helicapter crash
-
హెలికాఫ్టర్ ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
గాంధీ నగర్ : గుజరాత్ (Gujarat)లో విషాదం చోటు చేసుకుంది. పోర్బందర్ ఎయిర్పోర్ట్ (Porbandar Airport)లో ఘోర హెలికాప్టర్ (helicopter crash porbandar) ప్రమాదం జరిగింది. కోస్ట్ గార్డ్‌కు చెందిన ఏఎల్‌హెచ్ ధృవ్ హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ హెలికాప్టర్ భూమిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడినట్లు సమాచారం. అయితే మరణాలకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.ప్రమాదం వెంటనే హెలికాప్టర్ భూమిని ఢీకొట్టిన తర్వాత మంటలు చెలరేగి, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఘటనా స్థలంలో విమానాశ్రయ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే సివిల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.Helicopter of Indian Coast Guard ALH Dhruv 'crashed' in Porbandar, Gujarat during a routine training sortie.3 crew members DEAD. pic.twitter.com/vt4L025Ifl— RAMULU.B (@vedicramrekha) January 5, 2025 -
Year Ender 2024: వణికించిన విమాన ప్రమాదాలు
2024 ముగియడానికి ఇక కొద్దిరోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇంతలోనే కజకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 38 మంది ప్రయాణికులు మృతిచెందారు. ఈ ఏడాది అధికంగానే విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.జపాన్ విమాన ప్రమాదం2024 జనవరి 2న జపాన్‌లోని టోక్యోలోని హనెడా విమానాశ్రయంలో జపాన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 516- జపాన్ కోస్ట్ గార్డ్ విమానం పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం 367 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది సురక్షితంగానే ఉన్నారు. అయితే కోస్ట్ గార్డ్ విమానంలోని ఆరుగురు సభ్యులలో ఐదుగురు మృతిచెందారు.బెల్గోరోడ్ ఓబ్లాస్ట్ విమాన ప్రమాదం2024, జనవరి 24న బెల్గోరోడ్ ఒబ్లాస్ట్‌లో రష్యన్ వైమానిక దళానికి చెందిన ఇల్యుషిన్ ఐఎల్ 76 సైనిక రవాణా విమానం కూలిపోయింది. ఈ విమానంలో 65 మంది ఉక్రేనియన్ యుద్ధ ఖైదీలతో పాటు తొమ్మిదిమంది సిబ్బంది ఉన్నారు. వీరంతా మృతిచెందారు.రష్యా విమాన ప్రమాదం2024, మార్చి 12న రష్యాలోని ఇవానోవో ఒబ్లాస్ట్‌లో ఇల్యుషిన్ ఐఎల్76 కార్గో విమానం కూలిపోయింది. దీంతో ఆ విమానంలోని మొత్తం 15 మంది మృతిచెందారు.ఇరాన్ విమాన ప్రమాదం2024, మే 19న ఇరాన్‌లోని తూర్పు అజర్బైజాన్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో సహా మొత్తం తొమ్మిది మంది మృతిచెందారు.మలావి విమాన ప్రమాదం2024, జూన్ 10న మలావీ వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ చిలిమా, ఇతర ప్రముఖులతో ప్రయాణిస్తున్న మలావీ డిఫెన్స్ ఫోర్స్ డోర్నియర్- 228 విమానం కూలిపోవడంతో అందులోని తొమ్మిది మంది మృతిచెందారు.నేపాల్ విమాన ప్రమాదం2024, జూలై 24న నేపాల్‌లోని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన సౌర్య ఎయిర్‌లైన్స్ విమానం కొద్దిసేపటికే కుప్పకూలింది. అందులో ఉన్న 19 మందిలో 18 మంది మృతిచెందారు.విన్హాడో విమాన ప్రమాదం2024, ఆగస్ట్ 9న బ్రెజిల్‌లోని సావోపాలోలోని విన్హెడోలో ఫ్లైట్- 2283 క్రాష్ అయ్యింది. అందులో మొత్తం 62 మంది ప్రయాణికులు మృతిచెందారు. ఇది బ్రెజిల్లో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాలలో ఒకటిగా నిలిచింది.బ్రెజిల్ విమాన ప్రమాదం2024, డిసెంబర్ 22న బ్రెజిల్‌లోని కెనెలా విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైపర్ పీఏ42 చెయెన్నే విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది ప్రయాణికులు మృతిచెందారు. 17 మంది గాయపడ్డారు.కజకిస్తాన్ విమాన ప్రమాదం2024, డిసెంబర్ 25న అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ కజకిస్తాన్‌లోని అక్టౌ సమీపంలో కూలిపోయింది. క్రిస్మస్ రోజున జరిగిన ఈ విమాన ప్రమాదంలో 38 మంది మృతి చెందగా, పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: దుమ్మురేపిన 100 మంది డిజిటల్ స్టార్స్.. -
Year Ender 2024: విమాన ప్రమాదాలు.. ప్రాణాలు కోల్పోయిన ప్రముఖులు
2024 సోమవారం ప్రారంభమై మంగళవారంతో ముగియనుంది. ఇప్పుడు మనమంతా 2024 చివరిదశలో ఉన్నాం. ఈ ఏడాది పలు ఆనందాన్నిచ్చే ఘటనలతో పాటు విషాదాన్ని పంచే ఉందంతాలు కూడా చోటుచేసుకున్నాయి. వాటిలో విమాన ప్రమాదాలు ఒకటి. ఈ దుర్ఘటనల్లో పలువురు ప్రముఖులు కన్నుమూశారు.నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదంజూలై 24న సౌర్య ఎయిర్‌లైన్స్ విమానం పోఖ్రాకు వెళుతుండగా ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. ఉదయం 11 గంటలకు త్రిభువన్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం కొద్దిసేపటికే కుప్పకూలింది. 21 ఏళ్ల నాటి ఈ విమానానికి మరమ్మతులు చేసి పరీక్షలకు తీసుకెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.కుప్పకూలిన ఇరాన్ అధ్యక్షుని హెలికాప్టర్ మే 19న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీరాబ్దుల్లాహియాన్ సహా 9 మంది మృతిచెందారు. ఇరాన్ అధ్యక్షుడి కాన్వాయ్‌లో మూడు హెలికాప్టర్లు ఉన్నాయి. వీటిలో రెండు హెలికాప్టర్లు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నాయి. పలు నివేదికల ప్రకారం పైలట్ హెలికాప్టర్‌పై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. దట్టమైన పొగమంచు మధ్య పర్వత ప్రాంతాలను దాటుతుండగా హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు 600 కిలోమీటర్ల దూరంలోని అజర్బైజాన్ సరిహద్దు నగరం జోల్ఫా సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.రష్యాలో విమాన ప్రమాదం2024 జనవరిలో రష్యా విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 74 మంది మృతిచెందారు. బెల్గోరోడ్ ప్రాంతంలో ఈ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో విమానంలో 65 మంది ఉక్రెయిన్ ఖైదీలు మరియు 9 మంది రష్యన్ సిబ్బంది ఉన్నారు. ఈ సంఘటన తర్వాత రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఉక్రెయిన్ నుండి ప్రయోగించిన క్షిపణి విమానాన్ని తాకిందని పేర్కొంది. ఉక్రెయిన్ దీనిని రష్యా కుట్రగా పేర్కొంది.మలావిలో కూలిన విమానంఈ ఏడాది జూన్‌లో మలావీ వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ క్లాస్ చిలిమాతో పాటు మరో తొమ్మదిమంది విమాన ప్రమాదంలో మరణించారు. ఈ విమాన ప్రమాదాన్ని మలావీ అధ్యక్షుడు లాజరస్ చక్వేరా స్వయంగా ధృవీకరించారు. ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా ప్రయాణిస్తున్న సైనిక విమానం శకలాలు దేశంలోని ఉత్తర ప్రాంతంలోని ఒక పర్వత ప్రాంతంలో కనుగొన్నారు. సౌలోస్ చిలిమా విమానం అదృశ్యమయ్యే ముందు దక్షిణ ఆఫ్రికా దేశ రాజధాని లిలాంగ్వేకు ఉత్తరాన 370 కిలోమీటర్ల దూరంలో ఎగురుతూ కనిపించింది. అననుకూల వాతావరణం, దృశ్యమానత సరిగా లేకపోవడం కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది.హాలీవుడ్ నటుని దుర్మరణంహాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఆలివర్ అతని ఇద్దరు కుమార్తెలు, పైలట్ జనవరి ఆరున కరేబియన్ ద్వీపం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూశారు. గ్రెనడైన్స్‌లోని పెటిట్ నెవిస్ ద్వీపంలో ఈ విమానం కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తి సముద్రంలో కూలిపోయింది.చిలీ మాజీ అధ్యక్షుడి హెలికాప్టర్..చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా ఈ ఏడాది హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు. ఆయన వ్యక్తిగత హెలికాప్టర్ దేశంలోని దక్షిణ ప్రాంతంలో కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లో నలుగురు ఉన్నారు. ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.ఆఫ్ఘనిస్తాన్‌లో విమాన ప్రమాదంజనవరి 21న ఆఫ్ఘనిస్థాన్‌లోని బదక్షన్ ప్రావిన్స్‌లో ఓ విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో ఈ బిజినెస్ జెట్‌లో ఏడుగురు రష్యన్లు ఉన్నారు. వారు అక్కడికక్కడే మృతిచెందారు. విమానం ఇంజన్లో లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. విమానం మొరాకో కంపెనీకి చెందినది. ఇది కూడా చదవండి: Year Ender 2024: కొత్తగా పట్టాలెక్కిన ‘వందేభారత్’లివే.. -
లైవ్ షాకింగ్ విజువల్స్.. !
-
కుప్పకూలిన నేవీ హెలికాప్టర్: ఒకరు మృతి
కొచ్చి: భారత నావికా దళానికి చెందిన చేతక్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. నేవల్ బేస్‌లోని నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ గరుడ వద్ద శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. కేరళలోని నేవల్ ఎయిర్ స్టేషన్లో ట్రయల్ రన్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం పైలట్‌తో సహా ఇద్దరు గాయ పడగా, చాపర్ రోటర్ బ్లేడ్లు తగలడంతో రన్‌వేపై ఉన్న నౌకాదళ అధికారి మృతి చెందినట్లు తెలుస్తోంది. INS చేతక్ హెలికాప్టర్ నౌకాదళంలో అత్యంత పురాతనమైన హెలికాప్టర్. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. -
జవాన్ అనిల్ కు కన్నీటి వీడ్కోలు..
-
ఆర్మీ జవాన్ అనిల్ అంత్యక్రియలు...
-
బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం: ప్రతికూల వాతావరణమే కారణం
న్యూఢిల్లీ: మేఘావృతమైన ప్రతికూల వాతావరణంలోకి హఠాత్తుగా హెలికాప్టర్ ప్రవేశించడంతో.. అది పైలట్ అధీనంలో ఉన్నప్పటికీ దాని పథం మారి కిందకు దూసుకొచ్చి కూలిందని సీడీఎస్ రావత్ ఘటనపై త్రివిధ దళాల దర్యాప్తు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దర్యాప్తులో వెల్లడైన ప్రాథమిక వివరాలు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి చేరాయని భారత వాయుసేన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ముందుస్తు కుట్ర, ఉగ్రవాద దుశ్చర్చ, హెలికాప్టర్లో లోపాలు, పైలట్ తప్పిదం.. ఇలాంటి వాదనలు అన్నీ అవాస్తవం’ అని స్పష్టంచేసింది. చదవండి: కోడలి నగలు భద్రపరచడం క్రూరత్వం కాదు ఫ్లైట్ డాటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లో నమోదైన సమాచారంతోపాటు ఘటనాస్థలిలో సేకరించిన సమాచారాన్ని పరిశీలించి ప్రాథమిక అంచనాకు వచ్చారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికసహా 14 మంది ప్రయాణిస్తున్న భారత వాయుసేన హెలికాప్టర్ గత ఏడాది డిసెంబర్ ఎనిమిదిన కూనూర్‌లో నీలగిరి కొండల్లో నేలకూలిన విషయం తెల్సిందే. -
‘లవ్యూ డాడీ’ అంటూ.. సాయితేజ ఫోటోను ముద్దాడిన కొడుకు
చిత్తూరు: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన సైనికుడు లాన్స్ నాయక్ సాయితేజ పార్థివదేహానికి ఎగువరేగడిలో సైనిక లాంఛనాలతో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మదనపల్లి నుంచి ఎగువరేగడ వరకూ దాదాపు 30 కిలోమీటర్ల అంతిమయాత్ర కొనసాగింది. ఎగువరేగడకు చేరుకున్న సాయితేజ భౌతిక కాయాన్ని చూడగానే ఆయన భార్య సొమ్మసిల్లి పడిపోయారు. కన్నీరుమున్నీరుగా సాయితేజ కుటుంబ సభ్యులు విలపించారు. ఆయన కొడుకు తండ్రి ఫోటోకు ‘లవ్ యూ డాడీ.. లవ్ యూ డాడీ..’ అంటూ బాధగా ముద్దు పెట్టుకుంటున్న దృశ్యం కదిలించింది. -
సెలవిక.. సైనికా!
బి.కొత్తకోట: ‘సాయితేజ అమర్ రహే.. జై జవాన్.. భారత్ మాతాకీ జై’ అంటూ వేలాదిగా తరలివచ్చిన ప్రజల నినాదాలతో ఎగువరేగడి గ్రామం ప్రతిధ్వనించింది. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన లాన్స్‌నాయక్ బి.సాయితేజ అంత్యక్రియలు అతడి కుటుంబీకులు, సన్నిహితులు, బంధువుల అశ్రునయనాల నడుమ సైనిక, పోలీసు లాంఛనాలతో పూర్తయ్యాయి. బెంగళూరులోని ఆర్మీ బేస్ ఆస్పత్రి నుంచి సాయిజేజ మృతదేహం ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కురబలకోట మండలం ఎగువరేగడి గ్రామానికి చేరుకుంది. అప్పటికే వేలాదిగా తరలివచ్చిన ప్రజలు సాయితేజ భౌతికకాయాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. పార్థివదేహాన్ని తొలుత సాయితేజ ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించే మైదానానికి తీసుకొచ్చి ప్రజల సందర్శనార్థం గంటకుపైగా ఉంచారు. అనంతరం ఇంటి సమీపంలో సిద్ధం చేసిన సమాధి వద్దకు శవ పేటికను ప్రజలు మోసుకొచ్చారు. అక్కడ సాయితేజ కుమారుడు మోక్షజ్ఞ చేత తమ్ముడు మహేష్‌బాబు అంతిమ సంస్కారాలు చేయించారు. తర్వాత శవపేటికతో సహా సమాధి చేశారు. మధ్యాహ్నం 3:20 గంటలకు కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. నినాదాలు, ఆర్తనాదాల నడుమ.. సాయితేజ మృతదేహం ఉన్న శవపేటికను మైదానంలోకి తీసుకురావడంతో జనం ఒక్కసారిగా జై జవాన్ నినాదాలతో హోరెత్తించారు. దర్శనార్థం జనం దూసుకొచ్చారు. పోలీసులు, ఆర్మీ సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్లకు అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. అరగంట వరకు ఇదేపరిస్థితి నెలకొనగా పోలీసులు జనాన్ని అదుపు చేశాక శవపేటిక వద్దకు భార్య శ్యామల, తల్లిదండ్రులు భువనేశ్వరి, మోహన్, తమ్ముడు జవాన్ మహేష్‌బాబు, బంధువులు చేరుకోగా ఒక్కసారిగా ఆర్తనాదాలతో వాతావరణం ఆవేదనాభరితంగా మారింది. కొంతసేపు భార్య శ్యామల భర్త శవపేటిక వద్ద మౌనంగా ఉండిపోయింది. అర్తనాదాలు, జనం నినాదాలు, తోపులాటలు ఇవేమీ అర్థంకాని సాయితేజ కుమారుడు మోక్షజ్ఞ జాతీయ పతాకం చేతపట్టి తండ్రి శవపేటిక వద్ద కూర్చున్న దృశ్యం కలచివేసింది. ఇక తండ్రి లేడన్న విషయం తెలియని మోక్షజ్ఞ తల్లి ఒడిలో కూర్చోని అటుఇటూ చూస్తూ జెండా ఊపుతూ కనిపించాడు. జనం జై జవాన్ నినాదాలు చేస్తుంటే సాయితేజ తమ్ముడు జవాన్ మహేష్‌బాబు వారితో గొంతు కలిపి జై జవాన్ అంటూ చేతులెత్తి నినాదాలు చేశాడు. అంత్యక్రియల సందర్భంగా రెండుచోట్ల అధికారిక లాంఛనాలు జరిపారు. తొలుత మైదానంలో శవపేటిక ఎదుట బెంగళూరు నుంచి వచ్చిన 11వ పారా సైనికులు గౌరవ వందనం చేశారు. అనంతరం గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి నివాళులర్పించారు. ఆర్మ్డ్ పోలీసులు కూడా గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమానికి బెంగళూరు సైనిక విభాగం నుంచి నలుగురు అధికారులు, ఐదుగురు జాయింట్ కమెండో ఆఫీసర్లు, 30 మంది సైనికులు హాజరయ్యారు. సమాధి చేసేముందు ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి నివా ళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకా లతో జనం నినాదాలు చేశారు. చిత్తూరు, తిరుపతి ఎస్పీలు సెంథిల్‌కుమార్, వెంకట అప్పలనాయుడు సాయితేజ శవపేటికపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) వెంకటేశ్వర, బెంగళూరు నుంచి వచ్చిన 11వ పారా సైనిక విభాగం అధికారులు, మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, స్థానిక అధికారులు, ప్రముఖులు నివాళులర్పించారు. మదనపల్లె జెడ్పీ, హోప్, సీటీఎం, తంబళ్లపల్లె, చెంబకూరు హైస్కూళ్లు, మిట్స్, బీటీ కళాశాలకు చెందిన 200 మంది ఎన్సీసీ క్యాడెట్లు హాజరై నివాళులర్పించారు. అనంతరం సమాధి వద్దకు ప్రజలు శవపేటికను మోసుకొచ్చారు. శ్యామలకు జాతీయ పతాకం అందజేత సాయితేజ మృతదేహం ఉంచిన శవపేటికకు చుట్టిన జాతీయ పతాకాన్ని సైనిక అధికారులు అతడి భార్య శ్యామలకు అందజేశారు. దేశం కోసం సాయితేజ అమరుడైనాడని, మీకు దేశం అండగా ఉంటుందని దైర్యం చెప్పారు. కుటుంబాన్ని ఆదుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని మాటిచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బిపిన్ రావత్ మృతి.. ‘దయచేసి ఆ ఊహాగానాలకు చెక్ పెట్టండి’
న్యూఢిల్లీ: సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా 13మంది ప్రాణాలు కోల్పోయిన హెలికాఫ్టర్ ప్రమాదంపై వదంతులు ప్రచారం చేయొద్దని భారతీయ వాయుసేన విజ్ఞప్తిచేసింది. ఊహాగానాలకు దూరంగా ఉండాలని కోరింది. ఘటనపై త్రివిధ దళాల సంయుక్త దర్యాప్తునకు ఆదేశించామని.. దర్యాప్తు బృందం ఇప్పటికే విచారణ ప్రారంభించిందని పేర్కొంది. విచారణను త్వరితగతిన పూర్తిచేసి.. ప్రమాదానికి గల కారణాలు వెల్లడిస్తుందని ట్విట్టర్లో వెల్లడించింది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్. అప్పటివరకూ ఎలాంటి వదంతులు వ్యాప్తిచేయవద్దని విజ్ఞప్తిచేసింది. మరణించినవారి గౌరవాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరింది. బుధవారం తమిళనాడు నీలగిరి జిల్లాలోని కూనూర్ వద్ద హెలికాఫ్టర్ కూలిపోయిన ఘటనలో సీడీఎస్ రావత్ దంపతులు సహా 13మంది మరణించారు. (చదవండి: అమెరికా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ అధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ) -
బిపిన్ రావత్ ఓ బ్రాండ్ .. మాజీ కల్నల్ ఎమోషనల్
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన మాజీ కల్నల్ పీవీ దుర్గా ప్రసాద్ కొన్నేళ్ల పాటు బిపిన్ రావత్‌తో కలిసి పని చేశారు. ఇద్దరూ కలిసి అనేక కీలక ఆపరేషన్లు కూడా చేశారు. 1978 నుంచి ఇద్దరూ కలిసి ఒకే బెటాలియన్‌లో దాదాపు 18 ఏళ్లు విధులు నిర్వర్తించారు. లెఫ్ట్‌నెంట్ నుంచి కల్నల్ వరకు కలిసే ఎదిగారు. ఆపై దుర్గా ప్రసాద్ పదవీ విమరణ పొందారు. రావత్ సీడీఎస్ వరకు ఎదిగారు. ఈ ద్వయం అమృత్సర్, యూరిల్లో అత్యంత సన్నిహితంగా పని చేసి, అనేక ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేశారు. బిపిన్ హఠాన్మరణం నేపథ్యంలో దుర్గా ప్రసాద్ గురువారం మీడియాతో మాట్లాడారు. అవి ఆయన మాటల్లోనే.. నిబద్ధతకు నిదర్శనం.. ► బిపిన్ రావత్‌తో కలిసి 11 గూర్ఖా రైఫిల్స్‌కు చెందిన ఆల్ఫా కంపెనీలో పని చేశా. ఓ రోజు ఇద్దరం కలిసి యూరి క్యాంప్‌లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద గార్డ్ చేస్తూ మధ్యాహ్న భోజనానికి వచ్చాం. అది పూర్తయిన తర్వాత ఎవరో మేజర్ జనరల్ వస్తే ఆయన బ్రీఫింగ్ చేస్తూ నేను ఆగిపోగా... బిపిన్ ఆర్మీ వాహనంలో తన విధులకు వెనక్కు వెళ్తున్నారు. నేను చూస్తుండగానే బాంబు పేలింది. ఆ ప్రమాదంలో ఆయన గాయాలతో బయటపడ్డారు. నాటి దసరా సందర్భంలో గాయాలతో ఉన్నారు. అలాంటి వారికి క్యాంప్ నుంచి వెనక్కు వచ్చే అవకాశం ఉన్నా... ఆయన ఒప్పుకోలేదు. అంతటి నిబద్ధతతో విధులు నిర్వర్తించే వారాయన. ► దసరా రోజు సాయంత్రం 5.30 గంటలకు పాకిస్థాన్‌కు చెందిన ఛగోతీ పోస్టు వద్ద ఉన్నాం. ‘నేను నా ట్రూప్స్‌తో వెళ్లి దసరా బోర్డర్ లైన్ వద్ద సెలబ్రేట్ చేస్తా’ అని వెళ్లారు. దాదాపు రెండుమూడు గంటలు అక్కడ గడిపి వెనక్కు వచ్చారు. ఆయన నడిచే పరిస్థితి లేకపోవడంతో గూర్ఖా ట్రూప్స్ మోసుకు వెళ్లాయి. ఆ రోజు ఉన్నతాధికారులకూ సమాచారం ఇవ్వకుండా ఇలా చేశాం. అలాంటివి మళ్లీ జరిగి ఉంటాయని అనుకోను. పాకిస్థాన్‌కు చెందిన ఆయుధాలు రికవరీ చేయడం, ఆ బలగాల కదలికల్ని కనిపెట్టడంలో బిపిన్ రావత్‌కు మంచి నెట్వర్క్ ఉండేది. సెకండ్ లెఫ్ట్‌నెంట్ నుంచే ముందుండి ట్రూప్‌ను నడిపే వారు. అందుకే అనేక మెడల్స్ ఆయన సొంతమయ్యాయి. 18 గంటల పాటు పనిచేసేవారు ► రావత్‌కు మానసిక స్థైర్యం, ధైర్యం చాలా ఎక్కువ. నాగాలాండ్ ఇన్సెర్జెన్సీ ఏరియాలో ఉండగా ఓ రోజు ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ అయింది. ఆ వెంటనే కిందికి పడిపోయింది. అలా జరిగితే ఎవరైనా ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటారు. బిపిన్ రావత్ మాత్రం అలా చేయలేదు. మరో హెలికాప్టర్ తీసుకుని వెళ్లి పని పూర్తి చేసుకువచ్చారు. పని పట్ల ఆయనకు ఉండే నిబద్ధత అలాంటిది. ఒక్కోసారి నిర్విరామంగా 18 గంటలూ ఆయన పని చేసే వారు. ఆయన భార్యను మేం మధు అని పిలిచేవాళ్లం. ఆమెది మధ్యప్రదేశ్‌కు చెందిన రాజకుటుంబం. అయినా ఆ దర్పం గాని, సీనియర్ అధికారి భార్య అనే భావన గాని ఏనాడూ ఆమెలో కనిపించలేదు. లక్నోలో మేమంతా కలిసి ఒకేచోట ఉండేవాళ్లం. నా భార్య అరుణకు ఆమె స్కూటర్ నడపడం నేర్పారు. ► రావత్ ఆర్మీ వైస్ చీఫ్, చీఫ్ అయిన తర్వాత కూడా ఆయన నాకు ఫోన్లు చేసి మాట్లాడేవారు. ఆయన హైదరాబాద్ వచ్చిన ప్రతిసారీ వెళ్లి కలిసేవాడిని. రావత్ సీడీఎస్ అయిన తర్వాత ఒకేసారి కలిశాను. ఏడాది క్రితం ఆయన సీడీఎంలో లెక్చర్ ఇవ్వడానికి వచ్చారు. అప్పుడు దాదాపు గంటకు పైగా ఆయనతో గడిపా. బిపిన్ ఆర్మీ ఆపరేషన్స్‌లో దిట్ట. ఆయనకు అవంటే చాలా ఇష్టం. ఆయన కాంగోలో ఐక్యరాజ్య సమితి మిషన్‌లో పని చేశారు. అప్పట్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు, చర్యలను అందరూ అభినందించారు. ► బలగాల నైతిక ధైర్యం దెబ్బతీయడానికి యూఎన్ కాన్వాయ్‌పై దాడికి ప్రయత్నించిన కాంగో మిలిటెంట్స్‌ను సమర్థంగా తిప్పికొట్టి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రపంచంలోని ప్రసిద్ధ దేశాల ఆర్మీలని ఆయన అధ్యయనం చేశారు బిపిన్. ఈ నేపథ్యంలోనే ఆయన సీడీఎస్ అయిన తర్వాత థియేటర్ కమాండ్ అనే కొత్త కాన్సెప్ట్ పరిచయం చేశారు. దీంతో ఏ ప్రాంతంలో ఉన్న సైన్యానికైనా ఆయుధ, మౌలిక వసతుల కల్పన తేలికైంది. యుద్ధంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అది పూర్తిగా అమలులోకి వచ్చే సందర్భంలోనే విషాదం చోటుచేసుకోవడం దారుణం. చదవండి: ఎంఐ–17వీ5 ప్రమాదంపై త్రివిధ దళాల దర్యాప్తు -
Hyderabad: బిపిన్ రావత్ యాదిలో..
సాక్షి, హైదరాబాద్: త్రివిధ దళాల చీఫ్ జనరల్ బిపిన్ రావత్ బుధవారం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో సికింద్రాబాద్ మిలిటరీ స్టేషన్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 2017లో ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన అదే ఏడాది చివర్లో సికింద్రాబాద్‌లోని ప్రతిష్టాత్మక డిఫెన్స్ మేనేజ్మెంట్ కాలేజీ (సీడీఎం)ని, 2018 డిసెంబర్లో ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ కాలేజీ (ఎంసీఈఎంఈ)ని సందర్శించారు. సీడీఎం సందర్శనలో భాగంగా హయ్యర్ డిఫెన్స్ మేనేజ్మెంట్ కోర్సు (హెచ్‌డీఎంసీ)లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. దేశ రక్షణలో ఆర్మీ ప్రాముఖ్యత, అధునాతన టెక్నాలజీకి అనుగుణంగా ఆర్మీ పని తీరును మెరుగుపరుచుకోవడంపై పలు కీలక సూచనలు చేశారు. 2019 డిసెంబర్ 14న తిరుమలగిరిలోని ఎంసీఈఎంఈ 99వ స్నాతకోత్సవానికి సైతం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ సందర్శన సందర్భంగా.. ఈ సందర్భంగా ఎంసీఈఎంఈలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న మిలిటరీ అధికారులకు పట్టాలను ప్రదానం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. 2019 తర్వాత బిపిన్ రావత్ సికింద్రాబాద్ మిలిటరీ స్టేషన్‌ను సందర్శించలేదు. ఇక్కడి ప్రతిష్టాత్మక శిక్షణ సంస్థలకు సంబంధించిన కార్యక్రమాలకు వెబ్‌నార్ ద్వారా హాజరయ్యేవారు. ఎంసీఈఎంఈ స్నాతకోత్సవంలో.. – కంటోన్మెంట్ చదవండి: CDS Bipin Rawat: సెలవిక దళపతి... వెల్లింగ్టన్లో మృతులకు నివాళి -
చివరి కోరిక తీరకుండానే మృతి చెందిన బిపిన్ రావత్
పౌరి (ఉత్తరాఖండ్): బిపిన్ రావత్ రిటైరయ్యాక ఉత్తరాఖండ్‌లోని స్వగ్రామమైన ‘సైనా’లో ఇళ్లు కట్టుకోవాలని అనుకున్నారు. 2018 చివరిసారిగా ఆయన సొంతూరును సందర్శించారని బిపిన్ మేనమామ భరత్ తెలిపారు. పౌరి జిల్లాలోని ద్వారిఖాల్ బ్లాక్‌లో సైనీ గ్రామం ఉంది. ఈ ఊర్లో ప్రస్తుతం నివసిస్తున్న జనరల్ ఏకైక బంధువు భరత్. ‘2018లో వచ్చినపుడు కులదేవతకు పూజ చేశారు. రిటైరయ్యాక ఇక్కడే ఇల్లు నిర్మించుకుంటానని చెప్పారు. స్వగ్రామంతో బిపిన్‌కు అనుబంధం ఎక్కువ. ఊరి జనం ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం తనను బాధిస్తోందని, రిటైరయ్యాక ఈ ప్రాంతం కోసం ఏదైనా చేస్తానని గ్రామస్తులకు చెప్పారు. బిపిన్ ఫోన్లో నాతో మాట్లాడేవారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సైనీకి వస్తానన్నారు’ అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పారు భరత్. (చదవండి: బిపిన్ రావత్.. మాటలు కూడా తూటాలే) తన మేనల్లుడి కోరిక తీరకుండానే ఇలా జరుగుతుందని ఊహించలేదని అన్నారు. రావత్ సతీమణి మధులిక సొంతూరు మధ్యప్రదేశ్ షాడోల్ జిల్లాలోని సొహాగ్‌పూర్. ప్రస్తుతం ఆమె కుటుంబం షాడోల్లో ఉన్న పూర్వీకుల ఇంట్లో నివశిస్తున్నారు. వచ్చే ఏడాది సొహాగ్‌పూర్ వచ్చి సైనిక పాఠశాల పనులు ప్రారంభిస్తానని రావత్ చెప్పినట్లు బావమరిది యశవర్ధన్ అన్నారు. చదవండి: విమాన ప్రమాదం అంటే గుర్తొచ్చేది బ్లాక్‌బాక్స్.. అసలు దానికథేంటి..? -
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు దృశ్యాలు.. వీడియో వైరల్
సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు కూనూర్ సమీపంలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగిందా.. లేక మరేదైనా కారణామా అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు వాయుసేన అధికారులు. ఈ క్రమంలో తాజాగా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. హెలికాప్టర్ కూలడానికి కొన్ని సెకన్ల ముందు చోటు చేసుకున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ప్రమాదం చోటు చేసుకోవడానికి కొన్ని సెకన్ల ముందటి ఈ వీడియోలో హెలికాప్టర్ పొగ మంచులో చిక్కుకున్న దృశ్యాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అంతవరకు బాగానే ప్రయాణించిన హెలికాప్టర్ ఉన్నట్లుండి పొగ మంచులో చిక్కుకోవడంతో.. ఈ ప్రమాదం సంభవించింది. (చదవండి: Helicopter Crash: ఆయనొక్కరే బతికిబయటపడ్డారు) హెలికాప్టర్ పొగ మంచులో చిక్కుకున్న సమయంలో కింద కొందరు జనాలు ఉన్నారు. వారికి హెలికాప్టర్ కూలిన చప్పుడు వినిపించింది. ప్రమాదం గురించి వారు తమిళ్లో మాట్లాడుకోవడం దీనిలో రికార్డయ్యింది. ఈ వీడియో వెలుగులోకి రావడంతో.. ప్రమాదంపై నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయి. అలానే హెలికాప్టర్ బ్లాక్ బాక్స్ కూడా లభ్యం అయినట్లు అధికారులు ప్రకటించారు. (చదవండి: ప్రముఖులను కబళించిన హెలికాప్టర్ ప్రమాదాలు) మంగళవారం చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్, ఆయన భార్యతో మొత్తం 13 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తెలుగు జవాను కూడా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లాకు చెందిన సాయి తేజ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. చదవండి: సాయి తేజ చివరి మాటలు: ‘‘పాప దర్శిని ఏం చేస్తోంది.. బాబు స్కూల్‌కు వెళ్లాడా’’ -
సాయి తేజ చివరి మాటలు: ‘‘పాప దర్శిని ఏం చేస్తోంది.. బాబు స్కూల్‌కు వెళ్లాడా’’
Lance Naik Saiteja: ‘పాప దర్శిని ఏం చేస్తోంది.. మోక్షజ్ఞ స్కూల్‌కు వెళ్లాడా.. చిట్టితల్లిని చూడాలని ఉంది. వీడియో కాల్ చేస్తా’ అంటూ భార్య శ్యామలతో లాన్స్‌నాయక్ బి.సాయితేజ బుధవారం ఉదయం 8.45 గంటలకు మాట్లాడారు. భార్య, పాపను వీడియోకాల్‌లో చూస్తూ తాను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌తో కలిసి తమిళనాడు వెళుతున్నానని.. వీలు కుదిరితే సాయంత్రం చేస్తానని టాటా చెప్పిన సాయితేజ.. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఊహించని ఈ ఘటనతో సాయితేజ స్వస్థలం చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామం షాక్‌కు గురైంది. ప్రమాద విషయం తెలుసుకున్న సాయితేజ బంధువులు, స్నేహితులు, సన్నిహితులు మదనపల్లెలో భార్య శ్యామల నివాసం ఉంటున్న ఇంటికి, ఎగువరేగడ గ్రామంలో తల్లిదండ్రుల ఇంటికి చేరుకున్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో సాయితేజ చనిపోయాడని తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని, ఎలాంటి దుర్వార్త ఏ సమయంలో వినాల్సి వస్తోందని బాధాతప్త హృదయాలతో ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. సాయితేజ మరణ వార్త తెలిసి తల్లిదండ్రులు సొమ్మసిల్లి పడిపోయారు. తల్లి భువనేశ్వరిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. సిపాయిగా ఎంపికై.. లాన్స్‌నాయక్ స్థాయికి.. 28 ఏళ్ల సాయితేజ 2013లో బెంగళూరు రెజిమెంట్‌కు ఆర్మీ సిపాయిగా ఎంపికయ్యారు. అక్కడ శిక్షణ పొందుతూ డిపార్ట్మెంట్కు సంబంధించిన పరీక్షలు రాసి ఏడాది తర్వాత ప్యారా కమాండోగా ఎంపికై 11వ పారాలో లాన్స్‌నాయక్‌గా నియమితులయ్యారు. విధి నిర్వహణలో భాగంగా కశ్మీర్, బెంగళూరు హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేశారు. ప్రస్తుతం ఢిల్లీలోబిపిన్ రావత్ వద్ద పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. తల్లి భువనేశ్వరి మాజీ ఎంపీటీసీ, తండ్రి మోహన్ సాధారణ రైతు. తమ్ముడు మహేష్‌ఆర్మీలో సిపాయిగా సిక్కింలో పని చేస్తున్నారు. సాయితేజకు 2016లో శ్యామలతో వివాహం జరిగింది. వీరికి కుమారుడు మోక్షజ్ఞ (5), పాప దర్శిని (2) సంతానం. కుమారుడు మోక్షజ్ఞ చదువు కోసం సాయితేజ భార్య శ్యామల మదనపల్లె ఎస్బీఐ కాలనీ రోడ్ నెం.3లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. సాయితేజ చివరిగా సెప్టెంబర్‌లో వినాయక చవితికి స్వస్థలానికి వచ్చి వెళ్లారు. -
కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. ఇద్దరు పైలెట్లు మృతి
జమ్మూ కశ్మీర్: ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఇద్దరు పైలెట్లలతో ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్‌కు సమీపంలోని శివ్ గఢ్ ధార్ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ఘటనలో వారిద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే, దురదృష్టవశాత్తూ పైలెట్లు ఇద్దరూ అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఆకాశంలో దట్టమైన పొగమంచు వ్యాపించడంతో సిగ్నల్ సరిగా కనిపించక హెలికాప్టర్ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఉధంపూర్ డీఐజీ సులేమాన్ చౌదరి మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందిందని తెలిపారు. శివ్ గఢ్ ధార్‌లో ఘటన స్థలానికి రెస్క్యూ బృందాలను పంపించామని తెలిపారు. ఈ ప్రాంతంలో అధిక పొగమంచు ఉందని తెలిపారు. -
క్రాష్ అయిన నావీ హెలికాప్టర్: వీడియో వైరల్
మెక్సికో సిటీ: మెక్సికోలో ఓ నావీ హెలికాప్టర్ కుప్పకూలింది. లాండింగ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో హెలికాప్టర్ క్రాష్ అయ్యింది. హారికెన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పర్యటనకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ హెలికాప్టర్లో ఉన్న వాళ్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారని నావికాదళ అధికారులు తెలిపారు. హెలికాప్టర్ క్రాష్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి:VIRAL VIDEO: ఇదేం సరదా? ప్రాణాంతకంగా మారిన ఛాలెంజ్ -
ఘోర ప్రమాదం: రాఫెల్ ఫేమ్ ఓలివర్ డసాల్ట్ దుర్మరణం
ప్యారిస్: ఫ్రెంచ్ బిలియనీర్, ఎంపీ, యుద్ధ విమానాల తయారీ సంస్థ రఫేల్‌కు చెందిన ఓలివర్ డసాల్ట్ రాఫెల్ (69) దుర్మరణం తీవ్ర విషాదాన్ని రేపింది. ఫ్రాన్స్‌లోని నార్మాండీ ప్రాంతంలో ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో ఒలీవర్‌తో పాటు పైలెట్ కూడా ప్రాణాలు కోల్పోయారు. హెల్‌కాప్టర్ ప్రమాదంలో ఆలీవర్ దుర్మరణంపై సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. ఫ్రాన్స్‌ను ఎంతగానో ప్రేమించే ఓలివీర్ ఆకస్మిక మరణం తమకు తీరని నష్టమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ ట్వీట్ చేశారు. ఆయన మరణం చాలా బాధాకరం అంటూ కన్జర్వేటివ్ నేత, పారిస్ ప్రాంతీయ అధ్యక్షుడు వాలెరీ పెక్రెస్ ట్విటర్ ద్వారా నివాళులర్పించారు. (Muthoot Group: ఛైర్మన్ జార్జ్ ముత్తూట్ దుర్మరణం) కాగా ఫ్రెంచ్ విమానాల తయారీ దిగ్గజం డసాల్ట్ ఏవియేషన్ వ్యవస్థాపకుడు మార్సెల్ డసాల్ట్ మనవడు ఓలివర్ డసాల్ట్. దివంగత ఫ్రెంచ్ బిలియనీర్ పారిశ్రామికవేత్త సెర్జ్ డసాల్ట్ పెద్ద కుమారుడు. ఓలివర్ 2002లో ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీలోని దిగువ సభకు ఎన్నికయ్యారు. ఓలివర్ ప్రస్తుతం పార్లమెంట్ సభ్యునిగానూ కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం ప్రపంచంలోని బిలీనియర్ల జాబితాలో 361వ స్థానంలో ఒలివర్ ఉన్నారు. ఈయన సంపద 6.3 బిలియన్ యూరోలు. ఒలీవర్ డస్సాల్ట్‌కు ముగ్గురు పిల్లలున్నారు. భారత్‌కు రాఫెల్ యుద్ధవిమానాలను సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. Olivier Dassault aimait la France. Capitaine d’industrie, député, élu local, commandant de réserve dans l’armée de l’air : sa vie durant, il ne cessa de servir notre pays, d’en valoriser les atouts. Son décès brutal est une grande perte. Pensées à sa famille et à ses proches. — Emmanuel Macron (@EmmanuelMacron) March 7, 2021 -
ఆగని కార్చిచ్చు.. పైలట్ మృతి
వాషింగ్టన్: కాలిఫోర్నియాలో చేలరేగిన కార్చిచ్చు చల్లారడం లేదు. మంటలను ఆర్పడానికి పోరాడుతున్న ఒక హెలికాప్టర్ కూలడంతో పైలట్ చనిపోయాడు. గడిచిన 72 గంటల్లో కాలిఫోర్నియా దాదాపు 11,000 మెరుపు దాడులకు గురయ్యింది. ఫలితంగా 367 మంటలు చెలరేగాయి. ఉత్తర కాలిఫోర్నియా వైన్ ప్రాంతంలో 50 కి పైగా నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. అక్కడ నివసిస్తున్న వేలాది మంది తమ ఇళ్ల నుంచి పారిపోయారు. సెంట్రల్ కాలిఫోర్నియాలో, శాన్ఫ్రాన్సిస్కోకు దక్షిణాన 160 మైళ్ళు (258 కి.మీ) దూరంలో ఫ్రెస్నో కౌంటీలో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్న ఒక హెలికాప్టర్ కూలిపోయింది. దాంతో అందులో ఉన్న పైలట్ మృతి చెందాడని కాలిఫోర్నియా అటవీ,అగ్నిమాపక రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. శాన్ఫ్రాన్సిస్సోకు ఉత్తరాన, వాకావిల్లే నగరానికి సమీపంలో 46,000 ఎకరాల (18,615 హెక్టార్ల) విస్తీర్ణంలో కొండలు, పర్వత ప్రాంతాల్లో మంటలు వ్యాపించాయి. ఫలితంగా 50 గృహాలు, ఇతర నిర్మాణాలు కాలి బూడిద అయ్యాయి. సాక్రమెంటోకు నైరుతి దిశలో 30 మైళ్ళ దూరంలో 100,000 మంది నివసిస్తున్న నగరంలో పాక్షిక తరలింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఎల్ఎన్యు లైట్ కాంప్లెక్స్ ఫైర్‌గా పిలవబడే అగ్ని కీలలు పడమటి వైపున ఉన్న గృహాలను తగలబెట్టాయి. జనాలు తమ పశుసంపదను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. చనిపోయిన పశువులు, ఆస్తులకు సంబంధించిన ఫోటోలు ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘గతంలో ఎన్నడు ఇంత తీవ్రమైన మంటలను చూడలేదు. ఎన్నడు లేని వినాశకర పరిస్థితిని ఎదుర్కొంటున్నాము’ అని తెలిపారు. (వైరల్ వీడియో: మంటలార్పడానికి వెళ్తే..) 2017 లో ఉత్తర కాలిఫోర్నియా అంతటా మంటలు సంభవించాయి. ఫలితంగా 44 మంది చనిపోయారు. అనేక వైన్ తయారీ కేంద్రాలు తుడిచిపెట్టుకుపోయాయి. దాదాపు 9,000 గృహాలు, ఇతర నిర్మాణాలు ధ్వంసం అయ్యాయి. పాలో ఆల్టోకు తూర్పున 20 మైళ్ళ దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఎస్సీయూ ఫైర్ కాంప్లెక్స్‌గా పిలువబడే మంటలు రాత్రికి రాత్రే రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం 85,000 ఎకరాలకు పైగా మంటలు విస్తరించాయి. ఆగస్టు సీజడ్యూ ఫైర్ కాంప్లెక్స్ వల్ల చేలరేగిన మంటలు సుమారు 10,000 ఎకరాలకు పైగా వ్యాపించాయి. అలానే పశ్చిమాన, కరువుతో బాధపడుతున్న కొలరాడో బుధవారం చరిత్రలో రెండవ అతిపెద్ద అడవి మంటను ఎదుర్కొంది. పైన్ గుల్చ్ బ్లేజ్ 125,100 ఎకరాలలో కాలిపోవడమే కాక ఉరుములు, మెరుపులు సంభవించాయి. ఈ మంటల విస్తీర్ణం వ్యాప్తి డెన్వర్ నగరం కంటే అధికంగా ఉందని అధికారులు తెలిపారు. -
బాస్కెట్‌బాల్ లెజెండ్ కోబ్ బ్రియాంట్ మృతి
-
ఘోర ప్రమాదం : నేపాల్ మంత్రి దుర్మరణం
ఖట్మాండు : భారత, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగానే సరిహద్దు దేశం నేపాల్‌లో తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్ కుప్పలి కూలిన ఘోర ప్రమాదంలో ఆ దేశ విమానయాన శాఖమంత్రి, మరో ఏడుగురు దుర్మరణం చెందారు .టాపెజంగ్ జిల్లాలోని పాతిభారా సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నేపాల్ పర్యాటక రంగం, పౌర విమానయాన శాఖ మంత్రి రబీంద్ర అధికారి, మరో ఏడురు ఈ ప్రమాదంలో అసువులు బాశారు. హెలికాప్టర్ పైలట్‌తోపాటు మంత్రి భద్రతా సిబ్బంది అర్జున్ గిమిరే, పర్యాటక వ్యాపారి, యతి ఎయిర్‌లైన్స్ డైరెక్టర్,ఎయిర్ డైనాస్టీ ఛైర్మన్ ఆంగ్ చింగ్ షెర్పా, ప్రధాని దగ్గరి బంధువు యబ్బరాజ్ దహల్, సివిల్ ఏవియేషన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ బీరేంద్ర శ్రేష్ట, మరో వ్యక్తి మరణించారు. విమానయాన మంత్రి ఇతర అధికారులతో కలిసి పతిభార దేవాలయాన్నిసందర్శించి, చుహన్ దండలో విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించటానికి వెళుతున్నట్టుసమాచారం. ఈ ప్రాంతంలో భారీ శబ్దంతో పాటు దట్టమైన పొగ అలుముకున్నాయని స్థానికులు తెలిపారని స్థానికఅధికారులు ప్రకటించారు. మరోవైపు ఈ ప్రమాదం నేపథ్యంలో క్యాబినెట్ అత్యవసర సమావేశానికి నేపాల్ ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. -
మెక్సికోలో విషాదం
-
హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్: 13 మంది మృతి
మెక్సికో సిటీ: భూకంపం వచ్చిన ప్రాంతంలో పర్యటించేందుకు మెక్సికో హోంమంత్రి హెలికాప్టర్లో వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో ముగ్గురు చిన్నారులు, ఐదుగురు మహిళలున్నారు. శుక్రవారం మెక్సికో హోం మంత్రి అల్ఫోన్సో నవరెట్, ఓక్సాక స్టేట్ గవర్నర్ అలెజాండ్రో మురాత్లు సైనిక హెలికాప్టర్లో వెళ్తుండగా దాన్ని అత్యవసర పరిస్థితుల్లో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. దీంతో హెలికాప్టర్ దిగిన ప్రాంతంలో ఉన్న 12 మంది అక్కడికక్కడే మరణించగా మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మంత్రి, గవర్నర్లు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. -
ప్లాస్టిక్ సంచుల్లో సైనికుల మృతదేహాలు
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో మృతిచెందిన సైనికుల శరీరాలను ప్లాస్టిక్ సంచుల్లో చుట్టి కార్డుబోర్డుల్లో కుక్కిన ఫొటోలు వెలుగుచూడంతో దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వారి మృతదేహాలు గువాహటికి చేరుకున్న తరువాత ఈ ఫొటోలు తీసినట్లు తెలిసింది. వీటిని చూసిన పలువురు నెటిజన్లు జవాన్లకిస్తున్న గౌరవమిదేనా అంటూ ట్వీటర్ వేదికగా మండిపడ్డారు. అందుబాటులో ఉన్న వనరులతో సైనికుల మృతదేహాలను అలా భద్రపరచాల్సి వచ్చిందని, వారికి పూర్తి మిలిటరీ మర్యాదలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆర్మీ తెలిపింది.