Google Play Store
-
ఏకకాలంలో మూడు యాప్‌లు: గూగుల్ ప్లే స్టోర్‌లో కొత్త ఫీచర్
సాధారణంగా గూగుల్ ప్లే స్టోర్‌లో ఒకసారికి ఒక యాప్‌ను మాత్రమే ఇన్స్టాల్ చేయొచ్చు లేదా అప్డేట్ చేయొచ్చు. ఇప్పుడు యాప్ మేనేజ్మెంట్ మరింత వృద్ధి చెందింది. కాబట్టి ఏకకాలంలో మూడు యాప్‌లు లేదా గేమ్‌లను ఇన్స్టాల్ లేదా అప్డేట్ చేసుకోవచ్చు.ఈ కొత్త ఫీచర్ భారతదేశంతో సహా ఎంపిక చేసిన ప్రాంతాలలో అందుబాటులోకి వచ్చింది. గూగుల్ ప్లే స్టోర్‌లోని ఈ అప్డేట్ మునుపటి సిస్టమ్ కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. ఇది సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. యూజర్లకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది.ఇదీ చదవండి: తమిళనాడు ప్రభుత్వంతో గూగుల్ ఒప్పందం: ఎందుకో తెలుసా? గూగుల్ ఏప్రిల్‌లో మొదటిసారి రెండు యాప్‌లను ఏకకాలంలో ఇన్స్టాల్ లేదా అప్డేట్ చేసుకోవడానికి వీలు కల్పించింది. ఇప్పుడు ఆ సంఖ్య మూడుకు చేరింది. యూజర్ ఒకేసారి మూడు యాప్స్ ఇన్స్టాల్/అప్డేట్ చేసుకోవాలనుకున్నప్పుడు 'అప్డేట్ ఆల్' అనే ఫీచర్ ఎంచుకోవాలి ఉంటుంది. ఇలా సెలక్ట్ చేసుకున్న తరువాత యాప్స్ అప్డేట్లు ప్రాసెస్ అవుతాయి. అయితే ఈ ఫీచర్ కొన్ని పరికరాల్లోనూ అందుబాటులో లేదు. కానీ రాబోయే రోజుల్లో అన్ని పరికరాల్లోనూ అందుబాటులో వస్తుందని సమాచారం. -
10 యాప్ సంస్థలపై గూగుల్ చర్యలు
న్యూఢిల్లీ: సర్వీస్ ఫీజు చెల్లింపుల వివా దం కారణంగా టెక్ దిగ్గజం గూగుల్ పలు యాప్ సంస్థలపై చర్యలకు ఉపక్రమించింది. వాటిని తమ ప్లేస్టోర్ నుంచి తొలగించే ప్రక్రియ ప్రారంభించింది. అనేక అవకాశాలు ఇచి్చనప్పటికీ, తమ ప్లాట్‌ఫామ్‌తో ప్రయోజనం పొందుతున్న ‘పేరొందిన’ పది సంస్థలు ఫీజులు చెల్లించడం లేదని సంస్థ పేర్కొంది. అయితే, గూగుల్ సదరు సంస్థల పేర్లను నిర్దిష్టంగా వెల్లడించలేదు. కానీ, షాదీ, మ్యాట్రిమోనీడాట్కా మ్, భారత్ మ్యాట్రిమోనీ వంటి యాప్స్ కోసం ఆండ్రాయిడ్ ఫోన్లపై సెర్చి చేస్తే వాటి పేర్లు కనిపించకపోవడంతో జాబితాలో అవి ఉన్నట్లుగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే బాలాజీ టెలీఫిలిమ్స్కి చెందిన ఆల్ట్ (గతంలో ఆల్ట్‌బాలాజీ), ఆడియో ప్లాట్‌ఫాం కుకు ఎఫ్ఎం, డేటింగ్ సర్వీస్ యాప్ క్వాక్‌క్వాక్, ట్రూలీ మ్యాడ్లీ కూడా ప్లేస్టోర్ నుంచి మాయమయ్యాయి. ఇన్–యాప్ పేమెంట్స్‌పై గూగుల్ 11 నుంచి 26 శాతం ఫీజులను విధిస్తుండటంపై నెలకొన్న వివాదం ఈ పరిణామానికి దారి తీసింది. ప్లాట్‌ఫాం ఫీజుపై పోరాడుతున్న కంపెనీలకు అనుకూలంగా సుప్రీం కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో నిబంధనలను పాటించని యాప్‌లను గూగుల్ తొలగించడం ప్రారంభించింది. ఉచిత డిజిటల్ మార్కెట్‌ప్లేస్‌ను ఆఫర్ చేస్తూ ఇండస్ యాప్ స్టోర్‌ను ఫోన్‌పే ప్రవేశపెట్టిన తరుణంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది గుత్తాధిపత్య ధోరణి..: కుకు ఎఫ్ఎం కాగా, గూగుల్ గుత్తాధిపత్య ధోరణితో వ్యవహరిస్తోందని కుకు ఎఫ్ఎం సహ–వ్యవస్థాపకుడు వినోద్ కుమార్ వ్యాఖ్యానించగా, ఇది భారత్‌లో ఇంటర్నెట్కు దుర్దినంగా భారత్ మ్యాట్రిమోనీ వ్యవస్థాపకుడు మురుగవేల్ జానకిరామన్ అభివరి్ణంచారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ పెండింగ్‌లో ఉన్నందున ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, ఏ యాప్‌ను డీలిస్ట్ చేయొద్దని గూగుల్‌కి ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ (ఏఐఎంఏఐ) సూచించింది. -
షాకిచ్చిన గూగుల్..నౌకరి.కామ్ యాప్ మాయం!
భారత్‌లోని ప్రముఖ లార్జెస్ట్ వెబ్సైట్ నౌకరి.కామ్ యాప్ ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించిందా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. గూగుల్, భారత్‌లోని యాప్ డెవలపర్ల మధ్య కొంతకాలంగా ప్లే స్టోర్ ఛార్జీల వివాదం కొనసాగుతోంది. భారత్‌లోని కొన్ని కంపెనీలు సర్వీస్ ఛార్జీలు చెల్లించకుండా గూగుల్ ప్లే స్టోర్‌ని వినియోగించుకుంటున్నాయని తెలిపింది. ఆయా సంస్థలు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సిందేనని, లేదంటే ప్లేస్టోర్ నుంచి సంబంధిత సంస్థల యాప్స్‌లను తొలగిస్తామని ప్రకటించారు. నిబంధనల్ని పాటించాం.. ఈ తరుణంలో ఇన్ఫో ఎడ్జ్ యాజమాన్యంలోని నౌకరి, రియల్ ఎస్టేట్‌కు చెందిన 99 ఎకర్స్ యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించింది. ఈ సందర్భంగా గూగుల్ యాప్ బిల్లింగ్ పాలసీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ఫిబ్రవరి 9 నుండి తాము గూగుల్ యాప్ విధానాలకు కట్టుబడి ఉన్నామని ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిక్చందానీ గతంలో చెప్పారు. గూగుల్ బకాయిలన్నీ సకాలంలో చెల్లించామని తెలిపారు. భారత్‌లో 10 యాప్స్ తొలగింపు తాజాగా ప్లే స్టోర్ నుంచి యాప్‌ను తొలగించడంపై సంజీవ్ బిక్చందానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. కాగా, ఇన్ఫో ఎడ్జ్‌కి చెందిన నౌకరి, 99 ఎకర్స్తో కలిపి మొత్తం 10 యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించిన విషయం తెలిసిందే. -
2500 యాప్స్ తొలగించిన గూగుల్ - నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
చాలీ చాలని జీతాలతో పనిచేసే చాలామంది ఉద్యోగులు అత్యవసర సమయంలో బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకోవడం.. లేకుంటే కొన్ని యాప్స్ నుంచి ఇన్స్టంట్ లోన్స్ తీసుకోవడం ఎక్కువైపోతోంది. బ్యాంకుల్లో లోన్ తీసుకునే వారి విషయం పక్కన పెడితే.. యాప్స్ ద్వారా లోన్స్ తీసుకున్న వారు ఏకంగా ప్రాణాలే తీసుకున్న సందర్భాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి వాటిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది, తాజాగా దీని గురించి కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' లోక్‌సభలో మాట్లాడారు. 2021 ఏప్రిల్ నుంచి 2022 జూలై మధ్య కాలంలో గూగుల్ సంస్థ తన ప్లే స్టోర్ నుంచి ఏకంగా 2500 మోసపూరిత లోన్ యాప్‌లను తొలగించినట్లు డిసెంబర్ 18న లోక్‌సభలో వెల్లడైన ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ప్రజలను మోసం చేస్తున్న యాప్‌ల మీద కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో వర్షానికి మొలిచిన పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఫ్రాడ్ లోన్ యాప్‌ల మీద కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిసి పనిచేస్తున్నట్లు కూడా కేంద్రమంత్రి వెల్లడించారు. ఫేక్ లోన్ యాప్స్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇలాంటి వాటిని నివారించడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే సరిపోతుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. జనం కూడా ఫ్రాడ్ లోన్ యాప్‌ల గురించి అవగాహన పెంచుకోవాలని, అలాంటప్పుడే మోసాల నుంచి బయటపడే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: 2024లో బంగారం డిమాండ్ మరింత పైపైకి - కారణం ఇదే అంటున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ మోసపూరిత రుణ యాప్‌లను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా, భారత ప్రభుత్వ చట్టపరమైన నియమాలను పాటిస్తున్న యాప్‌ల జాబితాను ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (Meity) గూగుల్‌తో భాగస్వామ్యం చేసింది. ఈ యాప్‌లన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వ నియమాలను లోబడి పనిచేయాల్సి ఉంటుంది. -
డేంజర్ యాప్స్.. మీ ఫోన్లో ఇప్పుడే తొలగించండి..
వినియోగదారుల సమాచార భద్రతకు ముప్పుగా పరిణమించిన పలు మొబైల్ యాప్‌లను గూగుల్ ఇటీవల తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది. సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈసెట్(ESET) ఈ ఏడాది గూగుల్ ప్లేస్టోర్‌లో 18 లోన్ యాప్‌లను స్పైలోన్ యాప్‌లుగా గుర్తించింది. కోట్లాది డౌన్లోడ్స్ ఉన్న ఈ లోన్‌యాప్‌లు వినియోగదారుల ఫోన్ల నుంచి వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఈ సమాచారాన్ని రుణగ్రహీతలను బ్లాక్మెయిల్ చేసి అధిక వడ్డీ రాబట్టడానికి దుర్వినియోగం చేస్తున్నాయి. ఇటువంటి యాప్‌లకు సంబంధించిన వివరాలను ఈసెట్ పరిశోధకులు తెలియజేశారు. ఈ యాప్‌లు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియాలోని వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈసెట్ గుర్తించిన 18 డేంజర్ యాప్‌లలో 17 యాప్‌లను గూగుల్ ఇప్పటికే తొలగించింది. ఒకటి మాత్రం ఇప్పటికీ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. అయితే ఇది యాక్టివ్ స్థితిలో లేదు. గూగుల్ ప్లేస్టోర్‌లో తొలగించిన ఈ యాప్‌ను ఇక్కడ ఇస్తున్నాం.. ఇవి మీ మొబైల్ ఫోన్లో ఉంటే ఇప్పుడే తొలగించండి.. డేంజర్ యాప్స్ ఇవే.. ఏఏ క్రెడిట్ (AA Kredit) అమోర్ క్యాష్ (Amor Cash) గేయబాక్యాష్ (GuayabaCash) ఈజీ క్రెడిట్ (EasyCredit) క్యాష్‌వావ్ (Cashwow) క్రెడిబస్ (CrediBus) ఫ్లాష్‌లోన్ (FlashLoan) ప్రెస్టమోస్క్రెడిటో (PréstamosCrédito) ప్రెస్టమోస్ డి క్రెడిట్-యుమికాష్ (Préstamos De Crédito-YumiCash) గో క్రెడిటో (Go Crédito) ఇన్స్టంటానియో ప్రెస్టమో (Instantáneo Préstamo) కార్టెరా గ్రాండే (Cartera grande) రాపిడో క్రెడిటో (Rápido Crédito) ఫైనప్ లెండింగ్ (Finupp Lending) ఫోర్‌ఎస్ క్యాష్ (4S Cash) ట్రూనైరా (TrueNaira) ఈజీ క్యాష్ (EasyCash) ఇది కూడా చదవండి: టెక్ ప్రపంచంలో సంచలనం.. ఈ యేటి మేటి సీఈవో ఈయనే.. -
షాకింగ్: 100కు పైగా డేంజరస్ యాప్స్, వెంటనే డిలీట్ చేయకపోతే
యాప్స్‌కు సంబంధించి యూజర్లకు మరో షాకింగ్న్యూస్. స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేసి భయంకర వైరస్‌లను ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా డేటాను కొట్టేస్తున్న కేటుగాళ్లపై తాజా పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది. తాజాగా గూగుల్ ప్లే స్టోర్‌లోని 100 కంటే ఎక్కువ యాప్‌లకు సోకిన అత్యంత ప్రమాదకరమైన మాల్వేర్ను పరిశోధకులు గుర్తించారు. గూగుల్ ప్లే స్టోర్ లోని 100 కంటే ఎక్కువ యాప్‌లకు సోకిన ‘స్పిన్ ఓకే’ అనే కొత్త స్పైవేర్‌ను ఇటీవల గుర్తించారు. పైగా ఈ యాప్స్ 400 మిలియన్లకు పైగా డౌన్లోడ్లు నమోదైనాయి, అంటే దాదాపు 40 కోట్ల మంది సైబర్ ముప్పులో పడిపోయినట్టే. రోజువారీ రివార్డ్‌లు, మినీ గేమ్‌లను ద్వారా ఈ ట్రోజన్ మాల్వేర్ నిజమైందిగా కనిపిస్తుందని, వినియోగదారులను ఆకర్షిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ విషయాన్ని గూగుల్‌కి తెలియజేసి. వాటిని తొలగించినప్పటికీ, ఇలాంటి డేంజరస్ యాప్స్‌పై అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తునారు. భవిష్యత్తులో ఇలాంటి యాప్‌లను గుర్తించి, డౌన్లోడ్ చేయొద్దని హెచ్చరించారు. (బుగట్టి రెసిడెన్షియల్ టవర్...నెక్ట్స్ లెవల్: దిమ్మదిరిగే ఫోటోలు) ప్రభావితమైన యాప్‌లు ఇవే నాయిజ్: వీడియో ఎడిటర్ విత్ మ్యూజిక్ జాప్యా: ఫైల్ బదిలీ, షేర్ వీఫ్లై: వీడియో ఎడిటర్&వీడియో మేకర్ ఎంవీ బిట్- ఎంవీ వీడియో స్టేటస్ మేకర్ బియూగో- వీడియో మేకర్&వీడియో ఎడిటర్ క్రేజీ డ్రాప్ క్యాష్‌జైన్ – క్యాష్ రివార్డ్ ఫిజ్జో నావల్ – ఆఫ్‌లైన్ రీడింగ్ క్యాష్ ఈఎం: రివార్డ్స్ టిక్: వాట్ టు ఎర్న్ మాల్వేర్ సోకిన యాప్‌లను ఎలా గుర్తించాలి ♦ యాప్ అనుమతులను చెక్ చేసుకోవాలి.యాక్సెస్ లేదా నెట్వర్క్ కనెక్టివిటీ వంటి వాటిని పరిశీలించాలి. ♦ నకిలీ ఆఫర్లు లేదా రివ్యూస్‌లో అధిక ప్రకటనలుంటే పట్ల జాగ్రత్తగా ఉండాలి. యూజర్ అభిప్రాయానికి, సపోర్ట్‌కు స్పందించే డెవలపర్ల విశ్వసనీయతను గమనించాలి. ♦ ఇన్‌స్టాల్‌ల-టు-రివ్యూల రేషియోను గమనించాలి. ఇన్‌స్టాల్‌ల-టు-రివ్యూల నిష్పత్తి ఎంత; ఎంతమంది యాప్‌ను ఇన్స్టాల్ చేసారనే దానితో పోలిస్తే ఎంతమంది రివ్యూ చేశారనేది చూడాలి. డౌన్లోడ్లకు మించి రివ్యూలుంటే అనుమానించాల్సిందే. ♦ యాప్ డెవలపర్‌ని ఇతర సోషల్‌మీడియా హాండిల్స్, చట్టబద్ధతను చూడాలి. (మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్) ♦ స్పెల్లింగ్ లేదా వ్యాకరణ లోపాలు, అస్పష్టమైన సమాచారం లేదా యాప్ ఫంక్షనాలిటీ వివరాల కొరత గురించి జాగ్రత్తగా గమనించాలి. ♦ పాస్వర్డ్లు లేదా క్రెడిట్ కార్డ్ వివరాల వంటి సున్నితమైన డేటాను అభ్యర్థించే యాప్‌ల జోలికి అసలు వెళ్ల వద్దు. ముఖ్యంగా యాప్‌లను డౌన్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త గా ఉండాలి. యాప్ అనుమానాస్పదంగా అనిపిస్తే, ఇన్స్టాల్ చేయకపోవడమే మంచిది. మరిన్ని బిజినెస్ వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి:సాక్షిబిజినెస్ -
డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్)–2023 నోటిఫికేషన్‌ను కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిత్తల్‌తో కలసి ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి గురువారం విడుదల చేశారు. ఇంటర్ ఉత్తీర్ణులైనవారు రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ నెల 16 నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. దీనికోసం ఈసారి కొత్తగా ఈౖ ఖీ అనే యాప్‌ను ప్రవేశపెట్టారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో దీన్ని డౌన్లోడ్ చేసుకుని దోస్త్‌కు దరఖాస్తులు చేసుకోవచ్చు. మొబైల్ ద్వారా కూడా దోస్త్ రిజిస్ట్రేషన్ ► ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈౖ ఖీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో రిజిస్ట్రేషన్ చేసేప్పుడు విద్యార్థి ఆధార్ నంబర్‌తో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ► మీ సేవ కేంద్రాల ద్వారా దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే అక్కడ బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ► టీయాప్ ఫోలియో ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి.. విద్యార్థి ఇంటర్ హాల్‌టికెట్, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేసుకోవాలి. టీఎస్‌బీఐఈలో లభించే విద్యార్థి ఫొటో, ప్రత్యక్షంగా దిగే ఫొటో సరిపోతే.. దోస్త్ ఐడీ సమాచారం వస్తుంది. ► రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులు రూ.200 రుసుమును ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. దోస్త్ ఐడీ, పిన్ నంబర్‌ను భద్రపర్చుకోవాలి. ► రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు మీసేవ నుంచి పొందిన పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1, 2022 తర్వాత తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని కూడా అప్లోడ్ చేయాలి. 86 వేల సీట్లు తగ్గాయ్.. ఈ ఏడాది డిగ్రీలో దాదాపు 86 వేల సీట్లు తగ్గించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. డిమాండ్ లేని కోర్సుల బదులు కొత్త కోర్సులు పెడతామంటే అనుమతులు ఇస్తామన్నారు. గత ఏడాది 4,73,214 డిగ్రీ సీట్లు ఉంటే, ఈ ఏడాది 3,86,544 అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. డిమాండ్ లేని సీట్లను గత ఏడాది కూడా తగ్గించినట్లు పేర్కొన్నారు. -
ఈ యాప్స్ వినియోగిస్తున్నారా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే..
మిలియన్ల మంది యూజర్లు వినియోగిస్తున్న 19 రకాల ప్రమాదకరమైన యాప్స్‌ను వెంటనే డిలీట్ చేయాలని సైబర్ టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేదంటే ఆ యాప్స్ మీ ఫోన్లలోని సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని సూచిస్తున్నారు. మాల్వేర్ ఫాక్స్ నివేదిక ప్రకారం.. గత పదేళ్లలో సైబర్ కేటుగాళ్లు ఆండ్రాయిడ్ ఫోన్లను ఆసరగా చేసుకొని పలు వైరస్ల సాయంతో యూజర్ల వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం నేరస్తులు హార్లీ ట్రోజన్, జోకర్ స్పైవేర్, ఆటోలైకోస్ మాల్వేర్లను ఉపయోగిస్తున్నారు. మాల్వేర్ను ఎలా పంపిస్తారు పైన పేర్కొన్న మాల్వేర్లను వినియోగదారులు సర్వసాధారణంగా వినియోగించే యాప్‌లలోకి వైరస్‌ను పంపిస్తారు. అనంతరం వారికి కావాల్సిన డేటాను కలెక్ట్ చేసుకొని డార్క్‌వెబ్‌లో అమ్ముకుంటున్నట్లు పేర్కొంది. ఇక మాల్వేర్ ఫాక్స్ నిర్ధారించిన 19 యాప్స్‌లలో ఇవి ఉన్నాయి. ఆ యాప్స్ మీ ఫోన్లలో ఉంటే డిలీట్ చేయాలని విడుదల చేసిన రిపోర్ట్‌లో నివేదించింది. హార్లీ ట్రోజన్ - ఫేర్ గేమ్ హబ్ అండ్ బాక్స్, హోప్ కెమెరా- పిక్చర్ రికార్డ్, సేమ్ లాంచర్, లైవ్ వాల్ పేపర్, అమేజింగ్ వాల్ పేపర్, కూల్ ఎమోజీ ఎడిటర్ అండ్ స్టైకర్ జోకర్ స్పైవేర్ - సింపుల్ నోట్ స్కానర్, యూనివర్సల్ పీడీఎఫ్ స్కానర్, ప్రైవేట్ మెసేంజర్, ప్రీమియం ఎస్ఎంఎస్, బ్లడ్ ప్రజర్ చకర్, కూల్ కీబోర్డ్, పెయింట్ ఆర్ట్, కలర్ మెసేజ్ ఆటోలీ కాస్ మాల్వేర్- వ్వాల్గ్ స్టార్ వీడియో ఎడిటర్, క్రియేటీవ్ 3డీ లాంచర్, వావ్ బ్యూటీ కెమెరా, జిఫ్ ఎమోజీ కీబోర్డ్, ఇన్స్టంట్ హార్ట్‌రేట్ ఎనీటైమ్ వంటి యాప్స్ ఉన్నాయి. వీటిని డౌన్లోడ్ చేసుకోవద్దని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చదవండి👉 అద్దె ఇంట్లో ఉంటే ఒరిగేదేమీ లేదు.. సొంతిల్లు ఇప్పుడే కొనేయండహో.. -
గూగుల్ సంచలనం! 3500 యాప్‌ల తొలగింపు..
చట్టబద్ధంగా లేని రుణ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) నుంచి తొలగించింది. 2022లో ఇలాంటివి ఏకంగా 3,500 యాప్‌లను గూగుల్ తొలగించినట్లు ప్లే ప్రొటెక్ట్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. గూగుల్ ప్లే స్టోర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ 2022లో భారతదేశంలో 3,500 కంటే ఎక్కువ లోన్ యాప్‌లపై గూగుల్ చర్య తీసుకుంది. అంటే ఆ యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఇదీ చదవండి: కొడుకు పెళ్లికి అంబానీ దంపతులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి కొత్త విషయం! భారత్‌లో వ్యక్తిగత రుణాలు, ఆర్థిక సేవల యాప్‌లకు సంబంధించి గూగుల్ తన విధానాన్ని 2021లో అప్డేట్ చేసింది. ఈ విధానం 2021 సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం.. వ్యక్తిగత రుణాలను అందించడానికి ఆర్బీఐ నుంచి లైసెన్స్ పొందినట్లు యాప్ డెవలపర్లు ధ్రువీకరించాలి. అలాగే లైసెన్స్ కాపీని సమర్పించాలి. ఒక వేళ వారికి ఈ లైసెన్స్ లేకపోతే లైసెన్స్ ఉన్న రుణదాతలకు ప్లాట్‌ఫామ్‌గా మాత్రమే తాము ఉన్నట్లు ధ్రువీకరించాలి. డెవలపర్ ఖాతా పేరు నమోదిత వ్యాపార పేరు ఒక్కటే అయి ఉండాలి. ఇదీ చదవండి: ఐఫోన్14 ప్లస్‌పై అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు! ఈ రుణ యాప్‌లకు గూగుల్ ప్లే స్టోర్ 2022లో మరిన్ని నిబంధనలు చేర్చింది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC), బ్యాంకులకు ఫెసిలిటేటర్లుగా వ్యక్తిగత రుణాలను అందించే యాప్ డెవలపర్లు మరికొన్ని వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ డెవలపర్లు వారి భాగస్వామి NBFC, బ్యాంకుల పేర్లను, వాటికి తాము అధీకృత ఏజెంట్లనే విషయం తెలియజేసే వెబ్సైట్ల లైవ్ లింక్‌ను యాప్ వివరణలో బహిర్గతం చేయాలి. కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా రుణ యాప్‌లకు సంబంధించి నిబంధనలను కఠినతరం చేసిన గూగుల్ ఉల్లంఘించిన యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. -
టెక్ దిగ్గజం గూగుల్‌కు మరో భారీ షాక్
-
వారం రోజుల వ్యవధిలో.. గూగుల్‌కు సీసీఐ రూ. 936.44 కోట్ల ఫైన్
వారం రోజుల వ్యవధిలోనే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. కమిషన్ ఆఫ్ కాంపిటీషన్ (సీసీఐ) రూ. 936.44 కోట్ల ఫైన్ విధించింది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌ల విభాగంలో గూగుల్ తన గుత్తాదిపత్యాన్ని గూగుల్‌కు సీసీఐ రూ.1,338 కోట్ల జరిమానా విధించింది. అనైతిక వ్యాపార కార్యకలాపాలు మానుకోవాలని హితువు పలికింది. ఆ జరిమానాపై గూగుల్ స్పందించింది. సీసీఐ తమపై విధించిన జరిమానా భారతీయ వినియోగదారులు, వ్యాపారానికి ఎదురు దెబ్బ అని గూగుల్ పేర్కొంది. సీసీఐ తీర్పును సమీక్షించి తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. తమ ఆండ్రాయిడ్ అనేక అవకాశాలు సృష్టించిందని గూగుల్ తెలిపింది. దాంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వేలాది వ్యాపారాలు విజయానికి మద్దతుగా నిలిచిందని పేర్కొంది. సీసీఐ నిర్ణయం భారత్‌లో మొబైల్ డివైజ్‌ల ధరలు పెరిగేందుకు దారి తీస్తుందని గూగుల్ అధికార ప్రతినిధి తెలిపారు. Case Nos. 07 of 2020, 14 of 2021 and 35 of 2021 CCI imposes a monetary penalty of ₹ 936.44 Crore on Google for anti-competitive practices in relation to its Play Store policies. Read the full order here: https://t.co/GDR820ffYg Press release: https://t.co/7HEPJeHVK3#Antitrust pic.twitter.com/TbTa6vbCXl — CCI (@CCI_India) October 25, 2022 ఈ తరుణంలో మరోమారు సీసీఐ..గూగుల్‌కు భారీ ఎత్తున ఫైన్ విధించడం చర్చాంశనీయంగా మారింది. మార్కెట్లో గూగుల్ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తూ ప్లేస్టోర్ పాలసీ నిబంధనల్ని తుంగలో తొక్కుతూ పేమెంట్ యాప్స్, అండ్ పేమెంట్ సిస్టంను ప్రమోట్ చేస్తుందని ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో గూగుల్‌కు పైన పేర్కొన్న భారీ మొత్తాన్ని ఫైన్ విధిస్తున్నట్లు తెలిపింది. చదవండి👉 ‘టిమ్‌కుక్’ను ట్రోల్ చేయాలనుకుంది, పాపం..అడ్డంగా దొరికిపోయిన గూగుల్? -
ఆ యాప్స్ ను అన్ ఇన్స్టాల్ చెయ్యకపోతే ..!
-
ఇదేం బాలేదు.. కొందరి కోసమే గూగుల్ పాలసీ: విన్జో
న్యూఢిల్లీ: ప్లేస్టోర్‌లో ఎంపిక చేసిన కొన్ని ఫ్యాంటసీ, రమ్మీ గేమింగ్ యాప్స్‌ను ప్రయోగాత్మకంగా అనుమతించాలన్న గూగుల్ నిర్ణయాన్ని దేశీ గేమింగ్ ప్లాట్‌ఫాం విన్జో తప్పు పట్టింది. ఇది పూర్తిగా పక్షపాతపూరితమైన, అనుచితమైన, ఆంక్షాపూర్వక విధానమని వ్యాఖ్యానించింది. ప్లాట్‌ఫాంను తటస్థంగా ఉంచుతూ ఒక మధ్యవర్తిగానే వ్యవహరిస్తామనే గూగుల్ ధోరణిపై అనుమానాలు రేకెత్తుతున్నాయని విన్జో పేర్కొంది. దశాబ్దకాలంపైగా గుత్తాధిపత్యం సాగిస్తున్న కొన్ని సంస్థలకే లబ్ధి చేకూర్చేలా గూగుల్ విధానం ఉందని తెలిపింది. ఇది పోటీని దెబ్బతీయడమే కాకుండా నవకల్పనలకు చావుదెబ్బలాంటిదని విన్జో వ్యాఖ్యానించింది. గతంలో ఫ్యాంటసీ గేమింగ్ యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించినప్పటికీ సెప్టెంబర్ 28 నుంచి ఎంపిక చేసిన కొన్నింటిని పైలట్ ప్రాజెక్ట్ ప్రాతిపదికన ఏడాది పాటు తిరిగి ప్రవేశపెట్టనున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే విన్జో అభ్యంతరాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చదవండి: అన్నింటికీ ఒక్కటే కేవైసీ -
ప్లేస్టోర్‌లో మళ్లీ ఫ్యాంటసీ గేమ్స్ యాప్స్
న్యూఢిల్లీ: వివాదాస్పద ఫ్యాంటసీ గేమింగ్, రమ్మీ గేమ్స్ యాప్స్‌ను గతంలో తమ ప్లేస్టోర్ నుంచి తొలగించిన గూగుల్ .. కొన్ని ఎంపిక చేసిన యాప్స్‌ను తిరిగి ప్రవేశపెట్టనుంది. ఏడాది పాటు పైలట్ ప్రాజెక్టు కింద వాటిని ప్రయోగాత్మకంగా పరీక్షించనుంది. 2022 సెప్టెంబర్ 28 నుంచి 2023 సెప్టెంబర్ 28 వరకూ పరిమిత కాలం పాటు భారత్‌లోని డెవలపర్లు రూపొందించిన డీఎఫ్ఎస్ (డైలీ ఫ్యాంటసీ స్పోర్ట్స్), రమ్మీ యాప్స్‌ను దేశీయంగా యూజర్లకు అందించేందుకు ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంచున్నట్లు గూగుల్ తెలిపింది. అయితే, ఎంపిక చేసిన కొన్నింటిని మాత్రమే ప్లేస్టోర్‌లో అనుమతించడమనేది పక్షపాత ధోరణి అని, ఆధిపత్య దుర్వినియోగమే అవుతుందని గేమింగ్ సంస్థ విన్జో వర్గాలు ఆరోపించాయి. మరోవైపు, ఈ పైలట్ ప్రోగ్రాం ద్వారా పరిస్థితులను అధ్యయనం చేసి, తగు విధమైన చర్యలు తీసుకోనున్నట్లు గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. యువ జనాభా, ఇంటర్నెట్ .. స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా గేమింగ్ పరిశ్రమ వృద్ధికి భారీగా అవకాశాలు ఉన్నాయని పేటీఎం ఫస్ట్ గేమ్స్ (పీఎఫ్‌జీ) అభిప్రాయపడింది. -
వార్నింగ్: షార్క్‌బాట్ వచ్చేసింది.. మీ స్మార్ట్ఫోన్లలో ఆ యాప్స్‌ని డెలీట్ చేయండి!
గత దశబ్ద కాలంగా టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. అయితే దీని వల్ల బోలెడు లాభాలు ఉన్నా అప్రమత్తంగా లేకపోతే నష్టాలు కూడా ఉంటాయని సైబర్ నిపుణులు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. తాజాగా గూగుల్ ప్లేస్టోర్‌లో మాల్వేర్ షార్క్‌బాట్ (SharkBot Malware) అనే వైరస్ ప్రత్యక్షమైనట్లు తెలుస్తోంది. ఇది యాంటీవైరస్, క్లీనర్ వంటి యాప్‌ల రూపంలో ఉంటుంది. ఇన్స్టాల్ చేస్తే ఇక అంతే.. అల్బెర్టో సెగురా అనే మాల్వేర్ విశ్లేషకుడు ఆండ్రాయిడ్ యూజర్లను అప్రమత్తం చేసేందుకు తన ట్విట్టర్లో ఈ డేంజరెస్ సాఫ్ట్వేర్ గురించి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో.. ప్రధానంగా ఇది మిస్టర్ ఫోన్ క్లీనర్( Mister Phone Cleaner), కైల్హావీ మొబైల్ సెక్యూరిటీ ( Kylhavy Mobile Security) యాప్‌ల రూపంలో దాగి ఉంటుంది. ముఖ్యంగా యూజర్ల బ్యాంకింగ్, క్రిప్టో సంబంధిత యాప్‌లను ప్రభావితం చేస్తుందన్నారు. అంతేకాకుండా అకౌంట్స్ నుంచి కుకీలను దొంగిలించగలదని చెప్పారు. ఈ మాల్వేర్ షార్క్‌బాట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత, డివైజ్‌లోని 'ఫింగర్‌ప్రింట్‌తో లాగిన్' ఫీచర్‌ని పని చేయకుండా చేస్తుంది. దీంతో యూజర్ తప్పకుండా తన యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీంతో యూజర్లు పాస్వర్డ్, యూజర్ డీటైల్స్‌ను ఎంటర్ చేయాల్సి వస్తుంది. షార్క్‌బాట్ టూ- ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను కూడా అధిగమించగలదు. చివరికి ఈ మాల్వేర్ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ టెక్నిక్ ఉపయోగించి యూజర్ అకౌంట్ నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం ప్రారంభిస్తుంది. కనుక ఆ రెండు యాప్‌లు డౌన్లోడ్ చేసేముందు జాగ్రత్త వహించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. గణాంకాల ప్రకారం, మిస్టర్ ఫోన్ క్లీనర్ యాప్‌ని ఇంతవరకు 50,000 పైగా డౌన్లోడ్ నమోదు కాగా, Kylhavy మొబైల్ సెక్యూరిటీ యాప్ భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ, ఈ యాప్ 10,000 కంటే ఎక్కువ డౌన్లోడ్లు ఉన్నట్లు తెలుస్తోంది. -
2 వేల లోన్ యాప్స్ తొలగింపు
న్యూఢిల్లీ: నిబంధనల ఉల్లంఘన, తప్పుదోవ పట్టించే సమాచారం ఇవ్వడం, వివాదాస్పద ఆఫ్‌లైన్ ధోరణులు తదితర అంశాల కారణంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ ఇండియా ప్లే స్టోర్ నుంచి 2,000 పైగా లోన్ యాప్స్‌ను తొలగించినట్లు టెక్ దిగ్గజం గూగుల్ సీనియర్ డైరెక్టర్ సైకత్ మిత్రా తెలిపారు. రుణాల యాప్‌ల సమస్య ఇప్పటికే తారా స్థాయికి చేరుకుందని, దీనిపై అంతా దృష్టి పెడుతున్న నేపథ్యంలో ఇది ఇకపై క్రమంగా తగ్గుముఖం పట్టొచ్చని మిత్రా వివరించారు. రాబోయే రోజుల్లో నిబంధనలను మరింత కఠినతరం చేసే అంశాన్ని కూడా సంస్థ పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. లోన్ యాప్‌ల సమస్య ఒకో మార్కెట్లో ఒకో రకంగా ఉంటోందని మిత్రా తెలిపారు. అమెరికాలో పోటీ సంస్థలను దెబ్బతీసే విధమైన యాప్‌ల సమస్య ఉండగా.. భారత్‌లో తప్పుదోవ పట్టించే, నిబంధనలను ఉల్లంఘించడం రూపంలో యాప్‌ల సమస్య ఉన్నట్లు పేర్కొన్నారు. తాము కార్యకలాపాలు సాగించే అన్ని దేశాల్లోనూ నియంత్రణ నిబంధనలను పాటించడానికి కట్టుబడి ఉన్నామని మిత్రా స్పష్టం చేశారు. సైబర్‌సెక్యూరిటీపై రోడ్‌షోలు.. ఆన్లైన్ భద్రతపై అవగాహన కల్పించే దిశగా భారత్‌లో వివిధ నగరాల్లో సైబర్‌సెక్యూరిటీ రోడ్‌షోలు నిర్వహించనున్నట్లు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా తెలిపారు. 1,00,000 మంది డెవలపర్లకు శిక్షణ కల్పించనున్నట్లు, అలాగే డిజిటల్ భద్రతను ప్రోత్సహించే దిశగా వివిధ సంస్థలకు గూగుల్‌డాట్‌ఆర్గ్ 2 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 16 కోట్లు) నిధులు గ్రాంట్‌గా అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కలెక్టివ్ గుడ్ ఫౌండేషన్, పాయింట్ ఆఫ్ వ్యూ, హెల్ప్‌ఏజ్ ఇండియా తదితర స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. సైబర్ ముప్పుల నుంచి డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పటిష్టమైన రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు గుప్తా వివరించారు. డిజిటల్ లావాదేవీలను సురక్షితంగా నిర్వహించే క్రమంలో మెరుగైన విధానాలు పాటించేలా ఇంటర్నెట్ యూజర్లను ప్రోత్సహించే అవగాహన కార్యక్రమాన్ని కూడా వివిధ భాషల్లో గూగుల్ ఆవిష్కరించింది. -
గూగుల్ కొత్త రూల్స్.. ఇక యాప్‌లు ఇన్స్టాల్ చేసేముందు అది తప్పనిసరి!
స్మార్ట్ ఫోన్లు వాడకం పెరిగినప్పటి నుంచి ప్రతీ సేవలు అరచేతిలోకి వచ్చాయనే చెప్పాలి. మనం ఆ సేవల కోసం ప్రత్యేకంగా సంబంధిత యాప్‌లను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అసలు చిక్కంతా ఇక్కడే వచ్చింది. యాప్ ఇన్స్టాల్ చేసుకునే సమయంలో దానికి అవసరమైన అనుమతులను ఇచ్చేస్తాం. ఇలా చేయడం వల్ల యూజర్లకు సంబంధించిన విలువైన సమాచారం సైబర్ నేరాగాళ్ల చేతిలోకి వెళ్తోందని వాదనలు ఇటీవల గట్టిగానే వినిపిస్తున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. యాప్ డెవలపర్స్‌కు డేటా సేఫ్టీ పేరుతో కొత్త నిబంధన తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్ల డేటా భద్రతకు భరోసా కల్పించనుంది. యాప్ డెవలపర్లకు ఇది చేయాల్సిందే.. కొత్తగా విధించిన నిబంధనల ప్రకారం.. యూజర్లు యాప్‌లను ఇన్స్టాల్ చేసే సమయంలో యాప్ డెవలపర్ ఎలాంటి డేటా సేకరిస్తున్నారు, దాన్ని ఎవరితోనైనా పంచుకుంటున్నారా? అనే సమాచారాన్ని తప్పకుండా తెలియజేయాల్సి ఉంటుంది. అలా డెవలపర్ అందించిన సమాచారాన్ని గూగుల్ చెక్ చేసి నిబంధనలు పాటించిన యాప్‌లను తీసుకుని వాటిని యూజర్‌కు తెలిసేలా ప్లేస్టోర్‌లో ఉంచుతుంది. ఒకవేళ యాప్ డెవలపర్ యూజర్ డేటా విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏ కార్యకలపాలు జరిపినా తక్షణమే వారిపై చర్యలు తీసుకుంటుంది. అందుకు జూలై 20 నాటికి ప్రతి యాప్ డెవలపర్ డేటా సేఫ్టీ డ్యాకుమెంట్ని సమర్పించాలని గూగుల్ స్పష్టం చేసింది. ఒకవేళ డేటా సేఫ్టీ నిబంధనలను పాటించని యాప్‌లను ప్లేస్టోర్ నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. చదవండి: Reliance Jio: ట్రాయ్ రిపోర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో రిలయన్స్ జియో ధన్ ధనా ధన్! -
యాపిల్ ఐఫోన్ వినియోగదారులకు అలెర్ట్!
యాపిల్ ఐఫోన్ వినియోగదారులకు అలెర్ట్. ఐఫోన్లపై దాడి చేస్తున్న ప్రమాదకరమైన ఐఫోన్ యాప్స్‌ను యాపిల్ బ్లాక్ చేసింది. అంతేకాదు ఐఫోన్లపై దాడులు చేసేందుకు ఎలాంటి మాల్వేర్ను తయారు చేశారు. ఎవరు తయారు చేశారనే విషయాలు సైతం వెలుగులోకి వచ్చాయి. గూగుల్‌కు చెందిన 'థ్రెట్ అనాలిసిస్ గ్రూప్' (టీఏజీ ) హ్యాకింగ్, దాడుల్ని గుర్తిస్తుంది. తాజాగా విడుదలైన ఓ నివేదిక ప్రకారం..ఇటాలియన్ సాఫ్ట్ వేర్ సంస్థ ఆర్సీఎస్ తయారు చేసిన 'హెర్మిట్' అనే స్పైవేర్ ఐఫోన్లపై దాడి చేసి..ఆఫోన్ పనితీరు ఆగిపోయేలా చేస్తుంది.ఈ స్పైవేర్ మీ ఫోన్లో ఎంటర్ అయ్యిందంటే చాలు హ్యాక్ చేయడం,ఆడియోను రికార్డ్ చేయడం, అనధికారిక కాల్స్ లిఫ్ట్ చేయడం, ఈమెయిల్‌లు చెక్ చేయడం, మెసేజెస్ చదవడం, మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేశారో తెలుసుకోవడం, కెమెరాను హ్యాక్ చేస్తున్నట్లు ట్యాగ్ గ్రూప్ గుర్తించింది. అంతేకాదు విచిత్రంగా ఐఫోన్లలోకి ఎంటర్ అయ్యే ఈ వైరస్ గూగుల్ ప్లేస్టోర్ నుంచి కానీ యాపిల్ స్టోర్ నుంచి సాధ్యపడదని సదరు రిపోర్ట్‌లో పేర్కొంది. సైడ్ లోడింగ్ ద్వారా ఐఫోన్లలోకి ఎంటర్ అవుతున్నట్లు నివేదిక నిర్ధారించింది. సైడ్‌లోడింగ్ అంటే యూఎస్బీ, బ్లూటూత్, వైఫై లాంటి ఇతర పద్ధతుల ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు బదిలీ చేసే సామర్ధ్యం ఉన్న మీడియా ఫైల్స్ ద్వారా ఫోన్లపై అటాక్ చేస్తున్నట్లు తేలింది. ఈ సందర్భంగా యాపిల్ సంస్థ ఐఫోన్ వినియోగదారుల్ని హెచ్చరించింది. డేటా షేరింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. -
డబ్బులెవరికి ఊరికే రావు సార్, సుందర్ పిచాయ్‌పై పోలీసులకు ఫిర్యాదు!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌కు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లతో పాటు, సీఈవో సుందర్ పిచాయ్ వ్యవహారం పోలీస్టేషన్ వరకు చేరింది. యాప్ బిల్లింగ్ సిస్టమ్‌లో డొమొస్టిక్ యాప్ డెవలపర్ల నుంచి భారీ ఎత్తున కమిషన్లను వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ వినియోగదారుల సంఘం సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొరియా టైమ్స్ కథనం ప్రకారం..సిటిజన్ యునైటెడ్ ఫర్ కన్జ్యూమర్ సోవర్జినిటీ (సీయూసీఎస్) సభ్యులు సుందర్ పిచాయ్, గూగుల్ కొరియా సీఈవో నాన్సీ మాబెల్ వాకర్, గూగుల్ ఏసియా పసిపిక్ ప్రెసిడెంట్ స్కాట్ బ్యూమాంట్లపై సౌత్ కొరియా సియో నగరంలోని గంగ్నమ్ జిల్లా పోలిసుల్ని ఆశ్రయించారు. గూగుల్ టాప్ ఎగ్జిక్యూటీవ్‌లు దేశ టెలికమ్యూనికేషన్ బిజినెస్ యాక్ట్ నిబంధనల్ని ఉల్లంఘించారంటూ పోలీసులకు సీయూసీఎస్ సభ్యులు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గూగుల్ యాప్ పేమెంట్ పాలసీ పెంచుతున్న కమిషన్ల కారణంగా వినియోగదారులకు భారంగా, క్రియేటర్లకు నష్టం వాటిల్లేలా ఉందంటూ కన్జ్యూమర్ గ్రూప్ అధికార ప్రతినిధి తెలిపారు. "యాప్ డెవలపర్లకు ప్రత్యామ్నాయం లేదు. తప్పని సరిగా గూగుల్ సంస్థ చెప్పినట్లే వినాలి. ఎందుకంటే యాప్‌స్టోర్ మార్కెట్ షేర్ గూగుల్‌కు 74.6 శాతంగా ఉందని" అన్నారు. వివాదం ఏంటంటే సంస్థకు సంబంధించిన డిజిటల్ ప్రొడక్ట్‌లు సేల్ చేయాలన్నా,సంబంధిత యాప్స్ సర్వీస్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి అందించాలన్నా గూగుల్‌కు 15శాతం నుంచి 30 వరకు కమిషన్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ కమిషన్ ఎక్కువగా ఉండడంతో యాప్ డెవలపర్లు 15 శాతం నుంచి 20శాతం మాత్రమే కమిషన్ చెల్లించి థర్డ్ పార్టీ పేమెంట్ సర్వీస్ సంస్థల ద్వారా గూగుల్‌కు పేమెంట్ చేసేవారు. దీంతో యజమానులకు గూగుల్‌కు పెద్దమొత్తంలో చెల్లించే కమిషన్ల భారం తగ్గిపోయింది. యాప్స్‌ను బ్లాక్ చేస్తాం అదే సమయంలో యాప్ డెవలపర్ల నుంచి వచ్చే కమిషన్ పడిపోవడంతో గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై యాప్ డెవలపర్లు థర్డ్ పార్టీ పేమెంట్ సర్వీస్ సంస్థల నుంచి చెల్లింపులు జరపకూడదని హెచ్చరించింది. అలా చేస్తే సదరు యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి బ్లాక్ చేస్తామని తెలిపింది. పనిలో పనిగా గూగుల్‌కు లింకైన థర్డ్ పార్టీ పేమెంట్ సర్వీస్‌లను నిలిపివేసింది. దీంతో వినియోగదారుల సంఘం సభ్యులు గూగుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ తీరు మారలేదు! ఈ ఏడాది మార్చి నెలలో గూగుల్ తీరుతో సౌత్ కొరియా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. యాప్ డెవలపర్లు వారి ఇష్ట ప్రకారమే చెల్లింపులు చేసుకోవచ్చని, ఆ విషయంలో గూగుల్ ఒత్తిడి చేయకూడదని సవరించిన బిల్లుపై కేబినెట్ ఆమోదం తెలిపింది.అయినా సౌత్ కొరియా కేబినెట్ తెచ్చిన ప్రతిపాదనల్ని తిరస్కరించింది. ఏప్రిల్ 1 నుంచి డెవలపర్లను తమ బిల్లింగ్ పేమెంట్ సిస్టమ్‌ను ఉపయోగించాలని సూచించింది. లేని పక్షంలో యాప్స్‌లను ప్లేస్టోర్ నుంచి తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చింది. గూగుల్ తాజా నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ యునైటెడ్ ఫర్ కన్జ్యూమర్ సోవర్జినిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి👉సీఈఓ సుందర్ పిచాయ్‌కు గూగుల్ భారీ షాక్! -
గూగుల్ హెచ్చరిక..! యాప్స్‌ను అప్డేట్ చేయండి..లేకపోతే!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్.. యాప్స్ యజమానులకు హెచ్చరికలు జారీ చేసింది. ప్లేస్టోర్‌లో ఉన్న యాప్స్‌ను అప్డేట్ చేయాలని, లేదంటే వాటిని తొలగిస్తామని తెలిపింది. అయితే గూగుల్ హెచ్చరించిన యాప్స్ డెవలపర్లు పట్టించుకోకపోవడంతో సుమారు ప్లే స్టోర్‌లో ఉన్న సుమారు 9లక్షల యాప్స్‌ను తొలగించేందుకు సిద్ధమైంది. గూగుల్ ప్లేస్టోర్‌లో దాదాపు 8.69లక్షల ఆండ్రాయిడ్, యాపిల్ యాప్ స్టోర్‌లో సుమారు 6.50లక్షల ఐఓఎస్ యాప్స్ ను తొలగించేందుకు ఆ రెండు సంస్థలు సిద్ధమయ్యాయి. రెండేళ్ల నుంచి అప్డేట్ కానీ యాప్స్‌ను అప్డేట్ చేయాలని వాటి డెవలపర్లకు గూగుల్, యాపిల్ వార్నింగ్ ఇచ్చాయి. విధించిన గడువులోపే యాప్స్‌ను అప్డేట్ చేయాలని గూగుల్‌తో పాటు యాపిల్ సైతం హెచ్చరించాయి. అయినా డెవలపర్లు పట్టించుకోకపోవడంతో వాటిని డిలీట్ చేయనున్నాయి. -
Google Play Store: స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు షాక్!
సాక్షి, హైదరాబాద్: ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు బిగ్ షాక్ తగలనుంది. యాప్స్ విషయంలో గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో కాల్ రికార్డింగ్ యాప్స్‌ను తొలగించనున్నట్టు పేర్కొంది. యాజర్ల ప్రైవసీని దెబ్బతీస్తున్నాయన్న కారణంతో థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్ అన్నింటినీ నిలిపేయాలని గూగుల్ నిర్ణయించింది. మే 11 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, మీ ఫోన్లో వాయిస్ కాల్ మాట్లాడుతున్నప్పుడు, ఆన్లైన్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటున్నప్పుడు ఆ కాల్స్‌ను రికార్డ్ చేయడం ఇక కుదరకపోవచ్చు. గూగుల్ డయలర్ లేదా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ డిఫాల్ట్‌గా ఇచ్చే డయలర్ ద్వారా మాత్రమే ఇకపై కాల్ రికార్డింగ్ ఫీచర్ అందుబాటులో ఉండనుంది. కాగా, గూగుల్ డయలర్ ద్వారా ఎవరైనా ఈ ఫీచర్ ఉపయోగిస్తుంటే అవతలి వ్యక్తికి కూడా ఈ కాల్ రికార్డు చేస్తున్నారనే అలర్ట్ వస్తుంది. ఇదిలా ఉండగా.. కాల్ రికార్డింగ్‌కు గగుల్ ఎప్పుడూ వ్యతిరేక స్వరాన్నే వినిపించింది. అవతలి వ్యక్తికి తెలియకుండా ఫోన్లో వారి వాయిస్‌ను రికార్డ్ చేయడం ద్వారా యూజర్ల ప్రైవసీకి భంగం కలుగుతుందన్నది గూగుల్ ఇప్పటికే చాలా సందర్బాల్లో పేర్కొంది. అందులో భాగంగానే కాల్ రికార్డింగ్ యాప్స్‌ను తొలగించేందుకు సిద్ధమైంది. -
హెచ్చరిక..! మీ స్మార్ట్‌ఫోన్ నుంచి ఈ యాప్స్‌ను వెంటనే డిలీట్ చేయండి..లేకపోతే..!
సైబర్ నేరస్తులు కొత్త పుంతలను తొక్కుతూ..ఏకంగా గూగుల్ ప్లే స్టోర్‌లోకి నకిలీ యాప్స్‌ను రిలీజ్ చేస్తున్నారు. గూగుల్ నిర్వహించే అనేక భద్రతా తనిఖీలను కూడా తప్పించుకొని ప్లే స్టోర్స్‌లో యాప్స్‌ను కన్చించేలా హ్యకర్లు చేస్తున్నారు. కాగా తాజాగా గూగుల్ ప్లే స్టోర్‌లోని పలు యాప్స్ యూజర్లకు హాని కల్గించే 10 యాప్స్‌ను గూగుల్ గుర్తించింది. ఇప్పటికే పలు యూజర్లు ఈ యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకున్నట్లు గూగుల్ తెలిపింది. యూజర్ల డేటాను..! గూగుల్ బ్యాన్ చేసిన 10 పాపులర్ యాప్స్ యూజర్ డేటాను దొంగిలిస్తున్నాయని తెలిసింది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం... నిషేధిత యాప్‌లు ఇప్పటివరకు 60 మిలియన్లకు పైగా డౌన్లోడ్ అయిన్నట్లు తెలుస్తోంది. ఈ యాప్స్ సహాయంతో హ్యాకర్లు యూజర్ల కచ్చితమైన లొకేషన్‌ను తెలుసుకోవచ్చునని కూడా నివేదిక పేర్కొంది. దాంతో పాటుగా ఈ యాప్‌లను ఉపయోగించి ఈ-మెయిల్స్, ఫోన్ నంబర్లు, పాస్‌వర్డ్‌లను హ్యకర్లు దొంగిలిస్తున్నట్లు తెలిసింది. దీంతో యూజర్ల బ్యాంకు వివరాల గురించి తెలుసుకోవడం సులువు కానుంది. 'కట్ అండ్ పేస్ట్' పద్ధతి ద్వారా డేటా చౌర్యం జరుగుతున్నట్లు తెలిసింది. అంతేకాకుండా సదరు యూజరు ఏదైనా OTP లేదా ఇతర వివరాలను కాపీ-పేస్ట్ చేసినప్పుడు, హ్యాకర్లు ఈ యాప్‌ల నుంచి యూజర్లకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను దొంగిలించవచ్చునని తెలిసింది. అదనంగా హ్యకర్లు ఈ యాప్స్ సహాయంతో యూజర్ల వాట్సాప్‌ను కూడా యాక్సెస్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి గూగుల్ నిషేధించిన 10 యాప్స్ ఇవే..! 1. స్పీడ్ రాడార్ కెమెరా 2. AI-Moazin లైట్ (ప్రార్థన సమయాలు) 3. Wi-Fi మౌస్ (రిమోట్ కంట్రోల్ PC) 4. QR & బార్కోడ్ స్కానర్ (AppSource Hub ద్వారా అభివృద్ధి చేయబడింది) 5. Qibla కంపాస్ - రంజాన్ 2022 6. సింపుల్ వెదర్ & క్లాక్ విడ్జెట్ (డిఫర్ సంస్థ డెవలప్ చేసింది) 7. హ్యాండ్సెంట్ నెక్స్ట్ SMS- టెక్స్ట్ విత్ ఎంఎంఎస్ 8. స్మార్ట్ కిట్ 360 9. ఫుల్ ఖురాన్ MP3-50 లాంగ్వేజ్స్ & ట్రాన్స్లేషన్ ఆడియో 10. Audiosdroid ఆడియో స్టూడియో DAW చదవండి: తక్కువ ధరలో...108ఎంపీ కెమెరాతో సూపర్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన రియల్మీ..! -
భారతీయులు ఈ గేమ్‌ను తెగ ఆడేస్తున్నారు
భారత డెవలపర్లు రూపొందిస్తున్న యాప్స్, గేమ్స్‌ను వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గూగుల్ ప్లే యాప్ స్టోర్‌లో 2019తో పోలిస్తే 2021లో ఏకంగా 200 శాతం పెరిగింది. దీనితో వాటిపై ఇన్వెస్టర్లు కూడా అసాధారణ స్థాయిలో ఆసక్తి కనపరుస్తున్నారని గూగుల్ ప్లే పార్ట్నర్షిప్స్ వైస్–ప్రెసిడెంట్ పూర్ణిమా కొచికర్ తెలిపారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ (మెయిటీ)స్టార్టప్ హబ్‌తో కలిసి గూగుల్ .. యాప్‌స్కేల్ అకాడమీ క్లాస్ 2022ని ఆవిష్కరించిన సందర్భంగా ఆమె ఈ విషయాలు వివరించారు. లూడో కింగ్ జాతీయ, అంతర్జాతీయంగా అత్యధికంగా ఆడుతున్న గేమ్స్‌లో ఒకటిగా మారిందని పూర్ణిమ చెప్పారు. భారత కంపెనీలు రూపొందించిన యాప్స్, గేమ్స్‌ను ఇతర దేశాల్లో ఉపయోగిస్తున్న వారి సంఖ్య 2021లో 150 శాతం పెరిగిందని ఆమె పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలు కేవలం పెద్ద నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి కూడా వస్తున్నాయని పూర్ణిమ తెలిపారు. యాప్‌స్కేల్ అకాడమీ ప్రోగ్రాం కోసం 400 దరఖాస్తులు రాగా .. విద్య, వైద్యం తదితర రంగాలకు చెందిన 100 స్టార్టప్‌లు ఎంపికయ్యాయి. వీటికి యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్, వ్యాపార మోడల్, ఆదాయ వ్యూహాలు మొదలైన వాటిలో ఆరు నెలల పాటు శిక్షణ లభిస్తుంది. కొన్ని ఎంపిక చేసిన అంకుర సంస్థలకు .. ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్టులను కలిసే అవకాశం దక్కుతుంది. చదవండి: ఐఫోన్ ధర మరి ఇంత తక్కువా!! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి!! -
అమ్మో.. చైనా యాప్‌లు.. పేర్లు మార్చుకుని ఏకంగా 57 శాతం!
సాక్షి, అమరావతి: ‘చైనా దుకాణంలో దూరిన ఎద్దు..’ అనేది ఓ సామెత. అంటే పింగాణి సామగ్రి దుకాణంలో ఎద్దు దూరితే అది లోపలున్నా.. బయటకొచ్చినా.. దుకాణానికి నష్టమే. ఇక తాజాగా మన మొబైల్ ఫోన్లో చైనా యాప్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకునే కొన్ని చైనా యాప్‌లు చాపకింద నీరులా మన వ్యక్తిగత సమాచారాన్ని దేశ సరిహద్దులు దాటిస్తున్నాయి. దీన్ని గుర్తించిన కేంద్రం అటువంటి చైనా యాప్‌లను నిషేధిస్తున్నప్పటికీ పేర్లు మార్చుకుని మరీ చలామణిలోకి వచ్చేస్తున్నాయి. చైనా యాప్‌లు 57 శాతానికిపైగా అదనపు సమాచారాన్ని సేకరించి ఇతరులకు చేరవేస్తున్నాయని పుణెకు చెందిన ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఆర్కా కన్సల్టెన్సీ జనవరిలో చేసిన అధ్యయనంలో వెల్లడైంది. సరిహద్దులు దాటుతున్న సమాచారం మొబైల్ యాప్ సంస్థలు అవసరానికి మించి వినియోగదారుల సమాచారాన్ని కోరుతున్నాయి. వినియోగదారులకు తగిన అవగాహన లేకపోవడంతో యాప్‌లు డౌన్లోడ్ చేసుకునే తొందర్లో ఆ సమాచారాన్ని ఫీడ్ చేస్తున్నారు. ప్రధానంగా కాంటాక్ట్ నంబర్లు, కెమెరా, మైక్రోఫోన్, సెన్సార్లు, లొకేషన్, టెక్టŠస్ మెస్సేజ్‌లు మొదలైన అంశాలతో అనుసంధానించమని అడుగుతున్నాయి. ఆ విధంగా యాప్ కంపెనీలు 57 శాతానికిపైగా అవసరం లేని సమాచారాన్ని కూడా సేకరిస్తున్నాయి. 90 శాతానికిపైగా యాప్‌లు అవసరం లేనప్పటికీ కెమెరా యాక్సెస్ కోరుతున్నాయి. వాటిలో వినోద, విద్య, ఇ–కామర్స్, న్యూస్, గేమింగ్ తదితర యాప్‌లున్నాయి. ఆ సమాచారాన్ని యాప్ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా అమెరికా, సింగపూర్‌లతోపాటు గుర్తుతెలియని దేశాల్లోని సంస్థలకు విక్రయిస్తున్నాయి. ఆయా దేశాల్లోని సంస్థలు ఆ సమాచారాన్ని ఎందుకోసం కొనుగోలు చేస్తున్నాయన్న దానిపై స్పష్టత లేదు. మార్కెట్ రీసెర్చ్ కోసం అంటూ ఈ సమాచారాన్ని సేకరిస్తున్నాయని చెబుతున్నాయి. ఇతరత్రా అవసరాలకు మళ్లిస్తున్నారా అన్నదానిపై సందేహాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అలీబాబా వంటి ప్రముఖ సంస్థ యాప్‌లను భారత్‌లో ఏకంగా 43 కోట్లమంది వరకు డౌన్లోడ్ చేసుకోవడం గమనార్హం. అంటే ఏ స్థాయిలో భారతీయుల సమాచారాన్ని ఆ సంస్థ సేకరించిందో తెలుస్తోంది. వ్యక్తిగత సమాచారం అవాంఛనీయ వ్యక్తుల చేతుల్లోకి వెళుతుండటం సైబర్ నేరాలకు కూడా కారణమవుతోందని ఆర్కా కన్సల్టెన్సీ గుర్తించింది. డిజిటల్ పేమెంట్ల వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని క్రోడీకరించి సైబర్ నేరగాళ్లు భారీ మోసాలకు పాల్పడేందుకు అవకాశం ఏర్పడుతోందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు, హ్యాకింగ్లు పెరగడం దీనికి తార్కాణమని కూడా గుర్తుచేస్తున్నారు. పేరు మార్పుతో మళ్లీ.. కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా చైనా యాప్‌లను నిషేధిస్తోంది. 2020 నుంచి 278 చైనా యాప్‌లను నిషేధించింది. వాటిలో టిక్‌టాక్, షేర్ ఇట్, వుయ్‌చాట్, లైకీ, బిగ్ లివ్, అలీ ఎక్స్‌ప్రెస్, అలీపే క్యాషియర్ మొదలైనవి ఉన్నాయి. భారత్‌లో ఆ యాప్‌లను బ్యాన్ చేయాలని గూగుల్ ప్లే స్టోర్‌ను కేంద్రం ఆదేశించింది కూడా. కానీ ఆ యాప్‌లు పేర్లు మార్చుకుని మళ్లీ దేశంలో అందుబాటులోకి రావడం విస్మయం కలిగిస్తోంది. వాటిలో ప్రముఖ కంపెనీలు అలీబాబా, టెన్సెంట్, నెట్ఈజ్ వంటి ప్రముఖ సంస్థలకు చెందినవి కూడా ఉండటం గమనార్హం. దీనిపై వివరాల కోసం ఈ–మెయిల్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ సంస్థలు స్పందించలేదని ఆర్కా కన్సల్టెన్సీ పేర్కొంది. అప్రమత్తతే పరిష్కారం యాప్‌లు డౌన్లోడ్ చేసుకునే ముందు అప్రమత్తంగా ఉండాలి. మనకు అవసరమైనమేరకే యాప్‌లు డౌన్లోడ్ చేసుకోవాలి. అందుకు ముందు ఆ కంపెనీలు అడిగే సమాచారాన్ని పూర్తిగా చదవాలి. సమాచారం పెద్దగా ఉంది కదా అని చదవకుండా యాక్సెస్ ఇవ్వొద్దు. అవసరమైనంత వరకే సమాచారం ఇవ్వండి. యాప్‌లు ప్రతి వారం, పదిరోజులకు ఒకసారి అప్డేట్ అడుగుతుంటాయి. అప్పుడు కూడా ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని ఓకే చేయండి. ఇక బ్యాంకు ఖాతాలు, ఇతర ఆర్ధిక వ్యవహారాల అంశాలపై మరింత జాగ్రత్తగా ఉండాలి. తమ వ్యక్తిగత సమాచారం లీకైందని భావించినా, తాము సైబర్ నేరాల బారిన పడ్డామని తెలిసినా వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. – రాధిక, ఎస్పీ, సైబర్ క్రైం -
10కోట్ల స్మార్ట్ ఫోన్లే టార్గెట్! ట్రూకాలర్ కీలక నిర్ణయం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ట్రూకాలర్ యాప్ సైతం ప్రీలోడ్ కానుంది. ఇప్పటి వరకు కస్టమర్లు ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చేది. భారత్, ఇండోనేషియా, మలేషియా, లాటిన్ అమెరికా దేశాల్లో కొత్తగా విడుదలయ్యే ఫోన్లలో ఈ సౌకర్యం ఉంటుందని కంపెనీ సోమవారం ప్రకటించింది. రెండేళ్లలో 10 కోట్ల స్మార్ట్ఫోన్లలో ట్రూకాలర్ ప్రీలోడెడ్ యాప్‌గా ఉండాలన్నది లక్ష్యమని వివరించింది. ఇందుకోసం మొబైల్స్ తయారీలో ఉన్న ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. భారత్‌లో ప్రస్తుతం 22 కోట్ల మంది ట్రూకాలర్ వాడుతున్నారు.