ్లాట్‌లో మొత్తం 12 మంది ఉంటున్నారు. సతీష్ గ్యాస్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారికి ముగ్గురు సంతానం. ఏడాదిన్నర వయసున్న మూడో కూతురు ఆది్వక మంగళవారంరాత్రి ఇంట్లో తల్లి పెట్టే గోరుముద్దలు తింటూ సందడి చేస్తూ, తప్పటడుగులు వేస్తూ, అటు ఇటు తిరుగుతోంది. ఈ క్రమంలో తల్లి కూడా భోజనం ముగించుకొని 9.30 గంటలకు బెడ్రూంలో ఉన్న మొబైల్ ఫోన్ తీసుకునేందుకు వెళ్లగా అటాచ్డ్ బాత్రూం తలుపు తెరిచి ఉంది. అందులో ఉన్న నీళ్లబకెట్‌లో పాప కాళ్లు పైకి కనిపించడంతో తల్లి లబోదిబోమంటూ ఏడుస్తూ బయటికి తీసింది. కుటుంబసభ్యులు వెంటనే సమీపంలోని వాసవి హాస్పిటల్‌కు పాపను తీసుకువెళ్లారు. అక్కడ వైద్యుల సూచన మేరకు రాత్రి 11 గంటల నిలోఫర్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయింది. కళ్ల ముందు ఆడుకుంటూ ఉన్న పాప అంతలోనే మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నా యి. -
రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
యాదాద్రి భువనగిరి, సాక్షి: పది వేల మందిలో ఒకరికి అరుదుగా వచ్చే వ్యాధి అది. నెలలు కూడా నిండని తమ బిడ్డను బతికించుకునేందుకు ఆ తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కోట్లలో ఖరీదు చేసే ఇంజెక్షన్ కోసం సగానికి పైగా సాయం సమకూరగా.. మిగిలిన సాయం అందేలోపే పరిస్థితి విషమించింది. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతంగా ముగిసింది. ఆ తల్లిదండ్రులకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. వలిగొండ మండలం పులిగిల్లకు చెందిన ఆరు నెలల చిన్నారి భవిక్‌రెడ్డి అరుదైన జెనెటిక్ డిసీజ్ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ(SMA) బాధపడ్డాడు. ఆ పసికందు బతకాలంటే రూ.16 కోట్లు ఇంజెక్షన్ అవసరం. తండ్రి దిలీప్ ఎలక్ట్రిషీయిన్. దీంతో ఖరీదైన చికిత్స ఆ కుటుంబానికి కష్టం తెచ్చి పెట్టింది. అయితే నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి క్రౌడ్ ఫండింగ్ చేపట్టింది. దాని ద్వారా విదేశాల నుంచి రూ.10 కోట్లు సమకూరగా.. మరో ఆరు కోట్ల సాయం కోసం దాతల్ని ఆశ్రయించారు ఆ తల్లిదండ్రులు. సాక్షి సైతం నిన్న(మే 16 గురువారం) ఆ వార్తను ప్రచురించి.. దాతల కోసం పిలుపు ఇచ్చింది. అయితే.. ఇంతలోనే ఆ చిన్నారి ఆరోగ్యం విషమించింది. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భవిక్ కన్నుమూశాడు. ఖరీదైన ఇంజెక్షన్ కోసం సగం కంటే ఎక్కువ సాయం సమకూరినా.. మిగిలిన సాయం కోసం సమకూరేలోపే ఆ చిన్నారికి నూరేళ్లు నిండిపోయాయి.ఎస్ఎంఏ అంటే స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ. ఈ జన్యులోపం అందరిలో కనిపించదు. తల్లిదండ్రులు క్యారియర్లుగా ఉండి.. పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. మనుషుల్లోని 23 జతల క్రోమోజోములు ఉంటాయి. వీటిల్లో క్రోమోజోమ్ -5లో సర్వైవల్ మోటార్ న్యూరాన్-1(ఎస్ఎంఎన్1) వంటి జన్యువు లోపం ఏర్పడుతుంది. కండరాల స్పందనకు ఈ జన్యువు చాలా కీలకం. ఇది శరీరంలో అవసరమైన ఎస్ఎంఎన్ ప్రొటీన్ తయారు చేయడానికి చాలా అవసరం. మోటార్ న్యూరాన్ కణాలకు ఇది చాలా కీలకం. వాస్తవానికి ఎస్ఎంఎన్-2 రూపంలో శరీరం దీనిని బ్యాకప్ జన్యువు ఉంచుకొన్నా అది ఉత్పత్తి చేసే ఎస్ఎంఎన్ ప్రొటీన్ సరిపోదు. కేవలం 10శాతం మాత్రమే తయారు చేస్తుంది. ఫలితంగా మోటార్ న్యూరాన్ కణాలు బలహీనమైపోతాయి. అమెరికాలో ఏటా ఈ లోపంతో సుమారు 400 మంది పిల్లలు జన్మిస్తారని అంచనా. ఎస్ఎంఏ 1, 2, 3, 4 రకాలు ఉన్నాయి. వీటిల్లో టైప్-1 ప్రమాదకరమైంది.లక్షణాలు..కండరాలు బలహీనంగా ఉండటం మెడపై ఎటువంటి పట్టు లేకపోవడంకూర్చోవడం, నిలబడటం, నడవటం చేయలేరుపాలుతాగడం వంటివి వాటికి కూడా ఇబ్బంది పడతారుఊపిరి తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఎదుర్కొంటారు.చికిత్స ఇలా..ఎస్ఎంఏ-1 చిన్నారులు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. ఒకప్పుడు వీరికి చికిత్స చేయడానికి అవకాశం ఉండేది కాదు. దీంతో వీరి ఆయుర్దాయం దాదాపు రెండేళ్లు మాత్రమే ఉండేది. కానీ, ఇప్పుడు నొవార్టిస్ కంపెనీ ప్రయోగాత్మకంగా ‘జోల్జెన్స్మా’ అనే జన్యు చికిత్స ఇంజెక్షన్‌ను తయారు చేసింది. ఇది పూర్తిగా తగ్గించకపోయినా.. టైప్ 1 నుంచి వచ్చే ఎన్నో సమస్యల నుంచి బిడ్డ కోలుకొనేట్లు చేస్తుంది. దీని ధర రూ.16 కోట్లు ఉంది. ఇక దీనిని దిగుమతి చేసుకొనేందుకు చెల్లించాల్సిన సుంకాలను కలుపుకొంటే మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఔషధాన్ని అమెరికా నుంచి తరలించడం మొదలైన రోజు నుంచి 14 రోజుల్లోపే వాడుకోవాలి. దీని షెల్ఫ్లైప్ 14 రోజులు మాత్రమే. -
ఎంత ఘోరం.. గాజు డోర్ మీద పడటంతో మూడేళ్ల చిన్నారి మృతి
లుధియానా: పంజాబ్‌లో విషాదం చోటుచేసుకుంది. గ్లాస్ డోర్‌తో ఆడుకొంటున్న చిన్నారికి ఆ తలుపే మృత్యువుగా మారింది. భారీ గాజు తలుపు మీద పడటంతో మూడేళ్ల చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. లుధియానా ఘుమర్ మండి మార్కెట్లో ఈ దుర్ఘటన జరిగింది. ఊహించని ఘటనలో చిన్నారి ప్రాణాలు కోల్పోయిన దృశ్యాలు దృశ్యాలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి. వివరాలు.. మూడేళ్ల చిన్నారితో కలిసి ఓ కుటుంబం వస్త్ర దుకాణంలో కొనుగోలు కోసం వచ్చారు. తల్లిదండ్రులు వారి పనిలో నిమగ్నమై ఉండగా.. చిన్నారి దుకాణం ఎంట్రన్స్ వద్ద ఉన్న తలుపు హ్యాండిల్‌ను పట్టుకొని అటు ఇటూ ఊగుతూ ఆడుకుంటుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా గ్లాస్ డోర్ మొత్తం ఊడిపోయి అమాంతం ఆమెపై పడిపోయింది. బోల్టులు వదులుగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే గమనించిన తల్లిదండ్రులు, షోరూమ్ సిబ్బంది హుటాహుటిన బాలికను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అణ్యం పుణ్యం తెలియని చిన్నారిని, డోర్ బలితీసుకున్న దృశ్యాలు నెటిజన్ల హృదయాలను పిండేస్తున్నాయి. అయితే ఈ ఘటనపై తల్లిదండ్రుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. చదవండి: Video: హెల్మెట్‌లో దూరిన పాము.. జస్ట్ మిస్ PUNJAB | A three-year-old girl died in Punjab's Ludhiana after a giant glass door at a showroom fell on top of her. The incident took place at the Ghumar Mandi Market in the city, and the girl was rushed to a hospital soon after, where she was declared dead. The incident was… pic.twitter.com/WSiUtpmEyx— ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) November 28, 2023 -
కాకినాడలో విషాదం..పందుల్ని కాల్చబోతే పాపకు తూటా తగిలి..
సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాటు తుపాకీ పేలి నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదం తుని మండలం వెలమకొత్తూరు గ్రామంలో మంగళవారం జరిగింది. నాలుగేళ్ల చిన్నారి ధన్యశ్రీ ఇంటి సమీపంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటోంది. అక్కడే కొందరు వ్యక్తులు నాటు తుపాకులతో పందుల్ని కాలుస్తున్నారు. ఈ క్రమంలో నాటు తుపాకీతో పందులను కాల్చడానికి ప్రయత్నిస్తుండగా.. ఓ తుటా గురితప్పి చిన్నారికి తగిలింది. దీంతో ధన్య శ్రీ అక్కడికక్కడే కుప్పకూలింది. వెంటనే స్నేహితులు బాలిక కుటుంబ సభ్యులకు చేరవేయగా.. వారు వచ్చి చిన్నారిని చూసేసరికి అప్పటికే మృతిచెందింది. కూతురు మరణంతో తల్లిదండ్రులు తీవ్రంగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: ఒక్కగానొక్క కుమార్తె.. తిరుగు ప్రయాణంలో బైక్‌పై వస్తుంటే -
విషాదం.. స్కూల్ బస్సు కిందపడి ఒకరు.. ఆర్టీసీ బస్సు ఢీకొని మరో చిన్నారి
సాక్షి, తూర్పుగోదావరి: బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆరేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది. ఒకటో తరగతి చదువుతున్న ఈశ్వర్(6) తన తండ్రితో కలిసి బైక్‌పై స్కూల్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆల్కాట్ తోట సమీపంలోని ఐఓసి వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు బస్సు కిందపడి అక్కడికక్కడే మరణించాడు. బైక్ నుంచి పక్కకు పడిన బాలుడి తండ్రికి గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహం చెందిన మృతుని బంధువులు రాళ్లతో ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్ కడప: జిల్లాలోని జమ్మలమడుగులో విషాదం చోటుచేసుకుంది. ప్రైవేటు స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. ఇంట్లో నుంచి చిన్నారి సఫినా స్కూల్ బస్సులో పాఠశాలకు బయల్దేరింది. అయితే పాఠశాలకు చేరుకున్నాక బస్సు దిగుతుండగా కాలు జారి కిందపడిపోయింది. ఈ విషయాన్ని గమనించని డ్రైవర్ బస్సును ముందుకు వెళ్లనివ్వడంతో చిన్నారి అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ చేపట్టారు. ప్రస్తుతం బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కూతురు మరణంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. చదవండి: మాజీ ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో చోరీ వెనుక భారీ కుట్ర -
హైదరాబాద్: గోడ కూలి నెలల పసికందు మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బోరబండ పరిధిలోని రహమత్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి కురిసిన నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ గోడ కూలి.. పక్కనే ఉన్న రేకుల ఇంటి మీద ఇటుక రాళ్లు పడ్డాయి. దీంతో ఆ ఇంట్లో ఉన్న ఓ నెలల పసికందు మృతి చెందింది. నారాయణఖేడ్ చెందిన శ్రీకాంత్-జగదేవి జంట.. కూలీ పని కోసం నగరానికి వచ్చి రెహమత్నగర్ పరిధిలోని ఓంనగర్‌లో ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షంతో.. వాళ్లుంటున్న పోర్షన్ పక్కన నిర్మాణంలో ఉన్న భవనం నాలుగో అంతస్తులో ఉన్న సైడ్‌వాల్ కూలిపోయింది. దీంతో ఆ ఇటుక రాళ్లు పక్కనే శ్రీకాంత్ ఉంటున్న రేకుల రూమ్‌పై పడ్డాయి. ఆ సమయంలో పెద్ద శబ్ధం రావడంతో.. ఆ భార్యభర్తలిద్దరూ అప్రమత్తం అయ్యి బయటపడ్డారు. అయితే ఊయలలో నిద్రిస్తున్న 8 నెలల జీవనికా ఇటుకలు మీద పడి అక్కడికక్కడే మృతి చెందింది. బాలిక మృతితో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఆ భవన నిర్మాణం అక్రమంగా సాగుతోందని చెబుతూ.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మరోవైపు చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ తరలించి.. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
బతుకుదెరువు.. గుండె బరువు.. తల్లి ఒడిలో నుంచి ఎగిరిపడి!
సాక్షి, మహబూబాబాద్: బతుకుదెరువు కోసం బయల్దేరిన ఓ కుటుంబానికి గుండె బరువైంది. పొట్టకూటి కోసం ఊరూరా తిరిగి స్టీల్ సామగ్రి అమ్మే కుటుంబంలో ఆటో బోల్తా పడి విషాదం నిండింది. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామ శివారులో మంగళవారం ఆటో బోల్తా పడి రేబెల్లి యాలాద్రి–సమ్మక్క దంపతుల కుమార్తె రాణి(3) మృతి చెందింది. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి జమాండ్లపల్లికి చెందిన యాలాద్రి–సమ్మక్క దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వీరు బతుకుదెరువు కోసం ఊరూరా తిరిగి స్టీల్ సామగ్రి, అమ్ముతూ, గ్యాస్ స్టవ్‌లు మరమ్మతు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈక్రమంలో యాలాద్రి, సమ్మక్క తమ కుమార్తె రాణి కలిసి టాటా ఏస్ ట్రాలీ క్యాబిన్లో కూర్చున్నారు. వారితో పాటు వెనకాల ట్రాలీలో సమ్మక్క తల్లి వెంకటమ్మ కూర్చుని వరంగల్ వెళ్లేందుకు బయల్దేరారు. శనిగపురం శివారు గుండ్లబోడుతండా మూల మలుపు వద్ద గల రైస్ మిల్లు ప్రాంతానికి ఆటో చేరుకోగానే.. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే క్రమంలో ఒక్కసారిగా టాటాఏస్ ట్రాలీ అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈఘటనలో యాలాద్రి పక్కనే ఉన్న సమ్మక్క, చిన్నారి రాణి, ఆటో వెనుకభాగంలో కూర్చున్న వెంకటమ్మ రోడ్డుపై పడిపోయారు. సమ్మక్క, వెంకటమ్మకు స్వల్పగాయాలవగా.. రాణి తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఆటోలో వారిని ఆస్పత్రికి తరలించగా.. రాణి మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. సమ్మక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు రూరల్ ఎస్సై సీహెచ్.అరుణ్‌కుమార్, స్థానికులు తెలిపారు. చదవండి: ఇన్‌స్టాలో ఐఫోన్ అగ్గువ.. అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకున్న నిట్ విద్యార్థిని -
చిన్నారి ఉసురుతీసిన ఐదు రూపాయల కాయిన్..
నల్గొండ (భూదాన్‌పోచంపల్లి) : ఐదు రూపాయల నాణెం ఓ చిన్నారి ప్రాణం తీసింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణంలోని వెంకటరమణ కాలనీకి చెందిన బొంగు మహేశ్, సరిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారిలో చిన్నకుమార్తె చైత్ర(4) వారం రోజుల క్రితం ఇంటివద్ద ఆడుకొంటూ ఐదు కాయిన్ మింగగా, అది గొంతులో ఇరుక్కొంది. వెంటనే గమనించిన తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు చికిత్స చేసి కాయిన్ తొలగించారు. అనంతరం ఇంటికి పంపించారు. అయితే, సోమవారం చైత్ర తీవ్ర అస్వస్థతకు గురై శ్వాసతీసుకోవడానికి ఇబ్బంది పడుతుండగా వెంటనే తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. ఐదు రూపాయల కాయిన్ గొంతులో ఇరుక్కోవడం వల్ల ఇన్ఫెక్షన్ అయి చిన్నారి మృతి చెందిందని స్థానికులు పేర్కొంటున్నారు. కంటికి రెప్పలా సాకుకొంటున్న చిన్నారి అర్థాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబం పెను విషాదంలో అలుముకొంది. -
ఎయిర్ గన్ పేలి చిన్నారి మృతి.. కేసులో ట్విస్ట్.. జరిగింది ఇదే!
సాక్షి, సంగారెడ్డి: ఎయిర్ గన్ పేలి చిన్నారి మృతి చెందిన కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. చిన్నారి మృతిపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో తాజాగా ఈ కేసులో కొత్త ట్విస్ట్ తెరమీదకొచ్చింది. ఇప్పటి వరకు నాలుగేళ్ల చిన్నారి సాన్వి ఎయిర్ గన్‌తో ఆడుకుంటుండగా ఒక్కసారిగా పేలడంతో ఆమె కణతలోకి గుండు దూసుకుపోయి చనిపోయిందని అనుకున్నారు. అయితే ఎయిర్ గన్ పేలుడులో చిన్నారిని హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఉద్దేశపూర్వకంగానే దగ్గరి నుంచి కాల్చినట్టు పోలీసులు గుర్తించారు. పామ్‌హౌజ్‌లో 17 ఏళ్ల యువకుడు గన్‌తో ఆడుతూ ఫైర్ చేయగా అటుగా వెళ్తున్న బాలిక సాన్వీకి పిల్లిట్ తగిలినట్లు పోలీసులు తెలిపారు. కాగా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామంలోని ఓ ఫామ్ హౌజ్‌లో ఎయిర్ గన్ పేలి శాన్వి అనే నాలుగు సంవత్సరాల పాప మృతిచెందిన విషయం తెలిసిందే. మరోవైపు మృతిచెందిన చిన్నారి మృతదేహం ఇంకా ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలోనే ఉంది. గురువారం ఆసుపత్రిలో మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ కేసులోని నిందితులను పఠాన్ చెరు పోలీస్ స్టేషన్లో మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఎయిర్ గన్ ఘటనపై డీఎస్పీ భీమ్ రెడ్డి వివరాలు వెల్లడించారు. చదవండి: రియల్టర్ల జంట హత్య: ఇబ్రహీంపట్నం ఏసీపీపై వేటు ‘మార్చి 16న 12 గంటల సమయంలో జిన్నారం పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు వచ్చింది. ప్రసాద్ ఫామ్ హౌస్‌లో నాగరాజు అనే వ్యక్తి వాచ్ మెన్‌గా పని చేస్తున్నాడు. ఆన్ లైన్లో రూ. 26 వేలకు ఎయిర్ గన్ ప్రసాద్ కొనుగోలు చేసి నిర్లక్ష్యంగా తన ఫామ్‌హౌజ్‌లో వాచ్మెన్ గదిలో ఉంచాడు. ఎయిర్ గన్‌కు లైసెన్స్ అవసరం లేదు. నాగరాజు ఇంటికీ బంధువులు వచ్చారు అందులో 17 ఏళ్ళ యువకుడు గన్‌తో అడుతూ ఫైర్ చేశాడు. దీంతో అటు వైపుగా వస్తున్న 4 ఏళ్ళ బాలికకు పిల్లెట్ తగిలింది. పిల్లెట్ కణతి మీద తగలడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక మృతి చెందింది. 17 ఏళ్ళ బాలుడిని, ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నాం. 109, 176 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశాం’ అని డీఎస్పీ తెలిపారు. -
అంగన్వాడి కేంద్రంలో చిన్నారి మృతి!
గజ్వేల్ రూరల్: అంగన్వాడి కేంద్రానికి వెళ్లిన నాలుగేళ్ల చిన్నారి మృతిచెందింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బయ్యారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కామల్ల రాజు–సంతోష దంపతులకు కొడుకు, కూతురు నిత్య (4) ఉన్నారు. రోజు మాదిరిగానే గురువారం ఉదయం నిత్య అంగన్వాడీ కేంద్రానికి వెళ్లింది. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో నిత్య ఎడమ కాలుకు రక్తం కారుతుండడాన్ని గమనించిన ఆయా పసుపుతో కట్టుకట్టి గదిలోకి తీసుకువెళ్లి పడుకోబెట్టింది. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలంతా భోజనం చేసిన తర్వాత 2గంటల ప్రాంతంలో నిత్యను నిద్రనుంచి లేపేందుకు ప్రయత్నించగా, లేవకపోవడంతో తల్లి సంతోషకు సమాచారం అందించారు. వారు వెంటనే వచ్చి అపస్మారక స్థితిలో ఉన్న నిత్యను గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే నిత్య మృతి చెందినట్టు తెలిపారు. నిత్య ఎడమకాలు పాదం భాగంలో పాముకాటు గుర్తులున్నాయని, తమ కూతురి మృతిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఎస్ఐ అశోక్‌కు ఇచ్చిన ఫిర్యాదులో నిత్య తల్లిదండ్రులు పేర్కొన్నారు. నిత్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బస్సు చక్రాల కింద నలిగిన బాలుడు
గుడిహత్నూర్: అప్పటివరకు కుటుంబ సభ్యులతో గడిపిన బాలుడు ఇంటి ముందు ఉన్న షాప్‌కు వెళ్లొస్తానని బయటకు వెళ్లాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు ఆ చిన్నారిని చిదిమేసింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండ లం హనుమాన్‌నగర్‌లో మంగళవారం జరిగింది. హనుమాన్‌నగర్‌లో నివాసం ఉండే అజీజ్ –సుల్తానాలకు నలుగురు సంతానం. చిన్నవాడైన అర్మాన్ (6) సాయంత్రం సమయంలో ఇంటి ఎదురుగా ఉండే కిరాణా దుకాణం వైపు పరిగెత్తాడు. రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన (ఉట్నూర్– ఆదిలాబాద్ వన్‌స్టాప్) ఆర్టీసీ బస్సు చిన్నారి మీదుగా దూసుకెళ్లింది. బస్సు వేగంగా ఉండటంతో ముందు చక్రాలతోపాటు వెనుక చక్రాలు కూడా బాలుడిపైనుంచి వెళ్లాయి. తీవ్రంగా గాయపడిన చిన్నారిని స్థానికులు ప్రైవేటు వాహనంలో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, బస్సును నిర్లక్ష్యంగా నడిపి బాలుడి మృతికి కారణమైన డ్రైవర్‌ను స్థానికులు చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
పరుపులో దాగి.. పసికందును కాటేసి...
మహబూబాబాద్ రూరల్: పాము కాటుతో చిన్నారి మృతిచెందగా.. అదే పాము ఆమె తండ్రిని కాటు వేసింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా శనిగపురం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వేర్పుల క్రాంతి–మమత దంపతులకు మూడు నెలలు పసిపాప సంతానం. చిన్నారి కొద్ది రోజులుగా అనారో గ్యంతో ఉండటంతో వరంగల్, ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. శనివారం రాత్రి ఖమ్మం నుంచి తీసుకొచ్చి ఇంట్లోని బల్లపై ఉన్న పిల్లల పరుపులో పడుకోబెట్టారు. అప్పటికే అందులో ఉన్న పామును వీరు గుర్తించలేదు. కాసేపు పాలుతాగిన చిన్నా రి అంతలోనే బాగా ఏడుస్తుండటంతో ఆందోళనకు గురయిన తల్లిదండ్రులు చికిత్స కోసం మహబూబాబాద్‌లోని పిల్లల వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. పరుపులో నుంచి చిన్నారిని వైద్యుడికి చూపిస్తుండగానే.. అందులో నుంచి కట్ల పాము కిందపడింది. అది మమత కాలిపై నుంచి వెళుతుండగా పక్కనే ఉన్న క్రాంతి ఎడ మ కాలితో తొక్కాడు. దీంతో పాము అతడిని కాటు వేసింది. చిన్నారిని పరీక్షించిన వైద్యుడు అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. ఈ క్రమంలో అక్కడి స్థానికులు పామును చంపేశారు. పాప కూడా పాముకాటుతోనే మృతిచెందిందని కుటుంబ సభ్యులు గుర్తించారు. వెం టనే క్రాంతి ఏరియా ఆస్పత్రికి చేరుకుని పాముకాటు వికటించే ఇంజక్షన్ వేయించుకున్నాడు. కాగా.. పోస్టుమార్టం రిపోర్టులో పాము చిన్నారిని ఎడమ తుంటి భాగంలో కాటు వేసినట్లుగా వైద్యులు గుర్తించారు. -
ప్రేమపేరిట మోసపోయి.. శిశువుకు జన్మనిచ్చి..
నిజామాబాద్ అర్బన్: ప్రేమపేరుతో మోసపోయి గర్భం దాల్చిన ఓ బాలిక మగశిశువుకు జన్మనిచ్చింది. విషయం బయటకు పొక్కకుండా చెత్తకుప్పలో పడేసిన శిశువు కొద్దిసేపటికే మృతి చెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు... ఎడపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) అమ్మ మ్మ ఇంటి వద్ద ఉంటూ బోధన్‌లో ఇంటర్ చదువుతోంది. ఓ యువకుడితో ప్రేమలో పడి శారీరకంగా దగ్గరవడంతో ఆమె గర్భం దాల్చింది. ఈ క్రమంలో కడుపునొప్పిగా ఉందని అమ్మమ్మతో కలసి శనివారం తెల్లవారుజామున నిజామాబాద్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. అక్కడ డెలివరీ నిమిత్తం సిబ్బంది పూర్తి వివరాలు అడగడంతో చెప్పడం ఇష్టంలేక ఖలీల్వాడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడే ఆ బాలిక ఆస్పత్రి మెట్ల పక్కన మగశిశువును ప్రసవించింది. వెంటనే శిశువును పక్కనే ఉన్న చెత్తకుప్పలో పడేసి తీవ్రమైన కడుపు నొప్పి ఉందంటూ వైద్యుల వద్దకు వచ్చింది. ఆమె మాటల్లో పొంతన లేకపోవడంతో డాక్టర్లు తొలుత నమ్మలేదు. అయితే, అప్పటికే ఎక్కువ రక్తస్రావం అవుతుండటంతో ప్రాథమిక చికిత్స అందించారు. అదే సమయంలో పారిశుధ్య కార్మికులకు చెత్తకుప్పల్లో శిశువు కనిపించడంతో ఆస్పత్రి నిర్వాహకులకు సమాచారమిచ్చారు. వైద్యులిచ్చిన సమాచారం మేరకు పోలీసులు వచ్చి కొనఊపిరితో ఉన్న శిశువును ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించేలోపు శిశువు మృతి చెందింది. పోలీసులు బాలికను ప్రశ్నించగా తన ప్రేమ వ్యవహారం, గర్భం గురించి పూసగుచ్చినట్లు తెలిపింది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. -
తల్లి ప్రాణం గిలగిల.. గర్భంలో బిడ్డ మృతి
ఖమ్మం వైద్య విభాగం: వైద్యుల నిర్లక్ష్యానికి గర్భస్థ శిశువు బలైంది. నిండు గర్భిణి అనే కనికరం లేకుండా వ్యవహరించడం.. ఆ తల్లికి కడుపు కోతను మిగిలి్చంది. గురువారం ఖమ్మంలో ఈ అమాననీయ సంఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఖానాపురం యూపీహెచ్ కాలనీకి చెందిన ముసుకుల అశ్విని నిండు గర్భిణి కావడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతాశిశు సంరక్షణ కేంద్రానికి వచి్చంది. ఆమెను పరీక్షించిన వైద్యులు కాన్పు చేసేందుకు కొన్ని టెస్టులు రాశారు. దీంతో కుటుంబ సభ్యులు పరీక్షలు చేయించి డాక్టర్‌కు చూపించారు. పరీక్షల్లో ఆమెకు కామెర్లు ఉన్నట్లు తేలింది. దీంతో ఆపరేషన్ చేయడం కుదరదని, వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లాలని చెప్పారు. తాము నిరుపేదలమని, లాక్డౌన్లో అంతదూరం తీసుకెళ్లలేమని అశ్విని కుటుంబ సభ్యులు డాక్టర్లను వేడుకున్నా ససేమిరా అన్నారు. ఈ క్రమంలో అశ్విని పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కడుపులో ఇబ్బందిగా ఉందని కుటుంబసభ్యులకు తెలపడంతో డాక్టర్లు మరోసారి పరీక్షించారు. ఈ దశలో ఆమె కడుపులో బిడ్డ మృత్యువాత పడింది. దీంతో కుటుంబ సభ్యులు, అశ్విని కన్నీరు మున్నీరయ్యారు. కనీసం కడుపులోని మృత శిశువును అయినా తీయాలని కుటుంబ సభ్యులు డాక్టర్లను వేడుకున్నా కనికనించలేదు. దీంతో చేసేది లేక నగరంలోని వివిధ ప్రైవేటు ఆస్పత్రులను సంప్రదించారు. అయినా ఎవరూ వైద్యానికి అంగీకరించకపోవడంతో చివరి ప్రయత్నంగా మమత ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు తీవ్రంగా శ్రమించి మృత శిశువును బయటకు తీశారు. కాగా తల్లి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులపై కఠినచర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కామెర్లు ఉండడంతో ఎంజీఎంకు వెళ్లమన్నాం ఈ సంఘటనపై ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి ఆర్ఎంఓ బి. శ్రీనివాసరావు వివరణ కోరగా.. ఆమెకు కామెర్లు ఉం డటంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి డాక్టర్లు రిఫర్ చేశారన్నారు. కానీ కడుపులో శిశువు మాత్రం ఆస్పత్రిలో మృతి చెందలేదని స్పష్టం చేశారు. దానికి తమ వైద్యులు బాధ్యులు కాదని తెలిపారు. చదవండి: పాపం! అయినా అమ్మ దక్కలేదు.. చదవండి: ఇంట్లోనే కరోనా పరీక్ష చేసుకోవడం ఇలా.. -
చెరువులో శవమైన నాలుగేళ్ల చిన్నారి
సాక్షి, సంగారెడ్డి: ముక్కుపచ్చలారని నాలుగేళ్ల చిన్నారి చెరువులో శవమై కనిపించింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ చెరువులో ఆదివారం ఈ విషయం వెలుగుచూసింది. చిన్నారిని గ్రామానికి చెందిన కటికె మస్తాన్ కూతురిగా పోలీసులు గుర్తించారు. పాప మృతిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమెను ఎవరైనా చంపి చెరువులో పడేశారా, లేక తల్లిదండ్రుల మధ్య గొడవలే చిన్నారి మృతికి కారణమా? అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. -
చిన్నారి ప్రాణం తీసిన వీధికుక్కలు
-
ఘోరం: చిన్నారిని బలి తీసుకున్న చిరుత
సాక్షి, తుమకూరు : నరమాంసాన్ని రుచిమరిగిన ఓ చిరుత పులి ఓ చిన్నారిని బలితీసుకుంది. తుమకూరు తాలుకాలోని హెబ్బూరు సమీపంలో ఉన్న బైచేనహళ్లి తోటలో శనివారం సాయంత్రం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రీనివాస్, శిల్పా దంపతుల కుమార్తె చందన (2) ఇంటి ముందు ఆడుకుంటుండగా తోటలోకి ప్రవేశించిన పులి చిన్నారిని ఒక్కసారిగా నోట కరుచుకుని అడవిలోకి పారిపోయింది. విషయం గుర్తించిన తల్లిదండ్రులు బాలికను కాపాడటానికి పులితో పాటు పరుగులు తీసినా ఫలితం లేకపోయింది. అక్కడికి కొంత దూరంలో చిన్నారి మృతదేహం కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. (విషాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు..) చదవండి : పసి ప్రాణాన్ని బలిగొన్న ‘బాతు’! -
కూతురిని పూడ్చి పెట్టి.. తల్లి ఆత్మాహత్యాయత్నం
సాక్షి, విశాఖపట్నం: అత్తింటి వారితో గొడవపడి ఏడాదిన్నర కూతురితో కలిసి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. వివరాలు.. పెందుర్తి పరిధిలోని పులగాని పాలెంలో కుసుమలత అనే మహిళ.. తన భర్త, 18 నెలల కూతురితో కలిసి జీవనం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో కుంటుంబ కలహాలతో కుసుమలత తన కూతురిని తీసుకుని ఇంటి నుంచి వెళ్లి పోయింది. అదే రోజు తన భార్య, కూతురు కనపడటం లేదని ఈనెల 6వ తేదిన పెందుర్తి పోలీస్ స్టేషన్లో కుసుమలత భర్త ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అప్పటి నుంచి మహిళ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. కాగా ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో చిన్నముషిరివాడ వుడా కాలనీ కొండలమీద నుంచి ఓ మహిళ కనిపించిందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ మహిళను కుసుమలతగా గుర్తించారు. పాప ఏదని కుసుమలత తల్లిని విచారించగా తన కూతురు చనిపోయిందని, కొండ ప్రాంతంలో పాతి పెట్టానని చెప్పింది. ఈ క్రమంలో కొండపైన పోలీసులు గాలిస్తుండగా.. ఎర్ర కొండపై చిన్నారిని పాతిపెట్టిన ప్రదేశాన్నిపోలీసులు కనుగొన్నారు. బిడ్డ మృతదేహాన్ని చూసి, తండ్రి బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. మహిళ ఆత్మహత్య ప్రయత్నం విఫలమవడంతో శరీరం నిండా తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఆసుపత్రికి తరలించారు. -
మంగళగూడెం చిన్నారి.. దక్షిణాఫ్రికాలో మృతి
సాక్షి, ఖమ్మం: మండల పరిధిలోని మంగళగూడేనికి చెందిన చిన్నారి దక్షిణాఫ్రికాలో స్విమ్మింగ్‌పూల్‌లో పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కన్నేటి శంకర్, మమతలకు ఇద్దరు కుమారులు. మూడేళ్ల క్రితం శంకర్ భార్యా పిల్లలతో కలిసి ఉద్యోగ రీత్యా దక్షిణాఫ్రికా వెళ్లారు. శంకర్ అక్కడ హార్డ్‌వేర్ ఉద్యోం చేస్తున్నాడు. వీరు అక్కడే గేటెడ్ కమ్యూనిటీ వెంచర్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు. వారి చిన్న కుమారుడు జూవిత్(4) అక్కడి కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి, వారు నివాసం పక్కనే ఉన్న స్విమ్మింగ్‌పూల్‌లో పడి మృతి చెందాడు. అప్పటి వరకు ఆడుకుంటున్న జూవిత్ కనిపించకపోవడంతో తల్లి కంగారు పడి వెతకగా స్విమ్మింగ్ పూల్‌లో తేలియాడుతూ కనిపించాడు. దీంతో వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతదేహాన్ని స్వగ్రామమైన మంగళగూడేనికి శనివారం తీసుకురానున్నారు. కాగా జూవిత్ బీజేపీ జిల్లా కార్యదర్శి కన్నేటి కోటయ్యకు మనవడు. -
వైద్యం వికటించి చిన్నారి మృతి
సాక్షి, వైఎస్సార్: కడప నగరంలోని వంశీ చిన్నపిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి ఆదివారం మృతి చెందాడు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు వారి బంధువులు డాక్టరు నిర్లక్ష్యం, వైద్యం వికటించడంతోనే చిన్నారి మృతి చెందాడంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం కాస్త పెద్దది కావడంతో డాక్టర్ వంశీధర్ ఆసుపత్రికి తాళాలు వేసి పరారయ్యాడు. -
సంధ్యను చిదిమేశాయి!
వెదురుకొమ్మల కోసం అడవికి వెళ్లిన ఆరేళ్ల చిన్నారి అనుకోని ప్రమాదంలో చిక్కకొని ప్రాణాలు కోల్పోయింది. కందిరీగలు దాడి చేసి కుట్టడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ విషాద సంఘటన జి.మాడుగుల మండలంలో చోటుచేసుకోగా..వంతాల సంధ్య మృత్యువుఒడిలోకి చేరింది. కందిరీగల దాడిలో మరో ఇద్దరు గాయపడ్డారు. సాక్షి, జి.మాడుగుల : కె.కోడాపల్లి పంచాయతీ కవలపూలు పైవీధి గ్రామానికి చెందిన వంతాల సుబ్బారావు, వంతాల సీత భార్యభర్తలు. వీరితో పాటు ముగ్గురు ఆడపిల్లలు, గ్రామానికి చెందిన మరో ముగ్గురు గిరిజనులు కలసి గన్నేరుపుట్ట గ్రామం వద్ద అడవికి గురువారం సాయంత్రం సమయంలో వెదురుకొమ్ములు సేకరించటానికి వెళ్లారు. ఇంతలో కందిరీగలు గుంపుగా వచ్చి వీరిపై దాడి చేయగా వీరిలో అయిదుగురు వ్యక్తులు తప్పించుకొని పారిపోయారు. వంతాల సీత, వంతాల సంధ్య (6), 3 సంవత్సరాల వయస్సు గల వంతాల లక్ష్మిలపై కందిరీగలు, కొండ ఈగలు దాడి చేయటంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారాన్ని ఆశ వర్కర్ వైద్య సిబ్బందికి తెలిజేశారు. దీంతో అంబులెన్స్ పంపించి హుటాహూటిన జి.మాడుగుల పీహెచ్‌సీకి రాత్రి ఎనిమిది గంటల సమయంలో తరలించారు. వైద్యాధికారి డాక్టర్ వినోద్ కుమార్ వైద్యం అందిస్తున్న సమయంలో వంతాల సంధ్య మృతి చెందింది. మృతురాలి తల్లి సీత, వంతాల లక్ష్మిలకు చికిత్స అందించారు. వీరి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కాగా కందిరీగల దాడిలో తీవ్రంగా గాయపడిన వంతాల సీత, 3 సంవత్సరాల వంతాల లక్ష్మిలకు మరోసారి వైద్యం అందించేందుకు శుక్రవారం ఉదయం వైద్య సిబ్బంది, ఏఎన్ఎం సుమిత్ర, హెల్త్ అసిస్టెంట్ సప్పి బాలయ్యలు కవలపూలు గ్రామానికి ప్రయాసపడి కాలినడక వెళ్లారు. సీత, లక్షిలను వైద్యం చేయింటానికి అంబులెన్స్ ఏర్పాటు చేసి ఎంత బతిమిలాడిన ససేమిరా అన్నారు. దీంతో భాషా సంస్కృతులతో వైద్యానికి ఒప్పించి పాడేరు కమ్యూనిటీ ఆస్పత్రికి తలించి వైద్యం చేయించారు. సీత, లక్ష్మిలు ఆరోగ్యంగా నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
టిప్పర్ లారీ అదుపు తప్పి దారుణం..
-
బోయిన్‌పల్లిలో దారుణం..
హైదరాబాద్ : నగరంలోని బోయిన్పల్లి దారుణం చోటుచేసుకుంది. టిప్పర్ లారీ అదుపు తప్పి ఆరేళ్ల పాప మీదకు దూసుకురావడంతో చిన్నారి మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. హస్మత్‌పేట గల్లీలోకి కంకర లోడ్‌తో వచ్చిన టిప్పర్ లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో వెనక్కి దూసుకొచ్చింది. ఈ క్రమంలో అక్కడే ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి లారీ వెళ్లింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఇది గమనించిన స్థానికులు కేకలు వేయడంతో డ్రైవర్ లారీ అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఘటన స్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్న స్థానికులు ఆందోళన చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని వారు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి భారీ లోడ్‌తో కూడిన వాహనాలకు పగటి పూట నగరంలోకి అనుమతి లేకపోయినప్పటికీ.. కంకర లోడ్‌తో కూడిన టిప్పర్‌ను చిన్న గల్లీలోకి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. -
చెట్టు రూపంలో మృత్యువు
సాక్షి, తెనాలి(గుంటూరు) : అప్పటి వరకు తోటి విద్యార్థులతో పాఠశాలలో సందడిగా గడిపిన ఆ చిన్నారిని మరో రెండు నిమిషాల్లో ఇంటి వెళ్తున్న క్రమంలో చెట్టు రూపంలో మృత్యువు కబళించింది. చెట్టు విరిగి పడటంతో తీవ్రంగా గాయపడిన బాలుడిని వైద్యశాలకు తరలిస్తుండగా తల్లి ఒడిలోనే మృతి చెందిన విషాద ఘటన బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. తెనాలి పట్టణ మారిస్‌పేటలోని మఠం బజారులో ఉన్న మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల ఆవరణలోని యూకలిఫ్టస్ చెట్టు విరిగి పడటంతో విద్యార్థి భీమవరపు యువసందీప్ రెడ్డి(6) తీవ్రంగా గాయపడ్డాడు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పాఠశాల వదిలిపెట్టడంతో తోటి విద్యార్థులందరూ ఇళ్లకు వెళుతున్నారు. ఒకటో తరగతి చదువుతున్న సందీప్ ఉపాధ్యాయులకు వీడ్కోలు పలుకుతున్న విద్యార్థుల వరుసలో చివరన ఉన్నాడు. తరగతి గది నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా చెట్టు విరిగి పడింది. ఈ క్రమంలో చిన్నారి కుడి కాలు విరిగింది. వెంటనే ఉపాధ్యాయులు సమీపంలోని విద్యార్థులను పక్కకు లాగి, సందీప్‌ను చెట్టు కింద నుంచి పైకి తీశారు. కుమారుడు గాయపడిన విషయాన్ని తెలుసుకున్న తల్లి వీరకుమారి, స్థానికులు పాఠశాల వద్దకు వచ్చి సందీప్‌ను తెనాలి జిల్లా వైద్యశాలకు ఆటోలో తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. అలాగే వైద్యశాలకు తరలించగా.. డాక్టర్లు పరీక్షించి బాలుడు మృతి చెందిన విషయాన్ని ధ్రువీకరించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ మృతికి తండ్రి భీమవరపు సుబ్బరామిరెడ్డి, తల్లి కన్నీరుమున్నీరయ్యారు. బిడ్డ దేహాన్ని పట్టుకుని వారు విలపించిన తీరు కంట తడి పెట్టించింది. సందీప్ అన్నయ్య మణికంఠ అదే పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఘటన ప్రాంతానికి సమీపంలోనే ఉండటంతో మణికంఠ చెవికి చెట్టు కొమ్మలు రాసుకుపోయాయి. కడుపు కోత.. సుబ్బరామిరెడ్డి, వీరకుమారి దంపతులు నిరుపేదలు. కరెంటు పనుల మేస్త్రిలకు సహాయకుడిగా పని చేస్తూ సుబ్బరామిరెడ్డి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. చిన్న వాడైన సందీప్‌కు ఐదేళ్లు నిండటంతో కొద్దిరోజుల కిందట ఒకటో తరగతిలో చేర్పించారు. పాఠశాలలో బూట్లు, పుస్తకాలు ఇవ్వడంతో ఆ చిన్నారి ఉత్సాహంగా అన్నతో కలిసి స్కూలుకు వెళుతున్నాడు. చదువుకుని ప్రయోజకుడై కుటుంబాన్ని ఆదుకుంటాడని ఆశపడిన తల్లిదండ్రులకు కడపుకోత మిగిలింది. ఎమ్మెల్యే పరామర్శ.. ఘటన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ హుటాహుటిన వైద్యశాలకు చేరుకుని చిన్నారి పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కడుపుకోతతో వేదనపడుతున్న తల్లిదండ్రులను ఓదార్చారు. పురపాలక సంఘం నంచి తక్షణమే రూ.రెండు లక్షలు బాధిత కుటుంబానికి అందజేయాలని ఆదేశించారు. అలాగే అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు. నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలను తనిఖీ చేయాలని, విద్యార్థులకు ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.