dutch
-
తేనెటీగల కోసం కృత్రిమపూలు..!
తేనెటీగలు నానాటికీ తగ్గుతుండటంపై ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తేనెటీగలు అంతరించిపోతే, భూమ్మీద మానవులు కూడా అంతరించిపోవడానికి ఎంతోకాలం పట్టదని కూడా వారు హెచ్చరికలు చేస్తున్నారు. పట్టణీకరణ పెరుగుతుండటంతో అడవులు, అడవుల్లో ఉండే తేనెనిచ్చే పూలమొక్కలు కనుమరుగవుతున్నాయి. ఫలితంగా తేనెటీగల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. తేనెటీగలను కాపాడటానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే డచ్ డిజైనర్ మటిల్డా బోయల్హోవర్ తేనెటీగల మనుగడ కోసం కృత్రిమ పూలను తయారు చేశారు. జనావాసాలతో కిక్కిరిసి ఉండే నగరాల్లో ఈ పూలను ఇళ్లల్లోని పూలకుండీల్లో అమర్చుకోవడానికి వీలుగా రూపొందించారు. ఈ పూలు వాననీటిని చక్కెరతో కూడిన ద్రవంగా మార్చగలవు. తియ్యగా ఉండే ఈ ద్రవం సహజమైన తేనె మాదిరిగానే తేనెటీగలను ఆకట్టుకోగలదు. తేనెటీగలతో పాటు ఈ పూలు వృక్షజాతుల్లో పరపరాగ సంపర్కానికి దోహదపడే సీతాకోక చిలుకలు, తుమ్మెదలు, కందిరీగలు వంటి కీటకాలను కూడా ఆకర్షించగలవని డిజైనర్ మటిల్డా చెబుతున్నారు. (చదవండి: తేనెటీగల కోసం కృత్రిమపూలు) -
ఇలాంటి క్రేజీ గ్రౌండ్ఫ్రిడ్జ్ని చూశారా..? కరెంట్‌తో పని లేకుండానే..
ఎన్నో రకాల ఫ్రిడ్జ్ మోడల్స్‌ని చూసి ఉంటారు. కానీ ఇలాంటి వెరైటీ ఫ్రిడ్జ్‌ని గురించి విని ఉండరు. ఈ ఫ్రిడ్జ్ ఎలక్ట్రిసిటీ అవసరం లేకుండా పనిచేస్తుంది. మన సంప్రదాయ మూలాలకు సంబంధించిన మోడ్రన్ వర్షనే ఈ ఫ్రిడ్జ్ అని చెప్పొచ్చు. మరీ ఇంతకీ ఇదెలా ఉంటుందంటే..ఈ గ్రౌండ్ ఫ్రిడ్జ్‌ని డచ్‌కి చెందిన డిజైనర్ ఫ్లోరిస్ షూండర్బీక్ రూపొందించారు. ఇది చూడటానికి గోళాకారంలో ఉండి చెక్కతో కూడిన మెట్ల ద్వారం ఉంటుంది. సరిగ్గా ఫాలిక్ ఆకృతిలో ఉంటుంది. ఇది ఆధునిక గృహోపకరణాలకు అత్యంత విభిన్నంగా ఉంటుంది. సుమారు మూడు వేల లీటర్లు ఉండే ఈ ఫ్రిడ్జ్‌లో దాదాపు 12 ఫ్రిడ్జ్‌లలో పట్టేంతా ఆహార పదార్థాలు పెట్టొచ్చుఈ గ్రౌండ్ ఫ్రిడ్జ్‌ని భూమిలో సుమారు 1 నుంచి 1.5 మీటర్ల లోతులో పెట్టి చుట్టూ మట్టిని కప్పేస్తారు. అక్కడ ఉష్ణోగ్రత సుమారుగా 10 నుంచి 12 డిగ్రీల సెంటీగ్రేడ్లు ఉంటుంది. అక్కడ చుట్టూ ఉన్న మట్టి నేచురల్ ఇన్సులేటర్‌గా పనిచేసి ఫ్రిడ్జ్ లోపల చల్లదనాన్ని క్రియేట్ చేస్తుంది. అలాగే దానిలోపల వేడిని కింద ఉన్న భూమి అబ్జర్వ్ చేసుకుని బయటకు వదులుతుంది. అందువల్ల అక్కడ ఎలప్పుడూ ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. అలాగే రాత్రి సమయాల్లో ఎయిర్ ఎక్స్ఛేంజ్ అయ్యి కూల్ ఎయిర్ వచ్చేందుకు టైమర్‌తో కూడిన ఒక ఫ్యాన్ ఫిక్స్ చేసి ఉంటుంది. ఈ ఫ్రిడ్జ్‌ని ఇన్స్టాల్ చేసుకునేందుకు ఎలాంటి పర్మిషన్లు అవసరం లేదు. (చదవండి: ఆందోళనని హ్యాండిల్ చేయడంపై హీరో విక్కీ కౌశల్ సలహాలు!) -
డచ్ కార్యాలయంలో భారతీయ వంటకాలు..వీడియో వైరల్!
భారతదేశ సంస్కృతిలానే ఇక్కడ ఆహారం కూడా సంప్రదాయనుగుణంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ సోషల్ మీడియా పుణ్యమా అని భారతీయ వంటకాల గురించి ఖండాంతరాలకు వ్యాప్తి అవుతోంది. విలక్షణమైన స్వీట్స్, మసాలాతో కూడిన వంటకాలు చూసి విదేశీయలు సైతం టేస్ట్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. పైగా వాళ్లు కూడా ఈ వంటకాలను చేసేందుకు రెడీ అవుతున్నారు కూడా. ఇప్పడు ఇదంత ఎందుకంటే..మన భారతీయ వంటకాలను ఓ డచ్ కంపెనీ తన ఉద్యోగులకు సర్వ్ చేస్తోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెదర్లాండ్‌లో అనువింద్ కన్వాల్ అనే భారతీయుడు తన ఆఫీస్‌లో ఉద్యోగులుకు భారతీయ ఆహరం పేరుతో మన సంప్రదాయ వంటకాలు సర్వ్ చేసిన వీడియోని పంచుకున్నారు. ఇది ]ప్రశ్నించగదిగినది' అనే క్యాప్షన్ జోడించి మరీ ఈ వీడియోని పోస్ట్ చేశారు. అంతేగాదు కన్వాల్ పోస్ట్‌లో తన కార్యాలయంలో భారతీయ ఆహారం అనేది కొంచెం సందేహాస్పదంగా ఉన్నప్పటికీ.. ఎలా ఈ వంటకాలను వండారు అనేదాని గురించి తాను తెలుసుకోవాలనుకోవడం లేదని అన్నారు. అలాగే తన కార్యాలయంలో బెల్ పెప్పర్ పడిమా చట్నీ, నాన్స్ తదితర భారతీయ వంటకాలను సర్వ్ చేసినట్లు కూడా తెలిపారు. ఈ వీడియోకి ఒక మిలియన్‌కి పైగా వ్యూస్, లైక్‌లు వచ్చాయి. నెటిజన్లు మాత్రం ఇలా వైవిధ్యంగా ఉండేందుకు ప్రయత్రిస్తున్న సదరు కంపెనీని ప్రశంసించగా, మరికొందరూ భారతీయ వంటకాలు ఖండాంతారాలకు చేరుకోవడం విశేషమే కాకుండా టేస్టే చేయాలనే వారి ధైర్యాన్ని కూడా మెచ్చుకోవాల్సిందేనని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Anuvind Kanwal (@anuvindkanwal) (చదవండి: టేస్ట్ అట్లాస్ మెచ్చిన డెజర్ట్‌తో గుండె ఆరోగ్యం పదిలం..!) -
జంటగా చేతిలో చేయి వేసుకుని మరణించటం మాటలు కాదు..!
వృద్ధాప్యంలోకి వచ్చాక..భార్యాభర్తల్లో ఎవరో ఒకరు ముందు చనిపోవడం సహజం. మిగిలిని వారు ఆ విరహాన్ని తట్టుకోవడం కూడా అసాధ్యమే. చాలామటుకు ఆ బెంగతో మిగిలినవారు మహా అయితే ఆరు నెలలు లేదా ఏడాదిలోపు చనిపోవడం జరుగుతుంది. అయితే కొందరూ మరణంలోకూడా జంటగా కలిసే చనిపోవాలనుకుంటారు. అలాంటి అవకాశం అందరికీ రాదు కూడా. బహుశా అందువల్లే వృధాప్యంలో ఉన్న వాళ్లను ఒంటరిగా వదిలేయరేమో!. కానీ ఇక్కడొక వ్యక్తి ఓ దేశానికి ప్రధానిగా విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక వృధాప్యంలోకి చేరిన అతను మరణంలో కూడా భార్యని విడిచిపెట్టకూడదనుకున్నాడు. అందుకోసం వాళ్లేం ఏం చేశారో వింటే..కన్నీళ్లు ఆగవు.! వివరాల్లోకెళ్తే..డ్రైస్ వాన్ అగ్ట్ అనే వ్యక్తి నెదర్లాండ్ మాజీ ప్రధాని. అతను ప్రధానిగా 1977 నుంచి 1982 మధ్య కాలంలో ప్రధానిగా పనిచేశాడు. క్రిస్టియన్ డెమోక్రటిక్ అప్పీల్ అనే పార్టీని కూడా స్థాపించాడు. 2009లో 2009లో పాలస్తీనా హక్కుల కోసం వాదించేందుకు ది రైట్స్ ఫోరం అనే సంస్థను ఏర్పాటు చేశాడు. అధ్యక్షుడిగా ఉన్నంతసేపు నెదర్లాండ్ దేశంలో విలువలను కాపాడాడు. నిబద్ధమైన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందాడు. అక్కడి రాజకీయాలను శాసించాడు. ఆయనకు యూజీనీ అనే భార్య ఉంది. ప్రస్తుతం అగ్ట్కి 93 ఏళ్లు కాగా, అతడి భార్యకు కూడా ఇంచుమించుగా అంతే వయసు ఉంటుంది. ఇరువురు వృధాప్యంలోకి చేరిపోయారు. అయితే డ్రైస్కి 2019 నుంచి బ్రెయిన్ హేమరేజ్‌తో బాధపడుతున్నాడు. అప్పటి నుంచి అతను మంచం మీదే ఉన్నాడు. ఇక అతని భార్య కూడా గత కొంతకాలం నుంచి అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమయ్యింది. ఇద్దరూ మంచానికే పరిమితమయ్యారు, పైగా ఇరువురిలో ఎవరూ ముందు చనిపోయినా తట్టుకునే లేదు. దీంతో ఇరువురు జంటగా మరణించాలనే ఉద్దేశ్యంతో ద్వంద్వ అనాయాస మరణాన్ని ఆశ్రయించారు. అలా ఫిబ్రవరి 5న డ్రైస్ వాన్ అగ్ట్, యూజీనీ తమ స్వస్థలమైన నిజ్ మెగన్ లో ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుని కన్నుమూశారు. ఈ విషయాన్ని దీ రైట్స్ ఫోరం ధృవీకరించింది.”మా వ్యవస్థాపకుడు, గౌరవ చైర్మన్ డ్రైస్ వాన్ అగ్ట్ ఫిబ్రవరి 5, నిజ్ మెగన్ లో తన భార్యతో కలిసి మరణించారు. వారిద్దరూ 70 సంవత్సరాల పాటు వైవాహిక జీవితాన్ని గడిపారు. డ్రైస్ వాన్ అగ్ట్ తన భార్యను నా అమ్మాయి అని సంబోధించేవాడు. ఇద్దరు చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని” ది రైట్స్ వింగ్ డైరెక్టర్ గెరాడ్ జొంక్ మన్ తెలిపారు. ఇదిలా ఉండగా, నెదర్లాండ్‌లో "ద్వంద అనాయాస" లేదా ఇద్దరు వ్యక్తులు ఏకకాలంలో ప్రాణాంతక ఇంజెక్షన్‌ను తీసుకును చనిపోలానుకోనే ధోరణి ఎక్కువగా ఉంది. ఇలానే 2021లో 13 జంటలు, 2022లో ఏకంగా 29 జంటలు ప్రాణాలు పోగొట్టుకున్నట్లు తెలిపారు. నిజానికి దీన్ని ఇంగ్లీష్‌లో “duoEuthanasia” అంటారు.. తెలుగులో అయితే “అనాయాస మరణం” అని అంటారు. అయితే నెదర్లాండ్ దేశంలో ప్రతి ఏడాది దాదాపు వెయ్యి మంది వ్యక్తులు అనాయాస మరణం కోసం సంప్రదిస్తున్నట్లు ఎక్స్ పర్టి సెంట్రమ్ యుతనాసి ప్రతినిధి ఎల్కే స్వార్డ్ చెబుతున్నారు. ముఖ్యంగా నెదర్లాండ్ దేశం 2002 నుంచి ఈ అనాయాస మరణాన్ని చట్టం చేసింది. దీన్ని ఆరు షరతులతో అమలు చేశారు. అయితే ఇలా కారుణ్య మరణం కావాలనుకునేవారు అందుకు తగ్గ కారణాలు చూపించాల్సి ఉంటుంది. భరించలేని బాధలు, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందలేకపోవడం వంటివి ఇందులో ఉంటాయి. అనుమతి పొందిన వారికి వైద్యులు విషపూరిత ఇంజెక్షన్‌ను ఇస్తారు. మరోవైపు ఇలాంటి మరణాలను ప్రోత్సహించేది లేదంటూ అమెరికా, ఆసియా, యూరప్ లోని కొన్ని దేశాలు చట్టాలు రూపొందించాయి. కాగా, నెదర్లాండ్ మాజీ ప్రధాని, ఆయన భార్య అనాయస మరణం పొందడం పట్ల ప్రపంచ దేశాల అధిపతులు సంతాపం వ్యక్తం చేశారు. (చదవండి: 1700 ఏళ్ల నాటి పురాతన గుడ్డు..ఇప్పటికీ లోపల పచ్చసొన..!) -
Joyeeta Gupta: డైనమిక్ ప్రొఫెసర్‌కు డచ్ నోబెల్
ఆర్థికశాస్త్రం చదువుకున్నవారి ఆసక్తి గణాంకాలకే పరిమితమని, న్యాయశాస్త్రం చదువుకున్న వారి ఆసక్తి ఆ శాస్త్రానికి సంబంధించిన అంశాలపైనే ఉంటుందనేది ఒక సాధారణ భావన. ‘విభిన్న విద్యానేపథ్యం ఉన్న మేధావి’గా గుర్తింపు పొందిన జ్యోయితా గుప్తా ఆర్థికశాస్త్రం నుంచి న్యాయశాస్త్రం వరకు ఎన్నో శాస్త్రాలు చదివింది. అయితే ఆమె ప్రయాణంలో ఆ శాస్త్రాలేవీ వేటికవే అన్నట్లుగా ఉండిపోలేదు. వాతావరణ మార్పులపై తాను చేసిన శాస్త్రీయ పరిశోధనకు మరింత విస్తృతిని ఇచ్చాయి. నెదర్లాండ్స్‌లోని యూనివర్శిటీ ఆఫ్ ఆమ్‌స్టార్‌డమ్‌లో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జ్యోయితా గుప్తా డచ్ రిసెర్చి కౌన్సిల్ నుంచి ‘డచ్ నోబెల్’గా పేరొందిన ప్రతిష్టాత్మకమైన స్పినోజా ప్రైజ్‌ను ది హేగ్‌లో అందుకుంది... దిల్లీలో పుట్టి పెరిగింది జ్యోయితా గుప్తా. లోరెటో కాన్వెంట్ స్కూల్లో చదువుకుంది. దిల్లీ యూనివర్శిటీలో ఎకనామిక్స్, గుజరాత్ యూనివర్శిటీలో న్యాయశాస్త్రం, హార్వర్డ్ లా స్కూల్లో ఇంటర్నేషనల్ లా చదివింది. ‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాతావరణ మార్పులు’ అనే అంశంపై ఆమ్స్టార్ డామ్‌లోని వ్రిజే యూనివర్శిటీలో డాక్టరేట్ చేసింది. 2013లో ఈ యూనివర్శిటీలో ఫ్యాకల్టీగా చేరింది. వాతావరణ మార్పుల వల్ల సమాజంపై కలుగుతున్న ప్రభావం, ఉత్పన్నమవుతున్న సామాజిక అశాంతి... మొదలైన అంశాలపై లోతైన పరిశోధనలు చేసింది. 2016లో ఐక్యరాజ్య సమితి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఔట్లుక్ (జీఈవో)కు కో– చైర్‌పర్సన్‌గా నియమితురాలైంది. యూనివర్శిటీ ఆఫ్ ఆమ్‌స్టర్‌డమ్‌లో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జ్యోయితా గుప్తా ‘ఆమ్స్టర్డామ్ గ్లోబల్ చేంజ్ ఇన్స్టిట్యూట్’ సభ్యులలో ఒకరు. పరిశోధనలకే పరిమితం కాకుండా పర్యావరణ సంబంధిత అంశాలపై విలువైన పుస్తకాలు రాసింది జ్యోయిత. ‘ది హిస్టరీ ఆఫ్ గ్లోబల్ క్లైమెట్ గవర్నెన్స్’ ‘ది క్లైమెట్ ఛేంజ్ కన్వెన్షన్ అండ్ డెవలపింగ్ కంట్రీస్’ ‘టాక్సిక్ టెర్రరిజమ్: డంపింగ్ హజడస్ వేస్ట్’ ‘అవర్ సిమరింగ్ ప్లానెట్’ ‘ఆన్ బిహాఫ్ ఆఫ్ మై డెలిగేషన్: ఏ సర్వె్యవల్ గైడ్ ఫర్ డెవలపింగ్ కంట్రీ క్లైమెట్ నెగోషియేటర్స్’ ‘మెయిన్ స్ట్రీమింగ్ క్లైమేట్ చేంజ్ ఇన్ డెవలప్మెంట్ కో ఆపరేషన్’... మొదలైన పుస్తకాలు రాసింది. అమెరికా పరిశ్రమల చెత్త ఏ దేశాలకు చేరుతుంది? ఎంత విషతుల్యం అవుతుందో 1990లోనే ‘టాక్సిక్ టెర్రరిజమ్: డంపింగ్ హాజడస్ వేస్ట్’ పుస్తకంలో కళ్లకు కట్టినట్లు వివరించింది. పాశ్చాత్య దేశాల పరిశ్రమలు ఉత్పత్తి చేసే విషపూరిత వ్యర్థాలు మరోవైపు విదేశీ మారకద్రవ్యం కోసం పరితపిస్తూ పర్యావరణాన్ని పట్టించుకోని దేశాల గురించి లోతైన విశ్లేషణ చేసింది జ్యోయిత. సాధారణంగానైతే పర్యావరణ అంశాలకు సంబంధించిన చర్చ, విశ్లేషణ ఒక పరిధిని దాటి బయటికి రాదు. అయితే జ్యోయిత విశ్లేషణ మాత్రం ఎన్నో కోణాలను ఆవిష్కరించింది. వాతావరణంలోని మార్పులు ప్రభుత్వ పాలనపై చూపే ప్రభావం, ధనిక, పేద సమాజాల మధ్య తలెత్తే వైరుధ్యాల గురించి చెప్పడం ఇందుకు ఒక ఉదాహరణ. ‘ప్రపంచవ్యాప్తంగా తగినన్ని ఆర్థిక వనరులు ఉన్నాయి. అందరి జీవితాలను బాగు చేయడానికి ఆ వనరులను ఎలా ఉపయోగించాలనేదే సమస్య. ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు, నిరుపేదల మధ్య అసమానతలు ఉన్నాయి. భారత్‌లాంటి దేశాల్లో కూడా ఇదొక పెద్ద సవాలు’ అంటుంది జ్యోయిత. ఆమె విశ్లేషణలో విమర్శ మాత్రమే కనిపించదు. సందర్భాన్ని బట్టి పరిష్కారాలు కూడా కనిపిస్తాయి. ‘విస్తృతమైన, విలువైన పరిశోధన’ అంటూ స్పినోజా ప్రైజ్ జ్యూరీ గుప్తాను కొనియాడింది. కొత్త తరం పరిశోధకులకు ఆమె మార్గదర్శకత్వం విలువైనదిగా ప్రశంసించింది. తనకు లభించిన బహుమతి మొత్తాన్ని (1.5 మిలియన్ యూరోలు) శాస్త్రపరిశోధన కార్యక్రమాలపై ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకుంది జ్యోయితా గుప్తా. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు, పర్యావరణ సంరక్షణకు చట్టాలతో కూడిన ప్రపంచ రాజ్యాంగం కోసం జ్యోయితా గుప్తా గట్టి కృషి చేస్తోంది. -
ఇప్పటికీ అంతు తేలని ఇద్దరి యువతుల మిస్టరీ గాథ.. అడవిలో ఏం జరిగింది?
అదో అందాల వనం.. చుట్టూ కొండకోనల సోయగం.. చిన్నగా పిలిస్తే ప్రతిధ్వనించేంత నిశ్శబ్దం.. పెద్దగా అరచినా ఉలకని నిర్మానుష్యం.. ఆ రోజు ఏమైందో.. అక్కడున్న ప్రతి చెట్టూ చేమకూ, వాగూ వంకకూ బాగా తెలుసు. కానీ ఆనవాళ్లు ఆధారాలై.. జరిగిన కథను చెప్పలేకపోయాయి. జరిగే ఫెరాన్నీ ఆపలేకపోయాయి. ఎంతో ఆహ్లాదంగా మొదలైన ఆ ప్రయాణం.. చివరికి అమానుషంగా ముగిసిపోయింది. తొమ్మిదేళ్ల క్రితం బలైన క్రిస్ క్రెమర్స్(21), లిసానే ఫ్రూన్(22) అనే నెదర్లాండ్స్ యువతుల గాథ నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది! 2014 ఏప్రిల్ 1, మధ్యాహ్నం పన్నెండు తర్వాత.. క్రిస్, ఫ్రూన్లు కలసి.. పనామాలోని బోకేట్ మౌంటెన్స్ చుట్టూ ఉండే అడవుల్లో అడుగుపెట్టారు. అక్కడ తమకు ఆతిథ్యమ్చిన వారి పెంపుడు కుక్కను తమ వెంట తీసుకుని బయలుదేరారు. వీరిద్దరూ నెదర్లాండ్స్‌లోని అమెర్స్ఫోర్ట్కు చెందిన విద్యార్థినులు. ప్రాణస్నేహితులు కూడా. వెకేషన్ ఇంటర్న్‌షిప్‌కి సర్వీస్ ట్రిప్‌గా ఉపయోగపడే పనావ పర్యటన కోసం ఆరు నెలల క్రితమే ప్లాన్ చేసుకున్నారు. స్థానిక పిల్లలతో మాట్లాడటానికి, వారికి చేతి వృత్తులపై అవగాహన కల్పించడానికి స్థానిక భాషైన స్పానిష్నూ నేర్చుకున్నారు. హైకింగ్, టూరింగ్‌తో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాలలో పర్యటించాలనే ఉద్దేశం ఉందని అప్పటికే వారు ఫేస్బుక్లో చర్చించారు. ఇద్దరూ కలసి అడవి అందాలను ఆస్వాదిస్తూ ఆ రోజు దిగిన కొన్ని సెల్ఫీలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుని తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఆ రోజు గడిచిందిది. అర్ధరాత్రి అయ్యేసరికి.. వారి వెంట వెళ్లిన కుక్క ఒంటరిగా ఇంటికి తిరిగొచ్చింది. దాన్ని చూసి క్రిస్, ఫ్రూన్లు ఎక్కడైనా ఆగి ఉంటారని అభిప్రాయపడింది ఆ ఆతిథ్య కుటుంబం. ఏప్రిల్ 2న స్థానిక టూర్ గైడ్‌తో ఆ ఇద్దరు అమ్మాయిలకు అపాయింట్మెంట్ ఉంది. దానికి కూడా వాళ్లు రాకపోయేసరికి అనుమానం వచ్చిన ఆ ఆతిథ్య కుటుంబం.. అధికారులను అప్రమత్తం చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, రెస్క్య టీమ్.. అడవి చుట్టూ వివనంలో గాలింపు మొదలుపెట్టారు. స్థానిక గ్రామాలు, చుట్టుపక్కల కొండలను జల్లెడ పట్టారు. నాలుగు రోజులు గడిచినా వాళ్లు దొరక్కపోవడంతో వారి కుటుంబ సభ్యులు పనామా చేరుకున్నారు. నెదర్లాండ్స్ నుంచి డిటెక్టివ్‌లను వెంట తీసుకొచ్చారు. స్థానిక పోలీసులు, డాగ్ యూనిట్లతో కలసి పదిరోజుల పాటు.. ఆ అమ్మాయిల కోసం అడవుల్లో గాలించారు. రోజులు గడిచాయి తప్ప ఎలాంటి ఆధారాలు దొరకలేదు. నెల రోజుల తర్వాత ఒక మహిళ.. బోకేట్లోని నది ఒడ్డున.. ఓ బ్యాగ్ దొరికిందని తీసుకొచ్చి పోలీసులకు ఇచ్చింది. అది ఫ్రూన్ బ్యాగ్ కావడంతో అందరిలో ఆశాభావం మొదలైంది. అందులో ఇద్దరి ఫోన్లు, కెమెరా, కొన్ని చిన్న చిన్న వస్తువులతో పాటు 83 డాలర్లు దొరికాయి. ఫోన్లో డయల్ కాల్స్ చూసి షాకయ్యారు అధికారులు. సుమారు నాలుగు రోజుల పాటు నెదర్లాండ్స్‌లోని ఎమర్జెన్సీ నంబర్ 112కి, పనామాలోని ఎమర్జెన్సీ నంబర్ 911కి కాల్ చేయడానికి 77 సార్లు ప్రయత్నింనట్లు ఆధారాలున్నాయి. సరైన సిగ్నల్స్ లేక ఏ ఒక్క నంబర్ కలవలేదని అర్థమైంది. మరి ఆ అమ్మాయిలకు ఏమైంది? వాళ్లు ఏమయ్యారు? ఇవే ప్రశ్నలు అందరినీ అయోమయంలో పడేశాయి. టెక్నాలజీ సాయంతో ఏప్రిల్ 6న క్రిస్ ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి విఫలయత్నం జరిగినట్లు, ఏప్రిల్ 11 నాటికి, రెండు ఫోన్లు డెడ్ అయినట్లు రుజువులు సంపాదించారు పోలీసులు. ఇక కెమెరాలో ఫొటోలను పరిశీలిస్తే మరింత విస్తుగొల్పాయి. కాంటినెంటల్ డివైడ్‌కు సమీపంలో ఉన్న కాలిబాట వైపు వాళ్లు వెళ్లినట్లు ఏప్రిల్ 1న తీసుకున్న వరి ఫొటోలో ఉంది. అయితే ఆ తర్వాత వాళ్లు ఫొటోలేం తీసుకోలేదు. ఏప్రిల్ 8 తెల్లవారు జామున ఒంటి గంట నుంచి నాలుగు గంటల మధ్య.. తొంభైకి పైగా ఫ్లాష్ లైట్ ఫొటోలు ఉన్నాయి. అయితే అన్నీ అసంబద్ధంగా.. గజిబిజిగా ఉన్నాయి. వాటిలో అన్ని కొండలు, బండరాళ్లు, మొక్కలు, చెల్లాచెదురైన బట్టలు ఇవే ఉన్నాయి. ఒకే ఒక్క ఫొటోలో మాత్రం క్రిస్ తల వెనుక భాగం ఉంది. అది కూడా రక్తమోడుతూ! అది చూసి షాకయ్యారు అధికారులు. ఈ లోపు దర్యాప్తు సంస్థలు.. బ్యాగ్ దొరికిన ప్రాంతాన్ని అణువణువూ వెతికించాయి. అప్పుడే క్రిస్ డెనిమ్ డ్రెస్ దొరికింది. రెండు నెలల తర్వాత ఎడమ కాలి షూ దొరికింది. అందులో తెగిన కాలు ఉంది. కాసేపటికి అదే నది ఒడ్డున చెల్లాచెదురుగా పడున్న ఎముకలు కూడా కనిపించాయి. డీఎన్ఏ పరీక్షల్లో అవన్నీ క్రిస్, ఫ్రూన్లకు చెందినవని వైద్యులు తేల్చారు. అయితే వారికి మరణం ఎలా సంభవింందో తెలియలేదు. క్రిస్ అవశేషాలు పూర్తిగా ఎముకలుగా మిగిలితే.. ఫ్రూన్ అవశేషాలు.. సగానికి పైగా కుళ్లిపోయి ఉన్నాయి. ఆ ఆధారాలను బట్టి ఫ్రూన్ కంటే ముందుగా క్రిస్ మరణింందని భావించారు. క్రిస్ మరణం తర్వాత సిగ్నల్ కోసం ఫ్రూన్ .. క్రిస్ ఫోన్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించి ఉంటుందని నమ్మారు అధికారులు. క్రిస్, ఫ్రూన్ల మరణం వెనుక ఏదో కుట్ర ఉండే ఉంటుందని, ఎవరో నేరం చేసి తెలివిగా తప్పించుకుని ఉంటారని కొందరు నమ్మారు. ‘కెమెరాలో ఏప్రిల్ 1 తర్వాత వాళ్లు ఏ ఫొటోలు తీసుకోకపోవడం విచిత్రమని, ఏప్రిల్ 8న అసంబద్ధమైన ఫొటోలు ఉండటం కూడా అనుమానాస్పదమే’నని వారు భావించారు. దీన్ని ఆ అమ్మాయిల కుటుంబాలు కూడా నమ్మాయి. వీరి గాథ వింటుంటే.. వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఒకరికొకరు సాయం అనుకుని ఆనందంగా గడపడానికి వెళ్లారు. కానీ ఒక్కరూ ప్రాణాలతో తిరిగి రాలేదు. ఒకవేళ ట్రెకింగ్‌లో ఏ కొండ మీద నుంచో పడిపోయి ఉంటారని కొందరు, క్రూర మృగాలు దాడి చేసి ఉంటాయని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇంకొందరైతే ఈ వ్యథకు హారర్ రంగులద్ది హడలెత్తించారు. అంత పెద్ద అడవిలో సాయం చేసేవారు లేక.. ఏదైనా ప్రమాదం జరిగి, కదల్లేని స్థితిలో.. ఎంత నరకం అనుభవించి ఉంటారోనన్న ఊహ.. ఆ కుటుంబాలను మరింత క్రుంగదీసింది. ఒంటరిగా ఇద్దరు ఆడపిల్లలు అలాంటి అడవిలోకి వెళ్లడం సరికాదనే వారూ లేకపోలేదు. నిజానికి వారిని ఎవరైనా చంపేశారా? ప్రమాదవశాత్తు మరణించారా? అనేది ఇప్పటికీ మిస్టరీనే. -సంహిత నిమ్మన (చదవండి: పోలీసులనే హడలెత్తించిన మిస్టరీ కేసు..అతడొస్తే.. వర్షం వచ్చేస్తుంది!) -
48 గంటల్లోనే హైవే కింద సొరంగం.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్..
డచ్ దేశం నెదర్లాండ్స్‌లో ఒక్క వారాంతంలోనే హైవే కింద సొరంగం నిర్మించిన వీడియోను షేర్ చేశారు భారతవ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా. ఇలాంటి నైపుణ్యం కదా మనం సంపాందిచుకోవాల్సిందని కొనియాడారు. ఇది లేబర్‌ను తగ్గించుకోవడం కాదు.. సమయాన్ని ఆదా చేసుకోవడం అని చెప్పుకొచ్చారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలో ఇలా వేగంగా పనులు చేయడం కూడా చాలా కీలకమని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. వేగవంతమైన మౌలిక సదుపాయాల కల్పన అంటే వేగవంతమైన వృద్ధి, అందరికీ ప్రయోజనాలు చేకుర్చడం అని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. The Dutch built a tunnel under a highway in just one weekend! Skills we must acquire. It’s not about labour-saving, but about time-saving. That’s also critical in emerging economy. Faster infrastructure creation means faster growth & benefits to all. pic.twitter.com/SoU3NEsgpE — anand mahindra (@anandmahindra) March 3, 2023 -
విమాన కూల్చివేత కేసు.. ఎనిమిదేళ్లకు న్యాయం
ఆమ్స్టర్డ్యామ్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 298 మంది మృతికి కారణమైన నిందితులకు ఆలస్యంగా అయినా కఠిన శిక్ష పడింది. ఎంహెచ్17 మలేసియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఘటనలో నెదర్లాండ్స్ కోర్టు ఇద్దరు రష్యన్లు, ఒక ఉక్రెయిన్ వేర్పాటువాదికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2014 జూలై 17న నెదర్లాండ్స్‌లోని అమ్‌స్టర్‌డ్యామ్ నుంచి మలేసియాలోని కౌలాలంపూర్‌కు బయలుదేరిన బోయింగ్ 777 విమానాన్ని రష్యా అనుకూల ఉక్రెయిన్ వేర్పాటువాదులు బక్ మిస్సైల్ ప్రయోగించి, కూల్చేశారు. విమానం ఉక్రెయిన్ భూభాగంలో కూలిపోయింది. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది సహా మొత్తం 298 మంది మరణించారు. ఈ కేసుకు సంబంధించి మరో వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేసింది డచ్ కోర్టు. కోర్టు తీర్పుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో రష్యా పాత్ర ఉందనే విషయం స్పష్టమైందని బాధిత కుటుంబాలు పేర్కొంటున్నాయి. నెదర్లాండ్స్‌కు చెందిన 196 మంది, 43 మంది మలేసియన్ వాసులు, 38 మంది ఆస్ట్రేలియాకు చెందిన వాళ్లు.. ఇలా మొత్తం పది దేశాలకు చెందిన ప్రయాణికులు ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యారు. అయితే రష్యా మాత్రం అది ఉక్రెయిన్ వేర్పాటువాదుల పని అయ్యిండొచ్చని, అందులో మాస్కో ప్రమేయం ఏం లేదని పాత పాటే పాడుతోంది. -
‘సీ’దదీరుతూ....అండర్ వాటర్ ఎంటర్టైన్మెంట్
సముద్రంపై నౌకలో పార్టీలు, పెళ్లిళ్లు మాత్రమే మనకు ఇప్పటివరకు తెలుసు. సముద్రంలోతుల్లోనూ పార్టీ చేసుకునే అద్భుత అవకాశాన్ని తీసుకొచ్చిందో డచ్ కంపెనీ. సముద్రం లోపల సబ్‌మెరైన్‌లో పార్టీ... ఊహించడానికే థ్రిల్లింగ్‌గా ఉంది కదా! సాధారణంగా జలాంతర్గాములను నేవీకోసమో, లేదంటే సముద్రపు లోతుల్లోని రహస్యాలను కనుగొనేందుకో ఉపయోగిస్తారు. కానీ వ్యక్తిగత, వాణిజ్య జలాంతర్గాముల తయారీలో దిగ్గజ సంస్థ అయిన నెదర్లాండ్స్‌కు చెందిన యూ–బోట్‌వర్క్స్ ఈ అండర్ వాటర్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్ (యూడబ్ల్యూఈపీ)ను తయారు చేసింది. మినీ క్రూయిజ్ షిప్ తరహాలో రూపొందించిన ఈ సబ్‌మెరైన్ 200 మీటర్ల లోతువరకు డైవ్ చేయగలదు. 120మంది ప్రయాణించగలిగే సబ్‌మెరైన్‌లో 64 సీట్ల సామర్థ్యమున్న రెస్టారెంట్, జిమ్, కాసినో, వెడ్డింగ్ హాల్ కూడా ఉన్నాయి. సముద్రంలోపలి అద్భుతాలను వీక్షించేందుకు వీలుగా దీనికి 14 విశాలమైన కిటికీలను ఏర్పాటు చేశారు. వాటి బయట సముద్రం స్పష్టంగా కనిపించేందుకు ప్రకాశవంతమైన దీపాలను అమర్చారు. ఇది సముద్రతీరంలో ఉన్నప్పుడు, ఉపరితలంపై ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు తీరపు అందాలను ఆస్వాదించేలా యూడబ్ల్యూఈపీపై సన్‌డెక్‌ను, దాని చుట్టూ రెయిలింగ్‌ను కూడా ఏర్పాటు చేశారు. బ్యాటరీతో నడిచే ఈ సబ్‌మెరైన్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 24గంటలపాటు ప్రయాణించొచ్చు. యూడబ్ల్యూఈపీ ఓ సంచలనమని, నీటి అడుగున వేడుకలకు ఇది దారి చూపుతుందని యూ–బోట్‌వర్క్స్ వ్యవస్థాపక సీఈవో బెర్ట్ హౌట్మాన్ తెలిపారు. ఇంకెందుకాలస్యం.. నెదర్లాండ్స్‌కు వెళదాం అనుకుంటున్నారా! ఆగండాగండి.. ఏదైనా టూరిజం కంపెనీ కొనుగోలు చేసి టూర్స్ ఆఫర్ చేసేవరకూ మనం ఎదురుచూడాల్సిందే. (చదవండి: రష్యా బలగాల దుర్మార్గం! కాల్పులు జరిపి సజీవంగా పాతిపెట్టి.) -
రక్తంలో తిష్ట వేసిన ప్లాస్టిక్ కణాలు..షాక్‌లో శాస్త్రవేత్తలు!
Microplastic in human blood: ప్లాస్టిక్ వాడొద్దు అంటూ ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు ఎన్నోఏళ్లుగా మొత్తుకుంటున్నారు. కానీ ప్రజలు తమ నిత్య జీవన విధానంలో ఈ ప్లాస్టిక్ వస్తువులకు అలవాటుపడిపోయారు. అంతతేలిగ్గా బయటేపడే అవకాశం తక్కువ. అదీగాక ప్లాస్టిక్ చాలా చౌకగా దొరకడమే కాకుండా సామాన్య మానవునికి సైతం అందుబాటులో ఉంటుంది. ప్లాస్టిక్ పర్యావరణానికి హానికరం అందువల్ల దయచేసి వాడొద్దు అంటూ నినాదాలు చేసి మరీ సహజ పద్ధతుల్లో తయారు చేసినవి మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు కూడా. ప్రజలు ఇటీవలే వాటిని వాడేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గానీ ఆ ప్లాస్టిక్ వల్ల జరగవల్సిన నష్టం ఎప్పడో మనిషికి జరిగిపోయింది అంటున్నారు డచ్ శాస్త్రవేత్తలు. అసలేం జరిగిందంటే...పది మంది వ్యక్తుల రక్త నమూనాల్లో దాదాపు 8 మంది రక్తంలో మైక్రోప్లాస్టిక్ కణాలను గుర్తించామని డచ్ శాస్త్రవేత్తలు తమ తాజా అధ్యయనాల్లో వెల్లడించారు. తాము పరిశోధనలు చేసిన సుమారు 77 శాతం మందిలో రక్త ప్రవాహంలో మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నాయని తెలిపారు. ప్లాస్టిక్ గాలితో పాటు ఆహారం, పానీయాల ద్వారా కూడా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుందని వ్రిజే యూనివర్సిటీ ఆమ్స్టర్డామ్లోని ఎకోటాక్సికాలజీ అండ్ వాటర్ క్వాలిటీ అండ్ హెల్త్ ప్రొఫెసర్ డిక్ వెథాక్ నివేదికలో తెలిపారు. పైగా పాలీప్రొఫైలిన్, పాలీస్టైరిన్, పాలీమిథైల్ మెథాక్రిలేట్, పాలిథిలిన్ పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ (పీఈటీ) వంటి ఐదు రకాల ప్లాస్టిక్‌ల గురించి పరిశోధనాలు చేయడం మెదలు పెట్టారు. అందులో భాగంగా దాదాపు 22 మంది రక్త నమునాలను సేకరించారు. అయితే ఆ పరిశోధనల్లో చాలా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. సుమారు 17 మంది రక్తదాతల రక్తంలో ప్లాస్టిక్ రేణువుల ఉన్నాయని తెలిపారు. ఆ పరిశోధనల్లో కొంతమంది రక్తదాతల్లో గృహోపకరణాలకు వినియోగించే ప్లాస్టిక్ ఉందని, మరికొంతమంది రక్తం క్యారియర్ బ్యాగ్‌లను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పాలిథిన్‌ని గుర్తించినట్లు తెలిపారు. అంతేకాదు పరీక్షించిన వారిలో 50 శాతం మంది రక్తంలో పాలిథిలిన్ టెరెఫ్తాలేట్, 36 శాతం మంది రక్తప్రవాహంలో పాలీస్టైరిన్ కూడా ఉందని వెల్లడించారు. ఏదీఏమైన మానవుని ఆరోగ్యం ప్రమాదకరమైన స్థితిలోకి చేరకమునుపే ప్లాస్టిక్‌కి సంబంధించిన వస్తువులను పూర్తిగా బ్యాన్ చేయాల్సిందే. (చదవండి: బరువులు ఎత్తడంలో, ఎత్తులను ఎక్కడంలోనూ దిట్ట! -
చిక్కుల్లో ప్రపంచ కుబేరుడు.. కుళ్లిన కోడిగుడ్లతో కొడతామంటూ ప్రజల హెచ్చరిక!
అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు జెఫ్ బేజోస్ ఊహించని చిక్కుల్లో పడ్డారు. ఎంతో ముచ్చపడి తయారు చేయించుకున్న పడవ ఆయన్ని కలవరపాటుకి గురి చేస్తోంది. అలలపై ప్రయాణం మొదలుకాకముందే ఆయన్ని వివాదాల్లోకి ముంచింది. మెగాయాచ్ ఎలన్‌మస్క్ కంటే ముందు ప్రపంచంలో నంబర్ ధనవంతుడిగా రికార్డులెక్కారు జెఫ్ బేజోస్. దాదాపు 200 బిలియన్ డాలర్లకు సంపద ఆయన సొంతం. ఈ క్రమంలో తను సేద తీరేందుకు.. విహార యాత్రలు చేపట్టేందుకు సర్వాంగ సుందరంగా.. సకల సౌకర్యాలతో ఓ పడవ (మెగాయాచ్) తయారు చేయించుకోవాలని నిర్ణయించారు. కస్టమైజ్డ్ యాచ్‌లు తయారు చేసే ఓ డచ్ కంపెనీతో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. హలాండ్లో నిర్మాణం హలాండ్లోని ప్రముఖ పోర్టు సిటీల్లో రోటెర్డామ్ దగ్గరున్న ఆల్బ్లెస్సర్డామ్లో Y721 పేరుతో మెగాయాచ్ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పడవ ఖరీదు రమారమీ 485 మిలియన్ డాలర్లు. ఎట్టకేలకు ఫుట్‌బాల్ స్టేడియం కంటే పెద్దదిగా ఈ యాచ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ యాచ్‌ని సముద్రంలో ప్రవేశపెట్టే సమయంలో పెద్ద చిక్కు వచ్చి పడింది. రోటెర్డామ్లో చారిత్రక సంపదగా భావించే ఓ వంతెన యాచ్ ప్రయాణానికి అడ్డుగా నిలిచింది. చారిత్రక వంతెన యాచ్‌ని తయారు చేసిన చోటు నుంచి సముద్రంలోకి తీసుకెళ్లే నీటి ప్రవాహంపై పురాతన కాలం నాటి కోనింగ్షావెన్ అనే వంతెన ఉంది. దీనిని మొదటిసారి 1878లో నిర్మించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ నాజీలతో జరిగిన యుద్దంలో బాంబింగ్ కారణంగా ఈ వంతెన పాడవగా.. తిరిగి పునర్మించారు. అప్పటి నుంచి ఈ వంతెన ఓ చారిత్రాత్మక కట్టడంగా స్థానికులు భావిస్తున్నారు. చివరిసారి 2017లో వంతెనకు మరమ్మత్తులు చేశారు. వంతెన కూల్చేద్దాం జెఫ్‌బేజోస్ కోసం తయారు చేసిన మెగా యాచ్‌ను సముద్రంలోకి పంపే క్రమంలో పురాతన వంతెన అడ్డుగా ఉన్నందున... పాక్షికంగా వంతెనను కూల్యేయాలంటూ పడవ తయారీ సంస్థ రోటెర్డామ్ పాలకమండలకి విజ్ఞప్తి చేసింది. యాచ్‌ను సముద్రంలో పంపిన తర్వాత వంతెన పునర్ నిర్మాణానికి నిధులు అందిస్తామని పేర్కొంది. మేం ఒప్పుకోం జెఫ్ బేజోస్ పడవ వెళ్లేందుకు తమ చారిత్రక కట్టడానికి కూల్చాలనే ప్రతిపాదనలను రోటెర్డామ్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వంతెన కూల్చివేతకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. తమ సెంటిమెంట్స్ పట్టించుకోకుండా వంతెన కూల్చి ఈ మార్గంలో జోఫ్ బేజోస్ పడవని తీసుకెళ్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. కుళ్లిన కోడిగుడ్లతో యాచ్‌పై దాడి చేస్తామంటూ తమ కార్యాచరణ ప్రకటించారు. సోషల్ మీడియాలో ఈ కోడిగుడ్ల దాడికి మద్దతు రోజురోజుకి పెరుగుతోంది. బాయ్‌కాట్ అమెజాన్ ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ఏం చేయాలో పాలుపోక ఇటు రోటెడ్డ్యామ్ పాలకమండలి, అటు పడవ తయారీ కంపెనీలు బిక్కచచ్చిపోయాయి. మరోవైపు జెఫ్‌బేజోస్‌కి వ్యతిరేకంగా బాయ్‌కాట్ అమెజాన్ అంటూ గళం విప్పుతున్నారు. మొత్తంగా ఈ కొత్త పడవ వ్యహారం జెఫ్‌బేజోస్‌కి టైటానిక్‌లా మారింది. చదవండి: అమెజాన్ బాస్ పంటపండింది.. ఏకంగా లక్షా నలభై వేల కోట్లకు పైనే పెరిగిన సంపద -
ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ఐదు సంవత్సరాల వారంటీ...!
Fairphone 4 Sustainable Smartphone: మనకు నచ్చిన ఫలానా కంపెనీకి చెందిన స్మార్ట్‌ఫోన్ కొన్నమనుకోండి. దానిపై వారంటీ ఎన్ని రోజులమేర వస్తుందంటే...! సింపుల్‌గా వన్ ఇయర్ వారంటీ వస్తోందని చెప్తాం. ఫోన్‌తో వచ్చే ఇతర ఎలక్ట్రానిక్స్‌పై ఆర్నెల్లపాటు వారంటీ వస్తుంది. స్మార్ట్‌ఫోన్ తయారుచేసే కంపెనీలు గరిష్టంగా ఒక ఏడాది పాటు మాత్రమే వారంటీని అందిస్తాయి. ఈ సమయంలో ఫోన్‌కు ఏమైనా సమస్యలు తలెత్తితే ఆయా కంపెనీలు చూసుకుంటాయి. వారంటీ ముగిసిపోయాక ఏదైనా సమస్య వస్తే కచ్చితంగా డబ్బులను వసూలు చేస్తాయి. కాగా ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై కంపెనీ ఏకంగా ఐదేళ్ల పాటు వారంటీను అందిస్తోంది. చదవండి: వరుస సంక్షోభాలు.. చైనాకు భారీ దెబ్బే: గోల్డ్‌మన్ సాక్స్ మన్నికైన, పర్యావరణహితంగా ఉండే స్మార్ట్ఫోన్లను ప్రముఖ డచ్ కంపెనీ ఫెయిర్‌ఫోన్ తయారుచేస్తోంది. భూమ్మీద ఎలక్ట్రానిక్స్ ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా ఫెయిర్‌ఫోన్ పనిచేస్తోంది. తాజాగా ఫెయిర్‌ఫోన్ 4 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి పనిచేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ఐదేళ్ల పాటు వారంటీని అందిస్తుంది. భవిష్యత్తులో వచ్చే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ 12, 13, 14, 15 వెర్షన్లను సపోర్ట్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8జీబీ ర్యామ్+256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌తో లభిస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్ గ్రీన్, గ్రే, స్పెక్ల్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్లతో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చును. అక్టోబర్ 25 నుంచి కంపెనీ పలు దేశాలకు డెలివరీ చేయనున్నట్లు తెలుస్తోంది. 6జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 49,800 కాగా 8జీబీ వేరియంట్ ధర రూ. 55, 845. ఫెయిర్‌ఫోన్ 4 ఫీచర్లు.. 6.3-అంగుళాల ఫుల్-హెచ్డి+ (1,080x2,340 పిక్సెల్స్) ఐపిఎస్ ఎల్సిడి డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 స్నాప్‌డ్రాగన్ 750జీ ఆడ్రెనో 619 జీపీయూ 8జీబీ ర్యామ్+ 256 ఇంటర్నల్ స్టోరేజ్+ 2టీబీ మైక్రో ఎస్డీ సపోర్ట్ ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ 48 ఎమ్పీ రియర్ కెమెరా 25ఎమ్పీ సెల్ఫీ కెమెరా 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 3,905mAh రిమూవబుల్ బ్యాటరీ డ్యూయల్ బ్యాండ్ వైఫై 5జీ సపోర్ట్, యూఎస్బీ టైప్‌సీ చదవండి: రోల్స్‌రాయిస్ నుంచి తొలి ఎలక్ట్రిక్ కార్‌పై ఓ లుక్కేయండి..! -
రికార్డుల్లోకి బర్గర్.. ధర ఏకంగా రూ. 4.5 లక్షలు, ఎందుకంత ఖరీదు?
ఏ పని చేసినా కాస్త కళా పోషణ.. ప్రత్యేకత ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆ కోవలోకే చెందుతాడు రాబర్ట్ జాన్ డీ వీన్. ఇంతకీ ఆయనెవరు..? అంత ప్రత్యేకమైన పని ఏం చేశాడు? సాధారణంగా బర్గర్ అంటే ఏ వందో రెండొందలో ఉంటుంది. ఫైవ్‌స్టార్ రెస్టారెంట్లలో అయితే రూ.500 వరకు ఖరీదు ఉంటుంది. మరి ఈ ఫొటోలో ఉన్న బర్గర్ ఎంతో తెలుసా..? అక్షరాలా రూ.4.5 లక్షలు. ఏంటీ అంత చిన్న బర్గర్‌కు అంత ఖరీదా అని ఆశ్చర్యపోతున్నారా? ఈ ప్రత్యేకతే ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన బర్గర్‌గా రికార్డుల్లోకి ఎక్కేలా చేసింది. డీ డాల్టన్ అనే డచ్ రెస్టారెంట్ యజమాని అయిన రాబర్ట్‌కు ప్రత్యేకంగా ఏదైనా చేయాలని భావించాడు. వెంటనే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బర్గర్ అని ఇంటర్నెట్లో వెతకగా, 2011లో 352 కిలోలతో ఓరేగాన్ రెస్టారెంట్ తయారు చేసిన బర్గర్‌కు దాదాపు రూ.3,72,432 రికార్డు ధర పలికినట్లు తెలుసుకున్నాడు. దీని కన్నా ఖరీదైన బర్గర్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఎక్కు వ బరువుతో చేస్తే ఆహారపదార్థాలు చాలా వ్యర్థం అవుతా యని భావించాడు. పైగా ఒక్కరే తయారుచేసేలా, ఒక్కరే ఆ బర్గర్‌ను ఆరగించేలా ఉండాలని తనకు తాను షరతు విధించుకున్నాడు. దాంతో ఖరీదైన పదార్థాలతో తయారు చేయాలనుకుని, బర్గర్ కోసం వాడే రొట్టె (బన్)ను బంగారు పూతతో పూసి, రొట్టెల మధ్య ఉంచే పదార్థాలను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటిని ఉంచాడు. దీంతో ఈ బర్గర్ ఖరీదు అమాంతంగా పెరిగిపోయి అత్యంత ఖరీదైన బర్గర్‌గా రికార్డులు తిరగరాసింది. దీనికి రాబర్ట్ ముద్దుగా పెట్టుకున్న పేరు గోల్డెన్ బాయ్..! -
బాధితుల గొంతుక.. ప్రాణాలతో పోరాడుతున్న డచ్ క్రైమ్ రిపోర్టర్
హేగ్ (నెదర్లాండ్స్): ప్రముఖ డచ్ క్రైమ్ రిపోర్టర్ పీటర్ ఆర్. డి వ్రీస్పై దుండుగులు కాల్పులకు తెగపడ్డారు. తీవ్రగాయాపాలైన ఆయనను ఆమ్స్టర్డామ్లోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ప్రస్తుతం ఆయన ప్రాణాలతో పోరాడుతున్నారు. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. డి వ్రీస్ తలపై దుండగులు అయిదు సార్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. పీటర్ ఆర్. డి వ్రీస్ జర్నలిస్ట్, టీవీ ప్రెజెంటర్. క్రిమినల్ కేసులపై పరిశోధన చేయడంలో ఆయనకు మంచి పేరు ఉంది. పీటర్ ఆర్. డి వ్రీస్ బాధితుల తరపున నిత్యం తన గొంతుకను వినిపిస్తుంటారు. గతంలో డి వ్రీస్కు అనేక కేసులకు సంబంధించి క్రిమినల్ అండర్ వరల్డ్ నుంచి బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ ఘటనపై డచ్ ప్రధాన మంత్రి మార్క్ రుట్టే హేగ్‌లోని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఈ దాడి దిగ్భ్రాంతికరమైనది. ఓ సాహసోపేతమైన జర్నలిస్టుపై దాడి చేయడం.. మన ప్రజాస్వామ్యం, స్వేచ్ఛాయుత పత్రికల పై దాడి చేయడం వంటిది." అని అన్నారు. కాగా, ఈ ఘటనలో షూటర్‌తో.. సహా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డౌన్ టౌన్ లీడ్సెప్లిన్ స్క్వేర్ సమీపంలో కాల్పులు జరిపిన ప్రాంతంలో వీడియో ఫుటేజ్, సాక్షి స్టేట్మెంట్స్, ఫోరెన్సిక్ సాక్ష్యాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇక 2005లో అరుబాలో టీనేజర్ నటాలీ హోల్లోవే అదృశ్యంపై దర్యాప్తు చేసినందుకు 2008లో కరెంట్ ఎఫైర్స్ విభాగంలో డి వ్రీస్ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డును గెలుచుకున్నారు. -
ఎగిరే కారు వచ్చేసిందోచ్..!
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఎగిరే కారు వచ్చేసిందోచ్.. నెదర్లాండ్‌కు చెందిన పాల్–వీ అనే కంపెనీ తొలి కారును సిద్ధం చేసింది. యూరప్‌లో అన్ని రకాల ప్రభుత్వ అనుమతులను పొందింది. ఇప్పుడు ఎవరైనా ఈ కారు కొనుక్కుని ఎంచక్కా ఎగిరేయొచ్చు. ఎగిరే కారు ఆలోచనలు ఇప్పటివి కావు. కానీ ఈ కల సాకారం కాలేదు. అంతెందుకు ఈ పాల్–వీ కారు తయారీకి కూడా 20 ఏళ్లు పట్టింది. ఈ ఎగిరే కారు పేరు ‘ది లిబర్టీ’. వాహనం బరువు తగ్గించేందుకు మూడు చక్రాలతో తయారు చేశారు. నాలుగు చక్రాల వాహనాలతో పోలిస్తే 3 చక్రాల వాహనానికి లైసెన్సు కూడా సులువుగా లభిస్తుందట. రోడ్డుపై వెళ్లేటప్పుడు ద లిబర్టీ రెక్కలు పైభాగంలో ముడుచుకుని ఉంటాయి. విమానంగా మారేటప్పుడు రెక్కలు విచ్చుకుంటాయి. 100 హెచ్‌పీ గల ఇంజిన్‌తో ఇది తొమ్మిది సెకన్లలోనే వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గంటకు 180 కి.మీ. వేగంతో.. రెండు సీట్లు మాత్రమే ఈ కారులో ఉంటాయి. గాలిలో ఇది గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. టేకాఫ్ కోసం వెయ్యి అడుగుల రన్‌వే అవసరం కాగా.. ల్యాండ్ అయ్యేందుకు వంద అడుగుల దారి సరిపోతుంది. ఇంధన ట్యాంకులో వంద లీటర్ల ఇంధనాన్ని నింపుకొంటే 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు. అదనంగా మరో అరగంట పాటు నడిచేందుకు రిజర్వ్ ట్యాంకు కూడా ఉంది. రోడ్డుపై వెళ్లేటప్పుడు మైలేజీ లీటర్‌కు 13 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడే దీన్ని కొని గాల్లో ఎగిరేందుకు తహతహలాడకండి. ఎందు కంటే ఈ కారు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చేందుకు 2022 వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు అందుబాటులోకి తెచ్చేందుకు కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. ఈలోపు విమానంగా ఉపయోగించేందుకు అవసరమైన అనుమతులు సాధించే ప్రయత్నాల్లో కంపెనీ ఉంది. చదవండి: చైనాకి మరిన్ని వందేభారత్ విమానాలు -
కరోనా: మింక్‌లను చంపేందుకు నిర్ణయం..
ఆమ్స్టర్డామ్: కరోనా మనుషులు, మూగజీవాల మధ్య బంధాన్ని దూరం చేసిందా? దగ్గర చేసిందా? అనే ప్రశ్నకు బహుశా సరైన సమాధానం దొరక్కపోవచ్చు. ఎందుకంటే కరోనా బయటపడ్డ తొలినాళ్లలో చైనా సహా పలు దేశాల ప్రజలు పెంపుడు జంతువులే ఈ మహమ్మారి వ్యాప్తికి కారణమవుతున్నాయన్న అపోహతో జనం వాటిని నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీదకు విసిరేశారు. అయితే పెంపుడు జంతువుల వల్ల కరోనా వ్యాపిస్తుందనడానికి సరైన ఆధారాలు లేవని వైద్యులు వెల్లడించడంతో మూగజీవాలపై వివక్ష మానుకున్నారు. అటు జూలో ఉన్న జంతువులకూ మనుషుల ద్వారా వైరస్ వ్యాపించడం అప్పట్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. (ఇటలీని దాటేసిన భారత్) ఇదిలా వుండగా కరోనా భయంతో నెదర్లాండ్ ప్రభుత్వం మింక్‌లను చంపేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మింక్‌ల ద్వారా ఇద్దరు వ్యక్తులకు కరోనా వ్యాప్తి చెందినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో వాటివల్ల మానవులకు వైరస్ ముప్పు పొంచి ఉందని అభిప్రాయపడిన ప్రభుత్వం మింక్‌లను హతమార్చాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మింక్ ఫార్మ్లను అన్నింటినీ నేలమట్టం చేయాలని స్పష్టం చేసింది. దీంతో 10వేల మింక్‌లు మృత్యువాత పడనున్నాయి. కాగా చైనా, డెన్మార్క్, పోలాండ్ దేశాలు మింక్‌ల సంఖ్య ఎక్కువగా ఉండగా ప్రతి ఏడాది 60 మిలియన్ల మింక్‌లను హతమారుస్తున్నారు. (మరింత తగ్గిన మరణాల రేటు) -
డచ్‌లో ట్రాక్టర్లతో రైతన్నలు...
డచ్ పార్లమెంట్లో సభ్యులు చేసిన ఆరోపణలు రైతన్నల గుండెల్లో తూటాల్లా పేలాయి. వారంతా ఆందోళన బాట పట్టి ప్రభుత్వాన్ని హడలెత్తించారు. దేశంలో పర్యావరణ కాలుష్యానికి, గాలిలో నైట్రోజన్ ఆక్సైడ్ శాతం పెరిగిపోవడానికి వ్యవసాయమే కారణమని కొందరు సభ్యులు పార్లమెంట్లో వ్యాఖ్యానించారు. వారికి మద్దతుగా మరికొందరు గోశాలల్ని మూసివేయాలంటూ నినదించారు. దీంతో అన్నదాతల్లో ఆగ్రహం పెల్లుబుకింది. డచ్‌లో విమానాల పరిశ్రమ సర్వ అనర్థాలకు కారణమంటూ వారు మండిపడ్డారు. కానీ వారిని ఎవరూ నిందించడం లేదని తప్పుబట్టారు. రైతులు నిరసన వ్యక్తం చేయడానికి హేగ్‌కు వెళ్లే రహదారిని వేలాది ట్రాక్టర్లతో మోహరించారు. దాదాపుగా 1,136 కి.మీ. మేర ట్రాఫిక్‌జామ్ అయింది. ఇంచుమించుగా 3 వేల మంది వరకు రైతన్నలు ట్రాక్టర్లతో ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. -
వయసు తగ్గించమని కోర్టుకెక్కాడు!
తన వయసు వల్ల వివక్షకు గురవుతున్నానని, ఇందుకు తన వయసును 20 ఏళ్లు తగ్గించాలంటూ ఎమిలే రాటిల్‌బాండ్ (69) అనే డచ్ పౌరుడు కోర్టు మెట్లెక్కాడు. ఇందుకు ఆయనకు వచ్చే ఓల్డేజ్ పెన్షన్ సైతం వదులుకున్నాడు. ‘నా వయసు 69 అయినా నేను కొత్త ఇల్లు కొనగలను. కుర్రవాడిలా వేగంగా కారు నడపగలను. 49 ఏళ్ల వయసప్పుడు నా ముఖం ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. నా ఆస్తి అంతస్థులూ, స్థితిగతులు మారనప్పుడు నా వయసు మారడమేంటో అర్థం కావడం లేదు’ అంటూ రాటిల్ బాండ్ కోర్టుకు వివరించాడు. తాను ముసలాడినని, పెన్షనర్నని కంపెనీలు ఉద్యోగంలో చేర్చుకోకుండా వివక్ష చూపిస్తున్నాయని ఫిర్యాదు కూడా చేశాడు. అందరూ పదే పదే తన వయసును గుర్తు చేయడం వల్ల జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. తొలుత ట్రాన్స్‌జెండర్‌గా మారడానికి సైతం కోర్టులు ఒప్పుకోలేదని అనంతర పరిణామాలతో ఒప్పుకోక తప్పలేదని.. ఇదీ అంతేనంటూ జడ్జికి గుర్తు చేసి ఒప్పించే ప్రయత్నం చేశాడు. పేర్లను మార్చుకోవడానికి ఒప్పుకున్నప్పుడు 1949 మార్చి 11గా ఉన్న పుట్టిన తేదీని1969 మార్చి 11గా మారిస్తే ఏమవుతుందని ప్రశ్నించాడు తనకు తాను ‘యంగ్ గాడ్’గా ప్రకటించుకున్న రాటిల్‌బాండ్. అతని వాదన విన్న కోర్టు విచారణ వాయిదా వేసింది. నాలుగు వారాల్లో ఈ వ్యాజ్యంపై తీర్పు వచ్చే అవకాశం ఉంది. -
డచ్ ఓపెన్ విజేత సౌరభ్ వర్మ
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ ప్లేయర్ సౌరభ్ ఆదివారం నెదర్లాండ్స్ లో ముగిసిన డచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 టోర్నీలో విజేతగా నిలిచాడు. ఫైనల్లో సౌరభ్ 21–19, 21–13తో జూన్ వె చెమ్ (మలేసియా)పై నెగ్గి 5,625 డాలర్ల (రూ. 4 లక్షల 14 వేలు) ప్రైజ్‌మనీ దక్కించుకున్నాడు. 86 ఏళ్ల చరిత్ర కలిగిన డచ్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచిన నాలుగో భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో ప్రకాశ్ పదుకొనే (1982), చేతన్ ఆనంద్ (2009), అజయ్ జయరామ్ (2014, 2015) ఈ ఘనత సాధించారు. -
ఒలికిపోయిన కాఫీ.. క్లీన్ చేసిన ప్రధాని!
ఎడిన్బర్గ్: రాజకీయ నేతలంటేనే ఆర్భాటాలు, హంగులు, సేవలు చేయించుకోడానికి సిబ్బంది, సైగలతోనే శాసనాలు.. అబ్బో ఆ హంగామానే వేరు. అలాంటిది ఆయనో ప్రధాని. ఆ స్థాయి వ్యక్తి నుంచి అంత కంటే ఎక్కువ బిల్డప్పే ఆశించటం సహజం. కానీ, ఊహించని ఘటనతో డచ్(నెదర్లాండ్స్) ప్రధాని ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేశారు. కాఫీ కప్పు ఒలకబోసిన ఆయన.. తానే స్వయంగా అక్కడ శుభ్రం చేసి నెటిజన్ల మన్ననలు అందుకుంటున్నారు. నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టే ఓ చేతిలో ఫైళ్లతో.. మరో చేతిలో కాఫీ కప్పుతో పార్లమెంట్‌లోకి వెళ్తున్నారు. ఇంతలో సెక్యూరిటీ వద్ద ఉన్న మెషీన్ తగిలి ఆ కప్పు ఒలికిపోయింది. ఆ స్థానంలో వేరే వారు ఉంటే సిబ్బందితో శుభ్రపరిచేవారేమో. కానీ, రుట్టే మాత్రం మహిళా సిబ్బంది చేతిలోని తుడిచే కర్రను లాక్కుని సరదాగా ఆయనే శుభ్రం చేశారు. ఇంతలో అక్కడికి వచ్చిన క్లీనింగ్ స్టాఫ్ ఆయన నిలువరించే యత్నం చేసినప్పటికీ ఆయన వారి మాట వినలేదు. తాను చేసిన పొరపాటుకు.. తాను శుభ్రం చేయటం సరైందని ఆయన వారితో చెప్పటం విశేషం. దీంతో వారంతా ఆయన చుట్టూ చేరి పాట పాడుతూ ఆయన్ని ప్రొత్సహించారు. ఇక ఈ వీడియో వైరల్ అవ్వటం, లైకులు, షేర్లతో దూసుకుపోతుండగా.. కామెంట్లు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. స్వచ్ఛ నెదర్లాండ్స్ అని, ఆ స్థానంలో మన నేతలు ఉంటే ఏం చేసేవారో అని ఒకరు... ఇప్పటి నుంచి భారతీయ నేతలు కూడా క్యూ కడతారేమోనని మరోకరు.. మార్క్ రుట్టేని చూసి మన నేతలు కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఇంకొకరు... ఇలా అభిప్రాయపడుతున్నారు. వైరల్ అవుతున్న ఆ వీడియోను మీరూ చూడండి... -
పదే పదే గ్యాస్ వదలుతున్నాడంటూ...
-
గ్యాస్ వదలుతున్నాడంటూ...
వియన్నా : కొన్ని మనకు చెప్పి రావు. ఎంత నియంత్రించుకున్న అలాంటి వాటి విషయంలో మనమేం చెయ్యగలిగింది ఏం లేదు. సరిగ్గా అలాంటి సమస్యతో బాధపడుతున్న ఓ పెద్దాయన ఇక్కడ విమానంలో రచ్చ రచ్చ రేపాడు. పదే పదే గ్యాస్ వదులుతున్నాడంటూ ఓ వ్యక్తితో ప్రయాణికులు గొడవకు దిగగా.. ఏం చేయాలో పాలుపోనీ పైలెట్ జట్టు పీకున్నాడు. డచ్ ఎయిర్ లైన్స్ ట్రాంసవియాకు చెందిన ఓ విమానం దుబాయ్ నుంచి అమస్టర్‌డామ్‌కు ప్రయాణికులతో బయలుదేరింది. అయితే జీర్ణకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ ప్రయాణికుడు పదే పదే ‘గ్యాస్’ వదులుతుండటంతో ఇతరులకు ఇబ్బంది కలిగించింది. అదే వరుసలో కూర్చున్న ఇద్దరు మహిళలతోపాటు మరో ఇద్దరు అభ్యంతరం వ్యక్తం చేశారు. విమాన సిబ్బందికి ఈ విషయంపై ఫిర్యాదు చేయగా.. ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఆ నలుగురు సదరు పెద్దాయనతో గొడవకు దిగారు. ఈ వ్యవహారంతో ఏం చేయాలో పాలుపోనీ పైలెట్ వియన్నాలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. గొడవ పడ్డ నలుగురిని దించేసి.. ఆపై ఫ్లైట్ తిరిగి బయలుదేరినట్లు సమాచారం. అక్కడి నుంచి వారిని ప్రత్యామ్నయ మార్గంలో అమస్టర్‌డామ్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఇంత గొడవకు కారణమైన ఆ వ్యక్తిని తిరిగి ఫ్లైట్ ఎక్కించుకున్నారా? లేక అతన్ని కూడా దించేశారా? అన్న దానిపై స్పష్టత కొరవడింది. -
తలుపులు పగలగొట్టిన పోలీసులు షాక్..!
ఆమ్స్టర్డ్యామ్: డచ్ పోలీసులకు ఇటీవల వింత అనుభవం ఎదురైంది. ఓ ఇంట్లో మహిళ ఉరేసుకుందన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. తలుపులు పగులగొట్టి మరీ ఆమెను కాపాడటానికి ప్రయత్నించారు. అయితే ఆ తరువాతే తెలిసింది వారికి అసలు విషయం. తూర్పు ఆమ్స్టర్డ్యామ్లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న కొందరు వ్యక్తులు ఓ ఫ్లాట్‌లో మహిళ ఉరేసుకొని ఉండటాన్ని గమనించారు. కిటికీలోంచి స్పష్టంగా వేలాడుతూ కనిపిస్తున్న ఆ మహిళ కొన్ని గంటలుగా అలా కదలకుండా ఉండటంతో.. వారు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సైతం ఇదే దృశ్యాన్ని చూసి మహిళ ఉరేసుకుందని భావించారు. కాలింగ్ బెల్ కొట్టినా ఎవరూ స్పందించకపోవటంతో చివరికి తలుపులు పగలగొట్టి.. ఇంట్లోకి ప్రవేశించారు. ఆ మహిళను దగ్గరగా పరిక్షించి చూస్తేగానీ తెలియలేదు.. అది గాలితో నింపిన ఒట్టి బొమ్మ అని. దీంతో పోలీసులు షాక్ తిన్నారు. ఈ అనుభవాన్నంతా మీడియాకు వెల్లడించిన పోలీసులు.. అది బొమ్మ అయినందుకు సంతోషంగా ఉందన్నారు. ఆమ్‌స్టర్‌డామ్‌లో సెక్స్ వర్క్‌కు చట్టబద్ధత ఉంది. అక్కడ సెక్స్ షాపుల్లో ఇలాంటి సెక్స్ టాయ్స్ విరివిగా లభిస్తాయి. అయితే బొమ్మకు ఎందుకు ఉరివేశారు అనే విషయం మాత్రం తెలియరాలేదు. -
'నేను ఉత్ప్రేరకాలు వాడేదాన్ని'
ది హేగ్: ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విజేత.. తాను నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినట్లు సంచలన ప్రకటన చేసింది. 1984 ఒలింపిక్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన డచ్ డిస్కస్ త్రో క్రీడాకారిణి రియా స్టాల్మన్ శుక్రవారం ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ తన కెరీర్ చివర్లో ఉత్ప్రేరకాలు వాడేదాన్ని అని వెల్లడించింది. 'అప్పట్లో చాలా మంది మహిళలు ఉత్ప్రేరకాలు వాడేవారు. వారిని నేను చిత్తుగా ఓడించాలనుకునే దాన్ని అందుకోసం నేను కూడా శక్తి సామర్థ్యాలు పెంచుకోవడానికి ఉత్ప్రేరకాలు వాడేదాన్ని' అని తెలిపింది. ఉత్ప్రేరకాలు వాడినటువంటి ప్రత్యర్థులను ఓడించలేనప్పుడు మనమూ వారి దారిలోకి వెళ్లడమే సరైన మార్గం అని అప్పుడు భావించానని తెలిపింది. ప్రాక్టీస్‌లో భాగంగా ఎక్కువ శారీరక శ్రమ కలిగినప్పుడు సైతం త్వరగా కోలుకోవడానికి ఉత్ప్రేరకాలు వాడేదాన్ని అని 64 ఏళ్ల రియా స్టాల్మన్ వెల్లడించింది. -
అతనికి విమానం కూలుతుందని ముందే తెలుసా?
విమానం ఎక్కే ముందు ఆ ప్రయాణికుడు ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టాడు. "విమానానికి ఏదైనా అయితే ఇదిగో నేనెక్కిన విమానం ఇలా ఉంటుంది" అంటూ పోస్టు చేశాడు అతను. కొద్ది గంటల తరువాతే అతను ప్రయాణిస్తున్న విమానం ఉక్రేన్ గగనతలం నుంచి భూతలానికి నిప్పురవ్వలా రాలిపోయింది. దాంతో అతని ప్రాణాలు కూడా అనంతవాయువుల్లో కలిసిపోయాయి. కోర్ పాన్ అనే డచ్ ప్రయాణికుడు ఉక్రేన్ లో కుప్పకూలిన విమానంలో ప్రయాణించి, కౌలాలంపూర్ కి బయలుదేరాడు. విమానం ఎక్కడానికి క్షణాల ముందు విమానం ఫోటో తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. హిందూ మహాసముద్రంలో కుప్పకూలిన ఎం హెచ్ 370 గుర్తుకొచ్చిందేమో, కాస్త సరదాగా ఓ కామెంట్ కూడా పెట్టాడు. దానికి మిత్రుల నుంచి కామెంట్లు కూడా వచ్చాయి. ఆ తరువాత కాస్సేపటికే ప్రమాదం జరగడంతో మిత్రుల కామెంట్లు వేళాకోళం నుంచి విషాదానికి మారాయి. కోర్ పాన్ తో పాటు అతని గర్ల్ ఫ్రెండ్ నీల్ ట్యే తోలా కూడా అదే విమానంలో ఉంది. కలసి చేసిన ప్రయాణమే వారి ఆఖరి ప్రయాణంగా మారింది.