devices
-
ఈ డివైజ్‌తో మొటిమలు, మచ్చలు ఇట్టే మాయం..!
మొటిమలు, వాటి వల్ల ఏర్పడే మచ్చలు ముఖ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంటాయి. ముఖ్యంగా టీనేజ్‌లో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. చిత్రంలోని ‘సోలావేవ్ లైట్ థెరపీ డివైస్’ ముఖంపై పేరుకున్న జిడ్డును, మొటిమలను, వాటి కారణంగా కలిగిన మచ్చలను ఇట్టే తొలగిస్తుంది. అంతేకాకుండా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.ఈ డివైస్.. చర్మానికి పూర్తిగా సురక్షితమైనది. బ్లూ కలర్ లేదా రెడ్ కలర్ అనే రెండు ఆప్షన్స్‌తో ఇది ఏమాత్రం నొప్పి లేకుండా చికిత్స అందిస్తుంది. దీన్ని సుమారు తొమ్మిదిసార్లు వినియోగిస్తే, 90 శాతం వరకు ఫలితం కనిపిస్తుంది. దీన్ని ఉపయోగించడం చాలా తేలిక. పరికరాన్ని ఆఫ్ చేయాలన్నా, ఆఫ్ చేయాలన్నా ముందున్న బటన్ని ఒక సెకను పాటు ప్రెస్ చేసి ఉంచితే సరిపోతుంది. ఈ మెషిన్ని సుమారు 3 నిమిషాలు ఆన్ చేసి, ఆప్షన్ ఎంపిక చేసుకుని, సమస్య ఉన్న ప్రదేశంలో ఉంచితే సరిపోతుంది. నిజానికి ఈ డివైస్ ప్రతి మూడు నిమిషాలకొకసారి ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. ఇది వేలెడంత పొడవుతో చేతిలో ఇమిడేంత చిన్నగా ఉంటుంది. దాంతో దీన్ని పట్టుకోవడం, ఇతర ప్రదేశాలకు తీసుకుని వెళ్లడం చాలా సులభం. ముందుగా క్లీనింగ్ జెల్‌ని అవసరం అయిన చోట అప్లై చేసుకుని, మొటిమలు లేదా మచ్చలున్న భాగంలో ఈ డివైస్ హెడ్‌ని ఆనించి ఉంచితే ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇది బ్యాటరీ సాయంతో పని చేస్తుంది. దీని ధర 69 డాలర్లు (రూ.5,825). ఇలాంటి డివైస్‌లకు ఆన్లైన్లో మంచి డిమాండ్ ఉంది. ముందే వినియోగదారుల రివ్యూస్ ఫాలో అయ్యి ఆర్డర్ చేసుకోవడం ఉత్తమం. (చదవండి: ఏంటిది.. చేపకు ఆపరేషన్ చేశారా..!) -
కొంటున్నారు.. వింటున్నారు!
న్యూఢిల్లీ: దేశీయంగా ఆడియో డివైజ్‌ల ఆఫ్‌లైన్ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందుతోంది. జూన్‌తో ముగిసిన పన్నెండు నెలల వ్యవధిలో మూవింగ్ యాన్యువల్ టర్నోవర్ (ఎంఏటీ) ప్రాతిపదికన 32 శాతం పెరిగి రూ. 3,400 కోట్ల నుంచి రూ. 5,000 కోట్ల స్థాయికి చేరింది. మరింత మెరుగైన అనుభూతినిచ్చే సౌండ్ టెక్నాలజీలు రావడం, వ్యక్తిగత–గృహ కేటగిరీల్లో అత్యంత నాణ్యమైన ఆడియో ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం వంటి అంశాలు ఈ విభాగ వృద్ధికి తోడ్పడుతున్నాయి.పర్సనల్ ఆడియో సెగ్మెంట్లో అమ్మకాల పరిమాణం 61 శాతం మేర పెరిగింది. గ్లోబల్ మార్కెట్, కన్జూమర్ ఇంటెలిజెన్స్ సంస్థ ఎన్ఐక్యూలో భాగమైన జీఎఫ్కే రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఆడియో డివైజ్‌లపై భారతీయ వినియోగదారుల్లో ఆసక్తి భారీగా పెరిగింది. సినిమాటిక్ అనుభూతిని పొందేందుకు, సౌకర్యవంతంగా వినేందుకు వారు మొగ్గు చూపుతున్నారు.మార్కెట్లో ఇప్పటికీ కాంపాక్ట్ స్టీరియో సిస్టమ్స్ ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ, హోమ్ థియేటర్, స్మార్ట్ ఆడియో విభాగాలు గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. జెన్ జెడ్ కస్టమర్లకు హెడ్ఫోన్లు, హెడ్సెట్లు, మినీ/బ్లూటూత్ స్పీకర్లు తప్పనిసరి డివైజ్‌లుగా మారాయి. పాడ్‌కాస్ట్‌లు, ఆడియో సిరీస్ల్లాంటి కొత్త రకం కంటెంట్ ఫార్మాట్లు పెరుగుతుండటం కూడా ఈ ఉత్పత్తులకు దన్నుగా ఉంటోంది.నివేదికలోని మరిన్ని విశేషాలు..» వైర్లెస్, ట్రూ వైర్లెస్ డివైజ్‌లకు, నాయిస్ క్యాన్సిలేషన్, వాయిస్ అసిస్టెంట్ ఇంటిగ్రేషన్ వంటి అధునాతన ఫీచర్లకు డిమాండ్ పెరిగింది. సగటు అమ్మకం ధర సుమారు 18 శాతం తగ్గింది. » పర్సనల్ ఆడియో సెగ్మెంట్లో ట్రూ వైర్లెస్ హెడ్‌సెట్స్‌కి గణనీయమైన ఆదరణ నెలకొంది. దీంతో ఈ విభాగంలో వాటి వాటా 38 శాతానికి పెరిగింది. » మినీ/బ్లూటూత్ స్పీకర్ల అమ్మకాలు 15 శాతం వృద్ధి చెందాయి. రూ. 2,000 వరకు ధర ఉండే ఎంట్రీ లెవెల్ ప్రోడక్టుల విక్రయాలు 3 శాతం పెరిగాయి.» లౌడ్‌స్పీకర్ అమ్మకాలు 24 శాతం వృద్ధి చెంది రూ. 1,100 కోట్లకు చేరాయి. ఇందులో సౌండ్బార్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. 70 శాతం అమ్మకాలు బడా రిటైల్ చెయిన్ల ద్వారా ఉంటున్నాయి. ఇందులోనూ సౌత్ జోన్లో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలు లౌడ్‌స్పీకర్ల డిమాండ్‌కి హాట్స్పాట్లుగా మారాయి. చిన్న పట్టణాలు, నగరాల్లో అమ్మకాలకు ఈ విభాగంలోని విక్రయాల్లో దాదాపు 30 శాతం వాటా ఉండటమనేది, మెట్రోపాలిటన్యేతర ప్రాంతాల్లో కూడా ఈ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను సూచిస్తోంది. -
నిద్రలేమిని దూరం చేసే కళ్లజోడు.. ఎప్పుడైనా వాడారా..!?
ఈ కళ్లజోడును రోజూ ధరించినట్లయితే, నిద్రలేమి సమస్య దూరమవుతుంది. ప్రతిరోజూ సరైన వేళకు చక్కగా నిద్రపడుతుంది. ఆస్ట్రేలియన్ కంపెనీ ‘రీటైమ్’ ఈ హైటెక్ లైట్‌థెరపీ కళ్లజోడును తాజాగా ‘రీటైమర్–3’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఆడలాయిడ్లోని ఫ్లిండర్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ లియోన్ ల్యాక్ ‘రీటైమ్’ కంపెనీ కోసం ప్రత్యేకంగా ఈ కళ్లజోడును రూపొందించారు.ఈ కళ్లజోడును ధరిస్తే, దీని నుంచి నిర్ణీత తరంగదైర్ఘ్యంలో నీలి–ఆకుపచ్చ రంగులోని కాంతి కళ్ల మీద పడుతుంది. ఈ కాంతి కళ్ల అలసటను పోగొడుతుంది. దీని నుంచి వెలువడే కాంతి శరీర గడియారానికి అనుకూలంగా పనిచేస్తుంది. ఫలితంగా, వేళకు చక్కగా నిద్రపట్టేలా చేస్తుంది. ఈ కళ్లజోడు రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఒకసారి చార్జ్ చేసుకుంటే, ఆరుగంటల సేపు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని ధర 179 డాలర్లు (రూ.15,021) మాత్రమే!ఎక్కడైనా వాడుకోగల పోర్టబుల్ ఏసీ..ఇది పోర్టబుల్ ఏసీ. దీనిని ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇళ్లల్లోనే కాదు, పిక్నిక్లకు, ఫారెస్ట్ క్యాంపులకు వెళ్లేటప్పుడు తాత్కాలికంగా వేసుకున్న టెంట్లలో కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. చైనాకు చెందిన ‘హావోరాన్’, ‘యిఫీలింగ్ డిజైన్ ల్యాబ్’లకు ఇంజినీర్లు ‘యూయీ’ పేరుతో ఈ పోర్టబుల్ ఏసీకి రూపకల్పన చేశారు. ఒకదానికి మరొకటి అనుసంధానమై రెండు భాగాలుగా ఉండే ఈ ఏసీని సూట్‌కేసులా ఎక్కడికైనా సులువుగా తీసుకుపోవచ్చు.ఏసీ భాగాన్ని టెంట్ లోపల లేదా గది లోపల పెట్టుకుని, ఏసీ అడుగున ఉన్న భాగాన్ని టెంట్ లేదా గది వెలుపల పెట్టుకుని, ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది గది లేదా టెంట్ లోపల ఉన్న వేడిని బయటకు పంపి క్షణాల్లోనే చల్లబరుస్తుంది. అంతేకాదు, ఇది పనిచేసే పరిసరాల్లోకి దోమలు, ఇతర కీటకాలు చేరలేవు. దీని ధరను ఇంకా ప్రకటించలేదు.రక్తనాళాల్లోకి చొచ్చుకుపోయే మిల్లీరోబోలు..డచ్ వైద్యశాస్త్రవేత్తలు రక్తనాళాల్లోకి చొచ్చుకుపోయే ఈ మిల్లీరోబోలను ప్రయోగాత్మకంగా రూపొందించారు. ఇవి నేరుగా రక్తనాళాల్లోకి చొచ్చుకుపోయి, సూచించిన దిశలో ముందుకు సాగుతూ, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టిన చోట ఏర్పడిన అవరోధాలను సునాయాసంగా తొలగించి, సజావుగా రక్తప్రసరణ జరిగేలా చేస్తాయి. నెదర్లండ్స్‌లోని ట్వంటీ యూనివర్సిటీ, రాడ్‌బోడ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ మిల్లీరోబోలను త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా రూపొందించారు.అయస్కాంతం ద్వారా వీటి కదలికలకు దిశా నిర్దేశం చేయడానికి వీలవుతుంది. ఈ మిల్లీరోబోల పనితీరుపై ఇంకా లాబొరేటరీ పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి అందుబాటులోకి వచ్చినట్లయితే, గుండెజబ్బులు, పక్షవాతంతో బాధపడే చాలామంది రోగులకు చికిత్స చేసే పద్ధతి మరింత సులభతరమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. -
ఇది.. మైక్రోకరెంట్ ఫేస్ లిఫ్ట్ డివైస్!
ఈరోజుల్లో సౌందర్యాభిలాషులకు తమ వయసును దాచే అద్భుతమైన పరికరాలు మార్కెట్లోకి చాలానే వస్తున్నాయి. ముడతలు, మచ్చలు, గీతలు లేకుండా చర్మానికి నిగారింపునిచ్చి, యవ్వనంతో కళకళలాడేలా మార్చే ఇలాంటి డివైస్‌లు వెంట ఉంటే, అందాన్ని కాపాడుకోవడం చాలా తేలిక. చిత్రంలోని ఈ మైక్రోకరెంట్ ఫేస్ లిఫ్ట్ మెషిన్ అధునాతన రేడియో ఫ్రీక్వెన్సీ, ఎలక్ట్రికల్ మజిల్ స్టిములేషన్ టెక్నాలజీతో పనిచేస్తుంది.ఈ ప్రొఫెషనల్ ఫేషియల్ మసాజర్ వడలిపోయిన చర్మాన్ని బిగుతుగా మార్చడానికి, చర్మానికి ఉండే సహజ స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి, చర్మం నిగారింపును పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. ఈ పోర్టబుల్ మెషిన్ చూడటానికి టార్చ్లైట్లా కనిపిస్తుంది. రీచార్జ్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది.ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనిలోని రెడ్ లైట్ థెరపీ చర్మాన్ని బిగుతుగా మార్చడంతో పాటు దెబ్బతిన్న కొలాజెన్ పొరను సరిదిద్దడానికి సహాయపడుతుంది. అలాగే దీనిలోని బ్లూ కలర్ లైట్ థెరపీ మొటిమలను, మొటిమల వల్ల ఏర్పడే మచ్చలను తొలగిస్తుంది. దీనిలోని రెండు రకాల లైట్ థెరపీలకు మూడు స్థాయిల్లో వైబ్రేషన్ స్పీడ్‌ను కోరుకున్న విధంగా మార్చుకోవచ్చు. ఈ మెషిన్ ఆన్ అయిన ఆరు నిమిషాల్లో ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. దీని ధర 84 డాలర్లు (రూ.7,044) మాత్రమే!ఇవి చదవండి: అందాలొలికే ఈ బొమ్మలు.. సుమనోహరం! -
అవును! ఇదీ.. ఎగిరే కీటకాలను ఇట్టే పట్టేస్తుంది!
దోమలు, ఈగలు సహా రకరకాల ఎగిరే కీటకాలు ఇళ్లల్లోకి చేరి ఇబ్బంది పెడుతుంటాయి. వీటి బారి నుంచి తప్పించుకోవడానికి, వీటిని పారదోలడానికి రకరకాల మందులు వాడుతుంటారు. రసాయనాలు నిండిన మస్కిటో రిపెల్లెంట్స్ వంటి పరికరాలను ఉపయోగిస్తుంటారు. మస్కిటో రిపెల్లెంట్స్ వల్ల దోమల బెడద తగ్గినా, వాటిలోని రసాయనాలు సరిపడక కొందరికి అలర్జీలతో ఇబ్బందులు వస్తుంటాయి. ఎలాంటి రసాయనాలు లేకుండానే, ఎగిరే కీటకాలను ఇట్టే పట్టేసే పరికరాన్ని అమెరికన్ కంపెనీ ‘స్టెమ్’ తాజాగా ఈ ఫ్లైయింగ్ ఇన్సెక్ట్ లైట్ ట్రాప్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. మస్కిటో రిపెల్లెంట్స్ మాదిరిగానే దీనిని ప్లగ్‌లో పెట్టి, స్విచాన్ చేసుకుంటే చాలు. ఇందులోని అల్ట్రా వయొలెట్ లైట్ వెలిగి, ఎగిరే కీటకాలను తనవైపు ఆకర్షిస్తుంది. కీటకాలు ఇందులోకి చేరగానే, అల్ట్రా వయొలెట్ లైట్ ప్రభావానికి అవి వెంటనే అక్కడికక్కడే నశిస్తాయి. దీని ధర 17.59 డాలర్లు (రూ.1473) మాత్రమే!హైడ్రోజన్ వాటర్ బాటిల్..ఇది రీచార్జబుల్, పోర్టబుల్ హైడ్రోజన్ వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్ సాధారణమైన తాగునీటిని క్షణాల్లోనే హైడ్రోజన్ అయాన్ రిచ్ వాటర్‌గా మారుస్తుంది. అమెరికన్ కంపెనీ ‘ఆల్ ఇన్ న్యూట్రిషన్స్’ ఈ బాటిల్‌ను ‘హైడ్రా బాటిల్’ పేరుతో తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. హైడ్రోజన్ అయాన్లతో కూడి నీరు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుందని, పూర్తిగా ఆల్కలైన్ లక్షణాలను కలిగి ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు.సాధారణమైన నీటి కంటే ఆల్కలైన్ వాటర్ ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు ఇప్పటికే పలు పరిశోధనల్లో తేల్చారు. పూర్తిగా చార్జ్ చేసుకున్న తర్వాత ఈ బాటిల్లో నీరు నింపి, స్విచాన్ చేసుకుంటే చాలు. క్షణాల్లోనే ఇందులోని నీరు హైడ్రోజన్ అయాన్ రిచ్ వాటర్‌గా మారుతుంది. స్విచాన్ చేసుకున్నాక ఇందులో జరిగే ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఎలక్ట్రాలిసిస్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ ప్రక్రియలో నీటిలోని హైడ్రోజన్, ఆక్సిజన్ అణువులు వేర్వేరుగా మారి, క్షణాల్లోనే తిరిగి నీరుగా మారుతాయి. ఈ నీరు ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిదని ‘ఆల్ ఇన్ న్యూట్రిషన్స్’ సీఈవో లిండ్సే డంకన్ చెబుతున్నారు. ఈ బాటిల్ ధర 54.99 డాలర్లు (రూ.4,607).నొప్పులను నయం చేస్తుంది..బోలుగా గొట్టంలా ఉండే ఈ సాధనం కీళ్ల నొప్పులను, కండరాల నొప్పులను ఇట్టే నయం చేస్తుంది. అమెరికన్ కంపెనీ ‘ఓమ్నిపెంఫ్’ తాజాగా అందుబాటులోకి తెచ్చిన ఈ పరికరం ‘నియోరిథమ్ ట్యూబ్’. రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే ఈ నియోరిథమ్ ట్యూబ్‌ను శరీరంలో నొప్పి ఉన్న భాగానికి తొడుక్కుని స్విచాన్ చేసుకుంటే, ఇది ఆ భాగం చుట్టూ విద్యుదయస్కాంత క్షేత్రాన్ని సృష్టించి, కండరాలకు ఉత్తేజం కలిగిస్తుంది.ఇది సృష్టించే విద్యుదయస్కాంత క్షేత్రం పరిధిలో వెలువడే ప్రకంపనలు బిగపట్టిన కీళ్లను, కండరాలను సడలించి, నొప్పిని తగ్గిస్తాయి. తరచుగా కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులతో బాధపడే వృద్ధుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దినట్లు తయారీదారులు చెబుతున్నారు. దీని ధర 269 డాలర్లు (రూ.22,540) మాత్రమే!ఇవి చదివండి: అంత్యక్రియల కాలేజీ..! అవును మీరు విన్నది నిజమే..! అదీ..? -
అందానికి హై ఫ్రీక్వెన్సీ మెషిన్! ఇదొక మంత్రదండంలా..
అందాన్ని అరచేతుల్లో కోరుకునే ఆడవారికి ఈ హై ఫ్రీక్వెన్సీ మెషిన్ ఓ మంత్రదండంలా పని చేస్తుంది. ఇది మచ్చలు, ముడతలు, మొటిమలు, కళ్ల కింద నల్లటి వలయాలు వంటి లోపాలను మాయం చేసేస్తుంది. చర్మాన్ని బిగుతుగా, నవయవ్వనంగా మారుస్తుంది. దీనిలో మూడు ట్యూబ్స్ లభిస్తాయి.వాటిలో రెండు స్కిన్ ట్యూబ్స్ చర్మానికి, ఒక స్కాల్ప్ ట్యూబ్ తలకు అనువుగా ఉంటాయి. ఒక స్కిన్ ట్యూబ్ మృతకణాలను తొలగించి, ముడతలను దూరం చేస్తుంది. మరో స్కిన్ ట్యూబ్ మొటిమలను, వాటి వల్ల ఏర్పడే మచ్చలను మాయం చేస్తుంది. ఇక స్కాల్ప్ ట్యూబ్ హెయిర్ గ్రోత్‌ను పెంచుతుంది. దీని వల్ల తలలో రక్తప్రసరణ బాగా జరిగి, జుట్టు ఊడటం తగ్గుతుంది.ఈ డివైస్ 90% నియాన్, 10% ఆర్గాన్ తో కూడిన హై ఫ్రీక్వెన్సీ ఫేషియల్ మెషిన్. ఇది అన్ని రకాల చర్మాలకు అనువుగా ఉంటుంది. స్కిన్ కేర్, హెయిర్ కేర్లను కోరుకునే స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు ఇది చక్కటి బహుమతి అవుతుంది. పైగా దీన్ని వినియోగించడం చాలా తేలిక. దీని ధర 60 డాలర్లు. అంటే నాలుగువేల తొమ్మిది వందల ఎనభై మూడు రూపాయలు.ఇవి చదవండి: ప్రస్తుతం ఇంట్లో గోడలకు.. ట్రెండ్‌గా మారిన వాల్‌పేపర్ డిజైన్స్..! -
టెక్ టాక్: సరికొత్త టెక్నాలజీతో ఈ పరికరాలు మీకోసమే..
రోజురోజుకి మారుతున్న కొత్త టెక్నాలజీతో పాటు మానవ అవసరాలలో కూడా మార్పులు జరుగుతున్నాయి. కొత్త పరికరాలు ఏమైనా మార్కెట్లోకి వచ్చాయా అని ఎదురుచూపులు, పడిగాపులు కాచుకునే వారికోసం.. ఇలాంటి సరికొత్త టెక్నాలజీని కూడిన వస్తువులు దూసుకొస్తున్నాయి. మరి అవేంటో చూద్దాం. షావోమి వాచ్ 2 డిస్ప్లే: 1.43 అంగుళాలు రిజల్యూషన్: 466“466 పిక్సెల్స్ ∙లైట్ వెయిట్ 150 స్పోర్ట్స్ మోడ్స్ బ్యాటరీ: 495 ఎంఏహెచ్ స్లీప్ ట్రాకింగ్ పోకో ఎక్స్ 6 నియో 5జీ డిస్ప్లే: 6.67 అంగుళాలు వోఎస్: ఆండ్రాయిడ్ 13 ర్యామ్: 8జీబి, 12జీబి స్టోరేజ్: 128జీబి, 256జీబి బ్యాటరీ: 5000 ఎంఏహెచ్ బరువు: 175.00 గ్రా. ఇవి చదవండి: ఈ విశేషాల గురించి మీరెప్పుడైనా విన్నారా..! -
బట్టతలకు విరుగుడు మంత్రం.. ఈ స్మార్ట్ డివైజ్!
బట్టతల మీద జుట్టు మొలిపించుకోవడం కోసం జనాలు నానా తంటాలు పడుతుంటారు. జుట్టు రాలడాన్ని అరి కట్టడానికి రకరకాల నూనెలను ఉపయోగిస్తుంటారు. మందు మాకులు వాడుతుంటారు. బట్టతలను దాచుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ కొందరు విగ్గులు వాడుతుంటారు. బట్టతలపై జుట్టు కోసం ఇకపై ఇన్ని తంటాలు అక్కర్లేదు. హెల్మెట్‌లా కనిపించే ఈ పరికరాన్ని తలకు తొడుక్కుంటే చాలు. ఆరు నెలల్లోనే ఇది ఫలితాలను చూపించడం మొదలుపెడుతుంది. ఆస్ట్రియాకు చెందిన ‘నియోస్టెమ్’ కంపెనీ ఇటీవల ఈ పరికరాన్ని ‘హెయిర్‌లాస్ ప్రివెన్షన్ వెయిరబుల్’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. రోజూ అరగంట సేపు దీన్ని తలకు తొడుక్కుంటే, ఇది తలపైనున్న మూలకణాలను ఉత్తేజితం చేసి, జుట్టు రాలిపోయిన చోట తిరిగి జట్టు మొలిపిస్తుందని దీని తయారీదారులు చెబుతున్నారు. దీనిని వాడటం వల్ల దుష్ఫలితాలేవీ ఉండబోవని కూడా వారు చెబుతున్నారు. దీని ధర 899 డాలర్లు (రూ.74,734). -
చిన్న పరికరం.. పెద్ద ప్రయోజనం - వీడియో
ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లు, బైకులు మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా విరివిగా అందుబాటులో ఉన్నాయి. బైకులు, కార్లలో మాదిరిగా కాకుండా.. సైకిల్స్‌లో చిన్న బ్యాటరీ లేదా ఈ-బైక్ కన్వర్షన్ కిట్లు ఉంటాయి. బ్యాటరీల గురించి విన్న చాలామందికి కన్వర్షన్ కిట్ల గురించి తెలియకపోవచ్చు. ఈ కథనంలో మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం. ఈ-బైక్ కన్వర్షన్ కిట్లు సాధారణ సైకిల్‌కు అదనంగా యాడ్ చేయడానికి అనుగుణంగా ఉంటాయి. ఇది మౌంట్ చేసుకున్న తరువాత మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇక్కడ ఫోటోలలో గమనించినట్లయితే డిస్క్ బ్రేక్‌కు అమర్చిన కన్వర్షన్ కిట్ చూడవచ్చు. (Image credit: Skarper / Red Bull) ఇక్కడ కనిపించే కన్వర్షన్ కిట్‌ను స్కార్పర్ అనే స్టార్టప్ ఈ ఏడాది పరిచయం చేసింది. ఇది ఒక అధునాతన టూ-మోడ్ ఎలక్ట్రిక్ బైక్ మోటారు. కస్టమ్ డిజైన్ చేసిన డిస్క్ బ్రేక్‌కు క్లిప్ చేసుకోవచ్చు. ఇది పూర్తి గేర్‌బాక్స్‌గా పనిచేస్తుంది. బైక్‌పై కస్టమ్ డిస్క్‌ని ఇన్స్టాల్ చేసిన తర్వాత, మోటారును ఆన్ లేదా ఆఫ్ చేయడానికి కొన్ని సెకన్ల సమయం పడుతుంది. పవర్ అనేది వెంటనే మారుతుంది. కన్వర్షన్ కిట్ తయారీకి సంస్థకు ఏకంగా మూడు సంవత్సరాల సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఇది సైకిల్లో డిస్క్ బ్రేక్ మాదిరిగా కూడా పనిచేస్తుంది. ఈ కిట్‌ను మౌంట్ చేయడం లేదా రిమూవ్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి వినియోగదారుని అవసరమైనప్పుడు మౌంట్ చేసుకోవచ్చు, మిగిలిన సమయంలో తీసి ఇంట్లో జాగ్రత చేసుకోవచ్చు. ఇదీ చదవండి: భారత్ నెలలో చేసేది అమెరికాకు మూడేళ్లు - కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేతిలో పట్టుకెళ్ళడానికి అనుకూలంగా ఉండే కన్వర్షన్ కిట్ ధర 1295 యూకే పౌండ్స్ (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 1.30 లక్షలకంటే ఎక్కువ) అని తెలుస్తోంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన ఈ కిట్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో గొప్ప ఆదరణ పొందుతుందని తయారీదారులు భావిస్తున్నారు. -
రేపటి నుంచి అలెక్సా పనిచేయదు! కానీ..
ఆధునిక కాలంలో అమెజాన్ అలెక్సా, యాపిల్ హే సిరి వంటి వాయిస్ అసిస్ట్ సర్వీకులు ఎక్కువ వాడుకలో ఉన్నాయి. అయితే అలెక్సా త్వరలో కొన్ని డివైజ్‌లలో పనిచేయదని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అమెజాన్ అలెక్సా సర్వీసుకు సంబంధించి సెర్చ్ ఇంజిన్ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇది గూగుల్ నెస్ట్ కిట్‌పై పనిచేయదని సమాచారం. రేపటి నుంచి (2023 సెప్టెంబర్ 29) గూగుల్ లెగసీ నెస్ట్ కిట్ ద్వారా అలెక్సా సేవలు నిలిచిపోతున్నాయి. అయితే ఈ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండాలంటే కొత్త Google Nest స్కిల్‌ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ముందుగా మీ మొబైల్లోని అలెక్సా యాప్ ఓపెన్ చేసి, ట్యాప్ మరి మీద క్లిక్ చేయాలి. తరువాత స్కిల్ అండ్ గేమ్స్ సెలక్ట్ చేసుకుని, ఫైండ్ యువర్ స్కిల్స్ ఎంచుకోవాలి. ఫైండ్ నెస్ట్ అలెక్సా స్కిల్ సెలక్ట్ చేసి డిసేబుల్ చేయాలి. * అలెక్సా యాప్‌లో ఉన్న నెస్ట్ డివైజెస్ అన్నీ రిమూవ్ చేయాలి. గూగుల్ హోమ్ యాప్‌లో న్యూ గూగుల్ నెస్ట్ అలెక్సా స్కిల్ ప్రారంభించడానికి, ముందుగా యాప్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి + గుర్తు మీద ట్యాప్ చేయాలి. అందులో సర్వీస్ ఎంచుకుని అందులో అమెజాన్ అలెక్సా స్కిల్ సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత అలెక్సా యాప్ ఓపెన్ చేసి యాక్టివేట్ చేసుకోవాలి. అమెజాన్ ఎకో స్పీకర్ లేదా డిస్ప్లేను కలిగి ఉన్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. -
ఈ కెటిల్లో వంట కూడా వండేయొచ్చు , ధర కూడా తక్కువే
ఒకటిన్నర లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ స్టెయిన్ లెస్ స్టీల్ ఎలక్ట్రిక్ హాట్ వాటర్ కెటిల్.. ఆటో షట్ఆఫ్, బాయిల్–డ్రై ప్రొటెక్షన్‌తో రూపొందింది. ఈ మెషిన్‌తో టీ, కాఫీలతో పాటు ఇన్ స్టంట్ నూడుల్స్ వంటివెన్నో రెడీ చేసుకోవచ్చు. గుడ్లు, కూరగాయలు, దుంపలు వంటివి ఉడికించుకోవచ్చు. దీనిలో ఫారెన్ హీట్ లేదా సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత యూనిట్‌ని మార్చడానికి వీలుగా ప్రత్యేకమైన బటన్ ఉంటుంది. బాయిల్ లేదా స్టాప్ బటన్ సాయంతో.. దీన్ని చాలా సులభంగా వాడుకోవచ్చు. ఫుడ్–గ్రేడ్ స్టెయిన్ లెస్ స్టీల్‌తో ఉన్న ఈ డివైస్.. మగ్ మాదిరి వినియోగించుకోవడానికి ఈజీగా ఉంటుంది. హైక్వాలటీ టెక్నాలజీతో, యాంటీ స్కాల్డ్ హ్యాండిల్‌తో చూడటానికి భలే అందంగా ఉంటుంది. కిచెన్ ఇంటీరియర్ లుక్ కోసం కూడా దీన్ని ఎన్నుకోవచ్చు. ధర 40 డాలర్లు (రూ.3,315) -
నొప్పిలేకుండా ఇంట్లోనే వ్యాక్సింగ్.. ఈ మెషిన్ ఉంటే భలే సులువు
బ్యూటీ లవర్స్‌కి అన్నింటి కంటే అతిపెద్ద సమస్య అవాంఛితరోమాలే. నెలకోసారి పార్లర్‌కి వెళ్లి వాక్సింగ్ చేయించుకోవడం.. లేదంటే ఇంట్లోనే రకరకాల సాధనాలతో అవాంఛిత రోమాలను తొలగించుకోవడం.. తప్పించుకోలేని సమస్యగా మారుతుంది. అదంతా ఓ విసుగు వ్యవహారం. ఆ సమస్య.. విసుగును కట్ చేస్తుంది ఈ హెయిర్ రిమూవల్ డివైస్. నొప్పి తెలియకుండా.. సమయమూ ఎక్కువ తీసుకోకుండా శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది. ఈ లేజర్ హెయిర్ రిమూవల్ డివైస్.. అప్‌గ్రేడ్ వెర్షన్స్ లో అందుబాటులోకి వచ్చింది. ఇది కేవలం 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను మాత్రమే విడుదల చేయడంతో చర్మం కందిపోదు, ఎరుపెక్కదు. దీనిలో 5 లెవెల్స్ ఉంటాయి. అయితే సున్నితమైన భాగాలను బట్టి ఆ లెవెల్స్‌ని పెంచుకోవడం, తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. ఇందులో మాన్యువల్ మోడ్‌ని.. ప్రధానంగా బికినీ లైన్, అండర్ ఆర్మ్స్, వేళ్లు, పై పెదవి.. భాగాల్లో రోమాలను తొలగించడానికి ఉపయోగించాలి. దీనిలోని ఆటో మోడ్‌ని.. చేతులు, కాళ్లు, పొట్ట, వీపు వంటి ఏరియాల్లో వెంట్రుకలను తొలగించడానికి యూజ్ చేయాలి. ఇది ఎరుపు, తెలుపు, గ్రే కలర్ వెంట్రుకలను తీయడానికి పనిచేయదు. ఇది కేవలం ఎనిమిది నిమిషాల్లో మొత్తం బాడీని క్లీన్ చేయగలదు. అయితే ముందుగా షేవ్ చేసుకుని.. ఆ తర్వాత ఈ డివైస్‌తో ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీన్ని వినియోగించే సమయంలో మెషిన్‌తో పాటు వచ్చే ప్రత్యేకమైన కళ్లజోడును ధరించడం మంచిది. సరిగ్గా నాలుగు వారాల పాటు.. దీని మెనూ బుక్‌ని ఫాలో అవుతూ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఈ డివైస్ ధర సుమారు 7,829 రూపాయలు. ఇలాంటి లేటెస్ట్ మోడల్స్‌ని కొనుగోలు చేసే ముందు రివ్యూలు చదివి.. ఆర్డర్ చేయడం మంచిది. -
లాజిటెక్ నుండి డాకింగ్ స్టేషన్
న్యూఢిల్లీ: లాజిటెక్ కొత్తగా లాజి డాక్ పేరిట ఆల్ ఇన్ వన్ డాకింగ్ స్టేషన్‌ను ఆవిష్కరించింది. వివిధ డెస్క్‌టాప్ డివైజ్‌లకు ఒకే కనెక్షన్ పాయింట్‌గా ఇది ఉపయోగపడుతుంది. అయిదు వరకు యూఎస్బీ పెరిఫరల్స్, రెండు వరకూ మానిటర్లతో పాటు ఒక ల్యాప్‌టాప్‌ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. గ్రాఫైట్, తెలుపు రంగుల్లో ఇది లభిస్తుంది. దీని ధర రూ. 55,000 (పన్నులు కాకుండా). ఈ ఏడాది డిసెంబర్, వచ్చే ఏడాది జనవరి నుండి భారత మార్కెట్లో ఇది అందుబాటులోకి వస్తుంది. -
వాట్సాప్ మరో అద్భుత ఫీచర్: కంపానియన్ మోడ్, అంటే ఏంటంటే?
సాక్షి,ముంబై: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం తాజాగా మరో సూపర్ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఒకే నంబర్‌తో ఒకేసారి రెండు స్మార్ట్ఫోన్లతోపాటు, మరో రెండు డివైస్‌లలో వాట్సాప్‌ను యాక్సెస్‌కి యూజర్లకు అనుమతినివ్వనుంది. ఈ సేవను ఎనేబుల్ చేసేలా ‘కంపానియన్ మోడ్’ అనే ఫీచర్‌ని పరీక్షిస్తోంది. (ElonMusk క్షణం తీరికలేని పని: కొత్త ఫీచర్ ప్రకటించిన మస్క్) వాట్సాప్ రాబోయే ఫీచర్లను ట్రాక్ చేసే వాబేటా ఇన్ఫో ప్రకారం కంపానియన్ మోడ్ ఫీచర్‌ను కొన్ని బీటా టెస్టర్లకు విడుదల చేసింది. కొంతమంది బీటా టెస్టర్ల కోసం ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు తెలిపింది. అంతేకాద మొబైల్, డెస్క్‌టాప్‌లో ఏకకాలంలో వాట్సాప్‌ను ఉపయోగించవచ్చని తెలిపింది. 'లింక్ డివైస్' ఆప్షన్ ద్వారా రెండో స్మార్ట్‌ఫోన్‌ను లింక్ చేసుకునే అవకాశాన్ని వాట్సాప్ అందిస్తుంది. మరొక స్మార్ట్‌ఫోన్‌ను లింక్ చేసిన తర్వాత, చాట్ హిస్టరీ చూడటం తోపాటు, మెసేజేస్ చూసుకోవడం, సమాధానాలివ్వడంతోపాటు కాల్స్‌ను చేసుకోవచ్చు. బీటా టెస్టర్ గరిష్టంగా 4 పరికరాలను రెండు స్మార్ట్ఫోన్లు, ఒక టాబ్లెట్ ,ఒక డెస్క్టాప్కి లింక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా డెస్క్‌టాప్‌లో వాట్సాప్ సేవలను పొందుతున్న సంగతి తెలిసిందే. (ప్రతీ వాట్సాప్ గ్రూపునకు కూడా 10 డాలర్లు పెడితే!?) కాగా వాట్సాప్‌కు భారతదేశంలో దాదాపు 500 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు.ఇటీవల గ్రూప్‌లో పాల్గొనే వారి సంఖ్యను 1024కి పెంచింది. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిటీస్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఒక గ్రూపు పలు గ్రూపులను రూపొందించడానికి యూజర్లకు అనుమతిస్తుంది. ఇందులో ఒక గ్రూపు గరిష్టంగా 12 గ్రూపులను క్రియేట్ చేసుకోవచ్చు. (వాట్సాప్ అదిరిపోయే ఫీచర్లు: పోల్స్ ఫీచర్ ఇంకా...!) -
పిల్లలు ఇష్టంగా తినే ఎగ్ బైట్స్.. దీనితో సులభంగా తయారు చేసుకోవచ్చు! ధర?
చిన్నాపెద్దా ఇష్టపడే రుచుల్లో ఎగ్ బైట్స్ ప్రత్యేకం. కాఫీ, టీలతో పాటు సాయంకాలపు స్నాక్స్‌లో అవీ భాగమే. పిల్లల స్నాక్స్ బాక్సుల్లోనూ వాటినే సర్దుతుంటారు చాలామంది తల్లులు. ఈ ఎగ్ బైట్స్‌ను తయారు చేయడంలో ఈ డివైజ్ చక్కగా ఉపయోగపడుతుంది. డివైజ్ అడుగు భాగంలో ట్రే కింద వాటర్ నింపుకుని, ట్రే బౌల్స్‌లో సిద్ధం చేసుకున్న రెసిపీనీ ఉంచేసి.. మూతపెట్టి, స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుంది. పదే పది నిమిషాల్లో టేస్టీ టేస్టీ ఎగ్ బైట్స్ సిద్ధమైపోతాయి. ఎగ్ తిననివారు ఇతర రెసిపీలతో కూడా ఈ కప్స్‌ను కుక్ చేసుకోవచ్చు. భలే ఉంది కదూ. -ధర : 27 డాలర్లు (రూ.2,133) చదవండి: Health Tips: రోజూ క్యారెట్ తినే అలవాటుందా? దీనిలోని బీటా కెరోటిన్ వల్ల.. Black Pepper: మిరియాల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే -
ముఖంపై ముడతలు, మచ్చలను మాయం చేసే డివైజ్..!
మేకప్, టచప్ అంటూ ఎన్ని కాస్మొటిక్ ప్రోడక్ట్స్ మార్చినా.. యవ్వనానికి మించిన అందమే ఉండదు. అందుకే ఆ యవ్వనం కోసం తాపత్రయపడుతుంటారు సౌందర్యప్రియులు. వయసు పెరిగేకొలదీ వచ్చిన.. ముడతల చర్మాన్ని మృదువుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ మైక్రోడెర్మాబ్రేషన్ సిస్టమ్. చూడటానికి సిస్టమ్‌లానే, మినీ ల్యాప్‌టాప్‌లా కనిపించే... ఈ డివైజ్ వయసుతో వచ్చే ముడతలను, గీతలను ఇట్టే పోగొడుతుంది. చర్మానికి తగిన స్పాను అందిస్తుంది. Microdermabrasion: ఆటో మోడ్, సెన్సిటివ్ మోడ్, మాన్యువల్ మోడ్.. అనే మూడు వేరువేరు మోడ్స్‌తో చర్మానికి ఎక్స్ఫోలియేటర్ స్క్రబ్‌ను అందిస్తుంది. సిస్టమ్‌కి కుడివైపున అటాచ్ అయిన పొడవాటి ట్యూబ్ (ప్లాస్టిక్ వాండ్) లాంటిది ఉంటుంది. దానికే మరో చివర, డివైజ్‌తో పాటు లభించే.. 3 విడి భాగాలను అవసరాన్ని బట్టి మార్చుకుంటూ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అవే.. పోర్ ఎక్స్ట్రాక్షన్ టిప్ (రంధ్రాలను రూపుమాపేందుకు సహకరించే పార్ట్), మాగ్నెటిక్ ఇన్ఫ్యూజర్ టిప్ (మృతకణాలను, వ్యర్థాలను తొలగించే పార్ట్), డైమండ్ టిప్ (ముడతలు, గీతలు తొలగించే పార్ట్). వాటిని అమర్చిన తర్వాత.. ప్లాస్టిక్ వాండ్‌ను పెన్ మాదిరి పట్టుకుని, చర్మానికి ఆనిస్తే సరిపోతుంది. పునర్యవ్వనంతో కూడిన ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం. ల్యాప్‌టాప్‌లా ఉన్న ఈ సిస్టమ్‌లో ఒకవైపు అద్దంతో పాటు మరోవైపు పవర్ బటన్, మోడ్ సెలెక్షన్ బటన్, స్టార్ట్/స్టాప్ బటన్, లెవల్స్/ఏరియా బటన్, ఎల్సిడి స్క్రీన్ ఉంటాయి. వాటిని ఆపరేట్ చేసుకుని అద్దంలో చూసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. పవర్ అడాప్టర్, క్లీనింగ్ బ్రష్, రీప్లేస్మెంట్ ఫిల్టర్స్ (డైమండ్ టిప్‌లో మార్చాల్సిన ఫిల్టర్స్) మెషిన్‌తో పాటు లభిస్తాయి. దీని ధర సుమారు 179 డాలర్లు. అంటే 13,405 రూపాయలు. చదవండి: 88 యేళ్లనాటి కేకు.. ఇప్పటికీ తాజాగానే ఉంది!! -
నిద్ర సరిగ్గా పట్టడం లేదా? ఒత్తిడిని తగ్గించి మరీ నిద్రపుచ్చుతుంది
ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ చాటింగ్‌లు, బ్రౌజింగ్‌లు.. నిద్రను దోచుకుని, శరీరంలో ప్రతికూలమైన మార్పులు తెచ్చిపెడుతున్నాయి. నిద్రలేమితో ముఖం పాలిపోయి..కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడి.. ఎంతటి కళ గల ముఖమైనా డల్‌గా మారిపోతుంది. నిజానికి సరైన నిద్రే సౌందర్య రహస్యం అంటారు నిపుణులు. దానికి చక్కని బహుమతి..హ్యాండ్ హెల్డ్ స్లీప్ ఎయిడ్ ఇస్ట్రుమెంట్. కంటినిండా నిద్రను తెచ్చి..ముఖ వర్చస్సును పెంచుతుంది. చిత్రంలోని ఈ మైక్రో–కరెంట్ స్మార్ట్ హిప్నాసిస్ ఇస్ట్రుమెంట్..హైటెక్నాలజీతో రూపొందింది. ఈ పరికరం ప్రధానంగా తగినంత నిద్ర లేకుండా బాధపడేవారికి సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించి మరీ నిద్రపుచ్చుతుంది. ఈ డివైజ్‌ని చేతితో పట్టుకుని, రిలాక్స్డ్గా కళ్లు మూసుకుంటే చాలు.. మెదడులోని కండరాలను ఉత్తేజపరచి.. కళ్ల మీద నిద్రను మోసుకొస్తుంది. ఇది సురక్షితమైనది.. తేలికైనది..పరిమాణంలో చిన్నది. పోర్టబుల్ మాత్రమే కాదు సులభంగా ఆపరేట్ చేసుకోవచ్చు. దీనిలో వర్కింగ్ మోడ్స్ ఉంటాయి. తక్కువ ఫ్రీక్వెన్సీకి డికంప్రెషన్ మోడ్, హై ఫ్రీక్వెన్సీకి ఎగ్జిటేషన్ మోడ్ నొక్కాలి. తీవ్రతను పెంచడానికి లేదా తగ్గించడానికి ప్లస్ మైనస్ బటన్ నొక్కాలి. ఈ స్లీప్ ఎయిడ్ పరికరాన్ని ఆఫీసులో ఇంట్లో, వ్యాపార పర్యటన ప్రాంతాల్లో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. సుమారు 15 నిమిషాలు వాడితే.. తలనొప్పి, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను కూడా నివారిస్తుంది. దీన్ని చేతికి బ్రేస్లెట్లా వేసుకునేందుకు వీలుగా ప్రత్యేకమైన బ్యాండ్ ఉంటుంది. ఆ పరికరాన్ని చేతికి పెట్టుకొని నిద్రపోతే తెల్లవారాక.. ఆ రోజు ఉల్లాసంగా.. ఉత్సాహంగా మొదలవుతుంది. దీని ధర సుమారు 30 డాలర్లు. అంటే సుమారు రూ. 2,200. -
డ్రైవింగ్ సీట్లో నిద్ర..రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తం చేసే డివైజ్
ఎంత అప్రమత్తంగా ఉన్నా ప్రయాణాల్లో ఏ ప్రమాదం ఎటునుంచి మీదకొస్తుందో తెలియని రోజులివి. ఇక దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడైతే.. డ్రైవింగ్ సీట్లో ఉన్న వాళ్లకు మరిన్ని జాగ్రత్తలు తప్పవు. స్మూత్‌గా దూసుకుపోయే కారు వంటి వాహనాల్లో నిద్ర ముంచుకొస్తుంటుంది. అప్పుడే రెప్పపాటు కాలంలో ఘోర ప్రమాదాలు జరిగిపోతుంటాయి. అలాంటి ప్రమాదాలను ముందుగానే గుర్తించి.. హెచ్చరించే పరికరమే చిత్రంలోని ఆటో సేఫ్ డివైజ్. విధుల్లో ఉన్నప్పుడు పూర్తిగా అప్రమత్తంగా ఉండాల్సిన వ్యక్తుల కోసం ఈ రిమైండర్‌ని రూపొందించారు. డ్రైవర్స్, రాత్రిపూట డ్యూటీ చెసే సెక్యూరిటీ గార్డ్స్, మెషిన్ ఆపరేటర్లు ఇలా ఎందరికో ఈ డివైజ్ ఉపయోగపడుతుంది. పోర్టబుల్ సైజుతో డిజైన్ చేసిన ఈ పరికరం.. ప్రాణాలను రక్షించే నిద్ర నిరోధక అలారమే అంటున్నారు నిపుణులు. ఎలక్ట్రానిక్ పొజిషన్ సెన్సార్ కలిగిన ఈ గాడ్జెట్‌ని.. చెవికి బ్లూటూత్ మాదిరి పెట్టుకుంటే సరిపోతుంది. వినియోగిస్తున్నవారు ఏమాత్రం నిద్ర మత్తులో తూగినా చెవిలో వైబ్రేషన్‌తో కూడిన అలారాన్ని మోగించి అలెర్ట్ చేస్తుంది. -
స్పేస్‌లో మనిషి: మనుగడకోసం ఇస్రో మరో ముందడుగు
బెంగళూరు: అంతరిక్షంలో జరిపే జీవసంబంధిత ప్రయోగాలకు ఉపయోగపడే ఒక సాధనాన్ని ఇస్రో, ఐఐఎస్సీ సైంటిస్టులు రూపొందించారు. ఈ మాడ్యులర్ సాధనంతో జీవప్రయోగాలకు అవసరమైన సూక్ష్మజీవులను అభివృద్ధి చేస్తారు. అక్టా ఆస్ట్రోనాటికాలో ఈ పరిశోధన వివరాలు ప్రచురించారు. స్పొరోసార్సినా పాశ్చురై అనే బ్యాక్టీరియాను చాలా రోజులపాటు పెంచి పోషించేందుకు కొత్త సాధనం ఎలా ఉపయోగపడుతుందనే విషయాన్ని పరిశోధనలో వివరించారు. అంతరిక్షంలో ఎదురయ్యే విపరీత పరిస్థితుల్లో సదరు సూక్ష్మజీవులు ఎలా స్పందిస్తాయన్న విషయాలను అవగతం చేసుకోవడంలో ఈ ప్రయోగాలు కీలకపాత్ర పోషిస్తాయి. వీటి స్పందనల ఆధారంగా మనిషికి ఎదురయ్యే సవాళ్లను పసిగట్టవచ్చు. గగన్‌యాన్ పేరిట త్వరలో స్వదేశీయ అంతరిక్ష యాత్రకు ఇస్రో సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కొత్త సాధనంలో ఎల్ఈడీ, ఫొటోడయోడ్ సెన్సార్లతో బ్యాక్టీరియా పెరుగుదలను గమనిస్తారు. కొత్త పరికరం వంద శాతం లీక్ప్రూఫ్ అని, ప్రయాణంలో ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుంటుంది.జీవేతర ప్రయోగాలకు సైతం దీన్ని ఉపయోగించుకోవచ్చని పరిశోధకుల్లో ఒకరైన కుమార్ చెప్పారు. చదవండి: భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ఖాయం! -
We Care for You: వాట్సాప్ సర్వీస్ ద్వారా శాంసంగ్ బెనిఫిట్స్
న్యూఢిల్లీ: కస్టమర్ల సేఫ్టీ కోసం శాంసంగ్ సులువైన సౌకర్యాన్ని తీసుకొచ్చింది. కరోనా టైంలో షోరూమ్‌ల దగ్గర కస్టమర్ల క్యూ తాకిడిని తగ్గించేందుకు వీ కేర్ ప్రొగ్రాం కింద ఓ ఫీచర్‌ను తెచ్చింది. దాని పేరు ‘షాప్ బై అపాయింట్మెంట్’. శాంసంగ్ ప్రొడక్ట్స్ ఏవైనా కొనాలంటే ఇకపై కస్టమర్లు షోరూమ్ దగ్గర వేచిచూడాల్సిన అవసరం లేకుండా.. ముందుగా ఆన్లైన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ముందుగా శాంసంగ్ షాప్ బై అపాయింట్మెంట్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని ప్రకారం.. కస్టమర్లకు దగ్గర్లో ఉన్న శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌లో ఫలానా తేదీ, ఫలానా టైంకి అపాయింట్మెంట్ ఇస్తారు. అంతేకాదు శాంసంగ్ స్మార్ట్ కేఫ్‌లలో అపాయింట్మెంట్ కోసం 9870494949 నెంబర్‌కు వాట్సాప్ చేసి.. కొన్ని స్టెప్స్ ఫాలో కావాలి. ఆ తర్వాత వాళ్లు అపాయింట్మెంట్ ఇచ్చే టైంకి షోరూంకి వెళ్లి.. ఎగ్జిక్యూటివ్‌తో నేరుగా ఇంటెరాక్ట్ అయ్యి కావాల్సిన ప్రొడక్ట్ గురించి తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా కస్టమర్ల మధ్య ఫిజికల్ డిస్టెన్స్ తేలికగా అమలు అవుతుందని కంపెనీ భావిస్తోంది. ఈ వాట్సాప్ చాట్‌బోట్ ద్వారా డివైజ్‌ల వివరాలు, లేటెస్ట్ ఆఫర్లు, దగ్గర్లోని స్టోర్ల వివరాలు తెలుసుకోవచ్చు. హోం డెలివరీ, హోం డెమో సర్వీసులను కస్టమర్లు అందుకోవచ్చు. అవసరమైన చెల్లింపులను డిజిటల్ పే ద్వారా చేయొచ్చు. ఈ-ఇన్వాయిస్లను వాట్సాప్ ద్వారానే పొందవచ్చు. ఇక ఈ సర్వీస్‌ల ద్వారా ప్రొడక్టులను కొనే కస్టమర్లకు 1000 రూ. దాకా రివార్డు పాయింట్లు ఇస్తారు. ఈ పాయింట్లు శాంసంగ్ స్మార్ట్ క్లబ్ వాలెట్లో జమ అవుతుంది. ఈ సర్వీస్ ద్వారా గేలక్సీ ట్యాబ్స్, స్మార్ట్ వాచీలు, బడ్స్ మీద స్టూడెంట్స్‌కి స్పెషల్ డిస్కౌంట్ లభించనుంది. వీటితోపాటు అదనంగా రిఫరెల్ అడ్వాంటేజ్ ప్రోగ్రాం కింద ఆఫర్లు వర్తించే ఫోన్లపై రూ. 7500 రిఫరల్ బెనిఫిట్(రిఫరెన్స్ చేయడం ద్వారా) కస్టమర్లకు దక్కుతుంది. చదవండి: వాట్సప్ సమస్యలపై గ్రీవెన్స్ ఆఫీసర్‌కి కంప్లైంట్ చేయడం ఎలా? -
స్కోడా వోక్స్‌వ్యాగన్‌కు సుప్రీంలో చుక్కెదురు
న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ స్కోడా ఆటో వోక్స్వ్యాగన్ ఇండియాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. డీజిల్ కారులో ఉద్గార నిబంధనలను తారుమారు చేసేందుకు మోసపూరిత పరికారాన్ని (చీట్ డివైజ్) కంపెనీ ఏర్పాటు చేసిందంటూ ఉత్తరప్రదేశ్‌లో ఓ వినియోగదారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. దీన్ని కొట్టివేయాలని కోరుతూ స్కోడా ఆటో వోక్స్వ్యాగన్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించినా కోరుకున్న ఫలితం దక్కలేదు. వాహనాల్లో చీట్ డివైజ్‌ల ఏర్పాటుపై కచ్చితంగా విచారణ జరగాల్సిందేనని అలహాబాద్ హైకోర్టు తేల్చిచెప్పింది. దీంతో సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రమణియన్‌తో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను కొట్టేవేస్తూ తీర్పు చెప్పింది. ఈ కేసులో విచారణ ఎందుకు కొనసాగించరాదంటూ ఈ నెల 4న విచారణలో భాగంగా ప్రశ్నించిన ధర్మాసనం.. తన తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ‘చీట్’ లేదా ‘డిఫీట్ డివైజ్’ అన్నది సాఫ్ట్‌వేర్‌తో కూడిన ఓ పరికరం. దీన్ని ఆటో ఇంజన్లలో అమర్చడం ద్వారా కాలుష్యం విడుదల పరీక్షల ఫలితాలను తారుమారు చేయగలదు. ఈ విషయంలో అంతర్జాతీయంగా వోక్స్వ్యాగన్ కొన్నేళ్ల క్రితం ఆరోపణలను కూడా ఎదుర్కొన్నది. ఈ కేసులో స్కోడా వోక్స్వ్యాగన్ రూ.671.34 కోట్ల పరిహారం చెల్లించాలంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ గతంలో ఆదేశాలు జారీ చేసింది. -
బుల్లి పరికరం.. గొప్ప ప్రయోజనం
గుండెజబ్బులతోపాటు కేన్సర్లను కూడా చిటికెలో గుర్తించేందుకు యూనివర్శిటీ ఆఫ్ గ్లాస్గౌ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమై పరికరాన్ని అభివద్ధి చేశారు. మల్టీకార్డర్ అని పిలుస్తున్న ఈ పరికరం అరచేతిలో ఇమిడిపోయేంత చిన్నది కూడా. మన కెమరాల్లో ఉండే సీమాస్ సెన్సర్ లాంటిది ఒకటి దీంట్లో ఉంటుంది. నాలుగు భాగాలుగా విభజించిన ఈ సెన్సర్ నాలుగు ప్రత్యేక రసాయనాలను గుర్తించగలదు. మూత్రం, రక్తనమూనాల్లో ఈ నాలుగు రసాయనాల మోతాదును బట్టి వ్యాధి ఉందో లేదో.. ఉంటే ఎలా విస్తరిస్తోంది? లేదా ఎంతమేరకు నయమైంది? అన్నది తెలుసుకోవచ్చు. మైక్రోయూఎస్బీ సాయంతో దీన్ని స్మార్ట్‌ఫోన్‌కు తగిలించుకుని పనిచేయించవచ్చునని, అతి చౌకగా వ్యాధి నిర్ధారణ చేసేందుకు అవకాశం ఉండటం దీని ప్రత్యేకత అని అంటారు ఈ పరికరాన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తల్లో ఒకరైన సమాధాన్ పాటిల్. ప్రస్తుతం దీన్ని గుండెజబ్బులతోపాటు ప్రొస్టేట్ కేన్సర్ నిర్ధారణకు ఉపయోగించవచ్చునని చెప్పారు. ప్రపంచంలో ఏమూలన ఉన్న వారి వివరాలనైనా డాక్టర్లు ఈ పరికరం ద్వారా తెలుసుకోవచ్చునని వివరించారు. స్మార్ట్ఫోన్ల ద్వారా ఆరోగ్య సమస్యలను తెలుసుకునేందుకు ఇప్పటికే బోలెడన్ని అప్లికేషన్లు, గాడ్జెట్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. మరిన్ని వినూత్నమైన పరికరాల తయారీ కోసం మైక్రోప్రాసెసర్ తయారీ సంస్థ క్వాల్కామ్ భారీ నగదు బహుమతితో ఓ పోటీ కూడా నిర్వహిస్తోంది. -
మార్కెట్లోకి మరో రెండు ఫిట్నెస్ బ్యాండులు
న్యూఢిల్లీ: చైనీస్ ఎలక్ట్రానిక్ దిగ్గజం లెనోవా భారత మార్కెట్లోకి హెచ్ఎక్స్03ఎఫ్ స్పెక్ట్రా, హెచ్ఎక్స్03 కార్డియో పేరుతో మరో రెండు ఫిట్నెస్ బ్యాండులను విడుదల చేసింది. వీటిలో హెచ్ఎక్స్03ఎఫ్ స్పెక్ట్రా రూ.2,299 ధరకు లభిస్తుండగా , హెచ్ఎక్స్03 కార్డియో ధర 1,999గా నిర్ణయించారు. హెచ్ఎక్స్03 కార్డియో ప్రస్తుతం అందుబాటులో ఉండగా..హెచ్ఎక్స్03ఎఫ్ స్పెక్ట్రా మే 3 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫిట్నెస్ బ్యాండుల్లో ఓఎల్ఈడీ, టీఎఫ్టీ డిస్ప్లే ఉందని కంపెనీ పేర్కొంది. డైనమిక్ హార్ట్‌రేట్ మానిటర్, మూవ్మెంట్ మానిటరింగ్, స్లీప్ మానిటరింగ్ తదితర ఫీచర్లు ఈ బ్యాండుల్లో ఉన్నాయని కంపెనీ తెలిపింది. ప్రతి 15 నిమిషాల కొకసారి ఆటోమేటిక్‌గా వినియోగదారుడి హార్ట్ రేట్‌ను మానిటర్ చేస్తుందని వివరించింది. ఒక్కసారి స్మార్ట్‌ఫోన్‌కు సింక్ అయితే వీటికి సంబంధించిన ఫోన్ కాల్స్, ఈమెయిల్స్, టెక్ట్స్ మెసేజెస్, నోటిఫికేషన్ అప్డేట్స్ ఆటోమాటిక్‌గా అందుతాయని కంపెనీ తెలిపింది. 2018లో ఫిట్నెస్ బ్యాండుల విపణిలో 20 శాతం వాటా దక్కించుకునేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు లెనోవా ఎంబీజీ ఎకోసిస్టం హెడ్ సెబాస్టియన్ పెంగ్ తెలిపారు. -
గొరిల్లా గ్లాస్-5 వచ్చేసింది!
న్యూయార్క్ః మార్కెట్లో లభ్యమవుతున్న వివిధ మోడళ్ళ స్మార్ట్ ఫోన్ లు అధునాతన గొరిల్లా గ్లాస్ స్క్రీన్ లను కలిగి ఉంటున్నాయి. ఇలా గొరిల్లా గ్లాస్ ఉన్న ఫోన్లు ఎత్తునుంచీ కింద పడినా స్ర్నీన్ దెబ్బతినదన్న విషయం చాలామందికి ఇప్పటికే తెలిసిన విషయం. ఈ గ్లాస్ గీతలు పడకుండా కూడా నిరోధిస్తుంది. అయితే ఇప్పుడు గొరిల్లా గ్లాస్ 5 మరింత మన్నికతో, ధృఢంగా మార్కెట్లోకి ప్రవేశించింది. గ్లాస్ మేకర్ కార్నింగ్.. కొత్త గొరిల్లా గ్లాస్ 5 ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు, ఎలక్ట్రానిక్స్ తయారీదారులు తమ పరికరాల్లో ఉపయోగించే ఈ సూపర్ గ్లాస్ ను ఇప్పుడు రసాయనికంగా మరింత ధృఢంగా, బలంగా ఉండేట్టు రూపొందించారు. ఈ కొత్త గ్లాస్.. 1.6 మీటర్ల ఎత్తునుంచీ కిందపడినా 80 శాతం వరకూ పగిలే అవకాశమే ఉండదని ఉత్పత్తిదారులు చెప్తున్నారు. ముఖ్యంగా గాడ్జెట్ల పనితీరును మెరుగు పరిచేందుకు వీలుగా ఈ కొత్త గొరిల్లా గ్లాస్ 5 ను రూపొందించారు. భుజం లేదా నడుము ఎత్తునుంచీ గట్టిగా ఉండే ఉపరితలంపై పడినా స్మార్ట్ ఫోన్లు, గాడ్జెట్లకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా, గ్లాస్ పగలకుండా ఉండేట్టు తయారు చేసినట్లు పేర్కొన్నారు. 2014 లో కార్నింగ్... గొరిల్లా గ్లాస్ 4 ను ప్రవేశ పెట్టింది. అప్పట్లో ఆ గ్లాస్ ను 1 మీటర్ ఎత్తునుంచి పడినా పగలకుండా, దెబ్బతినకుండా ఉండేట్లు రూపొందించింది. ఇప్పుడు ఈ కొత్త గొరిల్లా గ్లాస్ 5 ను మునుపటికంటే రెండు రెట్లు దృఢంగా రూపొందించినట్లు కార్నింగ్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ జాన్ బేన్ తెలిపారు. గొరిల్లా గ్లాస్ ను మొట్టమొదట 2007 లో ఎలెక్ట్రానిక్ పరికరాల్లో వినియోగించడం ప్రారంభించారు. అప్పట్నుంచీ మరింత మన్నిక పెరిగేలా, గీతల్ని నిరోధించేలా, మరింత పలుచగా తయారు చేసేందుకు కార్నింగ్ సంస్థ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పటివరకూ సుమారు 4.5 బిలియన్ల పరికరాల యూనిట్లకు గొరిల్లా గ్లాస్ రవాణా జరిగినట్లు కంపెనీ చెప్తోంది. శాంసంగ్, హెచ్‌టీసీ, హెవావే, ఎల్జీ, హెచ్‌పీ, ఆసుస్ వంటి పేరు పొందిన తయారీదారులతోపాటు.. మరెందరో పేరులేని పరికరాల ఉత్పత్తిదారులు కూడా కార్నింగ్ గ్లాస్ ను ఉపయోగించి పరికరాలు చేస్తున్నట్లు జాన్ తెలిపారు. -
'యాపిల్' రీసైక్లింగ్ లో టన్ను బంగారం!
కంచి పట్టు చీరలు పాతవైనా వాటికో విలువ ఉంటుంది. ఎందుకంటే వాటి నేతకు వినియోగించే బంగారం, వెండి, కాపర్ వంటి వస్తువులు తిరిగి పనికొస్తాయి. అలాగే యాపిల్ ఐ ఫోన్లు బ్రాండ్ ఇమేజ్ మాత్రమే కాదు.. పాతపడిపోయినా అందులో వినియోగించే వస్తువులవల్ల కూడ దానికో విలువ ఉంటుందన్నమాట. ఇటీవల యాపిల్ కంపెనీ పాత ఫోన్లు రీసైకిల్ చేసి ఏకంగా ఓ టన్ను బంగారాన్ని సేకరించిందట. అంతేకాదు దాంతోపాటు ఫోన్లో వినియోగించే అల్యూమినియం, రాగి, స్టీల్ వంటి పదార్థాలను కూడ మిలియన్ల కొద్దీ టన్నులు సంపాదించిందట. యాపిల్ డివైజ్ లను రీ సైకిల్ చేయడం ద్వారా ఒక సంవత్సరంలో కంపెనీ ఓ టన్నుకు పైగా బంగారాన్ని సేకరించిందట. దాంతోపాటు 10.4 మిలియన్ కిలోల స్టీల్, రెండు మిలియన్ కిలోల అల్యూమినియం, 1.4 మిలియన్ కిలోల రాగిని కూడ సేకరించింది. ఒక్క బ్రాండ్ నేమ్ కే కాదు... ఫోన్ లో వినియోగించే వస్తువులు కూడ విలువైనవి కావడంతోనే యాపిల్ ఫోన్ కు అంత క్రేజ్ ఉందన్నమాట. పూర్తిగా పారేసే బదులు అవసరం లేని, పనికిరాని వస్తువులు పాత సామాన్ల వాళ్ళకి అమ్మేస్తుంటాం. అలానే యాపిల్ కంపెనీకూడ పనికిరాని ఐఫోన్లు, ఐ ప్యాడ్లు, మ్యాక్ కంప్యూటర్ల నుంచి 2015 సంవత్సరంలో సుమారు 28 మిలియన్ల యూరోలు ఖరీదైన మెటల్ ను సేకరించి సొమ్ము చేసుకుందట. మంచి బ్రాండ్ ఎలక్ట్రానిక్ వస్తువులు త్వరగా పాడవకుండా ఉండేందుకు వాటిలో కొద్దిపాటి బంగారాన్ని కూడ వినియోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో యాపిల్ కంపెనీ రీ సైక్లింగ్ కార్యక్రమంలో భాగంగా పనికిరాని, పాత యాపిల్ వస్తువులను వినియోగదారులకు డబ్బు చెల్లించి కొనుగోలు చేసి కర్మాగారంలో శుద్ధి చేస్తుంది. ఇందులో లక్షల ఖరీదైన ఉక్కు, అల్యూమినియం, రాగిని సేకరించింది. తమ కంపెనీ ఎలక్ట్రానిక్ వస్తువులు తయారీలో నాణ్యతకోసం ఖరీదైన, విలువైన వస్తువులను వాడతామని యాపిల్ కంపెనీ సంవత్సరాంతపు రీసైక్లింగ్ నివేదికలో వెల్లడించింది. అంతేకాక ఇలా రీ సైకిల్ చేయడంవల్ల ఆయా పరికరాల్లోని పునరుత్పాదక శక్తి వినియోగంతోపాటు.. ప్రకృతికి, మనుషులకు ఎటువంటి నష్టం కలగకుండా ఉంటుందని తెలిపింది. తమ కంపెనీ వస్తువులద్వారా చైనా సరఫరాదారులతో పాటు ప్రపంచవ్యాప్తంగా అందరికీ పరిశుభ్రతను పాటించే అవకాశం ఉంటుందని యాపిల్ తన నివేదికలో తెలిపింది.