hanuman jayanthi
-
హైదరాబాద్‌లోని ఆలయంలో ఓం రౌత్ ప్రత్యేక పూజలు, ఫొటోలు వైరల్
ఆది పురుష్ డైరెక్టర్ ఓం రౌత్ హైదరాబాద్‌లో సందడి చేశారు. గురువారం(ఏప్రిల్ 6న) హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లోని ప్రముఖ హానుమాన్ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆదిపురుష్ టీం, పలువురు ప్రముఖులు ఆలయాన్ని సందర్శించారు. దీంతో ఓం రౌత్‌ను చూసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ ఆలయానికి భారీగా తరలివచ్చారు. హైదరాబాద్‌లోని హనుమాన్ ఆలయంలో ఓంరౌత్ పూజలు చేసిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా హనుమాన్ జయంతి సందర్భంగా ఆదిపురుష్ నుంచి హనుమాన్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ప్రభాస్-కృతిసనన్ జంటగా నటించిన ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో ఇటీవల శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్‌పై ట్రోల్ చేశారు. కార్టున్ బొమ్మలా ఉందని, సీతకు మెడలో తాళి, కాళ్లకు మెట్టలు లేవంటూ నెటిజన్లు విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఆది పురుష్ మూవీ మొదటి నుంచి ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ టీజర్ రిలీజ్ తర్వాత డైరెక్టర్ ఓం రౌత్‌పై ఫ్యాన్స్, నెటిజన్లతో పలు హిందూ సంఘాలు మండిపడ్డాయి. దీంతో గత జనవరిలో విడుదల కావాల్సిన ఈ మూవీని జూన్‌కి వాయిదా వేశారు. జూన్ 16ను ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. Jai Shri Ram 🏹 Jai Shri Ram 🏹 #OmRaut visited Karmanghat Hanuman Temple, Hyderabad on the occasion of #HanumanJayanti to seek blessings for his upcoming movie Adipurush.#Adipurush releases globally IN THEATRES on June 16, 2023, In 3D.#Prabhas @omraut #SaifAliKhan… pic.twitter.com/VgRMsSNP6u — Vamsi Kaka (@vamsikaka) April 6, 2023 -
హైదరాబాద్: వర్షంలో తడుస్తూ హనుమాన్ శోభాయాత్ర (ఫొటోలు)
-
బేగంపేట పోలీస్ లేన్‌లో హనుమాన్ జయంతి వేడుకలు
ఎప్పుడూ ఖాకీ దుస్తుల్లో కనిపించే రక్షక భటులు కాస్తా.. భక్తులుగా మారిపోయారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించారు. బేగంపేట పోలీస్ లేన్ క్వార్టర్స్‌లో పోలీసుల కుటుంబ సభ్యులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. బేగంపేట పోలీస్ క్వార్టర్స్ లోపలి ప్రాంగణంలో దాదాపు మూడు దశాబ్దాల కిందట ఈ గుడిని నిర్మించారు పోలీసుల కుటుంబ సభ్యులు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా గుడిని విశాలంగా, సుందరంగా తీర్చిదిద్దారు. పలువురు రాజకీయ నాయకులు, ఇతర రంగాల ప్రముఖుల సహకారంతో గుడి ఆవరణకు ఒక రూపం తీసుకొచ్చారు. అప్పటి నుంచి ప్రతీ హనుమాన్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సారి ఉదయం నుంచే పూజలు నిర్వహించారు పోలీసులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులు. కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో బేగంపేట ఏసీపీ GS చక్రవర్తి, పోలీసు కుటుంబ సభ్యుల్లో ఒకరైన రవి క్రియాశీలకంగా వ్యవహరించగా, ముఖ్యఅతిథిగా సినీ నటులు కృష్ణ భగవాన్, రాజకీయ నాయకులు దాసోజు శ్రవణ్ తదితరులు హాజరయ్యారు. అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
'ఆదిపురుష్' నుంచి లేటెస్ట్ అప్డేట్.. మరో పోస్టర్ విడుదల
ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఆదిపురుష్. రామయాణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా, కృతిసనన్ సీతగా దర్శనమివ్వనుంది. 400కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2023 జూన్ 16న విడుదల కానుంది. ఇటీవల రామ నవమి సందర్భంగా ‘ఆదిపురుష్’ సినిమా కొత్త పోస్టర్ని విడుదల చేసిన మేకర్స్ ఇప్పుడు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘రామ భక్తుడు, రాముడి ఆత్మ.. జై పవన్‌పుత్ర హనుమాన్!’ అని క్యాప్షన్ ఇస్తూ, రామభక్తిలో మునిగిపోయిన హనుమంతుని పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఈ చిత్రంలో హనుమంతుడిగా దేవదత్ నాగే నటించారు. ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటినుంచి ఇప్పటికే పలు వివాదాలు చుట్టుముట్టాయి.మొన్నటికి మొన్న రామనవమి సందర్భంగా విడుదల చేసిన లుక్‌లో కూడా రాముడు, సీత, లక్ష్మణుడి వేషధారణపై పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి తాజాగా విడుదలైన పోస్టర్‌తో ఇంకేమైనా వివాదాలు తలెత్తుతాయా అన్నది చూడాల్సి ఉంది. View this post on Instagram A post shared by Prabhas (@actorprabhas) -
ఏ దేవుడూ హర్షించడు!
ఉత్సాహంగా జరుపుకోవాల్సిన సందర్భం ఉద్రిక్తతలకు దారి తీస్తే? ఎవరూ హర్షించరు. కానీ, ఇలాంటి పరిణామాలు ఎక్కువవుతున్నాయి. మార్చి 30న శ్రీరామనవమి సందర్భంగా గత వారం రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో తలెత్తిన ఘర్షణలే అందుకు సాక్ష్యం. భక్తిశ్రద్ధలతో జరగాల్సిన పండుగ,శాంతియుతంగా సాగాల్సిన శోభాయాత్రలు కొన్నేళ్ళుగా శత్రుత్వానికీ, అరెస్టులకూ, అభాగ్యుల మర ణాలకూ దారితీయడం శోచనీయం. ఈసారీ బిహార్, బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీల్లో రెండు మతాల ఘర్షణగా నవమి ఉత్సవం మారిపోయింది. అటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, ఇటు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోనూ హింసాకాండ చెలరేగింది. ప్రధానంగా ప్రతిపక్షాల హయాంలోని పశ్చిమ బెంగాల్, బిహార్లలో భారీ విధ్వంసం రేగిన తీరు ఆందోళనకరం. నిరుటి లాగే ఈసారీ రాళ్ళు రువ్వడం, నినాదాలు చేయడం, గృహదహనాలు, లూటీలు! సోకాల్డ్ భక్తుల చేతుల్లో కత్తులు, తుపాకీలు. వెరసి, పవిత్ర రామనవమి, రంజాన్ మాసం కలిసొచ్చే సమయం దేశంలో కొత్త తరహా హింసాత్మక ధోరణికి అనువైన సందర్భంగా మారిపోవడం ఓ విషాదం. బెంగాల్లో హౌరా జిల్లాలో వరుసగా రెండురోజులు, సోమవారం రాత్రి హుగ్లీ దగ్గర రిష్రాలో మరోసారి ఘర్షణలు రేగాయి. ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి, నిషేధాజ్ఞలు విధించిన పరిస్థితి. బిహార్‌లో సాసారామ్, నలందా జిల్లాల్లో హింసకు పలువురు గాయపడ్డారు. నలందా వద్ద 110 ఏళ్ళ చరిత్ర కలిగిన మదరసాలో వేలకొద్దీ అరుదైన పుస్తకాలకు నిలయమైన గ్రంథాలయం దుండగుల చేతిలో బూడిదైన ఘటన కదిలించేస్తుంది. రెచ్చగొట్టే ధోరణి వల్ల సామరస్యం దెబ్బతింటుందే తప్ప సమాజానికి మేలు చేకూరదు. ఇప్పుడు జరుగుతున్నదదే. వార్తల్ని గమనిస్తే – మథురలో జామా మసీదు పక్కనే కాషాయ జెండాలు కట్టారు. మరో రాష్ట్రంలో మసీదులో ప్రార్థనల వేళ పెద్దగా నినాదాలు చేస్తూ, లౌడ్ స్పీకర్లు హోరెత్తించారు. బెంగాల్లో అనుమతించిన మార్గంలో కాక రెండు వర్గాలూ ఉండే సున్నితమైన ప్రాంతం మీదుగా కత్తులతో ఊరేగింపు జరిపారు. నిరుటి ఉద్రిక్తతల రీత్యా ఢిల్లీలో ఓ పార్కులో నవమి యాత్ర, నమాజు – రెంటినీ పోలీసులు నిషేధించారు. అయినా కొన్ని మతవాద సంస్థలు అక్కడే యాత్ర, పూజ చేయడాన్ని ఏమనాలి? అదే సమయంలో రెండు చేతులూ కలవనిదే చప్పుడు రాదంటూ రెండోవర్గపు తప్పులు చెబుతున్నవారినీ కొట్టిపారేయలేం. ఈ హింసాకాండ రాజకీయ నిందలకు దారి తీస్తోంది. ఈ ఘర్షణలకు తమ పాలనలోని లోపాలు, ఉదాసీనతలు కారణమని అంగీకరించడానికి మమత, బిహార్ సీఎం నితీశ్ కుమార్ సహజంగానే సిద్ధంగా లేరు. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన గూండాలతో బీజేపీ ఈ ఘర్షణలకు పాల్పడుతోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణ. బెంగాల్ పోలీసులు ఒక వర్గానికే కొమ్ముకాస్తూ, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని బెంగాల్ బీజేపీ ఛీఫ్ నింద. ఇక, ఆ రాష్ట్ర గవర్నర్ సైతం బాధితప్రాంతాల్లో పర్యటించి గట్టిగానే గళం విప్పారు. ఘర్షణలపై కేంద్ర హోమ్‌శాఖ నివేదిక కోరే పరిస్థితి వచ్చింది. శ్రీరామనవమి ఘర్షణలతో గురువారం నాటి హనుమాన్ జయంతికి అప్రమత్తత అవసరమైంది. ఈసారి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా జాగరూకతతో వ్యవహరించాల్సిందిగా వివిధ రాష్ట్రాలకు హోమ్ శాఖ బుధవారం సలహా ఇవ్వాల్సి వచ్చింది. కలకత్తా హైకోర్ట్ ఆదేశంతో హనుమాన్ జయంతికి బెంగాల్ సర్కార్ 3 జిల్లాల్లో పారా మిలటరీ దళాలను బరిలోకి దింపాల్సొచ్చింది. ఈ ఘటనలన్నీ ధార్మిక ఉత్సవాలు అతి సున్నితంగా మారిన పరిస్థితులకు దర్పణం. నిజానికి, ఇలాంటివన్నీ నివారించదగ్గ విపరిణామాలు. ధార్మిక ఉత్సవాలు భారత సమాజంలో ఒక అంతర్భాగం. కానీ, వాటిని ఆసరాగా చేసుకొని, వివిధ మతాల మధ్య విషబీజాలను నాటాలనీ, రాజకీయ లబ్ధి పొందాలనీ చూస్తే అంతకన్నా నేరం, ఘోరం ఉండవు. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్ప టికీ ప్రజలు స్వేచ్ఛగా తమ మత విశ్వాసాలను అనుసరించేలా రక్షణ కల్పించాలి. వారి ధార్మిక యాత్రలకు భద్రతనివ్వాలి. అది ఆయా ప్రభుత్వాల, అధికార యంత్రాంగాల బాధ్యత. అదే సమయంలో రెచ్చగొట్టే చర్యలు, నినాదాలు, పుకార్ల ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. లక్ష్మణరేఖ దాటిన దోషులపై కఠినంగా వ్యవహరించాలి. ప్రతి ఎన్నికలో అధికారపీఠంపై పార్టీలు మారవచ్చేమో కానీ, మారకుండా ప్రజాసేవలోనే ఉండేది పోలీసు యంత్రాంగం. కాబట్టి, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాలి. ఎప్పటికప్పుడు ఏర్పాట్లలో లోపాలను సవరించాలి. విభిన్న వర్గాల మధ్య అపనమ్మకం పెంచే దుశ్చర్యలకు అడ్డుకట్ట వేయాలి. కలసిమెలసి బతకాల్సిన సమాజంలో విషబీజాలను విత్తితే అది యావత్ దేశానికే నష్టం. రాజ కీయ లబ్ధి కోసం అంగలారుస్తున్నవారు అది గ్రహించాలి. మరో ఏడాదిలో లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున మతాల మధ్య చిచ్చుపెట్టి, ఓటర్లను వర్గాలుగా చీల్చాలనే ప్రయత్నాలు పెరిగితే ఆశ్చర్యం లేదు. ఇలాంటి నీచ రాజకీయ వ్యూహాల ఉచ్చులో పడకుండా, జనం అప్రమత్తంగా ఉండాలి. రాజ కీయ వర్గాలు, చట్టాన్ని అమలు చేసే సంస్థలు రాజ్యాంగ విహితంగా వ్యవహరిస్తూ, మారణకాండకూ, మనుషుల్లో చీలికకూ చెక్ పెట్టాలి. ఒక్కమాటలో – సహనం, శాంతి, క్షమ పాటించిన ఆ రాముడైనా, అల్లా అయినా పొరుగువాడిని ద్వేషించమనలేదు. తమ ధర్మం గొప్పదని చాటుకోవడా నికి పరధర్మాన్ని తక్కువ చేయమని ఏ సమాజమూ, ఏ దేవుడూ చెప్పలేదు. అంతర్యామి సైతం హర్షించని ఘర్షణలతో మానవతా ధర్మాన్ని సైతం మర్చిపోతే, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఏ ధర్మంలోనూ లేదు. పాపఫలం మాత్రం ఇక్కడే, ఇప్పుడే మనమందరం అనుభవించాల్సి వస్తుంది. -
హనుమాన్ జయంతి ర్యాలీలో హింస.. 14 మంది అరెస్ట్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. జహంగీర్‌పురి ప్రాంతంలో ర్యాలీపై దుండగులు రాళ్లు రువ్వారు. ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. అయితే ఈ దాడిలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒక స్థానికుడు, ఎనిమిది మంది పోలీసులు ఉన్నారు. గాయపడిన వారిలో ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మేధలాల్ మీనా కూడా ఉన్నారు. అతని చేతికి బుల్లెట్ గాయమైంది. అయితే అతని ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో కాల్పులు జరిపిన అస్లాం కూడా ఉన్నాడు. నిందితుడి నుంచి ఒక కంట్రీమేడ్ పిస్తోల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఢిల్లీలో రాళ్లదాడి, హింసాత్మక ఘటనలకు సంబంధించి 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజీలు, సోషల్ మీడియాలోని వీడియోల ద్వారా మరింతమంది అనుమానితులను గుర్తించి వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. సంబంధిత వార్త: ఢిల్లీ హనుమాన్ జయంతి శోభాయాత్రపై రాళ్ల దాడి హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా చెలరేగిన ఘర్షణలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనం వహించడంపై ప్రతి పక్షాలు విమర్శలు గుప్పించాయి. దేశంలో శాంతి సామరస్యాన్ని కాపాడాలని, 13 ప్రతిపక్ష పార్టీలు విజ్ఞప్తి చేశాయి. అలాగే మతపరమైన హింసలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు శనివారం సంతకాల సేకరణ ద్వారా ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. దేశంలో జరుగుత్ను మతపరమైన ఉద్రిక్తతలపై ప్రధాని మౌనం వహించడం షాక్‌కు గురిచేసిందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా మాట్లాడటంలో, చర్యలు తీసుకోవడంలో మోదీ విఫలమయ్యారని విమర్శించారు. ‘ప్రధాని మౌనం.. ఇలాంటి ప్రైవేట్ సాయుధ గుంపులను అధికారికంగా ప్రోత్సాహించినట్లే అవుతుంది. వాళ్లు సంఘంలో విలాసాల్ని అనుభవిస్తున్నారనడానికి ఒక స్పష్టమైన సాక్ష్యంగా నిలిచింది’ అని విపక్షాలు ప్రకటనలో పేర్కొన్నాయి. ఇక సంతకం చేసిన పార్టీల్లో కాంగ్రెస్, తృణమూల్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ(ఎం), డిఎంకే, ఆర్జేడీ, ఇతర ప్రధాన ప్రతిపక్షాలు ఉన్నాయి. కాగా శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు జాబితాలో లేకపోవడం గమనార్హం. -
భాగ్య నగరంలో హనుమాన్ శోభాయాత్ర (ఫోటోలు)
-
Hanuman Shobha Yatra: ఈ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు
సాక్షి, హైదరాబాద్: హనుమాన్ జయంతి నేపథ్యంలో జరిగే విజయ్ యాత్రకు పోలీసు విభాగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధాన ఊరేగింపు గౌలిగూడ రామ్ మందిర్‌లో ఉదయం 11.30 గంటలకు మొదలై సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ హనుమాన్ మందిర్ వద్ద రాత్రి 8 గంటలకు ముగియనుంది. ఈ మార్గంలోని వివిధ ప్రాంతాల మీదుగా 12 కి.మీ సాగుతుంది. మరో ఊరేగింపు రాచకొండ పరిధిలోని కర్మన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్ వద్ద మొదలై వివిధ మార్గాల్లో 10.8 కి.మీ ప్రయాణిస్తూ కోఠి ఉమెన్స్ కాలేజ్ జంక్షన్ వద్ద ప్రధాన ఊరేగింపులో కలవనుంది. ఈ మ్యాప్‌ను పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం విడుదల చేశారు. ఈ రెండు మినహా కొత్త ఊరేగింపులకు ప్రధాన ఊరేగింపులో కలవడానికి అనుమతించరు. నగర పోలీసులతో పాటు ఇతర విభాగాలతో కలిపి మొత్తం 8 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ, ఆర్టీసీ సహా వివిధ విభాగాలతో భేటీ అయిన నగర పోలీసులు సమన్వయంతో ముందుకు వెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. #HYDTPinfo Commuters, please note traffic diversions in connection with the “Sri Hanuman Jayanthi Vijaya Yathra” procession on 16-04-2022 at 0900 hours, starting from Gowliguda Ram Mandir to Tadbund Sri Veeranjaneya Swamy Temple. pic.twitter.com/BrOuGXBy0D — Hyderabad Traffic Police (@HYDTP) April 15, 2022 రూట్‌మ్యాప్ ► బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో అన్ని శాఖలకు కలిపి ఉమ్మడి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సున్నిత ప్రాంతాల్లో అదనపు బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. సైబర్ స్పేస్ పోలీసింగ్‌లో భాగంగా సోషల్‌మీడియాపై కన్నేసి ఉంచడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ► ఊరేగింపుపై షీ– టీమ్స్, మఫ్టీ పోలీసులు కన్నేసి ఉంచనున్నారు. విజయ్ యాత్ర జరిగే మార్గాలతో పాటు చుట్టుపక్కల రూట్లలోనూ ముమ్మర తనిఖీలు, సోదాలు చేయనున్నారు. ఊరేగింపు నేపథ్యంలో శనివారం మద్యం విక్రయాలను నిషేధించారు. యాత్ర జరిగే మార్గాల్లో శుక్రవారం పర్యటించిన నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఇతర ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో సమీక్షించారు. ► బందోబస్తుతో పాటు ఇతర అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ‘శనివారం పనిదినం కావడంతో సాధారణ వాహనచోదకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నాం. ఊరేగింపు జరిగే మార్గాల్లోని ఎత్తైన భవనాలపై ఉండే ప్రత్యేక సిబ్బంది రూఫ్ టాప్ వాచ్ నిర్వహిస్తారు. అవసరమైన స్థాయిలో సీసీ కెమెరాలతో పాటు డ్రోన్లును వాడుతున్నాం’ అని పేర్కొన్నారు. చదవండి: E Challan: అంచనాలకు మించి వసూలు.. వారిపై చర్యలకు రంగం సిద్ధం ట్రాఫిక్ మళ్లింపు, ఆంక్షలు ఈ ప్రాంతాల్లోనే.. శనివారం ఉదయం 11.30– 12 గంటల మధ్య గౌలిగూడ నుంచి విజయ్ యాత్ర మొదలవుతుంది. మరో కర్మన్‌ఘాట్‌లో ప్రారంభమవుతుంది. ఈ ఊరేగింపులు ఏయే ప్రాంతాలకు చేరుకుంటే అక్కడ, ఆయా సమయాల్లో మళ్లింపులు, ఆంక్షలు అమలవుతాయి. నిర్దేశిత సమయాల్లో ఈ మార్గాల్లో ప్రయాణించాల్సిన వారు ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలని పోలీసులు కోరుతున్నారు. ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైనా 040– 27852482, 90102 03626, లేదా హైదరాబాద్ పోలీసు సోషల్‌మీడియా యాప్స్‌ను సంప్రదింవచ్చు. -
రేపటి నుంచి తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు
తిరుమల : తిరుమలలోని ఆకాశగంగ ప్రాంతం శ్రీ హనుమంతుని జన్మ స్థలమని టీటీడీ కమిటీ ప్రకటించిన నేపథ్యంలో ఆకాశగంగ వద్ద ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ దాకా హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీ పంచాంగంలో నిర్దేశించిన ప్రకారం ప్రతి ఏటా చేసే కార్యక్రమాలు యథాతథంగా చేస్తామన్నారు. కాగా, అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే నడకదారి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేస్తామని ధర్మారెడ్డి చెప్పారు. నడక దారి పైకప్పు నిర్మాణం పనులు వేగంగా చేయడం కోసం జూలై 30 వరకు భక్తులను అనుమతించడం లేదన్నారు. తిరుమలకు నడచి రావాలనుకునే భక్తులు శ్రీవారి మెట్టు మార్గంలో రావాలని ఆయన కోరారు. ఇందుకోసం తిరుపతి రైల్వే స్టేషన్, అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. -
మద్యం విక్రయాలు బంద్..
కంటోన్మెంట్,సుల్తాన్‌బజార్: హనుమాన్ జయం తిని పురస్కరించుకుని ఈ నెల 19న నిర్వహించనున్న శోభాయాత్రకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు నగరపోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. బుధవారం ఆయన జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ ఇతర అధికారులతో కలిసి శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించారు. తాడ్బంద్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ శోభాయాత్ర నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 1,200 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. యాత్రామార్గంలో 450 ప్రత్యేక సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం గౌలిగూడ నుంచి ప్రారంభం కానున్న శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నందున మార్గమధ్యంలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. రహదారుల మరమ్మతులు పూర్తి చేశామని. వేసవి దృష్ట్యా భక్తులకు మంచినీటిని అందుబాటులో ఉంచుతామన్నారు. పారిశుద్ధ్య సిబ్బందిని పెద్ద సంఖ్యలో శోభాయాత్ర విధులకు కేటాయించినట్లు తెలిపారు. శుక్రవారం సాయంత్రం తాడ్బంద్ హనుమాన్ ఆలయం వద్ద యాత్ర ముగుస్తుందన్నారు. యాత్రా మార్గంలో ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్లు తెలిపారు. అంతకు ముందు తాడ్బంద్ దేవాలయ కమిటీ చైర్మన్ బూరుగు వీరేశం అధికారులకు ఘనంగా స్వాగతం పలికారు. ట్రాఫిక్ మళ్లింపులపై విస్తృత ప్రచారం సాక్షి, సిటీబ్యూరో: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం శోభాయాత్ర నిర్వహించనున్నారు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్‌బండ్ హనుమాన్ టెంపుల్ వరకు జరిగే ఈ భారీ ఊరేగింపునకు నగర పోలీసులు భారీ భద్రత, బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సాధారణ వాహనచోదకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఆ రోజు తీసుకోవాల్సిన చర్యలపై ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ బుధవారం విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని ఉరేగింపు మార్గాల్లో అధికారులు స్వయంగా పర్యటించి సమస్యలను గుర్తించాలని సూచించారు. ఏ ప్రాంతంలో అయినా అత్యవసర వాహనాలు, అంబులెన్స్‌లకు కచ్చితంగా దారివదిలేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తున్న ప్రాంతాల్లో బారికేడ్లు, సైనేజెస్ ఏర్పాటు చేయాలన్నారు. వీటి వల్ల సామాన్య వాహనచోదకులకు ఎలాంటి ఇబ్బందులు రావని, ఊరేగింపునకు ఆటంకం ఉండదని ఆయన పేర్కొన్నారు. నగరంలోని కీలక ప్రాంతాల్లో ఎత్తైన స్థంభాలపై ఏర్పాటు చేసిన, మెబైల్ వేరియబుల్ మెసేజ్ బోర్డుల ద్వారా వాహనచోదకులకు ఎప్పటికప్పుడు సమాచారం, సలహాలు, సూచనలు అందించాలన్నారు. ట్రాఫిక్ మళ్లింపులు, ఆయా మార్గాల్లో ఉన్న రద్దీని గూగుల్ మ్యాపుల్లోనూ కనిపించేలా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ట్రాఫిక్ డీసీపీలు ఎల్ఎస్ చౌహాన్, కె.బాబూరావు తదితర అధికారులు పాల్గొన్నారు. రూట్ మ్యాప్‌ను పరిశీలిస్తున్న సీపీ అంజనీకుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ తదితరులు మద్యం విక్రయాలు బంద్ హనుమాన్ జయంతి ర్యాలీ నేపథ్యంలో నగరంలో మద్యం విక్రయాలను నిషేధిస్తూ సీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 6 నుంచి శనివారం ఉదయం 6 వరకు నగరంలోని మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు తదితరాలు మూసి ఉంచాలని ఆయన స్పష్టం చేశారు. రిజిస్టర్డ్ క్లబ్బులు, స్టార్ హోటల్స్‌లో ఉన్న బార్లకు మినహాయింపు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
ఘనంగా హనుమాన్ జయంతి
కట్టంగూర్ : హనుమాన్ జయంతి వేడుకలను మండలంలోని ఈదులూరు, కట్టంగూర్, అయిటిపాముల, చెర్వుఅన్నారం, పామనగుండ్ల గ్రామాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కట్టంగూర్, ఈదులూరు గ్రామాల్లో భక్తులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నరేష్, రమేష్, కిరణ్‌కుమార్, శ్రావణ్‌కుమార్, రమేష్, మోహన్, గుడిసె రవి, యశ్వంత్, శివశంకర్, మనోహర్ ఉన్నారు. నార్కట్‌పల్లి : స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్‌జయంతిని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు జానకిరామ శర్మ అర్చక బృందం ఆధ్వర్యంలో గాయత్రి హోమం, సహస్ర నామార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమానికి ఎంపీపీ రేగట్టే మల్లికార్జున్‌రెడ్డి సతిమణి రేగట్టే శోభారెడ్డి, జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, అండాలు, వైస్ ఎంపీపీ పుల్లెంల పద్మ ముత్తయ్య, సర్పంచ్ పుల్లెంల అచ్చాలు, అయిలమ్మ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ చైర్మన్ అనంతుల నాగరాజు చంద్రకళలు సన్మానం చేశారు. పూజా కార్యక్రమంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ చైర్మన్ సామ కొండల్‌రెడ్డి, కట్ట కిరణ్‌కుమార్, ముంత నర్సింహ, నడింపల్లి శ్రవణ్‌కుమార్, బొడ్డ నాగరాజు, ఐతరాజు రమేష్ పాల్గొన్నారు. -
ఘనంగా ముగిసిన హనుమజ్జయంతి
-
అంజన్న పెళ్లికొడుకాయనె..
పరకాల రూరల్: ఆంజనేయస్వామి, సువర్చలాదేవి కల్యాణానికి వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట భక్తాంజనేయస్వామి ఆలయం వేదిక కానుంది. లోక కల్యాణం కోసం బ్రహ్మచారులకు వివాహ వేడుకలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆరు సంవత్సరాలుగా ఇక్కడ అంజన్న కల్యాణం నిర్వహి ంచండం ఆనవాయితీగా వస్తోంది. శనివారం నిర్వహించే ఈ కల్యాణ వేడుక కోసం అవసరమైన ఏర్పాట్లును నిర్వాహకులు చేపట్టారు. కల్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు.. భక్తాంజనేయస్వామి ఆలయంలో సువర్చలాదేవి–హనుమంతుడి కల్యాణం నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ఆవరణలో భక్తుల కోసం చలువ పందిళ్లు, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. మహా అన్నదానం చేసేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. పెరిగిన భక్తుల తాకిడి.. పరకాల ప్రాతంలో తొలిసారి హనుమాన్ దీక్షలు ఈ ఆలయంలో చేపట్టడంతో భక్తులు పెరిగారు. పట్టణానికి చెందిన కాటూరి జగన్నాథచార్యులు 1988లో చెట్టుకింద ఉన్న హనుమాన్ విగ్రహానికి పూజలు అభిషేకాలు చేయడం ప్రారంభించారు. 1991లో జగనాన్నథచార్యులుతోపాటు మరో నలుగురు విజయవాడకు వెళ్లి 41రోజుల హనుమాన్ దీక్ష చేపట్టారు. మరుసటి సంవత్సరం నుంచి ఈ ఆలయంలో హనుమాన్ దీక్షాపరుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది. అలాగే 1997లో 108 కలశాలతో దుర్గాప్రసాద్ స్వామీజీ చేత యజ్ఞాలు చేయించారు. 2000 సంవత్సరంలో 1108 కలశాలతో హోమాలు చేయించారు. 2013లో 108 వినాయక విగ్రహాలతో 41రోజుల పాటు ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుతం ఆలయంతో సుమారు పది వేలకు పై బడి భక్తులు హనుమాన్ మాలాధారణ చేస్తున్నారు. ఆలయానికి వందేళ్ల చరిత్ర.. ఈ ఆలయానికి నూరు సంవత్సరాల చరిత్ర ఉంది. నాడు ఒక చెట్టు కింద విగ్రహ రూపంలో వెలిసిన హనుమంతుడికి ఆలయం కట్టించారు. ప్రతి ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి(ఇల్లంతకుంట పౌర్ణమి) రోజున ఆలయం చుట్టుపక్కల ఉన్న మల్లక్కపేట, రాయపర్తి, నాగారం, నర్సక్కపల్లి గ్రామాల నుంచి భక్తులు ఎడ్లబండ్లపై వచ్చి మొక్కులు చెల్లించుకునే వారు. కాల క్రమేనా ఆలయ విశిష్టత పెరిగి ప్రసిద్ధి గాంచిన హనుమాన్ దేవాలయాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. బ్రహ్మచారి అయిన హనుమంతుడి కల్యాణం చాలా శ్రేష్టమైనది. మన రాష్ట్రంలో ఇక్కడ మాత్రమే హనుమంతుడి కల్యాణం నిర్వహిస్తున్నాం. హోమంతో ప్రారంభమై పూర్ణాహుతి అనంతరం సువర్చలాదేవితో ఆంజనేయస్వామి కల్యాణ మహోత్సవం జరుగుతుంది. – కాటూరి జగన్నాథచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు -
హనుమాన్ జయంతి ఏర్పాట్లపై సమీక్ష
కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు అంజన్న ఆలయంలో ఈనెల 31న నిర్వహించే చిన్నజయంతి ఉత్సవాల ఏర్పాట్లపై ఎస్పీ సునీల్‌దత్ శుక్రవారం సమీక్షించారు. ఆలయ ఈవో అమరేందర్, డీఎస్పీ భద్రయ్య, జగిత్యాల రూరల్ సీఐ శ్రీనివాసచౌదరి, మల్యాల సీఐ నాగేందర్‌గౌడ్ హాజరయ్యారు. అంతకుముందు ఎస్పీ ఆలయం పరిసరాలు, క్యూలైన్, కోనేరు, కల్యాణకట్ట, సీతమ్మకన్నీటి గుంత, బేతాళస్వామి ఆలయం, వాహనాల పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. దీక్షాపరులకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారో ఆలయ ఈవోను అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. సూపరింటెండెంట్ శ్రీనివాసశర్మ, ఎస్ఐ నీలం రవి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
హోరెత్తిన శోభాయాత్ర
హిందూపురం అర్బన్ : హనుమాన్ జయంతి సందర్భంగా హిందూసురక్షసమితి ఆధ్వర్యంలో వైభవంగా శోభాయాత్ర చేపట్టారు. సుగూరు ఆంజనేయస్వామి ఆలయం వద్ద పూజలు నిర్వహించి హనుమాన్ విగ్రహాన్ని వాహనంపై కొలువుదీర్చి వేలాదిమంది భక్తులు రామదండు ర్యాలీగా కదిలారు. ఆలయం నుంచి జై శ్రీరామ్, జైబోలో హనుమాన్ అంటూ కాషాయ పతాకాలు పట్టుకుని ర్యాలీగా తరలివెళ్లారు. హిందూసురక్షసమితి అధ్యక్షులు రవిచంద్ర, శ్రీనివాసులు, బాబు, విద్యాసాగర్ నేతృత్వంలో ర్యాలీ భారీగా సాగింది. ర్యాలీలో యువకులు జై హనుమాన్ అంటూ కేరింతలు కొడుతూ కదిలారు. జాంబవంతుడు, హనుమంతుడు వేషధారణలో యువకులు అలరించారు. అలాగే కొల్లకుంట ఆంజనేయస్వామి, సూరప్పకట్ట వద్ద పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సమితి సభ్యులతో పాటు వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా రాతిదూలం లాగుడు పోటీలు
అనంతపురం రూరల్ : హనుమజ్జయంతిని పురస్కరించుకుని ఎ.నారాయణపురం గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన రాతిదూలం లాగుడు పోటీలు ఉత్సాహంగా సాగాయి. 8 కాండ్ల ఒంగోలు జాతి ఎద్దులు ఈ పోటీల్లో పాల్గొనగా ఆత్మకూరు మండలం మదిగుబ్బ గ్రామానికి చెందిన రాజన్న ఎద్దులు ప్రథమ స్థానంలో నిలిచాయి. యల్లనూరు మండలానికి చెందిన రామలింగారెడ్డి ఎద్దులు రెండవ స్థానంలోనూ, ఆత్మకూరు మండలానికి చెందిన రాజగోపాల్ ఎద్దులు మూడవ స్థానంలోనూ నిలిచాయి. నార్పల మండలం జంగంరెడ్డిపేటకు చెందిన రామలింగ వృషభాలు నాల్గో స్థానంలో నిలిచాయి. మొదటి బహుమతిగా రూరల్ మండల జెడ్పీటీసీ సభ్యుడు వేణుగోపాల్ రూ.20వేలు, రెండవ బహుమతిగా నారాయణపురం గ్రామానికి చెందిన పి.నారాయణస్వామి రూ.15 వేలు, మూడో బహుమతిగా ఎంపీటీసీ సభ్యుడు నాగేంద్ర రూ.10వేలు, నాల్గో బహుమతిగా లక్ష్మీనారాయణ రూ.5వేలు అందజేశారు. అనంతరం గ్రామంలోని అనంత వీరాజంనేయస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదానం చేశారు. -
కాషాయ క్షేత్రంగా యాదాద్రి పుణ్యక్షేత్రం
యాదాద్రి: మహా రామభక్తుడు.. ధర్మ రక్షకుడైన ఆంజనేయ స్వామి జయంతిని పురస్కరించుకుని ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో శోభాయాత్ర నిర్వహించారు. దీంతో యాదాద్రి కాషాయ క్షేత్రంగా మారింది. ఈ యాత్ర ఆదివారం హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన రహదారిపై హనుమాన్, శ్రీరాముడు, శివాజీ మహరాజ్‌ల భారీ విగ్రహాలతో సుమారు 6గంటలపాటు జరిగింది. కాషాయపు దుస్తులతో హనుమాన్ నామస్మరణం చేస్తూ కోలాటం, సంప్రదాయ నృత్యాలతో యాత్ర కొనసాగడం చూపరులను ఆకట్టుకుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఒంటెలపై చిన్నారులు శోభాయాత్రలో పాల్గొనడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ శోభయాత్రలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, శ్రీ రామకష్ణనందగిరి స్వామిజీ, శ్రీకష్ణ అఖండనామ సంకీర్తన ఆశ్రమ పీఠాధిపతి ప్రసన్న కష్ణదాసు ప్రభుజీ, మాతా మధు మంజరీదేవి, త్రిశక్తి పీఠాధిపతి బాలశివ స్వామిజీలు పాల్గొన్నారు. -
కిటకిటలాడుతున్న హనుమాన్ ఆలయాలు
► హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు భద్రాచలం : హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయుడి ఆలయాలు భకులతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచే పలు ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. భద్రాద్రిలో శ్రీరామచంద్రస్వామి దర్శనానికి భక్తులకు ఏడు గంటల సమయం పడుతోంది. హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా సీతారాముల దర్శనానికి భక్తులు పోటెత్తారు. గోదావరి నదిలో హనుమాన్ మాలధారులు పుణ్యస్నానాలు చేసి మొక్కులు చెల్లిస్తున్నారు. జగిత్యాల జిల్లాలోని మరో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు పుణ్యక్షేత్రానికి భక్త జనం పోటెత్తింది. స్వామివారి దర్శనం కోసం సుమారు ఆరు గంటల సమయం పడుతోంది. -
హనుమాన్ ర్యాలీకి పకడ్బందీ ఏర్పాట్లు
– 250మంది పోలీసులతో బందోబస్తు హిమాయత్‌నగర్: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నిర్వహించే హనుమాన్ ర్యాలీకి పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సుమారు 250మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తును నిర్వహిస్తున్నట్లు అబిడ్స్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జె.రాఘవేందర్‌రెడ్డి తెలిపారు. నారాయణగూడలోని ఓ ఫంక్షన్ హాలులో నారాయణగూడ, అబిడ్స్, బేగంబజార్ పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, కానిస్టేబుళ్లతో సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవేందర్‌రెడ్డి మాట్లాడుతూ హనుమాన్ ర్యాలీ గౌలిగూడ రామమందిరం నుంచి ప్రారంభమై సూల్తాన్‌బజార్ పీఎస్ మీదుగా అబిడ్స్, నారాయణగూడ పీఎస్‌ల పరిధిలోకి వస్తుందన్నారు. అబిడ్స్, నారాయణగూడ, బేగంబజార్ పీఎస్ పరిధిలో ఉన్న మసీదులు, మదర్సా, చిల్లాల్ల వద్ద ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటి మీదుగా ర్యాలీ వెళ్తున్నప్పుడు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. చిల్లాల్ వద్ద కుంకుమ చల్లే అవకాశాలు ఉండటం వల్ల అక్కడ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. యువకులు ద్విచక్రవాహనాలపై ర్యాలీగా కట్టెలతో వస్తారని, వాటిని స్వాధీనం చేసుకోవాలన్నారు. సమావేశంలో నారాయణగూడ ఇన్స్పెక్టర్ బండారి రవీందర్, క్రైమ్ ఇన్స్పెక్టర్ గవిడి రాంబాబు, ఇన్స్పెక్టర్లు గంగారాం, మోహన్, లక్ష్మణ్, ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు నాగార్జునరెడ్డి, వెంకటేశ్వర్లు, ఇమ్మానియేలు, సైదులు, కవుద్దీన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
రేపు ఈ దారుల్లో వెళ్లొద్దు
- శుక్రవారం పలు ప్రాంతాల్లో అమలు సాక్షి, సిటీబ్యూరో: హనుమాన్ జయంతి సందర్భంగా శుక్రవారం నగరంలో భారీ ఊరేగింపు జరుగనున్న నేపథ్యంలోనే నగరంలోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు విధిస్తూ కమిషనర్ మహేందర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఊరేగింపు జరిగే ప్రధాన మార్గాలతో పాటు అది చేరుకున్న ప్రదేశాల్లో అవసరాన్ని బట్టి వీటిని అమలు చేయనున్నారు. నగర వాసులు వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నా య మార్గాలు ఎంచుకోవాలని ఆయన సూచించారు. ♦ అఫ్జల్‌గంజ్, ఎస్జే బ్రిడ్జ్, శంకర్‌షేర్ హోటల్ వైపు నుంచి పుత్లిబౌలి చౌరస్తా వైపు వెళ్లే వాహనాలను గౌలిగూడ చమాన్ నుంచి బీఎస్ఎన్ఎల్ కార్యాలయం, సీబీఎస్ వైపు మళ్లిస్తారు. ♦ కోఠి ఆంధ్రాబ్యాంక్, రంగ్‌మహల్ వైపు నుంచి గౌలిగూడ చమాన్ వైపు వాహనాలను అనుమతించరు. వీటిని రంగ్‌మహల్ వైపు మళ్లిస్తారు. ♦ చాదర్‌ఘాట్ చౌరస్తా నుంచి పుత్లిబౌలి చౌరస్తా వైపు వెళ్లే వాహనాలను రంగ్‌మహల్ ‘వై’ జంక్షన్ నుంచి సీబీఎస్ వైపు పంపిస్తారు. ♦ పుత్లిబౌలి చౌరస్తా నుంచి ఆంధ్రాబ్యాంక్ వైపు, జీపీఓ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తారు. ♦ ఊరేగింపు కోఠిలోని ఆంధ్రాబ్యాంక్ వద్దకు చేరుకున్నప్పుడు చాదర్‌ఘాట్ చౌరస్తా వైపు నుంచి ఆంధ్రాబ్యాంక్ వైపు వెళ్లే వాహనాలను డీఎం అండ్ హెచ్ఎస్ జంక్షన్ నుంచి సుల్తాన్బజార్చౌరస్తా వైపు పంపిస్తారు. ♦ ఊరేగింపు కాచిగూడ చౌరస్తాకు చేరుకున్న తర్వాత కాచిగూడ రైల్వే స్టేషన్ వైపు నుంచి వచ్చే వాహనాలను బడీచౌడి వైపు మళ్లిస్తారు. ♦ ఆజామాబాద్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను క్రౌన్ కేఫ్ నుంచి వీఎస్టీ చౌరస్తా మీదుగా పంపిస్తారు. ♦ ముషీరాబాద్ చౌరస్తా వైపు నుంచి వచ్చే వాహనాలను మెట్రో కేఫ్ నుంచి రామ్‌నగర్ ‘టి’ జంక్షన్ వైపు పంపిస్తారు. ♦ హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ నుంచి నారాయణగూడ చౌరస్తా వైపు వచ్చే వాహనాలను నారాయణగూడ ఫ్లైఓవర్ మీదుగా మాత్రమే పంపిస్తారు. దిగువ నుంచి వాహనాలను అనుమతించరు. ♦ క్రౌన్ కేఫ్ వైపు నుంచి నారాయణగూడ చౌరస్తా వైపు వచ్చే వాహనాలను నేరుగా ఫ్లైఓవర్ మీదికి పంపిస్తారు. ♦ నారాయణగూడ చౌరస్తా, హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ మధ్య వాహనాలకు ప్రవేశం లేదు. ♦ కింగ్‌కోఠి, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు నుంచి వ చ్చే వాహనాలను వైఎంసీఏ సర్కిల్ వైపు అనుమతిం చరు. వీటిని ఈడెన్ గార్డెన్ నుంచి సిమెట్రీ వైపు పంపిస్తారు. ♦ బర్కత్‌పుర చమాన్ వైపు నుంచి వైఎంసీఏ సర్కిల్ వైపు ఎలాంటి వాహనాలను అనుమతించరు. వీటిని ఓల్డ్ పోస్టాఫీస్ చౌరస్తా నుంచి క్రౌన్ కేఫ్, కాచిగూడ చౌరస్తా వైపు పంపిస్తారు. ♦ కవాడీగూడ చౌరస్తా-ప్రాగా టూల్స్ మధ్య ప్రధా న రహదారిపై ఎలాంటి ట్రాఫిక్‌ను అనుమతించరు. ♦ కర్బాలా మైదాన్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను కవాడీగూడ చౌరస్తా వైపు అనుమతించరు. వీటిని సెయిలింగ్ క్లబ్ ‘టి’ జంక్షన్ నుంచి చిల్డ్రన్స్ పార్క్ మీదుగా పంపిస్తారు. ♦ లోయర్ ట్యాంక్‌బండ్‌లోని కట్టమైసమ్మ దేవాలయం వైపు నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలను డీబీఆర్ మిల్స్ వైపు పంపిస్తారు. ♦ ప్రధాన ఊరేగింపు ఆర్పీ రోడ్‌కు చేరుకున్నప్పుడు కర్బాలామైదాన్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎంజీరోడ్ వైపు పంపిస్తారు. ♦ ట్యాంక్‌బండ్ నుంచి బైబిల్ హౌస్ వైపు వచ్చే ఆర్టీసీ బస్సుల్ని కర్బాలా మైదాన్ నుంచి రాణిగంజ్, మినిస్టర్స్ రోడ్ వైపు పంపిస్తారు. ♦ టివోలీ జంక్షన్ నుంచి బాలమ్రాయ్ వైపు వచ్చే వాహనాలను ఎన్సీసీ చౌరస్తా, నార్నే ఎస్టేట్స్ వైపు పంపిస్తారు. ♦ సీటీఓ ఎక్స్ రోడ్ నుంచి బాలమ్రాయ్ వైపు వచ్చే వాహనాలను లీ రాయల్ ప్యాలెస్ నుంచి బ్రూక్‌బాండ్ చౌరస్తా, ఇంపీరియల్ గార్డెన్స్, మస్తాన్ కేఫ్ వైపు పంపిస్తారు. ♦ ఎన్సీసీ చౌరస్తా నుంచి డైమండ్ పాయింట్ వైపు వెళ్లే వాహనాలను నార్నే ఎస్టేట్స్ నుంచి కార్ఖానా బస్తీ వైపు పంపిస్తారు. ♦ బాపూజీనగర్ నుంచి తాడ్‌బండ్ వైపు వచ్చే వాహనాలను సెంటర్ పాయింట్ నుంచి డైమండ్ పాయింట్, కార్ఖానా వైపు పంపిస్తారు. ♦ మేడ్చెల్, బాలానగర్ వైపుల నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే వాహనాలను సేఫ్ ఎక్స్‌ప్రెస్ నుంచి బాపూజీనగర్, బోయిన్పల్లి మార్కెట్ మీదుగా పంపిస్తారు. -
అంజన్న కొండ.. భక్తులు నిండా..
మల్యాల: కరీంనగర్ జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి క్షేత్రంలో బుధవారం హనుమాన్ జయంత్యుత్సవాలు వైభవంగా జరిగాయి. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల నుంచి భక్తులు, హనుమాన్ దీక్షాపరులు తరలివచ్చారు. మంగళవారం రాత్రికే సుమారు లక్ష మంది కొండపైకి చేరుకున్నారు. రాత్రంతా భజనలు చేశారు. ఉదయం ఇరుముడులు సమర్పించి మాల విరమణ చేసిన భక్తులు మొక్కులు చెల్లించారు. బుధవారం రాత్రి కరీంనగర్లో శ్రీరాముడు, హనుమంతుడు భారీ విగ్రహాలతో శోభాయూత్ర చేపట్టారు. పరిపూర్ణానందస్వామి ప్రజలనుద్దేశించి ప్రసంగిం చారు. హుండీల ఆదాయూన్ని ఇటీవల ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన పోలీసుల కుటుంబాలకు అందజేస్తామని యూత్ర నిర్వాహకులు బండి సంజయ్‌కుమార్ తెలిపారు. రాముడి సన్నిధిలో హనుమాన్ భక్తులు భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో హనుమజ్జయంత్యోత్సవాలు ఘనంగా జరిగాయి. సీతారామచంద్రస్వామి, ఆంజనేయస్వామివారికి భక్తులు పూజలు చేశారు. హనుమాన్కు ఏకాం త తిరుమంజనం నిర్వహించారు. హనుమాన్ దీక్షధారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఇరుముడులు సమర్పించి, దీక్ష విరమించారు. -
కొండగట్టు కాషాయమయం
కొండగట్టు: హనుమాన్ పెద్ద జయంత్యుత్సవాల సందర్భంగా కొండగట్టు శ్రీఆంజనేయస్వామి క్షేత్రం భక్తుల రద్దీతో పోటెత్తింది. వేలాది మంది హనుమాన్ దీక్షాపరులు ఇరుముడులతో తరలిరాగా.. అంజన్న పుణ్యక్షేత్రం కాషాయ వర్ణం సంతరించుకుంది. బుధవారం జరగనున్న హనుమాన్ జయంతి వేడుకలకు మంగళవారం నుంచే భక్తుల రాక మొదలైంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ తదితర జిల్లాల నుంచి రాత్రి వరకు సుమారు 2 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. నేడు హనుమాన్ జయంతి సందర్భంగా మాల విరమణ చేసేందుకు లక్షమంది భక్తులు చేరుకునే అవకాశముందని ఆలయ అధికారులు తెలిపారు. -మల్యాల హనుమాన్ నామస్మరణతో కొండగట్టు మార్మోగుతోంది. ఇరుముడులతో దీక్షాపరులు అంజన్న సన్నిధికి తరలివస్తున్నారు. వేలాది మంది దీక్షాపరులతో కొండగట్టు కాషాయమయమైంది. మెట్లదారివెంట, నాచుపల్లి, ఘాట్‌రోడ్డు వెంట దీక్షాపరులు భజనలు చేసుకుం టూ కాలినడకన తరలివస్తున్నారు. జిల్లాతోపాటు ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల నుంచి సైతం భక్తులు వస్తున్నారు. హనుమాన్ పెద్దజయంతి ఉత్సవాలకు కొండగట్టు అంజన్న ఆలయం ముస్తాబైంది. ఆలయ ప్రాకారాలు విద్యుద్దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. కొండగట్టు వై జంక్షన్ నుంచి ఆలయం వరకు విద్యుద్దీపాలతో అలంకరించారు. మంగళవారం రాత్రికే 70 వేల మంది భక్తులు కొండపైకి చేరుకున్నట్లు అంచనా. హైదరాబాద్‌కు చెందిన శ్రీధర్ ఉచిత అన్నదానం, మంచినీరు అందించారు. బుధవారం హనుమాన్ జయంతి సందర్భంగా మాల విరమణ చేసేందుకు లక్షమంది భక్తులు చేరుకునే అవకాశం ఉంది. నేడు ప్రత్యేక పూజలు హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా ఆంజనేయస్వామివారి సన్నిధిలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 3 గంటలకు తిరుమంజనము, 6 గంటలకు ద్రావిడ ప్రబంధ పారాయణములు, 9 గంటల నుంచి విశేష అభిషేకము, అర్చన, పట్టు వ స్త్రముల అలంకరణ, సహస్ర నాగవల్లి అర్చన, హోమము, మహాపూర్ణాహుతి, స్నపన తిరుమంజనము, ఉత్సవ మూర్తికి ఉయ్యాల సేవ, మంత్ర పుష్పం, మహానివేదన, తీర్థ ప్రసాద వినియోగం, సామూహిక భజన నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30కు ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణము, అమ్మవారికి కుంకుమార్చన, ఒడి బియ్యం, సహస్ర దీపాలంకరణ, గరుడ వాహనసేవ, కంకణోద్వాసన, మంత్ర పుష్పము, మహదాశీర్వాదము, సామూహిక భజన, తీర్థ ప్రసాద వినియోగము, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో గజరాజు నర్సింహులు తెలిపారు. -
కాషాయవర్ణమైన రాజన్న సన్నిధి
వేములవాడ అర్బన్ : వేములవాడ రాజన్నసన్నిధానం కాషాయవర్ణమైంది. బుధవారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని సోమవారం రాత్రి నుంచి హనుమాన్ దీక్షాస్వాముల రాక భారీగా పెరిగిపోయింది. మంగళవారం వేకువజామునుంచే హనుమాన్ దీక్షాస్వాములు రాజన్నను దర్శించుకుని కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రసాదాలు కొనుగోలు చేసేందుకు బారులు తీరారు. దీంతో ప్రసాదాల కౌంటర్ క్యూలైన్ ఆలయ ఈవో ఛాంబర్ వరకు చేరుకుంది. ఇంతేకాకుండా ఆలయ ఆవరణంతా కాషాయవర్ణంతో నిండుకుని కనిపించింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని బుధవారం ఆలయంలోని స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
వేములవాడకు పోటెత్తిన భక్తులు
కరీంనగర్: కరీంనగర్ జిల్లాకు భక్తుల తాకిడి పెరిగింది. జిల్లా పరిధిలోని వేములవాడకు భక్తులు పోటెత్తారు. దీంతో దర్శనానికి దాదాపు 5 గంటల సమయం తీసుకుంటోంది. అదేవిధంగా జిల్లాలోని కొండగట్టులో సోమవారం నుంచి పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి వేలాదిగా జనాలు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. నాలుగు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. -
అల్లర్ల కేసులో ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: హనుమాన్ జయంతి రోజున నగరంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులపై పెట్రోలు పోసి నిప్పంటించడానికి ప్రయత్నించారు. బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో శుక్రవారం ఈ కేసులో సంబంధం ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.