Gorantla Butchaiah Chowdary
-
బుచ్చయ్యకు ఈసారైనా దక్కేనా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వెలువడ్డాయి. టీడీపీ అధికారం చేజిక్కించుకుంది. ఇప్పుడు ఆ పార్టీలో అందరి కళ్లూ కేబినెట్ కూర్పుపైనే ఉన్నాయి. మంత్రివర్గం ఎలా ఉండబోతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాతిపదికన తీసుకుంటారా, సామాజిక సమతూకాల మాటేమిటి, కూటమిలో క్రియాశీలకమైన జనసేనకు లభించే ప్రాతినిధ్యం ఎంతవరకూ ఉంటుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చర్చ అంతా ఈ అంశాలపైనే జరుగుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని స్థానాల్లోనూ టీడీపీ, జనసేన అభ్యర్థులు గెలుపొందడంతో మంత్రివర్గంపై ఆశలు పెంచుకున్న వారి జాబితా చాంతాడులా మారుతోంది. పార్టీ సీనియర్లు ఈసారి కేబినెట్లో బెర్త్ ఖాయం చేసుకోవాలని లాబీయింగ్ చేయడంలో బిజీబిజీగా గడుపుతున్నారు. మంత్రివర్గంలో బెర్త్ కోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సీనియర్లంతా రేసులో ఉన్నారు. పార్టీలో నంబర్ టుగా పేర్కొనే యనమల రామకృష్ణుడు సహా నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జ్యోతుల నెహ్రూ, బండారు సత్యానందరావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. స్పీకర్, ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల ప్రత్యక్ష రాజకీయాలకు దూరమై మండలిలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయన కుమార్తె దివ్య తుని నుంచి ఎన్నికయ్యారు. మండలి నుంచి మంత్రివర్గంలోకి యనమలకు బెర్త్ దక్కితే సరేసరి లేదంటే కుమార్తె దివ్య రేసులో ఉండటం ఖాయమంటున్నారు. గత చంద్రబాబు కేబినెట్లో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిగా చేసిన పెద్దాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యాన్ని కోరుకుంటున్నారు. వివాదరహితుడనే పేరున్న చినరాజప్ప రెండో సారి ప్రయత్నాల్లో ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా మెట్ట ప్రాంత రాజకీయాల్లో చక్రం తిప్పిన జ్యోతుల నెహ్రూ ఈసారి బెర్త్ ఖాయం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. మంత్రి అనిపించుకోవాలనే ఆత్రం ఎవరికి మాత్రం ఉండదని నెహ్రూ సన్నిహితులు చెబుతున్నారు. పార్టీ కాకినాడ జిల్లా అద్యక్షుడు నవీన్ ఇప్పటికే లోకేష్‌ను కలిసి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.బుచ్చయ్యకు ఈసారైనా దక్కేనా?రాజమహేంద్రవరం రూరల్ నుంచి గెలుపొందిన సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేరు కూడా కేబినెట్ రేసులో ప్రచారంలోకొచ్చింది. ఉమ్మడి తూర్పు గోదావరిలో అందరి కంటే సీనియర్ అయిన తనకు బెర్త్ ఖాయమనే ధీమాతో బుచ్చయ్యచౌదరి ఉన్నారు. దివంగత ఎన్టీఆర్ హయాంలోనే పౌర సరఫరాలు వంటి కీలక శాఖలు చేసిన తమ నేతకు ఈసారి మంత్రివర్గంలో చోటు కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నామని అనుచరులు బాహాటంగానే చెబుతున్నారు. బుచ్చయ్యకు పోటీగా సిటీ ఎమ్మెల్యేగా ఎన్నిక అయిన ఆదిరెడ్డి వాసు కూడా రేసులో ఉన్నారు. ఆది నుంచీ సిటీ సీటు విషయంలో గోరంట్ల...ఆదిరెడ్డి వర్గాల మధ్య వైషమ్యాలు ఉన్న విషయం బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో వాసు కోటరీ లోకేష్ ద్వారా బెర్త్ కోసం పావులు కదుపుతున్నారు. ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, చిన్న మావ అయిన అచ్చెన్నాయుడుతో చంద్రబాబుకు సిఫార్సు చేయించుకుంటున్నారు అని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీరితోపాటు కొత్తపేట నుంచి బండారు సత్యానందరావు, ఎస్సీ, బీసీ కోటాలో అమలాపురం అయితాబత్తుల ఆనందరావు, కాకినాడ నుంచి వనమాడి కొండబాబు అమాత్య పదవి కోసం పావులు కదుపుతున్నారు.యనమల హవా నడుస్తుందా?మంత్రివర్గం కూర్పులో సామాజికవర్గాల సమతూకమే ప్రామాణికంగా ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు కాపు, బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల నుంచి మూడు బెర్త్‌లు ఖాయం కావచ్చనే ప్రచారం టీడీపీలో జరుగుతోంది. అదే నిజమైతే సీనియర్ల మధ్యనే పోటీ ప్రధానంగా ఉంటుందని నేతలు విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి జిల్లా టీడీపీ రాజకీయాల్లో ఆది నుంచి యనమల, జ్యోతుల వర్గాలకు పొసగని పరిస్థితి. ఆది నుంచీ జ్యోతుల మంత్రి పదవికి మోకాలడ్డుతున్నది యనమల వర్గమేనని ఆయన సన్నిహితులు పేర్కొంటుంటారు. ఈసారి ఏమి జరుగుతుందో చూడాలంటున్నారు. గతంలో మాదిరి కేబినెట్ కూర్పులో యనమల హవా నడుస్తుందా లేదా మారిన సమీకరణలు ఎవరికి ప్లస్ అవుతాయో వేచి చూడాల్సిందేనంటున్నారు.కాపుల నుంచే పోటీ ఎక్కువప్రధానంగా కాపు సామాజికవర్గం నుంచి పోటీ ఎక్కువగా ఉండేటట్టు కనిపిస్తోంది. ఇటు టీడీపీ, అటు జనసేనలో ఈ సామాజికవర్గం నుంచి అమాత్య పదవిని ఆశిస్తున్నవారు ఎక్కువగా ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరిలో జనసేన అధ్యక్షుడు పవన్ పోటీ చేసిన పిఠాపురం సహా రాజోలు, పి.గన్నవరం, నిడదవోలు, కాకినాడ రూరల్, రాజానగరం స్థానాల్లో కాపు సామాజిక వర్గీయులు గెలుపొందారు. వీరిలో మొదటి ప్రాధాన్యంగా నిడదవోలు నుంచి గెలుపొందిన కందుల దుర్గేష్‌కు చాన్స్ లభించవచ్చునంటున్నారు. ఆవిర్భావం నుంచి పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా దుర్గేష్‌పై పవన్‌కు ఉన్న గుడ్‌లుక్స్ కేబినెట్లో చోటుకు సానుకూల అంశంగా మారుతుందంటున్నారు. పవన్‌కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి అంటూ జరుగుతోన్న ప్రచారమే నిజమైతే ఉమ్మడి జిల్లాలో కాపు సామాజికవర్గం నుంచి మరొకరికి అవకాశం లభించడం కష్టమేనంటున్నారు. ఉమ్మడి తూర్పున జనసేనలో ఎస్సీల నుంచి పవన్ ప్రతిపాదించాలనుకుంటే రాజోలులో గెలుపొందిన దేవ వరప్రసాద్ పేరు మొదటి వరుసలో ఉంటుందంటున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో గెలుపొందిన ఏకై క రాజోలు చీకటిలో చిరుదీపంగా నిలిచిందంటూ పవన్ ఆ నియోజకవర్గం పార్టీకి ప్రత్యేకం అని చెప్పుకొచ్చారు. అందునా రిటైర్డ్ ఐఏఎస్‌గా, పార్టీ జనవాణి కార్యక్రమ కోఆర్డినేటర్‌గా వరప్రసాదరావు వైపే పవన్ మొగ్గు చూపుతారంటున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్‌గా చంద్రబాబు హయాంలో పనిచేయడంతో వరప్రసాదరావుకు అటు టీడీపీ నుంచి కూడా సానుకూలం అవుతుందంటున్నారు. టీడీపీలో ఎస్సీ సామాజికవర్గం నుంచి అమలాపురంలో గెలుపొందిన ఆనందరావు పేరు తెరమీదకు వచ్చింది. కానీ కాకినాడ జిల్లాకు పొరుగున ఉన్న పాయకరావుపేట నుంచి గెలిచిన అదే సామాజికవర్గానికి చెందిన వంగలపూడి అనితకు అవకాశం దక్కవచ్చునంటున్నారు. -
చెప్పుతో కొడతా!
రాజమహేంద్రవరం రూరల్: ‘జోడిచ్చుకుని కొడతా’నంటూ ఓ మహిళపై రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి విరుచుకుపడ్డారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్ దుర్గాలమ్మ గుడి వీధిలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ డివిజన్లో తన పెద్ద కుమార్తె కంఠంనేని శిరీష, టీడీపీ శ్రేణులతో కలిసి గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దుర్గాలమ్మ గుడి వీధిలో ప్రచారం చేస్తున్న సమయంలో పిల్లల నాగమణి అనే మహిళ ‘ఎన్నికలప్పుడే మీకు ప్రజలు గుర్తొస్తారా?’ అని మహిళ నిలదీసింది. ‘ఓయ్ అమ్మాయ్.. ఆగు’ అంటూ గోరంట్ల ఆమెను అడ్డుకోబోయారు.అయినా.. నాగమణి నిలదీయడం ఆపకపోవడంతో నిగ్రహం కోల్పోయిన గోరంట్ల ఒక్కసారిగా కోపోద్రిక్తుడై ‘జోడిచ్చుకుని కొడతాను’ అంటూ రెచ్చిపోయారు. దీంతో అక్కడున్న మహిళలంతా ఒక్కసారిగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడి నుంచి పార్టీ శ్రేణులతో కలసి బుచ్చయ్య వెనుతిరిగారు.ఓటమి భయంతోనే ఫ్రస్ట్రేషన్పదేళ్లుగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రజల సమస్యలు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఆయన ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజల నుంచి స్పందన కరువవుతోంది. దీంతో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులందరినీ తాను తిరిగే గ్రామం లేదా డివిజన్‌కు తీసుకుని వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు ప్రజల నుంచి స్పందన లేకపోగా.. ప్రచారంలో మహిళలు నిలదీస్తుండటంతో గోరంట్ల ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.అడుగడుగునా నిలదీతలేఅంతకు ముందు కూడా ఓ ఇంటివద్ద నలుగురు వ్యక్తులు.. ‘ఎన్నికల సమయంలోనే తమరికి ప్రజలు గుర్తొస్తారా’ అంటూ గోరంట్లను నిలదీశారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా పట్టించుకోలేనప్పుడు ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. దీంతో కోపోద్రిక్తుడైన గోరంట్ల.. తమకు ఓట్లు వెయ్యవద్దని నోరు పారేసుకున్నారు. అలాంటప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారని అక్కడి వారు అడగడంతో గోరంట్ల, ఆయన అనుచరుడు కురుకూరి కిషోర్ ప్రజలపై దౌర్జన్యానికి దిగారు. వారిని స్థానిక నేతలు, టీడీపీ నాయకులు పక్కకు తీసుకుని వెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. గోరంట్ల కుమార్తె శిరీష 27వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పుడు అక్కడి మహిళలు నిలదీయడంతో ఆమె అక్కడి నుంచి జారుకున్నారు. -
గోరంట్లను వెంటాడుతున్న భయం.. కారణం అదేనట..!
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్ధి విషయంలో క్లారిటీ వచ్చింది. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆ పార్టీ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఆఖరు నిమిషం వరకూ రాజమండ్రి రూరల్ స్థానానికి పోటీ పడిన దుర్గేష్‌ను పవన్ కళ్యాణ్- చంద్రబాబు నిడదవోలు వెళ్లాలని ఆదేశించడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆయన అయిష్టంగా అక్కడకు వెళ్లేందుకు ఒప్పుకున్నారు. తనకు రూట్ క్లియర్ అయిందని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల భావిస్తున్నా, ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు ఎంతమేర సహకరిస్తారోనని టీడీపీ నేతలను ఓటమి భయం పట్టి పీడిస్తుంది. తీవ్రంగా పోటీపడి, సామదాన భేధ దండోపాయాలు ఉపయోగించి మరీ రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానాన్ని టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య దక్కించుకున్నారు. అధికారికంగా పేరు వెల్లడించకపోయినా, దాదాపుగా రాజమండ్రి రూరల్ స్థానం ఆయనకు ఖరారైనట్టే. అయితే జనసేన అభ్యర్ధి దుర్గేష్‌తో పోటీ పడి మరీ ఈ స్థానాన్ని దక్కించుకున్న గోరంట్లకు ఇంకా స్థిమితంగా లేరట. కమ్మ సామాజికవర్గానికి చెందిన ఆయన కాపు సామాజికవర్గం హవా అత్యధికంగా ఉన్న రాజమండ్రి రూరల్ స్థానం నుంచి రెండు సార్లు విజయం సాధించారు. గత ఎన్నికల్లో కాపుసామాజికవర్గానికి చెందిన దుర్గేష్ స్వతంత్ర్య అభ్యర్ధిగా, ఆకుల వీర్రాజు వైఎస్ ఆర్ అభ్యర్ధిగా పోటీ పడ్డారు. దీంతో చాలావరకూ కాపు ఓట్లు చీలిపోయాయి. దుర్గేష్ 46 వేల ఓట్లు సాధించుకోగలిగారు. ఆకుల వీర్రాజు రెండో స్థానంలో నిలిచారు. విజయం బుచ్చయ్యకు దక్కింది. ఈసారి టీడీపీ-జనసేన పొత్తులో రాజమండ్రి రూరల్ స్థానానికి జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ పోటీ చేస్తారని అందరూ ఊహించారు. పవన్ కళ్యాణ్ కూడా తనకు భరోసా ఇచ్చారు కనుక రూరల్ స్థానం తనదేనని దుర్గేష్ భావించారు. అయితే అనూహ్యంగా ఆయనను నిడదవోలు వెళ్లాలని ఆదేశించడంతో అయిష్టంగా ఊ కొట్టారు. అయితే జనసేన క్యాడర్ మాత్రం దుర్గేష్ ను రాజమండ్రి రూరల్ స్థానం నుంచే పోటీ కి దింపాలని పలు ఆందోళనలు నిర్వహించింది. చంద్రబాబు-పవన్ కళ్యాణ్ వీటిని లక్ష్యపెట్టలేదు. దీంతో పదోసారి అసెంబ్లీ బరిలోకి దిగేందుకు బుచ్చయ్య చౌదరి సిద్దపడుతున్నారు. అయితే ఈసారి తమ నాయకుడు బరిలో ఉంటారని భావించిన జనసేన క్యాడర్ బుచ్చయ్యకు ఎంతమేర సహకరిస్తారన్న విషయంపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన బుచ్చయ్య ఈసారి తమ అభ్యర్ధికి అవకాశం ఇస్తారని జనసేన కార్యకర్తలు భావించారు. ఏళ్ల తరబడి కష్టపడి పనిచేసిన దుర్గేష్ కు అవకాశం కల్పిస్తే గెలిపించుకోవాలని భావించారు. అయితే ఇపుడు పరిస్థితి పూర్తిగా మారిపోవడంతో బుచ్చయ్యకు మద్దతు ఇవ్వాలనే ఆలోచనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం పొత్తు లేకపోయినా, జనసేన-టీడీపీ నాయకులు కలిసే పనిచేశారు.అయినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మరోవైపు పదేళ్లపాటు రూరల్ లో శాసనసభ్యుడిగా కొనసాగిన బుచ్చయ్యచౌదిరి పై టీడీపీ క్యాడర్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత ఐదేళ్లలో నియోజకవర్గంలో తమకిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని స్థానికులకు కూడా బుచ్చయ్య అభ్యర్ధిత్వంపై గుర్రుగా ఉన్నారు. అవకాశం వస్తే కచ్చితంగా ఓడించాలనే ఆలోచనతో ఉన్నట్టు స్పష్టమవుతోంది. మరోవైపు, నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా వచ్చిన మంత్రి వేణుగోపాలకృష్ణ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. పాత, కొత్త నాయకులను కలుపుకుంటూ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోను పర్యటిస్తున్నారు. మంత్రి వేణు రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి వచ్చిన తరువాత నాయకులు, కార్యకర్తల్లో కూడా నూతన ఉత్సాహం కలుగుతోంది. ఎక్కడిక్కడ అన్నివర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తూ, వారి బాగోగులు తెలుసుకుంటూ అందరినీ ఆకర్షిస్తున్నారు. రూరల్ నియోజకవర్గంలో విజయం సాధించడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదీ చదవండి: వైఎస్సార్సీపీలో చేరబోతున్నా: ముద్రగడ -
Rajamahendravaram: సీటు తనకే దక్కేలా ఎమ్మెల్యే గోరంట్ల వ్యూహం
సాక్షి, రాజమహేంద్రవరం/నిడదవోలు: టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థుల జాబితాపై విభేదాల అగ్గి రగిలింది. పొత్తు ధర్మం, విలువలు పాటించకుండా చంద్రబాబు స్వప్రయోజనాల కోసమే అన్నట్లు సీట్లు కేటాయించడం, జాబితా రూపొందించడంపై ఇరు పార్టీల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నివురుగప్పిన నిప్పులా నిడదవోలు నిడదవోలు నుంచి తాను పోటీ చేస్తున్నట్టు జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ స్వయంగా ప్రకటించారు. దీనికి అధినేత పవన్ కల్యాణ్ సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని చెబుతూ, ఇప్పటికే నిడదవోలులోని కొంతమంది జనసేన నాయకులతో దుర్గేష్ మాట్లాడారని, వారికి ఆయన వర్గీయులు సైతం ఫోన్ చేసి, నియోజకవర్గ సమాచారం సేకరిస్తున్నారని తెలిసింది. ఈ పరిణామంపై ఇప్పటికే ఆ టికె ట్ ఆశిస్తున్న అక్కడి టీడీపీ నేతలు చంద్రబాబుపై కస్సుమంటున్నారు. తమను కాదని స్థానికేతరులకు నిడదవోలు టికెట్ ఇస్తే టీడీపీకి మూకుమ్మడి రాజీనామాకు సైతం సిద్ధమని అల్టిమేటం జారీ చేస్తున్నా రు. ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలోని టీడీపీ నిడదవోలు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఇంటి వద్దకు ఆదివారం పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. ఆయనకు అనుకూలంగా, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిడదవోలులో జనసేన, టీడీపీ మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. రాజకీయాలకు గుడ్‌బై చెప్పే యోచనలో బూరుగుపల్లి టీడీపీ నేత బూరుగుపల్లి శేషారావు నిడదవోలు టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవల టీడీపీ నిర్వహించిన సర్వేలో సైతం ఆయనకు అనుకూలంగా వచ్చిందని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకొంటున్నాయి. చంద్రబాబు సైతం భరోసా ఇవ్వడంతో ఆయన లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ పార్టీ కార్యక్రమాల్లో తలమునకలవుతున్నారు. ఈ తరుణంలో కందుల దుర్గేష్‌కు ఈ సీటు కేటాయిస్తారన్న సమాచారం అందడంతో శేషారావు వర్గీయులు ఆందోళన చెందుతున్నారు. టికెట్ దక్కకుంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పే ఆలోచనలో సైతం ఉన్నట్లు చెబుతున్నారు. కుందులది మరో దారి నిడదవోలు స్థానం జనసేనకు కేటాయించారని టీడీపీ శ్రేణులు గుర్రుగా ఉంటే.. టీడీపీ టికెట్ ఆశిస్తున్న మరో నేత కుందుల సత్యనారాయణ విచిత్ర ప్రకటన చేశారు. టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తనకు అవకాశం కల్పిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. శేషారావు, సత్యనారాయణ మధ్య ఇప్పటికే వర్గ విభేదాలు నడుస్తున్నాయి. టీడీపీ కార్యక్రమాలు సైతం వారు వేర్వేరుగా చేస్తున్నారు. చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో సైతం ఎవరికి వారే అన్న చందంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చేతిచమురు కూడా బాగానే వదిలించుకున్నారు. తాను కోట్ల రూపాయల పార్టీ ఫండ్ ఇచ్చానని, తనకు కాకుండా టికెట్ ఇతరులకు ఎలా ఇస్తారని కుందుల సత్యనారాయణ తన అనుచరుల వద్ద ప్రస్తావిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నేత దుర్గేష్ పోటీ చేస్తే, ఆయనకు సహకరించేందుకు టీడీపీకి చెందిన కమ్మ సామాజికవర్గ నాయకులు ఆసక్తి చూపడం లేదు. భగ్గుమన్న జనసేన నేతలు దుర్గేష్‌కు రాజమహేంద్రవరం రూరల్ కేటాయించకపోవడంతో జనసేన నేతలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఈ నెల 20న రాజమహేంద్రవరం వచ్చిన జన సేన అధినేత పవన్ కల్యాణ్ అంతర్గత సమావేశంలో ఈ సీటుపై దుర్గేష్‌కు భరోసా ఇచ్చారని, ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే ఈ మార్పు చేయడం ఏమిటని దుర్గేష్ అనుచరులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. జనసేన పార్టీ గుర్తు ఉన్న స్టిక్కర్లు చించివేశారు. జెండా పీకేసి నిరసన తెలిపారు. దుర్గేష్‌కు రాజమహేంద్రవరం రూరల్ కేటాయించాలని డిమాండ్ చేశారు. చక్రం తిప్పిన గోరంట్ల రాజమహేంద్రవరం రూరల్ సీటును తిరిగి ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో టీడీపీ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చక్రం తిప్పారు. ఈ సీటు చేజారిపోయిందనుకున్న సమయంలో చంద్రబాబుతో పెద్ద ఎత్తున వాదనకు దిగి మరీ సాధించుకున్నారని అంటున్నారు. ఈ విషయమై పవన్ కల్యాణ్ సైతం రంగంలోకి దిగారు. దుర్గేష్‌ను శనివారం రాత్రి మంగళగిరికి పిలిపించారు. రూరల్ ఆశలు వదిలేసి, నిడదవోలు నుంచి పోటీ చేయాలని ఆయనకు పవన్ సూచించారు. చేసేది లేక దుర్గేష్ నిడదవోలు నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. -
రాజమండ్రి రూరల్ సీటుపై జనసేన వర్సెస్ టీడీపీ
-
రాజమండ్రిలో సైకిల్, గ్లాసు రచ్చ రచ్చ
రాజమండ్రిలో టీడీపీ-జనసేనల మధ్య రాజకీయం మరింత వేడెక్కిందనడం కంటే రచ్చకెక్కిందనడమే ఇక్కడ సరిపోతుంది. ప్రధానంగా సైకిల్ పార్టీ, గ్లాసు పార్టీలు ఇక్కడ సీటుపై ఒకరిపై ఒకరు కారాలు-మిర్యాలు నూరుకుంటూ సీటు మాదే అంటే మాది అంటూ.ప్రకటనలు చేసేస్తున్నారు. ఇందుకు కారణం రాజమండ్రి రూరల్ సీటు జనసేనదేనంటూ పవన్ కళ్యాణ్ తేల్చేయడమే.. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన పవన్.. రాజోలు, రాజనగరంలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించగా.. తాజాగా రాజమండ్రి రూరల్ కూడా జనసేనకేనని తేల్చేశారు. దానిలో భాగంగానే కందుల దుర్గేష్ జనసేన రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా బరిలోకి దిగుబోతున్నానంటూ ప్రకటించి తెలుగుదేశం శ్రేణులకు షాకిచ్చారు. ఇదే విషయాన్ని టీడీపీ అధిష్టానంతో చర్చించి త్వరలో అధికారికంగా ప్రకటిస్తానని కూడా పవన్ తెలిపినట్లు దుర్గేష్ తెలిపారు. రాజమండ్రి రూరల్ టికెట్ నాదే పవన్ ఇచ్చిన హామీతో రాజమండ్రి రూరల్ టికెట్ నాదేనంటూ ఉబ్బితబ్బిబ్బి అయిపోతున్నారు కందుల దుర్గేష్. రాజమండ్రి టికెట్ తనదేనంటూ ప్రచారం కూడా మొదలు పెట్టేశారు. తనకు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేసారని, ఇక్కడ నుంచి జనసేన తరఫున తాను బరిలో దిగుతున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని కూడా కందుల దర్గేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నేను సీనియర్ని.. ఈ టికెట్ నాదే తాను జిల్లాలో సీనియర్ నాయకుడినని, జిల్లాలో పార్టీ వ్యవస్థాపకుడినని, టికెట్ తనదే అంటున్నారు గోరంట్ల బుచ్చయ్యచౌదరి. ‘ఇందులో ఎలాంటి వివాదం లేదు. పార్టీ టికెట్ నాకే. జనసేనకు మరో నియోజకవర్గం కేటాయిస్తాం. సర్దుబాటు వాళ్లిష్టం’ అంటూ గోరంట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న గోరంట్ల తన సీటుకే ఎసరు పడుతుందా అనే డైలమాలో పడ్డారు. టీడీపీ నేతల్లో అసంతృప్తి రాజానగరం టికెట్ జనసేన ప్రకటించడంతో ఇప్పటికే అసంతృప్తిలో ఉన్న టీడీపీ నేతలు.. రాజమండ్రి రూరల్‌లో సైతం ఇదే పరిస్థితి వస్తుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం మాత్రం.. పవన్ కళ్యాణ్ టికెట్లు ప్రకటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాజమండ్రి రూరల్ ,రాజానగరం స్థానాలు జనసేనకు ఇస్తే తమ సామాజిక వర్గం సీట్లు కోల్పోయేనట్లేనని అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పవన్ టికెట్లను ఇచ్చుకుపోతూ ఉంటే చంద్రబాబు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. ఇది చంద్రబాబు ఇచ్చిన హామీతోనే పవన్ ఇలా చేస్తున్నారా? అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా రాజమండ్రి రూరల్ సీటుపై టీడీపీ-జనసేనల మధ్య రసవత్తర రాజకీయమే నడుస్తోంది. -
ఇంతకీ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సీటు ఉన్నట్టా? లేనట్టా?
టీడీపీలో చంద్రబాబు కంటే సీనియర్ నేత అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి దిక్కుతోచని స్థితిలో ఉన్నారా? ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్యకు ఇప్పుడు పోటీ చేయడానికి సీటే లేకుండా పోయిందా? రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ సీట్లలో ఏదీ బుచ్చయ్యకు ఖాయం కాలేదా? ఈ రెండు సీట్లు ఎవరికి కేటాయించబోతున్నారు? సీనియర్ నేత బుచ్చయ్య చౌదరిని టీడీపీ అధ్యక్షుడు ఎందుకు పట్టించుకోవడంలేదు? ఇంతకీ బుచ్చయ్యకు సీటు ఉన్నట్టా? లేనట్టా? తెలుగుదేశం పార్టీ తరపున ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఈసారి పోటీ చేసే స్థానం కోసం వెత్తుకోవల్సిన దుస్థితి ఏర్పడింది. టీడీపీ- జనసేన పొత్తులో భాగంగా బుచ్చయ్య సిటింగ్ సీటు రాజమండ్రి రూరల్ స్థానాన్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ కు కేటాయించాలని జనసేన నిర్ణయించుకుంది. 2019 ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన దుర్గేష్ ఓటమి పాలైనా, 40 వేలకు పైగా ఓట్లు సంపాదించుకున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అధికంగా ఉన్న కాపు సామాజికవర్గం కూడా దుర్గేష్ కు మద్దతుగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఇదే వ్యవహారం టీడీపీలో కలకలానికి కారణమవుతోంది. రాజమండ్రి రూరల్ తరపున తానే పోటీ చేస్తానని ఎప్పటికప్పుడు ప్రకటించుకుంటున్న బుచ్చయ్య చౌదిరికి చంద్రబాబు ఎటువంటి గ్యారెంటీ ఇవ్వలేదు. బుచ్చయ్య చౌదిరికి అడ్డాలాంటి కాతేరులో చంద్రబాబు సభ నిర్వహించినా, బుచ్చయ్య పేరును ప్రకటించలేదు. తర్వాత కూడా బుచ్చయ్యకు చంద్రబాబు నుంచి పోటీకి ఎటువంటి సిగ్నల్ రాలేదు. దీంతో పోటీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న బుచ్చయ్య తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని జనసేన నేత కందుల దుర్గేష్ కు కేటాయించినందున..రాజమండ్రి సిటీలో పోటీ చేసేందుకు బుచ్చయ్య సిద్ధపడుతున్నట్టు సమాచారం. అయితే రాజమండ్రి సిటీలో పోటీ చేయడానికి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసు ఎప్పుడో ఫిక్సయ్యారు. రాజమండ్రి సిటీ అసెంబ్లీ స్థానం తనదేనంటూ ఆదిరెడ్డి వాసు గతంలో సభపెట్టి మరీ ప్రకటించారు. ఇపుడు బుచ్చయ్య దృష్టి మళ్ళీ సిటీ నియోజకవర్గంపై పడటంతో ఆదిరెడ్డి వర్గంలో అలజడి రేగుతోంది. ఇప్పటికే ఆదిరెడ్డి, బుచ్చయ్య వర్గాలకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. తాజా పరిణామాలతో ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రాజానగరం నుండి కూడా బుచ్చయ్య పోటే చేసే అవకాశం లేకుండా పోయింది. రాజానగరం, రాజోలు స్థానాల్లో జనసేన అభ్యర్ధులు పోటీ చేస్తారని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అటు రాజమండ్రి రూరల్ స్థానం కోల్పోయి, రాజానగరం దక్కక ఏం చేయాలో తెలియక బుచ్చయ్య వర్గం అయోమయంలో కూరుకుపోయింది. తన స్వంత నియోజకవర్గంలో పార్టీ అధ్యక్షుడి సభ ఏర్పాటు చేసినా, తన అభ్యర్ధిత్వాన్ని ప్రకటించుకోలేని స్థితి బుచ్చయ్య ఎదుర్కొన్నారు. గతంలో మండపేటలో సభ ఏర్పాటు చేసినపుడు అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేవేగుళ్ల జోగేశ్వరరావు అభ్యర్ధిత్వాన్ని ప్రకటించిన చంద్రబాబు కాతేరు బహిరంగసభలో తన పేరు కూడా ప్రకటిస్తారని బుచ్చ్యయ్య ఎదురు చూశారు. అయితే చంద్రబాబు పొరపాటున కూడా బుచ్చయ్య పేరును ప్రకటించకపోవడంతో తమకు ఎక్కడి స్థానం దక్కుతుందో, అసలు పోటీ చేసే అవకాశం లభిస్తుందో లేదో తెలియక బుచ్చయ్య వర్గం మథనపడుతోంది. రాజమండ్రి రూరల్ నుండి వరుసగా రెండు సార్లు విజయం సాధించినా, సిట్టింగులకు మళ్లీ అవకాశం కల్పిస్తామని గతంలో చంద్రబాబు ప్రకటించినా, బుచ్చయ్యకు మాత్రం ఊరట లభించడం లేదు. త్యాగాలకు సిద్ధపడాలంటూ చంద్రబాబు ఇస్తున్న పిలుపునకు అర్ధం ఏమిటో, అది తమకే వర్తిస్తుందేమోనని బుచ్చయ్య అనుచరులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదీ చదవండి: టీడీపీ చంద్రబాబు: ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. -
సీనియర్ నేతకు పొగ పెడుతున్న బాబు.. ఆ నియోజకవర్గం ఎంటీ?
గోదావరి జిల్లాల్లో అదొక కీలకమైన నియోజకవర్గం. పచ్చ పార్టీ నుంచి ఓ సీనియర్ నేత ఎప్పటినుంచో అక్కడ పోటీ చేస్తూ వస్తున్నారు. ఇప్పడు అక్కడ టీడీపీ సీనియర్ నేత మీదకు జనసేనను ఉసిగొలుపుతున్నారు చంద్రబాబు. జనసేన, టీడీపీల్లో ఎవరు పోటీ చేసినా ఈసారి అక్కడ గెలిచేది ఫ్యాన్ పార్టీయే. అయితే టీడీపీ, జనసేన సీటు ఆశిస్తున్న ఇద్దరూ పోటీ చేసేది మేమే అని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుందో చూద్దాం. రాజమండ్రి రూరల్ స్థానం విషయంలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య రసవత్తర పోటీ కొనసాగుతోంది. ఈ స్థానం ఈసారి తనదంటే తనదని టీడీపీ, జనసేన అభ్యర్ధులు పోటీ పడి ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో పొత్తులో ఉన్న టీడీపీ- జనసేన పార్టీలు అసలీ స్థానానికి ఎవరిని అభ్యర్ధిగా ప్రకటిస్తారోనని రెండుపార్టీల క్యాడర్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరోవైపు ఇరువురు అభ్యర్ధులు పైకి అధిష్టానం మాటే శిరోధార్యమని చెపుతున్నా, తామే అభ్యర్ధులమంటూ క్యాడర్‌కు బహిరంగంగానే చెపుతున్నారు. అయితే రాజమండ్రిలో టీడీపీ తరపున ఆరుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చంద్రబాబు తనకు పొగ పెడుతున్నారనే విషయాన్ని అర్థం చేసుకుని సన్నిహితుల దగ్గర వాపోతున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదిరి టీడీపీలో సీనియర్ నేత. మంత్రిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేసిన గోరంట్ల చంద్రబాబు కంటే కూడా సీనియర్. తనకు ఏ మాత్రం అన్యాయం జరిగిందని భావించినా, వెంటనే తీవ్ర స్థాయిలో పార్టీని, అధినేతను విమర్శిస్తూ అలిగి కావాల్సినంది సాధించుకోవడం ఆయనకు అలవాటు. వరుసగా రెండు సార్లు విజయం సాధించిన రాజమండ్రి రూరల్ స్థానాన్ని ఈసారి జనసేనకు కేటాయించాలని పార్టీ అధిష్టానం భావిస్తుండటం బుచ్చయ్య చౌదిరికి తీవ్ర మనస్తాపం కలిగిస్తోంది. ఓవైపు తానే అభ్యర్ధిని చెపుతున్నా, కచ్చితంగా ఈస్థానాన్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ కు కేటాయించారంటూ విస్తృతంగా ప్రచారం జరగడం బుచ్చయ్యకు మింగుడుపడటంలేదు. రాజమండ్రి రూరల్ స్థానం తనదేనంటూ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందులు దుర్గేష్ ఎప్పటినుంచో నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి పదిరోజులకు ఒకసారి మీడియా సమావేశం నిర్వహించి రూరల్ స్థానం నుండి పోటీచేస్తానంటూ చెపుతున్నారు. టిక్కెట్ ఎవరికిచ్చినా సహకరిస్తామంటూనే పొత్తు ధర్మం ఒకటుంటుందని, దీనికోసం ఎంతటివారైనా త్యాగాలు చేయాల్సి వస్తుందని పరోక్షంగా బుచ్చయ్య చౌదిరికి సంకేతాలిస్తున్నారు. అసలే ఓవైపు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో తన ప్రమేయాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసిన ఆదిరెడ్డి వర్గంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య ఇపుడు రూరల్ స్థానాన్ని కూడా పొత్తు పేరిట జనసేనకు కేటాయిస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని సహించలేకపోతున్నారు. జనసేన నేత దుర్గేష్ మీడియా సమావేశం పెట్టిన మరుసటిరోజే ఆయన కూడా మీడియా సమావేశం నిర్వహించి, తాను రాజమండ్రి రూరల్ స్థానం నుండే పోటీ చేస్తానని ప్రకటిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టిక్కెట్లు ఇస్తామని చంద్రబాబు చెప్పిన మాటలు గుర్తు చేస్తున్నారు. గతంలో కూడా బుచ్చయ్యకు టిక్కెట్ రాదని ప్రచారం జరిగినా ఆఖరు నిమిషంలో ఆయనే అభ్యర్ధంటూ ప్రకటించిన సంఘటనలు ఉన్నాయి. దీంతో అసలు రాజమండ్రి రూరల్ స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారో తెలియక అటు టీడీపీ, ఇటు జనసేన వర్గాలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడ పోటీ చేయడానికైనా సిద్ధమని చెపుతూనే రాజమండ్రి సిటీ స్థానానికైనా రెడీ అంటూ ఆదిరెడ్డి వర్గానికి కూడా జలక్ ఇస్తున్నారు బుచ్చయ్య. సింహం బయటకు వచ్చేవరకేనంటున్న బుచ్చయ్య చౌదిరికి ఈసారి చంద్రబాబు నిజంగానే టిక్కెట్ ఇస్తారో లేక పక్కన పెట్టేస్తారో చూడాలి. చదవండి: ‘మోసానికి, అవినీతికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్’ -
నాకు టిక్కెట్ ఉండదనడానికి దుర్గేష్ ఎవరు?
రాజమహేంద్రవరం రూరల్: సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టిక్కెట్ అని టీడీపీ అధిష్టానం ఎప్పుడో ప్రకటించిందని.. ఇప్పుడు ఉండదని చెప్పడానికి జనసేన నాయకుడు కందుల దుర్గేష్ ఎవరని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. నగరంలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతో తనకు వ్యక్తిగతంగా విభేదాలేవీ లేవని, జనసేన తమకు కేవలం మిత్రపక్షమేనని, టీడీపీ బలమైన పార్టీ అని అన్నారు. టీడీపీ నిర్ణయానికే కట్టుబడి ఉండాలన్నారు. రానున్న ఎన్నికల్లో అధిష్టానం ఎక్కడ టిక్కెట్ ఇచ్చినా అసెంబ్లీకి తాను పోటీ చేయటం ఖాయమని, ఎంపీగా మాత్రం పోటీ చేయనని చెప్పారు. అధిష్టానం నిర్ణయం మేరకు త్యాగానికి సిద్ధమని గోరంట్ల అన్నారు. -
టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీటుకు ఎసరు
-
ప్యాకేజీ స్టార్‌తో పొత్తు.. నన్ను పక్కన పెడతారా?
సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ, జనసేన సమన్వయ భేటీలో తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరికి అవమానం జరిగిందా..? కీలక సమావేశంలో స్థానం కల్పించకపోవడం వెనుక వేరే మతలబు ఉందా? పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నా జూనియర్లను అందలం ఎక్కించి ఆయన గుర్తింపును హరిస్తున్నారా? రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం జనసేనకు కేటాయించేందుకే ఇలా వ్యవహరిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. ఇదీ సంగతి.. స్కిల్ కుంభకోణంలో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ అనుభవిస్తున్న నేపథ్యంలో ఇటీవల టీడీపీ, జనసేన నేతల ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇరు పార్టీల నుంచి 14 మంది సభ్యులతో కూడిన కమిటీ సుమారు 3 గంటల పాటు భేటీ అయింది. కమిటీలో పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంటే సీనియర్ అయిన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి చోటు లభించలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే చేదు అనుభవమే ఎదురైంది. తన కంటే పార్టీలో జూనియర్లు నిమ్మల రామానాయుడు, తంగిరాల సౌమ్య, చివరకు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన వలస నేత పితాని సత్యనారాయణకు కూడా కమిటీలో స్థానం కల్పించడంతో బుచ్చయ్య అభిమానులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నట్లు సమాచారం. సీనియర్ నేతకు తగిన గౌరవం, గుర్తింపు దక్కకపోవడంతో టీడీపీపై వీరి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలిసింది. 25 ఏళ్లకు పైగా ఎమ్మెల్యేగా వ్యవహరించిన వ్యక్తి పార్టీ బలోపేతం, ఉమ్మడి వ్యూహాలపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కూడా పనికిరారా? అని ప్రశ్నిస్తున్నారు. పొత్తు సెగ తగిలిందా? టీడీపీ, జనసేన పొత్తు సెగ మొట్టమొదటిగా రూరల్ ఎమ్మెల్యే గోరంట్లకు తగిలిందన్న భావన టీడీపీ శ్రేణుల్లో నెలకొంది. పొత్తు కుదిరితే రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి స్థానం జనసేనకు కేటాయిస్తారన్న ప్రచారం ఆది నుంచీ సాగుతోంది. జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ రూరల్ స్థానం నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. అధినేత పవన్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని, ఆరు నూరైనా రూరల్ స్థానం తనకే దక్కుతుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ ఉన్న పరిస్థితుల్లో జనసేన అభ్యర్థనకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వక తప్పని పరిస్థితి. సీనియర్ నేత బుచ్చయ్యకు పార్టీలో సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఈ ప్రచారానికి ఇది మరింత బలం చేకూరుస్తోంది. ఇదే జరిగితే బుచ్చయ్యకు భంగపాటు తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ములాఖత్‌లోనూ శృంగభంగమే సెంట్రల్ జైల్లో ఉన్న బాబుతో ములాఖత్‌లోనూ బుచ్చయ్యకు అవమానమే ఎదురైంది. పార్టీ అధినేతను జైలులో కలిసే అవకాశం ఒక్కసారి కూడా దక్కలేదు. తెలంగాణ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన నేతలు బాబు కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి ములాఖత్ అవుతున్నారు. స్థానికంగా ఉన్న, సీనియర్ నేతను ఒక్కసారి కూడా పిలవకపోవడంతో పార్టీ బుచ్చయ్యకు ఎంత ప్రాధాన్యంఇస్తోందో తేటతెల్లమవుతోందని ఆయన వర్గీయులు లోలోన మదనపడుతున్నారు. ఆది నుంచీ ఆధిపత్య పోరే.. బుచ్చయ్య, ఆదిరెడ్డి అప్పారావు వర్గాల మధ్య ఆది నుంచీ ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. రూరల్ ఎమ్మెల్యే అయినా ఆయన దృష్టంతా సిటీపైనే ఉండేది. పార్టీలో సీనియరైనా తనను కాదని ఇతరులను ప్రోత్సహిస్తున్నారని ఆవేదన చెందేవారు. ఈ విషయాన్ని ఆయన అనేక సందర్భాలలో వెళ్లగక్కిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆదిరెడ్డి వర్గం సైతం ఆయనకు దీటుగా జవాబు ఇస్తూనే సిటీలో బలపడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నియోజకవర్గానికే పరిమితం చంద్రబాబు అరెస్టయి సెంట్రల్ జైలుకు వచ్చిన నాటి నుంచీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబానికి టీడీపీలో కొంత ప్రాధాన్యత పెరిగినట్లు ఆపార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు జైలు జీవితం నేపథ్యంలో బాబు కుటుంబం రాజమహేంద్రవరంలోనే బస చేస్తోంది. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలు ఇక్కడి నుంచే ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. వీటన్నింటీకీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసు సారథ్యం వహిస్తున్నారు. లోకేష్ క్యాంప్ కార్యాలయం వద్ద కూడా ఈయన తన ముద్ర చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిణామం బుచ్చయ్యకు మరింత భంగపాటుకు గురయ్యేలా చేస్తోంది. రూరల్ అసెంబ్లీ స్థానం లేకపోతే సిటీ టికెట్ ఆశిద్దామంటే అప్పారావు కుటుంబం ఏకు మేకు అయిందన్న చందంగా మారింది పరిస్థితి. చేసేది లేక బుచ్చయ్య చౌదరి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా చేపట్టే కార్యక్రమాల్లో సింహభాగం తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. -
మాసివ్ హార్ట్ఎటాక్తోనే కుప్పకూలిన తారకరత్న!
సాక్షి, చిత్తూరు: సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న పరిస్థితి ఇంకా క్రిటికల్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు కుప్పం పీఈఏస్ మెడికల్ కాలేజీలో చికిత్స అందుతుండగా.. బెంగళూరు తరలించే ప్రయత్నాలు మొదలయ్యాయి. శుక్రవారం కుప్పంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర మొదలు సందర్భంగా.. ఆయన ఉన్నట్లుండి కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాకు వివరించారు. ‘తారకరత్నకు స్టంట్లు వేయలేదు. యాంజియోగ్రామ్ మాత్రమే పూర్తైంది. హార్ట్‌లో కుడి, ఎడమ వైపు 95 శాతం బ్లాక్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కోలుకున్న తర్వాత స్టంట్స్ వేస్తారా?.. ఇతర ట్రీట్మెంట్లు అందిస్తారా? అనేది వేచిచూడాలి. తారకరత్నకు భారీగా గుండెపోటు వచ్చిందని, అయితే ఆస్పత్రిలో వైద్యులు 40 నిమిషాలపాటు తీవ్రంగా ప్రయత్నించడంతో పరిస్థితి కొంత మెరుగైందని తెలిపారాయన. బాలకృష్ణ రాకతో ఆయన రికవరీ కావడం ఆశ్చర్యంగా ఉందని, బాలకృష్ణే దగ్గరుండి చూసుకుంటున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. తారకరత్నకు ప్రాణాపాయం తప్పిందని భావనలో ఉన్నామని బుచ్చయ్యచౌదరి చెప్పారు. అవసరమైతేనే మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు ఎయిర్‌లిఫ్ట్ చేస్తారు. ఇక పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని వెల్లడించారు. నందమూరి అభిమానులు ఆందోళన చెందవద్దని, తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన. ఇక పరిస్థితిపై సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. తారకరత్నకు మాసివ్ హార్ట్ ఎటాక్ లెఫ్ట్ సైడ్ వచ్చిందని తెలిపారు. ఎడమ వైపు 90 శాతం బ్లాక్ అయ్యింది. అయితే మిగతా రిపోర్టులు నార్మల్‌గానే ఉన్నాయని బాలకృష్ణ వెల్లడించారు. డాక్టర్ల పర్యవేక్షణలో పరిస్థితి మెరుగవుతోందని, వైద్యులు కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు. అయినప్పటికీ బెంగళూరుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పరిస్థితి పాజిటివ్‌గానే ఉందని, దేవుడి దయతో పాటు కుటుంబం సభ్యుల ప్రార్థనతో అతని ఆరోగ్యం మెరుగవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే బాలకృష్ణ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు గోల చేయడంతో.. ఆయన మండిపడ్డారు. అంతకు ముందు.. తారకరత్న పల్స్ సాధారణ స్థితికి చేరుకునేందుకు 45 నిమిషాల సమయం పట్టిందని వైద్యులు తెలిపారు. ఆయన కోలుకుంటారని భావిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. తారకరత్నను గ్రీన్‌ఛానల్ ద్వారా కుప్పం ఈపీఎస్ ఆస్పత్రి నుంచి బెంగళూరు మణిపాల్ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. -
ఏం ఖర్మో.. లీడర్లని మారుస్తున్నా.. అక్కడ పార్టీ తలరాత మారడంలే!
అసలే పార్టీ పాతాళం వైపు చూస్తోంది. ఈ సీటు గెలుస్తామని ఏ జిల్లాలోనూ చెప్పేంత ధీమా కనిపించడంలేదు. కానీ పార్టీలో గ్రూపులు, కుమ్ములాటలు షరా మామూలే. ఏ నియోజకవర్గంలో చూసినా పచ్చ పార్టీలో తన్నులాటలు కామన్‌గా మారాయి. తూర్పుగోదావరి జిల్లాలో అయితే చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలోనే తమ్ముళ్ళు తన్నుకున్నారు. కొవ్వూరు నియోజకవర్గం టీడీపీలో గొడవలకు కారణమేంటో చదవండి.. అనుకూలం x వ్యతిరేకం గతంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ప్రస్తుతం పార్టీ అంపశయ్యపైకి చేరింది. వంగల పూడి అనిత, కొత్తపల్లి జవహర్ అంటూ... నియోజకవర్గంలో నేతల్ని మారుస్తున్నా పార్టీ రాత మారడంలేదని అక్కడి కేడర్ ఆందోళన చెందుతోంది. మంత్రిగా ఉన్న కాలంలో జవహర్ రాజేసిన గ్రూపుల కుంపటి సెగలు నేటికీ చల్లార లేదు. మొన్న అమరావతి రైతుల యాత్ర సన్నాహక సమావేశంలో కుమ్ములాడుకున్న జవహర్ అనుకూల, వ్యతిరేక వర్గాలు.. మరోసారి చంద్రబాబు పర్యటన ఏర్పాట్ల సమావేశంలోనూ సేమ్ సీన్ రిపీట్ చేశాయి. నియోజకవర్గ నాయకులు బాబు పర్యటన ఏర్పాట్ల పై కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం సజావుగా సాగుతున్న సమయంలో మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ సమావేశానికి వచ్చారు. జవహర్ ను చూసిన వ్యతిరేకవర్గం కేడర్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. కొవ్వూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి జవహర్‌కు పని ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు దింపుడు కళ్లెం ఆశలు చంద్రబాబు హయాంలో జవహర్ మంత్రిగా పనిచేసినపుడు ఒక వర్గాన్ని దూరంగా పెట్టారు. తనవర్గం వారిని వారిపై రెచ్చగొట్టారు. అప్పటినుంచి కొందరు నేతలు, కార్యకర్తలు జవహర్ వ్యతిరేక వర్గంగా నియోజకవర్గంలో గట్టిగా పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో జవహర్‌కు కొవ్వూరు టిక్కెట్ రాకుండా చంద్రబాబు దగ్గర చక్రం తిప్పారు వ్యతిరేక వర్గం నాయకులు. తనవారి మాట కాదనలేక.. అప్పట్లో కొత్తపల్లి జవహర్‌ను చంద్రబాబు నాయుడు తిరువూరు స్థానానికి పంపించారు. పాయకరావుపేట ఎమ్మెల్యేగా పనిచేసి అక్కడ అక్కడ గ్రూప్ తగాదాల్లో కూరుకుపోయిన వంగలపూడి అనితను కొవ్వూరు నుండి పోటీ చేయించారు. ఘోర పరాజయం పాలైన వంగలపూడి అనిత ఎన్నికల అనంతరం కొవ్వూరు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో తిరిగి కొవ్వూరు నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు పలుమార్లు జవహర్ ప్రయత్నించినా వ్యతిరేకవర్గం అడ్డుపడడంతో ఆయన ఆశలు అడియాశలే అవుతున్నాయి. చదవండి: (టికెట్‌కి వెల కడతారా?.. మా కుటుంబాన్ని కరివేపాకులా తీసేస్తారా?) గోరంట్లకు జవహర్ సెగ ప్రస్తుతం రాజమండ్రి జిల్లా ఇన్ఛార్జిగా జవహర్ కొనసాగుతున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. పర్యటనకు ఇన్చార్జిగా నియమితులైన టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన సమావేశం జరుగుతుండగా మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ రావడంతో ఒక్కసారిగా.. జవహర్ గోబ్యాక్ అంటూ పై నినాదాలు మొదలయ్యాయి. దీంతో జవహర్ అనుకూల వర్గం వారు వ్యతిరేకవర్గం వారితో ఘర్షణకు దిగారు. ఇరువర్గాల మధ్య గంట సేపు వాగ్వాదం జరిగింది. ఘర్షణను ఆపేందుకు ఎంత ప్రయత్నించినా ఎవరికీ సాధ్యం కాలేదు. నాయకులు, కార్యకర్తలతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతున్న సమయంలో సైతం గొడవ కంటిన్యూ అవుతుండటంతో బుచ్చయ్య చౌదరి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ తారస్థాయికి చేరడంతో సమావేశాన్ని అర్థాంతరంగా ముగించారు. ఎన్నికకు ఏడాదిన్నర ముందే ఇలా ఉంటే.. తీరా అసలు సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న బెంగ ఇద్దరు బాబులకు పట్టుకుందని తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్నారు. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
తెలుగు తమ్ముళ్ల తన్నులాట!
కొవ్వూరు: టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నిమిత్తం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం తెలుగు తమ్ముళ్ల తన్నులాటకు దారి తీసింది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో లిటరరీ క్లబ్ కళ్యాణ మండపం ఇందుకు వేదికయ్యింది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి సమక్షంలో ద్విసభ్య కమిటీ సభ్యులను వేదికపైకి ఆహ్వానించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కేఎస్ జవహర్‌ను వేదికపైకి ఆహ్వానించాలని కమిటీ సభ్యులకు బుచ్చయ్య చౌదరి సూచించారు. దీంతో ఆయన వ్యతిరేక వర్గీయులు జవహర్ గోబ్యాక్ అంటూ నినాదాలు ప్రారంభించారు. అదే సమయంలో జవహర్ వర్గీయులు గొంతెత్తారు. అరుపులతో సమావేశం రసాభాసగా మారింది. ఇరు పక్షాల మద్ధతుదారులు వేదికను చుట్టుముట్టి పరస్పరం నెట్టుకున్నారు. దీంతో మైక్ బాక్సులు, సోఫా సెట్లు కిందపడి పోయాయి. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బుచ్చయ్య చౌదరి, ద్విసభ్య కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, ఇరుపక్షాలకు చెందిన ఇతర ముఖ్య నేతలతో రహస్యంగా గదిలో చర్చించారు. కాగా, ఇటీవల నిర్వహించిన అమరావతి పాదయాత్రలోనూ ఇరు పక్షాల మధ్య విభేదాలు వెలుగు చూశాయి. చర్చల అనంతరం బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ నాయకులంతా విభేదాలను పక్కన పెట్టి చంద్రబాబు యాత్రను విజయవంతం చేయాలని కోరారు. దీంతో జవహర్, ఆయన వర్గీయులు జిల్లా పార్టీ అధ్యక్షుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ బుచ్చయ్య చౌదరిని ప్రశ్నించారు. దళితులంటే చిన్నచూపా అంటూ ఆయన వర్గీయులు కేకలు వేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నందుకేనా వేదికపై పిలవలేదంటూ నిలదీశారు. జవహర్ వర్గీయులు ఆగ్రహంతో సభ ప్రాంగణం నుంచి నిష్క్రమించారు. ద్విసభ్య కమిటీ సభ్యుడు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరిని వెంట బెట్టుకుని జవహర్, ఆయన వర్గీయులు బుచ్చయ్య చౌదరి బయటికి వెళ్లిపోయారు. ప్రాంగణంలో బుచ్చయ్య చౌదరి కారుకు అడ్డంగా టీడీపీ కార్యకర్తలు బైఠాయించారు. బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ సమావేశంలో జరిగిన విషయాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. చంద్రబాబు దృష్టికీ తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. దీంతో పరిస్ధితి సద్దుమణిగింది. -
గోరంట్ల వెర్సెస్ ఆదిరెడ్డి.. సిటీ సీట్ హాట్ గురూ..!
సాక్షి, రాజమహేంద్రవరం: ఇది మల్లెల వేళయని...వెన్నెల మాసమని...తొందరపడి ఒక కోయిల ముందే కూసింది ..విందులు చేసింది...సుఖదుఃఖాలు సినిమాలో దేవులపల్లి రాసిన పాట ఇది.. టీడీపీలో యువ నాయకుడొకరు ఇదే పల్లవి అందుకున్నారు. దీనిపై రాజకీయంగా రసవత్తరమైన చర్చ సాగుతోంది. ఫలితంగా చాలా కాలంగా పార్టీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుకు మరోసారి తెర లేచింది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉంది. ఆ పార్టీలో ఎప్పుడూ హాట్ సీట్‌గా పేరున్న రాజమహేంద్రవరం సిటీ కోసం ఇప్పటి నుంచే పోరు మొదలైనట్టుగా కనిపిస్తోంది. కొన్నేళ్లుగా ఈ విషయంలో సిటింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మామ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పొరుగున అదే పార్టీకి చెందిన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోన్న సంగతి బహిరంగ రహస్యమే. ప్రతి ఎన్నికల సందర్భంలో సిటీ నుంచి పోటీ చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈయనకు పోటీగా ఆదిరెడ్డి అప్పారావు వర్గం టిక్కెట్టు కోసం పోటీ పడుతూ ఉంటుంది. ఇది పార్టీలో సహజ పరిణామంగానే చెప్పుకుంటారు. అటువంటిది సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నా రాజమహేంద్రవరం సిటీ నుంచి తానే పోటీ చేస్తానని సిటింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త.. ఆ పార్టీ నాయకుడు వాసు బుధవారం హఠాత్తుగా ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక కారణమేమై ఉంటుందనే చర్చ జరుగుతోంది. అంటే ఇప్పటి నుంచే టీడీపీలో సీట్ల సిగపట్లు మొదలయ్యాయంటున్నారు. చదవండి: (Atmakur Byelection: బీజేపీ బేజార్.. అభ్యర్థి ఎంపికే మైనస్) ఆధిపత్య పోరు రాజమహేంద్రవరం జేకే గార్డెన్స్‌లో సిటీ నియోజకవర్గ పార్టీ సమావేశం సందర్భంగా ఎమ్మెల్యే భర్త వాసు బయటకు వచ్చి మీడియాకు ఈ విషయాన్ని తెలియజేశారు. గత కొంతకాలంగా ఆ పార్టీలో పరిణామాలే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఎమ్మెల్యే గోరంట్ల, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వర్గాల మధ్య పచ్చ గడ్డి వేయకుండానే భగ్గుమనే వాతావరణం ఈ ప్రకటనతో కనిపిస్తోంది. గోరంట్ల రూరల్‌కు వెళ్లిపోయినా సిటీపైనే ఆయన దృష్టి ఉంది. పార్టీలో సీనియర్ అయిన తనను కాదని వేరేవారిని ప్రోత్సహించారనే ఆవేదన ఆయనలో మొదటి నుంచి ఉంది. ఈ విషయాన్ని ఆయన అనేక సందర్భాల్లో వెళ్లగక్కుతూనే ఉంటారు. ఏడాదిన్నర క్రితం సిటీలో తమ వర్గానికి చెందిన వారికి పదవుల్లో ప్రాతినిధ్యం లేకుండా చేశారనే ఆవేదనతో పార్టీ, రాజకీయాలకు దూరమవుతున్నట్టు మీడియాకు తెలియచేసి హైడ్రామా సృష్టించారు. చివరకు పార్టీ పదవులు తమ వారికి సాధించుకుని ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. చదవండి: (జనసేన వారు 62 మంది.. టీడీపీ వారు 21 మంది) టీడీపీలో అంతర్యుద్ధం సిటీ నియోజకవర్గంలో తనకంటూ ఉన్న మాజీ కార్పొరేటర్లతో ఆదిరెడ్డి వర్గానికి పోటీగా గోరంట్ల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇవన్నీ నడుస్తోన్న క్రమంలోనే తన రాజకీయ వారసుడిగా సోదరుడు శాంతారామ్ తనయుడు రవిరామ్‌ను తెరమీదకు తీసుకువచ్చారు. అంతటితోనే ఆగకుండా సిటీలో తన పుట్టిన రోజు వేడుకలను విస్తృతంగా నిర్వహించి రాజకీయాలకు తానేమీ దూరం కాలేదని స్పష్టం చేశారు. ఇంతకంటే ముందుగానే గోరంట్ల వైరి పక్షమైన మాజీ ఎమ్మెల్సీ అప్పారావు కూడా రాజకీయ వారసుడిగా తనయుడు వాసును ప్రకటించడంతో టీడీపీలో అంతర్యుద్ధం మొదలైంది. నాటి నుంచి చాపకింద నీరులా సాగుతోన్న ఈ రెండు వర్గాల అంతర్గత పోరు వాసు తాజా ప్రకటనతో మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రకటన వెనుక వ్యూహం వాసు ప్రకటన వెనుక రాజకీయ దూరాలోచన ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. భవిష్యత్ రాజకీయ వ్యూహం ఉందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ స్థానానికి ఆదిరెడ్డి కుటుంబం నుంచి పోటీకి పెడతారని ఇటీవల ఆ పార్టీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనిని గోరంట్ల వర్గం భుజానకెత్తుకుని చేస్తోందని ఆదిరెడ్డి వర్గం అనుమానం వ్యక్తం చేస్తోంది. సిటీ కోసం ఆరాటపడుతోన్న గోరంట్ల వర్గం పనిగట్టుకుని చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే వ్యూహంలో భాగంగానే వాసు తాజా ప్రకటన అంతరార్థమని తెలుస్తోంది. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సిటీ నుంచే పోటీ చేస్తామని, ఎంపీగా వెళ్లే ప్రసక్తే లేదని వాసు తేల్చి చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యే భవాని ఉండగా ఆమెను కాదని భర్త వాసు పోటీ చేస్తాననడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆమె పనితీరు సమర్థవంతంగా లేదనా, లేక రాజకీయాల్లో రాణించలేక పోతున్నారనా.. వీటిలో ఏ కారణంతో వాసు పోటీకి సై అంటున్నారని నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఆమెను బలపరిచాను, వచ్చే సారి ఆమె నన్ను బలపరుస్తుంది అని వాసు మీడియా వద్ద ముక్తాయించడం గమనార్హం. దీనిపై గోరంట్ల వర్గం ఏ రకమైన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతుందో వేచి చూడాల్సిందే. -
బాబుగారు.. మీకో దండం! దూరమవుతున్న లీడర్లు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు ఇమడలేక సతమతమవుతున్నారా? దశ దిశా లేకుండా దిక్కులేని పక్షిలా సాగుతున్న పార్టీ ప్రయాణంతో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నారా? జనంతో సంబంధం లేకుండా నిత్యం మీడియాలో కనిపిస్తూ.. చంద్రబాబు, లోకేష్ భజన చేస్తూ పబ్బం గడుపుకునే నేతలకే ప్రాధాన్యం ఇస్తూ తమను అవమానిస్తుండడాన్ని తట్టుకోలేకపోతున్నారా? అంటే అవుననే అంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు. విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజా ఉదంతమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయబోనని, మరో అభ్యర్థిని చూసుకోవాలని కేశినేని నాని.. చంద్రబాబుకు స్పష్టంగా తేల్చిచెప్పడాన్ని బట్టి సీనియర్ నాయకుల్లో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుసుకోవచ్చని అంటున్నారు. ఇటీవలే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. టీడీపీ నడుస్తున్న తీరు బాగోలేదంటూ ఆయన రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డారు. చంద్రబాబు జోక్యం చేసుకుని బుజ్జగించడంతో తాత్కాలికంగా తన నిర్ణయాన్ని బుచ్చయ్య వాయిదా వేసుకున్నారు. అయితే పార్టీ అధినాయకత్వం పట్ల ఆయన అభిప్రాయం మాత్రం మారలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి సైతం పార్టీ తీరు పట్ల బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక ప్రైవేటు సంభాషణలో టీడీపీ పని అయిపోయిందని, ‘పార్టీ లేదు.. బొక్కా లేదు’ అని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. వీరే కాకుండా ఇంకా అనేక మంది సీనియర్ నాయకులు టీడీపీ మునిగిపోతున్న నావ అనే అభిప్రాయంతో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. చురుగ్గా లేని సీనియర్ నేతలు గతంలో టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకులు ఎవరూ ప్రస్తుతం చురుగ్గా లేరు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కీలక మంత్రిగా చక్రం తిప్పిన నారాయణ దాదాపు పార్టీకి దూరమయ్యారు. మరో మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టీడీపీలో ఉన్నారో, లేదోననే పరిస్థితి ఉంది. రాజమండ్రి మాజీ ఎంపీ మురళీమోహన్ పార్టీకి దూరమయ్యారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన మంత్రులు, ఎంపీలు, ఇతర నేతల్లో నలుగురైదుగురు మినహా ప్రస్తుతం ఎవరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. వారి నియోజకవర్గాల్లో సాక్షాత్తూ పార్టీ అధినేత చంద్రబాబు పర్యటించినా పట్టించుకోవడం లేదు. టీడీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు (వల్లభనేని వంశీ, మద్దాళి గిరి, వాసుపల్లి గణేష్, కరణం బలరామకృష్ణమూర్తి) ఆ పార్టీకి దూరమయ్యారు. మిగిలిన ఎమ్మెల్యేల్లో సగం మంది గోడ దూకడానికి ఎప్పుడో సిద్ధమైనట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. టీడీపీకి ఈ పరిస్థితి రావడానికి చంద్రబాబు వైఖరే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఆయన తన తనయుడు లోకేష్‌కి పెత్తనం అప్పగించడం సీనియర్లకు మింగుడుపడడం లేదు. తన భజన చేసే వారినే ఆయన ప్రోత్సహిస్తుండడం వారికి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోందంటున్నారు. -
బుచ్చిరాజ్యంలో.. ఆదిపత్య పోరు
వందల ఏళ్ల చరిత్ర కలిగి.. రాజరాజనరేంద్రుడు ఏలిన పురాతన రాజమహేంద్రవరం నగరంలో ఆధిపత్యం కోసం ఇద్దరు సామంతులు ‘ఎత్తుల’ కత్తులు దూస్తున్నారు. ఒక సామంతుడు ‘బుచ్చి’రాజు. మరొకరు ‘ఆది’రాజు. రాజులు పోయినా.. రాజ్యాలు పోయినా రాచరికపు వాసనలు వారిని వీడటం లేదు. బుచ్చిరాజును సైన్యంతో సహా పదేళ్ల క్రితమే పొరుగు రాజ్యానికి ఆదిరాజు తరిమేశారు. అప్పటి నుంచీ కోల్పోయిన రాజ్యంలో పట్టు సాధించాలనే ఆరాటంతో.. అవకాశం వచ్చినప్పుడల్లా అలక పాన్పు ఎక్కేస్తున్నారు బుచ్చిరాజు. వందిమాగధులతో రకరకాల తంత్రాలు పన్నుతున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవంతో రాజకీయ మాయోపాయాలు పన్ని, ఆదిరాజును ఇరుకున పెట్టి, రాజ్యంలో పట్టు సాధించాలన్నది ఆయన వ్యూహం. సాక్షి,రాజమహేంద్రవరం: ఉత్తరాంధ్ర పరగణాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన ఆజానుబాహుడైన ఓ నాయుడికి స్వయానా బంధువైన ఆదిరాజు ఏమైనా తక్కువ తిన్నారా? బుచ్చిరాజు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తన రాజ్యంలో వేలు పెడితే యుద్ధం తప్పదని వేగుల ద్వారా బుచ్చిరాజుకు సందేశం పంపించారు. అలనాడు దుర్యోధనుడు చెప్పినట్టు ‘‘సూది మొన మోపినంత స్థలం కూడా వదులుకోన’’ని స్పష్టంగా చెప్పాడు. విషయం ఆ నోటా ఈ నోటా రాజ్యం నలుమూలలా పాకడంతో సామంతులు, ఆంతరంగికుల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. భటుల ద్వారా ఇది తెలుసుకున్న బుచ్చిరాజు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అలాగని వందిమాగధులతో యుద్ధానికి సై అని సాహసించడం లేదు. తన రాజ్యంలోని సైనిక సంపత్తి, మంత్రాంగం సరిపోదనే కారణంతో.. అలకబూని.. రాజప్రసాదం తలుపులు తెరవకుండా మూడు రోజులుగా అంతఃపురానికే పరిమితమైపోయారు. ఈ తరహా రాజకీయ తంత్రం బుచ్చిరాజుకు కొత్తేమీ కాదు. రాజమహేంద్రవర రాజ్యాన్ని కోల్పోయిన గాయం ఇంకా మానకున్నా.. ‘చంద్ర’వంశ రాజదర్బార్‌లో కనీస మర్యాద కూడా దక్కడం లేదని ఏడు పదుల వయస్సులో ఉన్న ఈ సామంతరాజు కుమిలిపోతున్నారు. గతంలో కూడా ఇలానే కనీసం వయస్సుకు కూడా విలువ ఇవ్వడం లేదంటూ అంతఃపురంలో ఏకాంతంగా అంతర్మధనం చెందిన సందర్భాలు చాలానే ఉన్నాయని ఆంతరంగికులు గుసగుసలాడుకుంటున్నారు. దాదాపు పదేళ్లుగా అవమాన భారంతో రగిలిపోతున్న బుచ్చిరాజు కోల్పోయిన చోటే వెతుక్కోవాలనే సూత్రాన్ని అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ ఆయన ఎత్తులు ఆదిరాజు రాజకీయ తంత్రం ముందు చిత్తవుతున్నాయి. భవిష్యత్‌లో రాజమహేంద్రవరంలోని 52 పరగణాలకు జరిగే పోరు కోసమే సామంతుల మధ్య ఇంతటి రాజ్యకాంక్ష నెలకొందనే చర్చ రాజదర్బారులో నడుస్తోంది. బుచ్చిరాజు రాజ్యంలోకి వచ్చే తొమ్మిది పరగణాలతో పాటు, మిగిలిన 43 పరగణాల్లో తన సుబేదారులకే పట్టు ఎక్కువ ఉండటంతో.. వారిని యుద్ధరంగంలోకి దింపాలనేది బుచ్చిరాజు వ్యూహం. అయినప్పటికీ ఆదిరాజు సిక్కో లు రాజుల బంధుత్వం దన్నుతో ధీమాగా ఉన్నారని ఆ రాజప్రసాదంలోని భటులు చెప్పుకొంటున్నారు. సామంతుల మధ్య సంధి కోసం ‘చంద్ర’వంశ రాజు పంపించిన దూతలు బుచ్చిరాజు అంతఃపురంలో గంటన్నర చర్చించినా చివరకు తలలు పట్టుకుని వచ్చిన దారినే పలాయనం చిత్తగించారు. పైకి మాత్రం సామంతుల మధ్య యుద్ధ వాతావరణం లేదని, బుచ్చిరాజుకు అసలు అసంతృప్తే లేదని చెప్పారు. ‘చంద్ర’వంశ సామంతులు నిమ్మకాయల చినరాజు, బెజవాడలో ‘గద్దె’నెక్కిన రామ్మోహనరాజు, రాజమహేంద్రవరం రాజ్యంలో గోదావరి అవతల ఒడ్డున ప్రజలకు చుక్కలు చూపించిన హర్రర్రాజు, అనపర్తి రెడ్డి రాజు వంటి దూతల సంధి విఫలమైంది. అసలు సామంతుల మధ్య చిచ్చు పెట్టిందే ‘చంద్ర’వంశ రాజు. సంధి కోసం వెళ్లిన దూతలు మధ్యలో అంతఃపురం బయట చెప్పుకొన్న మాటలను రహస్యంగా విన్న రాజభటులు బుచ్చిరాజు చెవిన వేశారు. నాడు పిల్లనిచ్చి, మంత్రిని చేసిన మామ రాజ్యాన్నే కూల్చేసి, సింహాసనం అధిíÙ్ఠంచి, ఇన్నేళ్లవుతున్నా.. తన వ్యతిరేక కూటమితో చేతులు కలిపిన బుచ్చిరాజును ఒకప్పటి ‘చంద్ర’వంశ రాజు ఇప్పటికీ వదిలిపెట్టలేదని వేగుల ద్వారా వచ్చిన సమాచారం. అందుకే ఈ సంధి యత్నాలు ‘చంద్ర’వంశ అంతఃపురం సాక్షిగా రక్తి కట్టిస్తున్న ఎత్తుగడగా కనిపిస్తున్నాయి. చక్రవర్తిగా బుచ్చిరాజు చలామణీ అయ్యే రోజుల్లో అతడికి ఆదిరాజు సామంతుడు కావడమే విచిత్రం. సామంతుల మ«ధ్య చిచ్చు చివరకు ఏ తీరానికి చేరుతుందోనని ఇరుగు, పొరుగు రాజ్యాల్లోని నాయకులు, ప్రజలు కోటగోడలెక్కి మరీ ఆసక్తిగా చూస్తున్నారు. -
అధిష్టానంపై ‘గోరంట్ల’ తీవ్ర అసంతృప్తి
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి గోరంట్ల రాజీనా మా చేస్తున్నట్లు గురువారం సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది. ఈ సమాచారంపై మీడియా వద్ద స్పందించేం దుకు గోరంట్ల తొలుత నిరాకరించారు. సీని యర్ అయిన తనను పార్టీ అధిష్టానం అవ మానానికి గురిచేస్తోందనే ఆవేదనతో రాజమ హేంద్రవరంలో ఇంటికే పరిమిత మయ్యారు. విషయం తెలుసుకుని ఆ పార్టీ మరో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, మాజీమంత్రి జవహర్ ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. చంద్రబాబుతో మాట్లాడి సర్దుబా టు చేస్తామని, గోరంట్ల రాజీనామా ప్రస్తావన రాలేదని, అసంతృప్తి మాత్రమేనని చిన రాజప్ప, జవహర్ ప్రకటించారు. అయినా.. అలక వీడని గోరంట్ల పార్టీలో తాను ఒంటరినని, చంద్రబాబును మాత్రం కలిసేది లేదని, నాయకులే కలుస్తారని స్పష్టంచేశారు. పార్టీ పదవులు, పీఏసీ చైర్మన్లో ప్రాధాన్యం ఇవ్వక పోవడంతో చంద్రబాబుపై గోరంట్ల తీవ్ర అసంతృప్తితో రాజీనామాకు సిద్ధపడుతు న్నట్లు సమాచారం. దీనిపై గోరంట్ల స్పందిస్తూ.. రాజీనామా విషయంపై వారం, పది రోజుల్లో స్పష్టతనిస్తానని చెప్పారు. -
టీడీపీలో ‘గోరంట్ల’ కలకలం: చంద్రబాబును కలవనని ప్రకటన
సాక్షి, తూర్పుగోదావరి: తెలుగుదేశం పార్టీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం కలకలం రేపింది. పార్టీలోని అంతర్గత వర్గ విభేదాలు ఆయన ప్రకటనతో ఒక్కసారిగా తారస్థాయికి చేరుకున్నాయి. ఆయన త్వరలో టీడీపీకి రాజీనామా చేస్తారనే వార్తలు గురువారం గుప్పుమన్నాయి. పార్టీలో సీనియర్ అయిన బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తాజాగా ఆయన పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను చంద్రబాబును కలవను. నేను ఒంటరివాడిని. చంద్రబాబును నా వద్దకు వచ్చిన నాయకులు వెళ్లి కలుస్తారు. పార్టీ మనుగడ కోసమే ఇదంతా చేస్తున్నా. నేను ఏ నిర్ణయం తీసుకున్నా బహిరంగంగా మీకే చెబుతా. పార్టీ నిర్వహణలోని లోపాలను ఎత్తిచూపడమే లక్ష్యం’ అని తెలిపారు. ఇటీవల తన వర్గాన్ని అధిష్టానం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన చెందారు. తన వ్యతిరేక వర్గం ఆదిరెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడంపై విచారం వ్యక్తం చేశారు. చదవండి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి గాయం -
టీడీపీ నాయకత్వంపై బుచ్చయ్య చౌదరి అసంతృప్తి
సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీలో అంతర్గత వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఏకంగా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేనే పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన వర్గాన్ని అధిష్టానం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన చెందారు. తన వ్యతిరేక వర్గం ఆదిరెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం పై విచారం వ్యక్తం చేశారు. కాగా, గత మార్చి నెలలో పార్టీ నాయకత్వ మార్పుపై బుచ్చయ్య చౌదరి సంచలనాత్మక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. టీడీపీ 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో నిర్వహించిన వేడుకల్లో టీడీపీలో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. టీడీపీలో కొత్త నాయకత్వం రాబోతోందని ఆయన వ్యాఖ్యానించడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. మరొకసారి టీడీపీపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేసిన తరుణంలో టీడీపీ నేతలు సతమతమవుతున్నారు.ఒకవైపు పలు ఎన్నికల్లో టీడీపీ చవిచూసిన ఓటమి నుంచి ఇంకా కోలుకోకపోవడం, మరోవైపు గత టీడీపీ హయాంలో జరిగిన అవినీతి ఉచ్చు బిగుసుకోవడంతో ఏం చేయాల్లో తెలియని డైలమాలో ఉన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, తూర్పుగోదావరి: వరుసగా ఎదురవుతున్న ఘోర పరాజయాల నేపథ్యంలో టీడీపీ నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతోంది. ఒకవైపు ఎన్నికల్లో ఓటమి నుంచి ఇంకా కోలుకోకపోవడం, మరోవైపు గత టీడీపీ హయాంలో జరిగిన అవినీతి ఉచ్చు బిగుసుకోవడంతో ఏంచేయాల్లో తెలియక టీడీపీ నేతలు సతమతమవుతున్నారు. పార్టీ బలహీనపడిన నేపథ్యంలో కొంతకాలంగా టీడీపీలో నాయకత్వ మార్పుపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. తాజాగా పార్టీ నాయకత్వ మారుపై టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన వేడుకల్లో టీడీపీలో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయంటూ ఆయన వెల్లడించారు. టీడీపీలో కొత్త నాయకత్వం రాబోతోందంటూ ఆయన చేసిన కీలక వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చదవండి: బీజేపీ - జనసేన పొత్తుపై మరోసారి సందిగ్ధం.. నామినేషన్ వేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి -
టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరీ పీఏ అరెస్ట్
తూర్పు గోదావరి: రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ చిటికెల సందీప్‌ను పోలీసులు బుధవారం శ్రీశైలంలో అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. హుకుంపేట వినాయకుని విగ్రహానికి మలినం పూసిన ఘటనపై సోషల్ మీడియాలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేశాడని సందీప్‌పై ఆరోపణలు వచ్చాయి. అయితే ఇదే ఘటనలో పోలీసులు మొదట టీడీపీ నేత బాబుఖాన్ చౌదరిని అరెస్టు చేశారు. కానీ ఈ అంశంలో బుచ్చయ్య చౌదరీ పీఏ సందీప్ హస్తం ఉందని తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేసేందుకు సిద్ధమవ్వగా అప్పటినుంచి అతను పరారీలో ఉన్నాడు. తాజాగా పరారీలో ఉన్న సందీప్ శ్రీశైలంలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. కోర్టు సందీప్‌కు రిమాండ్ విధించింది. కాగా ఈ కేసులో మరికొందరిపై కూడా కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. -
ఆ పోస్టు పెట్టించింది నేనే: గోరంట్ల
సాక్షి, రాజమహేంద్రవరం : వెంకటగిరిలో వినాయక విగ్రహానికి మలినం పూసిన ఘటనపై మత విద్వేషాలకు తావు లేకుండా చూడాలని చెప్పి, తన పీఏతో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టించానని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి చెప్పారు. అయితే దాన్ని నేరంగా భావించి అతడిపై కేసులు పెట్టడం దారుణమన్నారు. తన నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఐ, ఎస్పీలకు ఫోన్ చేసి, నిందితులను త్వరగా పట్టుకోవాలని కోరినట్టు చెప్పారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే గోర్లంట పీఏ చిటికన సందీప్‌ను పోలీసులు మంగళవారం శ్రీశైలంలో అరెస్ట్ చేశారు. బొమ్మూరు స్టేషన్‌కు తీసుకువచ్చి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 15 రోజులు రిమాండ్ విధించారు. చదవండి: విగ్రహం మలినం కేసులో టీడీపీ నేత అరెస్టు చదవండి: శ్రీరాం.. నీ బండారం బయటపెడతా! -
పార్లమెంట్లో గళమెత్తిన గోరంట్ల మాధవ్
సాక్షి, అనంతపురం: ‘ఓ వైపు ప్రకృతి వైపరీత్యం, మరోవైపు గత ప్రభుత్వ వైఫల్యం.. కరువు జిల్లా ‘అనంత’లో రైతులు కుదేలయ్యారు. పదిమందికి అన్నం పెట్టే రైతు అన్నమో రామచంద్రా...అంటూ ఉపాధి లేక పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతులకు ఉపయోకరంగా ఉంటుంది’ అని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. గురువారం ఆయన పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడారు. జిల్లాలో నెలకొన్న కరువు, రైతుల దుస్థితి, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఇంగ్లిషులో ప్రసంగించారు. తీవ్ర కరువుతో కొట్టుమిట్టాడుతున్న అనంతపురం జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలు ఎంతో గౌరవింపబడుతున్న ఈ దేశంలో తీవ్ర కరువుతో పూటగడవక కొందరు వ్యభిచార గృహాలకు తరలిపోతుండగా...మరికొందరు ఉపాధి కోసం కుటుంబాలను వదిలి గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితికి కారణం ఎవరని ప్రశ్నించారు..?. ఢిల్లీకి కూత వేటు దూరంలోనే వ్యభిచార గృహాలు నడుస్తున్నాయన్నారు. మరోవైపు బడికి వెళ్లాల్సిన పసి పిల్లలు రోడ్లుపై తిరుగుతూ కనిపిస్తున్నారన్నారు. నిర్బంధ ఉచిత విద్య చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని కోరారు. లేదంటే పిల్లలు భవిష్యత్తులో జాతికి బరువుగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్రవాదులు, టెర్రరిస్టులుగా మారితే ఆరోజు వారిని అదుపు చేసేందుకు రూ.వంద ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. అదే నేడు రూ.10 ఖర్చు చేసి బడిలో చేర్పిస్తే ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. -
గోరంట్ల బుచ్చయ్య వర్సెస్ సోము వీర్రాజు
సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడలో జరిగిన అధికారుల సమీక్షా సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఏం మాట్లాడుతున్నవాంటే ఏం మాట్లాడుతున్నావని వాదించుకున్నారు. వైఎస్ఆర్ హయాంలో మంజూరైన ఇళ్లను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ పూర్తి చేయలేదని సోము వీర్రాజు అనగానే బుచ్చయ్య చౌదరి ఆవేశంతో ఊగిపోయారు. మిగిలిన సభ్యులు, మంత్రులు వీరిని శాంతింపజేశారు.