domestic
-
వాహన పరిశ్రమ @ రూ. 20 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశీయ ఆటోమోటివ్ పరిశ్రమ టర్నోవర్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షల కోట్ల మార్కును దాటిందని వాహన తయారీదారుల సమాఖ్య సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ వెల్లడించారు. మొత్తం వస్తు, సేవల పన్నుల్లో (జీఎస్టీ) 14–15 శాతం వాటా ఆటో పరిశ్రమదే ఉంటోందని ఆయన చెప్పారు. అలాగే దేశీయంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా గణనీయంగా ఉపాధి కలి్పస్తోందని ఆటో విడిభాగాల సంస్థల సమాఖ్య ఏసీఎంఏ 64వ వార్షిక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తిలో పరిశ్రమ వాటా 6.8 శాతంగా ఉండగా ఇది మరింత పెరగగలదని వివరించారు. అంతర్జాతీయంగా భారతీయ ఆటో రంగం పరపతి పెరిగిందని అగర్వాల్ చెప్పారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే దిశగా దేశీయంగా ఉత్పత్తి చేయగలిగే 50 క్రిటికల్ విడిభాగాలను పరిశ్రమ గుర్తించిందని ఆయన వివరించారు. 100 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం: కేంద్ర మంత్రి గోయల్ భారతీయ వాహన సంస్థలు 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకోవాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఏసీఎంఏ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సూచించారు. ఇందులో భాగంగా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, స్థానికంగా ఉత్పత్తిని మరింతగా పెంచాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వాహన ఎగుమతులు 21.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. పరిశ్రమలకు ఉపయోగపడేలా ప్రభుత్వం 20 స్మార్ట్ ఇండస్ట్రియల్ నగరాలను అభివృద్ధి చేస్తోందని, వాహనాల విడిభాగాల పరిశ్రమ ఈ టౌన్íÙప్ల రూపంలో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని మంత్రి చెప్పారు. మరోవైపు, లోకలైజేషన్‌ను పెంచేందుకు సియామ్, ఏసీఎంఏ స్వచ్ఛందంగా లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు అగర్వాల్ పేర్కొన్నారు. -
లాంగ్ వీకెండ్.. ఎక్కువ మంది ఇక్కడికే..
స్వాతంత్య్ర దినోత్సవం, రక్షా బంధన్లను పురస్కరించుకుని లాంగ్ వీకెండ్ వచ్చింది. దీంతో వీటిని సద్వినియోగం చేసుకునేందుకు చాలా మంది వెకేషన్ ప్లాన్ చేసే పనిలో పడ్డారు. దగ్గరలో మంచి వెకేషన్ స్పాట్లు ఎక్కడ ఉన్నాయా అని శోధిస్తున్నారు.వెకేషన్ రెంటల్ సేవలు అందించే ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb) సంస్థ ప్రకారం.. స్వాతంత్య్ర దినోత్సవం, రక్షా బంధన్ సందర్భంగా వచ్చిన లాంగ్ వీకెండ్‌తో డొమెస్టిక్ వెకేషన్ స్టేల కోసం శోధనలు వార్షిక ప్రాతికదికన 340 శాతానికిపైగా పెరిగాయి. దేశంలో మంచి వెకేషన్ స్పాట్లు అందుబాటులో ఉండటంతో లాంగ్ వీకెండ్లలో వీటిని సందర్శించేందుకు భారతీయ పర్యాటకులలో పెరుగుతున్న ఆసక్తిని ఈ డేటా తెలియజేస్తోంది.ఎక్కువ మంది సెర్చ్ చేసిన ప్రాంతాలు ఇవే.. ఈ లాంగ్ వీకెండ్ సందర్భంగా ఎక్కువ మంది ఆసక్తి కనబరిచిన వెకేషన్ స్పాట్లను ఎయిర్‌బీఎన్‌బీ తెలియజేసింది. వాటిలో గోవా, లోనావాలా, పుదుచ్చేరి, ముంబై, బెంగళూరు, న్యూఢిల్లీ, ఉదయపూర్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఎయిర్‌బీఎన్‌బీ సెర్చ్ డేటా ప్రకారం చాలా మంది బీచ్‌లు ఉన్న ప్రాంతాలపై ఆసక్తి కనబరిచినట్లుగా తెలుస్తోంది. -
సెన్సెక్స్ @ 78,000
ముంబై: ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్స్ షేర్లు రాణించడంతో దేశీయ స్టాక్ సూచీలు మంగళవారం ఇంట్రాడే, ముగింపులోనూ జీవితకాల గరిష్ట స్థాయిలను నమోదు చేశాయి. సెన్సెక్స్ తొలిసారి 78 వేల మైలురాయిని అధిగమించింది. నిఫ్టీ ఈ ఏడాదిలో 34వ సారి సరికొత్త రికార్డును నెలకొల్పింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి.మిడ్‌సెషన్ నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో ఊహించని రీతిలో పుంజుకున్నాయి. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 823 పాయింట్లు ఎగసి 78,165 వద్ద ఆల్‌టైం హైని అందుకుంది. చివరికి 712 పాయింట్ల లాభంతో 78,054 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 216 పాయింట్లు బలపడి 23,754 వద్ద తాజా గరిష్టాన్ని నెలకొలి్పంది. ఆఖరికి 183 పాయింట్లు బలపడి 23,721 వద్ద నిలిచింది. రికార్డుల ర్యాలీలోనూ రియలీ్ట, విద్యుత్, వినిమయ, మెటల్, టెలికం షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. రికార్డుల ర్యాలీకి కారణాలు ⇒ కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం, సంస్కరణల కొనసాగింపుపై ఆశలు, అధికారం చేపట్టిన తొలి 100 రోజుల ప్రణాళికల అమలుపై మంత్రిత్వ శాఖలు దృష్టి సారించడంతో ట్రేడర్లు ఎఫ్అండ్ఓలపై బుల్లిష్ వైఖరి ప్రదర్శించారు. నిఫ్టీ జూలై సిరీస్ ఫ్యూచర్ కాంట్రాక్టుల్లోకి పొజిషన్లను రోలోవర్ చేసుకునేందుకు ట్రేడర్లు ఆసక్తి చూపుతున్నట్లు ఎఫ్అండ్ఓ గణాంకాలు సూచిస్తున్నాయి. ⇒ ఇటీవల ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లలో ర్యాలీ మందగించడంతో మంగళవారం సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన ప్రైవేటు రంగ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. యాక్సిస్ బ్యాంక్ 3.50%, ఐసీఐసీఐ బ్యాంక్ 2.50%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.32% కోటక్ బ్యాంక్ అరశాతం మేర రాణించాయి. అలాగే పీఎస్‌యూ ఎస్బీఐ బ్యాంకు షేరూ ఒకశాతానికి పైగా లాభపడింది. ⇒ మూడోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో విదేశీ ఇన్వెస్టర్లు ఇండెక్స్ ఫ్యూచర్లలో షార్ట్ పొజిషన్లను కవరింగ్ చేయడంతో పాటు క్రమంగా లాంగ్ పొజిషన్లను బిల్డ్ చేసుకున్నారు. గడచిన ఏడు ట్రేడింగ్ సెషన్లలో ఇండెక్స్ ఫ్యూచర్లలో నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఇండెక్సు ఫ్యూచర్లలో 59.08 శాతం లాంగ్ పొజిషన్లను కలిగి ఉన్నారు. ఇది గత రెండు నెలల్లో అత్యధికం. ⇒ గత ఆర్థిక సంవత్సరంలో జనవరి–మార్చి త్రైమాసికంలో మనదేశ కరెంట్ ఖాతా మిగులు 5.7 మిలియన్ డాలర్లుగా ఉందని, ఇది జీడీపీలో 0.6 శాతానికి సమానమని ఆర్బీఐ ప్రకటించింది. ఇది సానుకూల సంకేతం కావడంతో ఇన్వెస్టర్లు భారీ కొనుగోళ్లకు మొగ్గుచూపారు. అలాగే అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లపై స్పష్టత ఇచి్చన తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లలో పెట్టుబడులు పెంచవచ్చని, రూపాయి మారకంపై ఒత్తిడి తగ్గే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు సూచీలకు కలిసొచ్చాయి. స్టాన్లీ లైఫ్‌స్టైల్ ఐపీవో సక్సెస్ 96 రెట్లు అధిక స్పందనలగ్జరీ ఫరీ్నచర్ బ్రాండ్(కంపెనీ) స్టాన్లీ లైఫ్‌స్టైల్ పబ్లిక్ ఇష్యూకు భారీ స్పందన లభించింది. ఇష్యూ చివరి రోజు మంగళవారానికల్లా 96 రెట్లు సబ్‌్రస్కిప్షన్‌ను అందుకుంది. కంపెనీ 1.02 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. దాదాపు 98.57 కోట్ల షేర్లకు స్పందన లభించింది. రిటైల్ ఇన్వెస్టర్లు 18 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. షేరుకి రూ. 351–369 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 537 కోట్లు సమీకరించింది.⇒ అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ షేరు 19% పెరిగి రూ.1,647 వద్ద ముగిసింది. లిథియం అయాన్ సెల్స్ ఉత్పత్తి చేసేందుకు స్లొవేకియా సంస్థ జీఐబీ ఎనర్జీఎక్స్తో ఈ సంస్థ లైసెన్సింగ్ డీల్ కుదుర్చుకోవడం ఇందుకు కారణం.⇒ ప్రైవేటు రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు షేరు 2.5% పెరిగి రూ.1199 వద్ద స్థిరపడింది. దీంతో బ్యాంకు మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్ల (రూ.8.43 లక్షల కోట్లు) వద్ద ముగిసింది. -
విలీనాలు, కొనుగోళ్ల నేలచూపు
ముంబై: గడిచిన క్యాలండర్ ఏడాది(2023)లో విలీనాలు, కొనుగోళ్ల(ఎంఅండ్ఏ) లావాదేవీలు 51 శాతం క్షీణించాయి. 83.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్ల గణాంకాల సంస్థ ఎల్ఎస్ఈజీ డీల్స్ ఇంటెలిజెన్స్(గతంలో రెఫినిటివ్) వివరాల ప్రకారం గతేడాది డీల్స్ భారీగా నీరసించాయి. ప్రయివేట్ రంగ ఫైనాన్షియల్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ ద్వయం మధ్య నమోదైన భారీ డీల్ గణాంకాలకు కొంతమేర మద్దతిచ్చినట్లు ఎల్ఎస్ఈజీ నివేదిక తెలియజేసింది. నిజానికి 60.4 బిలియన్ డాలర్ల ఈ డీల్‌ను మినహాయిస్తే వార్షికంగా మరో 23 శాతం అదనపు క్షీణత నమోదయ్యేదని పేర్కొంది. 2023లో ప్రపంచవ్యాప్తంగా లావాదేవీల వాతావరణం మందగించడంతో భారీ డీల్స్ నీరసించినట్లు తెలియజేసింది. ఒకే ఒక్క డీల్ అంతక్రితం ఏడాది(2022)తో పోలిస్తే 3 బిలియన్ డాలర్లకు ఎగువన హెచ్డీఎఫ్సీ ద్వయం లావాదేవీ మాత్రమే నమోదైంది. 2022లో 5 భారీ డీల్స్‌కు తెరలేవగా.. పరిమాణంరీత్యా గతేడాది 1.7 శాతం క్షీణతే నమోదైనట్లు ఎల్ఎస్ఈజీ డీల్స్ సీనియర్ మేనేజర్ ఇలేన్ టాన్ పేర్కొన్నారు. వెరసి మధ్యస్థాయి మార్కెట్ లావాదేవీల హవా కొనసాగినట్లు తెలియజేశారు. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం భారీగా నీరసించడంతో వడ్డీ రేట్లు దిగివచ్చే వీలుంది. ఫలితంగా 2024లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేందుకు దారి ఏర్పడనుంది. తద్వారా చౌకగా పెట్టుబడులు సమకూర్చుకునేందుకు వీలు చిక్కనున్నట్లు టాన్ వివరించారు. ఈ నేపథ్యంలో దేశీయంగా సార్వత్రిక ఎన్నికల తదుపరి ఎంఅండ్ఏ డీల్స్ ఊపందుకునే అవకాశమున్నట్లు అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా సైతం ఈ ట్రెండ్‌కు వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. రష్యా–ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో 2022 మార్చిలో ఫండింగ్ వింటర్(పెట్టుబడులు తగ్గిపోవడం) ప్రారంభమైనట్లు తెలియజేశారు. అంతేకాకుండా అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి దీనికి కారణమైనట్లు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంఅండ్ఏ డీల్స్ 17 శాతం క్షీణించి దశాబ్ద కనిష్టం 2.9 ట్రిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈక్విటీలు జూమ్ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్ 60 శాతం ఎగసి 31.2 బిలియన్ డాలర్లమేర బలపడింది. 2021 తదుపరి వార్షికంగా గరిష్టస్థాయిలో నమోదైంది. ఫాలోఆన్ ఆఫర్లు రెట్టింపై 24.4 బిలియన్ డాలర్లను తాకాయి. మరోవైపు 1996 తదుపరి కొత్త ఈక్విటీ జారీ ఐపీవోలు 56 శాతం జంప్‌చేశాయి. కనీసం 236 ఎస్ఎంఈలు లిస్టింగ్ ద్వారా 6.8 బిలియన్ డాలర్లు అందుకున్నాయి. అయితే 2022తో పోలిస్తే ఇవి 11 శాతం తక్కువే! -
రూ. 2.18 లక్షల కోట్లు: విదేశీ ఇన్వెస్టర్లు తెగ కొనేస్తున్నారు
హైదరాబాద్: అంతర్జాతీయ పెట్టుబడిదారులకు స్థిరాస్తి రంగం హాట్‌కేక్‌లా మారింది. దీంతో దేశీయ స్థిరాస్తి రంగంలోకి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తు తున్నాయి. పెట్టుబడి లావాదేవీలలో పారదర్శకత, విధానపరమైన సంస్కరణలు, వ్యాపారాలకు ప్రోత్సాహం, పారిశ్రామిక రంగంలో సాంకేతికత వంటివి ఇన్వెస్టర్ల ఆకర్షణకు ప్రధాన కారణాలని కొలియర్స్ నివేదిక వెల్లడించింది. 2017-22 మధ్య కాలంలో దేశీయ స్థిరాస్తి రంగంలోకి 32.9 బిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులు వచ్చాయి. అదే 2011-16 మధ్య కాలంలో అయితే 25.8 బిలియన్ డాలర్లు వచ్చాయి. అయితే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో విదేశీ సంస్థాగత పెట్టుబడుల (ఎఫ్ఐఐ) వాటా 2017-22 మధ్య కాలంలో రూ.2.18 లక్షల కోట్లు (26.6 బిలియన్ డాలర్లు), కాగా.. 2011-16లో కేవలం 8.2 బిలియన్ డాలర్లు మాత్రమే. గత ఆరేళ్ల కాలంతో పోలిస్తే 2017-22లో విదేశీ సంస్థాగత పెట్టుబడులు మూడు రెట్లు అధికంగా వచ్చాయని కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఈ విదేశీ సంస్థాగత పెట్టుబడులలో 70 శాతం అమెరికా, కెనడా దేశాల నుంచే వచ్చా యి. యూఎస్ నుంచి 11.1 బిలియన్ డాల ర్లు, కెనడా నుంచి 7.5 బిలియన్ డాలర్లు, సింగపూర్ నుంచి 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. మన దేశంలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర కారణాలతో అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. -
కేంద్రం మరో కీలక నిర్ణయం: విండ్‌ఫాల్ ట్యాక్స్ కట్
దేశీయంగా క్రూడ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను భారీగా తగ్గించింది. అలాగే డీజిల్, ఎటిఎఫ్ ఎగుమతులకు చెక్ పెట్టేలా లెవీనీ కూడా పెంచింది. ముడి చమురు అమ్మకంపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని టన్నుకు రూ.6,700కి తగ్గించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.. ఇది సెప్టెంబర్ 2 నుండి అమలుల్లోఉంటుందని తెలిపింది. క్రూడ్ పెట్రోలియంపై సాడ్ టన్నుకు రూ.7100 నుంచి రూ.6700కి తగ్గుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.ఆగస్టు 14న జరిగిన సమీక్షలో ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై టన్నుకు రూ.7,100గా విండ్ ఫాల్ ట్యాక్స్ విధించింది. ( డయానాతో ప్రమాదంలో మరణించిన డోడి తండ్రి, బిజినెస్ టైకూన్ కన్నుమూత) డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై లెవీ పెంపు మరోవైపు డీజిల్ ఎగుమతిపై SAED లేదా సుంకం లీటరుకు రూ.5.50 నుండి రూ.6కి పెంచింది. జెట్ ఇంధనం లేదా ఏటీఎఫ్‌పై సుంకం లీటరుకు రూ.2 నుంచి రూ.4కు రెట్టింపు అవుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. పెట్రోలియం ఎగుమతులపై సుంకం ఏమీఉండదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రష్యా ఉక్రెయిన్‌పై దాడి తర్వాత ఉత్పత్తి కంపెనీలు భారీ లాభాల నేపథంయలో జూలై 1, 2022 నుండి స్థానికంగా ఉత్పత్తి చేయబడిన ముడి చమురు అమ్మకాలపై కేంద్రం మొదట విండ్‌ఫాల్ పన్నులను విధించింది. అంతేకాకుండా, దేశీయ మార్కెట్‌కు బదులుగా, ప్రైవేట్ రిఫైనర్లు మెరుగైన అంతర్జాతీయ ధరల మధ్య విదేశాల్లో ఎక్కువగా విక్రయిస్తున్నందున పెట్రోల్, డీజిల్ ,జెట్ ఇంధనాల ఎగుమతులపై అదనపు సుంకంవిధించిన సంగతి తెలిసిందే. (వర్క్ ఫ్రం హోం: అటు ఎక్కువ పని, ఇటు హ్యాపీలైఫ్ అంటున్న ఐటీ దిగ్గజం) -
ద్రవ్యోల్బణం, ఫెడ్ మినిట్స్‌పై ఫోకస్
ముంబై: దేశీయ ద్రవ్యోల్బణం డేటా, అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) సమావేశ నిర్ణయాల వివరాలు (మినిట్స్) ఈ వారం మార్కెట్‌కు దారిచూపొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. తుది దశకు చేరిన కార్పొరేట్ క్యూ1 ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం (రేపు) ఎక్సే్చంజీలకు సెలవు. ట్రేడింగ్ నాలుగు రోజులే కావడంతో మార్కెట్ వర్గాల పారి్టసిపేషన్ (భాగస్వామ్యం) స్వల్పంగా ఉంటుంది. కావున సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడొచ్చంటున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ మారకంలో రూపాయి విలువ క్రూడాయిల్ ధరలపై దృష్టి సారించే వీలుందంటున్నారు. దేశీయంగా ట్రేడింగ్‌ను పెద్దగా ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని అనిశ్చితి పరిస్థితుల దృష్ట్యా సూచీలు స్థిరీకరణ దిశగా సాగొచ్చు. అయితే ద్రవ్యోల్బణ డేటా విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే వీలుంది. సాంకేతికంగా నిఫ్టీకి దిగువు స్థాయిలో 19,300–19,100 శ్రేణిలో కీలక మద్దతు స్థాయిని ఉంది. కొనుగోళ్ల మద్దతు లభిస్తే ఎగువ స్థాయిలో 19,650–19,700 స్థాయిని పరీక్షించవచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యల్బోణ అంచనాలను 30 బేసిస్ పాయింట్లు పెంచడం, అదనపు ద్రవ్య లభ్యతను తగ్గించేందుకు ఇంక్రిమెంటల్ సీఆర్ఆర్(నగదు నిల్వల నిష్పత్తి)ను పదిశాతం పెంపు చర్యలతో గతవారంలో మార్కెట్ నష్టాలను చవిచూసింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ షేర్ల పతనంతో సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్లు, నిఫ్టీ 89 పాయింట్లు కోల్పోయాయి. ద్రవ్యోల్బణ డేటాపై దృష్టి ద్రవ్యోల్బణ ఆందోళనలు అధికమతున్న వేళ నేడు(సోమవారం) రిటైల్, టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ డేటా విడుదల కానుంది. వడ్డీరేట్లను ప్రభావితం చేసే ఈ గణాంకాలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనునున్నారు. టమోటాతో పాటు ఇతర కాయగూరల ధరలు పెరగడంతో ఈ జూలై సీపీఐ ద్రవ్యోల్బణం అర్బీఐ లక్షిత పరిధి ఆరు శాతాన్ని మించి 6.3%గా నమోదుకావచ్చని ఆరి్థకవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆర్బీఐ తన సమీక్ష సమావేశంలో ప్రస్తుత ఆరి్థక సంవత్సరానికి గానూ ద్రవ్యోల్బణ అంచనాను 5.1% నుంచి 5.4 శాతానికి పెంచింది. ఇదే రోజున టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలూ వెలువడనున్నాయి. ఫెడ్ రిజర్వ్ సమావేశ వివరాలపై కన్ను అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ జూలైలో నిర్వహించిన ద్రవ్య పాలసీ సమావేశ వివరాలు (ఫెడ్ మినిట్స్) బుధవారం విడుదల కానున్నాయి. ఈ ఏడాదిలో మరోసారి వడ్డీరేట్ల పెంపు సంకేతాలిచి్చన ఫెడ్ సమావేశ అంతర్గత నిర్ణయాలు, అవుట్‌లుక్ వివరాలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుంది. చివరి దశకు కార్పొరేట్ ఆరి్థక ఫలితాలు దేశీయ కార్పొరేట్ క్యూ1 ఫలితాల అంకం తుది దశకు చేరింది. ఐటీసీ, దివీస్ ల్యాబ్స్, వోడాఫోన్ ఐడియాలు నేడు (సోమవారం) తమ జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇదే వారంలో కేరియర్ పాయింట్స్, ఈజీ ట్రిప్ ప్లానర్స్, ఫ్యూచర్ కన్జూమర్, గ్లోబల్ స్పిరిట్స్, జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్, హిందుస్థాన్ కాపర్, జాగరణ్ ప్రాకాశన్, మేఘ్మణి ఆర్గానిక్స్, పీసీ జ్యూవెలరీ, వోకార్డ్ కంపెనీలు ఫలితాలను వెల్లడించే జాబితాలో ఉన్నాయి. మారుతున్న ఎఫ్ఐఐల వైఖరి ఈ ఆగస్టు తొలివారంలో నికర అమ్మకందారులుగా నిలిచిన విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి మారింది. గడిచిన వారంలో రూ.3,200 కోట్ల ఈక్విటీలను కొనుగోలు చేశారు. మొత్తంగా దేశీయ మార్కెట్లో ఈ ఆగస్టు 11 తేదీ నాటికి రూ.3,272 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టినట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. ‘‘ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని అనిశి్చతి, చైనా ఆరి్థక వ్యవస్థ మందగమన పరిస్థితులు మన మార్కెట్లో పెట్టుబడులకు ఉతమిస్తున్నాయి. అలాగే భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుండటం కలిసొస్తుంది’’ అని మారి్నంగ్‌స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. అంచనాలకు మించి నమోదైన జూన్ క్వార్టర్ ఫలితాలూ విదేశీ ఇన్వెస్టర్లకు విశ్వాసాన్నిచ్చాయనన్నారు. -
మళ్లీ ‘విండ్‌ఫాల్’ బాదుడు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను ప్రభుత్వం తిరిగి విధించింది. తాజా ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం... ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) వంటి కంపెనీలు ఉత్పత్తి చేసే ముడి చమురుపై టన్నుకు రూ.6,400 విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను విధించడం జరిగింది. బుధవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఏప్రిల్ 4న జరిగిన గత చివరి సమీక్షలో దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై విండ్‌ఫాల్ పన్నును పూర్తిగా (జీరో స్థాయి) తొలగించడం జరిగింది. అంతర్జాతీయ చమురు ధరలు బ్యారెల్‌కు 75 డాలర్లకంటే తక్కువకు పడిపోవడం దీని నేపథ్యం. అయితే ఉత్పత్తిదారుల ఒపెక్ గ్రూప్, రష్యా వంటి దాని మిత్రపక్షాలు అనూహ్యంగా ప్రకటించిన ఉత్పత్తి ‘కోత’ నిర్ణయంతో చమురు ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. దీనితో తిరిగి విండ్‌ఫాల్ ట్యాక్స్ విధిస్తూ, ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై జీరో.. కాగా, డీజిల్ ఎగుమతిపై విధించే లెవీని మాత్రం పూర్తిగా తొలగించింది. ఇప్పటి వరకూ లీటర్‌కు ఈ పన్ను 0.50గా అమలవుతోంది. విమాన ఇంధనం ఏటీఎఫ్ ఎగుమతులపై కూడా జీరో పన్ను విధానం కొనసాగుతోంది. భారత్ 2022 జూలై 1వ తేదీన విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. చమురు ఉత్పత్తిదారులు ప్రతి బ్యారెల్‌కు 75 డాలర్ల కంటే ఎక్కువ ధరను పొందే సందర్భంలో వారు పొందే విండ్‌ఫాల్ లాభాలపై ప్రభుత్వం పన్ను విధింపు దీని లక్ష్యం. తద్వారా అంతర్జాతీయంగా ధరలు పెరుగుదల వల్ల ఇంధన కంపెనీలకు అనూహ్యంగా వచ్చే భారీ లాభాలపై పన్ను విధిస్తున్న పలు దేశాల సరసన చేరింది. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రతి పదిహేను రోజులకు ఈ పన్ను మదింపు, నిర్ణయం జరుగుతోంది. అటువంటి లెవీ ప్రస్తుతం ఉన్న అన్ని ఇతర పన్నులకు అదనం. దేశీయ చమురు అన్వేషణకు విఘాతం కలుగుతుందని పేర్కొంటూ ఈ పన్నును రద్దు చేయాలని ఫిక్కీ వంటి పారిశ్రామిక సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ప్రొడక్టుల ఎగుమతులపై విధించిన ఈ ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం (ఎస్ఏఈడీ) వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఖజానాకు దాదాపు రూ.40,000 కోట్ల ఆదాయం లభించింది. దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ ద్వారా 2023–24లో దాదాపు రూ.15,000 కోట్ల ఆదాయం వస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేసింది. -
విమాన టికెట్లపై గో ఫస్ట్ అదిరిపోయే ఆఫర్: రేపటి వరకే ఛాన్స్
సాక్షి,ముంబై: దేశీయ విమానయాన సంస్థ గో ఫస్ట్ తగ్గింపు ధరల్లో విమాన టికెట్లను అందిస్తోంది. దేశీయ,అంతర్జాతీయ విమాన టికెట్ల ధరలపై ఆఫర్‌ను అందిస్తోంది. నేటి నుంచి రెండు రోజుల పాటు (ఫిబ్రవరి 23-24) విక్రయిస్తున్న ఈ స్పెషల్ సేల్‌లో దేశీయ విమాన టికెట్ల ధరలు రూ. 1,199 వద్ద, అంతర్జాతీయ విమానాల ఛార్జీలు రూ. 6,139 నుంచి ప్రారంభమవుతాయని గో ఫస్ట్ తెలిపింది. (ఇదీ చదవండి: ఐసీఐసీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్) సమ్మర్ ట్రావెల్ సీజన్‌కు ముందు బడ్జెట్ ధరల విమానయాన సంస్థ గో ఫస్ట్ ఫిబ్రవరి 23న రెండు రోజుల ధరల విక్రయాన్ని ప్రకటించింది. ఈ సేల్ ఫిబ్రవరి 24 వరకు కొనసాగుతుందని, ప్రయాణ కాలం మార్చి 12 నుంచి సెప్టెంబర్ 30, 2023 వరకు ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో కూడా ఇదే విధమైన ఆఫర్ ప్రకటించింది.ఇండిగో దేశీయ విమాన టిక్కెట్లను రూ. 2,093 (ప్రారంభ ధర) ఆఫర్ ప్రకటించిన రోజు తర్వాత గో ఫస్ట్ ప్రకటన వచ్చింది. ఇండిగో సేల్ ఫిబ్రవరి 25 వరకు కొనసాగనుంది. ఈ ఆఫర్లో బుక్ చేసుకున్న టికెట్లపై మార్చి 13 నుండి అక్టోబర్ 13, 2023 వరకు ప్రయాణించవచ్చు. (సుమారు 5 వేలమంది సీనియర్లకు షాకిచ్చిన ఈ కామర్స్ దిగ్గజం) కాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఫిబ్రవరి 20న విడుదల చేసిన డేటా ప్రకారం జనవరి 2023లో 125.42 లక్షల మంది ప్రయాణీకులతో దేశీయ విమానాల రాకపోకలు గత ఏడాది కాలంతో పోలిస్తే దాదాపు రెట్టింపయ్యాయి. డిసెంబరు 2022 నుండి 127.35 లక్షలతో పోలిస్తే 1.5 శాతం తక్కువగా ఉంది. అయితే విమాన ట్రాఫిక్ ఇప్పటికీ ప్రీ-కోవిడ్ స్థాయిల కంటే తక్కువగా ఉంది. జనవరి 2020లో దేశీయ విమానయాన సంస్థలు 127.83 లక్షల మంది ప్రయాణికులతో ప్రయాణించారు. (నెలకు రూ.4 లక్షలు: రెండేళ...కష్టపడితే, కోటి...కానీ..!) -
వృద్ధి బాటలో వాణిజ్య వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ వాణిజ్య వాహన విక్రయాలు 2023–24లో 9–11 శాతం వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ వెల్లడించింది. 6 శాతం ఆర్థిక వృద్ధి అంచనాలు, అలాగే మధ్య, భారీ వాణిజ్య వాహన విభాగంలో పెద్ద ఎత్తున విక్రయాలు పరిశ్రమను నడిపిస్తాయని తెలిపింది. ‘మౌలిక రంగానికి బడ్జెట్లో పెరిగిన కేటాయింపులు డిమాండ్‌కు మద్ధతు ఇస్తాయి. దేశీయ వాణిజ్య వాహన విపణిలో వృద్ధి నమోదు కానుండడం వరుసగా ఇది మూడవ ఆర్థిక సంవత్సరంగా నిలుస్తుంది. తేలికపాటి వాణిజ్య వాహన విభాగం 8–10 శాతం వృద్ధి ఆస్కారం ఉంది. ఇదే జరిగితే కోవిడ్ ముందస్తు 2019ని మించి అమ్మకాలు నమోదు కానున్నాయి. మధ్య, భారీ వాణిజ్య వాహనాలు 13–15 శాతం అధికం అయ్యే చాన్స్ ఉంది. ఈ విభాగం విక్రయాలు 2024–25లో కోవిడ్ ముందస్తు స్థాయికి చేరుకోనున్నాయి. 2021–22లో పరిశ్రమ 31 శాతం దూసుకెళ్లింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ వాణిజ్య వాహన రంగం 27 శాతం వృద్ధి నమోదు కావొచ్చు. కంపెనీల నిర్వహణ లాభాలు 2023–24లో నాలుగేళ్ల గరిష్టం 7–7.5 శాతానికి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5–6 శాతం పెరగవచ్చు’ అని క్రిసిల్ వివరించింది. -
2022లో.. 37.93 లక్షల ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు
ముంబై: దేశీయంగా 2022లో మొత్తం 37.93 లక్షల ప్యాసింజర్ వాహన విక్రయాలు జరిగాయి. 2021తో పోల్చితే 23% వృద్ధి నమోదైంది. మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్, స్కోడా ఇండియా కార్లు రికార్డు సేల్స్ నమోదు చేసుకున్నాయి. కరోనా ప్రేరేపిత సవాళ్లు, సెమీ కండక్టర్ల కొరత తగ్గడంతో కార్లకు, ముఖ్యంగా స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ)లకు గిరాకీ పెరిగింది. -
ప్లేస్ ఏదైనా, క్లాస్ ఏదైనా.. విస్తారా బంపర్ ఆఫర్ ఉందిగా!
సాక్షి, ముంబై: టాటా యాజమాన్యంలోని ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా ఎయిర్ లైన్స్ తమ ప్రయాణికులకు తక్కువ ధరల్లో విమాన టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశీయ, అంతర్జాతీయ నెట్‌వర్క్‌లో 4 రోజుల ఫెస్టివ్ సేల్‌ను ప్రకటించింది. ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్ అనే మూడు క్యాబిన్ తరగతులకు ఈ సేల్ ఛార్జీలపై తగ్గింపులను అందిస్తుంది. అక్టోబర్ 17, 2022 నుంచి అక్టోబర్ 20, 2022 వరకు జరిగే ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్లపై అక్టోబర్ 23, 2022 నుంచి మార్చి 31, 2023 వరకు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. దేశీయంగా అన్ని చార్జీలు కలుకుపుని 1499లకే విమాన టికెట్‌ను అందిస్తోంది. వన్-వేలో అన్నీ కలిపిన దేశీయ ఛార్జీలు ఎకానమీకి రూ. 1,499, ప్రీమియం ఎకానమీకి రూ. 2,999, బిజినెస్ క్లాస్‌కు రూ. 8,999 (సౌకర్యపు రుసుములు వర్తిస్తాయి) నుండి ప్రారంభమవుతాయి. ఇక అంతర్జాతీయ రూట్లలో, అన్నీ కలిపిన రిటర్న్ ఛార్జీలు ఎకానమీకి రూ. 14,149, ప్రీమియం ఎకానమీకి రూ. 18,499, బిజినెస్ క్లాస్‌కు రూ. 42,499 నుండి ప్రారంభం. ఇటీవలి కాలంలో విమాన ప్రయాణానికి డిమాండ్ పెరగడం చాలా ప్రోత్సాహకరంగా ఉందని, ఈ పండుగ సందర్భంగా తమ కస్టమర్లకు సంతోష కరమైన క్షణాలను ఎంజాయ్ చేసి, ఆ జ్ఞాపకాలను గుర్తుంచుకునేలా చేయడమే తమ లక్క్ష్యమని విస్తారా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ దీపక్ రజావత్ తెలిపారు. అత్యుత్తమ సేవలను అందించే ఎయిర్‌లైన్ విస్తారా కస్టమర్ల ఇష్టమైన ఎంపికగా కొనసాగుతుందనే విశ్వాసాన్ని ప్రకటించారు. Let your travel plans take flight with the Festive Sale! Enjoy discounted fares across different cabin classes on our international network. Book until 20-Oct-22 for travel between 23-Oct-22 and 31-Mar-23: https://t.co/rbWxAfgtNJ pic.twitter.com/Zs8ASBibng — Vistara (@airvistara) October 18, 2022 Travelling home for the festive season? Enjoy discounted fares across different cabin classes on our domestic network. Book now for travel between 23-Oct-22 and 31-Mar-23: https://t.co/rbWxAfgtNJ pic.twitter.com/oMhYkA5WQU — Vistara (@airvistara) October 17, 2022 -
ఆగస్ట్‌లో విమాన ప్రయాణికుల్లో వృద్ధి
న్యూఢిల్లీ: దేశీ విమాన ప్రయాణికుల రద్దీ ఆగస్ట్‌లో 5 శాతం పెరిగింది. 1.02 కోట్ల మంది విమాన సేవలను వినియోగించుకున్నట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ఆగస్ట్ నెలకు సంబంధించి ఈ రంగంపై ఒక నివేదికను గురువారం విడుదల చేసింది. జూలై నెలలో విమాన ప్రయాణికుల సంఖ్య 97 లక్షలతో పోలిస్తే 5 శాతం పెరిగినట్టు పేర్కొంది. ఇక 2021 ఆగస్ట్ నెల గణాంకాలతో పోల్చి చూస్తే 52 శాతం పెరిగినట్టు తెలిపింది. ఇక కరోనా ముందు సంవత్సరం 2019 ఆగస్ట్ నెల గణాంకాల కంటే 14 శాతం తక్కువే ఉన్నట్టు వివరించింది. విమాన సర్వీసులు పూర్తి సాధారణ స్థాయికి చేరుకోవడంతోపాటు, కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోయినందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల రద్దీ వేగంగా పుంజుకోవచ్చని ఇక్రా అంచనా వేసింది. భారత ఎయిర్‌లైన్స్ సంస్థలకు సంబంధించి విదేశీ ప్రయాణికుల సంఖ్య ఆగస్ట్‌లో 19.8 లక్షలుగా ఉందని, కరోనా ముందు నాటితో పోలిస్తే ఇది 32 శాతం అధికమని తెలిపింది. 2022 మొదటి ఐదు నెలల్లో దేశీ విమాన ప్రయాణికుల సంఖ్య 5.24 కోట్లుగా ఉంటుందని, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 131 శాతం అధికమని ఇక్రా పేర్కొంది. విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు పెరిగిపోవడంతో ఎయిర్‌లైన్స్ ఆదాయం రికవరీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిదానంగా ఉంటుందని అంచనా వేసింది. దీనికితోడు పరిశ్రమపై ద్రవ్యోల్బణ ప్రభావం సైతం ఉంటుందని పేర్కొంది. -
ఈక్విటీ మ్యచువల్ ఫండ్స్: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్ రివ్యూ
ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర అస్థిరతలు చూస్తున్నాం. భౌగోళిక ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పెరిగిపోయిన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికే సెంట్రల్ బ్యాంకులు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆర్బీఐ, ఫెడ్ సహా అన్ని ప్రముఖ సెంట్రల్ బ్యాంకులు రేట్ల పెంపు బాటలోనే దూకుడుగా వెళుతున్నాయి. కరోనా సమయంలో ఇచ్చిన ఉద్దీపనలను వెనక్కి తీసుకుంటున్నాయి. ఇవన్నీ ఈక్విటీలకు ప్రతికూలతలే. ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీ రేట్లను చురుగ్గా పెంచాల్సిందేనని, అవసరమైతే వృద్ధి రేటును కూడా త్యాగం చేయాల్సి రావచ్చని ఫెడ్ చైర్మన్ జీరోమ్ పావెల్ పేర్కొనడాన్ని గమనించాలి. కనుక సమీప భవిష్యత్తులో మార్కెట్లు అస్థిరతలను చూడనున్నాయి దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ తరహా ప్రతికూల పరిస్థితులు ఎంతో అనుకూలం. ఈ దశలో వ్యాల్యూ ఫండ్స్‌ను పరిశీలించడం మెరుగైన ఆప్షన్ అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విభాగంలో సుదీర్ఘ చరిత్ర ఉన్న ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్‌ను పరిశీలించొచ్చు. పెట్టుబడుల విధానం.. వడ్డీ రేట్లు పెరిగే తరుణం కనుక ఖరీదైన వ్యాల్యూషన్లతో ఉన్న స్టాక్స్‌లో పెట్టుబడి రిస్క్ అవుతుంది. ఈ తరుణంలో అంతర్గత విలువ కంటే తక్కువలో లభించే నాణ్యమైన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే వ్యాల్యూ ఫండ్స్‌ను ఆకర్షణీయంగా భావించొచ్చు. పెట్టుబడులకు ముందు ఆయా కంపెనీల పుస్తక విలువ, క్యాష్ ఫ్లో సామర్థ్యాలను ఫండ్ పరిశోధన బృందం చూస్తుంది. ఈ సామర్థ్యాల బలంతోనే ఈ పథకం వ్యాల్యూ విభాగంలో దీర్ఘకాలంగా ఇన్వెస్టర్ల పెట్టుబడులకు మంచి విలువను తెచ్చి పెడుతోంది. రాబడులు వ్యాల్యూ విభాగంలోనే అని కాదు, మొత్తం ఈక్విటీ మ్యచువల్ ఫండ్స్‌లోనే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్ పనితీరు ప్రమాణాలకు తగ్గకుండా ఉండడాన్ని ఇన్వెస్టర్లు గమనించొచ్చు. అదిపెద్ద వ్యాల్యూ ఫండ్ కూడా ఇదే. దీని నిర్వహణలో రూ.24,694 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడి 17 శాతంగా ఉంది. మూడేళ్లలో వార్షికంగా 24 శాతానికి పైనే పెట్టుబడులపై ప్రతిఫలాన్ని తెచ్చిపెట్టింది. ఇక ఐదేళ్ల కాలంలో వార్షికంగా 14 శాతం, ఏడేళ్లలో 13 శాతం, పదేళ్లలో 14.40 శాతం చొప్పున రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. 2004 ఆగస్ట్‌లో ఈ పథకం ఆరంభమైంది. నాటి నుంచి చూసుకుంటే వార్షికంగా ఇచ్చిన రాబడి 20 శాతం. పోర్ట్‌ఫోలియో.. పస్త్రుతం తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 92 శాతాన్నే ఈక్విటీలకు కేటాయించింది. 1.4 శాతం డెట్ సాధనాల్లో, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. మార్కెట్లో దిద్దుబాటు ఏర్పడితే ఇన్వెస్ట్ చేయడానికి వీలుగా నగదు నిల్వలు పెంచుకుంది. ఇక ఈక్విటీల్లోనూ 81 శాతాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీలకే కేటాయించింది. 14 శాతాన్ని మిడ్‌క్యాప్ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టింది. స్మాల్‌క్యాప్ పెట్టుబడులు 5 శాతంగా ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 63 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల్లో 19 శాతాన్ని బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు, 17 శాతాన్ని ఇంధనరంగ కంపెనీలకు, 12 శాతం హెల్త్‌కేర్ కంపెనీలకు, 10 శాతం కమ్యూనికేషన్ స్టాక్స్‌కు, 8 శాతం టెక్నాలజీ కంపెనీలకు కేటాయించింది. -
డీజిల్, ఏటీఫ్ ఎగుమతులపై మరోసారి విండ్‌ఫాల్ టాక్స్ షాక్
న్యూఢిల్లీ: డీజిల్, జెట్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కొరడా ఝళిపించింది. వీటి ఎగుమతులపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం అర్థరాత్రి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. డీజిల్ ఎగుమతిపై విండ్ ఫాల్ టాక్స్‌ను లీటరుకు రూ.7 నుంచి రూ.13.5కు పెంచుతూ సర్కార్ నిర్ణయించింది. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఎగుమతులపై పన్నును లీటరుకు రూ.2 నుంచి రూ.9 కి పెంచింది. దీంతోపాటు దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై పన్ను టన్నుకు రూ.13,000 నుంచి రూ.13,300కి పెరిగింది. మార్జిన్ల పెరుగుదలకు అనుగుణంగా ఎగుమతులపై పన్నును పెంచారు. అంతర్జాతీయ చమురు బెంచ్‌మార్క్‌లలో మార్పులు, ఒపెక్, దాని మిత్రదేశాల అంచనా ఉత్పత్తి తగ్గింపునకు అనుగుణంగా దేశీయంగా ఉత్పత్తయ్యే చమురుపై కూడా లెవీని పెంచింది. (షాకింగ్ రిపోర్ట్: వదల బొమ్మాళీ అంటున్న ఎలాన్ మస్క్) ఇది చదవండి: SC On Check Bounce Case: చెక్ బౌన్స్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు కాగా దేశంలో మొదటిసారిగా జూలై 1న విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌లను విధించిందిప్రభుత్వం. పెట్రోల్, ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 6 ఎగుమతి సుంకం విధించి. ఆ తరువాత జూలై 1న డీజిల్ ఎగుమతిపై రూ. 13 పన్ను విధించింది.జూలై 20న జరిగిన మొదటి పక్షంవారీ సమీక్షలో, పెట్రోల్‌పై లీటర్‌కు రూ.6 ఎగుమతి సుంకం రద్దు చేయడంతోపాటు, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతిపై లీటరుకు రూ. 2 చొప్పున టాక్స్ తగ్గించింది. అలాగే దేశీయంగా ఉత్పత్తి అయ్యే క్రూడ్‌పై పన్నును టన్నుకు రూ.17వేలకు తగ్గించింది. మళ్లీ ఆగస్టు 2న డీజిల్, ఎటీఎఫ్ ఎగుమతులపై పన్ను తగ్గించింది. అయితే అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు స్వల్పంగా పెరగడంతో దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై లెవీని టన్నుకు రూ.17,750కి పెంచింది. తదనంతరం, ఆగస్టు 19న, మూడవ పక్షంవారీ సమీక్షలో, డీజిల్‌పై ఎగుమతి పన్ను రూ. 7కు పెంచి,ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 2ల పన్ను పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. -
ఎయిర్ ఇండియా ఖాతాలో మరో 4 విమానాలు
సాక్షి, ముంబై: టాటా గ్రూప్ కంపెనీ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఖాతాలో కొత్తగా నాలుగు బోయింగ్ 737 రకం విమానాలు జతకూడనున్నాయి. కోవిడ్ సంక్షోభం తరువాత క్రమంగా ఆంక్షలు తొలగిపోతున్న నేపథ్యంలో విమానయాన రంగంలో డిమాండ్ పుంజుకుంది. ఈనేపథ్యంలోనే ఎయిరిండియా తాజా నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా ప్రయాణ అడ్డంకులు తొలగిపోయిన తర్వాత విదేశాలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా అధికం అయిందని ఎయిరిండియా తెలిపింది. ఇప్పటికే సంస్థ వద్ద బోయింగ్ 737 విమానాలు 24 ఉన్నాయి. దీనికి మరో నాలుగు విమానాలు తోడు కావడంతో మొత్తం 28 విమానాలకు చేరనుంది.ఆగస్టు 2020లో కోజికోడ్ విమాన ప్రమాదంలో ఒక విమానాన్ని కోల్పోయింది. అన్ని విమాన మార్గాలు మెరుగ్గా పనిచేస్తున్నాయని వివరించింది. ప్రయాణికుల సంఖ్య పరంగా కాలానుగుణ వ్యత్యాసాలు సహజమని తెలిపింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం ప్రతిరోజు 100 సర్వీసుల ద్వారా భారత్‌లోని 13 విమానాశ్రయాలతోపాటు అంతర్జాతీయంగా 13 ఎయిర్‌పోర్టుల్లో ఎయిరిండియా విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. -
7 శాతం పెరిగిన విమాన ప్రయాణికులు
న్యూఢిల్లీ: ఒకవైపు కరోనా మహమ్మారి కోరలు చాచినా కానీ, మరోవైపు దేశీయంగా విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య 2021 డిసెంబర్లో 6.7 శాతం పెరిగింది. మొత్తం 1.12 కోట్ల మంది దేశీయంగా విమాన ప్రయాణం చేసినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. మొత్తం మీద 2021లో దేశీయ విమాన సర్వీసుల్లో 8.38 కోట్ల మంది ప్రయాణించారు. 2020లో 6.3 కోట్ల మందితో పోలిస్తే 33 శాతం పెరిగింది. కరోనా మహమ్మారి విమానయాన రంగంపై ఎక్కువ ప్రభావం చూపించడం తెలిసిందే. ఇండిగో వాటా 55 శాతం ► ఇండిగో విమానాల్లో 2021 డిసెంబర్లో 61.41 లక్షల మంది ప్రయాణించారు. మొత్తం ప్రయాణికుల్లో 54.8 శాతం ఇండిగోను ఎంచుకున్నారు. ► గోఫస్ట్ (గతంలో గోఎయిర్) విమానాల్లో 11.93 లక్షల మంది ప్రయాణించారు. ► స్పైస్‌జెట్ విమాన సర్వీసులను 11.51 లక్షల మంది వినియోగించుకున్నారు. సాధారణంగా రెండో స్థానంలో ఉండే స్పైస్‌జెట్ మూడో స్థానానికి పడిపోయింది. ► ఎయిర్ ఇండియా విమానాల్లో 9.89 లక్షల మంది, విస్తారా విమాన సర్వీసుల్లో 8.61 లక్షల మంది, ఎయిరేషియా విమానాల్లో 7.01 లక్షల మంది, అలియన్స్ ఎయిర్ సర్వీసుల్లో 1.25 లక్షల మంది చొప్పున ప్రయాణించారు. ► ఆక్యుపెన్సీ రేషియో లేదా లోడ్ ఫ్యాక్టర్ (సీట్ల భర్తీ)లో స్పైస్‌జెట్ మెరుగ్గా 86 శాతాన్ని డిసెంబర్లో నమోదు చేసింది. ఆ తర్వాత ఇండిగో 80.2%, విస్తారా 78.1%, గోఫస్ట్ 79%, ఎయిర్ ఇండియా 78.2 శాతం, ఎయిరేషియా 74.2% చొప్పున ఆక్యుపెన్సీ రేషియోను సాధించాయి. ► బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై నగరాల నుంచి సకాలంలో సర్వీసులు నడిపించడంలో ఇండిగో 83.5 శాతంతో మొదటి స్థానంలో ఉంది. ► గోఫస్ట్ 83 శాతం, విస్తారా 81.5 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
రద్దీ పెరిగిపోతుంది, 49 లక్షలకు చేరిన విమాన ప్రయాణికులు
న్యూఢిల్లీ: దేశీయ విమాన ప్రయాణీకుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. జూన్ నెలతో పోలిస్తే జులైలో ప్యాసింజర్ ట్రాఫిక్ 57 శాతం వృద్ధి చెంది 49 లక్షలకు చేరింది. గతేడాది జూన్‌లో రద్దీ 31.1 లక్షలుగా ఉందని.. ఏడాది కాలంతో పోలిస్తే 132 శాతం వృద్ధి రేటు నమోదయిందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఈ ఏడాది జులైలో సగటున ప్రతి విమానంలో 104 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఇదే జూన్ నెలలో ప్యాసింజర్ సంఖ్య 98గా ఉంది. ఇదే సమయంలో ఎయిర్‌లైన్స్ సామర్థ్యం కూడా పెరిగింది. గతేడాది జులైలో 24,770 విమానాలు డిపార్చర్ కాగా.. ఈ ఏడాది జులై నాటికి 90 శాతం పెరుగుదలతో 47,200 ఎయిర్‌లైన్స్ డిపార్చర్ అయ్యాయని పేర్కొంది. సగటు రోజు వారీ డిపార్చర్స్ చూస్తే.. గతేడాది జులైలో 800 విమానాలు కాగా.. ఈ ఏడాదికవి 1,500లకు పెరిగాయి. జూన్ నెలలో రోజుకు 1,100 ఎయిర్‌లైన్స్ డిపార్చర్ జరిగాయని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ అండ్ కో–గ్రూప్ హెడ్ కింజల్ షా వివరించారు. ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నప్పటికీ విమానాశ్రయ సంస్థలపై ఒత్తిడి ఇంకా కొనసాగుతూనే ఉందని తెలిపారు. పలు రాష్ట్రాల్లో ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో లీజర్, వ్యాపార ప్రయాణాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయని.. కేవలం అత్యవసరమైన వాటికి మాత్రమే ప్రయాణాలు చేస్తున్నారని పేర్కొన్నారు -
ఆర్బీఐ షాక్: ఈ కొత్త కార్డుల జారీపై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. వీటి చెల్లింపు వ్యవస్థ డేటా నిల్వ నిబంధనలకు అనుగుణంగా లేదంటూ కొత్త దేశీయ క్రెడిట్ కార్డులను వినియోగదారులకు జారీ చేయకుండా నిషేధం విధించింది. మే 1వ తేదీ నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది. అయితే కార్డ్ నెట్‌వర్క్‌లపై ఆంక్షలు ప్రస్తుత వినియోగదారులపై ప్రభావం చూపదని తెలిపింది. దేశంలోని భారతీయ వినియోగదారుల డాటా, ఇతర సమాచారాన్ని భద్రపరచడానికి నిబంధనలను ఉల్లంఘించడంపై రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007 (పీఎస్ఎస్ యాక్ట్) సెక్షన్ 17 కింద కార్డు నెట్వర్క్ ఆపరేటింగ్‌కు సంబంధించి అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థలకు అనుమతి ఉంది. చెల్లింపు వ్యవస్థతో అనుసంధానించిన అన్ని సర్వీసు ప్రొవైడర్లు, వారు నిర్వహించే చెల్లింపు వ్యవస్థకు సంబంధించిన డాటా, ఇతర సమాచారాన్ని ఆరు నెలల్లో తమ ముందు ఉంచేలా చూడాలని 2018 ఏప్రిల్‌లోసర్క్యులర్ ద్వారా సూచించింది. దీనిపై అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ఒక ప్రకటన విడుదల చేసింది వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించడానికి ఆర్బీఐ కలిసి పని చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఉత్తర్వులు ప్రస్తుత భారతీయ కస్టమర్లను ప్రభావితం చేయదని, కార్డులను యథాతధంగా ఉపయోగించవచ్చునని స్పష్టం చేసింది. -
హిందూ మహా సముద్రంలో పైచేయి భారత్‌దే..
సాక్షి, విశాఖపట్నం : భారత రక్షణ రంగం నౌకాదళం అమ్ముల పొదిలోకి మరో అధునాతన అస్త్రం రానుంది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ సేవలందించేందుకు సిద్ధమవుతోంది. 40 వేల టన్నుల బరువైన విక్రాంత్ నిర్మాణంతో.. విమాన వాహక యుద్ధ నౌకలు తయారు చేసిన ఐదో దేశంగా... అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ సరసన భారత్ స్థానం సంపాదించింది. ఐఎన్ఎస్ విక్రాంత్‌లో రెండు టేకాఫ్ రన్వేలు, ఒక ల్యాండింగ్ స్ట్రిప్ ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది సీ ట్రయల్ రన్‌కు సిద్ధమవుతున్న ఐఎన్ఎస్ విక్రాంత్.. 2022 నాటికి విశాఖలోని తూర్పు నౌకాదళం కేంద్రంగా సేవలందించనుంది. రక్షణ రంగంలో అగ్రశ్రేణి దేశాల సరసన నిలిచిన భారత్.. యుద్ధ విమాన వాహక నౌకల విషయంలో కూడా బలీయమైన శక్తిగా ఎదగాలన్న కాంక్షతో విక్రాంత్ తయారీపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో విక్రాంత్ క్లాస్ యుద్ధ నౌక సిద్ధమైంది. భారత నౌకాదళంలో యుద్ధ విమానాల కోసం రూపొందించిన మొట్టమొ దటి విక్రాంత్ క్లాస్ నౌక ఇది. వాస్తవానికి 1997లో విక్రాంత్ సేవల నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు అదే పేరుతో స్వదేశీ పరిజ్ఞానంతో విక్రాంత్ యుద్ధ విమాన వాహక నౌక సిద్ధమవుతోంది. దిగ్విజయంగా బేసిన్ ట్రయల్స్... విక్రాంత్ నిర్మాణం పదేళ్ల కిందటే ప్రారంభమైంది. పూర్తిస్థాయి భారతీయ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ యుద్ధ నౌకలో అత్యంత ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. కొచ్చి షిప్‌యార్డులో తుది మెరుగులు దిద్దుకుంటున్న విక్రాంత్ జయమ్ సమ్ యుద్ధి స్పర్థః అనే రుగ్వేద శ్లోకం స్ఫూర్తిగా రూపుదిద్దుకుంటోంది. నాతో యుద్ధమంటే నాదే గెలుపు అనే అర్థం వస్తుంది. 1999లో ఇండియన్ నేవీకి చెందిన డైరెక్టర్ ఆఫ్ నేవల్ డిజైన్ సంస్థ నౌకా డిజైన్ మొదలు పెట్టగా.. 2009లో కీలక భాగాల్ని పూర్తి చేశారు. 2011లో డ్రైడాక్ నుంచి విక్రాంత్‌ని బయటికి తీసుకొచ్చారు. 2015 జూన్ 10న కొచ్చిలో జల ప్రవేశం చేసింది. వివిధ సాంకేతిక పనుల అనంతరం ఇటీవలే బేసిన్ ట్రయల్స్ పూర్తి చేశారు. ఎల్ఎం 2500 గ్యాస్ టర్బైన్లు 4, ప్రధాన గేర్ బాక్స్‌లు, షాఫ్టింగ్, పిచ్ ప్రొపైల్లర్ కంట్రోలర్స్, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సిస్టమ్, స్టీరింగ్ గేర్, ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్లు, కంప్రెసర్లు, సెంట్రిఫ్యూజన్, 60 క్రిటికల్ పంప్స్, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలు, అగ్నిమాపక వ్యవస్థ, డెక్ మెషినరీతో పాటు అంతర్గత కమ్యూనికేషన్ పరికరాల్ని ఈ ట్రయల్‌రన్‌లో పరిశీలించారు. ఈ ఏడాది మధ్యలో సీ ట్రయల్స్ పూర్తి చేసిన తర్వాత... 2022 చివరిలో భారత నౌకాదళంలో సేవలు ప్రారంభించనుంది. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్.. ఇండియన్ నేవీలో కీలకమైన తూర్పు నౌకాదళం కేంద్రంగా సేవలందించనుంది. ఇక హిందూ మహా సముద్రంలో పైచేయి భారత్‌దే.. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద మహా సముద్రం హిందూ మహాసముద్రం. రక్షణ పరంగా, రవాణా పరంగా ఎంతో కీలకమైన ఈ సముద్రంలో ఆధిపత్యం కోసం మనదేశంతో పాటు చైనా, అమెరికా మొదలైన దేశాలన్నీ విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో పైచేయి సాధించేందుకు భారత్ సిద్ధం చేసిన బ్రహ్మాస్త్రమే ఐఎన్ఎస్ విక్రాంత్. విక్రాంత్ రాకతో రక్షణ పరంగా దుర్భేద్యంగా నిలవనుంది. 7 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన హిందూ మహా సముద్రంలో ఎలాంటి అడ్డు లేకుండా ముందుకు దూసుకెళ్లగలిగే సామర్థ్యాన్ని విక్రాంత్ సొంతం చేసుకుంటుంది. కీలక బాధ్యతలు నిర్వర్తించనున్న విక్రాంత్ వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్, తూర్పు నౌకాదళాధిపతి విక్రాంత్ సేవలు వచ్చే ఏడాది నుంచి మొదలు కానున్నాయని ఆశిస్తున్నాం. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విక్రాంత్ కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. ఈ విమాన వాహక యుద్ధ నౌక అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో తీర ప్రాంత భద్రతకు సంబంధించిన కీలక బాధ్యతలు భుజానికెత్తుకుంటుంది. ముఖ్యంగా నౌకాదళంలో చేరనున్న మిగ్–29 యుద్ధ విమానాలకు విక్రాంత్ ఉపయుక్తమవుతుంది. సీ ట్రయల్స్ పూర్తయిన తర్వాత ఏడా ది పాటు సిబ్బందికి నౌకలో శిక్షణ, సామర్థ్యాల నిర్వహణ అంశాలు పరీక్షిస్తారు. అనంతరం విక్రాంత్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
విమాన ప్రయాణికులకు మార్గదర్శకాలు విడుదల
-
విమాన ప్రయాణం.. మార్గదర్శకాలు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విమాన ప్రయాణికుల రాకపోకలకు ప్రభుత్వం నిబంధనలు విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో కేంద్రం సూచనలకు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించింది. డొమెస్టిక్ విమానాల రాకపోకలు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. విమాన ప్రయాణికులు స్పందన వెబ్సైట్లో సమాచారం పొందుపరచాలని, స్పందనలో ప్రభుత్వం అనుమతి ఇచ్చాకే ఎయిర్‌లైన్స్ టికెట్లను అమ్మాలని ప్రభుత్వం తెలిపింది. లక్షణాలున్న వారిని పరీక్షించి 7 రోజులు క్వారంటైన్లో ఉంచాలని, ఆ తర్వాత నెగిటివ్ వస్తే మరో 7 రోజులు హోంక్వారంటైన్‌కు పంపాలని ఆదేశించింది. హైరిస్క్ ప్రాంతాలైన చెన్నై, ముంబై, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి వచ్చేవారిని క్వారంటైన్ సెంటర్లకు పంపాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.ఇతర ప్రాంతాల నుంచి వస్తే 14 రోజులు హోం క్వారంటైన్‌కు పంపాలని ప్రభుత్వం పేర్కొంది. -
మార్చి 29 నుంచి 20 కొత్త విమానాలు
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయంగా కొత్త విమానాలను త్వరలోనే ప్రవేశపెడుతున్నామని స్పైస్‌జెట్ బుధవారం ప్రకటించింది. మార్చి29, 2020నుండి 20కొత్త విమానాలను ప్రారంభించనున్నట్టు తెలిపింది. తద్వారా ప్రాంతీయ కనెక్టివిటీని పెంచే పథకంలో భాగంగా 12 నగరాలను కలిపేలా మొత్తం 52 విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయని స్పైస్ జెట్ వెల్లడించింది. కొత్త విమానాలలో వారణాసి-పాట్నా , అమృత్సర్-పాట్నా ఉడాన్ మార్గాల్లో నాన్-స్టాప్ సేవలు ఉంటాయి. గువహటి-పాట్నా, హైదరాబాద్-మంగళూరు, బెంగళూరు-జబల్పూర్, పాట్నా-వారణాసి, ముంబై- ఔరంగాబాద్ ఉన్నాయి. దీనికి అదనంగా ముంబై-బాగ్డోగ్రా, ముంబై-చెన్నై, హైదరాబాద్-మంగళూరు, గౌహతి-డిల్లీ మార్గాల్లో సేవలను క్రమేపీ పెంచనుంది. 20 కొత్త దేశీయ విమానాలను ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని స్పైస్‌జెట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ శిల్పా భాటియా తెలిపారు. తమ నెట్‌వర్క్‌ను కొత్త నగరాలుకు విస్తరించి, మరింత ఎక్కువ మందికి సరసమైన ధరల్లో విమాన ప్రయాణ సేవలను అందిస్తామన్నారు. అలాగే మెట్రోలు, నాన్-మెట్రోల మధ్య కనెక్టివిటీని పెంచడంతో పాటు దేశంలోని అనుసంధానించబడని భాగాలను కూడా అనుసంధానించడంపై కూడా దృష్టి పెట్టామని చెప్పారు. -
టూరిస్టులకు కేంద్రం బంపర్ ఆఫర్
సాక్షి,న్యూఢిల్లీ: టూరిస్టులకు కేంద్రం ప్రభుత్వం భలే ఆఫర్‌ను ప్రకటించింది. సంవత్సరంలో దేశీయంగా 15 పర్యాటక ప్రదేశాలను సందర్శించిన ప్రయాణికులకు బంపర్ ఆఫర్ అందించనుంది. ప్రయాణ ఖర్చులను బహుమతిగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని కేంద్ర పర్యాటక మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ప్రకటించారు. కోణార్క్‌లో ఫిక్కీ సహకారంతో ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీయ పర్యాటక సదస్సు ముగింపు కార్యక్రమంలో కేంద్రమంత్రి శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. సంవత్సరం లోపు ఈ టాస్క్‌ను పూర్తి చేసిన టూరిస్టులను ప్రభుత్వం రివార్డుతో సంత్కరిస్తామన్నారు. టూరిస్టులను మరింత ప్రోత్సాహించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘పర్యాటన్ పర్వ్’ కార్యక్రమంలో భాగంగా అతడు /ఆమె 2022 నాటికి భారతదేశంలోని కనీసం 15 పర్యాటక ప్రదేశాల్లో పర్యటించాలి. స్వరాష్టం తప్ప ఇతర రాష్టాల్లో 15 ప్రదేశాలను సందర్శించాలి అనేది ప్రధాన షరతు. ఇందుకు గాను వారికి ప్రోత్సహకక బహుమతిగా ప్రయాణ ఖర్చులను పర్యాటక మంత్రిత్వ శాఖ భరిస్తుంది. అయితే ఇది నగదు రూపంలో కాకుండా ప్రోత్సాహక బహుమతిగా వుంటుందని స్పష్టం చేశారు. సంబంధిత ఫోటోలను తమ వెబ్సైట్లో పొందు పరుస్తామని ఆయన తెలిపారు. అలాగే ఎంపికైన వారిని భారతీయ పర్యాటక బ్రాండ్ అంబాసిడర్లుగా గుర్తిస్తామన్నారు. త్వరలోనే కోణార్క్‌లోని సూర్య దేవాలయాన్ని 'ఐకానిక్ సైట్ల' జాబితాలో చేర్చనున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రి తెలిపారు. అంతేకాదు టూరిస్టు గైడ్స్‌గా పనిచేయాలనుకునే అభ్యర్థుల కోసం పర్యాటక మంత్రిత్వశాఖ సర్టిఫికేట్ ప్రొగ్రామ్ కూడా నిర్వహిస్తోంది. కానీ ఈ కార్యక్రమంలో ఒడిశా పాల్గొనడం చాలా తక్కువ, దీనిని మెరుగు పరచాల్సిన అవసరం ఉందని పర్యాటక శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ రూపైందర్ బ్రార్ అన్నారు. మరోవైపు మరిన్ని పర్యాటక ప్రదేశాలను అనుసంధానించడానికి మరిన్ని పర్యాటక రైళ్లను ప్రవేశపెట్టాలని ఫిక్కీ ఈస్టర్న్ టూరిజం కమిటీ చైర్మన్ సౌభాగ్య మోహపాత్ర కోరారు. -
కి.మీకు రూ.1.75 : స్పైస్‌జెట్ సేల్
సాక్షి, ముంబై: బడ్జెట్ ఎయిర్‌లైన్స్ స్పైస్ జెట్ తక్కువ ధరల్లో విమాన టికెట్లను ప్రకటించింది. జాతీయ. అంతర్జాతీయ మార్గాల్లో ఈ ఆఫర్లను ప్రకటించింది. దేశీయంగా కిలోమీటర్‌కు 1.75 చొప్పున, అంతర్జాతీయ కి.మీకు రూ. 2.5 చొప్పున విమాన టికెట్ చార్జీలను వసూలు చేస్తున్నామని స్పైస్‌జెట్ ఒక ప్రకటన జారీ చేసింది. దేశీయంగా ఒకవైపు ప్రయాణానికి రూ.899 (అన్నీ కలిపి), అంతర్జాతీయ రూట్లలో రూ.3699 లకు ప్రారంభ ధరగా టికెట్లను అందిస్తోంది. ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమైన ఈ సేల్ ఫిబ్రవరి 9తో ముగియనుంది. ఇలా కొనుక్కున్న టికెట్ల ద్వారా సెప్టెంబరు 25, 2019 వరకు ప్రయాణించవచ్చు.