ECIL
-
ఈవీఎంల వినియోగంలో సందేహాలను నివృత్తి పర్చిన ఈసీఐఎల్ బృందం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల నిర్వహణ (EVM Management System-EMS 2.0) వాటి వినియోగంలో నోడల్ అధికారులు ఎదుర్కొంటున్న సందేహాలను, సమస్యలను హైదరాబాద్ నుంచి ఆన్లైన్ ఈసీఐఎల్ అధికారుల బృందం సభ్యులు సీనియర్ డి.జి.ఎం. ఎ.పి.రాజు, ఇంజనీర్ సి జి ఆదిత్య నివృత్తి చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రెండో రౌండ్ శిక్షణ కార్యక్రమం జరిగింది. అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్ నేతృత్వంలో జరిగి ఈ శిక్షణా కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన ఈవీఎం నోడల్ అధికారులు, సాంకేతిక సహాయకులు ప్రత్యక్షంగాను ,అరుణాచల ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలకు చెందిన అధికారులు ఆన్ లైన్ ద్వారా పాల్గొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9న జరిగిన మొదటి రౌండ్ శిక్షణా కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల నిర్వహణ మరియు వాటి వినియోగంపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఈవీఎం నోడల్ అధికారులకు, సాంకేతిక సహాయకులకు ఈసీఐఎల్ అధికారుల బృందం సమగ్ర అవగాహన కల్పించడం జరిగింది. అయితే క్షేత్ర స్థాయిలో ఈవీఎంల వినియోగంలో అధికారులకు, సాంకేతిక సహాయకులకు ఎదురైన సమస్యలు, సందేహాలను నివృత్తి పర్చేందుకు నెల రోజుల తదుపరి రెండో రౌండ్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈవీఎంల నిర్వహణలో సాదారణంగా ఎదురయ్యే సాంకేతిక సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో మరొసారి ఈ శిక్షణా కార్యక్రమంలో ఈసీఐఎల్ అధికారుల బృందం వివరించింది. అదే విధంగా జిల్లాల వారీగా ఈవీఎం నోడల్ అధికారులు, సాంకేతిక సహాయకులు అడిగిన పలు సందేహాలకు, సమస్యలకు ఈసీఐఎల్ అధికారుల బృందం సభ్యులు సీనియర్ డి.జి.ఎం. ఎ.పి.రాజు, ఇంజనీర్ సి జి ఆదిత్య సమగ్రమైన వివరణను ఇచ్చారు. అసిస్టెంట్ సీఈవో పి.తాతబ్బాయ్ తో పాటు అన్ని జిల్లాలకు చెందిన ఈవీఎం నోడల్ అధికారులు, సాంకేతిక సహాయకులు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
సూర్యుడిపై పరిశోధనల్లోనూ ఈసీఐఎల్ కీలకపాత్ర
కుషాయిగూడ: చంద్రయాన్–3 ప్రయోగానికి డీప్‌స్పేస్ నెట్వర్క్ (డీఎస్ఎన్) యాంటెన్నాను అందజేసిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎల్రక్టానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సూర్యుడిపై పరిశోధనల కోసం చేపట్టిన ఆదిత్య–ఎల్1 శాటిలైట్ ప్రయోగానికి అవసరమైన యాంటెన్నాను సైతం ఇస్రోకు అందజేసి మరోమారు సత్తా చాటుకుంది. శనివారం ప్రయోగించిన ఆదిత్య–ఎల్1కు అవసరమైన కమ్యూనికేషన్ వ్యవస్థను ఈ యాంటెన్నా అందిస్తుందని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ యాంటెన్నా 18 మీటర్ల విస్తీర్ణంలో ఉంటుందన్నాయి. 15 లక్షల కి.మీ. దూరంలో కక్ష్యలో ఉన్న శాటిలైట్‌కు భూమి నుంచి నిర్థిష్టమైన సమాచారాన్ని చేరవేయడంలో యాంటెన్నా కీలకంగా వ్యవహరిస్తుందని వివరించాయి. బెంగళూరుకు 40 కి.మీ. దూరంలోని బైలాలు గ్రామంలో దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపాయి. ఎంటీఏఆర్ సహకారం... ఆదిత్య–ఎల్1 ప్రయోగం విజయంలో హైదరాబాద్‌కు చెందిన ఎంటీఏఆర్ టెక్నాలజీస్ లిమిటెడ్ సైతం కీలక సహకారం అందించిందని సంస్థ ఎండీ పర్వత శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పీఎస్ఎల్వీ–సీ57 మిషన్‌లో భాగంగా లాంచింగ్ వాహనం కోసం లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజిన్లు, ఎలక్ట్రో–న్యూమాటిక్ మాడ్యూల్స్, ప్రొపల్షన్ సిస్టమ్, శాటిలైట్ వాల్వ్‌లు, సేఫ్టీ కప్లర్లు, లాంచ్ వెహికల్ యాక్చుయేషన్ సిస్టమ్‌ల కోసం బాల్ స్క్రూలు, కనెక్టర్ అసెంబ్లీలు, యాక్చుయేషన్ సిస్టమ్స్ హార్డ్‌వేర్, నోస్ కోన్ వంటి వాటిని సరఫరా చేశామన్నారు. -
చంద్రయాన్–3లో ఈసీఐఎల్ కీలక భూమిక
కుషాయిగూడ (హైదరాబాద్): చంద్రయాన్–3లో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎల్రక్టానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) కీలక భూమిక పోషించింది. చంద్రయాన్ కమ్యూనికేషన్‌కు కీలకమైన 32 మీటర్ డీప్ స్పేస్ నెట్వర్క్ (డీఎస్ఎన్) యాంటెన్నాను సరఫరా చేసిందని సంస్థ వర్గాలు గురువారం ఓ ప్రకటనలో తెలిపాయి. 300 టన్నుల ఈ యాంటెన్నా వ్యవస్థను బాబా అటామిక్ రీసెర్చ్, యూఆర్ రావు శాటిలైట్ సెంటర్, ఐఎస్టీఆర్ఏసీలతో కలిసి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినట్లు చెప్పాయి. చంద్రుడి ఉపరితలంపై 0.3 మిల్లీమీటర్ల పరిమాణం కలిగిన వాటినీ క్షుణ్ణంగా చూపించేలా వీల్ అండ్ ట్రాక్ మౌంట్, బీమ్ వేవ్ గైడ్, ఫీడ్ సిస్టమ్‌తో కూడిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యాంటెన్నాలో అమర్చినట్లు చెప్పాయి. చంద్రుడిపై తీసే చిత్రాలు, డేటాను స్వాదీనం చేసుకోవడంలోనూ ఈ యాంటెన్నా కీలక పాత్ర పోషిస్తుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన యాంటెన్నా సిస్టమ్‌తో పాటుగా సేఫ్ అండ్ సెక్యూర్ ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోల్ (పీఎల్సీ)ని అందిస్తూ ఇస్రోతో ఈసీఐఎల్ సన్నిహితంగా పనిచేస్తోందని ఆ వర్గాలు చెప్పాయి. రాబోయే ఆదిత్య, గగన్‌యాన్, మంగళ్యాన్–2 మిషన్లకు కూడా ఈసీఐఎల్ పనిచేస్తుందని పేర్కొన్నాయి. -
విజేత గౌతమ్ జూనియర్ కాలేజి
లాలాపేట: డిఫెండింగ్ చాంపియన్ గౌతమ్ జూనియర్ కాలేజి (ఈసీఐఎల్) జట్టు తెలంగాణ రీజియన్ సాక్షి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీలో టైటిల్ నిలబెట్టుకుంది. హబ్సిగూడలోని ఐఐసీటీ మైదానంలో జరిగిన జూనియర్ విభాగం ఫైనల్లో గౌతమ్ కాలేజి జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఎస్ఆర్ఆర్ జూనియర్ కాలేజి (మంచిర్యాల) జట్టుపై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్ఆర్ కాలేజి 11 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌటైంది. గౌతమ్ కాలేజీ స్పిన్నర్ డి.మనీశ్ రెండు వికెట్లు పడగొట్టాడు. టోర్నీ మొత్తంలో మనీశ్ 12 వికెట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. అనంతరం గౌతమ్ కాలేజి జట్టు కేవలం. 4.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసి గెలిచింది. అన్విత్ రెడ్డి 11 బంతుల్లో 24 పరుగులు చేశాడు. టోర్నీ మొత్తం నిలకడగా రాణించిన అన్విత్ రెడ్డి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు సొంతం చేసుకున్నాడు. హెచ్‌సీఏ అండర్–14, అండర్–16 లీగ్‌లలో కూడా అన్విత్ రెడ్డి తన సత్తా చాటుకున్నాడు. బాలాజీకి ‘మ్యాన్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డు లభించింది. సీనియర్ విభాగంలో భవాన్స్ వివేకానంద డిగ్రీ కాలేజి (సైనిక్‌పురి) జట్టు టైటిల్ సొంతం చేసుకుంది. ఫైనల్లో భవాన్స్ జట్టు 35 పరుగుల తేడాతో వాగ్దేవి డిగ్రీ కాలేజి (మంచిర్యాల) జట్టును ఓడించింది. ముందుగా భవాన్స్ జట్టు 15 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు సాధించింది. రాహుల్ 36 బంతుల్లో 71 పరుగులు చేశాడు. అనంతరం వాగ్దేవి కాలేజి 14.4 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ రెడ్డికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఫైనల్’ అవార్డులు దక్కాయి. జూనియర్, సీనియర్ విభాగాల్లో విజేతగా నిలిచిన జట్లకు రూ. 25 వేలు చొప్పున... రన్నరప్ జట్లకు రూ. 15 వేలు చొప్పున నగదు పురస్కారం లభించింది. తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి మల్లా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విన్నర్స్, రన్నరప్ జట్లకు ట్రోఫీలను అందజేశారు. అబ్బాయిలకే కాకుండా అమ్మాయిలకు కూడా టోర్నీ లు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ రాణి రెడ్డి కూడా పాల్గొన్నారు. -
హైదరాబాద్: ఎన్ఎండీసీ, ఈసీఐఎల్, ఐఐఆర్ఆర్లో జాబ్స్
హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ)..జూనియర్ ఆఫీస్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 94 ► విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, మైనింగ్, జీ అండ్ క్యూసీ, సర్వే. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, ఎమ్మెస్సీ /ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. వయసు: 32 ఏళ్లు మించకుండా ఉండాలి. ► జీతం: నెలకి రూ.37,000 నుంచి 1,30,000 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: రాతపరీక్ష, సూపర్వైజరీ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► పరీక్షా విధానం: రాత పరీక్షని మొత్తం 100 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో నిర్వహిస్తారు. ఈ పరీక్షని హిందీ, ఇంగ్లిష్ భాషల్లో నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని సూపర్వైజరీ స్కిల్టెస్ట్కి ఎంపికచేస్తారు. స్కిల్‌టెస్ట్ అర్హత పరీక్ష మాత్రమే. రాతపరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.02.2022 ► వెబ్సైట్: nmdc.co.in ఈసీఐఎల్ లో 12 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 12 ► పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ ఇంజనీర్(ఈసీఈ, ఈఈఈ, ఈటీఈ)–06, ప్రాజెక్ట్ ఇంజనీర్(మెకానికల్, ఈసీఈ, సీఎస్ఈ)–06. ► ప్రాజెక్ట్ ఇంజనీర్(ఈసీఈ, ఈఈఈ, ఈటీఈ): అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 33 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతం: నెలకి రూ.40,000 చెల్లిస్తారు. ► ప్రాజెక్ట్ ఇంజనీర్(మెకానికల్, ఈసీఈ, సీఎస్ఈ): అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 33 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతం: నెలకి రూ.40,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: వాక్ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► వాక్ఇన్ తేది: 15.02.2022 ► వేదిక: ఈసీఐఎల్, నలందా కాంప్లెక్స్, సీఎల్‌డీసీ, టీఐఎఫ్ఆర్ రోడ్,హైదరాబాద్–500062. ► వెబ్సైట్: ecil.co.in ఐకార్–ఐఐఆర్ఆర్ లో వివిధ ఖాళీలు హైదరాబాద్, రాజేంద్రనగర్‌లోని ఐకార్–ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్(ఐఐఆర్ఆర్).. తాత్కాలిక ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 07 ► పోస్టుల వివరాలు: రీసెర్చ్ అసోసియేట్–01, జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్) –03, టెక్నికల్ అసిస్టెంట్లు–03. ► రీసెర్చ్ అసోసియేట్: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ/పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పరిశోధన అనుభవం ఉండాలి. జీతం: నెలకి రూ.49,000+24 శాతం హెచ్ఆర్ఏ చెల్లిస్తారు. ► జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్): అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ/పీహెచ్డీ ఉత్తీర్ణతతోపాటు పరిశోధన అనుభవం ఉండాలి. జీతం: నెలకి రూ.31,000+24 శాతం హెచ్ఆర్ఏ చెల్లిస్తారు. ► టెక్నికల్ అసిస్టెంట్లు: అర్హత: డిగ్రీ(లైఫ్ సైన్స్)/డిప్లొమా(అగ్రికల్చర్) ఉత్తీర్ణులవ్వాలి. ఫీల్డ్ ఆపరేషన్స్‌పై మంచి నాలెడ్జ్‌తోపాటు కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి. జీతం: నెలకి రూ.20,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఈమెయిల్: msmrecruitment2021@gmail.com ► దరఖాస్తులకు చివరితేది: 12.02.2022 ► వెబ్సైట్: icar-iirr.org -
హైదరాబాద్, వైజాగ్‌లలో భారీగా అప్రెంటిస్ ట్రెయినీలు
హైదరాబాద్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియోనిక్స్ డివిజన్.. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ట్రెయినీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 150 ► ఖాళీల వివరాలు: టెక్నీషియన్(డిప్లొమా)అప్రెంటిస్ ట్రెయినీలు–80, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీలు–70. ► టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్ ట్రెయినీలు: సబ్జెక్టులు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీసింగ్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 2019, 2020,2021లో ఉత్తీర్ణులైన వారే అర్హులు. స్టైపెండ్: నెలకు రూ.8000 చెల్లిస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీలు: సబ్జెక్టులు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీసింగ్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. 2019, 2020, 2021లో ఉత్తీర్ణులైన వారే అర్హులు. స్టైపెండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: మెరిట్ మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 19.01.2022 ► వెబ్సైట్: hal-india.co.in ఈసీఐఎల్, హైదరాబాద్‌లో 150 అప్రెంటిస్‌లు హైదరాబాద్‌లో ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 150 ► ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు–145, డిప్లొమా అప్రెంటిస్‌లు–05. ► విభాగాలు:ఈసీఈ,సీఎస్ఈ,మెకానికల్,ఈఈఈ. ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 31.01.2022 నాటికి 25ఏళ్లు మించకుండా ఉండాలి. ► స్టైపెండ్: ఇంజనీరింగ్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.9000, డిప్లొమా అప్రెంటిస్‌లకు నెలకు రూ.8000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: బీఈ/బీటెక్‌లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 18.01.2022 ► వెబ్సైట్: ecil.co.in హెచ్‌పీసీఎల్, విశాఖ రిఫైనరీలో 100 అప్రెంటిస్‌లు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్), విశాఖ రిఫైనరీ.. వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్(ఇంజనీరింగ్) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 100 ► సబ్జెక్టులు/విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, సేఫ్టీ ఇంజనీరింగ్, ఎనర్జీ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్,పెట్రోలియం ఇంజనీరింగ్, ఎనర్జీ ఇంజనీరింగ్ తదితరాలు. ► అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్(బీఈ/బీటెక్) ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 07.01. 2022నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ► స్టైపెండ్: నెలకు రూ.25,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 14.01.2022 ► వెబ్సైట్: mhrdnats.gov.in -
'ఇక్కడింకా నడుస్తూనే ఉన్నారు'.. బస్సు మీ ఊరికి వస్తోంది
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్‌కు చెందిన విద్యార్థులు బస్సు సౌకర్యం లేక పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుండటంపై ‘ఇక్కడింకా నడుస్తూనే ఉన్నారు’ శీర్షికన బుధవారం ‘సాక్షి’ మెయిన్‌లో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ఆర్టీసీ కుషాయిగూడ డిపో మేనేజర్ సుధాకర్, యాదగిరిగుట్ట డిపో మేనేజర్ లక్ష్మారెడ్డి బుధవారం హాజీపూర్ గ్రామంతో పాటు మోడల్ స్కూల్‌ను సందర్శించారు. ఈసీఐఎల్ నుంచి బొమ్మలరామారం మండల కేంద్రం వయా మల్యాల గ్రామం నుంచి హాజీ పూర్‌కు బస్సు ఆరు ట్రిప్పులు నడుస్తోందని, హాజీపూర్ విద్యార్థుల సౌకర్యం కోసం ధర్మారెడ్డి గూడెం చౌరస్తా నుంచి మోడల్ స్కూల్‌కు బస్సు నడిపిస్తామన్నారు. ఎస్ఐ వెంకన్నతో పాటు షీ టీమ్ బృందం ఎస్ఐ మారుతి, కానిస్టేబుళ్లు అనిల్, పార్వతి మోడల్ స్కూల్ విద్యార్థినులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఆకతాయిలను గుర్తించి వారి వాహనాల నంబర్లను అందజేయాలని కోరారు. మోడల్ స్కూల్ పరిసరాలలో పెట్రోలింగ్ జరుగుతుందని, మరింత నిఘా పెంచుతామని చెప్పారు. ఆపద సమయంలో 100 నంబర్‌కు ఫోన్ చేయాలని విద్యార్థినులకు సూచించారు. -
హైదరాబాద్ రౌండప్; కోవిడ్ పరీక్షల కోసం బారులు
బంజారాహిల్స్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్నది. రోజురోజుకు కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్–7లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కరోనా పరీక్షల కోసం జనం బారులు తీరారు. ఒకేరోజు వందమందికి పైగా లక్షణాలతో బాధపడుతూ పరీక్షల కోసం వచ్చారు. కొంతకాలంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తిరిగి ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు మొదలు పెట్టారు. రోజురోజుకు కోవిడ్ విస్తరిస్తున్నదని జనం కూడా లక్షణాలతో పెద్ద సంఖ్యలో ఆస్పత్రులకు విచ్చేస్తున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. ఒకవైపు వ్యాక్సిన్ వేస్తుండగా మరోవైపు కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్నది. ఆరోగ్య కేంద్రాల్లో మంగళవారం ఒక్కరోజే వంద మందికి పైగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. గ్రేటర్లో 884 కోవిడ్ కేసులు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ జిల్లాల్లో మరోసారి కోవిడ్ విజృంభిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే 1052 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిలో అత్యధికంగా హైదరాబాద్‌లో 659, రంగారెడ్డిలో 109, మేడ్చల్ జిల్లాలో 116 (మొత్తం 884) పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. డిసెంబర్ మూడో వారం వరకు రోజుకు సగటున వంద లోపు కేసులు నమోదు కాగా, నాలుగో వారంలో క్రిస్మస్ వేడుకలు, డిసెంబర్ 31 తర్వాత వైరస్ మరింత వేగంగా విస్తరించింది. విదేశాల నుంచి వచ్చిన 10 మందికి పాజిటివ్ విదేశాల నుంచి నగరానికి చేరుకున్న వారిలో మంగళవారం ఒక రోజే 10 మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. దీంతో వారిని టిమ్స్‌కు తరలించారు. వీరికి ఏ వేరియంట్ సోకిందో తెలుసుకునేందుకు వారి నుంచి నమూనాలు సేకరించి జీనోమ్ సీక్వెన్సీ పరీక్షలకు పంపారు. ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 94కు చేరినట్లు తెలుస్తోంది. (హైదరాబాద్ మొదటి పేరు భాగ్యనగర్ కాదు.. అసలు పేరు ఏంటంటే!) 32 అన్నపూర్ణ కేంద్రాల్లో సిట్టింగ్ ఏర్పాట్లు సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ కేంద్రాల్లో వసతుల కల్పనపై దృష్టి సారించిన జీహెచ్ఎంసీ.. 32 ప్రాంతాల్లో కూర్చొని భోజనం చేసేలా సిట్టింగ్ సదుపాయాలు కల్పిస్తోంది. వీటిలో కొన్నింట్లో ఇప్పటికే కూర్చునే సదుపాయం అందుబాటులోకి రాగా, మిగతా ప్రాంతాల్లో పనులు పురోగతిలో ఉన్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. 4.42 లక్షల పాస్‌పోర్టులు, పీసీసీలు రాంగోపాల్‌పేట్: గత ఏడాది 4.42 లక్షల పాస్‌పోర్టులు, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు అందజేశామని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు. మంగళవారం ఆయన వార్షిక నివేదికను విడుదల చేశారు. 2020లో 2.93 లక్షలు, 2019లో 5.54 లక్షల పాస్‌పోర్టు, పీసీసీలు అందించినట్లు తెలిపారు. గత ఏడాది లాక్డౌన్ ఉన్నప్పటికీ పాస్‌పోర్టు సేవలు నిలిపివేయలేదన్నారు. అన్ని రకాల అత్యవసర పాస్‌పోర్టు అవసరాలను తీర్చినట్లు ఆయన పేర్కొన్నారు. కొద్ది రోజులు అపాయింట్మెంట్లు మాత్రం కుదించామని చెప్పారు. పాస్‌పోర్టు అపాయింట్మెంట్లలో జాప్యాన్ని నివారించేందుకు డిసెంబర్ నెలలో ప్రతి రోజు 200 అదనపు అపాయింట్మెంట్ స్లాట్లను విడుదల చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం సాధారణ పాస్‌పోర్టు అందించేందుకు 7– 10 రోజుల గడువు పడుతుండగా తత్కాల్ మాత్రం 3 రోజుల్లో ఇస్తున్నామని వివరించారు. 7న నిజాం కళాశాలకు కేటీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ: నిజాం కాలేజీకి ఈ నెల 7న మంత్రి కేటీఆర్ రానున్నారు. తొలిసారి జరుగుతున్న గ్రాడ్యుయేషన్ డేకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. (చదవండి: 'బుల్లిబాయ్' యాప్ మాస్టర్ మైండ్?! ఈ శ్వేత ఎవరు!) ఈఎస్ఐసీ ఆసుపత్రిలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ కుషాయిగూడ: సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) సంస్థ సనత్‌నగర్‌లోని ఈఎస్ఐసీ ఆసుపత్రిలో 960 ఎల్పీఎం కెపాసిటి కలిగిన ఆక్సిజన్ జనరేషన్ ఫ్లాంటును ఏర్పాటు చేసింది. 1.09 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంటును మంగళవారం ఈసీఐఎల్ అధికారులు ఆసుపత్రి సిబ్బందితో కలిసి ప్రారంభించారు. చెరువుల సుందరీకరణకు సర్కార్ సన్నాహాలు గ్రేటర్‌లోని చెరువుల పరిరక్షణ, అభివృద్ధిపై ప్రభుత్వం తాజాగా దృష్టి సారించింది. వారసత్వ సంపద అయిన చెరువులను కాపాడేందుకు చర్యలు చేపట్టింది.హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులు, కుంటలు, జలవనరుల (వాటర్ బాడీస్) సంరక్షణ, అభివృద్ధి కోసం సరికొత్త పాలసీని అమల్లోకి తెచ్చింది. చెరువులు, కుంటలు, జలవనరుల చుట్టూ పచ్చిక బయళ్లను పెంచడం ద్వారా వాటిని పరిరక్షించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను అధిగమించేందుకు అవకాశం ఏర్పడుతుందని, పచ్చటి అందాల నడుమ కనిపించే చెరువులు నగరవాసులకు చక్కటి ఆహ్లాదకరమైన అనుభూతినిస్తాయని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకనుగుణంగా వాటిని తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించింది. ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటైన హైదరాబాద్ నగరం పరిసరాల్లోని చెరువులను వారసత్వ సంపదగా కాపాడేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఇటీవల జరిగిన సమావేశంలో పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్‌కు సూచించారు. రియల్ ఎస్టేట్ విస్తరణ వల్ల చాలా చోట్ల చెరువులు మురికిగుంటలుగా మారుతున్నాయనీ, ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు, చెరువులు, కుంటల సంరక్షణ, అభివృద్ధి, పూర్వ వైభవం కల్పించే బాధ్యతలను స్థానిక డెవలపర్స్ కు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు లే అవుట్, మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ (ఎంఎస్ బి), గేటెడ్ కమ్యూనిటీ, కమర్షియల్ కాంప్లెక్స్ వంటి వాటికి అనుమతి ఇచ్చే సమయంలో వాటి డెవలప్ మెంట్ ఏరియాలో ఉన్న లేక్స్ అభివృద్ధి బాధ్యతలు వారే నిర్వహించాల్సి ఉంటుంది.వాటర్ బాడీకి 500 మీటర్ల విస్తీర్ణం(పరిధి) వరకు వాటి నిర్వహణ సంబంధిత డెవలపర్లు లేదా ఏజెన్సీలు చెరువుల అభివృద్ధికి బాధ్యతలు చేపట్టాలి. వెస్ట్ జోన్ డీసీపీగా జోయల్ డేవిస్ బాధ్యతల స్వీకరణ బంజారాహిల్స్: వెస్ట్ జోన్ డీసీపీగా జోయల్ డేవిస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సిద్దిపేట కమిషనర్‌గా పనిచేశారు. వెస్ట్‌జోన్ డీసీపీగా పనిచేసిన ఎ.ఆర్.శ్రీనివాస్ నగర జాయింట్ పోలీస్ కమిషనర్‌గా బదిలీ కావడంతో ఆయన స్థానంలో జోయల్ డేవిస్‌ను నియమించారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం వెస్ట్‌జోన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లపై సమీక్ష నిర్వహించారు. -
ఈసీఐఎల్ హైదరాబాద్‌లో టెక్నికల్ ఆఫీసర్లు
ECIL Hyderabad Recruitment 2021: భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఈఎంఎస్‌డీ, ఇతర విభాగాల్లో పనిచేసేందుకు ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► పోస్టులు: టెక్నికల్ ఆఫీసర్లు ► మొత్తం పోస్టుల సంఖ్య: 300 ► అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ /ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్/కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► వయసు: 30.11.2021 నాటికి 30ఏళ్లకు మించకుండా ఉండాలి. ► వేతనం: నెలకు రూ.25వేలు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: బీఈ/బీటెక్‌లో సాధించిన మార్కులు, పని అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దీనిలో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను న్యూఢిల్లీలోని జోనల్ కార్యాలయంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 21.12.2021 ► వెబ్సైట్: ecil.co.in -
స్మార్ట్‌గా నేర్చుకున్నారు
నీటి కొలనులో నుంచి పైకి ఉద్భవిస్తున్నట్లున్న నిండు చంద్రుడి పెయింటింగ్ పౌర్ణమిని డ్రాయింగ్ రూమ్‌లోకి తెచ్చినట్లుంది. ఒకరినొకరు తదేకంగా చూసుకుంటున్న రాధాకృష్ణుల చిత్రం... ఎన్నెన్నో ప్రశ్నలతో మనసును ఊపిరాడనివ్వదు. జుట్టు ముడిచుట్టిన ఆదివాసీ మహిళ చిత్రం... ఆధునికత ఫ్యాషన్ రీతులను ప్రశ్నిస్తున్నట్లు ఉంటుంది. వీటితోపాటు సూర్యోదయం, సూర్యాస్తమయాలు ఆ ఇంటి గోడల మీద వచ్చి వాలాయి. అడవిలో ఎగురుతున్న జింక ఈ ఇంట్లోకి తొంగి చూడడానికి వచ్చినట్లుంది ఓ చిత్రం. వీటి పక్కనే ఒక హృదయాకారంలో ‘ఐ లవ్ యూ అమ్మా’ అనే అక్షరాలు ఆ పెయింటింగ్‌ని మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తున్నాయి. హైదరాబాద్, ఈసీఐఎల్ సమీపంలోని సాయినాథపురంలోని ప్రశంస, అభిజ్ఞల ఇల్లు ఇది. ఈ బొమ్మలు వేసిన పిల్లలు అచ్చంగా పిల్లల్లాగా, స్వచ్ఛతకు ప్రతీకల్లా ఉన్నారు. ప్రశంస తొమ్మిదవ తరగతి, అభిజ్ఞ ఏడవ తరగతి. వీళ్లకు బొమ్మలు వేయడం నేర్పిన గురువు టెక్నాలజీ. నిజమే! ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. కరోనా కారణంగా లాక్డౌన్ ప్రపంచాన్ని స్తంభింపచేస్తే ఈ పిల్లలిద్దరూ ఆ విరామాన్ని పెయింటింగ్ శిక్షణకు ఉపయోగించుకున్నారు. ఒకరి ఇంటికి మరొకరు వెళ్లడానికి భయపడే కోవిడ్ కాలంలో వాళ్లకు బొమ్మలు వేయడం నేర్పించడానికి ఏ గురువు కూడా ఇంటికి వచ్చే సాహసం చేయలేరు. ఏ గురువు కూడా తమ ఇంటికి శిష్యులను స్వాగతించే పరిస్థితి కూడా కాదు. అలాంటప్పుడు యూ ట్యూబ్ చూస్తూ పెయింటింగ్ వేయడం నేర్చుకున్నారు. రోజుకొక పెయింటింగ్ వీడియో చూస్తూ సొంతంగా ప్రాక్టీస్ చేస్తూ పూర్తి స్థాయి చిత్రకారులైపోయారు. ఏ చిత్రానికి ఏ తరహా రంగులు వాడాలో, ఎంత మోతాదులో మిశ్రమాలను కలుపుకోవాలో కూడా నేర్చుకున్నారు. లాక్డౌన్ కాలం పిల్లల బాల్యాన్ని హరించిందని, స్తబ్దుగా మార్చేసిందని ఆందోళన పడుతుంటాం. కానీ కాలం అందరికీ సమానమే. ఎవరికైనా రోజుకు ఉన్నది ఇరవై నాలుగ్గంటలే. ఆ ఇరవై నాలుగ్గంటలను ఉపయోగపెట్టుకునే వాళ్లు, నిరర్ధకంగా గడిపేసే వాళ్లూ ఉన్నట్లే... ఈ అక్కాచెల్లెళ్లు లాక్డౌన్ కాలంలో చిత్రకారిణులుగా నైపుణ్యం సాధించారు. తోటి పిల్లలకు మార్గదర్శనంగా నిలుస్తున్నారు. పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ప్రశంస, అభిజ్ఞ ఫోన్ చేతికి వచ్చింది! ‘‘నేను పదవ సంవత్సరం నుంచి బొమ్మలేస్తున్నాను. స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్లలో పాల్గొన్నాను కూడా. లాక్డౌన్లో రోజంతా ఇంట్లోనే ఉండేవాళ్లం. బోర్ కొట్టేది. ఆన్లైన్ క్లాసుల కోసమని అమ్మానాన్న వాళ్ల స్మార్ట్ ఫోన్లు నాకు చెల్లికి ఇచ్చేశారు. క్లాస్‌లు అయిపోయిన తర్వాత నేను యూ ట్యూబ్ సెర్చ్ చేస్తూంటే పెయింటింగ్ క్లాసుల వీడియోలు కనిపించాయి. అప్పటి నుంచి రోజూ వీడియోలు చూస్తూ నోట్స్ రాసుకునేదాన్ని. అక్రిలిక్ కలర్స్, వాటర్ కలర్స్, ఆయిల్ పెయింటింగ్స్‌లో ఏ పెయింటింగ్‌కి ఏది వాడాలో వచ్చేసింది. ఈ ఏడాది కాలంగా నేను వందకు పైగా బొమ్మలు వేశాను. మధుబని, రంగోలి ఆర్ట్‌లు, రవీంద్రనాథ్ టాగూర్, స్వామి వివేకానంద పోట్రయిట్‌లు వేశాను. పెద్ద ఆర్టిస్ట్‌ను కావాలనేది నా లక్ష్యం. టెన్త్ క్లాస్ తర్వాత పెయింటింగ్ కోసం ఎక్కువ టైమ్ ప్రాక్టీస్ చేస్తాను’’. -
ఈసీఐఎల్‌లో టెక్నికల్ ఆఫీసర్ జాబ్స్
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ.. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్).. ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 22 ► అర్హత: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/ఇన్స్ట్రుమెంటేషన్ సబ్జెక్టుల్లో కనీసం 60శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► వయసు: 31.08.2021 నాటికి 30ఏళ్లు మించకుండా ఉండాలి. ► వేతనం: నెలకు రూ.23,000 చెల్లిస్తారు. ► పని ప్రదేశం: న్యూఢిల్లీ ► ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► ఇంటర్వ్యూ తేది: 06.10.2021(అర్హులైన అభ్యర్థులు సంబంధిత విద్యార్హతలు తదితర ధ్రువపత్రాలతో కింద పేర్కొన్న చిరునామాలో ఉదయం పది గంటల నుంచి 12 మధ్య రిపోర్ట్ చేయాలి) ► ఇంటర్వ్యూ వేదిక: ఈసీఐఎల్ జోనల్ ఆఫీస్, డీ–15, డీడీఏ లోకల్ షాపింగ్ కాంప్లెక్స్, ఏ–బ్లాక్, రింగ్ రోడ్, నరైనా, న్యూఢిల్లీ–110028. ► పూర్తి వివరాలకు వెబ్సైట్: www.ecil.co.in -
రెండు తలల పాము @ 70 లక్షలు.. ఈ పాము ఇంట్లో ఉంటే..
సాక్షి, హైదరాబాద్: రెండు తలల పామును అమ్మ కానికి పెట్టిన ముఠాను బుధవారం అటవీశాఖ విజిలెన్స్ విభాగం అదుపులోకి తీసుకుంది. ఈ పాము ఇంట్లో ఉంటే అదృష్టం కలిసివస్తుందని, గుప్తనిధులు దొరుకుతాయని తమ వద్దనున్న పామును ఈ ముఠా అమ్మకానికి పెట్టింది. తమకందిన సమాచారంతో విజిలెన్స్ డీఎఫ్ఓ సుధాకర్‌రెడ్డి నేతృత్వంలో దాడిచేసి.. ఈసీఐఎల్ సమీపంలోని నాగారంలో ఉన్న సగ్గుర్తి రోహిత్, జాలిగ శ్రీధర్, రాయుడు వెంకటరమణ, వీ.ఆంజనేయప్రసాద్‌తో కూడిన ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నాలుగున్నర కేజీల బరువున్న పామును డెబ్బై లక్షలకు వీరు అమ్మకానికి పెట్టారని, వీరితో పాటు కారు, టూవీలర్, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు చెప్పారు. నిందితులను మేడ్చల్ కోర్టు లో హాజరుపరిచారు. ముఠా ఆటకట్టించిన అధికారులను అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.శోభ అభినందించారు. కాగా, రెండు తలల పాముగా పిలిచే ‘రెడ్ సాండ్ బోవా’కు వాస్తవానికి రెండు తలలు ఉండవని అటవీశాఖ అధికారులు తెలిపారు. దీని ద్వారా అదృష్టం కలిసిరావటమనేది అపోహేనన్నారు. ఈ పాముకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా టోల్‌ఫ్రీ నంబర్ 18004255364కు ఫిర్యాదు చేయాలన్నారు. చదవండి: ఇవి మామూలు కళ్లద్దాలు కావు.. కనీసం రూ.25 కోట్లు హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ -
ఈసీఐఎల్‌లో ఆర్టిసన్ ఉద్యోగాలు, చివరి తేది మరో నాలుగు రోజులే
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్).. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ ఆర్టిసన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 04 ► అర్హత: ఫిట్టర్ ట్రేడులో రెండేళ్ల ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. అసెంబ్లీ ఆఫ్ మెకానికల్, ప్రెసిషన్ మెకానికల్ పని అనుభవం ఉండాలి. ► వయసు: 31.08.2021 నాటికి 25ఏళ్లు మించకూడదు. ► వేతనం: నెలకు రూ.18,564 చెల్లిస్తారు. ► పని ప్రదేశం: మైసూరు ► ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తులకు చివరి తేది: 17.09.2021 ► పూర్తి వివరాలకు వెబ్సైట్: www.ecil.co.in గెయిల్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(గెయిల్).. ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► పోస్టులు: ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు ► విభాగాలు: ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, ఎలక్ట్రికల్. ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు గేట్–2022కు దరఖాస్తు చేసుకోవాలి. ► ఎంపిక విధానం: గేట్–2022లో సాధించిన స్కోర్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తులకు చివరి తేది: 24.09.2021 ► వెబ్సైట్: www.gailonline.com -
ఈసీఐఎల్, హైదరాబాద్‌లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
హైదరాబాద్‌లోని అణుశక్తి విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్).. నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 08 ► అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి. ► వయసు: 31.07.2021 నాటికి 30ఏళ్లు మించకుండా ఉండాలి. ► వేతనం: నెలకు రూ.23,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: బీఈ/బీటెక్‌లో సాధించిన మార్కులు, అనుభవం ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని వర్చువల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.08.2021 ► వెబ్సైట్: www.ecil.co.in -
ఈసీఐఎల్‌లో టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 09 ► పోస్టుల వివరాలు: టెక్నికల్ ఆఫీసర్–08, సైంటిఫిక్ అసిస్టెంట్–01. ► టెక్నికల్ ఆఫీసర్: అర్హత: కనీసం 60శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్ /ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 31.01.2021 నాటికి 30ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.23,000 చెల్లిస్తారు. ► సైంటిఫిక్ అసిస్టెంట్: అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ /ఇన్స్ట్రుమెంటేషన్ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 31.01.2021 నాటికి 25ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.20,202 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు బీఈ/బీటెక్ మార్కులు, ఏడాది పని అనుభవం ఆధారంగా 1:5 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను వర్చువల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుకు డిప్లొమా మార్కులు, ఏడాది పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 18.03.2021 ► వెబ్సైట్: www.ecil.co.in ఎన్ఎండీసీలో జాబ్స్; 304 ఖాళీలు -
ఈసీఐఎల్‌లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) సీలింగ్, డిస్ట్రిబ్యూషన్, పోలింగ్, ఈవీఎం, వీవీపాట్ కమిషనింగ్ పనుల్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టు సైట్లలో పనిచేయడానికి 6 నెలల ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 650 ► అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రు మెంటేషన్ ఇంజనీరింగ్/మెకానికల్ ఇంజనీరింగ్/కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది పోస్టు క్వాలిఫికేషన్ ఇండస్ట్రియల్ అనుభవం ఉండాలి. ► వయసు: 31.01.2021 నాటికి 30ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. ► ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్(బీఈ/ బీటెక్ మార్కులు), అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 15.02.2021 ► వెబ్సైట్: https://careers.ecil.co.in/ చదవండి: జీ మ్యాట్ ఆన్లైన్ పరీక్షలో మరో విభాగం పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు.. జీతం ఎంతంటే! -
ఏదీ మానవత్వం?
-
మానవత్వం మాయం
కుషాయిగూడ (హైదరాబాద్): ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి.. మనుషుల్లో మానవత్వాన్ని కూడా మాయం చేస్తోంది. తోటి మనిషి ఎంత ఆపదలో ఉన్నా.. అతడికి సాయం చేద్దామనే ఆలోచన మచ్చుకైనా కనిపించని పరిస్థితిలోకి ప్రపంచం వచ్చేసింది. వారికి సాయపడితే ఆ మాయలమారి తమకు ఎక్కడ సోకుతుందో అనే భయమే అందరిలోనూ కనిపిస్తోంది. దీంతో ఎదుటి మనిషి ప్రాణం పోతున్నా కూడా మనకెందుకులే అని దూరం నుంచే తప్పుకుంటున్నారు తప్ప.. దగ్గరకెళ్లి సాయం చేసి అతడి ప్రాణం నిలబెట్టాలనే భావన కొంచెం కూడా ఎవరి మదిలోనూ మెదలడంలేదు. సాయం కోసం అర్థిస్తూ కళ్ల ముందే కుప్పకూలినా సరే కరోనా భయం వారిని అడుగు ముందుకు వేయనీయడంలేదు. ఈ నేపథ్యంలో మానవత్వం కూడా అంతరించిపోయేవాటి జాబితాలో చేరిపోతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. బుధవారం హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆస్పత్రికి వెళ్లేందుకు ఆటో ఎక్కుతూ ఓ వ్యక్తి కుప్పకూలిపోగా.. ఏ ఒక్కరూ సాయం చేయడానికి సాహసించలేదు. అతడి పరిస్థితి చూసి, అయ్యో పాపం అన్నారే తప్ప.. మేమున్నాం అంటూ ముందుకు రాలేదు. ఆటో ఎక్కుతూ... హైదరాబాద్ జవహర్‌నగర్‌లోని బీజేఆర్ కాలనీకి చెందిన పృథ్వీరాజ్ (35) నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. వైద్యం కోసం తన భార్యతో కలిసి ద్విచక్రవాహనంపై ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు అతడిని పరీక్షించి పెద్దాస్పత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో ఆస్పత్రి నుంచి బయటకు వచ్చి నిమ్స్‌కు వెళ్లేందుకు ఆటో మాట్లాడుకున్నారు. అనంతరం ఆటోలోకి ఎక్కబోతూ ఒక్కసారిగా పృథ్వీరాజ్ కుప్పకూలిపోయాడు. అతడి కుటుంబ సభ్యులు ఎంతగా కదిపినా చలనం కనిపించలేదు. అతడు కింద పడిపోవడం.. కుటుంబ సభ్యులు ఆందోళనతో రోదించడాన్ని అక్కడ ఉన్న జనం అలా చూస్తూ ఉన్నారే తప్ప.. ఏ ఒక్కరూ కూడా వారికి సాయం చేసేందుకు వెళ్లలేదు. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఈ సంఘటన చోటుచేసుకుంది. పృథ్వీ కుటుంబ సభ్యులు వెంటనే 108కి కాల్ చేయగా.. నిమిషాల్లోనే ఆ అంబులెన్స్ అక్కడకు చేరుకుంది. అయితే, 108 సిబ్బంది అతడిని పరీక్షించి చనిపోయినట్టు నిర్ధారించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాగా, పృథ్వీ మృతదేహాన్ని 108 వాహనంలోకి ఎక్కించేందుకు కూడా ఎవరూ సాయం చేయకపోవడం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది. కరోనా కారణంగా సాయం కూడా చేయలేకపోతున్నామని మాట్లాడుకోవడం తప్ప.. సాహసించి ఎవరూ ముందుకు వెళ్లలేదు. దీంతో 108 సిబ్బంది, పృథ్వీ కుటుంబ సభ్యులే అతడి మృతదేహాన్ని అంబులెన్స్‌లోకి ఎక్కించారు. -
హైదరాబాద్ ఈసీఐఎల్ చౌరస్తాలో విషాదం
-
నడిరోడ్డుపై యువకుడి మృతి
-
చూస్తుండగానే.. నడిరోడ్డుపై యువకుడి మృతి
సాక్షి, హైదరాబాద్: ఈసీఐఎల్ చౌరస్తాలో బుధవారం మధ్యాహ్నం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. చూస్తుండగానే ఓ యువకుడు రోడ్డుపై కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన అతన్ని ఆస్పత్రికి తరలించేయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయింది. యువకుడు అప్పటికే మృతి చెందినట్టు 108 సిబ్బంది నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువకుడి వెంటే ఉన్న అతని తల్లి, చెల్లి, భార్య గుండెలవిసేలా రోదించారు. మృతుడు జవహర్ నగర్ కు చెందిన పృథ్వీరాజ్‌గా తెలిసింది. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న అతన్ని స్థానికంగా ఉండే జీనియా ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. జీనియా ఆస్పత్రి సిబ్బంది వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మరో ఆస్పత్రికి తీసుకెళ్లండని ఉచిత సలహా ఇచ్చారు. దీంతో గత్యంతరం లేక యువకుడిని తీసుకుని కుటుంబ సభ్యులు బయటికొచ్చారు. వేరే ఆస్పత్రికి తీసుకెళ్దామని ఆటో కోసం చూస్తున్నారు. అంతలోనే ఘోరం జరిగిపోయింది. యువకుడు అనూహ్యంగా కిందపడి మృత్యువాత పడ్డాడు. పృథ్వీరాజ్‌ను ఆస్పత్రికి తరలించేందుకు సాయం కోసం ఎంత అర్థించినా ఎవరూ ముందుకురాలేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కరోనా భయాలతో సాటిమనిషిని పట్టించుకోవడం మానేశారని వాపోయారు. (చదవండి: కరోనా బిల్లులతో కన్నీటిపర్యంతమైన డాక్టర్) -
రిమోట్‌తో కరోనా రోగుల పర్యవేక్షణ
కుషాయిగూడ (హైదరాబాద్): ఇకపై కరోనా రోగులకు నేరుగా చికిత్స అందించాల్సిన పనిలేదు. చికిత్స సమయంలో రోగులకు సమీపంలో ఉండి సేవలందిస్తున్న హెల్త్‌కేర్ సిబ్బందికి వైరస్ బా రిన పడతామనే ఆందోళన అవసరం లేదు. ఆసుపత్రిలో, ఐసోలేషన్‌లో ఉన్న రోగుల వద్దకు వెళ్లకుండానే రిమోట్‌తో వైద్యసేవలు అందించే పరికరం అందుబాటులోకి వచ్చింది. నగరంలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్), రిషీకేశ్‌లోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)తో కలిసి కరోనా రోగులకు రిమోట్‌తో వైద్యం అందించే పరికరాన్ని రూపొందించింది. దీనికి రిమోట్ హెల్త్ మా నిటరింగ్ సొల్యూషన్‌గా నామకరణం చేశారు. దీనిని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్, ఎయిమ్స్ డైరెక్టర్ పద్మ శ్రీ ప్రొఫెసర్ రవికాంత్‌తో కలిసి ఎయిమ్స్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రారంభించి నట్లు ఈసీఐఎల్ సంస్థ వర్గాలు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. చేతి గడియారం మాదిరిగా ఉన్న ఈ పరికరాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఐసోలేషన్‌లో ఉన్నవారిని 24 గంటల పాటుగా పర్యవేక్షించడానికి ఉపయోగపడటంతో పాటు, పీపీఈ కిట్ల డిమాండ్‌ను కూడా ఇది తగ్గించే అవకాశం ఉంది. ఈ అధునాతన పరికరం రోగి శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్ శాతం, హృదయ స్పందన, ఏ జోన్లో ఉన్నాడన్న అంశాలనూ తెలియజేస్తుంది. దీనిని రిషీ కే‹శ్ వైద్యులు కరోనా రోగులపై విజయవంతంగా పరీక్షిం చారు. ప్రస్తుతం వినియోగానికి సిద్ధంగా ఉందని చెప్పారు. -
నవంబర్ చివరినాటికి వీవీప్యాట్లు సిద్ధం
న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అవసరమైన 17 లక్షల వీవీప్యాట్(ఓటు రశీదు) యంత్రాలను నవంబర్ చివరినాటికి సమకూర్చుకుంటామని ఎన్నికల సంఘం తెలిపింది. భవిష్యత్తులో జరగబోయే అన్ని అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వీవీప్యాట్లను పూర్తిస్థాయిలో వినియోగిస్తామని వెల్లడించింది. ఇందుకోసం 17.45 లక్షల యూనిట్ల వీవీప్యాట్ మెషీన్ల తయారీకి బెంగళూరులోని బెల్, హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌కు ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపింది. ఇప్పటి వరకు 9 లక్షల యంత్రాలు సిద్ధమయ్యాయని, మిగిలిన 8 లక్షల యంత్రాలను నవంబర్ చివరినాటి అందిస్తామని ఆ రెండు కంపెనీలు హామీ ఇచ్చినట్లు వెల్లడించింది. -
ఈసీఐఎల్ రూపొందించిన సీకర్ విజయవంతం
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్), బార్క్ (డీఏఈఆర్ అండ్ డీ ల్యాబ్) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన సీకర్ విజయవంతమైనట్లు సంస్థ వర్గాలు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపాయి. అలాగే సీకర్ తయారీలో డీఆర్డీవో శాస్త్రవేత్తలు ముఖ్యపాత్ర పోషించినట్లు పేర్కొన్నాయి. ఈ నెల 22న రాజస్తాన్‌లోని పోఖ్రాన్ టెస్టు రేంజ్ బ్రహ్మోస్ పరీక్షల్లో సీకర్ను అమర్చి నిర్వహించిన ప్రయోగం విజయవంతమైనట్లు వెల్లడించాయి. ఈ ప్రయోగంలో డీఆర్డీవో, ఈసీఐఎల్, బార్క్ అధికారులతో పాటుగా ఇండియన్ ఆర్మీ అధికారులు పాల్గొన్నట్లు తెలిపాయి. దేశ రక్షణకు సంబంధించిన అంశం కావడంతో సీకర్‌కు సంబంధించిన చిత్రాలను విడుదల చేయడం లేదన్నారు. శత్రువుల కదలికలను, వారి స్థావరాలను పక్కాగా గుర్తించి లక్ష్యాన్ని చేరుకోవడం దీని ప్రత్యేకతని తెలిపాయి. -
ఈసీఐఎల్‌కు రూ. 40 కోట్ల కుచ్చుటోపి
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో పనిచేసిన ఉద్యోగులే ఆ సంస్థకు కుచ్చుటోపి పెట్టారు. జీఎస్ఎం మానిటరింగ్ సిస్టమ్ కొనుగోలులో అక్రమాలు జరిగినట్టు చీఫ్ విజిలెన్స్ అధికారి సి.మురళీధర్‌రావు గుర్తించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి అర్హత లేని ఈఎల్డీ అనే సంస్థకు టెండర్లు అప్పగించినట్టు ఆరోపించారు. దీనిపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు 2013లో ఫిర్యాదు చేశారు. మూడేళ్ల విచారణ అనంతరం సీవీసీ సూచ న మేరకు సీబీఐ హైదరాబాద్ జోనల్ అధికారులు కేసు నమోదు చేశారు. 2004 నుంచి 2010 మధ్య మానిటరింగ్ పరికరాల కొనుగోలులో రూ.40 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు సీబీఐ గుర్తించింది. దీంతో ఈసీఐఎల్ ఐటీ అండ్ టీజీ విభాగం మాజీ డీజీఎం కె.హరి సత్యనారాయణ, టీసీడీ ఐటీ అండ్ టీజీ మాజీ జీఎం వి.సత్యనారాయణ, పర్చేజ్ విభాగం మాజీ డీజీఎం ఎం.విష్ణుమూర్తి, టెక్ని కల్ విభాగం మాజీ డైరెక్టర్ గడినాగ వెంకట సత్యనారాయణ, మరో రిటైర్డ్ పర్చేజ్ డీజీఎం కాట్రగడ్డ సుబ్బారావుపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈఎల్డీ సం స్థకు చెందిన కల్నల్ సురేశ్ భాటియా, లియోపాల్డిక్, నాథిన్ రోథ్విల్, ఈఎల్డీ సంస్థ, హార్టన్ కేస్ కమ్యూనికేషన్ కంపెనీలపై కూడా కేసులు నమోదు చేశారు.