dwarakatirumala
-
ఏలూరు జిల్లా: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై దాడి
-
ప్రేమ వివాహం.. సాంబశివరావు చెవికొరికి, కర్రలతో దాడి
సాక్షి, ఏలూరు: జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి శివార్లలోని ఓ రెస్టారెంట్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై దాడి జరిగింది. యువతి తండ్రి, తమ్ముడు దాడికి పాల్పడ్డారు. దెందలూరు మండలం చల్లచింతలపూడి గ్రామానికి చెందిన సాంబశివరావు, పావని మూడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత రాత్రి యువతి తండ్రి, తమ్ముడు సాంబశివరావు చెవి కొరికి, కర్రలతో దాడి చేశారు. దీంతో సాంబశివరావు, పావని ద్వారకాతిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: (చంద్రబాబును, ఆయన కొడుకుని ప్రజలు బాదేశారు: మంత్రి అంబటి) -
ప్రధాన దేవాలయాల్లో అమల్లోకి కోవిడ్ ఆంక్షలు
ద్వారకాతిరుమల/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలైన విజయవాడ దుర్గమ్మ ఆలయం, పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాల్లో మంగళవారం నుంచి కోవిడ్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఇరు ఆలయాల్లోని దర్శనానికి వెళ్లే క్యూ కాంప్లెక్స్‌ల వద్ద దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ జరిపి, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేయించారు. మాస్క్ ధరించాలని ప్రతి ఒక్కరికీ సూచిస్తున్నారు. భక్తుల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు చేపట్టారు. ఇరు ఆలయాల్లో గంటకు 1,000 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. చినవెంకన్న స్వామివారిని దర్శించిన భక్తులకు శేషాచల కొండపైన వకుళమాత అన్నదాన భవనం వద్ద ప్యాకెట్ల రూపంలో అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ, తీర్థం, శఠారి, అంతరాలయ దర్శనాన్ని నిలుపుదల చేశారు. ఇంద్రకీలాద్రిపై నిత్యం జరిగే ఆర్జిత సేవల్లో 50 శాతం టికెట్లను మాత్రమే విక్రయిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై నిత్య అన్నదాన ప్రసాద వితరణను అధికారులు నిలిపివేశారు. దీంతో మహా మండపం మూడో అంతస్తులోని క్యూ లైన్లు, రెండో అంతస్తులోని అన్న ప్రసాద వితరణ భవనం వెలవెలబోయింది. సెకండ్ వేవ్ వచ్చిన తరుణంలో అన్న ప్రసాద వితరణ నిలిపివేసినప్పటికీ ప్యాకెట్ల రూపంలో భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేసేవారు. ఈ దఫా అటువంటి ఏర్పాట్లు లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. అమ్మవారి లడ్డూ, పులిహోర ప్రసాదాలను కోవిడ్ నిబంధనల మేరకు విక్రయిస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలున్న వారు దేవాలయ సందర్శనను వాయిదా వేసుకోవాలని దేవదాయ శాఖాధికారులు విజ్ఞప్తి చేశారు. -
రోడ్డుపై దర్శనమిచ్చిన ప్రశ్నపత్రాలు
ద్వారకా తిరుమల: 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పలు సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నపత్రాలు మండలంలోని గుణ్ణంపల్లి వద్ద దర్శనమిచ్చాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి విశాఖపట్నంకు ట్రక్కు ఆటోలో పరీక్ష ప్రశ్న పత్రాలను భీమడోలు మీదుగా తీసుకెళుతుండగా గుణ్ణంపల్లి వచ్చేసరికి కొన్ని ప్రశ్నపత్రాల కట్టలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఆసమయంలో అటుగా వస్తున్న విద్యార్థులు ఆ పేపర్లను ఏరి, వొబ్బిడి చేశారు. దీనిని గమనించి వెనక్కి వచ్చిన ఆటో డ్రైవర్‌కు వాటిని విద్యార్థులు అందజేశారు -
అక్కడ దేవుడికే దిక్కులేదు.. పట్టించుకునే వాళ్లు లేరా!
చూడటానికి ఆ ఆలయాలు చక్కగా కనబడతాయి. వర్షం వస్తే భక్తులపైనే కాదు గర్భాలయంలోని దేవతామూర్తుల విగ్రహాలపై కూడా వర్షం పడుతుంది. అయినా పట్టించుకునే నాథుడు లేడు. దీంతో ఆ ఆలయాలకు వచ్చే భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి దివ్య క్షేత్రంలోని పలు ఉపాలయాల దుస్థితి ఇది. సాక్షి,ద్వారకాతిరుమల(పశ్చిమ గోదావరి): రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయానికి పలు ఉప, దత్తత ఆలయాలు ఉన్నాయి. రోజూ క్షేత్రానికి వేలాదిగా వచ్చే భక్తులు చినవెంకన్న దర్శనానంతరం ఆ ఆలయాలనూ సందర్శిస్తారు. ముఖ్యంగా క్షేత్రదేవత కుంకుళ్లమ్మ, క్షేత్రపాలకుడు భ్రమరాంబ మల్లీశ్వరస్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. చెరువు వీధిలో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని, పసరు కోనేరు వద్ద ఉన్న అభయాంజనేయ స్వామిని స్వల్ప సంఖ్యలో భక్తులు దర్శిస్తారు. ఆయా ఆలయాల్లో జరగాల్సిన ఉత్సవాలను చినవెంకన్న దేవస్థానం నేత్రపర్వంగా నిర్వహిస్తోంది. అధికారుల అలసత్వం కారణంగా ఆలయాల అభివృద్ధిలో మాత్రం డొల్లతనం బయటపడుతోంది. మేడిపండులా.. మేడిపండులా కనిపించే కుంకుళ్లమ్మ, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, క్షేత్రపాలకుని ఆలయాల ఆవరణల్లో ఉన్న నవగ్రహ మండపాల శ్లాబ్‌లు దెబ్బతిన్నాయి. దీంతో వర్షం కురిసిన ప్రతిసారీ కుంకుళ్లమ్మ ఆలయ ముఖ మండపం మడుగుగా మారుతోంది. సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయంలో స్వామివారిపైనే వర్షం పడుతోంది. ఆ ఆలయ ప్రహరీ బాగా బీటలు వారింది. క్షేత్రపాలకుని ఆలయ ఆవరణలోని నవగ్రహ మండపం శ్లాబ్ పూర్తిగా దెబ్బతినడంతో అధికారులు దాన్ని బోట్లు పెట్టి నిలబెట్టారు. భక్తులు ఆ మండపంలోనే పూజలు చేస్తున్నారు. ఆదాయం రూ.కోట్లలో ఉన్నా.. శ్రీవారి ప్రధాన ఆలయానికి ప్రతి నెలా కోట్లాది రూపాయల ఆదాయం వస్తోంది. అయినా ఉపాలయాలను పట్టించుకోవటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.త్వరలో మరమ్మతులు చేయిస్తాం సుబ్రహ్మణ్యేశ్వరుడు, కుంకుళ్లమ్మ ఆలయ శ్లాబ్‌లు దెబ్బతిన్న విషయం నా దృష్టికి రాలేదని దేవస్థానం ఈఓ జీవీ సుబ్బారెడ్డి అన్నారు. దీనిపై ఈఈ శ్రీనివాసరాజు వివరణ ఇస్తూ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం శ్లాబ్ దెబ్బతిన్న విషయాన్ని సిబ్బంది తమకు తెలపలేదన్నారు. ఈ ఆలయంతో పాటు కుంకుళ్లమ్మ ఆలయం, నవగ్రహ మండపం శ్లాబ్‌లకు త్వరగా మరమ్మతులు చేయిస్తామన్నారు. చదవండి: నమ్మకం మాటున మోసం.. శ్రీశైలం వెళ్తున్నామంటూ.. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు, రూ.16 లక్షలు స్వాధీనం
సాక్షి, విజయవాడ: జిల్లాలోని మారుతినగర్ ప్రాంతంలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను విజయవాడ క్రైం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ... ఈ ముఠాను ప్రసాదరావు అనే వ్యక్తి నిర్వహిస్తుంటాడని తెలిపారు. ఇందులో ప్రధాన నిందితుడైన కళ్యాణ చక్రవర్తితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశామని ఆయన చెప్పారు. మొత్తం 19 మంది ఉన్న ఈ ముఠాలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ఈ క్రమంలో వీరినుంచి లెన్త్ బాక్స్, 19 సెల్ఫోన్లు, 16 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కాగా ఈ లెన్త్ బాక్స్ నుంచి అందరూ కాన్పరెన్స్ ద్వారా బెట్టింగ్‌కు పాల్పడుతూ.. ప్లేయింగ్, ఈటింగ్, ఫ్యాన్సీ, 48.. 50 అనే కోడ్ భాషతో బెట్టింగ్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బెట్టింగ్‌కు సంబంధించిన మూలాలు పూర్తి స్థాయిలో దొరకలేదని అన్నారు. ఈ బెట్టింగ్ విజయవాడలోనే కాక హైదరబాద్, ముంబైలలో ఎక్కువగా జరుగుతున్నట్లు సమాచారమని అందినట్లు తెలిపారు. ఇక నగదు బదిలీ అంతా ఆన్లైన్ ద్వారా ఎక్కువగా జరుపుతూ చాలా పకడ్బందీగా ఈ బెట్టింగ్ వ్యవహరాన్ని నిర్వహిస్తున్నారని సీపీ తెలిపారు. -
పగబట్టి.. ప్రాణం తీశాడు
సాక్షి, పశ్చిమగోదావరి : వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. తన భార్యతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడన్న కక్షతో సోదరుడు వరుసైన వ్యక్తిని దారికాచి విచక్షణారహితంగా కత్తితో నరికి చంపాడు. ఆ తరువాత హత్యాయుధంతో సహా ద్వారకాతిరుమల పోలీస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన మండలంలోని పంగిడిగూడెం పంచాయతీ మెట్టపంగిడిగూడెంలో మంగళవారం ఉదయం సంచలనాన్ని రేకెత్తించింది. సమాచారాన్ని అందుకున్న భీమడోలు సీఐ ఎం.సుబ్బారావు, ఎస్సై ఎం.సూర్యభగవాన్, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని రక్తనమూనాలను సేకరించి దర్యాప్తును ప్రారంభించారు. స్థానికుల కథనం ప్రకారం. గ్రామానికి చెందిన కొప్పిశెట్టి వెంకట సుబ్బారావు (38) వ్యవసాయం చేసుకుంటూ భార్య, ఇద్దరు కుమారులను పోషిస్తున్నాడు. సుబ్బారావు పెదనాన్న కుమారుడు కొప్పిశెట్టి లక్ష్మణరావు బతుకుతెరువు కోసం ఏడేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. ఇదిలా ఉంటే లక్ష్మణరావు దుబాయ్‌లో ఉన్న సమయంలో అతని భార్య రమాదేవి మరిది వరసైన సుబ్బారావుతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. భర్త దుబాయ్ నుంచి వచ్చినా వీరి సంబంధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే రమాదేవి భర్త వద్దకు రాకుండా అదే గ్రామంలోని తన తల్లి ఇంట్లో ఉంటోంది. అయితే ఆమె పిల్లలకు తల్లి ప్రవర్తన నచ్చక తండ్రి లక్ష్మ ణరావు వద్ద ఉంటున్నట్లు బంధువులు చెబుతున్నారు. పక్కా పథకంతో.. లక్ష్మణరావు తన భార్యను కాపురానికి రమ్మని పలుమార్లు బతిమలాడినా ఫలితం లేకపోయింది. ఒకే వీధిలో ఉంటూ సుబ్బారావుతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. దీంతో విసుగుచెందిన లక్ష్మణరావు తన సోదరుడు సుబ్బారావును కడతేర్చేందుకు పథకం పన్నాడు. ఈ క్రమంలో సుబ్బారావు గేదెల పాలు తీసేందుకు మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో తన పొలానికి వెళ్లాడు. అయితే అప్పటికే అక్కడ కత్తితో కాపుకాసుకుని ఉన్న లక్ష్మణరావు మోటారు సైకిల్‌పై పొలానికి వచ్చిన సుబ్బారావును ఇష్టానుసారంగా తెగ నరికాడు. ముందు రెండు చేతులను నరకడంతో సుబ్బారావు కొంతదూరం పరుగులు తీశా డు. అయితే లక్ష్మణరావు అతడిని వెంబ డించి మరీ రెండు కాళ్లను సైతం నరకడంతో తీవ్ర రక్తస్రావమై కుప్పకూలిపోయాడు. దీంతో సుబ్బారావు మృతిచెందినట్లు భావించిన లక్ష్మణరావు, హత్యకు ఉపయోగించిన కత్తితో సహా పోలీస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కొన ఊపిరితో కొ ట్టుమిట్టాడుతున్న సుబ్బారావును స్థానిక రైతులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై భీమడోలు సీఐ సు బ్బారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పేరుకు ట్రస్ట్.. టీడీపీ ట్విస్ట్
సాక్షి, ద్వారకాతిరుమల (పశ్చిమ గోదావరి): టీడీపీ పాలనలో ఒక నేత ప్రభుత్వ పాఠశాలను విద్యార్థులకు దూరం చేశారు. దాని భవనాన్ని ఒక ప్రైవేటు ట్రస్టుకు కట్టబెట్టారు. అది ఆ ప్రాంత విద్యార్ధుల పాలిట శాపమైంది. ఇదంతా ఒక టీడీపీ నాయకుడి స్వార్ధ ప్రయోజనాల కారణంగానే జరిగాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ద్వారకా తిరుమల మండలంలోని మద్దులగూడెం పంచాయతీ పరిధిలో గతంలో ఒక ఎంపీపీ పాఠశాల ఉండేది. ఆ ప్రాంత విద్యార్ధులు ఆ పాఠశాలలోనే చదువుకునేవారు. నాలుగేళ్ల క్రితం ఒక టీడీపీ నేత ఒత్తిడి కారణంగా సంబంధిత అధికారులు పాఠశాలను మూసివేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ పాఠశాల భవనంలో శ్రీ సత్యసాయి ట్రస్టు ఆధ్వర్యంలో బాలికల అనాథ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏడెనిమిది మంది విద్యార్థులను ఏలూరు ఆశ్రమం నుంచి తీసుకొచ్చి ఇందులో ఉంచినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం వారు కూడా అందులో లేరని, ట్రస్టుకు లెక్కలు చూపేందుకే ఈ ట్రిక్కులు ఉపయోగిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పాఠశాలను మూసేయడం వల్ల మద్దులగూడెం పంచాయతీకి చెందిన విద్యార్థులు నిత్యం కిలోమీటరు దూరంలో ఉన్న సీహెచ్.పోతేపల్లిలోని పాఠశాలకు కాలినడకన వెళుతున్నారు. స్థానిక గోద్రెజ్ ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి నిత్యం ట్రాక్టర్లు, లారీల ద్వారా ఈ మార్గం గుండానే పామాయిల్ లోడులు వెళుతుంటాయి. దీంతో ఏ సమయంలో ఏం ప్రమాదం జరుగుతుందోనని పిల్లల తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ట్రస్టుకు ఎలా ఇస్తారు? ప్రభుత్వ భవనాన్ని ఒక ప్రైవేటు ట్రస్టుకు ఎలా ఇచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. బాలికల అనాథ ఆశ్రమం నడపాలనుకుంటే అందరికీ అనువైన ప్రాంతంలో ఏర్పాటు చేయాలి గానీ.. ఇలా మారుమూల గ్రామంలో ఏర్పాటు చేసి, ఎక్కడో ఉన్న విద్యార్థులను ఇక్కడ ఉంచడం హాస్యాస్పదమని గ్రామస్థులు అంటున్నారు. దీనిపై గ్రామానికి చెందిన పలువురు భవనం వద్ద సోమవారం నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ భవనాన్ని స్వాధీనం చేసుకుని, తిరిగి పాఠశాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీనిపై ఎంపీడీవో ప్రసాద్ వివరణ ఇస్తూ 2016 మార్చిలో ఈ పాఠశాల భవనాన్ని శ్రీ సత్యసాయి డిజిటల్ సాధికారిత శిక్షణకు కేటాయిస్తూ మండల పరిషత్ తీర్మానించిందన్నారు. అయితే ఆ భవనం వద్ద ప్రస్తుతం అనాథ ఆశ్రమం బోర్డు ఉందని చెప్పారు స్వలాభం కోసం పాఠశాల మూసేశారు స్వలాభం కోసం శ్రీ సత్యసాయి ట్రస్టు పేరుతో పాఠశాలను మూసేశారు. డిజిటల్ సాధికారిత శిక్షణ కోసమని పొందిన ఈ పాఠశాల భవనంలో బాలికల అనాథాశ్రమాన్ని ఎలా నడుపుతున్నారో తెలియడం లేదు. 35 మంది అనాథ బాలికలు ఉన్నట్లు లెక్కల్లో చూపి, భవనాన్ని పొందారు. కానీ ఇందులో మొన్నటి వరకు కేవలం ఏడెనిమిది మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు భవనం గేట్లకు తాళాలు పడ్డాయి. యాచమనేని నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ నాయకుడు, సీహెచ్.పోతేపల్లి చాలా ఇబ్బందిగా ఉంది మద్దులగూడెంలో ఎంపీపీ పాఠశాల మూతపడటం వల్ల మా పిల్లలను సీహెచ్.పోతేపల్లిలోని పాఠశాలకు పంపుతున్నాం. సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న ఆ పాఠశాలకు పిల్లలు నిత్యం నడిచి వెళుతున్నారు. ప్రభుత్వం కనికరించి, మూతపడ్డ పాఠశాలను మళ్లీ తెరిపించాలి. – చమటబోయిన రాంబాబు, మద్దులగూడెం, గ్రామస్థుడు ఆందోళనగా ఉంది మా పిల్లలను చదువు కోసం మద్దులగూడెం నుంచి సీహెచ్.పోతేపల్లిలోని ప్రభుత్వ పాఠశాలకు పంపుతున్నాను. అయితే పామాయిల్ లోడు లారీలు, ట్రాక్టర్లు తిరిగే ఈ రహదారిలో పిల్లలు నడిచి వెళ్లడం భయాన్ని కలిగిస్తోంది. ఏ సమయంలో ఏం జరుగుతుందోనని ఆందోళనగా ఉంటోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మద్దులగూడెంలో మూతపడ్డ పాఠశాలను తెరవాలి. – ముసలి కల్యాణి, మద్దులగూడెం -
శ్రీనివాసుని తాకిన రవికిరణాలు
సాక్షి, ద్వారకాతిరుమల: సాయం సంధ్య వేళ.. సూర్య భగవానుని కిరణాలు గర్భాలయంలో కొలువైన శ్రీనివాసుని అపాదమస్తకం స్ప్రుశించే శుభసమయంలో.. వీక్షించిన భక్తులు ఆనంద పారవశ్యంలో మునిగారు. ప్రతి ఏటా చైత్ర మాసం ముందు రోజుల్లో సాక్షాత్కరించే ఈ అరుదైన ఘట్టం పురాతన దేవాలయమై, శ్రీవారి క్షేత్ర ఉపాలయంగా విరాజిల్లుతోన్న లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం ఆవిష్కృతమైంది. ఎక్కడా ఏ ఆలయంలో లేని విధంగా ఇక్కడ ఇలా సూర్యకిరణాలు నేరుగా స్వామి, అమ్మవార్లను తాకడం ఒక విశిష్టతగా చెప్పొచ్చు. ఎంతో లోపలికి ఉండే ఈ ఆలయంలోని స్వామివారి గర్భాలయంలోకి సైతం నేరుగా సూర్యకిరణాలు ప్రవేశించి శ్రీవారిని అణువణువు అర్చించి వెళ్తాయి. ఆలయం ముందు చెట్లు, ధ్వజస్తంభం, పందిళ్లు ఉన్నా వాటిని తప్పించుకుని మరీ లోపలకు వచ్చి స్వామివారిని అర్చించడం పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ప్రతి సంవత్సరం చైత్ర మాసం ముందు రోజుల్లో, వరుసగా మూడు రోజులు సాయంత్రం సూర్యాస్తమయ సమయాన్న అద్భుత కాంతులతో సూర్యకిరణాలు నేరుగా ఆలయంలోకి ప్రవేశించి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ముఖం మీద నుంచి నెమ్మదిగా కిందకు దిగుతూ పాదాల వరకు అర్చించుతాయి. ఇలా అణువణువు అర్చిస్తూ దిగిన ఈ సూర్యకిరణాలు స్వామివారి పాదాల వద్ద ఉన్న ఉత్సవ మూర్తులను తాకి అనంతరం సూర్యకిరణం రెండుగా చీలి ఇరుపక్కలా ఉన్న పద్మావతి, ఆండాళ్ అమ్మవార్ల ఆలయంలోకి ప్రవేశించి అమ్మవార్లను అర్చిస్తాయి. ఏడాదిలో ఈ వింత మూడు రోజులు మాత్రమే జరగడం ఇక్కడి విశిష్టత. ఈ కిరణాలను చూసేందుకు ఈ మూడు రోజులు భక్తులు ఆసక్తిగా ఆలయానికి తరలివస్తారు. బుధవారం కూడా ఈ కిరణాలు పడే అవకాశం ఉందని ఆలయ అర్చకులు గోపీ తెలిపారు. -
ద్వారకాతిరుమలలో కొత్త టోల్గేట్
సాక్షి, ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న శేషాచలకొండపై దేవస్థానం నూతనంగా నిర్మించిన టోల్ గేటును ఆలయ చైర్మన్ ఎస్వీ.సుధాకరరావు కుమారుడు నివృతిరావు ఆదివారం ప్రారంభించారు. ఇప్పటివరకు కాంట్రాక్టర్ల ద్వారా నిర్వహించబడిన ఈ టోల్ గేటును ఇక దేవస్థానమే సొంతంగా నిర్వహించనుంది. 2018–2019 సంవత్సరానికి గాను స్వామివారికి టోల్ గేటు ద్వారా సుమారు రూ.77 లక్షలు ఆదాయం సమకూరింది. ఈ ఆదాయం మరింతగా పెరుగుతుందన్న ఉద్దేశంతో దీన్ని దేవస్థానం స్వయంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దాదాపు రూ.20 లక్షల వ్యయంతో టోల్ గేట్ వద్ద షెడ్డును, టికెట్ కౌంటర్‌ను, ఇతర నిర్మాణాలను జరిపారు. వీటిని ఆలయ ఈఓ దంతులూరి పెద్దిరాజు, ఈఈ వైకుంఠరావు, ఏఈవో బి.రామాచారి, డీఈలు టి.సూర్యనారాయణ, పి.ప్రసాద్, గుర్రాజు, సూపరింటిండెంట్లు నగేష్, జి.సుబ్రహ్మణ్యం, కిషోర్, ఏఈలు మధు, దిలీప్ తదితరులతో కలిసి నివృతిరావు ప్రారంభించారు. అనంతరం టికెట్ కౌంటర్లో చినవెంకన్న చిత్రపటాన్ని ఉంచి ఆలయ అర్చకులు, పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ ఈ టోల్ గేట్ నిర్వహణ ఇద్దరు సూపరింటిండెంట్ల పర్యవేక్షణలో ఉంటుందని, ఇందులో మూడు షిఫ్ట్‌లుగా 20 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. అలాగే టోల్‌గేటు ధరలను పెంపుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పెరిగిన ధరలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆయన వివరించారు. లారీ, బస్సు, భారీ వాహనాలకు టోల్ పాత ధర రూ.100 కాగా దానిని రూ.150కి పెంచారు. మినీ బస్సు, వ్యాన్లకు రూ.50 నుంచి రూ.100కు, ట్రాక్టర్ టక్కు, ట్రాక్ ఆటో, ప్రయాణికుల వాహనాలకు రూ.30 నుంచి రూ.50కి పెంచారు. కారు, జీపు, వ్యాన్, స్కూటర్, బైక్, ఆటోకు టోల్ ఫీజును పెంచలేదు. -
గిరమ్మ ఆత్మఘోష
సాక్షి, ద్వారకాతిరుమల : గిరమ్మ ఎత్తిపోతల పథకం ఆత్మ ఘోషిస్తోంది. ఏళ్లు గడుస్తున్నా రైతులకు చుక్క నీరందించలేకపోయానని ఆవేదన చెందుతోంది. ఆ పాపం పాలకులదేనని గిరమ్మ చెప్పలేకపోయినా, బాధిత రైతులు మాత్రం గొంతెత్తి చాటుతున్నారు. పాలకుల నిర్లక్ష్యమే పథకానికి శాపమని అంటున్నారు. ద్వారకాతిరుమల మండలం సీహెచ్ పోతేపల్లిలోని గిరమ్మ చెరువు నీటిని ఎత్తిపోతల ద్వారా 7 వేల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. 2003 నవంబర్ 12న అప్పటి, ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు పథకం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. శంకుస్థాపన చేసింది చంద్రబాబే అయినా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే పంప్ హౌస్, పైప్‌లైన్, కాలువ నిర్మాణ పనులన్నీ జరిగాయి. 2010 ఆగస్టులో పథకానికి ట్రైల్ రన్ కూడా వేశారు. అయితే వైఎస్సార్ హఠాన్మరణంతో పథకం పనులు అటకెక్కాయి. ఇదిలా ఉంటే కాలువ నిర్మాణానికి భూములు ఇవ్వమంటూ కొందరు రైతులు కోర్టును ఆశ్రయించడంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం, తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం పథకంపై నిర్లక్ష్యం వహించడంతో దాదాపు రూ.8 కోట్లు ఖర్చుతో చేసిన పనులు నిరుపయోగంగా మారాయి. ఇదిలా ఉంటే కోర్టును ఆశ్రయించిన రైతులు ఇటీవల భూములివ్వడంతో కాలువ తవ్వకం పనులు పూర్తిచేసిన అధికారులు ట్రైల్‌రన్ కూడా వేశారు. అయితే ఈస్టు యడవల్లి–దొరసానిపాడు గ్రామాల మధ్య సుమారు 3 కిలోమీటర్లు మేర కాలువకు బదులు నిర్మించిన అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్ నీటి ఒత్తిడి తట్టుకోలేక, ధ్వంసం కావడంతో పథకం మళ్లీ మూలకు చేరింది. 7 వేల ఎకరాలకు.. ద్వారకాతిరుమల, కామవరపుకోట మండలాల్లోని పలు గ్రామాల్లో ఉన్న దాదాపు 7 వేల ఎకరాలకు ఈ పథకం ద్వారా సాగునీరు అందించవచ్చు. ద్వారకాతిరుమల మండలంలోని సీహెచ్ పోతేపల్లి, మద్దులగూడెం, కొమ్మర, కోడిగూడెం, దొరసానిపాడు, కామవరపుకోట మండలంలోని ఈస్టు యడవల్లి, వెంకటాపురం, తాడిచర్ల తదితర ప్రాంతాల్లోని పొలాలకు సాగునీరు అందాల్సి ఉంది. అయితే పథకం శంకుస్థాపన జరిగి 15 ఏళ్లు గడిచినా వినియోగంలోకి రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పథకం : గిరమ్మ ఎత్తిపోతల పథకం ప్రాంతం : సీహెచ్ పోతేపల్లి, ద్వారకాతిరుమల మండలం శంకుస్థాపన : 2003 నవంబర్ 12 వ్యయం : రూ.8 కోట్లు సాగు లక్ష్యం : 7 వేల ఎకరాలు పూడుకుపోతున్న కాలువ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువు 2003లో టీడీపీ హయాంలో ప్రారంభమైన గిరమ్మ ఎత్తిపోతల పథకం ఇప్పటివరకు రైతులకు అక్కరకు రాలేదు. పథకాన్ని దాదాపుగా పూర్తిచేసిన ఘనత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కింది. కొద్దిపాటి పనులు పూర్తిచేస్తే పథకం పూర్తవుతుంది. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే టీడీపీ నేతలు దీనిపై ఏమాత్రం దృష్టి సారించలేదు. ఇటీవల ద్వారకాతిరుమల మండలంలో జరిగిన ప్రజాసంకల్పయాత్రలో గిరమ్మ పథకం గురించి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరించాం – యాచమనేని నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్, సీహెచ్ పోతేపల్లి కాలువలు పూడుకుపోతున్నాయ్ గిరమ్మ ఎత్తిపోతల పథకంలో భాగంగా తవ్విన కాలువలు పలు ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైనట్టు తెలుస్తోంది. మరికొంత మేర పూడుకుపోయి కాలువ వెడల్పు తగ్గిపోయాయి. ఇంకా ఆలస్యమైతే కాలువ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. 2003లో పథకానికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు ప్రస్తుతం అధికారంలో ఉన్నా దీనిపై దృష్టి సారించలేదు. కాలువలు, పంప్‌హౌస్ యంత్రాలు నిరుపయోగంగా మారాయి. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తేనే రైతులకు మేలు జరుగుతుందని భావిస్తున్నాం. – బసివిరెడ్డి వెంకటరామయ్య, రైతు -
హాస్యం లేని చిత్రం ఉప్పులేని కూరవంటిది
ద్వారకాతిరుమల : కుటుంబ నేపథ్యంతో పాటు, సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని శుక్రవారం రాత్రి ఆయన సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధికారులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనస్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖమండపంలో అర్చకులు శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలికారు. అనంతరం రాజేంద్రప్రసాద్ విలేకర్లతో మాట్లాడుతూ సినిమాల్లో హాస్యం ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. హాస్యం లేని చిత్రం ఉప్పులేని కూరవంటిదని అన్నారు. ఇటీవల విడుదలైన తాను నటించిన రాజ ది గ్రేట్ చిత్రం మంచి విజయాన్ని సాధించిందన్నారు. సమాజానికి ఎంతో విలువైన మెసేజ్ ఇచ్చిన ఆ నలుగురు వంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించే ప్రయత్నాన్ని చేస్తున్నానని ఆయన అన్నారు. తనకు చినవెంకన్న ఇష్టదైవమని, అందుకే కుటుంబ సమేతంగా వచ్చానన్నారు. -
నయనానందకరం.. శ్రీ చక్రవార్యుత్సవం
దేవరపల్లి : ద్వారకా తిరుమల శ్రీ వారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం శ్రీ చక్ర వార్యుత్సవాన్ని ఆలయ అర్చకులు కన్నుల పండువగా నిర్వహించారు. తొలుత తొళక్కం వాహనంపై విష్ణుమూర్తి అలంకరణలో శ్రీవారి తిరువీధి సేవ క్షేత్ర పురవీధుల్లో వైభవంగా జరిగింది. తొళక్కం వాహనంపై ఉభయ దేవేరులతో స్వామిని నిలిపి ప్రత్యేక పుష్పాలంకరణలు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల మధ్య క్షేత్ర పురవీధుల్లో శ్రీ వారు ఊరేగారు. ఆలయ ఆవరణలో శ్రీ చక్ర వార్యుత్సవాన్ని ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో ఘనంగా జరిపారు. శ్రీచక్రవార్యుత్సవం ఇలా.. ఆలయ ఆవరణలో శ్రీవారు, అమ్మవార్లు, చక్ర పెరుమాళ్లను ఒకే వేదికపై కొలువయ్యారు. పూజలు జరిపి సుగంథ ద్రవ్యాలు, పంచ పల్లవులు, శ్రీ చందనం, పసుపు, మంత్ర పూత అభిషేక తీర్థంతో శ్రీ చక్ర స్వామిని అభిషేకించారు. పాలు, పెరుగు, నీరు, తేనె, కొబ్బరి నీళ్లతో ఆలయ అర్చకులు శ్రీచక్రస్వామి అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీచక్ర పెరుమాళ్లతో పాటు ఉభయనాంచారులతో శ్రీవారికి తిరుమంజనాలు జరిపి, అలంకరించి హారతులను సమర్పించారు. అభిషేక జలాన్ని భక్తులు తమ శిరస్సులపై చల్లుకున్నారు. రాత్రి అశ్వవాహనంపై శ్రీవారి తిరువీధిసేవ భక్తులకు నేత్ర పర్వమైంది. ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. బ్రహ్మోత్సవాల్లో నేడు.. l ఉదయం 9 గంటల నుంచి – అన్నమాచార్య కీర్తనల ఆలాపన l ఉదయం 9 గంటల నుంచి – చూర్ణోత్సవం, వసంతోత్సవం l ఉదయం 10 గంటల నుంచి – హరికథ l సాయంత్రం 6.30 గంటల నుంచి – భక్తిరంజని l రాత్రి 7 గంటల నుంచి – ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీ పుష్ప యాగం నవనీత కృష్ణుడిగా చినవెంకన్న ద్వారకా తిరుమల క్షేత్ర వాసి చిన వెంకన్న గురువారం నవనీత కృష్ణుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో జరుగుతున్న శ్రీ వారి వైశాఖ మాస తిరు కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని స్వామి వారు రోజుకో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. వెన్నను దొంగిలించే నవనీత కృష్ణుడిగా చిన వెంకన్న దర్శనమివ్వడం భక్తులకు నేత్రపర్వమైంది. అధిక సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించి తరించారు. -
నేత్ర పర్వం.. శ్రీవారి రథోత్సవం
ద్వారకాతిరుమల : సమ్మోహిత రూపంతో భక్తులకు అభయహస్తమిస్తూ చినవెంకన్న ఉభయదేవేరులతో రథవాహనంపై తిరువీధుల్లో విహరించారు. ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి శ్రీవారి రథరంగ డోలోత్సవం కనుల పండువగా నిర్వహించారు. రథంపై శ్రీదేవి, భూదేవిలతో స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీహరి కళాతోరణంలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. వైభవోపేతంగా రథరంగ డోలోత్సవం శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం జరిగిన మరుసటి రోజు రథోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తోంది. బ్రహ్మోత్సవాల సమయంలో రథవాహనం ద్వారా భక్తులు స్వామికి సేవచేసుకునే అవకాశం లభించింది. బుధవారం రాత్రి ఆలయంలో ఉభయ దేవేరులతో శ్రీవారిని తొళక్కం వాహనంపై ఉంచి పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం రథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై కల్యాణమూర్తులను ఉంచి హారతులిచ్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, విచిత్ర వేషధారణలు, డప్పువాయిద్యాలు, కోలాటభజనలతో శ్రీవారి రథం క్షేత్ర పురవీధుల్లో తిరుగాడింది. ఆలయ ఫౌండర్ ట్రస్టీ ఎస్వీపీజే గోపాలరావు, ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు దంపతులు రథానికి బలిహరణ సమర్పించిన అనంతరం రథయాత్ర ప్రారంభమైంది. ఈఓ త్రినాథరావు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. మురళీకృష్ణుడిగా మురళీకృష్ణుడి అలంకారంలో చినవెంకన్న బుధవారం భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి ఆలయంలో జరుగుతున్న వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు సందర్భంగా స్వామివారు రోజుకో అలంకారంలో భక్తులను కటాక్షిస్తున్నారు. ఈ క్రమంలో స్వామివారు పిల్లనగ్రోవి ధరించి, గోవులను సంరక్షించే మురళీకృష్ణుడిగా భక్తులకు కనువిందు చేశారు. బ్రహ్మోత్సవాల్లో నేడు ఉదయం 10 గంటలకు భక్తి రంజని ఉదయం 10.30 గంటలకు అపబృదోత్సవం మధ్యాహ్నం 3 గంటల నుంచి వేద సదస్సు సాయంత్రం 5 గంటలకు కూచిపూడి నృత్య ప్రదర్శనలు రాత్రి 7 గంటల నుంచి పూర్ణాహుతి, మౌనబలి, ధ్వజారోహణ రాత్రి 8 గంటల నుంచి బుర్రకథ ప్రదర్శన రాత్రి 8 గంటల నుంచి అశ్వవాహనంపై గ్రామోత్సవం -
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.లక్ష విరాళం
ద్వారకా తిరుమల :శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు ఒక భక్తుడు బుధవారం రూ.1,00,116 విరాళంగా అందించారు. విజయవాడకు చెందిన గర్రే రాఘవగుప్తా ముందుగా కుటుంబ సభ్యులతో కలసి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం నిత్యాన్నదాన భవనంలో ఈ విరాళాన్ని జమచేశారు. దాతకు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు విరాళం బాండ్‌ను అందజేసి, అభినందించారు. -
కల్యాణ వైభోగమే
ద్వారకాతిరుమల: శ్రీనివాసుడు సర్వాభరణ భూషితుడై నుదుటిన కల్యాణ తిలకం, బుగ్గన చుక్కతో ఉభయ దేవేరులను పెళ్లాడాడు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. హేవిళంబి నామ సంవత్సర వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి కల్యాణం కనుల పండువగా జరిపించారు. అంతకుముందు ఉదయం సింహ వాహనంపై ఉభయ దేవేరులతో ఆశీనులైన శ్రీవారు క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. అట్టహాసంగా జరిగిన ఈ తిరువీధిసేవను భక్తులు ఆసక్తిగా తిలకించారు. ఆకర్షణీయంగా కల్యాణ వేదిక శ్రీవారి ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై చినవెంకన్న తిరుకల్యాణ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. కల్యాణ వేదికను ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు. అనంతరం ఆలయంలో తొళక్క వాహనంపై శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ మూర్తులను ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. తర్వాత ఆలయ అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్ఛరణల నడుమ మేళతాళాలు, మంగళవాయిద్యాలతో శ్రీవారి వాహనాన్ని కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. వేదికపై ప్రత్యేకంగా అలంకరించిన రజత సింహాసనంపై కల్యాణ మూర్తులను ఉంచి అర్చకులు కల్యాణ తంతును ప్రారంభించారు. శుభముహూర్త సమయంలో వధూవరుల శిరస్సులపై జీలక్రర్ర, బెల్లం ధరింపజేసి మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకను భక్తుల గోవింద నామస్మరణల నడుమ వైభవంగా నిర్వహించారు. దేవస్థానం తరపున శ్రీవారికి ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు పట్టువస్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఏర్పాట్లను ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు పర్యవేక్షించారు. ఆకట్టుకున్న గరుడోత్సవం శ్రీవారి కల్యాణ తంతు ముగిసిన అనంతరం వెండి గరుడ వాహనంపై స్వామి ఉభయదేవేరులతో క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. స్వామికి గరుడ నిత్య సేవకుడు. అటువంటి గరుడ వాహనంపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ చినవెంకన్న ఉభయ దేవేరులతో కలసి తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. మోహినీ అలంకరణలో.. మోహినీ అలంకారంలో స్వామి మంగళవారం భక్తులకు దర్శనమిచ్చారు. చినవెంకన్న వైశాఖమాస బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో మోహినిగా శ్రీవారు భక్తులను కటాక్షించారు. బ్రహ్మోత్సవాల్లో నేడు ∙ఉదయం ..10 గంటలకు భక్తిరంజని ∙సాయంత్రం ..5 గంటల నుంచి కూచిపూడి నృత్య ప్రదర్శన ∙రాత్రి 7 గంటలకు ..శ్రీవారి దివ్య రథోత్సవం ∙రాత్రి 8.30 గంటల ..నుంచి అన్నమాచార్య సంకీర్తనలు -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
ద్వారకాతిరుమల : వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలకు చిన వెంకన్న క్షేత్రం ముస్తాబైంది. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలు ఈనెల 12 వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో చలువ పందిర్లు వేశారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు స్వామి, అమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలుగా ముస్తాబు చేయడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఉత్సవాల రోజుల్లో స్వామి రోజుకో అలంకరణలో దర్శనమిస్తారని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సంగీత కచేరీ, సాయంత్రం 5 గంటలకు కూచిపూడి నృత్య ప్రదర్శన, రాత్రి 7 గంటల నుంచి గజవాహనంపై శ్రీవారి తిరువీధిసేవ, రాత్రి 8 గంటలకు రామాంజనేయ యుద్ధం పౌరాణిక నాటిక ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు ఈఓ వెల్లడించారు. -
చినవెంకన్నకు కాసుల పంట
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి (చినవెంకన్న) హుండీల ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. 33 రోజులకు రూ.2.12 కోట్ల ఆదాయం సమకూరింది. నగదు రూపంలో రూ.2,12,66,060, భక్తులు కానుకల రూపంలో సమర్పించిన 795 గ్రాముల బంగారం, 14.430 కిలోల వెండి లబించినట్టు ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. రద్దయిన రూ.1000, రూ.500 నోట్ల ద్వారా రూ.3,54,500 నగదు వచ్చిందని చెప్పారు. -
2న గవర్నర్ రాక
ఏలూరు (మెట్రో) : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ఆదివారం జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ నెల 2న ఉదయం 11.30 గంట లకు విమానంలో గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.50 గంటలకు ద్వారకా తిరుమల వస్తారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం స్థానికంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ద్వారకా తిరుమల నుంచి హెలికాప్టర్లో గన్నవరం చేరుకుంటారు. -
కుట్టు మెషిన్లు ఇప్పిస్తానంటూ బురిడీ
దేవరపల్లి (ద్వారకాతిరుమల) : గ్లోబల్ గివింగ్ సంస్థ పేరుతో మహిళలకు కుట్టుమెషిన్లు ఇస్తామని రూ.లక్షల పైబడి సొమ్ములు వసూలు చేసి బురిడీ కొట్టించారు. దీనిపై బాధిత మహిళలు శుక్రవారం స్థానిక పోలీస్స్టేన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. బాధిత మహిళలు తెలిపిన వివరాలిలా.. కృష్టాజిల్లాకు చెందిన చేకూరి ధన శిరీష కొద్దిరోజుల క్రితం ద్వారకాతిరుమల వచ్చి రూ.మూడు వేలిస్తే కొత్త కుట్టు మెషిన్లు ఇస్తామని, అలాగే 6 నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని నమ్మ బలికింది. గ్రామంలో 54 మంది మహిళల నుంచి ఒక్కక్కరి నుంచి రూ.2 వేల చొప్పున మొత్తం రూ.1.08 లక్షలు వసూలు చేసింది. గ్లోబల్ గివింగ్ సంస్థ పేరుతో మహిళలకు రశీదు ఇచ్చింది. అయితే ఇంతవరకూ కుట్టు మెషిన్లు రాలేదని బాధిత మహిళలు వాపోయారు. తామంతా కూలి పనులు చేసుకుని జీవించేవారమని, తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
శాంతి కల్యాణంలో పాల్గొన్న హీరో సునీల్
దేవరపల్లి (ద్వారకాతిరుమల) : ధన్వంతరీ సంపుటిత జ్వాలా నరసింహ సుదర్శన మహాయజ్ఞం ముగింపును పురస్కరించుకుని సుందరగిరిపై నృసింహ క్షేత్రంలో శనివారం ఉదయం శాంతి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన సుదర్శన మహాయజ్ఞంలో సినీ హీరో సునీల్ పాల్గొని యజ్ఞక్రతువును నిర్వహించారు. ఈ యజ్ఞం శనివారం తెల్లవారుజామున జరిగిన మహాపూర్ణాహుతితో ముగిసింది. అనంతరం రుత్వికులు, పండితులు సాలిగ్రామాలను అభిషేకించారు. మంగళకర శాంతి మంత్రాలతో రుద్రం, రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. -
శ్రీవారి ఆలయంలో హుండీ ఆదాయం లెక్కింపు
దేవరపల్లి : ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. 18 రోజులకు గాను వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా రూ.1,03,06,383 లభించినట్టు ఆలయ కార్యనిర్వాహణా««ధికారి వేండ్ర త్రినాథరావు తెలిపారు. 239 గ్రాముల బంగారం, 3 కేజీల 152 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీలు లభించినట్టు చెప్పారు. రూ1,15,116 విరాళం అందజేత చిన వెంకన్న ఆలయానికి మంగళవారం కామవరపుకోటకు చెందిన దాత గంటా బులిస్వామి కుటుంబ సభ్యులు 1,15,116 రూపాయలను అన్నదాన విరాళంగా అందజేశారు. విరాళాన్ని దాతలు ఈవో వేండ్ర త్రినాథరావుకు అందించారు. -
ఉత్తర ద్వారా దర్శనానికి వచ్చి అనంత లోకాలకు..
ద్వారకాతిరుమల/ఆకివీడు: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఉత్తర ద్వారా దర్శనం నిమిత్తం క్యూలైన్లో నిలుచున్న భక్తుడికి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. ఆకివీడుకు చెందిన లారీ యజమాని రెడ్డి జగదీశ్వరరావు (54), భార్య, ముగ్గురు కుమారులతో కలిసి ఉదయం చినవెంకన్న క్షేత్రానికి వచ్చారు. దర్శనం నిమిత్తం క్యూలైన్లో వేచి ఉండగా జగదీశ్వరరావుకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు, కొందరు భక్తులు ఆయన్ను హుటాహుటిన ద్వారకాతిరుమల ప్రాథమిక ఆ రోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే జగదీశ్వరరావు మృతి చెం దినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆకివీడులోని లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు సంతాపం తెలిపారు. -
19 రోజులు.. రూ.1.35 కోట్లు
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీల ఆదాయాన్ని మంగళవారం లెక్కించా రు. ఆలయ ఆవరణలో ఈవో వేండ్ర త్రినాథరావు పర్యవేక్షణలో లెక్కింపు జరిగింది. 19 రోజులకు నగదు రూపంలో రూ. 1,35,45,752, కానుకల రూపంలో 371 గ్రాముల బంగారం, 4.236 కిలోల వెండి లభించినట్టు ఈవో తెలిపారు. ఓ విదేశీ భక్తుడు అమెరికన్ కరెన్సీ నోట్ల కట్టను హుండీలో సమర్పించాడని, దీంతో పాటు ఇతర దేశాల కరెన్సీ నోట్లు లభించాయని చెప్పారు. -
గోవుల పాల, అందాల పోటీలు ప్రారంభం
ద్వారకా తిరుమల : రాష్ట్రస్థాయి గోవుల పాల, అందాల పోటీలు ద్వారకా తిరుమలలో గురువారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను రాష్ట్ర శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రారంభించారు. పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 130 జాతి గోవులు, ముర్రాజాతి గేదెలు, దున్నలు తరలివచ్చాయి. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను పురస్కరించుకుని గురువారం ఉదయం 8 గంటలకు పాలపోటీల రిజిస్ట్రేషన్లు జరిపారు. సాయంత్రం 5.30 గంటల నుంచి పోటీలో పాల్గొనే గోవుల పొదుగులను ఖాళీ చేశారు. శుక్రవారం ఉదయం, సాయంత్రం, అలాగే 17వ తేదీ ఉదయం మూడుపూటలా పాల ఉత్పత్తి సేకరణ జరగనుంది. దీని ఆధారంగా విజేతను ఎంపికచేస్తారు. 17వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అందాల పోటీలకు రిజిస్ట్రేషన్ జరగనుండగా, మధ్యాహ్నం 12 గంటలు తరువాత అందాల పోటీలు ప్రారంభమవుతాయి. ఈ రెండు పోటీల్లో గెలుపొందిన విజేతలకు 17 సాయంత్రం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా ఇ¯Œæచార్జి మంత్రి అయ్యన్న పాత్రుడు చేతులు మీదుగా బహుమతి ప్రదానం జరగనుంది. గురువారం నాటి ప్రారంభ కార్యక్రమంలో స్పీకర్‌తో పాటు రాజ్యసభ సభ్యురాలు తోట సీతా రామలక్ష్మి, రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మాగంటి మురళీమోహన్, ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు, గన్ని వీరాంజనేయులు, ఆల్డా చైర్మన్ గాంధీ, ఎంపీపీ వి.ప్రసాద్, జెడ్పీటీసీ లక్ష్మీ రమణి తదితరులు పాల్గొన్నారు. బహుమతుల ఇలా.. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ రూ.5 లక్షలు, పశుసంవర్ధకశాఖ రూ. 2 లక్షలతో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో గెలుపొందే ముర్రా గేదెలు, ఒంగోలు ఆవులకు ప్రథమ బహుమతిగా రూ.50 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.30 వేలు, తృతీయ బహుమతిగా రూ.20 వేలు అందజేస్తామన్నారు. అలాగే గిర్, పుంగనూరు జాతి ఆవులకు ప్రథమ బహుమతిగా రూ.25 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.15 వేలు, తృతీయ బహుమతిగా రూ.10 వేలు అందజేయనున్నారు. పోటీల్లో పాల్గొనే ప్రతి ఆవుకు ప్రోత్సాహక బహుమతులు అందించనున్నారు. అందాల పోటీల్లో గెలుపొందే వాటికి తగు బహుమతులు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఆకట్టుకున్న ముర్రాజాతి దున్న పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ముర్రాజాతి దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కృష్ణాజిల్లా గన్నవరం రైతు ముక్కామల కోటేశ్వరరావుకు చెందిన ఈ దున్న 8 అడుగుల పొడవు, 5.3 అడుగుల ఎత్తుతో చూపరులను ఆకట్టుకుంది.