condemn
-
పంజాబ్ పోలీసులు వర్సెస్ బ్రిటన్ ఆర్మీ
లండన్: జగ్జీత్సింగ్ అనే బ్రిటన్ సైనికుడు భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న విషయం తమ విచారణలో తేలిందని పంజాబ్ పోలీసులు ప్రకటించడం వివాదాస్పదమవుతోంది. ఈ విషయాన్ని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. పంజాబ్ పోలీసులు చెప్పిన జగ్జీత్సింగ్ పేరుతో బ్రిటిష్ ఆర్మీలో ఎవరూ పని చేయడం లేదని తెలిపింది.‘జగ్జీత్సింగ్ అనే వ్యక్తి ఫతేసింగ్ బాగీ అనే మారుపేరుతో ఖలిస్తానీ జిందాబాద్ ఫోర్స్ అనే ఉగ్రవాద సంస్థ నడుపుతున్నాడు. జగ్జీత్సింగ్ ప్రస్తుతం బ్రిటీష్ ఆర్మీలో జవానుగా పనిచేస్తున్నాడు’అని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. దీనికి సంబంధించి తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు.పంజాబ్ డీజీపీ వెల్లడించిన ఈ విషయాన్ని యూకే ప్రభుత్వం కొట్టిపారేసింది. కాగా,2021లో అమృత్సర్ పోలీసులకు పట్టుబడ్డ ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు జగ్జీత్సింగ్ పేరు చెప్పారు. తమకు ఆయుధాలు, డబ్బులు ఇచ్చింది జగ్జీత్సింగ్ అని వారు విచారణలో చెప్పడం గమనార్హం. -
ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం: అంబటి రాంబాబు
సాక్షి,గుంటూరు: విజయవాడలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటిరాంబాబు అన్నారు. ఈ విషయమై అంబటి శుక్రవారం(ఆగస్టు9) మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక దాడులు జరిగాయి. ఇప్పటివరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి విగ్రహాలపై, వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలపై టీడీపీ నేతలకు దాడులకు పాల్పడ్డారు. తాజాగా భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహంపైనే దాడికి పాల్పడ్డారు. దేశం మొత్తం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నడుస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నారా లోకేష్ తీసుకువచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది’అని మండిపడ్డారు.బాబు, లోకేష్‌ల ఆధ్వర్యంలోనే దాడి.. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డిడాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేయడం అంటే భారత రాజ్యాంగం మీద దాడి చేయడమే. రాష్ట్రంలో లాఅండ్ఆర్డర్ పనిచేయడం లేదు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ఆధ్వర్యంలోనే విజయవాడ అంబేద్కర్ స్మృతి వనం పై దాడి జరిగింది. అంబేద్కర్ స్మృతివనంపై కుట్ర ప్రకారమే టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దాడిలో టీడీపీకి ప్రమేయం లేకపోతే వెంటనే అంబేద్కర్ స్మృతి వనంలో తొలగించిన వైఎస్జగన్ పేరును పున: ప్రతిష్టించాలి దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి: వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావుయావత్తు దళిత జాతితో పాటు ప్రజాస్వామ్యవాదులంతా రాత్రి విజయవాడలో అంబేద్కర్ స్మృతి వనంపై జరిగిన దాడిని ఖండించాలి. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. అప్పటివరకు పోరాటం చేస్తాం. రాష్ట్రంలో ఏ ఒక్కరికి భరోసా లేదు. యావత్తు ప్రజానీకం భయాందోళనలో జీవనం సాగిస్తున్నారు.దాడుల పర్వం కొనసాగుతోంది: గుంటూరు తూర్పు వైఎస్సార్సీపీ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమారాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడుల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం కేవలం దాడులకే పరిమితమయింది. సీఎం చంద్రబాబు అభివృద్ధిలో పోటీపడాలి కాని విధ్వంసాలతో పరిపాలన చేయడం మంచి విధానం కాదు. -
ట్రంప్‌పై దాడిని ఖండించిన ప్రధాని మోదీ
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి జరిగింది. ఈ దాడి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఈ వార్త తెలిసిన ప్రపంచ నేతలంతా ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్రంప్‌పై దాడికి స్పందించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ప్రధాని మోదీ ఈ దాడిని ఖండించారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పోస్టులో ‘నా స్నేహితుడు, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడి విషయమై చాలా ఆందోళన చెందుతున్నాను. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. Deeply concerned by the attack on my friend, former President Donald Trump. Strongly condemn the incident. Violence has no place in politics and democracies. Wish him speedy recovery. Our thoughts and prayers are with the family of the deceased, those injured and the American…— Narendra Modi (@narendramodi) July 14, 2024 -
సురేఖ-సీతక్క లొల్లిపై క్లారిటీ
హైదరాబాద్, సాక్షి: ఇద్దరూ ఉమ్మడి వరంగల్‌కు చెందిన మహిళా నేతలు. పైగా మంత్రులు. కానీ, ఒకరంటే ఒకరికి పడడం లేదు. కనిపిస్తే కనీసం పలకరించుకోవడం లేదు సరికదా.. కలిసి పని చేయడం లేదు కూడా. మేడారం జాతర, లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఇద్దరి మధ్య విబేధాలు పబ్లిక్‌గా బయటపడ్డాయి.. అంటూ తాజాగా ఓ కథనం వెలువడింది. అయితే దీనిపై ఈ మంత్రులిద్దరూ స్పందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందట. రాజకీయాలు, పాలనా విషయాల్లో ఇద్దరి మధ్య విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయట. పైచేయి సాధించేందుకు ఇద్దరూ పోటాపోటీ వ్యూహాలను అమలు చేస్తున్నారట. గతంలో మేడారం జాతర సమయంలో వీరి మధ్య మొదలైన పంచాయితీ కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల ఇన్చార్జి మార్పు విషయంలో తీవ్రస్థాయికి చేరిందట.. అంటూ ఓ మీడియా సంస్థ కథనం ఇచ్చింది. అయితే దీనిపై ఇద్దరూ మండిపడ్డారు.తమ మధ్య విబేధాలు అనే వార్తలను సంయుక్తంగా ఈ ఇద్దరు మంత్రులు ఖండించారు. పరస్పర అవగాహనతో కలిసి మేం ముందుకు సాగుతున్నామని, మహిళా మంత్రుల మధ్య విభేదాలంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని స్పందించారు. పైగా ఆ కథనాలు మహిళా గౌరవాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రగతికి, రాష్ట్రాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియా బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో వ్యవహరించాలి అని మంత్రులిద్దరూ హితవు పలికారు. -
ఈడీ అధికారులపై దాడి.. బెంగాల్ గవర్నర్ ఫైర్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులపై జరిగిన దాడిని ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనందా బోస్ తీవ్రంగా ఖండించారు. అయితే ఈ ఘటనతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్న రాష్ట్ర చీఫ్ సెక్రటరీ బీపీ గోపాలికాను వివరణ ఇవ్వాలన్నారు. ఉత్తర 24 పరగణాలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత షాజహాన్ షేక్ నివాసంపై ఈడీ అధికారులు సోదాలు చేయడినికి వెళ్లగా.. ఆయన మద్దతుదారులు ఈడీ అధికారులపైకి దాడి చేసి, వాహనాలను ధ్వంసం చేశారు. రేషన్ పంపిణీ కుంభకోణంలో షాజహాన్‌కు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో శుక్రవారం ఈడీ అధికారులు ఆయన నివాసంలో సోదాలు చేపట్టాలనుకున్నారు. ఈడీ సోదాలు.. షాజహాన్ మద్దతుదారులతో దాడులతో ఆందోళనకంగా మారాయి. ఈడీ అధికారులపై జరిగిన దాడిపై రాష్ట్రం గవర్నర్ ఆనందా బోస్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ దాడులకు మమతా బెనర్జీ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఈ హింస బాధ్యత మొత్తం ప్రభుత్వంపై ఉన్నదని అన్నారు. ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించాలని లేకపోతే తీవ్రమైన పరిణామాను ఎదుర్కొవల్సి వస్తుందని హెచ్చరించారు. ఈడీ అధికారులపై జరిగిన దాడి ఘోరమైన చర్య అని మండిపడ్డారు. ఈ ఘటన దుర్భరమైన పరిస్థితులకు దారి తీస్తోందని అన్నారు. ప్రజా ప్రభుత్వం.. ప్రజాస్వామ్యాన్ని అనాగరిక విధ్వంసం నుంచి కాపాడాలని అన్నారు. ఇటువంటి విధ్వంసాలనను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలైమైతే.. రాజ్యాంగబద్దంగా తనకు ఉండే అధికారలతో తాను చర్యలు తీసుకుంటానని అన్నారు. West Bengal Governor CV Ananda Bose says, "It is a ghastly incident. It is alarming and deplorable. It is the duty of a civilised government to stop barbarism and vandalism in a democracy. If a govt fails in its basic duty, then the Constitution of India will take its course. I… pic.twitter.com/CH7Q12Qx7R — ANI (@ANI) January 5, 2024 అయితే ఈడీ అధికారులపై జరిగిన దాడులను ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి తీవ్రంగా ఖండించారు. ఈడీ అధికారులపై దాడు చేయటం అనేది సిగ్గుపడవల్సిన ఘటన అని దుయ్యబట్టారు. నెలరోజుల నుంచి ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ(PDS)లో పంపిణీ చేయాల్సిన సరుకులను సుమారు 30 శాతం దాకా లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా బహిరంగ మార్కెట్లో అమ్ముతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రేషన్ పంపిణీని పక్కదారి పట్టించడంలో మిల్లర్లు, పజా పంపిణీ వ్యవస్థ పంపిణీదారులు కుమ్మకైనట్లు ఈడీ ఆరోపిస్తుంది. చదవండి: రామ జమ్మభూమి-బాబ్రీ మసీద్ వివాదం: మాజీ పిటిషనర్ ఇక్బాల్‌కు ఆహ్వానం -
రజినీకాంత్ చంద్రబాబుతో కలిసి ఆయన కూడా వెన్నుపోటు దారుడుగా మారారు : లక్ష్మీపార్వతి
-
‘టీడీపీలోకి వెళ్లే ఆలోచనే లేదు’
హైదరాబాద్: గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ సస్పెండెడ్ నేత రాజాసింగ్ తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ ప్రచారం తెర మీదకు వచ్చింది. బీజేపీపై అసంతృప్తితో ఉన్న ఆయన సైకిల్ ఎక్కుతారంటూ ఆ ప్రచారంలో ఉంది. అయితే.. ఈ ప్రచారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తనకు పార్టీ మారే ఉద్దేశ్యం లేదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీలో చేరతానన్న వార్తలు అవాస్తవం. బీజేపీలోనే కొనసాగుతాను. వచ్చే ఎన్నికల్లో గోషామహల్ స్థానం నుంచి పోటీ చేస్తా. నా మెంటాలిటీకి బీజేపీ తప్ప వేరే పార్టీ సెట్ కాదు అంటూ జంపింగ్ వార్తలకు పుల్‌స్టాప్ పెట్టారాయన. ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రాజాసింగ్‌ను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీడీపీలోకి రాజాసింగ్ అంటూ ఆంధ్రజ్యోతి తాజాగా ఓ కథనం ప్రచురించింది. సస్పెన్షన్ తర్వాత బీజేపీ పట్టించుకోవడం లేదని, అందుకే ఆయన పార్టీ మారతారని, ఈ మేరకు ఇప్పటికే టీడీపీ నేతలతో చర్చలు జరిపారంటూ సుదీర్ఘంగా ఆ కథనంలో చర్చించింది. కానీ, ఆంధ్రజ్యోతిది తప్పుడు ప్రచారమేనని రాజాసింగ్ తేల్చేశారు. ఇదీ చదవండి: వాళ్ల ఉద్యోగాలు ఊడితేనే.. మన ఉద్యోగాలు -
వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసి విచారణ: రాచమల్లు
-
కారణం చెప్పకుండా బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం అన్యాయం : కిషన్ రెడ్డి
-
ఇది ప్రజాస్వామ్యానికి చీకటిరోజు
-
చైనా మళ్లీ అదే పని.. భారత్ ఘాటు బదులు1
ఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్.. టిబెట్‌లో అంతర్భాగమంటూ వాదిస్తున్న చైనా తాజాగా మరో దుశ్చర్యకు దిగింది. అరుణాచల్ సరిహద్దుల్లోని పదకొండు ప్రదేశాలకు పేర్లు పెట్టి.. జాంగ్నాన్ పేరుతో టిబెట్ దక్షిణ ప్రాంతంలో భాగమంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే.. ప్రతిస్పందనగా భారత్ ఘాటుగానే ప్రకటన విడుదల చేసింది. ఈ పేర్లన్నింటిని తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్.. ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమే అని ఢిల్లీ వర్గాలు ఒక ప్రకటనలో స్పష్టం చేశాయి. చైనా అలాంటి నివేదిక గురించి విడుదల చేసిందని తెలిసింది. చైనా ఇలాంటి పని చేయడం తొలిసారేం కాదు కదా. మేము దీనిని పూర్తిగా తిరస్కరిస్తున్నాము అని విదేశాగం మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్ అంతర్భాగం. అది విడదీయరాని భాగం. ఏవో పేర్లు కనిపెట్టి.. కనికట్టు చేసే ప్రయత్నాలు ఫలించబోవు. అవి వాస్తవాలను మార్చలేవు అని బాగ్చీ స్పష్టం చేశారు. Our response to media queries regarding the renaming of places in Arunachal Pradesh by China:https://t.co/JcMQoaTzK6 pic.twitter.com/CKBzK36H1K — Arindam Bagchi (@MEAIndia) April 4, 2023 2017లో దలైలామా అరుణాచల్ ప్రదేశ్ పర్యటన తర్వాత చైనా మొదటిసారి ఇలాంటి పనే చేసింది. ఆ సమయంలో ఆరు ప్రాంతాల పేర్లను మార్చేసింది. చైనా అధికార ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం.. ‘ప్రామాణిక భౌగోళిక పేర్లు’ అని చైనా తన చర్యను సమర్థించుకుంటూ వస్తోంది. ఇక 2021లో రెండో బ్యాచ్ కింద 15 ప్రాంతాల పేర్లను మార్చేసింది. ఆయా సందర్భాల్లో భారత్ చైనా చర్యను ఖండించింది. తాజాగా.. 11 ప్రాంతాలు(రెండు నదులు, ఐదు పర్వత ప్రాంతాలు, రెండు నివాస ప్రాంతాలు, రెండు మైదాన ప్రాంతాలు) పేర్లను మార్చేసింది. -
హిందూ ఫోబియాని ఖండించే తీర్మానాన్ని ఆమోదించిన యూఎస్ రాష్ట్రం
హిందూ ఫోబియాను, హిందూ వ్యతిరేక మతోన్మాదాన్ని ఖండిస్తూ యూఎస్‌లోని జార్జియా రాష్ట్రం ఒక తీర్మానాన్ని తీసుకొచ్చి ఆమోదించింది. అటువంటి చట్టబద్ధమైన చర్య తీసుకున్న తొలి అమెరికన్ రాష్ట్రంగా నిలించింది. ఆ తీర్మానంలో.. హిందూఫోబియాను ఖండిస్తూ.. దాదాపు 100 దేశాలలో 1.2 బిలియన్లకు పైగా అనుచరులను కలిగి ఉన్న అతిపెద్ద పురాతన మతాలలో హిందూ మతం ఒకటి. పైగా పరస్పర గౌరవం, శాంతి విలువలతో విభిన్న సంప్రదాయాలు, విశ్వాస వ్యవస్థలను కలిగి ఉన్న మతం అని తీర్మానంలో పేర్కొంది. ఈ తీర్మానాన్ని అట్లాంటా శివారులోని ఫోర్సిత్ కౌంటీకి చెందిన ప్రతినిధులు లారెన్ మెక్‌డొనాల్డ్, టాడ్‌జోన్స్ ప్రవేశపెట్టారు. అంతేగాదు ఈ తీర్మానంలో వైద్యం, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హాస్పిటాలిటీ, ఫైనాన్స్, అకాడెమియా, తయారీ, ఇంధనం, రిటైల్ వాణిజ్యం వంటి విభిన్న రంగాలకు అమెరికన్-హిందూ కమ్యూనిటీ ప్రధాన సహకారాన్ని అందించిందని గుర్తించింది. అలాగే యోగా, ఆయుర్వేదం, ధ్యానం, ఆహారం, సంగీతం, కళలు వంటివి అమెరికా సాంస్కృతికతను సుసంపన్నం చేశాయి. పైగా అమెరికన్ కమ్యూనిటీ వాటిని అడాప్ట్ చేసుకోవడమేగాక మిలియన్ల మంది జీవితాలను మెరుగుపరిచాయని కూడా పేర్కొంది. అలాగే దేశంలోని అనేక ప్రాంతాలలో గత కొన్ని దశాబ్దాలుగా హిందూ-అమెరికన్లపై ద్వేషపూరిత నేరాలు నమోదైన ఘటనలను వివరిస్తూ..హిందూ మతాన్ని విచ్ఛిన్నం చేసేందుకు విద్యారంగానికి చెందిన కొందరు హిందూ-అమెరికన్లపై ద్వేషపూరిత నేరాలకు పాల్పడుతున్నారని ఈ తీర్మానం పేర్కొంది. వాస్తవానికి ఈ నినాదం జార్జియా రాజధానిలో మార్చి 22న తొలిసారిగా హిందూ న్యాయవాద దినోత్సవాన్ని నిర్వహించే ఉత్తర అమెరికా హిందువలు కూటమి(కోహెచ్‌ఎన్‌ఏ) నుంచి వచ్చింది. దీనికి అమెరికాలోని రిపబ్లికన్లు, డెమోక్రాట్లకు సంబంధించి సుమారు 25 మంది చట్టసభ సభ్యులు హాజరయ్యారు. అలాగే హిందూ కమ్యూనిటీలో చేరిన కొందరూ తమ ఆందోళనలు ఆర్థం చేసకుని, ఈ వివక్షకు వ్యతిరేకంగా సమాజాన్ని రక్షించే మార్గాలను రూపొందించడానికి కృషి చేస్తామని హామి ఇచ్చినట్లు కోహెచ్‌ఎన్‌ఏ పేర్కొంది. కాగా, ఈ కౌంటీ రిజల్యూషన్‌ను ఆమోదించే ప్రక్రియలో మాకు మార్గనిర్దేశం చేసిన రెప్ మెక్‌డొనాల్డ్, రెప్ జోన్స్ తోపాటు చట్టసభ సభ్యులతో కలిసి పనిచేయడం నిజమైన గౌరవం అని కోహెచ్‌ఎన్‌ఏ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ మీనన్ అన్నారు. ఇప్పటి వరకు శాసనసభ్యులందరూ ఎజెండాలోని శాసనపరమైన అంశాల ప్రకారం చాలా గంటలు పని చేస్తున్నారని విన్నాం. కానీ ఈ రోజు వారంతా హిందూ సమాజానికి ఎంత విలువ ఇస్తున్నారో చూపించడానికి న్యాయవాద దినోత్సవంలో మాతో చేరడమే గాక దాన్ని నిజం చేసి చూపించారని రాజీవ్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కోహెచ్‌ఎన్‌ఏ ప్రధాన కార్యదర్శి శోభా స్వామి మాట్లాడుతూ..హిందూ అమెరికన్లు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి అసత్య ప్రచారం తోపాటుగా ఈ హిందూ ఫోబిక్ కథనాలు కూడా అమెరికా కమ్యూనిటిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇవి ఒకరకరంగా హిందువులపై విద్వేషాన్ని పెంచేలా చేయడమేగాక భారతీయ అమెరికన్ సంతతికిచెందిన ప్రజలపై వివక్ష చూపేందుకు కారణమవుతోంది. అందువల్ల అటువంటి మతోన్మాదాన్ని ఎదుర్కొనడానికి ప్రత్యేక చట్టాలు, పర్యవేక్షణ అవసరమని చెబుతూ వారి సహాయన్ని కోరినట్లు శోభా వివరించారు. (చదవండి: భారత్ నాటోలో చేరనుందా? యూఎస్ నాటో రాయబారి షాకింగ్ వ్యాఖ్యలు) -
ఆ హత్యను ఖండిస్తున్నాం
ముస్లిం అమ్మాయిని పెళ్ళి చేసుకున్నారన్న ఆక్రోశంతో దళితుడైన నాగరాజును ఆమె బంధువులు హత్య చేయడాన్ని ముస్లిం ఆలోచనాపరులం నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాం. ఏ విధంగా చూసినా ఈ చర్య అమానుషమైనది. మరీ ముఖ్యంగా ఇస్లామిక్ విలువలకు పూర్తిగా విరుద్ధమైనది. తీవ్రంగా వివక్షకు గురైన నల్లజాతి వారిని హృదయానికి హత్తుకున్న మొహమ్మద్ ప్రవక్త ఆదర్శానికి వ్యతిరేకమైనది. కులాన్ని పాటించడమంటే పవిత్ర ఖురాన్‌ను నిరాకరించడమే! ముస్లిం సమాజం ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. నాగరాజు కుటుంబానికి మేము తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాము. ఈ విషమ సమయంలో తీవ్ర బాధితురాలైన ఆశ్రీన్ సుల్తానా గుండె నిబ్బరంతో ఉండాలని కోరుతున్నాము. నాగరాజును హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమే కాకుండా ఆశ్రీన్ సుల్తానాకూ, నాగరాజు కుటుం బాలకూ పూర్తి రక్షణ కల్పించాలనీ, ఆశ్రీన్ సుల్తానాను ఆదుకోవాలనీ కోరుతున్నాము. ఈ సంఘటనను సాకుగా చూపి దళితులకూ ముస్లింలకూ మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టాలనుకుంటున్నారు కొందరు మహనుభావులు. వీరి విష రాజకీయాలకు గురి కావద్దని దళిత సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ( కాపాడమని కాళ్లు పట్టుకున్నా.. ఎవరూ ముందుకు రాలేదు) – ముస్లిం థింకర్స్ డయాస్ (సయ్యద్ సలీంపాషా, డా. ఖాజా, డా. రియాజ్, స్కైబాబ, ఖుర్షీద్, హుసేన్, డా. మాలిక్, ఇనాయతుల్లా, వహీద్ మహమ్మద్, డా. రఫీ, షఫీ, నస్రీన్ ఖాన్, డా. మహబూబ్ బాషా, షేక్ పీర్ల మహమూద్, అక్బర్ ఆర్టిస్ట్, నబి కరీమ్ ఖాన్, డా. అఫ్సర్, డా. యాకూబ్) -
సరూర్‌నగర్ పరువుహత్యపై స్పందించిన ఒవైసీ
హైదరాబాద్: తెలంగాణలోనే కాదు.. యావత్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించించింది సరూర్‌నగర్ పరువు హత్య ఉదంతం. ఈ ఘటనపై తాజాగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. దళిత యువకుడు నాగరాజు హత్యను ఒవైసీ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ దారుస్సలాంలో నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో ఒవైసీ ప్రసంగిస్తూ.. సరూర్‌నగర్‌లో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆమె(ఆశ్రిన్ సుల్తానా) తన ఇష్టపూర్వకంగానే ఆ వ్యక్తిని (నాగరాజు) పెళ్లి చేసుకుంది. అది సరైన చర్యే. కానీ, సుల్తాన్ సోదరుడికి ఆమె భర్తను చంపే హక్కు ఎక్కడిది? రాజ్యాంగం ప్రకారం హత్య చేయడం క్రూరమైన చర్య, ఇస్లాం ప్రకారం దారుణమైన నేరం కూడా. సరూర్ నగర్ హత్య ఘటనకు వేరే రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా బీజేపీ నేతలను ఉద్దేశించి ఒవైసీ కామెంట్స్ చేశారు. హత్య ఘటనలో నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారని.. తాము హంతకుల పక్షాన నిలబడేవాళ్లం కాదని అన్నారు ఆయన. #Nagraju की नृशंस हत्या पर साफ़ साफ़ बोले @asadowaisi - “जुर्म है ये , क़ानूनन जुर्म है ये।मैं खुलेआम condemn करता हूँ। अल्लाह से डरो” याद नहीं आता कि किसी मुस्लिम युवक की हत्या पर आज तक किसी भाजपा या हिंदूवादी नेता ने एक भी शब्द कहा हो। pic.twitter.com/yTZoVQL0FN — Vinod Kapri (@vinodkapri) May 6, 2022 ► ఖార్గోన్(మధ్యప్రదేశ్), జహంగీర్‌పురి(ఢిల్లీ) మత ఘర్షణలపైనా స్పందిస్తూ.. ఇకపై ఏ మతానికి సంబంధించి ఉరేగింపులు జరిగినా మసీదులపై హైరెజల్యూషన్‌తో కూడిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఉరేగింపులు జరిగేటప్పుడు లైవ్ టెలికాస్టింగ్ చేయాలని, అప్పుడు రాళ్లు రువ్వేది ఎవరో ప్రపంచం మొత్తానికి తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడ ముస్లింలపై దాడులు జరిగినా స్పందించే ఒవైసీ... సరూర్ నగర్ ఘటనపై మాత్రం ఎందుకు స్పందించట్లేదని బీజేపీ నేతలు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఒవైసీ స్పందించకపోవడం హత్యకు మద్దతునిచ్చినట్లేనని వాళ్లు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో హత్య ఘటనను ఖండిస్తూ ఒవైసీ స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చదవండి: కాపాడమని కాళ్లు పట్టుకున్నాను, ఎవరూ ముందుకు రాలేదు-అశ్రిన్ -
మేమున్నాం.. ఆందోళన వద్దు
న్యూఢిల్లీ: శ్రీలంకలో జరిగిన వరుస బాంబుపేలుళ్లపై భారత్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. శ్రీలంక రాష్ట్రపతి మైత్రిపాల సిరిసేన, ప్రధాని రణిల్ విక్రమసింఘేలతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. ఉగ్రవాదుల దుశ్చర్యను ‘అత్యంత క్రూరమైన, అనాగరిక చర్య’గా అభివర్ణించారు. ఈ షాక్‌నుంచి కోలుకోవడంతోపాటు, సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు శ్రీలంకకు అవసరమైన సాయం అందిస్తామని మోదీ భరోసా ఇచ్చారు. విశ్వ మానవాళికి ఉగ్రవాదం పెనుసవాలుగా మారిందనడానికి శ్రీలంకలో వరుసపేలుళ్లు మరో ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ‘సీమాంతర ఉగ్రవాదంతోపాటు, ఇలాంటి ఉన్మాదపు దాడులకు పాల్పడుతున్న వారిని అణచివేసేందుకు అంతర్జాతీయ సమాజమంతా ఏకమవ్వాలి. దీన్ని సమర్థించుకునే ఏ చర్యనూ సహించకూడదు’అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఆదివారం శ్రీలంకలో జరిగిన ఎనిమిది వరుస ఆత్మాహుతిదాడుల్లో 200 మందికి పైగా చనిపోగా.. 500 మందికి పైగా గాయలయ్యాయి. ‘మృతుల కుటుంబాలకు, శ్రీలంక ప్రభుత్వానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇలాంటి దారుణమైన దాడులకు పాల్పడిన వారెంతవారైనా కఠినంగా శిక్షించాల్సిందే’అని విదేశాంగశాఖ ప్రకటన పేర్కొంది. ‘కొలంబోలోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం టచ్‌లో ఉన్నాను. పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం’అని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ట్వీటర్లో పేర్కొన్నారు. ఖండించిన దేశాధినేతలు లండన్/కొలంబో/ముంబై: శ్రీలంకలో ఉగ్రదాడులను ప్రపంచ వ్యాప్తంగా నేతలు ఖండించారు. అమెరికా, బ్రిటన్, రష్యా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్ తదితర దేశాధినేతలతోపాటు పలువురు హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. శ్రీలంక ప్రజలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి సాక్షి, హైదరాబాద్: శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల సీఎం కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల చర్యను అత్యంత హేయమైందిగా వర్ణించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేటీఆర్ దిగ్భ్రాంతి శ్రీలంకలోని చర్చిలు, హోటళ్లలో జరిగిన వరుస బాంబు పేలుళ్లపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పవిత్రదినం రోజున అనాగరిక, క్రూరచర్యతో విలువైన ప్రాణాలను తీశారని అన్నారు. బాంబు పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదివారం ట్విటర్లో ప్రగాఢ సానుభూతి తెలిపారు. మానవత్వానికే మచ్చ సాక్షి, అమరావతి: శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు. ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీలంక మారణ హోమం మానవత్వానికే మాయనిమచ్చని, ప్రాణం పోసే శక్తి లేనివారికి ప్రాణం తీసే హక్కులేదని తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కిరాతక చర్య: జగన్ సాక్షి, అమరావతి: శ్రీలంకలోని కొలంబోలో జరిగిన మారణహోమాన్ని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ కిరాతక చర్యలకు బలైన వారి కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. నాగరిక సమాజంలో ఇలాంటి విచక్షణారహితమైన హింసకు తావే లేదని జగన్ అభిప్రాయపడ్డారు. అమాయకులను బలిగొన్న ఈ దుశ్చర్యను ఆయన తీవ్రంగా ఖండింస్తూ ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు. -
చర్చల్లేవ్.. ఇక ప్రత్యక్ష చర్యలే!
న్యూఢిల్లీ: చర్చలకు సమయం ముగిసిందనీ, ప్రత్యక్ష చర్యలకు సమయం ఆసన్నమయిందని ప్రధాని మోదీ అన్నారు. పుల్వామా ఘటనతో చర్చలకు ఇక అవకాశం లేదని, ఉగ్రవాదంతో పాటు దానికి మద్దతు తెలిపే వారిపై చర్యలు తీసుకోవడంలో ఉపేక్షిస్తే ప్రోత్సహించినట్లే అవుతుందని పాక్‌నుద్దేశించి ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో పర్యటిస్తున్న అర్జెంటీనా అధ్యక్షుడు మరిసియో మాక్రితో ప్రధాని సోమవారం చర్చలు జరిపారు. అనంతరం ఉగ్రవాదంపై పోరుకు సంబంధించి ఇద్దరు నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘పుల్వామా ఘటనతో చర్చలకు ఇక అవకాశం లేదనీ, ప్రత్యక్ష చర్యలకు సమయం ఆసన్నమైందన్న విషయం స్పష్టమైంది. ఉగ్రవాదాన్ని, దానిని ప్రోత్సహిస్తున్న వారికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదంపై, దానికి మద్దతిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో తటపటాయిస్తే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్లే అవుతుంది’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో ప్రపంచ దేశాలన్నీ సహకరించు కునే వేదిక(కాంప్రిహెన్సివ్ కాన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం) ఏర్పాటుకు మోదీ, మాక్రి మద్దతు ప్రకటించారు. చర్చల సందర్భంగా రెండు దేశాలు..రక్షణ, అణుశక్తి, కమ్యూనికేషన్ టెక్నాలజీ, వ్యవసాయ రంగాల్లో సహకారానికి సంబంధించిన పది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ‘ఠాగూర్’ అవార్డుల ప్రదానం ‘ఠాగూర్ అవార్డ్ ఫర్ కల్చరల్ హార్మొనీ’ పేరిట ఇచ్చే అవార్డుల ప్రదానోత్సవం సోమవారం ఇక్కడ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని ప్రసంగిస్తూ.. భారతదేశ శక్తిని ఠాగూర్ గుర్తించారని, ఈ విషయాలను రవీంద్ర సంగీత్‌లో ప్రస్తావించారని చెప్పారు. కాగా ఠాగూర్ అవార్డులకు అర్హులైన వారిని ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేసింది. 2014, 2015, 2016 సంవత్సరాలకుగానూ ఠాగూర్ అవార్డులకు వరుసగా ప్రముఖ మణిపురీ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ రాజ్‌కుమార్ సింఘజిత్ సింగ్, బంగ్లాదేశ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఛాయనౌత్, ప్రముఖ శిల్పి రామ్ వాన్జీ సుతార్లు ఎంపికయ్యారు. వీరికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డు కింద కోటి రూపాయలు అందించారు. -
ట్రంప్‌పై మండిపడుతున్న టెక్ దిగ్గజాలు
వాషింగ్టన్: ఏడు ముస్లిం దేశాల నుంచి అమెరికా వచ్చే పౌరులపై తీవ్ర ఆంక్షలు విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై టెక్ దిగ్గజ సంస్థలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. టెక్ కంపెనీల్లో ఉన్నత స్థాయిలో ఉన్న చాలా మంది అమెరికాకు వలస వచ్చిన వారే అయిన నేపథ్యంలో.. వారంతా ట్రంప్ చర్యపై వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. అదే సమయంలో గూగుల్‌తో పాటు టాప్ టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశాయి. లిబియా, ఇరాక్, ఇరాన్, సొమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ దేశాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు కఠినమైన నేపథ్యంలో.. ఆ దేశాలకు చెందిన వారు ప్రయాణాలు క్యాన్సిల్ చేసుకోవాలని తమ ఉద్యోగులను గూగుల్ ఆదేశించింది. ఆంక్షలు 90 రోజుల పాటు కొనసాగనున్న నేపథ్యంలో.. ఆంక్షలు ఎత్తివేసేవరకు ప్రయాణాలు మానుకోవాలని కోరింది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాకు వచ్చే మేథోవలసకు అడ్డుగా మారుతుందని గూగుల్ ఓ ప్రకటనలో పేర్కొంది. గూగుల్ సహవ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్.. శాన్ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో సైతం పాల్గొన్నారు. ట్రంప్ నిర్ణయం ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుందని ఆపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ పేర్కొన్నారు. ట్రంప్ పాలసీని యాపిల్ సపోర్ట్ చేయదని అన్నారు. ఇమ్మిగ్రేషన్ లేకుండా అసలు ఆపిల్ ఉండదని లేఖలో పేర్కొన్నారు. అలాగే బ్యాన్‌తో విమానాశ్రయంలో ఇబ్బందులు పడుతున్న తమ ఉద్యోగులకు సంస్థ తరఫున సహకారాలుంటాయని తెలిపారు. ఎవరు ఎక్కడనుంచి వచ్చారు అనేదానితో సంబంధం లేకుండా అందరికీ ఆపిల్ ద్వారాలు తెరిచే ఉంటాయని ఆయన వెల్లడించారు. ఇండియా నుంచి వలస వెళ్లి మైక్రోసాఫ్ట్ సీఈవోగా పనిచేస్తున్న సత్యానాదెళ్ల.. ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల నుంచి తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు లీగల్ సపోర్ట్ అందిస్తామని వెల్లడించారు. ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల నుంచి వచ్చిన 76 మంది మైక్రోసాఫ్ట్ ఉద్యోగులపై ప్రభావం పడనుంది. అమెజాన్ సంస్థ సైతం ముస్లిం దేశాలపై బ్యాన్ విధించడాన్ని వ్యతిరేకించింది. భిన్నత్వంతో కూడిన ఉద్యోగులు ఉండటం వల్లే ఉత్తమ ఉత్పత్తులు సాధ్యమయ్యాయని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులను సంస్థలో చేరేలా ఆకర్షించడమే తమ విజయానికి కారణమని అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గాలెట్టి వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం విధించిన ఆంక్షలు 90 రోజులపాటు కొనసాగుతాయని చెబుతున్నా.. మరికొంత కాలం వీటిని పొడిగించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. -
ట్రంప్ ఆర్డర్‌పై అటార్ని జనరల్స్ వ్యతిరేకత
-
'వాడొక పిచ్చి కుక్క.. దూరంగా ఉండండి'
లక్నో: ఫ్రాన్స్ లో దాడికి పాల్పడిన ముస్లిం ఉగ్రవాది పిచ్చికుక్కతో సమానం అని షియా మత పెద్ద మౌలానా కాబి సాదిక్ అన్నారు. లక్నోలో ఓ మెడికల్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఉగ్రవాదం అంశంపై మాట్లాడుతూ మానవత్వాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యలకైనా ముస్లింలు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఫ్రాన్స్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దాడికి పాల్పడని వ్యక్తి పిచ్చి కుక్కతో సమానం అని ఆయన అభివర్ణించారు. అనవసరంగా అమాయకులను పొట్టన పెట్టుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ చర్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పాడు. ప్రపంచంలోని ముస్లింల అందరి జీవితాలను బాగుచేసేది ఒక్క విద్యేనని ఆయన చెప్పారు. ప్రతి ఒక్క ముస్లిం మంచి విద్యావంతుడిగా మారాలని చెప్పారు. మాజీ రాష్ట్రపతి, భారత రత్న అబ్దుల్ కలాంను చూసి ఆ విషయం నేర్చుకోవాలని హితవు పలికారు. భారత్ మాతాకి జై అనేందుకు ఇష్టపడని ముస్లింలు భారత్ అమ్మికి జై అనొచ్చని అన్నారు. -
నీస్ ఉగ్రదాడిపై ప్రపంచ నేతల దిగ్భ్రాంతి
-
నీస్ ఉగ్రదాడిపై ప్రపంచ నేతల దిగ్భ్రాంతి
నీస్: పారిస్ ఉగ్రదాడి నుంచి కోలుకోకముందే ఫ్రాన్స్ లో మరోసారి ముష్కరులు మారణహోమానికి పాల్పడ్డారు. నీస్ నగరంలో బాస్టిల్ డే సంబరాల్లో నరమేధం సృష్టించారు. పేలుడు పదార్థాలు నింపిన ట్రక్కుతో పెను విధ్వంసం సృష్టించి 80 మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు. 100 మందిపైగా క్షతగాత్రులయ్యారు. నీస్ నగరంలో ఉగ్రదాడిని ప్రపంచ దేశాధినేతలు ముక్తకంఠంతో ఖండించారు. నీస్ దాడి పట్ల భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాస్టిల్ డే సంబరాల్లో పాల్గొన్న అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని తెలిసి ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరుకు ఫ్రాన్స్ తో కలిసి పనిచేస్తామన్నారు. ఉగ్రదాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఈ దాడిని మతిలేని చర్యగా వర్ణించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి సమయంలో ఫ్రాన్స్ కు అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసాయిచ్చారు. అమెరికా ప్రజల తరపున భయానక ఉగ్రదాడిని ఖండిస్తున్నట్టు అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. నీస్ దాడి నేపథ్యంలో రేపు జరగనున్న విలేకరుల సమావేశాన్ని వాయిదా వేసుకున్నట్టు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఉగ్రదాడి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని బ్రిటన్ ప్రధాని థెరిసా మే పేర్కొన్నారు. I hope the injured recover soon. India shares the pain & stands firmly with our French sisters & brothers in this hour of immense sadness. — Narendra Modi (@narendramodi) 15 July 2016 Appalled by the horrific attack in Nice. I strongly condemn such mindless acts of violence. My thoughts are with the families of deceased. — Narendra Modi (@narendramodi) 15 July 2016 I hope the injured recover soon. India shares the pain & stands firmly with our French sisters & brothers in this hour of immense sadness. — Narendra Modi (@narendramodi) 15 July 2016 -
'సాక్షి' పై కేసులను ఖండించిన ఏపీయూడబ్ల్యూజే
రాజమండ్రి: 'సాక్షి' పై కేసులు నమోదు చేయడాన్ని ఏపీయూడబ్ల్యూజే ఖండించింది. పత్రికలపై నేరుగా పోలీసులే కేసులు బనాయించడం దారుణమని పేర్కొంది. కేసు సెక్షన్లను గమనిస్తే బ్రిటీష్ పాలనలో ఎమర్జెన్సీ కాలంలోనే అలాంటి కేసులు నమోదయ్యాయని ధ్వజమెత్తింది. కావాలనే సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, ఎడిటర్ మురళిని ఇరికించారని ఏపీయూడబ్ల్యూజే మండిపడింది. సాక్షి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు శ్రీరాంమూర్తి, సీనియర్ జర్నలిస్టు సారధి, ఐజేయూ నేషనల్ కౌన్సిల్ మెంబర్ రెహమాన్, పలువురు జర్నలిస్టులు సాక్షిపై కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ రాజమండ్రి అర్బన్ ఎస్పీ రాజకుమార్‌కు వినతి పత్రం ఇచ్చారు. -
'భారతీయుల ఆగ్రహాన్ని మేమూ పంచుకుంటాం'
బీజింగ్: పఠాన్ కోట్‌పై దాడిని తాము కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని చైనా పేర్కొంది. ఈ దాడి వల్ల భారతీయులకు కలిగిన ఆవేదనను, ఆవేశాన్ని తాము కూడా పంచుకుంటున్నామని చైనా వెల్లడించింది. 'చైనా కూడా ఒక ఉగ్రవాద బాధితురాలే. మేం భారతీయుల బాధను పంచుకుంటున్నాం. ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా దానిని మేం తీవ్రంగా ఖండిస్తాం.. వ్యతిరేకిస్తాం' అని చైనా భారత రాయభారి లీ యూచెంగ్ అన్నారు. దాడి జరిగిన పఠాన్ కోట్ ప్రాంతాన్ని ప్రధాని నరేంద్రమోదీ సందర్శించిన కొద్ది సేపటితర్వాత చైనా తరుపున ఈ ప్రకటన రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వాస్తవానికి భారత్ కు అనుకూలంగా ఉన్నట్లు ప్రవర్తించినా.. వెనుకనుంచి అది పాకిస్థాన్‌కే అధిక మద్దతు ఇస్తుందని, పరోక్షంగా భారత్‌ను ఇరుకున పడేసి చర్యలకు సహకరిస్తుందని అపవాదు చైనాపై ఉన్న విషయం తెలిసిందే. -
'ఆ దాడిని ఖండిస్తున్నా.. ఈ దాడి తెలియదు'
న్యూయార్క్: అఫ్గానిస్తాన్‌లోని భారత దౌత్యకార్యాలయంపై ఉగ్రవాదులు దాడి చేయడాన్ని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ఖండించారు. అదే సమయంలో భారత్‌లోని పంజాబ్ లోగల పఠాన్ కోట్ పై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనపై మాత్రం స్పందించలేదు. ఆదివారం రాత్రి కొందరు ఉగ్రవాదులు అప్గానిస్తాన్‌లోని మజరీఈ షరీప్ నగరంలోని భారత దౌత్యకార్యాలయంపైకి దాడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ దాడిని భద్రతా బలగాలు సమర్ధంగా ఎదుర్కొన్నాయి. దీనికి సంబంధించి బాన్ కీ మూన్ స్పందిస్తూ 'మజరీ ఈ షరీఫ్ లోగల భారత్ కార్యాలయంపై జరిగిన దాడి ముమ్మాటికి ఖండించాల్సినదే. అన్ని దేశాల్లోని అన్ని దేశాల దౌత్య కార్యాలయాలకు గట్టి భద్రత కల్పించాలని గతంలోనే నేను చెప్పాను' అని అన్నారు. పఠాన్ కోట్‌పై పాక్ ఉగ్రవాదుల దాడిపై మాత్రం 'దానిపైన నేను ప్రత్యేకంగా మాట్లాడిల్సింది ఏమీ లేదు. దానిపై మాట్లాడేందుకు నా వద్ద వివరాలు కూడా ఏమీ లేవు' అని బాన్ కీ మూన్ చెప్పినట్లు ఆయన వ్యక్తిగత అధికార ప్రతినిధి స్టీపెన్ దుజారిక్ చెప్పారు. -
ట్విట్టర్ ఆక్రోశం
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన ఉగ్రదాడి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆ నగరంలో పలు చోట్ల సంభవించిన దాడుల్లో ఇప్పటికే 150 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల ఆర్తనాదాలు, క్షతగాత్రుల హాహాకారాలతో పారిస్ నగరం చివురుటాకులా వణికింది. ఈ దాడిని ప్రపంచదేశాల నాయకులు ముక్తం కంఠంతో ఖండించారు. కలిసికట్టుగా ఉగ్రవాదాన్ని రూపుమాపాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్, బాలీవుడ్ నటులు, గాయకులు, వివిధ రంగాల ప్రముఖులు ట్విట్టర్ లో స్పందించారు. ఉగ్రవాద చర్యను తీవ్రంగా ఖండించిన పలువురు సెలబ్రిటీలు మృతులకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. పారిస్‌లో తమ బంధువులు, సన్నిహితుల క్షేమం కోసం ఆరా తీశామన్నారు. శాంతి సందేశాలను, ఫొటోలను షేర్ చేశారు. బాలీవుడ్ నటీ నటులు, అనుపమ్ ఖేర్, హృతిక్ రోషన్, ప్రియాంకా చోప్రా, కేటీ పెర్రీ, నమ్రత్ కౌర్, అక్షయ్ కుమార్, అలియాభట్, తాప్సీ, క్రిస్ రాక్, నీల్ నితిన్ ముఖేష్ , ప్రాచీ దేశాయ్ తదితరులు ట్విట్టర్ లో తమ సందేశాలను పోస్ట్ చేశారు. ప్రే ఫర్ పారిస్ అంటూ ట్వీట్ చేశారు. Pray for Paris. pic.twitter.com/9scg3W27nD — Chris Rock (@chrisrock) November 14, 2015 Shocking,Appalling and disgusting!!!!! Yes this massacre is truly an attack on ALL humanity! Really praying for some peace in this world! — Alia Bhatt (@aliaa08) November 14, 2015