Department of Commerce
-
Wholesale price inflation: 3 నెలల గరిష్టానికి టోకు ధరలు
న్యూఢిల్లీ: దేశీయంగా టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యూపీఐ) మూడు నెలల గరిష్టానికి ఎగిసింది. కూరగాయలు, బంగాళదుంప, ఉల్లి, ముడి చమురు మొదలైన వాటి ధరల పెరుగుదల కారణంగా మార్చిలో 0.53 శాతంగా (ప్రొవిజనల్) నమోదైంది. ఫిబ్రవరిలో ఇది 0.20 శాతంగా ఉంది. గతేడాది మార్చిలో ఇది 1.41 శాతంగా నమోదైంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మైనస్‌లోనే ఉన్న టోకు ధరల ఆధారిత సూచీ నవంబర్‌లో ప్లస్ 0.26 శాతానికి వచి్చంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. రిటైల్ ద్రవ్యోల్బణం అయిదు నెలల కనిష్ట స్థాయి 4.85 శాతానికి తగ్గిన నేపథ్యంలో తాజా టోకు గణాంకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బేస్ ఎఫెక్ట్ తగ్గుతుండటంతో రాబోయే రోజుల్లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. గతేడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 5.42 శాతం నుంచి 6.88 శాతానికి చేరింది. కూరగాయల ధరల పెరుగుదల మైనస్ 2.39 శాతం నుంచి 19.52 శాతానికి ఎగిసింది. -
పీఎల్ఐ కింద రూ.4,415 కోట్ల ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నాటికి, ఎనిమిది రంగాలకు రూ.4,415 కోట్ల ప్రోత్సాహకాలను కేంద్ర సర్కారు మంజూరు చేసింది. ఈ విషయాన్ని వాణిజ్య శాఖ విభాగం డీపీఐఐటీ అదనపు కార్యదర్శి రాజీవ్ సింగ్ ఠాకూర్ వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి రూ.11,000 కోట్లను మంజూరు చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు ప్రకటించారు. కేవలం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరకే చూస్తే అక్టోబర్ నాటికి జారీ చేసిన మొత్తం రూ.1,515 కోట్లుగా ఉన్నట్టు, 2022–23లో రూ.2,900 కోట్లు మంజూరు చేసినట్టు వివరించారు. పెద్ద స్థాయి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ, ఐటీ హార్డ్‌వేర్, బల్క్ డ్రగ్స్, వైద్య పరికరాలు, ఫార్మా, టెలికం, ఫుడ్ ప్రాసెసింగ్, డ్రోన్స్ రంగాలకు ఈ ప్రోత్సాహకాలను అందించినట్టు తెలిపారు. శామ్సంగ్ కంపెనీకి సంబంధించి ప్రోత్సాహకాల క్లెయిమ్‌లలో ఒక కేసు పరిష్కారమైనట్టు చెప్పారు. 2021లో కేంద్ర సర్కారు 14 రంగాలకు పీఎల్ఐ పథకాల కింద ప్రోత్సాహకాలను ప్రకటించడం గమనార్హం. టెలికం, వైట్ గూడ్స్, టెక్స్టైల్స్, వైద్య పరికరాల తయారీ, ఆటోమొబైల్స్, స్పెషాలిటీ స్టీల్, ఆహారోత్పత్తులు, అధిక సామర్థ్యం కలిగిన సోలార్ పీవీ మాడ్యూల్స్, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ, డ్రోన్లు, ఫార్మా తదితర రంగాలకు రూ.1.97 లక్షల కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించింది. వీటికి సంబంధించి దేశీ తయారీని ప్రోత్సహించాలన్నది కేంద్ర సర్కారు లక్ష్యంగా ఉంది. పీఎల్ఐ కింద ప్రోత్సాహకాల పంపిణీ అన్నది ఆయా శాఖల బాధ్యతగా ఠాకూర్ చెప్పారు. ప్రాజెక్టు పర్యవేక్షక ఏజెన్సీలు (పీఎంఏలు), కంపెనీల మధ్య సరైన సమాచారం లేకపోవడం వల్ల సమయం వృధా అవుతున్న సందర్భాలున్నట్టు తెలిపారు. దీంతో దరఖాస్తుల మదింపు ప్రక్రియకు పట్టే సమయాన్ని తగ్గించేందుకు వీలుగా ప్రామాణిక విధానాన్ని రూపొందించుకోవాలని ఆదేశించినట్టు వెల్లడించారు. రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటి వరకు పీఎల్ఐ కింద 14 రంగాల్లోని కంపెనీల నుంచి 746 దరఖాస్తులు వచ్చాయని, ఇవి రూ.3 లక్షల కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్టు రాజీవ్‌సింగ్ ఠాకూర్ తెలిపారు. 2023 నవంబర్ నాటికి రూ.1.03 లక్షల కోట్ల పెట్టుబడులు నమోదైనట్టు చెప్పారు. వీటి ద్వారా రూ.8.61 లక్షల కోట్ల అమ్మకాలు, 6.78 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఫార్మా, టెలికం తదితర రంగాల్లో ప్రోత్సాహకాలను అందుకునే వాటిల్లో 176 ఎంఎస్ఎంఈలు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. పీఎల్ఐ ప్రోత్సాహకాల మద్దతుతో రూ.3.2 లక్షల కోట్ల ఎగుమతులు నమోదైనట్టు ఠాకూర్ తెలిపారు. ఎగుమతుల్లో ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, టెలికం రంగాల భాగస్వామ్యం ఎక్కువగా ఉందన్నారు. -
ఓఎన్డీసీతో ఆర్థిక సేవలు, తయారీకి దన్ను
న్యూఢిల్లీ: చిన్న రిటైలర్లకు కూడా ఈ–కామర్స్ ప్రయోజనాలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర వాణిజ్య శాఖ ప్రారంభించిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)తో నాలుగు కీలక రంగాల వృద్ధికి ఊతం లభించగలదని కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఒక నివేదికలో వెల్లడించింది. ఆర్థిక సేవలు, వ్యవసాయం, తయారీ, ఈ–కామర్స్ రిటైల్ వీటిలో ఉంటాయని పేర్కొంది. రుణ అవసరాల కోసం ప్రభుత్వ పథకాలు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలపై ఎక్కువగా ఆధారపడే చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ఆర్థిక సేవల సంస్థలు చేరువయ్యేందుకు ఓఎన్డీసీ ఉపయోగపడగలదని వివరించింది. సాధారణంగా ఎంఎస్ఎంఈల ఆర్థిక గణాంకాల సరిగ్గా అందుబాటులో లేకపోవడం వల్ల వాటి రుణ దరఖాస్తులు తిరస్కరణకు గురవుతుంటాయి. అయితే, ఓఎన్డీసీ ద్వారా అవి నిర్వహించే లావాదేవీల డేటా అంతా వ్యవస్థలో డిజిటల్‌గా నిక్షిప్తం కావడం వల్ల వాటికి అనువైన ఆర్థిక సాధనాలను రూపొందించడానికి ఫైనాన్షియల్ సంస్థలకు వీలవుతుందని నివేదిక పేర్కొంది. ‘పరిస్థితికి అనుగుణంగా మారగలిగే స్వభావం, భద్రత, లాభదాయకత.. ఏకకాలంలో ఈ మూడింటి మేళవింపుతో ఓఎన్డీసీ ఎంతో విశిష్టంగా రూపొందింది. ఇది సరఫరా, డిమాండ్ మధ్య వ్యత్యాసాలను భర్తీ చేయగలదు. నవకల్పనలకు తోడ్పాటునివ్వగలదు. తద్వారా కొత్త తరం వినూత్నంగా ఆలోచించేందుకు బాటలు వేయగలదు‘ అని డెలాయిట్ దక్షిణాసియా ప్రెసిడెంట్ (కన్సలి్టంగ్) సతీష్ గోపాలయ్య తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలకు ఓఎన్డీసీ ఒక గొప్ప అవకాశం కాగలదని ఆయన పేర్కొన్నారు. నివేదికలో మరిన్ని వివరాలు.. ► కోవిడ్ మహమ్మారి అనంతరం భోగోళిక–రాజకీయ ఉద్రిక్తతల కారణంగా తయారీ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వాణిజ్య పరిస్థితులు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు, పరికరాల కొరత, కమోడిటీల ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. తయారీ సంస్థలు ఈ సవాళ్లను వ్యాపార అవకాశాలుగా మల్చుకునేందుకు ఓఎన్డీసీ ఉపయోగపడవచ్చు. ఓఎన్డీసీలో లాజిస్టిక్స్ సేవలు అందించే సంస్థలు పుష్కలంగా ఉన్నందున.. లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గించుకునేందుకు, మరింత సమర్ధంగా డిమాండ్‌కి అనుగుణంగా స్పందించేందుకు వీలవుతుంది. ► ఆన్లైన్ అమ్మకాలకు ప్రాధాన్యం పెరుగుతున్నందున, రిటైల్ పరిశ్రమ భాగస్వాములు (బ్రాండ్లు, రిటైలర్లు, పంపిణీదారులు, సరఫరాదారులు) తమ వ్యవస్థలో అంతర్గతంగా మిగతా వర్గాలతో కలిసి పనిచేసేందుకు, అలాగే కస్టమర్లను చేరుకునేందుకు కూడా ఓఎన్డీసీ సహాయకరంగా ఉండనుంది. ► గత కొద్ది నెలలుగా నిత్యావసరాలు, ఫుడ్ డెలివరీ, గృహాలంకరణ, ఎల్రక్టానిక్స్, ఫ్యాషన్, లైఫ్‌స్టయిల్, సౌందర్య.. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ఫార్మా తదితర విభాగాల సంస్థలు ఓఎన్డీసీ నెట్‌వర్క్‌ను సమర్ధమంతంగా వినియోగించుకుంటున్నాయి. ► డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసాన్ని తక్కువ వ్యయాలతో పరిష్కరించుకోవడానికి బ్రాండ్స్/రిటైలర్లు/ఎంఎస్ఎంఈలకు ఓఎన్డీసీ ద్వారా అవకాశం లభిస్తుంది. బ్రాండ్లు నేరుగా రిటైలర్లను చేరుకోవడానికి, పంపిణీదారులు తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకోవడానికి కూడా ఇది తోడ్పడగలదు. ఇందుకోసం ఆయా సంస్థలు ఇరవై నాలుగ్గంటలూ ఆర్డర్ చేసేందుకు వెసులుబాటు, మరుసటి రోజే డెలివరీ, ఆటో ఆర్డరింగ్ వంటి సదుపాయాలను కలి్పంచవచ్చు. ► బ్రాండ్స్/రిటైలర్లు తమ సరఫరాదారుల వ్యవస్థను విస్తరించుకునేందుకు, ముడి వనరులు లేదా తయారీ ఉత్పత్తుల సేకరణ వ్యయాలను తగ్గించుకునేందుకు ఓఎన్డీసీ ఉపయోగకరంగా ఉండగలదు. ► ఇటు కొనుగోలుదారులను, అటు విక్రేతలను ఒకే వేదికపైకి తెచ్చే అవకాశం ఉన్నందున దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగాన్ని పెంచేందుకు ఇది సహాయకరంగా ఉండగలదు. ప్రాచుర్యం పొందడంలో సవాళ్లు ఎదుర్కొంటున్న అగ్రిటెక్ అంకుర వ్యవస్థలకు ఈ నెట్వర్క్ ఒక వరంగా మారగలదు. కంపెనీలు, ప్రభుత్వ సంస్థల నుంచి రైతు ఉత్పత్తి సంస్థలకు (ఎఫ్‌పీవో) ముడి సరుకు, సాంకేతికత, పరికరాలు, సేవలు అందుబాటులోకి రాగలవు. -
రూ. లక్షన్నర కోట్ల ఎగుమతులు
సాక్షి, అమరావతి: వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. 2019–20లో తొలిసారిగా రూ.లక్ష కోట్ల మార్కును చేరుకున్న రాష్ట్ర ఎగుమతులు నాలుగేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల మార్కును అధిగమించాయి. 2019–20లో రాష్ట్రం నుంచి రూ.1,04,829 కోట్ల ఎగుమతులు జరగగా 2022–23 నాటికి రూ.1,59,368.02 కోట్ల మార్కును చేరుకోవడం గమనార్హం. నాలుగేళ్లలో ఎగుమతులు దాదాపు రూ.55 వేల కోట్ల మేర పెరిగాయి. రాష్ట్రాల వారీగా ఎగుమతుల వివరాలను కేంద్ర వాణిజ్య శాఖ తాజాగా విడుదల చేసింది. అత్యధికంగా ఆక్వా 2022–23లో దేశవ్యాప్తంగా రూ.36,20,630.9 కోట్ల విలువైన ఎగుమతులు జరగగా 4.41 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో నిలిచింది. రూ.12,00,001.94 కోట్ల ఎగుమతులతో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఏపీ నుంచి అత్యధికంగా రూ.19,872.82 కోట్ల విలువైన ఆక్వా ఎగుమతులు జరగగా రూ.9,919 కోట్ల ఎగుమతులతో ఫార్మా రంగం రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలవారీగా చూస్తే ఉమ్మడి విశాఖ రూ.48,608.59 కోట్ల విలువైన ఎగుమతులతో అగ్రభాగాన ఉంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రూ.31426.23 కోట్ల ఎగుమతులతో ఆ తర్వాతి స్థానం దక్కించుకుంది. 10 శాతం మార్కెట్ వాటాపై దృష్టి దేశీయ ఎగుమతుల్లో 2030 నాటికి 10 శాతం వాటాను సాధించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా 2025–26 నాటికి రాష్ట్రంలో అదనంగా 110 మిలియన్ టన్నుల అదనపు సామర్థ్యం అందుబాటులోకి తెచ్చే విధంగా ఏకకాలంలో నాలుగు పోర్టులను నిర్మిస్తున్నారు. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ సెజ్‌ల్లో కొత్తగా నాలుగు పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.18,897 కోట్లను వ్యయం చేస్తోంది. రామాయపట్నం పోర్టు ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానుండగా మిగిలిన పోర్టులు 18 నుంచి 24 నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. వీటికి అదనంగా రూ.3,700 కోట్లతో మరో పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతోంది. వీటి చెంతనే ఫుడ్ పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. నాలుగు ఫిషింగ్ హార్బర్లు ఈ సంవత్సరాంతానికి అందుబాటులోకి రానుండగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. కొత్తగా ని ర్మించే నాలుగు పోర్టుల ద్వారా అదనంగా లక్ష మందికి ఉపాధి లభించడంతో పాటు రాష్ట్ర జీడీపీ, ప్రజల తలసరి ఆదాయంలో గణనీయమైన వృద్ధి నమోదవుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో.. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విస్తరించడంతో జిల్లాల వారీగా ఎగుమతి అవకాశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఎగుమతిదారులకు చేయూతనందించేలా తగినంత మంది అధికారులు అందుబాటులోకి వచ్చారు. విదేశాలకు ఇతర ఉత్పత్తుల ఎగుమతి అవకాశాలతోపాటు కొత్త దేశాల్లో అవకాశాలను గుర్తించి స్థానిక అవకాశాలను పరిశీలిస్తున్నాం. సుదీర్ఘ తీరప్రాంతాన్ని వినియోగించుకుంటూ సముద్ర ఆధారిత వాణిజ్య అవకాశాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నాం. నాలుగు పోర్టులతో పాటు పోర్టులకు ఆనుకుని పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. – ప్రవీణ్ కుమార్, సీఈవో, ఏపీమారిటైమ్ బోర్డు. -
పసిడి దిగుమతులు 24 శాతం డౌన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొ న్న నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం (2022– 23)లో పసిడి దిగుమతులు 24% తగ్గాయి. వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 35 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2021– 22లో ఇవి 46.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2022 ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు మందగించిన పసిడి దిగుమతులు మార్చిలో ఒక్కసారిగా ఎగిశాయి. ఆ నెలలో 3.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది మార్చిలో ఇవి 1 బిలియన్ డాలర్లే. ఇక వెండి దిగుమతులు గత ఆర్థిక సంవత్సరం 6 శాతం పెరిగి 5.29 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. బంగారం దిగుమతులు తగ్గినప్పటికీ వాణిజ్య లోటు భర్తీ యత్నాలకు పెద్దగా తోడ్పడలేదు. 2022– 23లో ఉత్పత్తులపరమైన వాణిజ్య లోటు 181 బిలియన్ డాలర్ల నుంచి 267 బిలియన్ డాలర్లకు పెరిగింది. రత్నాభరణాల ఎగుమతులు 3 శాతం క్షీణించి 38 బిలియన్ డాలర్లకు పరిమిత మయ్యాయి. అధిక సుంకాలు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు బంగారం దిగుమతులపై ప్రతికూల ప్రభావం చూపినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దేశీ పరిశ్రమకు తోడ్పాటు అందించే దిశగా సుంకాలను తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని పేర్కొన్నాయి. అమెరికాలో అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉండటం, రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం, చైనా ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం తదితర అంశాల కారణంగా రత్నాభరణాల రంగానికి సవాళ్లు తప్పకపోవచ్చని పరిశ్రమ సమాఖ్య జీజేఈపీసీ మాజీ చైర్మన్ కొలిన్ షా అభిప్రాయపడ్డారు. జ్యుయలరీ పరిశ్రమ అవసరాల కోసం భారత్ ఏటా దాదాపు 800–900 టన్నులను దిగుమతి చేసుకుంటోంది. కరెంటు అకౌంటు లోటు (సీఏడీ)ని కట్టడి చేసే దిశగా పసిడిపై దిగుమతి సుంకాన్ని కేంద్రం 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. -
ఎగుమతులపై ప్రపంచ అనిశ్చితి ప్రభావం! డిసెంబర్లో వృద్ధిలేకపోగా..
న్యూఢిల్లీ: భారత్ వస్తు ఎగుమతులపై అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావం కనబడుతోంది. 2022 డిసెంబర్ ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా 12.2 శాతం క్షీణతను నమోదుచేసుకున్నట్లు వాణిజ్యశాఖ వెలువరించిన తాజా గణాంకాలు వెల్లడించాయి. గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► 2022 డిసెంబర్లో వస్తు ఎగుమతుల విలువ 2021 ఇదే నెలతో పోల్చి 12.2 శాతం తగ్గి, 34.48 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ► ఇక వస్తు దిగుమతుల విలువ కూడా 3.5 శాతం తగ్గి 58.24 బిలియన్ డాలర్లుగా ఉంది. ► వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 23.76 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ► ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతుల విలువ డిసెంబర్లో 12 శాతం పడిపోయి 9.08 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► రత్నాలు ఆభరణాల ఎగుమతులు సైతం 15.2 శాతం పడిపోయి 2.54 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ► కాఫీ, జీడిపప్పు, ఔషధాలు, కార్పెట్, హస్తకళ లు , తోలు ఉత్పత్తుల ఎగుమతులు కూడా భారీ గా తగ్గాయి. ► పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు కూడా 27 శాతం తగ్గి 4.93 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► ఇక చమురు దిగుమతులు 6 శాతం పెరిగి 17.5 బిలియన్ డాలర్లకు చేరగా, పసిడి దిగుమతులు 75 శాతం క్షీణించి 1.18 బిలియన్ డాలర్లకు చేరాయి. తొమ్మిది నెలల పరిస్థితి ఇలా... ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య దేశ వస్తు ఎగుమతులు 9 శాతం పెరిగి 332.76 బిలియన్ డాలర్లుగా నమోదయితే, దిగుమతుల విలువ 24.96 శాతం పెరిగి 551.7 బిలియన్ డాలర్లుగా ఉంది. వెరసి వాణిజ్యలోటు 218.94 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021–22లో దాదాపు 400 బిలియన్ డాలర్ల విలువైన వస్తు ఎగుమతులు జరగ్గా, 2022–23లో ఈ స్థాయికి మించి ఎగుమతులు జరగాలన్నది కేంద్రం ధ్యేయం. అయితే అంతర్జాతీయ అనిశ్చితి వల్ల ఈ లక్ష్యంపై నీలినీడలు అలముకుంటున్నాయి. గడచిన తొమ్మిది నెలల్లో క్రూడ్ ఆయిల్ దిగుమతల విలువ 45.62 శాతం పెరిగి 163.91 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక ఎలక్ట్రానిక్స్ రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) వంటి ప్రోత్సాహకాల వల్ల ప్రయోజనం ఒనగూడిందని వాణిజ్యశాఖ కార్యదర్శి సునిల్ భరత్వాల్ పేర్కొన్నారు. ఈ రంగంలో ఎగుమతులు ఏప్రిల్–డిసెంబర్ మధ్య 52 శాతం పెరిగి 17 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. రష్యా నుంచి ఏప్రిల్–డిసెంబర్ మధ్య దిగుమతులు నాలుగురెట్లు పెరిగి 32.88 బిలియన్ డాలర్లకు చేరాయి. చైనా నుంచి సైతం దిగుమతులు 12 శాతం పెరిగి 75.87 బిలియన్ డాలర్లకు చేరాయి. ఎగుమతులు 35.58 శాతం తగ్గి 11 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఎగుమతులు విషయంలో 6.8 శాతం పెరుగుదలతో (59.57 బిలియన్ డాలర్లు) అమెరికా అతిపెద్ద ఎగుమతుల భాగస్వామిగా ఉండగా, తరువాతి స్థానంలో యూఏఈ, నెథర్లాండ్స్, బంగ్లాదేశ్, సింపూర్‌లు నిలిచాయి. -
పెట్టుబడుల్లో ఫస్ట్.. దేశంలోనే మొదటి స్థానం
సాక్షి, అమరావతి: ప్రచార ఆర్భాటాలు, దుబారా ఖర్చులకు దూరంగా ఉంటూ పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పించి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తేవడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఏపీలో రూ.44,286 కోట్ల విలువైన పెట్టుబడులు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా వాస్తవ రూపంలోకి వచ్చినట్లు కేంద్ర వాణిజ్య శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తాజా గణాంకాల్లో వెల్లడించింది. వీటి ద్వారా మొత్తం 70,000 మంది ఉపాధి పొందుతున్నట్లు అంచనా వేస్తున్నారు. గత జనవరి నుంచి తొమ్మిది నెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా రూ.1,99,399 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రాగా ఇందులో 20 శాతం పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్ వరుసగా తరువాత స్థానాల్లో ఉన్నాయి. 2020 నుంచి 129 యూనిట్లలో ఉత్పత్తి రాష్ట్రంలో ఈ ఏడాది ఉత్పత్తిని ప్రారంభించిన ప్రముఖ కంపెనీల్లో ఏటీజీ టైర్స్, నాట్కో ఫార్మా, గ్రీన్కో సోలార్, ఇసుజు, ఇండస్ కాఫీ, రుచి సోయా, సెంబ్‌కార్ప్, కోరమాండల్, ప్రీమియం ఎలక్ట్రిక్, ఎన్జీసీ ట్రాన్స్మిషన్, విష్ణు బేరియం తదిరాలున్నాయి. ఇక 2020 జనవరి నుంచి 2022 సెప్టెంబర్ వరకు ఆంధ్రప్రదేశ్‌లో 129 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా రూ.64,476 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చినట్లు డీపీఐఐటీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొత్తగా మరో రూ.13,516 కోట్ల పెట్టుబడులు ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 37 యూనిట్లు నిర్మాణ పనులను ప్రారంభించాయి. వీటి ద్వారా మరో రూ.13,516 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రంలోకి రానున్నాయి. 2020 జనవరి నుంచి ఇప్పటి వరకు 143 కొత్త యూనిట్లు రాష్ట్రంలో నిర్మాణ పనులు ప్రారంభించగా వీటిద్వారా మొత్తం రూ.32,616 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రంలోకి రానున్నాయి. రాష్ట్రంలో కొత్తగా నిర్మాణ పనులు ప్రారంభించిన కంపెనీల్లో గ్రాసిమ్, సెంచురీ ప్లే, మునోత్ ఇండ్రస్టీస్, టీటీఈ ఎలక్ట్రానిక్స్, ఐటీసీ, బ్లూస్టార్, హావెల్స్ లాంటి సంస్థలున్నాయి. సింగిల్ విండోలో అనుమతులు.. ముఖ్యమంత్రి జగన్ పెట్టుబడులకు పెద్దపీట వేస్తూ ప్రతిపాదన దగ్గర నుంచి ఉత్పత్తి ప్రారంభం వరకు సింగిల్ విండో విధానంలో అన్ని అనుమతులు మంజూరు చేయడం ద్వారా చేయూత అందిస్తున్నారని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. కార్పొరేట్ దిగ్గజ సంస్థలు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవను అభినందిస్తున్నాయని గుర్తు చేశారు. పరిశ్రమలకు పూర్తి స్థాయి మద్దతు అందిస్తుండటం వల్లే వరుసగా మూడో ఏడాదీ సర్వే ద్వారా ప్రకటించిన సులభతర వాణిజ్య ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. ఎంఎస్ఎంఈలతో 10.04 లక్షల మందికి ఉపాధి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో మూడున్నరేళ్లల్లో 1,08,206 యూనిట్లు ఏర్పాటు కావడం ఇందుకు నిదర్శనం. వీటి ద్వారా రూ.20,537.28 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు 10,04,555 మందికి ఉపాధి లభించింది. పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వకుండా గత సర్కారు బకాయి పెట్టిన రూ.962.05 కోట్లను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడమే కాకుండా ఏ ఏడాది రాయితీలను అదే సంవత్సరం చెల్లిస్తోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1,715.16 కోట్ల రాయితీలను, రూ.1,144 కోట్ల విలువైన విద్యుత్ రాయితీ ప్రోత్సాహకాలను చెల్లించింది. లాక్‌డౌన్‌తో పూర్తిగా వ్యాపారాలు నిలిచిపోయి జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నప్పుడు దేశంలో ఎక్కడా లేనివిధంగా రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుందని ఫ్యాప్సియా ప్రెసిడెంట్ మురళీకృష్ణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు దేశంలోనే తొలిసారిగా వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ద్వారా 2020–21లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.235.74 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.41.58 కోట్ల రాయితీలను విడుదల చేసింది. 2021–22లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.111.78 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.24.41 కోట్ల రాయితీలను అందచేసింది. మరో 20 భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన! రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించడంతోపాటు కొత్త ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు జారీ చేయడం ద్వారా నిర్మాణ పనులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రానున్న రెండు నెలల్లో రూ.64,555 కోట్ల విలువైన 20 భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసే విధంగా పరిశ్రమల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. రూ.14,634 కోట్లతో అదానీకి చెందిన వైజాగ్ టెక్‌పార్క్ లిమిటెడ్ నెలకొల్పే డేటా సెంటర్, ఐటీ పార్క్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. రూ.43,143 కోట్లతో నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద ఇండోసోల్ సోలార్ కంపెనీ నెలకొల్పే సౌర విద్యుత్ ఉపకరణాల తయారీ యూనిట్ పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. తిరుపతి జిల్లాలో 2.25 మిలియన్ టన్నుల సామర్థ్యంతో జిందాల్ స్టీల్ ప్లాంట్ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 20 యూనిట్లు నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ఉత్పత్తి ప్రారంభిస్తే 44,285 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఫిబ్రవరి చివరి వారంలో జరిగే పెట్టుబడుల సదస్సు నాటికి శంకుస్థాపనలు పూర్తి చేయాలని పరిశ్రమల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. -
భవిష్యత్‌కు సిద్ధంగా వాణిజ్య శాఖ
న్యూఢిల్లీ: వాణిజ్య శాఖ భవిష్యత్తుకు సన్నద్ధమవుతోందని, 2030 నాటికి 2 లక్షల కోట్ల డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించేందుకు కావాల్సిన ఎకోసిస్టమ్ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. వాణిజ్య శాఖ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా వాణిజ్య ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వద్ద సమర్థవంతమైన సంప్రదింపులు, చర్చలకు వీలుగా వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం ఇందులో భాగంగా ఉంటుందన్నారు. సులభతర వాణిజ్య ప్రక్రియకు వీలుగా డిజిటైజేషన్, డేటా అనలైటిక్స్ ఎకోసిస్టమ్‌ను మెరుగుపరచనున్నట్టు మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ వాటా పెంచడం, దేశీయంగా ఉపాధి కల్పించడమే ఉద్దేశ్యమని చెప్పారు. వాణిజ్య శాఖ పునర్నిర్మాణంలో భాగంగా సిబ్బందిని తగ్గించబోమని మంత్రి భరోసా ఇచ్చారు. ఇతర దేశాలతో బహుమఖ, ద్వైపాక్షిక ఒప్పందాల దిశగా తమ శాఖ సంప్రదింపులు చేస్తోందన్నారు. అంతర్జాతీయ వేదికల వద్ద భారత్ తరఫున సమర్థంగా వాదనలు వినిపించేందుకు ప్రైవేటు రంగం నుంచి నిపుణులను నియమించుకుంటామని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా పనితీరు ఉందన్నారు. -
ఏపీ వాణిజ్య శాఖ పనితీరు దేశంలోనే అత్యుత్తమం
భవానీపురం(విజయవాడ): దేశ వాణిజ్య పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ పనితీరు కనబర్చడం ద్వారా ఉన్నత స్థితిలో ఉందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. రెవెన్యూ అనేది పాలనలో కీలకమని, ఇందుకోసం వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. విజయవాడలో బుధవారం జరిగిన వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ స్వర్ణోత్సవాల్లో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ 2019లో వైఎస్సార్సీపీ భారీ మెజార్టీ సాధించడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని, ఉద్యోగుల సంఘ నేతగా సూర్యనారాయణ మంచి పనితీరు కనబర్చారని ప్రశంసించారు. కార్యక్రమంలో పాల్గొన్న సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఉద్యోగులంటే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక అభిమానమని, కానీ కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితులు కారణంగా పీఆర్సీ విషయంలో వారితో సంప్రదింపులు చేయాల్సి వచ్చిందన్నారు. 50 ఏళ్లుగా ఒకే యూనియన్‌గా వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ పనిచేయడం అభినందనీయమన్నారు. అలాంటి పార్టీలతో జాగ్రత్త : సజ్జల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు అడగకుండానే సీఎం వైఎస్ జగన్ 27% మధ్యంతర భృతి ఇచ్చారని గుర్తు చేశారు. రెండు, మూడు దశాబ్దాలుగా ఎన్నికల సమయంలో హామీలివ్వడం ఆ తర్వాత మర్చిపోవడం ఆనవాయితీగా వస్తోందని, సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం, అభివృద్ధిని ప్రజా సంక్షేమంతో కలిసి చూస్తోందని చెప్పారు. ఇవ్వగలమన్న ఉద్దేశంతోనే సీపీఎస్ రద్దు వంటి హామీలిచ్చామని, కానీ రాష్ట్ర ఆదాయంపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపిందని, అయినా ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ఎప్పుడూ పెద్దపీట వేస్తోందని చెప్పారు. ఎన్నికలు వస్తుండటంతో ఉద్యోగులను వాడుకునేందుకు పార్టీలు వస్తున్నాయని.. వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సుమారుగా 10 రాష్ట్రాల నుంచి హాజరైన అధికారులు జీఎస్టీ సంబంధిత అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 2,000 మందికిపైగా ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. -
400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యానికి చేరువ
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021 ఏప్రిల్–2022 మార్చి) 400 బిలియన్ డాలర్ల తన ఎగుమతుల లక్ష్యాన్ని సాధించనుందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. మార్చి 14వ తేదీ నాటికి భారత్ ఎగుమతుల విలువ 390 బిలియన్ డాలర్లకు చేరినట్లు తెలిపారు. ఆటో విడిభాగాల పరిశ్రమ మొట్టమొదటిసారి 600 మిలియన్ డాలర్ల మిగులు రికార్డును సాధించినట్లు వెల్లడించారు. ఆటో తయారీదారులు స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, దిగుమతుల ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని ఆటోమోటివ్ కాంపోనెంట్ రంగానికి సంబంధించి జరిగిన ఒక కార్యక్రమంలో కోరారు. అలాగే పరిశోధనా అభివృద్దిపై (ఆర్అండ్డీ) దృష్టి సారించాలని ఈ రంగానికి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకించి ఇందుకు సంబంధించి ఈ–మొబిలిటీపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. జీఐ ట్యాగ్ ఉత్పత్తుల ఎగుమతులు పెరగాలి... కాగా, స్థానికంగా జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ (జీఐ) ట్యాగ్ చేసిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పెరగాల్సిన అవసరం ఉందని వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ దిశలో ప్రభుత్వం కొన్ని కొత్త ఉత్పత్తులను, వాటిని ఎగుమతి చేయాల్సిన దేశాలను గుర్తించే పనిలో ఉన్నట్లు వెల్లడించింది. పలు రాష్ట్రాల్లో జీఐ ట్యాగ్ ఉన్న పలు ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని, ఆయా ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో ‘ఉత్సుకత’ ఉన్న కొనుగోలుదారులను చేరలేకపోతున్నాయని వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ సమస్య పరిష్కారానికి అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) ద్వారా ప్రభుత్వం పలు చర్యలకు శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించింది. జీఐ ఉత్పత్తులంటే... జీఐ ట్యాగ్ ఉత్పత్తుల్లో తిరుపతి లడ్డూసహా కాలా నమక్ బియ్యం, నాగా మిర్చా, బెంగళూరు రోజ్ ఆనియన్, షాహి లిచ్చి, భలియా గోధుమలు, దహ ను ఘోల్వాడ్ సపోటా, జల్గావ్ అరటి, వజ కులం పైనాపిల్, మరయూర్ బెల్లం, డార్జిలింగ్ టీ, బాస్మ తీ రైస్. మహాబలేశ్వర్ స్ట్రాబెర్రీ, బ్లూ పాటరీ ఆఫ్ జైపూర్, బనారసి చీర వంటివి ఉన్నాయి. ఇప్ప టివరకు 417 నమోదిత జీఐ ఉత్పత్తులు ఉన్నాయి. అందులో దాదాపు 150 వ్యవసాయ, ఆహార ఉత్పత్తులు. 2021లో జీఐ ఉత్పత్తులు భారీగా ఎగుమతులు జరిగిన విభాగాలను పరిశీలిస్తే.. నాగాలాండ్ నుండి బ్రిటన్‌కు నాగా మిర్చా (కింగ్ చిల్లీ) ఒకటి. మణిపూర్, అస్సాం నుండి బ్రిటన్‌కు బ్లాక్‌రైస్ ఎగుమతులు జరిగాయి. అస్సాం నుంచి బ్రిటన్, ఇటలీలకు నిమ్మకాయల ఎగుమతులు జరిగాయి. జీఐ అనేది నిర్దిష్ట భౌగోళిక మూలాన్ని కలిగి ఉన్న ఉత్పత్తులపై వినియోగించే ఒక బ్రాండ్ సంకేతం. ఆ మూలం కారణంగా ఉన్న నిర్దిష్ట లక్షణాలను లేదా ఖ్యాతిని సంబంధిత ఉత్పత్తి కలిగి ఉంటుంది. అటువంటి పేరు ప్రఖ్యాతలు ఉత్పత్తి నాణ్యత, విశిష్టతలకు సంబంధించిన హామీని వినియోగదారులకు అందిస్తుంది. -
పలాస జీడిపప్పు ఎగుమతి ప్రతిపాదన లేదు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా నుంచి పలాస జీడిపప్పును అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ప్రాసెసర్ల పరిస్థితికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదన, సమాచారం లేదని కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్ బుధవారం లోక్‌సభలో చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కోటగిరి శ్రీధర్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. ఏపీలో 4 టీఐఈఎస్ ప్రాజెక్టులు ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ స్కీం (టీఐఈఎస్)లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ప్రాజెక్టులను అనుమతించినట్లు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీలు చింతా అనూరాధ, పోచ బ్రహ్మానందరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. విశాఖపట్నంలో నిర్మాణంలో ఉన్న ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్‌కు మొత్తం ఖర్చు రూ.16.52 కోట్లు అని, రూ.8.15 కోట్ల గ్రాంట్ ఆమోదించగా రూ.4.15 కోట్లు విడుదల చేశామని వివరించారు. విశాఖలోని ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ లిమిటెడ్‌లో మూడు ప్రాజెక్టులకు రూ.220.87 కోట్లు ప్రతిపాదించగా రూ.66 కోట్లకు ఆమోదం లభించిందని, రూ.53 కోట్లు విడుదల చేశామని చెప్పారు. దీంట్లో రూ.40 కోట్ల పనులు పూర్తయ్యాయన్నారు. ఈస్ట్‌కోస్ట్ కారిడార్‌పై సర్వే ఖరగ్‌పూర్ నుంచి విజయవాడ వరకు ఈస్ట్‌కోస్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌ను పీఎం గతిశక్తి ప్రణాళికలో చేర్చడానికి డీపీఆర్ తయారీకి సర్వే నిర్వహిస్తున్నట్లు కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి సోమ్‌ప్రకాశ్ చెప్పారు. వైఎస్సార్సీపీ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. డీపీఆర్ వచ్చిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఏపీలో లిథియం అన్వేషణ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కడప జిల్లాలు, పార్నపల్లె–లోపట్నునూతల ప్రాంతంలో లిథియం సంభావ్యత అంచనా వేయడానికి నిఘా సర్వే, అన్వేషణ ప్రాజెక్టును జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టిందని వైఎస్సార్సీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, చింతా అనూరాధ, సంజీవ్‌కుమార్ సింగరి అడిగిన ప్రశ్నకు జవాబుగా కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. 10 జిల్లాల్లో 33 పత్తి సేకరణ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్‌లోని 10 జిల్లాల్లోని 33 ప్రాంతాల్లో పత్తి సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కేంద్ర జౌళిశాఖ సహాయమంత్రి దర్శన జర్దోష్ చెప్పారు. 1.10.2021 నుంచి 30.9.2022 సీజన్ కోసం ఈ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, వంగా గీతా విశ్వనాథ్, గోరంట్ల మాధవ్, గొడ్డేటి మాధవి, ఎం.వి.వి.సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు జవాబుగా తెలిపారు. 5జీ నైపుణ్య మానవవనరులపై అధ్యయనం చేపట్టలేదు 2025 నాటికి 5జీ నైపుణ్యం కలిగిన 2.2 కోట్ల మంది మానవవనరుల అవసరంపై ఐటీ శాఖ ఎలాంటి అధ్యయనం చేపట్టలేదని వైఎస్సార్సీపీ ఎంపీలు మద్దాల గురుమూర్తి, బి.వి.సత్యవతి అడిగిన ప్రశ్నకు జవాబుగా కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. -
పారిశ్రామికవేత్తలకు అవార్డులతో ముఖ్యమంత్రి సత్కారం
సాక్షి, అమరావతి: గత రెండేళ్లలో రాష్ట్రంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 15 మంది పారిశ్రామికవేత్తలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్కరించారు. రెండేళ్లలో రాష్ట్రంలో పెట్టిన పెట్టుబడులు, నమోదు చేసిన వ్యాపార పరిమాణం, ఉద్యోగాల కల్పన ఆధారంగా ఇండస్ట్రీ చాంపియన్లుగా ఎనిమిది మందిని, ఎగుమతుల్లో కీలక భాగస్వామ్యం వహించిన ఏడుగురు ఎగుమతిదారులను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ ఎంపిక చేసింది. విజయవాడలో మంగళవారం జరిగిన వాణిజ్య ఉత్సవ్‌లో వీరిని మెమెంటో, శాలువా, పుష్పగుచ్ఛాలతో ముఖ్యమంత్రి సత్కరించారు. ఇండస్ట్రీ చాంపియన్ అవార్డులు అందుకున్నవారు 1. పద్మశ్రీ అవార్డు గ్రహీత బీవీఆర్ మోహన్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సయంట్ లిమిటెడ్ 2. కబ్ డంగ్ లే, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 3. అనిల్ చలమశెట్టి, ఎండీ, గ్రీన్కో ఎనర్జీస్ లిమిటెడ్ 4. అవినాష్‌చంద్ రాయ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అదాని ఇంటర్నేషనల్ 5. ఇషాన్‌రెడ్డి ఆళ్ల, ప్రమోటర్ డైరెక్టర్, రామ్కీ గ్రూపు 6. సి.వి.రాజులు, వైస్ ప్రెసిడెంట్, ఎన్ఏసీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 7. కె.మదన్‌మోహన్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అరబిందో ఫార్మా 8. జోష్ ఫగ్లర్, ఎండీ, రైజింగ్ స్టార్ మొబైల్ ఇండియా లిమిటెడ్ ఎక్స్పోర్ట్ అవార్డులు అందుకున్నవారు 1. సి.శరవణన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, బ్రాండిక్స్ ఇండియా అప్పరెల్ ప్రైవేట్ లిమిటెడ్ 2. లీ మి తేస్, జనరల్ మేనేజర్, అపాచీ ఫుట్‌వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 3. బి.వి.కృష్ణారావు, ఎండీ, పట్టాభి ఆగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 4. వంకా రాజకుమారి, ఎండీ, ఇండియన్ హైర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 5. పాండవ ప్రసాద్, జీఎం, ఎస్ఎన్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ 6. సింగలూరి శారదాదేవి, పార్టనర్, ఆర్వీ కార్ప్ 7. కె.శ్రీనివాసరావు, ఎండీ, అమరావతి టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ -
‘హోదా’, విశాఖ రైల్వేజోన్‌పై స్థాయీ సంఘం పట్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అంశాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం పట్టుబట్టింది. విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో జాప్యంపై వాణిజ్య వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. సవివర ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) ఇంకా రైల్వే శాఖ పరిశీలనలో ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. జోన్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. తీసుకున్న చర్యలపై కమిటీకి నివేదిక అందజేయాలని సూచించింది. అలాగే, రాష్ట్ర విభజన సమయంలో రాజధాని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకు కనీసం పదేళ్లకు తగ్గకుండా ప్రత్యేక హోదా ఇవ్వాలని సిఫారసు చేసింది. ఈ చర్య సమగ్ర అభివృద్ధికి, వాణిజ్యం, ఎగుమతుల్లో ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని పేర్కొంది. ‘ఎగుమతులను పెంచేందుకు మౌలిక వసతుల విస్తరణ’ శీర్షికన రూపొందించిన 164వ నివేదికను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ వి.విజయసాయిరెడ్డి శనివారం వర్చువల్ సమావేశం ద్వారా రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడుకు సమర్పించారు. కొత్తగా ఏర్పాటైన జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలకు 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కేటాయింపులు పెంచడాన్ని కమిటీ ప్రశంసించింది. ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల స్థాపనకు, ఆర్థికాభివృద్ధికి, ఎగుమతుల పెంపునకు దోహదపడుతుందని పేర్కొంది. ఇదే తరహాలో ఇతర కొత్త రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లకు కూడా తగిన పరిహారం చెల్లించాలని కమిటీ అభిప్రాయపడుతూ.. రాష్ట్రాల విభజన కారణంగా రాజధానులు కోల్పోయిన ఈ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని సిఫారసు చేసింది. విశాఖ జోన్ ఇంకా పరిశీలనలోనా? విశాఖ జోన్‌కు ఇప్పటికే ఆమోదం లభించిందని, డీపీఆర్ ఇంకా మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉందని, కొత్త జోన్ కార్యాచరణకు కాలపరిమితిని నిర్ణయించలేమని ఆ శాఖ నుంచి సమాచారం వచ్చిందని కమిటీ తెలిపింది. ‘భారతీయ రైల్వేలలో 5వ అత్యధిక ఆదాయాన్ని అందించే డివిజన్ అయిన వాల్తేరు డివిజన్ రద్దుకు కారణాలు అడిగితే విశాఖలో జోనల్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు అవుతున్నందున పరిపాలన ప్రాతిపదికన మాత్రమే విశాఖలో డివి జన్ కేంద్రాన్ని తీసివేశామని రైల్వే శాఖ తెలిపింది. వాల్తేరు డివిజన్ కొనసాగింపు రోజువారీ కార్యకలాపాలలో గానీ, ఈ ప్రాంత దీర్ఘకాలిక రైల్వే అభివృద్ధిలో ఎటువంటి విలువను జోడించదని ఆ శాఖ తెలిపింది. వాల్తేరు డివిజన్‌ను పొరుగున ఉన్న విజయవాడ డివిజన్లో విలీనం చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది రాదని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత వ్యవస్థలను విస్తృతంగా ఉపయోగించడం వల్ల వ్యవస్థ సజావుగా సాగుతుందని తెలిపింది. కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నప్పుడు, డివిజన్ కార్యాలయం మినహా విశాఖ కేంద్రంగా ఉన్న ప్రస్తుత రైల్వే వ్యవస్థ చాలా వరకు అలాగే ఉంటుందని, వాల్తేరు డివిజనల్ ఆఫీస్‌తో సహా విశాఖలో ప్రస్తుతం ఉన్న రైల్వే సిబ్బందిలో ఎక్కువ మంది విశాఖలోనే సాధ్యమైనంత వరకు అక్కడే ఉంటారని కమిటీకి సమాచారం అందించింది. పరిపాలనా, కార్యాచరణ అవసరాలతో సహా అన్ని సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు కమిటీకి తెలిపింది’ అని స్టాండింగ్ కమిటీ పేర్కొంది. వాల్తేరు డివిజన్‌ను ముక్కలు చేయడం వెనుక ఉన్న ఆంతర్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నామంది. వాల్తేరు డివిజన్‌ను కుదించే నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని స్టాండింగ్ కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. మిరప ఎగుమతులకు శీతల గిడ్డంగులు.. గుంటూరు నుంచి ప్రతినెలా 1.80 లక్షల టన్నుల మిరప పంట ఎగుమతి అవుతుందని, వీటికి సాధారణ గిడ్డంగులు కాకుండా శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కమిటీ అభిప్రాయపడింది. ఫుడ్ ప్రాసెసింగ్ శాఖతో సమన్వయం చేసుకుని గుంటూరు జిల్లాలో తగిన సంఖ్యలో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలని వాణిజ్య శాఖకు కమిటీ సిఫారసు చేసింది. -
పార్లమెంటు నియోజకవర్గానికో ఆహారశుద్ధి పరిశ్రమ
సాక్షి, అమరావతి: రానున్న రెండేళ్లలో ప్రతీ పార్లమెంటు నియోజకవర్గానికో ఆహారశుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసిందని వాణిజ్యం, పరిశ్రమల శాఖ (ఆహారశుద్ధి) కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. సచివాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌తో భేటీ అయ్యారు. అనంతరం సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ఆహార శుద్ధి పరిశ్రమల రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యతనిస్తున్నారని, అందుకే ఈ శాఖకు ప్రత్యేకంగా కార్యదర్శిని నియమించారని చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చెయ్యాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. ఆయా జిల్లాల్లో పండే పంటల ఆధారంగా ఏ జిల్లాలో ఎలాంటిæ పరిశ్రమ రావాలన్న దానిపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాష్ట్ర ఆహారశుద్ధి సొసైటీ సీఈవో శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
India WPI Inflation: టోకు ధరలు... గుభేల్!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2021 ఏప్రిల్‌లో భారీగా 10.49 శాతం పెరిగింది. అంటే సూచీలోని ఉత్పత్తుల ధరలు 2020 ఏప్రిల్‌తో పోల్చితే తాజా సమీక్షా నెలలో 10.49 శాతం పెరిగాయన్నమాట. సూచీలోని ప్రధాన విభాగాలైన ఆహారం, ముడి చమురు, తయారీ రంగాల ఉత్పత్తుల ధరలు భారీగా పెరగడం మొత్తం సూచీపై ప్రభావం చూపింది. ఇదే పెరుగుదల తీరు మున్ముందూ కొనసాగుతుందన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణాల్లో లోబేస్ ఎఫెక్ట్ ఒకటి. గత ఏడాది ఏప్రిల్‌లో టోకు ద్రవ్యోల్బణంలో అసలు పెరుగుదల లేకపోగా 1.57 శాతం క్షీణించిన విషయం ఇక్కడ గమనార్హం. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడం బేస్ ఎఫెక్ట్‌గా పేర్కొంటారు. ఇక్కడ 2020 ఏప్రిల్‌లో అసలు వృద్ధి నమెదుకాకపోగా భారీగా 1.57 శాతం క్షీణత నమోదుకావడం (లో బేస్) ఇక్కడ గమనార్హం. వరుసగా నాలుగు నెలల నుంచీ టోకు ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తోంది. 2021 మార్చిలో ఈ రేటు 7.39 శాతంగా ఉంది. వాణిజ్య పరిశ్రమల శాఖ తాజా గణాంకాల్లో ముఖ్యాంశాలు... ► ఫుడ్ ఆర్టికల్స్: ఫుడ్ ఆర్టికల్స్ 4.92 శాతం పెరిగాయి. గుడ్లు, మాంసం, చేపల వంటి ప్రొటీన్ రిచ్ ఉత్పత్తుల ధరలు 10.88 శాతం పెరిగాయి. పప్పు దినుసుల ధరలు 10.74 శాతం ఎగశాయి. పండ్ల ధరలు 27.43 శాతం ఎగశాయి. కాగా కూరగాయల ధరలు మాత్రం 9.03 శాతం తగ్గాయి. ► ఫ్యూయెల్ అండ్ పవర్: ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 20.94 శాతంగా ఉంది. ► తయారీ ఉత్పత్తులు: సమీక్షా నెలలో 9.01 శాతం ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ► కాగా, ఆర్బీఐ రెపో నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 4.29 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. సరఫరాల సమస్య కనబడుతోంది ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదల 4.9 శాతంగా నమోదుకావడం ఆరు నెలల్లో ఇదే తొలిసారి. హోల్‌సేల్ స్థాయిలో సరఫరాల సమస్య తీవ్రంగా ఉందన్న విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది. రానున్న నెలల్లో టోకు ద్రవ్యోల్బణం 13 నుంచి 13.5 శాతం శ్రేణికి పెరుగుతుందన్నది మా అంచనా. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం)ను మరింత తగ్గిందన్న మా అభిప్రాయానికి కూడా గణాంకాలు బలాన్ని ఇస్తున్నాయి. అయితే బలహీన ఎకానమీ నేపథ్యంలో యథాతథ సరళతర ద్రవ్య పరపతి విధానాలనే ఆర్బీఐ కొనసాగిస్తుందని భావిస్తున్నాం. – అదితీ నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అంతర్జాతీయంగా పెరిగిన ధరల ప్రభావం కేవలం కొన్ని సీజనల్ కారణాల వల్లే టోకు ద్రవ్యోల్బణం పెరగలేదు. అంతర్జాతీయంగా ధరల పెరుగుదలా టోకు ద్రవ్యోల్బణం అప్‌ట్రెండ్‌కు కారణం. ఖనిజాలు, వంట నూనెలు, ముడి చమురు, బొగ్గు, ఎరువులు, ప్లాస్టిక్, బేసిక్ మెటల్స్‌న, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఆటో తత్సంబంధ విడిభాగాల వెయిటేజ్ మొత్తం సూచీలో 44%. అంతర్జాతీయంగా ఆయా కమోడిటీల ధరలు పెరగడం దేశీయంగా కూడా ప్రభావం చూపింది. ప్రపంచ మార్కెట్లో కమోడిటీల ధరలు మరింత పెరుగుతుండడం ఇక్కడ ఆందోళన కలిగిస్తున్న అంశం. ద్రవ్యోల్బణం మరింత పెరక్కుండా ప్రభుత్వం సరఫరాల వ్యవస్థ పటిష్టతపై దృషి సారించాలి. – సునీల్ కుమార్ సిన్హా, ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ ఆర్థికవేత్త -
వాణిజ్య పన్నుల వసూళ్లలో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: వాణిజ్య పన్నుల వసూళ్లకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానం, దేశవ్యాప్తంగా రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలవడంపై ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి హర్షం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో జీఎస్టీ ఆదాయం 2.07 శాతం వృద్ధితో రూ.345.24 కోట్లు పెరిగి రూ.17,020.36 కోట్లకు చేరుకుందని చెప్పారు. జీఎస్టీ పాత బకాయిల వసూలు చేయడానికి చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో అధికారులు మంచి పనితీరు కనబరచడంతో లక్ష్యాన్ని మించి వసూళ్లు నమోదయ్యాయన్నారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ ద్వారా రూ.942.41 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.1,073.03 కోట్లు వసూలయ్యాయని తెలిపారు. ఇందుకు కారణమైన 257 మంది అధికారులకు ప్రోత్సాహకాలు, ప్రశంసాపత్రాలిస్తామన్నారు. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న దశలవారీ మద్య నిషేధం వల్ల లిక్కర్‌పై వ్యాట్ ఆదాయం రూ.4,091 కోట్లు కోల్పోయినట్లు తెలిపారు. వాణిజ్య శాఖ సొంత కార్యాలయాలు నిర్మించుకోవడానికి జిల్లాల వారీగా స్థలాలను పరిశీలించడంతో పాటు, హైదరాబాద్‌లో ఉన్న కామన్ డేటా సెంటర్‌ను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ పీయూష్ కుమార్‌తో పాటు అధికారులను అభినందించారు. -
చక్కగా పనిచేస్తున్నాయి..
సాక్షి, న్యూఢిల్లీ: ‘క్షేత్ర స్థాయి ఇన్‌పుట్స్‌కు పెద్దపీట వేయడం ఈ ర్యాంకింగ్స్ ప్రక్రియలో మరో ముందడుగు. దేశ నిర్మాణానికి తోడ్పడే వారి అవసరాలను గుర్తించడం ఈ ప్రక్రియ గొప్పతనం. గడిచిన మూడేళ్లుగా కొన్ని రాష్ట్రాలు అసాధారణ పనితీరు కనబరుస్తున్నాయి. సంస్కరణలు అమలు చేస్తున్నాయి. అసాధారణ రీతిలో ప్రతిభ కనబరిచి ర్యాంకులు కనబరిచిన రాష్ట్రాలు సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేశాయి. ఈ ర్యాంకుల వెనక ఉద్దేశాన్ని గుర్తించి రాష్ట్రాలు చక్కగా పని చేస్తున్నాయి’ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. శనివారం ఆమె డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషనల్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) రూపొందించిన నాలుగో విడత ర్యాంకులను ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర పౌర విమానయానం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోంప్రకాష్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ► ఈ ప్రక్రియ ఆరోగ్యవంతమైన పోటీని సృష్టిస్తోంది. రాష్ట్రాల మధ్య చక్కటి పోటీని ఏర్పరుస్తుంది. రాష్ట్రంలో సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ పోటీతత్వం పనిచేస్తుంది. ఇది సానుకూల అడుగు. ఆరోగ్యకరమైన పోటీకి సంకేతం. ► కోవిడ్ సమయంలో ఆత్మనిర్భర్ ప్యాకేజీ ద్వారా అవసరమైన రంగాలకు చేయూతనిచ్చాం. ఇది సంస్కరణలకు మరింత ఊతమిచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సంస్కరణలను అమలు చేయడం వల్ల మన దేశం పెట్టుబడుల గమ్యస్థానంగా మారుతుంది. విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి. ► తొలి మూడు స్థానాల్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణలను ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఆయా రాష్ట్రాలు నిరంతరాయంగా సంస్కరణలను అమలు చేస్తున్నాయి. ప్రాంతాల వారీగా అగ్రస్థానం సాధించిన రాష్ట్రాలను కూడా అభినందిస్తున్నా. జోనల్ స్థాయిలో అగ్రస్థానం వీటిదే.. నార్త్‌జోన్‌లో యూపీ, తూర్పు జోన్లో జార్ఖండ్, పశ్చిమ జోన్లో మధ్యప్రదేశ్, దక్షిణ జోన్లో ఏపీ, ఈశాన్య జోన్లో అసోం అగ్రస్థానంలో నిలిచాయి. రాష్ట్రాల ఆర్థిక వృద్ధికి దోహదం : పీయూష్ ► ఈ యాక్షన్ ప్లాన్ రాష్ట్రాల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. పెట్టుబడులను ఆకర్షించే వాతావరణాన్ని సృష్టిస్తుంది. తద్వారా రాష్ట్రాల ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుంది. రాష్ట్రాలు వాటి వ్యవస్థలను మెరుగు పరుచుకునేందుకు ఈ ర్యాంకులు దోహదపడుతాయి. ► సంస్కరణల అమలు వల్ల ర్యాంకులు మెరుగు పడతాయి. అగ్రశ్రేణి ర్యాంకులు సాధించిన రాష్ట్రాలు అత్యుత్తమ పనితీరు కనబరిచాయి. తక్కువ ర్యాంకు సాధించాల్సిన రాష్ట్రాలకు ఇది మేలుకొలుపు వంటిది. ర్యాంకులు కోల్పోయిన రాష్ట్రాలు మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది. అగ్రశ్రేణి ర్యాంకులు సాధించిన రాష్ట్రాలకు అభినందనలు. -
ఎగుమతులు 10% డౌన్
న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఎగుమతులు క్షీణించాయి. జూలైలో 23.64 బిలియన్ డాలర్ల (రూ.1.77 లక్షల కోట్లు) ఎగుమతులు సాధ్యమయ్యాయి. ప్రధానంగా పెట్రోలియం, తోలు, రత్నాలు, జ్యుయలరీ ఎగుమతులు పడిపోయాయి. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర వాణిజ్య శాఖ శుక్రవారం విడుదల చేసింది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ (లాక్ డౌన్ లు ఎక్కువగా అమలైన కాలం) నెలలతో పోలిస్తే జూలైలో ఎగుమతుల క్షీణత తగ్గిందనే చెప్పుకోవాలి. ఏప్రిల్ లో ఎగుమతులు ఏకంగా అంతక్రితం ఏడాది అదే నెలతో పోలిస్తే 60 శాతం పడిపోగా, మే నెలలోనూ 37 శాతం, జూన్ లో 12.41 శాతం మేర తగ్గాయి. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా భారత్ తో వాణిజ్య సంబంధాలు కలిగిన దేశాలు కూడా సతమతమవుతుండడం ఎగుమతులపై ప్రభావం చూపిస్తోంది. ఇక జూలై నెలలో దిగుమతులు సైతం 28 శాతం మేర తగ్గి 28.47(రూ.2.17లక్షల కోట్లు) బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీంతో వాణిజ్య లోటు (ఎగుమతులతో పోలిస్తే దిగుమతుల విలువ ఎక్కువగా ఉండడం) 4.83 బిలియన్ డాలర్లు(రూ.36,225కోట్లు)గా నమోదైంది. గతేడాది జూలై నాటికి ఉన్న వాణిజ్య లోటు 13.43 బిలియన్ డాలర్ల (రూ.లక్ష కోట్లు)తో పోలిస్తే ఈ ఏడాది తక్కువగానే ఉండడం కాస్త ఊరటగానే చెప్పుకోవాలి. 18 ఏళ్ల తర్వాత ఈ ఏడాది జూన్ లో మన దేశం వాణిజ్య పరంగా మిగులును నమోదు చేయడం గమనార్హం. -
ఎగుమతులు.. 60 శాతం మైనస్
న్యూఢిల్లీ: కరోనా ప్రభావం ఏప్రిల్ ఎగుమతులపై తీవ్రంగా పడింది. ఎగుమతుల్లో –60.28 శాతం క్షీణత నెలకొంది. ఇక దిగుమతులదీ అదే పరిస్థితి. 58.65 శాతం క్షీణించాయి. శుక్రవారం వాణిజ్య, పరిశ్రమల శాఖ విడుదలచేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు.. ► ఏప్రిల్‌లో ఎగుమతుల విలువ కేవలం 10.36 బిలియన్ డాలర్లు. 2019 ఇదే నెలలో ఈ విలువ 26 బిలియన్ డాలర్లు. ► ఇక దిగుమతుల విలువ 41.4 బిలియన్ డాలర్లు (2019 ఏప్రిల్) నుంచి తాజా సమీక్షా నెలలో 17.12 బిలియన్ డాలర్లకు పడింది. ► దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 6.76 బిలియన్ డాలర్లకు తగ్గింది. 2019 ఇదే నెలలో ఈ వ్యత్యాసం 15.33 బిలియన్ డాలర్లు. ► ఆభరణాలు(–98.74%), తోలు (–93.28%), పెట్రోలియం ప్రొడక్టులు(–66.22 శాతం), ఇంజనీరింగ్ గూడ్స్ (–64.76%) ఎగుమతులు భారీ క్షీణ రేటును నమోదుచేసుకున్నాయి. ► ఏప్రిల్‌లో మొత్తం దిగుమతుల విలువలో చమురు వాటా 4.66 బిలియన్ డాలర్లు. 2019 ఏప్రిల్‌తో పోల్చితే విలువ 59.03% తక్కువ. ► మార్చి నెలలో కూడా ఎగుమతుల విలువ 34.57 శాతం పడిపోయిన సంగతి గమనార్హం. ► కాగా, 2019–20 ఆర్థిక సంవత్సరంలో సేవల రంగం ఎగుమతుల విలువ 214.61 బిలియన్ డాలర్లని ఆర్బీఐ గణాంకాలు పేర్కొన్నాయి. 2018–19తో పోల్చితే ఇది 4.3% పెరుగుదల. ఇక ఈ రంగం దిగుమతుల విలువ ఈ కాలం లో 131.56 బలియన్ డాలర్లు. ఒక్క మార్చి నెలలో ఎగుమతులు 18.16 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కాగా ఇదే నెలలో సేవల దిగుమతులు 11.11 బిలియన్ డాలర్లు. -
5.5% తగ్గిన బంగారం దిగుమతులు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు 11 నెలల కాలంలో బంగారం దిగుమతులు 5.5 శాతం తగ్గాయి. విలువ పరంగా చూస్తే 29.5 బిలియన్ డాలర్ల మేర బంగారం దిగుమతి అయింది. తద్వారా కరెంటు ఖాతా లోటుపై బంగారం భారం తగ్గిపోయింది. 2017–18 ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల కాలంలో బంగారం దిగుమతులు 31.2 బిలియన్ డాలర్ల మేర ఉండడం గమనార్హం. ఈ వివరాలను కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. అయితే, బంగారం దిగుమతుల విలువ తగ్గడానికి అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు తగ్గడమే కారణమని ట్రేడర్లు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో బంగారం దిగుమతుల విలువ ప్రతికూలంగా ఉండగా, జనవరిలో మాత్రం 38.16 శాతం పెరిగి 2.31 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కానీ, ఫిబ్రవరిలో తిరిగి 10.8 శాతం క్షీణించి దిగుమతులు 2.58 బిలియన్ డాలర్లకు పరిమితయ్యాయి. బంగారాన్ని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉంది. ముఖ్యంగా ఆభరణాల కోసమే మనదగ్గర ఎక్కువ కొనుగోళ్లు జరుగుతుంటాయి. జెమ్స్, జ్యుయలరీ ఎగుమతుల్లో క్షీణత ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల కాలంలో జెమ్స్, జ్యూయలరీ ఎగుమతులు 6.3 శాతం తగ్గి 28.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. రెండో త్రైమాసికంలో కరెంటు ఖాతా లోటు (ఎగుమతులు, దిగుమతుల విలువ మధ్య అంతరం) జీడీపీలో 2.9 శాతానికి పెరిగిన విషయం గమనార్హం. 2017–18లో బంగారం దిగుమతులు 22.43 శాతం పెరిగి 955.16 టన్నులుగా ఉన్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో దిగుమతులు 780 టన్నులుగా ఉండడం గమనార్హం. బంగారం దిగుమతులను తగ్గించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలను కూడా అమల్లోకి తెచ్చింది. -
ఈవోడీబీలో తెలంగాణకు రెండో ర్యాంకు
సాక్షి, హైదరాబాద్: సరళీకృత వ్యాపారం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్/ఈవోడీబీ) ర్యాంకింగ్స్‌లో గతేడాది అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న తెలంగాణ.. ఈ ఏడాది త్రుటిలో ఆ ర్యాంకును కోల్పోయింది. రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ, ప్రమోషన్ (డీఐపీపీ) మంగళవారం 2017 సంవత్సరానికి సంబంధించిన ఈవోడీబీ ర్యాంకులను ప్రకటించింది. ఇందులో 98.42 శాతం స్కోరుతో ఏపీ తొలి ర్యాంకు కైవసం చేసుకుంది. 98.33 శాతం స్కోరుతో (0.09 శాతం తక్కువ) తెలంగాణ రెండో ర్యాంకును సాధించింది. 98.07 శాతం స్కోరుతో హరియాణా మూడు, 97.99 శాతం స్కోరుతో జార్ఖండ్ నాలుగు, 97.96 శాతం స్కోరుతో గుజరాత్ ఐదో స్థానంలో నిలిచాయి. వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక–2017లోని సంస్కరణల అమలు ఆధారంగా దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు డీఐపీపీ ర్యాంకులు కేటాయించింది. ఆస్తుల రిజిస్ట్రేషన్, తనిఖీలు, సింగిల్ విండో విధానం, పరిశ్రమలకు స్థలాల లభ్యత, కేటాయింపులు, నిర్మాణ అనుమతులు, పర్యావరణ అనుమతుల విధానం, పన్నుల చెల్లింపు, పర్మిట్ల జారీ, పారదర్శకత, సమాచార లభ్యత, కార్మిక విధానాలు తదితర 12 అంశాల్లో సంస్కరణలను పరిగణనలోకి తీసుకుని ఈవోడీబీ ర్యాంకులను కేటాయించింది. 2016 సంవత్సరంలో తెలంగాణ, ఏపీలు 98.78 శాతం స్కోరు సాధించి ఉమ్మడిగా మొదటి స్థానంలో నిలిచాయి. ఫీడ్‌బ్యాక్‌లో తెలంగాణ వెనకడుగు వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక–2017లో భాగంగా 3,725 సంస్కరణలను అమలు చేయాలని డీఐపీపీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇందులో కేంద్రపాలిత ప్రాంతాలకు మాత్రమే వర్తించే సంస్కరణలను మినహాయించాక రాష్ట్రం అమలు చేయాల్సిన మొత్తం 368 సంస్కరణలను తెలంగాణ అమలు పరిచింది. దీంతో సంస్కరణల అమలు (రిఫార్మ్ ఎవిడెన్స్) విభాగంలో తెలంగాణకు 100 శాతం స్కోరు లభించింది. ఏపీ అమలు చేయాల్సిన 369 సంస్కరణలకు గాను 368 సంస్కరణలను అమలు చేసి 99.73 శాతం స్కోరు సాధించింది. అయితే రాష్ట్రాల్లో సంస్కరణల అమలుపై కొత్త పరిశ్రమలు, పాత పరిశ్రమలు, ఆర్కిటెక్టులు, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు, న్యాయవాదుల నుంచి డీఐపీపీ సేకరించిన ఫీడ్‌బ్యాక్‌లో తెలంగాణకు 83.95 శాతం స్కోరు లభించగా, ఏపీ 86.5 శాతం స్కోరు సాధించింది. ఫీడ్‌బ్యాక్ స్కోరులో తెలంగాణ కంటే మెరుగైన స్కోరు సాధించడంతో ఏపీ ఈ సారి ఈవోడీబీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సాధించింది. -
ఎగుమతుల పెంపునకు ప్రత్యేక వ్యూహం
సాక్షి, హైదరాబాద్: ఎగుమతుల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించుకోవాలని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రీటా టియోటియా సూచించారు. రాష్ట్ర ఎగుమతుల పెంపుపై శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షాసమావేశంలో రీయా టియోటియా పాల్గొన్నారు. ఫార్మా, ఐటీలతోపాటు మరిన్ని రంగాలకు ఎగుమతులను విస్తరించాలన్నారు. ఎగుమతులకున్న అవకాశాలను, పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఉత్పత్తులను ఎగుమతి చేయాలన్నారు. తెలంగాణ నుంచి ఎగుమతి అవుతున్న వస్తువులవారీగా సమీక్షించారు. ఎగ్ పౌడర్, ఎసెన్షియల్ ఆయి ల్స్, మీట్, బియ్యం, టెక్స్టైల్స్, కాటన్ ఎగుమతులపై చర్చించారు. కేంద్ర వాణిజ్య శాఖ విషయాలపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించటానికి నోడల్ ఆఫీసర్‌ను నియమిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ నుండి ఐటీ, ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులలో ప్రముఖపాత్ర పోషిస్తున్నామని జోషి వివరించారు. పర్యాటకం, మెడికల్ టూరిజం, సర్వీసెస్, హాస్పిటాలిటీ లాంటి రంగాల నుంచి ఎగుమతుల పెంపునకు కృషి చేస్తామని అన్నారు. దేశ ఫార్మా ఉత్పత్తుల్లో 30 శాతం తెలంగాణలో తయారవుతున్నాయని, ఎగుమతుల్లో 20 శా తం ఇక్కణ్నుంచే జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ పాలసీలు భేష్ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అగ్రిపాలసీ, లాజిస్టిక్ పాలసీ బాగున్నాయని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రియో టియోటియా అభిప్రాయపడ్డారు. అధికారులతో సమీక్ష అనం తరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో రెండు శాతం ఉన్న ఎగుమతులు ఏడాది చివరికల్లా 5 శాతం పెంచాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. జీఎస్టీపై కొంతమంది వ్యాపారుల్లో నిరాసక్తత ఉందని, దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని అన్నారు. -
బోధన్ స్కాంలో వేటుకు రంగం సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు వందల కోట్లు గండికొట్టిన బోధన్ వాణిజ్యపన్నుల స్కాంలో అధికారులపై వేటుకు రంగం సిద్ధమవుతోంది. గతేడాది ఫిబ్రవరిలో కేసు నమోదు చేసిన సీఐడీ, రూ.200 కోట్లకు పైగా ఖజానాకు గండిపడినట్లు గుర్తించింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారులిద్దరితో పాటు వాణిజ్య పన్నుల డిప్యూటీ కమిషనర్, నలుగురు రిటైర్డ్ అధికారులను అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఆరోపణలెదుర్కొంటున్న అధికారులపై ప్రభుత్వానికి సీఐడీ నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో నివేదికలో పేర్కొన్న మొత్తం 26 మంది అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయించడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు చార్జిమెమోలు జారీచేశారు. మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయవద్దు... వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఐదుగురు డిప్యూటీ కమిషనర్లు, ఐదుగురు కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లు (సీటీవో), ఎనిమిది మంది అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ అధికారులు, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఆరుగురు జూనియర్ అసిస్టెంట్లకు రెండు రోజుల క్రితం జీఏడీ నుంచి జీవోల రూపంలో చార్జిమెమోలు పంపించారు. 2005 నుంచి 2014 వరకు కుంభకోణం జరిగిందని, ఆ సమయంలో విధులు నిర్వర్తించిన డిప్యూటీ కమిషనర్లు ఆడిటింగ్ సరిగ్గా నిర్వహించకపోవడం వల్లే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. దీంతో సస్పెన్షన్‌తోపాటు, ఎందుకు అరెస్ట్ చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్‌కి... ప్రస్తుతం చార్జిమెమోలు అందుకున్న అధికారులు నెల రోజుల లోపల వివరణ ఇచ్చేందుకు ప్రభుత్వం గడువునిచ్చినట్టు తెలిసింది. కాగా, తమను సీఐడీ ఎక్కడ అరెస్ట్ చేస్తుందోనని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మెమోలకు వివరణను కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విభాగానికి పంపించాలనడంతో అధికారుల్లో మరింత ఆందోళన మొదలైంది. వివరణ సంతృప్తికరంగా లేకపోతే కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ నేరుగా విజిలెన్స్ కమిçషనర్‌కు చర్యల కోసం సిఫారసు చేయడంతో పాటు సీఎంకి సైతం చర్యలపై ప్రతిపాదన పంపేందుకు అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు ఎలా ఇస్తే ఏం జరుగుతుందో అన్న భయం అధికారుల్లో మొదలైంది. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే... ప్రస్తుతం ఈ స్కాంలో సీఐడీ విచారణ ఆగిపోయింది. గతంలో కీలక పాత్రధారులను అరెస్ట్ చేసిన సీఐడీ, కమర్షియల్ టాక్స్ శాఖలోని మరి కొంత మందిని అరెస్ట్ చేయాలని భావించింది. అయితే వాణిజ్యపన్నుల శాఖ అంతర్గత విచారణ అనంతరం అరెస్టులకు వెళ్లాలని ప్రభుత్వం సూచించడంతో సీఐడీ వెనక్కి తగ్గింది. ఇప్పుడు చార్జిమెమోలు జారీ చేయడంతో సీఐడీ అధికారులు ఈ 26 మందిలో కొందరిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వ అనుమతి పొందాలని యోచిస్తోంది. -
ఏసీబీ వలలో మరో తిమింగలం
విజయవాడ: పటమట ప్రాంతంలో ఉంటున్న వాణిజ్యపన్నుల శాఖ ఉన్నతాధికారి ఇంట్లో బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. లెహరీ హాస్పటల్ సమీపంలోని వివేకానందనగర్, తంగెళ్లమూడి వారి వీధిలో సాయి మానస అపార్ట్మెంట్స్ ప్లాట్ నంబరు 502లో విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ జి.లక్ష్మీప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారులు ఈ సోదాలు చేశారు. ఈ సోదాల్లో భారీగా బంగారు ఆభరణాలు, బ్యాంకు పాస్ పుస్తకాలు లభించాయి. సాయిబాబా అనే వ్యక్తి పేరుతో రూ.కోటికి 10 ప్రాంసరీ నోట్లు ద్వారా అప్పు ఇచ్చినట్లు ఏసీబీ తనిఖీల్లో వెల్లడైంది. నగరంతో పాటు శ్రీకాకుళం, విశాఖపట్నం, గుంటూరుతో పాటు మొత్తం 20చోట్ల ఏకకాలంలో ఏసీబీ ఈ సోదాలు నిర్వహించింది. -
త్వరలో జీఎస్టీ సంవిధాన
సాక్షి, అమరావతి బ్యూరో:వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో సంవిధాన పథకం (కాంపోజిషన్ స్కీమ్)లో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతోంది. చిన్న వ్యాపారులకు అనుకూలంగా ఉన్న ఈ పథకంలో చేరేందుకు గరిష్ట పరిమితిని పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఏడాదికి రూ.కోటి టర్నోవర్‌గా ఉన్న గరిష్ట పరిమితిని రూ.2 కోట్లకు పెంచనుంది. జీఎస్టీ కౌన్సిల్ సూచనల మేరకు ఈ దిశగా సన్నాహాలు చేస్తోంది. పార్లమెంటు ఆమోదం తర్వాత గరిష్ట పరిమితి పెంపును రెండు దశల్లో అమలు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. చిన్న వ్యాపారుల కోసం.. జీఎస్టీ విధానంలో చిన్న వ్యాపారులకు ఊరట కలిగించేందుకు సంవిధాన పథకాన్ని ప్రవేశపెట్టారు. చిన్న, మధ్యస్థాయి వ్యాపారుల మీద పన్ను భారాన్ని తగ్గించడం, ఎక్కువసార్లు రిటర్న్‌లు దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా చూడటం దీని ఉద్దేశం. అయితే ఇందులో చేరే వ్యాపారులు వినియోగదారుల నుంచి పన్ను వసూలు చేయకూడదు. పథకంలో చేరాలంటే వార్షిక టర్నోవర్ గరిష్టంగా రూ.కోటి లోపు ఉండాలి. చేరాలా, వద్దా అనేది వ్యాపారుల ఇష్టానికే వదిలేశారు. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీలో మొదట చిన్న వ్యాపారులు ఈ పథకం పట్ల ఆసక్తి చూపించలేదు. అయితే అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పరిస్థితి మారింది. తాజాగా ఏపీలో కేంద్ర ఎక్సైజ్, రాష్ట్ర వాణిజ్య శాఖల మధ్య జీఎస్టీ చెల్లింపుదారుల విభజన చేశారు. దీని ప్రకారం అక్కడత దాదాపు 1.60 లక్షల మంది సంవిధాన పథకంలో చేరారు. గరిష్ట పరిమితి పెంపునకు నిర్ణయం సంవిధాన పథకం పట్ల వ్యక్తమవుతున్న సానుకూలతను జీఎస్టీ జాతీయ కౌన్సిల్ గుర్తించింది. గరిష్ట పరిమితిని పెంచితే మరింతమంది చిన్న వ్యాపారులు ఈ పథకంలో చేరతారని భావించింది. కాగా పార్లమెంటులో చేసిన జీఎస్టీ చట్టం అందుకు అవకాశం కల్పించడం లేదు. వార్షిక టర్నోవర్ గరిష్టంగా రూ.కోటిలోపు ఉన్న వ్యాపారులే సంవిధాన పథకంలో చేరేందుకు అర్హులని చట్టంలో స్పష్టం చేశారు. పరిమితి పెంచాలి అంటే మళ్లీ పార్లమెంటే సవరణ చేయాలి. ఈ నెల 10న జీఎస్టీ జాతీయ కౌన్సిల్ ఈ అంశంపై చర్చించింది. ప్రస్తుతం వార్షిక టర్నోవర్ రూ.కోటిగా ఉన్నదాన్ని రూ.2 కోట్లకు పెంచాలని నిర్ణయించింది. దీనికి చట్ట సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ జీఎస్టీ కౌన్సిల్ తీర్మానాన్ని ఆమోదించింది. రెండు దశల్లో అమలు సంవిధాన పథకం గరిష్ట పరిమితిని పార్లమెంటు రూ.కోటి నుంచి రూ.2 కోట్లకు పెంచిన తర్వాత దాన్ని రెండు దశల్లో అమలు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ భావిస్తోంది. మొదటి దశలో గరిష్ట పరిమితిని రూ.1.50 కోటికి పెంచాలని నిర్ణయించింది. ఏడాది తర్వాత పరిస్థితిని సమీక్షించి వ్యాపారుల నుంచి ఆశించిన స్థాయిలో సానుకూల స్పందన కొనసాగితే పరిమితిని రెండో దశలో రూ.2 కోట్లకు పెంచాలని యోచిస్తోంది. ఈ మేరకు కేంద్ర జీఎస్టీ, రాష్ట్రాల వాణిజ్య పన్నుల శాఖలకు సమాచారం కూడా ఇచ్చింది. సాఫ్ట్‌వేర్‌లో మార్పులు, ఇతర ఏర్పాట్లు ముందస్తుగా చేసుకోవాలని సూచించింది.