french open title
-
సాత్విక్ జోడీ ముందంజ
సార్‌బ్రుక్‌కెన్ (జర్మనీ): హైలో ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 22–24, 21–15, 21–11తో రోరీ ఈస్టన్–జాక్ రస్ (ఇంగ్లండ్) జోడీపై గెలిచింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) ద్వయం 21–18, 21–19తో జిలీ దెబోరా–చెర్లీ సీనెన్ (నెదర్లాండ్స్) జోడీని ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ (భారత్) 15–21, 21–14, 21–13 తో లూ గ్వాంగ్ జు (చైనా)పై కష్టపడి గెలిచాడు. మహిళల సింగిల్స్‌లో భారత ప్లేయర్ మాళవిక క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. క్రిస్టీ గిల్మోర్ (స్కాట్లాండ్)తో జరిగిన మ్యాచ్‌లో మాళవిక తొలి గేమ్‌ను 24–22తో సొంతం చేసుకొని, రెండో గేమ్‌లో 19–7తో ఆధిక్యంలో ఉన్నదశలో గిల్మోర్ గాయం కారణంగా వైదొలిగింది. చదవండి: T20 WC 2022: భారత్‌ను భయపెట్టాడు.. లిటన్ దాస్‌కు కోహ్లి అదిరిపోయే గిఫ్ట్ -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ‘టెన్నిస్ స్టార్’.. ఫొటో వైరల్
Maria Sharapova Welcomes Son: రష్యా మాజీ టెన్నిస్ స్టార్ మారియా షరపోవా తల్లయ్యారు. పండంటి బాబుకు ఆమె జన్మనిచ్చారు. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా శుక్రవారం అభిమానులతో పంచుకున్నారు. తమ కుమారుడి పేరు థియోడర్ అని షరపోవా వెల్లడించారు. కాగా 35 ఏళ్ల ఈ రష్యన్ బ్యూటీ షరపోవా.. బ్రిటన్‌కు చెందిన 42 ఏళ్ల వ్యాపారవేత్త అలెగ్జాండర్ గిల్కెస్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరు 2020లో తమకు నిశ్చితార్థం జరిగినట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఈ జంట జూలై 1న తమ తొలి సంతానానికి జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ‘‘మా కుటుంబానికి అత్యంత అందమైన.. ఎంతో గొప్పదైన బహుమతి లభించింది.. థియోడర్’’ అంటూ తమకు కుమారుడు జన్మించిన విషయాన్ని షరపోవా వెల్లడించారు. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో తమ చిన్నారి పాపాయితో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఇక తన కెరీర్లో మారియా షరపోవా ఐదు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలుచుకున్నారు. పదిహేడేళ్ల వయసులో 2004లో తన తొలి వింబుల్డన్ టైటిల్ గెలిచిన ఆమె.. 2006లో యూఎస్ ఓపెన్, 2008లో ఆస్ట్రేలియా ఓపెన్, 2012, 2014 సంవత్సరాల్లో ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచారు. సుదీర్ఘ కెరీర్‌కు 2020లో ఆటకు వీడ్కోలు పలికిన షరపోవా ప్రస్తుతం వ్యక్తిగత జీవితాన్ని, మాతృత్వ మధురిమలను ఆస్వాదిస్తున్నారు. View this post on Instagram A post shared by Maria Sharapova (@mariasharapova) చదవండి: IRE Vs NZ: కివీస్ కొంపముంచిన టవల్.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి! టి20 ప్రపంచకప్‌కు జింబాబ్వే, నెదర్లాండ్స్ -
అతడో అద్భుతం!
అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు. జరిగిన తరువాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. ఈ పాపులర్ డైలాగ్‌కు రఫేల్ నాదల్ ఓ ఉదాహరణ. 19 ఏళ్ళ టీనేజ్‌లో ఫ్రెంచ్ ఓపెన్ ఎర్రమట్టి కోర్టులో నాదల్ తొలిసారి అడుగుపెట్టినప్పుడు ఆ టెన్నిస్ అద్భుతాన్ని ముందే ఎంత మంది పసిగట్టారో తెలియదు కానీ, 36వ ఏట రికార్డుల ఆసామిగా మారిన ఇవాళ ఆయన గురించి ఎవరికీ ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పని లేదు. పట్టుదల, క్రమశిక్షణ ఆలంబనగా 2005లో మొదలైన ఆ మేజిక్ మొన్న ఆదివారం ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ కొనసాగడం అభిమానులకు మరపు రాని అనుభవం. 2010 నుంచి వరుసగా రెండు గ్రాండ్ స్లామ్‌లు గెలవని రఫా తన 36వ ఏట తన సొగసైన ఆటతీరులో ఆ విన్యాసం చేసి చూపారు. వేధిస్తున్న ఎడమ పాదపు నొప్పి తెలియకుండా ఇంజెక్షన్లు తీసుకొని మరీ గత రెండువారాల్లో 7 మ్యాచ్‌లాడారు. ఫైనల్లో వరుస సెట్లలో 23 ఏళ్ళ నార్వే కుర్రాడు కాస్పర్ రూడ్‌పై అలవోకగా గెలిచారు. 14వసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించారు. కరోనా కష్టం, పక్కటెముకల్లో స్ట్రెస్ ఫ్రాక్చర్‌తో 6 వారాలు రాకెట్ ముట్టలేని బాధ, ఎర్రమట్టి కోర్టుల్లో సన్నాహక టోర్నమెంట్లలో పాల్గొనలేని వైనం, తిరగబెట్టిన ఎడమ పాదం గాయం... ఇవన్నీ పళ్ళబిగువున భరించి రఫా (నాదల్) టెన్నిసే ఊపిరిగా కదిలారు. జకోవిచ్ సహా టాప్ 10 ఆటగాళ్ళలో నలుగురిని దాటుకొని, ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచారు. ఆ టైటిల్ గెలిచిన అతి పెద్ద వయస్కుడయ్యారు. గతంలో మరో ఇద్దరు (2017 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫెదరర్, 1982 ఫ్రెంచ్ ఓపెన్‌లో విలాండర్) మాత్రమే ఇలా టాప్ 10లో నలుగురిని ఒక గ్రాండ్ స్లామ్లో ఓడించారనేది గమనార్హం. ఇప్పటికి 18 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ బరిలో దిగితే, 14 సార్లు టైటిల్ గెలిచి, తాను ఎర్ర మట్టి కోర్టులో కింగ్‌నని నిరూపించారు. అందుకే ఇది ఓ అద్భుతం. ఓ చరిత్ర. ప్రతి రంగంలో క్షణా నికో కొత్త తార మఖలో పుట్టి పుబ్బలో పోతున్న ఈ రోజుల్లో నాదల్ సుదీర్ఘకాలంగా సత్తా చాటి, సిసలైన టెన్నిస్ స్టార్‌గా నిలిచారు. ఒక్క ఫ్రెంచ్ ఓపెన్లోనే 115 సార్లు బరిలోకి దిగితే 112 సార్లు గెలిచి, 97 శాతం విజయాలు నమోదు చేసిన ఘనత ఆయనది. ప్రత్యర్థులైన తోటి టెన్నిస్ స్టార్లు ఫెదరర్, జకోవిచ్‌లను మించిన ప్రతిభ, గౌరవనీయ వర్తనతో రఫా ప్రత్యేక స్థానం సంపాదించారు. శారీరకంగా బాధల పాలైనా, తీవ్రంగా శ్రమించి గంటల కొద్దీ ఆడి ఓడినా – వాటిని తట్టుకొని ప్రతిసారీ నేలకు కొట్టిన బంతిలా నాదల్ పైకి లేచిన తీరు ఆటగాళ్ళకే కాదు... జీవనపోరాటంలోని ప్రతి ఒక్కరికీ ఆదర్శమే. గెలుపు ఓటములను నిర్ణయించేవి పరిస్థితులు కాదు... మన క్రమశిక్షణ, ఆట పట్ల మన వైఖరి. సొంత అంకుల్ అయిన మరో టెన్నిస్ ఆటగాడు టోనీ నాసిరకం కోర్టుల్లో, తీసికట్టు బంతులతో కఠోర శిక్షణనిచ్చినప్పుడే ఆ పాఠం నాదల్ వంటబట్టించుకున్నారు. అతి కొద్దిమందే అగ్రస్థానానికి చేరుకోగలుగుతారనే స్పృహతో, చిన్న చిన్న విజయాలతో తృప్తిపడకుండా ముందుకు సాగారు. వేధిస్తున్న గాయాల వల్ల ఆటకు శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితి వచ్చి పలుమార్లు కన్నీటి పర్యంతమైనా, ప్రతిసారీ యోధుడిగా తిరిగొచ్చారు. ఈ ఏడాదీ ఆస్ట్రేలియన్ ఓపెన్ ముందూ అదే పరిస్థితి. కానీ, ఇప్పుడు వరుసగా ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్లు గెలిచారు. వింబుల్డన్, యూఎస్ ఓపెన్ల దిశగా అడుగులు వేస్తున్నారు. పాదాల ఎముకలను శిథిలం చేసే అనారోగ్యాన్ని అధిగమించి వాటిలోనూ ఇలాగే గెలిస్తే, అది మరో రికార్డు. ఒకటీ రెండు కాదు... ఏకంగా 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన ఆటగాడిగా పురుషుల్లో నాదల్‌దే ఇప్పుడు రికార్డు. తోటి స్టార్లు జకోవిచ్, ఫెదరర్ల (20 స్లామ్ల) కన్నా రెండడుగులు ఆయన ముందున్నారు. సెర్బియాకు చెందిన అపూర్వ ప్రతిభావంతుడు జకోవిచ్ ఈ ఏడాదో, ఆ తర్వాతో ఈ రికార్డును బద్దలు కొట్టవచ్చు. రికార్డులు చెరిగిపోవచ్చు కానీ, టెన్నిస్ క్రీడాంగణంపై నాదల్ వేసిన ముద్ర మాత్రం ఎప్పటికీ చెరిగిపోనిది. మైదానంలో ప్రతిభే కాదు... మానవీయ బాహ్యవర్తనా మరపురానిది. అయిదంతస్తుల అపార్ట్మెంట్లో కలివిడిగా బతికిన ఉమ్మడి కుటుంబ విలువలతో పెరిగిన ఆయన ఒక్కోసారి మన భారతీయ ఉమ్మడి కుటుంబాలకూ, విలువలకూ సన్నిహితుడిగా అనిపిస్తారు. స్వీయప్రచారం, ప్రతిదానికీ చప్పట్లు, తక్షణలబ్ధి కోరుకోవడం ఆధునిక ప్రపంచ లక్షణానికి భిన్నంగా, తాత్త్విక దృష్టితో జీవితాన్ని నాదల్ చూసే తీరు ప్రత్యేకమైనది. జీవితంలో బాధ, నష్టం అనివార్యమనీ, అవీ జీవితంలో భాగమనీ ఎరుక ఆయనది. ఆయన ప్రతిభకు ఆ సమభావం, క్రమశిక్షణ కవచాలు. నేటికీ నిత్య పోరాటస్ఫూర్తి ఆయన పాశుపతాస్త్రమైంది. గెలుపు ఓటములను సమంగా స్వీకరిస్తూ, శారీరక బాధను అంగీకరిస్తూ, స్వీయ నియంత్రణ కోల్పోకుండా మెలగడం ఈ ఆటగాడిని ఆల్‌టైమ్ గ్రేట్‌ను చేసింది. 2011లో వెలువడ్డ ‘రఫా – మై స్టోరీ’ ఆత్మకథ చదివినా, ఆయన సుదీర్ఘ ప్రయాణం చూసినా ఇదే అర్థమవుతుంది. మరి ఏ ఇతర టెన్నిస్ ఆటగాడు కానీ, ఈ శతాబ్దపు అత్యుత్తమ అథ్లెట్లలో కొందరైన టైగర్ వుడ్, మైకేల్ ఫెల్ప్స్, ఉసేన్ బోల్ట్, సెరీనా విలియమ్స్ లాంటివారు కానీ – తమ ఆటల్లో నాదల్ స్థాయిలో ఆధిపత్యం చలాయించలేదని విశ్లేషకుల మాట. ఆదివారం ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ అపూర్వమైన ఆటతీరును మరోసారి చూసిన స్పెయిన్ రాజు సంతోషంలో ఒకటే అన్నారు – ‘స్పెయిన్ చరిత్రలో అత్యుత్తమ అథ్లెట్ నాదల్. రాబోయే తరాలు ఆయనకు నీరాజనాలు పడతారు. టెన్నిస్ ప్రపంచానికి ఆయన మహారాజు’. అది సత్యం. నాదల్ ఓ అద్భుతం. ఆయన పట్టుదల, పరిశ్రమ అనేక విధాల ఆదర్శం! -
14వసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన రాఫెల్ నాదల్ (ఫోటోలు)
-
French Open 2022: ఫ్రెంచ్ కోటలో నాదల్ పాట.. ప్రైజ్‌మనీ 18 కోట్లు!
వేదిక అదే. ప్రత్యర్థి మారాడంతే. తుది ఫలితం మాత్రం యథాతథం. ఎర్రమట్టి కోర్టులపై మకుటంలేని మహారాజు తానేనని స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ మరోసారి నిరూపించుకున్నాడు. 36 ఏళ్ల వయస్సులో ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 14వ సారి విజేతగా నిలిచి ఔరా అనిపించాడు. 2005లో తన 19 ఏళ్ల ప్రాయంలో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించిన నాదల్ 17 ఏళ్ల తర్వాత కూడా అదే ఉత్సాహంతో, అదే పట్టుదలతో, అదే విజయకాంక్షతో బరిలోకి దిగి తన గెలుపు పాట వినిపించాడు. ఫైనల్ చేరేలోపు తనను ఓడించగలిగే సత్తా ఉన్న ఆటగాళ్లను హోరాహోరీ పోరాటాల్లో ఇంటిదారి పట్టించిన ఈ స్పెయిన్ సూపర్‌స్టార్ తుది సమరంలో మాత్రం చెలరేగిపోయాడు. కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న నార్వే ప్లేయర్, ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ కాస్పర్ రూడ్‌ను నాదల్ హడలెత్తించాడు. రూడ్‌కు కేవలం ఆరు గేమ్‌లు కోల్పోయిన నాదల్ 2 గంటల 18 నిమిషాల్లో ఫైనల్‌ను ముగించేసి తనకెంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీని ముద్దాడాడు. పారిస్: మట్టికోటలో మహరాజు... నభూతో నభవిష్యత్... సరిలేరు నీకెవ్వరు... నమో నమః... ‘గ్రాండ్ సలాం’.. ఇంకా ఏమైనా విశేషణాలు ఉన్నాయంటే వాటిని కూడా స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్కు జత చేయాల్సిందే. ఒకవైపు తమ కెరీర్ మొత్తంలో ఒక్క గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడకుండానే.. గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గకుండానే కెరీర్‌ను ముగించేసిన టెన్నిస్ ఆటగాళ్లెందరో ఉంటే... మరోవైపు నాదల్ మాత్రం ఒకే గ్రాండ్‌స్లామ్ టోర్నీ టైటిల్‌ను ఒకసారి కాదు... రెండుసార్లు కాదు... మూడుసార్లు కాదు... ఏకంగా 14సార్లు గెలిచి అందరిచేతా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గి అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన రాఫెల్ నాదల్ ఆదివారం ఈ జాబితాలో మరింత ఎత్తుకు ఎదిగిపోయాడు. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ కాస్పర్ రూడ్ (నార్వే)తో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ నాదల్ 2 గంటల 18 నిమిషాల్లో 6–3, 6–3, 6–0తో గెలిచాడు. తద్వారా ఫ్రెంచ్ ఓపెన్‌ను 14వసారి సొంతం చేసుకోవడంతోపాటు తన ఖాతాలో 22వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన 14 సార్లూ నాదలే గెలిచాడు. విజేతగా నిలిచిన నాదల్కు 22 లక్షల యూరోలు (రూ. 18 కోట్ల 30 లక్షలు)... రన్నరప్ రూడ్‌కు 11 లక్షల యూరోలు (రూ. 9 కోట్ల 15 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఏకపక్షంగా... ఫైనల్ చేరే క్రమంలో ప్రిక్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో సీడ్ అలియాసిమ్ (కెనడా)పై, క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా)పై, సెమీఫైనల్లో మూడో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచిన నాదల్కు ఫైనల్లో ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. ఆరంభం నుంచే అద్భుతంగా ఆడిన నాదల్ తన ప్రత్యర్థికి ఏదశలోనూ పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. ఎనిమిదిసార్లు రూడ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. 37 విన్నర్స్ కొట్టిన నాదల్ కేవలం 18 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు రూడ్ 16 విన్నర్స్ కొట్టి, 26 అనవసర తప్పిదాలు చేశాడు. చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. వెంకటేష్ అయ్యర్, దినేష్ కార్తీక్‌కు నో ఛాన్స్..! Find someone who looks at you the way Rafa looks at the Coupe des Mousquetaires 🥰#RolandGarros pic.twitter.com/2ajSJ4aPyb — Roland-Garros (@rolandgarros) June 5, 2022 -
French Open 2022: ఇగా సిగలో ఫ్రెంచ్ కిరీటం
పారిస్: ఈ ఏడాది తన జైత్రయాత్ర కొనసాగిస్తూ ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను గెల్చుకుంది. శనివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ స్వియాటెక్ 68 నిమిషాల్లో 6–1, 6–3తో ప్రపంచ 23వ ర్యాంకర్, 18 ఏళ్ల కోకో గాఫ్ (అమెరికా)పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన స్వియాటెక్‌కు 22 లక్షల యూరోలు (రూ. 18 కోట్ల 30 లక్షలు)... రన్నరప్ కోకో గాఫ్‌కు 11 లక్షల యూరోలు (రూ. 9 కోట్ల 15 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ ఏడాది స్వియాటెక్‌కిది వరుసగా 35వ విజయంకాగా... ఆమె ఖాతాలో ఆరో టైటిల్ చేరింది. 21 ఏళ్ల స్వియాటెక్ 2020లో ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరే క్రమంలో అమెరికా టీనేజర్ కోకో గాఫ్ ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. కానీ ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్వియాటెక్‌తో జరిగిన తుది పోరులో కోకో గాఫ్ ఒత్తిడిలో చేతులెత్తేసింది. ఆమె కేవలం నాలుగు గేమ్‌లు గెలిచింది. మరోవైపు స్వియాటెక్ పక్కా ప్రణాళికతో ఆడుతూ కోకోకు ఏ దశలోనూ పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. కచ్చితమైన సర్వీస్‌లకు తోడు శక్తివంతమైన గ్రౌండ్‌స్ట్రోక్‌లతో ఈ పోలాండ్ స్టార్ విజృంభించింది. సుదీర్ఘ ర్యాలీలకు ఏమాత్రం అవకాశమివ్వకుండా స్వియాటెక్ చాలాసార్లు పది ర్యాలీల్లోపే పాయింట్లు గెలుచుకుంది. తొలి సెట్ తొలి గేమ్‌లోనే గాఫ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన స్వియాటెక్ ఆ తర్వాత వరుసగా మూడు గేమ్‌లు నెగ్గి 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఐదో గేమ్‌లో కోకో గాఫ్ తొలిసారి తన సర్వీస్‌ను కాపాడుకోగా... ఆరో గేమ్‌లో స్వియాటెక్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని, ఏడో గేమ్‌లో గాఫ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి తొలి సెట్‌ను 35 నిమిషాల్లో సొంతం చేసుకుంది. రెండో సెట్లో కోకో కాస్త పోటీనిచ్చినా స్వియాటెక్‌ను ఓడించేందుకు అది సరిపోలేదు. చదవండి: నీ క్రీడాస్ఫూర్తికి సలామ్ నాదల్: సచిన్, రవిశాస్త్రి ప్రశంసలు 35-0 🏆#RolandGarros pic.twitter.com/Tq7u72NWH8 — Roland-Garros (@rolandgarros) June 4, 2022 -
US Open 2021: రికార్డులపై జొకోవిచ్ గురి
న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ప్రపంచ నంబర్‌వన్, సెర్బియా స్టార్ జొకోవిచ్‌ను రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. అందులో ఒకటి ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ (ఒకే ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గడం) కాగా... రెండోది పురుషుల విభాగంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా నిలువడం. ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీ టైటిల్స్‌ను గెలిచాడు. 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) సరసన చేరాడు. యూఎస్ ఓపెన్‌లోనూ జొకోవిచ్ గెలిస్తే 21 టైటిల్స్‌తో కొత్త చరిత్రను సృష్టిస్తాడు. అంతేకాకుండా దిగ్గజ ప్లేయర్ రాడ్ లేవర్ (1969లో) తర్వాత ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత సాధించిన ప్లేయర్‌గా నిలుస్తాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు జామున జరిగే తొలి రౌండ్లో క్వాలిఫయర్ హోల్గర్ రునే (డెన్మార్క్) తో జొకోవిచ్ తలపడతాడు. -
స్వియాటెక్ @ 17
పారిస్: అందరి అంచనాలను తారుమారు చేసి ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచిన పోలాండ్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ర్యాంకింగ్స్‌లోనూ దూసుకుపోయింది. ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 54వ స్థానంలో ఉన్న 19 ఏళ్ల స్వియాటెక్ ‘గ్రాండ్’ విజయంతో 37 స్థానాలు పురోగతి సాధించి కెరీర్ బెస్ట్ 17వ ర్యాంక్‌కు చేరుకుంది. రన్నరప్‌గా నిలిచిన సోఫియా కెనిన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని నాలుగో స్థానానికి చేరింది. యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... సిమోనా హలెప్ రెండో ర్యాంక్‌లో (రొమేనియా), నయోమి ఒసాకా (జపాన్) మూడో ర్యాంక్‌లో ఉన్నారు. పురుషుల ర్యాంకింగ్స్‌లో ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ జొకోవిచ్ (సెర్బియా) నంబర్‌వన్ స్థానంలోనే కొనసాగుతుండగా... విజేత రాఫెల్ నాదల్ (స్పెయిన్) రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్ చేరిన డీగో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) 14వ ర్యాంక్ నుంచి కెరీర్ బెస్ట్ 8వ ర్యాంక్‌కు చేరుకోగా... ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) తొలిసారి పదో ర్యాంక్‌ను అందుకున్నాడు. -
ఫ్రెంచ్ ఓపెన్ నుంచి సెరెనా ఔట్!
పారిస్: మూడుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్‌గా నిలిచిన సెరెనా విలియమ్స్ పారిస్‌లో జరుగుతున్న గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ నుంచి గాయం కారణంగా వైదొలిగింది. ఈ విషయాన్ని రోలాండ్ గారోస్ నిర్వాహకులు బుధవారం వెల్లడించారు. సెరెనా విలియమ్స్ క్లే కోర్ట్ గ్రాండ్‌స్లామ్‌లో మార్గరెట్ సృష్టించిన 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ రికార్డును అధిగమించాలనుకుంది. కానీ ఆమె బుధవారం జరగాల్సిన రెండవ రౌండ్ మ్యాచ్‌కు ముందే కాలిగాయంతో టోర్నమెంట్ నుంచి వైదొలిగింది. చదవండి: మెద్వెదేవ్‌కు చుక్కెదురు -
శ్రీకాంత్‌కు నిరాశ
పారిస్: ఈ సీజన్లో నిరాశాజనక ప్రదర్శన కొనసాగిస్తూ... భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, సమీర్ వర్మ ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోరీ్నలో తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21–15, 7–21, 14–21తో రెండో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో... కశ్యప్ 11–21, 9–21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో... సమీర్ వర్మ 84 నిమిషాల్లో 22–20, 18–21, 18–21తో నిషిమోటో (జపాన్) చేతిలో ఓడిపోయారు. సైనా శుభారంభం... మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా నెహా్వల్ 23–21, 21–17తో చెయుంగ్ ఎన్గాన్ యి (హాంకాంగ్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా 13–21, 18–21తో క్రిస్ అడ్కాక్–గాబ్రియేలా అడ్కాక్ (ఇంగ్లండ్) చేతిలో... అశ్విని పొన్నప్ప–సాత్విక్ సాయిరాజ్ 17–21, 18–21తో సియో సెయుంగ్ జే–చే యుజుంగ్ (కొరియా) చేతిలో పరాయం పాలయ్యారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 21–16, 21–14తో జెలీ మాస్–రాబిన్ తబెలింగ్ (నెదర్లాండ్స్)లపై నెగ్గగా... సుమీత్ రెడ్డి–మనూ అత్రి 19–21, 22–20, 15–21తో బెన్ లేన్–సీన్ వెండీ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశి్వని పొన్నప్ప 21–16, 13–21, 17–21తో లీ సో హీ–షిన్ సెయుంగ్ చాన్ (కొరియా) చేతిలో ఓటమి పాలయ్యారు. -
పక్కింట్లో చూసి బాధపడితే ఎలా?
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో మరోసారి తిరుగులేని ఆట ప్రదర్శిస్తూ 12వ సారి టైటిల్ నెగ్గడంతో స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సంఖ్య 18కి చేరింది. పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధికంగా రోజర్ ఫెడరర్ సాధించిన 20 గ్రాండ్‌స్లామ్‌ల ఘనతను సమం చేసేందుకు అతను రెండు ట్రోఫీల దూరంలో మాత్రమే ఉన్నాడు. ఆ రికార్డును అందుకునే అవకాశాలపై అడిగిన ప్రశ్నకు నాదల్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘మన పొరుగున ఉండేవారి ఇల్లు మన ఇంటికంటే పెద్దదిగా ఉందని, వారింట్లో గార్డెన్ మనకంటే బాగుందని, వాళ్ల ఇంట్లో టీవీ మనింట్లో ఉన్న దానికంటే పెద్దదిగా ఉందని అస్తమానం అసహనంతో ఉండలేం కదా? నేను జీవితాన్ని ఆ దృష్టితో చూడను. దాని కోసం నేను ఉదయాన్నే లేచి వెళ్లి సాధన చేయను. ఫెడరర్ రికార్డును స్ఫూర్తిగా తీసుకోవడంలో తప్పు లేదు. కానీ దానిని ఎలాగైనా సాధించాలనే పిచ్చి మాత్రం నాకు లేదు’ అని స్పెయిన్ స్టార్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించాడు. -
సరిలేరు నీకెవ్వరు!
ఎర్రమట్టి కోర్టులపై తనకు తిరుగులేదని స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ మరోసారి నిరూపించాడు. టెన్నిస్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌ను రికార్డు స్థాయిలో 12వసారి సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో గతేడాది ఫలితమే పునరావృతం అయింది. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాదీ డొమినిక్ థీమ్‌ను ఓడించి నాదల్ చాంపియన్‌గా నిలిచాడు. పారిస్: ఊహించిన ఫలితమే వచ్చింది. ఎలాంటి అద్భుతం జరగలేదు. మట్టికోర్టులపై మకుటంలేని మహరాజు తానేనని రాఫెల్ నాదల్ మళ్లీ చాటి చెప్పాడు. ఈ స్పెయిన్ స్టార్ రికార్డుస్థాయిలో 12వ సారి ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో రెండో సీడ్ రాఫెల్ నాదల్ 6–3, 5–7, 6–1, 6–1తో నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను ఓడించాడు. 3 గంటల ఒక నిమిషంపాటు జరిగిన ఈ తుది సమరంలో నాదల్ మూడు ఏస్‌లు సంధించి, తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. 38 విన్నర్స్ కొట్టిన అతడు 31 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు థీమ్ ఏడు ఏస్‌లు సంధించి, నాదల్ సర్వీసును రెండుసార్లు బ్రేక్ చేయగలిగాడు. 31 విన్నర్స్ కొట్టిన అతడు 38 అనవసర తప్పిదాలు చేశాడు. విజేత రాఫెల్ నాదల్కు ట్రోఫీతోపాటు 23 లక్షల యూరోలు (రూ. 18 కోట్ల 8 లక్షలు), రన్నరప్ థీమ్‌కు 11 లక్షల 80 వేల యూరోలు (రూ. 9 కోట్ల 27 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. వేర్వేరు టోర్నమెంట్లలో నాలుగుసార్లు క్లే కోర్టులపై నాదల్‌ను ఓడించిన రికార్డు కలిగిన డొమినిక్ థీమ్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌కు వచ్చేసరికి మాత్రం చేతులెత్తేస్తున్నాడు. గతేడాది వరుసగా మూడు సెట్లలో ఓడిపోయిన థీమ్‌కు ఈసారి మాత్రం ఒక సెట్‌ను గెలిచిన సంతృప్తి మిగిలింది. ఫైనల్ తొలి సెట్లో థీమ్ ఐదో గేమ్‌లో నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 3–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ వెంటనే థీమ్ సర్వీస్‌ను నాదల్ బ్రేక్ చేసి స్కోరును 3–3తో సమం చేశాడు. ఎనిమిదో గేమ్‌లో మరోసారి థీమ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ సెట్‌ను 6–3తో గెల్చుకున్నాడు. రెండో సెట్లో ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. ఆఖరికి 12వ గేమ్‌లో నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసి థీమ్ సెట్‌ను 7–5తో దక్కించుకున్నాడు. అయితే ఫ్రెంచ్ ఓపెన్‌లో అద్వితీయమైన రికార్డు ఉన్న నాదల్ ఒక్కసారిగా విజృంభించాడు. థీమ్‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా పూర్తి నియంత్రణతో ఆడుతూ మూడో సెట్లో ఒక గేమ్, నాలుగో సెట్లో ఒక గేమ్ కోల్పోయి గెలుపు ఖాయం చేసుకున్నాడు. ►1 టెన్నిస్ చరిత్రలో ఒకే గ్రాండ్‌స్లామ్ టోర్నీని అత్యధికంగా 11 సార్లు గెలిచిన రికార్డు ఆస్ట్రేలియా క్రీడా కారిణి మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియన్ ఓపెన్) పేరిట ఉంది. తాజా టైటిల్‌తో ఈ రికార్డును నాదల్ బద్దలు కొట్టాడు. ►6 నాదల్ 12 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ (2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019) సాధించగా.... ఆరుసార్లు వేర్వేరు ప్రత్యర్థులపై గెలిచాడు. ఫైనల్స్‌లో ఫెడరర్‌పై నాలుగుసార్లు, జొకోవిచ్, థీమ్‌లపై రెండుసార్లు, రాబిన్ సోడెర్లింగ్, మరియానో పుయెర్టా, డేవిడ్ ఫెరర్, వావ్రింకాలపై ఒక్కోసారి గెలిచాడు. ►93 ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ గెలిచిన మ్యాచ్‌ల సంఖ్య. బరిలోకి దిగాక కేవలం రెండుసార్లు మాత్రమే నాదల్ (2009లో సోడెర్లింగ్ చేతిలో ప్రిక్వార్టర్ ఫైనల్లో; 2015లో జొకోవిచ్ చేతిలో క్వార్టర్ ఫైనల్లో) ఓడిపోయాడు. ►18 ఓవరాల్‌గా నాదల్ గెలిచిన గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ (12 ఫ్రెంచ్; 3 యూఎస్ ఓపెన్, 2 వింబుల్డన్, 1 ఆస్ట్రేలియన్ ఓపెన్). అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన రికార్డు ఫెడరర్ (20) పేరిట ఉంది. ఓవరాల్‌గా నాదల్ కెరీర్లో 82 టైటిల్స్ సాధించాడు. 12వసారి ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీని అందుకుంటున్న అనుభూతిని మాటల్లో వర్ణించలేను. ఫైనల్లో ఓడిపోవడం ఎంత బాధ కలిగిస్తుందో తెలుసు. ఏనాటికైనా నువ్వు (థీమ్) ఈ టైటిల్ సాధిస్తావు. – నాదల్ -
ఫెడరర్‌పై నాదల్‌దే పైచేయి
పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ 12వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌కు విజయం దూరంలో నిలిచాడు. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో రెండో సీడ్ నాదల్ 6–3, 6–4, 6–2తో మూడో సీడ్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)పై అలవోకగా గెలిచి ఈ టోర్నీలో 12వసారి ఫైనల్‌కు చేరాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫెడరర్‌తో ఇప్పటివరకు తలపడిన ఆరుసార్లూ నాదల్‌నే విజయం వరించడం విశేషం. 2 గంటల 25 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో నాదల్ ఆరుసార్లు ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. ఫెడరర్ 34 అనవసర తప్పిదాలు చేయగా... నాదల్ కేవలం 19 మాత్రమే చేశాడు. రెండో సెమీస్ నేటికి వాయిదా.... టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. తొలి సెట్‌ను థీమ్ 6–2తో నెగ్గగా... రెండో సెట్‌ను జొకోవిచ్ 6–3తో దక్కించుకున్నాడు. మూడో సెట్లో థీమ్ 3–1తో ఆధిక్యంలో ఉన్నపుడు వర్షం రావడంతో మ్యాచ్‌ను శనివారానికి వాయిదా వేశారు. -
సెరెనా వచ్చింది... అయితే నాకేంటి!
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకుల అత్యుత్సాహంపై ఆస్ట్రియా స్టార్ డొమినిక్ థీమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘ఓ స్టార్ క్రీడాకారిణి వచ్చినంత మాత్రాన నా మీడియా సమావేశాన్ని మధ్యలోనే ముగించుకొని వెళ్లాలా’ అని తీవ్ర స్థాయిలో నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేశాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే... నాలుగో సీడ్ థీమ్ మూడో రౌండ్ గెలిచి ప్రిక్వార్టర్స్ చేరాడు. మ్యాచ్ అనంతరం ప్రధాన మీడియా హాల్లో అతను విలేకర్లతో ముచ్చటిస్తున్నాడు. మరోవైపు అమెరికన్ స్టార్ సెరెనా విలియమ్స్ మూడో రౌండ్లో ఓడిపోయింది. మీడియా సమావేశం కోసం ఆ హాల్ దగ్గర వేచి ఉంది. దీంతో 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత సెరెనా కోసం నిర్వాహకులు... థీమ్ విలేకర్లతో ముచ్చటిస్తుంటే త్వరగా ముగించుకొని వెళ్లాలని అత్యుత్సాహం ప్రదర్శించారు. వెంటనే థీమ్ దీటుగా స్పందిస్తూ ‘ఏంటీ జోకా... ఆమె వచ్చిందని నన్ను ఉన్న పళంగా హాల్ ఖాళీ చేసి వెళ్లమంటారా? ఏంటి ఈ చోద్యం. నేను ముగించను. ఇక్కడి నుంచి వెళ్లను. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని తీవ్ర స్థాయిలో స్పందించాడు. విషయం తెలుసుకున్న సెరెనా తనకు ప్రధాన హాల్ లేకపోయినా పర్లేదు ఏదో గదిలో మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని నిర్వాహకులతో చెప్పింది. దీనిపై పలువురు దిగ్గజాలు, మాజీ ఆటగాళ్లు థీమ్‌ను వెనకేసుకొచ్చారు. మాజీ చాంపియన్ ఫెడరర్ మాట్లాడుతూ ‘థీమ్ అసహనానికి అర్థముంది. ఆగ్రహం వ్యక్తం చేయడానికి హక్కూ వుంది’ అని అన్నాడు. -
నాదల్‌ను ఆపతరమా!
పారిస్: ఈ ఏడాది గొప్పగా ఫామ్‌లో లేకపోయినప్పటికీ ఫ్రెంచ్ ఓపెన్ అనేసరికి రాఫెల్ నాదల్కు ఎక్కడలేని శక్తి వస్తుంది. తనకెంతో కలిసొచ్చిన మట్టి కోర్టులపై నాదల్‌ను నిలువరించాలంటే అతని ప్రత్యర్థులు విశేషంగా ఆడాల్సి ఉంటుంది. ఇప్పటికే రికార్డుస్థాయిలో 11సార్లు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను నెగ్గిన నాదల్ 12వసారి ఈ ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉన్నాడు. ఆదివారం మొదలయ్యే సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న నాదల్కు వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) నుంచే గట్టిపోటీ ఎదురయ్యే అవకాశముంది. ఇటీవలే రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టైటిల్ సాధించి ఫామ్‌లోకి వచ్చిన నాదల్కు ఫ్రెంచ్ ఓపెన్‌లో అద్వితీయమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో మొత్తం 86 మ్యాచ్‌ల్లో గెలిచిన నాదల్ కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే (2015లో క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ చేతిలో, 2009లో ప్రిక్వార్టర్ ఫైనల్లో సోడెర్లింగ్ చేతిలో) ఓడిపోయాడు. 2016లో మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్)తో జరగాల్సిన మూడో రౌండ్ మ్యాచ్‌లో గాయం కారణంగా బరిలోకి దిగకుండానే ‘వాకోవర్’ ఇచ్చాడు. మరోవైపు టాప్ సీడ్ జొకోవిచ్ ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ గెలిస్తే రెండుసార్లు వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను నిలబెట్టుకున్న రెండో ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ‘డ్రా’ ప్రకారం జొకోవిచ్‌కు నాదల్ ఫైనల్లోనే ఎదురయ్యే అవకాశముంది. ఇక మూడేళ్ల తర్వాత మళ్లీ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడుతున్న ఫెడరర్ ఆదివారం జరిగే తొలి రౌండ్లో లొరెంజో సొనెగో (ఇటలీ)తో తలపడతాడు. నాదల్, జొకోవిచ్ కాకుండా నాలుగో ర్యాంకర్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), ఐదో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఆరో ర్యాంకర్ సిట్సిపాస్ (గ్రీస్) కూడా టైటిల్ రేసులో ఉన్నారు. భారత్ తరఫున ప్రజ్నేశ్ గుణేశ్వరన్ మాత్రమే మెయిన్ ‘డ్రా’లో ఉన్నాడు. ఆదివారం జరిగే తొలి రౌండ్లో హుగో డెలియన్ (బొలీవియా)తో ప్రజ్నేశ్ ఆడతాడు. పలువురు ఫేవరెట్స్... మహిళల సింగిల్స్ విభాగంలో ఈసారీ పలువురు ఫేవరెట్స్‌గా కనిపిస్తున్నారు. డిఫెండింగ్ చాంపియన్ సిమోనా హలెప్ (రొమేనియా)తోపాటు వరల్డ్ నంబర్‌వన్ నయోమి ఒసాకా (జపాన్), మాజీ విజేత గార్బిన్ ముగురుజా (స్పెయిన్) టైటిల్ గెలిచే అవకాశాలున్నాయి. మాజీ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ (అమెరికా) ఫిట్నెస్ సమస్యను అధిగమిస్తే ఆమె ఖాతాలో మరో టైటిల్ చేరవచ్చు. గతేడాది యూఎస్ ఓపెన్, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించిన ఒసాకా వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టింది. అయితే ఆమెకు రెండో రౌండ్లో మాజీ విజేత ఒస్టాపెంకో రూపంలో సవాల్ ఎదురయ్యే చాన్స్ ఉంది. -
తొలి రౌండ్లోనే అంకిత ఔట్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ అంకిత రైనా తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. మంగళవారం జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో 26 ఏళ్ల అంకిత 4–6, 4–6తో అమెరికాకు చెందిన 15 ఏళ్ల అమ్మాయి, ప్రపంచ 320వ ర్యాంకర్ కోరి గౌఫ్ చేతిలో ఓడిపోయింది. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 172వ ర్యాంకర్ అంకిత ఏకంగా 36 అనవసర తప్పిదాలు చేసింది. -
రామ్‌కుమార్ ఓటమి
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత రెండో ర్యాంకర్ రామ్‌కుమార్ రామనాథన్‌కు నిరాశ ఎదురైంది. సోమవారం మొదలైన ఈ క్వాలిఫయింగ్ టోర్నీలో రామ్‌కుమార్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. ప్రపంచ 171వ ర్యాంకర్ జేసన్ కుబ్లెర్ (ఆస్ట్రేలియా)తో జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 144వ ర్యాంకర్ రామ్‌కుమార్ 4–6, 4–6తో ఓడిపోయాడు. గంటా 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్ ఐదు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్ వద్దకు 17 సార్లు దూసుకొచ్చి కేవలం ఆరుసార్లు మాత్రమే పాయింట్లు గెలిచాడు. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి కుబ్లెర్ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. భారత నంబర్‌వన్, ప్రపంచ 86వ ర్యాంకర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్‌కు నేరుగా మెయిన్ ‘డ్రా’లో పోటీపడే అవకాశం లభించింది. ప్రధాన టోర్నమెంట్ ఈనెల 26న మొదలవుతుంది. -
థీమ్ నిష్క్రమణ వింబుల్డన్ టోర్నీ
లండన్: గత నెలలో ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచిన డొమినిక్ థీమ్ వింబుల్డన్ టోర్నమెంట్లో మాత్రం తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన ఈ ఆస్ట్రియా ఆటగాడు మార్కోస్ బగ్ధాటిస్ (సైప్రస్)తో జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 4–6, 5–7తో రెండు సెట్లను చేజార్చుకొని మూడో సెట్లో 0–2తో వెనుకబడిన దశలో థీమ్ గాయం కారణంగా తప్పుకున్నాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో పదో సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 4–6, 3–6, 4–6తో మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. మరోవైపు రెండో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఐదో సీడ్ డెల్‌పొట్రో (అర్జెంటీనా) రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో నాదల్ 6–3, 6–3, 6–2తో డూడీ సెలా (ఇజ్రాయెల్)పై, జ్వెరెవ్ 7–5, 6–2, 6–0తో డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)పై, డెల్‌పొట్రో 6–3, 6–4, 6–3తో గొజోవిక్ (జర్మనీ)పై గెలిచారు. క్విటోవా ఇంటిముఖం... మహిళల సింగిల్స్‌లో 2011, 2014 చాంపియన్, ఎనిమిదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. బెలారస్ అమ్మాయి సస్నోవిచ్ 6–4, 4–6, 6–0తో క్విటోవాపై సంచలన విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో మూడో సీడ్ ముగురుజా (స్పెయిన్) 6–2, 7–5తో బ్రాడీ (బ్రిటన్)పై, టాప్ సీడ్ సిమోనా హాలెప్ (రొమేనియా) 6–2, 6–4తో కురిమి (జపాన్)పై గెలిచారు. ఫెడరర్ రికార్డు బద్దలు వరుసగా అత్యధిక గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లు ఆడిన ప్లేయర్‌గా స్పెయిన్ ఆటగాడు ఫెలిసియానో లోపెజ్ కొత్త రికార్డు నెలకొల్పాడు. స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ (వరుసగా 65) పేరిట ఉన్న ఈ రికార్డును వరుసగా 66వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న లోపెజ్ బద్దలు కొట్టాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో లోపెజ్ 6–3, 6–4, 6–2తో డెల్బోనిస్ (అర్జెంటీనా)పై గెలిచాడు. -
షరపోవా జోరు...
కొంతకాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతోన్న రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం అదరగొడుతోంది. రెండుసార్లు ఈ టోర్నమెంట్ టైటిల్‌ను సాధించిన ఆమె అలవోక విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. ఆరో సీడ్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో షరపోవా 6–2, 6–1తో ఘనవిజయం సాధించింది. తొలి గేమ్‌లోనే తన సర్వీస్ కోల్పోయిన షరపోవా వెంటనే తేరుకొని వరుస పాయింట్లతో కేవలం 59 నిమిషాల్లో ప్లిస్కోవా ఆట కట్టించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా)తో షరపోవా ఆడనుంది. మూడో రౌండ్లో సెరెనా 6–3, 6–4తో జూలియా జార్జెస్ (జర్మనీ)పై గెలిచింది. మరోవైపు ఎనిమిదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) మూడో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. కొంటావీట్ (ఎస్తోనియా) 7–6 (8/6), 7–6 (7/4)తో క్విటోవాను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. హలెప్ ముందంజ టాప్ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), మూడో సీడ్ ముగురుజా (స్పెయిన్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్లో హలెప్ 7–5, 6–0తో పెట్కోవిక్ (జర్మనీ)పై, ముగురుజా 6–0, 6–2తో సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించారు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో పదో సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) 4–6, 6–1, 8–6తో గియోర్గి (ఇటలీ)పై, ఏడో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–1, 6–3తో ఇరీనా బెగూ (రొమేనియా)పై గెలుపొందారు. నాదల్ దూకుడు... పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) 6–3, 6–2, 6–2తో రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. రెండు గంటల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో నాదల్ నెట్ వద్ద 12 పాయింట్లు సాధించడంతోపాటు గాస్కే సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 6–3, 6–2, 6–4తో జాన్సన్ (అమెరికా)పై, ఐదో సీడ్ డెల్‌పొట్రో (అర్జెంటీనా) 7–5, 6–4, 6–1తో రామోస్ (స్పెయిన్)పై, ఆరో సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 6–1, 6–7 (3/7), 6–3, 7–6 (7/4)తో మిషా జ్వెరెవ్ (జర్మనీ)పై, ఎనిమిదో సీడ్ గాఫిన్ (బెల్జియం) 6–7 (6/8), 6–3, 4–6, 7–5, 6–3తో మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)పై నెగ్గారు. క్వార్టర్స్‌లో బోపన్న జంట పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) ద్వయం సంచలనం సృష్టించింది. బోపన్న–వాసెలిన్ జంట 6–4, 7–6 (7/1)తో టాప్ సీడ్ మార్సెలో మెలో (బ్రెజిల్)–లుకాజ్ కుబోట్ (పోలాండ్) జోడీని బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. -
ఓటమి అంచుల నుంచి...
పారిస్: ఒక్క పాయింట్ కోల్పోతే టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితి నుంచి తేరుకున్న అలెగ్జాండర్ జ్వెరెవ్... తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో రెండో సీడ్ జ్వెరెవ్ 6–2, 3–6, 4–6, 7–6 (7/3), 7–5తో 26వ సీడ్ దామిర్ జుమ్హుర్ (బోస్నియా)పై కష్టపడి గెలిచాడు. తన కెరీర్లో ఎనిమిదో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న జ్వెరెవ్ తొలిసారి టాప్–50లోపు ర్యాంకర్‌ను ఓడించాడు. 3 గంటల 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్ నిర్ణాయక ఐదో సెట్ పదో గేమ్‌లో మ్యాచ్ పాయింట్ కాపాడుకున్నాడు. ఆ తర్వాత జుమ్హుర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో ఎనిమిది ఏస్‌లు సంధించిన జ్వెరెవ్... ఏడు డబుల్ ఫాల్ట్‌లు, 73 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. మరోవైపు నాలుగో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా), పదో సీడ్ కరెనో బుస్టా (స్పెయిన్) పోరాటం మూడో రౌండ్లోనే ముగిసింది. 30వ సీడ్ ఫెన్నాండో వెర్దాస్కో (స్పెయిన్) 7–6 (7/4), 6–2, 6–4తో దిమిత్రోవ్‌ను... మార్కో చెచినాటో (ఇటలీ) 2–6, 7–6 (7/5), 6–3, 6–1తో కరెనో బుస్టాను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ఇతర మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) 6–4, 6–7 (6/8), 7–6 (7/4), 6–2తో అగుట్ (స్పెయిన్)పై, ఏడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6–3, 6–7 (5/7), 6–3, 6–2తో బెరెటిని (ఇటలీ)పై, 19వ సీడ్ నిషికోరి (జపాన్) 6–3, 6–1, 6–3తో సిమోన్ (ఫ్రాన్స్)పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. స్వితోలినా నిష్క్రమణ మహిళల సింగిల్స్ విభాగంలో మరో సంచలనం నమోదైంది. నాలుగో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) మూడో రౌండ్లో 3–6, 5–7తో మిహెలా బుజర్‌నెస్కూ (రొమేనియా) చేతిలో ఓడిపోయింది. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్) 6–0, 6–3తో పౌలిన్ పార్మెంటీర్ (ఫ్రాన్స్)పై, 13వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6–1, 7–6 (9/7)తో 21వ సీడ్ నయోమి ఒసాకా (అమెరికా)పై నెగ్గారు. యూకీ, బోపన్నలకు నిరాశ డబుల్స్ విభాగాల్లో భారత ఆటగాళ్లకు నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో యూకీ బాంబ్రీ–దివిజ్ శరణ్ ద్వయం 5–7, 3–6తో మరాచ్ (ఆస్ట్రియా)–పావిక్ (క్రొయేషియా) జంట చేతిలో ఓటమి పాలైంది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–తిమియా (హంగేరి) జోడీ 2–6, 3–6తో జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా)–షుయె జాంగ్ (చైనా) జంట చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో దివిజ్ (భారత్)–షుకో అయోయామ (జపాన్) జోడీ 6–2, 3–6, 5–10తో స్రెబోత్నిక్ (స్లొవేనియా)–గొంజాలెజ్ (మెక్సికో) చేతిలో ఓడింది. -
నాదల్ దూకుడు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో రెండు సార్లు విజేతగా నిలిచిన మారియా షరపోవా మరో టైటిల్ వేటలో ముందంజ వేసింది. ఈ టోర్నీలో ఆమె మూడో రౌండ్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో షరపోవా 7–5, 6–4 స్కోరుతో డోనా వెకిక్ (క్రొయేషియా)పై విజయం సాధించింది. తర్వాతి మ్యాచ్‌లో షరపోవా, చెక్ రిపబ్లిక్కు చెందిన ఆరో సీడ్ కరోలినా ప్లిస్కోవాతో తలపడుతుంది. 2016 చాంపియన్, మూడో సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్) కూడా అలవోకగా గెలిచింది. రెండో రౌండ్లో ఆమె 6–4, 6–4తో ఫియోనా ఫెర్రో (ఫ్రాన్స్)ను ఓడించింది. గతంలో రెండు సార్లు ఫైనలిస్ట్‌గా నిలిచిన సిమోనా హలెప్ (రొమేనియా) 6–3, 6–1తో టేలర్ టౌన్సెండ్ (యూఎస్ఏ)ను ఓడించి ముందుకు దూసుకెళ్లింది. మూడోరౌండ్లో సెరెనా అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఫ్రెంచ్ ఓపెన్‌లో మరో విజయాన్ని సాధించింది. ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఆష్లీ బర్తితో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండోరౌండ్లో 36 ఏళ్ల సెరెనా 3–6, 6–3, 6–4తో విజయం సాధించింది. సిలిచ్, థీమ్ శ్రమించి...: పురుషుల వరల్డ్ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) కూడా తనదైన శైలిలో చెలరేగి మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. రెండో రౌండ్లో నాదల్ 6–2, 6–1, 6–1తో అర్జెంటీనా కుర్రాడు గిడో పెలాను చిత్తుగా ఓడించాడు. మూడో సీడ్ సిలిచ్ మాత్రం తీవ్రంగా శ్రమించాడు. రెండో రౌండ్లో అతను 6–2, 6–2, 6–7 (3/7), 7–5తో క్వాలిఫయర్ ఆటగాడు హ్యూబర్ట్ హర్కజ్ (పోలండ్)పై విజయం సాధించాడు. ఐదో సీడ్ డెల్‌పొట్రో (అర్జెంటీనా) 6–4, 6–3, 6–2తో జూలియన్ బెన్నెట్ (ఫ్రాన్స్)ను చిత్తు చేశాడు. ఏడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రేలియా) 6–2, 2–6, 6–4, 6–4తో స్టెఫెనోస్ స్టిట్సిపాస్ (గ్రీస్)పై గెలుపొందాడు. రెండో రౌండ్లో యూకీ–శరణ్ పురుషుల డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన యూకీ బాంబ్రీ–దివిజ్ శరణ్ జంట రెండో రౌండ్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్ మ్యాచ్‌లో ఈ జోడి 6–3, 7–5, 6–4 స్కోరుతో ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్)–çపురవ్ రాజా (భారత్) జంటను ఓడించింది. రెండో రౌండ్లో బాంబ్రీ–శరణ్ ద్వయం ఒలివర్ మరాక్–మేట్ పావిక్‌తో తలపడతారు. -
నాదల్‌ను ఆపతరమా...
పారిస్: అనుకోకుండా గాయపడటమో లేదా ఫిట్నెస్ సమస్యలు ఎదురైతే తప్పించి ఈసారీ మట్టికోటపై రాఫెల్ నాదల్ విజయబావుటా ఎగురవేయడం ఖాయమనిపిస్తోంది. ఇప్పటికే రికార్డుస్థాయిలో పదిసార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకున్న ఈ స్పెయిన్ స్టార్ గతేడాది ఫలితాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. క్లే కోర్టు సీజన్లో మూడు టైటిల్స్ (రోమ్, బార్సిలోనా, మోంటెకార్లో) నెగ్గిన నాదల్ తన స్థాయికి తగ్గట్టు ఆడితే 11వసారి ఫ్రెంచ్ ఓపెన్‌ను దక్కించుకోవడం కష్టమేమీ కాదు. తొలి రౌండ్లో అతడితో తలపడాల్సిన డల్గొపలోవ్ (ఉక్రెయిన్) గాయం కారణంగా చివరి నిమిషంలో వైదొలిగాడు. దాంతో ‘లక్కీ లూజర్’ సిమోన్ బొలెలీ (ఇటలీ)తో నాదల్ ఆడతాడు. బొలెలీతో ముఖా ముఖి రికార్డులో నాదల్ 5–0తో ఆధిక్యంలో ఉన్నాడు. ఇటీవలే మాడ్రిడ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) చేతిలో నాదల్ ఓడిపోయినప్పటికీ... అనంతరం పుంజుకొని రోమ్ ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. మాజీ చాంపియన్స్ వావ్రింకా (స్విట్జర్లాండ్), జొకోవిచ్ (సెర్బియా)... మాడ్రిడ్ ఓపెన్ విజేత, రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), డొమినిక్ థీమ్, దిమిత్రోవ్ (బల్గేరియా) తదితరులు ఒకే పార్శ్వంలో ఉండటంతో నాదల్ పని మరింత సులువు కానుంది. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో కచ్చితమైన ఫేవరెట్ ఎవరూ కనిపించడంలేదు. అయితే డిఫెండింగ్ చాంపియన్ ఒస్టాపెంకో (లాత్వియా), టాప్ సీడ్ హలెప్ (రొమేనియా), మాజీ విజేతలు షరపోవా (రష్యా), సెరెనా విలియమ్స్ (అమెరికా) ఆటతీరుపై అందరిలో ఆసక్తి నెలకొంది. గతేడాది పాపకు జన్మనిచ్చాక సెరెనా ఆడుతోన్న తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఇదే. ఆదివారం జరిగే తొలి రౌండ్లో కొజ్లోవా (ఉక్రెయిన్)తో ఒస్టాపెంకో ఆడుతుంది. నాదల్, జొకోవిచ్, షరపోవా, సెరెనా సోమవారం తమ తొలి రౌండ్ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. - మధ్యాహ్నం గం. 2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం -
పోరాడి ఓడిన అంకిత రైనా
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత క్రీడాకారిణి అంకిత రైనా తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. పారిస్‌లో మంగళవారం పదో సీడ్ రొడీనా (రష్యా)తో జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో అంకిత 3–6, 6–7 (2/7)తో ఓటమి చవిచూసింది. గంటా 41 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అంకిత తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడు సార్లు బ్రేక్ చేసింది. 52 అనవసర తప్పిదాలు చేసిన అంకిత నెట్‌వద్ద 15 పాయింట్లు సాధించింది. క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్ నుంచి నలుగురు బరిలోకి దిగారు. ప్రజ్నేశ్ రెండో రౌండ్‌కు చేరుకోగా... అంకిత, సుమీత్, రామ్‌కుమార్ తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. -
ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్
ప్యారిస్: ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్‌లో హెచ్ఎస్ ప్రణయ్‌పై కిదాంబి శ్రీకాంత్ గెలుపొందాడు. పురుషుల సింగిల్స్ సెమీస్‌లో ప్రణయ్‌ను 14-21, 21-19, 21-18 తేడాతో ఓడించాడు. ఆద్యంతం ఆసక్తిగా సాగిన మ్యాచ్‌లో మూడో గేమ్‌లో శ్రీకాంత్‌ను విజయం వరించింది. తొలి గేమ్‌లో వెనకబడ్డ శ్రీకాంత్ రెండో గేమ్‌లో హోరాహోరీగా తలపడ్డాడు. అటు ప్రణయ్ సైతం చక్కగా ఆడినా చివరకు 21-19 తో రెండో గేమ్‌ను శ్రీకాంత్ గెలిచాడు. ఇక నువ్వా నేనా అన్నట్టు సాగిన మూడో గేమ్‌ను శ్రీకాంత్ 21-18తో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాడు. -
అంత సులువు కాదు
వింబుల్డన్‌లో విజయంపై నాదల్ పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచినా... గ్రాస్‌కోర్ట్ ఈవెంట్లో తాను ఫేవరెట్‌ను కాదని స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ స్పష్టం చేశాడు. 2008, 2010లలో ఫ్రెంచ్ ఓపెన్‌తోపాటు వింబుల్డన్ టైటిల్‌ను గెలిచిన ఈ స్టార్ ప్లేయర్‌ను మళ్లీ ఈ ఏడాది ఆ ఫీట్ ఊరిస్తోంది. సోమవారం విడుదల చేసిన ర్యాం కుల్లో అతను రెండో ర్యాంకుకు ఎగబాకాడు. 2014 తర్వాత నాదల్కిదే మెరుగైన ర్యాంకు. ఎప్పటిలాగే పదో టైటిల్‌నూ సుప్రసిద్ధ ఈఫిల్ టవర్ వద్ద ముద్దాడిన 31 ఏళ్ల రాఫెల్ ఫొటో సెషన్లో సందడి చేశాడు. ఇబ్బంది అంతా గాయంతోనే... ‘2012 నుంచి మోకాలి గాయం పదేపదే ఇబ్బంది పెడుతోంది. ప్రత్యేకించి గ్రాస్‌కోర్టులపై ఆడుతుంటే అది మరింత ప్రభావం చూపెడుతోంది. ఈసారి ఏమవుతుందో చూడాలి. ఇక్కడ క్లేకోర్టులో ఆడినట్లు గ్రాస్‌కోర్టులో ఆడలేం. రెండు మ్యాచ్‌లైతే గెలవొచ్చు... కానీ ఆ తర్వాతే పరిస్థితులు మారతాయి’ అని పదోసారి ఫ్రెంచ్ ఓపెన్ సాధించిన నాదల్ అన్నాడు. వింబుల్డన్‌లో ఐదుసార్లు ఫైనల్ చేరినప్పటికీ కేవలం రెండుసార్లే టైటిల్ గెలుచుకున్నాడు. ‘ఇపుడైతే నేను రెండో ర్యాంకర్‌ను. మిగతా ఏడాదంతా ఏం జరుగుతుందో చూడాలి. అది నా ఆటతీరుమీదే ఆధారపడి ఉంటుంది’ అని అన్నాడు. విమర్శకులకు ఇదే నా జవాబు... గాయాలతో సతమతమవుతున్న నాదల్ ఇక గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవలేడనే వారికి తన పదో టైటిలే జవాబిచ్చిందని స్పెయిన్ స్టార్ అన్నాడు. ‘మూడేళ్ల నుంచి నిన్నమొన్నటి వరకు నా సామర్థ్యంపై ఎన్నో సందేహాలు రేకెత్తించినవారికి నా సత్తాతో సమాధానమిచ్చా. అయినా జీవితమెప్పుడూ సాఫీగా ఉండదు. అలా ఉంటే అహంభావమూ ఉంటుంది. నేను అహంభావిని కాదు’ అని నాదల్ చెప్పుకొచ్చాడు. గాయాలు, వైఫల్యాలతో 2015లో పదో ర్యాంకుకు పడిపోయిన నాదల్ గతేడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో మణికట్టు గాయం వల్ల మూడో రౌండ్లోనే వెనుదిరిగాడు. కానీ ఆరు నెలల వ్యవధిలోనే ఈ జనవరిలో ఆస్ట్రేలియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.