Engineering courses
-
ఎంఎస్.. చలో యూఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సులు పూర్తి చేసిన తర్వాత చాలా మంది విద్యార్థులు అమెరికాలో ఎంఎస్ కోర్సు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. అమెరికా వెళ్తే చదువుకుంటూనే ఉపాధి సైతం పొందవచ్చని భావిస్తున్నారు. కోవిడ్ కాలంలో అమెరికా వెళ్లాలనే ఆకాంక్ష విద్యార్థుల్లో కాస్త తగ్గినా గతేడాది నుంచి మళ్లీ ఆసక్తి పెరిగింది. ఆర్థిక మాంద్యంతో అక్కడ ఉపాధి అవకాశాలు తగ్గినా విద్యార్థులు మాత్రం దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎంఎస్ పూర్తయ్యే నాటికి పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటాయని ఆశిస్తున్నారు. దీంతో అప్పులు చేసి మరీ విదేశీ చదువుల కోసం పరుగులు పెరుగుతున్నారు. రాష్ట్రంలో 2020లో దాదాపు 40 వేల మంది విద్యార్థులు అమెరికా వెళ్లగా 2022లో ఈ సంఖ్య 52 వేలకు పెరిగిందని, ఈ ఏడాది ఆగస్టు నాటికి వారి సంఖ్య 60 వేల వరకు ఉండొచ్చని ఓ కన్సల్టెంట్ తెలిపారు. దేశం నుంచి ఈ ఏడాది దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు ఆగస్టులో అమెరికా, ఆ్రస్టేలియా ఇతర దేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారన్నారు. జాబ్ వచ్చే కోర్సులే గురి... దేశంలో ఏ కోర్సులో ఇంజనీరింగ్ చేసినా అమెరికాలో ఎంఎస్ మాత్రం సాఫ్ట్వేర్ అనుబంధ రంగాల్లోనే చేయాలని విద్యార్థులు లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా డేటా సైన్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. డిజిటల్ ఎకానమీలో అత్యధికంగా ఉదోగాలు ఉండటం, నైపుణ్య విభాగాలైన బిజినెస్, టెక్నాలజీ, డేటా సైన్స్‌కు భవిష్యత్తులోనూ మంచి డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ అంచనాలతోనే ఎక్కువ మంది డేటా సైన్స్‌లో విదేశీ విద్య పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు అందిన నివేదికల ప్రకారం డేటా అనాలసిస్‌లో 23 శాతం, డేటా విజువలైజేషన్లో 10 శాతం, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్‌లో 26 శాతం, మెషీన్ లెరి్నంగ్‌లో 41 శాతం మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుతున్నారు. వారి లక్ష్యం మాత్రం ఈ కోర్సుల డిమాండ్‌ను అందిపుచ్చుకోవడమే. దేశంలో 2020–21 మధ్య డేటా సైన్స్‌లో ఉద్యోగాలు 47.10 శాతం మేర పెరిగాయి. ఎంఎస్ పూర్తి చేసిన వారికి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు వస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. రంగంలోకి కన్సల్టెన్సీలు... విదేశాలకు వెళ్లే విద్యార్థులను వెతికి పట్టుకొనేందుకు కన్సల్టెన్సీలు పోటీపడుతున్నాయి. వాస్తవానికి విదేశాల్లో ఎంఎస్ కోర్సు చేసేందుకు ట్యూషన్ ఫీజు, ఇతర ఖర్చులు, విమాన ప్రయాణ చార్జీలు కలిపి రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు ఖర్చవుతుంది. చదువుతూ ఉద్యోగం చేయడానికి చాలా దేశాలు ఒప్పుకోవు. కాబట్టి అక్కడ చవివే సమయంలో కావల్సిన మొత్తం తమ వద్ద ఉందని విద్యార్థి వెళ్లే ముందే ఆధారాలు చూపించాలి. ఈ ప్రక్రియలో కన్సల్టెన్సీలు అవసరమైన తోడ్పాటు అందిస్తున్నాయి. విద్యార్థి ఖాతాలో డబ్బులు వేయడం, అతను విదేశాలకు వెళ్లిన తర్వాత తిరిగి తీసుకోవడం సర్వసాధారణంగా జరిగిపోతున్నాయి. విదేశాల్లో విద్యార్థులు చదువును త్వరగా పూర్తి చేసి వీసా గడువులోగా ఎక్కువ ఉపాధి మార్గాలపై దృష్టి పెడుతున్నారు. ఇలాంటి వారికి కన్సల్టెన్సీలు ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇస్తున్నాయి. ఎం.ఎస్. పూర్తి చేశాక కూడా ఉద్యోగం ఇస్తామని ఒప్పందం చేసుకుంటున్నాయి. విదేశాలకు విద్యార్థులు వెళ్లాక ఏదో ఒక పార్ట్‌టైం ఉద్యోగం చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇవన్నీ సానుకూల మార్గాలు కావడంతో ఎక్కువ మంది వెళ్ళేందుకు ఇష్టపడుతున్నారు. -
సివిల్, మెకానికల్ కోర్సులకు రిపేర్
సాక్షి, హైదరాబాద్: నానాటికీ ఆదరణ కోల్పోతున్న ఇంజనీరింగ్‌లోని కొన్ని కోర్సులకు కాయకల్ప చికిత్స చేసేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) సిద్ధమైంది. అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల స్వరూపాన్ని సమూలంగా మార్చాలని నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దేందుకు రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్ల అభిప్రాయాలు కోరింది. దీని ఆధారంగా ముసాయిదా ప్రతిని రూపొందించే ప్రయత్నంలో ఉంది. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో 12,70,482 సీట్లు ఉంటే, ఏటా సగటున 9.5 లక్షల మంది చేరుతున్నారు. ఇందులో 6.2 లక్షల మంది కంప్యూటర్, ఐటీ కోర్సులనే ఎంచుకుంటున్నారు. సివిల్‌లో 30 శాతం, మెకానికల్‌లో 28 శాతం, ఎలక్ట్రికల్‌లో 32 శాతం మించి సీట్లు భర్తీ కావడం లేదు. ఇదే ట్రెండ్ కొనసాగితే డిమాండ్ లేని బ్రాంచ్‌లుగా ఇవి మూతపడే ప్రమాదం ఉందని అన్ని రాష్ట్రాలూ భావిస్తున్నాయి. మార్కెట్ స్పీడేది? వాస్తవానికి దేశవ్యాప్తంగా నిర్మాణ, మోటార్, విద్యుత్ రంగాల్లో ఊహించని పురోగతి కన్పిస్తోంది. వీటికి సంబంధించిన నైపుణ్యం గల కోర్సులు మాత్రం డిమాండ్ కోల్పోతున్నాయి. కాలానుగుణంగా వస్తున్న మార్పులు సంబంధిత కోర్సుల్లో జోడించకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఏఐసీటీఈ అధ్యయనంలో వెల్లడైంది. ఉదాహరణకు నిర్మాణ రంగంలో అనేక మార్పులొచ్చాయి. ప్రాజెక్టులు, ఇళ్ల నిర్మాణంలో సాఫ్ట్‌వేర్‌తో ప్లానింగ్ రూపకల్పన చేస్తున్నారు. రిమోట్ కంట్రోల్ వ్యవస్థతో నడిచే యంత్రాలు రంగప్రవేశం చేశాయి. కానీ చదువు ముగించుకుని ఉపాధి కోసం వచ్చే విద్యార్థులు ఈ వేగాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారు. సాంకేతికత తోడవ్వని రీతిలోనే ఇంజనీరింగ్ పట్టా తీసుకోవడంతో పెద్దగా ఉపయోగం ఉండటం లేదు. వాహన రంగాన్ని ఆధునిక టెక్నాలజీ పూర్తిగా ఆక్రమించింది. స్మార్ట్ టెక్నాలజీతోనే వాహనాలను డిజైన్ చేస్తున్నారు. మెకానికల్ ఇంజనీర్లు అనుభవంలో తప్ప ఈ టెక్నాలజీని విద్యార్థి దశలో పొందలేకపోతున్నారు. అదేవిధంగా విద్యుత్ ప్రాజెక్టుల్లోనూ టెక్నాలజీ దూసుకొస్తున్నా, ఇంజనీరింగ్‌లో ఇంకా పాతకాలం బోధనే కొనసాగుతోంది. పారిశ్రామిక సంస్థలతో అనుసంధానం సాధారణ సివిల్, మెకానికల్ కోర్సుల్లో మార్కెట్లో ఉన్న టెక్నాలజీని జోడించే దిశగా కోర్సుల్లో మార్పులు చేయాలని నిర్ణయించారు. రెండో ఏడాది నుంచి కంప్యూటర్ అనుసంధాన కోర్సులు, సాఫ్ట్‌వేర్‌పై అవగాహన కల్పించాలని భావిస్తున్నారు. పారిశ్రామిక సంస్థలతో నేరుగా అనుభవం పొందేలా బోధన ఉండాలని ఏఐసీటీఈ ప్రతిపాదిస్తోంది. మెకానికల్‌లో సాధారణ పాఠ్య ప్రణాళికను బేసిక్ ఇన్ఫర్మేషన్‌గానే ఉంచి, మార్కెట్లో వస్తున్న మార్పులతో కూడిన సాంకేతికతను ప్రధానాంశంగా చేయాలని నిర్ణయించింది. ఇదేవిధంగా ఎలక్ట్రికల్ కోర్సుల్లోనూ మార్పులు ప్రతిపాదిస్తోంది. దీనిపై అన్ని కాలేజీలు మౌలిక వసతులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ప్రతీ కాలేజీ కూడా పారిశ్రామిక సంస్థలతో అనుసంధానమై ఉండేలా నిబంధనలు తేవాలని, అప్పుడే కోర్సులు ఆదరణ పొందుతాయని భావిస్తోంది. వాస్తవానికి ఈ దిశగా రాష్ట్ర ఉన్నత విద్యా మండళ్లు కూడా ఆసక్తి చూపుతున్నాయి. ముసాయిదా పూర్తయితే, ఏఐసీటీఈ కార్యాచరణకు ఉపక్రమించే అవకాశముందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. -
‘సెట్’ అడ్మిషన్లన్నీ ఈ నెలలోనే
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఈఏపీ సెట్–2022 రెండో విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి ప్రకటించారు. ఈనెల 25వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. వివిధ కోర్సులకు సంబంధించిన అడ్మిషన్ల కౌన్సెలింగ్ తేదీలను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సోమవారం ఆయన విడుదల చేశారు. ఈసెట్, ఐసెట్, పీజీఈ సెట్, జీప్యాట్, బీఆర్క్‌లకు సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను ఖరారు చేసినట్లు వివరించారు. అలాగే పీఈ సెట్, పీజీ సెట్ మొదటి విడత కౌన్సెలింగ్‌లను త్వరలో చేపట్టనున్నట్టు చెప్పారు. ఆర్ సెట్ పరీక్ష నిర్వహణ తేదీలను కూడా ఖరారు చేశామన్నారు. ఏపీ ఈఏపీ సెట్‌కు సంబంధించి కేటగిరీ–బి (యాజమాన్య కోటా) సీట్లలో ఎన్ఆర్ఐ కోటా సీట్ల భర్తీకి సెప్టెంబర్ 3నుంచి 15వరకు అవకాశం ఇచ్చామన్నారు. నాన్ ఎన్ఆర్ఐ కోటా సీట్లను సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభించామని, అక్టోబర్ 17వ తేదీతో ఈ అడ్మిషన్ల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. కొన్ని సెట్ల తొలివిడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ ముగియగా.. కొన్ని సెట్ల తొలివిడత ప్రక్రియ కొనసాగుతోందన్నారు. వాటినీ పూర్తిచేసి రెండో విడత కౌన్సెలింగ్‌ను చేపట్టేందుకు వీలుగా షెడ్యూళ్లను ఖరారు చేశామని వివరించారు. డిగ్రీ కోర్సుల సీట్ల కేటాయింపు కాగా, రాష్ట్రంలోని ఉన్నత విద్యాకోర్సులన్నిటికీ అడ్మిషన్లను ఆన్లైన్లోనే కల్పిస్తున్నామని హేమచంద్రారెడ్డి వివరించారు. జూలై 22న డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఇచ్చామని, సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించామని చెప్పారు. ఈ నెల 14న డిగ్రీ అభ్యర్థులకు తొలివిడత సీట్ల కేటాయింపు చేస్తామని చెప్పారు. వారంతా 15వ తేదీన కాలేజీల్లో రిపోర్టు చేయాలని, అదే రోజు నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. డిగ్రీ కోర్సులన్నీ నాలుగేళ్ల హానర్ కోర్సులుగా చేశామని, డిగ్రీలో చేరిన విద్యార్థులు ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. మూడేళ్లకే ఎగ్జిట్ అయ్యే విద్యార్థులకు 10 నెలల ఇంటర్న్‌షిప్ ఉంటుందన్నారు. ఇప్పటికే డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. ఇంటర్న్‌షిప్‌తోపాటు అదనంగా మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్ వంటి వివిధ ఆధునిక కంప్యూటర్ సర్టిఫికెట్ కోర్సులను కూడా ఉచితంగా అందిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కె.రామమోహనరావు, కార్యదర్శి ప్రొఫెసర్ నజీర్ అహమ్మద్, సెట్స్ ప్రత్యేకాధికారి డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. -
JNTU Vizianagaram: చదువు+ ఉద్యోగం= జేఎన్టీయూ
జేఎన్టీయూ గురజాడ విజయనగరం యూనివర్సిటీ... చక్కని చదువుల నిలయం. ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న వర్సిటీ.. విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తోంది. ప్రమాణాలతో కూడిన ఇంజినీరింగ్ విద్యను బోధిస్తోంది. నైపుణ్యాభివృద్ధిని పెంపొందిస్తోంది. ఉద్యోగ సాధనకు తోడ్పడుతోంది. పారిశ్రామిక వేత్తలుగా మలుస్తోంది. వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతోంది. వర్సిటీలో అమలుచేస్తున్న నూతన విద్యావిధానం, నిర్వహిస్తున్న కోర్సులు, ఉపాధికల్పనకు ‘సాక్షి’ అక్షరరూపం. విజయనగరం అర్బన్: విజయనగరం పట్టణానికి సమీపంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో 2007వ సంవత్సరంలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పడింది. ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి కృషితో కళాశాల కాస్త వర్సిటీగా రూపాంతరం చెందింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న వర్సిటీ ఇంజినీరింగ్ చదువులకు నిలయంగా మారింది. విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించేలా.. వారిలో నైపుణ్యాలను పెంపొందించేలా ఈ ఏడాది మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ కోర్సుల్లో ఆనర్స్, మైనర్ పేరుతో విస్తరణ డిగ్రీలను ప్రవేశపెట్టింది. జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రూపొందించిన నూతన సిలబస్, బోధనా విధానాన్ని అమలు లోకి తెచ్చింది. మొత్తం 8 సెమిస్టర్స్‌లో తొలి మూడు మినహా మిగిలిన ఐదు సెమిస్టర్స్తోపాటు 10 నెలల ఇంటెర్న్షిప్ చేయిస్తారు. ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ఈ, ఐటీ, మెకానికల్ డిగ్రీలలో 66 సీట్ల చొప్పున, సివిల్, మెటలడ్జికల్ సబ్జెక్టు బీటెక్ డిగ్రీలలో 33 సీట్ల చొప్పున వర్సిటీలో బోధన సాగుతోంది. ఇంజినీరింగ్ ఆనర్స్ డిగ్రీ విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలకు అనుగుణంగా ఇంజినీరింగ్ డిగ్రీని మూడు విధాలుగా విభజించారు. ఎప్పటి మాదిరిగా ఇచ్చిన కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు యథావిధిగా సాధారణ బీటెక్ డిగ్రీ వస్తుంది. డిగ్రీ సిలబస్‌తోపాటు ఇతర (డిగ్రీ సబ్జెక్టులకు సంబంధం లేని) అదనపు ప్రతిభాంశాలను ఉన్నట్లు నిర్ధారించుకున్న వారికి ఆనర్ డిగ్రీ ఇస్తారు. దీనికోసం మొత్తం ఎనిమిది సెమిస్టర్స్లోనూ 80 శాతం ఉత్తీర్ణతను చూపాల్సి ఉంటుంది. తొలుత రెండో సంవత్సరం మొదటి సెమిస్టర్ ఫలితాలలో అప్పటికి పూర్తయిన మూడు సెమిస్ట్లో 80 శాతంతో చూపిన ఫలితాల (ఒకే సారి ఉత్తీర్ణత పొందాలి) ఆధారంగా రిజస్టర్ అయిన విద్యార్థిని ఆనర్ డిగ్రీ విభాగంలోకి తీసుకుంటారు. అప్పటి నుంచి చివరి సెమిస్టర్ వరకు కనీసం 160 క్రెడిట్ పాయింట్లతో పాటు అదనపు నైపుణ్యాలపై మరో 20 క్రెడిట్ పాయింట్లు తెచ్చుకోవాలి. 1,075 మందికి ప్లేస్మెంట్ కళాశాలలో ఏడు కోర్సులలో బీటెక్ డిగ్రీని విద్యార్థులకు అందిస్తోంది. ఇప్పటివరకు 1,079 మంది విద్యార్థులు వివిధ కంపెనీలలో ఉద్యోగాలు సాధించారు. 11.5 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మరికొందరు పారిశ్రామిక వేత్తలుగా రాణిస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న విద్యాసంవత్సరం నాలుగో సంవత్సర విద్యార్థులు ఇప్పటివరకు 75 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. రానున్న రెండు నెలల్లో మరో 10 కంపెనీలు ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్టు వర్సిటీ వర్గాలు తెలిపాయి. 26 కంపెనీలతో వర్సిటీ ఎంఓయూ చేసుకున్నట్టు వెల్లడించాయి. ఇంజినీరింగ్ మైనర్ డిగ్రీ బీటెక్ కోర్సులో చేరే విద్యార్థులు ప్రధాన సబ్జెక్టుతోపాటు ఇతర ఇంజినీరింగ్ కోర్సుల్లో మరో సబ్జెక్టులో కూడా ప్రతిభ చూపాలనుకునే వారికి ఈ డిగ్రీ రూపంలో అవకాశాన్నిచ్చారు. మొదటి మూడు సెమిస్టర్ ఫలితాలలో 80 శాతం పాయింట్లను తెచ్చుకున్న వారికి మైనర్ డిగ్రీ కోర్సులకు రిజిస్టర్ చేయిస్తారు. నైపుణ్యం సాధించేలా బోధన అమెజాన్ సుపోర్టు ఇంజినీరింగ్ సంస్థలో ఉద్యోగం వచ్చింది. వార్షిక వేతనం రూ.11 లక్షలుగా నిర్ణయించారు. చాలా ఆనందంగా ఉంది. కళాశాలలో నైపుణ్యాభివృద్ధికి అనుగుణంగా అందించే బోధనలు వల్లే ఉద్యోగం సాధించగలిగాను. ఇంజినీరింగ్ సబ్జెక్టులతోపాటు ఉద్యోగావకాశాల అదనపు అంశాల్లో అందించిన గైడెన్స్ బాగుంది. – పి.సాహితి జ్యోత్స్న, సీఎస్ఈ విద్యార్థిని, జేఎన్టీయూ విజయనగరం ఉద్యోగ కల్పనే లక్ష్యంగా... ఉద్యోగ కల్పనే లక్ష్యంగా విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపరిచే ప్రణాళికలను రూపొందించాం. దేశ, అంతర్జాతీయ స్థాయిలోని 26 ప్రతిష్టాత్మకంగా కంపెనీలతో ఉద్యోగ నియామక ఒప్పందాలు పెట్టుకున్నాం. ఇంజినీరింగ్ కోర్సులపై అత్యాధునిక బోధనా విధానాన్ని అనుసరించడంతో పాటు విద్యార్థుల్లో ఉన్న అభిరుచికి అనుగుణంగా వారిలోని నైపుణ్యాలను వెలికితీస్తాం. దీనికోసం జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం. గత ఏడాది మొదటి సంవత్సరం నుంచి నూతన విద్యావిధానాన్ని అమలుచేస్తున్నాం. – ప్రొఫెసర్ శ్రీకుమార్, ప్రిన్సిపాల్, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, విజయనగరం చక్కని శిక్షణ టీసీఎప్ డిజిటల్ సంస్థలో 7.5 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని సాధించాను. ప్లేస్మెంట్ ఇంటర్వ్యూలో ఇంజినీరింగ్ సబ్జెక్టు అంశాలతో పాటు ఆ సంస్థకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యాలను పరీక్షించారు. కళాశాలలో ప్రత్యేకించి ఉన్న ప్లేస్మెంట్ విభాగం ఆ దిశగా అందించిన శిక్షణ వల్ల ఉద్యోగం సాధించగలిగాను. – ఎం.జాహ్నవి, సీఎస్ఈ, జేఎన్టీయూ, విజయనగరం -
Engineering: ఫీజులను పెంచేసిన పలు కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో పెరిగిన ఫీజులు.. పేద, మధ్య తరగతి విద్యార్థులకు గుదిబండగా మారనున్నాయి. సగటున ఒక్కో విద్యార్థిపై ఏటా అదనంగా రూ.20 వేల భారం పడుతుందని.. నాలుగేళ్లకు కలిపి రూ.80వేలు భరించాల్సి వస్తుందని విద్యా రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇంజనీరింగ్ ఫీజులు పెంచిన కళాశాలల్లో చేరే దాదాపు 45 వేల మంది విద్యార్థులపై ఈ భారం పడనుంది. వీరంతా కన్వీనర్ కోటా కింద చేరే విద్యార్థులే కానుండటం గమనార్హం. ఇక అదనపు ఫీజు భారానికితోడు ట్రాన్స్‌పోర్టు/హాస్టల్/ల్యాబ్ ఖర్చులపేరిట ప్రతినెలా మరో రూ.ఐదు వేల వరకు భారం పెరిగే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. అంటే నాలుగేళ్ల ఇంజనీరింగ్ ఫీజులో అదనంగా రూ.లక్షకుపైనే ఖర్చుచేయాల్సిన పరిస్థితి నెలకొంది. రూ.45 వేల దాకా అదనపు భారం కోర్టు అనుమతి మేరకు కాలేజీలను బట్టి వార్షిక ఫీజు కనీసం రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.45 వేల వరకు పెరిగింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 10వేలలోపు ర్యాంకు వచ్చి కాలేజీల్లో చేరే దాదాపు ఆరు వేల మంది బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు పూర్తిఫీజును ప్రభుత్వం ఇస్తుంది. గతేడాది కనీస ఫీజు రూ.35 వేలు, గరిష్ట ఫీజు రూ.1.38 లక్షలు ఉండేది. అదిప్పుడు రూ.45 వేల నుంచి రూ1.73 లక్షలకు పెరిగింది. ఈ అదనపు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. మరోవైపు పదివేలకన్నా పైన ర్యాంకు వచ్చినవారికి ప్రభుత్వం కనీస ఫీజును మాత్రమే చెల్లిస్తుంది. ఆపై మొత్తాన్ని విద్యార్థులే కట్టాలి. దీంతో పదివేలపైన ర్యాంకు వచ్చిన బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులందరిపై పెరిగిన ఫీజు మోత మోగనుంది. ఇక ఫీజు రీయింబర్స్మెంట్ పరిధిలోకి రానివారికీ భారం పడుతోంది. సగటున చూస్తే ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.20వేల చొప్పున నాలుగేళ్లకు రూ.80 వేలకుపైగా అదనపు భారం పడనుంది. పెంచిన ఫీజులను తగ్గించాల్సిందే.. ఏఎఫ్ఆర్సీ, రాష్ట్ర ప్రభుత్వ పరోక్ష సహకారంతోనే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజులు పెంచుకున్నాయి. దీనిని వెంటనే వెనక్కి తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కరోనా ప్రభావం నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం ఇంజనీరింగ్ ఫీజులు పెంచవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా.. యాజమాన్యాలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారు. పేద విద్యార్థులపై ఫీజుల భారం మోపారు. – ప్రవీణ్, ఏబీవీపీ నేత కోర్టుకెళ్లి పెంచుకున్న కాలేజీలు ‘తెలంగాణ రాష్ట్ర అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిషన్(టీఎస్ఏఎఫ్ఆర్సీ)’ ఈసారి ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల పెంపు ప్రక్రియ చేపట్టింది. కాలేజీల ప్రతిపాదనలను పరిశీలించి, యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి.. 20 నుంచి 25% ఫీజుల పెంపును ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఆ ప్రతిపాదనలపై ఏమీ తేల్చలేదు. దీనితో 81 ఇంజనీరింగ్ కాలేజీలు కోర్టును ఆశ్రయించి ఈ విద్యా సంవత్సరంలోనే ఫీజుల పెంపునకు అనుమతి తెచ్చుకున్నాయి. అయితే కోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటివరకు అప్పీలు చేయలేదని.. అంటే పరోక్షంగా పెంపును అంగీకరించనట్లేనన్న విమర్శలు వస్తున్నాయి. ట్యూషన్ ఫీజు రూ.లక్షకు పైగా ఉండే అవకాశం సీబీఐటీలో రూ.1.73 లక్షలకు, వాసవి, వర్దమాన్, సీవీఆర్, బీవీఆర్ఐటీ మహిళా కాలేజీలలో రూ.1.55 లక్షలు, శ్రీనిధి, వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజీలో రూ.1.50 లక్షలు, ఎంవీఎస్ఆర్ రూ.1.45 లక్షలు చొప్పున ట్యూషన్ ఫీజులకు అనుమతి లభించింది. అయితే ఫీజు పెంపునకు సంబంధించి హైకోర్టు.. కాలేజీలకు తాత్కాలిక అనుమతి మాత్రమే ఇచ్చింది. మొత్తం 79 కాలేజీలుండగా.. 36 కాలేజీల్లో ట్యూషన్ ఫీజు రూ.లక్షకు పైగా ఉండే అవకాశం ఉంది. కాగా, కాలేజీలు వసూలు చేసే పెంపు మొత్తాన్ని బ్యాంకుల్లోనే ఉంచాలని.. తామిచ్చే తుది తీర్పునకు లోబడి ఫీజు పెంపు ఉత్తర్వులు ఉంటాయని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. -
పీజీ స్కాలర్లకు నెలకు రూ.12,400 స్కాలర్షిప్
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ సహా ప్రొఫెషనల్ కోర్సుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) చదువుతున్న విద్యార్థులకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) శుభవార్త తెలిపింది. ఏఐసీటీఈ అనుమతితో నడిచే ప్రొఫెషనల్ కాలేజీల్లో ఇంజనీరింగ్, ఇతర కోర్సుల్లో పీజీ చదివేవారిలో అర్హులైన వారికి నెలకు రూ.12400 చొప్పున స్కాలర్షిప్ను ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈమేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఏఐసీటీఈ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. విద్యార్థులు ‘పీజీఎస్సీహెచ్ఓఎల్ఏఆర్ఎస్హెచ్ఐపీ.ఏఐసీటీఈఐఎన్డీఐఏ.ఓఆర్జీ’లో ఆన్లైన్ దరఖాస్తు సమర్పించాలని పేర్కొంది. అభ్యర్థులు డిసెంబర్ 31లోగా ఈ పోర్టల్ ద్వారా లాగిన్ ఐడీని క్రియేట్ చేసుకుని వచ్చే జనవరి 15 లోపల దరఖాస్తును సమర్పించాల్సి ఉంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.12,400 చొప్పున ‘ఏఐసీటీఈ పీజీస్కాలర్‌షిప్’ కింద వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తుంది. ఈ స్కాలర్షిప్కు ఎంపికైన వారు వారానికి 8 నుంచి 10 గంటలు వారి విద్యాసంస్థ సూచించిన మేరకు టీచింగ్, రీసెర్చి ప్రక్రియల్లో పాల్గొనాలి. అభ్యర్థుల నెలవారీ పెర్ఫార్మెన్స్ను పరిగణనలోకి తీసుకుని ఏఐసీటీఈ, విద్యాసంస్థ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా మంచి పురోగతిలో ఉంటేనే ఉపకార వేతనం కొనసాగిస్తారు. దరఖాస్తుదారులు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్టు ఇన్ ఇంజనీరింగ్ (గేట్), గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్టు (జీపాట్), కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్ (సీడ్)లలో నిర్ణీత స్కోరు సాధించి ఉండాలి. మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, మాస్టర్ ఆఫ్ ఫార్మసీ, మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలు పొంది ఉండాలి. ఆయా విద్యాసంస్థలలోని ఇన్‌టేక్‌ను అనుసరించి స్కాలర్‌షిప్‌ల సంఖ్యను ఏఐసీటీఈ నిర్ణయిస్తుంది. వీటికి అదనంగా ఈడబ్ల్యూఎస్ కోటా కింద పదిశాతం మందికి పీజీ స్కాలర్షిప్లను ఇస్తుంది. 24 నెలలు కొనసాగే ఈ ఉపకార వేతనానికి డ్యూయెల్ డిగ్రీ చదువుతున్నవారు కూడా అర్హులే. ఇతర వివరాలకు ఏఐసీటీఈ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. 2 వేలమంది విద్యార్థులకు ‘స్వనాద్’ కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు ‘స్వనాధ్’ పేరుతో ఆర్థికంగా తోడ్పాటు అందిస్తామని ఏఐసీటీఈ తెలిపింది. ఏఐసీటీఈ గుర్తింపు ఉన్న కాలేజీల్లో డిగ్రీ, డిప్లమో చదివే వారిలో అర్హులైన 2 వేలమందికి ఏడాదికి రూ.50 వేల చొప్పున నాలుగేళ్ల పాటు స్కాలర్షిప్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కాలేజీ ఫీజు, కంప్యూటర్, పుస్తకాలు, అవసరమైన పరికరాలు, మెటీరియల్ కోసం ఇచ్చే ఈ ఉపకార వేతనాల్లో వెయ్యి డిగ్రీ విద్యార్థులకు, వెయ్యి డిప్లమో విద్యార్థులకు కేటాయించారు. కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన వారు, సాయుధ బలగాలు, పారామిలటరీలో పనిచేస్తూ చనిపోయిన వారి పిల్లలు దరఖాస్తు చేయడానికి అర్హులు. వారి కుటుంబ సంవత్సర ఆదాయం రూ.8 లక్షలకు మించరాదు. విద్యార్థులు ప్రభుత్వం నుంచి ఇతర సహాయం పొందుతున్నవారై ఉండరాదు. ఏఐసీటీఈ అనుమతి ఉన్న కాలేజీల్లో ప్రస్తుతం మొదటి సంవత్సరం డిగ్రీ, డిప్లమో చదువుతున్నవారై ఉండాలి. అభ్యర్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ (ఎన్ఎస్పీ) ద్వారా నవంబర్ 30లోగా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి. డిగ్రీ విద్యార్థులను ఇంటర్మీడియెట్ మార్కుల ఆధారంగా, డిప్లమో విద్యార్థులను టెన్త్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. -
ఇంజనీరింగ్‌పై తగ్గుతున్న క్రేజ్
సాక్షి, అమరావతి: చేరికలు క్రమేణా కుదించుకుపోతుండడంతో దేశంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల సంఖ్య ఏటా తగ్గిపోతోంది. గత పదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఈ తగ్గుదల ఏటా సగటున లక్ష వరకు ఉంటోంది. ఇంజనీరింగ్‌తో పాటు మేనేజ్మెంట్ కోర్సులలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) గణాంకాల ప్రకారం 2012–13లో దేశంలో 26.9 లక్షల ఇంజనీరింగ్ సీట్లుండగా ఇప్పుడు 23.61 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2014–15లో గరిష్ట స్థాయిలో 31.83 లక్షల సీట్లున్నాయి. అప్పటి నుంచి సీట్ల సంఖ్యలో ఏటా లక్ష చొప్పున తగ్గుదల కనిపించింది. సరైన బోధనా సిబ్బంది లేకపోవడం, లేబొరేటరీలు, ఇతర ప్రమాణాలను సంస్థలు పాటించకపోవడంతో విద్యార్థులలో నైపుణ్యాలు కొరవడి ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతూ వచ్చాయి. ఈ ప్రభావంతో క్రమేణా ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశాల సంఖ్య తగ్గుతోంది. విద్యార్థుల చేరికలు పడిపోతుండటంతో కాలేజీలు సీట్ల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొత్త టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండటంతో ఆయా రంగాల్లోని అంశాలపై పరిజ్ఞానాన్ని విద్యార్థులు అలవర్చుకోవలసి వస్తోంది. పాత సంప్రదాయ కోర్సులకు ఆదరణ తగ్గుతుండడంతో కాలేజీలు క్రమేణా వాటిని వదులుకుంటున్నాయి. ఇవన్నీ ఇంజనీరింగ్ కోర్సులలో సీట్ల సంఖ్య తగ్గడానికి కారణంగా యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. మేనేజ్మెంట్ కోర్సుల్లో కొంత వ్యత్యాసం.. పదేళ్లుగా దేశంలో మేనేజ్మెంట్ కోర్సుల డేటా పరిశీలిస్తే 2012–13 నుంచి 2014–15 వరకు సీట్లు పెరగ్గా ఆ తర్వాత తగ్గాయి. 2017–18లో మేనేజ్మెంట్ సీట్ల సంఖ్య 3.94 లక్షలు కాగా 2018–19లో 3.74 లక్షలకు, 2019–20లో 3.73 లక్షలకు తగ్గాయి. తరువాత పెరుగుదల నమోదైంది. 2021–22లో 4.04 లక్షలకు చేరాయి. ఇంజనీరింగ్ వెలవెల.. మేనేజ్మెంట్ కోర్సులతో పోలిస్తే గత ఐదేళ్లలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎక్కువ సీట్లు ఖాళీగా ఉన్నాయి. మేనేజ్మెంట్ సీట్లు 34 – 37 శాతం వరకు ఖాళీగా ఉండగా ఇంజనీరింగ్ సీట్లు 45 – 48 శాతం వరకు ఖాళీగా ఉన్నాయి. బీఈ, బీటెక్ తర్వాత వెంటనే ఉద్యోగాలు రాకపోవడం కూడా దీనికి కారణం. అలాంటి వారు మేనేజ్మెంట్ కోర్సులలో చేరుతున్నట్లు తేలుతోంది. సివిల్, మెకానికల్, ఇతర ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు తమ కోర్ విభాగాల్లో ఉద్యోగాలు లేక మేనేజ్మెంట్ కోర్సుల ద్వారా కార్పొరేట్ రంగంలోకి ప్రవేశించాలని భావిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. స్కిల్ ఇండియా తాజా నివేదికల ప్రకారం ఇంజనీరింగ్ విద్యార్థులు 46.82 శాతం, మేనేజ్మెంట్ విద్యార్ధులు 46.59 శాతం ఉపాధి పొందినట్లు వెల్లడిస్తున్నాయి. వివిధ సంస్థలు ఇంజనీరింగ్ అర్హతలతోపాటు మేనేజ్మెంట్ నైపుణ్యాలున్న వారికి ప్రాధాన్యమిస్తుండడంతో అటువైపు మొగ్గు చూపుతున్నట్లు ఏఐసీటీఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలోనూ ఇవే రకమైన గణాంకాలు దేశంలోని పరిస్థితినే రాష్ట్రంలో ఏఐసీటీఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి. రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు 2.99 లక్షలుండగా 2021–22 నాటికి 2.37 లక్షలకు తగ్గాయి. మేనేజ్మెంట్ కోర్సుల్లో 2014–15లో 51,750 సీట్లుండగా 2021–22 నాటికి 39,451కి తగ్గాయి. -
మాతృభాషలో ఇంజనీరింగ్!
న్యూఢిల్లీ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ సహా టెక్నికల్ కోర్సులు స్థానిక భాషల్లో నేర్చుకునే వీలు కల్పించనున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు కేంద్ర విద్యా మంత్రి రమేశ్ పొఖ్రియాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రివ్యూమీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఇంజనీరింగ్ కోర్సులతో సహా టెక్నికల్ కోర్సులను మాతృభాషలో నేర్చుకునే వీలుకల్పించేలా కీలక నిర్ణయం తీసుకున్నామని, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందని, ఇందుకోసం కొన్ని ఐఐటీ, ఎన్ఐటీలను ఎంపిక చేస్తామని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. స్కాలర్షిప్పులు, ఫెలోషిప్పులు సమయానికి విద్యార్ధులకు అందించాలని, ఇందుకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి ఒక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయమని యూజీసీని సమావేశంలో ఆదేశించారు. కష్టమే..: సాంకేతిక పదబంధాలు అధికంగా ఉండే టెక్నికల్ కోర్సులను ఇంగ్లిష్‌లో కాదని స్థానిక భాషల్లో బోధించడం సవాలేనని, పైగా వచ్చే విద్యాసంవత్సరం దగ్గరలో ఉన్న ఈ స్వల్పతరుణంలో ఈ సవాలను అధిగమించడం కష్టమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. మాతృభాషలో ఇంజనీరింగ్ సిలబస్‌కు తగిన పుస్తకాలు, స్టడీ మెటీరియల్ రూపొందించాలని, బోధించేందుకు సిబ్బందికి తర్ఫీదు ఇవ్వాల్సిఉంటుందని నిపుణులు వివరించారు. -
ఇంజనీరింగ్‌లో కొత్త కోర్సులు
టెక్నాలజీ పరంగా విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. ఇది అది అనే తేడా లేకుండా.. అన్ని రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందులో భాగంగానే విద్యా రంగంలోనూ మార్పులు వస్తున్నాయి. దేశంలో ఇంజనీరింగ్ విద్యను పర్యవేక్షించే.. ఆల్ ఇండియా కౌన్సెల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ).. బీటెక్ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్, బ్లాక్‌చైన్ టెక్నాలజీ,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. ఆ వివరాలు... ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల పరిశ్రమలు..మానవ వనరులను తగ్గించుకునేందుకు ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను ఆయా రంగాల్లో ప్రవేశ పెడుతున్నాయి. ఇవే కాకుండా వ్యాపార అభివృద్ధి సులభతరం చేసుకునే విధంగా డేటాసైన్స్ వంటి టెక్నాలజీ కూడా అందుబాటులోకి వస్తోంది. ఇలాంటి తరుణంలో ఆయా రంగాల్లో సరిపడ సంఖ్యలో సమర్థవం తమైన నిపుణులు ఉన్నారా.. అంటే లేరనే చెప్పాలి. ఈ కొరతను అధిగమించడానికి గత కొంతకాలంగా ఆన్లైన్ మార్గాల ద్వారా ఏఐ,డేటాసైన్స్ లాంటి కోర్సులో పలు అవసరాలకు అనుగుణంగా శిక్షణన అందిస్తున్నాయి. తాజాగా ఆల్ ఇండియా కౌన్సెల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఇంజనీరింగ్ విద్యలో ఇలాంటి నూతన కోర్సులను ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. తెలుగు రాష్టాల్లోనూ పలు కాలేజీల్లో బీటెక్ స్థాయిలో ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. డేటా సైన్స్ నైపుణ్యం కలిగిన డేటా సైంటిస్టులను తయారు చేయడానికి ఇంజనీరింగ్ విద్యలో డేటాసైన్స్ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చారు. రంగం ఏదైనా.. జరగబోయే పరిణామాలను ముందే అంచనా వేసి.. కచ్చితత్వంతో కూడిన సమాచారాన్ని అందించేదే.. డేటాసైన్స్. విద్య, వైద్యం, వ్యాపార, సామాజిక ఆర్థిక, రాజకీయం.. ఇలా రంగం ఏదైనా గతంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల సమాచారాన్ని తెలుసుకొని.. భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తే.. ఆయా రంగాల్లో విజయం సా«ధించడానికి వీలుంటుందో ఖచ్చితంగా అంచనా వేసి చెప్పే వారే.. డేటా సైంటిస్టులు. డేటా విశ్లేషణ: డేటాసైన్స్.. గణాంక సహిత సమాచారాన్ని విశ్లేషించడానికి ఉపయోగించే సాధనం. అల్గారిథం, మెషిన్‌లెర్నింగ్ సిద్ధాంతాలను ఉపయోగించి.. వ్యాపారానికి సంబంధించిన వస్తువులు ఏ సంవత్సరంలో ఎంత మొత్తంలో అమ్మకాలు జరిగా యి. ఆ సమయంలో డిమాండ్ –సప్లయ్ ఏ విధంగా ఉంది. ప్రస్తుతం అంత డిమాండ్ ఎందుకు లేదు. ఆయా వస్తువులపై వినియోగదారుల అభిప్రాయం ఏంటి? కొనుగోలు శక్తిలో వచ్చిన మార్పులు ఏంటి?!వంటివి అంచనా వేసి చెబుతారు. గతంలో ఉన్న డిమాండ్‌ను ప్రస్తుత డిమాండ్‌తో పోల్చి విశ్లేషించి..రానున్న కాలంలో ఎంత డిమాండ్ ఉండవచ్చు..ఆ సమయానికి వినియోగ దారులకు అందుబాటులో ఉంచాల్సిన ప్రొడక్ట్స్ సంఖ్యతో సహా కచ్చితమైన లెక్కలతో వివరిస్తారు డేటా నిపుణులు. కోర్సు స్వరూపం: డేటాసైన్స్ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఎనిమిది సెమిస్టర్లుగా ఉంటుంది. ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు.. డేటావిజువలైజర్స్, డేటాసైన్స్ కన్సల్టెంట్, డేటా ఆర్కిటెక్చర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, డేటా ఇంజనీరింగ్ సహా వివిధ రకాల ఉద్యోగాలు పొందవచ్చు. వేతనాలు: డేటాసైన్స్ వి«భాగంలో ఉద్యోగాలు దక్కించుకున్న వారికి వార్షిక వేతనం దాదాపు రూ.5లక్షల వరకు ఉంటుంది. నైపుణ్యాలు,అనుభవం ఆధారంగా వేతనం పెరిగే అవకాశం ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వినియోగం తప్పనిసరిగా మారింది. ప్రభుత్వ/ప్రైవేట్, వ్యాపార సంస్థలు సహా ప్రతీ రంగంలో లావాదేవీలన్నీ ఇంటర్నెట్ ఆధారంగానే జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా లావాదేవీలు, సంబంధిత సమాచార భద్రత అనేది చాలా క్లిష్టంగా మారింది. ఇటువంటి విలువైన సమాచారాన్ని భద్రపరచడానికి రక్షణ కవచంగా వచ్చిందే..సైబర్ సెక్యూరిటీ. కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్‌కు సంబంధించి సైబర్ సెక్యూరిటీ నాలుగేళ్ల కోర్సు. డేటా స్ట్రక్చర్, డిజిటల్ ప్రిన్సిపుల్స్, సిస్టమ్ డిజైన్, జావా ప్రోగ్రామింగ్, సిస్టమ్ సాఫ్ట్వేర్, అల్గారిథంలను రూపొందించడం వంటివి ఈ కోర్సులో భాగంగా నేర్చుకుంటారు. జాబ్ ప్రొఫైల్: ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు సెక్యూరిటీ అనలిస్ట్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, సెక్యూరిటీ సాఫ్ట్వేర్ డెవలపర్, క్రిప్టానలిస్ట్, సెక్యూరిటీ ఇంజనీర్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే టీసీఎస్, ఇన్ఫోసిస్, గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, వంటి సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందే వీలుంటుంది. వేతనాలు : సంస్థను బట్టి సైబర్ సెక్యూరిటీ నిపుణులకు వార్షిక వేతనం రూ.8 లక్షల వరకు లభిస్తుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇంజనీరింగ్‌లో కొత్తగా ప్రవేశ పెట్టిన మరో కోర్సు.. బ్లాక్‌చైన్ టెక్నాలజీ. సైబర్ నేరాలను ఆరిక ట్టడానికి ఆయా వ్యవస్థలపై పనిచేసే నిపుణులు ఎప్పటికప్పడు నూతన పరిజ్ఞానాన్ని అందుబా టులోకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చిందే బ్లాక్‌చైన్ టెక్నాలజీ. ఆర్థికపరమైన లావాదేవీలల్లో పారదర్శకతను పెంచేవిధంగా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. ఆన్లైన్ ఆధారంగా జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలను సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. రానున్న కాలంలో బ్లాక్ చైన్ టెక్నాలజీలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే: బ్లాక్‌చైన్ టెక్నాలజీ అనేది ఒక పట్టిష్టమైన సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ. వ్యక్తులు, వ్యవస్థల మధ్య జరిగే ఆర్థిక సహ ఇతర కార్యకలాపాల సమాచారానికి కట్టుదిట్టమైన భద్రను కల్పించే రక్షణ కవచం ఇది. ఎంతటి సైబర్ హ్యాకర్లైనా దొంగలించేందుకు వీలులేకుం డా ఉండే డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ ఇది. దీని ద్వారా ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న సర్వర్లలో సమాచారం నిక్షిప్తం చేసి.. ఇతరులు దానిని దొంగిలించకుండా భద్రత కల్పిస్తారు. కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్‌లో బ్లాక్‌చైన్ టెక్నాలజీ కోర్సు వ్యవధి నాలుగేళ్లుగా ఉంటుంది. కోర్సులో భాగంగా బ్లాక్చైన్టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ, బ్లాక్‌చైన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లపై లోతైన అవగాహన కల్పిస్తారు. అలాగే సాలిడిటీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ క్లౌడ్ ప్లాట్‌ఫాం,ఎథెరియం,బిట్ కాయిన్ క్రిప్టోకరెన్సీల గురించి అవగాహన కలిగించే విధంగా కోర్సు ఉంటుంది. జాబ్ ప్రొఫైల్: ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు బ్లాక్‌చైన్ డెవలపర్, బ్లాక్‌చైన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, బ్లాక్‌చైన్ ఎస్ఐ పార్టనర్ డెవలప్మెంట్ మేనేజర్, బిట్‌కాయిన్ క్రిప్టోకరెన్సీ డెవలపర్, బ్లాక్‌చైన్ ప్రిన్సిçపల్ ప్రోగ్రామ్ మేనేజర్, బిజినెస్ అనలిటిక్స్ అసోసియేట్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగాలు: ఈ కోర్సు పూర్తిచేసిన వారు ఐబీఎం, మైక్రోసాఫ్ట్, యాక్సెంచర్, వీసా వంటి సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందవచ్చు. వేతనాలు: బ్లాక్‌చైన్ నిపుణులకు ప్రారంభంలో వార్షిక వేతనం రూ.5 లక్షల వరకు ఉంటుంది. అనుభవం, నైపుణ్యం ఆధారంగా ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక రంగంలో ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్. మానవ ఆలోచనలకు అనుగుణంగా కంప్యూటర్ ఆధారిత యంత్ర వ్యవస్థ పనిచేసేలా చేయడమే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ఇప్పుడు ఏఐ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఏఐలో స్పీచ్ రికగ్నిషన్, విజువల్ పర్సెప్షన్, లాజిక్ అండ్ డెసిషన్, మల్టీ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ లాంటి చాలా అంశాలుంటాయి. రోబోటిక్స్లోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానం కీలకం. కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్‌లో నాలుగేళ్ల బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఏఐ, మెషిన్ లెర్నింగ్) ఉంటుంది. ఈ కోర్సు లో భాగంగా విద్యార్థులకు కంప్యూటర్ లాంగ్వేజ్‌లను నేర్పిస్తారు. జావా, ప్రొలాగ్, లిస్ప్, పైథాన్ వంటి కోర్సులు ఇందులో నేర్చుకోవచ్చు. జాబ్ ప్రొఫైల్ : ఈ కోర్సును పూర్తిచేసిన అభ్య ర్థులకు డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, ప్రిన్సిపుల్ డేటాసైంటిస్ట్, కంప్యూటర్ విజన్ ఇంజనీర్లుగా అవకాశాలు లభిస్తాయి. వేతనాలు : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగా లు పొందిన వారికి వార్షిక వేతనం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని ఒక కుగ్రామంగా మార్చేసిన ఘనత ఇంటర్నెట్కు దక్కుతుంది. సమాచార వ్యవస్థలో వచ్చిన విప్లవాత్మ కతకు ముఖ్య కారణం ఇంటర్నెట్ అనడంలో సందేహం లేదు. దీని విస్తృతి మరింత పెరిగి.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) తెరపైకి వచ్చింది. ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సులో ఐఓటీ కూడా ఒకటి. ఐఓటీ అంటే: భవిష్యత్తులో ప్రపంచం మొత్తం ఒక స్మార్ట్ నగరం గా మారడానికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) ఉపయోగపడు తుంది. మనుషుల జీవితాలను మరింత సుఖమయం చేయడా నికి ఇది తోడ్పడుతుంది. మనుçషుల మాదిరిగానే యంత్రాలు, యంత్ర పరికరాలు అన్ని ఇంటర్నెట్ ఆధారంగా అనుసంధా నంగా ఉండి.. ఒక నెట్‌వర్క్‌గా ఏర్పడి పనిచేయడాన్ని ఇంటర్నెట్ ఆఫ్ «థింగ్స్ అంటారు. అంటే.. మనుషులు తమలో తాము ఎలాగైతే ఒకరితో ఒకరు మాట్లాడుకొని పనులు చేస్తారో.. యంత్రాలు కూడా ఒక దానితో ఒకటి సమాచార మార్పిడి చేసుకొని పనిచేస్తాయి. ప్రతి వస్తువు ఇంటర్నెట్తో అనుసం« దానంగా ఉండి.. వివిధ రకాల కార్యకలాపాలను కచ్చితమైన సమయంలో సమర్థవంతంగా పూర్తిచేస్తాయి. కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్ స్థాయిలో నాలుగేళ్ల బీటెక్ ఇన్ ఐఓటీ అండ్ అప్లికేషన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జాబ్ ప్రొఫైల్: ఇంజనీరింగ్‌లో ఐఓటీ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు ఐఓటీ ఇంజనీర్, ఐఓటీ యాప్ డెవలపర్, ఐఓటీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, సిటిజన్ ఐఓటీ సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, ఐఓటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లుగా విధులు నిర్వహిస్తారు. బిజినెస్ అనలిటిక్స్ ఒకప్పుడు వ్యాపార సంస్థల మధ్య పోటీ తక్కువగా ఉండేది. కొన్ని సంస్థల గుత్తాధిపత్యం కొనసాగేది. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో.. వ్యాపార సంస్థల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. దీంతో ఆయా వ్యాపారాలను లాభాల బాటలో తీసుకేళ్లేందుకు అందరూ బిజినెస్ అనలిటిక్స్ సహాయం తీసుకుంటున్నారు. అందుకే ప్రస్తుతం బడా కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకూ.. లక్షల్లో జీతాలు ఇచ్చి బిజినెస్ అనలిటిక్స్ నిపుణులను నియమించుకుంటున్నాయి. దీంతో బిజినెస్ అనలిటిక్స్‌కు బాగా డిమాండ్ ఏర్పడింది. పని తీరు మదింపు: స్టాటిస్టికల్, క్వాంటిటేటివ్, టెక్నికల్ çపరిజ్ఞానాన్ని ఉపయోగించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని వివిధ రకాల పద్దతుల ద్వారా విశ్లేషించి.. ఒక కంపెనీ లేదా వ్యాపార సంస్థ పని తీరును మదించడమే బిజినెస్ అనలిటిక్స్. ఆయా సంస్థల వ్యాపారవృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించేందుకు బిజినెస్ అనలిటిక్స్ ఉపయోగపడుతుంది. కోర్సు స్వరూపం: ఈ కోర్సులో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలనకునే వారు బీటెక్ బిగ్ డేటా అనలిటిక్స్ కోర్సు చేయాల్సి ఉంటుంది. నాలుగేళ్ల ఈ కోర్సులో డేటా మైనింగ్, డేటా వేర్‌హౌసింగ్, డేటా విజువలైజేషన్ అధ్యయనం చేస్తారు. ఈ కోర్సు కూడా డేటా సైన్స్‌కు అనుబంధంగా ఉంటుంది. జాబ్ ప్రొఫైల్ : ఈ కోర్సును పూర్తిచేసిన విద్యార్థులు బిజినెస్ అనలిటిక్స్‌గా కెరీర్‌ను ప్రారంభించవచ్చు. వేతనాలు: బిజినెస్ అనలిటిక్స్ నిపుణులకు నైపుణ్యాలను బట్టి వార్షిక వేతనం రూ.ఆరు లక్షల నుంచి రూ.పది లక్షల వరకూ లభిస్తుంది. బయో మెడికల్ ఇంజనీరింగ్ బయోమెడికల్ ఇంజనీంగ్ ప్రస్తుతం ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్న కోర్సులో ఒకటి. ఆరోగ్య రంగానికి సాంకేతిక తోడ్పాటు అందించేందుకు ఈ విభాగం కృషి చేస్తోంది. బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రధానంగా రోగ నిర్ధారణకు సంబంధించి ఉపయోగించే పరికరాలను తయారు చేస్తుంది. అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు రోగ నిర్ధారణ కోసం చేసే సిటీ స్కాన్, ఎంఆర్ఐలతో పాటు రోగా నిర్ధారణ పరిక్షల కోసం ఉపయోగించే ఇతర పరికరాలను తయారు చేసే వారే బయో మెడికల్ ఇంజనీర్లు. ఈ పరికరాలను తయారు చేయడానికి ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు. బయాలజీ, ఇంజనీరింగ్.. ఈ రెండింటిపై అవగాహన ఉండాలి. అందుకే ఈ రెండింటిని కలిపి ఉమ్మడిగా బయో మెడికల్ ఇంజనీరింగ్ కోర్సును రూపొందించారు. కోర్సు స్వరూపం: బయాలజీ, మెడిసిన్లకు సాంకేతికతను అన్వయించి మెడికల్ ఎక్విప్ మెంట్‌ను తయారు చేసేదే.. బయోమె డికల్ ఇంజనీరింగ్. నాణ్యమైన పరికరాలను తక్కువ ధరల్లో తయారు చేసేందు కు కృషి చేస్తారు. ఇది రానున్న కాలంలో మంచి డిమాండ్ ఉన్న రంగంగా మారుతుందని నిపుణుల అంచనా. జాబ్ ప్రొఫైల్: ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు బయోమెడికల్ టెక్నిషియన్, బయో మెడికల్ ఇంజనీర్, బయో కెమిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తారు. ఉద్యోగాలు: మెడికల్ కంపెనీలు, హాస్పిటల్స్, ఇన్స్ట్రుమెంట్ మ్యానుఫ్యా క్చరర్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, ఇన్‌స్టాలెషన్ యూనిట్లల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వేతనాలు: ఈ రంగంలో ఉద్యోగాలు చేసే వారికి నెలకు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు వేతనంగా లభిస్తుంది. అనుభవాన్ని బట్టి వేతనం పెరుగుతుంది. -
నియమాలు పాటిస్తేనే ప్రవేశాలు
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యలో ముఖ్యంగా ఇంజనీరింగ్, ఫార్మా తదితర కోర్సుల్లో నాణ్యతను పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకు తగ్గట్టుగానే 2020-21 విద్యా సంవత్సరంలో ప్రవేశాల ప్రక్రియ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నాణ్యమైన విద్యను అందించేలా కాలేజీల్లోని సదుపాయాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయిస్తోంది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ నియమాలను అనుసరించి సదుపాయాలు ఉన్న కళాశాలలను మాత్రమే కౌన్సెలింగ్‌లో అనుమతించనున్నారు. వర్సిటీల వారీగా తనిఖీలు ఏఐసీటీఈ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో నిర్ణీత నిబంధనల ప్రకారం సదుపాయాలు ఉన్నాయో లేదో పరిశీలించేందుకు యూనివర్సిటీలు ప్రత్యేక కమిటీల ద్వారా తనిఖీలు చేయిస్తున్నాయి. కాకినాడ జేఎన్టీయూ, అనంతపురం జేఎన్టీయూ ప్రస్తుతం ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. గతంలో ఇదంతా తూతూమంత్రంగా సాగేది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం సంబంధిత కాలేజీల్లో నిర్ణీత నియమాల ప్రకారం అన్ని సదుపాయాలు, బోధన, బోధనేతర సిబ్బంది, ల్యాబ్‌లు, భవనాలు, ఇతరత్రా ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయో లేదో క్షుణ్నంగా తనిఖీలు చేయిస్తోంది. ఉన్నత విద్యారంగంలో సంస్కరణల కోసం ఇప్పటికే ఏర్పాటైన ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కాలేజీలు సమర్పించిన పత్రాలను అనుసరించి ఫీజులను నిర్ణయిస్తోంది. కొన్ని కాలేజీలను కమిషన్ తనిఖీలు చేయించింది. పలు కాలేజీలు సదుపాయాలు లేకుండానే కొనసాగుతున్నాయని, కొన్నిచోట్ల సరైన సంఖ్యలో అడ్మిషన్లు లేకున్నా కాలేజీలు నడుపుతుండటాన్ని గుర్తించింది. సదుపాయాలు లేకుంటే అనుమతి నిల్ సరైన సదుపాయాలు లేని కాలేజీలను కౌన్సెలింగ్‌లో అనుమతించరాదని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడైనా లోపాలు ఉన్నట్టు తేలితే సంబంధిత పరిశీలన కమిటీలపై చర్యలు తీసుకుంటారన్న సంకేతాలు ఇవ్వడంతో ప్రమాణాలకు అనుగుణంగా సదుపాయాలు ఉన్నాయో లేవోననే దానిపై లోతుగా పరిశీలిస్తున్నారు. ఏఐసీటీఈ అనుమతించిన కాలేజీలు 392 రాష్ట్రంలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏఐసీటీఈ అనుమతించిన కాలేజీల సంఖ్య గతంతో పోలిస్తే ఈసారి భారీగా తగ్గింది. ఒకప్పుడు రాష్ట్రంలో 467 వరకు ఇంజనీరింగ్, ఫార్మా తదితర కాలేజీలు కౌన్సెలింగ్‌లో పాల్గొనేవి. కానీ ఈసారి వాటి సంఖ్య 392 వరకు మాత్రమే ఉండనుంది. గత ఏడాది వీటి సంఖ్య 445 కాగా ఈసారి 53 వరకు కాలేజీల సంఖ్య తగ్గడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణాల విషయంలో కఠినంగా ఉండటంతో సదుపాయాలు లేని కాలేజీలను యాజమాన్యాలు స్వచ్ఛందంగా మూసివేశాయి. ప్రస్తుతం ఈ కాలేజీల గుర్తింపు (అఫ్లియేషన్) కోసం యూనివర్సిటీల తనిఖీలు కూడా లోతుగా సాగుతుండటంతో కౌన్సెలింగ్‌లోకి ఎన్ని కాలేజీలు వస్తాయో పరిశీలన అనంతరమే తేలనుంది. ప్రమాణాలు పాటిస్తేనే ఫీజు రీయింబర్స్మెంట్ నిర్దేశించిన అన్ని ప్రమాణాలూ పాటించే కాలేజీలకు మాత్రమే ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనుంది. ఈసారి కాలేజీల సంఖ్య తగ్గినా సీట్ల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వం పలు కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంతో సీట్లు పెరుగుతున్నాయి. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డీప్ లెర్నింగ్, డేటా అనాలసిస్ వంటి కొత్త కోర్సుల్ని దాదాపు 50 శాతం కాలేజీల్లో ప్రారంభిస్తున్నారు. గడచిన నాలుగేళ్లలో కాలేజీలు, మొత్తం సీట్లు, కన్వీనర్ కోటా, భర్తీ అయిన, మిగులు సీట్ల వివరాలు సంవత్సరం కాలేజీల సంఖ్య మొత్తం సీట్లు కన్వీనర్ కోటా భర్తీ అయిన సీట్లు మిగిలిన సీట్లు 2017 467 1,40,358 98,251 66,073 32,178 2018 460 1,36,224 96,857 56,609 37,248 2019 445 1,29,882 1,06,203 60,315 45,888 2020 392 1,53,978 - - - -
ఇంజనీరింగ్‌లో న్యూ జనరేషన్ కోర్సులు
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో సరికొత్తగా ఇంజనీరింగ్ కోర్సులు రాబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో అత్యధిక డిమాండ్ ఉండే కోర్సులను ప్రవేశపెట్టేందుకు జాతీయస్థాయి విద్యాసంస్థలతోపాటు రాష్ట్రస్థాయి విద్యాసంస్థలు సైతం ముందుకొస్తున్నాయి. ప్రధానం గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో విద్యాసంస్థలు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఏఐతోపాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషీన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, బిగ్ డేటా వంటి కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఐఐటీ హైదరాబాద్ బాటలో.. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఐఐటీ హైదరాబాద్ దేశంలోనే మొదటిసారిగా 2019–20 విద్యాసంవత్సరం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు చేసింది. దీంతో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు సైతం అదే బాట పట్టనున్నాయి. ఏఐతోపాటు మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా అనలిటిక్స్, బిగ్ డేటా సబ్జెక్టులతో కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సును ప్రవేశపెట్టేందుకు స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీ చర్యలు చేపట్టింది. ఈ కోర్సును 2019–20 విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వాలంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి దరఖాస్తు చేసుకుంది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనలకు అనుగుణంగా సెమిస్టర్లవారీగా సిలబస్‌ను రూపొందించింది. వర్సిటీ అకడమిక్ కౌన్సిల్ ఆమోదిస్తే కోర్సును అమల్లోకి తేవాలని భావిస్తోంది. ఇది అమల్లోకి వస్తే రాష్ట్రస్థాయి కాలేజీల్లో ఈ కోర్సును ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం తెలంగాణ కానుంది. ఏఐ నైపుణ్యాలు ఉన్న వారు 2.5 శాతమే.. ప్రస్తుతం దేశంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నది కేవలం 20 శాతంలోపేనని నేషనల్ ఎంప్లాయబిలిటీ రిపోర్టు పేర్కొంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, వైర్లెస్ టెక్నాలజీ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ నైపుణ్యాలుగల వారికి మల్టీ నేషనల్ కంపెనీల్లో భారీ డిమాండ్ ఉండగా కేవలం 2.5 శాతం మాత్రమే ఏఐ నైపుణ్యాలు ఉన్న వారు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. మరోవైపు దేశంలోనూ ప్రస్తుతం ఉన్న ఇంజనీరింగ్ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కాస్త మెరుగై 37 శాతానికి చేరుకున్నా తగిన నైపుణ్యాలు లేకపోవడం వల్లే 63 శాతం మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడం లేదని ఇప్పటికే పలు నివేదికలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టాలని, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగానే 2019–20 విద్యాసంవత్సరం నుంచి 600–700 గంటలు ఇంటర్న్‌షిప్‌ను అమలు చేయాలని ఏఐసీటీఈ నిర్ణయించింది. మరోవైపు ఇంజనీరింగ్ విద్యాసంస్థలు కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కోర్సులను ప్రవేశపెట్టేందుకు కసరత్తు ప్రారంభించాయి. ఏఐ, బిగ్ డేటాకు భారీ డిమాండ్... ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్టు... రానున్న రోజుల్లో అంచనాలకు మించి విస్తరించనుందని జర్మనీకి చెందిన స్టాటిస్టా అనే గణాంక సేకరణ ఆన్లైన్ సంస్థ అంచనా వేసింది. 2016లో 3.2 బలియన్ డాలర్లుగా ఉన్న ఏఐ మార్కెట్ రెవెన్యూ... 2025 నాటికి 89.85 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం, శామ్సంగ్ వంటి ప్రముఖ సంస్థలు ఏఐ, ఏఐ సంబంధిత రంగాల్లో పరిశోధనల కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొంది. ప్రపంచ మార్కెట్లో 2011లో 7.6 బిలియన్ డాలర్లుగా ఉన్న బిగ్ డేటా మార్కెట్ ప్రస్తుతం 49 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు స్టాటిస్టా అంచనా వేసింది. అది 2027 నాటికి వంద శాతం వృద్ధితో 103 బిలియన్ డాలర్లకు చేరుతుందని పేర్కొంది. -
మెకానికల్‌లో సర్టిఫికేషన్స్ ఇవే..
ఇంజనీరింగ్ కోర్సులు చదువుతున్న/ఉత్తీర్ణులైన విద్యార్థులు మంచి ఉద్యోగం సాధించాలంటే అకడమిక్ సర్టిఫికెట్లతోపాటు ఆయా బ్రాంచ్‌ల్లో సర్టిఫికేషన్ కోర్సులు కూడా పూర్తి చేయాల్సిందే. అప్పుడే కోరుకున్న ఉద్యోగం దక్కుతుందని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న కొన్ని సర్టిఫికేషన్ కోర్సుల గురించి తెలుసుకుందాం.. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అతి పురాతన, సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సు. మెకానికల్‌లో డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్, ఇన్స్టాలేషన్ తదితర విభాగాల్లో ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక మార్పులు వస్తున్నాయి. ఇందులో రాణించాలంటే తాజా నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి. వీటి కోసం ప్రత్యేక సర్టిఫికేషన్ కోర్సులు ఉన్నాయి. అవి.. స్టాటిస్టికల్ ప్రాసెస్ కంట్రోల్ ట్రైనింగ్ కోర్సులు: ఈ కోర్సులు గణాంక పద్ధతుల ద్వారా ఒక ఉత్పత్తిని నాణ్యతతో రూపొందించడానికి ఉపయోగపడతాయి. ఉత్పత్తి, పర్యవేక్షణ, నియంత్రణ, నాణ్యతా ప్రమాణాలు పెంపొందించడానికి సంబంధించిన నైపుణ్యాలను పొందేలా కోర్సులు ఉంటాయి. ఎన్డీటీ కోర్సులు: ఉత్పత్తుల ప్రామాణికతను, నాణ్యతను పరీక్షించడానికి ఉపకరించేది ఎన్డీటీ (నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్) సర్టిఫికేషన్స్. ఉత్పత్తి, ప్రాసెసింగ్, హీట్ ట్రీట్మెంట్, ఆటోమొబైల్ లాంటి విభాగాల్లో ఎన్డీటీ ఇన్స్ట్రక్టర్ అవసరం ఉంటుంది. చాలావరకు ఎన్డీటీ సర్టిఫికేషన్ ప్రోగ్రాములు మూడు స్థాయిలో లెవల్- 1, లెవల్-2, లెవల్-3గా ఉంటాయి. లెవల్-1 సర్టిఫికేషన్ చేసినవారు ఒక ప్రొడక్ట్ తయారీ క్రమంలో అనుసరించాల్సిన పలు టెస్టింగ్ అంశాలను తెలుసుకుంటారు. వీరు లెవల్-2, -3 పూర్తిచేసినవారి పర్యవేక్షణలో పనిచేస్తారు. లెవల్-2లో స్వయంగా నిర్వహించాల్సిన టెస్టింగ్ అంశాలు ఉంటాయి. లెవల్-3 సర్టిఫికేషన్ చేసినవారు అభివృద్ధి, వివిధ విధానాలకు ఆమోదం తెలపడం వంటి విధులు నిర్వర్తించవచ్చు. మూడు దశల సర్టిఫికేషన్ చేస్తే తయారీ ప్రక్రియ నుంచి తుది రూపం వచ్చే వరకు అవసరమైన అన్ని అంశాలపై నైపుణ్యం లభిస్తుంది. ఆటోక్యాడ్ డిజైన్ సర్టిఫికేషన్: సాఫ్ట్వేర్ వినియోగం పెరిగిన క్రమంలో ఆటోక్యాడ్ డ్రాఫ్టింగ్ అండ్ డిజైన్‌లో సర్టిఫికేషన్ చేసిన వారికి నియామకాల్లో ప్రాధాన్యం ఉంటుంది. దీన్ని ఉపయోగించి 2డి డిజైన్, 3డి డిజైన్ మోడలింగ్ల్లో ప్రావీణ్యం పొందొచ్చు. కోర్సు పూర్తి చేసినవారు నిర్మాణం, ఆర్కిటెక్చరల్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, మెకానికల్ డిజైన్, యానిమేషన్ల్లో రాణించొచ్చు. మెకట్రానిక్స్ అండ్ రోబోటిక్స్: ఇది మెకానికల్ డిజైన్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్, కంట్రోల్ సిస్టమ్స్ స్కిల్స్ మేళవింపు. ఇందులో మెకట్రానిక్స్-రోబోటిక్స్‌కు సంబంధించిన ఎలక్ట్రానిక్స్ అంశాలపై స్కిల్స్ నేర్పిస్తారు. రోబోటిక్స్ కోర్సులు: ప్రొడక్ట్‌ను రిమోట్ కంట్రోల్ సహాయంతో లేదా కంప్యూటర్ సూచనల మేరకు పనిచేసే విధంగా రూపొందించడంతోపాటు ఆ ప్రొడక్ట్ సరిగా పనిచేసేలా స్కిల్స్ బోధిస్తారు. -
ఆధార్, బయోమెట్రిక్ తప్పనిసరి
- రేపటి నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ - విద్యార్థి స్వయంగా హాజరు కావాల్సిందే - బయోమెట్రిక్ వివరాలను పోల్చి చూసేందుకు చర్యలు - కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మాత్రమే ఈ ప్రక్రియ - మేనేజ్మెంట్, ఎన్నారై కోటా సీట్లలో చేరే వారికి వెరిఫికేషన్ అవసరం లేదని వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. వచ్చే నెల 1వ తేదీ వరకు పనిదినాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు వెరిఫికేషన్ చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు ఆధార్ కార్డును కచ్చితంగా వెంట తెచ్చుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. అలాగే వెరిఫికేషన్ సందర్భంగా విద్యార్థుల బయోమెట్రిక్ డేటా తీసుకుని.. పరీక్ష సమయంలో తీసుకున్న వివరాలతో పోల్చి చూస్తారు. కాబట్టి విద్యార్థులు స్వయంగా హాజరుకావాలని ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ ఎంవీ రెడ్డి, క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 21 హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో తేదీల వారీగా, ర్యాంకుల వారీగా వెరిఫికేషన్ చేపట్టే తేదీల వివరాలు, అభ్యర్థులు వెంట తెచ్చుకోవాల్సిన సర్టిఫికెట్లు ఇతర వివరాలను https://tseamcet.nic.in వెబ్సైట్లో పొందవచ్చు. ఇక వెబ్ ఆప్షన్ల తేదీలను కాలేజీలకు అనుబంధ గుర్తింపు లభించాక ప్రక టించనున్నారు. విద్యార్థులూ ఇవి మరచిపోవద్దు ఎంసెట్ ర్యాంకు కార్డు, ఎంసెట్ హాల్‌టికెట్, ఆధార్ కార్డు, పదో తరగతిమార్కుల మెమో, ఇంటర్ మార్కుల మెమో, పాస్ సర్టిఫికెట్, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, 2016 జనవరి 1 తరువాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన వారికి), కుల ధ్రువీకరణ పత్రం(వర్తించేవారు), స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్లు (వర్తించేవారు), నాన్ లోకల్ కేటగిరీ అభ్యర్థులైతే వారి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తెలంగాణలో పదేళ్ల కాలానికి సంబంధించిన నివాస సర్టిఫికెట్, విద్యాసంస్థల్లో రెగ్యులర్‌గా చదవని వారు నివాసం సర్టిఫికెట్...ఇవన్నీ ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను వెంట తెచ్చుకోవాలి. ఇక పరీక్ష సమయంలో బయోమెట్రిక్ వివరాలు ఇవ్వని విద్యార్థుల నుంచి వెరిఫికేషన్ సందర్భంగా సేకరిస్తారు. ఇవీ హెల్ప్‌లైన్ కేంద్రాలు మహబూబ్‌నగర్-ప్రభుత్వ పాలిటెక్నిక్; వనపర్తి- కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్; నల్లగొండ- ప్రభుత్వ పాలిటె క్నిక్, నాగార్జున డిగ్రీ కాలేజీ; కొత్తగూడెం (రుద్రంపూర్) ప్రభుత్వ పాలిటె క్నిక్; ఖమ్మం-ఎస్ఆర్, బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ; వరంగల్-ప్రభుత్వ పాలిటె క్నిక్, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, కాకతీయ యూనివర్సిటీ; బెల్లంపల్లి (ఆదిలాబాద్)-ప్రభుత్వ పాలిటెక్నిక్; నిజామాబాద్- ప్రభుత్వ పాలిటెక్నిక్, గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ; మెదక్-ప్రభుత్వ పాలిటె క్నిక్ (విమెన్); రాజగోపాల్పేట్ (సిద్ధిపేట)- ప్రభుత్వ పాలిటెక్నిక్; కరీంనగర్-డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ (విమెన్), ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ; ఈస్ట్ మారేడ్‌పల్లి (సికింద్రాబాద్)- గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ప్రింటింగ్ టెక్నాలజీ; హైదరాబాద్‌లోని చందూలాల్ బారాదరి (పాతబస్తీ)-క్యూక్యూ ప్రభుత్వ పాలిటెక్నిక్; రామంతాపూర్-జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్, కూకట్పల్లి- జేఎన్టీయూహెచ్, మాసాబ్‌ట్యాంకు-సాంకేతిక విద్యాభవన్. కన్వీనర్ కోటాకు మాత్రమే..! ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలోని 70 శాతం సీట్లకు మాత్రమే 22వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. మిగతా 30 శాతం మేనేజ్మెంట్, ఎన్నారై/ఎన్నారై స్పాన్సర్డ్ కోటా సీట్లను యాజమాన్యాలే భర్తీ చేస్తాయి. ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు లభించాక.. ప్రవేశాల కమిటీ ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియను చేపట్టనుంది. తరువాత యాజమాన్యాలు మేనేజ్మెంట్, ఎన్నారై/ఎన్నారై స్పాన్సర్డ్ కోటా సీట్లను భర్తీ చేసుకుంటాయి. ఈ సీట్లలో చేరాలనుకునే విద్యార్థులు ప్రస్తుత సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సిన అవసరం లేదని అధికారులు సూచించారు. కన్వీనర్ కోటా సీట్ల కోసం మాత్రం ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని వెల్లడించారు. -
27న ఏపీ ఇంజనీరింగ్ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి ఈనెల 27న అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల కానుంది. హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మంగళవారం ఎంసెట్ అడ్మిషన్ల కమిటీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మూడు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 6న సర్టిఫికెట్ల పరిశీలన, 9 నుంచి 18 వరకు ఆప్షన్ల నమోదు, 22న సీట్ల కేటాయింపు చేస్తారు. జూన్ 27 నుంచి తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు. మిగిలిన సీట్లకు తదుపరి కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ, 305 ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,53,150 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంజనీరింగ్ విద్యను పటిష్టం చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ఈసారి ప్రమాణాలు పాటించే కాలేజీలనే కౌన్సెలింగ్‌కు అనుమతించాలని అడ్మిషన్ల కమిటీ నిర్ణయించింది. -
ఏప్రిల్ 24న పాలిసెట్
♦ జూన్ 9 కల్లా విద్యా సంవత్సరం ప్రారంభం ♦ సాంకేతిక విద్యా డెరైక్టర్ ఎంవీరెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్-2016 పరీక్ష వచ్చే ఏడాది ఏప్రిల్ 24న జరుగనుంది. ఈ మేరకు పరీక్ష నిర్వహణ, ఏర్పాట్లపై సోమవారం పాలిసెట్ కమిటీ సమావేశమై సమీక్షించింది. సాంకేతిక విద్య డెరైక్టర్ ఎంవీ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడి, ప్రవేశాల కౌన్సెలింగ్ తదితర అంశాలపై చర్చించారు. గతేడాది దాదాపు 52 వేలకుపైగా పాలిటెక్నిక్ సీట్లకు లక్ష మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి అంతకంటే ఎక్కువగా పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. మొత్తంగా వచ్చే విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్ ప్రవేశాలను జూన్ 9లోగా పూర్తి చేయాలని.. ఆ రోజు నుంచే తరగతులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని పాలిసెట్ కమిటీని ఎంవీ రెడ్డి ఆదేశించారు. అలాగే ఈ సమావేశంలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సిలబస్‌లలో మార్పులు, ఇందుకు ఏర్పాటు చేసే కమిటీలో పరిశ్రమలకు ప్రాతినిధ్యం కల్పించడంపైనా చర్చించారు. అన్ని ఇంజనీరింగ్ కోర్సులకు అవసరమయ్యే సబ్జెక్టులను ఉంచేసి... అంతగా అవసరం లేని సబ్జెక్టులను తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. పదో తరగతి సిలబస్‌ను చూసి, అందుకు అనుగుణంగా మార్పులు చేయాలని అభిప్రాయపడ్డారు. ఇక పాలిటెక్నిక్‌లలో పాలిసెట్ ప్రాస్పెక్టస్, సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు, వెబ్సైట్ తదితర సమాచారం అందుబాటులో ఉంచనున్నారు. ఈ సమావేశంలో సాంకేతిక విద్య జాయింట్ డెరైక్టర్ యూవీఎస్ఎన్ మూర్తి, ఎస్బీటీఈటీ సెక్రెటరీ వెంకటేశ్వర్లు, ఆర్జేడీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
12 నుంచి ఏపీ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
ఈ నెల 14 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్లు సాక్షి, హైదరాబాద్: ఏపీలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 12 నుంచి ప్రారంభమవనుంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి గురువారం నోటిఫికేషన్ జారీచేశారు. ఆ ప్రకారం.. ఈ నెల 20వ తే దీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన చేపడతారు. 14వతేదీ నుంచి 21వ తేదీ వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. ఆప్షన్లను మార్పుచేసుకునేందుకు 22, 23 తేదీల్లో అవకాశమిస్తున్నారు. 26న విద్యార్థులకు సీట్లను అలాట్ చేయనున్నామని వేణుగోపాలరెడ్డి తెలిపారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు సంబంధించి అడ్మిషన్ల కమిటీ గురువారమిక్కడ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సమావేశమై అడ్మిషన్లకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకుంది. ఏపీలో 34 హెల్ప్‌లైన్ సెంటర్లు ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కోసం గతంలో హైదరాబాద్‌లో నోడల్ కార్యాలయం ఉండేది. ఇప్పుడు దీన్ని విజయవాడ బెంజ్‌సర్కిల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటుచేయనున్నారు. విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు రాష్ట్రవ్యాప్తంగా 34 హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటుచేస్తున్నట్లు మండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి తెలిపారు. విద్యార్థులు ర్యాంకులు, హెల్ప్‌లైన్ సెంటర్లు, ధ్రువపత్రాల పరిశీలన తేదీలు, వెబ్ ఆప్షన్ల తేదీలు తదితర ముఖ్యమైన వివరాలకోసం http://apeamcet.nic.in వెబ్‌సైట్‌ను చూడాలన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ యథాతథం ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరే విద్యార్థులకు అడ్మిషన్ ఫీజులను గతేడాది మాదిరిగానే అమలు చేయనున్నారు. గతంలో రాష్ట్ర అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ మండలి నిర్ణయించిన మేరకు ఈ ఫీజులుంటాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి గతంలోని విధానాన్నే అమలు చేయనున్నట్టు వేణుగోపాలరెడ్డి తెలిపారు. అయితే విద్యార్థులు ఈసారి ఫీజులను కౌన్సెలింగ్ కేంద్రాలకు వెళ్లి చెల్లించనక్కర్లేకుండా నేరుగా కాలేజీల్లో అడ్మిషను పొందిన సమయంలోనే చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రాసెసింగ్ ఫీజు గతంలో రూ.600 ఉండగా ఇప్పుడు దాన్ని రూ.800కు పెంచారు. ఎస్సీ, ఎస్టీలు రూ.400 చెల్లించాలి. -
ఇంజనీరింగ్‌లో ‘బతుకు విద్య’
ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కోర్సుల్లో కొత్త సబ్జెక్టులు సాఫ్ట్వేర్ సంస్థలకు అవసరమైన ఆరు అంశాల ఎంపిక థర్డ్ ఇయర్ మొదటి సెమిస్టర్లో ప్రారంభం చివరి సంవత్సరంలో విద్యార్థులకు ప్రత్యేక సమ్మర్ కోర్సులు పైలట్ ప్రాజెక్టుకు 20 కాలేజీల ఎంపిక ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి నాస్కామ్ కంపెనీల్లో ఉపాధి అవకాశాలు కసరత్తు చేస్తున్న జేఎన్టీయూ ఇంజనీరింగ్‌లో బతుకు విద్యను నేర్పించేందుకు హైదరాబాద్ జేఎన్టీయూ సిద్ధమైంది. 288 ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త సబ్జెక్టులను ప్రవేశ పెట్టడం ద్వారా ఏటా దాదాపు 15 వేల మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశం కల్పించేలా కసరత్తు చేస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచే దీనిని అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్)తో రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఒప్పందం చేసుకుంది. మొదట ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), కంప్యూటర్ సైన్స్ (సీఎస్సీ) కోర్సుల్లో కొత్త సబ్జెక్టుల ప్రవేశానికి చర్యలు చేపట్టిన జేఎన్టీయూ... భవిష్యత్‌లో మరిన్ని కొత్త సబ్జెక్టులను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఇంజనీరింగ్ కోర్సుల సిలబస్ మార్పుల్లో భాగంగా ఈ కొత్త సబ్జెక్టులను అందుబాటులోకి తీసుకువస్తోంది. అవసరాలను తేల్చిన నాస్కామ్.. నాస్కామ్ తమ పరిధిలోని కంపెనీల్లో వివిధ విభాగాల్లో మానవ వనరుల అవసరం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. అందులోనూ ముఖ్యంగా ఆరు ప్రధాన రంగాల్లో ఎక్కువ అవసరాలు ఉన్నట్లు తేల్చింది. ఇందులో డిజైన్ ఇంజనీర్, జూనియర్ డేటా అసోసియేట్, సెక్యూరిటీ అనలిస్ట్, డేటా సైంటిస్ట్, అసోసియేట్ అనలిటిక్స్, టెస్ట్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ డెవలపర్ వంటి అంశాల్లో నిపుణుల అవసరాలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఆయా రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించడం ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంతోపాటు కంపెనీల అవ సరాలు తీర్చవచ్చని భావిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నాస్కామ్తో చర్చించింది. తాము చెప్పిన సబ్జెక్టులను ప్రవేశపెడితే తమ పరిధిలోని సాఫ్ట్వేర్ కంపెనీల్లో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నాస్కామ్ ఈ సందర్భంగా పేర్కొంది. ఈ మేరకు తాము నాస్కామ్తో ఒప్పందం చేసుకున్నట్లు జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ఎన్వీ రమణరావు పేర్కొన్నారు. ‘ఉపాధి’కి కొత్త సబ్జెక్టులు, కోర్సులు.. ఉపాధి అవకాశాలు కల్పించే పలు సబ్జెక్టులు, కోర్సులను ప్రవేశపెట్టేందుకు జేఎన్టీయూహెచ్ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో డిజైన్ ఇంజనీర్, జూనియర్ డాటా అసోసియేట్, సెక్యూరిటీ అనలిస్ట్, అసోసియేట్ అనలిటిక్స్ సబ్జెక్టులను మొదటి దశలో ప్రవేశ పెడుతోంది. తరువాత రెండో దశలో టెస్ట్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ డెవలపర్ సబ్జెక్టులను ప్రవేశపెట్టనుంది. ఇక భవిష్యత్‌లో స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్, వెబ్ టెక్నాలజీస్, జావా ప్రోగ్రామింగ్‌లో రెండు రకాల కోర్సులు, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డాటా అనలిటిక్స్, నెట్వర్క్ ప్రోగ్రామింగ్, సాకెట్ ప్రోగ్రామింగ్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. 15 నుంచి శిక్షణ.. కొత్త సబ్జెక్టులకు సంబంధించిన ఫ్యాకల్టీకి ఐటీ కంపెనీల నిపుణులతో శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలుత 100 మందికి ఏప్రిల్ 15 నుంచి శిక్షణ ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఐటీ, సీఎస్సీ కోర్సుల్లో కోర్ సబ్జెక్టులతోపాటు ఎలెక్టివ్ సబ్జెక్టుల్లో భాగంగా ఈ కొత్త సబ్జెక్టులను విద్యార్థులు ఎంచుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఐటీ విభాగం ప్రొఫెసర్ విజయకుమారి పేర్కొన్నారు. బీటెక్ మూడో సంవత్సరంలోని మొదటి సెమిస్టర్, రెండో సెమిస్టర్, నాలుగో సంవత్సరంలోని మొదటి సెమిస్టర్, రెండో సెమిస్టర్లలో ఈ కొత్త సబ్జెక్టులను విద్యార్థులు చదువుకోవచ్చు. సబ్జెక్టులను ఎంచుకోవడమనేది పూర్తిగా విద్యార్థుల ఇష్టాయిష్టాలపైనే ఆధారపడి ఉంటుంది. ‘నాస్కామ్’ సర్టిఫికెట్లు.. ఈ కొత్త సబ్జెక్టులతో కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు నాస్కామ్ కూడా సర్టిఫికెట్లను అందజేయనుంది. నాస్కామ్ పరిధిలోని సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతోపాటు నాస్కామ్ సర్టిఫికెట్తో ఇతర సాఫ్ట్వేర్ కంపెనీల్లోనూ ఉద్యోగాలు పొందడం సులభం అవుతుందని నాస్కాం రీజనల్ డెరైక్టర్ శ్రీకాంత్ శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఈ సర్టిఫికెట్లకు అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు ఉంటుందని తెలిపారు. కొత్త సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్‌ను రూపొందిస్తున్నామని, దీనిపై వివిధ సాఫ్ట్వేర్ సంస్థల నిపుణులతో ఫ్యాకల్టీకి శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. ఫైనలియర్లో ప్రాజెక్టులు.. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం ప్రాజెక్టుల్లో భాగంగా సమ్మర్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా మొదట 20 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ కోర్సులను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. ఇందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) కార్యక్రమం కింద నాస్కామ్, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్‌తోనూ జేఎన్టీయూ ఒప్పందం చేసుకుంది. మొబైల్ ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ సబ్జెక్టులకు సంబంధించి ఈ ప్రత్యేక శిక్షణ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కొత్త సబ్జెక్టులు ప్రవేశపెట్టనున్న కాలేజీలు -288 నాస్కామ్ ద్వారా జేఎన్టీయూ ఏటా కల్పించనున్న ఉద్యోగాలు -15,000 -
30 శాతం మంది తెలుగు విద్యార్థులే
విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఎన్ఐటీ).. పరిచయం అక్కర్లేని విద్యా సంస్థ. దేశం గర్వించదగ్గ ఇంజనీర్,భారతరత్న అవార్డ్ గ్రహీత మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరుమీదుగా ఏర్పడిన ఈ సంస్థకు ఇంజనీరింగ్ కోర్సులను అందించడంలో మంచి పేరుంది. ఇక్కడ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్న నన్నపరాజు నైషద్ తన క్యాంపస్ లైఫ్‌ను వివరిస్తున్నాడిలా.. క్యాంపస్ లైఫ్ మాది హైదరాబాద్. జేఈఈ మెయిన్-2012లో విజయం సాధించి ఎన్ఐటీ -నాగ్‌పూర్‌లో చేరాను. ప్రస్తుతం బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్నాను. 220 ఎకరాల్లో క్యాంపస్ ఉంటుంది. ఇక్కడ తెలుగు విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ. బీటెక్‌లో అన్ని బ్రాంచ్‌లూ కలుపుకుని 30 శాతం మంది తెలుగు విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. సౌకర్యాలు అత్యుత్తమం ప్రవేశం లభించిన విద్యార్థులందరికీ హాస్టల్ వసతి ఉం టుంది. అందరికీ ల్యాన్ సౌకర్యం కల్పిస్తారు. ర్యాగింగ్ ఇంటరాక్షన్ వరకే పరిమితం. ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి హాస్టల్లో సదుపాయాలున్నాయి. హాస్టల్ కామన్రూమ్లో భాగంగా పత్రికలు, మ్యాగజైన్లు అందుబాటులో ఉంటాయి. ఇన్స్టిట్యూట్ ఉత్తర భారతదేశంలో ఉన్నా మన తెలుగు వంటకాలన్నీ లభిస్తాయి. భోజనం రుచిగా ఉంటుంది. తరగతి గదులు, లేబొరేటరీలు, లైబ్రరీ వంటివి అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయి. ఇండస్ట్రీ విజిట్స్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు ఆయా బ్రాంచ్‌లు, షెడ్యూల్‌ను బట్టి క్లాసులు, ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఫ్యాకల్టీ చాలా బాగా బోధిస్తారు. సబ్జెక్టు సందేహాలను నివృత్తి చేస్తారు. గెస్ట్ లెక్చర్లు ఇవ్వడానికి విద్యాసంస్థలు, పరిశ్రమల నుంచి నిపుణులు వస్తుంటారు. వివిధ అంశాలపై అవగాహన కల్పించడానికి విద్యార్థులను ఇండస్ట్రీ విజిట్స్‌కు కూడా తీసుకెళ్తారు. హ్యుమానిటీస్ కూడా ప్రతి సెమిస్టర్లో రెండు ఇంటర్నల్స్, ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. వీటితోపాటు నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సు పూర్తయ్యేలోపు హ్యుమానిటీస్/సోషల్ సెన్సైస్ సబ్జెక్టులను అధ్యయనం చేయాలి. వీటిల్లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. వీటిల్లో వచ్చిన మార్కులను కూడా క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ ఏవరేజ్ (సీజీపీఏ)లో కలుపుతారు. నేను ఇప్పటివరకు 10కి 7.58 సీజీపీఏ సాధించాను. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ల్లో విద్యార్థులకు మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఈ ఏడాది గరిష్టంగా రూ. 22 లక్షల వరకు కంపెనీలు వేతనాలు అందించాయి. ప్రధానంగా కోర్ బ్రాంచ్‌లు (మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్) చదివే విద్యార్థులు మంచి ఉద్యోగావకాశాలు పొందుతున్నారు. మేనేజ్మెంట్ ఫెస్ట్ ప్రత్యేకం ఏటా క్యాంపస్‌లో టెక్నికల్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్, మేనేజ్మెంట్ ఫెస్ట్ నిర్వహిస్తారు. గతేడాది టెక్నికల్ ఫెస్ట్‌కు మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్‌కలాం హాజరయ్యారు. ఏ ఎన్ఐటీలో నిర్వహించని మేనేజ్మెంట్ ఫెస్ట్‌ను ఇక్కడ మాత్రమే ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ-సెల్ అందించే సేవలెన్నో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునేవారి కోసం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్ ఉంది. విద్యార్థుల ఆలోచనలు నచ్చితే స్టార్టప్‌కు కావాల్సిన ఆర్థిక వనరులు అందిస్తారు. స్టార్టప్ విజయవంతం కావడానికి సూచనలు, సలహాలు ఇస్తారు. కోర్సు పూర్తయ్యాక రెండేళ్లు జాబ్ చేసి తర్వాత ఎంబీఏ చేస్తా. -
సీట్ బ్లాకింగ్‌ను అరికడతాం
మంత్రి ఆర్.వి.దేశ్‌పాండే ఫీజు నిర్ణయంలో మార్పు లేదు ఉమ్మడి సీఈటీ నిర్వహణపై సమాలోచనలు సాక్షి,బెంగళూరు: వైద్య, దంత వైద్య, ఇంజినీరింగ్ కోర్సుల సీట్ బ్లాకింగ్‌ను అరికడుతామని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్.వి.దేశ్‌పాండే స్పష్టం చేశారు. శుక్రవారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ ఈ విద్యా ఏడాదికి సీట్ల కేటాయింపు, ఫీజు నిర్ణయంలో ఎలాంటి మార్పు చేయలేదన్నారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించే విద్యా సంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలల్లో వృత్తి విద్యా కోర్సుల ప్రవేశం కోసం ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీఈటీ) నిర్వహించే ఆలోచన ఉందన్నారు. వృత్తివిద్యా కోర్సుల ప్రవేశాల్లో పారదర్శకత పెంచేందుకు రూపొందించిన ‘వృత్తి విద్యా కళాశాల ప్రవేశ నియంత్రణ, ఫీజు నిర్ణయం-2014’ బిల్లులో చేసిన మార్పులకు మండలిలో శుక్రవారం ఆమోదం లభించింది. రాష్ట్రంలోని 411 ప్రభుత్వ పీయూసీ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.630 కోట్లు వెచ్చించనున్నామని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రగౌడ అడిగిన ప్రశ్నకు మంత్రి దేశ్‌పాండే సమాధానమిచ్చారు. అక్రమార్కులపై చర్యలు బీదర్ జిల్లాలో మధ్యాహ్న భోజనానికి సంబంధించి కోడిగుడ్ల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ రఘునాథ్ రావ్ మల్కాపుర అడిగిన ప్రశ్నకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ఉమాశ్రీ సమాధానమిచ్చారు. వారంలో మూడు రోజుల చొప్పున ప్రతి నెల 38,70,420 గుడ్లను విద్యార్థులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇందు కోసం రూ.1,54,81,680 వెచ్చిస్తున్నట్లు వివరించారు. చర్చించి నిర్ణయం తీసుకుంటాం అక్షర దాసోహ పథకంలో భాగంగా విద్యార్థులకు భోజనం వండుతున్నవారిలో ప్రధాన వంటవారికి రూ.1,700, సహాయకులకు రూ.1,600 గౌరవ వేతనాన్ని అందిస్తున్నట్లు మంత్రి కిమ్మెన రత్నాకర్ పరిషత్‌కు తెలియజేశారు. గౌరవేతనం పెంపు విషయమై సంబంధిత కేంద్ర మంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. వంట సిబ్బంది విధి నిర్వహణలో ఉన్నప్పుడు మరణిస్తే రూ.లక్ష, శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే రూ.75వేలు, చిన్నపాటి గాయలైతే రూ. 30వేలు పరిహారంగా అందచేస్తునున్నటు చెప్పారు. -
డిగ్రీ కోర్సులకు సిటీ స్టూడెంట్ జై!
బీకాం(కంప్యూటర్‌స), బీఎస్సీ(ఫిజిక్స్)కు అధిక దరఖాస్తులు.. ఇంటర్మీడియెట్ పూర్తికాగానే అందరి చూపు ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ప్రొఫెషనల్ కోర్సులపైనే..! వాటిలో ప్రవేశం దక్కకపోతేనే డిగ్రీ కోర్సుల్లో చేరేవారు. ఆ పరిస్థితిలో ఇప్పుడు మార్పు వచ్చింది. విద్యార్థి లోకం డిగ్రీ కోర్సులకూ జై కొడుతోంది. జాబ్ ఓరియెంటేషన్‌కు ప్రాధాన్యమిస్తోంది. బీకాం(కంప్యూటర్‌స) వంటి కోర్సుల్లో చేరేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి. సిటీలోని ప్రముఖ డిగ్రీ కాలేజీల్లో సీట్ల కోసం గతంలో ఎన్నడూ లేనంత పోటీ నెలకొంది. బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీసీఏ... అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో తొలి ప్రాధాన్యం బీకాం కంప్యూటర్స్‌కే అంటున్నారు నగర విద్యార్థులు. ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. నగరంలో ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు సుమారు 260 వరకు ఉన్నాయి. గతానికి భిన్నంగా ఈ విద్యాసంవత్సరంలో డిగ్రీ కోర్సులకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. పేరున్న డిగ్రీ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేషన్ సీట్లు హాట్‌కేకుల్లా మారాయి. ఇక్కడ బీకాం కంప్యూటర్స్‌లోని 600 సీట్లకు సుమారు 2800 మంది దరఖాస్తు చేసుకున్నారు. బీఎస్సీ(ఫిజికల్ సైన్స్)కు ఏకంగా 6000 మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. నిజాం కాలేజీ, విల్లామేరీ, సెయింట్ ఫ్రాన్సిస్, లయోలా అకాడమీ, బద్రుకా, ఏవీ కాలేజీ, సెయింట్ ఆన్స్, కోఠి ఉమెన్స్ కాలేజీ, వనితా మహావిద్యాలయ తదితర కళాశాలల్లో డిగ్రీ కోర్సుల దరఖాస్తులను గతేడాది కంటే ఈసారి మూడురెట్లు అధికంగా విక్రయించారు. బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అక్కడ బీకాం కంప్యూటర్స్ సీట్లన్నీ భర్తీ అయినట్లు అడ్మినిస్ట్రేషన్ అధికారి తెలిపారు. ఫస్ట్‌ఛాయిస్.. బీకాం కంప్యూటర్స్ నిన్న మొన్నటి వరకూ ఒకటే క్రేజ్.. ఇంజనీరింగ్.. మెడిసిన్.. అందరిదీ అదే మాట, అదే దారి. ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. సిటీ విద్యార్థులు ఇప్పుడు డిగ్రీ వైపు మొగ్గుచూపుతున్నారు. క్రేజ్ కంటే జాబ్ ముఖ్యమని భావిస్తున్నారు.తమ ఫస్ట్ఛాయిస్గా బీకాం కంప్యూటర్స్‌కు ఎక్కువమంది దరఖాస్తు చేసుకుంటే.. సైన్సు కోర్సుల్లో బీఎస్సీ(ఫిజికల్ సైన్స్) వైపు అధిక శాతం మంది మొగ్గు చూపుతున్నారు. మొత్తంగా చూస్తే ఫస్ట్‌ఛాయిస్ బీకాం కంప్యూటర్స్.. రెండోది బీఎస్సీ(ఫిజికల్ సైన్స్).. మూడోస్థానంలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్.. నాలుగో స్థానంలో బీకాం రెగ్యులర్ కోర్సులున్నాయి. జాబ్ మార్కెట్లో రోజురోజుకీ వస్తున్న మార్పులు.. గ్లోబలైజేషన్ ప్రభావంతో సరికొత్త ఉద్యోగాలు పుట్టుకురావడం.. కమ్యూనికేషన్ స్కిల్స్‌కు పెరుగుతున్న ప్రాధాన్యత వంటి కారణాలు డిగ్రీ కోర్సులకు పూర్వవైభవం తెచ్చాయని చెబుతున్నారు నిజాం కళాశాల వైస్‌ప్రిన్సిపల్ జి.వీరభద్రం. ట్రెండ్ మారుతుందని భావించామని, అయితే ఇంత త్వరగా మార్పు వస్తుందని ఊహించలేదంటున్నారు. ‘సైన్స్ అనేది టెక్నాలజీని నడిపించాలి, కానీ ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో టెక్నాలజీయే సైన్స్‌ను నడిపిస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు. డిగ్రీ కోర్సుల వైపు యువత మొగ్గుచూపడం సైన్స్ మరింత అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెరుగుతున్న డిమాండ్ రీసెర్స్ అండ్ డెవలప్మెంట్ అనేది అధ్యయనం ద్వారానే సాధ్యమవుతుందని వనితా మహావిద్యాలయ ప్రిన్సిపల్ వాణి తెలిపారు. డిగ్రీ కోర్సులకు ఆదరణ పెరగడానికి కారణం జాబ్ ఓరియెంటేషన్ కోర్సులు రావడమేనని చెప్పారు. తమ కాలేజీలో బీఎస్సీకి 1:3 నిష్పత్తి , బీకాం కంప్యూటర్స్‌కు 1:6 మేర విద్యార్థుల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. బీకాంలో 30 సీట్లకు సుమారు 900 దరఖాస్తులు రావడం డిగ్రీ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్‌కు నిదర్శనమన్నారు. విల్లామేరీ కళాశాలలోనూ బీఎస్సీ, బీకాంలకు దాదాపు 2000 దరఖాస్తులు వచ్చాయంటున్నారు నిర్వాహకులు. కోఠి ఉమెన్స్ కళాశాలలో బీఎస్సీకి అధికంగా 1500 దరఖాస్తులు వచ్చాయని ప్రిన్సిపల్ బి.టి.సీత తెలిపారు. జనరల్ విభాగంలో బీఎస్సీకి 75-80 శాతం మార్కులు, బీకాం కంప్యూటర్స్‌కు 70 శాతం మార్కుల వరకూ సీట్లు కేటాయించామన్నారు. లయోలా అకాడమీ సికింద్రాబాద్ క్యాంపస్‌లో బీకాం కంప్యూటర్స్, బీఎస్సీ ఫిజికల్ సెన్సైస్ కోర్సుల్లో సీట్లన్నీ నెల రోజుల క్రితమే భర్తీ అయినట్లు నిర్వాహకులు చెప్పారు. -
సీట్ల మోసం కేసులో ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్టు
వేలూరు: తమిళనాడు వేలూరులోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో సీట్లు ఇప్పిస్తామని విద్యార్థులను మోసం చేసిన అలోక్ చౌహాన్ అనే ఇంజనీరింగ్ విద్యార్థిని పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అతను తమిళనాడులోని కొట్టాంగలత్తూరు సమీపంలో ఓ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ నాల్గో సంవత్సరం చదువుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ బాధిత విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన కాంచీపురం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు... అతని మోసాల గుట్టును రట్టు చేశారు. అతని గదిలో జరిపిన సోదాలో రూ. 20 వేల చొప్పున ఆరుగురు విద్యార్థులు పంపిన డీడీలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం... అలోక్ సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొంతమంది విద్యార్థులకు ఇంజనీరింగ్ సీట్ల ఆశ చూపాడు. రూ. 20 వేల చొప్పున డీడీ తనకు పంపిస్తే యూనివర్సిటీల్లో సీటు ఇప్పిస్తానని పేర్కొంటూ పలువురు విద్యార్థులకు ఈ మెయిల్ పంపాడు. ఇది నమ్మి విద్యార్థులు పంపిన డీడీలను తన స్నేహితులకు ఇచ్చి... యూనివర్సిటీలో ఫీజు కింద వాటిని జమ చేయించేవాడు. ఆమేరకు ఆ మొత్తాన్ని నగదు రూపంలో వారి నుంచి తీసుకొనేవాడు. అలా డీడీ పంపిన ఓ విద్యార్థిని వేలూరులోని సంబంధిత యూనివర్సిటీ నిర్వాహకులను ఫోన్లో సంప్రదించింది. అయితే తాము ర్యాంకుల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించే సీట్లు కేటాయిస్తామని, తాము ఎవ్వరికీ డీడీ ఇవ్వాలని చెప్పలేదని సమాధానమిచ్చారు. దీంతో బాధిత విద్యార్థిని పోలీసులను ఆశ్రయించడంతో అలోక్ మోసాల గుట్టు రట్టయ్యింది. వేలూరులోని ప్రైవేటు ఇంజనీరింగ్ యూనివర్సిటీల్లో సీట్లు ఇప్పిస్తామంటూ మోసం చేసే దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విద్యార్థులకు సూచించారు. -
లక్ష సీట్లు ఖాళీ
సాక్షి, చెన్నై : ఇంజినీరింగ్ విద్యపై ఆసక్తి తగ్గుతోందని దరఖాస్తుల పర్వంలో స్పష్టం అవుతోంది. దరఖాస్తులు పెద్ద ఎత్తున కొనుగోలు చేసినా, సమర్పించిన వాళ్లు మాత్రం తక్కువే. అన్నావర్సిటీ బీఈ, బీటెక్ కోర్సుల ఆహ్వానానికి స్పందన కరువైంది. ప్లస్‌టూ అనంతరం ఉన్నత విద్య ను అభ్యసించాలన్న తలంపుతో విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులను ఎంపి క చేసుకుంటారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ గ్రూపులను ఎంపిక చేసుకునే వాళ్లు కొందరు అయితే, న్యాయ, పాలిటెక్నిక్ కోర్సుల బాట పట్టేవారు కొందరు. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ మీద దృష్టి పెట్టే వాళ్లు అధికం. ఒకప్పుడు ఇంజినీరింగ్ సీట్లకు రాష్ట్రంలో భలే గిరాకీ ఉండే ది. ఎంబీబీఎస్ సీట్లు మెరిట్ విద్యార్థుల దరి చేరుతూ వచ్చారుు. రాష్ట్రంలోని ఉన్నత విద్యా విధానం మేరకు ఇంజినీరింగ్ కోర్సుల భర్తీ అన్నావర్సిటీ మీద ఉంది. ప్రతి ఏటా ఈ వర్సిటీ నేతృత్వంలో దరఖాస్తులను ఆహ్వానించడం, రాష్ట్రంలోని ఆయా కళాశాలలను విద్యార్థులు ఎంపిక చేసుకోవడం జరుగుతూ వస్తోంది. తగ్గుతున్న ఆసక్తి రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే కళాశాలలు, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు 570 వరకు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ కోటా సీట్లు మాత్రం రెండు లక్షలు, ఇక యాజమా న్య , ఇతరత్రా కోటా సీట్లు ఆయా కళాశాలల సామర్థ్యాన్ని బట్టి ఉన్నాయి. రెండేళ్లుగా ప్రభుత్వ కోటా సీట్లు పూర్తి స్థాయిలో భర్తీ కావడం లేదు. ప్రాధాన్యం కలిగిన కళాశాలల్లోని కోర్సులు మాత్రం చకచకా పూర్తి అవుతున్నాయి. అయితే, దక్షిణాది జిల్లాల్లోని అనేక కళాశాలల్లో సీట్ల భర్తీ పూర్తిస్థాయిలో జరగడం లేదు. గత ఏడాది రెండు లక్షల 38 వేల దరఖాస్తులు విక్రయించారు. వచ్చింది మాత్రం లక్ష 90 వేలు , ఇందు లో కొన్ని తిరస్కరణకు గురయ్యాయి. కౌన్సెలింగ్‌కు 40 వేల మంది హాజరు కాలేదు. దీంతో ప్రభుత్వ కోటా సీట్లు సుమారు 80 వేలు భర్తీ కాలేదు. ఈ ఏడాది ఆ సంఖ్య లక్ష దాటే అవకాశాలు కన్పిస్తున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది 25 వేల దరఖాస్తుల విక్రయం తగ్గాయి. వచ్చిన దరఖాస్తులు గత ఏడా ది కంటే 20 వేల వరకు తగ్గుముఖం పట్టాయి. దీంతో అన్నావర్సిటీ వర్గాలు అయోమయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇంజినీరింగ్‌పై మక్కువ తగ్గుతోందా? అన్న విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. లక్షా 70 వేల వరకు మాత్రమే దరఖాస్తులు వచ్చిన దృష్ట్యా, ఇందులో కొంత మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు డుమ్మా కొట్టడం ఖాయం. ఈ దృష్ట్యా, ఈ ఏడాది లక్ష సీట్ల వరకు ఖాళీగా దర్శనం ఇవ్వనున్నాయి. ఆందోళన ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు ఇటీవల తగ్గు తున్నాయి. విదేశాల్లో బీఈ పూర్తి చేసిన వారి కన్నా, ఆ తర్వాత ఎంఈ పూర్తి చేసిన వారికే ఉద్యోగాలు దక్కుతున్నా యి. దీంతో ఆ కోర్సులను ఎంపిక చేసుకుని నిరుద్యోగులుగా మిగలడం కన్నా, ప్రత్యామ్నాయ కోర్సుల మీద విద్యార్థులు దృష్టి కేంద్రీకరించే పనిలో పడ్డా రు. ఈ పరిణామాలు ఇంజినీరింగ్ కళాశాలలను ఆందోళనలో పడేస్తున్నాయి. ప్రాధాన్యం, పబ్లిసిటీ ఉన్న కళాశాలల్లో సీట్ల భర్తీ పూర్తి స్థాయిలో సాగుతున్నా, మారుమూల ప్రాంతాల్లో, గ్రామీణ విద్యార్థులకు అందుబాటులో ఉండే కళాశాలలు, అంతగా ప్రాచుర్యం లేని కళాశాలలు గగ్గోలు పెట్టే పరిస్థితి నెల కొంది. తమ కళాశాలు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, పరిస్థితి ఇలాగే ఉంటే కళాశాలలకు తా ళం వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుం దన్న ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. -
ఇంజనీరింగ్‌లో.. బ్రాంచీల మాదిరి ప్రశ్నలు
ECE: Which of the following logic gate behaves like a stair case switch? 1) AND 2) OR 3) NAND 4) EXOR Ans: 4 EEE: Kirchhoff's laws not applicable to? 1) Linear 2) Non Linear 3) Distributed 4) Non Linear and Distributed Ans: 3 Mech: Universal joints are located at the end of? 1) Clutch 2) Diffrential 3) Propeller shaft 4) Gear box shaft Ans: 3 Civil: The relation between Cd, Cv, Cc? 1) Cd=Cc+Cv 2) Cd=Cc+Cv-1 3) Cd=Cv Cc 4) all the above Ans: 3 CSE: In Kmap formation octane eliminates.... variables? 1) 1 2) 2 3) 3 4) 4 Ans: 3 -
‘పని’కిరాని ఇంజినీరింగ్ కోర్సులు!
రాష్ట్రంలో ఇంజినీరింగ్ బోధనలో నాణ్యత లోపిస్తోంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన కాలేజీల్లో ప్రమాణాలు దిగజారుతున్నాయి. పలు కాలేజీల్లో అధ్యాపకులు కూడా లేని పరిస్థితి ఉంది. విద్యార్థులు పాఠాలను వల్లే వేస్తూ ముక్కుని పట్టుకుని పరీక్షలు రాసేస్తున్నారు. ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో విద్యార్హతగా పట్టాలే చేతుల్లో ఉంటాయి. చదివిన వారికి కొలువులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతోందని పలువురు ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో శుక్ర, శనివారాల్లో జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇన్నోవేషన్స్ ఇన్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సదస్సుల్లో దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు, నిపుణులు ఇంజినీరింగ్ విద్యపై తమ అభిప్రాయాలు చెప్పారు. ప్రయోగాత్మక అంశాలపై కొత్త ఆలోచనలు రేకెత్తించాల్సిన రేపటి ఇంజనీర్లను పుస్తకాల పురుగుల్లా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా కాలేజీ యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా తీసుకుంటున్నాయని, సమాజానికి ఉపయోగపడే ఇంజినీర్లను రూపొదించలేక పోతున్నాయని ఆరోపిస్తున్నారు. గత ఏడేళ్లగా ఈ దుస్థితి నెలకొందని, దీన్ని ప్రభుత్వం స్పందించి సరిదిద్దాలని కోరుతున్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో వెనుకంజ కాలేజీ క్యాంపస్ ఇంటర్వ్యూల్లో పలువురు విద్యార్థులు వెనకంజ వేస్తున్నారు. క్లాసులో సమర్థులు కూడా కంపెనీలు వేసే ప్రశ్నలకు సమాధాన చెప్పడంలో విఫలమవుతున్నారు. పట్టణాల్లో చదివిన విద్యార్థుల పరిస్థితి కొంత బాగున్నా.. పల్లెల్లో వారైతే వెనకపడిపోతున్నారు. కంపెనీ ప్రతినిధులకు అనుకూలంగా లేకపోవటం వల్ల ఉద్యోగాలకు ఎంపిక కావడం లేదు. కంపెనీల ప్రతినిధులు కూడా విద్యాసంస్థ పల్లె లేక పట్టణంలో ఉందా అనేది చూసుకోకుండా ఏది నాణ్యమైన విద్యను అందించే మంచి విద్యాసంస్థ అనేది చూస్తున్నారు. ఇక్కడ సిల్బస్ తేలిక...అక్కడ చిటికెలో నేర్చుకోచ్చు మన రాష్ట్రంలో ఇంజినీరింగ్ సిలబస్‌ను జేఎన్టీయూ రూపొందిస్తోంది. సబ్జెక్ట్ తేలిగ్గా ఉన్నా విద్యార్థులు నేర్చుకోవడం కష్టంగా ఉంది. మహారాష్ట్రలో నాగపూర్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో ఇంజినీరింగ్ శాస్త్ర పరిజ్ఞానం ఒక్కటే అయినా వారు రూపొందించే సిలబస్ కష్టతరంగా ఉంటుంది. కాని సునాయాసంగా నేర్చుకోవచ్చునని అక్కడి నుంచి ఈ సదస్సులకు వచ్చిన అభ్యర్థులు చెబుతున్నారు. యువ ఇంజినీర్లకు ప్రోత్సాహకాలెన్నో ! ఇంజినీరింగ్ విద్యార్థులను పరిశోధన దిశగా అడుగులు వేయించేందుకు ఇ.ఎస్.సి.ఐ సంస్థను ప్రభుత్వం స్థాపించింది. పరిశోధక గ్రూపులకు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకూ ఇస్తున్నాం. ఏడాదికి 80గ్రూపులకు ఆర్థికసాయం చేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ, ఇంటర్నెట్ వాడకం, నూతన అంశాల ఆవిష్కరణ దిశగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం. ఎంఎస్, పీహెచ్‌డీలు చేసేవారికి గైడ్లెన్స్ ఇస్తున్నాం. మొక్కుబడిగా చెబుతున్న ఇంజినీరింగ్ విద్యను మెరుగుపరచాల్సి ఉంది. వ్యాపారపరంగా కాలేజీల్ని కొన్ని యాజమాన్యాలు నిర్వహించడం దురదృష్టకరం. - డాక్టర్ యు.చంద్రశేఖర్, ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా డెరైక్టర్ -
నైపుణ్యాల అంచనాకు మెరుగైన వేదిక.. ప్రాజెక్ట్ వర్క్
ఇంజనీరింగ్ విద్యార్థి కెరీర్‌ను ప్రభావితం చేసే అంశాల్లో కీలకమైంది.. ప్రాజెక్ట్ వర్క్. ప్రస్తుతం నియామక ప్రక్రియలో అకడమిక్ నాలెడ్జ్‌తోపాటు ప్రాక్టికల్ స్కిల్స్‌కు రిక్రూటింగ్ ఏజెన్సీలు పెద్ద పీట వేస్తున్నాయి.. ఇంజనీరింగ్ కోర్సు నాలుగేళ్లు అధిక శాతం థియరీ ఆధారితం కావడంతో.. ప్రాక్టికల్‌గా విద్యార్థి ప్రతిభను అంచనా వేయడానికి ప్రాజెక్ట్ వర్క్ దోహదపడుతుంది.. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ వర్క్‌ను ప్రభావవంతంగా చేయడానికి సూచనలు.. ఇంజనీరింగ్ విద్యార్థులు నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్లో ప్రాజెక్ట్ వర్క్ చేపడతారు. వ్యక్త్తిగతంగా లేదా ఇద్దరి నుంచి నలుగురు వరకు విద్యార్థులు ఒక బృందంగా ఏర్పడి ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తారు. కోర్సులో భాగంగా అంత కాలం నేర్చుకున్న అంశాలపై విద్యార్థులకు ఉన్న అవగాహనను ప్రాక్టికల్‌గా ఏవిధంగా అన్వయించుకోగలుగుతున్నారనే నైపుణ్యాన్ని అంచనా వేసేందుకు ఉద్దేశించింది ప్రాజెక్ట్ వర్క్. భవిష్యత్ దిశగా ప్రాక్టికల్ ఎక్స్పోజర్కు కూడా ప్రాజెక్ట్ వర్క్ చక్కని వేదికగా ఉపయోగపడుతుంది. పక్కాగా: ప్రాజెక్ట్ వర్క్‌ను విజయవంతంగా పూర్తి చేయడానికి పక్కా ప్రణాళిక రచించుకోవాలి. ఇందుకోసం చేసే సన్నాహకాలు పక్కాగా ఉండాలి. ఎటువంటి ప్రాజెక్ట్ చేపట్టాలి? ప్రాజెక్ట్ ఉద్దేశం? వ్యక్తిగతంగా చేయాలా లేదా ఒక గ్రూప్‌గా నిర్వహించాలా? ప్రాజెక్ట్ వల్ల ఏవరికి ప్రయోజనం? తదితర అంశాలపై స్పష్టత పొందాలి. సొంత ఆలోచనతో: ప్రాజెక్ట్ వర్క్ క్రమంలో కీలకమైంది.. టాపిక్ ఎంపిక. ఎటువంటి టాపిక్‌ను ఎంచుకోవాలనే విషయంలో స్పష్టత లేక విద్యార్థుల్లో ఒక రకమైన అయోమయమైన స్థితి నెలకొని ఉంటుంది. దీంతో ఎటువంటి ప్రాధాన్యత లేని అంశాన్ని ఎంచుకుని ప్రాజెక్ట్ వర్క్‌ను పూర్తి చేస్తారు. ఇది ఏవిధంగానూ వారి భవిష్యత్ అవకాశాలను ప్రభావితం చేయదు. ఇటువంటి ప్రాజెక్ట్స్‌తో సమయం వృథా తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రాజెక్ట్ వర్క్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పరిధి చిన్నదైనా సొంత ఆలోచనలతో పూర్తి చేయడం మంచిది. కాపీ లేదా డౌన్లోడ్ చేయడం ద్వారా ప్రాజెక్ట్ వర్క్ చేయకూడదు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకుంటూ: ప్రాజెక్ట్ వర్క్ ఎంపిక సమయంలో ఉన్నత విద్య, ఉద్యోగం అనే అంశాలను దృష్టిలో ఉంచుకుని.. వాటికనుగుణంగా ఉండే అంశాన్ని ఎంచుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. అదే సమయంలో ఆసక్తిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకు ప్రాజెక్ట్ చేస్తున్నాం? ఏవిధంగా చేయాలనుకుంటున్నాం? ఈ అంశాన్ని ఎంచుకోవడం వెనక ఉన్న కారణం? దీని వల్ల ఎవరికి ప్రయోజనం? వంటి ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వగలిగితే దాన్ని నాణ్యమైన ప్రాజెక్ట్‌గా పేర్కొనవచ్చు. పుస్తకాల నుంచి బయటికి వచ్చి వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ ప్రాక్టికల్‌గా ఆలోచించాలి. అప్పుడే నాణ్యమైన టాపిక్ స్ఫూర్తినిస్తుంది. అదే సమయంలో ఎంచుకున్న అంశం ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉండేలా జాగ్రత్త పడాలి. కొత్త నైపుణ్యాలు పెంచుకోవడానికి అవకాశమున్న ప్రాజెక్ట్‌ను ఎంపిక చేసుకోవాలి. ఇండస్ట్రీ రిలవెంట్ ప్రాజెక్ట్ వర్క్‌ను చేపట్టడం ఉత్తమం. టాపిక్ ఎంపికలో సభ్యులందరూ సమష్టి నిర్ణయం తీసుకోవాలి. ఈ నేపథ్యంలో గ్రూప్ సభ్యులు సమష్టితత్వాన్ని అలవర్చుకోవాలి. బాధ్యతలను గుర్తెరిగి ప్రవర్తించాలి. ఎవరు ఏ అంశాన్ని చేపట్టాలి అనే విషయంలో స్పష్టత కలిగి ఉండాలి. మరో కీలకాంశం.. సూపర్వైజర్/మెంటర్‌ను ఎంచుకోవడం. ఈవిషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రాజెక్ట్ వర్క్‌ను విజయవంతంగా పూర్తి చేయడంలో మెంటర్ పాత్ర కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్రెషర్‌గా ప్రాజెక్ట్ వర్క్‌పై అంతగా అవగాహన ఉండదు. కాబట్టి ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? అనే అంశంలో సదరు మెంటర్ అనుభవం ఉపయుక్తంగా ఉంటుంది. సోర్సెస్: ప్రాజెక్టు ఎంపికలో ఇంటర్నెట్ను మంచి వనరుగా వినియోగించుకోవచ్చు. కొన్ని ఐఐటీలు ప్రాజెక్ట్‌కు సంబంధించిన అంశాలను వాటి వెబ్సైట్లలో పొందుపరుస్తాయి. వాటిని వినియోగించుకోవచ్చు. అందులో విస్తృత సమాచారం అందుబాటులో ఉంటుంది. కొన్ని కంపెనీలైతే కేవలం ప్రాజెక్ట్ వర్క్/ఇంటర్న్‌షిప్స్‌ను దృష్టిలో ఉంచుకుని మాత్రమే ప్రకటనలను విడుదల చేస్తుంటాయి. వాటి ఆధారంగా కూడా ప్రాజెక్ట్ వర్క్ చేపట్టవచ్చు. కొన్ని కంపెనీలు కాలేజీల్లోని ఫ్యాకల్టీలను ప్రాజెక్ట్ వర్క్ కోసం ఆశ్రయిస్తుంటాయి. వీటి నుంచి కూడా టాపిక్‌ను ఎంచుకోవచ్చు. కొంతమంది ప్రొఫెసర్లకు ఏఐసీటీఈ, డీఎస్టీ, యూజీసీ నుంచి రీసెర్చ్ వర్క్‌లు వస్తాయి. అలాంటి వారి వద్ద ప్రాజెక్ట్ వర్క్ చేయొచ్చు. అలా కాకుండా క్షేత్ర స్థాయి పరిస్థితులను అవగాహన చేసుకోవడం ద్వారా టాపిక్ ఎంపికలో స్పష్టత తెచ్చుకోవచ్చు. ఈక్రమంలో కాలేజ్‌ను కూడా చక్కని వేదికగా వినియోగించుకోవచ్చు. కాలేజీలు లేదా చదువుతున్న బ్రాంచ్ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా ఒక ఫోన్ అప్లికేషన్‌ను రూపొందించవచ్చు. ఉన్నత విద్య/ఉద్యోగం: ప్రాజెక్ట్ టాపిక్ ఎంపిక.. ఇంజనీరింగ్ కోర్సు తర్వాత మనం ఏ దిశగా అడుగులు వేయాలనుకుంటున్నామో దాని ఆధారంగా ఉండడం ప్రయోజనకరం. ఈ క్రమంలో ఉన్నత విద్య దిశగా ఆలోచన ఉంటే.. సంబంధిత బ్రాంచ్ హెచ్ఓడీ లేదా ఫ్యాకల్టీ నుంచి సలహాను తీసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్‌లో ఎంటెక్/పీహెచ్డీ పరంగా ఎటువంటి సబ్జెక్ట్‌కు డిమాండ్ ఉండొచ్చు. కెరీర్ పరంగా అవకాశాలు? అనే విషయంలో సమగ్ర అవగాహన ఉంటుంది. ఒక వేళ ఉద్యోగమే లక్ష్యంగా ఉంటే మాత్రం ఏదైనా కంపెనీలో ప్రాజెక్ట్ వర్క్‌ను పూర్తి చేయడం ప్రయోజనకరం. కొన్ని కంపెనీలు విద్యార్థులకు రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేసే అవకాశాన్ని ఇస్తున్నాయి. ఒక సూపర్వైజర్ పర్యవేక్షణలో ఇండిపెండెంట్ మాడ్యుల్స్‌పై పని చేసే అవకాశం కల్పిస్తున్నాయి. తద్వారా సంబంధిత రంగంలో వాస్తవంగా ఎదుర య్యే సవాళ్లను పరిశీలించే అవకాశం లభిస్తుంది. ఆఫర్ కంపెనీలోనే: ప్రస్తుతం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కారణంగా చాలా కాలేజీల్లోని విద్యార్థుల చేతిలో ప్రాజెక్ట్ వర్క్ కంటే ముందే జాబ్ ఆఫర్ లెటర్స్ ఉంటున్నాయి. ఇటువంటి విద్యార్థులు ఆఫర్ లెటర్ ఇచ్చిన కంపెనీలో ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయడం ప్రయోజనకరం. తద్వారా పని చేయబోయే కంపెనీలోని క్షేత్ర స్థాయి పరిస్థితులను అవగాహన చేసుకోవచ్చు. కొన్ని కంపెనీలు ప్లేస్మెంట్ ఆఫర్ ఇచ్చిన విద్యార్థులకు తమ కంపెనీలో ప్రాజెక్ట్ వర్క్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. కాబట్టి వీటిని కూడా సద్వినియోగం చేసుకోవాలి. సమగ్రంగా: సరైన ప్రాజెక్ట్‌ను ఎంచుకోవడంతోపాటు దాన్ని పూర్తి చేయడం అనేది కూడా కీలక అంశం. ఈ విషయంలో ప్రాజెక్ట్ గైడ్, సూపర్ వైజర్, ప్రొఫెసర్లు, సీనియర్ల సలహాలు తీసుకోవాలి. ప్రాజెక్ట్‌ను కొన్ని అంశాలకే పరిమితం చేయకుండా సమగ్రంగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్‌ను తీసుకుంటే.. ఆ సబ్జెక్ట్‌కు సంబంధించి ఏదో ఒక అంశానికి మాత్రమే అధిక శాతం మంది విద్యార్థులు పరిమితం అవుతున్నారు. తద్వారా ప్రాజెక్ట్ అసంపూర్తిగా మిగిలిపోతుంది. అలాకాకుండా ఒక అంశానికి సంబంధించి కీలకమైన డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్ వంటి అన్ని అంశాలను కవర్ చేసే విధంగా ప్రాజెక్ట్ వర్క్ ఉండాలి. ఎందుకంటే విద్యార్థి దశ నుంచి ఉద్యోగిగా అడుగుపెట్టడంతోనే టెక్నికల్‌గా అన్ని రకాల బాధ్యతలను చేపట్టే విధంగా నైపుణ్యాలను కలిగి ఉండాలని సాఫ్ట్వేర్ కంపెనీలు భావిస్తున్నాయి. ఇదే అంశాన్ని ఇంటర్వ్యూలో ఎక్కువగా పరిశీలిస్తున్నాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు వచ్చే కంపెనీలన్నీ సృజనాత్మకంగా ఆలోచించే విద్యార్థుల కోసం అన్వేషిస్తుంటాయి. నియామక ప్రక్రియకు సంబంధించి ఇంటర్వ్యూ దశ లేదా ప్రజెంటేషన్ దశలో రిక్రూటర్లు విద్యార్థుల్లో ఇదే నైపుణ్యాన్ని నిశితంగా పరిశీలిస్తుంటారు. అందరికీ భిన్నంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ సృజనాత్మక ఆలోచనతో ప్రాజెక్ట్ వర్క్‌ను పూర్తి చేస్తే ఉద్యోగావకాశాలు మరింత మెరుగవుతాయి. నిరంతర అధ్యయనం: ప్రాజెక్ట్ వర్క్ సమయంలో నిరంతర అధ్యయనం చేయాలి. పరిశ్రమలోని సంబంధిత రంగంలోని వాస్తవ పరిస్థితులను పరిశీలించాలి. అంకితభావంతో పనిచేయాలి. సమస్యలకు అక్కడి సీనియర్లకు పరిష్కార మార్గాలను చూపాలి. వాటన్నిటినీ నోట్స్ రూపంలో రాసుకోవాలి. ప్రాజెక్ట్‌ను పూర్తిచేసేందుకు సమష్టిగా కష్టపడాలి. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. సరికొత్త టెక్నాలజీ గురించి బృంద సభ్యులతో చర్చిస్తూ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. అందుకు సంబంధించిన సందేహాలుంటే బుక్స్, ప్రొఫెసర్ల సహాయంతో నివృత్తి చేసుకోవాలి. ప్రాజెక్ట్ వర్క్ సమయంలో చొరవ, పరిజ్ఞానం ఉన్న వారికి ఆ తర్వాత అదే సంస్థ ఉద్యోగం ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. ప్రజెంటేషన్: ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ప్రాజెక్ట్ గైడ్, ప్రొఫెసర్లను సంప్రదించి..టైటిల్ పేజీ, అబ్స్ట్రాక్ట్, అక్నాలెడ్జ్మెంట్స్, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ తదితర అంశాలను పొందుపరుస్తూ ప్రామాణిక నమూనాలో రిపోర్ట్‌ను సిద్ధంచేసి కళాశాలలో సమర్పించాలి. ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం ఒక ఎత్తయితే.. దాన్ని ప్రభావవంతంగా ప్రజెంట్ చేయడం మరో ఎత్తు. చేసిన ప్రాజెక్ట్‌కు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని బట్టి ప్రాజెక్ట్‌కు గ్రేడింగ్ లేదా వెయిటేజీ ఇస్తారు. కెరీర్లో దీనికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ప్రయోజనాలు ప్రస్తుతం కొన్ని రకాల కంపెనీలు ఉద్యోగుల నియామక ప్రక్రియలో నూతన ఒరవడిని పాటిస్తున్నాయి. ముఖ్యంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహించని ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీలు, సర్వీసెస్ కంపెనీలు ప్రాజెక్ట్ వర్క్‌లో విద్యార్థి చూపిన ప్రతిభ ఆధారంగా మాత్రమే ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఉద్యోగుల నియామక ప్రక్రియలో భాగంగా..విద్యార్థులకు తమ కంపెనీలో ప్రాజెక్ట్ చేసే అవకాశాన్ని కల్పిస్తాయి. ఈ ప్రాజెక్ట్ వర్క్‌లో విద్యార్థి ప్రతిభను మూల్యాంకనం చేసి ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తున్నాయి. ఈ మొత్తం ప్రక్రియ ‘ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్’ పేరుతో ప్రాచుర్యంలో ఉంది. కోర్ బ్రాంచ్ విద్యార్థులు ఆఫ్ క్యాంపస్ పద్ధతిలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే సమయంలో.. ఎంపిక ప్రక్రియలో ప్రాజెక్ట్ వర్క్ నిర్ణయాత్మక పాత్రను పోషిస్తుంది. కొన్ని సంస్థలు పూర్తిగా విద్యార్థులు నిర్వహించిన ప్రాజెక్ట్ వర్క్ ఆధారంగానే ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అంతగా లేని కాలేజ్ విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్ మీద ఎక్కువగా దృష్టి సారించాలి. చక్కటి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తే ఉద్యోగం సాధించే అవకాశాలు మెరుగవుతాయి. సబ్జెక్ట్‌పై పట్టు ఉన్నత విద్య దిశగా ఆలోచిస్తున్న విద్యార్థికి లాభం చేస్తుంది. కోర్సు పూర్తయ్యాక ఏ రంగంలో ప్రవేశించాలో నిర్ణయం తీసుకోవడానికీ దోహదపడుతుంది. సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్‌కు ఐదు సూత్రాలు 1. ప్రాజెక్ట్ వర్క్‌కు ఎటువంటి టాపిక్ ఎంచుకోవాలనే విషయంలో స్పష్టతతో ఉండాలి. ఉన్నత విద్య, ఉద్యోగం, ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలాధారంగా టాపిక్‌ను ఎంచుకోవాలి. 2. ప్రాజెక్ట్ వర్క్‌ను విజయవంతంగా పూర్తి చేయడంలో మెంటర్ పాత్ర కీలకం. ఎందుకంటే ఫ్రెషర్‌గా ప్రాజెక్ట్ వర్క్‌పై అంతగా అవగాహన ఉండదు. కాబట్టి ఈ అంశంలో మెంటర్ అనుభవం ఉపయుక్తంగా ఉంటుంది. 3. ప్రాజెక్ట్‌ను కొన్ని అంశాలకే పరిమితం కాకుండా ..ఆ అంశానికి సంబంధించి డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్ వంటి అన్ని అంశాలను కవర్ చేసే విధంగా ఉండాలి. 4. ప్రాజెక్ట్ వర్క్ సమయంలో నిరంతర అధ్యయనం చేయాలి. పరిశ్రమలోని వాస్తవ పరిస్థితులను పరిశీలించాలి. వాటన్నిటినీ నోట్స్ రూపంలో రాసుకోవాలి. 5. ప్రాజెక్ట్ వర్క్ పూర్తయిన తర్వాత టైటిల్ పేజీ, అబ్స్ట్రాక్ట్, అక్నాలెడ్జ్మెంట్స్, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ తదితర అంశాలను పొందుపరుస్తూ ప్రామాణిక నమూనాలో రిపోర్ట్‌ను సిద్ధంచేసి కళాశాలలో సమర్పించాలి. ఆన్లైన్ సోర్సెస్: ఐఈఈఈ వెబ్సైట్: www.ieee.org ఏసీఎం వెబ్సైట్: www.acm.org సైన్స్ డెరైక్ట్ వెబ్సైట్: www.sciencedirect.com ఇల్స్వేర్ వెబ్సైట్: www.elsevier.co.in