Doctors Day
-
Doctors Day: వైద్యో నారాయణో హరిః
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి.. లైన్లో ఉండాలి.. మన టోకెన్ నంబర్ వచ్చే దాకా ఎదురుచూడాలి.. ఆ తర్వాత గానీ డాక్టర్ దగ్గరకు వెళ్లలేం.. వెళ్లినా మనకు వచి్చన సమస్య గురించి కొన్నిసార్లు పూర్తిగా డాక్టర్‌తో చెప్పుకోలేం. కొన్నిసార్లు చిన్నచిన్న సమస్యలే కదా అని ఊరుకుంటాం. వాటి గురించి డాక్టర్ దగ్గరికి వెళ్లాలా అని సంకోచం కూడా ఉంటుంది. మరికొందరికి కొన్ని అపోహలు ఉంటాయి. వాటి గురించి సరైన అవగాహన ఉండదు. ఎవరిని అడగాలో తెలియదు. ఇలాంటి వారికోసమే కొందరు డాక్టర్లు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని వేలాది మందికి సేవలు అందిస్తున్నారు. అలాంటి వారి సేవలు సమాజానికి ఎంతో అవసరం. సోమవారం ప్రపంచ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమాల ద్వారా సేవలు అందిస్తున్న పలువురు స్ఫూర్తిదాయక వైద్యులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సంతానంపై అవగాహన కలి్పంచేందుకు.. సంతాన లేమితో చాలా మంది దంపతులు బాధపడుతున్నారు. సరైన చికిత్స అందకపోవడం.. సంతానం కలగకపోవడంతో మానసికంగా ఎంతో కుమిలిపోతుంటారు. వాళ్లు చెప్పారని, వీళ్లు చెప్పారని ఆస్పత్రులన్నీ తిరుగుతుంటారు. కానీ అసలు సమస్య తెలియదు. కొందరిలో సమస్య ఒకటైతే.. మరొక దానికి ట్రీట్మెంట్ ఇస్తుంటారు. అలాంటి వారి అనుమానాలను, సందేహాలను తీర్చేందుకు ప్రముఖ ఫరి్టలిటీ నిపుణురాలు శిలి్పకారెడ్డి ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్‌ను వేదికగా చేసుకున్నారు. తన వద్దకు ఎంతో మంది పేషెంట్లు వస్తుంటారని, వారికి సలహాలు చెబుతుంటానని, తన వద్దకు రాలేని వారికి కూడా అపోహలను పోగొట్టాలనేదే ప్రధాన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. – డాక్టర్ శిల్పికారెడ్డి, ఫరి్టలిటీ నిపుణురాలుఅపోహలు పోగొట్టేందుకే.. ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా ప్రభావం ఎంతో ఉంది. అయితే.. సమాచారం కూడా ఎక్కువగా ఉంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా ఉంది. కొన్ని సమస్యలకు గూగుల్‌లో వెతుకుతున్నారు. వారికి సరైన సమాచారం ఇవ్వడం తమ బాధ్యత అంటున్నారు ప్రముఖ యూరాలజిస్టు డాక్టర్ దీపక్. యూరాలజీకి సంబంధించి ప్రజల్లో ఎన్నో అపోహలు ఉన్నాయని, ఆఖరికి రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలనే విషయంలో కూడా అనుమానాలు ఉన్నాయని చెబుతున్నారు. అందుకే ఒక నిపుణుడిగా చెబితే ప్రజలకు కూడా నమ్మకం కలుగతుందని పేర్కొంటున్నారు. ఎవరెవరో ఆరోగ్యం గురించి చెబుతున్నప్పుడు తన లాంటి నిపుణులు ఎందుకు సమాజానికి ఎందుకు చెప్పకూడదనే ఉద్దేశంతో సామాజిక మాధ్యమాల్లోకి వచ్చానని చెబుతున్నారు.ఎలాంటి అనుమానాలొద్దు.. దేశవ్యాప్తంగా ప్రజలకు దంతాల గురించి సరైన అవగాహన లేదు. దీనిపై అనుమానాలను తగ్గించేందుకు సోషల్ మీడియాను ఎంచుకున్నానని చెబుతున్నారు ప్రముఖ దంత వైద్యురాలు మానస. రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవాలని, ఆరు నెలలకు ఒకసారి డెంటిస్టును కలిస్తే సమస్యలు ఉండవనే విషయంపై అవగాహన చాలా మందిలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న పిల్లల్లో కూడా దంత సమస్యల గురించి ఎప్పటికప్పుడు చెక్ చేయిస్తూ ఉండాలని, దీని వల్ల వారు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని చెబుతున్నారు. ఇక, పన్ను తొలగిస్తే అనేక సమస్యలు వస్తాయన్న అపోహలు ఇప్పటికీ పల్లెటూర్లలో ఉన్నాయని, వారి కోసం తాను సామాజిక మాధ్యమాన్ని ఎంచుకున్నానని చెబుతున్నారు డాక్టర్ మానస.– డాక్టర్ మానస, డెంటిస్టువైద్య వృత్తిలో భాగంగానే.. మనం చెబుతున్న మాటలే భవిష్యత్తులో సంస్కృతిగా మారుతాయన్న ప్లేటో చెప్పిన మాటలే ఆయనకు స్ఫూర్తి. వైద్య రంగం గురించి సమాజంలో చాలా విస్తృతంగా చర్చ జరగాలనేదే ఆయన ఆశయం. అప్పుడే వైద్య రంగం, చికిత్సలు సమాజంలో భాగం అవుతాయనేది ఆయన నమ్మకం. ప్రజలకు ఉన్న అనుమానాలను ఫేస్ బుక్ ద్వారా ఆయన వైద్య రంగానికి సంబంధించిన అపోహలను నివృత్తి చేయాలని కరోనా సమయంలో నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వయంగా రచయిత కూడా అయిన డాక్టర్ విరించి ఎన్నో రచనలను పోస్టు చేస్తూ అవగాహన కలి్పస్తూ వస్తున్నారు. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలనేదే తన ప్రధాన ఉద్దేశమని చెబుతున్నారు. ఆయన స్ఫూర్తిదాయకమైన మాటలు, రచనలకు ఎంతో మందికి మేలుకొలుపు అయింది.– డాక్టర్ విరించి విరివింటి, క్లినికల్ కార్డియాలజిస్టు -
కనిపించే దైవం.. డాక్టర్లు
గుంటూరు మెడికల్/చిలకలూరిపేట: కనిపించే దైవం వైద్యులేనని.. వారు ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో శనివారం ‘డాక్టర్స్ డే’ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీలో వైద్య రంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన నాయకుడు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని చెప్పారు. ‘డాక్టర్స్ డే’లో బీసీ రాయ్‌తో పాటు డాక్టర్ వైఎస్సార్‌ను కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్యశ్రీతో పాటు 108 అంబులెన్సులు, 104 వాహనాలు తదితర గొప్ప కార్యక్రమాలను ప్రవేశపెట్టి.. ఎంతో మంది ప్రాణాలను కాపాడారని కొనియాడారు. ఆ తర్వాత వైద్య, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేసేందుకు ‘నాడు–నేడు’ కింద ఏకంగా రూ.16 వేల కోట్లకు పైగా నిధులను వైఎస్ జగన్ ప్రభుత్వం ఖర్చు చేస్తోందని చెప్పారు. గ్రామస్థాయి నుంచి బోధనాస్పత్రుల వరకు అన్నింటినీ అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ ఎంతో మేలు చేస్తున్నారని వివరించారు. ప్రభుత్వ వైద్యుడు రోగి ఇంటికే వెళ్లి సేవలందించడం గొప్ప విషయమన్నారు. వైద్య, ఆరోగ్య రంగంలో వేలాది ఖాళీలను భర్తీ చేస్తూ.. వైద్యులపై భారాన్ని తగ్గిస్తున్నామన్నారు. ఇదే గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో టీడీపీ పాలనలో సెల్‌ఫోన్ వెలుగులో ఆపరేషన్లు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. అంతకుముందు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే నాట్కో ఫౌండేషన్ వైస్ చైర్మన్ నన్నపనేని సదాశివరావు, డాక్టర్లు పొదిల ప్రసాద్, గంగా లక్ష్మి, బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, సుధాకర్, రాజేంద్రప్రసాద్, తారకనాథ్, మద్దినేని గోపాలకృష్ణయ్య, మురళీ బాబూరావు, ఫణిభూషణ్, రాజేంద్రప్రసాద్, సుబ్రహ్మణ్యం, కేఎస్ఎన్ చారి తదితరులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చేందుకు.. ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందించేందుకు, సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించేందుకు, ఎలాంటి ఫీజు లేకుండా ధ్రువీకరణ పత్రాలు అందజేసేందుకు ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి రజిని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. సంక్షేమ పథకాలకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలన్న ఆశయంతో సీఎం జగన్ ఈ కార్యక్రమానికి నాంది పలికారని తెలిపారు. దేశంలోనే ఇలాంటి గొప్ప కార్యక్రమం ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. మీడియా కూడా సహకరించి ప్రజలకు మేలు కలిగేలా ప్రచారం కల్పించాలని కోరారు. -
అపురూపం.. ప్రథమ వైద్యులు
భారతదేశ తొలి వైద్యురాలిగా ఆనందీ బాయి జోషీ పాపులర్ ఫొటో ఒకటి ఉంది. ఇప్పుడు మరొక అరుదైన ఫొటోలో ఆమె ప్రత్యక్షం అయ్యారు. ఇద్దరు మహిళా డాక్టర్లతో కలిసి ఆనందీబాయి దిగిన ఏళ్ల నాటి ఫొటో అది. అందులో కనిపించే ఒక డాక్టర్ జపాన్ తొలి మహిళా వైద్యురాలు! ఇంకో డాక్టర్ సిరియా తొలి మహిళా వైద్యురాలు! మరొక విశేషం.. ఆ ఫొటోలోని మూడు దేశాల తొలి మహిళా వైద్యులూ మెడిసిన్ చదివింది ఒకే కాలేజీలో! ఇక ఆ కాలేజీని స్థాపించింది ఎవరనుకున్నారు?! అమెరికా తొలి మహిళా వైద్యురాలు! డాక్టర్స్ డే సందర్భంగా జూలై 1 న డాక్టర్ ఆనందీబాయి ఫొటో ఒకటి ఇంటర్నెట్లో మళ్లీ వైరల్ అయింది. ఆ ఫొటో 135 ఏళ్ల నాటిది. డాక్టర్ ఆనందీబాయి భారతదేశ తొలి వైద్యురాలు. ఆమె ఒక్కరే ఉండే ఆ కాలం నాటి ఫొటో మనం ఎప్పుడూ చూస్తూ ఉన్నదే. అందులో ఆమె మహారాష్ట్ర సంప్రదాయ వస్త్ర ధారణలో పొడవు చేతుల జాకెట్టు, భుజం చుట్టూ కప్పుకుని ఉన్న చీరతో, చేతిలో చెయ్యి వేసుకుని నిలబడి ఓ పక్కకు చూస్తూ ఉంటారు. ఇరవై ఏళ్ల వయసులో 1886లో ఆమె మెడిసిన్ పూర్తి చేశారు. అప్పటికే ఉన్న టీబీ కారణంగా ఆ తర్వాతి ఏడాదే ఆనందీబాయి మరణించారు. భారతదేశ తొలి వైద్యురాలే అయినప్పటికీ, వైద్య సేవలకు అందించేందుకు ఆ అనారోగ్యం ఆమెకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు! ఇంకో ఫొటోలో (ఇప్పుడు వైరల్ అవుతున్నది) డాక్టర్ ఆనంది, ఆమెతో పాటు మెడిసిన్ పూర్తి చేసిన మరో ఇద్దరు మహిళా వైద్యులు ఉంటారు. గ్రాడ్యుయేషన్ ఫొటో అది. కోర్సు పూర్తి చేయడానికి ముందరి ఏడాది 1885లో అక్టోబర్ 10 న తీయించుకున్నది. అరుదైన ఆ ఫొటోలోని విశేషం.. అందులోని ముగ్గురూ మూడు దేశాల తొలి మహిళా వైద్యుల కావడం! ఎడమ వైపున ఉన్నవారు డాక్టర్ ఆనంది, మధ్యలో ఉన్నవారు జపాన్ తొలి వైద్యురాలు కై ఒకామీ, కుడివైపు ఉన్నవారు సిరియా తొలి వైద్యురాలు టబత్. ∙∙ ఈ బ్లాక్ అండ్ వైట్ ఫొటోకు అనుబంధంగా మరికొన్ని విశేషాలు కూడా ఉన్నాయి. డాక్టర్ ఆనంది, డాక్టర్ ఒకామీ, డాక్టర్ టబత్.. ముగ్గురూ ప్రఖ్యాత డబ్లు్య.ఎం.సి.పి. (ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఆఫ్ పెన్సిల్వేనియా) వైద్య విద్యార్థినులు. ప్రపంచంలోని తొలి మహిళా వైద్య కళాశాలలో ఒకటైన డబ్లు్య.ఎం.సి.పి. యూఎస్‌లోని పెన్సిల్వేనియాలో ఉంది. 173 ఏళ్ల నాటి ఆ కాలేజ్ పేరు ఇప్పుడు ‘డ్రెక్సెల్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్’. 1886 బ్యాచ్‌లో ఈ ముగ్గురే వైద్య విద్యార్థినులు. అందుకే ఇది ఇంత అపురూప చిత్రం అయింది. ఈ కాలేజ్‌ని స్థాపించింది కూడా ఒక వైద్యురాలే! ఆమె పేరు ఎలిజబెత్ బ్లాక్వెల్. ఈ ముగ్గురిలానే ఎలిజబెత్ కూడా తన దేశానికి (అమెరికా) తొలి వైద్యురాలు కావడం ఆసక్తి కలిగించే సంగతి. -
పుణేలో వైద్య దంపతుల ఆత్మహత్య
సాక్షి ముంబై: పుణేలో వైద్య దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్వల్ప వివాదమే ఈ ఆత్మహత్యలకు కారణమని తెలిసింది. ఈ సంఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. నిఖిల్ శేండ్కర్ (27), ఆయన భార్య అంకిత శేండ్కర్ (26) దంపతులు పుణేలో వానవడీలోని ఆజాద్‌నగర్‌లో నివసించేవారు. కాగా, నిఖిల్ ఇంటికి తిరిగి వచ్చే సమయంలో భార్యతో ఫోన్లో వివాదం కొనసాగిందని తెలిసింది. దీంతో బుధవారం రాత్రి అంకిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విధులు ముగించుకుని రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన నిఖిల్ తన భార్య ఉరివేసుకుని మృతిచెందడం చూసి తట్టుకోలేకపోయాడు. దీంతో అతను కూడా అదే ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
వైద్యులకు సెల్యూట్: ప్రధాని మోదీ
సాక్షి, ఢిల్లీ: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వారి సేవలను గుర్తుచేసుకుంటూ.. కరోనా కాలంలో సేవలందించిన వైద్యులకు ప్రధాని నరేంద్రమోదీ సెల్యూట్ చేశారు. గురువారం.. ప్రధాని ప్రసంగిస్తూ కరోనాతో చాలా మంది డాక్టర్లు చనిపోయారని.. వైద్యుల భద్రతకు కఠిన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కరోనాపై పోరులో డాక్టర్లు ముందున్నారన్నారు. వైద్య రంగానికి రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నామని మోదీ అన్నారు. వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రధాని ట్వీట్ చేశారు. వైద్య రంగంలో భారత్ పురోగమించడం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. -
నేషనల్ డాక్టర్స్ డే: థ్యాంక్యూ డాక్టర్ గారూ..
మీరు గుండె మీద స్టెత్ పెట్టినప్పుడుమందు చీటి రాసినప్పుడుసూదిమందు వేసినప్పుడుఎక్స్రేను చేయెత్తి చూసినప్పుడుఆపరేషన్ బల్ల మీద‘మరేం పర్వాలేదు’ అన్నప్పుడు డిశ్చార్జ్ అవుతుండగా‘జాగ్రత్తగా ఉండు’ అని హితవుచెప్పినప్పుడు పెద్దలు‘వైద్యో నారాయణో హరి’ అని ఎందుకన్నారో అర్థమవుతుంది.దేవుడు కరుణ మాత్రమే చూపుతాడు. వైద్యం మాత్రం మీరే చేసి ప్రాణం పోయాలి.ఈ కరోనా కాలంలో మనుషుల కోసంప్రాణాలు అర్పించిన డాక్టర్లను తలచుకుంటూ ప్రాణం పోస్తున్న డాక్టర్లకు కృతజ్ఞతలు చెబుతూ థ్యాంక్యూ డాక్టర్. ఇవాళ మనందరం తిరుగుతున్నామన్నా, ప్రాణాలతో ఉన్నామన్నా, ఈ క్షణాన ఈ పేపర్ చదువుతున్నామన్నా మనకు ఎవరో ఒక డాక్టర్ జన్మించడానికి సహాయం చేయడం వల్లే. బాల్యంలో, ఎదిగే వయసులో జ్వరాలు వచ్చినా, వాంతులు వచ్చినా, విరేచనాలు అయినా, ఆడుకుంటూ కింద పడ్డా, బండి మీద నుంచి పడి కాలు విరగ్గొట్టుకున్నా, కంటి నొప్పి వచ్చినా, పంటి నొప్పి వచ్చినా, ఒంటి మీద ఏదో మచ్చ వచ్చినా... డాక్టరు మనకు మందు చీటి రాసి ఆ సమస్యను దూరం చేయడం వల్లే. మనలో కొందరు నాస్తికులుగా ఉండవచ్చు. జీవితంలో ఒక్కసారి కూడా గుడీ, మసీదు, చర్చ్‌లకు వెళ్లకపోయి వుండవచ్చు. కాని ఆ నాస్తికులు కూడా ఏదో సందర్భంలో హాస్పిటల్ మెట్లు ఎక్కకుండా జీవితాన్ని దాటలేరు. వైద్యుడు లేని చోటు ను చప్పున వదిలిపెట్టాలని శతకకారుడు చెప్పాడు. మనిషి నివసించాలంటే వైద్యుడు ఉండాలి. మంచి వైద్య సదుపాయం అందుబాటులో ఉన్న ఊరే అభివృద్ధి చెందే ఊరు. ప్రజలు వచ్చి స్థిరపడే ఊరు. ఫ్యామిలీ డాక్టర్ ఈ సమాజం సమాజంగా రూపుదిద్దుకోవడం మొదలెట్టాక ప్రతి కుటుంబం ఆ ఊరిలోని దేశీయ వైద్యుడికి పరిచయంగా ఉండేది. ఇంగ్లిష్ వైద్యం మొదలయ్యి ఆధునికంగా మారే కొద్దీ వైద్యుల సంఖ్య పెరిగి కుటుంబానికి ఒక ఫ్యామిలీ డాక్టర్ ఏర్పడటం మొదలయ్యింది. ఫ్యామిలీ డాక్టర్ అంటే మరెవరో కాదు... మనకు గురి కుదిరిన, అందుబాటులో ఉండే, కష్టం సుఖం ఎరిగి మాట్లాడి పంపే వైద్యుడు. తరాలు గా ఈ ఫ్యామిలీ డాక్టర్ల మీద నమ్మకంతోనే ఎందరో తమ ఆరోగ్యం గురించి చింత లేకుండా జీవించారు. వీరు మరే డాక్టర్ దగ్గరికీ వెళ్లరు ఎంత గొప్ప డాక్టరు ఉన్నాడని చెప్పినా. ఫ్యామిలీ డాక్టర్ చేతి మాత్ర వేసుకుంటే టక్కున లేచి కూచుంటారు. హస్తవాసి ఊళ్లో ఎందరు డాక్టర్లు ఉన్నా కొందరి ‘హస్తవాసి’ మంచిదని జనంలో పేరొస్తుంది. ఆ పేరు ఒకరో ఇద్దరో ఇవ్వరు. ఊరంతా కట్టకట్టుకుని ఇస్తుంది. ఆ ‘హస్తవాసి’ బాగున్న డాక్టర్ దగ్గరికే క్యూ కడతారు. బహుశా ఆ డాక్టర్ మాటతీరు, జబ్బును అంచనా కట్టే పద్ధతి, వైద్యం చేసే విధానం హస్తవాసిని తీసుకు వస్తుందేమో. ‘అందరి చుట్టూ తిరిగి మీ హస్తవాసి మంచిదని వచ్చాం డాక్టర్’ అని ఈ డాక్టర్లను సంప్రదించడం ఆనవాయితీ. వైద్యులు పలు రకాలు మనుషుల్లో రకాలు ఉన్నట్టే వైద్యుల్లో రకాలు ఉంటారు. ముక్కోపి డాక్టర్లు, దూర్వాస డాక్టర్లు, సరదా డాక్టర్లు, అస్సలు మాట్లాడని డాక్టర్లు, చాలా మాట్లాడే డాక్టర్లు, మందు చీటిని పై నుంచి కింద దాకా నింపే డాక్టర్లు, ఒకటో అరా మాత్రలు మాత్రమే రాసే డాక్టర్లు, ఖరీదైన మందులు రాసే డాక్టర్లు, రూపాయి రెండు రూపాయల మందులు మాత్రమే రాసే డాక్టర్లు, మతి మరుపు డాక్టర్లు, అతి తెలివి డాక్టర్లు... ఎన్నో రకాలుగా ఉంటారు. వారు ఎన్ని రకాలుగా ఉన్నా సామాన్యులు వారి ప్రతిభను, నైపుణ్యాన్ని, అనుభవాన్ని గమనించి రోగిని డాక్టర్లు భరించినట్టు భరిస్తుంటారు. ఊళ్లల్లో కొన్ని రకాల స్పెషలిస్టులు ఉంటారు. అంటే వీరు పి.జి చేసినవారని కాదు అర్థం. ఉదాహరణకు పురుగుల మందు తాగినవాళ్లను బతికించే స్పెషలిస్ట్ ఉంటాడు ఊళ్లో. ఎవరు పురుగు మందు తాగినా అతని దగ్గరికే తీసుకెళతారు. గుండెపోటు వస్తే కాపాడే డాక్టర్ వేరే. ఎవరు గుండె పట్టుకున్నా ఈ డాక్టరు పరిగెత్తాల్సిందే. మహమ్మారి–త్యాగం హాస్పిటల్లో విధి వశాత్తు ప్రాణాలు పోయిన రోగులు ఉంటారు. వైద్యం చేస్తూ డాక్టర్లు మరణించరు. కాని మహమ్మారి కాలంలో రోగులూ వారికి వైద్యం చేసే డాక్టర్లూ మరణించే విషాద సన్నివేశం చూశాం. మహమ్మారి కాలంలో ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసినా వేలాది డాక్టర్లు రోగుల ప్రాణాలు కాపాడటానికి ప్రాణాలను పణంగా పెట్టారు. దేశ వ్యాప్తంగా వందల్లో డాక్టర్లు గత రెండేళ్లలో కరోనా వల్ల మరణించారు. బతికిన వారంతా ఆ వైద్యులకు రుణగ్రస్తులే. మారుతున్న బంధం పూర్వం సొరకాయలు, పొట్లకాయలు ఫీజుగా ఇచ్చే అమాయక గ్రామీణులు ఉండేవారు. రోగుల ఇళ్ల శుభకార్యాలకు హాజరయ్యే డాక్టర్లు ఉండేవారు. ఇవాళ ఈ బంధం కొంచెం పలుచబడింది. ఆర్థికపరమైన అంశమే రోగికి డాక్టరుకు మధ్య ప్రధానంగా మారిందనే అపవాదు వినవస్తూ ఉంది. కార్పొరెట్ వైద్యం పట్ల ఎంత నమ్మకం ఉందో అంతే అభ్యంతరం కూడా ఉంది. వైద్యం అంత ఖరీదు కావడం పట్ల, డాక్టరు అందరానివాడు కావడం పట్ల ఎవరికైనా అభ్యంతరం ఉండటం సహజమే. మానవీయత ఏమైనా కొరవడుతోందా అనేది ఇప్పుడు సమీక్షించుకోవాల్సిన అంశం. కాని ప్రతి మంచి వైద్యుడు తన అంతరాత్మ ఎదుట రోగి పక్షానే ఉంటాడు. అలాంటి ప్రతి వైద్యునికి కృతజ్ఞత ప్రకటించాల్సిన రోజు ఇది. థ్యాంక్యూ డాక్టర్. – సాక్షి ఫ్యామిలీ -
‘రోగుల ఆశీర్వాదాలే మాకు యాంటీబాడీస్’
ఏడాదిన్నరగా కరోనాతో అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. మహమ్మారి బారిన పడిన ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతున్నారు. నిరుపమాన సేవ తో.. ‘వైద్యులు కన్పించే దేవుళ్లు’ అనే నానుడిని నూటికి నూరుపాళ్లూ నిజం చేస్తున్నారు. తమ ప్రాణాలనూ పణంగా పెడుతున్నారు. ఈ క్రమంలో వైరస్ బారిన పడిన కొందరు అసువులు బాశారు. మరి కొందరు కుటుంబసభ్యుల్ని కోల్పోయారు. గురువారం ‘డాక్టర్స్ డే’ సందర్భంగా.. ఆస్పత్రుల్లో రోగుల మధ్య పోరాడుతున్న వైద్యులకు సారథ్యం వహిస్తూ, ఎప్పటికప్పుడు తగిన సలహాలు, సూచనలు చేస్తూ, రోగులకు సరైన చికిత్స, సౌకర్యాలు అందేలా నిర్విరామ కృషి చేస్తున్న ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లను ‘సాక్షి’ పలకరించింది. కరోనాతో రోగులు కళ్లెదుటే కన్ను మూస్తుంటే విలవిల్లాడిపోయామని, కోలుకున్న రోగులు, వారి కుటుంబసభ్యులు ఇచ్చిన ఆశీర్వాదాలే తమకు కొండంత బలాన్నిచ్చాయని అంటున్న సూపరింటెండెంట్ల మనోగతం వారి మాటల్లోనే.. –సాక్షి, హైదరాబాద్ 50వేల మందికి చికిత్స చేశాం గాంధీ ఆస్పత్రికి ఎక్కువగా ప్రాణాపాయస్థితి లో ఉన్నవారే వస్తుంటారు. వీరిని కాపాడేందుకు అహర్నిశలు శ్రమించాల్సి వస్తోంది. ఒక వైపు పరిపాలనా వ్యవహారాలు చక్కబెడుతూనే, మరో వైపు జనరల్ మెడిసిన్ విభాగాధిపతిగా పీపీఈ కిట్ ధరించి రోజంతా రోగుల మధ్య గడపాల్సి రావడం మొదట్లో కొంత ఇబ్బందిగానే అన్పించేది. కానీ ప్రాణపాయస్థితిలో వచ్చిన రోగి కోలుకుంటే, పునర్జన్మను ప్రసాదించామనే సంతృప్తి కొండంత బలాన్నిచ్చేది. కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు వారు, వారి కుటుంబసభ్యు లు ఇచ్చిన ఆశీర్వాదాలు.. ఇమ్యూనిటీ బూస్టర్లుగా పనిచేస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. వారి ఆశీర్వాదాలే మాకు యాంటీబాడీస్ అని చెప్పుకోవ చ్చు. 15 నెలల నుంచి ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా విధులు నిర్వహిస్తున్నా. ఫస్ట్‌వేవ్‌లో 35 వేల మందికి విజయవంతంగా చికిత్స చేశాం. సెకండ్ వేవ్‌లో 15 వేల మందికి చికిత్స అందించాం. ఇప్పటివరకు 1,500 మంది కోవిడ్ గర్భిణులకు పురుడు పోశాం. – డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ ఆసుపత్రి 450 మందికి కరోనా సోకింది కోవిడ్ ఆస్పత్రుల్లోని వారు మాత్రమే కాదు, నాన్ కోవిడ్ కేంద్రాల్లో పని చేసే వైద్య సిబ్బంది కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వచ్చింది. గాంధీని పూర్తిస్థాయి కోవిడ్ సెంటర్‌గా మార్చడం తో భారమంతా ఉస్మానియా ఆస్పత్రిపైనే పడింది. వివిధ ప్రమాదాల్లో గాయపడినవారు, గుండె, కాలేయం, కిడ్నీలు, మధుమేహం, హైపర్‌టెన్షన్, ఇతర అత్యవసర బాధితులు ఎక్కువగా వచ్చేవారు. వీరిలో ఎవరికి వైరస్ ఉందో? ఎవరికి లేదో? గుర్తించడం సవాల్‌గా మారింది. ప్రమాద క్షతగాత్రులకు వెంటనే సర్జరీ చేయాల్సి వచ్చేది. అప్పటికే వీరికి వైరస్ సోకి ఉండటంతో వైద్య సిబ్బందికి వ్యాపించేది. వారి కుటుంబ సభ్యులకు సోకేది. ఇలా ఫస్ట్‌వేవ్‌లో 300 మంది, సెకండ్ వేవ్‌లో 150 మంది వైద్య సిబ్బంది వైరస్ బారిన పడ్డారు. ఈ బాధితుల్లో నేను కూడా ఒకడిని. – డాక్టర్ నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా ఆసుపత్రి చాలా ఒత్తిడికి గురయ్యాం కరోనా కారణంగా నిత్యం వందల మంది రోగులకు వైద్యం అందించాల్సి రావటంతో మాపై పని ఒత్తిడి బాగా పెరిగింది. ఇలాంటి పరిస్ధితులు మునుపెన్నడూ చూడలేదు. మొదటి వేవ్‌లో కంటే రెండో వేవ్‌లో చాలా ఒత్తిడికి గురయ్యాం. మొదటి సారి 200 పడకల్లో వైద్య సేవలు అందించగా, రెండో వేవ్‌లో 320 బెడ్లను ఏర్పాటు చేశాం. పూర్తి ఆక్సిజన్న్సౌకర్యంతో రోగులకు ఎక్కడా ఇబ్బంది కలుగని రీతిలో చర్యలు తీసుకున్నాం. తొలిదశలో 70 మంది, రెండో సారి 50 మంది వరకు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. అయినా వారు కోలుకొని తిరిగి విధుల్లో చేరి సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అంతర్జాతీయ ప్రొటోకాల్ ప్రకారమే చికిత్స అందుతోంది. – డాక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, ఖమ్మం రోగుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాం కరోనా రోగులకు వైద్యులు, నర్సులు భయపడకుండా సేవలందిస్తున్నారు. మేము ధైర్యంగా ఉండటమే కాదు.. రోగులకు కూడా ధైర్యం చెబుతూ వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాం. గత ఏడాది కాలంలో జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యుల్లో 10 మంది, సిబ్బందిలో 35 మంది కరోనా బారినపడ్డారు. అందరూ ధైర్యంగా కరోనాను ఎదుర్కొని మళ్లీ విధుల్లో చేరారు. – డాక్టర్ సంగారెడ్డి, సూపరింటెండెంట్, సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి కష్టాలు కళ్లారా చూశాం జిల్లాలో మొదట్లో తక్కువ కేసులున్నా తరువాత ఒక్కసారిగా కరోనా విజృంభించింది. ఎన్నడూ లేనివిధంగా రోగులు కష్టపడటం కళ్లారా చూశాం. ఫస్ట్‌వేవ్‌లో ప్రజలు కొంత నిర్లక్ష్యం చేసినా ప్రాణ నష్టం అంతగా జరగలేదు. కానీ సెకండ్ వేవ్‌లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటిÐ ] రకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని పనులు ఉన్నా సెలవులు తీసుకోకుండా పని చేశాను. – డాక్టర్ అజయ్‌కుమార్, జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్, కామారెడ్డి ఇంట్లో వారికి కరోనా వచ్చినా.. మా కుటుంబ సభ్యులందరికీ కరోనా వచ్చినా వారిని హోం ఐసోలేషన్‌లో పెట్టి ప్రజలకు వైద్య సేవలు అందించా. కరోనా సోకిన వారిని నిరంతరం పర్య వేక్షిస్తూ మనోధైర్యం కల్పించాం. సెకండ్ వేవ్‌లో 2,089 మంది కరోనా సోకి ఆస్పత్రిలో చేరారు. 1,666 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారు. 30 మందిని వైరస్ తీవ్రత దృష్ట్యా ఖమ్మం, హైదరాబాద్ ఆసుపత్రులకు తరలించాం. – డాక్టర్ సరళ, జిల్లాఆసుపత్రి సూపరింటెండెంట్, కొత్తగూడెం యుద్ధంలో గెలిచినæ సంతృప్తి ఆస్పత్రిలో చికిత్స పొంది వెళ్లిన వారు ఇప్పటికీ ఫోన్లు చేస్తుంటా రు. అప్పుడు ఒక సైనికుడు యుద్ధంలో గెలిచి ఎంత సంతృప్తి పొందుతాడో నాకూ అంతే సంతృప్తిగా అన్పిస్తుంది. సెకండ్ వేవ్ ఒక గుణపాఠం లాంటిది. మున్ముందు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని వైద్యసేవలు అందిస్తామనే పూర్తి నమ్మకం నాకు, మా వైద్యులకు కలిగింది. ఇక నాకు ఫస్ట్, సెకండ్ వేవ్‌లో కూడా కరోనా సోకింది. – డాక్టర్ ప్రతిమరాజ్, నిజామాబాద్ ఆస్పత్రి సూపరింటెండెంట్ కంట్రోల్‌రూం ఏర్పాటు చేశాం నేను సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన నాలుగు రోజులకే ఎంజీఎం ఆస్పత్రిని సీఎం సందర్శించారు. సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రి కరోనా విభాగంలో 800 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్న క్రమంలో ఏ రోగి ఏక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితి నెలకొనేది. ఈ సమన్వయ లోపాన్ని తొలగించేందుకు కమాండ్ కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేశాం. ఏ రోగి ఏక్కడ ఉన్నాడు? ఎన్ని రోజుల క్రితం వచ్చాడు? ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుసుకునేందుకు వీలుగా ఈ విభాగం ఏర్పాటు చేశాం. – డాక్టర్ చంద్రశేఖర్, ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్, వరంగల్ -
Doctors day: జన్మ తల్లిది.. పునర్జన్మ వైద్యుడిది..
వైద్యో నారాయణో హరిః అంటారు పెద్దలు. దానిని నిత్య సత్యం చేస్తూ కలియుగ దైవం లాగా కరోనా కష్టకాలంలో వైద్యులు చూపుతున్న తెగువ మరువలేనిది. కరోనా సోకితే అయినవారే దగ్గరకు రాని సందర్భంలో మేమున్నామంటూ ముందుకు వచ్చి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. రోగుల్లో ఆత్మస్థైర్యం నింపుతూ జీవితంపై భరోసా కల్పిస్తున్నారు.. వైరస్ సోకుతుందని తెలిసినా వృత్తి ధర్మాన్ని వీడకుండా... కోవిడ్ రోగులకు నిరంతరం వైద్యం అందిస్తూ సమాజంపై వారి బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఆశలు సన్నగిల్లిన వారిలో మళ్లీ చిరునవ్వులు తెప్పించడంలో వారి పాత్ర కీలకం.. రోగులను కరోనా నుంచి కాపాడుతూ వారి కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. మరెందరో మహమ్మారి కాటుకు బలవుతున్నారు. అయినా మొక్కవోని ధైర్యంతో ప్రజల్లో భరోసానిస్తున్న వైద్యుల జాతీయ దినోత్సవం సందర్భంగా అభిప్రాయాలు వారి మాటల్లోనే.. డాక్టర్ బీసీ రాయ్ సేవలకు గుర్తుగా... భారతీయ వైద్య రంగంలో వ్యక్తిత్వంతో పాటు అన్ని తరాలకు ఆదర్శనీయంగా నిలిచిన డాక్టర్ బీసీ రాయ్ జయంతి సందర్భంగా ఏటా జులై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, విద్యావేత్తగా.. సంఘసంస్కర్తగా.. నిరుపేదలకు అపన్ననేస్తంగా వైద్య సేవలు అందించారు. 1882 జులై ఒకటో తేదీన పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోని బన్కీఫోర్లో జన్మించిన అతడు వైద్య రంగంలో చేసిన సేవలతో ప్రపంచస్థాయి గుర్తింపు పొందారు. స్వాతంత్య్రం అనంతరం పశ్చిమబెంగాల్‌కు 12ఏళ్లపాటు సీఎంగా పనిచేశారు. వైద్య రంగంలో చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1961లో భారతరత్న ఇచ్చి గౌరవించింది. ఆయన పుట్టిన రోజును జాతీయ వైద్యుల దినోత్సవంగా ప్రకటించింది. బీసీ రాయ్ మరణించిన రోజు కూడా జులై ఒకటో తేదీనే కావడం గమనార్హం. సిబ్బందిలో మనోధైర్యం నింపుతూ నిర్మల్ చైన్‌గేట్: ఒకవైపు కరోనా మొదటి వేవ్ ఉధృతి అంతగా లేనప్పటికీ.. సెకండ్ వేవ్‌లో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. జిల్లా ఆస్పత్రిలో మెరుగైన చికిత్సలు అందజేశాం. సిబ్బందిలో మనోధైర్యాన్ని నింపుతూ రోగులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూశాం. కరోనాతో ప్రజలు చిన్నపాటి జ్వరం, దగ్గు వచ్చిన చాలా భయపడుతున్నారు. అలాంటి వారికి ధైర్యం చెబుతూ జాగ్రత్తలు సూచిస్తున్నాం. – డాక్టర్ దేవేందర్‌రెడ్డి, నిర్మల్ జిల్లా ఆస్పత్రుల పర్యవేక్షకులు ధైర్యం కల్పిస్తున్నాం... నిర్మల్ చైన్‌గేట్: మొదటి వేవ్‌లో కరోనా సోకినప్పటికీ కోలుకుని విధులు నిర్వహించాను. కరోనా సమయంలో అన్ని ఆస్పత్రుల్లో చికిత్సలు చేయకపోడంతో జిల్లా ప్రసూతి ఆస్పత్రికి తాకిడి పెరిగింది. ఒక వైపు కరోనా విజృంభన మరో వైపు సిబ్బంది కొరతను అధిగమించి వైద్య సేవలు అందజేశాం. సెకండ్ వేవ్‌లో కరోనా సోకిన 10మంది గర్భిణులకు ప్రసూతి చేశాం. ఎప్పటికప్పుడు గర్భిణులకు, బాలింతలకు కరోనాపై అవగాహన కల్పిస్తూ జాగ్రత్తలు చెబుతున్నాం. – డాక్టర్ రజని, నిర్మల్ జిల్లా ప్రసూతి ఆస్పత్రి పర్యవేక్షకురాలు హాస్టల్లో ఉండి విధులు తాంసి: కరోనా లాక్డౌన్ సమయంలో హాస్టల్లో ఉంటూ విధులు నిర్వహించాను. నాకు ఐదేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడు నెలల పాటు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనా కాలంలో తనవంతుగా కుటుంబ సభ్యులకు, పిల్లలకు దూరంగా ఉన్న బాధపడకుండా వైద్యసేవలు అందించాను. కరోనా పాజిటివ్ వచ్చిన వారి ఇంటికి వెళ్లి అధైర్యపడకుండా ఉండాలని చెప్పాను. – నర్మద, మండల వైద్యాధికారి ప్రజల ప్రాణాలు కాపాడడమే బాధ్యత ఆదిలాబాద్‌టౌన్: ప్రజల ప్రాణాలు కాపాడడమే వైద్యుల బాధ్యత. నేను కూడా కరోనా బారిన పడి 14 రోజుల తర్వాత కోలుకున్నాను. ఆ తర్వాత విధుల్లో చేరాను. అధైర్యపడకుండా ఉన్నాను. కుటుంబ సభ్యుల్లో కూడా ధైర్యాన్ని నింపాను. విధి నిర్వహణలో బయటకు వెళ్తున్నప్పుడు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నాను. కోవిడ్ మహమ్మారి కారణంగా ఏడాదిన్నర కాలంగా కుటుంబ సభ్యులకు, నా తల్లిదండ్రులకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నాను. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. – నరేందర్ రాథోడ్, డీఎంహెచ్‌వో, ఆదిలాబాద్ ఇంట్లో నలుగురం కోవిడ్ బారినపడ్డాం ఆదిలాబాద్‌టౌన్: కోవిడ్ ఫస్ట్‌వేవ్‌లో మా ఇంట్లో ఉన్న నలుగురు సైతం కోవిడ్ బారిన పడ్డాం. వృత్తిరీత్యా మా ఆయన మనోహర్ అడిషనల్ డీఎంహెచ్‌వో. ఇద్దరు పిల్లలు. గత సెప్టెంబర్‌లో ఒకేసారి అందరం కోవిడ్ బారిన పడ్డాం. 17 రోజుల తర్వాత కోలుకొని 18వ రోజున విధుల్లోకి వచ్చాం. ఓపీలో కరోనా పాజిటివ్ ఉన్న గర్భిణులకు సైతం వైద్యసేవలు అందించాను. గర్భిణులకు అవగాహన కల్పించాం. – డాక్టర్ సాధన, డిప్యూటీ డీఎంహెచ్‌వో, ఆదిలాబాద్ కరోనా వచ్చినా భయపడలేదు ఆదిలాబాద్‌టౌన్: విధి నిర్వహణలో ఉన్నప్పుడు కోవిడ్ ఫస్ట్‌వేవ్‌లో కోవిడ్ బారిన పడ్డాను. 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నాను. ప్రభుత్వం ద్వారా పంపిణీ చేసే ఐసోలేషన్ కిట్‌ను వాడి కోలుకున్నాను. బయట వస్తువులు తినకుండా, నీరు తాగకుండా ఇంటినుంచే టిఫిన్ బాక్సును తీసుకెళ్తున్నాను. పౌష్టికాహారం తీసుకోవడంతో త్వరగానే కోలుకున్నా. ఏ వస్తువులను ముట్టకుండా, భౌతిక దూరం పాటిస్తూ విధులు నిర్వర్తిస్తున్నాను. కోవిడ్ నిబంధనలను పాటిస్తే ఈ మహమ్మారి బారినపడకుండా ఉండవచ్చు. – డాక్టర్ శ్రీకాంత్, జిల్లా కుష్ఠు నివారణ అధికారి, ఆదిలాబాద్ మానసికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ఆదిలాబాద్‌రూరల్: కోవిడ్ సమయంలో మానసికంగా ఇబ్బందులు ఎదురైనా గంటల తరబడి కోవిడ్ వార్డులో ఉంటూ రోగులకు వైద్య సేవలు అందజేసినా. కోవిడ్ సమయంలో ఎలాంటి సెలవులు ఉండవు, 24 గంటలు వైద్య సేవలు అందజేశాను. కోవిడ్ సోకిన అధైర్యపడలేదు. ఇంటికి వెళ్లినా రోగి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని ఆలోచనలే ఉండేవి. ఎవరో ఓ డాక్టర్‌తో తప్పు జరిగితే డాక్టర్లను నిందించడం సరికాదు. మూడోవేవ్ వస్తుందని ప్రచారం జరుగుతున్న దృష్ట్యా ప్రతి వైద్యుడు తగిన జాగ్రత్తలు తీసుకోని వైద్య చికిత్స అందజేయాలి. – డాక్టర్ సుమలత, రిమ్స్, అసోసియేట్ ఫ్రొఫెసర్ చదవండి: దర్భంగ పేలుడు: హైదరాబాదే.. ఎందుకు? -
దేశం మొత్తం చూసేలా చాటి చెప్పాం : సీఎం జగన్
సాక్షి, అమరావతి : జాతీయ వైద్యుల దినోత్సవం రోజు ఒకేసారి 1,008 సంఖ్యలో అధునాతన 104,108 సర్వీసు వాహనాలను ప్రారంభించడం గొప్ప ఆనందాన్ని ఇచ్చిందని ముంఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ట్వీటర్ వేదికగా ఆయన జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఏపీ చరిత్రలో ఈ రోజు ఒక సువర్ణఅధ్యాయంగా నిలుస్తుంది. ఒకేసారి 1088 సంఖ్యలో అధునాతన 104, 108 సర్వీసు వాహనాలను, గుంటూరు జీజీహెచ్ లో క్యాన్సర్ కేర్ సెంటర్ ను ప్రారంభించడం గొప్ప ఆనందాన్నిస్తోంది. ప్రతి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం మనదని మొత్తం దేశం చూసేలా చాటిచెప్పాం’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. (చదవండి : 108 సిబ్బందికి సీఎం జగన్ శుభవార్త) కాగా, బుధవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 1,088 అంబులెన్స్‌లను విజయవాడలో ప్రారంభించిన విషయం తెలిసిందే. అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిలో నాట్కో కేన్సర్ బ్లాక్‌ను ప్రారంభించారు. దీంతో పాటు 108 సిబ్బంది జీతాలను కూడా భారీగా పెంచారు. ఇంతకు ముందుకు డ్రైవర్లకు నెలకు రూ.10వేలు జీతం వస్తుండగా, ఇకపై వారి సర్వీసుకు అనుగుణంగా రూ.18వేల నుంచి 20వేల రూపాయల వరకు అందజేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. అలాగే ఎమెర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల జీతాలను కూడా పెంచుతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ప్రస్తుతం రూ.12వేల జీతం అందుకుంటున్న మెడికల్ టెక్నీయన్ ఇకపై రూ.20 వేల నుంచి 30 వేల వరకు అందుతుందని సీఎం జగన్ చెప్పారు. చదవండి : ఏపీ: ఆరోగ్య చరిత్రలో సువర్ణాధ్యాయం ప్రారంభం సీఎం జగన్ కృషి.. సుదీర్ఘ స్వప్నం సాకారం -
కోర్టుల్లో తక్షణ న్యాయం జరగట్లేదు
సాక్షి, హైదరాబాద్: ‘బాధితులు న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తుంటారు. నొప్పితో బాధపడే వారు వైద్యులను ఆశ్రయిస్తుంటారు. నొప్పి నుంచి వైద్యులు వెంటనే ఉపశమనం కల్పిస్తుండగా.. కోర్టుల్లో మాత్రం తక్షణ న్యాయం జరగడం లేదు’ అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ అన్నారు. ప్రపంచ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హై9 వెబ్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్స్ డేకి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వైద్యుల్లాగే తామూ బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తామన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన పద్మశ్రీ అవార్డు గ్రహీత, డాక్టర్ కాకర్ల సుబ్బారావు మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే వైద్యులు, రోగులకు మధ్య అవినాభావ సంబంధం తగ్గిందని, ఫలితంగా సమాజంలో వైద్యులకు గౌరవం తగ్గిందని అన్నారు. సామాజిక బాధ్యతగా రోగులకు సేవ చేయాల్సిన వైద్యులు.. ఆర్థికలావాదేవీలే ప్రధానంగా భావిస్తున్నారని చెప్పారు. వైద్యుల వైఖరిలో మార్పు రావా లన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏసియన్ గ్యాస్ట్రో ఎంట రాలజీ చీఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ వైద్యులు తమ కుటుంబ జీవితాన్నే వృత్తికి అంకితం చేస్తున్నారని, తమను వరిస్తున్న ప్రతి అవార్డు తమ బాధ్యతను మరింత పెంచుతుందన్నారు. ప్రముఖ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఏజీ గురవారెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల వైద్యులపై దాడులు పెరుగుతున్నాయని, వైద్యులకు రక్షణ కల్పించాలని కోరారు. నూటికి తొంబై శాతం మంది వైద్యులు మానవతా దృక్పధంతోనే వైద్యసేవలు అందిస్తున్నారని, ఒకరిద్దరి వల్ల వృత్తికి కళంకం ఏర్పడుతోందని తెలిపారు. ప్రముఖ వైద్యులకు సన్మానం.. ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి (జీవిత సాఫల్య పురస్కారం), ప్రముఖ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఏజీ గురవారెడ్డి (డాక్టర్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు), ప్రముఖ గుండె మార్పిడి నిపుణుడు డాక్టర్ ఏజీకే గోఖలే (మోస్ట్ ఫిలాంత్రోఫిక్ డాక్టర్ అవార్డ్), ప్రముఖ స్పైన్ సర్జన్ డాక్టర్ జీపీవీ సుబ్బయ్య (రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ మెడిసిన్ అవార్డు), ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ మానస్ ప్రాణిగ్రహి, గైనకాలజిస్ట్ డాక్టర్ అనురాధ(ఉత్తమ డాక్టర్స్ దంపతులు)లను అవార్డులతో సన్మానించారు. డాక్టర్ ఎంఎస్‌గౌడ్(ఉత్తమ డెంటిస్ట్), డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి(ఉత్తమ న్యూరాలజిస్ట్), డాక్టర్ మంజుల అనగాని(ఉత్తమ గైనకాలజిస్ట్), డాక్టర్ దశ రథరామిరెడ్డి(ఉత్తమ ఆర్థోపెడిక్ సర్జన్), డాక్టర్ దినే ష్‌కుమార్(ఉత్తమ పీడియాట్రిషన్), డాక్టర్ సోమశేఖర్‌రావు(ఉత్తమ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్), డాక్టర్ చిన్మయి(ఉత్తమ ఫీటల్మెడిసిన్), డాక్టర్ శ్రీనివాసకుమార్ (ఉత్తమ కార్డియాలజిస్ట్)లను సన్మానించారు. -
డాక్టర్స్ డే స్పెషల్ స్టోరి
-
ఆయనో యాచకుల డాక్టర్
ప్రాణం పోసేది దేవుడైతే..ప్రాణం నిలిపేది డాక్టర్లు. అందుకే డాక్టర్లను వైద్యోనారాయణహరి అంటాం. సృష్టిలో దేవుడి తర్వాత చేతులు జోడించి దండం పెట్టేది డాక్టర్లకే. రోగి ప్రాణాలుకాపాడేందుకు నిరంతరం శ్రమించే డాక్టర్లకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? వారు పోసిన ఊపిరి కృతఙ్ఞతా భావంతో అనునిత్యం గుర్తుచేస్తూ ఉండదూ? అందుకే ప్రపంచవ్యాప్తంగావైద్యులకోసం ఒకరోజు కేటాయించింది అదే డాక్టర్స్ డే. ఈ సందర్భంగా అసలు డాక్టర్స్ డే చరిత్ర ఏంటో తెలుసుకుందాం.. -
దండాలు డాక్టరమ్మా!
‘పణప్పుర ఊరు’.. కేరళలో మారుమూల ఆదివాసీ గ్రామం. నిలంబూర్ అడవుల్లో ఉంది. పణప్పుర ఊరికి మలప్పురం తాలూకా కేంద్రం నుంచి ఓ బృందం బయలుదేరింది. కొంతదూరం కారులో సాగింది ప్రయాణం. కొంత దూరం జీప్‌లో వెళ్లారు. ఆ తర్వాత ఇక ఏ వాహనమూ వెళ్లే వీలు కనిపించలేదు. కనీసం టూ వీలర్ కూడా. ట్రెకింగ్ మొదలుపెట్టిందా టీమ్. స్థానికులు కొడవళ్లు, గొడ్డళ్లతో దారిలో అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలు, తీగలను నరికేస్తూ వారికి దారి చేస్తున్నారు. ‘చెట్టు కొమ్మలనయితే నరికారు, మమ్మల్నేం చేస్తారు’ అన్నట్లు పెద్ద బండరాళ్లు! తాళ్లను పట్టుకుని ఆ బండల్ని ఎక్కారందరూ. కొండవాలులో మట్టి తడిసి ముద్దయి అడుగు పెడితే చాలు కాలు జారిపోతోంది. అలాంటి సాహసోపేతమైన ట్రెకింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసిందా బృందం. వైద్యం చేయడానికి! దాదాపు పదిమంది ఇంత కష్టతరమైన దారిలో ప్రయాణించి పణప్పుర ఊరు వెళ్లింది అడ్వెంచర్ టూర్ కోసం కాదు. ఒక రోగికి వైద్యం చేయడానికి. ఎంత ఆశ్చర్యపోయినా సరే... ఇది నిజం. ఆ పేషెంట్ సెలబ్రిటీ ఏమీ కాదు. అంతరించిపోతున్న చోళ నాయకన్ ఆదివాసి జాతికి చెందిన రవి. యాభై ఏళ్ల రవికి డయాబెటిస్ ఉంది, కాలి వేలికి గాయమైంది. రక్తస్రావం ఆగడం లేదు. మనిషి చిక్కి శల్యమయ్యాడు. ఇన్ఫెక్షన్ కూడా సోకింది. అడవిలో తెలిసిన ఆకు పసర్లేవో వేసుకుంటూ వ్యాధి ముదర పెట్టుకున్నాడు. అంతకంటే మెరుగైన వైద్యం ఉందని తెలియదు కూడా అతడికి. ఫారెస్ట్ సిబ్బంది ఈ సంగతిని డాక్టర్ అశ్వతి సోమన్‌కు చెప్పారు. డాక్టర్ అశ్వతి సోమన్ నిలంబూర్ మొబైల్ డిస్పెన్సరీలో మెడికల్ ఆఫీసర్. రవికి వైద్యం చేయడానికి తనకు ఉన్న మౌలిక వసతులు సరిపోవు. అందుకే అశ్వతి... మలప్పురం తాలూకా హాస్పిటల్ సిబ్బందిని, ఆపరేషన్‌కు అవసరమైన పరికరాలను సమకూర్చుకున్నారు. మెడికల్ టీమ్‌తో ఫారెస్ట్ సిబ్బంది సహాయంతో అడవి దారి పట్టారు. రవిని పరీక్షించి సర్జరీ చేసి ‘గాంగరిన్’ అయిన వేలిని తొలగించి, కట్టుకట్టారు. డయాబెటిస్‌ను అదుపులోకి తీసుకు వస్తే కానీ మిగతా చికిత్స ఇవ్వలేమని, అందుకు తాలూకా కేంద్రంలో ఉన్న హాస్పిటల్లో చేరాల్సిందేనని, తమతోపాటు వస్తే తీసుకువెళ్తామని చెప్పారు రవికి. డాక్టర్ వైద్యం చేస్తాను రమ్మన్నప్పటికీ రవి మాత్రం తన గూడెం వదిలి వచ్చే పనే లేదన్నాడు. దాంతో ‘‘డయాబెటిస్‌ను, గాయాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అప్పుడు వేలిని తొలగించాల్సి వచ్చింది. ఇప్పుడు మంచి వైద్యం అందితే ఆరోగ్యం బాగవుతుంది. అలా చేయకపోతే రేపటి రోజున కాలిని తొలగించాల్సి రావచ్చు, ఇంకా ముదిరిపోతే ప్రాణం మీదకే రావచ్చు’’ అని గట్టిగా హెచ్చరించారు అశ్వతి. ఆ భయంతో అతడు హాస్పిటల్‌కి రావడానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడతడు మణప్పురం తాలూకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. రోగి దగ్గరకు డాక్టరే వెళ్లాలి ఇంతమంది తరలి వెళ్లడం కంటే ఆ పేషెంట్‌నే హాస్పిటల్‌కి తెచ్చే ప్రయత్నం చేయవచ్చు కదా అని అడిగిన వాళ్లతో డాక్టర్ అశ్వతి ఒకే మాట చెప్పారు. ‘వైద్యరంగంలో నేర్పించే మొదటి పాఠం... డాక్టర్ దగ్గరకు పేషెంట్ కాదు, పేషెంట్ దగ్గరకు డాక్టర్ వెళ్లాలని. ఇక్కడ మరో చిక్కు కూడా ఉంది... ఈ పేషెంట్ వైద్యం కోసం హాస్పిటల్‌కు వచ్చే ఉద్దేశంలో లేడు. అలాంటప్పుడు డాక్టరే వెళ్లాలి. మాది రోగి ప్రాణాన్ని నిలపాల్సిన కర్తవ్యం’’ అన్నారు. పోలిక ఎక్కడ? మన దగ్గర అరకు, పాడేరు వంటి గిరిజన గ్రామాలు విషజ్వరాలతో మంచం పడితే వారి చెయ్యి పట్టుకుని నాడి చూడడానికి ఒక్క డాక్టరూ కనిపించట్లేదు. నొప్పులు పడుతున్న గర్భిణిని ప్రసవం కోసం మంచం మీద మోసుకు రావాల్సిన దుస్థితి. తరచూ ఇలాంటి సంఘటనలనే చూస్తున్న మనకు కేరళలో ఓ యువతి, వైద్యరంగంలోకి వచ్చి ఐదేళ్లు కూడా నిండని యువతి... పేషెంట్ కోసం ఇంతటి సాహసం చేసిందంటే ఆమెకు పాదాభివందనం చేయాలనిపిస్తుంది. డాక్టర్స్ డే రోజున ఇలాంటి డాక్టర్‌ను తలుచుకోవడం సంతోషంగా ఉంటుంది. వైద్యో నారాయణో హరి అని అందుకే అంటారు. ఇలాంటి డాక్టర్ని చూస్తే ఆ మాట మళ్లీ మళ్లీ అనాలనిపిస్తుంది. – మంజీర -
ఒంట్లో ప్రాబ్లమ్ ఇంట్లో సాల్వ్
అది ఆనంద్ ఇల్లు. వృద్ధులైన తన అమ్మా నాన్నా, తన భార్య, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్న హ్యాపీ హోమ్ ఆనంద్‌ది. ఒక హోమ్ హ్యాపీగా ఉండాలంటే ఏ డబ్బో, కారో, మోడ్రన్ గ్యాడ్జెట్సో ఉంటే సరిపోదు. తాను ఆనంద్ అని పేరు పెట్టుకున్నా సరే... ఆరోగ్యం లేనినాడు పైవన్నీ ఉన్నా ఆనందం ఉండదు. అన్నట్టు... ఎవరి వయసూ ఆగదు. ఆనంద్‌ది కూడా. ఆనంద్‌కు వయసుతో పాటు వచ్చే డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటి సమస్యలు రావచ్చు. వాటి కారణంగా వచ్చే గుండెజబ్బులు, బ్రెయిన్‌స్ట్రోక్ వంటి ముప్పు పొంచి ఉండవచ్చు. ఆనంద్ అమ్మా నాన్నా పెద్దవారు. కాబట్టి వారికి ఎముకలకు సంబంధించిన ఆస్టియోపోరోసిస్ లాంటి సమస్యలు ఉండవచ్చు. మహిళలకు ఉండే సాధారణ ఆరోగ్య సమస్యలైన గైనిక్ వంటివి ఆనంద్ తల్లికీ, భార్యకూ ఎదురుకావచ్చు. ఆనంద్ కూతురు ఇప్పుడు టీనేజ్‌లో ఉండటం వల్ల యువతులు సాధారణంగా ఎదుర్కొనే రుతుసమస్యలతో సతమతమవుతూ ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధపడుతుండవచ్చు. ఆనంద్ కొడుకుకూ కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. మరి వాళ్ల సాధారణ సమస్యలన్నీ తీరాలంటే ఎలా? కుటుంబ సభ్యులందరూ ఇన్ని విభాగాల డాక్టర్ల దగ్గరికి వెళ్తూ వస్తూ ఉండలేరు కదా. పైగా కొన్ని ప్రాథమిక అంశాలను ఒక్కో వ్యక్తికీ విపులంగా చెప్పడానికి పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర తగినంత∙సమయం ఉండకపోవచ్చు. అందుకే అలాంటి పెద్ద పెద్ద హాస్పిటళ్లలోని పెద్ద డాక్టర్లందరూ మీ దగ్గరికే వస్తున్నారు. ఒక కుటుంబంలోని వారికి వచ్చేందుకు అవకాశం ఉన్న సాధారణ సమస్యల నివారణకు కొన్ని సూచనలు చేస్తున్నారు. కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే ఊరు హెల్దీగా ఉంటుంది. ఊర్లో స్వస్థత నెలకొంటేనే దేశమంతా ఆరోగ్యంగా ఉంటుంది. అలా దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే డాక్టర్ల సేవలకు సార్థకత. పేషెంట్ బాగుపడితే అదే డాక్టర్ సమర్థతకు చిహ్నం. అందుకే డాక్టర్స్ డే సందర్భంగా కొంతమంది డాక్టర్లంతా ఈ కథనం రూపంలో మీ ఇంటికే వస్తున్నారు. ఆనంద్‌లాంటి కుటుంబాలన్నీ ఆనందంగా ఉండటమే తమకు కావాల్సింది అంటున్నారు. ఇవి కేవలం ప్రాథమిక సూచనలు మాత్రమే. వీటిని పాటిస్తే... మీరు పేషెంట్ కావడం దాదాపుగా అసాధ్యమంటూ భరోసా ఇస్తున్నారు. మన ‘ఫన్డే’ ద్వారా ఇచ్చే ఈ సూచనలను మన ఫ్యామిలీ సభ్యులంతా పాటిస్తే... అదే తమకు నిజమైన డాక్టర్స్ డే అంటున్నారు. ఆ సూచనలు మీ కోసం... గుండె అకస్మాత్తుగా మరణాన్ని తెచ్చిపెట్టే అంశాల్లో గుండెపోటు ఒకటి. ఆందోళన పరిచే వ్యాధుల్లో గుండెజబ్బులు ముఖ్యమైనవి. వాటిని కేవలం కొన్ని చిన్నపాటి జాగ్రత్తలతో నివారించవచ్చు. ఆ సులభమైన మార్గాలను ఒకేచోట మీ కోసం అందిస్తున్ నాం. ♦ ఆహారంలో ఓట్ మీల్ తింటే మంచిది. పీచు ఎక్కువగా ఉండే ఈ ఓట్ మీల్ ఒంట్లో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. జీర్ణకోశ మార్గంలో ఇది ఒక స్పాంజ్‌లా పనిచేసి, కొలెస్ట్రాల్‌ను నానిపోయేలా చేసి, రక్తంలో ఇంకిపోకుండా ఒంట్లో నుంచి తొలగిస్తుంది. హోల్ వీట్ బ్రెడ్ లాంటి తృణధాన్యాలతో చేసినవి తిన్నా మంచిదే ♦ స్ట్రా బెర్రీలు, బ్లూ బెర్రీల లాంటివి తింటే, అవి రక్తనాళాల్ని వెడల్పు చేసి, గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయని ఒక పరిశోధనలో వెల్లడైంది ♦ డార్క్ చాక్లెట్లు, అంటే కనీసం 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు తింటే, అధిక రక్తపోటు, రక్తం ఊరికే గట్టకట్టుకుపోవడం లాంటివి తగ్గుతాయి. అయితే, మామూలు మిల్క్ చాక్లెట్లు, క్యాండీ బార్ల వల్ల ఉపయోగం లేదు ♦ విటమిన్ ‘సి’ ఎక్కువగా ఉండే బత్తాయిలు, కమలా పండ్ల లాంటి నిమ్మజాతి పండ్లు తినాలి. అయితే, ఈ పండ్ల రసాల్లో అతిగా పంచదార కలుపుకోకూ డదు. అసలు పంచదార లేకుండా తీసుకుంటే ఇంకా మేలు. ♦ సోయా పాలు, సోయా జున్ను (తోఫూ) తింటే ఒంటికి కావాల్సిన ప్రొటీన్లు వస్తాయి. అనారోగ్యకరమైన కొవ్వు, కొలెస్ట్రాల్ ఒంట్లో చేరవు. సోయా ప్రొటీన్లు ఒంట్లో చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి ♦ బంగాళదుంపలు అనగానే అతిగా పిండిపదార్థమని చాలామంది పక్కనపెడుతుంటారు. కానీ, అతిగా వేయించనంత వరకు బంగాళదుంపలు గుండెకు ప్రమాదకరం కావు. పొటాషియం ఎక్కువగా ఉండే వీటిలో ఫైబర్ ఉంటుంది ∙టమోటాలలో కూడా గుండెకు ఆరోగ్యమిచ్చే పొటాషియం ఉంటుంది. ♦ తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. ఫ్రిజ్‌లో నిల్వచేసిన పదార్థాల్లో 50–60 శాతం మేరకు పోషకాలు నశిస్తాయి. అందువల్ల పూర్తి పోషకాల కోసం తాజావి తీసుకోవడమే మేలు ♦ బాదంపప్పు, అక్రోటు కాయలు (వాల్నట్స్), వేరుసెనగ లాంటివి తగు మోతాదులో తినాలి. వాటిలో చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించే విటమిన్ ‘ఇ’ ఉంటుంది ♦ బీన్స్, బఠానీల లాంటి కాయధాన్యాల్లో కూడా కొవ్వు చేరనివ్వని బోలెడంత ప్రొటీన్ ఉంటుంది ♦ రోజూ నాలుగు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల గుండెజబ్బులు దాదాపు 20 శాతం తగ్గుతాయని ఓ అధ్యయనంలో తేలింది ♦ బచ్చలి కూర లాంటి ఆకుకూరలు గుండెకు అదనపు బలం ఇస్తాయి ♦ అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్)లో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. పీచు పదార్థం కూడా ఎక్కువే. కాబట్టి, అవి గుండెకు మంచిది ♦ దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. రోజూ నిర్ణీత మోతాదులో కనీసం మూడు నెలల పైగా దానిమ్మ రసం తాగితే, గుండెకు రక్తప్రసారం బాగా మెరుగవుతుంది. అలాగే, యాపిల్ పండ్లు కూడా! ♦ సమతుల ఆహారం తీసుకోవాలి. ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే భోజనం చేయాలి. చీటికీ మాటికీ ఏదో ఒకటి చిరుతిళ్లు పంటి కింద నమిలే అలవాటు ఉంటే మానేయాలి ♦ ఒకసారి వాడిన నూనెను మళ్లీ వాడకూడదు ♦ కోపం, ప్రేమ, విచారం, దుఃఖం వంటి భావోద్వేగాలను అణచుకోవడం అంత మంచిది కాదు. భావోద్వేగాలను అణచుకుంటే, ఒత్తిడి పెరిగి గుండెపోటు వచ్చే ముప్పు ఏర్పడుతుంది ♦ వారానికి కనీసం ఐదు రోజులైనా, రోజుకు కనీసం 45 నిమిషాలపాటైనా గుండెపై ఒత్తిడి కలిగించని నడక, ఈత వంటి వ్యాయామాలు చేయాలి ♦ కంటినిండా నిద్రపోవడం కూడా గుండె ఆరోగ్యానికి ముఖ్యం. దీర్ఘకాలంగా నిద్రను అణచుకుంటూ ఉంటే, గుండె స్పందనల్లో లయతప్పే ప్రమాదం ఉంటుంది. - డాక్టర్ హేమంత్ కౌకుంట్ల , చీఫ్ కార్డియో థొరాసిక్ సర్జన్ సెంచరీ హాస్పిటల్, హైదరాబాద్ మెదడు మెదడుకు సంబంధించిన సమస్యల్లో ముఖ్యమైనది పక్షవాతం. ఇదిగాక మతిమరుపు, ఒక వయసు తర్వాత అలై్జమర్స్ వంటివి మామూలు. ఇలాంటి సమస్యలను నివారించడానికి గుండె విషయంలో పేర్కొన్న జాగ్రత్తలే చాలావరకు మెదడుకూ వర్తిస్తాయి. వాటితో పాటు ఈ కింది పేర్కొన్న ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకుంటే మేలు. ఇవి మెదడును చురుగ్గా ఉంచడానికీ దోహదపడతాయి. ♦ ఆహారంలో చేపలు తీసుకోవడం అన్నివిధాలా మేలు చేసే అంశం. దాంతో పాటు మెదడు చురుకుదనానికీ ఇది బాగా దోహదపడుతుంది. పండు చేప / పంగుగప్ప, వంజరం, కనగర్తలు (మాకరెల్) వీటిలో మెదడు చురుకుదనానికి దోహదం చేసే ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువ ∙ ♦ మెదడు చురుకుదనానికి దోహదం చేసే నూనెల్లో ఆలివ్ ఆయిల్ చాలా మంచిది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్, కొవ్వులను అరికడుతుంది. కాబట్టి మెదడుకు వచ్చే పక్షవాతం (స్ట్రోక్), అలై్జమర్స్ వ్యాధులను నివారిస్తుంది ∙మెదడుకు మేలు చేసే పండ్లలో బెర్రీలు మంచివి. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, నేరేడు వంటివి మెదడుకు మంచివి ♦ ఇక కూరగాయలు, ఆకుకూరల విషయానికి వస్తే... పాలకూర మెదడును చురుగ్గా ఉంచుతుంది. బీట్రూట్, చిక్కుళ్లు వంటి వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు కణాలను దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచి, వాటిని అనేక వ్యాధులనుంచి రక్షణ కల్పిస్తాయి ♦ వీటితో పాటు చాకొలెట్, గ్రీన్ టీ కూడా మెదడుకు మేలు చేస్తాయి. మెదడుకు హాని చేసే ఆహారాలు : నిల్వ ఉంచిన ఉప్పటి పదార్థాలైన చిప్స్, టిన్న్‌డ్ సూప్స్ మెదడుకు హానికరంగా పరిణమిస్తాయి. కాబట్టి వాటిని చాలా పరిమితంగా తీసుకోవాలి ∙మనం తీసుకునే ఉప్పు రోజుకు 6 గ్రాములకు మించితే అది ఆరోగ్యంతో పాటు మెదడుకూ చేటు చేస్తుంది ♦ కొవ్వుల్లో డాల్డా, మాంసాహారంలో ఉండే కొవ్వులు మెదడుకు అంత మంచిది కాదు. అందుకే మాంసాహారం తినేవారు కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలే తీసుకోవాలి. బటర్, క్రీమ్ కూడా పరిమితంగా వాడాలి ♦ ఆల్కహాల్ మెదడుకు హాని చేస్తుంది. ఇది తీసుకున్నప్పుడు తక్షణ ప్రభావంగా మెదడు స్థబ్దంగా ఉంచుతుంది. ఇక దీర్ఘకాలంలో డిమెన్షియా (మతిమరుపు) వంటి మెదడు సమస్యలకు దోహదం చేస్తుంది. కాబట్టి దీన్ని పూర్తిగా మానేయాలి. - డాక్టర్ బి.చంద్రశేఖర్‌రెడ్డి ,చీఫ్ న్యూరోఫిజీషియన్ సిటీ న్యూరో సెంటర్, హైదరాబాద్ కిడ్నీ ♦ డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారు కచ్చితంగా వాటిని నియంత్రణలో ఉంచు కోవాలి. చక్కెర వ్యాధిగ్రస్తులు ప్రతి మూడు నెలలకోసారి క్రమం తప్పకుండా హెచ్‌బీ1ఏసీ (గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్) అనే పరీక్షను మూడు నెలలకు ఒకసారి చేయిస్తూ దాని ఫలితం 6.5 కంటే తక్కువగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే రక్తపోటు ఉన్నవారు తమ బీపీని నిత్యం 130/80 ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమీ తినకముందు షుగర్ 100 ఎంజీ/డీఎల్ లోపల ఉండాలి. తిన్న తర్వాత 160 ఎంజీ/డీఎల్ ఉండేలా చూసుకోవాలి ♦ రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే... మాంసాహారం, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని పరిమితంగా తీసుకుంటూ, ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి ♦ మన ఆహారంలో ఉప్పును పరిమితం చేసుకోవాలి. ఉప్పు పాళ్లు ఎక్కువగా ఉండే బేకరీ ఆహారాన్ని, పచ్చళ్లు, అప్పడాలు, నిల్వ ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు ♦ మూత్ర విసర్జన సమయంలో మూత్రంలో నురుగులా పోతున్నట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. ఇది ప్రోటీన్‌ను కోల్పోవడానికి సూచన. కిడ్నీలో రాళ్ల నివారణ కోసం... అందరికీ ఆరోగ్యాన్నిచ్చేవే అయినా కొందరికి అవి కాస్త ప్రతికూలంగా పనిచేస్తాయంటే నమ్మడం కష్టమే. ఎందుకంటే పాలకూర వంటివి కొందరికి మాత్రం కిడ్నీలో రాళ్లను ఏర్పరచుతాయి. కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే కొన్ని చిన్న జాగ్రత్తలు పాటించండి. ♦ నీటిని ఎక్కువగా తాగాలి. రోజుకు తప్పని సరిగా రెండు నుంచి రెండున్నర లీటర్ల యూరిన్‌ను విసర్జించాల్సి ఉంటుంది కాబట్టి శరీర కణాల నిర్వహణకు పోను ఆ మోతాదులో మూత్ర విసర్జన జరగాలంటే రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది ♦ ఆహారంలో హై ప్రొటీన్, సోడియం ఉన్న పదార్థాలను తక్కువగా తీసుకోవాలి ♦ సోయాబీన్స్, పాలకూర, చాక్లెట్ల వంటి వాటిని వీలైనంతగా తగ్గించాలి ♦ క్యాల్షియం సప్లిమెంట్లను కారణం లేకుండా వాడకూడదు ♦ ఆల్కహాల్ వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. దాంతో దేహంలో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్, క్రమేణా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి అవకాశం ఎక్కువ ♦ కూల్‌డ్రింకులను అస్సలు తాగకూడదు. - డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి ,సీనియర్ నెఫ్రాలజిస్ట్ ,స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ ఎముకలు ఎముకలకు పటిష్టతను ఇచ్చేది క్యాల్షియమ్ అని తెలిసిందే. అది పాలు, పాల ఉత్పాదనలు, ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటుంది.అయితే కేవలం క్యాల్షియమ్ తీసుకొని ఊరుకుంటే సరిపోదు. అది ఎముకల్లోకి ఇంకిపోయేలా చేయడానికి క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాలి. వ్యాయామం చేయకుండా కేవలం క్యాల్షియమ్ తీసుకుంటూ ఉంటే అది మూత్రం ద్వారా బయటకు పోతూ ఉంటుంది. లేదా కొందరిలో అది మూత్రపిండాల్లో పోగుపడి కిడ్నీ స్టోన్‌గా కూడా పరిణమించవచ్చు. అందుకే మీరు క్యాల్షియమ్ తీసుకుంటూ ఉండటంతో పాటు వాకింగ్, జాగింగ్, ఏరోబిక్స్, స్విమ్మింగ్ వంటి వ్యాయా మాలలో మీకు అనువైన దాన్ని ఎంచుకొని, క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి. ∙యాభై ఏళ్ల వయసు దాటాక బోన్ డెన్సిటీ టెస్ట్ చేయించుకోవడం అవసరం. అది డాక్టర్ల సూచన మేరకు చేయించుకోవాలి. - డాక్టర్ సుధీర్‌రెడ్డి ,సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ ,ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ కడుపు ♦ ఆహారంలో పీచు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఆకుకూరలు, పండ్లలో పీచు ఎక్కువగా ఉంటుంది ♦ ఆహారాల్లో మసాలాలు తగ్గించాలి. వేపుళ్లు చాలా పరిమితంగా తీసుకోవాలి. ఉడికించిన పదార్థాలే కడుపు ఆరోగ్యానికి మేలు ♦ చిన్నచిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు తినాలి ♦ స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గించుకోవాలి ♦ పొగతాగడం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారు తక్షణం వాటిని మానివేయాలి ♦ రాత్రిపూట చాలా ఆలస్యంగా తినకూడదు ♦ రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత కొద్దిదూరం నడవాలి ♦ రాత్రి పూట తీసుకునే చిరుతిండ్లను వీలైనంత వరకు మానేయాలి ♦ రాత్రి నిద్రకు ముందర రెండు గంటల పాటు ఏమీ తినకూడదు ♦ కంటినిండా నిద్రపోవాలి ♦ డాక్టర్లు ప్రిస్క్రయిబ్ చేస్తే తప్ప నొప్పి నివారణ మందులు తీసుకోకూడదు. - డాక్టర్ భవానీరాజు ,సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ,కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ కాలేయం ♦ మీరు ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉంటే మీ ఆహారంలో పిండి పదార్థాలను తగ్గించుకోవాలి. ప్రతి వారానికి అర కిలో నుంచి కిలో బరువు తగ్గించుకునేలా శ్రమించాలి ♦ ♦ పొట్టుతో ఉండే తృణధాన్యాలు ఎక్కువగా వాడండి. పాలిష్ చేసిన వాటికి బదులుగా పొట్టు తీయని బియ్యం, గోధుమలు ఎక్కువగా తీసుకోవాలి ♦ డయాబెటిస్‌ను తప్పకుండా అదుపులో ఉంచుకోండి ♦ కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గించుకోండి. దీనికి వ్యాయామంతో పాటు ఒకవేళ అవసరమైతే మందులు కూడా వాడాల్సి ఉంటుంది ♦ ఆల్కహాల్ వంటి మత్తు పదార్థాలను తీసుకునే అలవాటు ఉంటే దానికి దూరంగా ఉండండి ♦ కాలేయాన్ని కాపాడుకునే అంశాల్లో ముఖ్యమైనది ఏమిటంటే... ప్రిస్క్రిప్షన్ లేకుండా ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఎప్పుడూ వాడకూడదు. కన్ను ♦ మంచి చూపు కోసం విటమిన్–ఏ పుష్కలంగా ఉండే ఆహారాలు, పండ్లు, కూరలు తీసుకోవాలి. వాటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే మంచి పోషకాహారం తీసుకోవడం కంటికి రక్షణ కలిగించడమే కాదు... చూపు పదిలంగా ఉంచడానికి దోహదపడుతుంది ♦ ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యుడిని నేరుగా చూడకూడదని ఎప్పుడూ గుర్తుంచుకోండి. మిట్ట మధ్యాహ్నం వేళల్లో వీలైనంతవరకు బయటకు వెళ్లకపోవడం మంచిది ♦ వీలైనంత వరకు కంటిని ఎప్పటికప్పుడు చల్లని, శుభ్రమైన నీటితో కడుక్కోవడం మంచిది. అలాగే పుష్కలంగా నీళ్లు తాగుతూ ఉండాలి ♦ తరచూ కంటి పరీక్షలు చేయించుకోండి. తీక్షణంగా ఎండల్లో తిరిగేవారు తప్పనసరిగా తరచూ కంటి పరీక్షలు చేయించుకోవడం మంచిది. ♦ మంచి మేలైన ప్రమాణాలతో ఉన్న సన్ గ్లాసెస్ వాడటం ద్వారా తీక్షణ కాంతితో పాటు అనేక దుష్ప్రభావాలనుంచి కంటిని కాపాడుకోవచ్చు. అయితే తక్కువ ప్రమాణాలతో తయారు చేసే సన్– గ్లాసెస్ వల్ల కన్ను మరింతగా తెరచుకుని చూడటంతో కంటిలోకి హానికరమైన యూవీ కిరణాలు మరింతగా ప్రవేశించవచ్చు. అందుకే మంచి ప్రమాణాలతో... అంటే పాలీకార్బనేట్, ట్రైవిక్స్ వంటి మెటీరియల్‌తో తయారైన మేలైన సన్‌గ్లాసెస్ వాడాలి. ♦ నీలం రంగులో ఉన్న కళ్లద్దాలు వాడకండి. నీలం రంగు కళ్లకు మంచిది కాదు. ♦ ఫ్రేమ్ అంచులు పెద్దవిగా ఉండే గ్లాసెస్ వాడటం వల్ల కంటి మూలల నుంచి కూడా యూవీ కిరణాలు లోపలికి ప్రసరించకుండా ఉంటాయి. అందుకే ఫ్యాషన్ పేరిట ఫ్రేమ్ తక్కువగా ఉండే వాటికంటే... ఒకింత ఫ్రేమ్ ఎక్కువగా ఉండే గ్లాసెస్ మరింత మేలు చేస్తాయి. - డాక్టర్ రవికుమార్ రెడ్డి ,సీనియర్ ఐ స్పెషలిస్ట్ ,మెడివిజన్ హాస్పిటల్, హైదరాబాద్ మహిళల ఆరోగ్యం ♦ యువతులు తమ రుతు సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. రుతుస్రావంతో వారు చాలారక్తాన్ని కోల్పోతారు. దాంతో వారిలో ఐరన్ తగ్గి అనీమియా కనిపించడం సాధారణం. అందుకే టీనేజ్‌నుంచే ఆడపిల్లలు ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ♦ స్వయంగా రొమ్ము పరీక్ష చేసుకోడాన్ని బీఎస్ఈ అని వ్యవహరిస్తారు. బిఎస్ఇ అంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఇరవై ఏళ్లు నిండిన ప్రతి స్త్రీ నెలకోసారి బిఎస్ఈ చేసుకోవాలి. బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలను ముందుగా పసిగట్టి చికిత్స చేయించుకోవడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. ♦ అద్దం ముందు నిలబడి స్వయంగా చేసుకునే పరీక్షలో చేతులను తల వెనకకు పెట్టి బ్రెస్ట్ ఆకారాన్ని రొమ్ముల ఆకారాన్ని గమనించాలి. రొమ్ముల పై భాగం, చుట్టూ, చంకల కింద కూడా నొక్కి చూడాలి ♦ ఇప్పుడు నిపిల్స్ మెల్లగా నొక్కి పాలలాగ లేదా నీటిలాగ ద్రవం విడుదలవుతుందేమో చూడాలి ♦ తర్వాత వెల్లకిలా పడుకుని చేతివేళ్లతో బ్రెస్ట్‌ను తాకుతూ పరీక్షించుకోవాలి. పడుకున్నప్పుడు తలకింద దిండు ఉండరాదు, భుజాల కింద మడతపెట్టిన టవల్‌ను ఉంచుకోవాలి. ఈ పరీక్షలో చిన్న గడ్డలాంటిది ఉన్నా వెంటనే తెలిసిపోతుంది. ♦ పైన పేర్కొన్న పరీక్షలను రుతుక్రమం పూర్తయిన తొలిరోజు చేసుకుంటే మంచిది. ఎందుకంటే పీరియడ్స్ మొదలయ్యే సమయంలో సాధారణంగానే రొమ్ములలో చిన్నపాటి గడ్డలు ఏర్పడుతుంటాయి. ఇవి రుతుక్రమం మొదలైన మూడు– నాలుగు రోజుల్లో కరిగిపోతాయి. ఆ తర్వాత కూడా ఏదైనా లంప్ తగిలితే అది బ్రెస్ట్ క్యాన్సర్‌కు సూచిక అయి ఉండవచ్చనే సందేహంతో డాక్టర్‌ను సంప్రదించాలి. అయితే అన్ని గడ్డలూ క్యాన్సర్లు కావు. అందుకే ఆందోళన అవసరం లేదు. అలాంటివేవైనా కనిపిస్తే మాత్రం డాక్టర్‌ను కలవాలి. ♦ ఇక మహిళల్లో వచ్చే మరో సాధారణ సమస్య సర్వైకల్ క్యాన్సర్. అయితే సెర్విక్స్ క్యాన్సర్ ముందుగా వచ్చే ప్రీ–క్యాన్సర్ దశ చాలా కాలం (దాదాపు ఎనిమిది నుంచి పదేళ్లు) కొనసాగుతుంది. అంటే అది పూర్తి క్యాన్సర్‌గా రూపొందడానికి సాగే ముందస్తు దశ ఇంత సుదీర్ఘకాలం కొనసాగుతుంది కాబట్టి అక్కడ వచ్చే మార్పులను ముందుగానే పసిగడితే అది క్యాన్సర్ కాకముందే చికిత్స చేయడం సాధ్యపడుతుంది. పాప్ స్మియర్ అనే చిన్న పరీక్షతో ఎంతో సులువుగా సెర్విక్స్ క్యాన్సర్‌ను ప్రీ క్యాన్సర్ దశలోనే గమనించి సమర్థంగా చికిత్స చేయడం సాధ్యమవుతుంది. ఇరవై ఒకటి నుంచి అరవై ఏళ్ల వయసులో ఉన్న మహిళలంతా తప్పనిసరిగా కనీసం ఏడాదికి ఒకసారి చేయించుకోవడం అవసరం ♦ మహిళలు ఎల్బీఎస్ (లిక్విడ్ బేస్డ్ సైటాలజీ) పరీక్షను ప్రతి ఐదేళ్లకోమారు చేయించుకోవాలి. - డాక్టర్ భాగ్యలక్ష్మి ,సీనియర్ గైనకాలజిస్ట్,యశోద హాస్పిటల్స్, హైదరాబాద్ హెయిర్ & స్కిన్ వెంట్రుకల రక్షణ కోసం... ♦ మంచి జుట్టు కోసం మెగ్నీషియమ్, ఐరన్, జింక్ వంటి ఖనిజలవణాలు ఉండే పౌష్టికాహారాన్ని తీసుకోవాలి ♦ క్రమం తప్ప కుండా వెంట్రుకలను షాంపూతో శుభ్రం చేసుకోవాలి. అయితే మరీ ఎక్కువగా వెంట్రుకలను కడగటం కూడా మంచిదికాదని గుర్తుంచుకోవాలి. దీనివల్ల వెంట్రుకలు పొడిబారవచ్చు. ♦ అలర్జెన్స్, కాలుష్యాలు నేరుగా వెంట్రుకలు తాకకుండా స్కార్ఫ్ కట్టుకోవడం, హాట్ పెట్టుకోవడం చేయాలి ♦ ఒకవేళ చుండ్రు వంటి సమస్య ఉంటే కీటోకెనజాల్ లేదా సైక్లోపిరోగ్సాలమైన్ ఉండే షాంపూలతో వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి ♦ వెంట్రుక చివర్లు చిట్లి పోకుండా ఉండేలా ప్రతి ఆరు వారాలకు ఓమారు జుట్టును ట్రిమ్ చేసుకోవాలి ♦ మీరు రంగు వేసుకునే వారైతే అది పడుతోందా లేదా అన్నది పరిశీలించుకోవాలి. చర్మం సంరక్షణ ఇలా... ♦ కాలుష్యాలైన పొగ, దుమ్ము, ధూళి నేరుగా తాకకుండా సాధ్యమైనంత వరకు చర్మం కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. అంటే ముఖం, చేతులను రక్షించుకోడానికి స్కార్ఫ్, గ్లవ్జ్ వంటివి తొడుక్కోవాలి. ♦ చర్మం, వెంట్రుకలు మంచి పోషకాలు అందేలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న పదార్థాలు అంటే ఆకుపచ్చని కూరలు (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్), తాజా పళ్లు, విటమిన్ ఏ, సీ, ఈ ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. రోజూ రాత్రివేళ కూడా చర్మం, వెంట్రుకలు శుభ్రం అయ్యేలా స్నానం చేయడం మేలు చేస్తుంది. ♦ బయటకు వెళ్లడానికి కనీసం 15–20 నిమిషాల ముందు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. దీనికి తోడు బయటకు వెళ్లాక కూడా ప్రతి రెండు, మూడు గంటలకోమారు మళ్లీ సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. సన్‌స్క్రీన్‌ను అన్ని సీజన్లలో రాసుకోవడం అవసరం. - డాక్టర్ స్వప్న ప్రియ ,సీనియర్ డర్మటాలజిస్ట్ ,కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ నోటి ఆరోగ్యం ♦ దంతసంరక్షణ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసు కోండి. ప్రతిరోజూ రెండు సార్లు పళ్లు తోముకోండి. (రాత్రి నిద్రకు ముందర, పొద్దున నిద్ర లేవగానే) ♦ మీ డెంటిస్ట్‌ను కలిసి క్రమంతప్పకుండా పరీక్షలు చేయించుకోండి. ♦ మీరు బ్రష్ చేసుకునేందుకు మృదువైన బ్రిజిల్స్ ఉన్న బ్రష్‌నే వాడండి. ♦ దంత సంరక్షణను అందించే మంచి టూత్‌పేస్ట్‌ను ఎంచుకోండి. ♦ పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు నిలువుగా బ్రష్ చేసుకోండి. ♦ బ్రష్ చేసుకునే సమయంలో చాలా మృదువుగా బ్రష్ చేసుకోండి. రఫ్‌గా బ్రష్ చేసుకుంటే అది మీ చిగుళ్లకు హాని చేకూర్చవచ్చు. అలాంటప్పుడు అవి త్వరగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. ♦ మీ పంటికి బయటివైపే కాదు... లోపలి వైపునా బ్రష్ చేసుకోవాలి. నమిలే ప్రదేశాలల్లో పంటిపైన వెడల్పుగా ఉంటే ప్రాంతంలోనూ బ్రష్ చేసుకోవాలి. ♦ లోపలివైపున బ్రష్ చేసుకోడానికి బ్రష్‌ను నిలు వుగా పట్టుకొని పైకీ, కిందికీ మృదువుగా కదిలించండి. ♦ కనీసం రెండు నిమిషాల పాటు బ్రష్ చేసుకోవాలి. ♦ నాలుకపైనున్న బాక్టీరియాను తొలగించుకోడానికి కనీసం 30 సెకన్ల పాటు స్క్రబ్ చేయండి. ♦ బ్రషింగ్ తర్వాత టూత్‌బ్రష్‌ను మృదువుగా రుద్దండి. ♦ చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్ చేసినట్లు రుద్దితే దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ♦ ప్రతి మూడు నెలలకు ఓమారు బ్రష్‌ను మార్చేయండి. లేదా బ్రిజిల్స్ వంగినట్లు, దెబ్బతిన్నట్లు కనిపించినా బ్రష్‌ను వెంటనే మార్చండి. ♦ మీ బ్రష్‌ను టాయిలెట్ దగ్గర పెట్టవద్దు. బ్రష్ చేసుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా తుడిచి, కప్‌బోర్డ్‌లో పెట్టండి. ♦ చిన్నపిల్లలు ఉన్నవారు ప్రతి ఆర్నెల్లకొకసారి వాళ్లను దంతవైద్యులకు చూపాలి. పాలపళ్లే కదా అని నిర్లక్ష్యం కూడదు. పాల పళ్లలోని ఇన్ఫెక్షన్, శాశ్వత దంతాలకూ పాకి, వాటిని పాడుచేయడమే కాక ఎగుడు–దిగుడు పళ్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. ♦ పాలపీకతో పాలు తాగే పిల్లలకి రాత్రి నిద్రకు ముందు పాలపీకను నోట్లోంచి తీసేసి, వేలితో నోరు శుభ్రం చేయాలి. సీసాను అలాగే ఉంచేస్తే అన్ని పళ్లూ పిప్పిపళ్లయ్యే అవకాశం ఎక్కువ. ♦ చిన్నపిల్లలు ఆడుకునే సమయంలో మౌత్గార్డ్స్ ధరించేలా చూడాలి. లేదంటే ఆటల్లో వారు కిందపడిపోతే పళ్లు ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ♦ దంతాలు శుభ్రంగా లేకపోతే అక్కడి బ్యాక్టీరియా గుండెకు పాకి, గుండెజబ్బులు వచ్చేందుకు అవకాశం అధికం. ♦ గుండెజబ్బులున్నవారు గుండె ఆపరేషన్‌కు ముందుగా దంతాలకు సంబంధించిన వ్యాధులేమీ లేకుండా చూసుకోవాలి. లేదంటే ఆపరేషన్ విజయవంతం కాకపోవడానికి ఆస్కారం ఎక్కువ. ♦ షుగర్ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా దంతవైద్యులను సంప్రదించి, వారు సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే పళ్లు కదలడం, నోటిదుర్వాసన, చిగుర్ల ఇన్ఫెక్షన్, నోరు ఎండిపోవడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ♦ గర్భవతులకు హార్మోనల్ మార్పుల వల్ల చిగుర్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. వాటిని నివారించకపోతే గర్భవతితో పాటు కడుపులోని బిడ్డకూ హాని కలిగే అవకాశాలు ఎక్కువ. ♦ వృద్ధులకు వాళ్ల వయసు వల్లగానీ, తీసుకునే మందుల వల్లగానీ లాలాజలం ఉత్పత్తి తగ్గితే, చిగుళ్ల వాపు, పిప్పిపళ్లు వచ్చేందుకు ఆస్కారం ఎక్కువ. అందుకే వాళ్లు తరచూ దంతవైద్యులను సంప్రదించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ♦ పళ్లు లేనివారు వెంటనే లేని పళ్ల స్థానంలో కృత్రిమదంతాలను అమర్చుకోవాలి. లేకపోతే సరిగ్గా నమలలేకపోవడంతో జీర్ణకోశవ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువ. నోట్లో షార్ప్ టీత్ ఉంటే వాటి పదునును తగ్గించాలి. లేదంటే నాలుక లేదా బుగ్గ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ♦ క్యాన్సర్ కారకాలైన పొగతాగడం, వక్కపొడి, సున్నం కలిపి తినడం, పాన్‌పరాగ్ నమలడం మానేయాలి. లేదంటే నోటిక్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ♦ టీనేజ్ వయసు రాగానే కొందరు పిల్లలు ఇప్పటి ఫ్యాషన్స్‌లో భాగంగా నోటికి, పెదవులకు రింగులు వేయించడం (పియర్సింగ్) వంటివి చేస్తుంటారు. ఇలా చేయదలచినప్పుడు ముందుగా మీ డెంటిస్ట్‌ను సంప్రదించాలి. అది సురక్షితంగా ఎలా చేసుకోవచ్చో ఆయన సూచిస్తారు. అయితే అలాంటి పియర్సింగ్ ప్రక్రియలు చేయకుండా ఉండటమే మంచిది. ♦ టీనేజ్ పిల్లల్లో విపరీతంగా తిని అదంతా వాంతి చేసుకోవడం వంటి లక్షణాలుండే బులీమియా, బరువు పెరుగుతామనే భయంతో అసలు తినడమే ఇష్టపడకపోవడం ఉండే అనొరెక్సియా నర్వోజా వంటివి చాలా సాధారణం. ఈ రెండు సమస్యలూ పళ్లపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఈ సమస్యల వల్ల పళ్ల ఎనామిల్ దెబ్బతింటుంది. కేవలం అనామిల్ దెబ్బతింటే డెంటిస్టులు చికిత్స అందిస్తారు. అయితే ఆ రెండు మానసిక సమస్యలకు సైకియాట్రిక్ చికిత్సతో పాటు కాస్తంత స్వయం నియంత్రణ కూడా అవసరం. - డాక్టర్ ప్రత్యూష ,సీనియర్ డెంటల్ సర్జన్ ,కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ – యాసీన్ -
మా మంచి డాక్టర్లు ఎందరో!
న్యూఢిల్లీ: కాసుల కోసమే కార్పొరేట్ ఆస్పత్రులు పనిచేస్తున్న నేటి రోజుల్లో ప్రజల ఆరోగ్యం కోసం కంకణబద్దులై గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ డాక్టర్లు ఉండడం మన అదష్టం. ఎవరి ఆదేశం లేకుండానే స్వచ్ఛందంగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లూ ఉండడం ఇంకా విశేషం. 24 గంటలు వైద్య సేవలు కొనసాగించాల్సిన రంగంలో డాక్టర్లు రోజూ 16 గంటలపాటు, కొన్ని సార్లు ఏకబిగినా 34 గంటలపాటు వైద్య సేవలు అందిస్తున్న మహానుభావులు ఉన్నారు. జాతీయ డాక్టర్ల దినోత్సవమైన జూలై ఒకటవ తేదీన అలాంటి వారి గురించి స్మరించుకోవడం ఎంతైన సబబే. జాతీయ డాక్టర్ల దినోత్సవాన్ని ఒక్కో దేశంలో ఒక్కోరోజు జరపుకుంటారు. భారత దేశంలో జూలై ఒకటవ తేదీన జరపుకోవడానికి కారణం డాక్టర్ బిదాన్ చంద్ర రాయ్. ఆయన ప్రముఖ డాక్టరవడమే కాకుండా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన 1882 జూలై ఒకటవ తేదీన జన్మించారు. 1962, జూలై ఒకటవ తేదీన మరణించారు. ఒకతేదీన పుట్టి, ఒకే తేదీన మరణించిన డాక్టర్ రాయ్ గౌరవార్థం భారత దేశం ఈ రోజును జాతీయ దినోత్సవంగా జరుపుతోంది. ఒకప్పుడు మన దేశంతోపాటు పలు ప్రపంచ దేశాల్లో డాక్టర్ల దినోత్సవం సందర్భంగా డాక్టర్లకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలకేవారు. మధ్యాహ్నం వారి గౌరవార్థం విందు భోజనం ఏర్పాటు చేసేవారు. కొన్ని దేశాల్లో ఈ రోజును డాక్లర్ల సెలవుదినంగా పరిగణించేవారు. రోగులు పండగ చేసుకునేవారు. రానురాను ఈ రోజు ప్రాముఖ్యతను మరచిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సేవలు ఇప్పటికి కూడా పట్టణ ప్రాంతాలకే పరిమితం అవుతున్నాయి. ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియా’ విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం 80 శాతం ఆస్పత్రులు, 75 శాతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 80 శాతం వైద్యులు పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 72 శాతం ప్రజలు నివసిస్తుండగా, పట్టణ ప్రాంతాల్లో 28 శాతం మంది ప్రజలు నివసిస్తున్నారు. అంటే తక్కువ జనాభా ఉండే పట్టణాల్లోనే ఎక్కువ మంది డాక్టర్లు పనిచేస్తున్నారు. మొత్తం ప్రభుత్వ డాక్లర్లు లక్షకుపైగా ఉండగా, వారిలో 30 వేల మంది గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంత మంది డాక్టర్లు స్వచ్ఛందంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవకు తమ జీవితాలను అంకితం చేస్తున్నారు. అలాంటి వారిలో ముంబైకి చెందిన డాక్టర్ రవీంద్ర కోహ్లీ దంపతులు ఉన్నారు. ఆయన భార్య పేరు స్మితా కోహ్లీ. మారుమూల ప్రాంతమైన మహారాష్ట్రలోని భైరాగఢ్ వెళ్లి అక్కడ వైద్య సేవలు అందించానుకున్నారు. ఆ షరతు మీదనే నాగపూర్‌కు చెందిన డాక్టర్ స్మిత్‌ను పెళ్లి చేసుకున్నారు. దంపతులు ఆ ప్రాంతం ప్రజలకు వైద్య సేవలు అందించడంతోపాటు తన మిత్రుడైన వెటర్నరీ డాక్టర్ ద్వారా పశు వైద్యాన్ని కూడా నేర్చుకొని రైతులకు సేవ చేశారు. అంతేకాకుండా వ్యవసాయ పంటలు దెబ్బతినకుండా రసాయనాలు ఎలా వాడాలో తెలసుకొని రైతులకు సహకరించారు. ఒరిస్సాకు చెందిన డాక్టర్ అక్వినాస్ రిటైరైన తర్వాత, అంటే 61వ ఏట ఆదివాసులకు వైద్య సేవలు అందించేందుకు వారుండే అటవి ప్రాంతాలకు వెళ్లి అక్కడే స్థిరపడి వారికి వైద్య సేవలు అందించడం ప్రారంభించారు. పిల్లల కార్డియాక్ సర్జన్ డాక్టర్ గోపి, ఆయన భార్య డాక్టర్ హేమ ప్రియ ప్రభుత్వాస్పత్రుల్లో మంచి ఉద్యోగాలు వదిలిపెట్టి దక్షిణ తమిళనాడులోని మారుమూల పల్లెల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. పిల్లల గుండె శస్త్ర చికిత్సకు అవసరమైన డబ్బును సేకరించేందుకు ఆయన ఓ ట్రస్ట్‌ను కూడా ఏర్పాటుచేసి నడుపుతున్నారు. ఇలాంటి వారి ఎందరికో జాతీయ డాక్టర్ల దినోత్సవ శుభాకాంక్షలు. -
తెల్లకోటులో తడిగుండె!
సందర్భం: నేడు డాక్టర్స్ డే రెండు తనువులు ఒకటే కాలేయం కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీనివాస్, సంధ్య భార్యాభర్తలు. వాళ్లకు ఇద్దరు పిల్లలు. తొమ్మిదేళ్ల అబ్బాయి. నాలుగేళ్ల అమ్మాయి. ఇద్దరూ టీచర్లే. వేర్వేరు చోట్ల పోస్టింగ్. దాంతో పిల్లలు తల్లి దగ్గర ఉంటున్నారు. వీకెండ్లో, సెలవుల్లో అందరూ కలుస్తారు. అంతా హ్యాపీ. మూడు నెలల కిందట శ్రీనివాస్‌కు కామెర్లు వచ్చాయి. ఏదో నాటు మందు తీసుకోవడంతో ఒళ్లూ, కళ్లూ పచ్చగా మారాయి. కాలేయం పూర్తిగా దెబ్బతిని, పరిస్థితి విషమించింది. మరింత మంచి చికిత్స కోసం మే 25న మా దగ్గరికి తీసుకొచ్చారు. రోగి హెపాటిక్ కోమా అంచున ఉన్నాడు. వెంటనే వెంటిలేటర్‌పై పెట్టాం. అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ కండిషన్లో తక్షణం కాలేయ మార్పిడి జరగకపోతే మెదడు వాచిపోయి పూర్తిగా దెబ్బతింటుంది.ఎంతమాత్రమూ చక్కదిద్దలేని పరిస్థితి అది. కాలేయం కోసం వెతుకుతూ ఉండగా అదృష్టవశాత్తు భార్య సంధ్య కాలేయం శ్రీనివాస్‌కు సరిపడుతుందని తేలింది. భర్తను కాపాడుకోడానికి సంధ్య వెంటనే సన్నద్ధం అయ్యింది. ఆఘమేఘాల మీద ఆపరేషన్‌కు అంతా సిద్ధమైంది. ఆసుపత్రిలో భావోద్వేగ వాతావరణం. ఆ భార్యభర్తలకోసం, ఆ పిల్లల కోసం అంతా ప్రార్థిస్తున్నారు. మే 26 సాయంత్రం మేజర్ సర్జరీ. అన్ని సన్నద్ధాలు జరిగాయి. ఎన్నో విభాగాలకు చెందిన నిపుణులు, ఇతరత్రా వైద్య, వైద్యేతర సిబ్బంది ప్రాణరక్షణ యాగంలో నిమగ్నమయ్యారు. నా నేతృత్వంలో సర్జరీ జరిగింది. విజయవంతంగా ముగిసింది. బాగా కోలుకొని సంధ్య ముందుగా డిశ్చార్జ్ అయ్యారు. అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ చాలా సంక్లిష్టమైనది. హెచ్చరికలు లేకండా వచ్చేస్తుంది. చాలా కష్టమైనదీ, సంక్లిష్టమైనదీ, ఖర్చుతో కూడినది. అయితే శ్రీనివాస్ అదృష్టానికి, మా అందరి సమష్టికృషి తోడైంది. ఆపరేషన్ జరిగిన 13వ రోజున సరికొత్త జీవితంతో శ్రీనివాస్ మళ్లీ ఈ లోకంలోకి వచ్చారు. డాక్టర్ మనీశ్ సి. వర్మ, హెడ్ – లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అండ్ హెపాటోబిలియరీ పాంక్రియాటిక్ యూనిట్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్ కల్పన కంటే చిత్రమైనది వాస్తవం! ‘‘శశిధర్గారిని ఎమర్జన్సీకి తీసుకొచ్చారు సర్’’ ఒక రోజు రాత్రి పదకొండు గంటలకు భోజనం చేస్తుండగా వచ్చిన ఫోన్లో చెప్పాడు మా హాస్పిటల్ ఎమర్జెన్సీ డాక్టర్ ప్రసాద్. ‘‘ఛాతీలో నొప్పి. తీవ్రమైన హార్ట్ ఎటాక్. వెంటనే రండి’’ చెప్పాడు. భోజనం మధ్యలోనే ముగించి బయల్దేరాను. శశిధర్‌ను కాథ్ల్యాబ్కు తరలించమని మధ్యదారిలోనే సూచించాను. సిస్టర్స్, ఇతర టెక్నీషియన్స్‌ను తయారుగా ఉండేలా ఏర్పాటు చేశాను. మా కొలీగ్ డాక్టర్ ప్రేమ్‌చంద్‌ను కూడా నాతో రమ్మని కోరాను. సరిగ్గా పావుగంటలో ఆసుపత్రికి చేరుకున్నాను. శశిధర్‌కు వచ్చిన గుండెపోటు చాలా తీవ్రమైనది. అత్యవసరంగా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ చేసినా బతికే అవకాశాలు 25 శాతం మాత్రమే. శశిధర్గారి భార్య, ముగ్గురు కొడుకులు, కూతురూ ఆయనను కాపాడమని ప్రాధేయపడడంతో ఎలాగైనా ఆయనను బతికించాలని నేనూ, ప్రేమ్‌చంద్ రంగంలోకి ఉరికాం. యాంజియోగ్రామ్ చేసి గుండె రక్తనాళాల్లోని అడ్డంకిని గుర్తించాం. దాన్ని తొలగించే ప్రయత్నాలు మొదలుపెట్టాం. గంట పాటు క్యాథ్లాబ్లోని పరిస్థితి యుద్ధవాతావరణాన్ని తలపించింది. ఎట్టకేలకు శశిధర్ గుండె మళ్లీ కొట్టుకోవడం మొదలైంది. ఈలోగా పిడుగులాంటి ఓ వార్త. ‘‘ఇప్పుడే ల్యాబ్ నుంచి ఫోన్ సర్. శశిధర్‌కు హెచ్ఐవీ పాజిటివ్ అట’’. వణికిపోయాను. శశిధర్ ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో నాకూ, నా సహచరుడైన ప్రేమ్చంద్కూ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉండవచ్చు. శశిధర్ కుటుంబాన్ని పిలిచి పరిస్థితిని వివరించాను. ‘‘ఆసుపత్రికి రావడంలో పదినిమిషాలు ఆలస్యం చేసినా, ఆయన దక్కేవారు కాదు’’ అంటూ కొడుకుకు విషయం చెప్పాం. తండ్రి అంటే కొడుకుకు అవ్యాజమైన ప్రేమ. కానీ ఆ ప్రేమను ప్రాక్టీకాలిటీ కమ్మేసి ఆ కొడుకు అన్న మాటలు నా గుండెను నొక్కేశాయి. ‘‘సార్ పది నిమిషాలు ఆలస్యం అయితే మా నాన్న ప్రాణాలు దక్కేవి కావని మీరన్నారు. కానీ నాకిప్పుడనిపిస్తోందీ... ఆ పది నిమిషాలు ఆలస్యం ఎందుకు కాలేదా అని.’’ అంటూ రోదించాడు. అనంతమైన ప్రేమసముద్రం... ప్రాక్టికాలిటీ అనే సూర్యుడి వేడికి ఆవిరైపోతున్న దృశ్యం కనిపించింది. నాలుగోరోజున శశిధర్ కోలుకోవడం మొదలైంది. వారంరోజుల్లో డిశ్చార్జ్ చేశాం. నెల తర్వాత ఫాలో అప్‌కు వచ్చినప్పుడు ‘‘నా వాళ్ల కళ్లలో కనిపించే నిర్లిప్తత చూస్తే చనిపోవడమే మంచిదనిపిస్తోంది సర్’’ అన్నాడు. ఐసీయూలో మృత్యువుతో పోరాడిన శశిధర్‌లో ఇప్పుడు యుద్ధం ఓడిన సైనికుడు కనిపిస్తున్నాడు. మూడు నెలల తర్వాత నేనూ, నా కొలీగ్ ప్రేమ్‌చంద్ హెచ్ఐవీ టెస్ట్ చేయించాం. ఏమీ కాదని నమ్మకం ఉన్నా మనసులో మూలన ఏదో భయం. ఆ మర్నాడు రెండు వార్తలు నాకు తెలిశాయి. మొదటిది... నాకూ, ప్రేమ్‌చంద్‌కు హెచ్ఐవీ సోకలేదు. ఇక రెండోది... రక్తంలో షుగర్ తగ్గడంతో శశిధర్ మరణించారు. అవును... కొన్ని ఆత్మహత్యలకు రుజువు లుండవు. సమాజం చేసే హత్యలకు సాక్ష్యాలుండవు. డాక్టర్లూ రాగద్వేషాలకు, భయాలకు అతీతులు కారు. డాక్టర్ ఎమ్.ఎస్.ఎస్. ముఖర్జీ, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మాక్స్‌క్యూర్ హాస్పిటల్స్, మాదాపూర్ ఆపారమైన ఆ అమ్మ ప్రేమకు నా చికిత్స కాస్త తోడయ్యిందంతే!! చిన్నారి నాజ్మీన్ శోడియాల్కు జస్ట్ 14 ఏళ్లు. ఎక్కడో అస్సాం రాష్ట్రంలోని మారుమూల మధుబన్ అనే చిన్న పల్లెటూరు ఆమెది. ఆడీ పాడీ అలసీ సొలసీ సేదదీరుతూ ఆనందంగా గడపాల్సిన వయసాపాపది. కానీ కిడ్నీలు రెండూ చెడిపోవడంతో ఆమెకు ప్రాణగండం ఏర్పడింది. దాదాపు మరణం అంచున ఉన్న ఆ పాపను ఎలాగైనా రక్షించుకోవాలనుకున్నారు ఆమె తల్లిదండ్రులు. అక్కడ ఎవరో నా పేరు చెప్పారట. అంతే... అస్సాం నుంచి ఇక్కడికి వచ్చి నన్ను సంప్రదించారు. ఆమెకు మూత్రపిండం మాత్రమే ప్రాణగండం కాదు. తండ్రి ఖుఖాన్ శోడియల్ నెలసరి వేతనం కేవలం రూ. 12000. ఆపరేషన్‌కు కనీసం రూ. ఏడు లక్షలైనా కావాలి. ఇక రెండో అవసరం ఎవరైనా మూత్రపిండం ఇవ్వాలి. డబ్బు సమకూర్చడం కోసం అందరమూ ఎంతో కష్టపడ్డాం. దాతలు, వదాన్యులతో పాటు కేర్ ఫర్ యువర్‡ కిడ్నీ ఫౌండేషన్ (సీఎఫ్వైకేఎఫ్) చేయూత ఇచ్చింది. స్టార్ హాస్పిటల్స్ ఎన్నో రాయితీలు ఇచ్చి తన పూర్తి సహకారం అందించింది. అపార ప్రేమాస్పదమూర్తి అయిన తన అమ్మ హిరామణి మూత్రపిండాన్ని నవ్వుతూ ఇచ్చింది. గత ఏడాది ఆగష్టులో ఇక్కడికి వచ్చిన ఆ అమ్మాయికి అక్టోబరులో శస్త్రచికిత్స చేశాం. ఆపరేషన్ పూర్తయ్యింది. అదీ అందరి సహకారంతో, కేవలం మూడు లక్షల ఖర్చుతోనే. ఇప్పుడా చిన్నారి అందరు పిల్లల్లాగే ఆనందంగా స్కూల్‌కు వెళ్తోంది. ఆపరేషన్ పూర్తయ్యాక అద్భుతంగా తన చేత్తో అల్లిన ఊల్ శాల్ను నాకు బహూకరించిందా చిన్నారి. అంతటి మంచి కానుక నాకు ఇచ్చింది గానీ ఆమె ప్రాణాలు రక్షించడానికి ఆ తల్లి తన కూతురికి ఇచ్చిన వరంతో పోలిస్తేæ నేను చేసిన వైద్యం ఏపాటిది? – డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి, సీనియర్ నెఫ్రాలజిస్ట్, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ ఈ చిన్నారికి చేసిన ఆపరేషన్ చరిత్రలోనే తొలిసారి! ఈ లోకంలోకి వచ్చి అందమైన ఈ ప్రపంచాన్ని చూడాలని ఆ చిన్నారి ఎంతగా త్వరపడిందంటే తన ఊపిరితిత్తులు మాత్రమే కాదు... ముక్కురంధ్రాలు కూడా ఏర్పడకముందే ఆమె పుట్టేసింది. అందునా కేవలం 1100 గ్రాముల బరువుతో. అది కూడా అసలు వ్యవధి కంటే మూడు వారాల ముందుగా. ముక్కురంధ్రాలూ లేని ఈ కండిషన్‌ను వైద్య పరిభాఫలో ‘కంజెనిటల్ కొయానల్ యాస్ట్రీషియా’ అంటారు. తక్షణం గాలి పీల్చుకోడానికి నోటిలో ఒక తాత్కాలిక మార్గం ఏర్పరచకపోతే వీళ్లు వెంటనే చనిపోతారు. ఆ మార్గాన్ని ఏర్పాటు చేసి, నోటి ద్వారా వెంటిలేటర్ అమర్చి మా దగ్గరికి తీసుకువచ్చారు. నిజానికి ఇదో ఛాలెంజ్. అంతకు మునుపు అప్పుడే పుట్టిన పిల్లలకు ముక్కురంధ్రాలు ఏర్పాటు చేశారు గానీ... ఇలా ప్రీ–మెచ్యుర్‌గా పుట్టిన బేబీకి ముక్కు రంధ్రాలు ఏర్పాటు చేయడం అన్నది నాకు తెలిసనంత వరకు వైద్య చరిత్రలోనే ఇది మొదటిసారి. అప్పటికే రెండు గర్భస్రావాల తర్వాత పుట్టిన చిన్నారి కావడంతో ఆ పాప చాలా అపురూపం. అలాంటి ప్రెషియస్ బేబీకి లంగ్స్ అభివృద్ధి చెందడానికి వారం టైమిచ్చాం. అసలు ఆపరేషన్ ముందుంది. కేవలం ఒక మిల్లీమీటరు వ్యాసం కలిగి ఉన్న స్కీటర్ అనే వజ్రపు డ్రిల్‌తో ఎండోస్కోపిక్ విధానంలో ముక్కు రంధ్రాలను నిర్మించాం. అవి వెంటనే మూసుకుపోకుండా స్టెంట్స్ ఏర్పాటు చేశాం. అలా ఆరువారాల టైమ్ ఇచ్చాం. అప్పటికి ముక్కు రంధ్రాలు మళ్లీ మూసుకుపోకుండా ఏర్పడ్డాయి. ఒక ఉచ్ఛ్వాస... ఆ చిన్నారి తనంతట తానే గాలి పీల్చుకుంది. మేం శ్వాసబిగబట్టుకున్నాం. నిశ్శా్వస... ఆమె మళ్లీ గాలి వదిలింది. హా... అంటూ హాయిగా నిట్టూరుస్తూ మేమూ ఆమెతో పాటు బిగబట్టిన ఊపిరి వదిలాం. ముక్కురంధ్రాలు ఏర్పాటు చేసిన చిన్నారితో డాక్టర్ విష్ణుస్వరూప్‌రెడ్డి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఈఎన్టీ, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ అంటుకట్టిన గుండె వికసించిన వేళ! అరుణ(24)ది కాకినాడ. గోపాలకృష్ణతో వివాహం తర్వాత ఆమె పూణేలో స్థిరపడ్డారు. కొడుకు కార్తీక్‌కు రెండున్నర ఏళ్లు. అందమైన కుటుంబం. అంతలోనే కల్లోలం. 2015లో సొంత ఊరికి వెళ్లినప్పుడు ఆమె అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. వైద్యపరీక్షలు చేసి ఆమెకు కార్డియోమయోపతి అని తేల్చారు. పూణే డాక్టర్ల సూచన మేరకు ఆమె మా హాస్పిటల్‌కు వచ్చారు. పరీక్షల్లో గుండె సామర్థ్యం కేవలం 15 శాతం మాత్రమేనని తేలింది. వెంటనే గుండెమార్పిడి శసచికిత్స చేస్తే తప్ప బతకదు. ఆ విషయం అరుణ భర్తకి చెప్పి జీవన్‌దాన్ సంస్థలో పేరు నమోదు చేయించుకొమ్మని సూచించాం. కిందటి ఏడాది జూన్ నెల అది. కొద్దిరోజుల్లోనే స్కూళ్లూ కాలేజీల ప్రారంభం. కాబట్టి బంధువులూ, స్నేహితులతో విహారయాత్రలకు ప్లాన్ చేసుకున్నాం. జూన్ 14న అరుణ ఆరోగ్యం మరోసారి విషమించింది. ఆమె మృత్యువుతో పోరాడుతోంది. అలాంటి సమయంలో మా వినోదాలూ, విహారాల కంటే పేషెంట్ ప్రాణాలే ముఖ్యమనుకున్నాం. మా సరదాలను వాయిదా వేసుకున్నాం. అప్పుడు ఒక వ్యక్తి దురదృష్టం అరుణ పాలిట అదృష్టమైంది. రోడ్డు ప్రమాదానికి గురైన ఒక వ్యక్తి బ్రెయిన్‌డెడ్ కావడంతో అరుణకు గుండె లభ్యమైంది. దాదాపు తొమ్మిదిగంటల కఠోర శ్రమతో కూడిన సర్జరీ చేశాం. అందరిలోనూ ఉత్కంఠ. ఎట్టకేలకు ఆపరేషన్ సక్సెస్. పదిరోజుల్లో అరుణ కోలుకొని ఇంటికి వెళ్లారు. భర్త, కొడుకుతో ఇప్పుడామె ఆనందంగా ఉన్నారు. ఆమె ఆనందం చూస్తే నాలోకి సర్జన్ పట్ల కించిత్ గర్వం.అకుంఠిత దీక్షతో పనిచేసే అద్భుతమైన నా టీమ్ పట్ల అపారమైన గౌరవం. కోలుకున్న అరుణతో డాక్టర్ పి.వి. నరేశ్‌కుమార్, సీనియర్ కార్డియోథొరాసిక్ అండ్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
తాగారు.. దొరికిపోయారు
డాక్టర్స్ డే రోజున ముగ్గురు డాక్టర్లపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు - కోర్టు వినూత్న శిక్ష రూ.2వేల చొప్పున జరిమానా, నిర్మల హృదయ్ భవన్లో రెండు రోజుల వైద్యసేవ విజయవాడ: డాక్టర్స్ డే రోజున ముగ్గురు డాక్టర్లకు కోర్టు వినూత్న శిక్ష విధించింది. మద్యం సేవించి కారు నడిపిన సదరు డాక్టర్లకు ఒక్కొక్కరికి రు.2వేల జరిమానా విధిస్తూ మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జేవీవీ సత్యనారాయణమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. అంతేకాదు.. ముగ్గురు డాక్టర్లూ.. రెండు రోజుల పాటు (శని, ఆదివారాల్లో) నగరంలోని నిర్మల హృదయ్ భవన్‌లోని వృద్ధులకు వైద్యం అందించాలని ఆదేశించింది. ఓ ప్రముఖ ఆస్పత్రి చైర్మన్, మరో రెండు ప్రముఖ ఆస్పత్రులకు చెందిన డాక్టర్లు మద్యం సేవించి కారు నడుపుతుండగా, నాల్గో ట్రాఫిక్ పోలీసులు గురు, శుక్రవారాల్లో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి పైవిధంగా వారికి జరిమానా విధించారు. -
మన తొలి డాక్టర్లు
నేడు డాక్టర్స్ డే కాయకల్ప చికిత్సల నాటి కాలం నుంచి నేడు కార్పొరేట్ చికిత్సలు పొందుతున్నాం. చిట్కా వైద్యాల కాలం నుంచి మోడరన్ మెడిసిన్ వైపు పురోగమిస్తున్నాం. ఆధునిక వైద్యం అందుబాటులోకి రాక ముందు మనకు వైద్యులే లేరా? బీసీనాటి కాలంలో భిషగ్వరులే లేరా? ఉన్నారు! అనాదిగా జరిగిన పరిశోధనలతో మన వైద్యశాస్త్రాన్ని పరిపుష్ఠం చేసిన మన పూర్వ ఆయుర్వేద డాక్టర్లలో కొందరి గురించి కొంత... వారు చెప్పిన అంశాల్లో నేటికీ పాటిస్తున్న వివరాల గురించి మరికొంత... చరకుడు మన భారతీయ వైద్యానికి మూలపురుషులుగా భావించే వారిలో చరకుడు ఒకరు. ఆయన జీవించిన కాలం క్రీస్తుపూర్వం రెండో శతాబ్దం. నిజానికి అంతకు ముందు నుంచీ వైద్యచికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. క్రీస్తుపూర్వం 10వ శతాబ్దంలోనే పునర్వస ఆత్రేయుడు మౌఖికంగా వైద్యచికిత్సల గురించి చెబుతూ ఉండగా అగ్నివేశుడు అనేక అంశాలను గ్రంథస్తం చేసినట్లు దాఖలాలు ఉన్నాయి. అయితే వాటిలోని చాలా విషయాలను క్రీ.పూ. రెండో శతాబ్దంలో చరకుడు సంస్కరించారు. ఆ తర్వాత దృఢబలుడు అనే వైద్యనిపుణుడు సైతం అందులోని అనేక విషయాలను సమీక్షిస్తూ మళ్లీ సంస్కరించారు. అయితే తొలినాటి చరకుడి పేరిటే ఆ వైద్యశాస్త్రమంతా చెలామణీ అయ్యేలా దృఢబలుడు గౌరవించాడు. దాంతో ఆ వైద్యగ్రంథమంతా ‘చరకసంహిత’గానే ప్రఖ్యాతి పొందింది. అనేక వైద్యశాఖలకు చెందిన విషయాలను ఒకే చోట చెప్పారు కాబట్టే వాటిని ‘సంహిత’గా ప్రస్తావించారు. చరక సంహితలో పేర్కొన్నవే అయినా ఆధునిక వైద్యం కూడా ఇప్పటికీ పాటిస్తున్న అంశాల్లో కొన్ని... * ఆమలకీ (ఉసిరికాయ) తింటే శతాయుష్షు కలుగుతుంది. రోగనిరోధక శక్తిని కలిగించే విటమిన్-సి పుష్కలంగా దొరికే స్వాభావికమైన పదార్థాలలో ఉసిరి చాలా ప్రధానం. అందుకే ఉసిరికాయతో వ్యాధులన్నీ దూరం. * ఆధునికభాషలో చెప్పాలంటే సంభోగశక్తి పెంచే మందులను ఆఫ్రోడెసియాక్స్ అంటారు. ఆయుర్వేదంలో దీనికి ఓ ప్రత్యేక శాస్త్రం ఉంది. దాని పేరే ‘వాజీకరణం’. ఇందులోని అనేక వైద్యచికిత్సలను ఆయుర్వేద వైద్యులు ఇప్పటికీ అనుసరిస్తున్నారు. ఉదాహరణకు పిప్పరీక్షీరం, యష్టిమధుచూర్ణం, శతావరిఘృతం. * పక్షవాతానికి ‘వస్తి’కర్మ అనే ప్రక్రియను ప్రయోగించి ఫలితాలు సాధించాడు చరకుడు. కషాయాలను శరీరంలోకి పంపే నిరూహవస్తి, ఔషధతైలాలతో చికిత్స చేసే అనువాసనవస్తి... ఈ రెండిటికీ మరో మూడు చికిత్సలు (వమన, విరేచన, నస్య) జోడించి... మొత్తం ఐదుగా కూర్చి వాటిని ‘పంచకర్మ’ చికిత్సలు అంటూ ఇప్పటికీ అనుసరిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు. * విషపదార్థాలను టాక్సిన్స్ అంటారన్న విషయం తెలిసిందే. అవే విషాలను ప్రమాదకరం కాని విధంగా చాలా కొద్ది మోతాదుల్లో తీసుకుంటే అమృతమవుతాయని చెప్పాడు చరకుడు. ఎన్నో వైద్య విధానాల్లో ఈ మార్గం ఇప్పటికీ అనుసరణీయం. వాగ్భటుడు చరక సుశ్రుత కాశ్యప సంహితల్లోని ముఖ్యాంశాలను సంక్షిప్తం చేసి, మరికొన్ని శాస్త్రాలను మిళితం చేసి సరళీకృతమైన సంస్కృతంలో అందించిన గ్రంథాలే... ‘అష్టాంగ సంగ్రహం’, ‘అష్టాంగ హృదయం’ . వీటిలో మొదటిదాన్ని రాసింది వృద్ధ వాగ్భటుడు. రెండోది రాసినవాడు లఘువాగ్భటుడు. వీటినే ‘వాగ్భట సంహిత’లని అంటారు. ఈ సంహితల్లో జ్వరాలను తగ్గించే ఎన్నో కష్టాలను పేర్కొన్నారు. త్రిదోషాల్లో ఒకటైన శ్లేషాన్ని (కఫం) అవలంబక, క్లేదక, బోధక, శ్లేషక, శ్లేష్మాలు అంటూ ఐదు రకాలుగా విభజించిన ప్రత్యేకత వీరిది. చరక, సుశ్రుత, వాగ్భటులను వృద్ధత్రయం అంటారు. సుశ్రుతుడు చరకసంహిత లాగే సుశ్రుతుడి పేరు పెట్టుకున్న అనేక వైద్యవిధానాలను పేర్కొన్న ఇది కూడా అనేకమంది వైద్యులు తమ పరిజ్ఞానాన్ని పొందుపరిచిన గ్రంథం. ఇందులో ఇద్దరు సుశ్రుతులున్నారు. ఒకరు వృద్ధ సుశ్రుతుడు. ఈయన ‘దివోదాస ధన్వంతరి’ అనే వైద్యుడి శిష్యుడు. వీరి కాలం సుమారు 10-15 బీసీ. వీరు రచించిన గ్రంథమే సుశ్రుతసంహిత. అయితే దీన్ని మరొక సుశ్రుతుడు (ఆయన కాలం క్రీ.శ. రెండో శతాబ్దం) సంస్కరించాడు. ఆ తర్వాత క్రీ.శ. ఐదో శతాబ్దంలో నాగార్జునుడు దీనికి ‘ఉత్తర తంత్రాన్ని’ చేర్చాడు. ఆధునిక వైద్యశాస్త్రంలో శస్త్రచికిత్సగా పేర్కొనే సర్జరీ ప్రక్రియను సుశ్రుత సంహితలో నిపుణులు పేర్కొన్నారు. శస్త్రచికిత్స చేసే ఎన్నో ఉపకరణాలనూ, శస్త్రాలనూ వారు వర్ణించారు. వారు పేర్కొన్నవీ... ఆధునిక శస్త్రచికిత్సల్లో ఉపకరించేవీ అయిన ఉపకరణాలు ఉదాహరణకు కొన్ని... జలోదర యంత్ర అంటే... అసైటిస్ కాన్యులా అర్ధధార శస్త్ర (స్కాల్పెల్) పూర్ణగర్భవతి మరణిస్తే, పొట్టలో కదలికలు కనిపిస్తే అప్పుడు ఉదరచ్ఛేదనం చేసి శిశువును వెలికి తీయవచ్చని ఆయుర్వేదం చెబుతుంది. ‘‘వస్తమార విపన్నాయాః కుక్షి ప్రస్పందతేయది, తక్షణాత్ జన్మకావే తత్పాటయిత్వా ఉద్ధరేత్ భిషక్’’ చికిత్సకు లొంగని కొన్ని పుండ్ల (దుష్టవ్రణాలు) విషయంలో జలగలను ప్రయోగించి సత్ఫలితాలను రాబట్టారు. మోడ్రన్ మెడిసిన్‌లో లీచ్ థెరపీ అని పేర్కొనే విధానం ఇది. భగందరవ్యాధి (ఫిస్టులా)కి క్షారసూత్ర ప్రక్రియ ద్వారా ఫలితం ఉంటుందని నిరూపించాడు. ఇప్పటికీ చాలామంది ఆధునిక శస్త్రకారులు సైతం ఈ ప్రక్రియను ప్రయోగిస్తున్నారు. మరి కొంతమంది కశ్యప కశ్యప సంహిత అని పేరొందిన వైద్యశాస్త్ర అంశాలను మరీచి కశ్యపుడు అనే నిపుణుడు బోధిస్తుండగా ‘వృద్ధజీవకుడు’ అనే ఆయన రాశారు. దీన్నే ‘వృద్ధజీవకతంత్రం’గా పేర్కొంటారు. దీన్నే కాశ్యపసంహిత అని కూడా అంటారు. ఈ సంహిత క్రీ.పూ. ఆరోశతాబ్దికి చెందింది. ఇక్కడ పేర్కొన్న కశ్యపుడితో బాటు చరిత్రలో ఇతర కశ్యపులూ ఉన్నారు. ఈ కశ్యపుల్లో ఒకరు ‘కౌమారభృత్య’ నిపుణుడు. అంటే ప్రసూతి చికిత్సలు, స్త్రీ సంబంధిత రోగాల ప్రత్యేక నిపుణుడు అని అర్థం. ‘కౌమరభృత్యం’ అంటే స్త్రీలకు, శిశువులకు చెందిన ప్రత్యేక విభాగాలకు చెందిన శాస్త్రపరిజ్ఞానం అన్నమాట. ఇందులో శిశువు శారీరక, మానసిక వికాస వివరాలు (గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మైల్‌స్టోన్స్) ఉన్నాయి. గర్భణీ పరిచర్యలనూ (యాంటీనేటల్ కేర్) వివరించారు. ఆధునిక కాలంలో ఇమ్యూనైజేషన్‌ను పోలిన కొన్ని ప్రక్రియలనూ ఈ విభాగంలో వివరించారు. ఇక వృద్ధత్రయం లాగే లఘుత్రయంలోనూ ముగ్గురు వైద్యనిపుణులున్నారు. వారు క్రీ.శ. ఏడో శతాబ్దానికి చెందిన మాధవకరుడు, పదమూడో శతాబ్దానికి చెందిన శారంగధరుడు, పదహారో శతాబ్దానికి చెందిన భావమిశ్రుడు. మాధవకరుడు ఈయన మాధవనిదానం అనే గ్రంథాన్ని రాశాడు. మాధవకరుడు ఆమవాత (రుమాటిక్ ఆర్థరైటిస్), అమ్లపిత్త (హైపర్ అసిడిటీ/ గ్యాస్ట్రైటిస్) పరిణామశూల (పెప్టిక్ అల్సర్స్) వ్యాధులు, వాటి చికిత్సలను విశదీకరించాడు. శారంగధరుడనే పండితుడు రాసిన గ్రంథానికి శారంగథర సంహిత అని పేరు. దీనికి కూడా మంచి ప్రామాణికత ఉంది. లఘుత్రయంలో శారంగధరుడు కూడా మంచి పేరు గడించాడు. సిద్ధనాగార్జునుడు వనాల నుంచి లభ్యమయ్యే ఔషధ ద్రవ్యాల చికిత్సలో ఉండే కష్టనష్టాలను అధిగమించడానికి మన తెలుగు రాష్ట్రాలలోని శ్రీశైలం ప్రాంతాలలో దొరికే ఖనిజధాతులను శుద్ధి చేసి, ఔషధాలుగా రూపొందించడానికి బాటలు వేశాడు. నిజానికి ఇది ఆయుర్వేదంలో విప్లవశకం. దీన్ని రసశాస్త్ర విప్లవంగా పేర్కొన్నవచ్చు. ‘రస’ అంటే ఇక్కడ పాదరసం. అలాగే రకరకాల ఔషధ నిర్మాణ పద్ధతులనూ (ఫార్మస్యూటికల్ మెథడ్స్) కూడా ప్రస్తావించాడు. ప్రతి మందుకూ మోతాదు (డోసేజ్) నిర్ణయించాడు. భావమిశ్రుడు ఆయుర్వేదంలో పచ్చిమిరపకాయను ప్రవేశపెట్టినది భావమిశ్రుడే. అంతవరకు కారానికి మిరియాలు (మరీచ) వాడటం మాత్రమే ఉండేది. ఫిరంగి రోగాన్ని (సిఫిలిస్)ను గుర్తించాడు. ఎన్నో విలువైన వైద్య పరిశోధనలలో పాలుపంచుకున్న మన పూర్వవైద్యులలో వీరు కొందరు మాత్రమే! ఆ కాలంలోనూ కొందరు కొన్ని ప్రత్యేక వైద్య విభాగాలలో సైతం నైపుణ్యం సాగించారు. ఉదాహరణకు చరకుడు కాయ చికిత్స (జనరల్ మెడిసిన్), సుశ్రుతుడు శల్యతంత్రం (జనరల్ సర్జరీ), కశ్యపుడు కౌమారభృత్య (శిశువైద్యం లేదా పీడియాట్రిక్స్) వంటి వాటిల్లో నైపుణ్యం సాగించారని ప్రతీతి. అయితే వారు వైద్యశాస్త్ర అంశాలన్నింటినీ ఒకే గ్రంథంగా ఒకేచోట కూర్చారు. దాంతో ఆ వైద్యశాస్త్ర గ్రంథాలు ప్రత్యేక విభాగాలుగా గాక... కూర్పు చేసిన పుస్తకాలను సూచించే విధంగా సంహితలు అని పేరొందాయి. - డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ -
డాక్టరుగారూ... బాగున్నారా?
డాక్టర్స్ డే: జూలై 1 జాతీయ వైద్యుల దినోత్సవం అందరి ప్రాణాలూ కాపాడటానికి అహరహం అలుపెరుగకుండా శ్రమిస్తారు వాళ్లు. అయినా వాళ్ల ప్రాణాలకు మాత్రం సుఖశాంతులు తక్కువే సమాజంలో గౌరవం సరే, దానికి వారు చెల్లించే మూల్యం... చిన్ని చిన్ని సరదాలు, కుటుంబంతో గడిపే కాలం. చిన్న పొరపాటు జరిగినా వైద్యులను నిందించే జనం... వైద్యుల సమస్యలను ఎన్నడైనా పట్టించుకుంటున్నారా..? అక్కడ వరద ఎగజిమ్ముతోంది... ఎక్కడ చూసినా నీరే... సుడులు తిరిగే ఆ నీళ్లలోకి లైఫ్‌బోట్ వేసుకొని వెళ్తున్నారు గజ ఈతగాళ్లు. చెట్టు కొమ్మలాంటి చిన్న ఆధారం కనిపిస్తే బయటకు వచ్చేయాలనుకునే చోటికి తమంతట తామే పూనుకొని వెళ్తున్నారు ఈ స్విమ్మర్స్. ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాళ్లను రక్షించడమే వాళ్ల ధ్యేయం. భయంకరమైన అగ్నిప్రమాదం... చుట్టూ ఎగసిపడే జ్వాలలు... అందరూ తప్పించు కోవడానికి వీలుంది. సెగ సోకితేనే ఒళ్లు కాలిపోయే ఉష్ణోగ్రత. అందరూ తప్పించుకోవడానికి చూస్తున్నారు. కానీ ఫైర్‌ఫైటర్స్ అలా చేయరు... చేయలేరు. ఈతగాళ్లు నీళ్ల ప్రవాహంలోకి వెళ్లినట్లే... అగ్నిజ్వాలలకు ఎదురెళ్తారు ఫైర్‌ఫైటర్స్. నీళ్లలోకి ఓ ఈతగాడు వెళ్లినట్లే... ఒళ్లు కాల్చేసే మంటల్లోకి ఫైర్‌ఫైటర్ దూకినట్లే... డాక్టర్లూ ఇన్ఫెక్షన్స్ ఉన్నచోటికి అనునిత్యం వెళ్తుంటారు. స్వైన్‌ఫ్లూ అనో, మరో వ్యాధి అనో ముట్టుకుంటేనే వ్యాధి అంటుకునే పరిస్థితి ఉన్నా రోగగ్రస్తులను చేతులు సాచి రక్షించుకుంటారు. ఒక్కపూట హాస్పిటల్‌కు వెళ్తేనే... ‘అమ్మో భరించలేం’ అనుకునే వారు ఆశ్చర్యపోయేలా ప్రతినిత్యం హాస్పిటల్స్‌లో రోగాలతో చెలగాటాలాడుతుంటారు. అక్కడ నీళ్లు మింగేసినవారూ, కరెంట్ తగిలి అగ్నిప్రమాదాలకు లోనైన వాళ్లూ, వ్యాధులకు గురైనవాళ్లూ ఉంటారు. కంటికి కనిపించనంత సూక్ష్మమైన వ్యాధికారక క్రిమికీటకాలను ఆశ్రయించి ఉన్నవారూ ఉంటారు. వరద నీటికో, అగ్నిజ్వాలలకో భయపడి మిగతా వాళ్లంతా వారి నుంచి దూరంగా వచ్చేస్తుంటారు. మరీ పలకరించాల్సి వచ్చే దగ్గరి బంధువులు సైతం దూరంగా వెళ్లిపోతూ, మరీ మాట్లాడాల్సి వస్తే కర్చీఫ్ అడ్డుపెట్టుకుంటారు. ధనమిచ్చినా దగ్గరిగా వెళ్లడానికి మనం ఇష్టపడని వాళ్ల దగ్గరికి తనంతట తనే వెళ్తుంటాడు ధన్వంతరి. మరేదైనా వృత్తిలో ఉన్నవారు సెలవులు తీసుకోవచ్చేమోగానీ డాక్టర్‌కు సెలవులు లేవు. సామాజిక గౌరవాలు ఎక్కువే అయినా ఒక్కోసారి వాటిని మించి అవమానాలనే పొందాల్సి రావచ్చు. ఇక కుటుంబ సమస్యలు అందరికీ ఉండేవాటి కంటే కాస్తంత ఎక్కువే. పిల్లాపాపలతో గడిపేందుకూ, కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని వెచ్చించేందుకు అవకాశాలూ ఒకింత తక్కువే. అందుకే... ‘మా అందరినీ కాపాడే మీ ఆరోగ్యం ఎలా ఉంది డాక్టర్..?’ అని ఒక్కసారైనా మనం అడిగి తీరాలి. తమ వ్యక్తిగత జీవితాన్ని విస్మరించుకొని సేవ చేసే వారందరినీ డాక్టర్స్ డే నాడు ప్రత్యేకంగా స్మరించుకోవాలి. అక్కడికి వెళ్లాలంటేనే చాలా మందికి బెరుకు. ఆ ప్రదేశం చూసొచ్చాక చాలా సేపు బెంగ. అదే ఆసుపత్రి. ఇప్పుడు చాలా ఆసుపత్రుల్లో మంచి పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూస్తున్నారుగానీ... ఒకప్పుడు అక్కడ మరీ భయవిహ్వలతలు రాజ్యమేలేవి. వేదనలూ రోదనలూ కనిపించేవి. రుగ్మతలు రాజ్యం చేసే చోట హానికారక సూక్ష్మజీవులూ తప్పదు. డాక్టర్లు వాటితోనే సహజీవనం చేస్తూ అవి తమకు అంటుకోకుండా చూసుకుంటూ... వ్యాధిగ్రస్తు లనూ వాటి బారి నుంచి కాపాడుతుంటారు. ప్రమాద అవకాశాలు ఎందుకుంటాయంటే... ఇటీవల అందుబాటులోకి వచ్చిన కొత్త కొత్త చికిత్స ప్రక్రియల్లో భాగంగా డాక్టర్లు రోజూ ఇంజెక్షన్లతో రోగుల శరీరంలోకి సూదులు పంపాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో డాక్టర్లు వాడే సర్జికల్ కత్తుల(స్కాల్పెల్స్) వంటి పరికరాలతో చిన్నవీ, పెద్దవీ గాట్లు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దాంతో రోగికి అటు కలుషితమైన సూదులు, కత్తుల కారణంగానూ, ఇటు వారి శరీరంపై పెట్టిన గాట్ల కారణంగానూ ఇన్ఫెక్షన్లు వచ్చే పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా రోగులు కోలుకోవడానికి డాక్టర్లు చేసే పనులే ఒక్కోసారి రోగులతో పాటు డాక్టర్లకూ ప్రమాదాన్ని తెచ్చిపెట్టవచ్చు. ఉదాహరణకు ఒక ఎయిడ్స్ రోగికి చేసిన ఇంజెక్షన్ డాక్టరుకు గానీ లేదా హెల్త్ కేర్ ప్రొవైడర్కుగానీ గుచ్చుకునే ప్రమాదాలు ఉండవచ్చు. ఇలాంటివి జరిగిన సందర్భాల్లో డాక్టర్లు ఆ జబ్బు తమకు వ్యాపించకుండా తామే ముందస్తు చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. అలాగే రోగిని పరీక్షించి, మరో రోగిని పరీక్షించే మధ్య సమయంలోనే ఆల్కహాల్ బే్‌స్డ్ హ్యాండ్‌వాష్‌లతో చేతులు శుభ్రం చేసుకోవడం, మంచి నాణ్యమైన గ్లౌవ్స్ వాడటం చేస్తుంటారు. శస్త్రచికిత్స చేసే సమయంలో ఇన్ఫెక్షన్లు సోకకుండా ప్రత్యేకమైన గౌన్స్ ధరిస్తుంటారు. అక్కడ ఉపయోగించే పాదరక్షలనూ స్టెరిలైజ్ చేసి ఉంచుతారు. ఆ ఉపకరణాలతో అపకారమే ఎక్కువ... రోగికి ఉపకారం చేసే ఉపకరణాల వల్ల కూడా ఒక్కోసారి డాక్టర్లకు ప్రమాదం కలుగుతుంది. రోగుల పరిస్థితిని మెరుగుపరచేందుకు డాక్టర్లు ఒక్కోసారి రోగి శరీరంలో లోపలి నుంచి కొన్ని ఉపకరణాలను అమర్చుతుంటారు. గుండెలోకి వేసే ఇంట్రా వ్యాస్కులర్, ఊపిరితిత్తుల్లోకి గాలిని పంపేందుకు ఉపయోగించే వెంటిలేటర్లు, మూత్రాశయంలోంచి మూత్రాన్ని పైప్ ద్వారా బయటకు తెచ్చేందుకు ఉపయోగించే యూరినరీ క్యాథెటర్ల వంటివి డాక్టర్లు వాడుతుంటారు. అవి కూడా ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. కుటుంబ సమస్యలు వృత్తిలోని సాధక బాధకాలను అవగాహన చేసుకోగలరనే ఉద్దేశంతో డాక్టర్లలో చాలామంది అదే వృత్తిలోని వారిని జీవిత భాగస్వామిగా ఎంచుకుంటారు. అయితే అదే వాళ్లకు సమస్యగా మారవచ్చు. ఇద్దరూ వృత్తిపరంగా బాగా బిజీ అయిపోయినప్పుడు వ్యక్తిగతంగా తమకు కేటాయించుకునే ‘నాణ్యమైన’ సమయం తగ్గుతుంది. జీవిత భాగస్వామి కంటే వృత్తి జీవితానికే ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంటుంది. దీనివల్ల ఇతరత్రా సమస్యలూ ఎదురుకావచ్చు. సాధారణంగా పిల్లల విషయంలో ఈ తరహా సమస్యలు ఎక్కువ. ఉదయం పదింటికి మొదలై, సాయంత్రం ఐదింటికి ముగిసే సాధారణ జీవనశైలి డాక్టర్ల దంపతులకు ఎప్పుడూ సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యం చేసుకోవాలనుకున్నా రోగులకు వచ్చే అత్యవసర పరిస్థితులు తమ కోసం, పిల్లల కోసం తగిన సమయాన్ని వెచ్చించలేని పరిస్థితులను వారికి కల్పిస్తుంటాయి. ఇవన్నీ వారికి ప్రతిబంధకంగా పరిణమించేవే. - యాసీన్ భారత్‌లో మెడికల్ కాలేజీలు 420 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 200 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 220 వీటిలో మొత్తం సీట్లు 52,765 రిజిస్టర్డ్ అల్లోపతిక్ వైద్యులు 9,38,861 డెంటల్ వైద్యులు 1,54,000 ఆయుష్ వైద్యులు 7,37,000 ‘హాయ్’ చెప్పే ఇన్ఫెక్షన్లు డాక్టర్లను ఇన్ఫెక్షన్లు నిత్యం పలకరిస్తుంటాయి. వారికి రోజూ ‘హాయ్’ చెబుతాయి. ఇది అతిశయోక్తి అనుకుంటే పొరబాటు. హాస్పిటల్స్‌లో రోగులు ఎప్పుడూ ఉంటారు. కాబట్టి వారిని ఆశ్రయించుకుని రోగకారక సూక్ష్మజీవులు ఉంటాయి. వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయి. ఇలా హాస్పిటల్స్‌లోనూ, ఐసీయూలలోనూ వచ్చే ఇన్ఫెక్షన్స్ను ఆసుపత్రుల సాంకేతిక పరిభాషలో ‘హెల్త్ కేర్ అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్స్’ (హాయ్) అంటారు. ఇక మరో రకమైన ‘హాయ్’ కూడా డాక్టర్లను పలకరిస్తుంది. ‘హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్సే ఆ మరో ‘హాయ్’. ఇలా తాము చికిత్స కోసం వచ్చిన జబ్బు వల్ల కాకుండా, హాస్పిటల్‌ను సందర్శించాక వచ్చే జబ్బును ‘హాయ్’ అంటారు. సాధారణంగా ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే ప్రతి 20 మంది రోగుల్లో ఒకరు ఆసుపత్రిలో మరో జబ్బుకు గురవుతారని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అధ్యయనంలో వెల్లడైంది. అంటే కాసేపు సందర్శన వల్లనో లేదా ఒక గంట కన్సల్టేషన్‌కు వచ్చినందువల్లనో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఇంతగా ఉందంటే మరి డాక్టర్లుకు ఉండదా? ఎందుకు ఉండదూ... వారూ మానవమాత్రులే కదా. అందుకే వాళ్లకూ ఈ ప్రమాదం ఉంటుంది. కాకపోతే వాళ్లే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కాబట్టి వృత్తిరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. తమ నుంచి భాగస్వామికీ... పిల్లలకూ ఇన్ఫెక్షన్ల ప్రమాదం రోగి నుంచి డాక్టర్లకే కాదు... వాళ్ల జీవిత భాగస్వామికీ, తాము ప్రేమగా చూసుకొనే తమ పిల్లలకూ వచ్చే ప్రమాదం ఉంది. అయినప్పటికీ ఇన్ఫెక్షన్ల ప్రమాదాల నుంచి అందరినీ రక్షించడానికి వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెడతారు గనుకనే డాక్టర్లు అంటే అందరికీ గౌరవం. సామాజికపరమైన ఇక్కట్లు డాక్టర్లు ఉత్సవాలు, ఫంక్షన్లు వంటి వేడుకలకు హాజరు కాలేకపోవడం చాలా సాధారణంగా కనిపించే అంశమే. ఒక్కోసారి తమ సొంత బిడ్డల పుట్టిన రోజు వేడుకలకు సైతం హాజరు కాలేని పరిస్థితులు వాళ్లలో చాలామందికి అనుభవమయ్యే విషయమే. దాంతో బంధువర్గాల్లో నిష్ఠురాలు మామూలే. స్నేహితులతో కులాసాగా గడపడం వైద్యవృత్తిలో గగనకుసుమమే. రోగులను నిత్యం విజిట్ చేసే వీరు ఏదైనా వేడుకల్లో విజిట్ చేయడం చాలా అరుదుగానే కనిపిస్తుంది. ఇక వృత్తిపరంగా కొనసాగే కాన్ఫరెన్స్‌లు మినహా వ్యక్తిగతంగా పర్యటనలూ తక్కువే. విదేశాలలో తిరిగినా అది తమ కాన్ఫరెన్సుల్లో భాగంగా కొనసాగే అవకాశాలే ఎక్కువ. అంతే తప్ప ఎప్పుడో గాని విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు దొరకవు. వృత్తిపరంగా అందరికంటే ఎక్కువ సామాజిక గౌరవం పొందే వీళ్లు... రోగులు మృతి చెందిన సమయంలో ఒక్కోసారి చేదు అనుభవాలను కూడా చవిచూడాల్సిన పరిస్థితి. అప్పటికే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న రోగులను రక్షించడానికి వీళ్లు శక్తివంచన లేకుండా పూనుకుంటారు. అలాంటి సమయాల్లో తమ వల్ల కాకపోయినా... రోగి మృతి చెందినప్పుడు చాలా సందర్భాల్లో వీరు నిందలు పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి సమయాలలో చాలా అరుదుగానైనా భౌతిక దాడులను ఎదుర్కొన్న సందర్భాలూ ఉంటాయి. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల ప్రకారం వైద్యులు,రోగుల నిష్పత్తి 1 : 1000 భారత్‌లో వైద్యులు,రోగుల నిష్పత్తి 1 : 1700 డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలను అందుకోవాలంటే... 4,00,000 2022 నాటికి భారత్‌కు అదనంగా కావలసిన వైద్యుల సంఖ్య దురభిప్రాయాలు వద్దు... చికిత్సకు దూరం కావద్దు... ఆయన వయసు 86 ఏళ్లు. నాందేడ్ నుంచి వచ్చారు. అన్నవాహిక క్యాన్సరు. ఆహారనాళం పూర్తిగా మూసుకుపోయింది. మేజర్ ఆపరేషన్ చేసి క్యాన్సర్ గడ్డ తొలగించాలంటే ప్రాణాలకు ముప్పు కూడా ఉండవచ్చు. కారణం ఆయన క్రానిక్ స్మోకర్. పైగా ఊపిరితిత్తులు బాగాలేవు. ఇలాంటి వాళ్లకు ఆపరేషన్ టైమ్‌లో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువే. అది రిస్క్‌తో కూడిన వ్యవహారం కాబట్టి సర్జరీ కాకుండా అన్నవాహికలోకి పైప్ వేసి, ఆహారం పంపించి రేడియేషన్ కూడా ఇద్దామని సూచించాం. ఆయన బాగా చదువుకున్న వ్యక్తి. ఆయన మాటలు చాలా అసెర్టివ్‌గా ఉన్నాయి. ‘‘ఎనభై ఆరేళ్ల జీవితాన్ని చూశా. అన్ని బాధ్యతలూ తీర్చుకున్నా. ఈ వయసులో కేవలం బతకడం కోసం పైప్ వేసి, దాని ద్వారా ఆహారం పంపడం ఎందుకు. బతికినన్నాళ్లూ తింటూ, తాగుతూ సంతోషంగా బతకాలి. ఒకవేళ క్యాన్సర్ సర్జరీ చేస్తుండగానే చనిపోయాననుకోండి. ఈ వయసులో హాయిగా చనిపోవడం కంటే ఏం కావాలి. ఒకవేళ బతికాననుకోండి. నాకు ఇష్టమైనట్లుగా తింటూ, తాగుతూ సుఖంగా ఉంటా. అందుకే పైప్ వేసి, దాని ద్వారా ఆహారం తీసుకోవడం వద్దు. రిస్క్ అయినా ఆపరేషన్ చేయండి’’ అన్నారు. దాంతో మేం చాలా జాగ్రత్తగా కీహోల్ సర్జరీ చేసి క్యాన్సర్ ఉన్న భాగాన్ని తొలగించాం. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. తనకు ఇష్టమైనవి తింటూ తాగుతూ హ్యాపీగా జీవిస్తున్నాడు. మొన్ననే ఫాలో అప్‌కు వచ్చి వెళ్లారు. వయసు పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. క్యాన్సర్ చికిత్సలు సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ మీద ఉన్న అనేక అపోహలతో చాలా మంది పెద్దవయసులో ఇలాంటి చికిత్సలు... తీసుకోవడానికి భయపడుతుంటారు. క్యాన్సర్ చికిత్సల్లో ఈ మధ్య వచ్చిన మార్పులతో పెద్దవయసులో కూడా చికిత్సలు తట్టుకునే అవకాశం ఉంది. అపోహలతో ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే చికిత్సలతో ప్రాణాలు కాపాడుకోవడం మేలు. - డాక్టర్ మోహన వంశీ, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమెగా హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ ఒక సర్జరీ... ఇద్దరి ప్రాణాలు కాపాడింది... సాధారణంగా బిడ్డను కనడం అంటేనే పునర్జన్మ. అలాంటిది 36 వారాల గర్భిణి ఉమాదేవి (25)కి గుండెలో సమస్య ఎదురైంది. గుండెలోని అతిపెద్ద రక్తనాళం (మహాధమని) బలహీనమైంది. ఒకరోజు ఛాతీలో నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. దగ్గర్లోని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అప్పుడు గుండె పరీక్షలు చేశారు. ఉమాదేవికి మార్ఫన్స్ సిండ్రోమ్ ఉందని తేలింది. వెంటనే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. పుట్టుకతోనే కొందరిలో ఈ వ్యాధి మొదలవుతుంది. గుండె నుంచి శరీర భాగాలకు మంచి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం బలహీనమవుతుంది. రక్తనాళంలో ఇంటిమా, మీడియా, అడ్వెంటీషియా అనే పొరలుంటాయి. రక్తప్రసరణ సరిగా చూసేందుకు ఇంటిమా తోడ్పడు తుంది. మీడియా, అడ్వెంటీషియా పొరలతో పాటు రక్తనాళం గోడల్లో ఉండే కొలాజెన్, ఎలాస్టిక్ ఫైబర్లు రక్తనాళానికి సపోర్ట్ చేస్తుంటాయి. రక్తం ఎక్కువ ఒత్తిడితో వెళ్తున్నప్పుడు అది బలంగా ఉండేందుకు దోహదపడతాయి. కొందరికి పుట్టుకతోనే కొలాజెన్ తక్కువగా ఉండి, అది క్రమంగా తగ్గుతూ పోవడం వల్ల రక్తనాళం బలహీనపడి, వాచిపోతుంది. దీన్నే అయోర్టికర్ డెసైక్షన్ లేదా మార్ఫన్స్ సిండ్రోమ్ అంటారు. ఈ సమస్యను అశ్రద్ధ చేస్తే రక్తనాళం చిట్లి రక్తం మొత్తం లీక్ అవుతుంది. అదే జరిగితే కొన్ని సెకండ్లలోనే రోగి మృతిచెందే అవకాశం ఉంది. దీనివల్ల అన్ని అవయవాలూ దెబ్బతిని మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌కి దారితీసే ప్రమాదం ఉంది. దీన్ని బెంటాల్స్ ప్రొసీజర్ అనే శస్త్రచికిత్స ద్వారా చక్కదిద్దాలి. కాబట్టి ఉమాదేవికి ఆ సర్జరీ అత్యవసరంగా చేయాలి. అదే ఆమె ప్రాణాలను కాపాడింది. ఒక ప్రాణాన్ని కాదు... ఇద్దరివి. ఆమె ప్రాణాన్ని, కడుపులోని ఆమె బిడ్డ ప్రాణాన్ని. ఆపరేషన్ సక్సెస్. తల్లీ బిడ్డా సేఫ్. - డాక్టర్ జి. రామసుబ్రమణ్యం, చీఫ్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిస్ సర్జన్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ ఛాన్స్ 1% - రిజల్ట్ 100% ఆరోజు జనవరి 21... ఆదివారం. మా కుటుంబం అంతా వైజాగ్‌కు బయల్దేరింది. కుటుంబ సభ్యులంతా హ్యాపీ. సరిగ్గా బోర్డింగ్ పాస్‌లు తీసుకొని ఫ్లైట్ ఎక్కడానికి ముందుగా నాకు ఫోన్. అదీ హాస్పిటల్ నుంచి. పేషెంట్ హార్ట్ ఫెయిల్యూర్ స్థితిలో ఎమర్జెన్సీకి వచ్చారనీ, అర్జెంటుగా రమ్మని ఆ కాల్ సారాంశం. అంతే! ప్రయాణం కట్టిపెట్టి... బాబు, పాపలను సముదాయించి, నా భార్యకు విషయం చెప్పి హాస్పిటల్‌కు ప్రయాణం కట్టాను. నేను బయల్దేరే సమయంలోనే నా కొలీగ్ డాక్టర్ ఆర్ముగంకూ ఫోన్ చేశా. అతడూ భార్యాపిల్లలతో నగరం శివార్లలోని ఏదో రిసార్ట్‌లో హాలీడే ప్లాన్ చేసుకున్నాడు. నాలాగే అతడూ తన హాలీడేకు ఫుల్స్టాప్ పెట్టి బయల్దేరాడు. మేమిద్దరమూ ఇలా ఆగమేఘాల మీద ఆసుపత్రికి రావడానికి కారణం... 59 ఏళ్ల పేషెంట్. జనవరిలోనే ఒకసారి గుండెపోటు వచ్చింది. పదిరోజుల్లోనే మళ్లీ హార్ట్ ఎటాక్. హాస్పిటల్‌కు వచ్చే సమయానికి గుండె దాదాపు ఆగిపోయింది. ఎమర్జెన్సీ టీమ్ పేషెంట్‌కు ముందుగా ‘డీసీ షాక్స్’ ఇచ్చారు. గుండె స్పందనలు మొదలయ్యాయి. వెంటనే లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్‌తో వెంటిలేటర్‌పై ఉంచారు. పేషెంట్ బతికేందుకు ఒక్క శాతమే ఛాన్స్ ఉంది. ఆలస్యం చేయకుండా ‘ఎండార్ట్ ఇరెక్టొమీ విత్ లెఫ్ట్ వెంట్రిక్యులార్ రిపేర్’ అనే సంక్లిష్టమైన సర్జరీకి పూనుకున్నాం. ఏడెనిమిది గంటలు సాగిన ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. వారం రోజుల తర్వాత పేషెంట్ కోలుకున్నాడు. మరో రెండు రోజుల తర్వాత లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్, వెంటిలేటర్ తొలగించాం. పేషెంట్ పూర్తిగా కోలుకొని మమ్మల్ని కళ్లతోనే ఆత్మీయంగా పలకరించాడు. కుటుంబాలతో హాలీడేని ఎంత ఎంజాయ్ చేసేవాళ్లమో తెలియదుగానీ... పేషెంట్‌కు మా బృందం ఇచ్చిన పునర్జన్మ మాకు అంతకంటే ఎక్కువ ఆనందాన్నిచ్చిందని నమ్మకంగా చెప్పగలం. - డాక్టర్ పి.వి.నరేష్ కుమార్, కార్డియో థొరాసిక్, హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ మానసికమైన ఒత్తిళ్లూ ఎక్కువే... డాక్టర్ల వృత్తిగతమైన జీవితాల్లో మానసిక ఒత్తిళ్లూ చాలా ఎక్కువ. అవతలి వారి ప్రాణాలతో వ్యవహరించాల్సి రావడం వల్ల మిగతా వృత్తుల్లో కంటే వైద్యవృత్తిలో ఈ మానసిక ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుంది. ‘ఆ... ఈ జీవితం ఇలా తగలడిపోయింది’ అనడం సాధారణంగా వింటుంటాం. కానీ డాక్టర్ల జీవితాల్లో ఇలాంటి అభివ్యక్తికి నిజంగానే ‘బర్నవుట్’ అని పేరు పెట్టి అనేక అధ్యయనాలు నిర్వహించారు. కొన్ని దేశాల్లో డాక్టర్లపై ఈ అంశమై అనేక అధ్యయనాలు జరిగాయి. 2012లో యూఎస్‌లో నిర్వహించిన ఒక అధ్యయనంలో ప్రతి ఇద్దరు ఫిజీషియన్లలో ఒకరిపై వృత్తిగతమైన ఒత్తిడి ఎక్కువ అని తేలింది. ఇది ‘ఆర్కైవ్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్’ అనే జర్నల్‌లో నమోదైంది. ఇలాంటిదే మళ్లీ 2013లో నిర్వహించారు. దాదాపు 36 శాతం మంది ఫిజీషియన్లు బాధ్యతను భారంగా భావిస్తున్నారని 2,556 మంది డాక్టర్లపై నిర్వహించిన ఆ అధ్యయనంలో తేలింది. ఈ ఒత్తిడి 40 శాతం డాక్టర్లలో ఉంటుందని తాజా అధ్యయనాల్లో తేలింది. సాధారణంగా పిల్లలు స్కూల్ నుంచి కాలేజీకి చేరాక ఒకింత స్వేచ్ఛాజీవితం దొరికినట్లు భావిస్తుండటం మామూలే. అయితే వైద్యవిద్య అభ్యసించే వారికి మిగతా పిల్లలతో పోలిస్తే ఇలా స్వేచ్ఛాజీవితం లభించినట్లు భావించడం తక్కువేనని తేలింది. డాక్టర్స్ డే విషెస్ when there are tears, you are a shoulder when there is pain, you are a medicine when there is a tragedy, you are a hope happy doctor's day i want to say a big thanks for making me healthy and fit you are the best doctor i have ever known happy doctor's day may your days be wonderful and healthy like you make it for others. i want to thank you this doctor's day dawn of relief - obliging caring - tolerant omniscient -reasonable happy doctor's day అక్కడ వరద ఎగజిమ్ముతోంది... ఎక్కడ చూసినా నీరే... సుడులు తిరిగే ఆ నీళ్లలోకి లైఫ్‌బోట్ వేసుకొని వెళ్తున్నారు గజ ఈతగాళ్లు. చెట్టు కొమ్మలాంటి చిన్న ఆధారం కనిపిస్తే బయటకు వచ్చేయాలనుకునే చోటికి తమంతట తామే పూనుకొని వెళ్తున్నారు ఈ స్విమ్మర్స్. ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాళ్లను రక్షించడమే వాళ్ల ధ్యేయం. భయంకరమైన అగ్నిప్రమాదం... చుట్టూ ఎగసిపడే జ్వాలలు... అందరూ తప్పించు కోవడానికి వీలుంది. సెగ సోకితేనే ఒళ్లు కాలిపోయే ఉష్ణోగ్రత. అందరూ తప్పించుకోవడానికి చూస్తున్నారు. కానీ ఫైర్‌ఫైటర్స్ అలా చేయరు... చేయలేరు. ఈతగాళ్లు నీళ్ల ప్రవాహంలోకి వెళ్లినట్లే... అగ్నిజ్వాలలకు ఎదురెళ్తారు ఫైర్‌ఫైటర్స్. నీళ్లలోకి ఓ ఈతగాడు వెళ్లినట్లే... ఒళ్లు కాల్చేసే మంటల్లోకి ఫైర్‌ఫైటర్ దూకినట్లే... డాక్టర్లూ ఇన్ఫెక్షన్స్ ఉన్నచోటికి అనునిత్యం వెళ్తుంటారు. స్వైన్‌ఫ్లూ అనో, మరో వ్యాధి అనో ముట్టుకుంటేనే వ్యాధి అంటుకునే పరిస్థితి ఉన్నా రోగగ్రస్తులను చేతులు సాచి రక్షించుకుంటారు. ఒక్కపూట హాస్పిటల్‌కు వెళ్తేనే... ‘అమ్మో భరించలేం’ అనుకునే వారు ఆశ్చర్యపోయేలా ప్రతినిత్యం హాస్పిటల్స్‌లో రోగాలతో చెలగాటాలాడుతుంటారు. అక్కడ నీళ్లు మింగేసినవారూ, కరెంట్ తగిలి అగ్నిప్రమాదాలకు లోనైన వాళ్లూ, వ్యాధులకు గురైనవాళ్లూ ఉంటారు. కంటికి కనిపించనంత సూక్ష్మమైన వ్యాధికారక క్రిమికీటకాలను ఆశ్రయించి ఉన్నవారూ ఉంటారు. వరద నీటికో, అగ్నిజ్వాలలకో భయపడి మిగతా వాళ్లంతా వారి నుంచి దూరంగా వచ్చేస్తుంటారు. మరీ పలకరించాల్సి వచ్చే దగ్గరి బంధువులు సైతం దూరంగా వెళ్లిపోతూ, మరీ మాట్లాడాల్సి వస్తే కర్చీఫ్ అడ్డుపెట్టుకుంటారు. ధనమిచ్చినా దగ్గరిగా వెళ్లడానికి మనం ఇష్టపడని వాళ్ల దగ్గరికి తనంతట తనే వెళ్తుంటాడు ధన్వంతరి. మరేదైనా వృత్తిలో ఉన్నవారు సెలవులు తీసుకోవచ్చేమోగానీ డాక్టర్‌కు సెలవులు లేవు. సామాజిక గౌరవాలు ఎక్కువే అయినా ఒక్కోసారి వాటిని మించి అవమానాలనే పొందాల్సి రావచ్చు. ఇక కుటుంబ సమస్యలు అందరికీ ఉండేవాటి కంటే కాస్తంత ఎక్కువే. పిల్లాపాపలతో గడిపేందుకూ, కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని వెచ్చించేందుకు అవకాశాలూ ఒకింత తక్కువే. అందుకే... ‘మా అందరినీ కాపాడే మీ ఆరోగ్యం ఎలా ఉంది డాక్టర్..?’ అని ఒక్కసారైనా మనం అడిగి తీరాలి. తమ వ్యక్తిగత జీవితాన్ని విస్మరించుకొని సేవ చేసే వారందరినీ డాక్టర్స్ డే నాడు ప్రత్యేకంగా స్మరించుకోవాలి. అక్కడికి వెళ్లాలంటేనే చాలా మందికి బెరుకు. ఆ ప్రదేశం చూసొచ్చాక చాలా సేపు బెంగ. అదే ఆసుపత్రి. ఇప్పుడు చాలా ఆసుపత్రుల్లో మంచి పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూస్తున్నారుగానీ... ఒకప్పుడు అక్కడ మరీ భయవిహ్వలతలు రాజ్యమేలేవి. వేదనలూ రోదనలూ కనిపించేవి. రుగ్మతలు రాజ్యం చేసే చోట హానికారక సూక్ష్మజీవులూ తప్పదు. డాక్టర్లు వాటితోనే సహజీవనం చేస్తూ అవి తమకు అంటుకోకుండా చూసుకుంటూ... వ్యాధిగ్రస్తు లనూ వాటి బారి నుంచి కాపాడుతుంటారు. ప్రమాద అవకాశాలు ఎందుకుంటాయంటే... ఇటీవల అందుబాటులోకి వచ్చిన కొత్త కొత్త చికిత్స ప్రక్రియల్లో భాగంగా డాక్టర్లు రోజూ ఇంజెక్షన్లతో రోగుల శరీరంలోకి సూదులు పంపాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో డాక్టర్లు వాడే సర్జికల్ కత్తుల(స్కాల్పెల్స్) వంటి పరికరాలతో చిన్నవీ, పెద్దవీ గాట్లు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దాంతో రోగికి అటు కలుషితమైన సూదులు, కత్తుల కారణంగానూ, ఇటు వారి శరీరంపై పెట్టిన గాట్ల కారణంగానూ ఇన్ఫెక్షన్లు వచ్చే పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా రోగులు కోలుకోవడానికి డాక్టర్లు చేసే పనులే ఒక్కోసారి రోగులతో పాటు డాక్టర్లకూ ప్రమాదాన్ని తెచ్చిపెట్టవచ్చు. ఉదాహరణకు ఒక ఎయిడ్స్ రోగికి చేసిన ఇంజెక్షన్ డాక్టరుకు గానీ లేదా హెల్త్ కేర్ ప్రొవైడర్కుగానీ గుచ్చుకునే ప్రమాదాలు ఉండవచ్చు. ఇలాంటివి జరిగిన సందర్భాల్లో డాక్టర్లు ఆ జబ్బు తమకు వ్యాపించకుండా తామే ముందస్తు చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. అలాగే రోగిని పరీక్షించి, మరో రోగిని పరీక్షించే మధ్య సమయంలోనే ఆల్కహాల్ బే్‌స్డ్ హ్యాండ్‌వాష్‌లతో చేతులు శుభ్రం చేసుకోవడం, మంచి నాణ్యమైన గ్లౌవ్స్ వాడటం చేస్తుంటారు. శస్త్రచికిత్స చేసే సమయంలో ఇన్ఫెక్షన్లు సోకకుండా ప్రత్యేకమైన గౌన్స్ ధరిస్తుంటారు. అక్కడ ఉపయోగించే పాదరక్షలనూ స్టెరిలైజ్ చేసి ఉంచుతారు. ఆ ఉపకరణాలతో అపకారమే ఎక్కువ... రోగికి ఉపకారం చేసే ఉపకరణాల వల్ల కూడా ఒక్కోసారి డాక్టర్లకు ప్రమాదం కలుగుతుంది. రోగుల పరిస్థితిని మెరుగుపరచేందుకు డాక్టర్లు ఒక్కోసారి రోగి శరీరంలో లోపలి నుంచి కొన్ని ఉపకరణాలను అమర్చుతుంటారు. గుండెలోకి వేసే ఇంట్రా వ్యాస్కులర్, ఊపిరితిత్తుల్లోకి గాలిని పంపేందుకు ఉపయోగించే వెంటిలేటర్లు, మూత్రాశయంలోంచి మూత్రాన్ని పైప్ ద్వారా బయటకు తెచ్చేందుకు ఉపయోగించే యూరినరీ క్యాథెటర్ల వంటివి డాక్టర్లు వాడుతుంటారు. అవి కూడా ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. కుటుంబ సమస్యలు వృత్తిలోని సాధక బాధకాలను అవగాహన చేసుకోగలరనే ఉద్దేశంతో డాక్టర్లలో చాలామంది అదే వృత్తిలోని వారిని జీవిత భాగస్వామిగా ఎంచుకుంటారు. అయితే అదే వాళ్లకు సమస్యగా మారవచ్చు. ఇద్దరూ వృత్తిపరంగా బాగా బిజీ అయిపోయినప్పుడు వ్యక్తిగతంగా తమకు కేటాయించుకునే ‘నాణ్యమైన’ సమయం తగ్గుతుంది. జీవిత భాగస్వామి కంటే వృత్తి జీవితానికే ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంటుంది. దీనివల్ల ఇతరత్రా సమస్యలూ ఎదురుకావచ్చు. సాధారణంగా పిల్లల విషయంలో ఈ తరహా సమస్యలు ఎక్కువ. ఉదయం పదింటికి మొదలై, సాయంత్రం ఐదింటికి ముగిసే సాధారణ జీవనశైలి డాక్టర్ల దంపతులకు ఎప్పుడూ సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యం చేసుకోవాలనుకున్నా రోగులకు వచ్చే అత్యవసర పరిస్థితులు తమ కోసం, పిల్లల కోసం తగిన సమయాన్ని వెచ్చించలేని పరిస్థితులను వారికి కల్పిస్తుంటాయి. ఇవన్నీ వారికి ప్రతిబంధకంగా పరిణమించేవే. - యాసీన్ -
'అవయవ దానంపై అవగాహన అవసరం'
నల్గొండ: డాక్టర్స్ డే సందర్భంగా నల్గొండ జిల్లాలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం అవయవదానం పై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విక్రమ్ జిత్ దుగ్గల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అవయవదానం ప్రాధాన్యత గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. -
జూలై 1న గుండె వ్యాధులపై అవగాహన సదస్సు
మహబూబ్‌నగర్: డాక్టర్స్ డేను పురస్కరించుకొని మల్లిక ఆస్పత్రి, సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో జూలై 1వ తేదీన గుండె సమస్యలపై మహబూబ్‌నగర్‌లో ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని తమ ఆస్పత్రిలో సదస్సు సందర్భంగా ఉచిత అవగాహన, వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు మల్లిక ఆస్పత్రి ఎండీ డాక్టర్ జె.మహేష్‌బాబు తెలిపారు. గుండె వ్యాధి బాధితులకు ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ గుండె స్కానింగ్ చేయనున్నామన్నారు. ఈనెల 30వ తేదీలోగా ఉచిత అవగాహన సదస్సుకు హాజరు కావాలనుకునే వారు తమ పేర్లను 988545128, 9963471933 నంబర్లకు ఫోన్ చేసి, నమోదు చేసుకోవాలని కోరారు. -
Doctor's Day is Observed On ..?
1. Who was reappointed as the Deputy Governor of the Reserve Bank of India for a further period of two years with effect from 2014 July 4? 1) Harun Rashid Khan 2) Urjit Patel 3) R. Gandhi 4) Anand Sinha 5) K.C. Chakrabarthy 2. M.K. Narayanan resigned as the Governor of which of the following States in June 2014? 1) Chhattisgarh 2) West Bengal 3) Uttar Pradesh 4) Gujarat 5) Jharkhand 3. Which State has declared Camel as the State animal? 1) Gujarat 2) Himachal Pradesh 3) Rajasthan 4) Jammu and Kashmir 5) Haryana 4. Which of the following countries became the 160th member of the World Trade Organization (WTO) on 2014 June 26? 1) Russia 2) Tajikistan 3) Saudi Arabia 4) Yemen 5) Nepal 5. Which country reached its first-ever world cup quarterfinal in the FIFA World Cup in July 2014? 1) Brazil 2) Argentina 3) Germany 4) France 5) Colombia 6. Doctors' Day is observed on? 1) June 29 2) April 7 3) July 1 4) June 30 5) June 1 7. Who has been appointed as the head of Advisory Group for Int-egrated Development of Power, Coal and Renewable Energy? 1) Suresh Prabhu 2) Pratyush Sinha 3) Anil Baijal 4) Partha Bhattacharya 5) None of these 8. Facebook Chief Operating Officer (COO) met Prime Minister Narendra Modi on 2014 July 3. Name her? 1) Marissa Mayer 2) Indra Nooyi 3) Mary Barra 4) Sheryl Sandberg 5) Ginni Rometty 9. Who was appointed as the first female judge to the national sharia court of Pakistan which hears cases under the country's Islamic legislation? 1) Maryam Nawaz 2) Kashmala Tariq 3) Sumaira Malik 4) Ashraf Jehan 5) Hina Rabbani Khar 10. Classical singer Begum Parveen Sultana was awarded which of the following awards in 2014? 1) Padma Vibhushan 2) Padma Bhushan 3) Padma Sri 4) National Communal Harm-ony Award 5) None of these 11. Who has been appointed as the new chairman of the National Dairy Development Board (NDDB)? (He replaced Amrita Patel who held the post for 15 years) 1) Ashok Rajgopal 2) Narendra Kumar Pandey 3) T. Nanda Kumar 4) Rakesh Kumar 5) None of these 12. Who headed a Committee on Financial Benchmarks? 1) U.K. Sinha 2) R. Damodaran 3) C.B. Bhave 4) P.Vijaya Bhaskar 5) None of these 13. Agni IV was test fired from the Wheeler Island in Odisha on 2014 January 20. It has a range of? 1) 700 km 2) 2,000 km 3) 3,000 km 4) 4,000 km 5) 1,000 km 14. P.J.Nayak Committee was constituted by the Reserve Bank of India to? 1) Review governance of boards of banks 2) Revise and strengthen the monetary policy framework 3) Review financial inclusion 4) Review non performing assets 5) None of these 15. Datuk Seri Palanivel was the chief guest at the 12th edition of the Pravasi Bharatiya Divas held in New Delhi. He is the Minister of Natural Resources and Environment of which of the following countries? 1) Mauritius 2) Maldives 3) Singapore 4) Sri Lanka 5) Malaysia 16. Liaoning is the first aircraft carrier of? 1) China 2) Vietnam 3) UK 4) South Korea 5) North Korea 17. Which of the following was set up by the Government of India in February 1964 on the recommendations of the K. Santhanam Committee? 1) CBI 2) IB 3) RAW 4) NIA 5) CVC 18. The 18th National Youth Festival was held from 2014 January 12 to16 in? 1) Jaipur 2) Chandigarh 3) Ludhiana 4) Karnal 5) Lucknow 19. The Indian and Japan Coast Guard conducted a joint exercise off Kochi in January 2014. It is called? 1) INDRA 2) Malabar 3) Hand in Hand 4) Sahayog-Kaijin 5) None of these 20. Who has been appointed as the first woman Director of the Hyderabad based Sardar Vallabhbhai Patel National Police Academy (SVPNPA)? 1) Archana Ramasundaram 2) Letika Saran 3) B. Sandhya 4) Aruna Bahuguna 5) Soumya Mishra 21. Stanley Fischer is the vice chair of the United States Federal Reserve. He served as the Governor of which of the following countries' central banks from 2005 to 2013? 1) Zambia 2) Germany 3) Israel 4) France 5) United Kingdom 22. Pran Chopra passed away recently. He was an eminent? 1) Journalist 2) Social activist 3) Human rights activist 4) Film actor 5) Poet 23. Sakala scheme won the national award on e-governance in January 2014. Sakala scheme has been launched by? 1) Kerala 2) Karnataka 3) Maharashtra 4) Tamil Nadu 5) Goa 24. Which of the following books is written by Fatima Bhutto? 1) A Girl is a Half-Formed Thing 2) Finding Neema 3) A Cool, Dark Place 4) The Shadow of the Crescent Moon 5) Scandal Point 25. The Reserve Bank of India releases the Financial Stability Report (FSR) every? 1) Two months 2) Three months 3) Six months 4) One year 5) One month 26. Which of the following panels recommended that Reserve Bank of India should adopt the new consumer price index (CPI) for anchoring the monetary policy? 1) Usha Thorat 2) Bimal Jalan 3) K.C. Chakrabarty 4) Urjit Patel 5) None of these 27. Little Eye Labs, a Bangalore based software company, was acquired by? 1) Facebook 2) Google 3) Microsoft 4) Oracle 5) Amazon 28. Which of the following companies recently signed a memorandum of understanding (MOU) with the Institute of Rural Management-Anand (IRMA) for dairying? 1) IOC 2) OIL 3) BPCL 4) HPCL 5) None of these 29. Who is the chairman of the committee that was set up to review the Global Depository Receipts (GDRs) and Foreign Currency Convertible Bonds (FCCBs)? 1) G. Padmanabhan 2) S. Ravindran 3) Pratik Gupta 4) M.S. Sahoo 5) Ajay Shah 30. The International Civil Aviation Organization (ICAO) has set a deadline of which of the following dates for globally phasing out all non-Machine Readable Passports? 1) 2014 November 24 2) 2015 November 24 3) 2014 October 24 4) 2015 October 24 5) 2016 January 1 31. Nachiket Mor committee recommended raising priority sector lending cap for banks to 50 per cent from the current? 1) 25 per cent 2) 30 per cent 3) 40 per cent 4) 20 per cent 5) None of these 32. NABARD on 2014 January 10 reduced refinance rate for banks and other lending agencies by? (This is done to promote rural credit and rural infrastructure) 1) 0.10 percent 2) 0.20 percent 3) 0.25 percent 4) 0.30 percent 5) 0.50 percent 33. Which of the following is the capital city of Iraq? 1) Tehran 2) Mashad 3) Basra 4) Baghdad 5) Mosul 34. Who, among the following winners of Pravasi Bharatiya Samman for 2014, is the chancellor of University of Houston System, USA? 1) Kurian Varghese 2) Renu Khator 3) Ela Gandhi 4) Bikas Chandra Sanyal 5) None of these 35. Abdulla Yameen paid an official visit to India in January 2014. He is the President of? 1) Malaysia 2) Indonesia 3) Maldives 4) Afghanistan 5) None of these 36. Matthew McConaughey won the Golden Globe Award for which of the following films? 1) American Hustle 2) 12 Years a Slave 3) The Wolf of Wall Street 4) Dallas Buyers Club 5) Blue Jasmine 37. Among the following Padma Shri Award winners, who is the Chairperson and Chief Executive Officer of Tractors and Farm Equipment Limited (TAFE)? 1) Sabitri Chatterjee 2) Bansi Kaul 3) Supriya Devi 4) M. Subhadra Nair 5) Mallika Srinivasan 38. Which of the following is the sixth community to be granted minority status in January 2014? 1) Sikhs 2) Buddhists 3) Parsis 4) Jains 5) None of these 39. Which of the following is the currency of Afghanistan? 1) Dinar 2) Rufiyaa 3) Dirham 4) Rupiah 5) Afghani 40. Gorakhpur has the world's longest railway platform (1,355 meters). It is in? 1) West Bengal 2) Haryana 3) Odisha 4) Bihar 5) Uttar Pradesh KEY 1) 1 2) 2 3) 3 4) 4 5) 5 6) 3 7) 1 8) 4 9) 4 10) 2 11) 3 12) 4 13) 4 14) 1 15) 5 16) 1 17) 5 18) 3 19) 4 20) 4 21) 3 22) 1 23) 2 24) 4 25) 3 26) 4 27) 1 28) 2 29) 4 30) 2 31) 3 32) 2 33) 4 34) 2 35) 3 36) 4 37) 5 38) 4 39) 5 40) 5 -
జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాల
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకు రావడంతో పాటు పేదలకు ఉత్తమ వైద్య సేవలను అందించే క్రమంలో ప్రతి జిల్లాలోనూ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు వైద్య విద్యా శాఖ మంత్రి డాక్టర్ శరణ్ ప్రకాశ్ పాటిల్ తెలిపారు. వికాస సౌధలో బుధవారం ఏర్పాటు చేసిన వైద్యుల దినోత్సవాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. బెంగళూరు, రాయచూరు సహా ఆరు నగరాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ప్రారంభించాలనే యోచన కూడా ఉందన్నారు. కొందరు వైద్యులు రోగులను దోచుకుంటున్నారని, ఈ విధానాన్ని విడనాడాలని హితవు పలికారు. అనంతరం ప్రసంగించిన ఆరోగ్య శాఖ మంత్రి యూటీ. ఖాదర్ వైద్యులు తమ ముందుంచిన పలు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రైవేట్ ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆస్పత్రులే ఉత్తమ సేవలు అందిస్తున్నాయని కితాబునిచ్చారు. అందరికీ టెన్షనే... ఈ సందర్భంగా మంత్రి ఖాదర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తించాయి. ‘ప్రతి ఒక్కరికీ ఏదోక టెన్షన్ ఉంటుంది. మంత్రిగా నాకూ టెన్షన్ ఉంది. మా అధికారం తాత్కాలికం, మీ సేవలు శాశ్వతం’ అని వైద్యులనుద్దేశించి అన్నారు. ఆరోగ్య శాఖలో ఇప్పటికే అనేక పథకాలున్నాయని చెబుతూ, వాటిని పూర్తి చేసేంత వరకు వేరే పథకాలు వద్దని ముఖ్యమంత్రికి కూడా సూచించానని తెలిపారు. తొలుత ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సుల పోస్టులను భర్తీ చేయాల్సి ఉందన్నారు. వైద్యుల వేతనాలను పెంచాలని కూడా కోరానని వెల్లడించారు. ‘మంత్రి గోల్ కీపర్ మాదిరి. తొమ్మిది గోల్స్‌ను ఆపి, పదో గోల్‌ను వదిలేస్తే...అతనికి మూఢినట్లే. తొమ్మిది మంచి పనులను చేసిన మంత్రి పదో సందర్భంలో విఫలమైతే...అతని గ్రహచారం’ అని ముక్తాయింపునిచ్చారు. -
గుండెలు ఉన్నాయి... కానీ మార్చుకునేవారేరీ?
నేడు డాక్టర్స్ డే డాక్టర్ ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే, హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ అందరిలాగే డాక్టరీ చదివాం. అందరిలాగే ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ జీవితానికి అది సరిపోతుందా? లేదు. మనం ఓపెన్‌హార్ట్ సర్జరీ దగ్గరే ఆగిపోకూడదు. గుండెల్ని మార్చి మనుషుల్ని బతికించాలి. గుండెమార్పిడి నైపుణ్యంలో విదేశాలకు దీటుగా పరుగిడాలి. ఇదీ 1992 నుంచి నా కోరిక. అదే కల. అదే తపన. మేము ఒక బృందంగా ఏర్పడి గుండె మార్పిడి శస్త్రచికిత్సలు విరివిగా జరిగే ‘కొలంబియా ప్రెసిబిటేరియన్’కు శిక్షణ కోసం వెళ్లాం. అక్కడ ఎముకలు కొరికే చలి. మా దృఢసంకల్పపు పులి ముందు చలి గడగడా వణికింది. ఒక సన్మార్గపు ఉన్మాదం. ఒక ధ్యానం లాంటి అధ్యయనం. అక్కడి ప్రొటోకాల్స్ ఏకాగ్రతతో పరిశీలించాం. 2004 జనవరిలో అక్కడికి వెళ్లిన మేము ఫిబ్రవరి 2, 2004న తిరిగి వచ్చాం. నేను విదేశాలకు వెళ్లకమునుపు ఒక 32 ఏళ్ల యువకుడు నన్ను కలిశాడు. అప్పటికే అన్ని ఆసుపత్రులూ తిరిగాడట. గుండె పూర్తిగా విఫలమైంది. వైద్యపరిభాషలో చెప్పాలంటే రికరెంట్ హార్ట్ ఫెయిల్యుర్. బీపీ పూర్తిగా పడిపోయింది. కాళ్ల వాపులు. గుండెమార్పిడి తప్ప మరో ప్రత్యామ్నాయం లేని కేసు అది. 2004 ఫిబ్రవరి 6న కారు యాక్సిడెంట్లో జీవన్మృతుడిగా మారిన ఓ పాతికేళ్ల యువకుడి గురించి సమాచారం వచ్చింది. అప్పుడు మేము ఒక చిన్న వేడుక సందర్భంగా ఎవరో ఇస్తున్న విందులో ఉన్నాం. సమాచారం విన్న వెంటనే హుటాహుటిన బయలుదేరి ఆసుపత్రికి వచ్చాం. అప్పటికి నా వద్దకు వచ్చిన పేషెంట్ మరికొద్ది గంటల్లో చనిపోయే పరిస్థితి. అతడికీ, అతడి బంధువులకూ రిస్క్ గురించి వివరించాం. ‘నేనెలాగూ చికిత్స చేయకపోయినా చనిపోతాను. మీ మొట్టమొదటి కేసే అయినా ప్రయోగాత్మకంగా నాకు శస్త్రచికిత్స చేయండి’ అంటూ చెప్పాడతడు. అంతే! కారు ప్రమాదంలో చనిపోయిన ఓ యువకుడి గుండెను అప్పటికప్పుడు తీసుకొచ్చి అతడికి అమర్చాం. మొట్టమొదటిసారి గుండె మార్పిడి చేస్తున్నామన్న ఉద్వేగం ఒకవైపు. ఎంతో మంది నిపుణుల కళ్లు మా మీదే నిమగ్నమై ఉన్నాయన్న ఉద్విగ్నత ఒక వైపు. ఎట్టకేలకు ఆపరేషన్ విజయవంతమైంది. కొద్దిగంటల్లో తప్పక చనిపోవాల్సిన ఆ వ్యక్తి బతికాడు. గుండె మార్పిడి తర్వాత విజయవంతంగా ఐదేళ్ల పాటు తన జీవనాన్ని కొనసాగించాడు. అది నా తొలి కేసు కావడంతో అతడి ముగ్గురు పిల్లల్లో ఒక అబ్బాయి చదువుకు అవసరమైన సహాయాన్ని కూడా నేను అందించాను. అలాగే ఎంబీయే చదువుతున్న 23 ఏళ్ల మరో యువకుడి వృత్తాంతమూ ఆసక్తిగొలిపేదే. నడుస్తుంటే ఆయాసం. చేయని చికిత్సా లేదు. తిరగని ఆసుపత్రీ లేదు. ఒక దశలో బీపీ పూర్తిగా పడిపోయింది. వెంటిలేటర్‌పై పెట్టారు. అతడు చనిపోయాడని భావించి ఊరికి తీసుకెళ్లడానికి వాహనంలో తరలిస్తుండగా కొద్దిగా కదిలాడట. వెంటనే నాకు ఫోన్ చేశారు. తక్షణం దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లమని సలహా ఇచ్చాను. కొద్దిగా కోలుకోగానే నా దగ్గరికి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తూ గుండె దొరికి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేశాను. ఆ తర్వాత విజయవంతంగా అతడు ఎంబీయే పూర్తిచేసి, ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. ఇలా గుండె మార్పిడులు విజయవంతం అయ్యాక ఊపిరితిత్తుల మార్పిడికీ ప్రయత్నించా. పూణేకు చెందిన 40 ఏళ్ల మహిళ ఒకావిడ ముంబైలాంటి నగరాల్లోని ప్రఖ్యాతి చెందిన ఆసుపత్రులకు వెళ్లింది. అక్కడ ఆమెకు ఎవరో చెప్పారట. హైదరాబాద్‌లో గుండె, ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని. వారు నేరుగా ఇక్కడికి వచ్చారు. ‘‘మేము ఎన్నో చోట్ల తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నాం. ఏం చేసినా మీరే’’ అని నాతో అన్నారు. అప్పటికి ప్రతి రెండేళ్లకు ఓసారి నేను టెక్సస్‌లోని డీబేకీ సెంటర్‌కు వెళ్లి ట్రాన్స్‌ప్లాంట్స్ జరిగే ప్రక్రియలను పరిశీలిస్తూ ఉన్నాను. ఊపిరితిత్తుల మార్పిడి చేయడం నాకిదే మొదటిసారి. అయినప్పటికీ ప్రయత్నించా. నాతోపాటు ఒక బృందం బృందమంతా నాపై ఆపారమైన నమ్మకం ఉంచి కష్టపడ్డారు. దాదాపు 16, 17 గంటల పాటు అవిశ్రాంతంగా శ్రమించారు. ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. ఆమె కోలుకుంది. అవును... మనమిప్పుడు గర్వంగా చెప్పగలం. గుండె, ఊపిరితిత్తులు మార్చి అమర్చగల నైపుణ్యం మన సొంతమని. ఇప్పటికి నేను తొమ్మిది గుండె మార్పిడులు, మూడు ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలు చేశాను. ‘జీవన్‌దాన్’ అనే కార్యక్రమం ద్వారా నిమ్స్ వారు జీవన్మృతుల బంధువులను ప్రోత్సహిస్తూ, కౌన్సెలింగ్ చేస్తూ అవయవదానం కోసం చాలా కృషి చేస్తున్నారు. వారి కృషి ఫలించి గత ఏడాదిన్నర కాలంలో 60 మంది దాతల నుంచి అవయవాలు సేకరించారు. ఆ దాతలనుంచి సేకరించిన అవయవాల్లో 115 మూత్రపిండాలను వేర్వేరు వ్యక్తులకు అమర్చి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించగలిగాం. కానీ గుండె విషయానికి వస్తే కేవలం రెండింటిని మాత్రమే అమర్చగలిగాం. ఊపిరితిత్తులు మూడు మాత్రమే. కారణం... అవగాహన లోపం. గుండె పూర్తిగా విఫలమైన వారికి దాన్ని మార్చి కొత్త జీవితం ప్రసాదించడం సాధ్యమనే అవగాహన చాలామందిలో కొరవడింది. ఆ అవగాహన పెంచుకుంటే గత ఏడాదిన్నర వ్యవధిలో 60 మంది దాతల్లో చాలా మంది గుండెలు... వేర్వేరు శరీరాల్లో ఇప్పటికీ స్పందిస్తూ ఉండేవి. వారిని జీవింపజేస్తూ ఉంచేవి. ఆ అవగాహన పెరగాలన్నదే డాక్టర్స్ డే సందర్భంగా నా ఈ గుండెఘోష. అలా గుండెలు మార్చి, హృదయాలను అమర్చి మరింత మందిని బతికించాలన్నదే నా సంకల్పం. -
కడుపులోనే పరీక్షలూ...పుట్టగానే చికిత్సలు...!
నేడు డాక్టర్స్ డే డాక్టర్ తపన్ దాష్, డాక్టర్ కె. నాగేశ్వరరావు పీడియాట్రిక్ కార్డియోథొరాసిక్ సర్జన్స్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ ఆమె మార్కెట్ యార్డులో పనిచేసే ఒక సాధారణ వ్యక్తి భార్య. గర్భవతి. మెదక్ జిల్లా కొండాపూర్‌కు చెందిన అనూరాధ అనే ఆ మహిళ ఎప్పటిలాగే రొటీన్ చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చింది. డాక్టర్లు ఆమెను పరీక్షిస్తూ ఒక అసాధారణ అంశాన్ని గమనించారు. ఆమె కడుపులో ఉన్న పాప ‘హార్ట్ ఫెయిల్యూర్’తో చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది. ఎలాగైనా పెద్ద ప్రాణాన్నీ, కడుపులోని పసిపాపనూ... ఇద్దర్నీ రక్షించాలని నిర్ణయించుకున్నా డాక్టర్లు. పాప అనూరాధ గర్భంలో ఉండగానే ‘ఫీటల్ ఎకోకార్డియోగ్రఫీ’ అనే పరీక్ష నిర్వహించారు. ఆ పరీక్ష ఫలితం వచ్చింది. పాప ‘అబ్స్ట్రక్టివ్ ఇన్ఫ్రాడయాఫ్రమాటిక్ టోటల్ అనామలస్ పల్మనరీ వీనస్ డ్రయినేజ్’ (టీఏపీవీఆర్) అనే అత్యంత అరుదైన వ్యాధితో తీవ్రంగా బాధపడుతోంది. సాధారణంగా శుద్ధమైన రక్తం ఊపిరితిత్తుల్లో శుభ్రపడి అక్కడ్నుంచి గుండె తాలూకు ఎడమ ఏట్రియమ్‌కు చేరాలి. ఈ కండిషన్లో అది గుండె ఎడమ ఏట్రియమ్‌కు బదులు కాలేయానికి తన దిశ మార్చుకుంటుంది. దాంతో పాపకు ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది. పాప కడుపులో ఉన్నంతసేపు ఎలాగూ బతికేస్తుంది. కానీ పుట్టీ పుట్టగానే పాపలో తనదైన రక్తప్రసరణ వ్యవస్థ మొదలవుతుంది. అయితే ఈ ప్రక్రియలో శుద్ధమైన రక్తం గుండె ఎడమ ఏట్రియమ్‌కు చేరకుండా కాలేయానికి చేరితే శుద్ధమైన రక్తం అందని కారణంగా పాప పుట్టిన కొద్దిసేపట్లోనే చనిపోవచ్చు. అనూరాధకు 2014 జనవరి 4న సిజేరియన్ చేసి కడుపులోంచి పాపను బయటకు తీశారు డాక్టర్లు. ఉదయం గం. 6.45 నిమిషాలకు పుట్టిన పాపను వెంటనే వెంటిలేటర్‌పై ఉంచారు. పుట్టీపుట్టగానే చిన్నారిని అత్యవసరంగా ఆపరేషన్ థియేటరకు తరలించారు. ఉదయం 8.30కి మొదలైన సర్జరీ 11.30 కల్లా విజయవంతంగా ముగిసింది. గంటల పాపపై డాక్టర్ల శస్త్రచికిత్స సత్ఫలితాలిచ్చింది. రక్తనాళాల్లోని రక్తంతో పాటు... మృత్యువూ తన దారి మార్చుకుని, పాప నుంచి దూరంగా వెళ్లింది. ఈ సందర్భంగా తమకు తోడ్పడ్డ డాక్టర్ శ్రీనివాసమూర్తి, డాక్టర్ మాల్జిని, డాక్టర్ పల్లవి, డాక్టర్ విజయ... ఇతర సహాయక సిబ్బంది సేవలను స్మరించారు డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ తపన్దాష్.