EPF
-
EPFO: 7.66 లక్షల కంపెనీలు.. 7.37 కోట్ల మందికి పీఎఫ్
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో సభ్యత్వం గడిచిన ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగింది. ఉద్యోగులకు చందా కట్టే కంపెనీల సంఖ్య 6.6 శాతం మేర పెరిగింది. దీంతో వీటి మొత్తం సంఖ్య 7.66 లక్షలకు చేరింది. అలాగే ఉద్యోగుల చేరికలు సైతం 7.6 శాతం పెరిగి ఈపీఎఫ్‌వో మొత్తం సభ్యుల సంఖ్య 7.37 కోట్లకు చేరినట్టు కేంద్ర కార్మిక శాఖ గణాంకాలు విడుదల చేసింది.2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికను ఈ నెల 8న జరిగిన ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ 109వ సమావేశం పరిగణనలోకి తీసుకున్నట్టు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. ఈపీఎఫ్‌వో కింద చందాలు జమ చేసే సంస్థలు 6.6 శాతం పెరిగి 7.66 లక్షలకు చేరాయి. చందాలు జమ చేసే సభ్యులు 7.6 శాతం పెరిగి 7.37 కోట్లుగా ఉన్నారు. మొత్తం 4.45 కోట్ల క్లెయిమ్‌లకు పరిష్కారం లభించింది.ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!2022–23లో ఇవి 4.13 కోట్లుగా ఉన్నాయి. కొత్త కారుణ్య నియామక ముసాయిదా విధానం, 2024ను సైతం ఎగ్జిక్యూటివ్ కమిటీ పరిగణనలోకి తీసుకున్నట్టు కార్మిక శాఖ ప్రకటించింది. ఐటీ, మెరుగైన పరిపాలనా, ఆర్థిక సంస్కరణలపై చర్చించినట్టు.. వచ్చే కొన్ని నెలల పాటు ప్రతి నెలా సమావేశమైన సంస్కరణల పురోగతిని సమీక్షించాలని నిర్ణయించనట్టు తెలిపింది. -
ఈపీఎఫ్ గరిష్ఠ వేతన పరిమితి పెంపు?
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించనుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్) ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితి(ఈపీఎఫ్ఓ వేజ్ సీలింగ్)ని పెంచాలని యోచిస్తోంది. ఈమేరకు త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నట్లు కొందరు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రూ.15 వేలుగా ఉన్న ఈ పరిమితిని రూ.21 వేలకు పెంచనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఒకవేళ అనుకున్న విధంగానే ఈ మేరకు నిర్ణయం తీసుకుంటే ఉద్యోగులకు మరింత సామాజిక భద్రత చేకూరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ప్రస్తుత విధానం ప్రకారం.. (ఈపీఎఫ్ఓ గరిష్ఠ వేతన పరిమితి: రూ.15,000)ఉద్యోగి ప్రాథమిక జీతం: నెలకు రూ.25,000ఎంప్లాయి కాంట్రిబ్యూషన్: రూ.25,000లో 12 శాతం= రూ.3,000యజమాని కాంట్రిబ్యూషన్: రూ.25,000లో 12 శాతం= రూ.3,000ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ కాంట్రిబ్యూషన్: నెలకు రూ.15,000(గరిష్ఠ పరిమితి)లో 8.33 శాతం = రూ.1,250ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్: నెలకు రూ.3,000 - రూ.1,250 = రూ.1,750ఇదీ చదవండి: ‘తను నా కోసమే పుట్టిందనిపించింది’ప్రతిపాదిత విధానం ప్రకారం.. (వేతన సీలింగ్: రూ.21,000)ఉద్యోగి ప్రాథమిక జీతం: నెలకు రూ.25,000ఎంప్లాయి కాంట్రిబ్యూషన్: రూ.25,000లో 12 శాతం= రూ.3,000యజమాని కాంట్రిబ్యూషన్: రూ.25,000లో 12 శాతం= రూ.3,000ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ కాంట్రిబ్యూషన్: నెలకు రూ.21,000(గరిష్ఠ పరిమితి)లో 8.33 శాతం = రూ.1,749ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్: నెలకు రూ.3,000 - రూ.1,749 = రూ.1,251కేంద్రం వేతన గరిష్ఠ పరిమితిలో మార్పులు తీసుకొస్తే గతంలో కంటే ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది. ఈపీఎఫ్ తగ్గుతుంది. -
వీపీఎఫ్..పన్ను రహిత వడ్డీ పరిమితి పెంపు?
స్వచ్ఛంద భవిష్య నిధి(వీపీఎఫ్)పై సమకూరే పన్ను రహిత వడ్డీ పరిమితిని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం రూ.2.5 లక్షల వరకు వీపీఎఫ్‌పై సమకూరే వడ్డీపై పన్ను మినహాయింపు ఉంది. ఈ పరిమితిని పెంచితే మరింత మందికి మేలు జరుగుతుందని, కాబట్టి ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఈ విషయం తెలిసిన వ్యక్తులు తెలిపారు.ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) ఆధ్వర్యంలోని స్వచ్ఛంద భవిష్య నిధి(వీపీఎఫ్) ద్వారా ఉద్యోగులు తమ డబ్బుపై అదనంగా వడ్డీ సమకూర్చుకోవచ్చు. ఈపీఎఫ్, వీపీఎఫ్‌కు ఒకే వడ్డీరేటు ఉంటుంది. దాంతో దీర్ఘకాలంలో మంచి రాబడి పొందవచ్చు. వీపీఎఫ్‌లో జమ చేసే నగదుకు సంబంధించి ఎలాంటి పరిమితులు లేవు.వీపీఎఫ్ గురించి కొన్ని విషయాలుఈ పథకం కోసం ఉద్యోగి ప్రత్యేకంగా కంపెనీ యాజమాన్యానికి లేఖ అందించాల్సి ఉంటుంది. కచ్చితంగా అందరు ఉద్యోగులు ఈ పథకంలో చేరాల్సిన నిబంధనేమీ లేదు. బ్యాంకు సేవింగ్స్ ఖాతా, కొన్ని బ్యాంకులు అందించే ఎఫ్డీ వడ్డీ కంటే మెరుగైన వడ్డీ ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలంలో మంచి రాబడులు అందుకోవచ్చు. భవిషత్తు అవసరాల కోసం మెరుగైన వడ్డీ కావాలని భావించే ఉద్యోగులు ఇందులో చేరవచ్చు.ఈ పథకంలో చేరిన వారు తమ ప్రాథమిక జీతంలో కట్ అవుతున్న 12 శాతం ఈపీఎప్ కంటే అధికంగా జమ చేసుకునే వీలుంది.ఇదీ చదవండి: ఆహార శుభ్రతకు ‘స్విగ్గీ సీల్’ఏటా జమ చేసే మొత్తం రూ.1.5 లక్షల వరకు ఉంటే సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది.ప్రస్తుతం ఈపీఎఫ్ వడ్డీ 8.15 శాతంగా ఉంది. ఇదే వడ్డీ వీపీఎఫ్‌కు వర్తిస్తుంది.ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత, లేదా పదవీ విరమణ చేసిన తర్వాత ఈ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. వైద్య అత్యవసరాలు, విద్య, వివాహాలు..వంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కూడా నిబంధనల ప్రకారం విత్‌డ్రా చేసుకోవచ్చు. -
EPFO: 18.53 లక్షల మందికి కొత్తగా పీఎఫ్
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో (ఈపీఎఫ్‌వో) ఆగస్టులో నికరంగా 18.53 లక్షల మంది కొత్త సభ్యులు జతయ్యారు. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఇది 9.07 శాతం అధికం. ఉద్యోగావకాశాలు, ఉద్యోగులకు లభించే ప్రయోజనాలపై అవగాహన పెరుగుతుండటం, ఈపీఎఫ్‌వో ప్రచార కార్యక్రమాలు మొదలైనవి ఇందుకు దోహదపడినట్లు కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.కొత్తగా చేరిన వారిలో 18–25 ఏళ్ల వయస్సు వారి వాటా గణనీయంగా ఉన్నట్లు పేర్కొంది. ఉద్యోగాల్లో తొలిసారి చేరేవారు, యువత సంఖ్య పెరుగుతుండటాన్ని ఇది సూచిస్తోందని వివరించింది. దాదాపు 13.54 లక్షల మంది ఉద్యోగాలు మారి, తిరిగి ఈపీఎఫ్‌లో చేరినట్లు పేర్కొంది.రాష్ట్రాలవారీగా చూస్తే నికరంగా కొత్తగా చేరిన సభ్యుల సంఖ్యను బట్టి మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. కర్ణాటక, తమిళనాడు, హర్యానా, ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి చేరిన వారి సంఖ్య తలో అయిదు శాతం పైగా ఉంది. -
ఈపీఎఫ్‌వో క్లెయిమ్ ప్రాసెసింగ్.. ఇప్పుడు మేలు!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌లో ఇటీవల గణనీయమైన పెరుగుదలను సాధించింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరులో ఇది సుమారు 30 శాతం పెరిగింది. దీనంతటికీ కారణం ఈపీఎఫ్‌వో ఇటీవల అమలు చేసిన భారీ సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్. ఇది దాని డిజిటల్ ప్లాట్‌ఫామ్ సామర్థ్యాన్ని మెరుగుపరిచింది.గతంలో క్లెయిమ్‌ల పరిష్కారం నెమ్మదిగా ఉండేది. దీంతో చందాదారులు, ప్రత్యేకించి అత్యవసర ఆర్థిక అవసరాల కోసం నిధులను ఉపసంహరించుకోవాల్సిన వారు ఇబ్బందులు పడేవారు. కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్తో ఇప్పుడది బాగా మెరుగుపడింది. ఈ వేగాన్ని కొనసాగించడానికి మరిన్ని హార్డ్‌వేర్ అప్గ్రేడ్లు, అదనపు సాఫ్ట్వేర్ మెరుగుదలలను కూడా ఈపీఎఫ్‌వో ప్లాన్ చేస్తోంది.ఇదీ చదవండి EPFO: కొత్త ప్రతిపాదన.. రిటైరయ్యాక భారీగా సొమ్ముసెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (C-DAC) అభివృద్ధి చేసిన కొత్త వ్యవస్థ క్లెయిమ్ తిరస్కరణలను తగ్గించడంలో కీలకపాత్ర పోషించింది. ఇటీవలి సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్ తర్వాత, క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగం, ఖచ్చితత్వం రెండింటిలోనూ మెరుగుదలను గుర్తించారు. దీంతోపాటు చందాదారులు ఉద్యోగాలు లేదా స్థానాలను మార్చినప్పటికీ, చెల్లింపు వ్యవస్థల క్రమబద్ధీకరణ, చందాదారుల రికార్డులను ఒకే చోట నిర్వహించే కేంద్రీకృత డేటాబేస్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇది రెండు నెలల్లో కార్యరూపం దాల్చనుంది. -
ఏ బ్యాంకు నుంచైనా ఈపీఎస్ పింఛను
న్యూఢిల్లీ: ఈపీఎఫ్‌వో నిర్వహణలోని ‘ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్’ (ఈపీఎస్) 1995 కింద దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు శాఖ నుంచి అయినా పింఛను పొందొచ్చని కేంద్ర కారి్మక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. వచ్చే జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నారు. ఈపీఎఫ్‌వో అత్యున్నత నిర్ణయాల మండలి అయిన ‘సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్’కు కారి్మక శాఖ మంత్రి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తుంటారు. ఈపీఎస్ 1995 పరిధిలోని ఉద్యోగులకు కేంద్రీకృత పింఛను చెల్లింపుల వ్యవస్థ(సీపీపీఎస్)కు ఆమోదం తెలిపినట్టు మాండవీయ ప్రకటించారు. దీని ద్వారా ఏ బ్యాంక్ శాఖ నుంచి అయినా పింఛను చెల్లింపులకు వీలుంటుంద న్నారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఆధునికీకరణలో సీపీపీఎస్ ఓ మైలురాయిగా అభివరి్ణంచారు. -
ఈటీఎఫ్ లేదా ఇండెక్స్ ఫండ్స్.. ఏది బెస్ట్?
ద్రవ్యోల్బణానికి దీటైన రాబడులు ఇవ్వడంలో షార్ట్ డ్యురేషన్ డెట్ ఫండ్స్, ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్లు ప్రభావవంతమైనవేనా? – జితేంద్రషార్ట్ డ్యురేషన్ డెట్ ఫండ్స్, ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్లు మంచి రాబడులను ఇవ్వగలవు. ఇవి ద్రవ్యోల్బణాన్ని మించి స్వల్ప రాబడులను ఇస్తాయి. అధిక రాబడుల కోసం ఈ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటే మరోసారి పునరాలోచించాల్సిందే.సాధారణంగా స్థిరాదాయ (ఫిక్స్డ్ ఇన్కమ్/డెట్) పథకాల్లో పెట్టుబడులు పెట్టడంలో ప్రధాన లక్ష్యాలు.. 1. పెట్టుబడిని కాపాడుకోవడం. 2. పెట్టుబడులకు స్థిరత్వాన్ని అందించడం. ఇవి ఊహించతగిన రాబడులు ఇవ్వగలవు. అలా కాకుండా ఫిక్స్డ్ ఇన్కమ్ ద్వారా గొప్ప రాబడులు ఆశిస్తున్నట్టు అయితే, అది రిస్కీ ఆప్షన్లలో పెట్టుబడి పెట్టడం అవుతుంది. కానీ, దీన్ని మేము సూచించం. పోర్ట్‌ఫోలియోలో డెట్ సాధనాలకు కేటాయింపుల లక్ష్యాన్ని ఇది నీరుగారుస్తుంది. ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడులు ఆశిస్తున్నట్టు అయితే అప్పుడు పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని ఈక్విటీలకు కేటాయించడాన్ని పరిశీలించొచ్చు.నేను నా రిటైర్మెంట్ అవసరాల కోసం 2040 వరకు ప్రతి నెలా రూ.25,000 చొప్పున ఇన్వెస్ట్ చేయగలను. ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్స్‌లో ఏది మెరుగైన ఆప్షన్ అవుతుంది? – వినాయక్ రావు భోలేఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు) ఏదో ఒక ఇండెక్స్‌కు అనుగుణంగా ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఉదాహరణకు సెన్సెక్స్, నిఫ్టీ 50. స్టాక్స్ మాదిరే ఇవి స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో ట్రేడ్ అవుతుంటాయి. ఈటీఎఫ్‌ల ద్వారా పెట్టుబడులు పెట్టడం ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అవుతుంది. ఈటీఎఫ్‌లు అన్నవి చాలా తక్కువ వ్యయాలతో కూడిన పెట్టుబడి సాధనాలు.మ్యూచువల్ ఫండ్స్‌లో వీటికి ప్రత్యామ్నాయం ఇండెక్స్ ఫండ్స్. ఈటీఎఫ్‌లలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) సాధ్యం కాదు. ఎందుకంటే ఇవి స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో ట్రేడ్ అవుతుంటాయి. అదే ఇండెక్స్ ఫండ్స్‌లో అయితే సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సిప్ ద్వారా అయితే పెట్టుడులు ప్రతి నెలా క్రమం తప్పకుండా వెళ్లేందుకు సాధ్యపడుతుంది. పెట్టుబడులు సులభంగా ఉండేందుకు ఇండెక్స్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇండెక్స్ ఫండ్స్‌లో సిప్ పెట్టుబడి వేతనానికి అనుగుణంగా ఏటా పెరిగేలా చూసుకోవడం మర్చిపోవద్దు. లార్జ్‌క్యాప్ విభాగంలో యాక్టివ్ ఫండ్స్‌తో పోల్చితే ఇండెక్స్ ఫండ్స్ స్థానం బలమైనది.ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఈపీఎఫ్ ఖాతాలో వ్యక్తిగత వివరాలు మార్చుకోండిలా..!
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) చందాదారులకు శుభవార్త! మీ పీఎఫ్ ఖాతాలో పేరు, జెండర్, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు..వంటి కీలక వివరాలు తప్పుగా ఉన్నాయా? అయితే ఇకపై వాటిని సవరించేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీనికోసం జాయింట్ డిక్లరేషన్‌ను మాత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆన్లైన్లోనే పూర్తి చేసుకోవచ్చు.ఏమిటీ జాయింట్ డిక్లరేషన్..ఈపీఎఫ్ చందాదారులు తమ వ్యక్తిగత వివరాలు మార్చాలనుకుంటే జాయింట్ డిక్లరేషన్ ఫారమ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగి పేరు, జెండర్, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, రిలేషన్, వైవాహిక స్థితి, జాయినింగ్ డేట్, లీవింగ్ డేట్, రీజన్ ఫర్ లీవింగ్, నేషనాలిటీ, ఆధార్ నంబర్.. వంటి 11 రకాల వివరాలు ఇందులో మార్చుకోవచ్చు. అయితే ఈ వివరాలను మార్చాలంటే చందాదారుడు, సంస్థ యజమాని ఇద్దరూ ఈ మార్పును ధ్రువీకరించాలి. ఈ ప్రక్రియ ఆన్లైన్నే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ డిక్లరేషన్ ఫారాన్ని పీఎఫ్ కమిషనర్‌కి పంపించాలి. దాని అనుసరించి చందాదారుల వివరాలు అప్డేట్ అవుతాయి.సవరణ ఇలా..చందాదారులు ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్ epfindia.gov.inకు వెళ్లాలి.హోం పేజీ టాప్‌లో ఎడమవైపు servicesపై క్లిక్ చేయాలి.For Employees అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.కిందకు స్క్రోల్ చేసి సర్వీసెస్ సెక్షన్లో Member UAN/ online Service(OCS/OTCP)పై క్లిక్ చేయాలి.కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో UAN, పాస్వర్డ్ వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.స్క్రీన్‌పై కనిపించే Manage ఆప్షన్‌ను ఎంచుకోగానే అందులో joint declaration ఆప్షన్ కనిపిస్తుంది.ఇదీ చదవండి: బ్యాంకులను హెచ్చరించిన ఆర్బీఐ గవర్నర్!మీ మెంబర్ ఐడీని ఎంటర్ చేసి అప్డేట్ చేయాలనుకుంటున్న వివరాలను తెలపాలి. సంబంధిత డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.వివరాలు సబ్మిట్ చేశాక యజమానికి (ఎంప్లాయర్) లాగిన్‌లో ఆ వివరాలు కనిపిస్తాయి. ఎంప్లాయర్ రిజిస్టర్డ్ ఇ-మెయిల్‌కు కూడా వెళ్తాయి.ఎంప్లాయర్ కూడా ఆయా వివరాలను ధ్రువీకరించిన తర్వాత సదరు జాయింట్ డిక్లరేషన్‌ను పీఎఫ్ కమిషనర్‌కు పంపించాలి. -
ఈపీఎఫ్ వడ్డీ చెల్లింపులు ప్రారంభం
సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం.. ఈపీఎఫ్ వడ్డీ సొమ్మును అవుట్గోయింగ్ సభ్యులకు ఇప్పటికే చెల్లిస్తున్నట్లు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తెలిపింది. దీంతో పదవీవిరమణ పొందిన సభ్యులు వారి ఫైనల్ పీఎఫ్ సెటిల్మెంట్లతో పాటు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ సొమ్మును పొందుతున్నారు.ఈపీఎఫ్ వార్షిక వడ్డీ రేటు సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత తదుపరి ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రకటిస్తారు. దీని ప్రకారం, ఈపీఎఫ్ సభ్యులకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి 8.25% వడ్డీ రేటును ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇదే విషయాన్ని గత మే నెలలో ఈపీఎఫ్ఓ తెలియజేసింది. సవరించిన రేట్ల ప్రకారం వడ్డీ సొమ్మును ఇప్పటికే అవుట్గోయింగ్ సభ్యులకు చెల్లించడం ప్రారంభించినట్లు ఈపీఎఫ్ఓ పేర్కొంది.ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా..ఉమంగ్ యాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునేందుకు..» యాప్‌ను డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకోండి» ఆప్షన్స్ నుంచి "EPFO"ని ఎంచుకుని, "View Passbook"పై క్లిక్ చేయండి» స్క్రీన్‌పై మీ పాస్‌బుక్, ఈపీఎఫ్ బ్యాలెన్స్ చూడటానికి UAN ఎంటర్ చేసి, ‘Get OTP’పై క్లిక్ చేయండిఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా.. » ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లోని ఎంప్లాయీ సెక్షన్‌కి వెళ్లి, "మెంబర్ పాస్‌బుక్"పై క్లిక్ చేయండి. » పీఎఫ్ పాస్‌బుక్‌ని చూడటానికి, మీ UAN, పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.» మీ UAN ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అయి ఉంటే 7738299899కి SMS పంపడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. -
రూ.61 కోట్లు రికవరీ చేసిన ఈపీఎఫ్ఓ
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ చెల్లించాల్సిన రూ.73 కోట్ల బకాయిలకుగాను రూ.61 కోట్లను రికవరీ చేసినట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తెలిపింది. మార్చి 2020 నుంచి మే 2021 వరకు ఈపీఎఫ్ఓకు చెల్లించాల్సిన ఎంప్లాయర్(కంపెనీ) వాటాలో కొంత మొత్తం వసూలైనట్లు పేర్కొంది.స్పైస్‌జెట్ సంస్థ ఉద్యోగుల వేతనాల్లో కట్ అవుతున్న ఈపీఎఫ్ఓ వాటాలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. మేనేజ్మెంట్ వాటాను ఈపీఎఫ్ఓకు జమ చేయడం లేదని, బకాయిపడిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని సంస్థకు నోటీసులు అందించారు. దాంతో తాజాగా మార్చి 2020 నుంచి మే 2021 వరకు బకాయిపడిన మొత్తం రూ.73 కోట్లలో రూ.61 కోట్లు రికవరీ అయినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. ఆలస్య చెల్లింపునకు సంబంధించిన వడ్డీ, జనవరి 2022 తర్వాత చెల్లించాల్సిన బకాయిలను కూడా అంచనా వేసినట్లు పేర్కొంది.ఈ సందర్భంగా స్పైస్‌జెట్ అధికారి ఒకరు మాట్లాడుతూ..‘ఈపీఎఫ్ సెక్షన్ 14బీ, ఇతర నిబంధనల చట్టం 1952 ప్రకారం విచారణ జరుగుతుంది. చట్టంలోని సెక్షన్ 7A కింద మిగిలిన కాలానికి (ఇప్పటి వరకు) ఎంత చెల్లించాలో లెక్కించి దాన్ని రికవరీ చేసే ప్రక్రియ మొదలైంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: అంబానీ చెల్లి.. భర్త చనిపోయినా కోట్ల కంపెనీకి ఛైర్‌పర్సన్‌గా..ఈపీఎఫ్ఓ పరిధిలోని ప్రతి సంస్థ ఎంప్లాయర్ వాటాను ఉద్యోగభవిష్య నిధిలో జమ చేయాలి. ప్రతి నెలా 15వ తేదీలోపు ఈపీఎఫ్ఓలో తమ రిటర్న్‌లను ఫైల్ చేయాలి. లేదంటే బకాయిపడిన తేదీ నుంచి ఏటా 12% చొప్పున వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది. -
ఈపీఎఫ్‌లో ఉన్న ఈ అదనపు బెనిఫిట్ గురించి తెలుసా?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రైవేటు సంస్థల్లో పని చేసే ఉద్యోగులు భవిష్యత్తు కోసం తమ కొంత మొత్తాన్ని ఇందులో జమ చేస్తుంటారు. దీనికి ఈపీఎఫ్ఓ వడ్డీ చెల్లిస్తుంది. అయితే దీంతోపాటు ఈపీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ అందించే అద్భుతమైన అదనపు ప్రయోజనం ఒకటుంది. అదేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..ఈపీఎఫ్ ఖాతాదారుల కోసం ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్ఐ) పథకాన్ని ఈపీఎఫ్ఓ 1976లో ప్రారంభించింది. ఈపీఎఫ్ఓ సభ్యుడు ఏ కారణం చేతనైనా మరణిస్తే, అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు. ఈ ఇన్సూరెన్స్ కవరేజీ పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. ఈడీఎల్ఐ స్కీమ్‌కు కంపెనీ కంట్రిబ్యూషన్ ఇస్తుంది.బీమా మొత్తాన్ని ఎలా నిర్ణయిస్తారంటే..బీమా మొత్తం గత 12 నెలల బేసిక్ జీతం, డీఏపై ఆధారపడి ఉంటుంది. బీమా కవరేజీ క్లెయిమ్ చివరి మూల వేతనం + డీఏకు 35 రెట్లు ఉంటుంది. ఇది కాకుండా, రూ .1,75,000 వరకు బోనస్ మొత్తాన్ని కూడా చెల్లిస్తారు.ఈపీఎఫ్ఓ సభ్యుడు ఉద్యోగంలో ఉన్నంత కాలం మాత్రమే ఈడీఎల్ఐ స్కీమ్ పరిధిలోకి వస్తారు. ఉద్యోగాన్ని విడిచిపెట్టిన తరువాత, అతని కుటుంబం, వారసులు, నామినీలు దానిని క్లెయిమ్ చేయలేరు. ఈపీఎఫ్ఓ సభ్యుడు 12 నెలలు నిరంతరాయంగా పనిచేస్తుంటే, ఉద్యోగి మరణించిన తర్వాత, నామినీకి కనీసం రూ .2.5 లక్షల ప్రయోజనం లభిస్తుంది.ఉద్యోగి పనిచేసేటప్పుడు అనారోగ్యం, ప్రమాదం లేదా సహజ మరణం సంభవిస్తే ఈడీఎల్ఐ క్లెయిమ్ చేయవచ్చు. ఈడీఎల్ఐ పథకం కింద నామినీలుగా ఎవరినీ పేర్కొనకపోతే మరణించిన ఉద్యోగి జీవిత భాగస్వామి, అవివాహిత కుమార్తెలు, మైనర్ కొడుకులు, కుమారులను కవరేజీని లబ్ధిదారులుగా పరిగణిస్తారు.ఎలా క్లెయిమ్ చేయాలంటే..ఈపీఎఫ్ చందాదారు అకాల మరణం చెందితే, వారి నామినీ లేదా చట్టబద్ధమైన వారసులు బీమా కవరేజీ కోసం క్లెయిమ్ చేయవచ్చు. ఇందుకోసం నామినీ వయస్సు కనీసం 18 ఏళ్లు ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే తల్లిదండ్రులు వారి తరఫున క్లెయిమ్ చేసుకోవచ్చు. క్లెయిమ్ చేసేటప్పుడు డెత్ సర్టిఫికేట్, వారసత్వ ధ్రువీకరణ పత్రం వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. మైనర్ సంరక్షకుడి తరఫున క్లెయిమ్ చేస్తుంటే గార్డియన్ షిప్ సర్టిఫికెట్, బ్యాంకు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. -
ఈపీఎస్‌లో మార్పులు.. పదేళ్ల సర్వీసు లేని వారికి నష్టం
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)లో చేరి పదేళ్లు పూర్తి కాలేదా..? ఉద్యోగుల పింఛను స్కీం (ఈపీఎస్)లో జమైన డబ్బు తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకు వచ్చే నగదు కొంతమేర తగ్గనుంది. ఈపీఎస్ ముందస్తు ఉపసంహరణ చెల్లింపుల్లో ఈపీఎఫ్‌వో మార్పులు తీసుకొచ్చింది. ఈపీఎఫ్ పరిధిలోని సంస్థలో పని చేసిన సర్వీసును ఇప్పటివరకు ఏడాది పరంగా లెక్కగట్టేవారు. తాజాగా మార్చిన నిబంధనల ప్రకారం సంస్థలో ఎన్ని నెలలు పనిచేస్తే అన్ని నెలలకే లెక్కించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఈపీఎస్ చట్టం, 1995 టేబుల్-డీలో కార్మికశాఖ సవరణలు చేసింది.ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం..ఉద్యోగి ఏదేని సంస్థలో పనిచేస్తూ కనీసం పదేళ్ల ఈపీఎస్ సర్వీసు పూర్తి చేస్తేనే వారికి 58 ఏళ్లు వచ్చాక నెలవారీ పింఛను వస్తుంది. తొమ్మిదేళ్ల ఆరు నెలల సర్వీసు పూర్తి చేసినా పదేళ్లుగానే పరిగణిస్తారు. అంతకు తక్కువుంటే పింఛను రాదు. పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఈపీఎస్ నిల్వలను చెల్లించదు. కనీస సర్వీసు లేనివారు మాత్రమే ఈ నగదు తీసుకునేందుకు అర్హులు.ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు పదేళ్ల సర్వీసుకంటే ముందే ఈపీఎస్ మొత్తాన్ని ఉపసంహరిస్తున్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన కొంతమంది రెండు, మూడేళ్లకో సంస్థ మారుతూ అప్పటికే ఈపీఎస్‌లో జమైన మొత్తాన్ని వెనక్కి తీసుకుంటున్నారు. అయితే బదిలీ, ఉద్యోగం మానేసిన కారణాలతో డబ్బులను వెనక్కి తీసుకోవద్దని, మరో సంస్థకు ఆ సర్వీసును పూర్తిగా బదిలీ చేసుకుంటే పింఛను అర్హత పొందడంతోపాటు ఎక్కువ పింఛను వస్తుందని ఈపీఎఫ్‌వో అధికారులు చెబుతున్నారు.ఇదీ చదవండి: నెలలో రెట్టింపైన ఉల్లి ధర.. ఎగుమతి సుంకంపై మంత్రి ఏమన్నారంటే..ఎలా లెక్కిస్తారంటే..ఉద్యోగి మూలవేతనం నుంచి 12 శాతం ఈపీఎఫ్ ఖాతాకు డబ్బు జమవుతుంది. పనిచేస్తున్న సంస్థ అంతేమొత్తంలో 12 శాతం వాటాను ఈపీఎఫ్‌కు చెల్లిస్తుంది. అయితే సంస్థ చెల్లించే 12 శాతంలో 8.33 శాతం ఈపీఎస్‌లోకి, 3.67 శాతం ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది. 2014 నుంచి ఈపీఎఫ్‌వో గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేలకు పెంచారు. దాని ప్రకారం సంస్థ చెల్లించే 12 శాతం వాటా (రూ.1,800)లో 8.33 శాతం అంటే రూ.1,250 ఈపీఎస్‌కు వెళ్తుంది. ఉద్యోగి పదేళ్ల సర్వీసుకు ముందే రాజీనామా చేసినా, రిటైర్డ్ అయినా ఈపీఎస్‌ను వెనక్కి తీసుకోవాలని అనుకుంటే అతని సర్వీసును పరిగణనలోకి తీసుకుని ఎంత చెల్లించాలో లెక్కించేవారు. ఒకవేళ మూలవేతనం, డీఏ కలిపి రూ.15000 ఉందనుకుందాం. ఉద్యోగి ఏడేళ్ల ఏడు నెలలు పని చేశాడనుకుంటే గతంలోని నిబంధన ప్రకారం ఏడేళ్ల ఏడు నెలలను ఎనిమిదేళ్లుగా పరిణించేవారు. రాజీనామా లేదా ఉద్యోగ విరమణ చేసినప్పుడు మూలవేతనం రూ.15000 ఉన్నందున ఈపీఎస్ టేబుల్-డీ ప్రకారం ఎనిమిదేళ్ల కాలానికి 8.22 నిష్పత్తి చొప్పున చెల్లించేవారు. అంటే రూ.15,000 X 8.22 చొప్పున రూ.1,23,300 వచ్చేవి. తాజా నిబంధనల ప్రకారం ఏడేళ్ల ఏడు నెలలు అంటే 91 నెలలు అవుతుంది. 91 నెలల కాలానికి నిష్పత్తి 7.61 అవుతుంది. అంటే రూ.15000 X 7.61 లెక్కన రూ.1,14,150 చెల్లిస్తారు. -
త్వరలో ఈపీఎఫ్ వడ్డీ.. మీ ఖాతాలో ఎంతుంది.. ఎంతొస్తుంది?
EPFO Interest Rate: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అనేది ఉద్యోగుల రిటైర్మెంట్ స్కీమ్. చాలా మంది ఉద్యోగులు తమ జీతంలో కొంత మొత్తాన్ని ఇందులో దాచుకుంటారు. కంపెనీల యాజమాన్యాలు కూడా ఉద్యోగుల తరఫున కొంత మొత్తాన్ని జమ చేస్తాయి.ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద రూ.1.50 లక్షల వరకు డిపాజిట్లకు పన్ను మినహాయింపు ఉంటుంది. దీనిపై ఈపీఎఫ్‌వో ఏటా వడ్డీని చెల్లిస్తుంది.వడ్డీ ఎంతొస్తుందో తెలుసుకోండి..ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ) ప్రకారం.. ఈ ఏడాది జూలై-ఆగస్టు నాటికి అన్ని ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలకు వడ్డీ జమ అవుతుంది. ఈ నేపథ్యంలో మీ ఈపీఎఫ్ ఖాతాలో వడ్డీ రేటును ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి.. మీ ఈపీఎఫ్ ఖాతాలో రూ.1 లక్ష, రూ.3 లక్షలు, రూ.5 లక్షల డిపాజిట్లు ఉంటే ఎంత రాబడి వస్తుందో ఇక్కడ తెలియజేస్తున్నాం..వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) నిర్ణయిస్తుంది. ఈ సంవత్సరానికి ఇది 8.25 శాతంగా ఉంటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.15 శాతంగా ఉంది. అంటే ప్రస్తుత సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాదారులకు వారి ఖాతాలపై ఎక్కువ వడ్డీ లభిస్తుంది.మీ ఈపీఎఫ్ ఖాతాలో రూ.1 లక్ష ఉంటే దానిపై 8.25 శాతం వడ్డీ పొందితే ఏడాదికి మీ వడ్డీ రూ.8,250 అవుతుంది.అదే రూ.3 లక్షలు ఉన్నట్లయితే రూ.24,500 వడ్డీ వస్తుంది. ఒక వేళ రూ.5 లక్షలు ఉంటే మీకు వచ్చే వడ్డీ రూ.41,250 అవుతుంది.పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా..⇒ ఉమాంగ్ యాప్ లేదా ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.⇒ ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో లాగిన్ అవ్వండి⇒ ఈ-పాస్‌బుక్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.⇒ ఇది మిమ్మల్ని మరొక స్క్రీన్కు తీసుకువెళుతుంది. ఇక్కడ మీ యూఏఎన్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ నమోదు చేయాలి.⇒ విజయవంతంగా లాగిన్ అయిన తర్వాత, పాస్‌బుక్ కోసం మెంబర్ ఐడీ ఆప్షన్‌ను ఎంచుకోండి.⇒ పాస్‌బుక్ పీడీఎఫ్ ఫార్మాట్లో లభిస్తుంది. నిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
ఈపీఎఫ్ కొత్త రూల్స్.. వాటి అప్లోడ్ తప్పనిసరి కాదు!
EPF New rules: ఆన్లైన్లో క్లెయిమ్ దరఖాస్తు చేసేవారికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఊరట కల్పించింది. దరఖాస్తులో భాగంగా చెక్ లీఫ్, అటెస్టెడ్ బ్యాంక్ పాస్‌బుక్ చిత్రాలను అప్లోడ్ చేయవలసిన అవసరాన్ని సడలించినట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది.ఆన్లైన్లో దాఖలు చేసిన క్లెయిమ్‌ల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి, క్లెయిమ్‌ను ఆన్లైన్లో ఫైల్ చేసినప్పుడు చెక్ లీఫ్/అటెస్టెడ్ బ్యాంక్ పాస్‌బుక్ చిత్రం అప్లోడ్ చేయని కారణంగా తిరస్కరణకు గురయ్యే క్లెయిమ్‌ల సంఖ్యను తగ్గించడానికి ఈ చర్య దోహదపడుతుంది.మరి క్లెయిమ్ వెరిఫై ఎలా?చెక్ లీఫ్/అటెస్టెడ్ బ్యాంక్ పాస్‌బుక్ చిత్రాలు అప్లోడ్ చేయని పక్షంలో క్లెయిమ్ ఖచ్చితత్వాన్ని ధ్రువీకరించడానికి ఈపీఎఫ్‌వో అదనపు ధ్రువీకరణ పద్ధతులను ఉపయోగిస్తుంది. వీటిలో ఇవి ఉండవచ్చు..ఆన్లైన్ బ్యాంక్ కేవైసీ వెరిఫికేషన్: మీ బ్యాంక్ లేదా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కేవైసీ వివరాలను నేరుగా తనిఖీ చేస్తుంది.డీఎస్సీ ద్వారా కంపెనీ వెరిఫికేషన్: డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ (డీఎస్సీ) ఉపయోగించి మీ బ్యాంకు ఖాతా వివరాలను మీ కంపెనీ ధ్రువీకరించవచ్చు.సీడెడ్ ఆధార్ నంబర్ వెరిఫికేషన్: మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ నంబర్‌ను యూఐడీఏఐ ధ్రువీకరిస్తుంది. -
ఇకపై రూ.1 లక్ష విత్‌డ్రా చేసుకోవచ్చు.. పీఎఫ్‌లో కీలక మార్పు
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ( EPFO ) చందాదారుల నగదు ఉపసంహరణ విషయంలో కీలక మార్పులు చేసింది. వైద్య ఖర్చుల కోసం చేసే 68జే క్లెయిమ్‌ల అర్హత పరిమితిని రూ. 50,000 నుంచి రూ.1 లక్షకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈపీఎఫ్‌వో కొత్త మార్పు ప్రకారం.. చందాదారులు తమ వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వైద్య చికిత్స ఖర్చుల కోసం ఇకపై రూ.1 లక్ష వరకూ ఉపసంహరించుకోవచ్చు. నెల అంతకంటే ఎక్కువ రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నా, ఆపరేషన్లు చేయించుకున్నా క్లెయిమ్ చేయొచ్చు. పక్షవాతం, టీబీ, క్షయ, క్యాన్సర్, గుండె సంబంధిత చికిత్స కోసం కూడా నగదు విత్‌డ్రాకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. లక్ష పరిమితికి లోబడి ఉద్యోగుల ఆరు నెలల బేసిక్ వేతనంతోపాటు డీఏ లేదా ఈపీఎఫ్‌లో ఉద్యోగి వాటా వడ్డీతో సహా ఏది తక్కువైతే అంత వరకూ మాత్రమే ఉపసంహరించుకోవడానికి క్లెయిమ్ చేయడానికి వీలుంటుంది. ఇందు కోసం ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్లు లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చు. -
EPFO Update: భారీగా పెరిగిన ఉద్యోగులు
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో సభ్యులు భారీగా పెరిగారు. 2023 నవంబర్‌లో నికరంగా 13.95 లక్షల మంది సభ్యులను చేర్చుకున్నట్లు ఈపీఎఫ్‌వో తాజాగా విడుదల చేసిన తాత్కాలిక పేరోల్ డేటా ద్వారా వెల్లడించింది. ఇది మునుపటి ఏడాదిఇదే కాలంలో చేరికల కంటే ఎక్కువని తెలుస్తోంది. 7.36 లక్షల మంది కొత్తవారు 2023 నవంబర్‌లో దాదాపు 7.36 లక్షల మంది కొత్త సభ్యులు నమోదు చేసుకున్నారని ఈపీఎఫ్‌వో డేటా సూచిస్తోంది. కొత్తగా చేరిన సభ్యులలో 18-25 సంవత్సరాల వయస్సు గలవారు 57.30 శాతం మంది ఉన్నారు. అంటే పెద్ద సంఖ్యలో శ్రామిక శక్తి సంఘటిత రంగంలో ప్రవేశించింది. సుమారు 10.67 లక్షల మంది సభ్యులు నిష్క్రమించినా మళ్లీ ఈపీఎఫ్‌వోలో చేరినట్లు పేరోల్ డేటా ప్రతిబింబిస్తోంది. 1.94 లక్షల మంది మహిళలు జెండర్‌వారీగా పేరోల్ డేటాను పరిశీలిస్తే 2023 నవంబర్‌లో చేరిన మొత్తం 7.36 లక్షల మంది కొత్త సభ్యులలో దాదాపు 1.94 లక్షల మంది మహిళలు ఉన్నారు. అలాగే ఆ నెలలో నికరంగా మహిళా సభ్యుల చేరిక దాదాపు 2.80 లక్షలకు చేరుకుంది. నికర చందాదారుల చేరికలో నికర మహిళా సభ్యుల శాతం 20.05 శాతంగా ఉంది. ఇది 2023 సెప్టెంబరు కంటే అధికం. సంఘటిత రంగ శ్రామిక శక్తిలో మహిళా ఉద్యోగుల భాగస్వామ్యాన్ని ఇది తెలియజేస్తోంది. -
అక్టోబర్‌లో భారీగా ఉపాధి
న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబర్‌లో భారీగా ఉపాధి కల్పన నమోదైంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్వహిస్తున్న ఈపీఎఫ్ పథకంలో 15.29 లక్షల మంది సభ్యులుగా చేరారు. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 18.2 శాతం మందికి అదనంగా ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. అక్టోబర్ నెలకు సంబంధించి పేరోల్ గణాంకాలను కేంద్ర కారి్మక శాఖ బుధవారం విడుదల చేసింది. 7.72 లక్షల మంది కొత్త సభ్యులు నికరంగా చేరినట్టు తెలుస్తోంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు ఇందులో 6 శాతం వృద్ధి నమోదైంది. నికర సభ్యుల చేరిక 15.29 లక్షలుగా ఉంది. కొత్తగా చేరిన వారిలో 58.60 శాతం మంది 18–25 ఏళ్ల వయసులోని వారు. అంటే సంఘటిత రంగంలో వీరంతా మొదటిసారి ఉపాధి పొందిన వారని తెలుస్తోంది. ఇక 11.10 లక్షల మంది ఒక సంస్థలో మానేసి మరో సంస్థలో చేరారు. వీరు ఆన్లైన్లో తమ ఈపీఎఫ్లను బదిలీ చేసుకున్నారు. ఈపీఎఫ్‌వో నుంచి వైదొలగిన సభ్యుల సంఖ్య గడిచిన 12 నెలల్లోనే తక్కువగా ఉంది. మహిళా సభ్యులు 3 లక్షలు: 7.72 లక్షల కొత్త సభ్యుల్లో 2.04 లక్షల మంది మహిళలు ఉన్నారు. అక్టోబర్ నెలకు నికరంగా చేరిన మహిళా సభ్యుల సంఖ్య 3.03 లక్షలుగా ఉంది. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలో పోల్చి చూస్తే 15 శాతం వృద్ధి కనిపించింది. రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 22 శాతం మంది సభ్యులు చేరారు. హోటళ్లు, టీ విక్రయ కేంద్రాలు, ట్రేడింగ్, షాపులు, కెమికల్స్ కంపెనీలు, జీవత బీమా సంస్థల్లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. -
ఎన్పీఎస్, ఈపీఎఫ్ - రెండింటిలో ఏది బెస్ట్ అంటే?
నాకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాల పెట్టుబడులు ఉండగా, వీటిని విక్రయించాను. ఈ లాభం లక్షలోపు ఉంది. దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్షలోపు ఉంటే పన్ను చెల్లించక్కర్లేదని విన్నాను. అయితే, ఈ లాభాలను ఆదాయపన్ను రిటర్నుల్లో వెల్లడించాలా? అవసరం లేదా? – గురుమూర్తి మీ వార్షికాదాయం ఆదాయపన్ను వర్తించే శ్లాబులో ఉంటే తప్పకుండా రిటర్నులు వేయాల్సి ఉంటుంది. రిటర్నులు దాఖలు చేయాల్సిన ప్రతి ఒక్కరూ పన్ను పరిధిలోకి రాని మూలధన లాభం ఉన్నప్పటికీ దాన్ని రిటర్నుల్లో వెల్లడించాల్సిందే. లిస్టెడ్ కంపెనీల్లో నేరుగా పెట్టుబడులు కలిగినా లేదా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను ఏడాదికి మించి కలిగి ఉంటే, వాటిపై వచ్చే లాభాన్ని దీర్ఘకాల మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ)గా పేర్కొంటారు. ఒక ఆర్థిక సంవత్సరంలో దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్ష వరకు ఉంటే పన్ను లేదు. అంతకుమించిన లాభం వస్తే, ఆ మొత్తంపై 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్) ఆధారంగా మీరు దాఖలు చేయాల్సిన వార్షిక రిటర్నుల పత్రాల్లో ఈ వివరాలు ముందుగానే నింపి ఉంటాయి. కనీస ఆదాయపన్ను మినహాయింపు పరిధిలోనే ఆదాయం ఉంటే, పన్ను వర్తించని మూలధన లాభాలను వెల్లడించక్కర్లేదు. ఆదాయపన్ను పాత విధానం కింద సీనియర్ సిటిజన్లు అయితే (60 ఏళ్లు నిండిన) వార్షికాదాయం రూ.3 లక్షలు ప్రాథమిక పన్ను మిహాయింపు పరిమితిగా ఉంది. 80 ఏళ్లు నిండిన వారికి ఇది రూ.5లక్షలుగా ఉంది. మిగిలిన వారికి రూ.2.5 లక్షలుగా ఉంది. నూతన పన్ను విధానంలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఆదాయపన్ను మినహాయింపు కనీస పరిమితి రూ.2.5 లక్షలుగానే ఉంది. వార్షిక ఆదాయ మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలుగా ఉన్నప్పటికీ, వాస్తవ ఆదాయం ఇంతకంటే తక్కువగా ఉన్న వారు మూలధన లాభాలు (స్వల్పకాల, దీర్ఘకాల) కలిగి ఉంటే, ఆ మొత్తాన్ని కనీస పరిమితి కింద భర్తీ చేసుకోవచ్చు ఉదాహరణకు వార్షికాదాయం రూ.1.8 లక్షలుగానే ఉండి, మూలధన లాభం రూ.లక్ష వచ్చి ఉంటే, అప్పుడు బేసిక్ పరిమితిలో మిగిలిన రూ.70వేలను భర్తీ చేసుకోవచ్చు. ఇది పోను మిగిలిన రూ.30వేలపైనే మూలధన లాభాల పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఇలా కాకుండా మీ ఆదాయం రూ.2.5 లక్షలకు పైన ఉంటే, అప్పుడు మూలధన లాభాలను రిటర్నుల్లో వెల్లడించి నిబంధనల కింద పన్ను చెల్లించాల్సిందే. ప్రస్తుతం నేను పనిచేస్తున్న సంస్థలో నా నెలవారీ వేతనం నుంచి ఈపీఎఫ్ పథకానికి చందాలు వెళుతున్నాయి. నేను వచ్చే ఏడాది నేను పదవీ విమరణ తీసుకోబోతున్నాను. పీఎఫ్ నిధి సుమారు రూ.50 లక్షలుగా ఉంటుంది. ఈ సమయంలో ఎన్పీఎస్కు మారేందుకు కార్యాలయం నాకు ఆప్షన్ ఇచ్చింది. మరి నేను ఎన్పీఎస్కు మారాలా? అది నాకు ప్రయోజనమేనా? – రాజేష్ కుమార్ భాసిన్ రిటైర్మెంట్ ప్రణాళిక కోసం ఎన్పీఎస్, ఈపీఎఫ్ రెండూ ముఖ్యమైన పథకాలుగా ఉన్నాయి. ఈపీఎఫ్ అనేది మీ వేతనం నుంచి తప్పకుండా మినహాయించే ప్రావిడెంట్ ఫండ్ ఆప్షన్. రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకోవడమే ఇందులోని ఉద్దేశం. పదవీ విమరణ సమయంలో చేతికి అందే మొత్తంపై పన్ను ఉండదు. ఎన్పీఎస్ అనేది స్వచ్ఛంద పథకం. పదవీ విరమణ నిధి ఏర్పాటుకు ఇది కూడా ఒక సాధనం. మీరు మరో ఏడాదిలో రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. ఈపీఎఫ్ ద్వారా ఇప్పటికే నిధిని సమకూర్చుకున్నారు. కనుక ఈ సమయంలో ఎన్పీఎస్కు మారడం వల్ల వచ్చే అదనపు ప్రయోజనం ఏమీ ఉండదు. వేచి చూసి రిటైర్మెంట్ తర్వాత వచ్చే ఈపీఎఫ్ నిధిని మీ అవసరాలకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేసుకోవడం సరైనది. పదవీ విరమణ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం కోరుకునేట్టు అయితే, మీ ఉద్దేశ్యాలకు అనుగుణంగా సాధనాలను ఎంపిక చేసుకోవాలి. క్రమం తప్పకుండా ఆదాయం కోరుకోకపోతే అప్పుడు ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు. స్వచ్ఛందంగా అయినా ఎన్పీఎస్ ఖాతాను 70 ఏళ్ల వరకు తెరిచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
వేతన జీవులకు షాక్.. తగ్గనున్న పీఎఫ్ వడ్డీ!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF)లో డబ్బులు దాచుకునే ఉద్యోగులకు చేదువార్త. రానున్న రోజుల్లో పీఎఫ్‌పై వడ్డీ తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగుల భవిష్యనిధిపై ఇస్తున్న వడ్డీ రేట్లను పునఃపరిశీలించాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించిందని ఆర్టీఐ సమాచారం ఆధారంగా ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ మిగులును అంచనా వేసిన తర్వాత కూడా నష్టాన్ని చవిచూసింది. రూ. 449.34 కోట్ల మిగులు ఉంటుందని అనుకున్నప్పటికీ రూ. 197.72 కోట్ల లోటును ఎదుర్కొంది. దీంతో పీఎఫ్‌పై ఇస్తున్న వడ్డీ రేట్లను పునఃపరిశీలించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈపీఎఫ్ఓ 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.15 శాతంగా నిర్ణయించింది. అయితే నష్టాలను దృష్టిలో ఉంచుకుని, వడ్డీ రేటును పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. పీఎఫ్‌పై అధిక వడ్డీ రేట్లను తగ్గించి మార్కెట్ రేట్లతో సమానంగా తీసుకురావాల్సిన అవసరం ఉందంది. ప్రస్తుతం పీఎఫ్‌పై వచ్చే వడ్డీని మార్కెట్‌తో పోల్చితే కాస్త ఎక్కువే. చాలా పొదుపు పథకాల్లో వడ్డీ పీఎఫ్‌పై చెల్లించే వడ్డీ కంటే తక్కువగానే ఉంది.ఈ కారణంగానే పీఎఫ్ వడ్డీని 8 శాతం దిగువకు తగ్గించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ చాలా కాలంగా వాదిస్తోంది. దీంతో పీఎఫ్‌పై వడ్డీని ఎప్పకప్పుడు తగ్గిస్తూ వస్తున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్‌పై వడ్డీ రేటును 8.80 శాతం నుంచి 8.70 శాతానికి తగ్గించారు. కార్మిక సంఘాల నిరసనతో మళ్లీ 8.80 శాతానికి పెంచారు. ఆ తర్వాత పీఎఫ్‌పై వడ్డీ రేట్లు తగ్గుతూ 2021-22లో 8.10 శాతానికి తగ్గాయి. 2022-23లో ఇది 8.15 శాతానికి స్వల్పంగా పెరిగింది. కోట్లాది మంది ఉద్యోగుల సామాజిక భద్రతకు పీఎఫ్ అతిపెద్ద ఆధారం. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ చందాదారుల సంఖ్య 6 కోట్లకు పైగా ఉంది. -
ఈపీఎఫ్‌వో అలర్ట్: వివరాల అప్డేషన్కు కొత్త మార్గదర్శకాలు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యుల ప్రొఫైల్ అప్డేషన్ ప్రక్రియకు సంబంధించి కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ను తీసుకొచ్చింది. ఈ మేరకు తాజాగా ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం, ఈపీఎఫ్ సభ్యులు వారి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను అప్డేట్ చేసుకోవడానికి జాయింట్ డిక్లరేషన్ల ప్రాసెసింగ్‌లో ఎస్ఓపీ సహాయం చేస్తుంది. అప్డేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు వివరాల నమోదులో అవకతవకలను నివారించేందుకు ఈ కొత్త ప్రక్రియను ఈపీఎఫ్ఓ తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఈపీఎఫ్‌వో డేటాబేస్‌లో అసంపూర్ణంగా లేదా సరిపోలని విధంగా ఉన్న వివరాల అప్డేషన్ కోసం కాగితాల ద్వారా సమర్పించే జాయింట్ డిక్లరేషన్ విధానం ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇందుకు చాలా సమయం పడుతోంది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కొత్త విధానానం (ఎస్ఓపీ) సహాయపడుతుందని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. అప్డేషన్ వివరాలు, పరిమితులు ప్రొఫైల్స్ సక్రమంగా లేకపోవడంతో తరచూ తిరస్కరణలు, కొన్నిసార్లు అవకతవకలకు సైతం దారితీసే అవకాశం ఉంటోంది. పేరు, జెండర్, పుట్టిన తేదీ, తండ్రి పేరు/తల్లి పేరు, సంబంధ స్థితి, ఆరోగ్య స్థితి, ఉద్యోగంలో చేరిన తేదీ, నిష్క్రమించడానికి కారణం, నిష్క్రమించిన తేదీ, జాతీయత, ఆధార్ నంబర్ తదితర వివరాల్లో డేటా సరిపోలకపోవడం వంటి కారణాల వల్ల క్లెయిమ్ సెటిల్మెంట్లలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పైన పేర్కొన్న 11 రకాల వివరాల్లో సవరణలను ఈపీఎఫ్‌వో సభ్యులు చేసుకోవచ్చు. కొత్త ఎస్ఓపీ ప్రకారం.. వీటిని చిన్న, పెద్ద మార్పులుగా వర్గీకరించారు. అలాగే ఈ వివరాలను ఎన్నిసార్లు అప్డేషన్ చేసుకోవచ్చన్న దానిపై కూడా పరిమితిని విధించింది ఈపీఎఫ్‌వో. చిన్న అభ్యర్థనలు ఏడు రోజుల్లో పెద్ద అప్డేషన్లు 15 రోజుల్లో పూర్తయ్యే చర్యలు చేపట్టింది. అప్డేషన్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి దశలోనూ సభ్యులకు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. అప్డేషన్ ప్రక్రియతో పాటు, ఇందుకు అవసరమైన పత్రాలను సర్క్యులర్‌లో పేర్కొన్నారు. పేరు, జెండర్ అప్డేట్ చేయడానికి ఆధార్ కార్డ్ తప్పనిసరి. అగానే సభ్యులు మరణించిన సందర్భంలో మరణ ధ్రువీకరణ పత్రం కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. -
పీఎఫ్ వడ్డీ డబ్బులు ఎప్పుడు పడతాయి? ఈపీఎఫ్ఓ ఏం చెప్పింది?
వేతన జీవులు డబ్బులు పొదుపు చేసుకునే ప్రావిడెంట్ ఫండ్ (PF)లో డిపాజిట్ల వడ్డీ రేటును 8.15 శాతానికి పెంచాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సిఫార్సును ప్రభుత్వం జులై 24న ఆమోదించింది. ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచి చాలా మంది సభ్యులు తమ పీఎఫ్ ఖాతాలో వడ్డీ మొత్తం ఎప్పుడు జమవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విటర్లో ఓ చందాదారు 2022-23 ఆర్థిక సంవత్సారానికి సంబంధించిన వడ్డీ ఎప్పుడు జమవుతుందని అడిగారు. దీనికి ఈపీఎఫ్ఓ స్పందిస్తూ, ప్రాసెస్ జరుగుతోందని, అతి త్వరలో వడ్డీ సొమ్ము జమవుతుందని బదులిచ్చింది. వడ్డీ సొమ్ము ఎప్పుడు జమయినా మొత్తం జమవుతుందని, కాస్త ఓపిక పట్టాలని కోరింది. EPFO: వేతన జీవులకు గుడ్‌న్యూస్: ఈపీఎఫ్ వడ్డీని పెంచిన కేంద్రం సాధారణంగా పీఎఫ్ వడ్డీని నెలవారీ ప్రాతిపదికన లెక్కిస్తారు. ఆర్థిక సంవత్సరం చివరిలో జమ చేస్తారు. ఇలా జమయిన వడ్డీ.. తర్వాత నెల బ్యాలెన్స్‌కి యాడ్ అవుతుంది. ఆ మొత్తం అంతటికీ మళ్లీ వడ్డీ లెక్కిస్తారు. వడ్డీ మొత్తం జమయిన తర్వాత పీఎఫ్ చందాదారులు ఈపీఎఫ్ఓ వెబ్సైట్, ఎస్సెమ్మెస్, మిస్డ్ కాల్లు లేదా ఉమంగ్ యాప్‌తో సహా వివిధ మోడ్ల ద్వారా వారి ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు. EPFO Provides dedicated portal for the members of EPF For more details please click on the below link 👇https://t.co/Y6MCy1V8rx#epf #ईपीएफ #पीएफ #epfowithyou #AmritMahotsav #HumHaiNa #epfo@PMO @byadavbjp @Rameswar_Teli @MIB_India @LabourMinistry @PIB_India @AmritMahotsav — EPFO (@socialepfo) August 4, 2023 -
విద్యుత్‌సౌధ అష్టదిగ్బంధనం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్‌సౌధను ఉద్యోగులు అష్టదిగ్బంధనం చేశారు. వేతన సవరణ, ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఆర్టిజన్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చలో విద్యుత్‌సౌధ కార్యక్రమానికి 24 సంఘాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్(టీఎస్పీఈ జేఏసీ) కమిటీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జేఏసీ పిలుపు మేరకు గ్రేటర్ హైదరాబాద్ నుంచే కాకుండా తెలంగాణ జిల్లాల నుంచి విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు, ఆర్టీజన్ కార్మి కులు ఉదయం పదిగంటలకే పెద్దసంఖ్యలో సోమాజిగూడలోని విద్యుత్‌సౌధకు చేరుకున్నారు. అనుకున్న దానికంటే అధిక సంఖ్యలో తరలిరావడంతో విద్యుత్‌సౌధ ప్రాంగణమంతా నిండిపోయింది. మిగిలినవాళ్లంతా ప్రధాన కార్యాలయం ముందున్న రహదారిపైనే నిలబడాల్సి వచ్చింది. దీంతో ఇటు ఖైరతాబాద్ చౌరస్తా నుంచి అటు పంజగుట్ట వరకు రోడ్డంతా విద్యుత్ కార్మి కులతో నిండిపోయింది. ట్రాఫిక్ మళ్లింపు.. ఎక్కడి వాహనాలు అక్కడే.. విద్యుత్ ఉద్యోగుల ధర్నాతో లక్డీకాపూల్, పంజగుట్ట, ఎన్టీఆర్ మార్గ్, సోమాజిగూడ, ఎర్రమంజిల్ పరిసర ప్రాంతాలన్నీ రద్దీగా మారి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు అప్రమత్తమై ఖైరతాబాద్ చౌరస్తా నుంచి పంజగుట్ట వైపు వెళ్లే రోడ్డుమార్గాన్ని బారికేడ్లతో మూసివేశారు. అసెంబ్లీ మీదుగా వచ్చి న వాహనాలను రాజ్‌భవన్ మీదుగా బేగంపేట వైపు మళ్లించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు రోడ్లన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. ఆందోళనకారులు ఒక్కసారిగా పెద్దసంఖ్యలో రోడ్డుపైకి రావడం, సీఎం కేసీఆర్, సీఎండీ ప్రభాకర్‌రావుకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని ముందే పసిగట్టిన జేఏసీ నేతలు ధర్నా విజయవంతమైందని చెప్పి ఆందోళన కార్యక్రమాన్ని ముగించారు. ధర్నా కారణంగా రోడ్లపై భారీగా ట్రాఫిక్ జాం కావడంతో వాహనచోదకులు, ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. మొండివైఖరిపై మండిపడిన జేఏసీ ఉద్యోగుల వేతనాలను వెంటనే సవరించాలని, 1999 నుంచి 2004 మధ్యకాలంలో నియమితులైన విద్యుత్ ఉద్యోగులందరికీ ఈపీఎఫ్ నుంచి జీïపీఎస్ సదుపాయాన్ని కల్పించాలని, ఆర్టీజన్ కార్మి కుల సమస్యలను పరిష్కరించాలని జేఏసీ కన్వీనర్ రత్నాకర్‌రావు, చైర్మన్ సాయిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నావేదికపై నుంచి వీరు కార్మి కులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ఇప్పటికే పలుమార్లు యాజమాన్యం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, అయినా వారి నుంచి కనీసస్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యోగులకు నగదురహిత అన్లిమిటెడ్ మెడికల్ పాలసీని అమలు చేయాలని, రూ.కోటి లైఫ్‌టైమ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వాలని, రిటైర్మెంట్ గ్యారంటీని జీపీఎఫ్ ఉద్యోగులకు రూ.16 లక్షలు, ఈపీఎఫ్ ఉద్యోగులకు రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా విద్యుత్ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
పెళ్లి ఖర్చులకు డబ్బు కావాలా? ఈపీఎఫ్ నుంచి ఇలా తీసుకోండి..
ఉద్యోగం చేసే ప్రతిఒక్కరికీ పీఎఫ్ అకౌంట్ అంటే ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉంటుంది. ఉద్యోగులు ప్రతినెలా తమ జీతం నుంచి కొంత మొత్తాన్ని ఇందులో పొదుపు చేస్తుంటారు. పీఎఫ్ ఖాతాలో ఉన్న సొమ్ముకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం కొంత వడ్డీని చెల్లిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 8.1 శాతం వడ్డీ రేటును నిర్ణయించింది. ఇలా పొదుపు చేసిన డబ్బు కష్ట సమయాల్లో ఉపయోపడుతుంది. అవసరమైనప్పుడు పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించుకోవచ్చు. పెళ్లి ఖర్చుల కోసం డబ్బు డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్ సంస్థ అవకాశం కల్పిస్తోంది. ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ఎన్సీఎల్టీ ఆమోదం.. ఇక ఇదే మూడో అతిపెద్ద బ్యాంక్! కొత్తగా వచ్చిన పీఎఫ్ ఉపసంహరణ నిబంధనల ప్రకారం.. ఈపీఎఫ్ సభ్యులు వివాహ సంబంధిత ఖర్చుల కోసం వారి ఖాతాలో ఉన్న సొమ్ము నుంచి కొంత మొత్తాన్ని డ్రా చేసుకోవచ్చు. స్వయంగా వధూవరులు కానీ లేదా ఖాతాదారు కుమారుడు, కుమార్తె, సోదరుడు, సోదరి వివాహాల నిమిత్తం డబ్బు ఉపసంహరించుకోవచ్చు. అయితే పీఎఫ్ ఖాతాలో ఏడేళ్ల పాటు డబ్బు జమ చేసి ఉండాలి. విత్‌డ్రా ఎంత చేసుకోవచ్చు? ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం.. సభ్యులు తమ ఖాతాలో ఉన్న మొత్తంలో 50 శాతం వడ్డీతో సహా ఉపసంహరించుకోవచ్చు. అయితే ప్రావిడెంట్ ఫండ్‌లో ఏడేళ్ల సభ్యత్వం కచ్చితంగా ఉండాలి. ముందస్తు ఉపసంహరణపై ఈపీఎఫ్ పరిమితులు విధించింది. పిల్లల స్కూల్ ఖర్చులు, పెళ్లి ఖర్చుల కోసం ఒక్కో సందర్భానికి మూడు సార్లు మాత్రమే విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇంట్లో నుంచి ఆన్లైన్ ద్వారా సులువుగా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన 72 గంటల తర్వాత డబ్బు బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. తగ్గిన టీడీఎస్ ఈపీఎఫ్ ఉపసంహరణలపై విధించే టీడీఎస్‌ను ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి 20 శాతానికి తగ్గించింది. గతంలో ఇది 30 శాతం ఉండేది. ఐదేళ్ల లోపు ఈపీఎఫ్ ఖాతా నుంచి ఉపసంహరించుకునే ప్రతిఒక్కరికీ టీడీఎస్ వర్తిస్తుంది. ఇదీ చదవండి: సుందర్ పిచాయ్.. మాకు న్యాయం చేయండి.. తొలగించిన ఉద్యోగుల బహిరంగ లేఖ -
EPFO: పెన్షనర్లు ఆగ్రహం.. నాలుగు నెలలని వారంలోనే ముగింపా?
సిరిపురం మాధవరావు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసి.. 2013 మేలో పదవీ విరమణ పొందారు. ఆయన సర్వీసులో ఉన్నప్పుడే అధిక పెన్షన్ కోసం ఉమ్మడి ఆప్షన్ ఇచ్చారు. అయితే ఈపీఎఫ్ఓ అధికారులు దానిని తిరస్కరించడంతో సాధారణ పెన్షన్ పొందుతున్నారు. కానీ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తిరిగి అధిక పెన్షన్ కోసం ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ వెబ్సైట్ ఓపెన్ కాకపోవడం, కొన్నిసార్లు ఓపెన్ అయినా వివరాలు నమోదు చేసేటప్పుడు స్తంభించిపోవడం ఆ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఇంతలో గడువు ముగిసింది. దీంతో ఈపీఎఫ్ఓ కార్యాలయం చుట్టూ తిరుగుతూ అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: అధిక పెన్షన్ల విషయంలో ‘ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)’తీరుపై పెన్షనర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తులు, ఆప్షన్ నమోదులో గందరగోళం, త్వరగా గడువును ముగించడంపై మండిపడుతున్నారు. ముఖ్యంగా 2014 సెప్టెంబర్ 1 కంటే ముందు పదవీ విరమణ పొందినవారు దరఖాస్తు చేసుకోలేక నష్టపోయామని వాపోతున్నారు. ఈపీఎఫ్ఓ తాత్సారం, సర్వర్ సమస్యతోపాటు నమోదు విషయంలో అవగాహన లోపంతో జాయింట్ ఆప్షన్ ఇవ్వలేకపోయామని అంటున్నారు. తమకు అవకాశం ఇవ్వాలంటూ ఈపీఎఫ్ఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తాము చేసేదేమీ లేదంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఈపీఎఫ్ఓ చందాదారులు, పెన్షనర్లకు సంబంధించి అధిక పెన్షన్ అమలుపై సుప్రీంకోర్టు గతేడాది నవంబర్ 4న తీర్పు ఇచ్చింది. ఆ రోజు నుంచి నాలుగు నెలల పాటు దరఖాస్తులకు గడువు ఇవ్వాలని ఆదేశించింది. 2023 మార్చి 3వ తేదీ వరకు గడువును నిర్దేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు చర్యలు చేపట్టిన ఈపీఎఫ్ఓ.. చాలా తాత్సారం చేసి ఈ ఏడాది ఫిబ్రవరి 20న దీనిపై ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. అంతేకాదు దరఖాస్తులు, జాయింట్ ఆప్షన్‌కు సంబంధించిన లింకును మరో ఐదురోజులు ఆలస్యంగా 25వ తేదీన అందుబాటులోకి తెచ్చింది. మార్చి 3వ తేదీతో గడువు ముగియనుండగా.. కేవలం వారం రోజుల ముందు మాత్రమే లింకును అందుబాటులోకి తేవడం గమనార్హం. అయితే 2014 సెప్టంబర్ 1 తర్వాత పదవీవిరమణ పొందినవారు, ప్రస్తుతం సర్వీసులో ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ మరో రెండునెలల పాటు అవకాశం కల్పించింది. వారు మే 3 నాటికల్లా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. కానీ 2014 సెపె్టంబర్ 1వ తేదీకి ముందు రిటైరైన వారికి మాత్రం అవకాశం ఇవ్వలేదు. దీనితో వారిలో చాలా మంది అధిక పెన్షన్‌కు దూరమయ్యారు. దేశవ్యాప్తంగా 91,258 దరఖాస్తులే.. 2014 సెపె్టంబర్ 1వ తేదీకి ముందు రిటైరైనవారిలో దేశవ్యాప్తంగా కేవలం 91,258 మంది మాత్రమే అధిక పెన్షన్ కోసం జాయింట్ ఆప్షన్ ఇవ్వగలిగారు. పేరుకు నాలుగు నెలలు అవకాశం ఇచ్చినా.. సర్క్యులర్ జారీ, ఆన్లైన్ లింకు అందుబాటులోకి తేవడంలో ఈపీఎఫ్ఓ జాప్యం చేసిందని సీనియర్ పెన్షనర్లు మండిపడుతున్నారు. తమకు మరో అవకాశం కల్పించాలంటూ ఈపీఎఫ్ఓకు విజ్ఞప్తి చేస్తున్నారు. చదవండి: ఈపీఎఫ్‌వో అధిక పెన్షన్.. అంత ఈజీ కాదు!? -
ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్‌కు మీరు అర్హులేనా? ఇలా అప్లయ్ చేసుకోండి!
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) సంస్థ ఉద్యోగులు ఎక్కువ పెన్షన్ పొందేలా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో అధిక పెన్షన్ కోసం ఉద్యోగులు ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో అప్లయ్ చేసుకునే వీలు కల్పించింది. ఉద్యోగులు పెన్షన్ పొందడానికి గరిష్ట వేతనం (బేసిక్ పే ప్లస్ డియర్నెస్ అలవెన్స్) నెలకు రూ.15,000 ఉండాలి. ఆ వేతనంపై 8.33 శాతం పూర్తిగా ఈపీఎస్(ఉద్యోగుల భవిష్యనిధి పింఛను పథకం)లో జమ చేయాల్సి ఉంటుంది. నవంబర్ 4న సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం.. అధిక పెన్షన్ పొందేందుకు అర్హులైన ఉద్యోగులు ఈపీఎఫ్ఓలో అప్లయి చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులకు అనుగుణంగా ఈపీఎఫ్ఓ రిటైర్డ్ ఫండ్ బాడీ పోర్టల్‌ను సిద్ధం చేసింది. ఈపీఎఫ్ఓలో ఎలా అప్లయ్ చేయాలి ♦ అర్హులైన ఈపీఎఫ్ఓ ఖతాదారులు ఈ-సేవ పోర్టల్(e-Sewa portal)ను సందర్శించాలి ♦అందులో అధిక పెన్షన్ అప్లయ్ చేసేలా Pension on Higher Salary: Exercise of Joint Option under para 11(3) and para 11(4) of EPS-1995 on or before 3rd May 2023 అనే ఆప్షన్ పాపప్ అవుతుంది. ♦ ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో అధిక పెన్షన్ కోసం (pensionOnHigherWages) అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ♦ అనంతరం అప్లికేషన్ ఫారమ్ ఫర్ జాయింట్ ఆప్షన్‌తో యూఏఎన్ నెంబర్, పేరు, మీ పుట్టిన తేదీ, ఆధార్ కార్డ్ వివరాల్ని ఎంటర్ చేసి ఓటీపీ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి. ♦ ట్యాప్ చేసిన తర్వాత మీరు అర్హులైతే అధిక పెన్షన్ పొందే సౌలభ్యం కలుగుతుంది. లేదంటే రిజెక్ట్ అవుతుంది.