hindu temples
-
ఇస్కాన్ కేంద్రానికి నిప్పు
కోల్‌కతా: బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని ఢాకాలోని ఓ ఇస్కాన్ కేంద్రానికి శనివారం వేకువజామున గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. ధౌర్ గ్రామంలోని నమ్హట్టా ప్రాంతంలో ఉన్న శ్రీ రాధా కృష్ణ ఆలయం, శ్రీ మహాభాగ్య లక్ష్మీ నారాయణ ఆలయాలపై ఈ దాడి జరిగిందని ఇస్కాన్ కోల్‌కతా ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ ‘ఎక్స్’లో వెల్లడించారు. పెట్రోల్ పోసి నిప్పంటించడంతో శ్రీ లక్ష్మీ నారాయణ విగ్రహంతోపాటు అన్ని వస్తువులు పూర్తిగా కాలిపోయాయన్నారు. హిందూమత పెద్ద చిన్మయ్ కృష్ణ దాస్ బెయిలివ్వకుండా జైలులో ఉంచారంటూ...ఆయన భద్రతపై రాధారమణ్ దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇస్కాన్ అనుయాయులు బయట తిరిగేటప్పుడు ముందు జాగ్రత్తగా నుదుటన తిలకం ధరించవద్దని కోరారు. మైనారిటీలకు భద్రత కల్పిస్తామని యూనస్ సారథ్యంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఎక్కడా అమలు కావడం లేదని రాధారమణ్ దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. -
బంగ్లాదేశ్‌లో ఆలయాలు, దుకాణాలపై దాడులు
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో శుక్రవారం హిందువుల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చే పలు ఆందోళనకర పరిణామాలు సంభవించాయి. హిందూ ఆలయాలపై దుండగులు దాడులు చేశారు. హిందువులపై దాడి చేయడంతోపాటు వారి దుకాణాల్లో లూటీకి పాల్పడ్డారు. ఆపైన ఇస్కాన్‌పై నిషేధం విధించాలంటూ ర్యాలీ చేపట్టారు. హిందువులు అత్యధికంగా నివసించే కొత్వాలి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ప్రార్థనల అనంతరం చోటుచేసుకున్న ఘటనలివి. జమాతె ఇస్లామీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ)కి చెందినట్లుగా భావిస్తున్న కొందరు చిట్టగాంగ్‌లోని రాధా గోవింద, సంతానేశ్వరి మాత్రి ఆలయాలపై దాడులకు పాల్పడ్డారు. మైనారిటీ వర్గం ప్రజలపై దాడులు చేశారు. హిందువులు నిర్వహించే దుకాణాలను ధ్వసం చేశారు. భయాందోళనలకు గురైన బాధితులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నారు. అనంతరం దుండగులు ఇస్కాన్‌ను నిషేధించాలంటూ ర్యాలీ చేపట్టారు. ఇన్ని జరుగుతున్నా స్థానిక పోలీస్, ఆర్మీ అధికారులు వారిని తమను కాపాడేందుకు ఏమాత్రం ప్రయతి్నంచకుండా ప్రేక్షకపాత్ర వహించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగిపోయాయి. చిన్మయ్ దాస్ అరెస్ట్‌పై హిందువులు నిరసనలు తెలపడంతో దాడులు మరింతగా పెరిగాయి. చిన్మయ్ దాస్ బ్యాంక్ అకౌంట్ నిలిపివేత హిందూ మత పెద్ద చిన్మయ్ దాస్‌కు చెందిన వివిధ బ్యాంకు అకౌంట్లను బంగ్లాదేశ్ ఆర్థిక విభాగం స్తంభింపజేసింది. రాజద్రోహం నేరం కింద ఈ నెల 25న పోలీసులు చిన్మయ్ దాస్‌ను అరెస్ట్ చేయడం తెలిసిందే. దాస్తోపాటు ఇస్కాన్ సంబంధిత వ్యక్తులకు చెందిన మరో 17 అకౌంట్లను కూడా నెల రోజుల పాటు సీజ్ చేస్తున్నట్లు యంత్రాంగం తెలిపింది. ఈ బ్యాంకు అకౌంట్ల లావాదేవీలన్నిటినీ నిలిపివేయాలని, ఇప్పటి వరకు జరిగిన లావాదేవీల వివరాల్ని అందజేయాలని ఆదేశించినట్లు పేర్కొంది. హిందువుల రక్షణకు చర్యలు తీసుకోండి:భారత్ హిందువుల పెరిగిపోయిన దాడులు, బెదిరింపులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. మైనారిటీలకు భద్రత కల్పించాలన్న బాధ్యతను నెరవేర్చాలని బంగ్లా ప్రభుత్వాన్ని గట్టిగా కోరింది. మైనారిటీలపై దాడులను మీడియా ఎక్కువ చేసి చూపుతోందంటూ కొట్టిపారేయవద్దని విదేశాంగ శాఖ ప్రతినిధి రణదీర్ జైశ్వాల్ బంగ్లా ప్రభుత్వానికి స్పష్టం చేశారు. హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులు ఆందోళనకరమని బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ సారథ్యంలోని ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నామన్నారు. హిందూ మత పెద్ద చిన్మయ్ దాస్‌పై నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు.మైనారిటీల భద్రత బాధ్యత బంగ్లా ప్రభుత్వానిదే: జై శంకర్ బంగ్లాదేశ్‌లోని మైనారిటీల రక్షణ కల్పించాల్సిన ప్రాథమిక బాధ్యత అక్కడి ప్రభుత్వానిదేనని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ శుక్రవారం లోక్‌సభలో అన్నారు. హిందువుల ఆలయాలు, దుకాణాలు, నివాసాలపై పెరిగిపోయిన దాడులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలకు అడ్డుకట్ట వేయాలంటూ అక్కడి ఆపద్ధర్మ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని కూడా చెప్పారు. దుర్గా పూజ సమయంలో మంటపాలపై దాడులు జరుగుతున్న విషయాన్ని అక్కడి ప్రభుత్వానికి తెలపగా రక్షణ కల్పిస్తామని హామీ ఇచి్చందని గుర్తు చేశారు. కోల్‌కతాలో ఇస్కాన్ ర్యాలీ చిన్మయ్ కృష్ణ దాస్నను బంగ్లాదేశ్ అధికారులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కోల్‌కతాలోని అల్బర్ట్ రోడ్లో వరుసగా రెండో రోజు శుక్రవారం ఇస్కాన్‌కు చెందిన పలువురు ప్లకార్డులు చేబూని ‘కీర్తన్’నిర్వహించారు. దాస్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
పాక్‌లో ప్రముఖ ఆలయాలు (ఫొటోలు)
-
Famous Temples In India Photos: భారతదేశంలోని ప్రముఖ హిందూ దేవాలయాలు (ఫొటోలు)
-
స్వరూపానందేంద్ర స్వామీజీ ఆశీస్సులు తీసుకున్న కేసీఆర్
-
బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై విధ్వంసకాండ
ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై గుర్తుతెలియని దుండగులు విధ్వంస కాండకు తెగబడ్డారు. రాత్రికి రాత్రే పక్కా ప్రణాళికలతో విరుచుకుపడి.. థకూర్గావ్ రీజియన్ పరిధిలో ఉన్న 14 ఆలయాలను ధ్వంసం చేసినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. చీకట్లను ఆసరాగా చేసుకుని.. రీజియన్ పరిధిలోని మూడు చోట్ల ఉన్న హిందూ దేవాలయాలపై కొందరు ఆగంతకులు దాడులకు తెగబడ్డారు. సుమారు 14 చోట్ల విగ్రహాలను ధ్వంసం చేశారని బలియాదంగికు చెందిన హిందూ కమ్యూనిటీ నేత వైద్యనాథ్ బర్మన్ వెల్లడించారు. కొన్ని చోట్ల విగ్రహాలను పగలకొట్టారని, మరికొన్ని చోట్ల విగ్రహాలను పెకలించి.. దగ్గర్లో ఉన్న కొలనులో పడేశారని తెలిపారాయన. గతంలో ఇలాంటి ఘటనలు ఏం జరగలేదని.. అక్కడున్న ముస్లిం ప్రజలు కూడా స్నేహపూర్వకంగానే మెలుగుతుంటారని.. కానీ, ఏనాడూ ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోలేదని యూనియన్ పరిషత్ చైర్మన్ సమర్ ఛటర్జీ తెలిపారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం మధ్య ఈ దాడులు కొనసాగాయని బలియాదంగీ పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని, దాడి వెనుక కారణాలను రాబట్టాల్సి ఉందని స్థానిక పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఈ దాడులను ముస్లిం సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అన్నదమ్ముల్లాగా మెదులుతున్న తమ మధ్య చిచ్చుపెట్టే యత్నం చేసిన వాళ్లెవరినీ వదలకూడదని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు ముస్లిం సంఘాల పెద్దలు. ప్రశాంతంగా ఉన్న చోట.. అల్లకల్లోలం సృష్టించేందుకే దాడులు జగిరి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు థాకూర్‌గావ్ పోలీస్ చీఫ్ జహంగీర్ హోస్సేన్. దుండగులు ఎవరైనా సరే.. కఠిన చర్యలు ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాల్లోని హిందూ ఆలయాలపై ఈ మధ్యకాలంలో దాడులు జరిగిన సంగతి తెలిసే ఉంటుంది. -
యూకేలో హిందూ ఆలయాలపై వరుస దాడులు
-
ఎందుకీ విద్వేషపు చిచ్చు ?
ప్రపంచంలో అత్యంత సురక్షిత దేశాల్లో ఒకటిగా కెనడాకు పేరుంది. గతేడాది ప్రపంచ శాంతి సూచిలో ఆరో ర్యాంకు దక్కింది. నేరాలు, ఘర్షణలూ తక్కువే. రాజకీయంగా సుస్థిరమైన ప్రభుత్వం. అలాంటి దేశంలో భారతీయులకు భద్రత ఎందుకు లేదు? వారిపై విద్వేష నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి? కెనడాలో భారతీయులు జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్రం హెచ్చరించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది...? కెనడాలో హిందూ, భారత్ వ్యతిరేక శక్తులు బలపడుతున్నాయి. ఇటీవల అక్కడ హిందూ దేవాలయాలపై వరసగా జరుగుతున్న దాడులు ఆందోళన పెంచుతున్నాయి. టొరంటోలోని స్వామినారాయణ మందిరంపై కొన్నాళ్ల క్రితం కొందరు దుండగులు దాడులు చేస్తూ ఖలిస్తాన్ జిందాబాద్, హిందూస్తాన్ ముర్దాబాద్ అంటూ చేసిన నినాదాలతో భారతీయులు ఉలిక్కిపడ్డారు. జూలైలో గ్రేటర్ టొరంటో ప్రాంతంలోని రిచ్మండ్ హిల్‌లో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వీటి వెనక ఖలీస్తాన్ ఉగ్రవాదుల హస్తముందని ఆధారాలున్నా కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం భారత్‌కు ఆగ్రహం తెప్పిస్తోంది. అధికార లిబరల్ పార్టీ ఎంపీ, ప్రవాస భారతీయుడు చంద్ర ఆర్య వీటిని పార్లమెంటులో లేవనెత్తారు. భారత్‌పై, హిందూ మతంపై విద్వేషం వెళ్లగక్కుతున్నారన్నారు. ఖలిస్తానీల అడ్డా? కెనడా కొన్నేళ్లుగా ఖలిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత వ్యతిరేక అజెండాతో పని చేస్తున్న వీరంతా ప్రత్యేక ఖలిస్తాన్ ఉద్యమం కోసం కెనడాను వాడుకుంటున్నారు. భారత్ నిషేధించిన సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) సెప్టెంబర్ 18న ఖలిస్తాన్ రిఫరెండాన్ని నిర్వహించింది. దీన్ని నిలిపేయాలని భారత్ కోరినా కెనడా పట్టించుకోలేదు. లౌకిక దేశమైన తాము ప్రజాభిప్రాయ సేకరణలను అడ్డుకోబోమని తేల్చి చెప్పింది. ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థలైన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్, ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ వంటివి కెనడా గడ్డ నుంచి భారత్‌లో మత ఘర్షణలకు ప్రయత్నిస్తున్నాయి. 2018 నుంచి కెనడాలో భారత్ వ్యతిరేక కార్యకలాపాలు పెరిగాయి. బ్రాంప్టన్‌లో గౌరీశంకర్, జగన్నాథాలయం, మిసిసాపలో హిందూ హెరిటేజ్ సెంటర్‌పై దాడులు జరిగాయి. ఇదంతా కెనడాలో ఉంటూ భారత్‌ను అస్థిరపరిచే కుట్రేనని గతేడాది అక్కడ పర్యటించిన జాతీయ దర్యాప్తు సంస్థ తేల్చింది. కెనడాలో భారతీయం కెనడాలో మొదట్నుంచి భారతీయుల ప్రాబల్యం ఎక్కువే. ప్రస్తుతం అక్కడ 16 లక్షల మంది (4 శాతం) భారతీయులున్నారు. వీరిలో లక్ష మందికి పైగా శాశ్వత పౌరసత్వముంది. ఎక్కువగా పంజాబీలే కెనడా వెళుతుంటారు. ఆ దేశంలో అత్యధికంగా మాట్లాడే 10 భాషల్లో పంజాబీ కూడా ఉంది. చట్టసభల్లోనూ భారతీయులు సత్తా చాటారు. 2015లో 21 మంది భారత సంతతికి వారు ఎంపీలయ్యారు. 2019లో 23కు పెరిగారు. కెనడా రక్షణ మంత్రి హర్జిత్ సింగ్ సజ్జన్ కూడా భారతీయ మూలాలున్న వ్యక్తే! జర భద్రం: కేంద్రం ‘‘కెనడాలో జాతి విద్వేష నేరాలు, వర్గ హింస, భారత్ వ్యతిరేక కార్యక్రమాలు విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి అక్కడి భారతీయులంతా జాగ్రత్తగా ఉండాలి’’ అంటూ విదేశాంగ శాఖ శుక్రవారం హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే ఒట్టావాలోని భారతీయ హైకమిషన్, టొరంటోలో దౌత్య కార్యాలయాలను సంప్రదించాలని సూచించింది. ఇటీవలి నేరాలపై సమగ్ర విచారణ జరపాలని కెనడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సామాన్య శూద్రుడికి సెయింట్‌హుడ్
భారతదేశంలో సామాన్య మానవుడైన దేవసహాయం లేదా లాజరస్ (1712–1752)ను వాటికన్ 2022 మే 15న ‘పునీత హోదా’(సెయింట్ హుడ్)గా ప్రకటించడం అనేక రకాలుగా చారిత్రాత్మకమైనది. సెయింట్ పీటర్ లేదా మదర్ థెరీసా స్థాయిని కల్పించడంతో ఇది సమానం. పుట్టుక, పెరుగుదల, చావు వరకూ హింసాత్మక జీవితాన్ని గడిపిన అతి సామాన్యుడు సెయింట్‌గా మారడం మానవ మత చరిత్రలో ఎన్నడూ చూసి ఉండం. నీలకంఠ పిళ్లైగా జన్మించిన దేవసహాయం కుల వ్యవస్థ కారణంగానే తనచుట్టూ ఉన్న లక్షలాది మంది మగ్గిపోతున్నారని గ్రహించాడు. మానవజాతిలోని సమస్త బానిసత్వానికి వ్యతిరేకంగా జీసస్ ఎలా దారి చూపాడో, దేవసహాయం కూడా తన మరణం ద్వారా భారత్‌లోని శూద్రులకు అలాంటి దారి చూపాడు. హిందూ దేవాలయాల్లో ప్రార్థించినట్లు గానే, స్త్రీ పురుషులు తమకు కానుకలు (క్రైస్తవ సంప్రదాయంలో అద్భుతాలు) ఇవ్వాలని దేవసహాయంను వేడుకునే వారు. ఆయన విగ్రహం మెడలో రంగురంగుల పూలదండలను అలంకరించి పూజలు చేసేవారు. పొట్టలోనే మరణించిన తన గర్భస్థ పిండాన్ని తాను ప్రార్థించిన వెంటనే సజీవమైన పసిపాపగా చేశాడని ఒక మహిళ ఆ మహిమ గురించి పేర్కొనడం దేవసహాయంకు సెయింట్‌హుడ్ ఇవ్వడానికి గల ఆధారాలలో ఒకటయింది. శూద్ర మహిళలపై ఘోరమైన కుల, ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధనాలు బిగించిన వ్యవస్థలో దేవసహాయం జన్మించాడు. తల్లి దేవకి అమ్మ. ఈమె కేరళలో నాయర్ అని పిలిచే శూద్ర వ్యవసాయ ఉత్పాదక కులానికి చెందిన వ్యక్తి. హిందూ ఆలయంలో పూజలు నిర్వహించే వాసుదేవన్ నంబూద్రి అనే బ్రాహ్మణ పూజారికి పుట్టిన సంతానమే దేవసహాయం (మతం మారడానికి ముందుపేరు నీలకంఠన్ పిళ్లై). దేవకి అమ్మ, వాసుదేవన్ నంబూద్రి మధ్య ‘సంబంధం’ వారి మధ్య ప్రేమ వ్యవహారం లేదా వారు వివాహం చేసుకున్న కారణంగా ఏర్పడిన సంబంధం కాదు. నంబూద్రికి ఆమె లొంగిపోవడం అనేది నాయర్ మహిళలతో లైంగిక సంబంధాలను నిర్బంధపూరితంగా బ్రాహ్మణులు పెట్టుకునే కులకట్టు బాటులో భాగంగా జరిగింది. ఇలాంటి లైంగిక బంధాన్ని ‘సంబంధం’ అని పిలిచేవారు. ఒక శూద్రుడిగా ఇలాంటి మానవ హింస ద్వారానే బాల్యం నుంచి పెద్ద వయసు వరకూ అనుభవిస్తూ వచ్చాడు దేవసహాయం. బ్రాహ్మణ నిర్దేశకత్వంలోని ఈ సంబంధంలోని హింసాత్మక భాగం ఏమిటంటే, పిల్లలు తమకు జన్మనిచ్చిన తండ్రి ఎవరు అనేది తెలుసు కోవలసి ఉంటుంది. పైగా ఈ సంబంధం ద్వారా పుట్టిన పిల్లలు తల్లివద్ద లేక ఆమె పుట్టింట్లో పెరగాలి లేదా వ్యవసాయ పనులు చేసుకుంటూ బయట గడపాలి. చాలామంది నాయర్ కుటుంబాలు ఇలాంటి వివాహేతర సంబంధం ద్వారా పుట్టిన తమ కుమార్తెల పిల్లలను ఆమోదించి వారికి కొన్ని ఆస్తి హక్కులు కల్పించేవారు. కానీ ‘సంబంధం’లో పుట్టిన పిల్లలు తండ్రి, తల్లితో పాటు ఇతర పిల్లలు ఉన్న కుటుంబాల్లో జీవించవలసి వస్తే అది ఘోరమైన చిత్రహింస లతో కూడిన జీవితాన్ని కలిగిస్తుంది. దీనిలో ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే ఇలాంటి పిల్లలను దేవుడి బిడ్డల్లాగే చూసేవారు. వీళ్లు దేవుడిచ్చిన దౌర్భాగ్యాన్ని అనుభవిస్తూ దానికి ఎదురు తిరగలేక జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. హిందూమతంలోని అలాంటి అమానుష జీవితానికి వ్యతి రేకంగా నీలకంఠన్ పిళ్లై తిరగబడి క్రైస్తవ మతం పుచ్చుకున్నాడు. ఆనాటి పూజారి వర్గం, క్షత్రియుల నియంత్రణలో ఉన్న రాజ్యం ఈ మతమార్పిడిని ఘోరాతిఘోరమైన నేరంగా భావించింది. క్రైస్తవు డిగా మారిన తర్వాత, దేవసహాయం కుల వ్యవస్థ కారణంగానే తన చుట్టూ ఉన్న లక్షలాది మంది ప్రజలు మగ్గిపోతున్నారని గ్రహించాడు. దీంతో దిగువ కులాలతో కలవటం ప్రారంభించాడు. కేరళలో ఇప్పటికీ నాయర్ కులం శూద్ర వ్యవసాయ కులంలో ఉన్నత శ్రేణిలో ఉంటోంది. అదే సమయంలో నాయర్లకు జంధ్యం ధరించే హక్కు లేదు. వీరికి సంçస్కృత గ్రంథాలు చదివే హక్కు లేదు. హిందూ ఆలయాల్లో వీరు పూజారులు కాలేరు. దేవసహాయం అన్ని కులాల ప్రజలతో కలిశాడనీ, అస్పృశ్యులతో కలిసి భోంచేయడం కొనసాగించాడనీ జనం చెప్పుకునేవారు. ఇది జీసస్ స్వయంగా ఇజ్రాయెల్‌లో అన్యజనులు, వ్యభిచారిణిలతో కలిసిన దానితో సమానం అని చెప్పుకోవచ్చు. వికీపీడియాలోని వివ రాల ప్రకారం, రాజ్యంలోని బ్రాహ్మణ పూజారి, భూస్వామ్య ప్రభువులు, రాజకుటుంబ సభ్యులు, నాయర్ కమ్యూనిటీ కలిసి దేవన్ లేదా రామయ్యన్ దలవా వద్ద దేవ సహాయంపై ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. శూద్రుల చారిత్రక బానిసత్వం, అదనంగా సంబంధం పేరిట స్త్రీ పురుషుల బంధంలో అత్యంత అవమానాలు భరించిన నాయర్ కమ్యూనిటీ కూడా విముక్తి ప్రదాత అయిన దేవసహాయంను చిత్రహింసలు పెట్టి వధించడంలో పూజారులతో, రాజుతో కలిసి పోయారు. శూద్రులలోని ఈ ప్రతిఘాతుక చైతన్యమే భారతదేశాన్ని చిరకాల బానిసల భూమిగా మార్చివేసింది. రెండువేల సంవత్సరాల క్రితం మానవజాతిలోని సమస్త బానిసత్వానికి వ్యతిరేకంగా జీసస్ ఎలా దారి చూపాడో, దేవసహాయం కూడా తన మరణం ద్వారా భారత దేశంలోని శూద్రులకు అలాంటి దారి చూపాడు. ఇప్పటికీ శూద్రులలో ఆధ్యాత్మిక బానిసత్వం కొనసాగుతోంది. క్రిస్టియన్‌గా మారిన తర్వాత దేవసహాయం మహారాజా మార్తాండవర్మ రాజ్యంలో నివసించసాగాడు. క్రిస్టియానిటీని స్వీకరిం చిన నాటికి ఆ రాజ్యంలో మంచి స్థానంలోనే ఉండేవాడు. కానీ 40 ఏళ్ల వయసులో అంటే 1752 సంవత్సరంలో అతడిని చంపేశారు. తమిళ–మలయాళీ ప్రాంతాన్ని చాలా కాలం పరిపాలించిన వర్మలు క్షత్రియులు. జీసస్‌ను శిలువ వేసిన కాలంలో జెరూసలెంలోని ఫరిసీ కౌన్సెల్ నాటి రోమన్ పాలకులపై ఒత్తిడి తెచ్చినట్లే, భారత ఉప ఖండం మొత్తంలో క్షత్రియులు పాలిస్తున్న రాజ్యాలకు బ్రాహ్మణులు న్యాయ శాసనాలు రచించేవారు. మరణ శిక్ష విధిస్తున్న సమయంలో రోమన్ పాలకుడు పొంటియనస్ పిలేట్, జీసస్ పట్ల మరీ కఠినంగా వ్యవహరించాలని అనుకోలేదు. కానీ అప్పటి పూజారి వర్గ మండలి అత్యంత క్రూరంగా వ్యవహరించి జీసస్‌కి శిలువ విధించింది. తలపై ముళ్ల కిరీటం పెట్టారు. గోల్గోతాలోని శిలువ వేసే ప్రాంతం వరకూ ఆయనపై శిలువ మోపి నడిపించారు. బ్రాహ్మణ ఆధిపత్యంనుంచి శూద్రులకు ఏవిధంగానూ విముక్తి లభించని విధంగా ప్రాచీన బ్రాహ్మణ న్యాయ శాస్త్రమైన మను ధర్మ శాస్త్రం శాసనాలు రూపొందిం చింది. అందుకే దేవసహాయం బ్రాహ్మణాధిపత్య హిందూయిజం నుంచి బయటపడినప్పటికీ అతడిని చిత్రహింసలు పెట్టాలని పూజారి వర్గం నిర్ణయించుకుంది. దళితులు, మత్స్యకారులు, వడ్రంగులు, గొర్రెల కాపర్లు, కుమ్మ రులు, ఇనుము, బంగారు నగల పనివారితో కలిసి భోంచేయటం ద్వారా దేవసహాయం కుల వ్యవస్థను ధ్వంసం చేయడానికి ప్రయ త్నించాడని ఆరోపించారు. పైగా మతమార్పిడిలను అతడు ప్రోత్స హించాడనీ, విదేశీయులకు సమాచారం ఇవ్వడం ద్వారా రాజద్రోహా నికి పూనుకున్నాడనీ ఆరోపణలు గుప్పించారు. జీసస్‌కి లాగే ముందుగా అతడిని నిర్బంధించి చిత్రహింసల ఏకాంత గదిలో ఉంచారు. మూడేళ్ల తర్వాత దేవసహాయాన్ని గొడ్డును బాదినట్లు బాది, గేదెపై కూర్చోబెట్టారు. గేదెను పురాణ గ్రంథాల ప్రకారం మృత్యుదేవత అయిన యుముడి వాహనంగా వర్ణించేవారు. గేదె వెనుక వైపు అతడిని తిప్పి గ్రామాల్లో ఊరేగిస్తూ కొరడాలతో కొట్టారు. భారతీయ ఉపఖండం మొత్తంలో అత్యధికంగా పాలను ఇచ్చే జంతువు గేదె. కానీ అది నల్లగా ఉంటుంది కాబట్టి బ్రహ్మణ పూజా రులు, క్షత్రియ పాలకులు దాన్ని దయ్యపు జంతువుగా భావించేవారు. జీసస్కు గాడిద వాహనమైనట్లే, దేవసహాయానికి గేదె దేవుడిచ్చిన వాహనంగా మారింది. ఆ గేదె ముందుకు కదులుతుండగా, రక్తమోడే టట్లు దేవసహాయాన్ని బాదారు. రోజుల తరబడి అతడికి కనీసం ఆహారం, నీరు అందించకుండా గేదెపై ఊరేగిస్తూ చిత్రహింసలు పెట్టారు. అతడిని ఎలా హింసిస్తున్నారో, బాధపెడుతున్నారో అతడి భార్య స్వయంగా చూసేలా నిర్బంధించారు. చివరకు అతడిని రాళ్లు, పొదలతో ఉన్న అడవిలో కాల్చేశారు. ఇప్పుడు దేవసహాయం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సెయింట్ అయ్యాడు. సెయింట్‌గా మారిన సాధారణ మానవుడు దేవసహాయం. ప్రపంచ ఆధ్యాత్మిక వ్యవస్థలపై ఇది తీవ్ర ప్రభావం కలిగిస్తుంది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
మూలవిరాట్టు కన్నా ముందు మొక్కాల్సింది అక్కడే! నారేప ప్రత్యేకతే వేరు!
బుట్టాయగూడెం (పశ్చిమగోదావరి): దేవుడి దర్శనం కోసం భక్తులు ఏ ఆలయానికి వెళ్లినా ముందుగా గుడి ముందు ఉన్న ధ్వజస్తంభానికి మొక్కుకున్నాకే గుడి లోపలకు వెళ్లి మూలవిరాట్టును దర్శించుకుంటారు. ధ్వజస్తంభంలోనూ దైవశక్తి ఉంటుందని ఆగమశాస్త్రం చెబుతోంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన ధ్వజస్తంభాల తయారీకి ప్రకృతిలో ఎన్ని చెట్లు ఉన్నప్పటికీ అత్యధికంగా ఉపయోగిస్తున్నది మాత్రం నారేప చెట్టునే. ఈ చెట్టు బలంగా, ఎత్తుగా పెరగటమే కాకుండా కలప ఎన్నాళ్లయినా చెక్కు చెదరకుండా ఉండడమే ఇందుకు కారణం. (చదవండి: నిశ్చితార్ధం ఫిక్స్ అయింది కదా అని, వ్యక్తిగత వీడియోలు షేర్ చేసినందుకు..) వీటి ప్రత్యేకతే వేరు.. దేవాలయాల ఎదుట ప్రతిష్టించే ధ్వజస్తంభం తయారీకి సోమి చెట్టు, టేకు, నారేప చెట్టుతో పాటు ఇంకొన్ని రకాల వృక్ష జాతులను కూడా వినియోగిస్తుంటారు. అయితే ఎక్కువగా వినియోగించేది మాత్రం నారేప చెట్లను, తర్వాత సోమి చెట్లనే. వృక్ష జాతుల్లో నారేపకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. నారేప చెట్ల కర్రలకు చెదలు పట్టవు. ఈ చెట్టు కర్రతో తయారుచేసిన ధ్వజస్తంభం దశాబ్దాల పాటు పటిష్టంగా ఉంటుంది. ప్రకృతి విపత్తులు వచ్చినా తట్టుకునే స్వభావం నారేప సొంతం. నారేప వృక్షం 50 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. చుట్టుకొలత 40 నుంచి 50 అంగుళాలు ఉంటుంది. ఈ చెట్లు దట్టమైన అటవీ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంటాయి. గోదావరి పరీవాహక అటవీ ప్రదేశాల్లో కూడా నారేప వృక్షాలు దర్శనమిస్తుంటాయి. పాపికొండల అభయారణ్యంతో పాటు ఏలూరు జిల్లాలోని బుట్టాయగూడెం, వేలేరుపాడు, కుక్కనూరు మండలాల పరిధిలోని అటవీ ప్రాంతంలో ఎక్కువగా నారేప చెట్లు ఉన్నాయి. అరుదైన నారేప వృక్షజాతిని కాపాడేందుకు పశ్చిమ మన్యంలోని ఏపీ అటవీ శాఖ అధికారులు నర్సరీల్లో నారేప మొక్కలను పెంచుతున్నారు. గతంతో పోల్చుకుంటే ఈ ప్రాంతంలో నారేప చెట్ల సంఖ్య క్రమంగా తగ్గిపోవడంతో నర్సరీల ద్వారా వీటి పెంపకాన్ని చేపట్టినట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. నర్సరీల్లో నారేప మొక్కల పెంపకం చదవండి 👉🏼ఫైబర్, ఐరన్ అధికం.. బరువు తగ్గాలనుకుంటే ఈ జ్యూస్ తాగితే! 👉🏼 జగన్ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికే ‘అధర్మ యుద్ధం’ -
బంగ్లాదేశ్‌లో దుర్గాదేవి మండపాలు ధ్వంసం
ఢాకా: దసరా వేడుకల వేళ బంగ్లాదేశ్‌లో దుర్గామాతకి తీవ్ర అపచారం జరిగింది. క్యుమిలియా జిల్లాలో దుర్గా దేవి మండపాలను కొందరు దుండగులు ధ్వంసం చేశారు. పలు జిల్లాల్లో హిందూ దేవాలయాలపై దాడులకు దిగారు. దుర్గ దేవి కొలువుదీరిన మండపాల వద్ద ఖురాన్‌ను అపవిత్రం చేశారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో దుండగులు మండపాలపై దాడికి దిగి ధ్వంసం చేశారు. దీంతో ప్రభుత్వం పోలీసుల్ని రంగంలోకి దింపింది. అదనపు భద్రతా బలగాలను మోహరించింది. 22 జిల్లాల్లో హై అలెర్ట్ ప్రకటించింది. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకి మధ్య చెలరేగిన ఘర్షణల్లో నలుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. చాందీపూర్ హజీగంజ్, బన్షఖాలి, షిబ్‌గంజ్, కాక్స్ బజార్ తదితర ప్రాంతాల్లో దుర్గాదేవి విగ్రహాలను ధ్వంసం చేసినట్టుగా బంగ్లాదేశ్ మీడియా వెల్లడించింది. ఈ ఘటనలపై బంగ్లా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. కాగా ఈ దాడుల వెనుక జమాత్–ఇ–ఇస్లామీ హస్తం ఉందని బంగ్లాదేశ్ అధికారులు తెలిపారు. షేక్ హసీనా ప్రభుత్వానికి అంతర్జాతీయంగా మచ్చ తీసుకురావడానికి, మత ఘర్షణలు రాజేయడానికే వారు ఈ పని చేశారని చెప్పారు. కొన్ని మండపాల్లో దుర్గమ్మ పాదాల చెంత పవిత్ర ఖురాన్‌ను ఉంచారు. ఈ విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఘర్షణలు చెలరేగాయి. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం దుర్గాదేవి మండపాలు మూడు వేలు ఉన్నాయి. -
హే రామ్.. తుఝే సలామ్
సాక్షి, గుంటూరు: ‘రామ్ రహీమ్ ఏక్ హై’ అని శతాబ్దాల క్రితమే గళమెత్తాడు భక్త కబీర్దాస్. అదే భావంతో.. అదే బాటలో పయనిస్తూ.. హిందూ బంధువుల ఆధ్యాత్మిక చింతనకు ధ్వజాలు ఎత్తుతున్నారు ఈ ముసల్మాన్లు. గుంటూరు జిల్లా మాచవరం మండలం తురక పాలెం గ్రామంలోని ముస్లిం శిల్పకారులు ధ్వజస్తంభాలు చెక్కడంలో నేర్పరులు. తరతరాలుగా హిందూ ఆలయాలకు ధ్వజ స్తంభాలను చెక్కే వృత్తిలోనే కొనసాగుతూ.. రాముడైనా.. రహీమ్ అయినా తమకొక్కటేనని చాటుతున్నారు. వంద కుటుంబాలకు ఇదే వృత్తి ► సుమారు వందేళ్ల క్రితం తురక పాలెం గ్రామానికి చెందిన కరీమ్ సాహెబ్ ధ్వజస్తంభాలు చెక్కడం ప్రారంభించారు. ► తర్వాతి రోజుల్లో ఆయన కుటుంబీకులతోపాటు గ్రామానికి చెందిన మరికొన్ని ముస్లిం కుటుంబాలు దీనినే వృత్తిగా చేసుకున్నాయి. ► కరీమ్ సాహెబ్ నాలుగో తరానికి చెందిన కుటుంబాలు కూడా నేటికీ ఇదే వృత్తిలో రాణిస్తున్నాయి. ► ప్రస్తుతం గ్రామంలో వందకు పైగా కుటుంబాలు శిల్పాలతో కూడిన ధ్వజస్తంభాలు చెక్కుతున్నాయి. బండల్ని తొలిచి.. ► తురకపాలెం గ్రామ పరిసర ప్రాంతాల్లోని క్వారీల్లో పెద్ద పెద్ద బండలను తొలిచి ధ్వజస్తంభం ఆకృతులుగా మలుస్తారు. ► ఒక్కొక్క ధ్వజస్తంభం 20 నుంచి 40 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. ► ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక ప్రాంతానికి కూడా ఇక్కడి నుంచి ధ్వజస్తంభాలు సరఫరా అవుతుంటాయి. ► ధ్వజస్తంభాన్ని చెక్కడం, లారీలోకి ఎక్కించి ఆలయానికి చేర్చే బాధ్యత వీరే చేపడతారు. మార్గమధ్యంలో దురదృష్టవశాత్తూ ధ్వజ స్తంభం విరిగితే మళ్లీ కొత్తది తయారు చేసి అందిస్తారు. ► ధ్వజస్తంభం ఎత్తును బట్టి అడుగుకు రూ.3,500 నుంచి రూ.4 వేల చొప్పున ధర ఉంటుంది. ► ఒక్కో స్తంభం చెక్కడానికి 20 నుంచి 30 రోజుల సమయం పడుతుంది. 30 ఏళ్లుగా ఇదే వృత్తి 30 ఏళ్లుగా ఇదే వృత్తి చేస్తున్నాను. తాతల నుంచి వస్తున్న వృత్తిని వదిలి వేరే పనికి వెళ్లడానికి మనసు ఒప్పుకోదు. ఆర్థిక ఇబ్బందులున్నా ఈ వృత్తిని ఎంతో ప్రేమతో కొనసాగిస్తున్నాం. ప్రస్తుత తరం వాళ్లు ఈ వృత్తిని చేపట్టడానికి మొగ్గు చూపడం లేదు. మాతోనే ఈ కళ కనుమరుగవుతుందేమో అనే బాధ ఉంది. – షేక్ అల్లాబక్షు, శిల్పకారుడు మా కళను గుర్తిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఆలయాలు నిర్మించినా.. ఆ కమిటీల వాళ్లు మా కళను గుర్తించి ధ్వజస్తంభం ఆర్డర్ ఇవ్వడానికి ఇక్కడకే వస్తారు. మా కళను గుర్తించి వాళ్లు రావడం ఎంతో ఆనందంగా ఉంటుంది. కరోనా నేపథ్యంలో కొత్త ఆలయాల నిర్మాణాలు లేకపోవడంతో ప్రస్తుతం పెద్దగా ఆర్డర్లు లేవు. – షేక్ పెంటుసా, శిల్పకారుడు -
ఆలయ నిధులు కరోనాకు ఖర్చు పెట్టరాదా!
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులో కరోనా వైరస్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి పది కోట్ల రూపాయల నిధులను మిగులు నిధుల నుంచి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోని 47 హిందూ దేవాలయాలకు ఏప్రిల్ 22వ తేదీన ఓ సర్కులర్‌ను జారీ చేసింది. వాస్తవంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పరిధిలో దాదాపు నాలుగు వేల దేవాలయాలు ఉండగా, అధిక ఆదాయం కలిగిన ఆ 47 దేవాలయాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. అది ఆలయ నిధులను దుర్వినియోగం చేయడమేనంటూ రెండు వారాలపాటు దాని మీద వివాదం చెలరేగడం, కొన్ని హిందూ శక్తులు తమిళనాడు హైకోర్టులో సవాల్ చేయడంతో చివరకు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వివాదాస్పదమైన సర్యులర్‌ను తమిళనాడు ప్రభుత్వం ఉపసంహరించుకుంది. (చదవండి : లాక్డౌన్ పొడగించాల్సిందేనట!) దీంతో అసలు హిందూ దేవాలయాలపై ప్రభుత్వం పెత్తనం అవసరమా ? అన్న అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. దేశ స్వాతంత్య్రానికి పూర్వమే అంటే, 1789 సంవత్సరం నుంచే హిందూ దేవాలయాలు ప్రభుత్వం ఆధీనంలో ఉంటూ వస్తున్నాయి. బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1789లో ‘మద్రాస్‌ప్రెసిడెన్సీ’లో బోర్డ్ ఆణ్ రెవెన్యూను ఏర్పాటు చేసింది. ఆ బోర్డు కింద ఆలయాల అజమాయిషి ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నప్పటికీ పూజారులైన బ్రాహ్మణుల పెత్తనాన్ని అనుమతిస్తూ వచ్చారు. ఆలయాలతోపాటు మఠాలు, పీఠాలను కూడా బ్రిటిష్ ప్రభుత్వం హయాంలోకి తీసుకుంటూ 1840 చట్టం తీసుకొచ్చింది. జస్టిస్ పార్టీ హయాంలో 1925లో తమిళనాడుకు ‘మద్రాస్ హిందూ రిలీజియస్ యాక్ట్’ వచ్చింది. అది కాస్త 1936లో ‘హిందూ రిలీజియస్ ఎండోమెంట్ బోర్డు’ ఏర్పాటుకు దారితీసింది. (చదవండి : లాక్డౌన్4పై మోదీ కీలక వ్యాఖ్యలు ) అది 1940 దశకం అనేక మార్పులకు చేర్పులకు గురవుతూ 1959లో తమిళనాడులోని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ‘హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ యాక్ట్’గా మారింది. 1969లో ద్రావిడ మున్నేట్ర కళగం ప్రభుత్వం భారీ మార్పులు తెచ్చింది. ఆ తర్వాత ఎంజీ రామచంద్రన్ నాయకత్వంలో ఏఐఏడీఎంకే ప్రభుత్వం పేదలకు సహాయం చేసేందుకు 1983లో 32–బి సెక్షన్‌ను తెచ్చారు. ఆలయ మిగులు నిధులను పేదల వసతి, తిండి కోసం ఖర్చు పెట్టేందుకు ఈ సెక్షన్ అనుమతిస్తోంది. ఈ సెక్షన్ కిందనే ప్రస్తుత తమిళనాడు ప్రభుత్వం మిగులు నిధుల నుంచి పది కోట్ల రూపాయలను కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.(చదవండి : ప్రపంచంలో 82 కోట్ల మంది ఆకలి కేకలు) లాక్డౌన్ కారణంగా పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భోజన సదుపాయాలను ఏర్పాటు చేసింది. అలాంటప్పుడు సీఏం సహాయ నిధి అడిగే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్న వాదన ప్రభుత్వానిది. అయితే దీన్ని ఆర్ఎస్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించడం, స్థానిక హిందూ పత్రికలు హైకోర్టుకు వెళ్లడంతో ప్రభుత్వం నోటిఫికేషన్‌ను ఉపసంహిరించుకుంటున్నట్లు ప్రకటించింది. కోర్టు తీర్పునకు వదిలేసినట్లయితే కొన్ని దశాబ్దాల వివాదానికి తెరపడి ఉండేదేమో! -
ఆలయాలు రాజకీయ అడ్డాలయ్యాయి..
సాక్షి, కొత్తగూడెం: దేశవ్యాప్తంగా అన్ని హిందూ దేవాలయాలు ‘రాజకీయ’ కబంధ హస్తాల నుంచి త్వరలో బయటప డనున్నాయని శ్రీపీఠం వ్యవస్థాపకుడు స్వామి పరిపూర్ణా నంద అన్నారు. ఆదివారం ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో నిర్వహించిన లక్షదీపోత్సవానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. హిందూ దేవాలయాలు రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నప్పటికీ రాజ కీయ అడ్డాలుగా మారిపోయాయన్నారు. ఆలయాల్లో ఆధ్యాత్మిక, ధార్మిక చైతన్యం కలిగించే వాతావరణం నెలకొల్పాల్సిన అవస రముందన్నారు. ఆలయాలు హిందువుల సొత్తని.. అవి హిందువులకే ఉపయోగపడా లని పేర్కొన్నారు. దేవాలయాల్లో హిందూ భావజాలం, సంస్కృతి రూపు దిద్దుకునేలా మోదీ ప్రభుత్వం వ్యూహరచన చేసిందని చెప్పారు. హిందూ దేవాలయాల విషయమై పదేళ్లుగా తాము సుప్రీంకోర్టులో న్యాయపో రాటం చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న దేవాలయాల నిర్వహణ, విధివిధానాల రూపకల్పన తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసు కోవాలని నిర్ణయించిందన్నారు. ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. దీనిపై ఇప్పటికే బీజేపీ ఎంపీ సత్యపాల్‌సింగ్ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారని, ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉందని అన్నారు. -
దైవదూషణ: హిందువుల ఇళ్లు, ఆలయాలపై దాడి
కరాచీ: పాకిస్థాన్ సింధ్ ప్రావిన్స్‌లోని ఘోట్కి పట్టణంలో హిందువుల ఇళ్లు, ఆలయాలు లక్ష్యంగా దాడులు జరిగాయి. ఓ స్కూలుకు చెందిన హిందూ ప్రిన్సిపాల్ దైవదూషణ చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా హింస చెలరేగింది. ఘోట్కి పట్టణంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, మూకదాడులపై పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడ చోటుచేసుకున్న మూక దాడుల్లో హిందువుల ఇళ్లు, దుకాణాలు, ఆలయాలు ధ్వంసమైనట్టు మానవ హక్కుల సంస్థ ట్విటర్లో పేర్కొంది. వరల్డ్ సింధీ కాంగ్రెస్ అనే సంస్థ కూడా ఘోట్కి పట్టణంలో చోటుచేసుకున్న మూకదాడులపై ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్థాన్‌లోని మతమైనారిటీలకు రక్షణ కల్పించేవిధంగా ఇతర దేశాలు ఆ దేశంపై ఒత్తిడి తీసుకురావాలని అభ్యర్థించింది. ‘ఘోట్కి పట్టణంలోని హిందూ కమ్యూనిటీపై దాడులు జరుగుతున్నాయి. హిందూ స్కూల్ ప్రిన్సిపాల్ దైవదూషణ చేశాడని ఓ విద్యార్థి ఆరోపించడంతో ప్రిన్సిపాల్ స్కూలుతోపాటు హిందువుల ఆలయాలు, దుకాణాలు, ఇళ్లను ధ్వంసం చేశారు’ అని వరల్డ్ సింధీ కాంగ్రెస్ ట్విటర్లో పేర్కొంది. ఘోట్కి పట్టణంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు పేర్కొన్నట్టు పాక్ మీడియా పేర్కొంది. దైవదూషణ చేసిన హిందు ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నట్టు తెలిపింది. అధికారులు మాత్రం దాడులకు కారణమైన గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఘోట్కితోపాటు మీర్పూర్ మథెలో, అదిల్‌పూర్ ప్రాంతాల్లో కూడా హింస చోటుచేసుకున్నట్టు డాన్ పత్రిక పేర్కొంది. భారత్‌లో మత మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని, వారికి రక్షణ లేకుండాపోయిందని ఒకవైపు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్న సమయంలోనే పాక్‌లోని హిందు మైనారిటీలపై దాడులు జరగడం గమనార్హం. -
కేరళకు ప్రముఖ ఆలయాల విరాళాలు
సాక్షి,హైదరాబాద్ : కేరళలో ప్రకృతి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. అక్కడ సంభవించిన వరదల్లో ఆస్తి నష్టంతో పాటు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దేశం నలుమూలల నుంచి కేరళకు విరాళాలు, సహాయ సహాకారాలు అందుతున్నాయి. తాజాగా ప్రముఖ దేవాలయాలు కేరళకు ఆర్థిక సహాయాన్ని అందించాయి. శబరిమల అయ్యప్ప ఆలయం రూ. 10కోట్లు, తిరుమల దేవస్థానం రూ.5కోట్లు, షిర్డీ సాయి ఆలయం రూ.5కోట్లు, ముంబై సిద్ధివినాయక ఆలయం రూ. కోటి, జమ్మూకశ్మీర్ వైష్ణోదేవి ఆలయం రూ.కోటి, కొల్లురూ మూకాంబికా దేవాలయం రూ.1.25కోట్లు, పండరీపుర్ ఆలయం రూ.25లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాయి. -
మానవత్వమే మతం
కొచ్చి: నవత్వానికి మతాలు అడ్డురావని వారు నిరూపించారు. విపత్కర పరిస్థితుల్లో అన్య మతస్తుల ఆచారాలు, సంప్రదాయాలను గౌరవించి ఆదర్శంగా నిలిచారు. వరదల ఉధృతికి త్రిసూర్ జిల్లాలోని కోచ్‌కడవులోని జుమా మసీదును వరదనీరు ముంచెత్తింది. దీంతో సమీపంలోని రత్నేశ్వరి ఆలయంలోని హాలులో ముస్లిం సోదరులు ఈద్ ప్రార్థనలు చేసుకోవడానికి దేవాలయ కమిటీ అంగీకరించింది. ప్రార్థనలు చేసుకోవడానికి హాలులో ఏర్పాట్లుచేసింది. ‘బుధవారం కల్లా వరద నీరు తగ్గితే, ప్రార్థనలు చేసుకోవచ్చని భావించాము. కానీ నీరు అలాగే ఉంది. దేవాలయ కమిటీ సభ్యులను కలవగా దేవాలయంలో ప్రార్థనలు చేసుకోవడానికి వెంటనే అంగీకరించారు’ అని మసీదు కమిటీ అధ్యక్షుడు పీఏ ఖలీద్ చెప్పారు. ‘మొదట మనమంతా మనుషులం. అందరం ఒకే దేవుని బిడ్డలం అని గుర్తుంచుకోవాలి’ అని రత్నేశ్వరి దేవాలయ కమిటీ సభ్యుడొకరు అన్నారు. దేవాలయంలో ముస్లింలు ప్రార్థనలు చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. పునరావాస కేంద్రాల్లో ఉన్న నన్‌లు బక్రీద్ సందర్భంగా మెహందీ పెట్టుకున్న వీడియోలు, హిందూ దేవాలయాల్ని శుభ్రం చేస్తున్న ముస్లింల ఫొటోలు మాధ్యమాల్లో వైరల్అయ్యాయి. హిందువులకు మసీదులో ఆశ్రయం వరదలకు నిరాశ్రయులైన పలు హిందూ కుటుంబాలకు మల్లప్పురం జిల్లా అక్కంపాడులోని చెలియార్ గ్రామంలో ఉన్న జుమా మసీదు ఆశ్రయం కల్పించింది. వరదలకు నిలువనీడ కోల్పోయిన 78 మంది హిందువులకు మసీదులో వసతి కల్పించారు. వరదనీటితో అపరిశుభ్రంగా మారిన వెన్నియాడ్లోని విష్ణుమూర్తి ఆలయాన్ని, మల్లప్పురంలోని అయ్యప్ప ఆలయాన్ని కొంతమంది ముస్లింలు శుభ్రం చేశారు. ‘ముక్క’ను వదులుకున్న ఖైదీలు కర్ణాటకలో వరద బాధితులను ఆదుకునేందుకు పరప్పన అగ్రహారం, బళ్లారి జైలు ఖైదీలు ఒక్కవారం మాంసాహారాన్ని వదులుకున్నారు. ఇలా ఆదా అయ్యే నగదు మొత్తాన్ని వరద బాధితల సహాయార్థం వెచ్చించాలని జైలు అధికారులను కోరారు. ఈ రెండు జైళ్లలో ప్రతి శుక్రవారం ఖైదీలకు మాంసాహారం వడ్డిస్తారు. ఇందుకోసం సుమారు రూ.2–3 లక్షల దాకా ఖర్చవుతోంది. బక్రీద్ సందర్భంగా కేరళలోని త్రిసూర్ రత్నేశ్వరి ఆలయంలో ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు -
జపాన్‌కి లక్ష్మీకళ
-
‘హిందూ దేవాలయాలకు ఎందుకు వస్తున్నారు’
డెహ్రాడూన్ : ముస్లింలు హిందూవుల దేవాలయాలకు ఎందుకు వస్తున్నారని ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ తుక్రాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ముస్లింలు హిందూవులను మసీద్, మదార్సాలోకి రానివ్వరు అందుకే హిందూవులు మసీద్‌లోకి వెళ్లరు. ముస్లింలు హిందూ దేవాలయాలకు ఎందుకు వస్తున్నారు’ అని ప్రశ్నించారు. ఆదివారం రాంనగర్‌లోని దేవాలయంలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ముస్లింలు దేవాలయ ప్రాంగణంలోకి రావడంతో ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు దురుద్దేశంతో హిందూ దేవాలయాలకు వస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. మతమార్పిడి, లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా హిందూసేన కార్యకర్తలు పోరాడుతున్నారని, పోలీసు అధికారులు మాత్రం ఏం చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లోని రామ్ నగర్లో పోలీసు అధికారి గంగాదీప్ సింగ్ హిందూ యువకుల దాడినుంచి ముస్లిం యువకుడిని కాపాడిన విషయం తెలిసిందే. ఆ ఘటన జరిగి రెండు రోజులు కూడా కాకముందే ఈ వ్యాఖ్యలు చేయడంతో ఎమ్మెల్యేపై విమర్శలు వెలువెత్తున్నాయి. -
హిందూ ఆలయాలపైనే పెత్తనమెందుకు?
కొల్లాపూర్: పాలకులు కేవలం హిందూ ఆలయాలపైనే తమ పెత్తనం ప్రదర్శిస్తూ.. మజీదులు, చర్చిల జోలికి ఎందుకు వెళ్లడం లేదని శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద ప్రశ్నించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో కేవైఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద మాట్లాడుతూ హిందువుల ఆలయాలు రాజకీయాలకు వేదికలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులు ఆలయాల సొమ్మును దోచేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో పాలకవర్గాలే విజయవాడ కనకదుర్గమ్మ గుడి, అమ్మవారిని రోడ్డుకీడ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. హిందూ దేవుళ్లను దర్శించుకోవాలంటే ఎమ్మెల్యే, ఎంపీల సిఫారసు లేఖలు తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోందన్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని కొందరు కుహనా మేధావులు భారతీయ సంస్కృతిని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. -
హిందూ ఆలయాలపైనే పెత్తనమెందుకు ?
సాక్షి, కొల్లాపూర్: పాలకులు కేవలం హిందూ ఆలయాలపైనే తమ పెత్తనం ప్రదర్శిస్తున్నారని, మజీదులు, చర్చిల జోలికి వారు ఎందుకు పోవడం లేదని శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద ప్రభుత్వాలను ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌జిల్లా కొల్లాపూర్‌లో కేవైఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం యువతనుద్దేశించి మాట్లాడారు. హిందువుల గుడులు రాజకీయాలకు వేదికలవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చర్చిలు, మజీదులపై లేని పెత్తనం హిందూ దేవాలయాలపైనే ఎందుకన్నారు. ఆలయాల సొమ్మును దోచేస్తున్నారని, పాలకవర్గాల వైఖరి కారణంగా విజయవాడ కనకదుర్గమ్మ గుడిని, అమ్మవారిని రోడ్డుకీడ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మా దేవుళ్లను దర్శించుకోవాలంటే ఎమ్మెల్యే, ఎంపీల రికమెండేషన్ లెటర్లు తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోందన్నారు. బంగారు తెలంగాణ సాధించాలంటే 80 ఏళ్లు దాటిన వారికి సాధ్యం కాదని, యువతే దానికి కారకులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ మాది అని భావించి స్వార్థం లేకుండా ముందుకు సాగితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని కొందరు కుహానా మేధావులు భారతీయ సంస్కతిని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వారినుంచి మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. టీఎస్ రెడ్కో ఎండీ.సుధాకర్‌రావు, సురభి రాజు బాలాదిత్య లక్ష్మారావులు కూడా ప్రసంగించారు. -
బీజేపీ ఉండగా ‘క్లోన్’ ఎందుకు?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గుజరాత్లో ఎన్నికల వేళ తరచూ హిందూ దేవాలయాలు సందర్శిస్తుండటంపై కేంద్ర మంత్రి జైట్లీ వ్యంగ్యంగా స్పందించారు. హిందుత్వ విధానాలకు బీజేపీ అనుకూలంగా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ...‘ఒరిజినల్’ ఉండగా ప్రజలు ‘క్లోన్’ను ఎందుకు కోరుకుంటారని అన్నారు. ‘బీజేపీని హిందుత్వ అనుకూల పార్టీ అని భావిస్తారు. అసలు సిసలు హిందుత్వ పార్టీ బీజేపీ ఉండగా ప్రజలు క్లోన్‌కు ఎందుకు ప్రాధాన్యమిస్తారు?’ అని జైట్లీ శనివారం మీడియా సమావేశంలో ప్రశ్నించారు. 2014లో లోక్‌సభ ఎన్నికలు మొదలుకొని చాలాసార్లు ఓటమిపాలైన కాంగ్రెస్ పార్టీ క్రమంగా అంతరించి పోతోందని ఎద్దేవా చేశారు. నేడు భారత్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మెరుగైన ర్యాంకు సాధించిందని తెలిపారు. వారి తప్పేంటి?: రాహుల్ ‘రోజుకో ప్రశ్న’ పరంపరలో భాగంగా ‘ విద్యలో ప్రభుత్వ ఖర్చుకు సంబంధించి గుజరాత్ 26వ స్థానంలో ఎందుకు ఉంది?ఈ రాష్ట్ర యువత చేసిన తప్పేంటి?’ అని రాహుల్ నిలదీశారు. ప్రభుత్వ పాఠశాలలను పణంగా పెట్టి మోదీ విద్యను వ్యాపారమయం చేస్తున్నారని, విద్యార్థులపై ఫీజుల భారం పెంచుతున్నారని ఆరోపించారు. -
హిందూ దేవతలు అందరివారూ కారా?
అవలోకనం మన దేశంలో మసీదులు, చర్చిలు, గురుద్వారాల్లో అందరికీ ప్రవేశం ఉంటుంది. హిందూ శాస్త్రాలు విదేశీయులకు, ఇతర మతస్తులకు ఆలయ ప్రవేశాన్ని నిషేధించినట్టు లేదు. నిషేధించి ఉంటే, అన్ని దేవాలయాల్లోనూ అదే నిబంధన ఉండేది. కానీ లేదు. అయినా ముఖ్య దేవాలయాలు నానాటికీ మరింత ఎక్కువగా విదేశస్తులకు, హిందూయేతరులకు ఆలయ ప్రవేశాన్ని నిరాకరిస్తున్నాయి. ఒరియా ప్రజల్లో దుర్యోధన పేరు సర్వసాధారణం. అలాగే దుశ్శాసన పేరు కూడా. భువనేశ్వర్, పూరీలను సందర్శించేంత వరకు అది నాకూ తెలీదు. పూరీ లోని సుప్రసిద్ధ జగన్నాథ ఆలయాన్ని చూడటానికి ఈ వారం అక్కడికి వెళ్లాను. ఇలాంటి ప్రదేశాల చరిత్ర, అద్భుత నిర్మాణ కౌశలాల కారణంగా సాధారణంగా వాటిని నేను సందర్శిస్తుంటాను. బయటకు చూడటానికి భారత సంస్కృతి దేశం అంతటా ఒక్కటిగా కనిపించినా, అలా ఉండదనే విషయాన్ని గుర్తించడానికి కూడా అవి తోడ్పడతాయి. తండ్రి తన కొడుక్కి మహా భారతంలోని విలన్‌గా మనకు తెలిసిన దుశ్సాసనుని పేరు పెట్టడం దేశంలో మరెక్కడైనా దిగ్భ్రాంతిని కలుగజేస్తుంది. ఒరియా ప్రజలు ఆసక్తికరమైన వారు, కుర్చీ ఉద్యోగస్తులకు లోతుగా వేళ్లూనుకున్న వారి సంస్కృతి కొరుకుడు పడటం కష్టమే. జగన్నాథ ఆలయం బయట హిందువులకు మాత్రమే ప్రవేశమని పలు భాషలలో రాసి ఉన్న బోర్డు కనిపించింది. దీని వెనుక ఉన్న తర్కం ఏమిటో నాకు అర్థం కాలేదు, ఒప్పుకుంటాను. నేను చూసిన ^è ర్చిలు వేటిలో, వాటికన్లోని అతి సుప్రసిద్ధ చర్చిలో సైతం ఇలాంటి నిబంధనేదీ లేదు. వాటికన్లో, అక్కడి పురాతత్వ వస్తువులను సగర్వంగా మనకు చూపుతారు. సౌదీలు ముస్లిమేతరులను మక్కాకు అనుమతించరు. అయితే చాలా ఏళ్ల క్రితం గురునానక్ మక్కా యాత్ర చేశారని చెప్పారు. కొన్నేళ్ల క్రితం నేను, స్థానిక మిత్రులతో కలసి లాహోర్‌లోని గురు అర్జున్‌సింగ్ గురుద్వారాను సందర్శించాను. పాకిస్థాన్ ప్రభుత్వం పెట్టినది కావచ్చు అక్కడ ‘ముస్లింలకు ప్రవేశం నిషిద్ధం’ అనే బోర్డు ఉంది. దాన్ని పట్టించుకోకుండా మేం లోపలికి వెళ్లాం. గురుద్వారా సంరక్షకులు నాతో పాటూ వచ్చినవారు ఎవరని అడిగితే అబద్ధం చెప్పలేదు. స్థానిక మిత్రులలో ఒకరి కుమారుడి పేరు అర్జున్ అని తెలిసి ఆ సిక్కులు పిల్లాడితో ఆడుకుంటామని, అతడ్ని తమతో వదిలి మిగతావారు గురుద్వారా అంతా చూసిరండని పట్టుబట్టారు. మన దేశంలో మసీదులు, చర్చిలు, గురుద్వారాల్లో అందరికీ ప్రవేశం ఉంటుంది. స్థానిక మసీదులోకి వెళ్లి చూసి రమ్మని హిందువులకు చెబుతుంటాను. వారికి అక్కడ స్వాగతం పలుకుతారు. ఇస్లాం మతంలో ఆసక్తి ఉన్నా లేకున్నా మసీదు సందర్శన ఉపయోగకరమనే అనిపిస్తుంది. మన మతంలో పుట్టకపోయినా దాని పట్ల ఆసక్తి ఉన్నవారికి ఆలయ సందర్శన అనుభవాన్ని ఎందుకు నిరాకరిస్తున్నట్టు? హిందూ శాస్త్రాలు అలాంటి నిషేధాన్ని శాసించడం అందుకు కారణం కాజాలదు. అదే నిజమైతే అన్ని దేవాలయాల్లోనూ ఆ నిబంధన ఉండేది. కానీ లేదు. అయితే ప్రధాన దేవాలయాలు నానాటికీ మరింత ఎక్కువగా విదేశస్తులకు, హిందూయేతరులకు ఆలయ ప్రవేశాన్ని నిరాకరిస్తుండటం కనిపిస్తుంది. క్రైస్తవునిగా జన్మించిన గొప్ప గాయకుడు జేసుదాస్, భజన గీతాలను ఆలపించాలని కోరుకుంటున్న గురువాయూర్ వంటి ఆలయాల్లోకి ఆయనకు ప్రవేశాన్ని నిరాకరిస్తూనే ఉన్నారు. సెప్టెంబర్ 30న ఆయన, తనకు హిందూ కట్టుబాట్లలో విశ్వాసం ఉన్నదని అఫిడవిట్‌ను సమర్పించిన తర్వాతనే ఆ ఆలయంలోకి అనుమతిస్తారు. ఈ ఆలయాలు ఎప్పడూ కొందరు ప్రజలకు, ప్రత్యేకించి ఇతర హిందువులకు ప్రవేశాన్ని నిరాకరిస్తూనే ఉన్నాయి. స్వామినారాయణ్ శాఖీయుల ఆలయాలు (మా పాటీదార్ కులస్తుల నిర్వహణలో ఉంటాయి) దిగువ కులాల ప్రవేశానికి ఇష్టపడవు. 1930లలో గాంధీ ఈ విషయంపైనే నిరాహార దీక్ష చేపట్టారు. అయినా ఆ శాఖవారు దిగువ కులస్తుల ఆలయప్రవేశాన్ని అనుమతించ లేదు, పైగా తాము హిందూయేతర మైనారిటీ అని కోర్టులో వాదించారు. కుల çస్వచ్ఛత అనే దురభిమానమే ఆలయాల ప్రవేశాన్ని అందరికీ అనుమతించకపోవడానికి కారణం కావచ్చా? కాదనే అనుకుంటున్నా. ఇందిరా గాంధీ హిందువుగా పుట్టారు, ఆమెకు హిందూ దహన సంస్కారాలే జరిగాయి. జగన్నాథ ఆలయ పాండాలు ఆమెకు ప్రవేశాన్ని నిరాకరించారు. 2012లో వాళ్లు ‘సనాతన హిందువులకు మాత్రమే ప్రవేశం’ అనే బోర్డును పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఆ బోర్డు నాకైతే కనబడలేదుగానీ, ఇప్పటికీ నాకు అది అంతుబట్టడం లేదు. సనాతన హిందూమతం పూర్తిగా వర్ణ వ్యవస్థకు సంబంధించినదే. దాన్ని పాటించడాన్ని రాజ్యాంగంలోని 14 నుంచి 17 వరకు గల అధికరణలు నిషేధించాయి. వర్ణాశ్రమ ధర్మాలను (అంటరానితనాన్ని పాటించడం. శూద్రులు వేదాధ్యయనానికి తగరని అంగీకరించడం అని అర్థం) పాటించే వారే సనాతన హిందువులు. మరిక పాండాలు ఎవరినీ ఆలయంలోకి అనుమతించేట్టు? ఒరియా మహిళను పెళ్లి చేసుకున్న అమెరికన్ ఒకరు రథయాత్రలో పాల్గొన యత్నించగా పాండాలు చితకబాదారు. ఆ ఘటన తదుపరి ఈ బోర్డును పెట్టారు. శిల్పి బోరాల్ అనే ఆ మహిళ ‘‘ఇది అన్యాయం. జగన్నా«థుణ్ణి విశ్వానికంతటికీ అధినాధునిగా పరిగణిస్తుండగా నా భర్తకు ఎవరైనా గానీ అనుమతిని ఎలా నిరాకరిస్తారు?’’ అన్నట్టు వార్తలు తెలిపాయి. ఆమె లేవనెత్తిన అంశం అర్థం అవుతూనే ఉంది. పూరీ ఆలయంతోపాటూ ఇతర ఆలయాలన్నీ ప్రజలకు ప్రవేశాన్ని ఎందుకు నిరాకరిస్తున్నాయో వివరించాలి. జగన్నాథ ఆలయం నిర్మాణకౌశలంలాగే, దేవతామూర్తులు కూడా విశిష్టమైనవి. సర్వగుణశోభితమైన మానవాకృతుల రూపంలోని దేవతలకు భిన్నంగా ప్రత్యేకంగా ఉంటాయి. అంతిమ హారతి సమయంలో వెళ్లాం కాబట్టి భక్తులు కొందరే ఉన్నారు. దేవతా మూర్తిని చూశాక, నేను ఆ సమూహాన్ని చూడటానికి వెనక్కు తిరిగాను. దైవారాధనలో హిందువులు చేతులు పైకి చాచి దండం పెడుతూ, సాష్టాంగపడి, పొర్లుతూ ఇతర మతస్తులకంటే ఎక్కువ ప్రదర్శనాత్మకంగా ఉంటారు. మనం చేసే ప్రార్థన, చర్చి, మసీదు, గురుద్వారాల్లోలా మతపరమైనది కాదు, వ్యక్తిగతమైనది. దేవతా ‘విగ్రహం’ మనల్ని చూసిందని రూఢి చేసుకోవడం అవసరం. కాబట్టి ప్రత్యేకంగా కనబడటం కోసం ఏదో ఒకటి చేస్తాం. వచ్చినవారిలో చాలా మంది మొహాలు బాగా పేదవి, నిజమైన భక్తి, ఉద్వేగం, విశ్వాసం నిండి కనిపించాయి. వారిని చూసి నేను చలించిపోయాను. అలాంటి క్షణాలను అనుభూతి చెందడానికి మనం మరింత మందిని అనుమతించాలని ఆశిస్తాను. హిందూ భక్తిలోని ఉద్వేగం, పారవశ్యం చూసేవారికి కనువిందు చేస్తాయి. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ఈ-మెయిల్ : aakar.patel@icloud.com -
'నాన్-వెజ్' నోట్లను వద్దంటున్న ఆలయాలు
కొత్త ఐదు పౌండ్ల నోట్లను యూకేలోని హిందూ దేవాలయాలు రద్దు చేశాయి. ఈ కొత్త నోట్లలో జంతు కొవ్వు జాడలున్నాయని రిపోర్టులు వస్తున్న నేపథ్యంలో ఈ నోట్లను తాము అంగీకరించేంది లేదంటూ హిందూ దేవాలయాలు ప్రకటించాయి. ఈ కొత్త నోట్లను జంతు కొవ్వుతో గతవారం గుర్తించినట్టు రిపోర్టులు వచ్చాయి. ఈ కొవ్వును గొడ్డు లేదా మటన్ నుంచి సేకరిస్తారని తెలియగానే, వెజిటేరియన్లు, మత గ్రూపులు ఈ నోట్ల తయారీపై మండిపడ్డారు.. ఎక్స్చేంజ్గా ఈ 'నాన్-వెజ్' నోట్లను సీజ్ చేస్తున్నామని, కానీ ఈ విషయాన్ని కమ్యూనికేట్ చేసే విషయంలోనే కొంత గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశముందని హిందూ ఆలయాల జాతీయ కౌన్సిల్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఎన్ని ఆలయాల్లో ఈ 'నాన్-వెజ్' నోట్లను రద్దు చేశారో సరియైన సమాచారం లేదని పేర్కొంది. హిందూ ఆర్గనైజేషన్లకు బాడీగా ఉంటున్న హిందూ ఫోరమ్ ఆఫ్ బ్రిటన్(హెచ్ఎఫ్బీ) గతవారం రోజులుగా ఓ నోటీసు జారీచేస్తోంది. ఈ నోటీసులో నోట్లను విత్‌డ్రా చేసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారని, డొనేషన్లకు ఈ నోట్ల వాడద్దొంటూ హెచ్ఎఫ్బీ తన ప్రకటనలో పేర్కొంటోంది. కొత్త నోట్లను జంతువుల కొవ్వుతో తయారుచేయడాన్ని రద్దు చేసుకోవాలని దాదాపు 1,30,000 సంతకాలు నమోదయ్యాయి. ఈ సంతకాలు 1,50,000 నమోదైతే, బ్యాంకు ఆఫ్ ఇంగ్లాండ్‌కు పంపించనున్నారు. -
పాక్‌లో హిందూ ఆలయాలను కూల్చనివ్వం
అతడు కరడుగట్టిన ఉగ్రవాది. పాకిస్థాన్‌లోనే నిషేధించిన జమాత్ ఉద్ దవా అనే ఉగ్రవాద సంస్థకు అధినేత. పేరు హఫీజ్ సయీద్. అలాంటి వ్యక్తి తాజాగా చేసిన ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తోంది. పాకిస్థాన్‌లోని హిందూ ఆలయాలతో పాటు ముస్లిమేతరులకు సంబంధించిన పవిత్ర స్థలాలు వేటినీ కూల్చడానికి తాము ఒప్పుకొనేది లేదని చెప్పాడు. హిందూ సోదరుల పవిత్రస్థలాలను కాపాడాల్సిన బాధ్యత ముస్లింలపై ఉంటుందని సింధ్ రాష్ట్రంలోని మత్లీ పట్టణంలో జరిగిన ఓ సమావేశంలో సయీద్ అన్నాడు. సింధ్‌లోని థార్ ప్రాంతంలో తమ సంస్థ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలను సయీద్ ఖండించాడు. కశ్మీరీ ముస్లింలకు కూడా అతడు మద్దతు పలికినట్లు తెలుస్తోంది.