hebba Patel
-
కో కో రెస్టారెంట్ : డింపుల్ హయతీ, హెబ్బా పటేల్ సందడి
ఫుడ్ హబ్‌గా పేరుగాంచిన భాగ్యనగరానికి మరో హాట్‌స్పాట్ వచ్చింది. ముంబైకి చెందిన ప్రఖ్యాత లగ్జరీ ఆసియా డైనింగ్ రెస్టారెంట్ ‘కోకో’ మన నగరంలో ప్రారంభమైంది. వినూత్న కాంటోనీస్, జపనీస్ వంటకాలు నగరవాసులను నోరూరించేందుకు సిద్ధమైంది. #KoKo Restaurant Launch in #Hyderabad #dimplehayati pic.twitter.com/XUyCPnmWMt— Dimple Hayathi (Parody) (@hayathidimple) November 11, 2024ప్రారంభోత్సవంలో డింపుల్ హయాతీ, హెబ్బా పటేల్, సిద్దు జొన్నలగడ్డ, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు హాజరై సరికొత్త రుచులను ఆస్వాదించారు. -
ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’
మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు థియేటర్స్, ఓటీటీ ఎక్కడైనా మంచి ఆదరణ దక్కుతుంది. ఇలాంటి సినిమాలు ఒక్కోసారి థియేటర్స్‌లో చూడటం మిస్ అయిన వారు ఓటీటీలో తప్పకుండా చూస్తారు. ఈ క్రమంలోనే ఓటీటీలో ఈ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంటుంది. ' చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' ఓటీటీలో దూసుకెళ్తోంది. చైతన్య రావ్ ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్ ముందుకు వస్తుంటారు. ఈ క్రమంలో రీసెంట్గా వచ్చిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌కి థియేటర్లోనూ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. చైతన్య రావ్, హెబ్బా పటేల్ జోడీ నటన, కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి.‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ను కేకేఆర్, బాల రాజ్ నిర్మించగా.. బాల రాజశేఖరుని దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కళ్యాణీ మాలిక్ అందించిన సంగీతం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సిస్ట్లా వీఎంకే కెమెరా పనితనానికి మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీకి థియేటర్స్‌లో ఎలాంటి రెస్పాన్స్ అయితే వచ్చిందో.. ఓటీటీలో అంతకు మించిన రెస్పాన్స్ వస్తోంది. బిగ్ ఫిష్ సినిమాస్ ద్వారా ఈ మూవీ నేటి (ఆగస్ట్ 27) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది.అమెజాన్‌లో ఈ మూవీ ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతోంది. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ మూవీ ఓటీటీ ఆడియెన్స్‌ని సైతం ఆకట్టుకుంటోంది. ప్రస్తుత తరం ఎదుర్కొంటోన్న ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్టుల మీద అందరినీ ఆకట్టుకునేలా, అందరినీ మెప్పించేలా తీసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను సైతం కట్టి పడేస్తోంది. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి 40 మిలియన్ల మినిట్స్ వ్యూస్ వచ్చాయి. మున్ముందు ఈ చిత్రం ఇంకెంత మందిని ఆకట్టుకుని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. -
ధూం ధాం పాటలు బాగున్నాయి
‘‘ధూం ధాం’ టీజర్ ఆకట్టుకునేలా ఉంది.. పాటలు బాగున్నాయి. రామ్ కుమార్ మంచి నిర్మాత. డైరెక్టర్ సాయి అంకితభావం ఉన్న వ్యక్తి. ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందించిన గోపీమోహన్ ‘లౌక్యం’ సినిమా నుంచి నాతో పని చేస్తున్నారు. ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని హీరో గోపీచంద్ అన్నారు. హెబ్బా పటేల్, చేతన్ కృష్ణ జంటగా సాయికిశోర్ మచ్చ దర్శకత్వం వహించిన చిత్రం ‘ధూం ధాం’. ఎంఎస్ రామ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 13న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం టీజర్‌ను గోపీచంద్, డైరెక్టర్ శ్రీను వైట్ల విడుదల చేశారు. శ్రీను వైట్ల మాట్లాడుతూ– ‘‘టీజర్ చాలా బాగుంది. ‘దుబాయ్ శీను’ నుంచి ‘బాద్షా’ వరకు నా దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాడు సాయికిశోర్. రామ్ కుమార్‌గారు సినిమా మీద ప్యాషన్‌తో విదేశాల నుంచి ఇండస్ట్రీకి వచ్చారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి’’ అన్నారు. ‘‘లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది’’ అని సాయికిశోర్ మచ్చా తెలిపారు. ‘‘ఈ సినిమాని ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం’’ అని ఎంఎస్ రామ్ కుమార్ చెప్పారు. -
ఇది కనులు కల గన సాధ్యమా...
‘నిజమా.. ఇది కనులు కల గన సాధ్యమా..’ అంటూ ప్రేమ పాట పాడుకున్నారు చైతన్యా రావు, హెబ్బా పటేల్. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ చిత్రంలోని పాట ఇది. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ (యుఎస్ఎ) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్పై కేకేఆర్, బాలరాజ్ నిర్మించారు. బాల రాజశేఖరుని దర్శకుడు. ఈ చిత్ర సంగీతదర్శకుడు కల్యాణీ మాలిక్ స్వరపరచి, సునీతతో కలిసి పాడినన ‘నిజమా...’ పాటను దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘నిజమా..’ పాట చాలా మెలోడియస్గా ఉంది. లొకేషన్స్ బాగున్నాయి. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘రామ్‌గోపాల్ వర్మగారితో ‘బ్యూటీ ఆఫ్ ఫ్యాషన్, ఆట’ అనే రెండు హాలీవుడ్ చిత్రాలకు పనిచేశాను. నేను దర్శకుడు కావడానికి ‘శివ’ చిత్రం స్ఫూర్తి. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు బాల రాజశేఖరుని. -
కామెడీ ఎక్స్‌ప్రెస్
చైతన్యారావు, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్, న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై బాల రాజశేఖరుని దర్శకత్వంలో కేకేఆర్, బాల రాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను హీరో నాగార్జున విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘వినోదాత్మకంగా సందేశంతో కూడిన ఈ చిత్రం విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘లాస్ ఏంజెల్స్‌లో ఉంటూ ఎన్నో హాలీవుడ్ చిత్రాలకు పని చేశాను. కానీ తెలుగు సినిమా చేయాలనేది నా కల. నాగార్జున, అమలగార్ల ్రపోత్సాహంతో టాలీవుడ్లో అరంగేట్రం చేశాను. మా సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన నాగార్జునగారికి ధన్యవాదాలు’’ అన్నారు బాల రాజశేఖరుని. తనికెళ్ల భరణి, సుహాసిని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: కళ్యాణీ మాలిక్, నేపథ్యసంగీతం: ఆర్పీ పట్నాయక్. -
మంచి సినిమా అంటున్నారు
‘‘అలా నిన్ను చేరి’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మరీ ముఖ్యంగా గ్రామీణప్రాంతాల ప్రేక్షకుల నుంచి ఎక్కువగా స్పందన వస్తోంది. వారంతా ఫస్ట్ హాఫ్‌కి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు’’ అని కొమ్మాలపాటి సాయి సుధాకర్ అన్నారు. దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. మారేష్ శివన్ దర్శకత్వం వహించారు. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా కొమ్మాలపాటి సాయి సుధాకర్ మాట్లాడుతూ–‘‘మా సినిమా చూసిన చాలామంది తమ జీవితాన్ని చూసుకున్నట్టుగా ఉందనడం సంతోషం. ‘అలా నిన్ను చేరి’ నిర్మాతగా మొదటి సినిమా అయినా కథకి అవసరం మేరకు ఖర్చు పెట్టా. సినిమా చూసిన మా నాన్నగారు బాగా తీశారని మెచ్చుకున్నారు. నా తర్వాతి సినిమా కోసం ప్రస్తుతం థ్రిల్లర్ జానర్లో ఓ కథ విన్నాను’’ అన్నారు. -
కథే హీరో
దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించిన లవ్‌స్టోరీ ఫిల్మ్ ‘అలా నిన్ను చేరి..’. మారేష్ శివన్ దర్శకత్వంలో కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో దినేష్ తేజ్ మాట్లాడుతూ– ‘‘జీవితంలోని ఓ దశలో ప్రేమ ముఖ్యమా? లక్ష్యం ముఖ్యమా? అంటూ ప్రతి మధ్యతరగతి అబ్బాయి గురయ్యే సంఘర్షణను ఇందులో చూపించాం. ఈ సినిమాలో నేను కొత్తగా కాస్త కమర్షియల్ రోల్లో నటించాను. ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌తో ప్రేక్షకులు థియేటర్స్ నుంచి బయటకి వస్తారని చెప్పగలను. కథ ఉంటేనే ఏమైనా చేయగలం. అందుకే కథే హీరో అని నమ్మే వ్యక్తిని నేను. ప్రేక్షకులు మెచ్చుకునే కథల్లో భాగం కావాలనుకుంటాను’’ అన్నారు. -
లవ్ అండ్ ఎమోషన్
దినేష్ తేజ్ హీరోగా, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్లుగా నటించిన ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ఫిల్మ్ ‘అలా నిన్ను చేరి’. మారేష్ శివన్ దర్శకత్వంలో కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 10న విడుదల కానుంది. ‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ లవ్ అండ్ ఎమోషనల్ ఫిల్మ్ ఇది. చంద్రబోస్‌గారి సాహిత్యం, సుభాస్ ఆనంద్ సంగీతం అదనపు ఆకర్షణలు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
కోడిబాయె లచ్చమ్మది
దినేష్ తేజ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. కొమ్మాల పాటి శ్రీధర్ సమర్పణలో మారేష్ శివన్ దర్శకత్వంలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలోని మాస్ సాంగ్ ‘కోడిబాయె లచ్చమ్మది..’ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘యంగ్ టాలెంట్ తీసే చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. ఈ చిత్రాన్ని కూడా ఆదరించాలి. సినిమా పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు. సుభాష్ ఆనంద్ స్వరపరచిన ‘కోడిబాయె..’ పాటను మంగ్లీ పాడగా, భాను నృత్యరీతులు సమకూర్చారు. ‘‘ఈ పాటలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్‌ల మాస్ స్టెప్స్ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. తెలంగాణ నుంచి మరో జానపదం చార్ట్ బస్టర్‌గా నిలవనుంది. సినిమాలోని అన్ని పాటలనూ చంద్రబోస్ గారు రాశారు ’’ అని యూనిట్ పేర్కొంది. -
చావని ప్రేమిది...
హెబ్బా పటేల్ ప్రధాన పా త్రలో నటించిన చిత్రం ‘సందేహం’. సతీష్ పరమవేద దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్ ఊటుకూరు హీరో. సత్యనారాయణ పర్చా నిర్మించిన ఈ చిత్రం నుంచి సంగీతదర్శకుడు సుభాష్ ఆనంద్ స్వరపరచిన ‘చచ్చినా చావని ప్రేమిది..’ పాటను దర్శకుడు దశరథ్ విడుదల చేశారు. ‘‘ఈ చిత్రంలో హెబ్బా పటేల్ డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
అలా నిన్ను చేరి ఫ్యామిలీ ఎంటర్టైనర్
దినేష్ తేజ్ హీరోగా, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్లుగా నూతన దర్శకుడు మారేష్ శివన్ తెరకెక్కించిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో విజన్ మూవీ మేకర్స్‌పై కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. త్వరలోనే మూవీ విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, కెమెరా: ఐ ఆండ్రూ. -
150 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌తో వ్యవస్థ రికార్డు
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో విజయవంతంగా దూసుకుపోతున్న వెబ్ సిరీస్ ‘వ్యవస్థ’. ఈ థ్రిల్లింగ్ కోర్టు రూమ్ డ్రామా ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఆనంద్ రంగ దర్శకత్వం వహించటంతో పాటు పట్టాభి చిలుకూరితో కలిసి రూపొందించారు. ఈ సిరీస్ 150 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించింది. ఈ సందర్బంగా వ్యవస్థ టీమ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హీరో సందీప్ కిషన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘వ్యవస్థలో వర్క్ చేసిన వారందరూ చాలా కావాల్సిన వారే. సంపత్‌గారితో కలిసి సినిమా చేయాలని ఎదురు చూస్తున్నాను. అలాగే కామ్నా జెఠ్మలానీతో నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి పరిచయం ఉంది. హెబ్బా పటేల్‌కి కంగ్రాట్స్. కార్తీక్ రత్నం అంటే చాలా ఇష్టం. తను వ్యవస్థలో పోషించిన తీరు అద్భుతం. దర్శకుడు ఆనంద్ రంగగారితో డీకే బోస్ చిత్రం నుంచి పరిచయం ఉంది. వ్యవస్థ సినిమాను ఎలా తెరకెక్కించారా? అని వెయిట్ చేసి చూశాను. ఎంటైర్ టీమ్‌కి కంగ్రాట్స్’’ అన్నారు సందీప్ కిషన్. కార్తీక్ రత్నం మాట్లాడుతూ ‘‘సందీప్ కిషనన్నను కలిసిన తర్వాత ఆయన నాకు ఎప్పుడూ తిరుగులేని సపోర్ట్‌ను అందిస్తూనే ఉన్నారు. ఆనంద్ రంగగారితో కలిసి పని చేయటం ఎంతో ఆనందంగా ఉంది. అదృష్టంగా భావిస్తున్నాను. పట్టాభిగారు చాలా ధైర్యం చేసి తీశారు. సంపత్ రాజ్, అనిల్ సార్ అందరికీ థాంక్స్. హెబ్బా పటేల్, కామ్నా జెఠ్మలానీతో కలిసి వర్క్ చేయటం చాలా ఆనందంగా ఉంది. జీ 5వారు చేస్తోన్న సపోర్ట్ మరచిపోలేం’’ అన్నారు. కామ్నా జెఠ్మలానీ మాట్లాడుతూ ‘‘ఎగ్జయిటెడ్‌గా, నెర్వస్‌గా ఉన్నాను. ఎందుకంటే ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించాను. చిన్న రోల్ అయినా చాలా ఇంపార్టెంట్ ఉండటంతో యాక్సెప్ట్ చేశాను’’ అన్నారు. సంపత్ రాజ్ మాట్లాడుతూ ‘‘నాపై నమ్మకంతో నాకీ అవకాశాన్ని ఇచ్చిన ఆనంద్ రంగాగారికి థాంక్స్. వ్యవస్థ చేసే ముందు చాలా మంది ఎందుకు చేస్తున్నావని అడిగారు. అయితే నాకు స్క్రిప్ట్‌పై నమ్మకం ఉందని చెప్పాను. ఇదొక స్లో బర్నర్‌లా ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యింది. కంటెంట్ బావుంటే ఆడియెన్స్ ఆదరిస్తారని మరోసారి వ్యవస్థ ప్రూవ్ చేసింది’’ అన్నారు. -
రాఘవేంద్ర రావు చేతుల మీదుగా అలా నిన్ను చేరి ఫస్ట్‌లుక్
ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇలాంటి కథలకు అటు యూత్‌తో పాటు ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే బాటలో రాబోతున్న కొత్త సినిమా ‘అలా నిన్ను చేరి’. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. చిత్రంలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ చేపడుతున్న చిత్రబృందం.. తాజాగా సంక్రాంతి కానుకగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అనంతరం రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మూవీ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా ఈ సినిమాలో శివకుమార్ రామచంద్రవరపు, శత్రు, కల్పలత, ‘రంగస్థలం’ మహేష్, ఝాన్సీ, కేదర్ శంకర్ తదితరులు నటిస్తున్నారు. -
సొట్టబుగ్గలున్న అగ్గిపెట్టే నేను..
‘నన్ను పట్టుకుంటే జారిపోతుంటాను... ఒంపుసొంపులున్న పాదరసమే నేను.. నన్ను ముట్టుకుంటే నిప్పునవుతుంటాను.. సొట్టబుగ్గలున్న అగ్గిపెట్టే నేను..’ అంటూ అదిరిపోయే స్టెప్పులు వేశారు హెబ్బా పటేల్. ఇంద్రసేన హీరోగా నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘శాసనసభ’. ఇందులో ఐశ్వర్యారాజ్ భకుని, రాజేంద్ర ప్రసాద్, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించారు. తులసీరామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మాతలు. రవి బసూర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నన్ను పట్టుకుంటే..’పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ స్పెషల్ సాంగ్‌లో హెబ్బాపటేల్ మంచి స్టెప్పులు వేశారు. కాసర్లశ్యామ్ సాహిత్యం అందించగా, మంగ్లీ, సంతోష్ వెంకీ, ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బసూర్ పాడారు. ప్రేమ్‌రక్షిత్ నృత్యరీతులు సమకూర్చారు. -
కథ విని ఆశ్చర్యపోయాను
హెబ్బా పటేల్, వశిష్ఠ సింహ, సాయి రోనక్, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రల్లో అశోక్ తేజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్’. దర్శకుడు సంపత్ నంది అందించిన కథ, స్క్రీన్ ప్లేతో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 26 నుంచి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకర్ల సమావేశంలో హెబ్బా పటేల్ మాట్లాడుతూ – ‘‘సంపత్ నందిగారు చెప్పిన కథ విని ఆశ్చర్యపోయాను. నా కెరీర్లో నేను చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. సవాల్‌గా తీసుకుని చేశాను. నటిగా ఈ సినిమాతో చాలా నేర్చుకున్నాను’’ అన్నారు. ‘‘ఓదెల రైల్వేస్టేషన్’ క్రైమ్ థ్రిల్లర్. 50 రోజుల్లో సినిమా షూటింగ్‌ను పూర్తి చేసినా కోవిడ్ వల్ల రిలీజ్ కాస్త ఆలస్యమైంది’’ అన్నారు రాధామోహన్. ‘‘నాకు దర్శకుడిగా చాన్స్ ఇచ్చిన సంపత్ నందిగారికి రుణపడి ఉంటాను. ఈ సినిమాలో నటించిన అందరికీ మంచి పేరు వస్తుంది’’ అన్నారు అశోక్ తేజ్. ‘‘ఈ సినిమా కథ విన్నపుడు థ్రిల్ అయ్యాను. ప్రతి సన్నివేశం ఉత్కంఠగా సాగుతుంది’’ అన్నారు వశిష్ఠ సింహ. ‘‘ఇప్పటివరకు ఎక్కువగా సాఫ్ట్ పాత్రలు చేసిన నేను ఇందులో సీరియస్ పోలీస్ ఆఫీసర్‌గా చేశాను’’ అన్నారు సాయి రోనక్. ఈ కార్యక్రమంలో ‘ఆహా’ ప్రతినిధి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సునీల్-హెబ్బా పటేల్‌ల ‘గీత’ వచ్చేస్తుంది
హెబ్బా పటేల్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘గీత’. ‘మ్యూట్ విట్నెస్’ అన్నది ఉప శీర్షిక. ‘గ్రాండ్ మూవీస్’పతాకంపై ఆర్.రాచయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.వి వినాయక్ శిష్యుడు విశ్వా.ఆర్.రావు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘నువ్వే కావాలి’, ‘ప్రేమించు’చిత్రాల ఫేమ్ సాయి కిరణ్ ప్రతి నాయకుడిగా పరిచయమవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు విశ్వ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా అవకాశం నా గురువు, దైవం అయిన వినాయక్ గారే ఇప్పించారు. నిర్మాత రాచయ్యగారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను" అన్నారు. నిర్మాత ఆర్.రాచయ్య మాట్లాడుతూ... "గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా మా డైరెక్టర్ విశ్వ... ‘గీత’చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఈనెల 26న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’ అన్నారు. రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి , తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో సూపర్ గ్లామర్ హీరోయిన్ హెబ్బా పటేల్ అనాథల కోసం పోరాడే మూగ యువతిగా... ఓ చాలెంజింగ్ రోల్ చేస్తుండడం విశేషం. సూర్య, లలిత, ప్రియ, మీనాకుమారి, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ దుర్గారావు తదితరులు ఇతర పాత్రలు ప్లే చేస్తున్న ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్నాడు. -
'గీత' ఫస్ట్ లుక్ విడుదల.. గురువుకు తగ్గ శిష్యుడని ప్రశంస
Geetha Movie First Look Poster Released By VV Vinayak: ‘‘గీత’ సినిమా ఫస్ట్ లుక్ బాగుంది. నా శిష్యుడు విశ్వ దర్శకుడిగా, నా మిత్రుడు రాచయ్య నిర్మాతగా పరిచయమవుతున్న ఈ సినిమా విజయం సాధించాలి. యూనిట్‌కి మంచి పేరు రావాలి’’ అని డైరెక్టర్ వీవీ వినాయక్ అన్నారు. కుమారి 21F ఫేమ్ హెబ్బా పటేల్ టైటిల్ రోల్, సునీల్ ముఖ్యపాత్ర చేసిన చిత్రం ‘గీత’. ‘మ్యూట్ విట్నెస్’ (మూగ సాక్ష్యం) అన్నది ఉప శీర్షిక. ‘నువ్వే కావాలి, ప్రేమించు’ సినిమాల ఫేమ్ సాయికిరణ్ ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించారు. డైరెక్టర్ వీవీ వినాయక్ శిష్యుడు విశ్వని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్. రాచయ్య నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని వినాయక్ విడుదల చేశారు. రాచయ్య మాట్లాడుతూ ‘‘గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా విశ్వ ‘గీత’ చిత్రాన్ని తెరకెక్కించాడు. మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావొచ్చాయి’’ అన్నారు. ‘‘గీత’ సినిమా అవకాశం మా గురువు వినాయక్‌గారే ఇప్పించారు. రాచయ్యగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అన్నారు విశ్వ. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్ అందించగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఎస్. చిన్నా, కెమెరా: క్రాంతికుమార్.కె. -
నా శిష్యుడు 'విశ్వ' విజేత కావాలి: వి.వి.వినాయక్
మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ప్రియ శిష్యుడు విశ్వ దర్శకత్వంతో తెరకెక్కుతున్న తొలి చిత్రం ‘గీత’.‘మ్యూట్ విట్నెస్’ అన్నది ఉప శీర్షిక. ‘గ్రాండ్ మూవీస్’ పతాకంపై ఆర్.రాచయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ టైటిల్ పాత్ర పోషిస్తుండగా, ప్రముఖ నటుడు సనీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ‘నువ్వే కావాలి’, ‘ప్రేమించు’వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సాయి కిరణ్ విలన్‌గా పరిచయం అవుతున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ దాదాపుగా పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని వి.వి.వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ.. తన శిష్యుడు విశ్వ దర్శకుడిగా పరిచయమవుతున్న "గీత' ఘన విజయం సాధించాలని, తన మిత్రుడు రాచయ్య నిర్మాతగా రాణించాలని అభిలాషించాడు. . ఈ చిత్రంలో పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకున్నారు. ఈ సినిమా అవకాశం తన గురువు, దైవం అయిన వినాయక్ గారే ఇప్పించారని, నిర్మాత రాచయ్యగారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చిత్ర దర్శకుడు విశ్వ పేర్కొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న హిందీ "ఛత్రపతి" పనులతో తలమునకలుగా ఉన్నప్పటికీ... తమ మీద ప్రత్యేకమైన అభిమానంతో "గీత" చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వినాయక్ గారికి నిర్మాత ఆర్.రాచయ్య కృతజ్ఞతలు తెలిపారు. గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా డైరెక్టర్ విశ్వ... "గీత" చిత్రాన్ని అత్యద్భుత ప్రణాళికతో రూపొందించారని పేర్కొన్నారు. రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి, తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎస్.చిన్నా. -
హల్చల్ : మసాజ్‌తో సారా..చీరలో దీప్తి సునయన..రీల్స్‌తో వర్షిణి
♦ రాజీ స్కెచ్‌లో సమంత ♦ చీరకట్టులో మెరిసిపోతున్న దీప్తి సునయన ♦ నీకు నేనున్నానని ధైర్యం చెప్తున్న కౌశల్ ♦ బుక్ రీడింగ్‌లో మునిగిపోయిన తాప్సీ ♦ రీల్స్‌తో అలా సరదాగా అంటున్న వర్షిని ♦ గుర్రపు స్వారీ చేస్తోన్న అభిజీత్ ♦ అమ్మతో ఆయిల్ మసాజ్ అంటోన్న సారా అలీఖాన్ ♦ నిన్నే చూస్తానంటున్న అషూ View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by Rubina Dilaik (@rubinadilaik) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) -
నవ్వులతో స్వాగతం
రాజ్ తరుణ్ హీరోగా, మాళవికా నాయర్, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా..’. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాని నూతన సంవత్సరం కానుకగా జనవరి 1న థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. కేకే రాధామోహన్ మాట్లాడుతూ – ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. మా సినిమా చూసిన ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు. 2021కి స్వాగతం పలుకుతూ మా చిత్రం విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఐ. ఆండ్రూ. -
ఐపీఎస్ ఆఫీసర్
వశిష్టసింహ, హెబ్బా పటేల్, సాయిరోనక్, పూజితా పొన్నాడ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్’. డైరెక్టర్ సంపత్ నంది కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించిన ఈ చిత్రం ద్వారా అశోక్ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించారు. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన వశిష్ట సింహ లుక్‌కి, హెబ్బా పటేల్ లుక్‌కి మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ సినిమాలో పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ అనుదీప్ పాత్ర చేస్తున్న సాయిరోనక్ లుక్‌ని విడుదలచేశారు. ‘‘డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు. కేకే రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘ఓదెల’ అనే గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. -
ఓదెలలో ఏం జరిగింది?
ఓదెల అనే గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వేస్టేషన్’. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఇందులో వశిష్ట సింహ హీరోగా, హెబ్బా పటేల్ హీరోయిన్గా నటిస్తున్నారు. అశోక్ తేజ దర్శకత్వంలో లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. మేకప్, డ్రీమ్ సీక్వెన్సెస్, పాటలు లేకుండా సినిమాను ఎంతో వాస్తవికంగా తెరకెక్కిస్తున్నాం. ఓదెలలో మొదటి షెడ్యూల్ పూర్తిచేశాం. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రెండో షెడ్యూల్లో చిత్రంలోని కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు క్లయిమాక్స్‌ను చిత్రీకరిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. సౌందర్ రాజ¯Œ , సంగీతం: అనూప్ రూబెన్స్. -
నిజామాబాద్‌లో హెబ్బా, పాయల్ సందడి
సాక్షి, నిజామాబాద్: పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్ మాల్‌ను హీరోయిన్లు హెబ్బా పటేల్, పాయల్ రాజ్‌పుత్ కలిసి శుక్రవారం ప్రారంభించారు. వారిని చూసేందుకు జనాలు భారీగా తరలి వచ్చారు. క్లాత్ సెక్షన్‌తో పాటు జ్యూవెలరీ విభాగంలో కూడా మహిళలతో కలిసి ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు హల్చల్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. చదవండి: నా కల నెరవేరింది: పాయల్ రాజ్‌పుత్ -
థ్రిల్లింగ్ స్టేషన్
కన్నడంలో దాదాపు 25 సినిమాల్లో పలు ప్రముఖ పాత్రల్లో నటించారు వశిష్ట సింహా. తెలుగులో ఆయన హీరోగా చేస్తున్న తొలి చిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్’. వశిష్ట సరసన పల్లెటూరి అమ్మాయి పాత్రలో హెబ్బా పటేల్ నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో ఈ చిత్రాన్ని కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఆయన బ్యానర్లో ‘బెంగాల్ టైగర్’ చిత్రానికి దర్శకత్వం వహించిన సంపత్ నంది ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అశోక్‌తేజ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. మేకప్, డిఫరెంట్ కాస్ట్యూమ్స్, డ్రీమ్ సీక్వెన్సెస్, పాటలు లేకుండా సహజత్వానికి దగ్గరగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఓదెల అనే గ్రామంలో జరిగిన వాస్తవ ఘటనతో క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయిరోనక్, పూజితా పొన్నాడ, నాగమహేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్, సంగీతం: అనూప్ రూబెన్స్. -
వెబ్ సిరీస్‌లో హెబ్బా
డిజిటల్ మీడియమ్‌లో షోలు, సిరీస్‌లకు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేయడానికి స్టార్స్ కూడా వెబ్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా హెబ్బా పటేల్ కూడా ఓ వెబ్ సిరీస్‌లో కనిపించనున్నారు. నవదీప్, హెబ్బా పటేల్ ముఖ్య పాత్రల్లో దర్శకుడు అజయ్ భూయాన్ ఓ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఇటీవల ప్రారంభం అయింది. ఈ వెబ్ సిరీస్ జానర్, మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నితిన్ ‘భీష్మ’, రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు హెబ్బా పటేల్.