Health university
-
తెల్లకోటు కలలు ఛిద్రం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గపు పోకడలతో మన రాష్ట్రంలో విద్యార్థులకు తీరని అన్యాయం జరిగింది. డాక్టర్ కావాలని కలలుగని రేయింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థులకు తీవ్ర నిరాశే ఎదురైంది. అనేకమంది తెల్లకోటు కలలు ఛిద్రమయ్యాయి. కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం ఈ ఏడాది అనుమతులను అడ్డుకోవడంతో పోటీకి తగ్గట్టుగా సీట్లు పెరగక విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. నీట్ యూజీలో మంచి స్కోర్ సాధించినా.. ఓసీలతో పాటు బీసీ, ఎస్సీ విద్యార్థులకూ సీటు దక్కలేదు. మూడోరౌండ్ కౌన్సెలింగ్ ముగిసిన తరువాత పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో జనరల్ విభాగంలో 502 మార్కుల వరకు ప్రభుత్వ కోటా సీటు లభించింది. అదే మన రాష్ట్రంలో ఏయూ రీజియన్‌లో 513 మార్కుల (1,85,817 ర్యాంకు) వద్దే ఎస్సీ విభాగంలో సీట్ల కేటాయింపు నిలిచిపోయింది.ఇదే ఎస్సీ విభాగంలో తెలంగాణ రాష్ట్రంలో 433 మార్కుల వరకు సీట్లు దక్కాయి. అంటే మన దగ్గర కంటే 80 మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులకు ప్రభుత్వ కోటా సీట్లతో ఎంబీబీఎస్ పూర్తిచేసే అదృష్టం లభించింది. పక్క రాష్ట్రంతో పోలిస్తే అత్యధికంగా బీసీ–ఏ విభాగంలో మన విద్యార్థులు 146 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నా ప్రభుత్వ సీటు లభించలేదు. మంజూరైన సీట్లనూ వద్దన్న బాబు సర్కారు వాస్తవానికి ఈ విద్యా సంవత్సరం పులివెందుల, ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పాడేరుల్లో ఒక్కోచోట 150 సీట్లతో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడం కోసం చంద్రబాబు ప్రభుత్వం అనుమతులు రాబట్టలేదు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో తీసుకున్న చర్యల ఫలితంగా ఒక్క పాడేరు వైద్యకళాశాలకు మాత్రం కేవలం 50 సీట్లు దక్కాయి. పులివెందుల కళాశాలకు 50 సీట్లు మంజూరైనా మాకొద్దని ఎన్ఎంసీకి ప్రభుత్వమే లేఖరాసి రద్దుచేయించింది. ప్రభుత్వ తీరుతో ఈ ఒక్క ఏడాదే ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్రం నష్టపోయింది. ఈ కారణంగా మన విద్యార్థులకు జరిగిన నష్టం స్పష్టంగా కనిపిస్తోంది. సీట్లు పెరగకపోవడంతో 500 నుంచి 560 వరకు స్కోర్ చేసిన బీసీ, ఎస్సీ విద్యార్థులకు కన్వీనర్ కోటా సీటు లభించలేదు. దీంతో పిల్లలను యాజమాన్య కోటా కింద రూ.లక్షలు వెచ్చించి చదివించలేని నిరుపేద, మధ్యతరగతి తల్లిదండ్రులు నర్సింగ్, వెటర్నరీ, బీడీఎస్ వంటి ప్రత్యామ్నాయ కోర్సుల్లో చేర్పిస్తున్నారు. ధైర్యం చేసి లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు పంపినా వచ్చే ఏడాది రాష్ట్రంలో సీట్లు పెరుగుతాయన్న నమ్మకంలేదని వారు చెబుతున్నారు. ప్రభుత్వమే మా తెల్లకోటు కలను ఛిద్రం చేసిందని బీసీ, ఎస్సీ, ఇతర వర్గాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మూడో విడత కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపు2024–25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపునకు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం మూడోవిడత కౌన్సెలింగ్ నిర్వహించింది. విద్యార్థులు సోమవారం మధ్యాహ్నం రెండు గంటల్లోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి ఆదేశించారు. గడువులోగా విద్యార్థులు కళాశాలల్లో రిపోర్ట్ చేయడం కోసం ఆదివారం కూడా పనిదినంగా పరిగణించాలని అన్ని వైద్య కళాశాలల ప్రిన్సిపల్స్‌కు సూచించారు.ప్రిన్సిపల్స్ బదిలీ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం కోసం కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు, వాటి బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లను ప్రభుత్వం బదిలీ చేసింది. వాస్తవానికి ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా నిరి్మంచిన ఐదు వైద్య కళాశాలలు ప్రారంభమవ్వాల్సి ఉంది. అయితే కొత్త కళాశాలను ప్రైవేటుకు కట్టబెట్టడం కోసం ప్రభుత్వం వీటిలో సీట్ల కేటాయింపులను అడ్డుకుంది. ఇప్పుడు ఆ బోధనాస్పత్రుల స్థాయిని తగ్గిస్తోంది. డీఎంఈ నుంచి సెకండరీ హెల్త్‌కు ఆస్పత్రులను అప్పగించే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అక్కడ పని చేసే వైద్యులను పాత కళాశాలలు, బోధనాస్పత్రులకు సర్దుబాటు చేస్తోంది. ఇదే క్రమంలో ప్రిన్సిపళ్లను, సూపరింటెండెంట్లను బదిలీ చేసింది. -
హెల్త్ వర్సిటీ పేరు మార్పులో చంద్రబాబు అత్యుత్సాహం
సాక్షి, అమరావతి: పేదలకు మెరుగైన వైద్యసేవలు, విద్యార్థులకు వైద్య విద్యను అందించడంలో పూర్తి నిర్లక్ష్యం వహించిన చంద్రబాబు హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పునకు మాత్రం అత్యుత్సాహం చూపించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీగా మారుస్తూ తీసుకున్న నిర్ణయంపట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడుసార్లు సీఎంగా చేసిన బాబు ఏనాడు ప్రభుత్వ వైద్య రంగాన్ని పట్టించుకోలేదు. పైగా ప్రైవేటు వైద్య కళాశాలలను, ప్రైవేటు ఆసుపత్రులను ప్రోత్సహించి వైద్య వృత్తిని వ్యాపారం చేశారు.కానీ, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే వైద్యరంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్సార్ హయాంలో ఆరోగ్యశ్రీ, 108, 104 వ్యవస్థలను ప్రవేశపెట్టి వైద్యశాఖను బలోపేతం చేశారు. ఆయన తనయుడైన జగన్ గడిచిన ఐదేళ్లలో వైద్యరంగం రూపురేఖలు మార్చారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఏకంగా 17 వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టారు. అలాగే, నాడు–నేడుతో ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులు ఆధునీకరించారు.ఈ నేపథ్యంలోనే.. వైద్య రంగాన్ని పేదలకు చేరువ చేసిన వైఎస్సార్ పేరును హెల్త్ యూనివర్శిటీకి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెట్టింది. దీనికితోడు ఎన్టీఆర్ పేరును జిల్లాకు పెట్టి వైఎస్ జగన్ ఆదర్శంగా నిలిచారు. కానీ, రాజకీయ కక్ష సాధింపునకు కొనసాగింపుగా బాబు వైఎస్సార్ పేరును తొలగించి ఎన్టీఆర్ పేరు పెడుతూ కేబినెట్లో నిర్ణయం తీసుకోవడంపై ప్రజలు తప్పుబడుతున్నారు. -
పిల్లల భవితకు పరీక్షా?
పరీక్షల్లో విద్యార్థులు పాసవడం, ఫెయిలవడం సహజం. కానీ వ్యవస్థే ఫెయిలవడం, తత్కారణంగా విద్యార్థులు గురి తప్పడం ఎప్పుడన్నా చూస్తామా? వైద్య విద్యాలయాల్లో ప్రవేశానికై జరిపే అఖిల భారత పరీక్ష నేషనల్ ఎలిజబిలిటీ– కమ్– ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) విషయంలో అదే జరిగింది. పేపర్ లీకులు, గ్రేస్ మార్కులు, పలువురికి నూరుశాతం మార్కులు, కటాఫ్ మార్కుల్లో గణనీయంగా పెరుగుదల... ఇలా ఈ ఏటి ‘నీట్’ పరీక్షలో వివాదాలు అనేకం. ఈ అవకతవకలన్నీ విద్యార్థుల్లో ఆవేదన, ఆందోళన, నిరాశ రేపుతున్నాయి. ఈసారి పరీక్ష జరిగిన కంగాళీ వ్యవహారంపై కోచింగ్ సంస్థలు, డాక్టర్లు, ప్రతిపక్ష నేతలు గొంతెత్తేలా చేశాయి. చివరకిలాంటి దేశవ్యాప్త పరీక్షలు నిర్వహించే జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)పై పిల్లలకూ, తల్లితండ్రులకూ నమ్మకమే పోయే పరిస్థితి వచ్చింది. కొన్నిచోట్ల పేపర్ లీకైందన్న వార్తల్ని ఎన్టీఏ కొట్టిపారేసినా, విద్యార్థులు, కోచింగ్ సంస్థల వారు కోర్టు కెక్కారు. ఫలితాలను రద్దు చేయాలన్న వారి పిటిషన్‌పై కేంద్రానికీ, ఎన్టీఏకీ సుప్రీం కోర్ట్ మంగళవారం నోటీసులు జారీ చేసింది. పరీక్ష పవిత్రతే దెబ్బతిన్నదంటూ జవాబు కోరింది. వెరసి కొన్నేళ్ళు గా రచ్చ రేపుతున్న ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ విశ్వసనీయతకు ఇప్పుడు అగ్నిపరీక్ష ఎదురైంది. దేశంలోని 700 పైచిలుకు విద్యాలయాల్లో లక్షా 8 వేల చిల్లర ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఎంబీబీఎస్ చదివేందుకు ఏటా కొన్ని లక్షల మంది ‘నీట్’కు హాజరవుతారు. 2017లో 12 లక్షల మంది హాజరుకాగా, ఏడేళ్ళలో ఆ సంఖ్య రెట్టింపైంది. ఈ ఏడాది ‘నీట్’కు 24 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మే 5న పరీక్ష జరగగా, తర్వాత నెలరోజులకే, నిర్ణయించిన తేదీ కన్నా పది రోజుల ముందరే జూన్ 4న ఫలితాలను ప్రకటించారు. దేశమంతా ఎన్నికల ఫలితాల హడావిడిలో ఉండగా సందట్లో సడేమియాగా ఈ ఫలితాల వెల్లడి అనుమానాలు రేపింది. పైగా, ఏటా ఈ ప్రవేశపరీక్షలో ఏ ఒక్కరో నూరు శాతం మార్కులు సాధిస్తారు. ఆ మాటకొస్తే, అసలీ పరీక్షలో 650, ఆ పైన మార్కులు సంపాదించడం సైతం కష్టం. కఠోరసాధనతోనే సాధ్యం. అలాంటిది... ఈసారి ఏకంగా 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు వచ్చాయి. ఫలితంగా... గతంలో 650 మార్కుల స్కోరుకు సైతం విద్యార్థులకు పదివేలల్లో ర్యాంకులొస్తే, ఈసారి ఆ మార్కులకు ముప్ఫై, నలభై వేల మధ్య ర్యాంకులే దక్కడంతో విద్యార్థులు, తల్లితండ్రుల ఆవేదన అంతా ఇంతా కాదు. ఆన్లైన్ పరీక్ష ‘క్లాట్’కూ, ఆఫ్‌లైన్‌లో జరిగే ‘నీట్’కూ విధానాల్లో తేడాలున్నాయి. కానీ, క్లాట్‌లో లాగా ఇక్కడా 1563 మంది విద్యార్థులకు ఎన్టీఏ గ్రేస్ మార్కులు కలిపింది. అదేమంటే కొన్నిచోట్ల ప్రశ్నపత్రాలు ఆలస్యంగా ఇవ్వడం వల్ల విద్యార్థులకు సమయం వృథా అయిందనీ, వారు చదివిన పాత – కొత్త పాఠ్యపుస్తకాల్లో తేడాలున్నాయనీ, అందుకే అదనపు మార్కులు కలిపామనీ చెప్పింది. కాంపిటీటివ్ పరీక్షల్లో కనీవినీ ఎరుగని గ్రేస్ మార్కులు, ఈ వివరణలు హాస్యాస్పదం. పైగా, సరైన జవాబుకు 4 మార్కులు – తప్పితే ఒక మార్కు మైనస్ గనక, ఏ లెక్కన చూసినా అసంభవమైన 717, 718 లాంటి స్కోర్లు రావడమేమిటో దేవుడికే తెలియాలి. పాట్నాలో పేపర్ లీకైందనీ, రాజస్థాన్, జార్ఖండ్, ఢిల్లీ, గుజరాత్‌లలో ఒకరి బదులు మరొకరు పరీక్షలు రాశారనీ ఫిర్యాదులున్నాయి. హర్యానాలో ఒకే సెంటర్లో పరీక్ష రాసిన ఆరుగురికి ఫస్ట్ ర్యాంక్ రావడం, పైగా వారి దరఖాస్తులు ఆరోహణ క్రమంలో ఒకరి తర్వాత మరొకరివి కావడం విడ్డూరం. నీట్లో 715 మార్కులొచ్చిన విద్యార్థి తీరా ఇంటరే పాసవని విచిత్రం సరేసరి. అందుకే, అసలు నిజాలను ఎన్టీఏ దాచిపెడుతోందని అనుమానాలొస్తున్నాయి. లీకులు, వివాదాలు కొత్త కాకున్నా ఈసారి జరిగింది పక్కా స్కామ్ అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరీక్ష రద్దు చేసి, మళ్ళీ జరపాలనే డిమాండ్లూ వస్తున్నాయి. ఇప్పుడు నీట్లో మంచి మార్కులొచ్చి కూడా ఎప్పటిలా మంచి ర్యాంక్, కోరుకున్న కాలేజీలో సీటు రాని విచిత్రపరిస్థితి విద్యార్థులది. నిస్పృహతో కొందరు పిల్లలు ఇప్పటికే ఆత్మహత్యలకు పాల్పడడం విషాదం. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పేదలకూ, సామాజిక న్యాయానికీ ఈ నీట్ నిర్వహణ పూర్తిగా వ్యతిరేకమని తమిళనాడు ఎప్పటి నుంచో వాదిస్తోంది. 2021లో వచ్చిన స్టాలిన్ సర్కార్ జస్టిస్ రాజన్ సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీ వేసింది. కమిటీ సిఫార్సుల మేరకు లోపభూయిష్ఠమైన నీట్ నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలంటూ, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. దీర్ఘకాలంగా రాష్ట్రపతి ముద్ర కోసం వేచి చూస్తోంది. ఎన్టీఏ మాత్రం తప్పులు ఒప్పుకొని, దిద్దుబాటుకు సిద్ధం కావట్లేదు. తాజా పరీక్షలో జవాబులు గుర్తుపెట్టే ఓఎంఆర్ షీట్ చినిగిపోయిందంటూ ఎన్టీఏ ఒకరి ఫలితం ఆపేసింది. తీరా చూస్తే ఆ విద్యార్థినికి 715 మార్కులు రావడం గమనార్హం. ఇలాంటి విచిత్ర విన్యాసాలు చూశాకనైనా... మన పరీక్షా వ్యవస్థలో, ఉపయోగించే సాంకేతికతలో పారదర్శకత తీసుకురాక తప్పదు. అవసరమైతే వైద్య విద్యాలయాల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను వాయిదా వేసి, కూలంకషంగా దర్యాప్తు చేయాలి. అవకతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలను పరిశీలిస్తున్న ఉన్నతస్థాయి ప్యానెల్ మరో వారంలో తన నివేదిక ఇవ్వనుంది. అది చేసే సిఫార్సుల మాట అటుంచితే, ఇంత జరుగుతున్నా ప్రభుత్వ పెద్దలు ఈ వివాదంపై ఇప్పటి దాకా నోరు విప్పకపోవడం విషాదం. చదువుల నుంచి ఉద్యోగాల దాకా మన దేశంలో సమస్త పరీక్షలకూ లీకుల జాడ్యం, అవకతవకల మకిలి అంటుకుంది. గత అయిదేళ్ళలో 15 రాష్ట్రాల్లో మొత్తం 41 పేపర్ లీకుల వల్ల 1.4 కోట్ల మంది ఉద్యోగార్థులకు కష్టం, నష్టం కలిగాయి. ఇది మన వ్యవస్థకే సిగ్గుచేటు. బాగా చదువుకోవాలనుకున్న పసివారి భవిష్యత్తుకు సైతం ఈ పీడ తప్పకపోవడమే మరీ బాధాకరం. సమూల ప్రక్షాళనతో ఇలాంటి పరీక్షలను లోపరహితంగా మార్చడమే మార్గం. -
హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు ప్రక్రియ పరిపూర్ణం
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా వెబ్‌సైట్‌ను మార్చడంతో పాటు, అన్నింట్లో మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే యూనివర్సిటీలోని అన్ని విభాగాల్లో పేర్లు మార్చారు. యూనివర్సిటీ భవనంపై ఉన్న పేర్లు సైతం మార్చేశారు. యూనివర్సిటీ నిధులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు, ఇతరత్రా పేర్లు సైతం మార్పు చేసేలా బుధవారం చర్యలు తీసుకున్నారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ముందస్తు చర్యలను యూనివర్సిటీ వీసీ డాక్టర్ పి.శ్యామ్‌ప్రసాద్‌తో పాటు ఇతర అధికారులు సమీక్షిస్తున్నారు. విదేశాలకు వెళ్లే వైద్య విద్యార్థులకు సైతం ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సమగ్ర చర్యలు తీసుకుంటున్నారు. ఇక మీదట అన్ని కార్యకలాపాలు డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరుతోనే నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. -
హెల్త్ వర్సిటీ వెబ్సైట్లో మార్పులు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ సోమవారం ఆదేశాలు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక వర్సిటీ అధికారిక వెబ్సైట్లోనూ మార్పుల ప్రక్రియకు మంగళవారం శ్రీకారం చుట్టింది. అన్ని రకాల వెబ్సైట్లను డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా మారుస్తున్నారు. ఇకపై అన్ని రకాల ఉత్తర ప్రత్యుత్తరాలతో పాటు, ఇతర కార్యకలాపాలు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరుతోనే నిర్వహించనున్నారు. ఇందుకోసం అనుబంధ కళాశాలలకు, నేషనల్ మెడికల్ కమిషన్‌కు సమాచారం ఇవ్వనున్నారు. ఒకట్రెండు రోజుల్లో యూనివర్సిటీ భవనాలపై ఉన్న పేర్లు సైతం మార్పుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో రెండుసార్లు పేరు మార్పు విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చడం ఇప్పుడు కొత్తేమీ కాదని సీనియర్ వైద్యులు అంటున్నారు. తొలుత యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (యూహెచ్ఎస్)గా ఉండేదని, ఆ తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా నామకరణ చేశారని గుర్తుచేశారు. ఆయన మరణానంతరం డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చారని పేర్కొన్నారు. అప్పట్లో వైద్య విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదని.. ఇప్పుడు కూడా ఏమీ ఉండవని వారంటున్నారు. వైఎస్సార్ సేవలకు గుర్తింపుగానే.. ఇక రాష్ట్రంలో వైద్య రంగానికి దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సేవలకు గుర్తింపుగానే హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టారని యూనివర్సిటీ డెంటల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ మెహబూబ్ షేక్ తెలిపారు. ఆరోగ్యశ్రీ, 108, 104 వంటి సేవలతో పాటు, కొత్తగా మూడు వైద్య కళాశాలలను ఏర్పాటుచేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. ఇప్పుడు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏకంగా 17 వైద్య కళాశాలలు ఏర్పాటుచేస్తున్నారని, వర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడంతో తప్పులేదని, విద్యార్థులకూ ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన స్పష్టంచేశారు. -
పేదల దేవుడు డాక్టర్ వైఎస్సార్
చిలకలూరిపేట: పేదల దేవుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. వైద్య రంగంలో వైఎస్సార్ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి చరిత్రలో నిలిచిపోయారని ఆమె కొనియాడారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆదివారం మంత్రి రజిని విలేకరులతో మాట్లాడుతూ ఎన్టీఆర్ బతికుండగా ఘోరంగా అవమానించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని, ఆయన బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు కూడా లాగేసుకున్నారని, జీవిత చరమాంకంలో మానసిక క్షోభకు గురి చేసి మరణించేలా చేసిన చరిత్ర చంద్రబాబుదని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ జ్ఞాపకాలను చెరిపివేయాలని తపన పడిన టీడీపీ నాయకులు హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎన్టీఆర్‌పై చంద్రబాబు చెప్పులు వేయించినప్పుడు ఆయన కుటుంబ సభ్యులు ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ అంటే తమ పార్టీకి, తమ నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి గౌరవం ఉందని, అందువల్లే ఆయన పేరును ఒక జిల్లాకు పెట్టారని చెప్పారు. చంద్రబాబు కనీసం ఈ పని కూడా చేయలేదన్నారు. అందరి బంధువు సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందరి బంధువు అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఆదివారం ఆమె పల్నాడు జిల్లా చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో వైఎస్సార్ చేయూత లబ్ధిదారులతో కలిసి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. -
వెన్నుపోటుదారులు ఎన్టీఆర్ భక్తులా?
సాక్షి, అమరావతి: టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌పై చెప్పులేసిన వారు, వెన్నుపోటుదారులు ఆయన భక్తులమని చెప్పుకోవటం విడ్డూరంగా ఉందని పలువురు రాష్ట్ర మంత్రులు మండిపడ్డారు. హెల్త్ వర్సిటీకి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టడాన్ని తప్పు పట్టే నైతిక అర్హత వారికి లేదన్నారు. ఈ మేరకు శనివారం ట్వీట్లు చేశారు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి, ఆయన మరణానికి కారకుడైన చంద్రబాబు, తండ్రిని పదవీచ్యుతుడిని చేసేందుకు జరిగిన కుట్రలో భాగస్వామి అయిన చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ హెల్త్ వర్సిటీ పేరు మార్పును విమర్శిస్తే ఎవరూ నమ్మెందుకు సిద్ధంగా లేరన్నారు. మంత్రుల ట్వీట్లు ఇలా ఉన్నాయి.. ఎంత గొప్ప మనుషులురా బాబూ మీరు వెన్నుపోటు పొడిచిన వారంతా ఎన్టీఆర్ భక్తులమని చెబుతున్నారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన సీఎం జగన్‌పై బురద చల్లుతున్నారు. ఎంత గొప్ప మనుషులురా బాబు మీరు. – పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు. ఎన్టీఆర్‌ను చంపేశాకే కదా మీరు ఆయన పేరు పెట్టింది హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఎప్పుడు పెట్టారు? ఆయన్ని మీరంతా కలిసి చంపేశాకే కదా? చేసిన పాపం పేరు పెడితే పోతుందా బాలకృష్ణా? టీడీపీ హయాంలో ఒక్క ప్రభుత్వ ఆస్పత్రి కూడా కట్టకపోయినా హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఎలా పెట్టుకున్నారు? – సాంఘిక శాఖ మంత్రి మేరుగ నాగార్జున బాబు చెప్పులేయించారు.. జగన్ పూలు వేయించారు చంద్రబాబు ఎన్టీఆర్ మీద చెప్పులు వేయిస్తే, సీఎం జగన్ కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి పూలు వేయించారు. – పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ జోరు తగ్గించవయ్యా.. జోకర్ బాలయ్య జోరు తగ్గించవయ్యా.. జోకర్ బాలయ్య. యూనివర్సిటీ అనేది చిన్నది. జిల్లాకు పేరు చాలా పెద్దది బాలయ్యా. చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిల్చిపోతుంది. ఇది వాస్తవం. – సాగునీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు వైద్య రంగానికి టీడీపీ చేసిన మేలేమిటి? నాన్ టీడీపీ 8.. వైఎస్సార్ 3.. సీఎం జగన్ 17.. ఇదీ ఏపీలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీల లెక్క. మరి ఎన్టీఆర్ ఎక్కణ్నుంచి వచ్చారు? ఇంతకీ వైద్య రంగానికి టీడీపీ చేసిన గొప్ప మేలు ఏమిటి? వైఎస్సార్, సీఎం జగన్ చేయని మేలు ఏమిటీ? – మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా ఎన్టీఆర్‌పై చెప్పులేసినప్పుడు ఈ పౌరుషం ఏమైంది? గవర్నమెంట్ హాస్పిటల్స్‌ను పిల్లల్ని ఎలుకలు కొరికే హాస్పిటల్స్‌గా, సెల్‌ఫోన్ లైట్లలో ఆపరేషన్లు చేసే ఆస్పత్రులుగా మార్చిన మీ ఎల్లో గ్యాంగ్.. మెడికల్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరే ఉండాలనుకుంటోంది. ఇది కరెక్టేనా? ప్రజల హెల్త్ అంటే మీకు ఎంత చులకన? 104, 108 వాహనాలను పాడుపెట్టి, ఆరోగ్యశ్రీని చంపేసి హెల్త్ యూనివర్సిటీకి మాత్రం ఎన్టీఆర్ పేరు ఉంచాలని ఉద్యమాలు చేస్తారా? సిగ్గుండాలి. ఎన్టీఆర్‌కు అత్యంత మానసిక క్షోభ మిగిల్చిన వ్యక్తి, ఆయనకు శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే. చంద్రబాబు తన కుర్చీ లాగేసినప్పుడు ఎన్టీ రామారావు కంట తడి పెడితే ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదు. ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరిన సమయంలో కుటుంబ సభ్యుల పౌరుషం ఏమైంది? – వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని (ట్వీట్‌తో పాటు విజయవాడలో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ చేసిన ఈ విమర్శలు చేశారు) -
బాబు సీఎం కాకముందే నెల్లూరు మెడికల్ కాలేజీ ఏర్పాటు: మంత్రి కాకాణి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు నోటినుంచి వచ్చేవన్నీ పచ్చి అబద్ధాలేనని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మీడియాతో గోవర్ధన్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో వైద్య రంగానికి విశేషమైన కృషి చేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు హెల్త్ యూనివర్సిటీకి పెట్టడం సముచితమన్నారు. దీనిపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తన హయాంలోనే పలు వైద్య కళాశాలలు నిరి్మంచినట్లు ఓ జాబితా చంద్రబాబు విడుదల చేశారని, అందులో నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కళాశాల తామే కట్టామని చెప్పారని, ఇది పచ్చి అబద్ధమని మంత్రి స్పష్టం చేశారు. ఆ మెడికల్ కళాశాలకు 2013, ఏప్రిల్ 3న శంకుస్థాపన చేశారని, జీవోఎంఎస్ నం.141 ద్వారా 2013, ఆగస్టు 24న, ఏసీ సుబ్బారెడ్డి మెమోరియల్ మెడికల్ కళాశాలగా నామకరణం చేశారని మంత్రి వివరించారు. ఆ కాలేజీకి ప్రారం¿ోత్సవం మినహా చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. కాగా, గతంలో చంద్రబాబు విపక్ష నేతగా ఉన్నపుడు కృష్ణపట్నం పోర్టు వద్దకు వచ్చి ప్రజల శ్రేయస్సు దృష్ట్యా అక్కడి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు కూల్చేస్తామని చెప్పారనీ, ఆ తర్వాత కృష్ణపట్నం వచ్చి థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రారంభించిన సందర్భంలో తమ వల్లే అభివృద్ధి అంటూ ప్రకటించుకున్నారని మంత్రి తెలిపారు. నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే టీడీపీని ఎన్టీఆర్ వారసులకు అప్పగించాలన్నారు. -
అందుకే హెల్త్ యూనివర్శిటికీ వైఎస్సార్ పేరు.. వాస్తవాలివిగో..
ఏపీలో ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం పేరు మార్చగానే కొందరు గగ్గోలు పెడుతున్నారు. బ్రహ్మండం బద్ధలయిందా అన్నట్టుగానే గావు కేకలు పెడుతున్నారు. డాక్టర్ వైఎస్సార్ పేరు ఎందుకు పెట్టారన్న విషయాన్ని మాత్రం ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. నిజాలేంటో మీరే గమనించండి. వైద్య,ఆరోగ్య రంగంలో పెను విప్లవానికి శ్రీకారం చుట్టారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. పేదోడికి కార్పొరేట్ వైద్యాన్ని ఓ హక్కుగా మలుస్తూ ఆరోగ్యశ్రీ పథకానికి రూపకల్పన చేసి పకడ్బందీగా అమలు చేశారు. లక్షలాది మంది ఆ పథకంతో ప్రాణాలు నిలుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు భారతదేశంలో ఎక్కడికెళ్లినా సరే ఆరోగ్యశ్రీ అన్న పేరు వినపడితే చాలు ఎవ్వరికైనా గుర్తుకు వచ్చేది వైఎస్సార్ పేరే. 2003లో పాదయాత్ర సందర్బంగా ప్రజల కష్టసుఖాలు వారి నోటనే విన్న వైఎస్సార్ నిరుపేదలకు ఏ అనారోగ్యం కలిగినా ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితి లేదని గమనించారు. అందుకే తాను అధికారంలోకి వస్తే ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలని దృఢ సంకల్పం తీసుకున్నారు. 2004లో వైఎస్సార్ అధికారంలోకి రాగానే ఎన్నికల హామీలకు సంబంధించిన కీలక ఫైళ్లపై సంతకాలు చేసిన తర్వాత మొదటి చూపు పేదల ఆరోగ్యంపైనే పెట్టారు. అలా ఆరోగ్య శ్రీ పథకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి వచ్చింది. దేశంలోని వివిధ రాష్ట్రాలు ఆరోగ్యశ్రీని మెచ్చుకోవడమే కాకుండా తమ రాష్ట్రాల్లో దీని ఎలా అమలు చేయచ్చా అని అధ్యయనాలు చేశారు కూడా. ఈ పథకంతో నిరుపేద కుటుంబీకులు కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో కోటీశ్వరులతో సమానంగా వైద్యం అందుకోగలిగారు. ఎన్నో గుండె ఆపరేషన్లు ఎందరి ప్రాణాలనో కాపాడాయి. వారి కుటుంబాల్లో సంతోషాలు నింపాయి. అందుకే 2009 ఎన్నికల్లోనూ వైఎస్సార్‌కు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య శ్రీ పథకం అంతంత మాత్రంగా అమలయ్యేది. ఇందులో భాగంగా ప్రవేశ పెట్టిన 108, 104వాహనాలు మూలన పడ్డాయి. వాటికి మరమ్మతులు చేయించకుండా కొత్త వాటిని కొనకుండా పథకాన్ని నీరుగార్చింది చంద్రబాబు నాయుడి ప్రభుత్వం. ప్రజల్లో మళ్లీ ఆరోగ్యంపై ఒక రకమైన బెంగ. ఈ క్రమంలోనే 2018లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించారు. యాత్ర పొడవునా గ్రామగ్రామాన నిరుపేద ప్రజలను కలుసుకున్న జగన్ వారి జీవన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో తాను అధికారంలోకి వస్తే వైద్య,ఆరోగ్య రంగంలో తన తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే తాను రెండడుగులు ముందుకు వేస్తానని భరోసా ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన జగన్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని ఎవరూ ఊహించని విధంగా విస్తరించారు. ►వెయ్యికి పైగా రుగ్మతలకు మాత్రమే ఆరోగ్యశ్రీలో చికిత్స అందేది. దాన్ని రెండు వేల నాలుగు వందలకు పెంచిన జగన్మోహన్ రెడ్డి వచ్చే అక్టోబరు 5నుండి ఏకంగా 3,118 వైద్య ప్రక్రియలను ఆరోగ్యశ్రీలో చేరుస్తున్నారు. ►90శాతం ప్రజలకు ఆరోగ్య శ్రీ వెన్నుదన్నుగా నిలిచింది. నాడు- నేడు పథకం కింద ఆసుపత్రుల రూపు రేఖలను మార్చేశారు. ►కార్పొరేట్ ఆసుపత్రులకు ఏ మాత్రం తీసిపోకుండానే కాదు కార్పొరేట్ ఆసుపత్రులను మించి ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరించారు. దానికి అనుగుణంగా ఆసుపత్రుల్లో వైద్యులు, ఇతరత్రా సిబ్బంది నియామకాలు చేపట్టారు. ►వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి మన రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క వైరాలజీ ల్యాబ్ కూడా లేదు. ఈ విషయం కరోనా వల్లనే బయట పడింది. వైరాలజీ ల్యాబ్‌లు కూడా లేవని వారు చెప్పడంతో అప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైరాలజీ ల్యాబులను ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయడమే కాకుండా వాటికి నిధులు మంజూరు చేసి యుద్ద ప్రాతిపదికన వాటిని అందుబాటులోకి తెచ్చారు. ►కరోనా రెండో వేవ్‌లో దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత సమస్య రావడంతో ఏపీలో అది పునరావృతం కాకుండా చూసేందుకు ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు వేగంగా నిధులు విడుదల చేసి చక్కటి విజన్ చాటుకున్నారు ►వాక్సినేషన్లో దేశానికే ఆదర్శంగా నిలిచారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే ఏ రాష్ట్రమైనా చురుగ్గా పనిచేయగలుగుతుంది. పనులు చురుగ్గా జరిగితేనే ప్రగతి రథ చక్రాలు వేగంగా ముందుకు కదులుతాయి. ఆ చక్రాలు వేగం అందుకుంటేనే అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఈ లక్ష్యంతోనే తన తండ్రి వైఎస్సార్ అడుగు జాడల్లో జగన్మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్ వన్‌గా నిలపాలని కంకణం కట్టుకున్నారు. మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలతో పోటీపడేలా ఏపీని వైద్య రంగంలో తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ రెండు దశాబ్ధాల పాటు అధికారంలో ఉన్నా ఒక్కటంటే ఒక్క వైద్య కళాశాలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయలేదు. వైద్య రంగంపైనా ప్రజారోగ్యంపైనా టిడిపికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనడానికి ఇదే తిరుగులేని నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మూడేళ్ల వ్యవధిలోనే రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయడం రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త అధ్యాయం అంటున్నారు మేధావులు. స్వాతంత్ర్యం వచ్చిందగ్గర నుంచి 2019 వరకు 72 ఏళ్ల లో కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు కావడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు స్థాపించారు. 1947 నుండి 2004 వరకు వీటిలో ఎనిమిది కాలేజీలు నెలకొల్పితే 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మూడు ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మించారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నారు. చిత్రం ఏంటంటే పార్టీ ఆవిర్బావం నుంచి రెండు దశాబ్ధాల నిడివి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా పెట్టలేదు. తండ్రిగా వైఎస్సార్, కొడుకుగా వైఎస్ జగన్.. ఆరోగ్య రంగానికి.. తద్వారా ప్రజలకు చేసిన సేవలు ఎప్పటికీ ఎవరూ మరిచిపోలేరు. అందుకే హెల్త్ యూనివర్సిటీకి పేరు పెట్టడానికి వైఎస్సార్ తప్ప మరో వ్యక్తి సమీప దూరంలో కనిపించరు. -
హెల్త్ వర్సిటీకి వైఎస్సార్ పేరు సముచితం
సాక్షి, అమరావతి: హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టడం సముచితం అని మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. వైఎస్సార్ పరిపాలనకు ముందు, ఆ తరువాత వైద్య రంగంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని, వైద్య విద్య, వైద్య శాఖలో సంస్కరణల్లో స్పష్టమైన తేడా ఉందని తెలిపారు. వైఎస్సార్ సువర్ణ పాలన, ఆయన ప్రజలకు అందించిన సేవలకు గుర్తుగా హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టామన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ఏపీలో లక్షలాది మంది గుండెలు ఆగిపోకుండా ఉన్నాయంటే అందుకు కారణం వైఎస్సార్ తీసుకువచి్చన ఆరోగ్యశ్రీ పథకమే కారణమని మంత్రి చెప్పారు. వేలాది నిరుపేద విద్యార్థులు వైద్య విద్య పూర్తి చేసుకుంటున్నారంటే దానికి వైఎస్సార్ చేసిన సేవే కారణమన్నారు. అన్ని బోధనాస్పత్రులు, ఏరియా, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో ప్రజల నుంచి యూజర్ చార్జీలను వసూలు చేసిన చరిత్ర చంద్రబాబుది అని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చి నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందజేయాలనే ఆలోచన చంద్రబాబు ఎప్పుడైనా చేశారా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ను క్షోభకు గురిచేసి మానసికంగా హత్య చేసిన చరిత్ర చంద్రబాబుదని అన్నారు. దాని నుంచి బయ టపడాలని విరుగుడుగా హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టాడని, అందుకు చంద్రబాబు ఎంత బాధపడి ఉంటాడో ఆయ న మాటల్లోనే అర్థం అవుతుందని చెప్పారు. -
ఎన్టీఆర్‌కు గౌరవం ఇచ్చింది వైఎస్ కుటుంబమే
ఏయూ క్యాంపస్: ఎన్టీఆర్‌కు గౌరవం ఇచ్చింది వైఎస్సార్ కుటుంబమేనని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చెప్పారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. తెలుగు గంగకు ఎన్టీఆర్ పేరును వైఎస్సార్ పెడితే, ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన ఘనత ఆయన తనయుడు, సీఎం జగన్‌దేన్నారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు, టీడీపీ నాయకులు చేసిన ద్రోహాలు అన్నీ ఇన్నీ కావన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా, శంషాబాద్ ఎయిర్‌పోర్టు డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టకుండా చంద్రబాబే అడ్డుకున్నారన్నారు. రాష్ట్ర కొత్త రాజధానికి ఎన్టీఆర్ నగర్ లేదా తారకరామనగర్ అని పేరు పెట్టాలని తాను కోరానని, ఇది ఇష్టంలేని చంద్రబాబు రాజగురువుతో మాట్లాడి అమరావతి పేరు పెట్టారన్నారు. 1998 ఎన్నికల్లో ఎన్టీఆర్ చిత్రపటాలను పార్టీ కార్యాలయాలు, సభల్లో లేకుండా చేశారని చెప్పారు. ఎన్టీఆర్ బసవ తారకం మాతా శిశు కేంద్రం పెట్టాలని భావించిన ఇంటిని, ఎన్టీఆర్ మ్యూజియంగా మార్చాలని ఆశించిన ఇళ్లను సైతం అపార్టుమెంట్లుగా మార్చేశారని చెప్పారు. ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు దండం పెట్టి తెలంగాణలో కాంగ్రెస్‌తో జతకట్టారని చెప్పారు. కుటుంబ రాజకీయాలకు ఎన్టీఆర్ వ్యతిరేకమని, దీనికి భిన్నంగా చంద్రబాబు లోకేష్‌ను తెరమీదకు తెచ్చారన్నారు. తెలుగు భాషకు జగన్ సేవ చేస్తున్నారు రాష్ట్రంలో తెలుగు భాషకు సీఎం జగన్ ఎనలేని సేవ చేస్తున్నారని యార్లగడ్డ చెప్పారు. రాష్ట్రంలో అధికార భాషా సంఘాన్ని పునరుద్ధరించి, తెలుగు ప్రాధికార సంస్థ, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరుకు తేవడం, ఉచితంగా ఐదెకరాలు ఇవ్వడం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. తాను ఆయనకు విధేయుడినేనని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి పదవులను వద్దనుకున్న జగన్ హీరోగా నిలుస్తారని చెప్పారు. పేరు తొలగించడం బాధ కలిగించింది ఆరోగ్య విశ్వవిద్యాయానికి వైఎస్ పేరు పెట్టడానికి తాను వ్యతిరేకం కాదని, ఎన్టీఆర్ పేరును తొలగించడం బాధ కలిగించిందని, అధికార భాషా సంఘం, హిందీ అకాడెమీ, తెలుగు అభివృద్ధి ప్రాధికార సంస్థలకు రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో రానున్న తెలుగు విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పెట్టి అప్పుడు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైఎస్సార్ పేరు పెట్టి ఉండే బాగుండేదని అన్నారు. -
శాసన సభలో టీడీపీ ఎమ్మెల్యేల వీరంగం
సాక్షి, అమరావతి: శాసన సభ సమావేశాల్లో చివరిరోజైన బుధవారం టీడీపీ ఎమ్మెల్యేలు వీరంగం సృష్టించారు. చట్ట సభ ఖ్యాతిని దిగజార్చేలా వ్యవహరించారు. స్పీకర్ పట్ల అమర్యాదగా వ్యవహరించారు. మార్షల్స్‌పైనా దాడికి పాల్పడ్డారు. బుధవారం ఉదయం ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభమైంది. సభ ప్రారంభలోనే ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోందని, దానిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. బిల్లు ఇంకా ప్రవేశపెట్టలేదని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. దానిని ప్రవేశపెట్టినప్పుడు అభిప్రాయాలు తెలిపి, చర్చించండని స్పీకర్ సూచించినా పట్టు వీడలేదు. ఓ వైపు సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తుంటే.. టీడీపీ ఎమ్మెల్యేలు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు చేరారు. పోడియం పైకి ఎక్కి స్పీకర్ చైర్‌ను ఆనుకుని నినాదాలు చేశారు. వారి స్థానాల్లోకి వెళ్లాలని స్పీకర్ సూచించినా పట్టించుకోలేదు. తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన స్పీకర్ టీడీపీ ఎమ్మెల్యేలు రామకృష్ణబాబు, డోలా బాలవీరాంజనేయ స్వామి, అశోక్, ఇతరులు కాగితాలు చించి స్పీకర్ పైకి విసిరారు. అయినా స్పీకర్ సంయమనం పాటించారు. స్పీకర్‌పై కాగితాలు విసరడాన్ని తప్పుబడుతూ అధికారపక్ష సభ్యులు పోడియం వద్దకు వస్తుండగా స్పీకర్ రావద్దని సూచించారు. దీంతో వారు ఆగిపోయారు. టీడీపీ సభ్యుల తీరు శ్రుతి మించడంతో స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శాసనసభ గౌరవాన్ని దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని వారిపై మండిపడ్డారు. ఈ క్రమంలో స్పీకర్‌కు, టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య మాటల యుద్ధం నడిచింది. దీంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశం అయ్యాక కూడా టీడీపీ ఎమ్మెల్యేల తీరు మారలేదు. ప్లకార్డులతో నేరుగా స్పీకర్ పోడియం పైకి వెళ్లారు. స్పీకర్ చైర్‌ను చుట్టుముట్టి నినాదాలు చేశారు. కాగితాలు చించి స్పీకర్‌పై వేశారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేయాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతిపాదించారు. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని టీడీపీ సభ్యులను ఒక రోజు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయినా టీడీపీ సభ్యులు బయటకు వెళ్లకుండా స్పీకర్ పోడియం వద్దే నినాదాలు చేశారు. వారిని బయటకు తరలించాలని మార్షల్స్‌ను స్పీకర్ ఆదేశించారు. వారిని తరలించడానికి మార్షల్స్ ప్రయత్నించగా.. పయ్యావుల, బాలవీరాంజనేయ స్వామి, ఏలూరు సాంబశివరావు సహా పలువురు ఎమ్మెల్యేలు మార్షల్స్‌పైనే దాడికి పాల్పడ్డారు. స్పీకర్, అధికారుల టేబుళ్లపై ఉన్న బిల్లు ప్రతులను చించి గందరగోళం సృష్టించారు. చవరికి వారిని మార్షల్స్ ఎత్తుకుని బయటకు తీసుకువెళ్లారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై చర్చించని టీడీపీ హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ వైఎస్సార్ పేరు పెడుతూ ప్రభుత్వం శాసన మండలిలో ప్రవేశపెట్టిన బిల్లుపై టీడీపీ సభ్యులు చర్చ కంటే రచ్చకే ప్రాధాన్యం ఇచ్చారు. సభా సమయాన్ని వృథా చేయ డం తగదని, బిల్లుపై చర్చలో పాల్గొని అభిప్రాయం చెప్పాలని చైర్మన్ మోషేన్‌రాజు సూచించారు. బిల్లును పెట్టవద్దని అడ్డు చెప్పే అధికారం లేదని చైర్మన్ చెప్పినా టీడీపీ సభ్యులు వినలేదు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ కాగితాలు చించి, వాటర్ బాటిల్స్‌తో బల్లలపై కొడుతూ గందరగోళం సృష్టించారు. సభను పలుమార్లు వాయిదా వేశారు. అయినా∙టీడీపీ సభ్యుల తీరు మారలేదు. దీంతో బిల్లులను ఆమోదించి సభను నిరవధిక వాయిదా వేశారు. -
ఎన్టీఆర్‌గారంటే నాకే గౌరవం ఎక్కువ: సీఎం జగన్
సాక్షి, అమరావతి: దివంగత ఎన్టీఆర్ అంటే తనకెంతో గౌరవమని, ఆయన్ని తక్కువ చేసి మాట్లాడే వారు మన దేశంలోనే ఉండరని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఐదవ రోజు భాగంగా బుధవారం.. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చే బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. అనవసరంగా గొడవలు చేసి.. టీడీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోవడం దురదృష్టకరమని, వాళ్లు కూడా ఈ చర్చ సందర్భంగా ఉండి ఉంటే బాగుండేదని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ‘‘ఎన్టీఆర్‌గారంటే అంటే నాకు ఎలాంటి కోపం లేదు. ఒకరకంగా.. ఎన్టీఆర్‌కు చంద్రబాబునాయుడుగారి కంటే జగన్మోహన్రెడ్డినే ఎక్కువ గౌరవం ఇస్తాడు. ఏపొద్దు కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం లేదు. పైగా ఎన్టీఆర్ మీద నాకు ఆప్యాయతే ఉంది. ఆయన్ని అగౌరవ పరిచే కార్యక్రమూ నా తరపున ఏనాడూ జరగద’’ని సీఎం జగన్ స్పష్టం చేశారు. నందమూరి తారకరామారావు అని పలకడం చంద్రబాబు నాయుడికి నచ్చదని, అదే చంద్రబాబు నోట వెంట నందమూరి తారకరామారావు అనే మాట వస్తే పైన ఉన్న ఎన్టీఆర్‌గారికి నచ్చదని పేర్కొన్నారు సీఎం జగన్. ‘‘నటుడిగా, రాజకీయవేత్తగా గొప్పఖ్యాతి సంపాదించిన వ్యక్తి ఎన్టీఆర్. కూతురిని ఇచ్చిన అల్లుడు(చంద్రబాబు) వెన్నుపోటు పొడవడం, దానికి తోడు ఈనాడు రామోజీరావుగారి పథక రచన, మరో జర్నలిస్ట్ రాధాకృష్ణ డబ్బు సంచులు మోయడం.. ఇలాంటి పరిణామాలతో మానసిక క్షోభకు గురై ఎన్టీఆర్ అకాల మరణం చెందారు. చంద్రబాబు వెన్నుపోటు పొడవకుండా ఉంటే.. చాలాకాలం బతికి ఉండేవారు. అసలు చంద్రబాబు సీఎం అయ్యి ఉండేవారు కాదు’’ అని సీఎం జగన్‌ని పేర్కొన్నారు. ఏ పక్షాన ఉన్నా తమ తరపున ఏనాడూ ఎన్టీఆర్‌ను ఒక్క మాట అనలేదని, పైగా పాదయాత్రలో ఇచ్చిన హామీ కింద ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టడం తెలిసిందేనని సీఎం జగన్ గుర్తు చేశారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు.. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇప్పించలేకపోయారన్నారు. దివంగత మహానేత వైఎస్సార్.. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి. ఖరీదైన వైద్యాన్ని పేదలకు అందించిన మానవతావాద మహాశిఖరం. ప్రాణం విలువ తెలిసిన డాక్టర్. వైద్య రంగంలో సంస్కరణలకర్త. పేదవాడి సమస్యలు, జీవితాలు అర్థం చేసుకున్న వ్యక్తి అని సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆరోగ్యశ్రీ పథకంతో పాటు ప్రజావైద్యం కోసం 108, 104 సర్వీసులు తెచ్చిన ఘనత ఆయనది. ఆ సమయంలో దేశం మొత్తం ఆయన గురించి గొప్పగా మాట్లాడుకుందని సీఎం జగన్ ప్రస్తావించారు. ఏపీ 11 మెడికల్ కాలేజీలకు ఎనిమిది, టీడీపీ ఆవిర్భావం కంటే ముందే ఉన్నాయి. 1983 నుంచి ఈరోజువరకు టీడీపీ చరిత్రలో ఒక్క మెడికల్ కాలేజీ పెట్టలేదు. మూడు మెడికల్ కాలేజీలు వైఎస్సార్ హయాంలోనే వచ్చాయి. ప్రస్తుతం మరో 17 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. మొత్తంగా.. ఏపీలో ఉన్న(నిర్మాణ దశలో ఉన్నవి కలుపుకుని) 28 మెడికల్ కాలేజీల్లో 20 కాలేజీలు వైఎస్సార్, ఆయన కొడుకు(వైఎస్ జగన్) హయాంలోనే వచ్చాయి. అలాంటప్పుడు వైఎస్సార్ పేరు పెట్టకూడదనడం న్యాయమేనా?, అర్హత దక్కాల్సిన వాళ్లకు క్రెడిట్ ఇవ్వకపోవడం ధర్మమేనా? అని సీఎం జగన్, టీడీపీని నిలదీశారు. ఎన్టీఆర్ విషయంలో ఆయన మీద ఎలాంటి కల్మషం లేదని, ఎవరూ అడగకపోయినా ఆయన పేరు మీద జిల్లా పెట్టామని, టీడీపీ హయాంలో ఏదైనా కట్టి ఉంటే.. దానికి ఎన్టీఆర్ పేరు పెట్టమని వాళ్లు అడిగితే సానుకూలంగా స్పందిస్తామని సీఎం జగన్ తెలియజేశారు. బాగా ఆలోచించే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై నిర్ణయం తీసుకున్నామని, మార్పు ముందు ఎన్టీఆర్ పేరు మార్చడం కరెక్టేనా? అని నన్ను నేను ప్రశ్నించుకున్నా అని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ఇదీ చదవండి: ‘ఎన్టీఆర్‌పై ప్రేమే ఉంటే చెప్పులు, రాళ్లు ఎందుకేశారు?’ -
నీట్ రాష్ట్ర స్థాయి ర్యాంకులు విడుదల
సాక్షి, హైదరాబాద్: నీట్–2021 యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత పరీక్షకు సంబంధించి రాష్ట్ర స్థాయి ర్యాంకులను శనివారం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఈ జాబితాను వర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ ర్యాంకుల జాబితా సమాచారం నిమిత్తమేనని, వర్సిటీకి దరఖాస్తు చేసిన తర్వాతే మెరిట్ జాబితా విడుదల చేస్తామని వర్సిటీ వర్గాలు స్పష్టం చేశాయి. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ముందుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేస్తుందని, అభ్యర్థుల దరఖాస్తుల ఆధారంగా ధ్రువపత్రాలను పరిశీలించి ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల చేసిన తర్వాత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వివరించింది. నీట్–21 యూజీ అడ్మిషన్లకు సంబంధించి కేంద్రం ఇంకా నోటిఫికేషన్ విడుదల చేయలేదు. అడ్మిషన్ల షెడ్యూల్ ఖరారైన తర్వాత కాళోజీ వర్సిటీ కౌన్సెలింగ్ చేపట్టనుంది. నీట్ కటాఫ్ స్కోర్ వివరాలు: జనరల్/ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 50 పర్సంటైల్, కట్ ఆఫ్ స్కోర్ 138 మార్కులు ♦ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 40 పర్సంటైల్, కట్ ఆఫ్ స్కోర్ 108 మార్కులు ♦పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 45 పర్సంటైల్, కట్ ఆఫ్ స్కోర్ 122 మార్కులు -
వెక్కిళ్లు ఆగడం లేదా.. ఈ ‘స్ట్రా’తో చెక్ పెట్టేయొచ్చు!
వెక్కిళ్లు వస్తే ఏం చేస్తారు..? ఏముంది కాసేపు ఊపిరి బిగపట్టడం లేదా నీరు తాగుతాం అంతేకదా..! కొన్నిసార్లు ఎంతసేపు ఊపిరి బిగపట్టినా లేదా నీరు తాగినా కొందరికి వెక్కిళ్లు అస్సలు ఆగవు. చాలాసేపు వెక్కిళ్లు రావడం మంచిది కాదనే విషయం మనకు తెలిసిందే. అలాంటి వారికి వెంటనే వెక్కిళ్లు ఆగిపోవాలంటే ఏం చేయాలి? అలాంటి వారికోసమే ‘హిక్ అవే’అనే పరికరాన్ని తాజాగా యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ హెల్త్ సైన్స్ సెంటర్‌కు చెందిన డాక్టర్ అలీ సీఫీ అభివృద్ధి పరిచారు. ‘ఎల్’ఆకారంలో ఉండే ఈ స్ట్రా పరికరం దాదాపు 92 శాతం మందిలో సమర్థంగా పనిచేసిందని చెబుతున్నారు. గ్లాసులోని నీటిని ఈ స్ట్రా ద్వారా పీల్చుకుంటే చాలు క్షణాల్లో వెక్కిళ్లను తగ్గించేస్తుందని పేర్కొంటున్నారు. ఒకవైపు సన్నగా ఉండి నీటిని పీల్చుకోవడానికి వీలుగా ఉంటుంది. మరోవైపు అడ్జస్ట్ చేసుకునే వీలుండి, చిన్న రంధ్రం మాదిరిగా ప్రెషర్ వాల్వ్ ఉంటుంది. ఈ చిన్న వాల్వ్ ద్వారా నీటిని గట్టిగా పీల్చుకోవడం ద్వారా ఫ్రెనిక్ నాడీకణం క్రియాశీలమై మనకు వెక్కిళ్లు రావడానికి కారణమైన మన శరీరంలోని విభాజపటలం (డయాఫ్రమ్) ముడుచుకుపోతుంది. పీల్చుకున్న నీటిని మింగాలంటే వేగస్ నాడీ కణం క్రియాశీలం కావాలి. ఈ రెండు నాడీ కణాలే మనకు వెక్కిళ్లు రావడానికి కారణం. ‘హిక్ అవే స్ట్రా’ద్వారా నీటిని తాగితే ఈ రెండు నాడీ కణాలను నీటిని గట్టిగా పీల్చడం, నీటిని మింగడం వంటి వేరే పనుల్లో బిజీ చేయడం ద్వారా వెక్కిళ్లు రాకుండా చేయొచ్చని డాక్టర్ అలీ సీఫీ వివరించారు. -
కాళోజి హెల్త్ యూనివర్సిటీ పరీక్షలో గందరగోళం
సాక్షి, వరంగల్: కాళోజి హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన పరీక్షలో గందరగోళం చోటుచేసుకుంది. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల రాసిన పరీక్షను రద్దు చేశారు. టెక్నికల్ కారణాల వల్ల పరీక్ష రద్దు చేసినట్టు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. వివరాల్లోకి వెళితే. సోమవారం నుంచి యూనివర్సిటీ పరిధిలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే నేడు ఉదయం విద్యార్థులు ఫస్ట్ పేపర్ పరీక్ష నిర్వహించారు. తీరా ఎగ్జామ్ పూర్తయిన కొద్దిసేపటికి పరీక్ష రద్దు చేసినట్టు యూనివర్సిటీ నుంచి విద్యార్థుల ఫోన్లకు అధికారులు సందేశాలు పంపించారు. మరోసారి షెడ్యూల్ ఖరారు చేసి పరీక్ష నిర్వహిస్తామని యూనివర్సిటీ అధికారులు ఆ సందేశంలో పేర్కొన్నారు. పరీక్ష జరిగిన రెండు సెంటర్లలో ఒక కోడ్‌కు బదులు.. మరో కోడ్ ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసి పరీక్ష నిర్వహించనందువల్ల.. పరీక్ష రద్దు చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. రాసిన పరీక్ష రద్దు చేసి.. మళ్లీ పరీక్ష నిర్వహిస్తామంటు అధికారులు ప్రకటించడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంబీబీఎస్ పరీక్షలంటే ఇంత నిర్లక్ష్యమా అని యూనివర్సిటీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. పరీక్ష నిర్వహణ సిబ్బంది తీరును తప్పుబట్టిన విద్యార్థులు.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
రేపటి నుంచి ‘మెడికల్’ సర్టిఫికెట్ల పరిశీలన
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ) : ఏపీలో ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో కాంపిటెంట్ అథారిటీ సీట్ల (కన్వీనర్ కోటా) కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 15 నుంచి 21వరకు ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ ఎస్.అప్పలనాయుడు తెలిపారు. ఈ మేరకు గురువారం రాత్రి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రాథమిక మెరిట్ లిస్టును కూడా విడుదల చేశారు. ఏపీలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అనుబంధ ప్రభుత్వ, ప్రైవేటు (మైనార్టీ, నాన్ మైనార్టీ), తిరుపతి శ్రీ పద్మావతి మెడికల్ కళాశాలలో సీట్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలి. మెరిట్ ఆర్డర్ వారీగా విజయవాడ, హైదరాబాద్, విశాఖ, తిరుపతి, కర్నూలులో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాల్లో హాజరై ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలించుకోవాలి. విజయవాడలో 2, కర్నూలులో 1 కొత్తగా ఏర్పాటు చేశారు. వివరాలకు... హెచ్‌టీటీపీ://ఎన్టీఆర్యూహెచ్ఎస్.ఏపీ.ఎన్ఐసీ.ఇన్ / హెచ్‌టీటీపీ://ఏపీఎంఈడీఏడీఎం.ఏపీఎస్సీహెచ్ఈ.ఏసీ.ఇన్ వెబ్సైట్లో పొందవచ్చు. -
పదేళ్లు నివాసముంటేనే లోకల్!
♦ కనీసం పేరెంట్స్ ఇక్కడున్నా పర్వాలేదు ♦ మెడికల్ అడ్మిషన్లపై ఆరోగ్య వర్సిటీ వెల్లడి ♦ స్థానికతపై నోటిఫికేషన్లో స్పష్టత సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లు నివాసం ఉంటేనే ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో స్థానికులుగా పరిగణిస్తారు. సీటు కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థి తెలంగాణలో చదువుకోని పరిస్థితుల్లో.. కనీసం అభ్యర్థి తల్లిదండ్రులు పదేళ్లపాటు తెలంగాణలో నివాసం ఉన్నా స్థానికులుగానే పేర్కొంటారు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో సీట్ల భర్తీపై 2024 వరకు ఉమ్మడి ప్రవేశాలు ఉండాలనే నిబంధన నేపథ్యంలో వైద్య విద్య సీట్ల భర్తీలో స్థానికతపై కాళోజీ నారాయణరావు ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం స్పష్టత ఇచ్చింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థులు.. స్థానికత, కులం వివరాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను వెంట తెచ్చుకోవాలని సూచించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సందర్భంలోనే అభ్యర్థులు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లను జత చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. అలాగే అభ్యర్థులు తెలంగాణలో కాకుండా.. ఇతర రాష్ట్రాల్లో చదివితే స్థానికతను గుర్తించేందుకు వర్సిటీ మరిన్ని వివరాలు కోరుతోంది. అభ్యర్థిగానీ, అభ్యర్థి తల్లిదండ్రులుగానీ పదేళ్లపాటు తెలంగాణలోనే నివసించినట్లుగా తహసీల్దారు జారీ చేసిన ధ్రువీకరణ పత్రం సమర్పించాలని పేర్కొంటోంది. తెలంగాణలో నివసించినట్లుగా ధ్రువీకరించే పత్రంలో సంవత్సరాల వివరాలను స్పష్టంగా పేర్కొనాలని తెలిపింది. అభ్యర్థులు కులాన్ని, స్థానికతను ధ్రువీకరించే సర్టిఫికెట్లతోపాటు తాము జత చేసే సర్టిఫికెట్ల వివరాలన్నీ సరైనవేనని పేర్కొంటూ రూ.100 స్టాంప్ పేపర్‌పై అఫిడవిట్ సమర్పించాలని తెలిపింది. సర్టిఫికెట్లలో పేర్కొన్న వివరాలు తప్పుగా ఉంటే అభ్యర్థులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. -
పీఆర్సీ అమలు చేయాల్సిందే
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): అడ్హాక్ ఉద్యోగులకు 2010, 2015 పీఆర్సీని అమలు చేయాలంటూ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఉద్యోగ జేఏసీ నిరసన కార్యక్రమంలో రెండు రోజూ కొనసాగింది. శనివారం కూడా గంట పాటు యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద ధర్నా నిర్వహించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఉద్యోగులు చెబుతున్నారు. సోమవారం నుంచి పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే నిరవధిక సమ్మెకు దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉద్యోగులంతా స్వచ్చందంగా ఆందోళనలో పాల్గొన్నారు. -
హెల్త్ యూనివర్సిటీలో ప్రొటోకాల్ రగడ
శంకుస్థాపన శిలాఫలకంపై కానరాని స్థానిక కార్పొరేటర్ పేరు కార్పొరేటర్ లీలావతికి బదులు వద్దిరాజు గణేష్‌కు స్థానం వీసీపై డీఆర్ఓకు ఫిర్యాదు పోచమ్మమైదాన్ : రాష్ట్రంలోని వైద్య కళాశాలల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పింది. దీని శంకుస్థాపన కార్యక్రమంతోనే వివాదాలు మెుగ్గ తొడిగాయి. వరంగల్ కేంద్ర కారాగార ఆవరణలో హెల్త్ యూనివర్సిటీ భవనానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు(ఆదివారం) మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి రిమోట్ ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. అయితే శంకుస్థాపన శిలాఫలకంలో కొన్ని పొరపాట్లు దొర్లాయి. దీనిపై 28వ డివిజన్ కార్పొరేటర్ యెలగం లీలావతి పేరు కాకుండా 27వ డివిజన్ కార్పొరేటర్ వద్దిరాజు గణేష్ పేరును పెట్టారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి సైతం స్థానిక కార్పొరేటర్ లీలావతికి ఆహ్వానం అందలేదు. ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగిందని హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డిపై స్థానిక కార్పొరేటర్ లీలావతి శనివారం డీఆర్వో శోభకు ఫిర్యాదు చేశారు. పొరపాట్లను సరిదిద్దుతాం ప్రధాని నరేంద్ర మోదీ నేడు శంకుస్థాపన చేయనున్న శిలాఫలకంపై పేర్ల విషయంలో ముద్రణ తప్పుగా జరిగింది వాస్తవమే. తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంజినీర్ అందించిన పేర్లతో ఈ శిలాఫలకాన్ని తయారుచేయించాం. దాన్ని అమర్చే సమయంలో పొరపాట్లను సరిదిద్దుతాం. – కరుణాకర్ రెడ్డి, వీసీ, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ -
ముగిసిన తుది విడుత కౌన్సెలింగ్
తుది విడత ఏపీ మెడికల్ కౌన్సెలింగ్ సోమవారంతో ముగిసింది. కౌన్సెలింగ్ ముగిసే సమయానికి మొత్తం 2, 648 ఎంబీబీఎస్, 709 బీడీఎస్ సీట్లు భర్తీ అయ్యాయి. చివరి రోజు జరిగిన కౌన్సెలింగ్‌లో ఏయూ అభ్యర్థులకు మాత్రమే సీట్లు అందుబాటులో ఉండగా, ఇందులో ఎస్టీ మహిళా కేటగిరీకి చెందిన రెండు ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేశారు. ఎస్టీ కేటగిరీలో ఏయూలో 16, 296 ర్యాంకు వద్ద ఎంబీబీఎస్ సీట్ల భర్తీ ముగిసింది. బీడీఎస్‌లో ఎస్సీ కేటగిరీలో 16,263, ఎస్టీ కేటగిరీలో 23,322, బీసీలో 15,564 ర్యాంకు వద్ద సీట్ల భర్తీ ముగిసింది. స్పెషల్ కేటగిరీ కింద ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు ఎన్సీసీ కోటా సీట్లకు కౌన్సెలింగ్ జరగనుంది. స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌కు సంబంధించి మెరిట్ జాబితాలను రెండు రాష్ట్రాల క్రీడా ప్రాధికార సంస్థలు సోమవారం కూడా అందజేయలేక పోయాయి. ఏపీ ప్రైవేటు మెడికల్ కళాశాలల్లోని బి-కేటగిరీ సీట్లకు మంగళవారం కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. సుమారు 19 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. -
నేడు తుది విడత ఏపీ మెడికల్ కౌన్సెలింగ్
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఏపీ మెడికల్ కౌన్సెలింగ్‌లో భాగంగా సోమవారం జరిగే తుది విడత కౌన్సెలింగ్ చివరి రోజుకు ఏయూ పరిధిలోని ఎస్టీ కేటగిరీ మహిళా అభ్యర్థులకు మాత్రమే ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయని ఆదివారమిక్కడ హెల్త్ వర్సిటీ క్యాంపు అధికారి డాక్టర్ టి.మురళీమోహన్ తెలిపారు. ఏయూ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ-సీ అభ్యర్థులకు మాత్రమే బీడీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. సోమవారం జరిగే కౌన్సెలింగ్‌కు 15,001 నుంచి చివరి ర్యాంకు వరకు అభ్యర్థులను ఆహ్వానించారు. ఈ నెల 29వ తేదీ ఉదయం 9 గంటలకు హెల్త్ వర్సిటీలో ఎంసెట్-ఏపీ (పైవేటు కళాశాలల యాజమాన్య కోటా ఎంట్రన్స్)లో అర్హత సాధించిన అభ్యర్థులకు రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నామన్నారు. -
శాంతారావుకు ఆరోగ్య వర్సిటీ బాధ్యతలు
హైదరాబాద్: రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ జి. శాంతారావుకు ప్రభుత్వం విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు వైద్య విద్య ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత వీసీ రవిరాజు ఈ నెల 9 నుంచి 26 వరకు విదేశీ పర్యటన నేపథ్యంలో ఆయన వచ్చే వరకూ ఈ బాధ్యతలను డీఎంఈకి అప్పగించినట్లు పేర్కొన్నారు. -
రాజయ్యా..రోగాలేందయ్యా!
సాక్షి, హన్మకొండ : హెల్త్ యూనివర్సిటీని వరంగల్‌కు మంజూరు చేరుుంచి పట్టు నిలుపుకున్న ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య.... జిల్లాలో విజృంభిస్తున్న విషజ్వరాలను అరికట్టడంలో మాత్రం సఫలం కాలేకపోతున్నారు. స్వతహాగా డాక్టర్ అయిన రాజయ్య స్వయంగా ఆరోగ్యశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తుండడంతో జిల్లాలోని పేద ప్రజలు ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ... సొంత జిల్లాలోనే వైద్య ఆరోగ్యశాఖ గాడిలో పడకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు. వర్షాకాలం ముగిసిన తర్వాత జిల్లాలో విషజ్వరాలు విజృంభించడంతో ఇప్పటివరకు సుమారు 30కి పైగా మరణాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా గిరిజనగూడేలు, తండాలు విషజ్వరాల బారిన పడుతున్నాయి. వైద్య సిబ్బంది తరచుగా గ్రామాలను సందర్శించకపోవడం వల్ల జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. వైద్య సిబ్బంది మేల్కొని చర్యలు చేపట్టేలోగా... మరణాలు చోటుచేసుకుంటున్నాయి. వారం క్రితం హసన్‌పర్తి మండలం హరిశ్చంద్రనాయక్ తండా మొత్తం విషజ్వరాల బారిన పడగా... ప్రస్తుతం పాలకుర్తి మండలం వావిలాల గ్రామ పంచాయతీ పరిధి భూక్యాతండాలోని ప్రతి కుటుంబంలో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. ఈ గ్రామంలో జ్వరాల బారిన పడిన ఒకరు శనివారం మృతి చెందారు. ఏజెన్సీలో వేధిస్తున్న సిబ్బంది కొరత మౌలిక సదుపాయలు అరకొరగా ఉండే ఏజెన్సీలో వైద్య పరంగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండగా... ఇక్కడ వైద్య సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. ములుగు ఏజెన్సీ పరిధిలో 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ) ఉన్నారుు. వీటిలో మంగపేట మండలం బ్రాహ్మణపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం పూర్తరుునప్పటికీ... ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో ఈ గ్రామానికి సమీపంలో ఉన్న ప్రజలు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న చుంచుపల్లి పీహెచ్‌సీకి వెళ్లాల్సి వస్తోంది. తాడ్వాయి మండలం కాటాపూర్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభమైనా... ఇప్పటివరకు సిబ్బందిని కేటాయించలేదు. తాడ్వాయి పీహెచ్‌సీకి చెందిన వైద్య సిబ్బంది ఇక్కడ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ములుగు ఏజెన్సీ పరిధిలో 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక వైద్యుడు, 43 ఏఎన్ఎం పోస్టులు, 4 స్టాఫ్‌నర్సు, 14 పారామెడికల్ సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి పరిధిలోని సబ్ సెంటర్లలో 40 శాతం ఇప్పటికీ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. సరైన సిబ్బంది లేకపోవడం వల్ల ఏజెన్సీలో అనారోగ్య సమస్యలు తలెత్తితే.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి రావాల్సి వస్తోంది. రోగమొస్తే ఒళ్లుగుల్ల... ప్రభుత్వ వైద్యశాలల్లో అరకొర సిబ్బంది కారణంగా ప్రజలు ఎక్కువగా ప్రైవేట్ ఆస్పత్రుల వైపు మొగ్గు చూపుతున్నారు. వీరిలో ఎక్కువ మంది జిల్లా కేంద్రం వైపు వస్తున్నారు. దీన్ని ఆసరా చేసుకున్న డయూగ్నస్టిక్ సెంటర్ల నిర్వాహకులు రోగులను దోపిడీ చేస్తున్నారు. రోగనిర్ధారణ పరీక్షల ఖర్చు వారికి తడిసిమోపెడవుతోంది. ముఖ్యంగా డెంగీపై అవగాహన లేకపోవడంతో ప్లేట్లెట్ సంఖ్య పడిపోయిందన్న సమాచారం వినగానే రోగులు బెంబేలెత్తుతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎంత ఖర్చుకైనా వెనకాడడం లేదు. ఫలితంగా రోగం కుదురుకునేలోపు అప్పులపాలవుతున్నారు. మరోవైపు నగరంలో మెడికల్ షాప్‌లు సిండికేటుగా మారడంతో ఔషధాల ధరలు చుక్కల్లో ఉంటున్నాయి. ఈ ధరలను నియంత్రించేందుకు ఇటు పాలకులు... అటు ప్రభుత్వ యంత్రాంగం చొరవ చూపించకపోవడంతో ఈ దందాకు అడ్డుకట్ట లేకుండా పోయింది. సీనియార్టీ లిస్టులో గందరగోళం తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత ఐదో జోన్ పరిధిలో పదోన్నతులు, బదిలీలకు సంబంధిం చి వెలువరించిన సీనియారిటీ జాబితా గందరగోళానికి దారితీసింది. ఈ జాబితాను అందుబాటులో ఉంచడంలో ఆర్డీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో సకాలంలో జాబితా అందక నాలుగు జిల్లాల పరిధిలోని వైద్య శాఖ ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు సంబంధించిన జాబితాలో తప్పులు దొర్లాయి. అధికారులు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు అభ్యంతరాల స్వీకరణ గడువును అక్టోబర్ 31 నుంచి నవంబర్ 10 వరకు పొడిగించారు. -
ఇది.. మరచిపోలేని రోజు
కేసీఆర్ ఆశీస్సులతో హెల్త్ యూనివర్సిటీ మంజూరు ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య కేఎంసీలో కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ కార్యాలయం ప్రారంభం వీసీగా బాధ్యతలు స్వీకరించిన సురేష్‌చందా పోచమ్మమైదాన్ : తన హయూంలో వరంగల్‌కు హెల్త్ యూనివర్సిటీ మంజూరు కావడం మరచిపోలేనని, తన జీవితంలో ఇంతకంటే సంతోషమైన రోజు ఎన్నడూ లేదని డిప్యూటీ సీఎం, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో శనివారం కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ కార్యాలయూన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ పుట్టిన గడ్డకు, చదివిన కళాశాలకు ఏదో ఒకటి చేయాలనే పట్టుదలతో ముందుకు సాగి... కేసీఆర్‌ను మెప్పించి వరంగల్‌కు హెల్త్ యూనివర్సిటీని మంజూరు చేయించుకోగలిగామన్నారు. హెల్త్ యూనివర్సీటీకి కాళోజీ పేరు పెట్టడం సైతం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. యూనివర్సిటీ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషిచేద్దామని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ అశీస్సులతో వరంగల్‌కు హెల్త్ యూనివర్సిటీ వచ్చిందంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. మన రాజ్యం ఇది ..... మనం అనుకున్నది సాధించకున్నామని, ప్రతిఒక్కరూ సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. ఆరోగ్య సేవలను విస్తరించే దిశగా ముందుకు సాగుదామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 30వ తేదీ లోపు హెల్త్ యూనివర్సిటీ వస్తే... మన విద్యార్థులు ఇక్కడే నమోదు చేసుకోవచ్చనే ఉద్దేశంతో కేసీఆర్ ఇంత వేగంగా నిర్ణయం తీసుకున్నారని వివరించారు. మహబూబాబాద్ ఎంపీ అజ్మీర సీతారాం నాయక్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాకు ఒక చరిత్ర ఉందని, అందుకే కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వచ్చిందన్నారు. ఉప ముఖ్యమంత్రి రాజయ్య కృషి చేయడం వల్లే సీఎం కేసీఆర్ మంజూరుచేశారని చెప్పారు. హెల్త్ యూనివర్సిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. తెలంగాణ వస్తే ఏం వస్తదో అన్నారు కాదా .... ప్రత్యేక రాష్ట్రం రావడం వల్ల వరంగల్‌కు హెల్త్ యూనివర్సిటీ వచ్చిందన్నారు. మన ఆత్మగౌరవం మనకు దక్కింది... మన ఇంటిని మనం పాలించుకునే అవకాశం దక్కిందన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఇతర ప్రాంతాల్లో పీజీ చేసిన తర్వాత వారు గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుందని... ఏపీలో మన తెలంగాణ వారు నాన్‌లోకల్ అవుతున్నారని... ఈ సమస్యను తేల్చాలని సీతారాం నాయక్ కోరారు. వెంటనే డీఎంఈ శ్రీనివాస్ స్పందించి అక్కడ చదివిన విద్యార్థులు ఎన్ఓసీ అందజేస్తే... వెంటనే ఇక్కడ ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పని చేసేలా ఆర్డర్లు అందజేస్తామన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాకు హెల్త్ యూనివర్సిటీ మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉపముఖ్యమంత్రి రాజయ్య కృషి, పట్టుదలతో వరంగల్‌కు హెల్త్ యూనివర్సిటీ వచ్చిందన్నారు. వరంగల్ జిల్లా అభివృద్ధికి మేధావులు, నిపుణులు సలహాలు ఇవ్వాలని, వాటిని కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి అమలయ్యేలా చూస్తామని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముందు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ చందాకు ఉప ముఖ్యమంత్రి రాజయ్య, ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డెరైక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ సాంబశివరావు, కేఎంసీ ప్రిన్సిపాల్ రమేష్ కుమార్, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ మనోహర్, ఐఎంఏ ప్రతినిధులు పెసరు విజయచందర్ రెడ్డి, భూమిగారి మోహన్ రావు, ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ శ్రీరామ్, డీఐఓ సూర్యప్రకాష్, ఐ ఆస్పత్రి సూపరింటెండెంట్ పాండురంగ జాదవ్, హాస్టల్ వార్డెన్ సీతామహాలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే దోనెపూడి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.