false allegations
-
ఎంపీ తేజస్వీ సూర్యపై కేసు
బెంగళూరు: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై కేసు నమోదైంది. రైతు ఆత్మహత్యకు వక్ఫ్ భూముల సమస్యతో సంబంధం ఉందంటూ తప్పుడు సమాచారాన్ని పంచుకున్నందుకు ఎంపీతోపాటు కన్నడ న్యూస్ పోర్టల్స్ ఎడిటర్లు ఇద్దరిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తన భూమిని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకోవడంతో కర్ణాటకలోని హవేరి జిల్లాకు చెందిన రుద్రప్ప చెన్నప్ప బాలికై అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని సూర్య తన పోస్టులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మంత్రి బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్లు రాష్ట్రంలోని రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సూర్య ఆరోపించారు. అయితే.. రుణ భారం, పంట నష్టంతో 2022 జనవరిలో రైతు ఆత్మహత్య చేసుకున్నారని హవేరి పోలీసు సూపరింటెండెంట్ స్పష్టం చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. అసహజ మరణాల దర్యాప్తు ప్రక్రియ కింద తుది నివేదిక సమరి్పంచిన తర్వాత కేసును ఇప్పటికే మూసేసినట్లు పోలీసులు తెలిపారు. రైతు భూమిని వక్ఫ్ భూమిగా రికార్డుల్లో నమోదు చేయడం వల్లనే అతను ఆత్మహత్య చేసుకున్నాడనే శీర్షికతో వార్తను ప్రచురించినందుకు గాను.. కన్నడ దునియా ఈ–పేపర్, కన్నడ న్యూస్ ఈ–పేపర్ ఎడిటర్లపైనా ఎఫ్ఐఆర్ నమోదైంది. హవేరిలో రైతులు వక్ఫ్ నోటీసులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారని, ఇది రుద్రప్పను మానసిక క్షోభకు గురిచేసిందని ఆ వార్తా కథనం పేర్కొంది. -
అది నోరా.. మోరా.. పవన్
-
KSR Live Show: ప్రకటనల ఆరోపణలపై చంద్రబాబుకు దిమ్మదిరిగేలా కౌంటర్..
-
సాక్షి'పై ఇన్ని అబద్ధాలా?.. కూటమి కుట్ర బట్టబయలు
-
టీడీపీ నీతిమాలిన నిస్సిగ్గు రాజకీయాలు చేస్తోంది: లేళ్ల అప్పిరెడ్డి
సాక్షి, గుంటూరు: అధికార మత్తులో టీడీపీ నీతిమాలిన నిస్సిగ్గు రాజకీయాలు చేస్తోందని.. ఆ పార్టీ నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ శ్రేణులు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ క్యాంప్ ఆఫీస్‌లోని ఫర్నిచర్‌పై టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. టీడీపీ నీతిమాలిన రాజకీయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు.‘‘ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో పరిపాలనకు అవసరమైన సౌకర్యాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి హోదాలో ఎవరు ఉన్నా.. వారి క్యాంప్ కార్యాలయాలకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం సర్వసాధారణ విషయం. ఇందులో భాగంగానే వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మారాక ఏయే వస్తువులను క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారో జాబితాను అధికారులకు ఇప్పటికే సమర్పించడం జరిగింది.’’ అని ఆయన వివరించారు.‘‘వెసులుబాటు ఇస్తే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌కు విలువకట్టి, ఎంత తిరిగి చెల్లించాలో చెప్తే, అంతా చెల్లిస్తామని ప్రభుత్వాధికారులను కోరాం. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ప్రభుత్వం వైపు నుంచి సమాధానం కోసం ఎదురుచూస్తున్నాం. ఇదిలా ఉండగానే టీడీపీ మంత్రులు, ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వైఎస్ జగన్‌ని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దుష్ప్రచారం రాజకీయాల్లో అత్యంత దిగజారుడుతనాన్ని సూచిస్తున్నాయి.’’ అని లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. -
అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
జి.కొండూరు: పదవీ కాంక్షతో తరచూ పార్టీలు మారే ఆనవాయితీ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వసంత వెంకటకృష్ణప్రసాద్ అబద్ధ ప్రచారాలను తలకెత్తుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారానంటూ గొప్పలు చెప్పుకొంటున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభంజనంలో 2019లో మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన, తనకు అత్యంత ప్రియమైన టీడీపీతో గత ఐదేళ్లూ గుట్టుగా సంబంధాలు కొనసాగించారు. మరోవైపు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీని విచి్ఛన్నం చేయడమే లక్ష్యంగా పార్టీలో గ్రూపులను ప్రోత్సహించి వెన్నుపోటు రాజకీయాలతో చెలరేగిపోయారు. వసంత తీరును పసిగట్టిన వైఎస్సార్ సీపీ అధిస్టానం ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్న క్రమంలో పరువు దక్కించుకునేందుకు ఆనవాయితీ ప్రకారం ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. తన పాచిక పారలేదన్న దుగ్ధతో రాజకీయంగా భవిష్యత్ ఇచ్చిన పారీ్టపై అసత్యాలు గుప్పిస్తున్నారు. ఇన్‌చార్జ్‌లదే పెత్తనం వసంత వెంకటకృష్ణప్రసాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన కొద్ది నెలల్లోనే తన సొంత వ్యక్తులను మండలానికి ఒకరు చొప్పున ఇన్చార్జులుగా నియమించారు. ఎమ్మెల్యేతో ఏ పని చేయించుకోవాలన్నా ఇన్‌చార్జ్‌లను సంప్రదించాల్సి రావడంతో తమకు విలువ లేదంటూ కొందరు సీనియర్ నాయకులు పదవులకు రాజీనామా చేసి వైఎస్సార్ సీపీకి దూరంగా జరిగారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడిన కేడర్‌ను గాలికి వదిలేసి అధికారంలోకి వచ్చిన తర్వాత స్వార్థ ప్రయోజనాల కోసం జంపింగ్‌లు చేసిన వ్యక్తులకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు. దీంతో ప్రతి గ్రామంలో ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడిన నాయకులు ఒక గ్రూపుగా, పదవులు పొందిన నాయకులు మరో గ్రూపుగా విడిపోయారు. ముందస్తు కుట్రలో భాగంగా ఈ గ్రూపులను సమన్వయం చేయకుండా అలానే వదిలేశారు. వసంతపై అసంతృప్తితో పారీ్టలోని రెండో కేడర్‌గా ఏర్పడిన నాయకులకు మంత్రి జోగి రమేష్ అండగా నిలబడ్డారు. దీనిని సాకుగా చూపుతూ జోగి రమేష్ గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ వసంత కృష్ణప్రసాద్ అసత్య ప్రచారం చేశారు. తన కుట్రలో భాగంగా చివరికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ మారేందుకు సిద్ధమైన ఆయన తన తండ్రి వసంత నాగేశ్వరరావుతో సైతం ప్రభుత్వంపై విమర్శలు చేయించారు.సీటిచ్చినా పార్టీ మారారంట..! ఐదేళ్లు మైలవరం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారం¿ోత్సవాల్లో ఫొటోలకు ఫోజులిచ్చిన వసంత వెంకట కృష్ణప్రసాద్ నేడు మాట మార్చారు. నియోజక వర్గంలో అభివృద్ధి జరగనందుకే ఎమ్మెల్యే సీటు ఇచ్చినా కాదని పార్టీ మారినట్లు గొప్పలు చెబుతున్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు సామాన్యుడు కావ డంతో ఆయనపై మాట్లాడేందుకు ఏమీ లేక నేరుగా ముఖ్యమంత్రిపై రోజూ అరిగిపోయిన రికార్డులా పచ్చి అబద్ధాలను గుప్పిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు టీడీపీ కేడర్‌కు సైతం విసుగుతెప్పిస్తున్నాయి. ఐదేళ్లపాటు తాను చేసిన వెన్నుపోటు రాజకీయాలను పసిగట్టే వైఎస్సార్ సీపీ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేíÙస్తోందని గుర్తించిన వసంత, పదవీ కాంక్షతో పార్టీ మారారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్ సీపీలో ఎమ్మెల్యే సీటిచ్చినా కాదని పార్టీ మారినట్లు గొప్పలు చెబుతున్నా రని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
కోర్టుకెళ్తా.. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పాత్రపై వస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సీరియస్‌గా స్పందించారు. ఆ ఆరోపణలకు ఖండించిన ఆయన.. లీగల్ యాక్షన్‌కు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ‘‘నాపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, ఓ మంత్రిపై కోర్టుకు వెళ్తా. న్యాయపరంగా నాపై చేస్తున్న అబద్ధపు ఆరోపణలు ఎదుర్కొంటా. సిగ్గులేకుండా ఇలాంటి అర్థరహిత, ఆధారాల్లేని ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు అయినా తెలియజేయాలి. లేదంటే.. లీగల్‌గా చర్యలకు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. అలాగే.. వాస్తవాలు తెలుసుకోకుండా ఈ వార్తను ప్రచురించిన వార్త సంస్థలకు కూడా నోటీసులు ఇస్తాం’’ అని కేటీఆర్ తెలిపారు.Both these Congress fellows (including the minister) will be served legal notices for defamation & slanderEither Apologise for this shameful, baseless & nonsensical allegations or face legal consequences Also will be serving legal notices to news outlets who are dishing out… pic.twitter.com/IjHNQ7Yn2T— KTR (@KTRBRS) April 2, 2024 -
రాష్ట్రం భూమి ఇచ్చినా.. రైల్వేజోన్‌పై కేంద్రందే కిరికిరి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక డిమాండ్, విభజన చట్టంలోని హామీ అయిన విశాఖపట్నం రైల్వేజోన్‌కు సంబంధించిన కూత ఈ ఏడాది రైల్వే బడ్జెట్లోనూ వినిపించలేదు. పైగా దీనిపై కేంద్రం మరోసారి కిరికిరీ పెడుతోంది. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ఢిల్లీలో విలేకరుల సమా వేశంలో జోన్ అంశంపై నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వం నెట్టేసేందుకు యత్నించారు. రైల్వేజోన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించాల్సి ఉందని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉంది.కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని కప్పిపుచ్చేందుకు సమాధానాన్ని దాటవేసే ఉద్దేశంతోనే ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై నెపం నెట్టేసేందుకు ప్రయత్నిస్తూ అసత్య ఆరోపణలు చేయడం విభ్రాంతి కల్గించింది. ఎందుకంటే.. కేంద్రమంత్రి చెప్పిన 52 ఎకరాలకు, రైల్వేజోన్ వ్యవ హారానికి అసలు ప్రత్యక్ష సంబంధమేలేదు. ఆయన చెబుతున్న 52 ఎకరాలను రైల్వేకు కేటాయించకుండా తాత్సారం చేసింది గత టీడీపీ ప్రభుత్వం. ఇక అసలు విషయం ఏమిటంటే.. ఆ 52 ఎకరాలను రైల్వేకు అప్పగిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. గత నెల 2న జీవీఎంసీ కమిషనర్ రైల్వే అధికారులకు లేఖ రాశారు. వాస్తవాలిలా ఉంటే.. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఇందుకు విరుద్ధంగా రైల్వేజోన్‌పై అవాస్తవాలు వల్లెవేశారు. కేవలం ఒ డిశాలోని బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ యన ఈ విధంగా మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ వ్యవహారాన్ని తాత్సారం చేస్తున్నట్లుగా స్పష్ట మవుతోంది. అసలు ఈ రైల్వేజోన్ అంశంపై వాస్తవాలు ఏమిటంటే.. ► విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ ఏర్పాటుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ను రైల్వే శాఖ రూపొందించింది. భవనాలు, ఇతర అవసరాల కోసం విశాఖలో 950 ఎకరాలు అందుబాటులో ఉందని స్పష్టంగా పేర్కొంది. ► రాష్టప్రభుత్వ ఒత్తిడితో విశాఖపట్నంలో రైల్వే జోన్ కార్యాలయాల నిర్మాణానికి గతేడాది రూ.170 కోట్లు కూడా కేటాయించింది. ► రైల్వేజోన్ ఆచరణలోకి రావాలంటే సాంకేతికంగా కీలక అంశాలపై కేంద్రం నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోంది. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వేజోన్, సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వేజోన్లతో ఏపీ పరిధిలో ఆస్తుల పంపకం, కొత్త డివిజన్ల ఏర్పా టు, ఉద్యోగుల కేటాయింపు, కొత్త కార్యాలయా ల ఏర్పాటు తదితర అంశాలను ఓ కొలిక్కి తీసు కువచ్చి దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ను ఆచర ణలోకి తీసుకురావాలి. కానీ.. కేంద్రం బడ్జెట్లో ఈ విషయాలేవీ కనీసం ప్రస్తావించలేదు. ► ఇక రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించనందునే రైల్వేజోన్ ఏర్పాటులో జాప్యం జరుగుతోందన డం హాస్యాస్పదం. ఎందుకంటే.. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రైల్వే భూమికి బదులుగా రైల్వేశాఖకు భూమి కేటాయించాలని ఆయన చెబుతున్నారు. కానీ, విశాఖలో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2013లో రైల్వే భూములను తీసుకుంది. అందుకు ప్రత్యామ్నాయంగా రైల్వేశాఖకు 52 ఎకరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేశాఖ మధ్య అంతకుముందే ఒప్పందం కుదిరింది. అంటే.. రాష్ట్ర విభజనకు ఏడాది ముందు సంగతి అది. ► 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించారు. విభజన చట్టంలో విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీకి అంతకుముందటి రైల్వే భూమి తీసుకున్న దానికి సంబంధమేలేదు. ఆ అంశంతో ముడిపెట్టకుండా విభజన చట్టం ప్రకారం రైల్వేజోన్‌ను ఏర్పాటుచేయాలి. అందుకోసం 950 ఎకరాలు అందుబాటులో ఉన్నాయని కూడా డీపీఆర్‌లో కేంద్ర ప్రభుత్వమే స్పష్టంగా పేర్కొంది. ఆ విషయాన్ని కప్పిపుచ్చుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఆశ్చర్యకరం. ► వాస్తవానికి రైల్వేకు కేటాయించాలని 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిన 52 ఎకరాలపై వివాదం ఏర్పడింది. అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు రైల్వేశాఖ అధికారులు ప్రయత్నిస్తే అక్కడి గిరిజనులు అడ్డుకున్నారు. సమస్య సున్నితంగా మారడంతో రైల్వేశాఖ వెనక్కి తగ్గింది. దీనిపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కూడా మౌనంగా ఉండిపోయింది. అప్పట్లో కూడా రైల్వేశాఖ ఆ విషయంపై పట్టుబట్టలేదు. ► ఇక భూమి సమస్యతోనే రైల్వేజోన్ ఏర్పాటులో జాప్యం జరుగుతోందని రైల్వేశాఖ ఇప్పటివరకు చెప్పనేలేదు. రైల్వేజోన్ అంశంపై వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఈ నాలుగున్నరేళ్లలో ఎన్నోసార్లు సమావేశమయ్యారు. ఏ ఒక్క సమావేశంలో కూడా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించనేలేదు. రెల్వేకు 52 ఎకరాలు అప్పగింత.. కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ఇంకా అప్పగించలేదని చెబుతున్న 52 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైల్వేకు అప్పగించేసింది. ఈ మేరకు గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఆ భూముల్లో ఉన్న ఆక్రమణలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలగించారు. వాటిని పూర్తిగా తమ ఆధీనంలో తీసుకున్నారు. జీవీఎంసీ పరిధిలోని ముడసర్లోవ సర్వే నెంబర్లు 57, 58, 59, 61, 62, 63, 64, 65తో ఉన్న 52 ఎకరాలను రైల్వేశాఖకు అప్పగించారు. ఈ మేరకు జీవీఎంసీ మున్సిపల్ కమిషనర్ సీఎం శ్రీకాంత్ వర్మ ఈ ఏడాది జనవరి 2నే విశాఖలోని ఈస్ట్‌కోస్ట్ డీఆర్ఎంకు లేఖ ద్వారా తెలియజేశారు. వాస్తవం ఇలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం భూమిని అప్పగించలేదని రైల్వేమంత్రి వ్యాఖ్యానించడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు ఢిల్లీలోని పచ్చమీడియా ప్రతినిధులు ఉద్దేశపూర్వకంగా అడిగిన ప్రశ్నలకు ప్రభావితమైన ఆయన అవాస్తవాలు మాట్లాడడం కేంద్రమంత్రి స్థాయికి తగినట్లుగా లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఒడిశాలో రాజకీయ ప్రయోజనాల కోసమేనా? ఒడిశాలో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నది స్పష్టమవుతోంది. ప్రధానంగా విశాఖ కేంద్రంగా వాల్తేర్ రైల్వే డివిజన్‌ను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు డిమాండ్ చేస్తుండగా.. వాల్తేర్ రైల్వే డివిజన్‌ను రద్దుచేసి.. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్ల తోనే కొత్త జోన్ ఏర్పాటుపై డీపీఆర్‌లో ప్రస్తావించారు. దీనిపై రాష్ట్రంలో తీవ్ర విమర్శలు వ్యక్తమ య్యాయి. ఎందుకంటే.. విజయవాడ నుంచి విశాఖ 350 కి.మీ. దూరంలో ఉండగా.. రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఇచ్చాపురం 580 కి.మీ. దూరంలో ఉంది. అంతవరకు విజయవాడ రైల్వే డివిజన్‌గా ఏర్పాటుచేస్తే పరిపాలన నిర్వహణ సమస్యలు ఏర్పడతాయి. అందుకే వాల్తేర్ రైల్వే డివిజన్‌ను కొనసాగిస్తూనే విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ కావాలని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం తూర్పు కోస్తా జోన్లో అత్యధిక రాబడి ఉన్న వాల్తేర్ డివి జన్ను రద్దుచేయాలని కేంద్రం భావిస్తోంది. తద్వారా భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వేజోన్ ఆర్థిక ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది. ఒడిశాలో బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించేందుకే ఇలా వ్యవహరిస్తోంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఒడిశా కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి కావడంతో ఆయన ఒడిశాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
రోడ్ల నిర్మాణంలో సత్తా చాటుతున్న ఏపీ సర్కార్
-
అలాంటి ప్రచారం! ప్చ్.. ప్రార్ధనలు చేసినా ప్రయోజనం ఉండదు.!
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు భలే చిత్రమైన మనిషి. తను బైబిల్ చదివితే అది లోకం కోసం అని నమ్మబలుకుతారు. అదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చదివితే మతం కోసం అని దుష్ప్రచారం చేస్తారు. గత నాలుగేళ్లలో చంద్రబాబు నాయుడు క్రైస్తవమతాన్ని అపహాస్యం పాలు చేసేలా ఎన్నిసార్లు మాట్లాడి ఉంటారు! ఏకంగా ఆయా పదవులలో ఉన్నవారికి మతం ఆపాదించి విమర్శలు చేశారు. కాని మరి ఇప్పుడు క్రైస్తవుల ఓట్లు అవసరం అయి ఉంటాయి. ఆయనే క్రిస్టమస్‌ను పురస్కరించుకుని చర్చీల చుట్టూ తిరిగారు. ఇంతవరకు తప్పు లేదు. కాని అక్కడకు వెళ్లి కూడా ఆయన దిక్కుమాలిన రాజకీయాలు, ముఖ్యమంత్రి జగన్ పై పిచ్చి ఆరోపణలు, సెంటిమెంట్‌తో కూడిన విమర్శలు చేశారు. ఆయన కంటే చిన్నవాడైన జగన్ ఎంత హుందాగా క్రిస్టమస్ సమావేశంలో పాల్గొని వ్యవహరించారు? రాజకీయాలకు అతీతంగా ఎలా మాట్లాడారు. మరి ఎంతో సీనియర్ని అని చెప్పుకునే చంద్రబాబు ఏమి ప్రసంగించారు. ✍️ఏకంగా ఏడు లక్షల కోట్ల రూపాయల విలువైన క్రైస్తవుల ఆస్తుల దోపిడీకి ప్లాన్ చేశారని చంద్రబాబు ఆరోపించారు. అంటే మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనుండగా ఈ ఆస్తులన్నిటిని జగన్ దోపిడీ చేసేస్తారా? చెప్పేదానికి అయినా అర్ధం ఉండాలి. నిజంగానే ఆయన అలాంటి ఆలోచలతో ఉండి ఉంటే ఈ ఐదేళ్లలో ఒక్క ఆరోపణ కూడా ఎందుకు రాలేదు?అంటే తప్పుడు ఆరోపణ చేయడం, దానిని ఈనాడు ఎల్లో మీడియా పటం కట్టి మొదటి పేజీలో అచ్చేయడం నిత్యకృత్యంగా మారింది. ఆ తర్వాత అచ్చోసిన ఆంబోతును జనం మీదకు వదలినట్లు, ప్రజల మీదకు ఈ పత్రిక కాపీలను వదలడం. ఇదే పనిగా గత నాలుగేళ్లుగా సాగిస్తున్నారు. ✍️బహుశా అమరావతి రాజధాని గ్రామాలలో తన పార్టీవారు చేసిన భూ దోపిడి ఏమైనా చంద్రబాబుకు గుర్తుకు వచ్చిందేమో! క్రైస్తవ మిషనరీలవారు విద్యాసంస్థలు, ఆస్పత్రులు, శరణాలయాలను నెలకొల్పి ప్రభుత్వం చేయని పనులను క్రైస్తవ మిషనరీలు చేస్తుంటే, గత ప్రభుత్వాలు వారికి గ్రాంట్లు ఇచ్చి ప్రోత్సహించితే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ సాయం నిలిపివేసి ఆయా విద్యాసంస్థలను మూతపడేలా చేసి వాటి ఆస్తులను ఆక్రమించాలని చూసిందని పచ్చి అసత్యం చెప్పారు. ఏ ఆస్పత్రి స్థలాన్ని తీసుకున్నారు?ఏ విద్యా సంస్థను ఆక్రమించారు. ✍️మిషనరీలు అన్నీ హిందూమతాన్ని దెబ్బతీయడానికి యత్నిస్తున్నాయని ఆరోపించే బీజేపీతో కలిసి పనిచేసింది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని టీడీపీనే కదా!. బీజెపీతో సావాసం కోసం క్రైస్తవ మతస్తులను అవమానించేలా, పాస్టర్లను అనుమానించేలా ప్రసంగాలు చేసింది చంద్రబాబు, ఆయన అనుచరులే. కాని ఇప్పుడు మాత్రం మాట మార్చి మిషనరీల ఆస్తులు ఆక్రమించే యత్నం చేస్తున్నారని ప్రభుత్వంపై ఆరోపిస్తున్నారు.నిజానికి అలాంటి ఆరోపణలకు గురైంది టిడిపి నేతలు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గుంటూరులో ఎఈఎల్సి అనే క్రైస్తవ సంస్థకు చెందిన దాదాపు ఎకరం స్థలాన్ని చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసిన ఒక నేత ఏడాదికి కేవలం లక్ష రూపాలయ లీజుకు లాగించేశారట. ✍️గుంటూరులోని ఓ కాలేజీకి చెందిన రెండు ఎకరాల స్థలాన్ని కూడా ఏడాదికి ఏడు లక్షల లీజుకు ఒక ఆస్పత్రికి బలవంతంగా ఇప్పించారట. విజయవాడ లో లయోలా కాలేజీకి చెందిన ఎనిమిది ఎకరాల స్థలాన్ని చంద్రబాబు టైమ్ లో ఒక క్లబ్ కు ఇప్పించారట. ఇలా పలు అంశాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన వెనుక ఇంత పెద్ద మచ్చ పెట్టుకుని జగన్ పై దారుణమైన ఆరోపణ చేశారు.జగన్ ఎయిడెడ్ స్కూళ్లను సంస్కరించే క్రమంలో తీసుకున్న చర్యలను తప్పుపడుతున్నారు. అదేమీ బలవంతంగా ఎవరి నుంచి తీసుకోలేదు. అయినా చంద్రబాబు , టీడీపీ మీడియా దుష్ప్రచారం చేస్తుంటాయి.శత్రువును కూడా ప్రేమించాలని బైబిల్ చెబుతోందని చంద్రబాబు సూక్తి ముక్తావళి చెప్పారు. ✍️ మరి అసలు ఏ పదవిలో లేనప్పుడు జగన్ పై కక్ష కట్టి సోనియాగాంధీతో కలిసి చంద్రబాబు తప్పుడు కేసులు ఎలా పెట్టించారు? నిత్యం జగన్ పై తప్పుడు ప్రచారం ఎలా చేశారు?సోషల్ మీడియాలో ఇష్టారీతిన పోస్టులు పెట్టి ఎదుటివారిని అవమానిస్తే కూడా చర్య తీసుకోకూడదని చెబుతున్న చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు ఎర్రబుక్ అంటూ ఎందుకు పట్టుకు తిరుగుతున్నారు? అందరి అంతు చూస్తామని ఎలా బెదిరిస్తున్నారు?ఎన్నికలు లేకపోతే క్రైస్తవమతం గురించి ఈయనకు పడుతుందా!. ఎన్నికలు రాగానే క్రీస్తు, బైబిల్, పాస్టర్ లకు భృతి,చర్చిల మరమ్మతులకు నిధులు మొదలైనవి గుర్తుకు వస్తాయి. అవే జగన్ ప్రభుత్వం చేస్తే ఇదే టీడీపీ తప్పు పడుతుంది. జగన్ ను సమర్ధిస్తే దేవుడి సందేశాన్ని అపహాస్యం చేసినట్లే అని ఆయన ఎంత దారుణంగా వ్యాఖ్యానించారు! జగన్ అమలు చేస్తున్న స్కీములను ఎదుర్కోలేక, ప్రజలలో జగన్ పట్టు తగ్గించడం ఎలాగో తెలియక ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ✍️అంటే దేవుడి సందేశం ప్రకారమే గత ఎన్నికలలో టీడీపీని ప్రజలు ఓడించారని చంద్రబాబు ఒప్పుకుంటారా? ఇంత వయస్సు వచ్చాక కూడా చంద్రబాబులో అసూయ, ద్వేషం వంటివి పోలేదనడానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరమా? దైవ సందేశం అంటే ఇలా మాట్లాడడమా!చంద్రబాబు కన్నా అధిక అసూయతో రగిలిపోతున్న రామోజీరావు ఇంతకన్నా నీచంగా జగన్ ప్రభుత్వంపై అబద్దపు ప్రచారం చేస్తున్నారు. ఇంకో సంగతి ఏమిటంటే గతంలో ఎన్నడూ సందర్శించని గుణదల మేరీమాత ఆలయానికి కూడా చంద్రబాబు వెళ్లారట. ఓట్ల కోసం ఎక్కడికైనా ఈయన వెళతారు. మరో వైపు ఇంటిలో యాగం కూడా చేస్తున్నారట. మనిషి లో మార్పు రాకుండా ఎన్ని ఆలయాలు, చర్చీలు, మసీదులకు వెళ్లితే,ఎన్ని యాగాలు, ప్రార్ధనలు చేస్తే మాత్రం ఏం ప్రయోజనం ఉంటుంది?. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ఆంధ్రజ్యోతి కథనంపై దుర్గగుడి స్పందన
సాక్షి, కృష్ణా: విజయవాడ దుర్గగుడికి చెందిన సీవీ రెడ్డి ఛారిటీస్‌లో మాంసాహారం పేరుతో వార్తను ప్రచురించింది ఆంధ్రజ్యోతి. పోలీసులు మాంసాహారం వండుకుని తిన్నారంటూ అందులో పేర్కొంది. అయితే ఆ పత్రికలో వచ్చిన కథనాన్ని ఖండించారు దుర్గగుడి అధికారులు. దుర్గ గుడి ఈవో భ్రమరాంబ ఆదేశాల మేరకు సత్రాన్ని సందర్శించి.. అన్ని రూములు, పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు అధికారులు. ఆపై సత్రంలో ఎలాంటి మాంసాహారం వండటం స్వీకరించడం లేదని పర్యవేక్షణాధికారి స్పష్టత ఇచ్చారు. తప్పుడు కథనం ఆధారంగా.. చేసిన ఆరోపణలను నిరూపించడంతో పాటు రేపటి పేపర్లో వివరణ ప్రచురించాల్సిందిగా ఆంధ్రజ్యోతిని అధికారులు కోరినట్లు ఈవో వెల్లడించారు. -
అంకెల గారడీతో అసత్యాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (స్పెషల్ సీఎస్) శ్రీలక్ష్మితో కలిసి మంత్రి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో వేల కోట్లతో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని ఎల్లో మీడియా అంకెలను వక్రీకరిస్తూ, అసత్య కథనాలతో ప్రభుత్వంపై విషం చిమ్ముతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సీఎఫ్ఎంఎస్కు వచ్చిన బిల్లును విడుదల చేస్తున్నామని చెప్పారు. పురపాలక సంస్థల్లో చేపట్టిన 2,760 పనులకు రూ.510.46 కోట్లు చెల్లించామన్నారు. పలాస – కాశీబుగ్గ, తాడిగడప, సాలూరు, గుంటూరు, జంగారెడ్డిగూడెం, పిడుగురాళ్ల, ఎర్రగుంట్లలో మొత్తం 269 పనులకు రూ.32.55 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. తాడేపల్లి–మంగళగిరి మున్సిపల్ కార్పొషన్‌లో ఫేజ్ 1, ఫేజ్–2 జనరల్ ఫండ్స్ బిల్లులు, 14, 15 ఆరి్థక సంఘం నిధులుతో చేపట్టిన పనులకు రూ. 37.06 కోట్లు విడుదల చేసినట్టు వివరించారు. ఒక్క బిల్లు కూడా పెండింగ్‌లో లేదన్నారు. బిల్లుల జాప్యంతో అభివృద్ధి నిలిచిపోతోందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. 123 పట్టణాలకుగాను ఏడింటిలో పనులు, బిల్లులనే ప్రస్తావించారని, అంటే మిగిలిన వాటిలో అభివృద్ధి జరుగుతోందనే అర్థమని చెప్పారు. పనులు చేసేందుకు చిన్న కాంట్రాక్టర్లు ముందుకు రానందునే చిన్న పనులను ఒక ప్యాకేజీగా మార్చి పెద్ద కాంట్రాక్టరుకు ఇచ్చేలా ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. సాలూరులో 12 పనులకు రూ.15 లక్షల బిల్లులు ఉన్నాయని, అంటే ఒక పనికి రూ.లక్ష వరకు ఉంటుందని, దీనిని కూడా భూతద్దంలో చూపించడం దుర్మార్గమని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమృత్ 1.0లో ఇప్పటికే రూ.3,500 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు ఇవ్వగా, అమృత్ 2.0లో రూ. 5 వేల కోట్లతో పనులు చేపడుతున్నట్టు వివరించారు. పన్నులు సకాలంలో చెల్లించని వారిపై వడ్డీల భారం పెరుగుతోందని, దానిని కూడా ప్రభుత్వం మినహాయించిందని, ఇందుకోసం రూ.3 వేల కోట్లు వడ్డీ భారాన్ని మోస్తోందని తెలిపారు. కాంట్రాక్టర్లు సంతృప్తితో ఉన్నారు బిల్లుల చెల్లింపుపై కాంట్రాక్టర్లు సంతృప్తితో ఉన్నారని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి చెప్పారు. పట్టణాల్లో సాధారణ పనులకే కాకుండా.. 528 అర్బన్ హెల్త్ సెంటర్ల పనులకు కూడా రూ.187 కోట్లు చెల్లించామన్నారు. యూజర్ చార్జీలు ఇవ్వడానికి ప్రజలు ముందుకొస్తుంటే మీడియాకు ఇబ్బంది ఎందుకని ప్రశ్నించారు. చదవండి: Fact Check : పేదల ఇళ్లపై పిచ్చి రాతలు.. బాబు కొంప కొల్లేరవుతుందనే! -
నారా లోకేష్‌కు కేతిరెడ్డి ఓపెన్ ఛాలెంజ్..
సాక్షి, విజయవాడ: నారా లోకేష్‌కు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. 24 గంటల్లో తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు. అలా చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఒకవేళ ఆరోపణలు నిరూపించలేకపోతే లోకేష్ పాదయాత్ర వదిలేసి వెళ్లిపోతాడా..? అని ప్రతి సవాల్ విసిరారు. 'చంద్రబాబు, లోకేష్లలా నాది అక్రమ నివాసం కాదు. రైతుల వద్ద నుంచి భూమి కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నా. చంద్రబాబులా నేను ఎవర్నీ బెదిరించలేదు. నా నివాసానికి అన్ని రకాల అనుమతులు చూపిస్తా. చంద్రబాబుది అక్రమ నివాసం కాదా? చంద్రబాబు, లోకేష్‌ల నివాసం డాక్యుమెంట్లు చూపిస్తారా..? ఇసుక లారీలు బెంగళూరు వెళ్లాయని నిరూపించండి..? లోకేష్‌కి దమ్ముంటే నా ఇంటికొస్తే.. అన్ని ఆధారాలు చూపిస్తా. చంద్రబాబు, లోకేష్‌వి ఆడవాళ్ళ ను అడ్డం పెట్టి రాజకీయాలు చేసే బతుకులు. పులకేసి లోకేష్‌కి అందర్నీ తిట్టి తిట్టించుకోవడం అలవాటైంది. మా టార్గెట్ 175ని ఖచ్చితంగా సాధిస్తాం. మా నాయకుడు తప్పు చేసిన నలుగురు ఎమ్మెల్యేలు ను సస్పెండ్ చేశారు. చంద్రబాబుకి ఆయన పార్టీ వీడిన ఎమ్మెల్యే, ఎంపీలను సస్పెండ్ చేసే దమ్ముందా? అని కేతిరెడ్డి ఫైర్ అయ్యారు. చదవండి: ఆ రూమర్లను కొట్టిపారేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ -
కట్టుకథలు..విషపురాతలు.. ఎమ్మెల్యే కేతిరెడ్డిని టార్గెట్ చేస్తూ కథనాలు
సాక్షి, ధర్మవరం: ఎల్లో మీడియా బరితెగించింది. వాస్తవాలను కప్పిపుచ్చుతూ విషపు రాతలతో జనానికి కనికట్టు కడుతోంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా శ్రమిస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని టార్గెట్ చేసింది. కట్టుకథలతో అసత్యాలు వల్లిస్తోంది. టీడీపీ డైరెక్షన్లో నిరాధార కథనాలు రాస్తూ ప్రజలను మభ్యపెట్టాలని ప్రయతి్నస్తోంది. కానీ వాస్తవాలు చూస్తున్న జనం ఎల్లో మీడియా తీరును బహిరంగంగానే కడిగిపారేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లంటూ విష ప్రచారం ధర్మవరం నియోజకవర్గంలో అధికారులు పని చేయలేక రాజకీయ ఒత్తిళ్లతో సెలవులో వెళ్లి పోతున్నారంటూ ఇటీవల ఎల్లో మీడియా గగ్గోలు పెడుతోంది. డీఎస్పీ, తహసీల్దార్, సెబ్ ఇన్స్పెక్టర్, మున్సిపల్ కమిషనర్లు సెలవులో వెళ్లిపోయరాని తప్పుడు రాతలు రాసింది. వాస్తవాలు ఇలా... కొన్నిరోజుల క్రితమే డీఎస్పీ రమాకాంత్ వ్యక్తిగత కారణాలతో సెలవు పెట్టారు. ఆయన రెండేళ్లకుపైగా ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా విధులు నిర్వర్తించారు. రాజకీయ ఒత్తిళ్లే ఉంటే రెండేళ్లు ఇక్కడ ఎలా పనిచేస్తారని ప్రజలే చర్చించుకుంటున్నారు. ►తహసీల్దార్ నీలకంఠారెడ్డి నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆస్పత్రిలో చేరి చికిత్స అనంతరం ఇటీవలే విధుల్లోకి వచ్చారు. అయినా ఆరోగ్యం సహకరించక పోవడంతో వైద్యుల సూచన మేరకు..మరో నెల రోజులు సెలవు పెట్టారు. ►వారం రోజుల క్రితం సెబ్ ఇన్స్పెక్టర్ సైదుల్ తన డ్రైవర్‌పై విచక్షణా రహితంగా దాడి చేయడంతో బాధితుడు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో సైదుల్పై కేసు నమోదు కాగా, అతను సెలవుపై వెళ్లారు. ►తాజాగా బుధవారం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున వ్యక్తిగత పనుల నిమిత్తం 25 రోజులు సెలవు పెట్టారు. ఈ విషయాన్ని కమిషనరే స్వయంగా మీడియా ముఖంగా చెప్పారు. అయినా ఎల్లో మీడియా ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లతో కమిషనర్ సెలవులో వెళ్తున్నారని విష ప్రచారం చేసింది. ►ఇలా ఏ కారణంతో అధికారులు సెలవు పెట్టినా ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ టీడీపీ, దాని అనుకూల ఎల్లోమీడియా కట్టుకథలతో విష ప్రచారం చేస్తున్నాయి. దీనిపై అధికారులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. సెలవునూ రాజకీయం చేస్తారా ? నేను ధర్మవరం మున్సిపల్ కమిషనర్‌గా రెండున్నరేళ్ల నుంచీ విధులు నిర్వర్తిస్తున్నా. ఏనాడూ రాజకీయ ఒత్తిళ్లు రాలేదు. నేను ఇంతవరకు ఎప్పుడూ ఎక్కువ రోజులు సెలవు తీసుకోలేదు. వ్యక్తిగత పనుల నిమిత్తం 25 రోజులు సెలవు పెట్టాను. దీన్ని రాజకీయం చేయడం బాధ కల్గిస్తోంది. సెలవు ముగియగానే మళ్లీ విధుల్లో చేరుతా. –మల్లికార్జున, మున్సిపల్ కమిషనర్, ధర్మవరం వైద్య చికిత్స కోసం సెలవు నేను ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాను. వైద్యుల సూచనతో విశ్రాంతి కోసం సెలవు పెట్టాను. దీన్ని రాజకీయం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ధర్మవరంలో రెండేళ్లకుపైగానే విధులు నిర్వర్తించా. ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా పని చేశాను. మాపై తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గం. –నీలకంఠారెడ్డి, తహసీల్దార్, ధర్మవరం -
రామోజీ ‘ప్రసవ యాతన’కు అడ్డూఅదుపూ లేదా?
ఛాతీ ఆసుపత్రిలో ప్రసవాలెందుకు చేస్తారు రామోజీరావు గారూ? మీ ‘ప్రసవ యాతన’కు అడ్డూఅదుపూ లేదా? అధికారాన్ని కనటానికి చంద్రబాబు నాయుడితో కలిసి మీరెంత వేదన పడుతున్నారో జనానికి తెలియనిదేమీ కాదు. అలాగని ప్రతిరోజూ అబద్ధాలేనా? పండగ పూట అంతంత పెద్దగా పతాక శీర్షికల్లో వండి వార్చే ముందు కనీస వాస్తవాలేంటో తెలుసుకోవాలిగా? అనంతపురం సీడీ ఆసుపత్రిలో కొన్నేళ్లుగా ప్రసవాలే జరగటం లేదన్నది మీరు వాకృచ్చిన వార్తా రాజం. సీడీ ఆసుపత్రి అంటే చెస్ట్ డిసీజెస్ ఆసుపత్రి. అక్కడ ఊపిరితిత్తుల వ్యాధులు, ఇతర జబ్బులతో బాధపడుతున్న వారికి వైద్యసేవలందిస్తారు. ఇక్కడ గైనిక్ సేవలే ఉండవు. అలాంటి చోట గైనకాలజిస్టులు లేరంటూ... కొన్నేళ్లుగా ప్రసవాలే జరగటం లేదంటూ మీర్రాసిన రాతల్లో అర్థమేమైనా ఉందా? మీ చంద్రబాబు హయాంలోనూ ఇది చెస్ట్ ఆసుపత్రే కదా? ఇప్పుడెందుకు మీరు అంతయాతన పడుతున్నారు? ముఖ్యమంత్రి ఇలాకాలో... అంటూ బాక్సు కట్టి రాసిన రాతలూ అంతే. పులివెందుల ఏరియా ఆసుపత్రిలో 22 మంది వైద్యులకు గాను 10 మందే ఉన్నారంటూ ఎందుకంత విషం చిమ్మటం? అక్కడ మొత్తం 23 మంది వైద్యులని... వారిలో 17 మంది ప్రస్తుతం ఉన్నారని, మరో ఆరుగురు వైద్యులను సమకూర్చడానికి కసరత్తు జరుగుతోందని ఆసుపత్రిలో అడిగితే చెబుతారు కదా? అయినా నిజాలతో పనిలేనపుడు అది తెలుసుకోవాలన్న ఉద్దేశం మాత్రం మీకెందుకుంటుంది లెండి!. ‘వైద్యులు లేక గర్భిణులకు ఇబ్బంది... మత్తు వైద్య నిపుణులకూ కొరతే’ అంటూ మీరు అచ్చేసిన కథనంలో నిజినిజాలేంటో చెప్పడానికి!! ఆరోగ్య శ్రీ ఉందిగా... వేలకు వేలు ఖర్చెందుకు? ‘ఈనాడు’ రాతల్లో మరో దారుణమేంటంటే ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు గానీ, సౌకర్యాలు గానీ లేక.. అంతా ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయించి వేలకువేలు ఖర్చు చేస్తున్నారనేది!!. అసలు ఏ కొంచెమైనా ఇంగితం ఉండాలి కదా? సిజేరియన్ కావచ్చు, సాధారణం కావచ్చు... ప్రసవాలన్నీ ఆరోగ్య శ్రీ పరిధిలోనే ఉన్నాయి కదా? ప్రభుత్వాసుపత్రులకు వెళుతున్నారంటే వారంతా అర్హులేనని కదా అర్థం? మరి వాళ్లు ఒకవేళ తప్పనిసరై ప్రయివేట ఆసుపత్రులకు వెళ్లినా ఆరోగ్యశ్రీ కింద ప్రసవం జరుగుతంది కదా? వాళ్లెందుకు వేలకువేలు ఖర్చు చేస్తారు? ఇవేం రాతలు రామోజీరావు గారూ? పైపెచ్చు ప్రసవానికి నెట్వర్క్ ఆసుపత్రుల్లో చేరిన ప్రతి ఒక్కరికీ ప్రసవానంతరం విశ్రాంతి సమయానికి ‘ఆరోగ్య ఆసరా’ కింద ప్రభుత్వం రూ.5వేలు అందిస్తోంది. ఎందుకంటే పనిచేస్తే తప్ప పొట్టనిండని పేదలు ప్రసవానంతరం పనిచేయటం కష్టం కనక ఈ ఆసరా అవసరమన్నది సీఎం ఉద్దేశం. ఈ మూడేళ్లలో ఇలా ఆరోగ్య ఆసరా కింద 2,61,000 మందికి రూ.76.8 కోట్లు చెల్లించింది ప్రభుత్వం. కాకపోతే ఇవేవీ రామోజీకి కనిపించవు. అసలు 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీ కింద ఒక్క ప్రసవమైనా జరిగితే ఒట్టు!. ఎన్నికల గిమ్మిక్కులో భాగంగా 2018 డిసెంబర్లో ఓట్ల కోసం ప్రసవాల్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. 2019 జనవరి 15 నుంచి చికిత్సలు మొదలు పెట్టారు. ఆ సమయంలో ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, మౌలిక వసతులు లేక అందరూ ప్రయివేటు ఆసుపత్రులనే ఆశ్రయించారు. వేలకువేలు వదిలించుకున్నారు. కాకపోతే అప్పుడు రాయాల్సిన రాతలన్నీ ‘ఈనాడు’ ఇప్పుడు రాస్తుండటమే విచిత్రం. చంద్రబాబు హయాంలో 1,051 రకాల చికిత్సలకు మాత్రమే ఆరోగ్య శ్రీ వర్తించగా... ఇపుడది మూడు రెట్లు పెరిగి ఈ నెల నుంచి ఏకంగా 3,158 చికిత్సలకు వర్తించబోతోంది. ఇలాంటి మంచిపనులు ‘ఈనాడు’కు కనిపించకపోవటమే ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. తల్లీబిడ్డకు సురక్షిత ప్రయాణం.. ప్రభుత్వాసుపత్రుల నుంచి ప్రసవానంతరం తల్లీబిడ్డను సురక్షితంగా ఇంటికి చేర్చడానికి ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవల్ని ప్రభుత్వం బలోపేతం చేసింది. గతంలో 279 పాత వాహనాలే దిక్కు కాగా... వీటిని 500కు పెంచటంతో పాటు ఈ మధ్యే 500 కొత్త వాహనాలతో సేవలు విస్తరించారు. ఏప్రిల్ నుంచి ఇప్పటికి దాదాపు లక్ష మంది దీన్ని వినియోగించుకున్నారు. మునుపు ఒక ట్రిప్పుల్లో ఇద్దరేసి బాలింతల్ని తరలించటంతో ఇబ్బందులు పడ్డ బాలింతలకు ఇప్పుడు ఒక్కరినే తరలించడం పెద్ద ఊరటే!!. కాకపోతే ఇవేవీ ‘ఈనాడు’కు కనిపించవు. 40 వేల పోస్టుల భర్తీ... మునుపెన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వ హయాంలో ఒక్క వైద్య శాఖలోనే ఏకంగా 40వేల పోస్టులు భర్తీ అయ్యాయి. మిగిలిన కొద్ది పోస్టులు కూడా వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వాసుపత్రుల్ని పునర్నిర్వచించేలా ఏకంగా రూ.16,255 కోట్లతో ‘నాడు–నేడు’ కింద వాటిని బాగు చేస్తున్నారు. ఇక ధనికులు మాత్రమే ఆలోచించగలిగే ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని ప్రతి గ్రామానికీ పరిచయం చేస్తోంది ప్రభుత్వం. వీటన్నిటికీ తోడు టీడీపీ హయాంలో గర్భిణులకు ముందులనేవి ప్రభుత్వాసుపత్రుల్లో దొరికితే ఒట్టు. నిజానికి గర్భిణులకు, బాలింతలకు రకరకాల సమస్యలు సహజం. గర్భిణులకు రక్తపోటు ఉంటే లాబెటాలోల్ మాత్రలు వాడాలి. ఇవి బహిరంగ మార్కెట్లో ఒక్కోటీ రూ.16 పైనే. రోజుకు 2–3 మాత్రల చొప్పున 3 నుంచి 5 నెలలు వాడాలి. అధిక రక్తస్త్రావం అయితే మిసోప్రోస్టోల్ వాడాలి. ఇవీ ఖరీదైనవే. ఇలాంటì వేవీ టీడీపీ హయాంలో లేవు. బయటే కొనుక్కోవాల్సి వచ్చేది. ఇపుడైతే ఆ పరిస్థితులు లేవు. గర్భిణులకు, బాలింతలకు అవసరమైన మందులు... అవి కూడా డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలతో కూడినవి ప్రతి ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి. ఈ వాస్తవాలేవీ ఈనాడు’ పట్టవు మరి. 108 సేవలు మెరుగుపడలేదా? టీడీపీ హయాంలో 1.19 లక్షల జనాభాకు ఒకటి చొప్పున ‘104 అంబులెన్స్’లు 440 మాత్రమే ఉండేవి. ఇందులో అంతంతమాత్రంగా సేవలందించివని 336 మాత్రమే. మిగిలినవి కండీషన్లో ఉండేవి కాదు. వై.ఎస్.జగన్ అధికారంలోకి వచ్చాక 74 వేల మంది జనాభాకు ఒకటి చొప్పున 748 వాహనాలు అందుబాటులోకి తెచ్చారు. అప్పట్లో రోజుకు 1760 కేసుల్ని అటెండ్ అయిన అంబులెన్స్‌లు, ప్రస్తుతం 3294 కేసుల్ని డీల్ చేస్తున్నాయి. గ్రామీణులకూ మెరుగైన వైద్యం.. గ్రామీణులకు ఉన్నచోటే మెరుగైన వైద్యం అందేలా 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను గ్రామాల్లో నెలకొల్పుతున్నారు. వీటి ద్వారా ఇమ్యూనైజేషన్, ఓపీడీ, ఎన్సీడీ స్క్రీనింగ్ సహా పలు వైద్య సేవలు, 14 రకాల వైద్య పరీక్షలు, 67 రకాల మందులను ప్రభుత్వం అందిస్తోంది. వీటి ఏర్పాటుకు ఏకంగా రూ.1692 కోట్లు వెచ్చిస్తోంది. డిసెంబర్ 2022 నాటికి అన్ని క్లినిక్ భనాలూ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయి. పనులు జరుగుతుండటం పట్టదా? వైద్య విధాన పరిషత్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 251 సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులున్నాయి. వీటిలో 15 సీహెచ్‌సీల్లో ఈ ఏడాది జూలై వరకూ ఒక్క ప్రసవం జరగలేదన్నది ‘రామోజీ’ రాత. నిజానికి ఏడింట్లోనే ఒక్కటీ జరగలేదని, 6 ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగినా ఆన్లైన్లో ఎంటర్ చేయలేదని అధికారులు చెబుతున్నారు. మిగిలిన 7 చోట్ల నాడు–నేడు పనుల వల్ల లేబర్ రూమ్‌లు అందుబాటులో లేవు. కాకపోతే బురద చల్లడానికి ఈ నిజాలేవీ అవసరం లేదుగా? -
ఎలా చూసినా సంక్షేమ పథకాలు సమర్థనీయమే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల సుడిగుండంలో ఉందని ఒక విమర్శ ఉంది. దీనికి కారణం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న∙సంక్షేమ పథకాలు అనీ, రాష్ట్రం దివాలా తీసే దిశలోకి ప్రయాణిస్తోందనీ అభిప్రాయాలూ వెల్లువెత్తుతున్నాయి. నిజంగా ఆంధ్రప్రదేశ్ అప్పు ప్రమాదపు అంచుకి చేరిందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా ఇతర రాష్ట్రాల్లో పెరుగుతున్న అప్పులను ఎలా అర్థం చేసుకోవాలి? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చెప్పిన దాని ప్రకారం ప్రస్తుతానికి ఆంధ్ర ప్రదేశ్ అప్పు మార్చ్ 2022 నాటికి 3.98 లక్షల కోట్ల రూపాయలు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఇది 32.51 శాతంగా ఉంది. మరి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇది ఎక్కువ ఏమి కాదు. ఉదాహరణకి, ఈ అప్పు పంజాబులో 53.3 శాతంగా, రాజస్థాన్‌లో 39.5 శాతంగా, బీహార్‌లో 38.7 శాతంగా, కేరళలో 37.2 శాతంగా, పశ్చిమ బెంగాల్లో 34.2 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ది ఏడవ స్థానం. ఈ అప్పు కేంద్రానికి 60 శాతంగా ఉంది. ఇది అభివృద్ధి చెందిన దేశాల అప్పుతో పోలిస్తే చాలా తక్కువే. కానీ ఎఫ్ఆర్బీఎమ్ చట్టంలో కేంద్రం 40 శాతం, రాష్ట్రాలు 20 శాతంగా... మొత్తం దేశం అప్పు 60 శాతం మించొద్దని పేర్కొన్నారు. ఈ అరవై శాతం పరిమితికి సైద్ధాంతిక ప్రాతి పదిక ఏమీ లేదు. పైగా ఎవరూ ఈ పరిమితిని పాటించలేక పోతున్నారన్నది కూడా వాస్తవం. ప్రభుత్వం చేసే అప్పులు ఎంత దాకా సుస్థిరమో చెప్పే మూడు సూత్రాలు ఆర్థిక శాస్త్రంలో ఉన్నాయి. అవి ఏమిటంటే: ఒకటి– రాష్ట్రం అప్పు మీద చెల్లించే వడ్డీ రేట్ల కంటే రాష్ట్ర ఆదాయ రేటు ఎక్కువగా ఉన్నన్నాళ్ళు ప్రభుత్వ అప్పు అనేది కొనసాగించవచ్చు అనేది. ఇక రెండవ సూత్రం– దీర్ఘ కాలిక అప్పును వడ్డీ రేటు పెట్టి డిస్కౌంట్ చేసిన తర్వాత ఆ అప్పు స్థిరంగా ఉంటే, అలాంటి అప్పు ఫరవాలేదు. మూడవది– వడ్డీ వాయిదాలు తీసివేసిన తరవాత మిగిలే ప్రాథమిక అప్పు కాలక్రమేణా స్థిరంగా ఉంటే, ఆ అప్పు కూడా ఫరవా లేదు. ఈ సూత్రాల ఆధారంగా చెప్పేది ఏమిటంటే... ఆంధ్ర ప్రదేశ్ అప్పు మొదటి రెండు టెస్టులు సునాయాసంగా పాస్ అయ్యి, మూడవ టెస్టు కొంచెం కష్టంగా పాస్ అవుతోంది. కానీ అప్పుల ఊబి అంచున ఉందన్న వాదనకు మాత్రం ఏమీ ఆధారం లేదు. కొందరు శ్రీలంకతోటి పోల్చి అలాంటి సంక్షోభం వస్తుందా అని అడుగుతున్నారు. అయితే విదేశీ అప్పు, అంతర్గత అప్పు రెండూ వేరు వేరు విషయాలు. కేంద్రం అప్పు, రాష్ట్రం అప్పు కూడా వేరు వేరు విషయాలే. అయితే ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రమాదభరితంగా అప్పులు చేసింది అన్నదానికి సైద్ధాంతిక ఆధారాలు లేవు. అనేక సోషల్ మాధ్యమాలలో కొంతమంది మేధావులు చేసే ఆరోపణ ఏమిటంటే ఉచితాలు ఎక్కువగా ఇవ్వడం వలన ప్రభుత్వ ఖర్చు పెరిగి, అప్పుల భారం పెరిగిందని! ఇది చాలా అభ్యంతరకర వాదన. ఆధునిక సమాజంలో అన్ని వర్గాలకూ విద్య, వసతి, ఆరోగ్యం, జీవనోపాధి, ఇతర మౌలిక సదుపాయాలు అందించడం ప్రభుత్వాల బాధ్యత. వైస్సార్సీపీ ప్రభుత్వం ఏ కారణం వల్ల ఇచ్చినా అది సమర్థ నీయమే. ‘నవరత్నాలు’ అని చెప్పే సంక్షేమ పథకాల ద్వారా ఏపీ ప్రభుత్వం పేద ప్రజలకు గణనీయమైన ధన సహాయమే చేస్తోంది. విద్య మీద ఖర్చు 2019 –20లో రాష్ట్ర జీడీపీలో ఒకేసారి 2.71 శాతానికి పెంచారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ సంక్షేమం... ఎన్నడూ లేని విధంగా చివరి మూడేళ్లలో 2.24, 2.21, 2.11 శాతంగా ఉన్నాయి. ఇంకా ఆర్థిక సేవా విభాగ వ్యయం చివరి రెండేళ్లలో అత్యధికంగా 3.71, 3.55 శాతంగా ఉన్నాయి. ఆ విధంగా రాష్ట్రం మిలీనియం సస్టయినబుల్ గోల్స్ అందుకోవడా నికి ఇవి అవసరమే. మరో పక్క, మూల ధన వ్యయం చివరి మూడేళ్లలో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ (జీఎస్డీపీ)లో 1.27, 1.87, 1.54 శాతాలతో కావాల్సిన దానికంటే చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ ఆర్థిక పరిస్థితుల సుస్థిరత కోసం నిధుల్ని మూల ధన వ్యయానికి మరల్చడం అవసరం. అది చేయకపోతే రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు మందగించడం, దరిమిలా రాష్ట్ర ఆదాయం పెరగక పోవడం జరగవచ్చు. ఆదాయం పెరగక పొతే పథకాల అమలు ప్రమాదంలో పడవచ్చు. దీనికి సంక్షేమ పథకాలను తప్పు పట్టి ఎవరూ ఏమీ చెయ్యలేరు. పెట్టుబడిదారీ విధానంలో అభివృద్ధి ఫలాలు అందరికీ చేరవు కాబట్టి ప్రభుత్వాలు అప్పు చేసైనా అల్పాదాయ వర్గాల సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సి ఉంది. అప్పుల పెరుగుదలకు తగ్గ ఆదాయ సామర్థ్యం పెంచుకోవడం రాష్ట్రాలకు అవసరం. కానీ జీఎస్టీ విధానం తర్వాత రాష్ట్రాలు తమ స్వేచ్ఛను అనూహ్యంగా కోల్పోయాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం తన ఖర్చుల కోసం సెస్సులు విధించి, రాష్ట్రాలకు రావాల్సిన నిధుల విషయంలో మోసం చేస్తోంది. 15వ ఫైనాన్స్ కమిషన్, రిజర్వ్ బ్యాంకు వాళ్ళ నివేదికలలో కూడా దీని ప్రస్తావన ఉంది. గత ఏడేళ్లలో ఆంధ్ర ప్రదేశ్ సగటు నిజ ఆర్థిక వృద్ధి రేటు 7.76గా ఉంది. ఇది దేశ జీడీపీ రేటు 5.08తో పోలిస్తే మెరుగ్గానే ఉంది. ఇక నామినల్ వడ్డీ రేటు 15 నుండి 18 శాతం మధ్య ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందనడం అవాస్తవం. రాష్ట్ర రెవెన్యూ ఆదాయం, రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో కూడా రాష్ట్ర పరిస్థితి బాగానే ఉంది. రాష్ట్ర ఆదాయ సామర్థ్యం గణనీయంగా ఉన్నప్పటికీ, రాష్ట్రానికి పన్ను విధింపు అధికారాలు పరిమితం చేయడం వల్ల పెరిగిన ఖర్చును ఆదాయం ద్వారా అందుకోలేక పోతోంది. కేంద్రం... రాష్ట్రాలకు సరైన గ్రాంట్లు ఆలస్యం చేయకుండా ఇవ్వడం, కేంద్ర–రాష్ట్ర పన్నుల జాబితాలను సవరణ చేసి రాష్ట్రాలకు అదనపు పన్నులు విధించుకునే అధికారాలు ఇవ్వడం ఇందుకు పరిష్కార మార్గాలు. – శివదుర్గా రావు, రీసర్చ్ స్కాలర్, – రమణ మూర్తి, ఆర్థిక శాస్త్ర ఆచార్యులు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం -
చంద్రబాబు క్షుద్ర రాజకీయం
-
ప్రకృతి వైపరిత్యాల్లోనూ టీడీపీ చిల్లర పనులు
-
బురద జల్లడమే జనవాణి అజెండా.. ఫ్యాక్ట్ చెక్
సాక్షి, అమరావతి: దున్నపోతు ఈనిదంటే.. దూడను గాటన కట్టేయమన్న తరహాలో విపక్ష టీడీపీ, జనసేన, వాటికి కొమ్ముకాసే మీడియా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలో చీమ చిటుక్కుమన్నా రాజకీయ రంగు పులిమి రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడం వారికి రివాజుగా మారింది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాజాగా నిర్వహించిన ‘జనవాణి’ కార్యక్రమమే ఇందుకు నిదర్శనం. విజయవాడలో ఆదివారం జరిగిన ‘జనవాణి’ వేదికగా వాస్తవాలు తెలుసుకోకుండా పవన్ కల్యాణ్ తన అక్కసు వెలిబుచ్చారు. తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన అనిత అనే మహిళ పేరుతో అవాస్తవాలను వల్లించారు. ఆమె స్థలాన్ని వైఎస్సార్సీపీ నాయకుడు కబ్జా చేశాడంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు. ఆమె స్థలం కబ్జాకు గురైందన్న ఆరోపణలపై విచారణలో వెలుగు చూసిన అంశాలను తిరుపతి జిల్లా కలెక్టర్ వెల్లడించారు. పవన్ డ్రామాలు కలెక్టర్ నివేదికతో బహిర్గతమయ్యాయి. విచారణలో వెలుగు చూసిన వాస్తవాలను పరిశీలిస్తే... తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి గ్రామం తారకరామ నగర్లో అనిత అనే మహిళకు 2004లో ప్రభుత్వం ప్లాట్ నంబర్ 2400లో ఇంటి పట్టా కేటాయించింది. 6 నుంచి 12 నెలల్లోగా అందులో ఇల్లు లేదా గుడిసె నిర్మించుకుని స్వాధీనంలో ఉంచుకోవాలని షరతు విధించింది. ► 2004 నుంచి తమకు కేటాయించిన ప్లాట్లలో గుడిసె / ఇల్లు నిర్మించుకోని 989 మందికి 2018లో టీడీపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. లబ్ధిదారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్లాట్లను రద్దు చేసి అర్హులైన ఇతరులకు పంపిణీ చేపట్టింది. ► ఈ క్రమంలో ప్లాట్ నంబరు 2400ని గత సర్కారు వి.వెంకటేష్ అనే వ్యక్తికి కేటాయిస్తూ 2018లో ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ మంజూరు చేసింది. అందులో వెంకటేష్ షెడ్డు నిర్మించుకుని ఇంటి పన్ను, కరెంటు బిల్లు చెల్లిస్తున్నాడు. ►షెడ్డు నిర్మిస్తున్న సమయంలో అనిత, వెంకటేష్ మధ్య వివాదం చోటు చేసుకుంది. అనిత షెడ్డును స్వాధీనం చేసుకోవడంతో ఆమెపై వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత అనిత నుంచి షెడ్డును స్వాధీనం చేసుకున్న వెంకటేష్ చుట్టూ ప్రహరీగోడ నిర్మించుకున్నాడు. ► వైఎస్సార్సీపీతో వెంకటేష్‌కు ఎలాంటి సంబంధం లేదు. అసలు ఈ వివాదం 2019 తర్వాత చోటు చేసుకున్నది కూడా కాదు. -
ఉచిత విద్యుత్‌పై టీడీపీ అసత్య ప్రచారం: మంత్రి బుగ్గన
సాక్షి,డోన్: వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్‌పై టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లా డోన్‌లో శనివారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి వైఎస్సార్సీపీ ప్లీనరీలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుదుత్పత్తికి ఏటా రూ.10 వేల కోట్లు వ్యయం చేస్తుంటే.. రూ.2 వేల కోట్లకు లెక్కలు తేలడం లేదన్నారు. ఈ నేపథ్యంలో మోటార్లకు మీటర్లు బిగించబోతున్నట్లు చెప్పారు. రైతులకు యథాతథంగా ఉచిత విద్యుత్ అందుతోందని తెలిపారు. -
AP: ఏం తమాషాలు చేస్తున్నారా?.. భార్యాభర్తలపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, అమరావతి: ఓ వ్యక్తితో తలెత్తిన ఆర్థిక వివాదం పరిష్కారానికి పోలీసుల ఆదేశం మేరకు స్టేషన్‌కు వెళ్లిన తన భార్య తిరిగి రాలేదని, ఆమెను కోర్టు ముందు హాజరు పరిచేలా పోలీసులను ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్‌కు, ఆయన భార్యకు మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని, అందుకే ఆమె కొన్నాళ్లు భర్తకు దూరంగా వెళ్లిందని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. ప్రస్తుతం వారిద్దరూ కలిసి ఉంటున్నారని వివరించారు. దీంతో పిటిషనర్ మంథా రవిప్రసాద్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. చదవండి: భర్త నుంచి విడాకులు.. ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని.. ఏం తమాషాలు చేస్తున్నారా? భార్య, భర్త కలిసి కోర్టుతో ఆడుకుంటున్నారా అంటూ మండిపడింది. పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు, కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేసినందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని రవిప్రసాద్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. భేదాభిప్రాయాల కారణంతో వెళ్లిపోయింది పశ్చిమ గోదావరి జిల్లా, ఉండ్రాజవరానికి చెందిన మనురాజు శ్యాంకుమార్ తమకు రూ. 5 లక్షలు ఇవ్వాలని, ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు పోలీసులు తన భార్య ఉషా పది్మనిని స్టేషన్‌కు పిలిపించారని, అప్పటి నుంచి ఆమె కనిపించడంలేదంటూ రవిప్రసాద్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. గత వారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా.. స్టేషన్‌కు వెళ్లిన మహిళ కనిపించకపోవడం తీవ్రమైన విషయమంటూ ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించిన సంగతి విదితమే. ఈ వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు వచ్చింది. పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది వైఎన్ వివేకానంద స్పందిస్తూ, పిటిషనర్ భార్యను ఏ కేసు విషయంలోనూ స్టేషన్‌కు పిలిపించలేదంటూ పోలీసులు అఫిడవిట్ దాఖలు చేశారని వివరించారు. కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిన తరువాత ఉషా పద్మిని భర్త వద్దకు తిరిగి వచ్చిందని చెప్పారు. ఆమె ఇంటి నుంచి ఎందుకు వెళ్లిందని ధర్మాసనం ప్రశ్నించగా.. భర్తతో భేదాభిప్రాయాల కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయారని వివేకానంద తెలిపారు. దీంతో ధర్మాసనం పిటిషనర్‌పైన, ఉషా పద్మినిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. వారి మధ్య వివాదం ఉంటే, పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించింది. డబ్బు ఇవ్వాల్సిన శ్యాం కుమార్, పోలీసులు కుమ్మక్కయ్యారని, ఉషా పద్మినిని కిడ్నాప్ చేశారని రవిప్రసాద్ తరఫు న్యాయవాది ఆరోపించారు. వేటి ఆధారంగా పోలీసులపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని ధర్మాసనం ప్రశి్నంచింది. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నందుకు పిటిషనర్‌పై ఎందుకు చర్యలు తీసుకోకూడదని ప్రశ్నించింది. భార్య, భర్త మధ్య గొడవ ఉంటే కోర్టుకొచ్చి ఏవేవో చెబుతూ కోర్టు ప్రక్రియను దురి్వనియోగం చేశారని మండిపడింది. కోర్టుతో ఆడుకుంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. -
ఏది నిజం?: కోతలు కాదు... కళ్లున్నా చూడలేని రాతలు!
పెరిగిన కార్డులు కనిపించలేదు. అత్యంత నాణ్యతతో ఇస్తున్న సరుకులు కనిపించలేదు. దాదాపుగా రెట్టింపు స్థాయిలో ఇస్తున్న సబ్సిడీ గానీ... కార్డుదారుల కష్టాలెరిగి...ఇంటి ముంగిటకే వస్తున్న రేషన్ డెలివరీ గానీ... ఇవేవీ ‘ఈనాడు’కు కనిపిస్తే ఒట్టు!!.ప్రజల్ని ఓటర్లుగా మాత్రమే గుర్తించే నారా వారు చివరి ఏడాదిలో ‘ప్రయోగాత్మకంగా’ పంచిన రాగులు, జొన్నలు మాత్రం కనిపించాయి. అవిప్పుడు ఇవ్వటం లేదు కాబట్టి రేషన్ మొత్తానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కోత పెట్టేసిందంటూ శోకాలందుకున్నారు రామోజీ!. అసలు చంద్రబాబు హయాంలో ఏ సరుకులు.. ఎంతమందికిచ్చారు? ఎంత సబ్సిడీ ఇచ్చారు? సరుకుల్లో నాణ్యతెంత? ఇవన్నీ ‘ఈనాడు’కు ఆనాడెందుకు కనిపించలేదు? ఇప్పుడు ఇన్ని రకాలుగా పేదలను ఆదుకుంటున్నా ఎందుకిలా పదేపదే అబద్ధాలకు రంగేస్తున్నారు? ‘రేషన్ కోతలు’ అంటూ శుక్రవారం ‘ఈనాడు’ అచ్చేసిన వార్తలో ఏది నిజం? గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో వివిధ పథకాల లబ్ధిదారులకు అందిన మొత్తం 1.37 లక్షల కోట్లు. అదికూడా పైసా అవినీతికి తావు లేకుండా... నేరుగా వారి ఖాతాల్లోకే వచ్చింది. 31 లక్షల కుటుంబాలకు సొంతింటి కల నెరవేరుతోంది. లక్షల రూపాయల విలువ చేసే స్థలాలు.. ఆ ఇంటి మహలకు‡్ష్మల చేతిలో ‘పట్టా’లయ్యాయి. ఇవన్నీ ఈనాడుకెన్నడూ కనిపించవు. రామోజీ దృష్టిలో చంద్రబాబు ఏలిన కాలమేదైనా గుప్తులనాటి స్వర్ణ యుగంతో సమానమే. ఆయనకది స్వర్ణయుగం కాబట్టి వేరెవరు అధికారంలో ఉన్నా తట్టుకోలేరు. నిజానికి చంద్రబాబు హయాంలో ప్రతిపక్షానికి మద్దతిచ్చేవారి రేషన్ కార్డులూ పోయాయి. అలా ఏరేస్తేనే... ఆయన దిగిపోయే నాటికి 1.39 కోట్ల కార్డులు మిగిలాయి. కానీ సంక్షేమ జెండాకు పార్టీలుండవని మనసావాచా నమ్మే వైఎస్ జగన్... ఇంటింటికీ వలంటీర్లను పంపి మరీ... అర్హులకు కార్డులిచ్చారు. కార్డులు ఆరు లక్షలు పెరిగి... 1.45 కోట్లకు చేరాయి. ఇదీ నిజం!. ఇక బాబు హయాంలో రేషన్ బియ్యం ఇచ్చినా దాన్ని తినేవారు తక్కువే. ఎందుకంటే ముక్కిపోవటం... పురుగులు పట్టడం... రాళ్లు, నూకలు ఎక్కువగా ఉండటంతో పాటు గింజలు రంగు మారటం వంటి అప్పట్లో అత్యంత సహజం. ఇంటికి తెచ్చుకున్న బియ్యాన్ని లబ్ధిదారులు శుభ్రం చేసుకోవడానికే సమయం పోయేది. కానీ ఇప్పుడిస్తున్నది నాణ్యమైన సార్టెక్స్ బియ్యం. కరోనా సమయంలో ప్రభుత్వం ఇచ్చిన నాణ్యమైన రేషన్ బియ్యమే పేదల ఆకలి తీర్చింది. బియ్యం సార్టెక్స్‌కే కిలోకు రూపాయి చొప్పున నెలకు 20 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంతెందుకు... బాబు ఐదేళ్ల కాలంలో బియ్యం సబ్సిడీపై చేసిన ఖర్చు రూ.12,377 కోట్లయితే జగన్ ప్రభుత్వం కిలో రూపాయి చొప్పున నాణ్యమైన బియ్యమిస్తూ ఈ మూడేళ్లలోనే రూ.12,379 కోట్లు సబ్సిడీకి వెచ్చించింది. ఇదీ ‘ఈనాడు’ చెప్పలేని నిజం!!. పై పట్టికలో చూస్తే టీడీపీ హయాంలో గరిష్ఠంగా బియ్యం పంపిణీ చేసింది 2014–15లోనే. అది కూడా... 25.93 లక్షల టన్నులు. కానీ గడిచిన మూడేళ్లుగా ప్రస్తుత ప్రభుత్వం ప్రతి ఏటా అంతకన్నా ఎక్కువే పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది ఏకంగా 27.8 లక్షల టన్నులు పంపిణీ చేసింది. ఈ నిజాన్ని ఎందుకు చెప్పరు రామోజీ? దీన్ని కోతలంటారా? గతంలో రేషన్ సరుకులు తెచ్చుకోవటమంటే... అదో పెద్ద ప్రహసనం. రేషన్ డిపోల దగ్గరి సీన్లు వర్ణించలేం. సర్వర్లు ఎప్పుడు పని చేస్తాయో తెలీక రోజంతా కూలి మానేసి క్యూలో పడిగాపులు పడేవారు. ఒక్కోసారి రేషన్ తీసుకోకుండానే ఇంటికి వెళ్లేవారు. వృద్ధులు, దివ్యాంగుల పరిస్థితి మరీ ఘోరం. కానీ ఈ నిజాలనెప్పుడూ ‘ఈనాడు’ చెప్పలేదు. ఎందుకంటే తమ బాబు సీఎం మరి. కానీ ఏడాది కిందట వై.ఎస్.జగన్ ఆరంభించిన ఇంటింటికీ రేషన్ డెలివరీతో పరిస్థితి మొత్తం మారిపోయింది. 9,260 వాహనాల్లో లబ్ధిదారులకు ఇళ్లవద్దే రేషన్ అందుతోంది. ఈ మొబైల్ వాహనాలతో ఉపాధి పొందుతున్న ఆపరేటర్లకు నెలకు సుమారు రూ.25 కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తోంది. కార్డుదారుల సమక్షంలో ఇంటి దగ్గరే సంచులు తెరచి, కచ్చితమైన తూకంతో ఇస్తుండటంతో కొలతలపై ఫిర్యాదుల్లేవు. వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయడంతో అక్రమ రవాణా లేదు. ఇవి కూడా ‘ఈనాడు’ చెప్పని నిజాలే మరి!!. ఇదీ... బాబు చిరుధాన్యాల గుట్టు టీడీపీ ప్రభుత్వం హయాంలో రాగులు, జొన్నలు, గోదుమ పిండి, ఉప్పు పంపిణీ చేయటం మొదలెట్టిందే చివర్లో. ‘ఈనాడు’ దృష్టిలో అది సూపర్. 1.38 కోట్ల కార్డుల్లో కేవలం 1 శాతానికే వీటినిచ్చినా... అబ్బో అంటున్నారు రామోజీ. ఎన్నికల భయంతో ప్రజలను మభ్యపెట్టేందుకు చివరి సంవత్సరంలో పంపిణీ చేశారీ చిరు ధాన్యాల్ని. గతంలో నెలకు 14 వేల టన్నుల గోధుమ పిండి అవసరం ఉంటే 900 టన్నులే తెచ్చి కొద్ది మందికే పంపిణీ చేశారు. ఇక్కడి ప్రజలు బియ్యం ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడతారు. కార్మికులు, కూలి కుటుంబాలకు గోధుమ పిండితో రొట్టెలు చేసుకునే తీరిక ఉండదు. దీంతో గోధుమ పిండిని తీసుకోవడానికి ఇష్టపడకపోవడంతో నిల్వలు పాడైపోతున్న కారణంగా పంపిణీ నిలిచిపోయింది. రాగులు, జొన్నల పంపిణీ విషయంలోనూ ఇదే జరిగింది. 2018–19 మధ్య 25,034 టన్నుల రాగులు, 15,635 టన్నుల జొన్నలను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసి కార్డుదారులకు సరఫరా చేశారు. వీటిని బయటి మార్కెట్ నుంచి కొనటంతో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ నిలిపివేసింది. వీటి పరిమాణానికి సమానమైన బియ్యంపైనా సబ్సిడీ ఇవ్వలేదు. ఈ భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. వీటిని తీసుకునేందుకెవరూ ఆసక్తి చూపించకపోవడంతో మధ్యలోనే ఆగిపోతే.. దీనిక్కూడా ‘ఈనాడు’ మసి పూసేసింది. ఇక కందిపప్పు జూన్ 2014 నుంచి అక్టోబర్ 2016 వరకు పంపిణీయే చేయలేదు. నవంబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2018 వరకు గిరిజన ప్రాంతాల్లో మాత్రమే కిలో రూ.40 చొప్పున పంపిణీ చేసింది. ఎన్నికలు వస్తున్నాయనగా మార్చి 2018 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కార్డుదారులకు రెండు కిలోల కందిపప్పు పేరిట పంచి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. 85,600 టన్నులకు సబ్సిడీ కింద రూ.254 కోట్ల మాత్రమే వెచ్చించారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం మూడేళ్లలో 5.14 లక్షల టన్నుల కందిపప్పును పంపిణీకి రూ.1350 కోట్లు సబ్సిడీ భరించింది. ఇదీ... నిజం. రక్తికట్టని ఎన్నికల డ్రామా.. ఎన్నికల డ్రామాలో భాగంగా కందిపప్పు పంపిణీని ప్రారంభించి... బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.63 ఉంటే రూ.23 మాత్రమే సబ్సిడీ భరించి రూ.40కు పంపిణీ చేసినా రామోజీకది అద్భుతంగానే కనిపించింది. మార్కెట్ ఒడిదుడుకులు, కోవిడ్ సంక్షోభం, ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసరాల రేట్లు అమాంతం పెరిగాయి. దీంతో ప్రస్తుత మార్కెట్లో కిలో కందిపప్పు రూ.115కు చేరింది. ప్రభుత్వం రూ.39 సబ్సిడీ భరించి ప్రజలకు రూ.67కు అందిస్తోంది. నెలనెల రూ.56 కోట్ల సబ్సిడీ భరిస్తోంది. ఇదే నేరమైనట్లు... ధరలు పెంచేశారంటూ ‘ఈనాడు’ గుండెలు బాదుకోవటం చూస్తే చిత్రంగానే అనిపిస్తుంది. పంచదార పరిస్థితీ అంతే. నెలకు సగటున 7724 టన్నులు అవసరం కాగా, కేంద్రం కేవలం 908 టన్నులకే రాయితీ ఇస్తోంది. మిగిలినదంతా రాష్ట్రం బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసి... సబ్సిడీని భరిస్తోంది. అసలు టీడీపీ ఐదేళ్లలో 3.52 లక్షల టన్నుల చక్కెర పంపిణీలో రూ.314 కోట్లు సబ్సిడీ భారాన్ని భరిస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ మూడేళ్లలో 2.70 లక్షల టన్నులు పంపిణీ చేసి రూ.541 కోట్లు భరించింది. ఈ లెక్కలు చాలవూ రేషన్‌కు ఎవరు కోతలు పెట్టారో చెప్పటానికి? ఎవరెంత సబ్సిడీ భరిస్తూ పేదల పక్షానున్నారో తెలియటానికి? -
ఏది నిజం?: విద్యుత్ వెలుగులపై చీకటి రాతలు
రాజకీయమైనా... పాత్రికేయమైనా రాష్ట్రం బాగును కోరుకోవాలి. దౌర్భాగ్యవశాత్తూ ఆంధప్రదేశ్‌కు అదే లేదు. అటు ప్రతిపక్షం... దానికి కొమ్ముకాసే పాత్రికేయ పక్షం... రెండిటిదీ ఒకే అజెండా!!. రాష్ట్రాదాయం పెరగకూడదు. అప్పులు తేకూడదు. పరిశ్రమలు రాకూడదు. సంక్షేమ పథకాలు నిలిచిపోవాలి. విద్యుత్ కోతలు పెరగాలి. మొత్తంగా... రాష్ట్రం నాశనమైపోవాలి. అందుకోసం అవసరమైతే... డ్రగ్స్ ముద్ర వేస్తారు. శ్రీలంకలా దివాలా తీస్తుందని ప్రచారం చేస్తారు. ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికీ వెనకాడరు. అందులో భాగమే... కొద్దిరోజులుగా విపరీతమైన విషప్రచారం చేస్తూ... బుధవారం నాడు ‘ఆ విద్యుత్ అదానీదే’ అంటూ ‘ఈనాడు’ రాసిన కథనం. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు వచ్చే 30ఏళ్లలో భారీగా గండి పడనున్నదంటూ రామోజీరావు వండిన వంటకంలో నిజానిజాలేంటి? ఏది నిజం? ఇదిగో చూద్దాం... లక్ష దీపాల మధ్య నిలబడ్డా... కళ్లు మూసుకుంటే చీకటే. ‘ఈనాడు’దీ అదే పరిస్థితి. ఒప్పందాలు... రికార్డుల సాక్షిగా నిజాలు నర్తిస్తున్నా దానికి కనిపించవు. రైతుల కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం ఏం చేసినా... దాన్ని వ్యతిరేకించాల్సిందేనన్నది రామోజీ సిద్ధాంతం. ఎందుకంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికున్న జనాదరణను తగ్గించకపోతే తన చంద్రబాబు వానప్రస్థం శాశ్వతమవుతుందన్నది ఆయన భయం. రాత్రనక, పగలనక రైతులు పొలాల్లో విద్యుత్ కోసం పడిగాపులు కాస్తూ, ప్రాణాలు పోగొట్టుకున్న చీకటి రోజుల నుంచి విముక్తి కలిగిస్తూ పగటిపూట 9 గంటల విద్యుత్ అందిస్తోంది ప్రభుత్వం. వ్యవసాయ విద్యుత్‌ను రైతులు తమ హక్కుగా భావించేలా చర్యలు చేపడుతూ, వచ్చే 30 ఏళ్ల పాటు వారికి విద్యుత్ కష్టాలు లేకుండా సౌర విద్యుత్‌ను సమకూర్చే ప్రయత్నాల్లో ఉంది. చంద్రబాబు హయాంలో ఆరోహి సోలార్ ప్రైవేటు లిమిటెడ్‌తో యూనిట్‌కు రూ.5.63 చొప్పున కుదుర్చుకున్న సోలార్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఇందులో భాగంగా... ప్రైవేటు నుంచి కాకుండా,‘ట్రిపుల్ ఏ’ రేటింగున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)’ నుంచి నేరుగా 7వేల మెగావాట్ల సౌర విద్యుత్ తీసుకునే ఒప్పందం చేసుకుంది. నిజానికిదే ఒప్పందం చంద్రబాబులా ఏ ప్రైవేటు కంపెనీలతోనో చేసుకుంటే ‘ఈనాడు’ దాని బృంద మీడియా శివాలెత్తేసేవి. కానీ నేరుగా సెకీతో కావటంతో బురద జల్లడానికి రంధ్రాన్వేషణ మొదలెట్టి.. చివరకు ఆ సెకీ అదానీ, తదితరుల నుంచి కొని రాష్ట్రానికి అందిస్తుందంటూ... అదానీ కోసమే ఈ ఒప్పందం చేసుకున్నారంటూ కొత్త రాగం మొదలెట్టాయి. దీనికన్నా దివాలాకోరుతనం ఇంకేమైనా ఉంటుందా రామోజీ? 2024 నుంచి 18 లక్షల మందికి పగటిపూట 9 గంటల పాటు ప్రత్యేక డిస్కమ్ ద్వారా ఉచిత విద్యుత్ అందటమే మహాపరాధంగా పరిగణిçస్తూ రాస్తున్న మీ కథనాలను ఏమనుకోవాలి? ఇదెక్కడి దివాలాకోరుతనం? ‘టాటా’ సంస్థ ఏమన్నది రామోజీ? నిజమే! వ్యవసాయ విద్యుత్ కోసం 6,400 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ అభివృద్ధి చేయాలంటూ రాష్ట్ర గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీజీఈసీఎల్) 2020లో టెండర్లు పిలవటం నిజం. దాన్నెవ్వరూ కాదనరు. యూనిట్ రూ.2.49, రూ.2.56 చొప్పున ఇస్తామని బిడ్లు దాఖలు కావటమూ నిజమే. మరి ఈ బిడ్లలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) కూడా ఉందిగా!. ఆ విషయమెందుకు ప్రస్తావించరు రామోజీ? ఈ టెండర్లు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లేవని టాటా సంస్థ కోర్టుకెళ్లింది. మీరు మాత్రం ఇలా కాకుండా... టెండరు నిబంధనలు కొన్ని సంస్థలకు అనుకూలంగా ఉన్నాయంటూ టాటా సంస్థ కోర్టుకెక్కినట్లు రాసిపారేశారు. ఇదెక్కడి పాత్రికేయం? ఆ సంస్థ కోర్టులో కాకుండా మీతో మాత్రమే ఈ విషయం చెప్పిందా? మరీ ఇంత తప్పుడు రాతలేల? చంద్రబాబు హయాంలో దయానిధి సోలార్ పవర్ ప్రైవేటు లిమిటెడ్‌తో యూనిట్‌కు రూ.5.97 చొప్పున కుదుర్చుకున్న సోలార్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ రాజస్థాన్‌లో ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ ద్వారా ఇస్తున్న విద్యుత్ యూనిట్ రూ.2.01. నిజమే! కానీ రాజస్థాన్‌లో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్ఎఫ్) 23.5 శాతం. కానీ ఏపీలో ఇది 17.5 శాతమే. మరి ధరలో మార్పులుండవా? గ్రిడ్ చార్జీలు మినహాయించారు గనకే... సెకీ నుంచి విద్యుత్ తీసుకోవడం వల్ల పాతికేళ్ల పాటు అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ చార్జీల నుంచి కేంద్రం మినహాయింపు వస్తోంది. అదే రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే పాతికేళ్లు సెంట్రల్ గ్రిడ్ చార్జీలు చెల్లించాలి. రాష్ట్రంలో అంతర్గతంగా సౌర ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే వాటికి కావాల్సిన విద్యుత్ లైన్లు, అంతర్గతంగా విద్యుత్ ప్రసార వ్యవస్థ బలోపేతం చేయటం తప్పనిసరి. రాష్ట్రంలో ఇçప్పుడున్న విద్యుత్ ప్రసార వ్యవస్థలపై దీనికోసం పెట్టాల్సిన ఖర్చును బేరీజు వేసుకుంటే బయటి రాష్ట్రాల నుంచి సౌర విద్యుత్ తీసుకున్నప్పుడే తక్కువవుతోంది. అందుకే తొలత రాష్ట్రంలోనే సౌర విద్యుత్ ప్రాజెక్టు పెట్టాలనుకున్నప్పటికీ... తరువాత సెకీ ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. వీటిలో కొన్ని అంశాలనే ప్రస్తావించటం ద్వారా ‘ఈనాడు’ తప్పుడు సమాచారానికే ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పకనే చెబుతోంది. అందుకే... కేంద్రం ఆమోదం 2003 విద్యుత్ చట్టం ప్రకారం సెకీ ఒప్పందాలకు ఏపీఈఆర్సీ అనుమతినిచ్చింది. దీంతో సెకీ నుంచి 2024 సెప్టెంబర్ నుంచి విద్యుత్ కొనుగోలు మొదలవుతుంది. తొలి ఏడాది 3 వేల మెగావాట్లు, 2025లో మరో 3వేల మెగావాట్లు, 2026లో 1000 మెగావాట్లు చొప్పున 7 వేల మెగావాట్లను రాష్ట్రం తీసుకుంటుంది. డిస్కమ్‌తో పాటు ప్రభుత్వమూ ఒప్పందంలో భాగస్వామి కావటంతో చెల్లింపులకు ఇబ్బంది ఉండదు. అందుకే కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి కూడా దీన్ని ఆమోదించింది. చంద్రబాబు హయాంలో నిరంజన సోలార్ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్‌తో యూనిట్‌కు రూ.5.71 చొప్పున కుదుర్చుకున్న సోలార్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఏటా రూ.3,750 కోట్ల ఆదా... ప్రస్తుతం రాష్ట్రం కొనుగోలు చేస్తున్న విద్యుత్ యూనిట్‌కు సగటున రూ.5.10 అవుతోంది. సెకీ విద్యుత్ మాత్రం యూనిట్‌కు రూ.2.49కి వస్తోంది. ప్రస్తుతం రాష్ట్రానికి ఎన్టీపీసీ ఇస్తున్న సౌర విద్యుత్ ధర కూడా ట్రేడింగ్ మార్జిన్ కలిపి యూనిట్‌కు రూ.2.79 అవుతోంది. ఎలా చూసినా సెకీ విద్యుత్ తక్కువకే వస్తోంది. ఏటా దాదాపు రూ.3,750 కోట్లు ఆదా అవుతోంది. కాకపోతే ‘ఈనాడు’ రాతల్లో ఇవేవీ ఉండవు. ఆ రాతల లక్ష్యం వేరు మరి. 35 వేల కోట్ల భారం.. ఎవరి పాపం? టీడీపీ ప్రభుత్వ హయాంలో మార్కెట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.2.44లకు లభిస్తుంటే (బ్యాక్‌డౌన్ చార్జీలతో కలిసి రూ.3.54), ఏకంగా యూనిట్ రూ.6.99కి కొన్న చరిత్ర బాబుది. దాన్ని ఏమాత్రం విమర్శించని నిఖార్సయిన జర్నలిజం రామోజీది. ఇక çపవన విద్యుత్కయితే యూనిట్‌కు రూ.4.84 వరకు అదనంగా పెట్టి నామినేషన్ పద్ధతిలో మరీ పీపీఏలు చేసేశారు. పోటీ బిడ్డింగ్ లేనేలేదు. ‘ఈనాడు’కు ఇదంతా దోచిపెట్టినట్లుగా కనిపించకపోవటమే చిత్రం. 4 వేల మెగావాట్లకు ఒప్పందాలపై సంతకాలు చేశాక ఎక్కువ చెల్లిస్తున్నట్లు చంద్రబాబుకు గుర్తుకువచ్చి ఏపీఈఆర్సీకి ఓపీ నెం.17ను దాఖలు చేయటం హాస్యాస్పదమే తప్ప మరొకటి కాదనే చెప్పాలి. ఏదేమైనా ఫలితం మాత్రం విద్యుత్ పంపిణీ సంస్థలపై ఏటా రూ.3,500 కోట్ల భారం. అది కూడా 25 ఏళ్లపాటు. ప్రస్తుత విలువ ప్రకారం డిస్కమ్‌లు రూ.35 వేల కోట్లకు పైనే చెల్లించాలి. ఈ కథంతా ‘ఈనాడు’కు ఇంపుగా అనిపించటం చిత్రాతిచిత్రం. – సాక్షి, అమరావతి ‘ఈనాడు’కి అక్కర్లేని నిజాలివీ... ►టీడీపీ హయాంలో రూ.30 వేల కోట్లు రుణాలు తీసుకుని 2018–19 నాటికి వాటిని ఏకంగా రూ.62 వేల కోట్లకు చేర్చటం నిజం కాదా? ►గత ప్రభుత్వం బకాయిలకు 2014–19 మధ్య రూ.24,165 కోట్లు మాత్రమే చెల్లించగా, ప్రస్తుత ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో రూ.35,963 కోట్లు చెల్లించటం అబద్ధమా? ►విద్యుత్ రంగంలో దుబారా, దోపిడీ అరికట్టి మూడేళ్లలో విద్యుత్ కొనుగోళ్లు, ఉత్తమ యాజమాన్య విధానాల ద్వారా దాదాపు రూ.4,925 కోట్లు ఆదా చేయటం నిజం కాదా? ►వ్యవసాయ రంగానికి ఐదేళ్లలో టీడీపీ విడుదల చేసిన మొత్తం రాయితీలు రూ.13,255 కోట్లు కాగా, ఈ ప్రభుత్వం రెండున్నరేళ్లలో విడుదల చేసిన సబ్సిడీ రూ.21,497 కోట్లు. ఈ నిజాలతో మీకు పనిలేదా రామోజీ? -
ఆస్తి పన్ను పెంపుపై ప్రతిపక్షాలవి అసత్య ఆరోపణలు: మంత్రి బొత్స
అమరావతి: ఆస్తి పన్ను పెంపుపై ప్రతిపక్షాలవి అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. దళారులు లేకుండా పారదర్శక పన్ను విధానం రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోని పన్ను విధానాలనూ పరిశీలించి, అత్యుత్తమ పన్ను విధానాన్నే రాష్ట్రంలో తీసుకొచ్చామని మంత్రి బొత్స పేర్కొన్నారు. తిరుపతి స్మార్ట్ సిటీ అభివృద్ధికి అదనంగా రూ.123 కోట్లు కేటాయించినట్లు మంత్రి బొత్స వెల్లడించారు. అంతేకాకుండా ఆస్తి పన్ను పెంపు 15 శాతానికి పరిమితం చేశామని, ఇది చాలా తక్కువ అని ఆయన తెలిపారు. కాగా అమర్ రాజా ఫ్యాక్టరీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. తప్పు చేసి ఉంటేనే నోటీసులు ఇచ్చి ఉంటారని తెలిపారు. వాళ్లు వెళ్లిపోవాలని మేము కోరుకోవడం లేదన్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండి పడ్డారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. జల వివాదంలో తెలంగాణతో సఖ్యత కోరుకుంటున్నట్లు వెల్లడించారు. జల వివాదాన్ని పరిష్కరించు కోవాలనుకుంటున్నామని పేర్కొన్నారు. చట్టం చేసిన రోజే 3 రాజధానులు అమల్లోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఇక రాజధానుల ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిపారు. -
విడాకుల కేసులో కేరళ హైకోర్టు ‘క్రూరత్వం’ వ్యాఖ్యలు
కొచ్చి: కేరళ హైకోర్టు ఓ విడాకుల కేసు తీర్పు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భర్తగానీ, భార్యగానీ విడాకుల కోసం ఒకరిపై మరొకరు సంసార జీవితంపై తప్పుడు ఆరోపలు చేయడం హింసించడం కిందకే వస్తుందని పేర్కొంది. గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ముహమ్మద్ ముస్తక్, జస్టిస్ కసర్ ఎడపగ్గత్ ఈ మేరకు ఈ వ్యాఖ్యలు చేశారు. సంసారానికి పనికి రారని, అంగస్తంభన లాంటి దిగజారుడు ఆరోపణలు ఒకరిపై ఒకరు చేసుకుని విడాకులు తీసుకోవాలనుకోవడం క్రూరత్వం మాత్రమే కాదు.. నేరం కూడా. ఇది వైవాహిక వ్యవస్థను చులకన చేయడమే కాదు.. భార్యాభర్తల బంధాన్ని అవహేళన చేసినట్లే అని ద్విసభ్య న్యాయమూర్తుల బెంచ్ వ్యాఖ్యానించింది. ఇలాంటి కేసుల్లో తప్పుడు ఆరోపణలు చేసే వాళ్లపై చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్న విషయాన్ని తాము పరిశీలిస్తున్నామని బెంచ్ అభిప్రాయపడింది. కాగా, కేరళ ఎర్నాకులం ప్రాంతానికి చెందిన ఇద్దరు మెడికల్ గ్రాడ్యుయేట్స్ పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ అమ్మాయి మానసిక ఆరోగ్యం బాగోలేదని తనకు విడాకులిప్పించాలని అబ్బాయి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో తన భర్తకి అంగస్తంభన సమస్య ఉందని అమ్మాయి ఆరోపించింది. ఇది ముదిరి పరస్పర ఆరోపణలతో మరీ పచ్చిగా కోర్టుకు స్టేట్మెంట్ సమర్పించింది ఆ జంట. దీంతో బెంచ్ అవాక్కయ్యింది. అయితే అమ్మాయి ఆరోపణల్లో నిజం లేదని తేలడంతో బెంచ్ పైవ్యాఖ్యలు చేసింది. ఇక ఆ ఆరోపణల ఫలితంగా జంట కలిసి ఉండే అవకాశం లేదన్న ఉద్దేశంతో విడాకుల మంజూరీకే మొగ్గుచూపింది.