gangula kamalkar
-
‘పొలంబాట’న కేసీఆర్.. సెంటిమెంట్ జిల్లాపై స్పెషల్ ఫోకస్!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. సాగునీరు అందక ఎండిపోయిన పంటల ను పరిశీలించనున్నారు. ఆయన పర్యటనను విజ యవంతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక పార్టీ అధినేతగా మాజీ సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనకు రావడం ఇది రెండోసారి. మార్చి లో కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో జరిగిన కరీంనగర్ కదనభేరీసభలో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలి పించాలని సెంటిమెంట్ జిల్లా అయిన కరీంనగర్ నుంచే ప్రచార శంఖారావాన్ని పూరించారు. తాజా గా రైతుల పొలాలను పరిశీలించనున్నారు. నీరిచ్చే అవకాశం ఉన్నా .. పచ్చటి పొలాలను ప్రభుత్వమే ఎండబెట్టిందని, కంటికి రెప్పలా కాపాడుకున్న పంటలు కళ్లముందు ఎండిపోతోంటే దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నల్లో భరోసా నింపేందుకు కేసీఆర్ మరోసారి కరీంనగర్ రానున్నారు. సెంటిమెంట్ జిల్లాపై స్పెషల్ ఫోకస్.. తెలంగాణ తొలి సింహగర్జన సభ నుంచి కేసీఆర్‌కు కరీంనగర్ జిల్లా అంటే సెంటిమెంట్. ఇటీవల కరీంనగర్ కదనభేరి బహిరంగ సభతో కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపారు. గెలుపోటములు సహజమని, పదేళ్లు జనరంజకమైన పాలన సాగించామని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన అడ్డగోలు హామీలతో జనం మోసపోయి ఓట్లు వేశారని, రానున్న రోజులు బీఆర్ఎస్ పార్టీదేనని ధైర్యం నింపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఆవశ్యకత, కాంగ్రెస్ హామీల అమలుపై క్షేత్రస్థాయిలో ప్రజలను జాగృతం చేసే పనిలో బీఆర్ఎస్ శ్రేణులు ముందుండాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ను దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ మైండ్‌గేమ్ ఆడుతున్నాయని, ఆ విషప్రచారంలో కార్యకర్తలు చిక్కుకోకుండా చూడాలని, కేడర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులకు ఇదివరకే కేసీఆర్ సూచించినట్లు పార్టీ వర్గాల సమాచారం. రెండు పార్లమెంట్ స్థానాలపై గురి.. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలుపించుకునే దిశగా మాజీ సీఎం కేసీఆర్ కసరత్తు ముమ్మరం చేసినట్లు సమాచారం. కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్‌కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ సీనియర్ నేతలు కావడం, అపారమైన అనుభవం ఉండటం, పదేళ్లల్లో బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పనులను క్షేత్రస్థాయిలో వివరించి ఓటు బ్యాంకును పటిష్టపరుచుకుని ఎలాగైనా రెండు సీట్లను కైవసం చేసుకునే దిశగా పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశనం చేయనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను తొలగించడంపైనా దృష్టి సారించినట్లు సమాచారం. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం కొరవడటం, కొన్ని నియోజకవర్గాల్లో మొన్నటి వరకు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారితోనే ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య అంతరాలు పెరిగిపోవడం వంటి సమస్యలపై దృష్టిసారించనున్నారు. అన్నదాతకు అండగా.. సర్కారుపై సమరం చేసేందుకు వస్తున్న బీఆర్ఎస్ అధినేత పర్యటనపై ఆసక్తి నెలకొంది. ‘చొప్పదండి’లో తారాస్థాయికి అసమ్మతి చొప్పదండి నియోజకవర్గంలో పార్టీలో అసమ్మతి తీవ్రస్థాయికి చేరుకుంది. అసెంబ్లీ ఎన్నికల ముందునుంచే అప్పటి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు వ్యతిరేకంగా జట్టుకట్టిన ద్వితీయశ్రేణి నాయకులు.. కాంగ్రెస్, ఇతరపార్టీల వైపు వెళ్లారు. తాజాగా అదే నియోజకవర్గం నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న ఓ నేత సుంకె తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గ ఇన్చార్జిగా సుంకె కొనసాగితే ఇతర పార్టీలోకి వెళ్లడమే మంచిదని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. చొప్పదండిలో నెలకొన్న అసమ్మతిపై పార్టీ అధిష్టానం ఏ మేరకు దృష్టిసారిస్తుందో వేచి చూడాలి. కేసీఆర్ పర్యటన సాగుతుందిలా ఉదయం 8.30కు ఎర్రవల్లిలోని ఫాంహౌస్ నుంచి బయలుదేరి ఉదయం 10.30 గంటలకు కరీంనగర్ మండలం మొగ్దుంపూర్ చేరుకుంటారు. గ్రామంలో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడుతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కరీంనగర్‌లోని మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటికి చేరుకుని అక్కడే భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2గంటలకు రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లిలనెండిన వరిపంటను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు శభాష్‌పల్లి వద్ద మిడ్‌మానేరు రిజర్వాయర్‌ను పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటలకు రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఎర్రవెల్లి ఫాంహౌజ్‌కు బయల్దేరుతారు. -
బీఆర్ఎస్తోనే అన్నివర్గాలకు న్యాయం : గంగుల కమలాకర్
కరీంనగర్: బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని, రానున్న ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా వినోద్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించా లని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలు పునిచ్చారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భా గంగా కిసాన్‌నగర్ 3,25వ డివిజన్లో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఎమ్మెల్యే కమలాకర్, వినోద్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ్డాక స్మార్ట్‌సిటీ నిధులతో పాటు సీఎం హామీ నిధులు రూ.360 కోట్లతో కరీంనగర్ నగరాన్ని అద్దంలా తీర్చిదిద్దామని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల మోసపూరిత వాగ్దానాలను తిప్పికొట్టి బీఆర్ఎస్కు అండగా నిలవాలని ప్రజలను కోరా రు. మేయర్ సునీల్‌రావు, బీఆర్ఎస్ నాయకులు చల్ల హరిశంకర్, ఎడ్ల అశోక్, కుర్ర తిరుపతి, కంసాల శ్రీనివాస్, కామారపు శ్యాం పాల్గొన్నారు. ఇవి చదవండి: బీజేపీ ఎందుకు సుమోటోగా తీసుకోవడం లేదు? -
నల్గొండ సభను విజయవంతం చేయాలి : గంగుల కమలాకర్
కరీంనగర్: ఈనెల 13న నిర్వహించే చలో నల్గొండ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ ఎమ్మెల్యే నివాసంలో నల్గొండ సభకు సంబంధించి కరీంనగర్ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. కృష్ణానదిపై తెలంగాణ ప్రాజెక్టులు, నీటిహక్కులను హరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర సంస్థ కేఆర్ఎంబీకి అధికారాలు అప్పగించడం ద్వారా జరగబోయే దుష్పరిణామాలను తెలంగాణ సమాజానికి వివరించేందుకు నల్గొండలో ఈనెల 13న నిర్వహించతలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను వివరించారు. కరీంనగర్ నియోజకవర్గం నుండి 2000 మందిని తరలిస్తున్నట్లు వెల్లడించారు. మేయర్ వై.సునీల్ రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, పాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యామ్ సుందర్‌రెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: మోదీతోనే దేశాభివృద్ధి : బండి సంజయ్‌కుమార్ -
గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే ప్రచారాన్ని ఖండించే క్రమంలో తెలంగాణ మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఒకరిని తీసుకెళ్తే.. బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ వాళ్లు పది మంది వస్తారని అన్నారాయన. గురువారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కానీ, కేసీఆర్ మాకు దైవ సమానులు. ఆయననుగానీ, బీఆర్ఎస్నుగానీ ఎవరూ వీడరు. అందరూ ఆయన వెంటే ఉంటారు. ఎవరూ కాంగ్రెస్‌లో చేరరు. కాంగ్రెస్ వాళ్లు ఒక్కరిని తీసుకెళ్తే.. బీఆర్ఎస్లోకి పది మంది వస్తారు. మేం గేట్లు తెరిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బీఆర్ఎస్లోకి వచ్చే పరిస్థితి ఉంది. పదేళ్లు అధికారంలో ఉన్నాం. మాకు అధికారం ముఖ్యం కాదు. ప్రభుత్వాన్ని కూలదోసే ఉద్దేశం లేదూ అని గంగుల వ్యాఖ్యానించారు. కరీంనగర్ ప్రజలకు మేలు చేయడంలోఎంపీగా బండి సంజయ్ విఫలమయ్యారని.. మళ్లీ వినోద్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని.. ఇందుకోసం కృషి చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన పిలుపు ఇచ్చారు. -
ఎంపీగా గెలిపించుకున్న బండి సంజయ్ ఎక్కడికి పోయాడు
-
రేషన్ డీలర్ల కమీషన్ రెండింతలు పెంపు
సాక్షి, హైదరాబాద్: గతంలో ఇచ్చిన హామీ మేరకు రేషన్ డీలర్ల కమీషన్‌ను ప్రభుత్వం రెండింతలు చేసింది. టన్ను బియ్యంపై రూ. 700గా ఉన్న కమీషన్‌ను రూ. 1,400 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్‌లోని తన నివాసంలో రేషన్ డీలర్ల జేఏసీ ప్రతినిధులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రతిని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పెంపు తక్షణమే అమల్లోకి రానున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఉత్తర్వుల ద్వారా ఏటా డీలర్ల కమిషన్ రూ. 303 కోట్లకు చేరనుందని, అందులో రూ. 245 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా భరిస్తుందని వెల్లడించారు. కరోనా వంటి సంక్షోభ సమయంలో రేషన్ డీలర్లు అందించిన సేవలకు గౌరవంగా సీఎం డీలర్ల కమీషన్‌ను రెండింతలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ కేంద్రం అందించే కమీషన్కన్నా అదనంగా రూ.950 ఒక్కో టన్నుకు అందిస్తున్నారని తెలిపారు. అలాగే కేంద్రం జాతీయ ఆహార భద్రతా కార్డులు ఇవ్వని దాదాపు 90 లక్షల మంది పేదలకు రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర ఆహార భద్రత కింద పూర్తి రేషన్‌ను అదనంగా అందజేస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసే 5కిలోల బియ్యానికి అదనంగా మరో కిలోని చేర్చి ఎన్ఎఫ్ఎస్సీ కార్డులకు కూడా ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యాన్ని అందచేస్తోందని తెలిపారు. ఇందుకోసం ఏటా రూ. 3వేల కోట్లను పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేస్తోందన్నారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల ప్రతినిధులు మంత్రిని సన్మానించి తమ కృతజ్ఞతలు తెలియజేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
రేషన్ డీలర్లపై కేసీఆర్ సర్కార్ వరాల జల్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రేషన్ డీలర్లపై ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ముఖ్యంగా బియ్యం పంపిణీకి గాను వారికిచ్చే కమీషన్‌ను మెట్రిక్ టన్నుకు రూ.900 నుంచి రూ.1,400 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే డీలర్లు డిమాండ్ చేస్తున్న మరో 13 అంశాలపై కూడా సానుకూలంగా స్పందించింది. రేషన్ డీలర్ల సంఘం జేఏసీ ప్రతినిధులతో మంగళవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సచివాలయంలో చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ప్రభుత్వానికి, రేషన్ డీలర్లకు ఆమోదయోగ్యమైన విధంగా కమీషన్‌ను పెంచడంతో పాటు మరో 13 డిమాండ్లను పరిష్కరిస్తున్నట్లు ఈ సందర్భంగా వారు ప్రకటించారు. కరోనా సమయంలో సేవలందిస్తూ మరణించిన 100 మంది డీలర్ల వారసులకు కారుణ్య నియామకం కింద డీలర్‌షిప్‌ను మంజూరు చేయడం, రాష్ట్రంలో అమలవుతున్న రైతు, నేత, గౌడన్నల బీమా తరహాలో రేషన్ డీలర్లకు రూ.5 లక్షల బీమా వర్తింప చేయడం, ప్రతి డీలర్‌ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం, వయోపరిమితి 40 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంపు తదితర 13 అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.200 గా ఉన్న డీలర్ల కమీషన్‌ను దశలవారీగా పెంచుతూ రూ.1400కు చేర్చినట్లు మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. దీర్ఘకాల డిమాండ్లకు పరిష్కారం రాష్ట్రంలోని పేదలకు చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యానికి సంబంధించి ప్రస్తుతం డీలర్లకు మెట్రిక్ టన్నుకు రూ.900 చొప్పున కమీషన్ అందుతోంది. దీనిని పెంచాలని గత కొంతకాలంగా డీలర్లు ఆందోళన చేస్తున్నారు. గత నెలలో సమ్మెలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నించారు. అయితే మంత్రి గంగుల ఇచ్చిన హామీ మేరకు గత నెలలో బియ్యం పంపిణీ చేసిన డీలర్లు, ఈ నెలలో తమ సమస్యలు పరిష్కారమైతేనే బియ్యం పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. దీంతో ప్రభుత్వం ఈనెల 5 నుంచి ప్రారంభం కావలసిన బియ్యం పంపిణీని 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం మంత్రులు హరీశ్, గంగులతో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మారావ్ గౌడ్, రేషన్ డీలర్ల సంఘం గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి డీలర్ల జేఏసీ నేతలతో సమావేశమయ్యారు. కాగా ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 17,227 మంది డీలర్లకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్రంలో మొత్తం 90.05 లక్షల ఆహారభద్రత కార్డులు ఉన్నాయి. వాటిలో 35.56 లక్షల కార్డులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కార్డులు కాగా మిగతా 54.5 లక్షల కార్డులు కేంద్రం మంజూరు చేసినవి. ఈ కార్డులకు గాను 2.82 కోట్ల మంది లబ్ది దారులకు ప్రతినెలా 1.80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వంపై రూ.138.73 కోట్ల భారం డీలర్ల కమీషన్‌ను రూ.1,400కు పెంచడం వల్ల ప్రభుత్వంపై సంవత్సరానికి రూ.138.73 కోట్ల భారం పడనుంది. కమీషన్ మొన్నటివరకు రూ.700 ఉండగా రెండు నెలల క్రితం కేంద్రంతో జరిగిన సర్దుబాటు వల్ల రూ.200 పెంచి రూ.900 కమీషన్ ఇవ్వాలని నిర్ణయించింది. రూ.700 ఉన్నప్పుడు రూ.45.36 కోట్ల కేంద్రం వాటా పోగా, రాష్ట్రం వాటా రూ.106.33 కోట్లతో డీలర్లకు మొత్తం రూ.151.69 కోట్లు ఏటా వెచ్చించాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం కమీషన్‌ను రూ.1,400కు పెంచడంతో ఏటా మొత్తం రూ.303.38 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇందులో కేంద్రం వాటా రూ.58.32 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.245.06 కోట్లకు పెరిగింది. అంటే రూ.138.73 కోట్ల అదనపు భారం పడుతోందన్నమాట. డీలర్లకు మరికొన్ని ప్రభుత్వ వరాలు ♦ ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద కచ్చితమైన తూకం వేసేలా వే బ్రిడ్జిల ఏర్పాటు ♦ డీలర్షిప్ రెన్యువల్‌ను ఐదేళ్ల కాలపరిమితికి పెంచడం ♦ డీలర్ మరణిస్తే అంత్యక్రియల నిర్వహణకు రూ.10 వేల తక్షణ సాయం ♦ 1.5 క్వింటాళ్ల వేరియేషన్ (తేడా)ను కేసుల పరిధి నుంచి తీసివేయడం ♦ హైదరాబాద్‌లో రేషన్ భవన్ నిర్మాణానికి భూ కేటాయింపు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన డీలర్లు కమీషన్ పెంపు సహా తమ ఇతర సమస్యలు పరిష్కరించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేషన్ డీలర్లు కృతజ్ఞతలు తెలిపారు. తమ వినతులపై సీఎం సానుకూలంగా స్పందించడంపై హర్షం వ్యక్తం చేశారు. మంత్రులు హరీశ్‌రావు, గంగుల, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో పౌరసరఫరాల కమిషనర్ వి.అనిల్ కుమార్, రేషన్ డీలర్ల జేఏసీ ప్రతినిధులు నాయికోటి రాజు, మల్లిఖార్జున్, రవీందర్, నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో ‘కేసీఆర్ విద్యా కానుక’: గంగుల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలు తలెత్తుకొని తిరిగేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శాసనమండలిలో శుక్రవారం ‘రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు’అనే అంశంపై లఘు చర్చ జరిగింది. సంక్షేమంపై పలువురు సభ్యులు అడిగిన పలు ప్రశ్నలపై మంత్రులు స్పందించారు. బీసీ సంక్షేమంపై మంత్రి గంగుల మాట్లాడుతూ కేసీఆర్ తీసుకున్న చర్యలతో బీసీల్లో ఆత్మగౌరవం ఎన్నోరెట్లు పెరిగిందన్నారు. త్వరలోనే కేసీఆర్ విద్యాకానుక పథకాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పు ల ఈశ్వర్ మాట్లాడుతూ దళితుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే ఎవరూ చేయలేదన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గిరిజన వర్గాలను కేసీఆర్ జనజీవనంలో ఉన్నతస్థానంలో నిలిపారన్నారు. -
రేపు ‘కేసీఆర్ విద్యాబంధు’
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో వెనకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు మోసుకొచ్చింది. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో బీసీ గురుకులాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువ స్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. కరీంనగర్లో మీడియా తో మాట్లాడుతూ పథకానికి సంబంధించిన వివరాలు తెలిపారు. కేసీఆర్ విద్యాకానుక/ కేసీఆర్ విద్యాబంధు/ స్వదేశీ విద్యానిధి.. ఇలా దాదాపు 20 పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. ఈనెల 28న హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగం(ఎంహెచ్ఆర్డీ)లో పథకం పేరు, జీవో విడుదల, లోగోతోపాటు విధివిధానాలను ఆవిష్కరించనున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, బీసీ సంఘం నేత జాజుల శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్ హాజరవుతున్నారని చెప్పారు. గురుకులాలన్నీ ఒకే గొడుగు కిందకు..: కేవలం స్కూల్ వరకు విద్యార్థులకు డైట్, కాస్మెటిక్ చార్జీలు చెల్లిస్తే.. సరిపోదని భావించిన కేసీఆర్.. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు కూడా అవే సౌకర్యాలు కల్పించాలని ఈ కార్య క్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి గంగుల తెలిపారు. ఈ నిర్ణయంతో 302 హాస్టళ్లలో చదువుకుంటున్న 33, 687 మంది విద్యార్థులకు లబ్ధి చేకూ రుతుందన్నారు. వీరికి డైట్, కాస్మె టిక్ చార్జీలతోపాటు నోట్‌బుక్స్, రికా ర్డ్స్, బెడ్షీట్లు తదితరాలు అందిస్తా మన్నారు. అదే విధంగా ఐఐటీ, ఐఐ ఎం, ఐఐఎస్సీ, ఐఐటీ, ఎయిమ్స్‌తో పాటు అన్ని ప్రముఖ వర్సిటీలు, జాతీయ ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు సైతం ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తామన్నారు. ఒక్కో విద్యార్థికి రూ.2 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు కూడా చెల్లిసా ్తమని మంత్రి స్పష్టంచేశారు. అందు కే, గురుకులాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడమే నూతన పథ కం ముఖ్యఉద్దేశమని శుక్రవారం విధివిధానాలు వివరిస్తామని తెలి పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవి శంకర్ పాల్గొన్నారు. -
జాతీయ విద్యా సంస్థల్లో చదివే బీసీలకూ ఫీజు రీయింబర్స్మెంట్
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో చదివే బీసీలకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ (ఆర్టీఎఫ్) పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఐఐటీలు, ఐఐఎంలు, సెంట్రల్ యూనివర్సిటీలు వంటి 200కు పైగా ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందిన రాష్ట్ర బీసీ విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజులు చెల్లించనుంది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అమలు చేస్తున్న ఈ పథకాన్ని.. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే బీసీలకు కూడా వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. ఏటా సుమారు 10 వేల మందికి.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్లను అందజేస్తోందని.. రాష్ట్రంలో చదువుతున్న వారికి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నామని మంత్రి గంగుల గుర్తు చేశారు. ఇకపై దేశంలోని ప్రతిష్టాత్మక కాలేజీల్లో సీట్లు పొందిన బీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఫీజు అందించనుందని తెలిపారు. మొత్తంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణేనని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఏటా రాష్ట్రానికి చెందిన దాదాపు 10వేల మంది బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని, ఇందుకోసం ప్రభుత్వంపై ఏటా అదనంగా రూ.150 కోట్ల భారం పడుతుందని గంగుల వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆసరా పింఛన్లు, రైతు బంధు, ఉచిత కరెంటు తదితర పథకాల్లో బీసీలదే మెజార్టీ వాటా అని పేర్కొన్నారు. బీసీలకు ఆత్మగౌరవ భవనాలు, గ్రామాలు, పట్టణాల్లో కమ్యూనిటీ హాళ్లు, కుల వృత్తిదారుల ఆర్థిక స్వావలంబనకు రూ.లక్ష ఆర్థిక సాయం, ప్రపంచస్థాయి విద్యను అందించేలా 327 గురుకుల విద్యాలయాల ఏర్పాటు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. ఈ నిర్ణయం విప్లవాత్మకం: జూలూరు గౌరీశంకర్ ఎక్కడా లేని విధంగా దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థల్లో చదువుకునేందుకు బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లించాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ హర్షం వ్యక్తం చేశారు. -
ఎఫ్‌సీఐ ఇలా చేస్తే కష్టం
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు పంపిణీ చేసే ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధక బియ్యం) విషయంలో ఎఫ్‌సీఐ వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్రంలోని మిల్లర్లు మండిపడుతున్నారు. ఇటీవల 290 మిల్లుల నుంచి ఎఫ్‌సీఐకి పంపిన సుమారు 40 వేల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ బియ్యాన్ని (సీఎంఆర్) నాణ్యత సరిగా లేదంటూ ఎఫ్‌సీఐ తిరస్కరించడంంతో పాటు మిల్లుల నుంచి 2022–23కు సంబంధించిన సీఎంఆర్‌ను తీసుకునేందుకు కూడా నిరాకరించింది. దీంతో మిల్లింగ్ అయిన బియ్యం మిల్లుల్లోనే ఉండిపోతోంది. గత సంవత్సరం వానకాలం, యాసంగి ధాన్యం ఇప్పటికే కోటి టన్నులకు పైగా మిల్లుల్లో నిల్వ ఉండగా, మర పట్టించిన మేరకు బియ్యాన్ని కూడా ఎఫ్‌సీఐ తీసుకోవడం లేదని మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మిల్లర్ల సంఘం నాయకులు సచివాలయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌తో భేటీ అయ్యారు. ఎఫ్‌సీఐ ఘర్షణాత్మక వైఖరి: రాష్ట్రంలోని సుమారు 3 వేల మిల్లులు ధాన్యం, బియ్యంతో నిండిపోయి ఉన్నాయని, ధాన్యం నిల్వకు గోదాములు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మంత్రికి మిల్లర్లు తెలిపారు. ఈ పరిస్థితుల్లో మిల్లర్లు పంపించిన బియ్యాన్ని నిరాకరిస్తూ, దాదాపు 290 మిల్లుల్ని బ్లాక్ లిస్టులో పెట్టి ఎఫ్‌సీఐ ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ నాఫెడ్ సరఫరా చేసిన ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ (ఎఫ్ఆర్కే) నాణ్యత సరిగా లేదంటూ ఎఫ్‌సీఐ బియ్యాన్ని తీసుకోవడానికి నిరాకరించడంతో రైస్ మిల్లింగ్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని చెప్పారు. ఎఫ్‌సీఐ ఇలాగే వ్యవహరిస్తే సీఎంఆర్ నుంచి పూర్తిగా తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఎఫ్‌సీఐ గోదాములు సమకూర్చకపోవడం వల్ల సకాలంలో సీఎంఆర్ చేయలేకపోతున్నట్లు తెలిపారు. కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుల్లో.. గత వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించిన కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు రైస్ మిల్లుల వద్ద పేరుకుపోయాయని మిల్లర్లు మంత్రి దృష్టికి తెచ్చారు. కోటీ పదమూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లింగ్ చేయాల్సి ఉండగా, అందులో గత వానాకాలంలో తడిసిన ధాన్యం కూడా ఉందని తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ధాన్యం పాడయ్యే ప్రమాదం ఉందని, అప్పుడు సీఎంఆర్ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. వానాకాలం ధాన్యం తడిసిపోయిన నేపథ్యంలో ఈ సీజన్‌కు సంబంధించిన 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బాయిల్డ్ చేసేందుకు ఆదేశాలివ్వాలని కోరారు. లేని పక్షంలో తమ దగ్గర ఉన్న ధాన్యాన్ని వెనక్కితీసుకోవాలని అన్నారు. ఎఫ్‌సీఐ కఠిన వైఖరి నేపథ్యంలో డిఫాల్ట్ పెట్టబోమని హామీ ఇస్తే ప్రభుత్వ ధాన్యానికి కస్టోడియన్‌గా ఉంటామని స్పష్టం చేశారు. సీఎం దృష్టికి తీసుకెళ్తా: మంత్రి గంగుల మిల్లర్ల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి గంగుల హామీ ఇచ్చారు. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మద్దతు ధరతో ధాన్యం కొను గోలుకు సీఎం ఆదేశాలిచ్చారని, కేంద్రం కూడా దేశంలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత నుంచి తప్పుకోకూడదని సూచించారు. తక్షణ మే ఎఫ్‌సీఐ స్టోరేజీ సౌకర్యం కల్పిస్తే నెలకు పదిలక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాగా అప్పటికప్పుడు ఎఫ్‌సీఐ ఉన్నతాధికారులతో చర్చించిన మంత్రి.. వీలైనంత త్వరగా స్టోరేజీని పెంచి బియ్యం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులతో పాటు మిల్లర్ల సంఘం అధ్యక్షుడు గంపా నాగేందర్, జనరల్ సెక్రటరీలు వి.మోహన్ రెడ్డి, ఎ.సుధాకర్ రావ్, ట్రెజరర్ చంద్రపాల్, 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, మిల్లర్లు పాల్గొన్నారు. -
నాని ఎక్కడ పుట్టినా.. ఇప్పుడు తెలంగాణ బిడ్డే: మంత్రి గంగుల
నాచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రం విజయోత్సవ సభ బుధవారం సాయంత్రం కరీంనగర్ ఎస్సారార్ కళాశాల గ్రౌండ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి గంగుల కమలాకర్ హాజరై మాట్లాడారు. మానేరు నీళ్లు తాగిన మా సిరిసిల్ల బిడ్డ వేణు బలగంతో, పెద్దపెల్లి బిడ్డ శ్రీకాంత్ ఓదెల దసరాతో కరీంనగర్ సత్తా చాటారన్నారు. తెలంగాణ సాధించడం వల్లే మట్టిలోని మాణిక్యాలు బయటకొస్తున్నాయని పేర్కొన్నారు. కాసర్ల శ్యామ్ గొప్ప పాటలు రాస్తూ తెలంగాణ సంస్కృతిని వెలుగులోకి తెస్తున్నారని.. నాని ఎక్కడ పుట్టినా దసరా సినిమా తర్వాత తెలంగాణ బిడ్డయ్యాడని అన్నారు. నాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. కరీంనగర్ ఎనర్జీ అద్భుతంగా ఉందని, ఈవెంట్ సక్సెస్‌కు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్లో అద్భుతమైన అభివృద్ధితోపాటు ప్రకృతి రమణీయత ఆకట్టుకుందని.. త్వరలోనే ఇక్కడ షూటింగ్ కోసం ప్లాన్ చేస్తానన్నారు. దసరా డైలాగ్స్‌తో ప్రేక్షకులను అలరించాడు. సక్సెస్ మీట్లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, మేయర్ వై.సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణిహరిశంకర్, ఎడిటర్ నవీన్, ప్రముఖ నటుడు దీక్షిత్, దాసర్ల శ్యామ్ పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Karimnagar: ఉగాది వేళ.. జాతకాల్లో అదృష్టం వెతుక్కుంటున్న నేతలు
సాక్షి, కరీంనగర్: తెలుగువారి కొత్త సంవత్సరాది ఉగాది. శోభకృత్ నామ సంవత్సరం సందర్భంగా ప్రతీ ఒక్కరూ తమ జాతకాన్ని కొత్త పంచాంగంలో వెతుక్కుంటున్నారు. ఈ ఉగాది సాధారణ ప్రజల కంటే.. రాజకీయ నాయకులకు ఎంతో కీలకమైంది. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్న ప్రత్యర్థులు, ఈసారి ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకునే ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో అధికార–ప్రతిపక్ష నేతలంతా నూతన పంచాంగంలో తమ జాతకాలలో ఆదాయ వ్యయాల మాట ఎలా ఉన్నా.. రాజ్యపూజ్యంపైనే కన్నేశారు. అవమానాల మాట పక్కనబెట్టి.. రాజ్యపూజ్యం దక్కుతుందా? లేదా అన్న అంశంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే.. కరీంనగర్: బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ తీగల వంతెన, ఎమ్మారెఫ్, స్మార్ట్ సిటీ పనులతో కరీంనగర్‌పై ఫోకస్ పెట్టారు. హిందుత్వం, మార్పు అన్న ఎజెండాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నుంచి పోటీ ఎదరవనుంది. బీజేపీ నుంచి కొత్త జయపాల్‌రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి ఎమ్మెస్సార్ మనవడు రోహిత్, నగరాధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. వైస్సార్టీపీ నుంచి డాక్టర్ నగేశ్ బరిలో నిలవనున్నారు. చొప్పదండి: ప్రస్తుతం ఎమ్మెల్యే రవిశంకర్ (బీఆర్ఎస్)కు ఇంటిపోరు తప్పేలా లేదు. అదేపార్టీ నుంచి గజ్జెల కాంతం, కత్తెరపాక కొండయ్య, కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ టికెట్ రేసులో ఉన్నారు. ఈసారి మేడిపల్లి సత్యం (కాంగ్రెస్) నుంచి గట్టి పోటీ ఇవ్వనున్నారు. బీజేపీ నుంచి బొడిగె శోభ, సుద్దాల దేవయ్యల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వైఎస్సార్టీపీ నుంచి అక్కెనపల్లి కుమార్ బరిలో నిలవనున్నారు. మానకొండూరు: ఇక్కడ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రసమయి బాలకిషన్‌కు ఈసారి ఇంటి పోరు తీవ్రంగానే ఉంది. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఇక్కడే నుంచే పోటీ చేసిన ఓరుగంటి ఆనంద్ కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ, బీజేపీ గడ్డం నాగరాజు, దరువు ఎల్లన్న బరిలో నిలవనున్నారు. హుజూరాబాద్: గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఈటల రాజేందర్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ఈసారి బరిలో దిగనున్నారు. కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సిరిసిల్ల: ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్‌కు ప్రత్యర్థులు పెద్దగా లేరు. కాంగ్రెస్ నుంచి కె.కె.మహేందర్‌రెడ్డి మినహా ఇక్కడ ఆయనకు గట్టి వైరిపక్షం కానరావడం లేదు. ఈసారి బీజేపీ మాత్రం సెలబ్రెటీని రంగంలోకి దించుతారన్న ప్రచారం సాగుతోంది. రామగుండం: ప్రస్తుతం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు, ఈసారి కాంగ్రెస్ నేత ఠాకూర్ మక్కాన్ సింగ్ (కాంగ్రెస్) గట్టి పోటీ ఎదురవనుంది. వీరితోపాటు సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ (బీజేపీ) కూడా బరిలో ఉండటంతో పోరు రసవత్తరంగా మారనుంది. వేములవాడ: ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ (బీఆర్ఎస్)కు చిరకాల ప్రత్యర్థి ఈసారి కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నుంచి చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ పేరు వినిపిస్తుండగా.. తాను స్వతంత్రంగానైనా పోటీచేస్తానని అదే పార్టీ నేత తుల ఉమ ఇప్పటికే ప్రకటించారు. ఎన్నారైలు గోలి మోహన్ (ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు), మరో ఎన్నారై తోట రాంకుమార్ కూడా బరిలో నిలిచేందుకు ఆసక్తిగా ఉన్నారు. జగిత్యాల: డాక్టర్ సంజయ్ ఇప్పటికే వరుసగా గ్రామాల్లో పర్యటిస్తూ.. పల్లె నిద్ర పేరుతో ప్రజలకు చేరవవుతున్నారు. ఇక మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (కాంగ్రెస్) కూడా పోటాపోటీగా పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల భోగశ్రావణి బీజేపీ నుంచి బరిలోకి దిగేందుకు ఆసక్తిగా ఉన్నారు. కోరుట్ల: ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు(బీఆర్ఎస్) వరుసగా అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు అంటూ పర్యటిస్తున్నారు. ఈసారి జువ్వాడి నర్సింగరావు (కాంగ్రెస్) గట్టి పోటీ ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నారు. మార్పులు జరిగితే వీరిద్దరు కుమారులను బరిలో దింపుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ధర్మపురి: ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ (బీఆర్ఎస్)కు ఈసారి గట్టి పోటీ ఉంది. ఇక్కడ నుంచి అడ్లూరి లక్ష్మణ్ (కాంగ్రెస్), మాజీ ఎంపీ గడ్డం వివేక్ (బీజేపీ) కూడా బరిలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది. పెద్దపల్లి: ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి (బీఆర్ఎస్)కి సొంత పార్టీ నుంచే తీవ్ర పోటీ ఉంది. ఎమ్మెల్యే టికెట్ కోసం.. సొంత పార్టీకే చెందిన ఎన్నారై నల్ల మనోహర్‌రెడ్డి, జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నేత విజయరమణారావు నుంచి వీరికి గట్టి పోటీ ఎదురవనుంది. బీజేపీ నుంచి గుజ్జుల రామక్రిష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్‌రావు, గొట్టిముక్కల సురేశ్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. బీఎస్పీ నుంచి దాసరి ఉష బరిలో ఉన్నారు. మంథని: ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు (కాంగ్రెస్)కు, పుట్ట మధు (బీఆర్ఎస్)కు ఈసారి హోరాహోరీ పోరు నడవనుంది. ఇక్కడ వీరిద్దరు మినహా మూడో పార్టీ అభ్యర్థులెవరూ ఇంతవరకూ ఆసక్తి చూపలేదు. -
సంచలనాలకు కేంద్రబిందువుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో ఇప్పుడు అంతా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ (ఐటీ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఆకస్మిక దాడులు, ఎమ్మెల్యేల ఎరపై దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) గురించే జోరుగా చర్చలు సాగుతున్నాయి. మీడియాలో ప్రతీరోజూ పతాకశీర్షికన కథనాలు వస్తుండగా.. ఈ వ్యవహారాలన్నీ రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఈ దర్యాప్తు సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నప్పటికీ.. వీరు విచారిస్తున్న ప్రతీ కేసులోనూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధాలు ఉండటం చర్చనీయాంశంగా మారింది. ► ఉద్యమకాలం నుంచి రాజకీయాల్లో ఉమ్మడి కరీంనగర్ తన ప్రత్యేకతను చాటుకుంది. రాష్ట్ర అవతరణ అనంతరం కూడా రాజకీయాల్లో క్రియాశీలకంగా తనదైన ముద్ర వేస్తూ వస్తోంది. తాజాగా రాష్ట్రంలో టీఆర్ఎస్–బీజేపీ మధ్య రాజకీయవైరం పతాకస్థాయికి చేరడం, కేంద్ర దర్యాప్తు సంస్థలు జోరు పెంచడం, రాష్ట్ర దర్యాప్తు బృందాలు కూడా అదేస్థాయిలో దూకుడు ప్రదర్శించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రతీ వ్యవహారంలోనూ కరీంనగర్ వ్యక్తులే కీలకంగా మారుతుండటం ఇక్కడ గమనించదగ్గ విషయం. ► ఇటీవల కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రానైట్ సంస్థలపై ఈడీ, ఐటీ ఆకస్మిక దాడులు నిర్వహించడం.. మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లోనూ తనిఖీలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అదే సమయంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు పార్టీలు మారుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సైతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా చీకోటి ప్రవీణ్ కేసినో వ్యవహారంలోనూ ఉమ్మడి జిల్లాకే చెందిన ఎమ్మెల్సీ రమణకు ఈడీ సంస్థ నోటీసులు ఇవ్వడం.. శుక్రవారం ఆయన విచారణకు హాజరవడం జరిగాయి. తొలుత ఎన్ఐఏ.. నిజామాబాద్‌లో స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఉ గ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ సంస్థలో క్రియాశీలక సభ్యుడు జగిత్యాల వాసిగా గుర్తించా రు. ఈ క్రమంలో సెప్టెంబరు 19వ తేదీన దేశవ్యాప్తంగా సదరు సంస్థపై ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో సదరు జగిత్యాల వాసిని కరీంనగర్‌లోని నాఖా చౌరస్తా సమీపంలోని ఓ ఇంటి నుంచి అరె స్టు చేసి తీసుకెళ్లారు. ఆ రోజు తెల్లవారుజామున కరీంనగర్ పట్టణంలో పలువురి అనుమానితుల ఇళ్లపైనా ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపి, అనుమానాస్పద ఫైళ్లను తీసుకెళ్లారని సమాచారం. జగిత్యాల, కరీంనగర్లో ఉగ్ర సంస్థతో సంబంధాలు బయటపడటం అప్పట్లో కలకలం రేపింది. ఈడీ, ఐటీ.. ఆకస్మిక సోదాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సింగరేణి తరువాత అతిపెద్దది గ్రానైట్ పరిశ్రమ. ఈ క్రమంలో మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి గ్రానైట్‌ను విదేశాలకు ఎగుమతి చేశారని, అక్రమ మార్గాల ద్వారా పెద్ద ఎత్తున డబ్బు విదేశాలకు తరలించారన్న ఆరోపణలపై పలు కంపెనీలపై ఈ నెల 9వ తేదీన తరలించారన్న ఫిర్యాదులతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) సంయుక్తంగా సోదాలు నిర్వహించాయి. రెండురోజులపాటు జరిగిన ఈ సోదాల్లో దాదాపు 10కిపైగా కంపెనీల్లో అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లోనూ తనిఖీలు చేయడం సంచలనంగా మారింది. ► చీకోటి ప్రవీణ్ కేసినో కేసులోనూ రోజుకో కొత్తకోణం వెలుగుచూస్తోంది. తొలుత ఈ కేసుకు కరీంనగర్‌తో సంబంధాలు లేవనుకున్నప్పటికీ.. తాజాగా ఎమ్మెల్సీ రమణకు నోటీసులు జారీ చేయడం, ఆయన విచారణకు హాజరు కావడం ఉమ్మడి జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ► మరోవైపు ఢిల్లీ వేదికగా జరిగిన లిక్కర్ స్కాంలోనూ పలువురు సిరిసిల్ల, కరీంనగర్ పట్టణవాసుల ప్రమేయం ఉందన్న ప్రచారం అప్పుడే మొదలైంది. కరీంనగర్లో ఇటీవల జరిగిన ఈడీ దాడుల సమయంలోనూ తొలుత లిక్కర్ స్కాంలో సోదాలుగానే ప్రచారం జరిగాయి. ► మరోవైపు అధికార పార్టీ ‘ఎమ్మెల్యేలకు ఎర కేసు’ కూడా జాతీయస్థాయిలో చర్చ లేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బీజేపీ పార్టీపై స్వయంగా సీఎం చంద్రశేఖర్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు కరీంనగర్‌తో ఉన్న లింకులు బయటపెట్టారు. కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులకు విమాన టికెట్లు బుక్ చేసిన ఆరోపణలపై సిట్ అధికారులు కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌కు నోటీసులు జారీచేయడంతో మరోసారి కరీంనగర్ వార్తల్లోకెక్కింది. రాజకీయ సమరానికీ ఇక్కడే ఆజ్యం..! కొంతకాలంగా ఉప్పు నిప్పులా ఉన్న బీజేపీ–టీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు బహిరంగంగానే పరస్పర ప్రత్యారోపణలకు దిగుతున్నాయి. గల్లీ స్థాయి నుంచి ఢిల్లీస్థాయి వరకు ఇరు పార్టీ నాయకులు తమకు ఏమాత్రం చిన్న అవకాశం లభించినా ప్రత్యర్థి వర్గాన్ని ఆరోపణలతో చీల్చిచెండాడుతున్నారు. ఈ సమరానికి సైతం ఉమ్మడి కరీంనగర్ జిల్లానే వేదికగా నిలవడం విశేషం. ఇటీవల రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్సీఎల్)ను జాతికి అంకితం చేసే క్రమంలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా టీఆర్ఎస్పై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. అవినీతి చేసే ఎవరినీ వదలమంటూ హెచ్చరికలు జారీచేశారు. ► మరోవైపు సోషల్‌మీడియాలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు నాయకుల విషయంలో పూటకో ప్రచారం వెలుగుచూస్తోంది. టీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురై, హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తిరిగి సొంతగూటికి వెళ్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ‘ఘర్‌వాపసీ’ పేరిట సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని ఈటల ఖండించారు. ► శుక్రవారం ఉదయం నుంచి మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ పుట్ట మధు పార్టీ మారుతున్నారన్న సందేశం వైరల్‌గా మారింది. టీవీలు, వెబ్సైట్లలో బ్రేకింగ్ న్యూస్ రావడంతో ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న పుట్ట మధు హడావిడిగా అక్కడే విలేకరుల సమావేశం పెట్టి ప్రచారాన్ని ఖండించారు. అంతకుముందు ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడిన ఆయన తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తిచేశారు. తాను సొంత పనుల మీద నియోజకవర్గం వీడిన ప్రతీసారి ప్రతిపక్షాలు రాస్తున్న ప్రేమలేఖలు చదివి నవ్వుకుంటున్నానని చమత్కరించారు. (క్లిక్: ఆ ఎమ్మెల్యే ఇక రాజకీయాలకు దూరమా?.. ఆ రెండు చోట్ల కొత్త అభ్యర్థులేనా?) -
Heavy Rain: కరీంనగర్.. అతలాకుతలం
సాక్ష, కరీంనగర్: భారీ వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అతలాకుతలమైంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఆగకుండా వాన కురుస్తూనే ఉండటంతో.. జనం బిక్కుబిక్కుమంటూ గడిపారు. వాగులు ఉప్పొంగడంతో పెద్ద సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. శాతవాహన వర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు. ► కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిలో కమాన్‌పూర్ వద్ద కల్వర్టు కొట్టుకుపోయింది. సైదాపూర్, హుజూరాబాద్, జమ్మికుంట, కొత్తపల్లి మండలాల్లో రోడ్లు తెగిపోయాయి. కరీంనగర్ పట్టణంలోని ఆర్టీసీ వర్క్ షాప్, విద్యానగర్, కట్టరాంపూర్, జ్యోతినగర్, రాంనగర్, మంకమ్మతోట, హోసింగ్‌బోర్డ్ ప్రాంతాలు నీటమునిగాయి. జగిత్యాలకు వెళ్లే హైవేపై భారీగా నీరు నిలిచింది. కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. కరీంనగర్లో ఆర్టీసీ వర్క్‌షాప్ ప్రాంతంలో రోడ్డుపై భారీగా నిలిచిన నీరు ► కుండపోత వానతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం చెరువుగా మారిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. కొత్త చెరువు పొంగడంతో కరీంనగర్ ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. సిరిసిల్ల కొత్త కలెక్టరేట్ మళ్లీ వరదలో చిక్కుకుంది. సిరిసిల్ల పట్టణంలో చేనేత పరిశ్రమలు ఉండే పలు ప్రాం తాలు నీటమునిగాయి. ► కుండపోత కారణంగా జగిత్యాల జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇబ్రహీంపట్నం మండలంలో గోదావరిలో ముగ్గురు గొర్రెల కాపరులు చిక్కుకున్నారు. కథలాపూర్ మండ లం తుర్తి గ్రామం వద్ద బ్రిడ్జి కూలిపోయింది. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం కార్పొరేషన్లో పలు కాలనీలు నీటమునిగాయి. సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామ శివారులోని చెరువు మత్తడి నీటిలో కారు కొట్టుకుపోగా, చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్న ఉత్తరప్రదేశ్ యువకుడు ► సిరిసిల్లను వరద ముంచెత్తడంతో మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నుంచి సమీక్షించారు. కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడారు. మంత్రి ఆదేశాల మేరకు.. హైదరాబాద్ నుంచి డీఆర్ఎఫ్ బృందాలు, జీహెచ్ఎంసీ నుంచి మరో బృందం సిరిసిల్లకు చేరి సహాయక చర్యలు చేపట్టింది. ముంపు ప్రాంతాల్లోని బాధితులను బోట్లలో పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద ఉధృతికి వేములవాడలోని మూల వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. కాగా, ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం జల దిగ్బంధమైంది. ఇక, ఆసియా ఖండంలోనే మొదటిదైన సరళాసాగర్ ప్రాజెక్టు సైఫన్లు మరోసారి ఆటోమేటిగ్గా తెరుచుకున్నాయి. వరద పోటెత్తడంతో ఉడ్ సైఫన్లు తెరుచుకుని నీరు దిగువనకు విడుదలవుతోంది. -
సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటన
-
నోరు జారిన మంత్రి గంగుల.. ఏకంగా సీఎంను మార్చేశారు!
-
Huzurabad: వదిలే ప్రసక్తే లేదు.. ఈటల భూదందాలు బయటపెడతా!
సాక్షి, ప్రతినిధి: రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌నకు గురైన ఈటల రాజేందర్ ప్రాతినిథ్యం వహిస్తున్న హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయం రంగులు మారుతోంది. 2004 నుంచి ఈటలకు కంచుకోటగా నిలిచిన ఈ నియోజకవర్గంలో ఆయనను రాజకీయంగా దెబ్బకొట్టే దిశగా టీఆర్ఎస్ నాయకత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రాజేందర్‌కు ప్రజల్లో, కార్యకర్తల్లో ఉన్న బలాన్ని పలుచన చేయడంతో పాటు ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని పెంచే దిశగా పావులు కదుపుతున్నాయి. హుజురాబాద్‌నియోజకవర్గం బాధ్యతలను భుజాల మీద వేసుకున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తొలుత స్థానిక ప్రజాప్రతినిధులను ఈటలకు దూరం చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. ఇటీవల జమ్మికుంట, ఇల్లందకుంట మండలాలకు చెందిన కొందరు నాయకులతో మాట్లాడిన ఆయన.. గురువారం హుజురాబాద్ మున్సిపాలిటీకి చెందిన ప్రజాప్రతినిధులు, మహిళా కౌన్సిలర్ల భర్తలను 11 మందిని కరీంనగర్‌కు పిలిపించి చర్చలు జరిపారు. మున్సిపాలిటీలోనే కాకుండా నియోజకవర్గంలో ఏ పని కావాలన్నా తానున్నానని వారికి హామీ ఇచ్చారు. నాయకులు శాశ్వతం కాదని, పార్టీ నీడలో ఉండి ప్రజలకు సేవ చేయాలని హితవు చెప్పారు. లాక్డౌన్ తర్వాత మంత్రి కేటీఆర్‌తో కలిసి హుజురాబాద్‌లో పర్యటిస్తానని, ప్రజలు టీఆర్ఎస్కు అండగా ఉన్నారని వివరించారు. మంత్రిని కలిసిన వారిలో కొలిపాక శ్రీనివాస్(వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల భర్త), కేసిరెడ్డి నర్సింహారెడ్డి(కౌన్సిలర్ లావణ్య భర్త), ఆర్కె రమేశ్(కౌన్సిలర్ ఉమాదేవి భర్త), పూర్ణచందర్(కౌన్సిలర్ సృజన భర్త), ఇమ్రాన్(కౌన్సిలర్ ఉజ్మానూహరిన్ భర్త), అనిల్(కౌన్సిలర్ రాజకొమురయ్య కుమారుడు), కౌన్సిలర్లు తొగరు సదానందం, తోట రాజేంద్రప్రసాద్, తాళ్లపల్లి శ్రీనివాస్, ముక్కపల్లి కుమార్, కొండాల్‌రెడ్డి ఉన్నారు. చిల్లర వార్తలు నమ్మొద్దన్న ఈటల సోషల్ మీడియాలో, కొన్ని పత్రికల్లో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని చిల్లర వార్తలుగా అభివర్ణిస్తూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ తిప్పికొట్టారు. తన వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశానని, కరోనా మహమ్మారి ప్రబలిన ఈ సమయంలో రాజకీయాలను పక్కనపెట్టి ప్రజలను ఆదుకునే పనిలో నిమగ్నమైనట్టు చెప్పారు. కరోనా తగ్గుముఖం పట్టిన వెంటనే తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ముందుకు సాగుతానని గురువారం విడుదల చేసిన ఓ వీడియో ద్వారా తెలియజేశారు. అంతుచిక్కని కౌశిక్ రాజకీయం హుజురాబాద్ కాంగ్రెస్ నేత, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీప బంధువు పాడి కౌశిక్‌రెడ్డి రాజకీయం ఏంటో కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంతుచిక్కడం లేదు. పార్టీల నాయకుల అభిప్రాయానికి భిన్నంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను భూకబ్జాదారుడిగా తెరపైకి తెస్తూ తూర్పార పడుతున్న కాంగ్రెస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి తన చర్యలకు కట్టుబడి ఉంటున్నట్లు గురువారం గురువారం ఓ వీడియో విడుదల చేశారు. తాను టీఆర్ఎస్లో చేరుతున్నట్లు సాగుతున్న ప్రచారాన్ని ఖండించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. అదే సమయంలో ఈటల భూదందాలను వెలుగులోకి తెస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను వేధింపులకు గురిచేసిన ఈటల రాజేందర్ వదిలే సమస్య లేదన్నారు. చదవండి: Etela: కౌశిక్‌రెడ్డి తీరుతో ఇరకాటంలో కాంగ్రెస్ -
సీఎం నుంచి విడదీసే శక్తి ఎవరికీ లేదు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ నుంచి టీఎన్జీవోలను విడదీసే శక్తి ఎవరికీ లేదని, వారి మధ్య ఉన్నది పేగుబంధమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. టీఎన్జీవోల మద్దతు బేషరతుగా టీఆర్ఎస్కే ఉంటుందని, తెలంగాణ సాధనలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పోషించిన పాత్రను సీఎం మరిచిపోలేదని పేర్కొన్నారు. శనివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఎన్జీవో భవన్లో ఉద్యోగులతో మంత్రులు గంగుల కమలాకర్, మహమూద్ అలీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవిని ఎమ్మెల్సీగా గెలిపించి సీఎం కేసీఆర్ వద్ద సమస్యలను గర్వంగా సాధించుకుందామన్నారు. ప్రశ్నించే గొంతుక అని చెప్పుకొనే రామచంద్రారావు ఏనాడూ చట్టసభల్లో గ్రాడ్యుయేట్ల హక్కుల గురించి ప్రశ్నించలేదని పేర్కొన్నారు. సురభి వాణీదేవి విద్యావేత్త అని, దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు గట్టెక్కించిన మేధావి పీవీ కూతురుగానే కాకుండా లక్షలాది మంది గ్రాడ్యుయేట్లను సరైన దిశలో నడిపించి ఉపాధి చూపించిన వ్యక్తి అనే విషయం మరవొద్దని అన్నారు. పదేళ్లకోసారి పీఆర్సీని ప్రకటించే కేంద్రం కన్నా, రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యోగులకు ఎక్కువ మేలు చేస్తుందని గంగుల అన్నారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారాలను నమ్మవద్దని, టీఎన్జీవోలకు అత్యధిక లబ్ధి చేకూర్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్న విషయం గుర్తుంచుకోవాలని టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ప్రతాప్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. -
పీవీకి అసలైన గౌరవమిచ్చింది మేమే
సాక్షి, హైదరాబాద్: దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో పురోగతి బాట పట్టించిన మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు అసలైన గౌరవమిచ్చింది టీఆర్ఎస్ పార్టీయేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇప్పుడు పీవీ కుమార్తె సురభి వాణీదేవికి హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంతో మరింత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఈ ఎన్నికల్లో ఆమెను గెలిపించి పీవీకి అసలైన నివాళి ఇవ్వాలని గంగుల పిలుపునిచ్చారు. గురువారం ఇక్కడ మినిస్టర్స్ క్వార్టర్స్‌లో టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులు, డివిజన్ ఇన్చార్జులు, ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి తోపాటు మంత్రులు మహమూద్ అలీ, తల సాని శ్రీనివాస్‌యాదవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి గంగుల మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటైన ఈ ఏడేళ్లలో సరికొత్త అవకాశాలను సృష్టించుకుంటూ రాష్ట్రం ముందుకుపోతోందన్నారు. ప్రభుత్వ రంగంలో కేవలం ఆరేళ్లలోనే 1.30 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వివరించారు. ప్రైవేటు రంగంలో కూడా లక్షలాది ఉద్యోగాల కల్పనకు కృషి చేశామన్నారు. రాష్ట్రానికి మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును హైదరాబాద్‌కు ఇవ్వకుండా తన్నుకుపోయిన గద్దలు బీజేపీ నేతలని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 3,400 మంది కార్యకర్తలతో డివిజన్ల వారీగా ఇన్చార్జీలను నియమించి, ప్రతి 50 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని 1.53 లక్షలకుపైగా ఓటర్లను కలిసి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించేలా కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. -
రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు లేవని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టంచేశారు. చికెన్, గుడ్లు తింటే ఎలాంటి నష్టమూ జరగదన్నారు. దేశవ్యాప్తం గా వివిధ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో మంగళవారం బీఆర్కేఆర్ భవన్లో వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్, చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డితో కలసి పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు, వివిధ సంస్థల శాస్త్రవేత్తలు, ప్రొఫె సర్లు, పశువైద్యశాఖ అధికారులతో మంత్రి తలసాని సమీక్షించారు. బర్డ్ ఫ్లూపై ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలను మంత్రి వివరించారు. ఇతర రాష్ట్రాల్లో ఈ వ్యాధి కనిపించినట్లు సమాచారం అందగానే పశుసంవర్థక, వైద్య ఆరోగ్య శాఖలను అప్రమత్తం చేసినట్లు చెప్పా రు. నల్లగొండ, వరంగల్, పెద్దపల్లి జిల్లాలో కోళ్ల మృతిపై సమాచారం రాగానే 276 శాం పిల్స్ సేకరించామని, అలాగే గత మూడు రోజుల్లో వెయ్యి నమూనాలు పరీక్షించగా అన్నీ నెగెటివ్ వచ్చినట్లు వెల్లడించారు. పౌల్ట్రీ పరిశ్రమను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలు గా సహకరిస్తుందని తెలిపారు. మన రాష్ట్రానికి వచ్చే వలస పక్షుల సంఖ్య చాలా పరిమితమన్నారు. మంత్రి ఈటల మాట్లాడుతూ.. గతం లో బర్డ్ ఫ్లూ వల్ల పౌల్ట్రీ రంగం మాత్రమే నష్టపోయిందని, మనుషులకు నష్టం జరగలేదని తెలిపారు. మన శరీరానికి తక్కువ ఖర్చుతో అధిక విలువలువున్న ప్రోటీన్లను అందించే శక్తి చికెన్, గుడ్లకే ఉందన్నారు. భేటీలో అధికారులు అనితా రాజేంద్ర, రిజ్వీ, వాకాటి కరుణ, డా.శ్రీనివాస్ రావు, డా.వి.లక్ష్మారెడ్డి, డా.రాంచందర్, బ్రీడర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వి.హర్షవర్ధన్ రెడ్డి, బ్రీడర్స్ ప్రధాన కార్యదర్శి జి.రమేశ్ బాబు, నెక్ సీఈవో కె.జి.ఆనంద్, చైర్మన్ ఏ.గోపాల్‌రెడ్డి, పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులు కె.మోహన్‌రెడ్డి, భాస్కర్‌రావు, చంద్రశేఖర్ రెడ్డి, స్నేహ చికెన్ డి.రాఘవరావు పాల్గొన్నారు. 25లోగా హాస్టళ్లకు బియ్యం సరఫరా సమావేశంలో గంగుల, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు ఈ నెల 25వ తేదీలోగా సన్నబియ్యం అందుబాటులో ఉంచాలని బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. సన్నబియ్యంతో పాటు పప్పు, ఉప్పులు, నూనె, ఇతర రేషన్ సరుకులను అందుబాటులో ఉంచడంతో పాటు శానిటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. 26 తర్వాత హాస్టళ్లలో వసతులపై మంత్రులు, శాసన సభ్యులు తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. కలెక్టర్లతో ఈ నెల 18వ తేదీ తర్వాత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి 9, 10, ఇంటర్, డిగ్రీ, బీటెక్ తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బీసీ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఏర్పాట్లను మంత్రి గంగుల మంగళవారం తన కార్యాలయంలో శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దాదాపు 9 నెలల నుండి హాస్టళ్లు, స్కూల్స్ మూతపడి ఉన్నాయని, తగిన జాగ్రత్తలు తీసుకుని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ముఖ్యంగా శానిటేషన్‌పై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలకు పౌరసరఫరాల సంస్థ సన్న బియ్యాన్ని సరఫరా చేస్తోందని ప్రతినెల 8,500 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని చెప్పారు. దాదాపు 74వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అందుబాటులో ఉన్నాయని, ఈ నెల 25వ తేదీలోగా గోదాముల నుండి హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలకు రవాణా చేయాలని సూచించారు. సమావేశంలో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. -
ఆరేళ్లలో అద్భుత ప్రగతి సాధించాం
-
ఎంపీ వర్సెస్ మంత్రిగా కరీంనగర్ రాజకీయం
సాక్షి, కరీంనగర్: కరీంనగర్లో ఇద్దరు నేతల మధ్య రాజకీయ పోరు తీవ్ర రూపం దాలుస్తోంది. వేర్వేరు పార్టీల నుంచి ఇద్దరు నేతలు ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నా... ఒకరి నీడను మరొకరు తాకడం లేదు. వీరిలో ఒకరు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇటీవల మంత్రి పదవి చేపట్టిన గంగుల కమలాకర్ అయితే... మరొకరు ఎమ్మెల్యేగా గంగుల చేతిలో ఓడిపోయి... కరీంనగర్ బీజేపీ ఎంపీగా ఘన విజయం సాధించిన బండి సంజయ్‌కుమార్. ఎంపీగా సంజయ్ గెలిచిన నాటి నుంచి గంగులతో అంటీ ముంటనట్టుగానే ఉంటున్నప్పటికీ... గత కొద్దిరోజులుగా దూరం మరింత పెరిగింది. ఎంతగా అంటే ప్రభుత్వ పరమైన కార్యక్రమాల్లో కూడా సంజయ్ పాల్గొన లేనంతగా...! వచ్చే మునిసిపల్ ఎన్నికలను ఇరుపార్టీలు సవాల్‌గా తీసుకున్న నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య నెలకొన్న వార్ ఎటువైపు దారితీస్తుందోనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. స్మార్ట్‌సిటీ టెండర్ల ఖరారుపై వ్యతిరేకత కరీంనగర్ నగరాన్ని కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీ మిషన్ జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. రూ.1878 కోట్ల అంచనా వ్యయంతో కరీంనగర్‌ను ఆధునీకరించాలనేది ఈ స్మార్ట్‌సిటీ కాన్సెప్ట్. ఇందులో భాగంగా పటిష్టమైన సీసీ రోడ్లు నిర్మించాల్సి ఉంది. రూ.217.7 కోట్ల అంచనా వ్యయంతో మూడు ప్యాకేజీల్లో సుమారు 30 కిలోమీటర్ల మేర తొలిదశలో రోడ్ల నిర్మాణానికి గత సంవత్సరం ఆన్లైన్లో టెండర్లు ఆహ్వానించగా, ఒకసారి బిడ్డర్లు ఎవరూ రాక రద్దయింది. రెండోసారి మూడో ప్యాకేజీ టెండర్ ఖరారైనప్పటికీ, ఒకటి, రెండు ప్యాకేజీలకు సంబంధించి ఓ కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించారు. ఓ వైపు కోర్టులో కేసు ఉండగానే మూడోసారి టెండర్లను పిలిచారు. ఈ టెండర్ల ప్రక్రియ గడువు మూడురోజుల్లో పూర్తవుతుందనగా, ఆ టెండర్లను వాయిదా చేసినట్లు స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ ఓ ప్రతిక ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో గంగుల మంత్రి కాకముందే ఎమ్మెల్యే హోదాలో రంగ ప్రవేశం చేసి, 2వ విడత కోర్టును ఆశ్రయించిన కాంట్రాక్టర్‌ను కేసు ఉపసంహరించుకునేలా చేశారు. ఈ నేపథ్యంలో మూడో విడత టెండర్లలో పాల్గొన్న రాజరాజేశ్వర కన్స్ట్రక్షన్స్ సంస్థకు రూ.164 కోట్ల విలువైన 1, 2 ప్యాకేజీలను అప్పగిస్తూ టెండర్ల కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇక్కడే ఎంపీ హోదాలో తొలిసారి సంజయ్ రంగ ప్రవేశం చేశారు. సింగిల్ టెండర్‌ను ఆమోదించడం, ఒకవైపు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి, టెక్నికల్ అంశాలను సాకుగా చూపి కాంట్రాక్టర్‌ను ఖరారు చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు అక్రమాలకు పాల్పడ్డట్టు ఆరోపించడమే కాకుండా టెండర్లపై విచారణ జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. ఎంపీ, మంత్రి మధ్య గ్రానైట్ రాయి దీనిపై రాద్ధాంతం సాగుతుండగానే మరోవైపు కరీంనగర్లో గ్రానైట్ వ్యాపారులు వందల కోట్ల రూపాయల రాయల్టీని ప్రభుత్వానికి ఎగ్గొట్టారని, అపరాధ రుసుం కింద విధించిన సుమారు రూ.700 కోట్లు సర్కారుకు చెల్లించలేదని హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ విమర్శించారు. గంగుల కుటుంబాన్ని టార్గెట్ చేసుకొని సంజయ్ 2009 నాటి గ్రానైట్ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారనేది టీఆర్ఎస్ నేతల వాదన. మంత్రిగా గంగుల ప్రమాణం స్వీకారం చేసిన తరువాత సంజయ్ విమర్శల జోరు పెంచగా, ఇటీవల గంగుల కూడా తీవ్రంగానే స్పందించారు. కాగా ఇటీవల కరీంనగర్ వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్మార్ట్‌సిటీ టెండర్లలో ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం లేదని వ్యాఖ్యానించడం, పారదర్శకంగా స్మార్ట్‌సిటీ పనులు జరిగేలా చూస్తామనడం గంగుల వర్గానికి ఉత్సాహాన్ని ఇవ్వగా, గ్రానైట్ సమస్యపై మాత్రం కిషన్‌రెడ్డి ఎంపీ సంజయ్‌కు అనుకూలంగా మాట్లాడారు. అధికారిక కార్యక్రమాలకు దూరం గంగుల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత స్మార్ట్‌సిటీ పనులు, ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. అదే రోజు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రెండు కార్యక్రమాలకు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ హాజరు కాలేదు. ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి కరీంనగర్ వచ్చిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయగా, మంత్రి కమలాకర్ హాజరు కాలేదు. అసెంబ్లీ సమావేశాలు ఉన్న కారణంగా మంత్రి రాలేదని టీఆర్ఎస్ నేతలు సమర్థించుకున్నారు. కాగా సోమవారం కలెక్టరేట్లో మంత్రి కమలాకర్ ‘నేను సైతం... నా నగరం కోసం’ అనే అధికారిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమాన్ని కమలాకర్ స్వయంగా డిజైన్ చేసినప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో పాల్గొనే కార్యక్రమం. కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమానికి కూడా సంజయ్ రాలేదు. అలాగే 5వ డివిజన్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మంత్రి చేతుల మీదుగా జరుగగా, సంజయ్ యధావిధిగా హాజరుకాలేదు. ఒకరు లేని సమయంలో మరొకరు ప్రభుత్వ కార్యక్రమాల షెడ్యూల్ రూపొందిస్తున్నట్టుగా ప్రస్తుతం పరిస్థితి నెలకొంది. రాజకీయ సమకాలికులే... ఇంజినీరింగ్ చదివి వ్యాపారం చేసుకుంటూ 2000 సంవత్సరంలో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు గంగుల కమలాకర్. అప్పటి కరీంనగర్ మునిసిపాలిటీకి టీడీపీ తరఫున వార్డు కౌన్సిలర్‌గా గెలిచి వెనుదిరిగి చూడలేదు. కరీంనగర్‌కే చెందిన బండి సంజయ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, శిక్షక్‌గా ఎదిగి ఏబీవీపీ ద్వారా తొలుత విద్యార్థి రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు. తరువాత 1994లోనే అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్‌గా గెలిచి దాదాపు పదేళ్లు కొనసాగారు. 2005లో తొలి కార్పొరేషన్‌కు బీజేపీ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఆ కౌన్సిల్లో గంగుల సైతం టీడీపీ తరఫున ఫ్లోర్‌లీడర్. 2009లో గంగుల ఎమ్మెల్యేగా గెలిచి, 2013లో టీఆర్ఎస్లో చేరారు. 2014, 2018లలో జరిగిన ఎన్నికల్లో గంగుల కమలాకర్‌పై పోటీ చేసిన సంజయ్ రెండుసార్లు ఓడిపోయారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం అనూహ్య విజయం సాధించారు. రాజకీయ సమకాలికులే అయినప్పటికీ, పార్టీలు వేరు కావడంతో ప్రస్తుతం ఎంపీ వర్సెస్ మంత్రిగా కరీంనగర్ రాజకీయం మారింది. -
పొన్నంకు మతి భ్రమించింది
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ విచక్షణ కోల్పోయి మతిభ్రమించి మాట్లాతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో వరుస ఓటములతో పొన్నం ఓటమికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని ఎద్దేశా చేశారు. అసెంబ్లీలోని టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే గంగుల శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్పైనా, నాపైనా పొన్నం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. పొన్నం విచక్షణ కోల్పోయి మతిభ్రమించి మాట్లాడారు. పొన్నం ఓ రాజకీయ వ్యభిచారి. 5 సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక్కసారి గెలిచారు. నేను ఐదుసార్లు పోటీ చేస్తే ఐదుసార్లు గెలిచాను. పొన్నం హైదరాబాద్‌లో ప్రెస్మీట్లకే పరిమితం. కరీంనగర్లో ఆయనకు అంత సీన్ లేదు. కరీంనగర్లో మొన్న పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమవడంతో తెలంగాణ కేఏ పాల్గా మారారు. పొన్నం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాలి గోటికి సరిపోరు..’ అని వ్యాఖ్యానించారు. పొన్నం ఓ మీటర్ బద్ద.. తుపాకీ రాముడు తెలంగాణ ఉద్యమంలో పొన్నం ఓ డ్రామా ఆర్టిస్టు అని గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. ‘లగడపాటి రాజగోపాల్‌తో కుమ్మక్కై పెప్పర్ స్ప్రే కొట్టించుకున్నారు. అయినా 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ప్రజలు పొన్నం ప్రభాకర్‌ను తుక్కుతుక్కుగా ఓడించారు. నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నించానని పొన్నం ప్రభాకర్ దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు పొన్నం ఉన్న పార్టీలో ఎవరైనా చేరతారా? పొన్నంను కాంగ్రెస్ నుంచి మెడ పట్టి గెంటేయాలి. పొన్నం ఓ మీటర్ బద్ద.. తుపాకీ రాముడు. పొన్నం పోటుగాడని మళ్ళీ కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తున్నారా? కేటీఆర్‌ను విమర్శించే అర్హత పొన్నంకు ఉందా? స్థాయికి మించి సంస్కారం లేకుండా మాట్లాడితే మేం ఊరుకోం. ఎంపీగా కాదు కార్పొరేటర్‌గా పోటీ చేయాలి. మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా, ఎంపీగా పొన్నం ప్రభాకర్‌ది అవినీతి చరిత్రే. పొన్నం ఖబడ్దార్.. సంస్కారం లేకుండా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని గంగుల కమలాకర్ హెచ్చరించారు. -
అభ్యర్థులతో కాదు.. డబ్బుసంచులతో పోటీపడ్డాం: పొన్నం
సాక్షి, కరీంనగర్ : ఎన్నికల్లో అభ్యర్థులతో కాకుండా.. డబ్బు సంచులతో పోటిపడ్డామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్ పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. 2014 ఫలితాలు తారుమారై, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రజాకూటమిపై వ్యతిరేకంగా చేసిన ప్రచారం వారికే నష్టం కలిగించిందన్నారు. ముందస్తుగా శాసనసభను ఎందుకు రద్దు చేశారో చెప్పకపోవడాన్ని ప్రజలు గమనించారని చెప్పారు. తమ మేనిఫెస్టోపై విమర్శలు చేసిన టీఆర్ఎస్.. తిరిగి దాన్నే కాపీ కొట్టిందని ఎద్దేవ చేశారు. ప్రకటనల పేరిట కోట్లరూపాయలు ఖర్చు చేసామని చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని కొట్టిపారేశారు. ఇప్పటికీ కేటీఆర్ 100 సీట్లు వస్తాయని చెప్పుకుంటున్నారంటే.. ఫలితాలు తెలిసి భయపడైనా ఉండాలని, లేకుంటే ఈవీఎంలను మేనేజ్ అయినా చేసి ఉండాలని అనుమానం వ్యక్తం చేశారు. తాము వేసుకున్న కండువాలు చూసి కేటీఆర్ భయపడుతున్నారని, తమ పొత్తులు బహిరంగమన్నారు. కానీ టీఆర్ఎస్.. బీజేపీ,ఎంఐఎం కండువాలు వేసుకోకున్నా.. వారి పొత్తులు నిజం కదా? అని ప్రశ్నించారు. ఈవీఎంల వద్ద మా తరఫున మూడు షిప్ట్‌ల్లో కాపాలా కాస్తున్నామని తెలిపారు. రౌడీయిజం, ఫ్యాక్షనిజం చేసానని తనపై టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. తాను పోటీ చేస్తున్నా అనగానే గంగులకు భయపట్టుకుందని, ప్రస్టేషన్‌తో ఇంట్లో టీవీ, సెల్ఫోన్లు పగులగొట్టుకున్నాడని తెలిపారు. అవినీతిపరుడైన గంగుల అన్ని విధాల ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. డబ్బులు, అహంకారం ఉన్నవాళ్లు చాలా మంది ఓడిపోయారన్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తారన్న అనుమానం ఉందని, అవసరమైతే గజ్వేల్‌లా అంతటా వీవీ ఫ్యాట్ స్లిప్‌లను లెక్కించాలని కోరుతామన్నారు.