Geeta Basra
-
పోస్టర్ చూసి హీరోయిన్ ప్రేమలో పడ్డ హర్భజన్ సింగ్
‘ఐ లవ్ యూ.. నీతోనే ఉండిపోవాలనుంది’ అని చెప్పాడు అతను ఓ కాఫీ హోటల్లో. ‘ప్రేమ – గీమ, కలిసుండడాలు – గిలిసుండడాలు వంటివేం వద్దుకానీ.. ముందు ఫ్రెండ్స్‌గా స్టార్ట్ చేద్దాం జర్నీ.. తర్వాత చూద్దాం.. అది ఎటు తీసుకెళితే అటు వెళదాం’ అని బదులిచ్చింది ఆమె. ఆ ప్రతిస్పందన అతనిలో ఎక్కడలేని నిరాశను పెంచింది. అయినా ఆమె అభిప్రాయాన్ని గౌరవించాడు. ఆమె నిర్ణయాన్ని పాటించాడు. అతను.. ఇండియన్ క్రికెట్ టీమ్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ఆమె.. బాలీవుడ్ యాక్ట్రెస్ గీతా బస్రా. గీతా పట్ల హర్భజన్ ప్రేమ ఇంచుమించు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాంటిదే. ‘ది ట్రైన్’ ఆమె మొదటి సినిమా. ఆ చిత్రం పోస్టర్లో ఉన్న ఆమె బొమ్మను చూసి మనసు పారేసుకున్నాడు హర్భజన్. ఆ క్షణం నుంచే ఆమె గురించి ఆరా తీయడం ప్రారంభించాడు. ఈలోపు ఆ సినిమాలోని ‘వోహ్ అజ్నబీ’ అనే వీడియో సాంగ్ విడుదలైంది. అది చూశాక.. ఎలాగైనా ఆమెను కలవాలి అన్న ఆరాటం ఎక్కువైంది అతనికి. గీతా వివరాల కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. సినిమా అభిమానే తప్ప.. బాలీవుడ్‌తో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవు అతనికి. అందుకే ఆమె ఆచూకీ దొరకడం చాలా కష్టమైంది. చివరకు అతని స్నేహితులు ఆమె ఫోన్‌నంబర్ సంపాదించి హర్భజన్‌కు ఇచ్చారు. అలా నంబర్ అందుకున్నాడో లేదో ఇలా ఆమెకు సందేశం పంపించాడు. గీతా చూడలేదు. చాన్నాళ్లు వేచున్నాడు అవతలి నుంచి సమాధానం వస్తుందేమోనని. టీ20 వరల్డ్ కప్ (2007)ను గెలిచేంత వరకు గీతా నుంచి మెసేజ్ రాలేదు. వచ్చిన మెసేజ్ కూడా హర్భజన్ అంతకుముందు పంపిన సందేశానికి రిప్లయ్ కాదు. టీ20 వరల్డ్ కప్ విజయానికి ఆమె అభినందన మెసేజ్. దానికే ఉబ్బితబ్బిబ్బై పోయాడు అతను. వెంటనే ఓ సందేశం పంపాడు.. ‘కలుద్దామా?’ అంటూ. ఐపీఎల్ మ్యాచ్‌లకు టికెట్లూ పంపాడు. గ్యాలరీలో ఆమెను చూసుకుని గ్రౌండ్లో రెచ్చిపోయాడు. అతనికేమూలో ఆశ.. తన మనసుని అర్థం చేసుకొని తన చేయి పట్టుకుంటుందని. గీతా పట్టించుకోలేదు. అతని మనసు అర్థంకానట్టే ప్రవర్తించింది. కాఫీ డేట్‌కు ఒప్పేసుకుంది గీతా బస్రా.. లండన్‌లో పుట్టి, పెరిగింది. సినిమాల్లో నటించాలనే ఆసక్తితో ముంబై చేరింది. ఆమె దృష్టి అంతా కెరీర్ మీదే. అందుకే హర్భజన్‌ను పట్టించుకోలేదు. అలా వన్ సైడెడ్ లవ్‌తో దాదాపు పది నెలలు ఆమె వెంట పడ్డాడు హర్భజన్. మొత్తానికి అతని ఆరాటాన్ని అర్థం చేసుకున్న గీతా.. ఓ రోజు కాఫీ డేట్‌కి రావడానికి ఒప్పుకుంది. కలుసుకున్న వెంటనే ఆమె అంటే తనకున్న ఇష్టాన్ని ప్రకటించేశాడు. అప్పుడే ఆమె చెప్పింది ముందు ఫ్రెండ్ షిప్ చేద్దాం అని. ‘హర్భజన్ ప్రపోజ్ చేసిన వెంటనే నేను ‘‘ఎస్’’ చెప్పకపోవడానికి అతనంటే ఇష్టం లేక కాదు.. కెరీర్‌ను సీరియస్‌గా తీసుకోవడం వల్ల. నేను యాక్ట్ చేసిన ది ట్రైన్ రిలీజ్ అయ్యేనాటికి నాకు బాలీవుడే కాదు.. ఇండియా కూడా కొత్తే. ఆ టైమ్‌లో ప్రేమ, డేటింగ్లో పడిపోతే కెరీర్ మీద ఫోకస్ చేయలేం. అందుకే ముందు ఫ్రెండ్స్‌గానే ఉందాం అన్నా. కానీ ఉండలేకపోయా. అతని ప్రేమలో పడిపోయా. కుటుంబం అంటే ప్రాణం పెడతాడు. సింపుల్‌గా ఉంటాడు.. నెమ్మదస్తుడు.. ఇన్ని క్వాలిటీస్ ఉన్న మనిషిని ప్రేమించకుండా ఎలా ఉంటాం!’ అని చెప్పింది గీతా బస్రా ఓ ఇంటర్వ్యూలో. అయిదేళ్లు సాగిన ఆ స్నేహయానంలో పొరపొచ్చాలు చాలానే వచ్చాయి ఇద్దరి మధ్య. గొడవలు పడ్డారు. ‘ఇంక చాలు.. మనం ఫ్రెండ్స్‌గా కూడా ఉండలేం’ అని చెప్పుకున్నారు. బ్రేకప్ చేసుకున్నారు. కానీ హర్భజన్‌తో స్నేహంగా లేని కాలం ఆగిపోయినట్టుగా తోచింది గీతాకు. ఉండలేకపోయింది. అప్పుడు గ్రహించింది అది ఫ్రెండ్షిప్ కాదు.. ప్రేమ అని. అతని తోడు లేనిదే ఉండలేనని.. అతని తోడిదే జీవితమని. ఆ విషయమే హర్భజన్‌కు చెప్పింది. అతని సంతోషానికి అవధుల్లేవ్. ‘అయితే ఒకరికొకరం జీవితాంతం ముడిపడి ఉందాం’ అన్నాడు గీతాతో. ‘సరే’అంది ఆమె. 2015, డిసెంబర్లో ఈ ఇద్దరికీ పెళ్లయింది. ప్రపంచంలోని ఆనందాన్నంతా ఆస్తిగా చేసుకొని సాగిపోతోంది ఆ జంట. ∙ఎస్సార్ -
నా భార్య ఇచ్చిన అండ దండలు వెలకట్టలేనివి: భజ్జీ భావోద్వేగం
Harbhajan Singh Emotional Comments: ‘‘గత కొంతకాలంగా నేను యాక్టివ్ క్రికెట్ ఆడట్లేదు. అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఉన్న ఒప్పందం, అనుబంధంతో ఇన్నాళ్లు ఆటలో కొనసాగాను. దేనికైనా సమయమే సమాధానం. ఇప్పుడు కూడా నా నిర్ణయానికి సమయం వచ్చింది. మానసికంగా నేనెప్పుడో రిటైరయ్యాను. ఇప్పుడు పూర్తిగా వీడ్కోలు పలికి వ్యక్తిగత, కుటుంబ జీవితంపై దృష్టి పెడతాను. నేను ఐపీఎల్లో ముంబై, చెన్నై, కోల్‌కతా జట్లకు ఆడాను. కౌంటీల్లో సర్రే,, ఎస్సెక్స్లకు ప్రాతినిధ్యం వహించాను. అంకితభావంతో, నిబద్ధతతో ఆయా జట్లకు సేవలందించాను. మొత్తం కెరీర్లో నేను తీసిన హ్యాట్రిక్ వికెట్లను ఎన్నటికీ మరచిపోలేను. భారత్ సాధించిన 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లో భాగమవడం అన్నింటికన్నా అత్యుత్తమం. ఇంతటి విజయవంతమైన క్రికెట్ ప్రయాణానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నా కలల్ని సాకారం చేసుకునేందుకు నా తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడ్డారు. గడ్డు పరిస్థితుల్లో నా భార్య గీత ఇచ్చిన అండ దండలు వెలకట్టలేనివి’’ అంటూ హర్భజన్ సింగ్ భావోద్వేగానికి గురయ్యాడు. రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా తన వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో కుటుంబ సభ్యులు తనకు అండగా నిలిచిన విధానాన్ని గుర్తుచేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా అన్ని రకాల ఫార్మాట్లకు వీడ్కోలు చెబుతున్నట్లు భజ్జీ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. అందరు క్రికెటర్లలాగే తాను కూడా టీమిండియా జెర్సీతోనే క్రికెట్ వీడ్కోలు పలకాలని భావించినా.. విధిరాత మరోలా ఉందంటూ ఎమోషనల్ అయ్యాడు. 1998లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన భజ్జీ... 2016లో ఢాకాలో యూఏఈతో చివరిసారిగా టీమిండియా తరఫున అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడాడు. గర్వంగా ఉంది మై లవ్: ఈ సందర్భంగా భజ్జీ భార్య, బాలీవుడ్ నటి గీతా బస్రా సైతం.. ‘‘ఈ క్షణం కోసం నువ్వు ఎంతగా ఎదురుచూశావో నాకు తెలుసు.. మానసికంగా నువ్వు ఎప్పుడో రిటైర్ అయ్యావు. ఇప్పుడు అధికారికంగా... నువ్వు సాధించిన విజయాల పట్ల గర్వంగా ఉంది. నువ్వు అంకితభావంతో ఆడావు. మన జీవితంలో రెండో భాగం మొదలుకాబోతోంది. మంచికాలం ముందుంది మై లవ్’’అంటూ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. కాగా హర్భజన్, గీత 2015లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. చదవండి: భజ్జీ 23 ఏళ్ల క్రికెట్ కెరీర్లో ఎన్నో ఘనతలు View this post on Instagram A post shared by Geeta Basra (@geetabasra) -
రెండు సార్లు అబార్షన్.. చాలా డిప్రెషన్‌కు లోనయ్యా: నటి
Geeta Basra Reveals Why She Spoke About Her Miscarriages: టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ భార్య, నటి గీతా బస్రా ఇటీవలె రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కుమారుడి రాకతో మరోసారి మాతృత్వాన్ని అనుభవించిన ఆమె గతంలో రెండుసార్లు గర్భస్రావానికి గురైంది. తాజాగా ఈ విషయం గురించి సోషల్ మీడియాలో ఓపెన్ అప్ అయ్యింది. 'ప్రతి మహిళ తను ప్రెగ్నెంట్ అని తెలిసిన రోజు నుంచి వచ్చే తొమ్మిది నెలల కోసం ఎంతో ఎదురు చూస్తుంటుంది. ఎప్పుడెప్పుడు చిన్నారిని తమ చేతుల్లోకి తీసుకొని ముద్దు చేద్దామా అని కలలు కంటుంది. కానీ దురదృష్టవశాత్తూ అలాంటి సమయంలో మిస్ క్యారేజ్(గర్భస్రావం) జరిగితే జీవితమే కోల్పోయినట్లు అనిపిస్తుంది. నా స్నేహితుల్లో కూడా కొందిరికి ఇలానే జరిగింది. నేను కూడా దీన్ని అనుభవించాను. మొదటిసారి పాప హీర్ పుట్టాక రెండు సార్లు నాకు గర్భస్రావం అయ్యింది. ఆ సమయంలో చాలా డిప్రెషన్‌కు లోనయ్యా. రెండుసార్లు వరుసగా అబార్షన్ కావడంతో ఎంతో బాధపడ్డా. అయితే ఆ సమయంలో నా భర్త నాకు తోడుగా నిలిచారు. చాలామంది అనుకొంటారు సెలబ్రిటీలకు ఏముంటుంది? వాళ్ల జీవితం చాలా సాఫీగా గడుస్తుంది అని కానీ కానీ ప్రతి సెలబ్రిటీ జీవితం అంత సులభం కాదు. వాళ్లకూ అందరిలానే కష్టాలు ఉంటాయి. అమ్మతనం ఆస్వాదించాలనుకున్న వారికి గర్భస్రావం ఓ పీడకలలా మారుతుంది. దీన్నుంచి కోలుకోవడం అంత సులభమేమీ కాదు కానీ అసాధ్యం అయితే కాదు. ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి భయటపడేందుకు ప్రయత్నించాలి. ఆశను వదులుకోకూడదు అన్న ధైర్యాన్ని నింపేందుకు నేను నా అనుభవాల్ని పంచుకున్నాను. ఈ విషయాల గురించి మాట్లాడటం ఎంత ముఖ్యమో నేను తెలుసుకున్నాను. దీనికి సోషల్ మీడియాను మించిన బెస్ట్ ఫ్లాట్ ఫాం లేదనిపించింది. ఎట్టి పరిస్థిత్లుల్లోనూ నమ్మకాన్ని కోల్పోకూడదు' అంటూ మహిళల్లో ఎంతో స్పూర్తి నింపింది. కాగా ‘ద ట్రైన్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న గీత బస్రా 2015లో టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్‌సింగ్‌తో కలిసి ఏడడుగులు వేసింది. 2016 లో ఈ దంపతులు మొదటిసారిగా తల్లిదండ్రులయ్యారు. ఆ పాపకు హీర్ ప్లాహా అనే పేరు పెట్టారు. అనంతరం ఈ ఏడాది జోవన్ వీర్ సింగ్ ప్లాహా అనే బాబు పుట్టాడు. -
హర్భజన్ సింగ్ కొడుకు పేరేంటో తెలుసా?
టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్, నటి గీతా బస్రా ఇటీవల జన్మించిన తమ కుమారుడికి పేరు పెట్టారు. ఈ నెల జన్మించిన తమ ముద్దుల తనయుడికి జోవన్ వీర్‌గా నామకరణం చేసినట్లు సోమవారం వెల్లడించారు. ఈ మేరకు గీతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు ద్వారా తెలియజేశారు. ఇందులో కూతురు హినయ తన తమ్ముడిని అప్యాయంగా చేతులోకి తీసుకున్నఫోటోను షేర్ చేస్తూ.. ‘పరిచయం చేస్తున్నాం మా హీర్ కా వీర్ జోవన్ వీర్ సింగ్ ప్లాహా’ అని కామెంట్ చేశారు. ఇక ఈ పోస్టుపై అభిమానులు స్పందిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. కాగా గత నెలలో హర్భజన్ మరోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. ఆయన భార్య గీతా బస్రా మగపిల్లాడికి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హర్భజన్ సింగ్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేశాడు. తన భార్య మగబిడ్డకు జన్మనిచ్చినట్లు.. తల్లి బిడ్డా క్షేమంగా తెలిపాడు. అయితే హర్భజన్, గీత దంపతులకు ఇప్పటికే ఓ కుమార్తె ఉంది. 2016 లో ఈ దంపతులు మొదటిసారిగా తల్లిదండ్రులయ్యారు. ఆ పాపకు హీర్ ప్లాహా అనే పేరు పెట్టారు. గీతా బాలీవుడ్ లో ‘దిల్ దియా హై’, ‘ది ట్రైన్’ వంటి పలు సినిమాల్లో నటించింది. గీత, హర్భజన్ లు ప్రేమించుకుని 2015 లో పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram A post shared by Geeta Basra (@geetabasra) -
కొడుకుతో హర్భజన్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్
టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ ఇటీవల రెండోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. హర్భజన్ భార్య గీతా బస్రా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని భజ్జీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా హర్భజన్ సింగ్, గీతా బాస్రా జంట తమ ముద్దుల కొడుకుతో కలిసి బుధవారం మధ్యాహ్నం ఇంటికి వెళ్తుండగా కెమెరా కంటికి చిక్కారు. ముంబై ఆసుపత్రి నుంచి వస్తుండగా నవజాత శిశువు, కుమార్తె హినయాతో కలిసి కుటుంబమంతా చిరునవ్వులతో ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చారు. కాగా హర్భజన్, గీతా బస్రా దంపతులకు 2016లో వీరికి సంతానంగా ఓ పాప జన్మించింది. ఇప్పుడు కొడుకు పుట్టాడు. ఈ మేరకు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో భావోద్వేగంతో ఓ సందేశాన్ని హర్భజన్ షేర్ చేశాడు. ‘మేం పట్టుకోవడానికి మరో చిన్ని చేతులు మాకు అందాయి. బుజ్జాయి ఇంట్లోకి రావడంతో మేం చాలా సంతోషంగా ఉన్నాము. మా జీవితంలో అద్భుతమైన బహుమతి పొందాం. మా మనసులో ఆనందంతో బరువెక్కాయి. మా జీవితం ఇప్పుడు పూర్తి అయిన భావన కలుగుతోంది. గీతా బస్రా, బాబు ఆరోగ్యంగా ఉన్నారు. మాపై ప్రేమ చూపుతూ, మద్దతుగా నిలుస్తున్న శ్రేయోభిలాషులు, అభిమానులకు ధన్యవాదాలు అని ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు. -
రెండోసారి తండ్రైన భజ్జీ.. భావోద్వేగ ట్వీట్
న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ బౌలర్ హర్భజన్ సింగ్ రెండోసారి తండ్రయ్యాడు. భజ్జీ భార్య, నటి గీతా బస్రా శనివారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హర్భజన్ ట్విటర్ వేదికగా వెల్లడించాడు. భగవంతుడి దయ వల్ల గీతా, బాబు పూర్తి క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నాడు. ‘‘మేం చేయి పట్టుకుని నడిపించేందుకు ఓ చిన్ని చేయి... తన ప్రేమ స్వర్ణం అంతటి విలువైనది.. అద్భుతమైన బహుమతి... మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. జీవితాలు పరిపూర్ణమయ్యాయి’’ అంటూ భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు. కాగా 2015, అక్టోబరు 29న పెళ్లి బంధంతో ఒక్కటైన హర్భజన్ సింగ్- గీతా బస్రా దంపతులకు ఇది వరకు కూతురు ఉన్న సంగతి తెలిసిందే. ఇక కెరీర్ విషయానికొస్తే... టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న భజ్జీ.. ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో భాగస్వామ్యమైన విషయం తెలిసిందే. కాగా ఐపీఎల్-2021 సీజన్లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున అతడు మైదానంలో దిగాడు. ఇక గీతా బస్రా... ‘‘దిల్ దియా హై’’ సినిమాతో బాలీవుడ్లో అరంగేట్రం చేశారు. -
పాటకు... ఫైట్‌కూ రెడీ
క్రికెటర్ హర్భజన్ సింగ్, హీరో అర్జున్ నటిస్తున్న చిత్రం ‘ఫ్రెండ్ షిప్’. ‘సింగ్ అండ్ కింగ్’ అనేది ఉపశీర్షిక. జాన్ పాల్ రాజ్–శ్యామ్ సూర్య సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ బిగ్‌బాస్ ఫేమ్, మాజీ మిస్ శ్రీలంక లోస్లియా హీరోయిన్గా నటì స్తున్నారు. ఆర్.కె ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్‌పై ఏ.ఎన్. బాలాజీ నిర్మిస్తున్నారు. నేడు (జూలై 3) హర్భజన్ సింగ్ పుట్టినరోజుని పురస్కరించుకుని షూటింగ్ విశేషాలను చిత్రబృందం తెలియజేసింది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది. తమిళ నిర్మాత జె.సతీష్ కుమార్ (జెఎస్కె) విలన్‌గా నటిస్తున్నారు. మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థ స్వామి మంత్రాలయంలో విడుదల చేసిన లోగోకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలోని ఒక పాట, ఫైట్‌ని హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నాం’’ అన్నారు. సో.. హర్భజన్ పాటకు, ఫైట్‌కూ రెడీ అవుతున్నారన్న మాట. ఈ చిత్రానికి సంగీతం: డి.ఎం. ఉదయ్ కుమార్, కెమెరా: శాంతకుమార్. -
‘షాదీ’ వెడ్డింగ్ ఫ్యాషన్ షో అదుర్స్
-
భార్యతో జాలీగా హర్బజన్ టూర్
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫ్యామిలీ ఫొటో వైరల్ గా మారింది. గతేడాది గీతా బస్రాను పెళ్లిచేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన భజ్జీ గత జూలైలో తండ్రిగా ప్రమోషన్ పొందాడు. భార్య గీతా బస్రా, కూతురు 'హినయ హీర్ ప్లహా'తో కలిసి దిగిన ఓ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ట్రావెల్ టైమ్ విత్ ఫ్యామిలీ అని క్యాప్షన్ పెట్టాడు భజ్జీ. ఇక అంతే శనివారం ఉదయం హర్బజన్ పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హర్బజన్ భార్య గీతా బస్రా చేతిలో ట్రావెల్ టికెట్లు ఉండటాన్ని ఫొటోలో గమనించవచ్చు. కొందరు ఫ్యాన్స్ దీనిపై కామెంట్ చేశారు. బ్యూటిఫుల్ కపుల్ అని కొందరు, స్వీట్ ఫ్యామిలీ పాజీ అని, హ్యాపీ జర్నీ భజ్జీ అని ఇలా హర్బజన్ అభిమానులు, ఫాలోయర్స్ కామెంట్ చేశారు. టీమిండియా జెర్సీలో మళ్లీ ఎప్పుడూ కనిపిస్తావు భజ్జీ అని కొందరు కామెంట్ చేశారు. -
హర్భజన్ కూతురు పేరేమిటో తెలుసా!
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ హర్భజన్ సింగ్-గీతా బస్రా దంపతులు తాజాగా పండంటి బిడ్డను కన్నారు. గత ఏడాది పెళ్లి చేసుకున్న ఈ జంటకు గత జూలైలో ఆడబిడ్డ పుట్టింది. తమ ముద్దుల కూతురి పేరేమిటో తాజాగా వీరు తమ ట్విట్టర్ పేజీలో వెల్లడించారు. తమ బిడ్డకు 'హినయ హీర్ ప్లహా' అని పేరు పెట్టామని వారు తెలిపారు. పాపకు ఆశీస్సులు అందజేసిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. టర్బోనేటర్ భజ్జీ గత ఏడాది ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రేమికురాలు అయిన బాలీవుడ్ నటి గీతా బస్రాను ఆయన పెళ్లాడారు. ఇక మహేంద్రసింగ్ ధోనీ కూతురి పేరు 'జివా' కాగా, భజ్జీ కూతురి పేరు 'హినయ' అని పెట్టడం బాగుందని భారత క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. HINAYA HEER PLAHA would like to thank you all for your lovely wishes in welcoming her into this world .. #ourlife #ourworld @Geeta_Basra — Harbhajan Turbanator (@harbhajan_singh) September 2, 2016 -
భజ్జీకి కంగ్రాట్స్ : సచిన్, కోహ్లీ
తండ్రిగా ప్రమోషన్ లభించిన టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్‌కు అభినందల వెల్లువ మొదలైంది. హర్భజన్ సింగ్ తండ్రి అయిన సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ భజ్జీ, గీతా బస్రా దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. పాపాజీ, మమ్మిజీలకు కంగ్రాట్స్ అంటూ సచిన్ ట్వీట్ చేశాడు. వారి జీవితంలో అంతా మంచి జరగాలని, అందరి ఆశీస్సులు ఆ జంటకు ఉంటాయని తన పోస్ట్ లో సచిన్ రాసుకొచ్చాడు. 'భజ్జీ దంపతులు చాలా సంతోషంగా ఉండాల్సిన సమయం. హర్భజన్, గీతా దంపతులకు అభినందనలు. మీ జీవితంలో సుఖసంతోషాలు ఉండాలని' విండీస్ పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. గీతా బస్రా లండన్‌లోని ఓ ఆస్పత్రిలో బుధవారం పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని భజ్జీ తల్లి అవతార్ కౌర్ మీడియాకు వెల్లడించగా ఈ దంపతులకు క్రికెట్ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. Welcome to a new world @harbhajan_singh. Congratulations to Papaji and Mummyji@Geeta_Basra. Lots of love & blessings to the Bundle of joy! — sachin tendulkar (@sachin_rt) 29 July 2016 Bohot khushi da mauka haiga. Meri lakh lakh vadhaiyan tussi dona nu. Rab Raakha @harbhajan_singh @Geeta_Basra — Virat Kohli (@imVkohli) 28 July 2016 -
భజ్జీకి తండ్రిగా ప్రమోషన్
లండన్: టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్‌కు తండ్రిగా ప్రమోషన్ లభించింది. అతని భార్య గీతా బస్రా లండన్‌లోని ఓ ఆస్పత్రిలో బుధవారం పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని భజ్జీ తల్లి అవతార్ కౌర్ మీడియాకు వెల్లడించింది. తల్లి, బిడ్డ ఆరోగ్యం ఉన్నట్లు ఆమె పేర్కొంది. తొలి కాన్పులో భాగంగా కొన్ని వారాల క్రితం గీతా బస్రా లండన్‌లోని తన తల్లి దండ్రులకు వద్దకు వెళ్లిన సంగతి తెలిసిందే. 2015, అక్టోబర్‌లో హర్భజన్ సింగ్-గీతాబస్రాలు వివాహం చేసుకున్నారు. ఆ జంట ఆరు సంవత్సరాలు ప్రేమించుకున్న తరువాత పెద్దల అంగీకారంతో గతేడాది ఒక్కటైంది. -
'ఆడాళ్లతో ఉండడం కష్టం'
న్యూఢిల్లీ: ఆడాళ్లతో వేగడం కష్టమేనని టీమిండియా బౌలర్ హర్భజన్ సింగ్ సరదాగా వ్యాఖ్యానించాడు. ఆడాళ్లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. 'గర్భంతో ఉన్నా లేదా మామూలుగా ఉన్న ఆడాళ్లతో సమయం గడపడం చాలా కష్టమ'ని పేర్కొన్నాడు. ఆలుమగల మధ్య సదావగాహన ఉంటే సంసారం సాఫీగా సాగిపోతుందని కూడా అన్నాడు. హర్భజన్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ నెలాఖరుకు అతడి భార్య గీతా బస్రా బిడ్డను ప్రసవించనుంది. తన మొదటి సంతానం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చేస్తున్నానని 36 ఏళ్ల భజ్జీ తెలిపాడు. గీత(32)ను గతేడాది అక్టోబర్ లో పెళ్లి చేసుకున్నాడు. పసిబిడ్డను ఎలా పెంచాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి భార్యతో కలిసి ప్రి-నాటల్ క్లాసులకు వెళ్లినట్టు వెల్లడించాడు. తన బిడ్డ ఇంగ్లండ్ లో పుడుతుందని చెప్పాడు. గీత బ్రిటీష్ పౌరురాలని, ఆమె తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారని చెప్పాడు. తమ కుటుంబంలోకి కొత్తగా రానున్న బుజ్జాయి కోసం షాపింగ్ మొదలు పెట్టానని భజ్జీ తెలిపాడు. -
బంతి...చామంతి...ప్రేమించుకున్నాయ్
కొన్ని ప్రేమలు ఎప్పుడు మొదలవుతాయో, ఎప్పుడు ముగుస్తాయో తెలీదు. ఈ ప్రేమ పెళ్లి దాకా చేరుతుందని వారికే నమ్మకముండదు. అయినా సరే తాము కలసి తిరుగుతూ కనిపిస్తారు. ఎయిర్‌పోర్ట్‌లోనో, మరో పార్టీలోనో చిరునవ్వులు చిందిస్తూ, కెమెరాల వైపు చేయి చూపుతూ అలా ఒక పోజిస్తారు. అంతే ఇదంతా వార్తల్లోకెక్కుతుంది. మీడియాలో మంచి పబ్లిసిటీ లభిస్తుంది. వారికి కావాల్సిందీ ఇదే. ఫామ్ కోల్పోయిన క్రికెటర్ అయినా, సినిమాలు లేని హీరోయిన్ అయినా అందరికీ ఇది మంచి బూస్ట్‌గా పని చేస్తుంది. భవిష్యత్తు సంగతి ఎవడు చూడబోయారు, ప్రస్తుతానికి మాత్రం మేం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత ఎంచక్కా గుడ్‌బై చెప్పేస్తారు. ఆఫీసులో ఐదింటి వరకు సాగే ప్రేమలు కొన్నయితే... ఆ తర్వాత ఆరింటికి బస్టాపులో మొదలయ్యే ప్రేమలు మరికొన్ని... కాలేజీలో పుట్టే ప్రేమలు కొన్నయితే... క్యాంటీన్లో పుట్టే ప్రేమలు మరికొన్ని... ఇదంతా మనం చూసే ప్రపంచం. కానీ మరికొన్ని ప్రేమలు క్రికెట్ మైదానాల్లోనూ, సినిమా ప్రీమి యర్ షోలలోనూ పుడతాయి. ఒక మైలురాయి సాధించిన క్షణాన బ్యాట్ వెనకనుంచి ఓరకంట చూపులతో సఖికి సంకేతం పంపే ప్రేమ ఒకటైతే... నా రియల్ హీరో అంటూ ఒక్కసారిగా ప్రపంచం ముందు ప్రదర్శించే హీరోయిన్ ప్రేమ మరొకటి. ఈ ప్రేమల్లో అన్నింటికీ శుభం కార్డు పడదు. అలా అని దుఃఖాంతాలూ కావు. నిజంగా గుండె లోతుల్లోంచి పుట్టే ప్రేమతో పెళ్లి దాకా చేరేవి కొన్నయితే... దానికి ముందే వీడ్కోలు తీసుకునే ప్రేమలు మరికొన్ని. అసలు ఇదంతా ట్రాష్ అన్నట్లుగా కొంత కాలం కలసి తిరగడం, వార్తల్లో నిలవడం కోసమే ప్రేమగా కనిపించే జంటలూ ఉంటాయి. అంతకు ముందు అతనికి పెళ్లయినా వెంటపడి తమ ప్రేమను గెలిపించుకున్నవారు కొందరు ఉంటే, మా దారి వేరయింది, అయినా స్నేహితులమే అంటూ చెప్పుకునేవారూ ఉన్నారు. మన దేశంలో సినిమాలు, క్రికెట్లు రెండు కళ్లలాంటివి. ఆటగాళ్లకి, తారలకి ఉండే క్రేజ్ వేరు. ఈ రెండు రంగాలు కలసి అడుగు వేస్తే అభిమానులకు అంతకంటే కనువిందు ఏముంటుంది. అనుష్కశర్మకు తన సూపర్ హిట్ సినిమాలతో రాని గుర్తింపు విరాట్ కోహ్లి ఫ్లాప్ మ్యాచ్‌ల సమయంలో వచ్చిందనే వ్యాఖ్య ఇటీవల సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో హల్చల్ చేసింది. క్రికెటర్లు, హీరోయిన్ల ప్రేమ వ్యవహారాలు ఎప్పుడైనా పాపులర్. 60వ దశకంనుంచి ఈతరం వరకు కూడా అలాంటి ఏ ఇద్దరు చేరినా అది వార్తగా మారింది. సంచలనంగా నిలిచింది. అలాంటి పెళ్లిళ్లు, పెటాకులు, ప్రేమలపై ఫోకస్. - సాక్షి క్రీడావిభాగం మన్సూర్ అలీఖాన్ పటౌడీ-షర్మిలా ఠాగోర్ భారత క్రికెట్, బాలీవుడ్ కలసి అడుగులో అడుగు వేసి విజయవంతంగా నిలిచిన తొలి జోడీ ఇది. భోపాల్ ముస్లిం నవాబుల వంశానికి చెందిన పటౌడీ అప్పటికే భారత స్టార్ క్రికెటర్. కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. బెంగాలీ కుటుంబానికి చెందిన షర్మిల కూడా ఆ సమయంలో బాలీవుడ్‌ను ఊపేస్తోంది. ఒక సినిమాలో ఆమెను చూసిన పటౌడీ మనసు పారేసుకున్నాడు. మతాలు వేరు కావడంతో సహజంగానే పెద్దలనుంచి వ్యతిరేకత ఎదురైంది. కానీ వీరి పట్టుదల ముందు అది సరిపోలేదు. దాంతో 1969లో ఒక్కటైన పటౌడీ-షర్మిల తమ దాంపత్య జీవితంలో సక్సెస్‌ఫుల్‌గా నిలిచారు. వీరి కుమారుడే ప్రముఖ హీరో సైఫ్ అలీఖాన్. మొహసీన్ ఖాన్-రీనా రాయ్ దేశ సరిహద్దులు దాటిన ఈ ప్రేమ ఒక దశలో ఎంతో సక్సెస్‌ఫుల్‌గా కనిపించినా...చివరకు బీటలు వారింది. పాకిస్తాన్ తరఫున 48 టెస్టులు ఆడిన క్రికెటర్ మొహసీన్ ఖాన్ భారత పర్యటనకు వచ్చి అప్పటి హీరోయిన్ రీనారాయ్ను ప్రేమించాడు. అందగాడైన మొహసీన్ పట్ల ఆకర్షితురాలైన రీనా దూసుకుపోతున్న తన కెరీర్‌కు ఒక్కసారిగా గుడ్‌బై చెప్పి పెళ్లికి సిద్ధమైంది. తన పరిచయాలతో అతడికి అవకాశాలు ఇప్పించి బాలీవుడ్ హీరోని కూడా చేసింది. అయితే తొమ్మిదేళ్ల తర్వాత ఈ బంధం ముగిసింది. భారత్‌కు తిరిగి వచ్చి రీనా మళ్లీ సినిమాల్లో సహాయక పాత్రలు వెతుక్కుంది. హర్భజన్ సింగ్- గీతా బస్రా వీరిద్దరి ప్రేమ వ్యవహారం కూడా సుదీర్ఘంగా దాదాపు ఐదేళ్లకు పైగా సాగింది. సైడ్ హీరోయిన్ పాత్రలకే ఎక్కువగా పరిమితమైన బస్రా, భజ్జీతో ప్రేమ వ్యవహారం వల్లే వార్తల్లో నిలిచింది. క్రికెట్ మ్యాచ్‌లకు రావడం, కలిసి ఎఫ్1 పోటీలు చూడటంతో ఒక దశలో ఇది కూడా సాధారణ ఫ్రెండ్షిప్ వ్యవహారంలాగే కనిపించింది. అయితే హర్భజన్ పట్టుదల ప్రదర్శించాడు. లండన్‌లో పుట్టినా... తమలాగే పంజాబీ కుటుంబానికి చెందిన అమ్మాయి కావడంతో ఈ భారత ఆఫ్‌స్పిన్నర్ తన తల్లిని ఒప్పించగలిగాడు. బల్లే బల్లే అంటూ వైభవంగా ఈ పెళ్లి జరిగింది. అజహరుద్దీన్-సంగీతా బిజ్లాని భారత క్రికెట్ జట్టు విజయవంతమైన కెప్టెన్‌గా అప్పటికే గుర్తింపు తెచ్చుకున్న అజహర్‌కు పెళ్లయి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. ఒక వాణిజ్య ప్రకటన షూటింగ్ సందర్భంగా సంగీతతో మొదలైన పరిచయం గాఢమైన ప్రేమగా మారింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన సంగీత... హీరోయిన్గా మాత్రం పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. భారత జట్టులో రెగ్యులర్‌గా మారినా... సాధారణంగా ముభావంగా, కుటుంబ మనిషిగా కనిపించే అజహర్ కూడా ఈ మాజీ మిస్ ఇండియా ముందు దాసోహం అన్నాడు. దాంతో మొదటి భార్యకు విడాకులిచ్చి మరీ సంగీతను పెళ్లాడాడు. ముస్లింగా మారుతూ తన పేరును ఆయేషాగా మార్చుకున్నానని ఆమె చెప్పినా... అది ఎక్కడా పెద్దగా కనపడలేదు. కంచికి చేరని పాపులర్ ప్రేమలు... గ్యారీ సోబర్స్-అంజూ మహేంద్రు వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ 60వ దశకంలో భారత పర్యటనకు వచ్చినప్పుడు బాలీవుడ్ హీరోయిన్ అంజూ మహేంద్రుతో ప్రేమలో పడ్డాడు. బహిరంగంగానే తమ ప్రేమను వ్యక్తం చేసి వీరిద్దరు పెళ్లికి కూడా సిద్ధమయ్యారు. అయితే అంజూ తల్లిదండ్రులు విదేశీయుడితో వివాహానికి ససేమిరా అనడంతో దానికి అక్కడే బ్రేక్ పడింది. రవిశాస్త్రి-అమృతా సింగ్ 1985లో మినీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రవిశాస్త్రి ఒక్కసారిగా అమ్మాయిల కలల రాకుమారుడు అయిపోయాడు. ఇదే క్రమంలో నటి అమృతా సింగ్‌తో అతను సుదీర్ఘ కాలం ప్రేమ వ్యవహారం నడిపాడు. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు బాంబేలో పెద్ద పోస్టర్లుగా మారిపో యాయి. అయితే అనూహ్యంగా ఈ కథ ముగిసిపోయింది. తర్వాత అమృతాసింగ్ సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకుంది. అయితే ఇది కూడా పెటాకులై సైఫ్.. మరో హీరోయిన్ కరీనాకపూర్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఇమ్రాన్ ఖాన్-జీనత్ అమన్ అతను ప్రపంచ క్రికెట్లో సెక్సీయెస్ట్ క్రికెటర్, ఆమె సెక్సీ హీరోయిన్...ఇద్దరి కెరీర్లు మంచి దశలో ఉన్న సమయంలో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైంది. పెళ్లి ఖాయం అనిపించిన దశలో ఇమ్రాన్ ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు. తాను అప్పుడే పెళ్లి చేసుకోనని తేల్చేశాడు. స్పెషల్ లవ్ స్టోరీ... అయితే వీటన్నింటికీ భిన్నమైన, సంచలన ప్రేమ కథ వివియన్ రిచర్డ్స్, నీనా గుప్తాలది. వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ భారత పర్యటనకు వచ్చిన సమయంలో కళాత్మక చిత్రాల నటి నీనాగుప్తా ముందు తన కళ ప్రదర్శించాడు. తమ వ్యవహారాన్ని నీనా ఏనాడూ దాచుకోలేదు. ఈనాటి సహజీవనాలతో పోలిస్తే 80లలో ఇదో పెద్ద సంచలనం. రిచర్డ్స్‌ను పెళ్లి చేసుకోకపోయినా అతని ద్వారా పుట్టిన కూతురు మసాబాను పెంచి, పెద్ద చేసిన నీనా... ఆమెకు తండ్రి రిచర్డ్స్ అని బహిరంగంగానే ప్రకటించింది. ఆ తర్వాత వివ్ కూడా తమ బంధానికి అంగీకారం తెలిపాడు. అయినా రిచర్డ్స్ కూతురుగా పుట్టే అదృష్టం ఎంత మందికి దక్కుతుంది అంటూ తల్లిలాగే వివాదాస్పద స్టేట్మెంట్ ఇచ్చిన మసాబా.... ఇటీవలే తెలుగువాడైన సినీ నిర్మాత మధు మంతెనను పెళ్లి చేసుకుంది. విరాట్ కోహ్లి- అనుష్క శర్మ ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ లవ్ స్టోరీ ఇది. ఒక షాంపూ ప్రకటనలో కలి సి నటించిన స్నేహం ప్రేమగా మారింది. ఆస్ట్రేలియా నుంచి ఇంగ్లండ్ వరకు, దక్షిణా ఫ్రికా నుంచి శ్రీలంక వరకు వీరి టూర్ కొనసాగుతోంది. అయితే 26 ఏళ్ల వయసులో కెరీర్లో మంచి దశలో ఉన్న వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా అనేది సందేహమే. జహీర్ ఖాన్- ఇషా శర్వాణి కొన్నేళ్ల క్రితం భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తిరిగి వచ్చినప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో జహీర్‌ఖాన్‌ను ఇషా రిసీవ్ చేసుకుంటూ అక్కడ చేసిన హడావుడి, అతనితో కలిసి ఇంటికి వెళ్లడం చూస్తే పెళ్లి గ్యారంటీ అనిపించింది. అయితే సుభాష్ ఘై కిస్నాతో హీరోయిన్గా పరిచయం అయిన ఈ క్లాసికల్ డ్యాన్సర్‌తో తమ బంధాన్ని ముందుకు తీసుకెళ్లకుండా జహీర్ మధ్యలోనే ముగించాడు. యువరాజ్ సింగ్ -కిమ్ శర్మ యువరాజ్‌కు అమ్మాయిలతో జత కట్టి వార్తలు రాయడం కొత్త కాదు కానీ వీరిద్దరి స్నేహం మాత్రం నాలుగేళ్లకు పైగానే సాగింది. సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకోలేని కిమ్, యువీ కారణంగా హైలైట్ అయింది. చివరకు యువీ తల్లి చొరవతో ఈ వ్యవహారం ముగిసిపోయింది. సౌరవ్ గంగూలీ-నగ్మా పెద్దలను ఎదిరించి తన చిన్న నాటి స్నేహితురాలు డోనాను పెళ్లి చే సుకున్న సౌరవ్ కూడా ఒక దశలో దారి తప్పాడు. నాటి టాప్ హీ రోయిన్ నగ్మాతో చిన్నపాటి ప్రే మ వ్యవహారం నడిపాడు. వీరి ద్దరు బహిరంగంగా ఎప్పుడూ దీని గురించి మాట్లాడకపో వడంతో పాటు ఎక్కువ కాలం వార్తల్లో నిలవకపోవడం వల్ల కూ డా సమస్య రాలేదు. అయితే సౌరవ్, నగ్మా కలిసి ఒక సారి శ్రీకాళహస్తిలో సర్ప దోష నివారణ పూజ చేయించడం అనుమానాలను పెంచింది. ఇక ధోని, శ్రీశాంత్‌లాంటి క్రికెటర్లతో హీరోయిన్ల పేరు చేరుస్తూ పుంఖానుపుంఖాలుగా కథనాలు వచ్చినా అవన్నీ దమ్ము లేనివే. క్రికెటేతర ప్రేమలు... భారత టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతి, సినీ హీరోయిన్ లారా దత్తాను పెళ్లి చేసుకున్నాడు. 12 గ్రాండ్‌స్లామ్‌ల విజేత అయిన భూపతి ఈ పెళ్లి కోసం తన మొదటి భార్య శ్వేతా జైశంకర్‌కు విడాకులివ్వగా... 2000 మిస్ యూనివర్స్ లారా దత్తా పెళ్లికి ముందు మోడల్ కెల్లీ దోర్జ్ (డాన్ విలన్)తో సుదీర్ఘ కాలం ప్రేమ వ్యవహారం నడిపింది. ప్రముఖ గోల్ఫర్ జ్యోతి రణ్‌ధావా... మోడల్, నటి చిత్రాంగదా సింగ్‌ను వివాహమాడాడు. అయితే పుష్కర కాలం తర్వాత ఈ వివాహ బంధం ముగిసింది. -
పెళ్లిలో సారీ చెప్పిన హర్భజన్
-
పెళ్లిలో సారీ చెప్పిన హర్భజన్
జలంధర్: భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ పెళ్లిలో బౌన్సర్లుగా అతిగా స్పందించి మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న హర్భజన్ మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెప్పాడు. గురువారం జలంధర్‌లో హర్భజన్.. తన ప్రియురాలు గీతా బస్రాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి సచిన్ దంపతులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వివాహ వేదిక పొరుగింటిపై నుంచి మీడియా ప్రతినిధులు హర్భజన్ పెళ్లిని వీడియో తీసేందుకు ప్రయత్నించారు. అయితే బౌన్సర్లు వెళ్లి కెమెరామెన్లపై దాడికి దిగారు. భజ్జీ పెళ్లి వైభవంగా జరిగినా.. చివర్లో మీడియా ప్రతినిధులపై బౌన్సర్లు దాడి చేయడంతో వివాదం ఏర్పడింది. -
వైభవంగా హర్భజన్ వివాహం
జలంధర్: భారత జట్టు సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఓ ఇంటివాడయ్యాడు. గురువారం ఇక్కడి గురుద్వారలో ప్రియురాలు గీతా బస్రాను భజ్జీ వివాహం చేసుకున్నాడు. 35 ఏళ్ల హర్భజన్, బస్రా గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తెలుపు రంగు షేర్వాణీ, ఎర్రటి తలపాగా ధరించిన హర్భజన్ తమ సంప్రదాయానికి అనుగుణంగా చేతిలో కత్తి పట్టుకోగా... ఎరుపు, బంగారు లెహంగాతో పెళ్లి కూతురు బస్రా మెరిసింది. వైభవంగా జరిగిన వీరి వివాహానికి సన్నిహితులు, బంధువులతో పాటు బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, అతని భార్య అంజలి హాజరయ్యారు. మరికొంతమంది క్రికెటర్లు ఈ ఆఫ్ స్పిన్నర్‌కు ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. ఆదివారం ఢిల్లీలో రిసెప్షన్ జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు క్రికెటర్లు యువరాజ్, కోహ్లి, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారుఖ్, ప్రియాంక తదితరులు రిసెప్షన్‌కు వచ్చే అవకాశం ఉంది. -
ఓ ఇంటి వాడైన హర్భజన్
జలంధర్: టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ ఓ ఇంటి వాడయ్యాడు. స్నేహితురాలు గీతా బాస్రాను అతడు పెళ్లాడాడు. పంజాబ్‌లోని ఫగ్వారాలోని గురుద్వారాలో గురువారం వీరి వివాహం జరిగింది. తెలుపు రంగు షెర్వానీ, ఎరుపు టోపీ ధరించి భజ్జీ మెరిశాడు. పెళ్లికూతురు సంప్రదాయ ఎరుపు రంగు చీర ధరించింది. వీరి వివాహానికి దగ్గరి బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, అతడి సతీమణి అంజలి విచ్చేసి భజ్జీ-బాస్రా దంపతులను ఆశీర్వదించారు. అంతకుముందు హర్భజన్ నివాసంలో మెహందీ, సంగీత్ కార్యక్రమాలు నిర్వహించారు. నవంబర్ 1న ఢిల్లీలో భజ్జీ-బాస్రా వివాహ రిసెప్షన్ జరగనుంది. రిసెప్షన్ కు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశముంది. క్రికెటర్లు యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లి, అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా తదితర ప్రముఖులు రిసెప్షన్ కు రానున్నారు -
ఓ ఇంటి వాడైన హర్భజన్
-
భజ్జీ రిసెప్షన్‌కు మోదీ!
ఫగ్వరా: క్రికెటర్ హర్భజన్ సింగ్, బాలీవుడ్ నటి గీతా బస్రా నేడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. పంజాబ్‌లోని ఫగ్వారాలో నేడు వీరి వివాహం జరుగనుంది. జలంధర్‌లో బుధవారం అట్టహాసంగా జరిగిన వేడుకలో ఈ జంట వివాహ ఉంగరాలను మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 500 మంది బంధుమిత్రులు హాజరుకానున్నారు. నవంబర్ 1న భజ్జీ-బస్రా దంపతులు ఢిల్లీలో వివాహ విందు (రిసెప్షన్) ఇవ్వనున్నారు. ఈ విందుకు క్రికెటర్లు యువరాజ్‌సింగ్, విరాట్ కోహ్లితోపాటు బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ హాజరుకానున్నరు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఈ విందుకు హాజరై.. నూతన దంపతులను ఆశ్వీరవదించే అవకాశముందని తెలుస్తున్నది. చాలాకాలంగా ప్రేమించుకుంటున్న హర్భజన్ సింగ్, గీతా బస్రా ఇటీవల పెళ్లికి ఓకే చెప్పిన సంగతి తెలిసింది. వివాహం అనంతరం రంజీ ట్రోఫీలో ఆడాలని 35 ఏళ్ల హర్భజన్ సింగ్ భావిస్తున్నారు. తన స్పిన్ బౌలింగ్‌తో ప్రపంచంలోని మేటి జట్లకు వణుకు పుట్టించిన భజ్జీ మొత్తం 103 టెస్టులు ఆడి 417 వికెట్లు తీశాడు. వన్డేలు, ట్వంటీ-20ల్లోనూ తన సత్తా చాటాడు. -
హనీమూన్‌కు వెళ్లడం లేదు: హర్భజన్
నేడు గీతా బాస్రాతో వివాహం న్యూఢిల్లీ: భారత జట్టు క్రికెటర్ హర్భజన్ సింగ్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. మెహందీ, సంగీత్ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న స్పిన్నర్.. గురువారం తన స్నేహితురాలు గీతా బాస్రాను వివాహామాడనున్నాడు. జీవితంలో మరో కొత్త ఇన్నింగ్స్‌పై దృష్టిపెట్టానని భజ్జీ అన్నాడు. అయితే పెళ్లి తర్వాత హనీమూన్‌కు వెళ్లడం లేదని చెప్పాడు. ‘నేను దేవుడిని నమ్ముతాను. ఆయన ఆశీస్సులతో నేటి నుంచి నా జీవితంలో కొత్త ఆధ్యాయం ప్రారంభమవుతుంది. అది కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నా. ఇప్పటికైతే హనీమూన్ ప్రణాళికలు లేవు. పెళ్లి తంతు ముగిశాక ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో బరిలోకి దిగాలి. పీసీఏ అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి’ అని భజ్జీ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో తన బౌలింగ్ సంతృప్తినిచ్చిందని హర్భజన్ అన్నాడు. ‘తొలి రెండు టెస్టుల్లో చోటు దక్కకపోవడంపై విరాట్‌తో మాట్లాడా. ప్రొటీస్ జట్టులో ముగ్గురు కుడి చేతి వాటం బ్యాట్స్‌మన్ ఉండటంతో లెఫ్టార్మ్ స్పిన్నర్ జడేజా కావాలనుకుంటున్నట్లు చెప్పాడు. నిజంగా జట్టు కూర్పు గురించి ఇలా చెప్పడం చాలా బాగా అనిపించింది. అయితే టెస్టుల్లో చోటు కోసం పోరాడుతూనే ఉంటా’ అని హర్భజన్ వివరించాడు. -
భజ్జీ పెళ్లికి భారీ సన్నాహాలు
న్యూఢిల్లీ: ఐదురోజులపాటు అట్టహాసంగా జరుగనున్న క్రికెటర్ హర్భజన్ సింగ్, నటి గీతా బస్రా పెళ్లికి భారీగా సన్నాహాలు చేస్తున్నారు. శుక్రవారం వీరి పెళ్లి జరుగనుంది. దీంతోపాటు మెహిందీ, సంగీత్, రిసెప్షన్ వంటి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం వధూవరులకు ప్రముఖ డిజైనర్ అర్చన కొచ్చర్ వస్త్రాలను రూపొందిస్తున్నారు. పెళ్లిరోజున భజ్జీ, గీత వేసుకునే దుస్తులను అత్యంత సంప్రదాయ శైలితో సరికొత్తగా రూపొందిస్తున్నట్టు ఆమె తెలిపారు. 'గీత బాగా సంప్రదాయబద్ధంగా డిజైన్‌ను కోరుకుంటున్నారు. ఆమె కోసం భారతీయ వర్క్‌తో కూడిన లెహెంగా, దుపట్టా, బ్లౌజ్ సిద్ధం చేస్తున్నాం. భజ్జీ కూడా సంప్రదాయ డిజైన్‌కు ప్రాధాన్యమిస్తున్నారు. పెళ్లిరోజున ఆయన భారతీయతో ఉట్టిపడే చుడిదార్ ధరించనున్నారు. మెహిందీ, పెళ్లి, రిసెప్షన్ ఇలా వివిధ వేడుకలకు వధూవరులు మెచ్చేరీతిలో డిజైన్ వస్త్రాలను రూపొందిస్తున్నాం' అని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ఐదురోజుల ఈ పెళ్లి వేడుకలో భాగంగా నవంబర్ 1న జరుగనున్న రిసెప్షన్‌కు క్రికెటర్లు యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లి, బాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు. -
'హర్భజన్, గీతల పెళ్లికి రండి'
న్యూఢిల్లీ: ప్రేమపక్షులు క్రికెటర్ హర్భజన్ సింగ్, బాలీవుడ్ భామ గీతా బస్రా పెళ్లి తేదీ ఎట్టకేలకు నిశ్చయమైంది. వాయిదాలు పడుతూ వస్తున్న వివాహ తేదీని ఖరారు చేశారు. ఈ నెల 29న హర్భజన్, గీత వివాహం జరగనుంది. నవంబర్ 1న రిసెప్షన్. ఈ మేరకు ఆహ్వాన పత్రికలు కూడా సిద్ధం చేశారు. భజ్జీ, గీతల వివాహ ఆహ్వాన పత్రికను డిజైనర్ ఏడీ సింగ్ రూపొందించారు. ఈ వివాహ పత్రికను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. హర్భజన్ సొంతూరైన పంజాబ్‌లోని జలంధర్‌కు 20 కిలో మీటర్ల దూరంలోని ఓ హోటల్లో జరగనుంది. సంగీత్, మెహంది, రిసెప్షన్లతో సహా పెళ్లి వేడుకలు ఐదు రోజుల పాటు జరగనున్నాయి. పెళ్లి రోజున గీత గాగ్రా, హర్భజన్ షేర్వానీలతో మెరిసిపోనున్నారు. -
వచ్చే నెలలో వాళ్లిదరి పెళ్లి లేనట్టే!
భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్, బాలీవుడ్ నటి గీతా బస్రా పెళ్లి వాయిదా పడినట్టు సమాచారం. వచ్చే నెల 29న ఢిల్లీలో పెళ్లి చేసుకోవాలని ఈ ప్రేమ జంట ఇటీవల నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. అయితే హర్భజన్ సింగ్ సన్నిహితుడు ఈ వార్తను తోసిపుచ్చాడు. భజ్జీ, బస్రాల పెళ్లి అక్టోబర్‌లో ఉండదని చెప్పాడు. 'హర్భజన్, అతని కుటుంబం వివాహ తేదీని ఇంకా నిర్ణయించలేదు. వివాహ వేదికను కూడా బుక్ చేయలేదు. నవంబర్ 2 నుంచి హర్భజన్ క్రికెట్ సిరీస్‌లో పాల్గొంటాడు. దీంతో హర్భజన్ పెళ్లి డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ఉండొచ్చు. ఏ విషయాన్ని ఇంకా ఖరారు చేయలేదు' అని భజ్జీ సన్నిహితుడు చెప్పాడు. -
త్వరలో పెళ్లి కొడుకు కానున్న హర్భజన్
ముంబై: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ త్వరలో ఇంటివాడు కానున్నాడు. తన స్నేహితురాలు, మోడల్ గీతా బస్రాతో హర్భజన్ ఏడు అడుగులు వేయనున్నాడు. ఇటీవల హర్భజన్ పెళ్లి మూహూర్తాన్ని ఖరారు చేసినట్లు అతని కుటుంబ సభ్యుడు ధృవీకరించాడు. అక్టోబర్ 29 వ తేదీన హర్భజన్-గీతాల పెళ్లి జరుగనున్నట్లు తెలిపాడు. ఇందుకు పంజాబ్ రాష్ట్రంలోని ఫాగ్వారాలో హోటల్ క్లబ్ కెబనాను బుక్ చేశామని.. ఒకవేళ అక్టోబర్ నెలలో దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న టీమిండియా టీమ్ లో హర్భజన్ ఎంపికైతే తేదీల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా హర్భజన్ పెళ్లి తేదీకి సంబంధించి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అతని కజిన్ తెలిపాడు. శ్రీలంక టూర్ లో ఉన్న హర్భజన్ ఇండియాకు తిరిగొచ్చిన తరువాతే తేదీపై నిర్ణయం తీసుకుంటామన్నాడు. కాగా, ఇప్పటికే ఆ పెళ్లి వేడుకకు సంబంధించి క్లబ్ కెబెనాను బుక్ చేసుకున్నట్లు ఆ క్లబ్ సీనియర్ ఉద్యోగి తెలిపాడు.