Crime Data
-
నేరాలు పెరిగి.. ప్రమాదాలు తగ్గి
రాష్ట్రవ్యాప్తంగా కేసుల నమోదులో 8.97 శాతం పెరిగినట్టు తెలంగాణ రాష్ట్ర పోలీస్ వార్షిక నివేదిక 2023 వెల్లడించింది. 2022లో మొత్తం 1,95,582 కేసులు నమోదు కాగా.. 2023లో 2,13,121 కేసులు నమోదైనట్టు నివేదికలో పేర్కొన్నారు. 2022లో 938 జీరో ఎఫ్ఐఆర్లు నమోదుకాగా 2023లో అది 18 శాతం పెరుగుదలతో 1,108కి చేరింది. మహిళలపై నేరాలకు సంబంధించి 2022లో 18,075 కేసులు నమోదు కాగా, 2023లో 5.19 శాతం పెరుగుదలతో 19,013 కేసులు నమోదయ్యాయి. వరకట్న వేధింపుల కేసులు 4.27శాతం పెరిగాయి. ప్రధాన నేరాల నమోదు, పలు రకాల నేరాల సరళి, తదితర అంశాలపై నివేదికలో పేర్కొన్న కీలక అంశాలు ఇలా ఉన్నాయి. – సాక్షి, హైదరాబాద్ 2023లో శిక్షల ఖరారులో 2 శాతం తగ్గుదల ♦ 2023లో మొత్తం అన్ని రకాల కేసులలో కన్విక్షన్ రేట్ 41 శాతం, 2022లో ఇది 43 శాతంగా ఉంది. ♦ 73 రేప్ కేసులలో 84 మంది నిందితులకు యావజ్జీవ ఖైదు. ♦ పోక్సో చట్టం కింద నమోదైన 87 కేసులలో 104 మంది నిందితులకు శిక్ష పడింది. వీరిలో 41 మందికి జీవిత ఖైదు, నలుగురికి 25 ఏళ్ల జైలు, 58 మందికి 20 ఏళ్ల జైలు, ఒకరికి 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. ♦ మహబూబాబాద్ పట్టణంలో దీక్షిత్‌రెడ్డి అనే 9 ఏళ్ల బాలుడిని కిడ్నాప్‌చేసి అనంతరం హత్య చేసిన కేసులో నిందితుడు మందసాగర్‌కు మరణశిక్ష పడింది. అత్యాచారం కేసులు కారణాల వారీగా..: ♦ మొత్తం కేసులు: 2,284 ♦ పెళ్లి పేరుతో మోసం చేసినవి: 1,580 (69.18 శాతం) ♦ పరిచయస్తులు పాల్పడినవి: 307 (13.44 శాతం) ♦ కుటుంబీకులు, బంధువులు చేసినవి: 147 (6.44 శాతం) ♦ గుర్తుతెలియని వ్యక్తులు చేసినవి: 6 (0.26 శాతం) ♦ మిగిలిన కేసులు ఇతర సాంకేతిక అంశాలతో అత్యాచారం కేసుగా నమోదైనవి హత్యలు కారణాల వారీగా...: మొత్తం హత్యలు: 789 కుటుంబ కలహాలతో : 176 (22.31 శాతం) వివాహేతర సంబంధాలతో : 136 (17.24 శాతం) భూ/ఆస్తి వివాదాల కారణంగా: 89 (11.28 శాతం) ప్రేమ వ్యవహారాలతో : 18 (2.28 శాతం) సుపారీ హత్యలు: 8 (1.01 శాతం) పరువు హత్యలు: 2 (0.25 శాతం) మిగిలినవి ఇతర కారణాల వల్ల జరిగినవి, ఇప్పటికీ హతులు, హంతకులు గుర్తించనివి ఉన్నాయి. కిడ్నాప్‌లు కారణాల వారీగా ఇలా.. మొత్తం కిడ్నాప్‌లు : 1,362 ప్రేమ, వివాహేతర సంబంధాలవి : 646 (47.43 శాతం) మైనర్ల మిస్సింగ్వి : 329 (21.15 శాతం) ఆర్థిక వివాదాల వల్ల : 111 (8.14 శాతం) అక్రమ నిర్బంధం : 35 (2.56 శాతం) ప్రతీకారేచ్ఛతో : 26 (1.9 శాతం) డబ్బు కోసం : 09 (0.66 శాతం) మిగిలినవి ఇతర కారణాల వల్ల జరిగినవి. సైబర్ నేరాలపై ఇలా..: ♦ టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అందిన మొత్తం ఫిర్యాదులు – 85,030 ♦ నమోదు చేసిన మొత్తం ఎఫ్ఐఆర్లు – 12,317 ♦ సైబర్ నేరగాళ్లు కొట్టేసిన సొమ్మురూ.707,25,75,547 ♦ పోలీసులు స్తంభింపజేసిన మొత్తం రూ.1,14,72,13,218 ♦ బాధితులకు తిరిగి ఇప్పించిన మొత్తం రూ.7,29,32,546 ♦ అరెస్టుల సంఖ్య 149 మహిళలపై ప్రధాన నేరాలు నమోదు ఇలా ..: అత్యాచారం కేసులు 2,284 వరకట్నం హత్యలు 33 వరకట్న వేధింపులతో మృతులు 132 వరకట్న వేధింపులు 9,458 హత్యలు 213 -
శాంతికి భద్రత.. నేరానికి శిక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. గతంతో పోలిస్తే రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గాయి. హత్యలు, హింసాత్మక ఘటనలు, అవినీతి కేసులు బాగా తగ్గుముఖం పట్టడం ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు తగ్గుతున్నాయని జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్సీఆర్బీ) నివేదిక వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2022లో దేశంలో వివిధ నేరాల గణాంకాలను వెల్లడిస్తూ ఎన్సీఆర్బీ తాజా నివేదికను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రకాల నేరాలు తగ్గడంతోపాటు రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఎన్సీఆర్బీ తాజా నివేదికలోని అంశాలు సంగ్రహంగా.. అన్ని రకాల నేరాల తగ్గుదల రాష్ట్రంలో అన్ని రకాల నేరాలు తగ్గాయి. నేరాలకు పాల్పడితే నమోదు చేసే ఐపీసీ సెక్షన్ల కేసులు, పౌరులు చట్టబద్ధంగా వ్యవహరించేలా చేసేందుకు ప్రత్యేక స్థానిక చట్టాల కింద (స్పెషల్ లోకల్ లాస్ – ఎస్ఎల్ఎల్) నమోదు చేసే (ట్రాఫిక్ ఉల్లంఘన, కోవిడ్ నిబంధనల ఉల్లంఘన వంటివి) కేసులు కూడా తగ్గడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. 2022లో రాష్ట్రంలో మొత్తం 1,95,284 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఐపీసీ సెక్షన్ల కేసులు 1,56,503, ఎస్ఎల్ఎల్ కేసులు 36,737 ఉన్నాయి. గత రెండేళ్లతో పోలిస్తే రాష్ట్రంలో నేరాల సంఖ్య బాగా తగ్గడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో ఐపీసీ నేరాలు 11.72 శాతం, ఎస్ఎల్ఎల్ నేరాలు 13.73 శాతం తగ్గాయి. వెరసి రాష్ట్రం మొత్తం మీద 12.11 శాతం కేసులు తగ్గాయని ఎన్సీఆర్బీ నివేదిక స్పష్టం చేసింది. నేరాలకు పాల్పడేవారికి న్యాయస్థానం ద్వారా శిక్షలు విధించేలా పర్యవేక్షించడంలో పోలీసు శాఖ చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. అందుకోసం సత్వరం చార్జిషీట్లు దాఖలు చేస్తూ దర్యాప్తును వేగవంతం చేస్తోంది. 2022లో ఐపీసీ కేసుల్లో 86.5 శాతం, ఎస్ఎల్ఎల్ కేసుల్లో 96.4 శాతం కేసుల్లో నిర్ణీత వ్యవధి 60 రోజుల్లో చార్జిషీట్లు దాఖలు చేసింది. మొత్తం మీద 88.9 శాతం కేసుల్లో నిర్ణీత వ్యవధిలో చార్జిషీట్లు దాఖలు చేసింది. తగ్గిన హత్యలు అసాంఘిక శక్తుల ఆటకట్టించడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో హత్యలు తగ్గడమే అందుకు నిదర్శనం. 2021లో రాష్ట్రంలో 956 మంది హత్యకు గురికాగా.. ఆ సంఖ్య 2022లో 925కి తగ్గింది. హత్యల రేటు ఉత్తరాది రాష్ట్రాల్లో మూడుశాతనికిపైగా ఉండగా.. తెలంగాణలో 2.5 శాతం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది 1.7 శాతం మాత్రమే. హత్యకేసుల్లో దేశంలో టాప్–20 రాష్ట్రాల జాబితాలో కూడా ఆంధ్రప్రదేశ్ లేదు. ఘర్ణణలు, అల్లర్ల కట్టడి రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు అల్లరిమూకలు చేసే కుట్రలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేస్తోంది. ఘర్షణలు, అల్లర్ల కేసులు గణనీయంగా తగ్గాయి. 2021లో రాష్ట్రంలో 444 ఘర్షణలు, అల్లర్ల కేసులు నమోదు కాగా 2022లో వాటి సంఖ్య 304కు తగ్గడం శాంతిభద్రతల పరిరణక్షలో ప్రభుత్వ చిత్తశుద్ధిని వెల్లడిస్తోంది. అత్యాచారాలు 47.72 శాతం తగ్గుదల, వరకట్న వేధింపుల కట్టడి దిశ యాప్, దిశ వ్యవస్థ వంటి విప్లవాత్మక విధానాలతో మహిళల భద్రత కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలినిస్తున్నాయి. రాష్ట్రంలో మహిళలపై వేధింపులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ప్రధానంగా అత్యాచారాలు, వరకట్న వేధింపుల కేసులు తగ్గడం దీనికి నిదర్శనం. 2021లో రాష్ట్రంలో 1,188 అత్యాచారాల కేసులు నమోదు కాగా 2022లో 621 కేసులు నమోదయ్యాయి. అత్యాచారాల కేసులు దేశంలోకెల్లా అత్యధికంగా రాష్ట్రంలో 47.72 శాతం తగ్గడం ప్రభుత్వం సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. ఇక 2021లో రాష్ట్రంలో 111 వరకట్న కేసులు నమోదు కాగా 2022లో వందకు తగ్గాయి. వరకట్న కేసుల రేటు కేవలం 0.4 శాతానికే పరిమితమైంది. ఇక యాసిడ్ దాడుల కేసులు 2021లో ఏడు నమోదు కాగా 2022కు అవి నాలుగుకు తగ్గాయి. తగ్గిన రైతుల ఆత్మహత్యలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని మరోసారి నిరూపించుకుంది. రైతు సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు విజయవంతమవుతున్నాయి. సాగు లాభసాటిగా మారడంతో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. 2021లో రాష్ట్రంలో 481 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో భూయజమానులైన రైతులు 359 మంది, కౌలురైతులు 122 మంది ఉన్నారు. 2022లో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు 369కి తగ్గాయి. వారిలో భూయజమానులైన రైతులు 309 మంది, కౌలురైతులు 60 మంది ఉన్నారు. 2021లో 584 మంది వ్యవసాయ కూలీలు ఇతరత్రా కారణాలతో ఆత్మహత్య చేసుకోగా.. 2022లో వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు 548కి తగ్గాయి. మొత్తం మీద వ్యవసాయంపై ప్రత్యక్షంగా ఆధారపడేవారు 2021లో 1,065 మంది ఆత్మహత్య చేసుకోగా.. 2022లో ఆ సంఖ్య 917కు తగ్గింది. -
వ్యభిచారాన్ని మళ్లీ నేరంగా పరిగణించాలి: ఎంపీ ప్యానెల్
ఢిల్లీ: కొత్త నేర న్యాయ బిల్లులపై సమీక్ష చేపట్టిన పార్లమెంటరీ ప్యానెల్.. కీలక సవరణలు చేసింది. సుప్రీంకోర్టు కొట్టేసిన సెక్షన్ 497(వ్యభిచారం)ని మళ్లీ నేరంగా పరిగణించాలని అంటోంది. వివాహ వ్వవస్థ పవిత్రమైనది దానిని పరిరక్షించాలని పేర్కొంటూ భారతీయ న్యాయ సంహిత బిల్లులపై తన రిపోర్టును కేంద్రానికి సమర్ఫించింది. ప్రతిపాదిత సవరణలో లింగ-తటస్థ (gender-neutral ) నేరంగా పరిగణించాలని నివేదికలో పేర్కొంది. ఈ కేసుల్లో పురుషుడు, మహిళ సమాన బాధ్యత వహించాలని పిలుపునిచ్చింది. భారతీయ న్యాయ సంహితపై తదుపరి పరిశీలన కోసం బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదికను ఒక వేళ పార్లమెంట్ ఆమోదం తెలిపితే.. వివాహేతర సంబంధాలపై 2018 నాటి సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పును పక్కకు పెట్టినట్లవుతుంది. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు.. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో.. భారతీయ న్యాయ సంహిత- 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత- 2023, భారతీయ సాక్ష్య బిల్లు- 2023 లను కేంద్రం తేనుంది. వీటిని పార్లమెంట్లో ప్రవేశపెట్టి.. తదుపరి పరిశీలన కోసం బీజెపి ఎంపీ బ్రిజ్ లాల్ నేతృత్వంలోని హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీకి ఆగస్టులో పంపారు. సుప్రీం తీర్పు.. వివాహేతర సంబంధం నేరం కాదంటూ 2018 సెప్టెంబర్‌లో తీర్పు ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం. ఓ ప్రవాస భారతీయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. వ్యభిచారం నేరంగా పేర్కొంటున్న ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ‘‘మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న సెక్షన్ 497కు కాలం చెల్లింది, అది రాజ్యాంగ విరుద్ధం’’ అని ప్రకటించింది. ఇదీ చదవండి: 377, 497 సెక్షన్లు మళ్లీనా?.. భారతీయ న్యాయ సంహిత బిల్లులో సవరణలతో చేర్చే ప్రతిపాదన! -
ప్రపంచంలోనే అత్యంత ఘరానా మోసం.. అమెరికా సర్కార్కే షాక్!
ప్రపంచంలో జరిగే మోసాలకు అంతేలేకుండా పోతోంది. అమెరికాలో కరోనా కాలంలో జరిగిన ఒక మోసాన్ని అత్యంత ఘరానా మోసంగా చెబుతుంటారు. పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం(పీపీపీ) లోన్ సిస్టమ్‌ను ఆధారంగా చేసుకుని $200 బిలియన్లను దక్కించుకుని, దానితో లంబోర్ఘినిలు, వెకేషన్ హోమ్‌లు, ప్రైవేట్ జెట్ ఫ్లైట్లు, కార్టియర్ ఆభరణాలు కొనుగోలు చేసి, వేలాది మంది మోసగాళ్లు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు. మహమ్మారి సమయంలో అందించిన కోవిడ్ లోన్ స్కీమ్‌ను వారు అక్రమంగా దక్కించుకుని అవినీతికి పాల్పడ్డారు $200 బిలియన్ల మేరకు ఫ్రాడ్ 2020,2021లో అమెరికా ప్రభుత్వం దాదాపు $1.2 ట్రిలియన్ మొత్తాన్ని వివిధ వ్యాపారాల కోసం కోవిడ్ బెయిలౌట్ నగదు కింద కేటాయించింది. ఆర్థిక విపత్తు లోన్ ప్రోగ్రామ్ (ఈఐడీఎల్పీ), పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ (పీపీపీ) స్కీమ్‌ల కోసం ఈ నిధులను ఖర్చు చేశారు. అయితే దీనికి సంబంధించిన స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ జనరల్(ఎస్బీఏ) నుండి వచ్చిన ఒక నివేదిక ఆశ్చర్యపరిచే విధంగా ఉంది. దీనిలో 17% నిధులు దుర్వినియోగం అయ్యాయని తేలింది. అంటే 200 బిలియన్ డాలర్ల (దాదాపు 16 లక్షల 40 వేల కోట్లు) మేరకు ఫ్రాడ్ జరిగింది. అక్రమంగా మిలియన్ల డాలర్ల లోన్ తీసుకుని.. ఈ మోసపూరిత వ్యవహారంలో 90,000కు మించిన యాక్టివ్ లీడ్లు ఉన్నాయని ఎస్బీఏ అంచనా వేసింది. ఈ ఉదంతంలో ఎస్బీఏ ఇప్పటికే మాజీ న్యూయార్క్ జెట్స్ వైడ్ రిసీవర్, జోష్ బెల్లామీతో సహా పలువురిని విచారణ చేసింది. ఈ జాబితాలో మాన్హాటన్ థీమ్ రెస్టారెంట్ జెకిల్ అండ్ హైడ్ యజమాని డోనాల్డ్ ఫిన్లీ ఉన్నారు. ఈయన పీపీపీ,ఈఐడీఎల్పీ సాయంతో మిలియన్ల డాలర్ల లోన్ తీసుకుని వాటర్‌ఫ్రంట్ వీక్షణ కలిగిన డయోనిస్ బీచ్‌లో నాన్టుకెట్ ఇంటిని కొనుగోలు చేశాడు. ప్రస్తుతం మాన్హాటన్ థీమ్ రెస్టారెంట్ జెకిల్ అండ్ హైడ్ మూతబడింది. ఈ ఘరానా మోసానికి పాల్పడిన ఫిన్లీ 30 సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కొననున్నాడు. అలాగే $3.2 మిలియన్ల మొత్తాన్ని తిరిగి చెల్లించవలసి ఉంటుంది. దీనికితోడు ఆయనపై $1.25 మిలియన్ల మేరకు జరిమానా కూడా విధించారు. మే 2023 నాటికి మొత్తం 803 అరెస్టులు అక్రమంగా నగదును పొందేందుకు మోసగాళ్లు నకిలీ వ్యాపారాలను సృష్టించారని లేదా వారి ఉద్యోగుల సంఖ్య గురించి అబద్ధాలు చెప్పారని లెక్సిస్ నెక్సిస్ రిస్క్ సొల్యూషన్స్ ప్రతినిధి హేవుడ్ టాల్కోవ్ ది పోస్ట్‌కు తెలిపారు. మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో రోల్స్ రాయిస్ లేదా హై-ఎండ్ మెర్సిడెస్ వంటి కార్లను కొనుగోలు చేయడం చాలా కష్టమని భావించిన ఈ మోసగాళ్లు పీపీపీ ప్రోగ్రాంను అక్రమంగా వినియోగించుకున్నారని మరో అధికారి టాల్కోవ్ చెప్పారు.మహమ్మారి కాలంలో జరిగిన ఈ మోసానికి సంబంధించి మే 2023 నాటికి మొత్తం 803 అరెస్టులు జరిగాయని ఎస్బీఏ తెలిపింది. ఇది కూడా చదవండి: గూగుల్ మ్యాప్‌ను వినియోగిస్తూ.. ఆ గొంతు తెలియదంటే ఎలా? అత్యంత ఖరీదైన కార్ల కొనుగోలుకు.. పీపీపీ ప్రోగ్రాంను ఫ్లోరిడాకు చెందిన డేవిడ్ హైన్స్(29) అక్రమంగా వినియోగించుకుని $3.9 మిలియన్ల మొత్తాన్ని పొంది, అత్యంత విలువైన లంబోర్ఘిని హురాకాన్ ఎవో స్పోర్ట్స్ కారును కొనుగోలు చేశాడు. అధికారులు ఇతని దగ్గర నుంచి స్పోర్ట్స్ కారును స్వాధీనం చేసుకోవడంతోపాటు, అతని బ్యాంకు ఖాతాల నుండి $3.4 మిలియన్ల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారుల ముందు హైన్స్ తన నేరాన్ని అంగీకరించాడు. అతను హై-ఎండ్ దుకాణాలు, మయామి హోటల్లో అత్యధికంగా నిధులు ఖర్చుపెట్టాడు. తల్లికి $30,000 పన్నుచెల్లింపుదారుల నగదును పంపినట్లు అతని రికార్డులు చూపిస్తున్నాయి. ఫెడరల్ జైలులో గరిష్టంగా 30 సంవత్సరాల పెనాల్టీ జాక్సన్విల్లే తన ఇంటి, వ్యాపార ఆస్తి తనఖాను చెల్లించడానికి మొత్తం $910,000 పీపీపీ నిధులను అక్రమంగా ఉపయోగించాడు. ఆ తర్వాత తన నేరాన్ని అంగీకరించారు. జాక్సన్విల్లే ఈ నిధులతో 18-క్యారెట్ బంగారు రోలెక్స్ వాచ్, పాతకాలపు జాగ్వార్ ఎక్స్‌కే-ఈ, ఈ-టైప్, రోడ్‌స్టర్‌ను కొనుగోలు చేశాడు. అతను అందుకున్న పీపీపీ రుణాల ఆధారంగా నగదు ఉపసంహరణ ద్వారా $113,000 మొత్తాన్ని అందుకున్నాడు. కాగా ల్యాండర్లు ఫెడరల్ జైలులో గరిష్టంగా 30 సంవత్సరాల పెనాల్టీని ఎదుర్కొనబోతున్నారు. జార్జియాకు చెందిన డారెల్ థామస్‌కు పీపీపీ నిధులను వినియోగించి మెర్సిడీస్ బెంజ్ ఎస్-క్లాస్, ఒక ల్యాండ్ రోవర్,ఒక గోల్డ్ రోలెక్స్‌తో పాటు అకురా ఎన్ఎస్ఎక్స్ కోసం ఖర్చు చేసినందుకు 15 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. డిజైనర్ నగలు, దుస్తుల కోసం ఖర్చు చేసి.. పీపీపీ నుండి $11.1 మిలియన్లు దక్కించుకునేందుకు 14 మోసపూరిత రుణాలను పొందానని బ్యాంకును మోసగించానని, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డానని థామస్ నేరాన్ని అంగీకరించాడు. ఇదేవిధంగా రెస్టారెంట్ స్కామర్ మాన్‌హట్టన్ తన రెస్టారేటర్ బెసిమ్ కుకాజ్ రెస్టారెంట్ గ్రూప్ కోసం బోగస్ లోన్ల పేరిట $6.1 మిలియన్లను మోసగించినట్లు వెల్లడైంది. అతను నిర్వహిస్తున్న ఇంటర్మెజో, లిమోన్ జంగిల్, కారా మియాలు ఇప్పుడు మూతబడ్డాయి. మాన్‌హట్టన్ డిజైనర్ నగలు, దుస్తుల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేసినట్లు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: వీరు విమాన ప్రయాణికులేనా.. పెరుగుతున్న ఫిర్యాదుల పరంపర బెయిల్‌పై విడుదలైన తర్వాత కూడా.. మాన్‌హట్టన్ అత్యాశతోనే ఇదంతా చేశాడని, ఈ డబ్బులో కొంత భాగాన్ని ఫ్లోరిడా రియల్ ఎస్టేట్ డెవలపర్‌కు పంపాడు. కార్టియర్, హ్యూగో బాస్ నుండి విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఉపయోగించాడని న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ న్యాయవాది డామియన్ విలియమ్స్ అన్నారు. ఈ మోసగాడు అరెస్టు అయి, బెయిల్‌పై విడుదలైన తర్వాత కూడా మహమ్మారి సహాయాన్ని అందుకున్నాడని ప్రాసిక్యూటర్ చెప్పారు. ఈ నేపధ్యంలో ఆయన న్యూజెర్సీలోని ఫోర్ట్ డిక్స్ ఫెడరల్ జైలులో ఆరు సంవత్సరాల ఎనిమిది నెలల శిక్షను అనుభవిస్తున్నాడు. విలాసవంతమైన ప్రయాణాల కోసం.. ప్లాస్టిక్ సర్జరీతో పాటు విలాసవంతమైన ప్రయాణం చేసేందుకు టేనస్సీలోని సర్గోయిన్స్విల్లేకు చెందిన లెస్లీ బెథియా, 2021లో మోసపూరితంగా $20,805 రుణం పొందింది. ఈ నేపధ్యంలో ఆమెకు 78 నెలల జైలు శిక్ష విధించారు. ఫ్లోరిడాలోని సన్నీ ఐల్స్ బీచ్‌లోని ఒక రిసార్ట్‌లో ఐదు రోజులు గడిపేందుకు ఆమె స్కామ్ చేసిన నగదును ఉపయోగించింది. ఆమె తన ఈ పర్యటనలో ప్లాస్టిక్ సర్జరీకి చెల్లించడానికి కూడా పెద్ద మొత్తంలో చెల్లింపులు చేసింది. ఇదేవిధంగా హ్యూస్టన్‌కు చెందిన స్కాట్ జాక్సన్ డేవిస్‌ను ఈ కేసులో జైలుకు తరలించారు. అతను మూడు నకిలీ వ్యాపారాల కోసం పీపీపీ రుణాలను మోసపూరితంగా అందుకున్నాడు. అతను $3.3 మిలియన్లను తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. తప్పుడు పత్రాలు, తప్పుడు సమాచారంతో.. మాజీ ఎన్ఎఫ్ఎల్ ఆటగాడు జోష్ బెల్లామీ తప్పుడు పత్రాలు, తప్పుడు సమాచారాన్ని ఉపయోగించి 2021లో తన కంపెనీ డ్రిప్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్సీ కోసం $1.2 మిలియన్ రుణాన్ని అక్రమంగా పొందాడు. బెల్లామీ ఈ మొత్తాన్ని నగల కొనుగోలుతో పాటు సెమినోల్ హార్డ్ రాక్ హోటల్, క్యాసినోలో బస చేయడానికి ఉపయోగించినట్లు అంగీకరించాడు. ఈ నేరంలో సహ-కుట్రదారుకు $311,000కు మించిన మొత్తాన్ని ఖర్చు చేశాడని విచారణతో తేలింది. పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అంటే.. పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ (పీపీపీ) అనేది 2020లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టిన పథకం. ఇది కరోనావైరస్ ఎయిడ్, రిలీఫ్, ఎకనామిక్ సెక్యూరిటీ యాక్ట్ (కేర్స్ యాక్ట్) ద్వారా కొన్ని వ్యాపారాలకు సహాయం అందించేందుకు ఏర్పాటుచేసిన $953-బిలియన్ల విలువైన వ్యాపార రుణ కార్యక్రమం. పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్.. సంస్థాగత ఖర్చులు చెల్లించడానికి తక్కువ వడ్డీతో కూడిన రుణాల కోసం వివిధ కంపెనీలకు అనుమతి కల్పిస్తుంది. పీపీపీ లోన్ అనేది దరఖాస్తుదారు చెల్లించే సగటు నెలవారీ పేరోల్ ఖర్చుల కంటే దాదాపు 2.5 రెట్లు అధికంగా ఉంటుంది. దీనిలో కొన్నిసార్లు దరఖాస్తుదారు సాధారణంగా మొదటి డ్రాతో సమానంగా రెండవ డ్రాను కూడా అందుకోవచ్చు. ఈ రుణం పేరోల్ ఖర్చులు, అద్దె, వడ్డీ, యుటిలిటీలను కవర్ చేయడానికి అందిస్తారు. ఇది కూడా చదవండి: ఎరక్కపోయి వచ్చి ఎలుగుబంటి కంట్లో పడ్డాం.. పరుగో పరుగు -
నేరాలను తగ్గించేలా.. సరికొత్త అత్యాధునిక జైలు
జైలు అనగానే సినిమాలే గుర్తోస్తాయి. వాటిల్లో చూపించనంత అందంగా ఏమి ఉండవు. కానీ ఇప్పుడూ ఆ జైళ్లనే ఖైదీలలో పరివర్తన వచ్చేలా గొప్ప కేంద్రాలుగా మారుస్తున్నారు. అలాగే వారి శిక్షకాలం పూర్తి చేసుకున్న తదుపరి హాయిగా జీవించేలా నైపుణ్యాలు సంపాదించుకునేలా చేసేందుకు శ్రీకారం చుట్టింది బ్రిటన్ ప్రభుత్వం. మరోసారి ఎటువంటి నేరాలకు దిగకుండా ఉండి, వారి భవిష్యత్తును వారంతట వారే తీర్చిదిద్దకునేలా చేస్తున్నారు అక్కడి అధికారులు. అందుకోసం అని "హెచ్ఎంపీ ఫోస్సే వే" అనే పేరుతో అత్యాధునికి జైలుని నిర్మిస్తున్నారు. ఇందులో దగ్గర దగ్గరగా దాదాపు వెయ్యిమందికి పైగా అంటే 1,715 మంది దాక ఖైదీలు ఉండేంత స్థలం ఉంటుంది. ఖైదీలకు పునరావసం కల్పించడం తోపాటుగా ఆర్థిక వ్యవస్థను పెంచడంలో సహాయపడేందుకు ఈ కొత్త జైలుని ప్రారంభించారు. ఈ కొత్త జైలు నిర్మాణంలో 71 మంది ఖైదీలు, ఇద్దరు మాజీ నేరస్తులు పనిచేయాలనే ఒక నిబంధన కూడా ఉంది. ఇక్కడ మొత్తం 24 వర్కషాప్‌లు ఉంటాయి. నేరస్తులు ఇక్కడ నిర్మాణ వాహనాలను ఎలా నడపాలి, అద్దాలను ఎలా తయారు చేయాలి, జైలు నిర్మాణానికి సంబంధించి కాంక్రీట్ విభాగాలు, లైటింగ్ పరికరాలు తదితరాలకు సంబంధించిన పనులు నేర్చుకుంటారు. ఇప్పటి వరకు బ్రిటన్‌లో ఉన్న ఆరు అత్యాధునికి జైళ్లలో ఇది రెండోది. ఈ జైలుని.. చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించారు. అలాగే యూకేలో ఇప్పటి వరకు నిర్మించిన పచ్చటి జైలు కూడా అదే. బ్రిటన్ ప్రభుత్వం ప్రజలకు వాగ్దానం చేసిన నాలుగు బిలియన్ పౌండ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈ అత్యాధునిక జైలుని నిర్మించింది. అలాగే ఖైదీలు తమ శిక్ష కాలం పూర్తి అయిన వెంటనే ఉపాధిని వెతుక్కోవడం ఈజీ అవ్వడమే గాక సమాజంలో ఎలాంటి ఢోకా లేకుండా ధైర్యంగా బతకగలగుతారని చెబుతున్నారు బ్రిటన్ అధికారులు. (చదవండి: యమహానగరీ..నీటిలో తేలియాడే నగరం) -
నిసిగ్గుగా చందబ్రాబు, లోకేష్ శవ రాజకీయాలు.. ఇదీ అసలు వాస్తవం..
సాక్షి, అమరావతి: రాజకీయంగా ఉనికిని కోల్పోతున్న తమ పార్టీని బతికించుకునేందుకు టీడీపీ దిగజారి వ్యవహరిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మృతిపై చంద్రబాబు, లోకేష్ నిసిగ్గుగా శవరాజకీయాలకు తెరలేపారు. ఆ యువకుడి మృతికి వైఎస్సార్సీపీ నేతల ప్రమేయం ఉందంటూ అసత్య ఆరోపణలు చేస్తూ.. ఆత్మహత్యకు లింకు పెట్టే కుట్రకు బీజం వేశారు. అసలేం జరిగింది? తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్యాం.. జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలంటే ప్రాణం. వయస్సు 23 సంవత్సరాలు. శ్యామ్ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని కొప్పిగుంట గ్రామం. ఇటీవల చింతలూరు గ్రామానికి వెళ్లిన శ్యామ్ అక్కడే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు. తన అభిమాని శ్యాం మరణించినందుకు జూనియర్ ఎన్టీఆర్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తెర లేచిన శవరాజకీయం ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. తెలుగుదేశం, జనసేన రకరకాల కుట్రలు చేస్తున్నాయి. ఎక్కడ లేని క్రైం అంతా ఏపీలోనే జరుగుతున్నట్టు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా.. ఏది జరగకపోయినా.. దాన్ని అధికార పార్టీపై రుద్ది రాజకీయ లబ్ది పొందాలన్నది టిడిపి కుట్రగా మారింది. ఏ క్రైం జరిగినా.. దానికి YSRCPకి అంటగట్టే ప్రయత్నం జరుగుతోంది. తాజాగా శ్యామ్ చనిపోయాడని తెలియగానే.. తెలుగుదేశం రంగంలోకి దిగింది. ఒక వ్యక్తి బాధతో, వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటే.. దాన్ని అడ్డం పెట్టుకుని శవరాజకీయాలు చేయడానికి ఏకంగా చంద్రబాబు, లోకేష్ రంగంలోకి దిగారు. చంద్రబాబు నిర్వాకం ఇది శ్యాం మరణం వార్త తెలియగానే, చంద్రబాబు దానికి రాజకీయ రంగు పులిమేశారు. ఇది వైఎస్సార్ సిపి పనేనంటూ నిందలు మోపారు. Deeply saddened by the tragic and untimely demise of Shyam in Chintaluru, EG District. The suspicious circumstances surrounding his death are alarming. I strongly urge for a thorough investigation into this matter, ensuring justice is served. It has been alleged that YSRCP… pic.twitter.com/55bpR9cgvR — N Chandrababu Naidu (@ncbn) June 27, 2023 తానా.. తందానా.. తనయుడి కూత ఇది తండ్రి చంద్రబాబు బాటలోనే లోకేష్ నడిచారు. వెంటనే ఓ ట్వీటేశాడు. తన ఆస్థాన విద్వాంసులు రాసిచ్చిన నాలుగు వ్యాఖ్యలను జోడించారు. Pained to learn about the suspicious death of unemployed youngster Shyam. Deepest condolences to his family & friends. A thorough investigation without any bias is needed, even if it involves YCP leaders as alleged by locals. We will fight until justice is delivered to Shyam… pic.twitter.com/C8OvdExVWD — Lokesh Nara (@naralokesh) June 27, 2023 తెలుగుదేశం శవరాజకీయం శ్యాం మృతిపై తీవ్ర ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులు తమకు శ్యాం పంపించిన వీడియోలను పోలీసులకు అందించారు. శ్యాం ఆత్మహత్య చేసుకునేముందు ఏం జరిగిందన్నది ఈ వీడియోల్లో స్పష్టంగా ఉంది. శవాన్ని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం తండ్రీ కొడుకులు రాజకీయాలు చేయడంతో వైఎస్సార్సీపీ స్పందించింది. ఇది ఎన్నికల సమయం, రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి కొంత మంది రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులు అని చెప్పుకునే నటులు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి విష ప్రచారాలు భవిష్యత్తులో ఇంకా చాలా చేస్తారు. రాష్ట్ర ప్రజలు గమనించాలంటూ వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది. YSRCP ఏం చెప్పింది? సుసైడ్ చేసుకోబోయే ముందు శ్యామ్ మాట్లాడిన వీడియో! శ్యామ్ ఆత్మ కి శాంతి చేకూరాలి, ఈ విషాధ సమయంలో శ్యామ్ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి మరియు శ్యామ్ తోటి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరికి మా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాం 🙏🏻 శ్యామ్ కుటుంబ సభ్యులకి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా… pic.twitter.com/DANeXVEgCm — YSR Congress Party (@YSRCParty) June 27, 2023 ఎన్టీఆర్ అభిమాని మృతిని టీడీపీ అవకాశంగా తీసుకుని నీచ రాజకీయాలు చేస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ తన అభిమాని మరణం పట్ల గౌరవంగా, పద్ధతిగా సానుభూతి తెలిపారు. శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన అని, ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసు మనసు కలచివేస్తోందని, ప్రభుత్వం దీనిపై తక్షణమే దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
తెలంగాణలో పెరిగిన క్రైమ్ రేట్.. గతేడాదితో పోలిస్తే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో క్రైమ్ రేట్ పెరిగిందని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే 4.44 శాతం క్రైం రేట్ పెరిగిందన్నారు. సైబర్ క్రైమ్ కేసులు 57 శాతం పెరిగాయి. 2022 లో రాష్ట్ర వ్యాప్తంగా 3 ఎన్కౌంటర్లు జరగాయని, ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారన్నారు. 120 మంది మావోయిస్టులు లొంగిపోగా, వారి నుంచి 14 ఆయుధాలు, 12 లక్షల 65 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని డీజీపీ వివరించారు. ‘‘కన్విక్షన్ రేట్ 50 నుండి 56 శాతానికి పెరిగింది. 152 మందికి జీవితకాలం శిక్ష పడింది. సీసీ కెమెరాలు ద్వారా 18,234 కేసులు ఛేదించాం. 431 మంది పై పీడీ యాక్ట్ పెట్టి జైలు పంపించాం. రాష్ట్ర వ్యాప్తంగా షీ టీమ్స్‌కి 6,157 ఫిర్యాదులు వచ్చాయి.. వీటిలో 2,128 కేసులు నమోదు చేశాం. డయల్ 100 కి 13 లక్షల 77 వేళా 113 కాల్స్ వచ్చాయి. ఫింగర్ ప్రింట్స్ ద్వారా 420 కేసులను ఛేదించాం’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ ఏడాది 762 హత్యకేసులు నమోదయ్యాయి. 2,126 అత్యాచార కేసులు నమోదయ్యాయి. 1176 డ్రగ్ కేసులు నమోదవ్వగా 2582 నిందితులను అరెస్ట్ చేశాం. మహిళలపై క్రైమ్ కేసులు 17,908 నమోదయ్యాయి. 2432 పొక్సో కేసులు నమోదు. 2022లో 24,127 దోపిడీ కేసులు నమోదయ్యాయి. 148 కోట్ల దోపిడీ జరగగా 74 కోట్లు రికవరీ చేశాం. 19,456 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 6,746 మంది ప్రాణాలు కోల్పోయారు. మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఒక కోటి 65 లక్షల 84 వేల కేసులు నమోదు చేశాం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 612 కోట్ల రూపాయల జరిమానాలు వేశాం. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల 25 వేల సీసీ కెమెరాలున్నాయి. ఈ సంవత్సరం లక్షా 75 వేల కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం’’ అని డీజీపీ వెల్లడించారు. -
తగ్గిన నేరాలు..పెరిగిన భద్రత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసు శాఖ నేరాలను నియంత్రించి శాంతిభద్రతలను సమర్థంగా పరిరక్షిస్తోందని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. వినూత్న పోలీసింగ్ విధానాలతో 2022లో అన్ని రకాల నేరాలు తగ్గడంతో పాటు ప్రజలకు మెరుగైన భద్రతను అందించగలిగామని తెలిపారు. ఆయన బుధవారం మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర పోలీసు శాఖ వార్షిక నివేదిక – 2022ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. గంజాయి, అక్రమ మద్యం దందాను సమర్థంగా కట్టడి చేశామన్నారు. అసాంఘిక శక్తులపై నిఘా, పీడీ యాక్ట్ ప్రయోగం, తక్షణ అరెస్టులతో రాష్ట్రంలో హత్యలు, ఘర్షణలను నియంత్రించినట్లు తెలిపారు. గ్రామాల సందర్శన, అవగాహన కార్యక్రమాలతో ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలు, దాడులను గణనీయంగా తగ్గించామన్నారు. దిశ వ్యవస్థను పటిష్టంగా అమలు చేశామన్నారు. నేర ప్రభావిత ప్రదేశాల జియో మ్యాపింగ్, మహిళా పోలీసుల పర్యవేక్షణ తదితర చర్యలతో మహిళా భద్రతను పటిష్టం చేసినట్లు చెప్పారు. రోడ్లపై బ్లాక్ స్పాట్లు గుర్తించడం, ఇతరత్రా చర్యలతో రోడ్డు ప్రమాదాలను తగ్గించామన్నారు. లోన్ యాప్ వేధింపులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్ర పోలీసు శాఖ జాతీయ స్థాయిలో 36 అవార్డులు సాధించిందని చెప్పారు. 420 ఎస్సై పోస్టులు, 6,100 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. కానిస్టేబుల్ పోస్టుల్లో హోంగార్డులకు తొలిసారిగా రిజర్వేషన్ కల్పించామన్నారు. కొత్తగా నాలుగు ఐఆర్ బెటాలియన్లు మంజూరయ్యాయని అన్నారు. 2023లో కూడా సమర్థ పోలీసింగ్‌తో శాంతిభద్రతలను పరిరక్షిస్తామని చెప్పారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించిన ప్రధానాంశాలు ఇవీ... ► 2020లో రాష్ట్రంలో 2,92,565 కేసులు, 2021లో 2,84,753 కేసులు నమోదు కాగా 2022లో కేసులు 2,31,359కి తగ్గాయి. గత సంవత్సరంతో కలిపి పెండింగ్ కేసులు 3,77,584 ఉండగా, 2,66,394 కేసుల దర్యాప్తు పూర్తయింది. దీంతో పెండింగ్ కేసుల సంఖ్య 1,11,190కి తగ్గింది. 96 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే చార్జిషీట్లు దాఖలు చేశారు. నేరాలకు శిక్షలు 66.69 శాతానికి పెరిగాయి. 2020లో 21 పోక్సో కేసుల్లో శిక్షలు పడగా, 2022లో ఆరు నెలల్లోనే 90 కేసుల్లో శిక్షలు పడ్డాయి. 42 కేసుల్లో జీవిత ఖైదు పడటం గమనార్హం. రాష్ట్రంలో 2021లో 945 హత్య కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 857కు తగ్గాయి. రోడ్డు ప్రమాదాలు 2021లో 19,203 జరగ్గా 2022లో 18,739కు తగ్గాయి. ► లైంగిక దాడి కేసులు 2021లో 1,456 నమోదు కాగా, ఈ ఏడాది 1,419 నమోదయ్యాయి. పోలీసులు చేపట్టిన అవగాహన కార్యక్రమాలతో మహిళలు ధైర్యంగా ఫిర్యాదులు చేస్తున్నారు. దాంతో కేసుల సంఖ్య పెరిగింది. మహిళలపై వేధింపుల్లో 2021లో 10,373 కేసులు నమోదు కాగా 2022లో 11,895 నమోదయ్యాయి. ► దిశ యాప్‌ను 1,37,54,267 మంది డౌన్లోడ్ చేసుకోగా, 1,11,08,227 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2022లో దిశ యాప్ వినతుల్లో 17,933 కేసుల్లో తక్షణ చర్యలు తీసుకుని 1,585 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ► ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారం కేసులు 2021లో 231 నమోదు కాగా, 2022లో 205కు తగ్గాయి. దాడులపై 2021లో 606 నమోదవగా 2022లో 585 నమోదయ్యాయి. ► అక్రమ మద్యం, నాటుసారాపై మొత్తం 37,189 కేసులు నమోదు చేసి 28,803 మందిని అరెస్టు చేశారు. 169 మందిపై పీడీ యాక్ట్ అమలు చేశారు. 2,093 గ్రామాలను నాటు సారా లేని గ్రామాలుగా ప్రకటించారు. కేవలం 103 గ్రామాలు మాత్రమే నాటు సారా లేని గ్రామాలుగా ప్రకటించాల్సి ఉంది. నాటుసారా తయారీపైనే ఆధారపడుతున్న 1,363 కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించారు. ► ఆపరేషన్ పరివర్తన్ ద్వారా 7119.85 ఎకరాల్లో గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. కేవలం ఐదు రోజుల్లో 720 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2,45,000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 70 శాతం ఒడిశా నుంచి తరలిస్తున్నదే. -
ఏపీలో ఈ ఏడాది భారీగా తగ్గిన క్రైం రేట్
సాక్షి, విజయవాడ: ఏపీలో క్రైమ్ రేటు తగ్గిందని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మెరుగైన పోలీసింగ్‌తో నేరాలు తగ్గించగలిగామన్నారు. లోక్ అదాలత్ ద్వారా పెద్ద ఎత్తున కేసులు పరిష్కరిస్తున్నాం. 1.08 లక్షల కేసులు పరిష్కరించాం. చోరీ కేసుల్లో రికవరీ శాతం బాగా పెరిగిందని డీజీపీ పేర్కొన్నారు. ‘‘గతేడాది 2,84,753 కేసులు నమోదు కాగా, 2022లో 2,31,359 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 2021లో 945 హత్య కేసులు నమోదు కాగా, 2022లో 857 హత్య కేసులు మాత్రమే నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాలు 2021లో 19,203 జరగగా 2022 లో 18739 ప్రమాదాలు జరిగాయి. బ్లాక్ స్పాట్ లను గుర్తించి నివారణా చర్యలు చేపట్టాం. కన్విక్షన్ బేస్ పోలింగ్ విధానాన్ని ఈ సంవత్సరం జూన్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నాం. ఈ విధానం ద్వారా ప్రతి ఒక్క యూనిట్ అధికారి సీపీ/ ఎస్పీ తమ పరిధిలోని అత్యంత ముఖ్యమైన ఐదు కేసులు(మహిళలకు సంబంధించిన కేసులకు మొదటి ప్రాధాన్యత) పర్యవేక్షణ చేస్తారు’’ అని డీజీపీ వివరించారు. ‘‘ప్రతి రోజు షెడ్యూల్ మేరకు కోర్టులో జరుగుతున్న కేసు ట్రైల్ పురోగతిపై సమీక్ష నిర్వహించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేశాం ఈ విధానం ద్వారా కేసు ట్రైల్ సమయాన్ని తగ్గించి స్వల్పకాల వ్యవధిలోనే నేరస్తులకు శిక్ష పడేవిధంగా చేయొచ్చు. అంతేకాకుండా ఏ ఒక్క నేరస్థుడు తప్పించుకోకుండా చూడటం ముఖ్య ఉద్దేశం’’ అని రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. చదవండి: కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం యనమల.. ఆ లీకుల వెనుక అసలు వ్యూహం ఇదే.. -
తెలంగాణలో భారీగా పెరిగిన క్రైం రేటు.. దేశంలోనే నెం.1
న్యూఢిల్లీ: 2021లో తెలంగాణలో క్రైం రేటు విపరీతంగా పెరిగింది. అంతేకాదు మహిళలపై దాడులు, చిన్నారులపై లైంగిక వేధింపులు సైతం భారీగా పెరిగాయి. సైబర్ నేరాల్లోనూ తెలంగాణ దేశంలోనే తొలిస్థానలో ఉందని జాతీయ నేర గణాంక సంస్థ వెల్లడించింది. ఈ మేరకు జాతీయ నేర గణాంక సంస్థ 2021 నివేదిక ప్రకటించింది. దీని ప్రకారం మానవ అక్రమ రవాణా, ఆహార కల్తీ కేసుల్లోనూ తెలంగాణ మళ్లీ టాప్‌గా నిలిచింది. ఇక రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది 2019లో 2,691 సైబర్ నేరాలు నమోదవ్వగా. .2020లో ఈసంఖ్య 5,024కు చేరింది. కాగా 2021లో సైబర్ నేరాలు 200 శాతం పెరిగి ఏకంగా 10,303కు చేరాయి. దేశ వ్యాప్తంగా 52, 430 సైబర్ నేరాల కేసులు వెలుగు చూస్తే అత్యధికంగా తెలంగాణలోనే 20 శాతం నమోదవుతున్నాయి. సైబర్ నేరాల్లో 8, 829 కేసులతో ఉత్తర ప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఇక తెలంగాణలో ఆర్థిక నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. 2019లో 11, 465.. 2020లో 12.985..కేసులు నమోదయితే 2021లో ఏకంగా 20,759 కేసులు వచ్చాయి. 23, 757 ఆర్థిక నేరాల కేసులతో రాజస్థాన్ అగ్ర స్థానంలో ఉంది. వృద్ధులపై దాడుల్లో తెలంగాణ మూడు, రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. ఏటీఎం, ఆన్లైన్ బ్యాంకింగ్, ఓటీపీ, మార్ఫింగ్ మోసాలు, ఫేక్ ప్రొఫైల్ తయారీ తెలంగాణలో అధికమని ఎన్సీఆర్బీ నివేదికలో తేలింది. చదవండి: హతవిధీ!..పదేళ్ల తర్వాత విధులకు..గుండెపోటుతో -
క్రైమ్ వర్క్‌కూ ట్రాఫిక్ టెక్నాలజీ
సాక్షి, హైదరాబాద్: నగర ట్రాఫిక్ పోలీసు విభాగం వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కేవలం ట్రాఫిక్ కోణంలోనే కాకుండా క్రైమ్ వర్క్‌కూ ఉపకరిస్తోంది. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్లోని ఇంటిగ్రేటెడ్ ఈ–చలాన్ డేటాతో పాటు ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ సిస్టం (ఏఎన్పీఆర్) వల్ల అనేక కేసులు కొలిక్కి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ స్థాయి స్కోచ్ సంస్థ 2022 సంవత్సరానికి సంబంధించి పోలీసు అండ్ సేఫ్టీ అంశంలో గోల్డ్, సిల్వర్ అవార్డులను బుధవారం ప్రకటించింది. ఉల్లంఘనుల్లో క్రమశిక్షణ పెంచడం, స్వైర‘విహారం’ చేసే నేరగాళ్లకు చెక్ చెప్పడం, వాహన చోదకులు గమ్యం చేసుకునే సమయాన్ని గణనీయంగా తగ్గించడం, ట్రాఫిక్ జామ్స్‌ను దాదాపు కనుమరుగు చేయడం ఈ లక్ష్యాలతో ఏర్పాటైన అత్యాధునిక వ్యవస్థ ఇంటెలిజెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం (ఐటీఎంఎస్) నగర పోలీసు విభాగానికి వెన్నెముకగా మారింది. నేరగాళ్లు, ఉల్లంఘనులు పోలీసుల్ని తప్పించుకోవడానికి అనేక ఎత్తులు వేస్తుంటారు. ఇందులో భాగంగా ఇతర వాహనాల నెంబర్లకు తమ వాహనాల నెంబర్ ప్లేట్లపై వేసుకుని సంచరిస్తుంటారు. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రీడింగ్ సిస్టం (ఏఎన్పీఆర్) సాఫ్ట్వేర్ ఈ తరహా కేటుగాళ్లకు చెక్ చెప్తోంది. నగర వ్యాప్తంగా ఉండే కెమెరాల ద్వారా ఒకే నెంబర్‌తో రెండు వాహనాలు, కార్ల నెంబర్లతో ద్విచక్ర వాహనాలు, వేరే నెంబర్లతో తిరిగే ఆటోలను తక్షణం గుర్తిస్తుంది. ఆ విషయాన్ని ఆ వాహనం ప్రయాణించే ముందు జంక్షన్లలో ఉన్న క్షేత్రస్థాయి పోలీసులు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తుంది. ట్రాకింగ్ విధానం సైతం.. నగర వ్యాప్తంగా సంచరించే వాహనాల ట్రాకింగ్ విధానం సైతం ఐటీఎంఎస్ ద్వారా అందుబాటులోకి వచి్చంది. సీసీ కెమెరాలు ఆయా ప్రాంతాల్లో సంచరించే ప్రతి వాహనాన్నీ నెంబర్‌తో సహా చిత్రీకరించి సర్వర్‌లో నిక్షిప్తం చేస్తాయి. ఏదైనా నేరానికి పాల్పడిన వాహనమో, అనుమానిత వాహనమో ఏ ప్రాంతం నుంచి ఏ సమయంలో ఎక్కడికి ప్రయాణించిందో క్షణాల్లో తెలుసుకునే అవకాశం ఈ సాఫ్ట్వేర్ ద్వారా కలుగుతోంది. ప్రస్తుతం నగరంలోని కొన్ని జంక్షన్లలో వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డులుగా (వీఎంఎస్) పిలిచే డిజిటల్ బోర్డులు అందుబాటులో ఉన్నాయి. ఓ మార్గంలో ప్రయాణిస్తున్న వాహన చోదకుడికి ముందు రానున్న చౌరస్తా, రహదారిలో ట్రాఫిక్ స్థితిగతుల్ని ఎప్పికప్పుడు వీఎంఎస్‌ల్లో ప్రదర్శితమవుతాయి. ట్రాఫిక్ జామ్‌లో చిక్కకుండా ఉండేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాలూ వీటి ద్వారా ప్రదర్శితమవుతున్నాయి. వాహన చోదకుల్లో క్రమశిక్షణ పెంచడంతో పాటు ఉల్లంఘనులకు చెక్ చెప్పడానికి ఐటీఎంఎస్‌లో పెద్దపీట వేశారు. అన్ని రకాలైన ఉల్లంఘనలపై ఐటీఎంఎస్ వ్యవస్థలోని కెమెరాలు వాటంతట అవే ఆయా ఉల్లంఘనుల వాహనాలను ఫొటో తీస్తాయి. సర్వర్ ఆధారంగా ఈ–చలాన్ సైతం ఆటోమేటిక్‌గా సంబంధింత వాహనచోదకుడి చిరునామాకు చేరిపోతోంది. కొలిక్కి వచి్చన కేసుల్లో కొన్ని... రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఈ ఏడాది మార్చిలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన హేమంత్ కుమార్ గుప్తా 48 గంటల్లోనే శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. సీసీ కెమెరాల ద్వారా స్నాచర్ వాడిన వాహనం నెంబర్ గుర్తించిన అధికారులు ఈ–చలాన్ డేటాబేస్ నుంచి యజమానికి ఫోన్ నెంబర్ సంగ్రహించారు. దీంతో ముందుకు వెళ్లిన పోలీసులు స్సైస్ జెట్ విమానం ఎక్కిన హేమంత్‌ను అందులోనే పట్టుకుని తీసుకువచ్చారు. వికారాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో 11 వాహనాలను తస్కరించిన నిందితుడు సైతం ఈ డేటాబేస్ ద్వారానే చిక్కాడు. మహంకాళి, చిలకలగూడ పోలీసుస్టేషన్ల పరిధిలో చోటు చేసుకున్న హిట్ అండ్ రన్ కేసు, ఎస్సార్‌నగర్ పరిధిలోని స్నాచింగ్ కేసు, ఇబ్రహీంపట్నానికి సంబంధించిన చోరీ కేసు తదితరాలు సైతం ఈ డేటాబేస్ ద్వారానే కొలిక్కి వచ్చాయి. లాక్డౌన్ సమయంలో ఉల్లంఘనుల గుర్తింపు, ఫలక్నుమలో నమోదైన కిడ్నాప్ కేసుల ఛేదనలో ఏఎన్పీఆర్ డేటా ఉపయుక్తంగా మారింది. (చదవండి: ట్రేడింగ్ పేరుతో హాంఫట్ ) -
శతమానం భారతి: పౌర రక్షణ
నేరాలు మన సమాజంలోని చీకటి కోణాలను వెల్లడిస్తే, వాటి నివారణకు అనుసరించే మార్గాలు సమాజం తాలూకు సున్నితత్వాన్ని, అదే సమయంలో దాని దృఢ సంకల్పాన్ని తెలియజేస్తాయి. ఏటా గడిచిన సంవత్సరంలో జరిగిన నేరాలపై విడుదలయ్యే జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు వెలువడతాయి. నేరాల సంఖ్య పెరిగిందని, ఎప్పటిలానే మహిళల భద్రత విషయంలో సంతృప్తికరమైన ప్రగతి సాధించలేకపోయామని, ముఖ్యంగా నగరాల్లో పరిస్థితి ఏమంత గర్వకారణంగా లేదని ఆ నివేదిక చూస్తే అర్థమవుతుంది. నమోదైన కేసుల ఆధారంగా మాత్రమే ఎన్సీఆర్బీ నివేదిక రూపొందుతుందని మరిచిపోకూడదు. బాధితుల భయాందోళనలవల్ల పోలీసుల దృష్టికి రాని కేసులు, వచ్చినా రకరకాల ప్రభావాలకు లొంగి ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం వంటి కారణాల వల్ల నమోదైన కేసులతో పోలిస్తే... జరిగినవి అనేక రెట్లు అధికంగా ఉండొచ్చు. సామాజిక దురాచారాలు, సంస్కృతి పేరుతో చలామణి అవుతున్న విలువలు, అధికారంలో ఉన్నవారు బాధ్యతారహితంగా మాట్లాడే తీరు మారనంతకాలం నేరాలను సమూలంగా నాశనం చేయడం అసాధ్యం. అమృతోత్సవాల సందర్భంగా నేర నిరోధక, నేర నివారణ, నేర రహిత భారత్ ఏర్పడేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని మోదీజీ పిలుపునిచ్చారు. ఆ పిలుపును సమాజంలోని అన్ని రంగాలవారు, అన్ని స్థాయిలలోని వారు అందుకుని ‘సురక్షిత భారత్’ కోసం పాటు పడాలి. -
మూడేళ్లలో నేరాల సంఖ్య తగ్గింది
తిరుపతి క్రైం/తిరుమల: గడచిన మూడేళ్లలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని డీజీపీ కాసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కరోనా సమయంలో క్రైం రేటును ప్రామాణికంగా తీసుకోకుండా క్రైమ్ రేటును గణించినట్టు చెప్పారు. శనివారం తిరుపతిలోని ఎస్వీ సెనేట్ హాల్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాత్రి సమయాల్లో గస్తీ పెంచడంతోపాటు నేర చరిత్ర కలిగిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని చెప్పారు. రాష్ట్రంలో యాక్సిడెంట్ల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పదో తరగతి తెలుగు పరీక్షలో మాల్ ప్రాక్టీస్ జరిగిన మాట వాస్తవమేనని, ఈ కేసులో పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే నారాయణను అరెస్ట్ చేశామని చెప్పారు. కేసు విషయంలో నిర్లక్ష్యం వహించిన ఏపీపీ సుజాతను సస్పెండ్ చేశామని చెప్పారు. ప్రాసిక్యూషన్‌కు ఏపీపీ సుజాత సహకరించకపోవడంతో చర్యలు తీసుకున్నామన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత దిశ, మహిళా పోలీస్ స్టేషన్ల ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని డీజీపీ తెలిపారు. రాష్ట్రంలో సైబర్ నేరాలు ఆందోళనకరంగా లేవని, అయినా వాటి నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గంజాయి సాగు, రవాణాను నిరోధించాం రాష్ట్రంలో గంజాయి సాగు జరగకుండా చర్యలు తీసుకోవడమే కాకుండా, ప్రత్యామ్నాయ పంటలపై గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నట్లు డీజీపీ చెప్పారు. మల్కాన్‌గిరి జిల్లా నుంచి గంజాయి అక్రమ రవాణాను పూర్తి స్ధాయిలో నిరోధించినట్లు తెలిపారు. నిషేధిత వస్తువులు అక్రమంగా రవాణా చేస్తే చట్టరీత్యా కఠినంగా చర్యలు తీసుకుంటామని, నేరాలకు పాల్పడితే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. చిత్తూరు ఉమ్మడి జిల్లాలోని సరిహద్దుల్లో త్వరలో చెక్ పోస్టు ఏర్పాటు చేస్తామన్నారు. కాగా, తిరుమల శ్రీవారిని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి శనివారం దర్శించుకున్నారు. -
వెరైటీ క్రైమ్: 2021లో ఎన్నెన్ని వింతలో.. ఇదెక్కడి గోలరా బాబూ..
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో హత్యలు, హత్యాయత్నాలు, బాంబు పేలుళ్లు, ఉగ్రవాద కార్యకలాపాలు, భారీ చోరీలు వంటి సంచలనాత్మక నేరాలు నమోదవుతూనే ఉంటాయి. వీటిని నిత్యం చూస్తూనే ఉంటాం. వీటితో పాటు అంతగా ప్రాచుర్యానికి నోచుకోని వెరైటీ నేరాలు కూడా నమోదవుతూ ఉంటాయి. కొన్ని కేసులను తమ విధుల్లో భాగమనుకుంటూ పోలీసులు ఇష్టంతో చేసినా... ఇదెక్కడి గోలరా బాబూ అనుకుంటూ కష్టంగా భావించినా ఈ తరహా కేసుల్నీ దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. వీటిలో అత్యధికం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఠాణాల పరిధిలో చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది చోటు చేసుకున్న వాటిలో ఈ కోవలోకి వచ్చే కేసుల్లో కొన్ని... చదవండి: జపాన్ నుంచి నెహ్రూ జూ పార్క్‌కు అరుదైన అతిథులు! జనవరిలోనే.. తనది పోయిందని మరొకరిది... సాధారణంగా ఎవరైనా తమ వస్తువు పోతే వీలున్నంత వరకు వెతికి విలువైనది అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. లేని పక్షంలో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుని వదిలేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మూల సునీల్ కుమార్ తన బ్యాగ్ పోయినందుకు మరోటి చోరీ చేసి చిక్కాడు. ఇతగాడు రైల్లో వస్తూ తన బ్యాగ్ పోగొట్టుకున్నాడు. ఈ నష్టం పూడ్చుకునేందుకు విజయనగరం నుంచి వచ్చిన శివశంకర్ అనే వ్యక్తిది చోరీ చేశాడు. బాధితుడు రైల్వే పోలీసులను ఆశ్రయించడంతో సీసీ కెమెరాల ఆధారంగా చిక్కి జైలుకు వెళ్లాడు. నేరం చేస్తుండగా నిద్రొచ్చేసింది.. ఓ టార్గెట్‌ను ఎంచుకుని అక్కడ చోరీ చేయాలని భావించిన దొంగలు పక్కా పథకం ప్రకారం వ్యవహరిస్తారు. రెక్కీ తర్వాత ‘పని’లోకి దిగి చడీచప్పుడు కాకుండా పూర్తి చేస్తారు. ఆపై ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా ఉడాయించేస్తారు. అయితే చాంద్రాయణగుట్ట పరిధిలోని ఆలయంలో చోరీ చేసిన బాలుడు మాత్రం అందులోనే బజ్జుని చిక్కాడు. ఓ బాలుడు శ్రీశైలం రహదారిపై ఉన్న శ్రీరామాలయంలో చోరీకి వచ్చాడు. అర్థరాత్రి శ్లాబ్ నుంచి మెట్ల మార్గంలో లోపలకు ప్రవేశించాడు. అక్కడి హుండీ, అల్మారా తాళాలు పగులకొట్టి సొత్తును సంచిలో వేసుకున్నాడు. ఇంత వరకు అంతా అతడు అనుకు న్నట్లే జరిగినా... ఈ పనితో అలసిపోయాడో ఏమో అక్కడే నిద్రపోయాడు. ఉదయం వచ్చిన పూజారి బాలుడిని, అతడితో ఉన్న సంచిలో సొత్తును చూసి పోలీసులకు అప్పగించాడు. మూత్రం తెచ్చిన తంటా... దేవరకొండ బస్తీలో మూత్ర విసర్జన రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టింది. ఆ బస్తీకి చెందిన ఓ యువకుడు ఓ రోజు రాత్రి ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో మూత్ర విసర్జన చేస్తున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ వ్యక్తి ఇతడిని మందలించాడు. ఇరువురి మధ్యా మాటామాటా పెరిగి వాగ్వాదం మొదలైంది. కొద్దిసేపటికే ఇద్దరి స్నేహితులూ అక్కడకు చేరుకుని రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. ఇది పరస్పర దాడుల వరకు వెళ్లింది. విషయం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌కు చేరడంతో రెండు వర్గాలకు చెందిన 17 మందిపై కేసు నమోదైంది. కాస్త అడ్వాన్స్ అయ్యాడు.. పెళ్లైన కొన్నేళ్ల తర్వాత నుంచో భార్యలకు భర్తలు, అత్తింటి వారి నుంచి వరకట్న వేధింపులు ఎదురైన కేసులు ఎన్నో చూస్తుంటాం. అయితే కర్నూలు జిల్లాకు చెందిన మనోజ్‌కుమార్‌రెడ్డి మాత్రం ‘అడ్వాన్స్’ అయిపోయాడు. మాట్రిమోనియల్ సైట్ ద్వారా కేపీహెచ్‌బీ రెండో ఫేజ్‌కు చెందిన యువతితో వివాహం కుదిరింది. ఐదెకరాల భూమి, మరో రూ.25 లక్షల విలువైన స్థలం కట్నంగా ఇచ్చేలా ఒప్పందం తర్వాత నిశి్చతార్థం కూడా జరిగింది. కర్ణాటకలోని బేలూరులో బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్న ఇతడి మనస్సు పెళ్లికి ముందే మారిపోయింది. అదనంగా ఐదెకరాలు ఇస్తేనే తాళి కడతానంటూ యువతితో పాటు ఆమె తల్లిదండ్రులనూ ఫోన్ ద్వారా వేధిస్తూ బెదిరింపులకు దిగాడు. ఫిర్యాదుతో చివరకు జైలు గడప తొక్కాడు. భయపడి బాత్రూమ్లో పడేశాడు.. నగదు, సొత్తు చోరీ చేసిన దొంగలు దాన్ని తమతో పట్టుకుపోతారు. ఆనక జల్సాలు, అవసరాలకు ఖర్చు చేసుకుంటారు. అయితే జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యాపారి ప్రకాష్ ఇంట్లో చోరీ చేసిన క్యాటరింగ్ బాయ్ మాత్రం ఆ మొత్తాన్ని కమోడ్‌లో వేసి ఫ్లష్ చేసేశాడు. దీపావళి సందర్భంగా ప్రకాష్ రూ.3.5 లక్షలు అమ్మవారి ఎదుట ఉంచి పూజించాడు. ఆ ఫంక్షన్‌కు క్యాటరింగ్ బాయ్‌గా వచి్చన షేక్ చాంద్ రజాక్ ఆ మొత్తాన్ని జేబులో పెట్టుకున్నాడు. కొద్దిసేపటికి డబ్బు పోయిన విషయం గుర్తించిన యజమాని తనిఖీలు మొదలెట్టారు. దీంతో తాను చిక్కుతానని భయపడిన రజాక్ బాత్రూమ్లోకి వెళ్లాడు. రూ.75 వేలు జేబులో ఉంచుకుని మిగతా మొత్తం కమోడ్‌లో వేసి ఫ్లష్ చేసేశాడు. జేబులో ఉన్న డబ్బుతోనే చిక్కిన అత గాడు ఆరా తీస్తే అసలు విషయం చెప్పాడు. అదృశ్యాలు తట్టుకోలేక ‘ఆమె’గా మార్చారు.. యువతిగా మారాలన్న తన కోరికను కుటుంబీకులు అంగీకరించట్లేదనే ఉద్దేశంలో షాద్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు పదేపదే ‘అదృశ్యం’ అవుతున్నాడు. ఎట్టకేలకు ఈ అంశం సైబరాబాద్ ట్రాన్స్‌జెండర్స్ హెల్ప్‌డెస్క్ వద్దకు వచి్చంది. అతడి ఆచూకీ కనిపెట్టిన అధికారులు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అంతటితో ఆగకుండా కుటుంబీకులకు కౌన్సెలింగ్ చేసి అతడి కోరిక తీరేలా చేశారు. షాద్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు పదో తరగతిలో ఉండగానే యువతిగా మారాలని భావించాడు. తన కోరికను తల్లిదండ్రులకు చెప్పగా వాళ్లు ససేమిరా అన్నారు. దీంతో రెండుమూడుసార్లు ఇల్లు విడిచి పారిపోయిన అతగాడు ట్రాన్స్‌జెండర్స్ గ్రూపుల్లో చేరుతున్నాడు. విషయం గచ్చిబౌలి పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌జెండర్స్ హెల్ప్ డెస్‌్కకు చేరింది. సిద్ధిపేటలో అతడిని గుర్తించి ఇంటికి తీసుకువచ్చారు. యువతిగా మారాలన్న కోరిక తీరకపోతే ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నం కావడంతో పాటు భవిష్యత్‌లో మరిన్ని పరిణామాలకు దారితీసే ఆస్కారం ఉందని గుర్తించారు. తల్లిదండ్రులకు హెల్ప్ డెస్క్ కౌన్సెలింగ్ చేసి వారి కుమారుడి కోరికను మన్నించేలా చేశారు. రాజీ కోసం చోరీ.. గ్రామీణ ప్రాంతాల్లో చోటు చేసుకున్న కొన్ని నేరాలు పోలీసుల వరకు రావు. పెద్దల సమక్షంలో జరిగే పంచాయితీల్లోనే సెటిల్ అవుతుంటాయి. చోరీ కేసులో ఇలాంటి ఓ సెటిల్మెంట్కు సంబంధించిన సొమ్ము చెల్లించడానికి నగరానికి వచ్చి చోరీ చేసి చిక్కాడో ప్రబుద్ధుడు. సంగారెడ్డి జిల్లా, నారాయణ్‌ఖేడ్ మండలం, సత్యగామకు చెందిన నాగరాజు ఆ గ్రామంలో ఓ చోరీ చేశాడు. పెద్ద మనుషుల సమక్షంలో ఆ మొత్తం తిరిగి ఇచ్చేస్తానంటూ అంగీకరించాడు. ఆ డబ్బుతో పాటు తనకూ కొంత మిగలాలనే ఉద్దేశంతో సిటీకి వచ్చి చోరీ చేయాలని భావించాడు. నగరానికి వచ్చి బంజారాహిల్స్‌లోని ఓ దేవాలయంలో పూజారిగా చేరాడు. అక్కడికి వచి్చన ఓ బాధితురాలి ఇబ్బందులు తొలగిస్తానని నమ్మబలికాడు. అందుకు అవసరమైన పూజ కోసం బంగారం ఇస్తే పూర్తయిన తర్వాత మరో తు లం కలిపి ఇస్తానంటూ నమ్మించాడు. ఇలా ఆమె నుంచి బంగారం, వెండి తీసుకుని పారి పోయాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. -
పోలీసులు పనితీరుతో... నేరాల శాతం తగ్గుతోంది!!
గోల్కొండ: నిరంతరం సీసీ కెమెరాల నిఘా.. ఎక్కడ ఏ ఘటన జరిగినా నిముషాల్లో చేరుకుంటున్న పోలీసులు.. గంటల వ్యవధిలోనే కేసులను ఛేదిస్తుండటంతో రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయి.. దీంతో రాష్ట్ర జీడీపీ గుజరాత్, మహారాష్ట్రలతో పాటు పోటీపడుతూ గణనీయంగా పెరిగిందని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. టోలిచౌకి టూంబ్స్ రోడ్డులోని గోల్డెన్ ఫంక్షన్ హాల్లో ఆసిఫ్‌నగర్ డివిజన్‌కు చెందిన 100 కమ్యూనిటీ సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో భాగంగా పోలీసులు పనితీరులో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని, ఫలితంగా నేరాల శాతం గతంతో పోలిస్తే చాలా తగ్గిందన్నారు. (చదవండి: నాలుగేళ్ల జైలు శిక్ష!.... రెండు రోజుల్లో విడుదల అంతలోనే..) నేర విచారణలో కూడా సీసీ పుటేజీలను న్యాయస్థానంలో సాక్ష్యాలుగా చూపుతున్నట్లు ఆయన చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు వ్యాపారులు ముందుకు రావాలని అన్నారు. దాతల సహకారంతోనే రూ.30 లక్షలతోనే హుమాయున్‌నగర్, ఆసిఫ్‌నగర్, గోల్కొండ, లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రధాన రహదారులు, వ్యాపార సముదాయాల్లో ఉన్న కెమెరాల వల్ల ఆ ప్రాంతాల్లో నేరాలు తగ్గడంతో పాటు ప్రమాదాలు కూడా తగ్గాయని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు భావితరాలకు భద్రత కల్పిస్తుందన్నారు. ప్రతిపౌరుడు ఒక పోలీస్ అని, పోలీసులు సైతం పౌరులేనని ఆయన గుర్తు చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల హైదరాబాద్ నగరానికి సేఫ్ సిటీ అని పేరు వచ్చిందని చెప్పారు. శాంతిభద్రతలు అదుపులో ఉండటం, నేరాలు తగ్గడం వల్ల పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారన్నారు. 5 సంవత్సరాల్లో హైదరాబాద్‌లో శాంతిభద్రతలు అదుపులో ఉండటం వల్ల ఎన్నో కొత్త పరిశ్రమలు వచ్చాయని, దీనివల్ల యువతకు ఉపాధి కూడా లభించిందన్నారు. గతంలో ఒక్క కేసు ఛేదించడానికి, వ్యయప్రయాసలు ఉండేవని నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటయ్యేవని గుర్తు చేశారు. సీసీ కెమెరాలతో అతి కొద్ది సమయంలోనే నిందితులకు శిక్షపడేలా చేయడం సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో నగర జాయింట్ పోలీస్ కమిషనర్, పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, అడిషనర్ డీసీపీ ఇక్బాల్ సిద్ధిఖి, ఆసిఫ్‌నగర్ డివిజన్ ఏసీపీ శివమారుతి, ఇన్స్పెక్టర్ కె.చంద్రశేఖర్‌రెడ్డితో పాటు పీస్ అండ్ మైత్రి కమిటీ సభ్యులు రాజు వస్తాద్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: మాజీ ప్రియురాలు ఫోన్ అన్‌లాక్ చేసి... ఏకంగా రూ 18 లక్షలు కొట్టేశాడు!!) -
మెతుకుసీమలో రక్తపు మరకలు.. 12 నెలల్లో 18 హత్యలు
సాక్షి, మెదక్: పచ్చటి పంట పొలాలతో కళకళలాడే మెతుకుసీమలో రక్తపు మరకలు అలజడి సృష్టిస్తున్నాయి. మానవత్వాన్ని మరిచి పైశాచికత్వంతో హత్యలకు తెగబడుతున్నారు. ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధాలు, భూ వివాదాలే ఘటనలకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. న్యాయస్థానాలు చట్టాలను కఠినతరం చేస్తూ దోషులను శిక్షిస్తున్నప్పటికీ మార్పు అనివార్యమవుతుంది. జిల్లాలో 12 నెలల్లో జరిగిన 18 హత్యలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వరుస హత్యలపై సాక్షి ప్రత్యేక కథనం.. ►జిల్లావ్యాప్తంగా 21 మండలాలు 469 గ్రామ పంచాయతీలు ఉండగా, మొత్తం 21 పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. ఇందులో ఎస్పీ, ఏఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, ఒక్క ఏఆర్ డీఎస్పీ, 57 మంది సీఐ, ఎస్ఐలు, సుమారు 800 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ►మూడేళ్లుగా పోలీస్ అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 64 హత్య కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 2019లో 19, 2020లో 27, 2021 ఇప్ప టి వరకు 18 హత్య కేసులు నమోదయ్యాయి. ►ఈ హత్య కేసుల్లో ఎక్కువగా ఆర్థికలావాదేవీలు, అక్రమ సంబంధాలు, భూవివాదాలు, ప్రేమ వివాదాలే కారణాలుగా నిలిచాయి. ►రూ.200 మొదలుకొని రూ. 2కోట్ల వరకు జరిగిన లావాదేవీల్లో హత్యలకు దారితీశాయి. ►భార్యాభర్తల మధ్య అనుమానాలు, ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధాలు, కులాంతర వివాహాలు వంటి పలు కారణాలు హత్యలకు ఆజ్యం పోస్తున్నాయి. ►నేరాలకు పాల్పడే వ్యక్తులు చట్టం నుంచి తప్పించుకునేందుకు చేసే ప్రయత్నాలు సినీ ఫక్కీని తలపించాయి. పథకం ప్రకారమే నేరాలకు తెగబడుతూ హత్య ఒక చోట చేసి శవాన్ని మరొకచోట పడేయటం, మృతదేహాన్ని గుర్తు పట్టలేనంతగా ఛిద్రం చేయడం వంటివి ఇటీవల జరిగిన ఘటనల్లో ఎక్కువగా వెలుగుచూశాయి. ►నిందితులు ఎంతో పకడ్బందీగా నేరాలకు పాల్ప డుతున్నప్పటికీ అధునాతన సాంకేతికత ఆధా రంగా పోలీసులు నిందితులను గంటల వ్యవధిలోనే పట్టుకొని రిమాండ్‌కు తరలిస్తున్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన ఘటనలు: ►2019 అక్టోబర్ 26న ఓ గుర్తు తెలియని మహిళను హత్యచేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి పాపన్నపేట మండలం ఏడుపాయల దేవస్థానం సమీపంలో పడేశారు. ఈ కేసు ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. ►ఈ ఏడాది ఆగస్టు 4వ తేదీన హవేళిఘనపూర్ మండలం బూరుగుపల్లి గేట్ వద్ద కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పొల్కంపేట గ్రామానికి చెందిన గడ్డి హనుమంతును కేవలం రూ.30 వేల అప్పు వివాదంలో అతడి సన్నిహితుడు బండ రాయితో కొట్టి అతికిరాతంగా హతమార్చాడు. ఈ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించి నిందితుడిని రిమాండ్ చేశారు. ►ఈ ఏడాది ఆగస్టు 9 అర్ధరాత్రి వెల్దుర్తి మండలం మంగళపర్తి–యశ్వంతరావుపేట సమీపంలో మెదక్ పట్టణానికి చెందిన «బీజేపీ నేత, రియల్ ఎస్టేట్ వ్యాపారి ధర్మకారి శ్రీనివాస్(కటికె శ్రీను) ను అతి కిరాతకంగా కత్తితో పొడిచి హతమార్చి, కారుతో సహా నిప్పంటించి దహనం చేశారు. జిల్లాలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. ►అదే రోజు మెదక్ మండలం మంబోజిపల్లి వద్ద గ్రామానికి చెందిన బోల సిద్ధయ్యను కేవలం రూ. 200 కోసం ఎలాంటి పరిచయం లేని హవేళిఘనపూర్ మండలం ఫరీద్‌పూర్‌కు చెందిన ఓ తాగుబోతు పదునైన బండ రాయితో కొట్టి చంపేశాడు. మృతుడి వద్ద నుంచి రూ. 1200లతో పాటు సెల్‌ఫోన్‌ను దొంగిలించాడు. ►ఆగస్టు 27వ తేదీన కొల్చారం మండలం మెదక్–నర్సాపూర్ ప్రధాన రహదారిలో లోతు వాగు వద్ద 30 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తిని అతి కిరాతకంగా చంపేసి గుర్తు పట్టేందుకు వీలు లేకుండా కాలి్చవేశారు. ►అక్టోబర్ 21న కామారెడ్డి జిల్లా బిక్కనూర్ గ్రామానికి చెందిన మల్లయ్య మద్యం సేవించి వేధింపులకు పాల్పడుతున్నాడనే కారణంతో కుటుంబీకులే హత్య చేశారు. మెదక్–రామాయంపేట ప్రధాన రహదారిలో శమ్నాపూర్ శివారులోని అటవీ ప్రాంతంలోని నీటి కుంటలో పడేశారు. పోలీసుల విచారణలో మృతుడి భార్య ఎల్లవ్వ, కూతురు రాణి, అల్లుడు రాజమల్లు ముగ్గురు కలిసే హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది. నేరస్తులు చట్టం నుంచి తప్పించుకోలేరు నేరం చేసే ప్రతి ఒక్కరూ చట్టం ముందు దోషులుగా నిలబడాల్సిందే. ఆర్థిక లావాదేవీలు, భూ వివాదాలు, వివాహేత సంబంధాలు, కుటుంబ తగాదాలే హత్యలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. కక్ష్యపూరిత నిర్ణయాలతో విచక్షణను కోల్పోయి పథకం ప్రకారం హత్యలు చేస్తున్నారు. ప్రతీ కేసును సవాల్‌గా తీసుకొని దర్యాప్తు ప్రారంభించిన 24 గంటల్లోనే పురోగతి సాధిస్తున్నాం. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేస్తున్నాం. – చందనాదీప్తి, ఎస్పీ, మెదక్ -
చిన్నారి ప్రాణం తీసిన పబ్జీ గేమ్ గొడవ!
బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరులో పిల్లల చేతికి సెల్‌ఫోన్ ఇవ్వడంతో ఓ విషాద సంఘటన జరిగింది. పబ్జీ గేమ్ విషయంలో ఇద్దరు చిన్నారుల మధ్య జరిగిన గొడవ వల్ల 12 ఏళ్ల చిన్నారి ప్రాణం బలైపోయింది. స్నేహితుడిని కలవాలని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన 10 గంటల తర్వాత ఇంటి నుంచి 500 మీటర్ల దూరంలో శవమై కనిపించాడు. ఇండియాలో నిషేధించిన పబ్జీ వీడియో గేమ్ బాలుడు మరణానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ప్రశ్నించేందుకు 17 ఏళ్ల మైనర్ బాలుడైన నిందితుణ్ని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చనిపోయిన మహ్మద్ అకీఫ్ లారీ డ్రైవర్ హనీఫ్ కుమారుడుగా గుర్తించారు. అకీఫ్ ఎప్పుడు కొంతమంది పరిచయస్తులతో పబ్జీ గేమ్ ఆడేవాడు. ఫలా స్కూల్లో 6వ తరగతి చదువుతున్న బాలుడు శనివారం రాత్రి 8.45 గంటల సమయంలో ఇంటి నుంచి ఫోన్లో మాట్లాడుతూ బయటికి వెళ్ళాడు. ఎంతసేపటికి బాలుడు తిరిగి రాకపోయేసరికి వారు పోలీసులకు పిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ఉల్లాల్ పోలీస్ స్టేషన్ పరిమితిలో ఉన్న స్కూల్ అరటి ఆకులు, కొబ్బరి ఫ్రాండ్లతో కప్పబడిన ఒక బాలుడి మృతదేహాన్ని పోలీసు బృందం గుర్తించింది. ఆ బాలుడి మృతదేహాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వెన్లాక్ ఆసుపత్రికి తరలించారు. అకీఫ్ అనే చిన్నారిని ఇంటి పక్కన ఉండే మరో బాలుడు తనతో పాటు పబ్జీ ఆడాల్సిందిగా కోరాడు. అయితే ఆట మధ్యలో ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. అకీఫ్ తోటి బాలుడిపై రాళ్లు విసిరాడు. దానికి కోపోద్రిక్తుడైన ఆ బాలుడు ఓ పెద్ద రాయిని అకీఫ్‌పై వేశాడు. దీంతో అతడికి తీవ్రంగా రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. భయపడ్డ ఆ బాలుడు మృతదేహాన్ని అరిటాకులతో కప్పేసి అక్కడి నుంచి పారిపోయాడని పోలీసు అధికారి తెలిపారు. నిందితుడు మైనర్ కావడంతో అతడికి ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై నగర పోలీస్ కమిషనర్ ఎన్.శశి కుమార్ స్పందిస్తూ చిన్నారులకు ఫోన్లు ఇచ్చినప్పుడు పెద్దలు ఓ కంట కనిపెడుతూ ఉండాలని సూచించారు. చదవండి: తల్లి టీవీ ఆఫ్ చేసిందని కొడుకు ఆత్మహత్య మయన్మార్‌లో ఆగని అరాచకం.. 550 మంది మృతి -
నేర, మావో రహిత తెలంగాణే లక్ష్యం
సాక్షి,హైదరాబాద్: ఈ ఏడాది రాష్ట్రంలో పలు రకాల నేరాలు తగ్గుముఖం పట్టాయి. సైబర్ నేరాలు మాత్రం పెరిగాయి. నేరాల అదుపులోనూ పోలీసుల పనితీరు మెరుగైంది. నేర, మావోయిస్టు రహిత తెలంగాణే తమ లక్ష్యమని డీజీపీ డాక్టర్ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో జరిగిన నేరాలపై బుధవారం వార్షిక నివేదిక విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. డీజీపీ ఇంకా ఏమన్నారంటే... 2020లో అనేక విపత్తులు, వరదలు, కరోనా వంటి సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజల వెంట నిలిచాం. మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట వేశాం. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాలలో దాదాపు 6 శాతం తగ్గుదల నమోదైంది. గతేడాది 1,60,571 కేసులు నమోదు కాగా, 2020లో 1,50,922 కేసులు నమోదయ్యాయి. 2019లో 1,780 లైంగికదాడులు జరగ్గా 2020లో ఆ సంఖ్య 1,934కు చేరింది. ఆపదలో ఉన్నవారిని రక్షించడానికి ఘటనాస్థలానికి కేవలం 8 నిమిషాల్లో చేరుకుంటున్నాం. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌లో దేశంలోనే ఇది అత్యుత్తమ సగటు. ప్రజలకు చేరవయ్యేందుకు ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకున్నాం. డీజీపీ వెల్లడించిన ఇతర ముఖ్యాంశాలు ఏమిటంటే.. 11 ఎన్కౌంటర్లలో 11 మంది మావోయిస్టులు హతమయ్యారు. 135 మంది అరెస్టు కాగా, 45 మంది లొంగిపోయారు. 22 ఆయుధాలు, రూ.23 లక్షల నగదు స్వాధీనం. 33 జిల్లాల తెలంగాణలో 30 జిల్లాల్లో మావోయిస్టు కార్యకలాపాలు లేవు. ►లాక్డౌన్ కాలంలో 6,000 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. వారిలో 72 మంది మరణించారు. ►లొకేషన్ బేస్డ్ సర్వీస్ ద్వారా డయల్ 100కు ఫోన్ చేసిన బాధితులు ఎక్కడున్నారో కనిపెడుతున్నాం. ►డయల్ 100/ డయల్ 112లకు 12,45,680 ఫిర్యాదులు వచ్చాయి. సోషల్ మీడియా కంప్లైంట్స్ 1,59,915, రిసెప్షన్ ఫిర్యాదులు 6,78,189, హాక్ ఐకి 1,15,743 ఫిర్యాదులు ►ఫింగర్ ప్రింట్ టెక్నాలజీతో 300 కేసుల్లో నేరస్తుల్ని, పాస్‌పోర్టు వెరిఫికేషన్‌లో 22 మంది నేరచరితులను గుర్తించాం. ►దర్పణ్ యాప్ ద్వారా 33 మంది పిల్లల ఆచూకీ కనుగొన్నాం ►2020లో 624 జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం. 350 మందిపై ప్రివెన్షన్ డిటెన్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు ► షీ–టీములకు 4,855 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 567 ఎఫ్ఐఆర్లు నమోదు. ►రాష్ట్రవ్యాప్తంగా ఆరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను ఏర్పాటు చేశాం. త్వరలో వీటిని ప్రతి జిల్లా/ కమిషనరేట్లలో ఏర్పాటు చేస్తాం. ► డిపార్ట్మెంట్లో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్(హెచ్ఆర్ఎంఎస్) అమలుకు శ్రీకారం ►వికారాబాద్, సంగారెడ్డి, వరంగల్‌లో భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాం. ►థర్డ్‌పార్టీ ద్వారా పోలీసుల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. ►ఆపరేషన్ స్మైల్–6లో 1,292 మందిని, ఆపరేషన్ ముస్కాన్‌లో 741 మంది పిల్లలను రక్షించాం. ►మానవ అక్రమ రవాణా ముఠాల నుంచి 383 మందిని కాపాడాం. ►వర్టికల్ ఫంక్షనింగ్ ద్వారా 2019లో 29 శాతంగా ఉన్న కన్విక్షన్ రేటు 2020లో 48 శాతానికి చేరుకుంది. ►2020లో నలుగురికి మరణశిక్ష ఖరారైంది. ఉమ్మడి ఏపీ, తెలంగాణలో ఇది ఒక రికార్డు. ►రూ.93 కోట్ల 73 లక్షల ప్రాపర్టీ లాస్ అయితే రూ.50 కోట్ల 47 లక్షలు రికవరీ ►మహిళలపై వేధింపులు గత ఏడాదితో పోలిస్తే 1.92% తగ్గింది ►హత్యలు 8.29%, దోపిడీలు 28.57%, రాబరీ 33.11%, చైన్ స్నాచింగ్ 46% తగ్గాయి. ►రోడ్డు ప్రమాదాలు 13.93% తగ్గాయి. మరణాలు 9% తగ్గాయి ►వరకట్న వేధింపులు 6,544 నమోదు కాగా, అందులో 144 మంది మృతి. ►ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీ చట్టం కింద 2,096 కేసులు నమోదు. కేసుల పెరుగుదల 10.89%. ►రాష్ట్రవ్యాప్తంగా 9,568 ఆర్థిక నేరాలు నమోదు. 4,544 సైబర్ నేరాలు నమోదు. గతేడాదితో పోలిస్తే 103% పెరిగాయి. ►ఈ ఏడాది 16,866 రోడ్డు ప్రమాదాలు, 5,821 మంది మరణం. ►ట్రాఫిక్ ఉల్లంఘనలపై రూ.613 కోట్ల జరిమానాలు, మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కోటీ 67 లక్షల కేసులు. ►రాష్ట్రంలో 4.5 లక్షల మందికి సంబంధించి పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ చేశాం. -
సంస్కరణ అడుగులు.. రక్షణ కవచాలు
సాక్షి, కర్నూలు: క్షేత్రస్థాయిలో పటిష్టమైన నిఘా... సమర్థవంతంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం.. సీసీ కెమెరాల ఏర్పాటు.. నేరస్తుల కదలికలపై డేగ కన్ను.. కరడుగట్టిన నేరస్తులపై పీడీ చట్టం ప్రయోగం.. తరచూ సమస్యాత్మక గ్రామాల్లో కార్డెన్ అండ్ సర్చ్ (నాకా బందీ).. వీటికి తోడు పోలీసు శాఖలో వినూత్న మార్పులు.. దీంతో గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లాలో నేరాల శాతం తగ్గుముఖం పట్టింది. అయితే సైబర్ మోసాలు, చిన్నారులపై అత్యాచారం (పొక్సో) తదితర నేరాలు పెరిగాయి. ఆస్తి తగాదాలు, చిన్న చిన్న ఘర్షణలు, మహిళా వేధింపులు మాత్రం తగ్గలేదు. చోరీల సంఖ్య తగ్గినప్పటికీ సొత్తుల రికవరీలో పోలీసులు విఫలమయ్యారన్న విమర్శలు బాధితుల నుంచి వినిపిస్తున్నాయి. పోలీసు శాఖలో కొత్తగా వస్తున్న సంస్కరణలతో కొంత కాలంగా అవగాహన పెరిగింది. పీడీ చట్టం అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తుండటంతో హింసాత్మక ఘటనలు తగ్గాయి. దొంగతనాలు, దోపిడీలతో పోల్చితే సైబర్ నేరాలు పెరగడం ఆందోళన కలిగించే అంశం. 2020 సంవత్సరం జిల్లాలో చోటు చేసుకున్న నేరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. సాంకేతికత తోడుగా.. మారుతున్న పరిస్థితులను బట్టి పోలీసుశాఖలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కేసుల విచారణలో సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నారు. కేసు నమోదు దగ్గరి నుంచి న్యాయస్థానంలో తీర్పు వెలువడే వరకు ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. అన్ని పట్టణాలు, గ్రామాల్లో నిఘా, నియంత్రణతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ దాతలు, ప్రజల సహకారంతో నిఘా నేత్రాలను ఏర్పాటు చేయడం ఇటీవల పలు కేసులను చేధించారు. (చదవండి: తగ్గిన నేరాలు.. పెరిగిన కేసులు) మతసామరస్యాన్ని దెబ్బ తీసేందుకు జరుగుతున్న కుట్రను ఛేదించేందుకు జిల్లాలోని దేవాలయాలు, మసీదులు, చర్చిల వద్ద పోలీసు నిఘా నిరంతరం ఉండేలా చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,856 ఆలయాలు, 921 మసీదులు, 745 చర్చీలు మొత్తం 3,522 ప్రార్థనాలయాలకు జియో ట్యాగింగ్ చేయించారు. బహిరంగ ప్రదేశాలు, ముఖ్య కూడళ్లు, జాతీయ రహదారులపై కూడా ప్రజలు, ప్రైవేట్ వారి సహకారంతో గృహాలు, వ్యాపార దుకాణాలు, మద్యం షాపులు, డాబాల్లో సీసీటీవీ కమ్యూనిటీ ప్రాజెక్టులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 15,662 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మ్యాట్రిక్స్, బృహస్పతి టెక్నాలజీకి సంబంధించిన కెమెరాలను కూడా వినియోగిస్తున్నారు. నేరాల నియంత్రణ, కేసులు ఛేదించడంలో నిఘానేత్రాలు కీలకంగా మారాయి. నిఘా నీడలో.. ఎవరూ ఊహించని విధంగా ఈ ఏడాది కరోనా వైరస్ జనజీవనాన్ని కట్టి పడేసింది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 3వ వారం నుంచి లాక్డౌన్ ప్రకటించాయి. దీంతో జిల్లాలో 4 నెలల పాటు పోలీసులు రాత్రింబవళ్లు గస్తీ కాశారు. రాష్ట్ర, జిల్లా సరిహద్దులను రెండు నెలల పాటు పూర్తిగా మూసేశారు. పట్టణాల్లో చెక్‌పోస్టులు, ప్రతివీధిలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గస్తీ పెంచడంతో దొంగతనాల సంఖ్య భారీగా తగ్గింది. లాక్డౌన్ సమయంలో పగటి పూట అందరూ ఇళ్లలోనే ఉండటంతో చోరీలకు అవకాశం లేకుండా పోయింది. లాక్డౌన్ సమయంలో వాహనాల రాకపోకలు తక్కువ కావడంతో 80 శాతం ప్రమాదాలు తగ్గాయి. అలాగే శాంతి భద్రతలు, మతసామరస్య పరిరక్షణకు, ఆకతాయిల ఆగడాలను అరికట్టేందుకు జిల్లాలో వినూత్నంగా ఏర్పాటు చేసిన గ్రామ రక్షక దళాల వ్యవస్థ సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో ప్రజలు, యువత స్వచ్ఛంద భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ దళాలు తమ పనితీరుతో పోలీసు ఉన్నతాధికారుల అభినందనలు అందుకుంటున్నాయి. జిల్లాలో 83 పోలీసుస్టేషన్లు, 19 సర్కిళ్లు ఉండగా వీటి పరిధిలో 1,450 గ్రామరక్షక దళాలు ఏర్పాటు చేశారు. కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్స్ రిమాండు ఖైదీలను కోర్టులో హాజరుపరిచి తిరిగి జైలుకు తీసుకెళ్లే సమయంలో పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన సంఘటనల నేపథ్యంలో వీడియో లింకేజీ ద్వారా జైళ్ల నుంచే ఖైదీలను హాజరు పరిచే విధానాన్ని అమల్లోకి తెచ్చారు. జిల్లా వ్యాప్తంగా 1,426 కేసుల్లో 2,318 మంది సబ్ జైలు రిమాండులో ఉన్న ముద్దాయిలను సంబంధిత జడ్జీల ద్వారా వీడియో లింకేజీల ద్వారా రిమాండ్ గడువు పొడిగించేటట్టు చర్యలు చేపట్టారు. నేర ప్రవృత్తి మార్చుకోని నూకల మనోహర్‌రావు, గంగదాసరి రవిచంద్రరెడ్డి, నకిలీ విత్తనాల వ్యాపారి మణిగొండ రత్నాకరరావు, నకిలీ మద్యం తయారీ ముఠా నాయకుడు వినోద్ ఖలాల్ తదితరులపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేసి కటకటాలకు పంపారు. సెబ్‌తో కిక్కుకు కళ్లెం అక్రమ మద్యం రవాణాకు సంబంధించి జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు కాక ముందు 574 కేసులు నమోదు చేసి 622 మందిని అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మే నెలలో ప్రత్యేకంగా సెబ్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు జిల్లాలో 9,060 మద్యం కేసులు నమోదుచేసి 11,606 మందిని అరెస్ట్ చేసి 3,373 వాహనాలను సీజ్ చేశారు. 59,873 లీటర్ల నాటుసారా, 69,002 లీటర్ల ఇతర రాష్ట్రాల మద్యం సీజ్ చేసి 11,363 మందిని అరెస్ట్ చేశారు. సెబ్ తీసుకుంటున్న చర్యలతో సరిహద్దు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణాకు దాదాపు అడ్డుకట్ట పడింది. పోలీసు శాఖకు మచ్చ తెచ్చిన ఘటనలు శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ అందులో పనిచేస్తున్న కొంతమంది వ్యవహారం వల్ల మచ్చ తెచ్చిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అక్రమ మద్యం రవాణాను అడ్డుకునేందుకు సెబ్ విస్తృత దాడులు చేస్తున్నా కాసులకు కక్కుర్తి పడి పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తరలిస్తూ సుమారు 10 మంది పోలీసు సిబ్బంది తనిఖీల్లో పట్టుబడ్డారు. అలాగే నంద్యాలలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో ఒక సీఐ, ఒక హెడ్‌కానిస్టేబుల్ అరెస్ట్ కావడం, ప్రేమ వ్యవహారంలో తుగ్గలి ఎస్ఐని విధుల నుంచి తొలగిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసిన సంఘటనలు చర్చనీయాంశమయ్యాయి. ఇసుక దోపిడీకి అడ్డుకట్ట సెబ్ ఏర్పాటుతో ఇసుక అక్రమ రవాణాదారులకు కూడా కళ్లెం పడింది. అనుమతులులేని ప్రాంతాల నుంచి ఇసుకను తరలిస్తున్న వారిపై నిఘా ఉంచి 435 కేసులు నమోదు చేసి 833 మందిని అరెస్ట్ చేసి 505 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దీని ద్వారా దాదాపు రూ.25 లక్షలు విలువ చేసే 6,661 మెట్రిక్ టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరాలతో ముచ్చెమటలు ఈ ఏడాది తీవ్ర నేరాలు తగ్గినప్పటికీ సైబర్ నేరాలు 19 శాతం పెరిగాయి. కరోనా సమయంలో ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో సైబర్‌నేరాలు పెరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు విశ్లేషిస్తున్నారు. గత ఏడాది 136 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 163 కేసులు నమోద య్యాయి. ఈ కేసులు దర్యాప్తు చేపట్టి రూ.3.36 కోట్లు రికవరీ చేశారు. అధునాతున సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మరో 230 కేసులను చేధించారు. ఛేదించిన సంచలన కేసులు ► ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో 9 రోజుల బాలిక కిడ్నాప్‌నకు గురైనట్లు సమాచారం అందిన వెంటనే ఐదు స్పెషల్‌పార్టీ బృందాలు రంగంలోకి దిగి రెండు గంటల్లోనే కేసును చేధించి బిడ్డను తల్లి ఒడికి చేర్చారు. ► కర్నూలులో ప్రగతి మహిళా పరస్పర పొదుపు సంఘంలో అక్రమాలు చోటు చేసుకున్న కేసులోని నిందితుల ఆస్తులను ప్రభుత్వానికి అటా^Œ చేసేలా దర్యాప్తు చేపట్టి బాధితులకు ఊరట కలిగించారు. ► ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి వసూళ్లకు పాల్పడిన నకిలీ ఏసీబీ అధికారుల సంచలన కేసును సెప్టెంబర్ 2వ తేదీ అరెస్ట్ చేసి రూ.14.34 లక్షలు రికవరీ చేశారు. ► ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలో కాలభైరవ విగ్రహంలోని ఓ భాగాన్ని తొలగించిన దుండగున్ని సెప్టెంబర్ 28న అరెస్ట్ చేసి కటకటాలకు పంపారు. ► జాతీయ రహదారుల సమీపంలోని ఆలయాల్లో చోరీలకు పాల్పడిన ఎరుకల నల్లబోతుల నాగప్పతో పాటు మరో ఇద్దరు మహిళలను అక్టోబర్ 17న అరెస్ట్ చేసి కటకటాలకు పంపారు. వీరు 20 దేవాలయాల్లో చోరీలకు పాల్పడ్డారు. ► ప్రభుత్వ పథకాల ద్వారా దొడ్డిదారిలో లబ్ధికి వీలుగా ఆధార్ కార్డులో డేటా మార్పి మోసాలకు పాల్పడిన 30 మందిని అక్టోబర్ 28న అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ► ఇంటలిజెన్స్ డీఎస్పీనని మోసాలకు పాల్పడిన కుమార్ అనే వ్యక్తిని నవంబర్ 2న అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ► ఎటువంటి ఆధారాలు, పత్రాలు లేకుండా రూ.4.35 కోట్లు విలువ చేసే 686.5 కిలోల వెండితో పాటు కారును డిసెంబర్ 11వ తేదీ అమకతాడు చెక్‌పోస్టు వద్ద స్వాధీనం చేసుకుని తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశారు. ► ఆర్టీసీ బస్సులో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.1.9 కోట్లు నగదును డిసెంబర్ 13వ తేదీన కర్నూలు శివారులో పోలీసులు స్వాధీనం చేసుకుని వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అప్పగించారు. ► పి.రుద్రవరంలో ప్రత్యర్థులను అంతమొందించేందుకు పన్నిన కుట్రను భగ్నం చేసి ఆరుగురు నిందితులను ముందుగానే అరెస్ట్ చేసి కటకటాలకు పంపడమేగాక గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పారు. ► నాదస్వరం కాయ మహిమల పేరిట మోసాలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. శభాష్ పోలీసు.. శాంతి భద్రత పరిరక్షణలో పోలీసు శాఖ తీసుకున్న పటిష్టమైన చర్యలకు ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి పలు ప్రసంశలతో పాటు పలు అవార్డులు దక్కాయి. ఎన్నికల్లో ఈ–సీజర్, ఈ–నాకాబంది, ఎలక్షన్ ఏపీ పోలీసు డాట్‌కామ్ వెబ్ అప్లికేషన్లకు సంబంధించిన టెక్నాలజీలను వినియోగిస్తూ చెక్‌పోస్టులల్లో ఈ–టెక్నాలజీ ద్వారా రియల్ టైం బేసిస్‌లో వాహన తనిఖీల ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ అడ్డుకట్ట వేశారు. ఇందు కోసం బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్ అవార్డు 2019, గవర్నెన్స్ నౌ–ఇండియా పోలీసు అవార్డు 2020, జిల్లా పోలీసు కార్యాలయాన్ని పరిశుభ్రంగా నిర్వహించినందుకు స్వచ్ఛ్ సుర్వేక్షణ్ 2021 అవార్డు మున్సిపల్ కార్యాలయాల నుంచి అందుకున్నారు. అలాగే ఫిబ్రవరి 14న టెక్నాలజీ సభ అవార్డు, కోర్టు మానిటరింగ్ సిస్టమ్, డీపీఓ సమాచార్ నిర్వహణకు సంబంధించి రెండు స్కోచ్ అవార్డులు దక్కాయి. జిల్లా ఎస్పీ ఫక్కీరప్పకు కూడా వ్యక్తిగతంగా స్కోచ్ అవార్డు, ఎలక్టోరల్ ప్రాక్టీస్ అవార్డును గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ చేతుల మీదుగా అందుకున్నారు. -
నేరాల్లో 10% తగ్గుదల..!
సాక్షి హైదాబాద్: టెక్నాలజీ వినియోగం.. నేరాలు కొలిక్కి తీసుకురావడంలో సీసీ కెమెరాల కీలకపాత్ర.. నేరాలు నిరోధించడంలో పీడీ యాక్ట్ ప్రయోగం వంటి చర్యలు.. వెరసి హైదరాబాద్ నగరంలో నేరాలు గణనీయంగా తగ్గాయి. గతేడాదితో పోలిస్తే అన్ని రకాలైన నేరాల్లో కలిపి దాదాపు 10 శాతం తగ్గుదల నమోదైంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి డిసెంబర్ 20 వరకు నమోదైన నేరాల గణాంకాలను సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో సీపీ అంజనీకుమార్ విడుదల చేశారు. సైబర్ నేరాల సంఖ్య మాత్రం గతేడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. తగ్గిన ‘మరణాలు’.. రోడ్డు ప్రమాదాలు, వాటిలో మరణాల సంఖ్య తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసు విభాగం స్పెషల్ డ్రైవ్ చేపడుతోంది. ఫలితంగా ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు, క్షతగాత్రులతో పాటు మృతుల సంఖ్య తగ్గింది. 2018 2019 2020 మొత్తం ప్రమాదాలు 2,431 2,496 1,738 క్షతగాత్రులు 2,435 2,649 1,793 మృతులు 293 271 237 ‘దిశ’ఉదంతం తర్వాత మహిళల భద్రతపై అన్ని విభాగాలు దృష్టి పెట్టాయి. సాధారణ సమయంలోనూ మహిళలు/యువతులపై జరిగే నేరాలను అధికారులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. మహిళలపై నేరాలు.. 2018 2019 2020 మొత్తం కేసులు 2,286 2,354 1,908 వరకట్న హత్యలు 17 3 2 అత్యాచారం 178 281 265 కిడ్నాప్‌లు 134 95 60 ఆత్మగౌరవానికి భంగం కలిగించడం 373 448 438 వేధింపులు 1,342 1,462 1,043 శిక్షలు ఇలా.. 2018 2019 2020 విచారణ ముగిసిన కేసులు 4,245 4,947 2,688 నేరం నిరూపితమైనవి 1,471 2,092 1,964 శిక్షల శాతం 34 42 73 చోరీ అయిన సొత్తు రికవరీ.. 2018 2019 2020 చోరీ అయిన సొత్తు విలువ రూ.74.05 కోట్లు రూ.27.78 కోట్లు రూ.26.15 కోట్లు రికవరీ రూ.62.97 కోట్లు రూ.16.26 కోట్లు రూ.17.24 కోట్లు శాతం 86 59 66 సైబర్ క్రైం పెరిగింది.. ఈ సందర్భంగా అడిషపల్ సీపీ షిఖా గోయల్ మాట్లాడుతూ.. ‘గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబర్ క్రైం పెరిగింది. 2019లో 1,393 సైబర్ కేసులు నమోదయితే 2020 లో 2,406 కేసులు నమోదు అయ్యాయి. ఇంటర్ నెట్ వినియోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. దేశ వ్యాప్తంగా జరుగుతున్న సైబర్ క్రైమ్‌లు రాజస్తాన్‌లోని జంతారా నుంచే జరుగుతున్నాయి. 25 శాతం ఓటీపీ మోసాలు పెరిగాయి. ఆన్లైన్ గేమింగ్ యువతను ఆకర్షిస్తుంది. దీన్ని ఆధారంగా చేసుకొని ఎంతో మంది అమాయకులను మోసం చేస్తున్నారు. మైక్రో ఫైనాన్స్ వేధింపులు ఈ మధ్య భారీగా పెరిగాయి. 100 యాప్‌లు గూగుల్ ప్లేస్టోర్ లో ఉన్నాయి. మైక్రో ఫైనాన్స్ ద్వారా అప్పులు ఇచ్చి వేధింపులకు గురిచేస్తున్నారు. డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో భాదితుల ఫోటోలు, అలాగే కాంటాక్ట్‌లకు మెసేజ్‌లు పంపుతున్నారు. వీరి వేధింపులకు ముగ్గురు ఆత్మ హత్య చేసుకున్నారు. ఇలాంటి యాప్‌లు ఎవరు డౌన్లోడ్ చేసుకొని మోసపోవద్దు’ అన్నారు. (చదవండి: ఆన్లైన్లో ఏం చేస్తున్నారో గమనించండి) ‘ఈ ఏడాది సైబర్ క్రైమ్ నేరాలు చేసిన 12 రాష్ట్రాలకు చెందిన 259 మంది ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యారు. 19 మ్యాట్రిమోని కేసులు నమోదు అయ్యాయి. ఆన్లైన్ గేమింగ్‌పై ప్రత్యేకంగా నిఘా పెట్టాం. చైనా బేస్‌గా ఆన్లైన్ గేమింగ్‌పై తెలంగాణలో పలు కేసులు నమోదు అయ్యాయి. ఆన్లైన్ గేమింగ్ తెలంగాణలో నిషేధం. ఆన్లైన్ గేమింగ్ కేసులో 170 బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశాం. చైనా దేశస్తుడిని అరెస్ట్ చేశాం. ఇప్పటి వరకు 16వందల కోట్ల ట్రాన్సక్షన్ జరిగినట్టు గుర్తించాం’ అని షిఖా గోయల్ తెలిపారు. -
మహిళలపై నేరాలు తగ్గుముఖం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై జరుగుతున్న అరాచకాలు తగ్గాయి. ఢిల్లీ పోలీసులు విడుదల చేసిన క్రైమ్ రికార్డు జాబితాలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది మహిళల మీద జరుగుతున్న నేరాలు గతేడాదితో పోలిస్తే 2,111 తగ్గాయని ఆ నివేదిక వెల్లడించింది. 2020 సెప్టెంబర్ వరకు 7,236 కేసులు నమోదయ్యాయి. ఇది గతేడాదివతో పోలీస్తే 22.58 శాతం తక్కువ. గతేడాది 9,347 కేసులు నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది మహిళళపై జరుగుతున్న అత్యాచారాలు కూడా 29.8 శాతం తగ్గాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఢిల్లీలో ఐపీసీ సెక్షన్ 376 కింద 1,132 కేసులు నమోదయ్యాయి. అదే 2019లో ఈ కేసుల సంఖ్య 1613గా ఉంది. ఇదిలా ఉండగా ఐపీసీ సెక్షన్ 509 ( మహిళలను అవమానించడం) కింద నమోదయిన కేసుల సంఖ్య 312 రెట్లు పెరిగాయి. ఈ కేసులు 2019లో 333 నమోదు కాగా, 2020లో వీటి సంఖ్య ఒక్కసారిగా 1,374కు పెరిగింది. ఇక వరకట్న వేధింపులకు సంబంధించి 2020లో సెప్టెంబర్ 15వరకు 89 కేసులు నమోదు కాగా 2019లో వీటి సంఖ్య 107గా ఉంది. మొత్తం మీద 2020లో మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్య గణనీయంగానే తగ్గింది. మహిళల కిడ్నాప్‌ల సంఖ్య కూడా తగ్గింది. అయితే ఇది లాక్డౌన్ కారణంగా తగ్గిందా? భద్రతా ప్రమాణాలు పెంచడం వల్ల తగ్గింద అన్నది తెలియాల్సి ఉంది. చదవండి: ఉరి తీయండి లేదా ఎన్కౌంటర్ చేయండి -
నెట్లో అభ్యర్థుల నేరచరిత!
న్యూఢిల్లీ: చట్టసభల్లో నేరచరితుల సంఖ్య పెరిగిపోతూండటంపై సుప్రీంకోర్టు గురువారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్న వారిని ఎన్నికల్లో అభ్యర్థులుగా ఎందుకు నిర్ణయించారో వివరణ ఇవ్వడంతోపాటు ఆయా కేసుల జాబితాను రాజకీయ పక్షాలన్నీ తమ వెబ్సైట్లలో ఉంచాలని స్పష్టంచేసింది. ఎన్నికల్లో విజయం సాధించగలరన్న ఒకే ఒక్క కారణంతో నేర చరితులకు టిక్కెట్లు ఇచ్చామని పార్టీలు చెప్పజాలవని, వారి అర్హతలు, సమర్థత వంటి అంశాలను ప్రస్తావిస్తూ తగిన కారణాలు చూపాలని జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ రవీంద్రభట్‌ల బెంచ్ స్పష్టం చేసింది. రాజకీయాలు నేరపూరితం కావడంపైకోర్టు 2018 సెప్టెంబర్‌లో ఇచ్చిన తీర్పు(అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ నేరాల వివరాలు బహిర్గతం చేయాలి) అమలు కావడం లేదని, ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థులను ఎంపిక చేసిన 48 గంటల్లోగా లేదా నామినేషన్ల దాఖలు ప్రారంభమయ్యే తేదీకి కనీసం రెండు వారాల ముందు వారి నేర చరిత్రను ట్విట్టర్, ఫేస్బుక్ వంటి అన్ని సోషల్ మీడియా వేదికలపై వెల్లడించాలని, జాతీయ, స్థానిక వార్తా పత్రికల్లోనూ ప్రకటనలు జారీ చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలను పాటిస్తున్నట్లు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్‌కు లిఖిత పూర్వకంగా తెలపాలని, అభ్యర్థులను ఎంపిక చేసిన మూడు రోజు(72 గంటలు) ల్లోగా ఈ పని పూర్తి చేయాలని వివరించింది. ఎవరైనా ఈ ఆదేశాలను పాటించని పక్షంలో ఆ వివరాలను తమకు ఇవ్వాలని ఈసీకి చెప్పింది. నేర చరితులు పెరుగుతున్నారు గత నాలుగు ఎన్నికలను పరిశీలిస్తే చట్టసభల్లో నేరచరితులు ఎక్కువవుతున్నట్లు స్పష్టమవుతోందని సుప్రీంకోర్టు ఈ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. నేరచరితులను పోటీలో నిలిపిన పార్టీలకు లేదా అభ్యర్థులకు జరిమానా విధించాలన్న అంశంపై కొంత జాగరూకత అవసరమని, రాజకీయ కారణాలతో అభ్యర్థులపై తీవ్ర ఆరోపణలు వచ్చే అవకాశం ఉండటం ఇందుకు కారణమని కోర్టు వివరించింది. 2018 సెప్టెంబర్‌లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఒక ఏకగ్రీవ తీర్పునిస్తూ.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ తమపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను ఈసీకి వెల్లడించాలని, ఆ వివరాలకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా ప్రచారం కూడా కల్పించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రాజకీయాలు నేరపూరితం కావడమన్న రోగానికి పార్లమెంటు తగిన చికిత్స చేయాలని, నేర చరితులు చట్టసభల్లో ప్రవేశించకుండా చట్టాలు చేయాలని, కలుషితమైన రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందని తన ఆదేశాల్లో పేర్కొంది. నేర చరితులకు టికెట్లిస్తే అందుకు వివరణ ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను ప్రధాని మోదీ ఉల్లంఘించారని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ఆరోపించారు. ప్రజాస్వామ్యం మరింత బలోపేతం: బీజేపీ రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల నేరచరిత్రను ఆన్లైన్లో ఉంచాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. ఈ చర్య ద్వారా ఎన్నికల్లో ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని పేర్కొంది. ఎంపీల్లో 40 శాతం మందిపై కేసులు: ఈసీ పార్లమెంట్‌లోని కనీసం 43 శాతం ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఈసీ గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. కోర్టు ధిక్కరణకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా నేరచరితుల వివరాలను, వారి ఎంపికకు కారణాలను, క్రిమినల్ కేసులు లేని వారిని ఎందుకు ఎంపిక చేయలేదో తమతమ వెబ్సైట్లలో పార్టీలు వెల్లడించడాన్ని తప్పనిసరి చేయాలన్న బీజేపీ నేత, పిటిషనర్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ తరఫు న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ సూచనను ఈసీ అంగీకరించింది. ఈ మేరకు 2018 అక్టోబరు 10వ తేదీన ఫార్మ్ –26లో కొన్ని మార్పులు చేస్తూ నేర చరిత్ర వివరాలను అందించాల్సిందిగా రాజకీయ పార్టీలకు ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విషయంలో ఎలక్షన్ సింబల్ ఆర్డర్–1968లోగానీ, ఎన్నికల నిబంధనావళిలోగానీ తగు మార్పులు చేయకపోవడం వల్ల 2018 అక్టోబర్ నాటి నోటిఫికేషన్‌కు న్యాయబద్ధత లేకుండా పోయిందన్న అశ్వినీకుమార్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలను జారీ చేసింది. -
నేర చరితులకు టిక్కెట్లివ్వొద్దు: ఈసీ
న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నేరచరితను మీడియాలో ప్రకటించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల వల్ల రాజకీయాలు నేరమయం కావడం ఆగిపోలేదని శుక్రవారం ఎన్నికల సంఘం(ఈసీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. అందుకు బదులుగా, నేర చరిత్ర ఉన్నవారికి టికెట్లు ఇవ్వకూడదని రాజకీయ పార్టీలను ఆదేశించడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలు వెతకడం మంచిదని సూచించింది. నేరమయ రాజకీయాలను అరికట్టేందుకు వారంలోగా ఒక ప్రణాళికతో తమ ముందుకు రావాలని ఈ సందర్భంగా జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ రవీంద్ర భట్ల ధర్మాసనం ఈసీని కోరింది. ఈ విషయంలో ఈసీకి సహకరించాలని పిటిషనర్, బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయకు సూచించింది. రాజకీయాల్లో నేరస్తుల ప్రమేయాన్ని అరికట్టేందుకు ఈసీ ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకుందని ఈసీ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ కోర్టుకు తెలిపారు. నేరస్తులు రాజకీయాల్లోకి రాకుండా చూసే బాధ్యతను రాజకీయ పార్టీలకే అప్పగించడం మంచిదని సూచించారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో క్రిమినల్ కేసులున్న చట్ట సభ్యులను అనర్హులను చేసే దిశగా చట్టం రూపొందే అవకాశం కనిపించడం లేదు’ అన్నారు. అశ్విని ఉపాధ్యాయ తరఫు న్యాయవాది గోపాల శంకర్‌నారాయణ్ ఈ వాదనతో ఏకీభవించారు. ప్రస్తుతం పార్లమెంటు సభ్యుల్లో దాదాపు 46% మందికి నేర చరిత్ర ఉందని వివరించారు. అభ్యర్థులు తమపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను మీడియాకు తెలపాలని 2018లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. -
నేరాలు తగ్గినట్టేనా?
జాతీయ క్రైం రికార్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ) 2017నాటి నివేదిక వెలువరించిన మూడు నెలల్లోనే 2018 సంవత్సరం నివేదికను విడుదల చేసింది. ముగియబోయే సంవత్సరం నివేదికను ఏడాది చివరిలోనో, ఆ మరుసటి ఏడాది మొదట్లోనో విడుదల చేయడం రివాజు. దాన్ననుసరించి 2017 వార్షిక నివేదిక 2018లో రావాల్సివుండగా, ఏడాది ఆలస్యమై నిరుడు విడుదలైంది. అంత జాప్యం చోటుచేసుకున్నందుకు వచ్చిన విమర్శల వల్లకావొచ్చు... 2019 ముగిసిన కొన్ని రోజులకే 2018 నివేదిక బయటికొచ్చింది. స్థూలంగా చూస్తే నేరాల రేటు తగ్గినట్టు కనిపించినా మహిళలపై జరుగు తున్న నేరాలు పెరిగాయి. నేరాల రేటును గణించడంలో కొత్త విధానం అనుసరిస్తూ, దాని ద్వారా నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్న అభిప్రాయం కలిగిస్తున్నారని నిపుణుల విమర్శ. లక్షమంది జనాభాకు జరిగే నేరాల సంఖ్యను బట్టి ఈ నేరాల రేటును లెక్కేయడం ఎప్పటినుంచో ఆనవాయితీ. అయితే 2016 మొదలుకొని ఈ విధానం మారింది. దాని ప్రకారం ఒక ఎఫ్ఐఆర్లో వేర్వేరు నేరాలు నమోదైనప్పుడు వాటిల్లో గరిష్టంగా శిక్షపడగల తీవ్రమైన నేరాలను మాత్రమే పరిగణనలోకి తీసు కుంటారు. దాంతో ఇతర నేరాలన్నీ లెక్కలోకి రాకుండా పోతున్నాయి. ఒక బాలుడిని అపహరించి, గుర్తుతెలియని చోట నిర్బంధించి, అతన్ని హింసించి హత్య చేసిన సందర్భాలున్నప్పుడు ఎన్సీ ఆర్బీ ఇందులో అపహరణ, అక్రమ నిర్బంధం, చిత్రహింసలు పెట్టడం, హత్య చేయడం వంటి అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని గణాంకాల్లో చూపేది. కొత్త విధానం ప్రకారం గరిష్టకాలం శిక్ష పడే అవకాశంవున్న హత్యా నేరాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఇందువల్ల దేశంలో జరిగే నేరాల స్వభావంపైనా, వాటి తీరుపైనా అవగాహనకు రావడం కష్టమవుతుంది. నిరుడు అక్టోబర్‌లో విడుదలైన 2017నాటి నివేదిక తొలిసారి మహిళలు, పిల్లలపై జరిగే అఘాయిత్యాలను, దళితులపై జరిగే అఘాయిత్యాలను, అవినీతి ఉదంతాలను భిన్నవిధాలుగా వర్గీకరించారు. నకిలీ నోట్లనూ, నల్లధనాన్ని అరికట్టడానికి 2016లో పెద్ద నోట్లు రద్దు చేశాక విడుదల చేసిన రూ. 2,000 నోట్లపై నేరగాళ్ల దృష్టి పడిందని ఈ నివేదిక వెల్లడిస్తోంది. దేశంలో వేర్వేరు చోట్ల పట్టుబడిన నకిలీ కరెన్సీలో ఈ నోట్ల వాటా 61.01శాతం వున్నదంటే పరిస్థితి ఏవిధంగా వున్నదో అర్థం చేసుకోవచ్చు. 2017లో ఈ నోట్ల వాటా 53.30 శాతంవుంటే, ఇప్పుడది మరింత పెరగడం ఆందోళన కలిగిస్తుంది. గుజరాత్లో రూ. 2,000 నకిలీ నోట్లు అధికంగా పట్టుబడగా, తదనంతర స్థానాల్లో పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వున్నాయి. ఆ నోటును అనుకరించడం అసాధ్యమని అప్పట్లో రిజర్వ్ బ్యాంక్ ప్ర కటించడం గమనార్హం. సగటున రోజూ దేశవ్యాప్తంగా 80 హత్యలు, 91 అత్యాచారాలు, 289 అపహరణలు జరుగు తున్నాయని తాజా నివేదిక వెల్లడిస్తోంది. 2017లో ఈ నేరాల సంఖ్య 3,45,989 కాగా, 2018లో అవి 3,78,277కి చేరుకున్నాయి. అంటే నేరాలు 1.3 శాతంమేర పెరిగాయి. ఉత్తరాది ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై నేరాలు పెరిగాయి. ఆ రాష్ట్రంలో మహిళలపై మొత్తం 59,445 నేరాలు జరిగాయి. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే ఇవి దాదాపు 3,500 అధికం. అత్యాచారాలకు పాల్పడిన నేరగాళ్లలో 93.7శాతం మంది బాధితులకు తెలిసినవారే. 2017నాటి నివేదిక కూడా ఈ సంగతినే నిర్ధారించింది. మహిళలు గతంతో పోలిస్తే ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేసే తీరు పెరిగినందువల్ల అత్యాచార కేసుల సంఖ్యలో పెరుగుదల కనబడుతోందన్నది వాస్తవం. అయితే ఇప్పటికీ బాధితులు ఫిర్యాదు చేయడానికి ముందుకురాని స్థితి సమాజంలో వుంది. కనుక ఎన్సీఆర్బీ నివేదికలు వెల్లడించే సంఖ్యను మించి ఈ నేరాలు ఉండొచ్చుననే భావించాలి. ప్రభుత్వాల వైఖరి మారితే తప్ప ఈ నేరాలు తగ్గే అవకాశం వుండదు. అత్యాచారం జరి గినట్టు ఫిర్యాదు అందినప్పుడు వెనువెంటనే కదిలి నేరగాళ్లను అదుపులోనికి తీసుకుని, త్వరితగతిన దర్యాప్తు చేసినప్పుడు, న్యాయస్థానాల్లో సాధ్యమైనంత త్వరగా నేరగాళ్లకు శిక్షలు పడినప్పుడు మాత్రమే ఇవి అంతరిస్తాయి. అలాగే బాధితులను బాధితులుగా చూడకుండా, తప్పంతా వారిదే అయినట్టు ప్రశ్నించే పోలీసుల తీరు కూడా ఫిర్యాదు చేయడానికి బాధితులు వెనకాడేలా చేస్తోంది. పోలీసు గస్తీ పెంచడం, సమాచారం అందినవెంటనే స్పందించడం, ప్రజారవాణా విభాగాన్ని పటిష్టం చేయడం అత్యవసరం. మహిళలను చిన్నచూపు చూసే సామాజిక, సాంస్కృతిక ధోర ణులను అరికట్టడం అన్నిటికన్నా ముఖ్యం. మహిళలపై నేరాలను అరికట్టడం ప్రభుత్వాలకూ, పోలీసు విభాగాలకూ ప్రాధాన్యతాంశంగా మారినప్పుడు ఇవన్నీ సరిచేయడం సులభమవుతుంది. అంతక్రితంతో పోలిస్తే రైతుల ఆత్మహత్యలు తగ్గాయని గణాంకాలు చెప్పడం ఊరటనిస్తుంది. అయితే వాటిని తరచి చూస్తే పంటలు సరిగా పండని ప్రాంతాల్లో, వర్షపాతం సరిగాలేని ప్రాంతాల్లో ఈ ఆత్మహత్యలు ఇప్పటికీ గణనీయంగా వున్నాయని బోధపడుతుంది. రైతుల కష్టాలను తీర్చడంలో ప్రభుత్వాల చూపు మరింత నిశితం కావాల్సిన అవసరాన్ని ఇది ఎత్తిచూపుతోంది. దేశంలోని రైతుల్లో పది శాతంమంది భూమిలేనివారే. కౌలుకు తీసుకున్న భూముల్లో సాగు చేస్తూ, అందుకవసరమైన అప్పు బ్యాంకుల్లో దొరక్క, అధిక వడ్డీ వసూలు చేసే ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై ఆధారపడతారు. దాంతో అప్పుల ఊబిలో కూరుకుపోతారు. ఈమాదిరి అప్పులు సాగు ఉత్పత్తుల విలువలో సగానికిపైగా వుంటాయి. ఇలాంటి రైతులకు సైతం బ్యాంకు రుణాలు లభించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అలాగే ధరల స్థిరీకరణ నిధి, ఉచిత పంటల బీమా, ప్రకృతి విపత్తుల నిర్వహణ వగైరాలకు భారీ మొత్తంలో కేటాయింపులు చేసింది. 48 లక్షలమంది రైతులకు వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద రూ. 13,500 చొప్పున అందించింది. ఇతర రాష్ట్రాలు సాగు రంగంలో ఈ తరహా చర్యలు తీసుకుంటే రైతుల ఆత్మహత్యలు అరికట్టడం సాధ్యమవుతుంది. -
‘2019లో శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వర్తించాం’
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో తొలిసారి విజయవాడ రూరల్‌లో ఉన్న పోలీసు స్టేషన్‌కు టెక్నాలజీని సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు ఐఎస్ఓ సర్టిఫికెట్ వచ్చిందని విజయవాడ పోలీసు కమిషనర్ ద్వారకాతిరులమరావు తెలిపారు. 2019 వార్షిక మీడియా సమావేశాన్ని సీపీ ద్వారకాతిరుమలరావు సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2019లో శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వర్తించామన్నారు. అదేవిధంగా ఎన్నికల నిర్వహణ సంతృప్తినిచ్చిందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రితోపాటు ప్రముఖుల ప్రమాణస్వీకారాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించామని సీపీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. పదేళ్ల తరువాత కృష్ణానదికి వరద వచ్చిందని.. దాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ఆయన తెలిపారు. 2019లో ఎఫ్ఐఆర్ నమోదులు తగ్గాయని.. బైండోవర్ కేసులు పెరిగాయని వెల్లడించారు. కిడ్నాప్ కేసులు 25 శాతం, హత్యాయత్నం కేసులు 52 శాతం, దాడుల కేసులు 24 శాతం, ప్రాపర్టి అఫెన్స్ కేసులు 18 శాతం, వరకట్నం కేసులు 45 శాతం తగ్గాయన్నారు. దొంగతనం కేసులు 21 శాతం, మర్డర్ కేసులు 19 శాతం, గృహహింస కేసులు 11 శాతం పెరిగాయని సీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. వీటితోపాటు పోక్సో కేసులు 2018లో 95 కేసులు, 2019లో 67 కేసులు నమోదయ్యాయని సీపీ తెలిపారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ కేసులు, ఘరానామోసాలు తగ్గాయన్నారు. కాగా, 2018లో 498 కేసులు, 2019లో 463 కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని.. 2018లో 191, 2019లో 242 కేసులు నమోదయ్యాయని సీపీ తెలిపారు. సైబర్ క్రైమ్ కేసులో ప్రాపర్టీ రికవరీ గత ఏడాదితో పొలిస్తే ఈ ఏడాది ఎక్కవగా చేశామన్నారు. మిస్సింగ్ కేసులు తగ్గాయని 2018లో 788, 2019లో 624 కేసులు నమోదు చేశామన్నారు. ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా 199 మంది మగపిల్లల్ని, ఐదుగురు ఆడపిల్లలను గుర్తించామని సీపీ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గంచగలిగామని.. 2018లో 1,483 కేసులు, 2019లో 1,376 కేసులు నమోదయ్యాయని సీపీ తెలిపారు. 2019 టాస్క్ ఫోర్స్ కేసుల్లో కీలకమైనవి.. క్రికెట్ బెట్టింగ్, నకిలీ బంగారం, విదేశి సిగిరెట్లు, డ్రగ్స్, నకిలి సర్టిఫికెట్స్ కేసులని ఆయన పేర్కొన్నారు. కిడ్నాప్‌తో పాటు అత్యాచారం, మిస్సింగ్ లాంటి చాలా కీలకమైన కేసులను 2019లో చేధించగలిగామని సీపీ ద్వారకాతిరుమల రావు పేర్కొన్నారు. క్రైమ్ స్పాట్ వాహనాలు ప్రారంభించామని.. సైబర్ మిత్ర పేరుతో పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టామమని సీపీ తెలిపారు. గడిచిన ఆరునెలల్లో 2,968 స్పందన పిటిషన్లు వచ్చాయని.. 2,961 పిటిషన్లను పరిష్కరించామన్నారు. కేవలం 7 పిటిషన్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 379 పిటిషన్లపై ఎఫ్ఐఆర్లు నమొదు చేశామన్నారు. రూ.10 కోట్లతో మాచవరం, ఉయ్యూరు, కంకిపాడు పోలీసు స్టేషన్లను నిర్మించామని అయన పేర్కొన్నారు. రూ.2.75 కోట్లతో కృష్ణలంక, భవానిపురం, సత్యనారాయణపురంలో పోలీసుల స్టేషన్ల భవన నిర్మాణం జరగుతుందన్నారు. డయిల్ 100కు 3,06,036 కాల్స్ వచ్చాయని.. 72,889 కాల్స్ మాత్రమే నిజమైనవని, మిగిలిన 2,33,147 కాల్స్ ఆకతాయిలు చేసిన నకిలీవి వచ్చాయని సీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.