Harsha Vardhan
-
ఫిక్కీ కొత్త ప్రెసిడెంట్ హర్షవర్ధన్ అగర్వాల్
న్యూఢిల్లీ: 2024–25 సంవత్సరానికి గాను పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ కొత్త ప్రెసిడెంట్‌గా ఇమామి లిమిటెడ్ ఎండీ హర్షవర్ధన్ అగర్వాల్ ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం ఫిక్కీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.నవంబర్ 21న ఫిక్కీ 97వ వార్షిక సమావేశం ముగిసిన తర్వాత అగర్వాల్ బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం ఫిక్కీ ప్రెసిడెంట్‌గా మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ సీఈవో అనీష్ షా ఉన్నారు.ఇదీ చదవండి: అభినవ ‘టాటా’! సంపదలో భారీ మొత్తం విరాళం -
గతంలో బీఆర్ఎస్ కోసం పనిచేసిన వారికే బదిలీలు: హర్షవర్ధన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గత బీఆర్ఎస్ పాలనలో పార్టీ కోసం పనిచేసిన వారికే బదిలీలు చేసేవారని అన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమ సమయంలో టీచర్లకు హామీ ఇచ్చి వారిని మోసం చేసిన ఘనత కేసీఆర్‌దే అంటూ ఘాటు విమర్శలు చేశారు.కాగా, హర్షవర్ధన్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును ముందు డాక్టర్‌కు చూపించండి. నిన్న టీచర్స్ డేను టీచర్లు పండుగలా చేసుకున్నారు. నిన్న రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనలేదని కామెంట్స్ చేస్తున్నారు. మరి 2014 నుంచి 2023 వరకు టీచర్స్ డే వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారా?. నిన్న ఐటీ సదస్సులో సీఎం పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి టీచర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు.బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఎప్పుడైనా టీచర్స్ సమస్యలపై సమీక్ష చేపట్టారా?. సీఎం రేవంత్ ఇప్పటికే 30 మందికి ప్రమోషన్ ఇచ్చారు. మీ పాలనలో బదిలీలు జరిగితే సస్పెండ్ అయ్యారు. కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ కోసం పనిచేసిన వారికే బదిలీలు చేసేవారు. ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా బదిలీలు, ప్రమోషన్లు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. జూన్ ఆరో తేదీన ఎన్నికలు అయిపోగానే మరుసటి రోజు సీఎం రేవంత్ బదిలీలు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతీ నెలా ఒకటో తేదీనే జీతాలు వేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ ఇచ్చేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. దరఖాస్తులు పెట్టుకోకున్నా బెస్ట్ టీచర్ అవార్డులు ఇచ్చాం. తెలంగాణ వచ్చిన తర్వాత టీచర్లపై బీఆర్ఎస్ వివక్షత చూపింది. కొఠారీ కమిషన్ బడ్జెట్లో ఆరు శాతం నిధులు ఇవ్వాలంటే.. సీఎం రేవంత్ మాత్రం ఏడు శాతం ఇచ్చారు. విద్య పట్ల సీఎం రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంది’ అని కామెంట్స్ చేశారు. -
49 ఏళ్లయినా సింగిల్‌గానే.. కారణమేంటో చెప్పిన నటుడు
హర్షవర్దన్.. డైరెక్టర్‌గా కంటే కూడా అమృతం సీరియల్ నటుడిగా ఎక్కువమందికి సుపరిచితం. బుల్లితెరపైనే కాకుండా వెండితెరపైనా ఎన్నో చిత్రాల్లో నటించాడు. గుండెజారి గల్లంతయ్యిందే, మనం, గురు వంటి సినిమాలకు డైలాగులు రాశాడు. ఇటీవల రిలీజైన మామా మశ్చీంద్ర సినిమాకు దర్శకత్వం వహించాడు. కానీ ఇది బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. ఇకపోతే 49 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉంటున్నాడు హర్ష వర్ధన్. తను ఒంటరిగా ఉండటానికి గల కారణాలను తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. 'నా లైఫ్ స్టైల్‌కు పెళ్లి అనేది పడదు. నేను అందరితోనూ స్నేహంగా ఉంటాను. ఉన్న కాసేపు చాలా బాగా మాట్లాడతాను. అలా అని పార్టీలకు గట్రా వెళ్లను. ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడతాను. వేరేవాళ్లకు ఎక్కువ సమయం ఇవ్వడం, వాళ్లకు నచ్చినట్లుగా ఉండటం అనేది కష్టం. నేనసలు నా కుటుంబ బాధ్యతలనే సరిగా పట్టించుకోను. నేను పెళ్లి చేసుకుంటే భార్యను వదలను, వేరే అమ్మాయిని కన్నెత్తి చూడను, పిల్లలను నెత్తిన పెట్టుకుని చూసుకుంటాను. వాళ్లు చనిపోయేవరకు నేను బతికుండాలి.. ఎందుకంటే వారికోసం కష్టపడాలి, వాళ్లకు రక్షణ కవచంగా ఉండాలి! అని ఆరాటపడతాను. అయినా పెళ్లి అనేది తోడు కోసం అంటారు. కానీ, అది ఒక ఇన్సూరెన్స్ పాలసీ, బిజినెస్ డీల్. మనకు చేతకానప్పుడు భార్యాపిల్లలు చూసుకుంటారు. మన పనులన్నీ చేసిపెడతారంతే! నాకు కూడా గతంలో రిలేషన్స్ ఉన్నాయి. పెళ్లి కోసం అమ్మాయిల వెంటపడ్డాను కూడా! ఒకమ్మాయైతే బ్రేకప్ అయ్యాక కూడా అప్పుడప్పుడూ మెసేజ్‌లు చేస్తూ ఉంటుంది. నా మంచి చెడూ చూసేందుకు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక జీవితమంతా ఆడుతూ పాడుతూ సింగిల్‌గా బతికేస్తాను' అని చెప్పుకొచ్చాడు హర్ష వర్ధన్. చదవండి: బిగ్‌బాస్ 7 మినీ లాంచ్‌లో నాగ్ వేసుకున్న షర్ట్ ధరెంతో తెలుసా? -
కొల్లాపూర్‌లో హీటెక్కిన రాజకీయం
-
క్రైమ్ థ్రిల్లర్
రితికా సింగ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఇన్ కార్’. హర్ష వర్ధన్ దర్శకత్వంలో అంజుమ్ ఖురేషి, సాజిద్ ఖురేషి నిర్మించిన ఈ సినిమా మార్చి 3న విడుదల కానుంది. రితికా సింగ్ మాట్లాడుతూ–‘‘ఈ మూవీలోని నా పాత్ర కోసం షూటింగ్ పూర్తయ్యే వరకు నేను తల స్నానం చేయలేదు’’ అన్నారు. ‘‘సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ‘ఇన్ కార్’’ అన్నారు హర్ష వర్ధన్. ఈ చిత్రానికి కెమెరా: మిథున్ గంగోపాధ్యాయ. -
కొత్త సినిమా షూటింగ్‌ను ప్రారంభించిన సుధీర్ బాబు
Sudheer Babu Next Film Directed By Harsha Vardhan Goes On Floors: సుధీర్‌బాబు కెరీర్లో 15వ సినిమాగా రాబోతున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ షురూ అయ్యింది. నటుడు–దర్శకుడు హర్షవర్ధన్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సోనాలి నారంగ్, సృష్టి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ పతాకంపై నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. షూటింగ్ ప్రారంభం అంటూ చిత్రయూనిట్ ఓ వర్కింగ్ స్టిల్‌ను విడుదల చేసింది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రమిది. సుధీర్‌బాబు కోసం భిన్నమైన కథను రెడీ చేశారు హర్షవర్ధన్. ఈ సినిమాలో సరికొత్తగా కనిపిస్తారు సుధీర్ బాబు. ఈ చిత్రంలో ఛాలెంజింగ్ పాత్రను పోషిస్తున్నారాయన. ఈ తొలి షెడ్యూల్లో కీలక పాత్రధారులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: పీజీ విందా. -
చిన్నారికి చిత్రహింసలు
తూప్రాన్: మద్యం తాగేందుకు భార్య డబ్బులు ఇవ్వలేదని ఆవేశంతో మూడేళ్ల కొడుకును విచక్షణ రహితంగా చితకబాదాడొక తండ్రి. ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామంలో శనివారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్లాంపూర్‌లో బెడ బుడగ జంగాల కాలనీకి చెందిన గణేశ్, పుష్ప దంపతులకు ఇద్దరు కొడుకులు. దంపతులిద్దరూ కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు. గణేశ్ మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతూ భార్య పుష్పతో నిత్యం గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే తనకు రూ.5 వేలు కావాలని, ఇందుకోసం ఆమె వెండి పట్టీ గొలుసులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన గణేశ్ భార్యపై రాయితో దాడి చేసేందుకు యత్నించాడు. ఆమె తప్పించుకోవడంతో ఎదురుగా ఉన్న మూడేళ్ల కొడుకు హర్షవర్ధన్‌ను కర్రతో పైశాచికంగా చితకబాదాడు. బాలుడి వీపు, ముఖం, శరీర భాగాలపై తీవ్రంగా గాయాలయ్యాయి. భార్యను సైతం చంపుతానని భయభ్రాంతులకు గురిచేశాడు. చుట్టు పక్కల వారితో కలిసి బిడ్డను పట్టణ ప్రభుత్వాస్పత్రికి చికిత్సకు తరలించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాత్రి ఇంటికి వెళ్తే తిరిగి ఎక్కడ కొడతాడోనని భయంతో పుష్ప మాసాయిపేటలోని పుట్టింటికి ఇద్దరు పిల్లలతో వెళ్లింది. ప్రస్తుతం గణేశ్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
నెక్స్ట్ సినిమాను లైన్లో పెట్టిన సుధీర్‌బాబు
హీరో సుధీర్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా మరో మూవీని అనౌన్స్ చేశాడు. హర్షవర్ధన్ డైరెక్షన్లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే నటుడిగా, రచయితగా హర్షవర్థన్ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. రొమాంటికి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థ నిర్మిస్తుంది. దీనికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుంచి ప్రారంభం కానుంది. హీరోయిన్ సహా మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఇప్పటికే ఈ బ్యానర్లో లవ్‌స్టోరీ సినిమాతో పాటు ధనుష్- శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఓ చిత్రం రూపొందుతున్నాయి. ప్రస్తుతం సుధీర్‌బాబు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాతో పాటు కరుణ కుమార్ డైరెక్షన్లో శ్రీదేవి సోడా సెంటర్ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు పుల్లెల గోపీచంద్ బయోపిక్ సినిమాకు సైతం సైన్ చేశారు. #Sudheer15 & @SVCLLP #ProdNo5 is in talented hands of #HarshaVardhan ... This is going to be a challenging journey for me and the team ... Safe to say that, it's something that I haven't tried yet 😉#NarayanDasNarang #PuskurRamMohanRoa pic.twitter.com/wx8eQL9f9I — Sudheer Babu (@isudheerbabu) July 12, 2021 -
Corona Down Fall : 7 రాష్ట్రాల్లో వెయ్యిలోపు కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్‌వేవ్ ఉధృతి తగ్గుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. గడిచిన 24 గంటలలో మన దేశంలోని మధ్యప్రదేశ్, రాజస్థాన్, న్యూఢిల్లీ, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా, జార్ఖండ్ ఏడు రాష్ట్రాలలో 1,000 లోపు కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. అదే విధంగా జమ్ముకశ్మీర్, పంజాబ్, బీహర్, ఛత్తీస్‌ఘడ్, ఉత్తరప్రదేశ్ అయిదు రాష్ట్రాలలో 2,000 కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయని తెలిపారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న మహరాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కూడా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. కరోనా కట్టడికి వైద్యం, ఇతర మౌళిక సదుపాయాల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్వహించిన సమావేశంలో మంత్రి హర్షవర్దన్ ఈ వివరాలు వెల్లడించారు. తాజా, లెక్కల ప్రకారం, ఇప్పటి వరకు దేశంలో 2,89,09,975 మంది కరోనా వైరస్‌కు గురికాగా .. 3,49,186 మంది ఈ మహమ్మారి బారిన పడి తమ ప్రాణాలను కోల్పోయారు. ఇక గత 24 గంటల్లో 1,74,399 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 14,01,609 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని వెల్లడించారు. చదవండి: జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ -
వ్యాక్సిన్ పాస్‌పోర్టు సరైంది కాదు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విస్తరణకు అడ్డుకట్టవేయడానికి వ్యాక్సిన్ పాస్‌పోర్టు విధానాన్ని తీసుకురావాలనే కొన్ని దేశాలు ప్రతిపాదనల్ని జీ–7 సదస్సు వేదికగా భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది అత్యంత వివక్షాపూరిత చర్యగా అభివర్ణించింది. వ్యాక్సిన్ పాస్‌పోర్టు వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలకు నష్టం వాటిల్లుతుందని సదస్సులో పాల్గొన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఆందోళన వ్యక్తం చేశారు. జీ–7 దేశాల సదస్సుకు ఈ ఏడాది భారత్‌ను అతిథిగా ఆహ్వానించారు. జీ–7 ఆరోగ్య మంత్రుల సమావేశంలో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన హర్షవర్ధన్ అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలు వ్యాక్సిన్ కొరతని ఎదుర్కొంటున్నాయని చెప్పారు. భారత్‌లో కేవలం 3 శాతం మంది ప్రజలకు మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చిన నేపథ్యంలో ఈ ప్రతిపాదల్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘వ్యాక్సిన్ పాస్‌పోర్టు విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాలు టీకాల సరఫరా, పంపిణీ, రవాణా, సామర్థ్యం వంటి అంశాల్లో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్ పాస్‌పోర్టు విధానాన్ని అమల్లోకి తీసుకువస్తే అది వివక్ష చూపించడమే’’ అని ఆయన గట్టిగా చెప్పారు. కాగా ఈ సదస్సులో పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజలందరికీ టీకాలు ఇవ్వడానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయాలను మంత్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వ్యాక్సిన్ పాస్‌పోర్టు అంటే.. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లడానికి వ్యాక్సిన్ పాస్‌పోర్టు విధానాన్ని అమలు చేయాలని అంతర్జాతీయంగా ప్రతిపాదనలు వస్తున్నాయి. కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకున్న వారు తాము వ్యాక్సిన్ తీసుకున్నామని ధ్రువపత్రం చూపించాలి. అయితే ఇది డిజిటల్ రూపంలో ఉంటుంది. ఇప్పటికే కొన్ని మల్టీ నేషనల్ కంపెనీలు తయారుచేసిన యాప్‌లలో ప్రజలు వ్యాక్సినేషన్ వివరాలను పొందుపరచాలి. విదేశీ ప్రయాణం సమయంలో ఆ దేశాలు ఈ యాప్‌ల ద్వారా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి వ్యాక్సిన్ తీసుకున్నారో లేదో తెలుసుకుంటాయి. కరోనాని కట్టడి చేయాలంటే ఈ విధానాన్ని అమలు చేయాలని అమెరికా, కొన్ని యూరప్ దేశాలు సమాలోచనలు జరుపుతున్నాయి. అదే జరిగితే భవిష్యత్‌లో వ్యాక్సిన్ పాస్‌పోర్టు ఉంటేనే విదేశీ ప్రయాణాలు సాధ్యమవుతాయి. -
వ్యాక్సిన్ పాస్ పోర్ట్ అంటే ఏమిటి?, భారత్ ఎందుకు వ్యతిరేకిస్తోంది?
న్యూఢిల్లీ : వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ప్రక్రియను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్దన్ వ్యతిరేకించారు. మరికొద్దిరోజుల్లో జీ7 సమ్మిట్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జీ 7 సమ్మిట్ కు సంబంధించి ఆయా దేశాల ఆరోగ్యశాఖ మంత్రుల వీడియో కాన్ఫరెన్స్ జరిగింది.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హర్షవర్దన్ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ను వ్యతిరేకిస్తున్నట్లు హర్ష వర్ధన్ ప్రకటించారు. వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ఇవ్వడం దేశాలపట్ల వివక్షత చూపినట్లే అవుతుందన్నారు. దీంతో పాటు అభివృద్ధి చెందిన దేశాలకు కంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యాక్సినేషన్ తక్కువగా ఉండడం, సంబంధిత సమస్యలను పరిష్కరించడం, వ్యాక్సినేషన్, వ్యాక్సిన్ల సరఫరా మరియు పంపిణీలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని హర్షవర్దన్ అన్నారు.ఇక వ్యాక్సిన్ పాస్ పోర్ట్ అమలు అంటే దేశాల పట్ల వివక్షత చూపినట్లేనని, ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రతికూలంగా ఉంటుందనే విషయాన్ని భారత్ స్పష్టం చేస్తోందని చెప్పారు. వ్యాక్సిన్ పాస్ పోర్ట్ అంటే కోవిడ్-19 నేపథ్యంలో ఆయా దేశాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వచ్చే వారు తప్పని సరిగా వ్యాక్సిన్ పాస్ పోర్ట్ కలిగి ఉండాలి. ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకుంటారో వారు సంబంధింత వివరాల్ని అధికారిక పాస్ పోర్ట్ వెబ్ సైట్లలో నమోదు చేసుకోవాలి. అలా ఎవరైతే పాస్ పోర్ట్ వెబ్ సైట్లో నమోదు చేసుకుంటారో వారికి ఆయా దేశాల పాస్ పోర్ట్ అధికారులు వ్యాక్సిన్ డీటెయిల్స్ తో సర్టిఫికెట్స్ ను అందిస్తారు. ఈ సర్టిఫికెట్ ఉంటేనే విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. దీన్నే ఇప్పుడు భారత్ వ్యతిరేకిస్తుంది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారి ఇజ్రాయెల్ దేశం ఈ వ్యాక్సినేషన్ పాస్ పోర్ట్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎవరి దగ్గర ఈ వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ఉంటే వాళ్లు మాత్రమే ఇజ్రాయెల్ దేశంలో ఉండే వెసలు బాటు కల్పించింది. ఇజ్రాయెల్ బాటలో మరికొన్నిదేశాలు ఈ వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ను అందుబాటులోకి తెచ్చాయి. చదవండి : లాక్డౌన్ పొడిగింపు.. కానీ భారీ సడలింపులు -
అల్లోపతిపై రామ్‌దేవ్ వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన హర్షవర్థన్
న్యూఢిల్లీ: అల్లోపతి వైద్యమంటే తమాషా కాదంటూ బాబా రామ్‌దేవ్‌కి గట్టి కౌంటర్ ఇచ్చారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్. అల్లోపతి వైద్యంపై రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. లక్షలాది మంది వైద్య సిబ్బంది మనోభావాలను గాయపరిచి.. కంటి తుడుపు చర్యగా రామ్‌దేవ్ ఇచ్చిన వివరణ కూడా సరిపోదన్నారు. ఈ మేరకు రామ్‌దేవ్‌బాబాకి హర్షవర్థన్ లేఖ రాశారు. కోవిడ్ కల్లోల సమయంలో ఎంతో మంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో వైద్య సిబ్బంది మనోస్థైర్యం దెబ్బతినేలా, వారు చేస్తున్న త్యాగాలను అవమానించేనట్టుగా రామ్‌దేవ్ బాబా వ్యాఖ్యలు ఉన్నాయని మంత్రి అన్నారు. ఆయన వ్యాఖ్యలు దేశంలో ఎంతోమందిని బాధ పెట్టాయన్నారు. వైద్య సిబ్బంది ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంటే .. మరోవైపు అల్లోపతి వైద్య విధానం వల్ల లక్షల మంది చనిపోయారని.. అదొక , మూర్ఖపు విజ్ఙానం... తమాషా అంటూ రామ్‌దేవ్ వ్యాఖ్యానించడం సబబు కాదన్నారు. సమాజంలో ఎంతో గౌరవం ఉన్న వ్యక్తి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు తాము ఊహించలేదన్నారు. మరోవైపు బాబా రామ్‌దేవ్ వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. -
ప్రమాదంలో యావత్ దేశం.. కేంద్రం ఆందోళన
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ తీవ్రత మరింత విషమంగా మారిందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాల్లో ఆందోళనకరంగా తయారైందని తెలిపింది. ప్రస్తుతం దేశం మొత్తం ప్రమాదంలో పడిందనీ, ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని స్పష్టం చేసింది. దేశంలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన మొదటి 10 జిల్లాల్లో 8 మహారాష్ట్రలో, ఒకటి ఢిల్లీలో ఉన్నట్లు వెల్లడించింది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, నీతి ఆయోగ్(ఆరోగ్య)సభ్యుడు వీకే పాల్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. దేశంలో యాక్టివ్ కేసులు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించిన 10 జిల్లాల్లో పుణేలో 59,475 కేసులు, ముంబైలో 46,248, నాగ్‌పూర్‌లో 45,322, థానేలో 35,264, నాశిక్‌లో 26,553, ఔరంగాబాద్‌లో 21,282, బెంగళూరు అర్బన్‌లో 16,259, నాందేడ్‌లో 15,171, ఢిల్లీలో 8,032, అహ్మద్‌నగర్‌లో 7,952 యాక్టివ్ కేసులున్నట్లు తెలిపారు. ‘దేశంలో ప్రస్తుతం పరిస్థితులు విషమంగా మారాయి. గడిచిన కొన్ని వారాల్లోనే కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాప్తి ఆందోళనకరంగా ఉంది. ఏ ఒక్క రాష్ట్రం, ప్రాంతం, జిల్లా ఇందుకు మినహాయింపు కాదు’అని వారన్నారు. ‘ఆస్పత్రుల్లో ఐసీయూ ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేసులు వేగంగా పెరిగిన పక్షంలో ఆరోగ్య వ్యవస్థ స్తంభించిపోతుంది’అని చెప్పారు. జాతీయ స్థాయిలో పాజిటివిటీ రేట్ 5.65% ఉండగా మహారాష్ట్రలో గత వారం ఇది 23%గా రికార్డయినట్లు తెలిపారు. ఆ తర్వాత పంజాబ్‌లో పాజిటివిటీ రేట్ 8.82%, ఛత్తీస్‌గఢ్‌లో 8.24%, మధ్యప్రదేశ్‌లో 7.82%, ఢిల్లీలో 2.04% ఉందన్నారు. దేశంలో యూకే వేరియంట్ కేసులు 807, దక్షిణాఫ్రికా వేరియంట్ కేసులు 47, బ్రెజిల్ వేరియంట్ కేసు ఒకటి బయటపడింది. జిల్లాల వారీగా చర్యలు మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, తదితర రాష్ట్రాల్లోని కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న 47 జిల్లాల అధికారులకు శనివారం రాసిన లేఖలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలిచ్చామని రాజేశ్ భూషణ్ తెలిపారు. ఒక్కో పాజిటివ్ కేసుకు 25 నుంచి 30 కాంట్రాక్టులను గుర్తించి, ఐసోలేషన్‌లో ఉంచాలని కోరామన్నారు. కంటైన్మెంట్ జోన్ల పరిధిని కూడా విస్తరించాలని తెలిపినట్లు వివరించారు. దేశవ్యాప్త వ్యాక్సినేషన్లో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటల సమయానికి 6.11 కోట్ల పైచిలుకు వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో అత్యధికంగా 48.39% మందికి, ఆ తర్వాత ఢిల్లీలో 43.11% మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి కూడా టీకా పంపిణీ జరుగుతుందన్నారు. కో–విన్, ఆరోగ్య సేతు యాప్‌లో పేర్లను నమోదు చేసుకోవచ్చని, లేదంటే ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి వ్యాక్సిన్ కేంద్రంలోనే పేర్ల రిజిస్ట్రేషన్ ఉంటుందని చెప్పారు. రికార్డు స్థాయిలో 56,211 కేసులు దేశంలో 24 గంటల్లో మరో 56,211 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో మొత్తం కేసులు 1,20,95,855ఎగబాకాయి. ఒక్క రోజులోనే ఈ మహమ్మారితో 271 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,62,114కు చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మృతుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 102 మంది ఉన్నారని పేర్కొంది. యాక్టివ్ కేసులు 5,40,720 కాగా మొత్తం కేసుల్లో ఇవి 4.47%కు చేరుకున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,1393,021కు చేరుకోగా రికవరీ రేట్ మాత్రం 94.19%కి తగ్గిపోయింది. ఒకే పడకపై ఇద్దరు కోవిడ్ రోగులు నాగ్‌పూర్: ఆస్పత్రిలో ఒకే పడకపై ఇద్దరు కోవిడ్ రోగులను ఉంచిన ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. నగరంలోని నాగ్‌పూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో తీసిన ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. మహారాష్ట్రలో ప్రస్తుతం కోవిడ్ ఉన్న పరిస్థితికి ఈ ఘటన అద్దం పడుతోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. ప్రైవేటు ఆస్పత్రులు వైద్యం కోసం భారీగా డబ్బును వసూలు చేస్తాయని భయపడుతున్న వారంతా ప్రభుత్వ ఆస్పత్రికి రావడంతో ఈ పరిస్థితి ఎదురైందని చెబుతున్నారు. అంతేగాక బాగా సీరియస్ పరిస్థితిలో ఉన్న రోగులను డాక్టర్లు వార్డుకు పంపిస్తుండడంతో ఈ పరిస్థితి ఎదురైందని ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ అవినాశ్ గవాండే చెప్పారు. అయితే ఫొటోలు తీసిన నాటికి, ఇప్పటికి పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. వర్క్‌లోడ్ ఒకప్పుడు ఎక్కువగా ఉండేదని ఇప్పుడు తక్కువే ఉందన్నారు. ప్రస్తుతం బెడ్‌కు ఒక రోగి మాత్రమే ఉన్నారని చెప్పారు. చదవండి: (మాస్క్ సరిగా ధరించకుంటే ఫైన్) -
ఇక 24 గంటలూ ప్రజలకు కరోనా వ్యాక్సిన్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్‌ను దేశవ్యాప్తంగా మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 24 గంటలూ ప్రజలకు కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచుతామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి వెల్లడించారు. ప్రజలు వారికి అనుకూలమైన సమయాల్లో వచ్చి వ్యాక్సిన్ తీసుకునేందు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. అన్ని ఆస్పత్రుల్లో టీకా వేయడానికి ఉన్న సమయ పరిమితిని ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్థన్ తెలిపారు. అదే విధంగా ప్రజలకు కోవిడ్ టీకాలు వేయడానికి ప్రైవేట్ ఆస్పత్రులు కూడా అన్నివేళల్లో అందుబాటులో ఉంటాయిని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ డ్రైవ్‌లో పాల్గొన్న అన్ని ఆస్పత్రులు కోవిన్ యాప్, వెబ్సైట్ ద్వారా అనుసంధానం చేయబడినట్లు తెలిపారు. దీంతో అన్ని ఆస్పత్రుల్లో కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించడానికి సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. కోవిన్ పోర్టల్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే టీకా అందుబాటులో ఉంటుందని నిబంధన ఏమి లేదని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ మంగళవారం వెల్లడించిన విషయం తెలిసిందే. ఆస్పత్రి యాజమాన్యం కోరుకున్న సమయంలో ప్రజలకు టీకాలు అందించే అనుమతి ఉందని తెలిపారు. చదవండి: ఈ రోజు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న దిగ్గజాలు -
2020 పేరు చెబితే మానవాళికి గుర్తొచ్చేది కరోనా..
2020 పేరు చెబితే మానవాళికి గుర్తొచ్చేది, ప్రాణాంతకమైన వైరస్ విజృంభణ. అది సృష్టించిన కల్లోలం కారణంగా ప్రపంచం ఛిన్నాభిన్నమై సుమారు 15 లక్షల మంది మృత్యు వాత పడ్డారు. ప్రపంచం యావత్తూ కనీవినీ ఎరుగని ఆర్థిక వినాశనాన్ని చవిచూసింది. దాన్ని అదుపులోకి తేవడం, మానవాళిని కాపాడటం లక్ష్యంగా సైన్స్ ఎలా పరుగులు తీసిందో, పరిశోధన, అభివృద్ధికి ప్రపంచ భాగస్వామ్యాలు ఏవిధంగా దోహదపడ్డాయో మానవాళి గుర్తుంచుకుంటుంది. ఈ నేపథ్యంలో 2020ని సైన్స్ సంవత్సరంగా అభివర్ణించాలి. కోవిడ్–19 కారణంగా మానవాళి అత్యుత్తమ సామర్థ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. మహమ్మారి వ్యాపిస్తున్న కొద్దీ దాని ప్రభావాన్ని తగ్గించేందుకు పరిశోధన ప్రయత్నాలు వేగం అందుకున్నాయి. మానవాళి భద్రతతో ఎలాంటి రాజీ పడకుండానే ఆ మహ మ్మారిని నిలువరించే చికిత్సలు, వ్యాక్సిన్లు, డయాగ్నస్టిక్స్ అభివృద్ధి చేయడంలో ప్రపంచస్థాయి భాగస్వామ్యాలు ఏర్పాటైనాయి. ప్రభుత్వం, వ్యాపార సంస్థలు, దాతృత్వ సంస్థలు చేయి కలిపి ఈ ప్రయత్నం అంతటికీ అవసరం అయిన వనరులు కూడగట్టడం ప్రారంభించాయి. అందుకే ఒక్క సైన్స్ మాత్రమే కాదు, అంతర్జాతీయ భాగ స్వామ్యాలు కూడా ఈ ఏడాదిలో చెప్పుకోదగినవని నేనంటాను. మానవాళి జీవితాలను కాపాడటానికి దోహదపడే విజయాలు సాధించినందుకు మాత్రమే కాదు, కనీవినీ ఎరుగని వేగంతో ప్రయత్నాలు చేసేందుకు అంకితభావం ప్రదర్శించినందుకు కూడా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను అభినందించాలి. శాస్త్రవేత్తలు తమ వ్యక్తిగత పురస్కారా లకన్నా బృందకృషికి పెద్దపీట వేశారు. ఎలాంటి వేగాన్నయినా మనం అందుకోగలమనీ, వేగం వల్ల నాణ్యత దెబ్బ తినదనీ శాస్త్రవేత్తలు నిరూపించారు. శాస్త్ర, ఆరోగ్య సంరక్షణ భాగస్వామ్యాల ఫలాలు అందరికీ సమానంగా అందాలని నేను భావిస్తాను. మనం మరింత సమానత్వం గల ప్రపంచాన్ని సృష్టించుకుని ప్రతీ ఒక్కరికీ ఆ ఫలాలు అందేలా చూడాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక మండలి చైర్మన్ హోదాలో నేను ఈ అంశంపై అన్ని దేశాలు, నిధులు అందిస్తున్న ఏజెన్సీలు, శాస్త్రవేత్తలు, దాతలతో చర్చిస్తున్నాను. ఇది మనందరి నిబద్ధత. ఈ మహమ్మారి సమయంలో సైన్స్ కమ్యూనిటీ యావత్తూ సామాజిక సమస్యలను పరిష్కరించే దిశగా అలుపు లేకుండా స్థిరమైన చర్యలు చేపట్టింది. గత ఆరున్నర సంవత్సరాల కాలంగా మా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టే విషయంలో సాధించిన విజయం– శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఇన్నోవేటర్ల ప్రయత్నాల ఫలమేనని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ విజయానికి చిహ్నంగానే 2015 సంవత్సరం నుంచి ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ఎఫ్) నిర్వహిస్తున్నాం. మన జీవితాల నాణ్యత పెంచడానికి అవసరమైన పరిష్కారాలు అందించే విషయంలో ‘సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణిత శాస్త్రాలు’ (స్టెమ్) సాధించిన పురోగతిని ప్రజలకు తెలియజేసి వారందరినీ ఇందులో భాగస్వా ములను చేయడం ఐఐఎస్ఎఫ్ నిర్వహణ లక్ష్యం. సైన్స్ అధ్యయనం మరింత ప్రయోజనకరంగా ఉండేందుకు వీలుగా ప్రజల్లో ఉత్సుకతను పెంచడం కోసం విజ్ఞాన భారతి (విభా) సహకారంతో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఎర్త్ సైన్సుల మంత్రిత్వ శాఖలు ఈ ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశాయి. శాస్త్రీయ స్ఫూర్తిని ప్రజ్వరిల్లచేసేందుకు ప్రత్యేకంగా విద్యార్థి సమాజానికి చేరువ కావడం ఈ ఉత్సవం లక్ష్యం. ఒక చిన్న ప్రయత్నంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు విద్యార్థులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, మీడియా, సాధారణ ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ, అందరూ ఎదురుచూసే ఒక వార్షిక శాస్త్రీయ సమ్మేళనంగా పరిణతి చెందింది. విభిన్న సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన ప్రజలందరూ వచ్చి జీవశాస్త్రాల విభాగంలో జరుగుతున్న కార్యక్రమాలు, సాధించిన విజయాలు, వస్తున్న ఆవిష్కరణలపై ప్రత్యక్ష అనుభవం పొందేలా చేస్తున్న బహిరంగ ప్రజావేదిక ఇది. ప్రతీ సంవత్సరం ఇది మరింత పెద్దదిగా, మెరుగైనదిగా విస్తరిస్తూ ఉండటం నాకు ఎంతో ఆనందం కలిగిస్తోంది. అందరూ ఎంతో ఉత్సుకతతో ఎదురుచూసే సైన్స్ కార్యక్రమంగా ఇది రూపాంతరం చెందింది. ఇందులో జరుగుతున్న శాస్త్రీయ కార్యక్రమాలు ప్రపంచ రికార్డులను ఛేదించి ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పేజీల్లో స్థానం సంపాదించాయి. ఈ ఏడాది డిసెంబర్ 22 నుంచి 25 వరకు వర్చువల్ విధానంలో జరుగుతోంది. శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా మండలి (సీఎస్ఐఆర్) ఆధ్వర్యం లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ స్టడీస్ (సీఎస్ఐఆర్–నిస్టాడ్స్) ఈ భారీ ఆన్లైన్ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. స్వయంసమృద్ధ భారతదేశాన్ని ఆవిష్కరించి, తద్వారా ప్రపంచ సంక్షేమానికి తోడ్పాటు అందించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ‘స్వయంసమృద్ధ భారత్, ప్రపంచ సంక్షేమం కోసం సైన్స్’ అనే ప్రధాన థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మన దేశానికి గల సున్నితమైన శక్తిని ప్రపంచానికి చాటడం కోసమే నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతోంది. యువ శాస్త్రవేత్తలను ఆకర్షించేం దుకు స్టెమ్ నిర్వహించే వివిధ కోర్సులకు చెందిన 41 విభిన్న కార్యక్రమాలను ఇందులో చేర్చడం జరిగింది. 2020 సంవత్సరం కోవిడ్–19 వ్యాక్సిన్ల పరిశోధన సంవత్సరం అయితే, ప్రపంచవ్యాప్తంగా అది అత్యంత అవసరం అయిన ప్రజలు దాన్ని ఏవిధంగా అధిగమించారో తెలియజేసే సంవత్సరం 2021. ఈ ఉత్సవం సందర్భంగా మనం ఈ మహమ్మారిని తుదముట్టించేందుకు మనం చేస్తున్న ప్రయత్నాలు రెట్టింపు చేయడానికీ, జీవితాలను కాపాడే సైన్స్‌లో సహకారాన్ని మరింతగా పెంచడానికీ ప్రతిజ్ఞ చేద్దాం. 2020 సంవత్సరం కనీవినీ ఎరుగని విధ్వంసం సృష్టించివుండొచ్చు, అయినా శాస్త్రీయ విజయగాథకు కూడా అది ప్రతీక. మానవాళి ఎదుర్కొనే ముప్పును నిలువరించేందుకు శాస్త్రవేత్తలు ఎంత దీటుగా స్పందించారన్నది ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంది. కోవిడ్–19కి సంబంధించిన పరీక్షలు, చికిత్సలు, వ్యాక్సిన్లు అన్నీ అల్పాదాయ, మధ్యాదాయ దేశాలకు చేరేలా చూడటమే ఇప్పుడు మన ముందున్న సవాలు. ఈ ఏడాది వ్యాక్సిన్లు, పరీక్షలు, చికిత్సలపై శక్తియుక్తులన్నీ ధారపోసి కృషి చేసిన శాస్త్రవేత్తలందరినీ గొంతెత్తి అభినందిస్తున్నాను. డాక్టర్ హర్షవర్ధన్ వ్యాసకర్త కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సులు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి -
కొత్త కరోనా భయంతో మళ్లీ ఆంక్షలు
31వరకు నిషేధం హమ్మయ్య... కరోనాకు వ్యాక్సిన్ వచ్చేస్తోంది. మాస్క్ కాస్త పక్కకు పెట్టి ఊపిరిపీల్చుకోవచ్చు.. అనుకునేలోపే.. బ్రిటన్‌లో కొత్త రకం వైరస్ పుట్టుకొచ్చింది. కరోనా కంటే వేగంగా దూసుకొస్తోంది. ఊపిరిపీల్చుకుంటున్న ప్రపంచ దేశాలను ఈ వైరస్ ఉలిక్కిపడేలా చేసింది. బ్రిటన్‌లో మొదట గుర్తించిన ఈ ‘వీయూఐ 202012/1’ వైరస్ ఇప్పటికే డెన్మార్క్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, బెల్జియం, ఇటలీ దేశాల్లోనూ అడుగుపెట్టింది. దీంతో పలు దేశాలు యూకే నుంచి రాకపోకలను నిషేధించాయి. బ్రిటన్‌లో కొత్త వైరస్ నేపథ్యంలో భారత్ బుధవారం నుంచి డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు యూకే నుంచి అన్ని విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. మంగళవారం అర్ధరాత్రిలోపు వచ్చినవారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తామని, ఆ టెస్ట్‌లో ఎవరైనా కోవిడ్ పాజిటివ్‌గా తేలితే వారిని క్వారంటైన్‌కు పంపిస్తామని ప్రకటించింది. బ్రిటన్ నుంచి వేరే దేశం వచ్చి, అక్కడి నుంచి భారత్ రావాలనుకుంటున్న ప్రయాణికులను కూడా అడ్డుకోవాలని డీజీసీఏ ఆదేశించింది. ►కొత్త తరహా వైరస్‌పై కేంద్రం అప్రమత్తంగా ఉంది. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – కేంద్ర మంత్రి హర్షవర్ధన్ నిమిషానికి 1,850 కోట్లు నష్టం సూచీల మూడుశాతం పతనంతో ఇన్వెస్టర్ల సంపద హారతిలా కరిగిపోయింది. ట్రేడింగ్‌లో వారికి ప్రతి నిమిషానికి రూ.1,850 కోట్ల నష్టం వాటిల్లింది. ఒక్కరోజులోనే ఇన్వెస్టర్లు రూ.6.89 లక్షల కోట్లను కోల్పోయారు. ఇన్వెస్టర్ల సంపదగా భావించే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.1.78 లక్షల కోట్లకు దిగివచ్చింది. రాష్ట్రంలో అలర్ట్ బ్రిటన్‌లో కరోనా తీవ్రరూపం దాల్చడంతో రాష్ట్రం అప్రమత్తమైంది. అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులకు క్షుణ్ణంగా పరీక్షలు చేసిన తర్వాతే పంపాలనినిర్ణయించింది. -
6 నెలల్లో 30 కోట్ల మందికి టీకా
న్యూఢిల్లీ: దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్‌ను రానున్న ఆరేడు నెలల్లో 30 కోట్ల మందికి ఇవ్వనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. కోవిడ్–19పై శనివారం మంత్రుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. జీనోమ్ సీక్వెన్స్ ద్వారా మన దేశ శాస్త్రవేత్తలు దేశీయంగా రూపొందించిన వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నట్లు చెప్పారు. కోటికి పైగా కేసులు మన దేశంలో నమోదైనప్పటికీ, రికవరీ రేటు విషయంలో భారత్ చాలా ముందుందని అన్నారు. పండుగల సీజన్లో కూడా దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య ఓ పరిమితిని మించి పెరగలేదన్నారు. పండుగ సమయాల్లో తీసుకు న్న జాగ్రత్తలనే వ్యాక్సినేషన్ సమయంలో కూడా పాటించాలని సూచించారు. మోదీ కృషి అమోఘం: కరోనా సమయంలో ప్రధాని మోదీ తీసుకున్న చర్యలే దేశంలో కరోనాను నియంత్రించేందుకు, అవగాహన కల్పించేందుకు తోడ్పడ్డాయని హర్షవర్ధన్ వ్యాఖ్యానించారు. ప్రతి విషయాన్ని ఆయన సమీక్షించారని అన్నారు. వ్యాక్సిన్ అభివృద్ధిలో సైతం మోదీ అదే చొరవను ప్రదర్శించారని తెలిపారు. అంత తీవ్రత ఉండక పోవచ్చు.. న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తిరిగి భారీ స్థాయిలో పెరగకపోవచ్చని ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ షాహిద్ జమీల్ చెప్పారు. సెప్టెంబర్ మధ్య కాలంలో రోజుకు 90 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని, ఆ స్థాయిలో తిరిగి కేసులు నమోదయ్యే అవకాశం ఉండబోదని ఆయన పేర్కొన్నారు. కేసుల సంఖ్య నవంబర్‌లో నమోదైన తీరులోనే ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. 25 వేల కొత్త కేసులు: దేశంలో 24 గంటల్లో 25,152 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,00,04,599కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 347 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,45,136కు చేరుకుంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 95.50 లక్షలకు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,13,831గా ఉంది. -
పొరపాటు దిద్దుకున్న ఎయిమ్స్!
న్యూఢిల్లీ: నీట్ పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించిన ఓ విద్యార్థినికి ఆలిండియా ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సీటు నిరాకరించడం సంచలనమైంది. నీట్-2020లో 66వ ర్యాంక్ పొందిన ఫర్హీన్ కేఎస్‌కు ఎయిమ్స్ సీటు ఇవ్వకపోవడంతో ఆమె టూరిజం శాఖ మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అల్ఫోన్స్‌ను కలిసి గోడు వెళ్లబోసుకుంది. దీనిపై స్పందించిన ఎంపీ అల్ఫోన్స్ కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు లేఖ రాసి విద్యార్థిని సమస్య పరిష్కరించాలని కోరారు. విషయం ఆరోగ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో తమ పొరపాటును సరిదిద్దుకున్న ఎయిమ్స్ యాజమాన్యం ఎట్టకేలకు ఫర్హీన్ కేఎస్‌కు ప్రవేశం కల్పించింది. కాగా, నీట్లో 66 ర్యాంక్ సాధించిన ఫర్హీన్ గడువులోగా క్రిమి లేయర్ సర్టిఫికెట్ సమర్పించలేదన్న కారణంతో ఎయిమ్స్ సీటు నిరాకరించిన సంగతి తెలిసిందే. పేద కుటుంబంలో టాప్ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఎయిమ్స్‌లో చేదు అనుభవం ఎదురవడం దురదృష్టకరమని అల్ఫోన్స్ ఈ సంర్భంగా పేర్కొన్నారు. కేంద్ర మంత్రి చొరవతో ఫర్హీన్‌కు సీటు దక్కిందని, మరి మంచి ర్యాంకులు సాధించినప్పటికీ చిన్నచిన్న కారణాలతో ప్రవేశాలకు దూరమవుతున్నవారి సంగతేంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సమస్యల పరిష్కారానికి ఒక అప్పిలేట్ అథారిటీ ఉండాలని అల్ఫోన్స్ సూచించారు. ఉన్నత చదువులకు సుదూర ప్రాంతాల నుంచి ఢిల్లీ వచ్చే విద్యార్థులంతా మంత్రులను కలవలేరు కదా అని అన్నారు. ప్రవేశాలకు సంబంధించి ప్రాస్పెక్టస్‌లో సవివరంగా చెప్పాలని అన్నారు. -
కరోనా విజృంభణ.. రాజధాని ఆందోళన
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 7,178 కరోనా కేసులు నమోద కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇంత వరకు ఢిల్లీలో 7000 కరోనా కేసుల సంఖ్యను ఎప్పుడూ దాటలేదు. గత మూడు రోజుల నుంచి రోజుకి 6000కి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రెండో అత్యధిక కేసులు నవంబర్ 4న 6842 కేసులు నమోదయ్యాయి. నగరంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,23,831కి చేరింది. గత 24 గంటల్లో 64 మరణాలు సంభవించాయని, మరణాల రేటు 1.6 శాతంగా ఉందని, రికవరీ రేటు 89 శాతంగా ఉందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. సీతాకాలం సమీపించడంతో నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో వాయు కాలుష్యం పెరగడం మూలంగానూ ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం శీతాకాలంలో వాయు కాలుష్యం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వైరస్ శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావితం చేస్తుందని, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎక్కువ ప్రమాదంలో పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. ఢిల్లీలో రోజువారీగా కరోనా సోకే సగటు రేటు 12.2 శాతంగా ఉంటే జాతీయ సగటు రేటు 3.9 శాతంగా ఉంది. పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా నమోదు కావడానికి చర్యలు తీసుకోవాలని కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలకు విజ్క్షప్తి చేస్తుంది. నగరంలో కోవిడ్ నియంత్రణకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష్ వర్ధన్ గురువారం ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, ఢిల్లీ ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. నగరంలో కోవిడ్ ఆర్టీ-పీసీఆర్ పరీక్షల సంఖ్యను పెంచాలని, కొవిడ్ సోకిన వారికి మెరగైన వైద్యం అందించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరారు. యాంటిజెన్ పరీక్షలలో కరోనా నెగటివ్ వచ్చినప్పటికీ కరోనా లక్షణాలు ఉన్నట్లనిపిస్తే తప్పనిసరిగా పీసీఆర్ పరీక్ష చేయాలన్నారు. ఢిల్లీలోని ఉత్తర, మధ్య, ఈశాన్య, తూర్పు, వాయువ్య ఆగ్నేయ ఆరు జిల్లాల్లో కరోనా పెరుగుదల రేటు గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశ కరోనా రాజధాని నగరంలో పెరుగుతున్న కోవిడ్ -19 కేసులపై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు గురువారం విమర్శించడమే గాక నగరం త్వరలోనే "దేశ కరోనా రాజధాని"గా మారనుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. గత వారం హోం మంత్రిత్వ శాఖ, ఢిల్లీ ప్రభుత్వ అధికారుల సమావేశంలో కరోనా కేసులు పెరగడానికి పండుగలు, ప్రజలు గుంపులు గుంపులుగా తిరగడం, కోవిడ్ నిబంధనలు పాటించకపోవడమే ప్రధాన కారణాలుగా పేర్కొంది. దేశంలో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 84.11 లక్షలు కాగా, 1,24,985 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుత కరోనా కేసుల సంఖ్య 5.2 లక్షలు. రికవరీ అయిన వారి సంఖ్య 77.66 లక్షలకు చేరింది. శుక్రవారం ఒక రోజే 54,157 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, బిహార్ పలు రాష్ట్రల్లో కేసుల విపరీతంగా పెరగడంతో మళ్లీ లాక్డౌన్ ప్రకటించాలనే చర్చకుడా సాగుతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా యూరోపియన్, ఇతర దేశాలు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నాయి. ఇదే విధంగా దేశంలో కరోనా ప్రభావం ఎక్కువైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించక తప్పదు. ఇక నుంచైనా ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జీవనం కొనసాగించకపోతే అంతే సంగతులని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
డిసెంబరు నాటికి భారత్‌లో వ్యాక్సిన్!
న్యూఢిల్లీ: ఐసీఎంఆర్‌తో కలిసి భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ ‘కోవాక్సిన్’ ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. మరోవైపు ట్రయల్స్ అన్ని విజయవంతమైన పక్షంలో ఆక్స్ఫర్డ్ టీకా ‘కోవిషీల్డ్’ 2020 చివరి నాటికి భారతీయులకు అందుబాటులోకి రావచ్చునని కూడా పలు రిపోర్టులు చెప్తున్నాయి. వీటితోపాటు జైడుస్ కాడిలా తయారు చేస్తున్న ‘జైకోవ్ డీ’, ఆక్స్ఫర్డ్ ‘ఆస్ట్రాజెనికా’తో జతకట్టిన సీరం ఇన్స్‌స్టిట్యూట్ ట్రయల్స్ కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే మరో నాలుగు నెలల్లో ఇవి కూడా అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని హర్షవర్ధన్ వెల్లడించారు. వ్యాక్సిన్ల తయారీలో భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తోందని అన్నారు. (చదవండి: ప్లాస్మా థెరపీ: అనుమతులు నిలిపివేసిన యూఎస్!) సురక్షిత వ్యాక్సిన్‌తోపాటు సరసమైన ధరలకే దానిని ప్రజలకు అందించే దిశగా ఆయా కంపెనీలు పనిచేస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఇక భారత్‌లో అందుబాటులోకి వచ్చే వ్యాక్సిన్ ఏదైనా తొలుత 50 లక్షల వ్యాక్సిన్లు కరోనా వారియర్లకే ఇవ్వాలని కేంద్రం ఇదివరకే నిర్ణయించింది. దానికోసం ఆర్డర్లు కూడా ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇదిలాఉండగా.. వ్యాక్సిన్ తయారీలో భారత్ సక్సెస్ అవుతుందని రష్యా పేర్కొంది. ఆ సత్తా భారత్‌కు ఉందని తెలిపింది. కాగా, స్పుత్నిక్ వీ పేరుతో రష్యా తొలి కరోనా వ్యాక్సిన్‌ను అందబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే, సరైన నిబంధనలు పాటించకుండా ఆగమేఘాల మీద రష్యా వ్యాక్సిన్‌ను తెచ్చిందనే విమర్శలు వెలువడుతున్నాయి. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ పనితీరు త్వరలో వెల్లడి కానుంది. (డిసెంబరు 3 నాటికి కరోనా కనుమరుగు!) -
మరణాల రేటు 2.72 శాతమే: కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా రికవరీ రేటు 63 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. అదే సమయంలో మరణాల రేటు 2.72 శాతం మాత్రమే ఉందని అన్నారు. భారత్‌లో కరోనా మహమ్మారి ఇంకా సామాజిక వ్యాప్తి కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ) దశకు చేరుకోలేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. కొన్ని చోట్ల మాత్రం స్థానికంగా కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉందని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నామని తెలిపారు. రోజూ 2.7 లక్షల పరీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే, కేసుల పెరుగుదల గురించి ఆందోళన చెందడం లేదని చెప్పారు. వైరస్ బాధితులను గుర్తించి చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. (చదవండి: పనికిరాని ప్లాస్టిక్‌తో లక్ష కి.మీ రోడ్లు) కాగా, దేశవ్యాప్తంగా శుక్రవారం అత్యధికంగా 26,506 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,93,802 కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో మహమ్మారి బారినపడి 475 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 21,604కు చేరుకుంది. కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,95,513కు చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2,76,685 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. ఇక రాష్ట్రాలవారీగా కోవిడ్ కేసులు చూస్తే.. 2,30,599 కేసులతో మహారాష్ట్ర, 1,26,581 కేసులతో తమిళనాడు, 1,07,051 కేసులతో ఢిల్లీ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి (కరోనా : దేశంలో సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదు) -
కరోనా : దేశంలో సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదు
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి ఇంకా సామాజిక వ్యాప్తి( కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ) దశకు చేరుకోలేదని ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ మరోసారి స్పష్టం చేశారు. గురువారం 18వ ఉన్నత స్థాయి మంత్రులు, నిపుణుల సమీక్షలో పాల్గొన్న మంత్రి తాజా పరిస్థితులపై అధ్యయనంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. ''కరోనా ప్రభావిత దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉందని ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఈ గణాంకాలను సరైన కోణంలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే జానాభా పరంగా రెండో స్థానంలో ఉన్న మన దేశంలో ప్రతి పది లక్షల జనాభాకు 538 కేసులే నమోదవుతున్నాయి. ప్రపంచ సగటు పరంగా 1453 కేసులు నమోదువుతుంటే భారత్‌లో ఈ సంఖ్య తక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ దేశ వ్యాప్తంగా చూస్తే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ దశకు మనం ఇంకా చేరుకోలేదు'' అని హర్షవర్దన్ పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్, నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, ఐసీఎంఆర్ డిజి డాక్టర్ బలరాబ్ భరగవ సహా పలువురు నిపుణులు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే కరోనా సామాజిక వ్యాప్తికి ఇంకా చేరుకోలేదని నిపుణుల బృందం మరోసారి స్పష్టం చేసింది. (భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న కరోనా! ) ఇక దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,67,29కు చేరుకోగా గడిచిన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 24,879 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధిక కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, డిల్లీ, తెలంగాణ, యూపీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లోనూ 75 శాతం ఈ రాష్ర్టాల్లోనే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత్‌లో వరుసగా ఏడవరోజు కూడా 20వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతుండగా రికవరీ రేటు మాత్రం అధికంగానే ఉందని పేర్కొంది. ఇప్పటికే 4,76,377 మంది కరోనా నుంచి కోలుకోగా ప్రస్తుతం 2,69,789 యాక్టివ్ కేసులే ఉన్నాయని వెల్లడించింది. (యూపీలో తక్కువ టెస్టులే.. అయినా మెరుగ్గానే! ) -
రక్తం అవసరం ఉన్నవారికి ఇకపై సులభంగా
ఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తుంది. ఈ క్లిష్టమైన సమయంలో రక్తం అవసరం ఉన్నవారికి సులభంగా అందించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ గురువారం ‘ఈ బ్లడ్ సర్వీసెస్’ అనే యాప్‌ను ప్రారంభించారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్) భాగస్వామ్యంతో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని మంతత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకుంటే కొద్ది నిమిషాల్లోనే రక్తం అందిస్తారని, సింగిల్ విండో యాక్సెస్ ద్వారా ఈ సేవలు పొందడం చాలా సులభమని హర్షవర్దన్ పేర్కొన్నారు. (కరోనా కొత్త హాట్ స్పాట్ ఢిల్లీ ) The App will act as a boon for the needy. @IndianRedCross has always assisted the Government in various health programs. I commend this effort that they have made during difficult #COVID19. The needy will now have easy access to blood now@cdacindia @MoHFW_INDIA @WHO @pagthals pic.twitter.com/ZblUXas0NO — Dr Harsh Vardhan (@drharshvardhan) June 25, 2020 ఎంతో పారదర్శకంగా పనిచేయడంతో పాటు రక్తం అత్యవసరమైన వారికి తొందరగా చేరుస్తారని అన్నారు. రక్తం కావాలనుకునే వారు యాప్‌లో రిజిస్టార్ చేసుకోవాలని, దీని ద్వారా ఏఏ ప్రాంతాల్లో రక్తం నిల్వలు అందుబాటులో ఉన్నాయన్న సమాచారం తెలుస్తుందని చెప్పారు. రక్తం అవసరమైన వారికి బ్లడ్ బ్యాంకుల ద్వారా కనీసం నాలుగు యూనిట్లు అందుతుందని చెప్పారు. రెడ్‌క్రాస్ సంస్థ వివిధ ఆరోగ్య కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతూ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ సహాయం అందిస్తోందని మంత్రి కొనియాడారు. కరోనా లాంటి కష్టకాలంలోనూ ప్రజలకు అండగా నిలబడిందని హర్షవర్దన్ ప్రశంసించారు. (నా కూతురు కెప్టెన్ అని నాన్న అంటుంటే.. ) -
టీబీ నిర్మూలనలో రెండో స్థానంలో ఏపీ
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: టీబీ నిర్మూలనలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. దేశంలో 2019లో 24.04 లక్షల టీబీ కేసులను గుర్తించామని, 2018తో పోల్చితే కేసుల సంఖ్య 14 శాతం పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో ప్రైవేటు రంగంలో గుర్తించిన కేసుల సంఖ్య 6.78 లక్షలుగా ఉందని తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, సహాయ మంత్రి అశ్వినీకుమార్ చౌబే బుధవారం ఇక్కడ టీబీ వార్షిక నివేదిక–2020ని విడుదల చేశారు. నివేదిక ప్రకారం.. ► 2017లో దాదాపు 10 లక్షల మేర తప్పిపోయిన టీబీ కేసుల సంఖ్య ఉండగా.. ఇప్పుడది 2.9 లక్షలకు తగ్గింది. ► హెచ్ఐవీ పరీక్షలు చేసిన టీబీ పేషెంట్ల సంఖ్య 2018తో పోలిస్తే 14 శాతం పెరిగి 81 శాతానికి చేరింది. ► 4.5 లక్షల డాట్ కేంద్రాల ద్వారా దాదాపు అన్ని గ్రామాల్లో టీబీ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. ► టీబీ పేషెంట్లకు నిక్షయ్ పోషణ్ యోజన ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ కోసం వ్యవస్థ పూర్తిస్థాయిలో రూపొందిందని వెల్లడించింది. ► ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా 2025 నాటికి దేశంలో టీబీని నిర్మూలించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని వివరించారు. ► నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ (ఎన్టీఈపీ)–2019లో అత్యుత్తమ పనితీరుకు కేంద్రం ర్యాంకులు ప్రకటించింది. ► 50 లక్షలకు పైబడిన జనాభా గల పెద్ద రాష్ట్రాల కేటగిరీల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ అత్యుత్తమ పనితీరు కనబరిచి వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ► 50 లక్షల కంటే తక్కువ జనాభా కలిగిన చిన్న రాష్ట్రాల కేటగిరీలో త్రిపుర, నాగాలాండ్ అత్యుత్తమ పనితీరు కనబరిచాయి. ► కాగా, టీబీ నిర్మూలనలో ఏపీ రెండో స్థానం లభించడంపై రాష్ట్ర క్షయ నిర్మూలనా ప్రాజెక్టు అధికారి డాక్టర్ రామారావు సంతోషం వ్యక్తం చేశారు. గతేడాది రాష్ట్రంలో 99,904 మంది టీబీ రోగులను గుర్తించి చికిత్స అందించామని, ఇందులో 92 శాతం రికవరీ రేటు నమోదైనట్లు తెలిపారు. -
ఆయుర్వేద మూలిక అశ్వగంధపై క్రినికల్ ట్రయల్స్
ఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. భారత్‌లోనూ కోవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా మెడిసన్‌కు సంబంధించి పలు దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. కరోనా వల్ల మనదేశ సాంప్రదాయ పద్దతులు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయుర్వేద మూలిక అశ్వగంధపై క్రినికల్ ట్రయల్స్ ప్రారంభించనుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్సీ (ఐసీఎంఆర్ ), కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) సంయుక్తంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాక మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తో పోలిస్తే అశ్వగంధ ఏ విధింగా పనిచేస్తుందన్న దానిపై పరీక్షించనున్నారు. #WATCH ...Clinical trials of Ayush medicines like Ashwagandha, Yashtimadhu, Guduchi Pippali, Ayush-64 on health workers and those working in high risk areas has begun from today: Union Health Minister Dr Harsh Vardhan #COVID19 pic.twitter.com/dHKUMGCclX — ANI (@ANI) May 7, 2020 అంతేకాకుండా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు అశ్వగంధతో పాటు యష్తిమధు, గుడుచి పిప్పాలి వంటి సాంప్రదాయ ఔషదాలు (ఆయుష్ -64) గా పిలిచే ఈ ఫార్ములాను నేటినుంచి ఇవ్వనున్నట్లు ఆయుష్ కార్యదర్శి రాజేశ్ కొటెచా తెలిపారు. దీని వల్ల శ్వాస సంబంధిత సమస్యలు నియంత్రణలో ఉంటాయని పేర్కిన్నారు. ఇదిలా ఉండగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,952 కు చేరింది. కోవిడ్ కారణంగా ఇప్పటివరకు దేశంలో 1,783 మంది మరణించారని కేంద్రం వెల్లడించింది. (చ్యవన్‌ప్రాశ్ తినండి.. తులసి టీ తాగండి)